Hyderabad district
-
రాజధానిలోనే ఎక్కువ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీలో అత్యధిక పోస్టులు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 878 టీచర్ పోస్టులు భర్తీ చేయనుండగా రంగారెడ్డి జిల్లాలో 379 ఖాళీలున్నట్లు అధికారులు తేల్చారు. ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్లు (ఎస్జీటీల) అవసరం ఎక్కువగా జగిత్యాల జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా టీచర్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. -
జడ్జీల పేరిట.. లాయర్ ఘరానా మోసం! చివరికీ..
సాక్షి, హైదరాబాద్: భూవివాద కేసులో జడ్జీలను మేనేజ్ చేస్తానంటూ రూ.7 కోట్లు తీసుకున్న హైకోర్టు న్యాయవాది వేదుల వెంకటరమణతోపాటు బెదిరింపులకు పాల్పడిన మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై ఇటీవల ఐఎస్‌సదన్ ఠాణాలో కేసు నమోదైంది. దర్యాప్తు నిమిత్తం ఈ కేసును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చింతల్‌లోని వాణీనగర్‌కు చెందిన డాక్టర్ చింతల యాదగిరి సామాజిక కార్యకర్త. ఈయన తండ్రి మల్లయ్య తన కులానికి చెందిన వారి కోసం ఓ సంఘం ఏర్పాటు చేశారు. ఆయన మరణించిన తర్వాత యాదగిరి దీనిని పర్యవేక్షిస్తున్నారు. సంఘం కోసం 1982లో బౌరంపేట గ్రామంలో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పట్టాదారుడికి నగదు చెల్లించి ప్రైవేట్ సేల్ డీడ్ ద్వారా స్థలం పొందారు. 2005లో కొందరి కన్ను ఈ స్థలంపై పడింది. దీనిపై సంఘానికి చెందిన వారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి, సివిల్ దావాలు దాఖలు చేశారు. ఇవి ఫలితాలు ఇవ్వకపోవడంతో యాదగిరి నేతృత్వంలోని కులపెద్దలు సైదాబాద్‌లో ఉండే న్యాయవాది వేదుల వెంకట రమణను సంప్రదించగా, హైకోర్టు కేసు నడుస్తోంది. సాంకేతిక, అనివార్య కారణాల నేపథ్యంలో దాదాపు 18 ఏళ్లు కేసు మూలనపడింది. మాట్లాడదాం రమ్మని చెప్పి.. కేసు విషయమై మాట్లాడటానికి యాదగిరిని కులపెద్దలతో కలిసి తన కార్యాలయానికి రమ్మని న్యాయవాది వెంకటరమణ చెప్పాడు. దీంతో యాదగిరి 10 మందితో వెళ్లి చర్చించారు. తీర్పు వేగంగా, అనుకూలంగా తెచ్చుకోవడానికి బెంచ్‌లో ఉన్న జడ్జీలను మేనేజ్ చేయాల్సి ఉంటుందని చెప్పి, దీని కోసం వెంకటరమణ రూ.10 కోట్లు అడిగాడు. రూ.7 కోట్లు చెల్లించడానికి అంగీకరించారు. రెండు విడతల్లో ఈ మొత్తాన్ని వారంతా నగదుగా అందజేశారు. కోర్టు ఉత్తర్వులు కూడా వీరికి అనుకూలంగా లేకపోవడంతో భూమిని కోల్పోయారు. వెంకటరమణ తమ ప్రతివాదులతో కుమ్మక్కు అయ్యి, వారి నుంచి 25 కోట్లు తీసుకున్నాడని యాదగిరి, కుల పెద్దలకు తెలిసింది. దీనికి న్యాయవాది వెంకటరమణ వైఖరే కారణమని భావించిన బాధితులు తమ వద్ద తీసుకున్న మొత్తం నగదు తిరిగి ఇవ్వాలని, నష్టపరిహారంగా అంతే మొత్తం అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒత్తిడి చేయగా, రూ.కోటి మాత్రమే వెంకటరమణ తిరిగి చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లించకపోగా, వెంకటరమణతోపాటు మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అనుచరుడు జైకుమార్‌తో పాటు పాతబస్తీకి చెందిన రౌడీలతో బెదిరింపులకు దిగారంటూ యాదగిరి ఐఎస్‌సదన్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార (నిరోధక) చట్టంలోని సెక్షన్ల కింద వెంకటరమణ, అహ్మద్ బలాల, జైకుమార్ తదితరులపై కేసు నమోదై సీసీఎస్‌కు బదిలీ అయ్యింది. ఇవి చదవండి: మద్యం సేవిస్తూ.. మహిళా క్రికెటర్లను బూతులు తిడుతూ! వేటు పడింది.. -
'కారు పార్టీ' స్టీరింగ్ ఓవైసీల చేతుల్లోనే.. : రాజా సింగ్
సాక్షి, నిజామాబాద్/హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో ఓవైసీలు టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ పాతబస్తీని మినీ పాకిస్థాన్‌గా మార్చారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తరఫున రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు దుబ్బ చౌరస్తా నుంచి గంజ్ కమాన్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, దేవీరోడ్, పూసలగల్లి మీదుగా గోల్ హనుమాన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోల్ హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ అర్బన్‌లో సూర్య నారాయణను గెలిపించుకుంటే కేంద్రం, రాష్ట్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొస్తాడని తెలిపారు. గణేశ్ గుప్తా కమీషన్లు తీసుకుంటాడని ఆరోపించారు. దేశంలో ఉగ్ర కార్యకలాపాలు ఎక్కడ జరిగినా వాటి మూలాలు, అరెస్టులు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా హైదరాబాద్‌లో అల్లర్లు కాకుండా ఓవైసీ కాళ్లు పట్టుకుంటున్నారని, వాళ్లని అడుక్కునే అవసరమేముందని ప్రశ్నించారు. ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి ఎన్ఐఏ అధికారులు వచ్చి ఆరుగురు టెర్రరిస్టులను పట్టుకున్నారని, అందులో ఒకరు ఓవైసీకి చెందిన కళాశాల ప్రొఫెసర్ అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఒక టెర్రరిస్టు ఏం పాఠాలు చెబుతాడని, కేవ లం టెర్రరిజం నూరిపోస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రవాదులకు మద్దతు తెలిపితే బుల్డోజర్లు వస్తాయన్నారు. హైదరాబాద్ తర్వాత ఎంఐఎం లక్ష్యం నిజామాబాద్ అని, ఇందూరు ప్రజలు ఆలోచించి ఓటే యాలన్నారు. కారు పార్టీ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీఆర్ఎస్ను కాస్త బార్ అండ్ రెస్టారెంట్ సమితి (బీఆర్ఎస్)గా మార్చారన్నారు. మైనారిటీ మహిళల ఆత్మగౌరవం కోసం పీఎం నరేంద్రమోదీ ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయించారన్నారు. నగరాభివృద్ధి ఎక్కడ..? సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడని, 2014లో దళితుడి ని సీఎం చేస్తానని చెప్పి చేయలేదన్నారు. గణేశ్ గు ప్తా అర్బన్‌ను రూ.1500 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్తున్నాడని, ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పాలని డి మాండ్ చేశారు. కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కుందన్నారు. బీసీని సీఎం చేస్తానని ప్రకటించిందని బీజే పీ మాట నిలబెట్టుకుంటుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, జిల్లా ఇన్‌ఛార్జి క ళ్లెం బాల్‌రెడ్డి, నాయకులు, కార్పొరేటర్లు న్యాలం రా జు, స్రవంతిరెడ్డి, పంచరెడ్డి లింగం, వనిత, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శివప్రసాద్ తదితరులున్నారు. నేను గెలిస్తే హిందువులు గెలిచినట్లే.. అర్బన్‌లో తాను గెలిస్తే హిందువులందరూ గెలిచినట్లేనని బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్య నారాయణ పేర్కొన్నారు. ఓవైసీ 15 నిమిషాలు సమయమిస్తే హిందువులు లేకుండా చేస్తానని గతంలో ప్రసంగించారని గుర్తుచేశారు. దమ్ముంటే అర్బన్‌లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయాల ని సవాల్ విసిరానని, భయపడి రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి హిందూ వ్యతిరేక శక్తులతో సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక వర్గం కోసం పని చేస్తున్నాయన్నారు. ఇవి చదవండి: ఓటుకు వారు దూరమే.. -
కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో బీటీ రోడ్డు..!
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో సరికొత్త మార్పులు, ప్రయోగాలకు సిద్దిపేట కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణంలో మరో కొత్త విధానానికి ఇక్కడే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కాయిర్ జియో టెక్స్టైల్ (కొబ్బరినార) సాంకేతికతతో తొలిసారిగా రోడ్డు నిర్మించడంతో.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు ముందుగా నేలను చదును చేస్తారు. ఆ తర్వాత వివిధ సైజుల్లో ఉన్న కంకరను పొరలు పొరలుగా పోసి రోలర్ సాయంతో తొక్కిస్తారు. ఆ మార్గం గట్టిపడిందని నిర్ధారించుకున్న తర్వాత బ్లాక్‌టేప్ (బీటీ) మిశ్రమంతో రోడ్డును నిర్మిస్తారు. లేదంటే నేరుగా సిమెంట్ రోడ్డును నిర్మించడం ఇప్పటివరకు చూశాం. అయితే, ఇటీవల సిద్దిపేటలో కొత్తగా కొబ్బరినారతో రోడ్డును నిర్మించారు. కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో హుస్నాబాద్‌లో ఉమ్మాపూర్ నుంచి పోతారం(ఎస్) వరకు నాగారం మీదుగా 3.5 కి.మీ. నిడివితో బీటీ రోడ్డు వేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.2.31 కోట్లు కేటాయించారు. అయితే నేషనల్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌ఆర్‌ఆర్‌డీ) సూచనలతో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో ఈ రోడ్డు నిర్మించారు. ఈ విధానంలో తాగి పడేసిన కొబ్బరి బొండాల నుంచి నారును వేరు చేశారు. దీన్ని ఒక మిషన్‌లో వేసి జాలీ మాదిరిగా అల్లారు. ముందుగా నేలను చదునుగా చేసి రోలర్‌తో తొక్కించిన తర్వాత కొబ్బరి నారతో చేసిన జాలీని పరిచారు. దీనిపై 5 అంగుళాల సన్న కంకరను ఒక పొరగా వేసి.. దానిపై 6 అంగుళాల మందంతో కంకరను మరో పొరగా పోసి రోలర్‌తో తొక్కించారు. అనంతరం పై నుంచి బ్లాక్‌టేప్ డాంబర్ వేసి రోడ్డును వేశారు. రాష్ట్రంలో తొలిసారిగా వేసిన ఈ రోడ్డును పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇటీవల పరిశీలించారు. ఇలాంటి రోడ్ల నిర్మాణానికి డబ్బు ఆదా అవుతుందని, నాణ్యత కూడా బాగా ఉంటుందని ఆయన చెప్పారు. ఖర్చు తక్కువ.. సాధారణ రోడ్ల నిర్మాణంలో 9 అంగుళాలు, 6 అంగుళాల మందంతో కూడిన కంకరను వినియోగిస్తారు. దీని వల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా రోడ్డు వాడకంలోకి వచ్చాక వాహనాల బరువుతో కలిగే ఒత్తిడి వల్ల 9 అంగుళాల మందమున్న కంకర స్థానభ్రంశం చెంది రోడ్డు కుంగిపోతుంది. ఇలా వచి్చన పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు నిలుస్తుంది. దీని వల్ల బ్లాక్‌టేప్‌లో ఉండే పటుత్వం తగ్గుతుంది. ఫలితంగా రోడ్డులో గుంతలు ఏర్పడతాయి. అదీగాక, 15 అంగుళాల ఎత్తుతో రోడ్డు నిర్మించడం వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల కంటే రోడ్డు ఎక్కువ ఎత్తుగా కనిపిస్తుంది. రోడ్డు నిర్మాణంలో కొబ్బరి పీచు వాడితే నిర్మాణ వ్యయం ప్రతీ కిలోమీటరుకు రూ.2 లక్షల వరకు తక్కువ అవుతుంది. దీంతోపాటు వృథాగా ఉంటూ దోమల పెరుగుదలకు కారణమయ్యే కొబ్బరి బొండాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. రోడ్డుపై వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా హుస్నాబాద్‌లో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించాం. రోడ్డు పైన పడే వర్షపు నీరు భూమిలోకి వెళ్లకుండా కొబ్బరి పీచులోకి ఇంకుతుంది. తర్వాత ఈ నీరు బయటకు రావడం వల్ల రోడ్డు చాలా రోజులు మన్నికగా ఉంటుంది. గుంతలు పడే అవకాశాలు తక్కువ. ఇదే విధంగా మరిన్ని రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం చెప్పింది. –సదాశివరెడ్డి, డీఈ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -
పెండింగ్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు.. ఎందుకిలా?
మలక్‌పేటకు చెందిన ఆటో డ్రైవర్ మస్తాన్ తన ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సాయం కోసం షాదీముబారక్ పథకం కింద ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు సదరు దరఖాస్తుపై విచారణ జరగలేదు. సంబందిత తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నా సరైన సమాధానం మాత్రం లభించడం లేదు. ఇది ఒక్క మస్తాన్ సమస్య కాదు.. నగరంలో వందలాది మంది నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య. సాక్షి, హైదరాబాద్: దేవుడు వరం ఇచ్చినా... పూజారి కరుణించని చందంగా తయారైంది షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల పరిస్థితి. ఉన్నతాధికారుల ఉదాసీనవైఖరితో నిరుపేద ఆడబిడ్డల ఆర్థిక చేయూతకు గ్రహణం పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు సాయంపై గంపెడాశతో అప్పో సప్పో చేసి ఆడబిడ్డల పెళ్లిల్లు చేస్తున్న పేద కుటుంబాలు మరింత ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఏడాది గడిస్తే కానీ ఆర్థిక సాయం అందే పరిస్థితి కానరావడం లేదు. ప్రధానంగా దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ రెవెన్యూ యంత్రాంగానికి గుదిబండగా తయారైంది. ఒకవైపు వీఆర్వోలను ఇతర శాఖలకు బదిలీ చేయడం, మరోవైపు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏల ఆందోళన... సిబ్బంది కొరత కారణంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది ప్రభుత్వ భూముల పరిరక్షణ, ధ్రువీకరణ పత్రాల జారీ, పింఛన్లు ఇతరత్రా విధుల్లో బిజీబిజీగా ఉండటంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉండగా... ఇప్పటికే క్షేత్ర స్థాయి విచారణ పూర్తయినా మిగితా ప్రక్రియ కూడా నత్తకు నడక నేర్పిస్తోందనడం నిర్వివాదంశం. వెంటాడుతున్న నిధుల కొరత ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను గ్రీన్ చానల్ కింద ప్రకటించినా నిధుల కొరత వెంటాడుతోంది. బడ్జెట్లో పథకాలకు కేటాయింపులు ఘనంగా ఉన్నా.. ఆమలులో మాత్రం పథకం చుక్కలు చూపిస్తోంది. క్షేత్ర స్థాయి విచారణ అనంతం ఆర్థిక సాయం మంజూరైనా... ట్రెజరీ బిల్లుల పెండింగ్‌లో పడిపోతున్నాయి. ప్రభుత్వ సాయం అందితే పెళ్లికి చేసిన అప్పులు తీర్చాలని భావిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. పేదింటి బిడ్డలను ఆదుకునేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ప్రభుత్వం 2014లో శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వధువులకు రూ. 1,00,116 సాయంగా అందజేస్తున్నారు. కార్యాలయాల చూట్టూ... కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు సంబంధిత తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ప్రభుత్వ సాయం అందలేదని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. దరఖాస్తులు తమ వద్ద పెండింగ్‌లో లేవని అధికారులు పేర్కొంటుండటంతో స్థానిక ఎమ్మెల్యేల వద్దకు పరుగులు చేస్తున్నారు. పరిస్థితి ఇలా... హైదరాబాద్ జిల్లాలో 14 వేల పైగా షాదీముబారక్ దరఖాస్తులు 2 వేలపైగా కల్యాణలక్ష్మి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విషయంలో కనీస విచారణ జరగకపోవడం కొసమెరుపు. (క్లిక్ చేయండి: మునుగోడు ఎన్నికల బరిలో ఉంటాం) -
బ్లాక్‌ల వారీగా గుర్తింపు.. ఇక కూల్చివేతలే!
సాక్షి, హైదరాబాద్: సుందరీకరణలో భాగంగా మూసీ నది తీరప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు రెవెన్యూ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పరీవాహక ప్రాంతంలో టౌన్ ప్లానింగ్ సర్వే ద్వారా బ్లాక్‌ల వారీగా ఆక్రమిత నిర్మాణాలను గుర్తించింది. మండలాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసి అక్రమ నిర్మాణాల జాబితాను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శిస్తోంది. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి సమగ్రంగా పరిశీలించనుంది. అనంతరం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అక్రమ నిర్మాణాలను తొలగింపునకు మార్గం సుగుమమం చేసుకుంటోంది. రెండున్నరేళ్ల క్రితమే.. ► నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతంలో ఆరు వేలకుపైగా ఆక్రమణ నిర్మాణాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. రెండున్నరేళ్ల క్రితం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మూసీ రివర్ అథారిటీ సంయుక్తంగా సర్వే నిర్వహించి సుమారు ఆక్రమణల సంఖ్య 8,529 పైనే ఉన్నట్లు తేల్చారు. ఇందుకు అప్పట్లో తొమ్మిది బృందాలు రంగంలో దిగి మూసీ నది పారుతున్న ఎనిమిది మండలాల పరిధిలో వాస్తవ పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాయి. ► మండలాల వారీగా మూసీ నది మొత్తం, పొడవు, ఆక్రమణల ఫొటోలు, వీడియోగ్రాఫ్‌లతో పాటు కేటగిరీల వారీగా పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. పరీవాహక ప్రాంతాంలో మండల వారీగా ఆక్రమణల సంఖ్య పరిశీలిస్తే.. ఆసిఫ్‌నగర్ మండలంలో ఆక్రమణల సంఖ్య 667, అంబర్‌పేట పరిధిలో 989, బహదూర్‌పురా 4,225, చార్మినార్ 73, గోల్కొండ 517, హిమాయత్‌నగర్ 499, నాంపల్లి 658, సైదాబాద్ పరిధిలో 902 ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సర్వే మరోసారి.. మూసీ సుందరీకరణ వైపు వేగంగా అడుగులు పడుతుండటంతో ఆక్రమణలను గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మరోసారి సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా, చార్మినార్, నాంపల్లి, హిమాయత్‌నగర్, సైదాబాద్, అంబర్పేట్ మండలాల్లో పూర్తయింది. మొత్తం మీద నదిలో 978, బఫర్‌జోన్‌లో నదికి ఇరువైపులా 5,501 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. (క్లిక్: తెలంగాణలో పెరుగుతున్న భూముల ధరలు.. ఖజానాకు ‘భూమ్’) ఇరువైపులా 50 మీటర్ల పరిధి.. మూసీ ఒడ్డు నుంచి ఇరువైపులా 50 మీటర్ల చొప్పున బఫర్ జోన్లో గుర్తించిన నిర్మాణాలను కూల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రత్యేక నోటీఫికేషన్ల ద్వారా ఆక్రమణల వివరాల జాబితాలను ప్రకటించి వాటిని ఆర్డీఓ, తహసీల్దార్ ఆఫీసులు, పీఎస్‌లు, మున్సిపల్, సంబంధిత ప్రభుత్వ ఆఫీసుల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. అభ్యంతరాలుంటే సరైన డాక్యుమెంట్లతో పక్షం రోజులుగా సంబంధిత తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీసులో తెలియజేసేలా రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆ తర్వాత ఏకకాలంలో పోలీసుల బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టనుంది. (చదవండి: భ్రాంతిగా మారిన తెలంగాణ సంపర్క్ క్రాంతి) -
నెట్టింటి వెరైటీ స్టార్స్..!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం యువతని ఉర్రూతలూ గిస్తున్న అధునాతన వేదిక సోషల్ మీడియా. ఇది కోట్లాది మందికి వినోదాన్ని విజ్ఞానాన్ని పంచుతుంటే.. వేలాది మందికి ఉపాధిగానూ మారుతోంది. ఈ నేపథ్యంలో సిటీ యువత తమలోని ప్రతిభకు సానబెడుతూ సోషల్ మీడియా వేదికగా విజయాలు సాధిస్తున్నారు. యూట్యూబ్, టిక్ టాక్.. ఇలా ఏదైనా సరే తమకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్‌ను క్రియేట్ చేసుకుంటూ లక్షలాది ఫాలోవర్లుగా మార్చుకుంటూ సోషల్ మీడియా స్టార్స్‌గా నిలుస్తున్నారు. ఫ్రాంక్‌గా.. తన యూట్యూబ్ చానల్లో 5 లక్షలకుపైగా అభిమానులతో వినోదాన్ని మేళవించి సందేశాత్మక వీడియోలతో స్టార్‌గా నిలిచాడు దిల్సుఖ్నగర్ వాసి వినయ్. అకస్మాత్తుగా ఎదురై అల్లరి పెట్టే ఫ్రాంక్ వీడియోలకు ఈయన ఫేమస్. 200కు పైగా ఫ్రాంక్ వీడియోలతో పాపులరై లక్షలాదిగా వ్యూస్‌ని కొల్లగొట్టాడు. సందేశాత్మకంగానూ, వినోదాత్మకంగానూ ఉండేలా కనీసం వారానికి 2 వీడియోలు చేస్తుంటాడు. యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగం అనాథ బాలలకు, చారిటీలకు అందిస్తుంటానని ఆయన చెప్పాడు. ప్రస్తుతం ఒక టెలివిజన్ చానల్లో క్రియేటివ్ డడైరెక్టర్గా పని చేస్తూన్న ఆయన తన వీడియోస్‌కి వచ్చిన కామెంట్లలోని సూచనల ఆధారంగా తదుపరి ఫ్రాంక్స్ ప్లాన్ చేస్తుంటాడు. లాఫ్.. రాయల్ నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు నగరవాసి రాయల్ శ్రీ. హాస్య ప్రధానమైన డబ్‌స్మాష్‌లు, టిక్‌టాక్‌లు చేస్తూ తన ఫన్నీ గెటప్‌లతో క్రేజ్ తెచ్చుకున్నాడు. నాలుగో తరగతి మాత్రమే చదువుకున్నానని చెప్పే రాయల్.. అన్ని తరగతుల అన్ని వర్గాల మెప్పునూ పొందుతున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే యూట్యూబ్ చానల్లో వైరల్ అవుతున్నాడు. ఆరోగ్యకరమైన హాస్యం, ఎంటర్టైన్మెంట్ ఉండటంతో తనకు చాలా మంది అభిమానులుగా మారారని, నవ్వటం ఒక యోగం, అందరినీ నవ్వించగలగడం తన దృష్టం అని అంటున్నాడు రాయల్ శ్రీ. సంగీతాన్ని వండుతూ... ఆనందంగా తింటే ఆరోగ్యంగా ఉంటాం అన్నట్టుగా.. నవ్వుతూ తుళ్లుతూ వంట చేస్తూ ఆయన రూపొందించే టిక్‌టాక్ వీడియోలు విశేషాదరణ పొందాయి. ఆహారాన్ని ఆస్వాదిస్తే అదో వినూత్న అనుభూతి అని చెప్పకనే చెబుతూ, అసలు తినడానికి కూడా ఒక అర్హత ఉండాలి అంటాడు సైనిక్‌పురిలో నివసించే కల్యాణ్ నాయక్. తన వీడియోల ద్వారా తనకంటూ ఒక స్టైల్‌ని ఏర్పరచుకున్నాడు. ప్రకృతి ప్రేమికుడు కావడం వల్లనేమో ఆయన వీడియోల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. ఒక్కమాటలో జీవితమంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ కేరింగ్ అంటున్నాడు. తను మ్యూజిక్ కంపోజ్ చేసిన పిల్లా పిలగాడు ఆల్బమ్ వైరల్‌గా మారి ఏకంగా 5.4 మిలియన్స్ హ్యాష్‌ట్యాగ్స్‌ని సొంతం చేసుకుంది. ఉత్తరాది నుంచి కూడా పెద్ద సంఖ్యలో హ్యాష్‌ట్యాగ్స్ పొందడం విశేషం. ‘దీని ద్వారా వచ్చిన ప్రాచుర్యం 4 సినిమాలకు సంగీత దర్శకునిగా అవకాశాలను తెచ్చిపెట్టింది’ అని కల్యాణ్ నాయక్ చెప్పాడు. బీటెక్ పూర్తి చేసి ఇంట్లో వాళ్లు ఉద్యోగం చేయమని పోరుతున్నా వినకుండా.. ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ మ్యూజిక్ ఇనిస్టిట్యూట్‌లో సంగీతం నేర్చుకున్నానని వివరించాడు. -
‘లిఫ్ట్ ప్లీజ్’ అని నగరాలను చుట్టొచ్చాడు!
సాక్షి, హైదరాబాద్: ఆ యువకుడు ‘లిఫ్ట్ ప్లీజ్’ అంటూ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఏకంగా దేశంలోని ప్రధాన నగరాలను చుట్టి వచ్చేశాడు. డబ్బుల అవసరం లేకుండానే రెండు దఫాల్లో సుమారు 12 వేల కి.మీ. మేర పర్యటించి చరిత్ర సృష్టించాడు నగరానికి చెందిన గ్రాఫిక్ డిజైనర్ వంగవేటి కరుణాకర్. 29 రోజుల పాటు సాగిన తన సుదీర్ఘ పర్యటనలో మహోన్నతమైన భారతీయ ఆత్మను సమున్నతంగా ఆవిష్కరించాడు. వైవిధ్యభరితమైన సంస్కృతులు, జీవన విధానాలు ఎన్నెన్ని ఉన్నా అంతిమంగా భారతీయులంతా ఒక్కటేనని నిరూపించాడు. దేశంలో ఎక్కడికి వెళ్లినా అతిథిలా ఆదరించి అక్కున చేర్చుకుంటారని నిరూపించాడు. ట్రావెలింగ్‌పై మక్కువతో ప్రపంచమంతా పర్యటించాలనే చిన్నప్పటి తన కలను సాకారం చేసుకునే తొలి అడుగు పడిందంటున్నాడు కరుణాకర్. ఆయన ఫ్రీ ట్రావెలింగ్ ఎలా సాగింది.. తనకు ఎదురైన అనుభవాలేమిటి? తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అలా మొదలైంది.. ‘లిఫ్ట్ ప్లీజ్’ అంటే ఏ వాహనదారైనా ఐదారు కి.మీ వరకు తీసుకెళ్తాడు. కానీ ఊళ్లకు ఊళ్లు.. రాష్ట్రాలు దాటించడం సాధ్యం కాదు. దేశ సరిహద్దుల వరకు వెళ్లలేం కదా. అటు నేపాల్‌లోని ఖాట్మండూ. ఇటు పాక్ సమీపంలోని అనూబ్‌ఘర్ వరకు కేవలం ఇతరుల సహాయంతో చేరుకోలేం కదా. కానీ అలాంటి సాహసోపేతమైన పర్యటనే చేశాడు కరుణాకర్. ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తుల సహాయంతో రోడ్డు మార్గంలో రకరకాల వాహనాలపై వెళ్లాడు. అలా వెళ్లే క్రమంలో కేవలం ఒక్క కి.మీ. తీసుకెళ్లినవారూ ఉన్నారు. 500 కి.మీ. వరకు దాటించినవారూ ఉన్నారు. నగరంలోని కృష్ణానగర్‌లో ఉన్న తన ఇంటి నుంచి ఓ బైక్ లిఫ్ట్ తీసుకొని బయలుదేరితే దారిలో ట్రక్కు, లారీ, కారు, సైకిల్, ఒంటెబండి.. ఇలా ఏ వాహనంలో చోటు లభిస్తే ఆ వాహనంలో వెళ్లాడు కరుణాకర్. సాహసమే ఊపిరిగా.. ప్రయాణం అంటేనే డబ్బులతో ముడిపడిన విషయం. అవి లేకుండా ప్రయాణం చేయడం సాహసమే. ‘మొదట మా ఊరికి వెళ్లాను. మాములుగా అయితే ఖమ్మం సమీపంలోని మా ఊరికి హైదరాబాద్ నుంచి 6 గంటల సమయం పడుతుంది. లిఫ్ట్ తీసుకొని వెళ్లడంతో 9 గంటలు పట్టింది. కానీ తిరుగు ప్రయాణంలో 5 గంటల్లోనే చేరుకున్నాను. ఈ అనుభవం నాకు గొప్ప దైర్యాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే పర్యటన మొదలైంది అని చెబుతున్నాడు కరుణాకర్. అక్టోబర్‌లో 15 రోజుల పాటు రాజస్థాన్ ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో చుట్టూ పొలాల మధ్యలో ఉన్న ఓ ఇంట్లో, ఓ పంజాబీ ఫ్యామిలీ ఆతిథ్యం స్వీకరించడం గొప్ప అనుభూతిగా మిగిలింది. అహ్మదాబాద్‌కు, ఉదయపూర్ మధ్యలో రాత్రి 2గంటల సమయంలో ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు ఓ ఆర్టీఓ అధికారి లిఫ్ట్ ఇచ్చాడు. ఈ ట్రిప్‌లో కార్లు, బైక్‌లు, ట్రక్కులు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు, సైకిల్, బస్సు, అన్ని రకాల వాహనాల్లో వెళ్లాడు. రెండు దఫాలుగా.. కరుణాకర్ భారత యాత్ర రెండు దఫాలుగా సాగింది. మొదట హైదరాబాద్– రాజస్థాన్ వరకు వెళ్లి వచ్చాడు. 15 రోజుల్లో మొత్తం3,500 కి.మీ చుట్టొచ్చాడు. ముంబై, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, బికనీర్, అనూబ్‌ఘర్, శ్రీగంగానగర్, జైపూర్ మీదుగా తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. -
క్యాబ్ నిర్వహకులతో సమావేశమైన నగర సీపీ
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత, రక్షణపై గురువారం హైద్రాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. దిశ సంఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం మహిళల భద్రత కోసం క్యాబ్ సర్వీస్ నిర్వహుకులతో సమావేశమయ్యారు. సమావేశంలో సిటీకి చెందిన 15 ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థలు పాల్గొన్నాయి. నగర సీపీ, ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేవంలో.. మహిళల భద్రతకు క్యాబ్ నిర్వాహకులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. క్యాబ్‌లలో మహిళా భద్రత కోసం ఉన్న యాప్‌లను డిస్ప్లే చేయడంతో పాటు డయల్ 100కు కాల్స్ అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా క్యాబ్ నిర్వహకులకు స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి రెండు, మూడు రోజులకొసారి డ్రైవర్ల ప్రవర్తనపై కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు. -
భారీగా హెల్మెట్ల ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతుండడంతో... నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మితిమీరిన వేగం, అంతులేని నిర్లక్ష్యం కారణంగా అమాయకులు బలవుతున్నారు. పెరుగుతున్న ద్విచక్ర వాహనాల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని సోమవారం సైబరాబాద్ పోలీసులు ప్రమాదాల చర్యలు నియంత్రనకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా హెల్మెట్ డ్రైవ్ చేపట్టి.. నకిలీ ఐఎస్ఐ(ISI) మార్క్‌తో కూడిన హెల్మెట్లు విక్రయించే వారిపై కొరడా జులుపిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నకిలీ హెల్మెట్ అమ్మకాలు చేస్తున్న వారి నుంచి భారీగా నకిలీ హెల్మెట్లు స్వాధీనం చేసుకుంటున్నారు. అంతేకాక వాటిని ధ్వసం చేయడంతో పాటు అమ్మకం దారులపై కేసులు పెట్టి.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఏమాత్రం నాణ్యతలేని నకిలీ హెల్మెట్ల కారణంగా నగరంలో వందలాది సంఖ్యలో వాహన దారులు ప్రమాదాలబారిన పడుతున్నారని.. అందుకే హెల్మెట్ డ్రైవ్ చేపట్టామని సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. అయితే నాణ్యమైన హెల్మెట్ల ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యులు చౌకైన హెల్మెట్లు కొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫుట్‌పాత్‌లపై అమ్మే హెల్మెట్లు తక్కువ ధరలకు లభిస్తుండటంతో వాటిని కొంటున్నారు. అటు బడా వ్యాపారులు, బైక్ షోరూమ్‌లు ఎక్కువ లాభాలకు ఆశపడి రేట్లు పెంచేస్తున్నాయి. వీరిపైనా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. నాణ్యమైన హెల్మెట్లను అధిక ధరలకు విక్రయించకుండా చూడాలని సూచిస్తున్నారు. -
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ జంక్షన్లో శనివారం జరిగిన ప్రమాదంపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. సోమవారం నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ఛీఫ్ ఇంజనీర్స్, ప్రొఫెసర్స్‌తో కూడిన ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ బృందం నేడు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై జరిగిన తీరును ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిది. అంతేకాక మూడు రోజుల్లో ఫ్లైఓవర్ డిజైన్‌పై నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. ఫ్లైఓవర్‌పై వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైతే మరో ఐదు రోజుల వరకు ఫ్లైఓవర్‌ను మూసివేస్తామని పేర్కొన్నారు. (చదవండి: డిజైన్ లోపమేనా?) -
డిసెంబర్ 5లోగా జిల్లాలకు క్రిస్మస్ గిఫ్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 5 లోగా జిల్లా కేంద్రాలకు క్రిస్మస్ గిఫ్ట్‌ప్యాక్‌లు పంపించాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి క్రిస్మస్ వేడుకల నిర్వహణ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ పండగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ హాజరయ్యే విందు కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రముఖ క్రిస్టియన్ అవార్డులను అర్హత గల 12 మందికి, 6 సంస్థలకు ఇవ్వాలని సూచించారు. క్రిస్టియన్ భవన్‌కు పునాది రాయి వేయడానికి అవసరమైన ఏర్పాట్లు వచ్చే నెల 20 కల్లా పూర్తవుతాయన్నారు. 63 ఎకరాల భూమిని శ్మశాన వాటికల ఏర్పాటుకు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. వీటిని వెంటనే మైనార్టీ సంక్షేమశాఖకు అప్పగించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యే స్టీఫెన్సన్, టీఎస్ఎంసీ వైస్ చైర్మన్ బి.శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఆస్పత్రుల్లో ‘అమృత్’ ఫార్మసీలు
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న నిరుపేద రోగులకు బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే చాలా తక్కువ ధరకే మందులు, సర్జికల్స్, ఇంప్లాట్స్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కేంద్రం దేశవ్యాప్తంగా ఆలిండియా మెడికల్ సైన్స్(ఎయిమ్స్)ల్లో ప్రారంభించి, విజయవంతమైన దీన్‌దయాళ్ ‘అమృత్’ మెడికల్ స్టోర్స్‌ను ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రుల్లో కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ దుకాణాల్లో జనరిక్ మందులతో పాటు బ్రాండెడ్ మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ప్రైవేటు మెడికల్ స్టోర్స్‌లోని బ్రాండెడ్ మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్ ధరలతో పోలిస్తే ఈ అమృత్ మెడికల్ స్టోర్స్‌లో 30 నుంచి 40 శాతం తక్కువ ధరకే లభించనున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో హెచ్‌ఎల్‌ఎల్‌కు షాపును కేటాయించారు. రెండు మూడు రోజుల్లో ఇక్కడ ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. నిలోఫర్ సహా ఇతర ఆస్పత్రుల్లో సాధ్యమైనంత త్వరలోనే ఈ దుకాణాలు అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. బ్రాండెడ్ బాదుడుకు ఇక చెల్లుచీటీ.. ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలో ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సహా నిలోఫర్, ఈఎన్టీ, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఫీవర్, ఛాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి, నయూపూల్ ప్రసూతి ఆస్పత్రులు ఉన్నాయి. ఇక గాంధీ మెడికల్ కాలేజీ పరిధిలో గాంధీ ఆస్పత్రి కొనసాగుతోంది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల ఓపీకి రోజుకు సగటున 2500 నుంచి 3000 మంది రోగులు వస్తుంటారు. మిగిలిన ఆస్పత్రుల ఓపీలకు రోజుకు సగటున 500 నుంచి 1200 మంది వస్తుంటారు. ప్రభుత్వ ఆస్పత్రులకు టీఎస్ఎంఐడీసీ మందులు సరఫరా చేస్తుంది. వైద్యులు రాసిన వాటిలో చాలా మందులు ప్రభుత్వ ఫార్మసీలో దొరకడం లేదు. దీంతో ఆ మందులను రోగులే స్వయంగా సమకూర్చుకోవాలి. ఇందుకు సమీపంలో ఉన్న ప్రైవేటు మెడికల్ షాపులను ఆశ్రయిస్తుంటే.. దుకాణదారులు బ్రాండెడ్ పేరుతో అధిక ధరల మందులు ఇస్తున్నారు. దీంతో నిరుపేద రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కేవలం అవుట్ పేషంట్లకు మాత్రమే గాక.. ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్న రోగులు కూడా చాలా రకాల మందులను బయటే కొంటున్నారు. అమృత్ స్టోర్స్ ఏర్పాటుతో ఖరీదైన మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్ సైతం తక్కువ ధరకే పొందే అవకాశం ఉండడంతో పేద రోగులకు మేలు జరగనుంది. ఏళ్ల నుంచి ప్రైవేటు షాపుల దందా గతంలో నిమ్స్ సహా ఉస్మానియా, గాంధీలోనూ జీవన్‌ధార పేరుతో జనఔషధి మెడికల్ స్టోర్స్‌ను ఏర్పాటు చేశారు. రోగుల నుంచి వీటికి మంచి ఆధరణ కూడా లభించింది. అప్పటికే ఆయా ఆస్పత్రుల్లో లీజుపై కొనసాగుతున్న ప్రైవేటు మెడికల్ షాపుల నిర్వహకులు స్థానిక వైద్యులతో కుమ్మక్కై వాటిని సంక్షోభంలోకి నెట్టేశారు. ప్రస్తుతం ఒక్క ఉస్మానియాలోనే విజయవంతంగా కొనసాగుతోంది. గాంధీలో దాదాపు మూతపడే స్థితికి చేర్చారు. ఇక నిమ్స్‌లో మూడేళ్ల క్రితమే దుకాణం ఏత్తేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాంధీలో మూడు, ఉస్మానియాలో రెండు, నిలోఫర్‌లో ఒక ప్రైవేటు మెడికల్ స్టోర్లు కొనసాగుతున్నాయి. ఒక్కో స్టోర్‌లో రోజుకు సగటున రూ.2 లక్షల విలువ చేసే మందుల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. ఇప్పటికే ఆయా దుకానాల లీజు గడువు కూడా ముగిసింది. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ప్రైవేటు మెడికల్ షాపులకు అనుమతి ఇవ్వరాదనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల నేపథ్యంలో.. అధికారులు ఇప్పటికే ఆయా దుకాణాల నిర్వహకులకు నోటీసులు జారీ చేశారు. కొంత మంది అధికారులు ఆయా షాపుల నిర్వహాకులతో కుమ్మక్కై.. కోర్టుల నుంచి స్టే ఆర్డర్లు ఇప్పించడం వివాదాస్పదంగా మారింది. -
ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే పెను విషాదం తప్పదని మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ హెచ్చరించారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండా పోతుందని, దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టూ కూలిపోతుందని పేర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సర్కార్ సత్వర చర్యలు తీసుకుంటే ఈ ప్రాజెక్టును పరిరక్షించుకోవచ్చని చెప్పారు. డ్యాం సమీప నిర్మాణాలపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించడంతోపాటు వాటి నిర్వహణ బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. -
రాష్ట్రంలో పాఠశాలలను మూసివేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తే దళితులు, బడుగులు, బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరమవుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బుధవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సగం పాఠశాలలను మూసివేసే కుట్ర జరుగుతోందని, దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే తీవ్రంగా నష్టపోతారని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు తగ్గడానికి కారణాలను గుర్తించి చక్కదిద్దాలని, అలాకాకుండా పాఠశాలలను మూసివేస్తే తరువాతి తరం విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ఉపాధ్యాయ ఖాళీ లను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగుల్లో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు దాదాపు 6 లక్షల మంది ఉన్నారని చెప్పారు. స్కూళ్ల మూసివేతతో వీరందరికీ ఉద్యోగావకాశాలు లేకుండా పోతాయని తెలిపారు. -
22న నిరుద్యోగులకు జాబ్‌మేళా
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ప్రాంతంలోని నిరుద్యోగులైన యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 22న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కే.రవికుమార్ తెలిపారు. నగరపాలక సంస్థ నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డులోని హరిహర కళాభవన్ ఆడిటోరియంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు కలిగి 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చుని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఇంర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి ఉన్న కోర్సుల్లో ఉచితంగా శిక్షణలు ఇచ్చిన మీదట ఉద్యోగ అవకాశాలు చూపించనున్నట్టు చెప్పారు. కస్టమర్‌కేర్ ఎగ్జిక్యూటివ్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లు, యానిమేటర్లు, సాఫ్ట్‌వేర్‌డెవలపర్లు, డొమెస్టిక్వాయిస్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, ఎలక్ట్రీషిన్ తదితర కోర్సుల్లో శిక్షణలు ఇవ్వనున్నట్టు డీసీ చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 22న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హరిహరకళాభవన్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని డీసీ కోరారు. మరిన్ని వివరాలకు 9705092502, 9010650188. -
గర్భిణులకు పోటీలు, విజేతలకు ఉచిత ప్రసవం!
సాక్షి, హైదరాబాద్: మిసెస్ మామ్ రెండో సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 8న నిర్వహించనున్నట్లు డాక్టర్ శిల్పిరెడ్డి తెలిపారు. కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్లో మంగళవారం కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిసెస్ మామ్‌లో పాల్గొనే గర్భిణులకు మాదాపూర్‌లోని స్నాట్ స్పోర్ట్స్‌లో డిసెంబర్ 8న సాయంత్రం గ్రాండ్ ఫినాలే పోటీలు నిర్వహిస్తామన్నారు. మిసెస్ స్మైల్, మిసెస్ ఫ్యాషనిస్టా, మిసెస్ బ్రెయిన్స్, మిసెస్ బ్యూటీఫుల్ హెయిర్, మిసెస్ ఫిట్నెస్ తదితర కేటగిరీల్లో విజేత, రన్నరప్, రెండో రన్నరప్‌లను ఎంపిక చేస్తామన్నారు. విజేతలకు ఉచిత ప్రసవంతో పాటు ఆసక్తికర బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. గర్భిణులు 8897993265 నంబర్‌కు ఫోన్ చేసి డిసెంబర్ 1లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గర్భిణులు శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు వ్యక్తిత్వ వికాసంతో పాటు యోగా చేయిస్తామన్నారు. న్యూట్రిషన్లో చిట్కాలు, డెంటల్, హెల్త్ చెకప్స్, గర్భిణులు అందంగా ఎలా తయారు కావచ్చో తెలియజేయడమేగాక సాధారణ ప్రసవం కోసం వారిని సిద్ధం చేస్తామని తెలిపారు. గత ఏడాది 60 మంది మిస్ మామ్ పోటీల్లో పాల్గొనగా 40 మందికి సాధారణ ప్రసవాలు జరిగినట్లు తెలిపారు. ప్రసవానంతరం వ్యాయమం, బేబీ కేర్, బేబీ మేకప్, మసాజ్, స్నానం, హెల్దీ కుకింగ్‌లపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నీలిమా ఆర్య, మన్సీ ఉప్పల, డాక్టర్లు సమంత, శారద, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మార్వోలకు ‘పార్ట్–బీ’ బాధ్యత!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తేరుకుంది. చిక్కుముడిగా మారిన పార్ట్–బీ భూములను పరిష్కరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల పేరిట కాలయాపన చేసిన రెవెన్యూశాఖ.. ఈ భూ వివాదాలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు వీలుగా.. సవరణ అధికారాన్ని తహసీల్దార్లకు ఇవ్వాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీగా పరిగణించిన ప్రభుత్వం.. పట్టాదార్ పాస్పుస్త కాలు ఇవ్వకుండా పక్కనపెట్టింది. కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములు, భూవిస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు–రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు, ప్రైవేటు భూముల మధ్య వివాదాస్పదంగా ఉన్నవాటిని కూడా ఈ కేటగిరీలో నమోదు చేసింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల మేర భూము లకు పార్ట్–బీ కేటగిరీలో చేర్చింది. అయితే, వీటిని సకాలంలో పరిష్కరించడంలో రెవె న్యూ యంత్రాంగం ఎడతెగని జాప్యం ప్రదర్శించింది. సాఫ్ట్వేర్ సమస్యలు, తప్పొప్పు లను సవరించే అధికారం జేసీలకు కట్టబెట్టడంతో పార్ట్–బీ భూముల వ్యవహారం జటిలమైంది. ఈ భూములకు పాస్‌పుస్తకాలు నిలిపేయడంతో ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ రైతులు తిరగడం.. ఆ వివాదాలను పరిష్క రించే అధికారం తమకు లేదని తహసీల్దార్లు చెప్పినా వినకపోవడంతో ఉద్దేశపూర్వంగా రెవెన్యూ ఉద్యోగులే చేయడం లేదనే భావన రైతాంగంలో నెలకొంది. ఈ వివాదాలు మొ దలు. భౌతిక దాడులు వరకు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురికావడంతో ప్రభుత్వం మేలుకుంది. సాం కేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఒక వైపు చర్యలు తీసుకుంటునే.. పార్ట్–బీ భూ ములను కూడా సాధ్యమైనంత త్వరగా కొలి క్కి తేవాలని నిర్ణయించింది. ఇందులో భా గంగా ఈ భూములను పరిశీలించి.. పరిష్క రించే అధికారాన్ని తహసీల్దార్లకు అప్ప గిం చాలని యోచిస్తోంది. తాజాగా తహసీ ల్దార్ల బదిలీ ప్రక్రియ ముగిసినందున.. కొత్త తహసీల్దార్లు కుదురుకోగానే స్పష్టమైన మార్గ దర్శకాలను వెలువరించ నున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. త్వరలో సీఎంతో భేటీ! రెవెన్యూ సమస్యలపై త్వరలో సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో రెవెన్యూ ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేయ నున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీ ఆర్ హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ.. మం గళవారం రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌ను కలసింది. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల కొరత తదితర అంశాలపై చర్చించింది. అలాగే తాజా పరిణామాలను వివరించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరలోనే సమావేశ తేదీని ఖరారు చేస్తానని హామీ ఇచ్చినట్లు రవీందర్‌రెడ్డి తెలిపారు. అలాగే తహసీల్దార్ల బదిలీకి కృషి చేసినందున కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. -
ఆ డిపో బస్సు ఒక్కటీ రోడ్డెక్కలేదు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో ఒక బస్ డిపో కొత్త రికార్డు సృష్టించింది. సమ్మె మొదలైన గత 46 రోజుల్లో ఆ డిపో నుంచి ఒక్కబస్సూ రోడ్డెక్కలేదు. రాష్ట్రంలో 97 బస్ డిపోలు ఉండగా.. 96 చోట్ల ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఏదోలా బస్సులను తిప్పుతోంది. కానీ, ముషీరాబాద్–2 బస్సు డిపోలోని 140 బస్సులకు ఒక్కటంటే ఒక్కటి కూడా బయటకు రావడంలేదు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌కు సమీపంలో ఉన్న ఈ డిపోలోని 140 బస్సులను జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద 2012లో కేంద్రం మంజూరు చేసింది. టాటా కంపెనీ రూపొందించిన ఆ బస్సులు సాధారణ బస్సులకు కాస్త భిన్నం. వీటిని నడిపేందుకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సాధారణ బస్సులు నడిపే అనుభవం ఉన్న డ్రైవర్లు వీటిని నడపటానికి ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఈ బస్సుల మన్నిక అంతంతే. ప్రస్తుతం కండీషన్ తప్పిన ఆ బస్సులు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటిని డిపోలోనే ఉంచేశారు. ఫలితంగా సమ్మె కాలంలో ఆ డిపో నుంచి ఒక్క బస్సూ గేటు దాటలేదు. -
హైకోర్టు తీర్పుకాపీ అందేవరకూ ఆందోళనలు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే.. అవి దొందూ దొందే అన్న చందంగా మారాయనే విషయం స్పష్టమవుతోందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ నాయకుడు లింగమూర్తి మూడు రోజులుగా రాంనగర్లో చేస్తున్న నిరాహార దీక్షను సోమవారం రాత్రి అఖిలపక్షం నేతలు ప్రొఫెసర్ కోదండరాం, చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, వినోద్‌రెడ్డి, మందకృష్ణ మాదిగ, కె.గోవర్ధన్, కె.రమ తదితరులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా లేదన్నారు. గత 45 రోజులుగా ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి కోర్టు అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటికీ సమ్మెను చట్ట వ్యతిరేకంగా గుర్తించడానికి కోర్టు అంగీకరించలేదని, కార్మికులను బిడ్డలుగా చూడాలి తప్ప అణచివేసే ధోరణి మంచిదికాదని మొదటి నుంచీ చెబుతోందని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ చూసేవరకు ఆందోళనలు ఆపకుండా యథావిధిగా కొనసాగుతాయని, నేడు తలపెట్టిన సడక్ బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో ప్రధాన డిమాండ్లు సాధ్యమవుతున్నప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో సాధ్యం కాకపోవడానికి కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టాలనే స్వార్థ బుద్ధే అసలు కారణమనే విషయాన్ని తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోందన్నారు. హైకోర్టు సాక్షిగా దాఖలు చేసిన పిటిషన్, కేసీఆర్ మాటలు ఒకేరకంగా ఉన్నాయన్నారు. కార్మికుల సమ్మె పట్ల కేసీఆర్ దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల 45 రోజుల సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకట్, సుధాభాస్కర్, డి.జి. నర్సింగ్‌రావు, న్యూడెమోక్రసీ నాయకులు హన్మేష్, ఎస్.ఎల్. పద్మ తదితరులు పాల్గొన్నారు. -
అయోధ్య కోసం మోదీ చేసిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: అయోధ్య భూ సమస్య పరిష్కారానికి పధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయిలు చేసింది ఏమీ లేదని, పీవీ నర్సింహారావు హయాంలోనే అయోధ్య.. శ్రీరామచంద్రునిదని స్పష్టమైందని పూరీ గోవర్ధన పీఠం పీఠాధీశ్వరుడు జగద్గురు శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి మహరాజ్ అన్నారు. ఆయన సోమవారం నగర శివారు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ చంద్రమౌళీశ్వర, శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీ సత్యనారాయణస్వామి, శ్రీ శారధామాత (గోల్డన్‌టెంపుల్)దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లా డారు. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రామమందిరం గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. ఇప్పటికైనా అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం అయినందుకు హిందువులంతా సంతోషించాలన్నారు. దేశంలో ఆదిశంకరులు స్థాపించిన నాలుగు జగద్గురు పీఠాలు మాత్రమే ధర్మ నిష్టతో అనాదిగా అవిచ్ఛిన్న పరంపరతో ధార్మిక దిశానిర్దేశం చేస్తున్నాయన్నారు. -
ముగిసిన మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీలు
సాక్షి, హైదరాబాద్: కేఎం పాండు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 200 మందికి పైగా బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్ బహుమతులు ప్రదానం చేశారు. 55 కేజీల నుంచి 100 కేజీల వరకు మొత్తం 10 రౌండ్లలో పోటీలు జరిగాయి. ఒక్కో రౌండ్లో మొదటి స్థానంలో 10 మందిని ఎంపిక చేసి మిస్టర్ తెలంగాణ పోటీలు నిర్వహించారు. కుత్బుల్లాపూర్ వాజ్‌పేయినగర్‌కు చెందిన కట్టా కుమార్ మిస్టర్ తెలంగాణ–2019 విజేతగా నిలిచాడు. 2018 ఆగస్టులో రామంతాపూర్‌లో జరిగిన మిస్టర్ తెలంగాణ పోటీల్లోనూ కుమార్ విజేతగా నిలిచాడు. -
గ్రీన్ చాలెంజ్: మొక్కలు నాటిన రాహుల్
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చేపట్టిన ‘గ్రీన్ చాలెంజ్’కు బిగ్‌బాస్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా వంతు బాధ్యతగా మొక్కలు నాటాను. మీరూ కూడా నాటండి’ అంటూ ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఇటీవల మరో ముగ్గురిని నామినేట్ చేశారు. అందులో రాహుల్ కూడా ఉన్నారు. సుమ కనకాల చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినట్లుగా రాహుల్ పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: రాహుల్‌కు సుమ గ్రీన్ చాలెంజ్) -
గోషామహల్లో నిరుపయోగ వస్తువుల వేలం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్న, ప్రస్తుతం నిరుపయోగ స్థితిలో ఉన్న వస్తువులను వేలం వేయనున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రహదారి, ఫుట్‌పాత్‌లకు అడ్డంగా ఏర్పాటు చేసిన తోపుడు బళ్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని గోషామహల్ పోలీస్ స్టేడియాని తరలించారు. ఆయా వస్తువులను కొనుగోలు చేయాలని చేయాలని భావించే వారు మంగళవారం ఉదయం 11 గంటలకు గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగే వేలంలో పాల్గొనాలని కోరారు. -
రాష్ట్రవ్యాప్తంగా హెపటైటిస్ స్క్రీనింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా హెపటైటిస్ స్క్రీనింగ్ చేయాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ మేరకు అధికంగా కేసులు నమోదవుతున్న గద్వాల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయించింది. గద్వాల జిల్లాలోని ఐజా, రాజోలి మండలాల్లోని పలు గ్రామాల్లో 20 నుంచి 25 శాతం మంది రకరకాల కాలేయ వ్యాధులతో బాధపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 10వేల మందికి ఆరోగ్య పరీక్షలు చేయించనున్నారు. వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ప్రమాదమున్న నేపథ్యంలో స్క్రీనింగ్‌లో పాల్గొనే ఆరోగ్య సిబ్బందికి ఇప్పటికే వ్యాక్సిన్లు ఇచ్చారు. డిసెంబర్ తొలి వారంలో స్క్రీనింగ్ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్క్రీనింగ్‌కు అవసరమైన మెడికల్ కిట్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులకు అందజేసింది. ఈ స్క్రీనింగ్‌లో వ్యాధి ఉన్నట్లు తేలితే నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో ఉచితంగా చికిత్స అందించనున్నారు. -
సమ్మె పరిష్కారంపై చిత్తశుద్ధి లేదు: శ్రీధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, న్యాయస్థానాలను సైతం అది తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన పార్టీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగర పాలకసంస్థ అవినీతికి మారుపేరుగా తయారైందని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీలో అన్ని విభాగాల పనితీరు అధ్వానంగా తయారైందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా, డల్లాస్‌గా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం గుప్పిస్తున్న వాగ్దానాలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నాయన్నారు. నగరంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నీరుగారుస్తున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ ఘోరంగా తయారైందని విమర్శించారు. ఎక్కడ చూసినా వ్యర్థ పదార్థాలు నిండిపోయి, దుర్వాసన వస్తోందని, అసలు జీహెచ్ఎంసీ పనిచేస్తోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ నాయకులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అక్రమ కట్టడాల నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
చెంచాగిరీ చేస్తున్నారు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఆత్మహత్యలుండవని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారని, కానీ అందుకు విరుద్ధంగా పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఒకవైపు రైతులు, మరోవైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె 40 రోజులు జరగడం ఇదే తొలిసారి అని, ఇంకా ఎన్ని రోజులు ఈ సమ్మె జరుగుతుందో అర్థం కావడం లేదని అన్నారు. ఉద్యమాలకు రాష్ట్రంలో విలువ లేకుండా పోయిందన్న జగ్గారెడ్డి.. చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. ఇంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదా? అని నిలదీశారు. బలవంతుడికి, బలహీనుడికి జరుగుతున్న పోరాటంలో భగవంతుడు ఎవరిని గెలిపిస్తాడో అని వ్యాఖ్యానించారు. కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు కూడా కేసీఆర్ మాటలను బలపరుస్తూ ప్రభుత్వానికి చెంచాగిరీ చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇంత జరుగుతున్నా స్వామిగౌడ్, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, మమత, రవీందర్‌రెడ్డిలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. టీజీవో, టీఎన్జీవో సంఘాలు ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి వారికి మనోస్థైర్యం కల్పించాలని ఆయన సూచించారు. -
తాత్కాలికంగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నిర్వహణాపరమైన కారణాల దృష్ట్యా హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం 19 రైళ్లను పూర్తిగా, మరో 24 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కూడా ఎంఎంటీఎస్ రైళ్ల పాక్షిక, పూర్తిస్థాయి రద్దు కొనసాగనుంది. ఈ మేరకు నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్‌నుమా, జనగామ–ఫలక్‌నుమా (ఇది ప్యాసింజర్ ట్రైన్), నాంపల్లి–ఫలక్‌నుమా, లింగంపల్లి–నాంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్ రూట్లలో 19 సర్వీసులను రద్దు చేశారు. అలాగే మరో 24 సర్వీసులను సికింద్రాబాద్–ఫలక్‌నుమా, నాంపల్లి–ఫలక్‌నుమా మధ్య రద్దు చేశారు. దీంతో ఈ రైళ్లు లింగంపల్లి–సికింద్రాబాద్, లింగంపల్లి–నాంపల్లి మధ్య మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. -
ఆర్టీసీ కార్మికుల్లో కొందరి పరిస్థితి అయోమయం
సాక్షి, హైదరాబాద్: సమ్మెలో ఉండి తిరిగి విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికుల్లో కొందరి పరిస్థితి అయోమయంలో పడింది. ఈనెల ఐదవతేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరినవారినే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పెట్టిన గడువుకు 495 మంది విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతూ లేఖలు ఇచ్చారు. వారిలో 220 మంది మాత్రమే ఇప్పుడు విధులకు హాజరవుతున్నారు. మిగిలిన 275 మందిని సమ్మెలో ఉన్నట్టుగానే అధికారులు పరిగణిస్తున్నారు. వీరు సమ్మెలోకి వెళ్లకుండా విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండగా..అధికారులనుంచి పిలుపు రాకపోవటంతో వీరి పరిస్థితి గందరగోళంగా మారింది. వీరు విధుల్లో చేరుతున్నట్లు సమర్పించిన లేఖలు తమకు అందలేదని డిపో మేనేజర్లు చెబుతున్నారు. ఇప్పటికే రెండు నెలల నుంచి వేతనాల్లేక ఇబ్బంది పడుతున్నందున, ఇప్పుడు డ్యూటీలో లేనట్టుగా అధికారులు పరిగణిస్తే ప్రస్తుత నెల వేతనం కూడా అందదన్న ఆందోళనతో ఉన్నారు. అసలేం జరిగింది.. ఈనెల 2న సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు ప్రకటనకు తొలిరెండ్రోజులు కార్మికుల నుంచి స్పందనలేదు. తాము పనిచేస్తోన్న డిపో మేనేజర్ల వద్దకు వెళ్లి లేఖలు ఇస్తే సమ్మెలో ఉన్న తోటి కార్మికుల ఆగ్రహానికి గురవుతామన్న భయం కార్మికుల్లో ఉందని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు ఈ నెల 4న కార్మికులు పనిచేస్తోన్న డిపోలోనే కాకుండా ఏ డిపోలో లేఖ ఇచ్చినా స్వీకరిస్తామని, కలెక్టరేట్లు, పోలీసు స్టేషన్లు, ఆర్డీఓ కార్యాలయాలు..ఇలా కొన్ని ప్రత్యామ్నాయ కార్యాలయాలను ప్రకటించారు. దీంతో చివరిరోజు ఎక్కు వ మంది కార్మికులు ఆయా ప్రత్యామ్నాయ కార్యాలయాల్లో అందజేశారు. ఈ లేఖల్లో కొన్ని మాత్రమే సంబంధిత డిపోలకు చేరగా, మిగతావి అందలేదు. ఇప్పుడదే ఈ గందరగోళానికి కారణమైంది. ‘నేను పనిచేస్తున్న డిపోలో కాకుండా నగరంలోని ఓ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లేఖ ఇవ్వగా అక్కడి ఏసీపీనే స్వయంగా అందుకున్నారు. వారం గడిచినా నా లేఖ సంబంధిత డిపో మేనేజర్‌కు అందలేదు. దీంతో నాకు అధికారుల నుంచి పిలుపు రాలేదు. ఏం జరిగిందో వాకబు చేస్తే అసలు లేఖనే రాలేదని చెప్పారు. ఇప్పుడు ఈడీ కార్యాలయం నుంచి అనుమతి పొందితేనే చేర్చుకుంటామంటున్నారు’అని నగరానికి చెందిన ఓ డిపో స్థాయి అధికారి పేర్కొన్నారు. ఇలాంటి వారు ఎంతోమంది. ప్రస్తుతం ఆర్టీసీ భవితవ్యం కోర్టు ఆదేశాలపైనే ఆధారపడ్డ నేపథ్యంలో, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొంతమంది విధుల్లో చేరాలనుకుంటున్నారు. సమ్మె నుంచి బయటకొచ్చి ధైర్యం చేసి లేఖలిచ్చినా, ఇప్పుడవి అధికారులకు చేరకపోవటంతో వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. తమకు గడువులోపు లేఖలు అందినవారిని మాత్రమే విధుల్లోకి తీసుకున్నామని, లేఖలు ఇచ్చి ఇప్పటి వరకు విధులకు రాని వారిని, లేఖలు ఇవ్వనివారిని సమ్మెలోనే ఉన్నట్టుగా పరిగణిస్తామని ఓ అధికారి పేర్కొన్నారు. -
ఎకరానికి రూ. 20వేల నష్ట పరిహారమివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అకాల వర్షాలు, అతివృష్టి వల్ల వరి పంట చాలా దెబ్బతిందని, ధాన్యం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఖరీఫ్ సీజన్ మొదట్లో వాతావరణం అనుకూలించలేదని, ఆ తర్వాత వర్షా లు పుంజుకున్నాయని అన్నారు . కానీ అతి వృష్టి, అకాల వర్షాల కారణంగా పంట చేతికొచ్చే సమయంలో వరి పొలాలు నేలకొరగడంతో ధాన్యం రైతులు నష్టపోయారని లేఖలో వెల్లడించారు. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో అంచనాలు ప్రారంభించి కేంద్రం సాయంతో ఇన్పుట్ సాయం అందించాలన్నారు. -
మావో దంపతుల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విప్లవ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడు నార్ల రవి శర్మ, అతని భార్య అనురాధలను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎల్బీ నగర్‌లోని మన్సూరాబాద్ వెంకటరమణ కాలనీలోని వీరి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. వారి నుంచి మావో యిస్టు సాహిత్యంతో పాటు మూడు ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి రాష్ట్రంలో జరిగిన మావోయిస్టు కార్యకలాపాలతో వీరికి సంబంధం ఉందని 2012 తెలంగాణ స్టేట్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్ 8(1)2, 1967 చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం తిరుమలపురం గ్రామానికి చెందిన రవి శర్మ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. సీపీఐ (ఎంఎల్) పీడబ్ల్యూజీలో పనిచేసే మేకల దామోదర్‌రెడ్డితో పరిచయం ఏర్పడటంతో జంట నగరాల్లో ఆ సంస్థల్లో సీవోగా పనిచేశారు. 1988లో ఆర్టీసీ బస్సుపై దాడి కేసులో సైఫాబాద్ ఠాణాలో వీరిపై కేసు నమోదైంది. మీర్చౌట్ ఠాణాలోనూ మరో కేసులో అరెస్టయి 1988 సెప్టెంబర్ 9న బెయిల్‌పై బయటకు వచ్చాడు. 1992–93లో హైదరాబాద్‌లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్లో పనిచేశాడు. ఆ తర్వాత అజ్ఞాత కార్యకలాపాలు నిర్వహించాడు. 1998లో బిహార్, జార్ఖండ్‌లకు వెళ్లి పీపుల్స్ వార్ గ్రూప్‌ను అక్కడి పీయూతో విలీనం చేశాడు. 1999లో జార్ఖండ్ రాష్ట్రంలోని పాలమూ, లతేహర్‌లో జోనల్ కమిటీ మెంబర్‌గా, 2001లో బిహార్, జార్ఖండ్ స్టేట్ యాక్షన్ కమిటీ మెంబర్‌గా, 2003 నుంచి 2006 వరకు బిహార్ జార్ఖండ్ స్టేట్ యాక్షన్ కమిటీ మిలటరీ కార్యకలాపాలను చూసుకున్నాడు. బిహార్‌లోని బీమ్బంద్ అడవిలో జరిగిన తొమ్మిదో కాంగ్రెస్‌కు హజరై భద్రతా చర్యలను పర్యవేక్షించాడు. ఆ తర్వాత నుంచి మావోయిస్టు పార్టీలోని సభ్యులకు వివిధ అంశాలపై తర్ఫీదు ఇస్తూ వచ్చాడు. ఇలా ఒకసారి పోలీసులకు చిక్కిన రవి శర్మ 2016 ఏప్రిల్ 4న బెయిల్‌పై బయటకు వచ్చాడు. తరచూ ఛత్తీస్‌గఢ్‌లో అగ్రనేతల సమావేశాలకు హజరవుతూ వస్తున్నాడు. రవి శర్మపై 16 కేసులు.. 2018 జూలై 21 నుంచి ఆగస్టు 6 వరకు రవి శర్మ దండకారుణ్యానికి వెళ్లాడు. 2018 నవంబర్‌లో కోల్‌కత్తాలో సెంట్రల్ కమిటీ మాజీ సభ్యులను, 2019 మార్చిలో హైదరాబాద్‌లో వారణాసి సుబ్రహ్మణ్యంను కలిశాడు. ఢిల్లీలో 2019 ఫిబ్రవరిలో జరిగిన హిందుత్వ ఫాసిస్టు అఫెన్సివ్కు వ్యతిరేకంగా ఆలిండియా ఫోరమ్ ఏర్పాటులో చురుగ్గా పాల్గొన్నాడు. రవి శర్మ పోలీసులకు లొంగిపోయినప్పటి నుంచి కూకట్‌పల్లిలో నివసించే అతని సోదరుడు ప్రకాశ్ శర్మ ఇంటి వద్ద ఉండేవాడు. రవి శర్మ తల్లిదండ్రులు సుధాకర శర్మ, సులోచనతోపాటు సోదరి శ్రీదేవి కూడా ఉండేవారు. మన్సూరాబాద్‌లోని వెంకటరమణ కాలనీలో సుధాకర శర్మ సోదరుడి కుమారుడు రాజేష్ కుమార్‌కు రెండంతస్థుల భవనం ఉంది. సుధాకర శర్మకు విశాలాంధ్ర కాలనీలో 230 గజాల ప్లాటు ఉంది. ఈ ప్లాటులో ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఆరు నెలల క్రితం రవి శర్మ రాజేష్ కుమార్ ఇంట్లోకి దిగాడు. విషయం తెలుసుకున్న ప్రత్యేక పోలీసులు.. ఎల్బీ నగర్ పోలీసుల సహకారంతో రవి శర్మ ఇంటిపై దాడి చేశారు. దంపతులిద్దరినీ అరెస్టు చేశారు. రవి శర్మపై జార్ఖండ్‌లో 11, హైదరాబాద్‌లో 4, విశాఖపట్నం రూరల్ చింత పల్లిలో ఒక కేసు.. మొత్తం 16 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో జార్ఖండ్ బోకారా జిల్లా తెనుఘాట్లో ఒక కేసు పెండింగ్‌లో ఉందని పోలీసులు తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం రవి శర్మ పక్క పోర్షన్లోకి హిందీ భాష మాట్లాడే దంపతులు అద్దెకు దిగారని తెలుస్తోంది. వారు ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. -
రాష్ట్రంలో మావోలు ఉన్నారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్ట్‌లే లేరని శాసనసభలో ప్రభుత్వం చెప్పిందని, ఈ మేరకు కేంద్రానికి నివేదిక కూడా పంపిందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఇప్పుడేమో ఆర్టీసీ సమ్మెలో మావోయిస్ట్‌లు ఉన్నారని పోలీసు అధికారులు చెబుతున్నారని ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం.. అని ప్రశ్నించారు. పోలీసులు ప్రతి అంశాన్ని శాంతి భద్రతల కోణంలోనే చూడటం సబబుకాదని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే నగరాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉండగా అది జరగడం లేదని ఆరోపించారు. నగర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని కమిషనర్ అంజనీ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల కోదండరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు హైదరాబాద్‌లో స్వేచ్ఛగా నిరసన తెలిపే అవకాశాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. సోమవారం పార్టీ నేతలు పీఎల్ విశ్వేశ్వరరావు, వెంకట్‌రెడ్డి, శ్రీశైల్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘చలో ట్యాంక్‌బండ్’ సందర్భంగా ప్రభుత్వమే ఎక్కడికక్కడ కంచెలు వేసి ప్రజలకు ఇబ్బందులు, అసౌకర్యం కలిగేలా చేసిం దని విమర్శించారు. ఆర్టీసీని నడిపించడం ప్రభుత్వ బా« ధ్యత కాగా, ఇంకెన్ని రోజులు ఆర్టీసీకి సహాయం చేయాలనడం ప్రభుత్వానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. -
శబ్ద, వాయు కాలుష్యాలతో మహిళల్లో గర్భస్రావం
సాక్షి, హైదరాబాద్: నగరంలో నానాటికి పెరుగుతున్న శబ్ద, వాయు కాలుష్యాలతో ప్రజలు అనారోగ్యాల బారిన పడి తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని తెలంగాణ హైకోర్టులో ఎమ్. ఆదిత్య అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఈ అంశంపై సోమవారం వాదనలు విన్న న్యాయస్థానం.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ), మున్సిపల్ కమిషన్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డితో సహా రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే.. దేశంలో ఢిల్లీ తరువాత హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగే అవకాశం ఉందని, జంట నగరాల్లో పెరుగుతున్న వాహనాల కారణంగా శబ్ద, వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిందని పిటిషనర్ తరపు న్యాయవాది రాపోలు భాస్కర్ వాదించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో మహిళలు గర్భస్రావంతో సహా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ హైకోర్టుకు విన్నవించారు. అలానే రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పాటు పలు ద్విచక్ర వాహనాల కారణంగా విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని పిటిషనర్ తన నివేదికలో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలపై విచారణ వాయిదా అదేవిధంగా సోమవారం మున్సిపల్ ఎన్నికల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 30న వాయిదా వేసింది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని జబ్బిర్ అహ్మద్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు. -
నేడు, రేపు ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్: గురునానక్ జయంతి వేడుకలతో పాటు మిలాదున్నబి ర్యాలీ నేపథ్యంలో నగరంలో శని, ఆదివారాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురునానక్ జయంతి వేడుకల్లో భాగంగా సిక్కులు అశోక్ బజార్‌లోని గురుద్వారా ర్యాలీగా బయలుదేరి మళ్లీ అక్కడికే చేరుకుంటారు. ఈ నేపథ్యంలో శివాజీ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్ టి జంక్షన్, రంగ్ మహల్ జంక్షన్, నయాపూల్, శాంతి ఫైర్ వర్క్స్ మార్గంలో శనివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 వరకు మళ్లింపులు ఉంటాయి. మిలాదున్నబి ర్యాలీ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పాతబస్తీ సహా కొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లిస్తారు. చార్మినార్, శాలిబండ, మోతిగల్లీ, మదీన, డబీర్‌పుర, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, చెత్తబజార్ ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. -
‘నయా నిజాం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్ చేస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంలో ఆవిర్భవించిన ఆర్టీసీని నయా నిజాం కేసీఆర్ ప్రైవేట్ పరం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. ఆర్టీసీని కాపాడేందుకు ఎంఐఎం ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి బయటకు రావాలని సీపీఐ నారాయణ సూచించారు. శుక్రవారం మగ్దూం భవన్లో అత్యవసరంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నప్పటికీ.. ప్రభుత్వానికి ఎంఐఎం ఇప్పటికి కూడా మద్దతివ్వడంపై విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే చలో ట్యాంక్ బండ్లో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. హైకోర్టు ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్‌పై స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రయివేట్ బస్సులు ప్రవేశ పెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి ప్రయత్నిస్తే.. కోర్టు స్టే ఇవ్వడంతో ఆయన ఏకంగా సీఎం పదవికే రాజీనామా చేశారని గతాన్ని గుర్తు చేశారు. కోర్టులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు అవమానం ఎదురైతే.. ప్రభుత్వానికి కూడా అది అవమానమే అని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, అధికారులకు అవమానం జరిగితే.. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలకు అవమానమని భావించి తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తీరు మార్చుకోకపోతే రావణాసురుడికి పట్టిన గతే పడుతుందని విమర్శించారు. హైకోర్టు 11న ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచేందుకు అవకాశం ఇచ్చిందని.. ఇప్పటికైనా వారిని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించేలా చూడాలన్నారు. రాష్ట్ర రెండో రాజధానిపై విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలకు.. సొంత పార్టీ వారు సంబంధం లేదంటే.. ఆయన మాత్రం తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం ఏమి బాలేదన్నారు. కేవలం ఆర్టీసీ సమస్యను పక్కదారి పట్టించేందుకే విద్యాసాగర్ రావు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నరని ధ్వజమెత్తారు. ఛలో ట్యాంక్‌బండ్ పిలుపు నేపథ్యంలో.. ముందస్తు అరెస్టులపై ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తదితరులు హాజరయ్యారు. కేసీఆర్ చెప్పినట్లు చేయడం వల్లే.. కోర్టు బోనులో తలదించుకుంటున్నారు చట్టాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు చేయడం వల్లే.. నేడు ఐఏఎస్ అధికారులకు కోర్టు బోనులో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇక్కడ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదున్నరేళ్ల కేసీఆర్ ప్రభుత్వం పాలనలో కోర్టు ఎన్నో మొట్టికాయలు వేసిందని అన్నారు. ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్‌పై కోర్టు స్టే ఇచ్చిందని, దీనిపై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని ఎద్దేవా చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణమే ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలానే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఏమాత్రం ప్రశాంతత లేదని.. ఉద్యమాలు అణచడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఛలో ట్యాంక్ బండ్‌ను విజయవంతం చేయాలని అందరిని కోరారు. -
విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నాం: కుంతియా
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలపై డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నామని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి ఆర్సీ కుంతియా పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన బుధవారం ఇందిరా భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు బడే భాయ్.. ఛోటా భాయ్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సచివాలయాన్ని కూల్చి వేయాలని చూస్తుంటే .. మోదీ పార్లమెంట్ కూల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దేశ ఆర్థిక పరిస్థితిని హృతిక్ రోషన్ సినిమా కలెక్షన్లతో పోల్చడాన్ని కుంతియా తప్పుబట్టారు. ఆర్టీసీ సమ్మెపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం కేసీఆర్ పట్టించుకోక పోవడంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మెజార్టీ రైతులకు రైతుబంధు డబ్బులు అందలేదన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిజాయితీగా పనిచేసే అధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అదేవిధంగా ఈనెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలతో పాటు 16న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, తక్షణమే ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి కంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోదీ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను జనంలోకి ఉద్యమ రూపంలో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కార్యాచరణ రూపొందించిందని చెప్పారు. దేశంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోమాలో.. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు వెంటిలేటర్‌పై ఉందంటూ ఎద్దేవా చేశారు. మోదీ విధానాలు అన్నీ సామాన్యులకు వ్యతిరేకంగా ఉండడంతో.. పారిశ్రామిక వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆర్సీ కుంతియా, హెచ్‌కే పాటిల్, భట్టి విక్రమార్క, జానా రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, బోసు రాజు, దాసోజు శ్రవణ్, బొల్లు కిషన్, కోదండ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
ఆర్టీసీ సమ్మె: ఆరెపల్లిలో విషాదం
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన సకలజనుల సమరభేరి సభకు బుధవారం హైదరాబాద్‌కు తరలివెళ్లిన డ్రైవర్ నంగునూరి బాబు గుండె ఆగింది. కరీంనగర్–2 డిపోకు చెందిన ఆయన హఠాన్మరణం కరీంనగర్ రూరల్ మండలం ఆరెపల్లి గ్రామంలో విషాదం మిగిల్చింది. బాబు మృతి విషయం తెలియడంతో ఆయన కుటుంబం గుండెలవిసేలా రోదించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. బెజ్జంకి మండలం గాగిళ్లపూర్ గ్రామానికి చెందిన బాబు ఉద్యోగరీత్యా ఆరెపల్లిలో నివాసం ఉంటున్నాడు. కరీంనగర్–2 డిపోలో 25 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఆర్టీసీ జేఏసీ సమ్మె పిలుపులో భాగంగా గత 26రోజులుగా ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరిగిన సభలో పాల్గొనేందుకు తోటి కార్మికులతో కలిసి వెళ్లాడు. సభాప్రాంగణంలోనే గుండెపోటుతో కుప్పకూలాడు. జేఏసీ నాయకులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాబుకు భార్య జయ, కుమారుడు సాయికుమార్, ఇద్దరు కూతుళ్లు దివ్య, సంధ్య ఉన్నారు. కూతురు దివ్యకు వివాహం కాగా.. కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. నేడు ఉమ్మడి కరీంనగర్ బంద్ : ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ డ్రైవర్ బాబు హఠాన్మరణం చెందడంపై గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ జిల్లా శాఖ పిలుపునిచ్చింది. సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని, ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో 16 మంది కార్మికులు అమరులయ్యారని ఆర్టీసీ జేఏసీ జిల్లా నాయకులు ఎంపీ రెడ్డి, జక్కుల మల్లేశం, మనోహర్, ఎస్కె రాజు, తదితరులు విమర్శించారు. బాబు మరణం బాధాకరమని, ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. బంద్‌లో వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొనాలని, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, కుల సంఘాలు బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. బంద్‌కు పలు పార్టీల మద్దతు.. బంద్‌కు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, న్యూడెమోక్రసీ పార్టీలు వేర్వేరు ప్రకటనల్లో మద్దతు ప్రకటించాయి. గురువారం జరిగే బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పలువురి సంతాపం.. ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతికి సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు శేఖర్, ఎడ్ల రమేష్, జాక్టో నేతలు, ప్రజా సంఘాల నేతలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (చదవండి: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి) -
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
సాక్షి, హైదరాబాద్: సరూర్ నగర్లో బుధవారం జరిగిన సకల జనుల సమావేశానికి హాజరయిన ఆర్టీసీ డ్రైవర్ అనూహ్యంగా గుండెపోటుతో మరణించాడు. మృతుడు కరీంనగర్-2 డిపోకు చెందిన నంగునూరి బాబు అని, జిల్లాలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించేవాడని ప్రాథమికంగా గుర్తించారు. ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకులు చేస్తున్న ప్రసంగాలు వింటుండగా.. హఠాత్తుగా బాబుకు గుండెపోటు రావడంతో.. తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర కలత చెందిన బాబు గుండె పోటుకు గురై హఠాన్మరణం పొందాడని తోటి కార్మికులు పేర్కొన్నారు. డ్రైవర్ బాబు మృతికి సంతాపంగా రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. -
‘ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు గెలవగానే సరిపోదని ప్రజా సమస్యలను పరిష్కారించాలన్నారు. ధనం, మద్యం, అధికార బలంతో హుజూర్నగర్ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఉప ఎన్నికలో రూ. యాభై కోట్లు ఖర్చు చేసి గెలిచినందువల్లే.. నిన్న ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ అహంకార ధోరణితో మాట్లాడారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీర్ కాదని, ఆర్టీసీని మూసివేస్తానంటే ఉరుకునేది లేదన్నారు. ఆర్టీసీ సంస్థ నష్టపోతుంటే.. ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టేలే ప్రజారవాణా వ్యవస్థ నష్టాల్లో ఉంటే.. లాభాల్లోకి తీసుకు రావడానికి రివ్యూ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటే రివ్యూ చేయని సీఎం కేసీఆర్, ఎన్నికలకు మాత్రం రివ్యూ చేస్తారని వ్యంగ్యంగా మాట్లాడారు. జ్వరాలు వచ్చి జనాలు ఇబ్బంది పడుతుంటే రివ్యూ చేయని మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూర్ నగర్ ఎన్నికల్లో మాత్రం మొత్తం అక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో డెంగ్యూ జ్వరంతో మహిళా జడ్జీ చనిపోయిందని, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని స్వయంగా కోర్టు చెప్పినా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎంఐఎం మోదీకి 'బీ' టీమ్: గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి హరియాణా, మహారాష్ట్రలో మంచి ఫలితాలు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుందని ఆనందం వెల్లిబుచ్చారు. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సత్ఫలితాలు వస్తాయని ఆశించారు. మహారాష్ట్రలో 44 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ కేవలం 2 సీట్లే గెలిచి, మిగతా సీట్లలో బీజేపీ, శివసేనను గెలిపించిందన్నారు. ఎంఐఎం మోదీకి బీ టీమ్ అని, సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ ఓట్లు చీల్చి.. మతతత్వ పార్టీని ఎంఐఎం గెలిపించిందన్నారు. ముస్లిం ఓట్లను చీల్చడానికే ఎంఐఎం అభ్యర్థులను నిలపెట్టిందన్నారు. బీజేపీ మాదిరిగానే ఎంఐఎం కూడా మతతత్వ పార్టీనే. హైదరాబాద్‌లో పుట్టిన ఎంఐఎం పార్టీ, రాష్ట్రంలో ఎన్నడూ 44 సీట్లలో పోటీ చేయలేదు. మహారాష్ట్రలో మాత్రం 44 సీట్లు పోటీ చేయడం వెనుక ఉన్న అంతార్యం ఏమిటని ప్రశ్నించారు. ఆరెస్సెస్, బీజేపీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని హిందు, ముస్లిం ఓట్లను చీల్చుతుందని ఆరోపించారు. -
'వారి ధనబలం ముందు ఓడిపోయాం'
సాక్షి, హైదరాబాద్: హుజుర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ధనబలం ముందు ఓడిపోయామని బీజేపీ ఎమ్మెల్సీ నరపరాజు రామచంద్రరావు అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార బలంతో టీఆర్ఎస్ గెలించిందని, అయినా టీఆర్ఎస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హుజుర్నగర్ గెలుపుతో అహంకారం పెంచుకోవద్దన్నారు. స్థానికంగా హుజుర్నగర్లో బీజేపీ బలంగా లేదని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం అహంకారాన్ని పక్కన బెట్టి, ఆర్టీసీ కార్మికులని చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్లు, లీగల్ బాడీస్ కార్మికులకు.. ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేమో అనే అంశంపై వారికి స్పష్టత ఇవ్వాలన్నారు. కార్మికులకు పనిచేసే వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమ్మెలకు, కోర్టుకు పోవద్దంటే.. ఆర్టీసీ కార్మికులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రానికి ఒక్కో విధానం ఉందని, ఆర్టీసీని అంతమొందించాలని చూస్తున్నారని ఆరోపించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితాలు.. ఆర్టీసీని అణిచివేయడానికి ఆమోదముద్ర కాదన్నారు. ఉన్నపళంగా 48 వేల మంది కార్మికులను తీసేస్తే.. అందుకు సంఘీభావం ప్రకటించిన బీజేపీ రాష్ట్ర నేతలపై.. ఎందుకు ప్రధాని మోదీకి లేఖ రాశారని ప్రశ్నించారు. ఇప్పటివరకూ రైల్వే ప్రైవేటికరణ జరగలేదని, ప్రయోగాత్మకంగా ప్రయివేట్ రైలు నడిపిందని తెలిపారు. -
మద్దిలేటిని కోర్టులో హాజరుపర్చాలి
సాక్షి, హైదరాబాద్: సీపీఐ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మక్తల్‌కు చెందిన తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాగ్‌లింగంపల్లిలోని టీపీఎఫ్ ఆఫీసులో ఓ రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరైన వీరిద్దరిని పోలీసులు నేరుగా కస్టడీలోకి తీసుకొన్నారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉండటమేగాక, చురుకైన కార్యకర్తలుగా పనిచేస్తూ.. కొత్త క్యాడర్‌ను నియమించడం, నిధులను సేకరించడం వంటివి చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీ నిర్వహించే బంద్‌లు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతిస్తున్నారని, అందుకే నిందితులను అరెస్ట్ చేశామని గద్వాల్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో అరెస్ట్ చేసిన నలమాస కృష్ణ, మద్దిలేటిని కోర్టులో హాజరు పర్చాలని వారి బంధువులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
10న యువ కవి సమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాహితి, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 10న సుద్దాల హనుమంతు యాదిలో ‘నల్లమల యురేనియం తవ్వకాలపై యువ కవి సమ్మేళనం’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఇందులో తెలంగాణ సాహితి ప్రతినిధులు భూపతి వెంకటేశ్వర్లు, జి.నరేష్, డీవైఎఫ్ఐ అధ్యక్షుడు విప్లవ కుమార్, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆన్లైన్లో రైల్వే టికెట్ పొందండిలా..
సాక్షి, హైదరాబాద్: రైలు టికెట్ సేవలను పొందడానికి ఇండియన్ రైల్వే పలు సులభ మార్గాలను ప్రవేశపెట్టింది. టికెట్ కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ సేవలు వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టిన విధానాల్లో ఈ టికెట్ విధానం ఒకటి. ఈ టికెట్‌ను పొందాలంటే ఇలా చేయాలి. రైల్వే వెబ్సైట్ http://www.irctc.co.inను ఓపెన్ చేయండి. పేరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అప్లికేషన్లో మరోసారి పేరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి పూర్తి అడ్రస్‌తో సబ్మిట్ అన్న చోట క్లిక్ చేయండి. ‘ప్లాన్ మై ట్రావెల్ అండ్ టికెట్స్’ కాలమ్‌ను పూర్తి చేయండి. ఈ కాలమ్‌లో రైళ్లు ప్రయాణించే మార్గాలు, రైలు బెర్తు, టికెట్ ధర తెలుసుకుని పూర్తి చేయాలి. టికెట్‌కు సరిపడా డబ్బులు చెల్లించడానికి మేకింగ్ పేమెంట్ వద్ద క్లిక్ చేయాలి. మీ డెబిట్ కార్డు ఉన్న బ్యాంక్ కాలమ్‌ను క్లిక్ చేసి టికెట్ బుక్ చేసుకోండి. ఈ టికెట్ బుక్ చేసే వారు రూ.20 యూజర్ ఛార్జీ చెల్లించాలి. ఈ టికెట్ బుకింగ్‌కు ఫొటో గుర్తింపు కార్డు వివరాలు తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. -
చలో పల్లెటూర్!
-
అడుగడుగునా ట్రాఫిక్ గండం!
ఆరోగ్య సమస్యలు.. ప్రమాదాలు జరిగినప్పుడు ఫోన్ చేస్తే పరుగెత్తుకొచ్చే 108 వాహనాలకు కురుస్తున్న వర్షాలకు తోడు ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. పురిటినొప్పులతో బాధపడుతున్న బడంగ్‌పేటకు చెందిన ఓ గర్భిణిని ప్రసవం కోసం రెండు రోజుల క్రితం 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా, నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ రద్దీలో ఆ వాహనం చిక్కుకుంది. గత్యంతరం లేని పరిస్థితిలో సిబ్బంది వాహనాన్ని పక్కకు నిలిపేశారు. బాధితురాలు అంబులెన్స్‌లోనే బిడ్డను ప్రసవించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులను ట్రాఫిక్ రద్దీ ప్రాణాలు తీస్తోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 7,200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రాష్ట్ర, జాతీయ రహదారులు వీటికి ఆనుకొని ఉన్నాయి. ఈ పరిధిలో ఏటా జరుగుతున్న సుమారు రెండు వేలకుపైగా రోడ్డు ప్రమాదాల్లో 200 నుంచి 300 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 43 వరకు 108 వాహనాలు సేవలు అందిస్తున్నాయి. గ్రేటర్లో సగటున 56 ప్రమాదాలు జరుగుతుంటే.. గాయపడిన వారిని కాపాడేందుకు సకాలంలో 108 వాహనాలు ఘటనా స్థలికి చేరుకోవడం లేదు. అవి వచ్చేందుకు సగటున 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతోంది. ప్రధాన నగరంలో ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఓ వాహనం ఉంది. అయితే శివార్లలో ప్రతి 25 నుంచి 30 కిలోమీటర్లకు ఒక 108 వాహనం సేవలు అందిస్తోంది. దీంతో సంఘటన జరిగిందన్న సమాచారం అందుకొన్నా స్థలానికి వెళ్లేసరికి గంటన్నరకు పైనే సమయం పడుతోంది. ఫలితంగా కొన్నిసార్లు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినా ప్రాణాలు పోతున్నాయి. గోల్డెన్ అవర్స్‌లో వచ్చే కేసులు తక్కువే.. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరినప్పుడు 70 శాతం మందిలో తల, వెన్నుముకకు గాయాలవుతున్నాయి. ఈ సందర్భాల్లో తొలి గంటను ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారు. ఆ సమయంలో ఆస్పత్రికి తీసుకెళితే ప్రాణాలు నిలిచే అవకాశాలు ఎక్కువ. ఆలస్యమయ్యే కొద్దీ కోలుకోవడం కష్టం. గతంలో నిమ్స్‌లో జరిగిన సర్వేలో తొలి గంటలో 23 కేసులకు మించి రావడం లేదు. ఆరేడు గంటల తర్వాతే చాలామందిని ఆస్పత్రిలో చేరుస్తున్నారు. దీంతో తలకు, వెన్నుముకకు బలమైన గాయాలు తగిలి, రక్తస్రావం జరిగి మృత్యువాత పడుతున్నారు. ఒకవేళ బతికినా శాశ్వతంగా వికలాంగులుగా మారుతున్నారు. 108 వాహనాలు సకాలంలో చేరుకొని 2 నుంచి 3 గంటల్లో తీసుకురాగలిగితే 30 నుంచి 40 శాతం కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. నగరంలో సంఘటన స్థలానికి వాహనం చేరి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించే సమయానికి చాలా ఆలస్యమవుతోంది. శివార్లలో ఒకటి రెండు చోట్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులు లేవు. ఎక్కువ శాతం మంది ఉస్మానియా, గాంధీలపై ఆధార పడుతున్నారు. శివార్ల నుంచి ఇక్కడకు చేరే సరికి సమయం మించిపోతోంది. అలాకాకుండా నగరం చుట్టూ ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో ట్రామాకేర్‌తో కూడిన ఏరియా ఆస్పత్రుల ఏర్పాటు ఎంతో అవసరమని సూచిస్తున్నారు. ఇక్కడ ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత అవసరమైతే ఇతర ఆస్పత్రులకు తరలించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఇవీ ప్రధాన సమస్యలు.. నగరంలో రెండు, మూడు కిలోమీటర్ల ప్రయాణం చేయాలన్నా ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనం ముందుకు కదలడం లేదు. కొన్ని చోట్ల సుదూరంగా ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తోంది. ఇంతలో ట్రాఫిక్ రద్దీ తప్పడం లేదు. చిన్న వర్షానికే నగరంలో అనేక ప్రాంతాల్లోని రోడ్లు నీట మునుగుతున్నాయి. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే 108 వాహనం చేరుకోవడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఉన్న వాహనాల్లో 2 అధికారిక పర్యటనలకు వచ్చే వీవీఐపీలకు కేటాయిస్తున్నారు. మిగతా వాహనాలు మాత్రమే అత్యవసర సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, మెదక్, రంగారెడ్డి పరిధిలో సేవలు అందించేందుకు మరో 70 నుంచి 80 వాహనాలు అవసరముంది. ఇందుకు 2016లో కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖకు ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు కార్యాచరణ చేపట్టలేదు. శివార్లలో ఉండే ప్రాంతీయ ఆస్పత్రుల నుంచి తరచూ రిఫరల్ కేసులను ఉస్మానియా, గాంధీలకు తరలించడానికే ఎక్కువ 108 వాహనాలు వినియోగిస్తున్నారు. దీంతో సైకిల్ టైం భారీగా పెరుగుతోంది. 108 వాహనాలకే కాకుండా మరో 30 వరకు బైక్ అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. వాహనాలు చేరేలోపు ఈ బైక్ అంబులెన్సుల సేవలను సమర్థంగా వినియోగించుకునేలా అధికారులు ప్రణాళికలు రూపొందించడం వల్ల చాలా వరకు క్షతగాత్రులకు భరోసా అందించవచ్చు. అయితే, అనుకున్నంత సమర్థంగా ఈ సేవలు వినియోగించుకోవడం లేదు. -
ఇంటి నిర్మాణం పూర్తికాగానే వసూలుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: బల్దియా ఆదాయం పెంపునకు కమిషనర్ లోకేష్‌కుమార్ చర్యలు ప్రారంభించారు. ఇకపై ప్రతి ఇంటి నిర్మాణదారుడి నుంచి కచ్చితంగా పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భవన నిర్మాణం పూర్తికాగానే ఆటోమేటిక్‌గా అసెస్మెంట్తో పాటు ఆస్తిపన్ను చెల్లించాల్సిందిగా సదరు యజమానికి డిమాండ్ నోటీసు కూడా అందించనున్నారు. ఇందుకోసం టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాలను అనుసంధానం చేయనున్నారు. -
'శభాష్.. గణేష్'
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రయాణికుడు ఆటోలో పోగొట్టుకున్న 15 తులాల బంగారు నగలను పోలీసులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఆటో డ్రైవర్ మెరుగు గణేష్. అఫ్జల్‌గంజ్ పోలీస్ ష్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ పిజి రెడ్డి తెలిపిన మేరకు.. చాంద్రయాణగుట్ట ప్రాంతానికి చెందిన వ్యాపారి మహ్మద్ ఇబ్రహీం (45) శనివారం సాయంత్రం షాపింగ్ చేసి ఆటో ఎక్కి పుత్లీబౌలీలో దిగాడు. ఆటో దిగే సమయంలో జోరుగా వర్షం కురుస్తుండడంతో బంగారు ఆభరణాలు ఉన్న పాలిథిన్ కవర్‌ను ఆటోలోనే మర్చిపోయి వెళ్లిపోయాడు. తరువాత కవర్‌ను మర్చిపోయానని గ్రహించిన ఇబ్రహీం ఆటో కోసం వెతకగా ఫలితం లేకపోవడంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవి ఫుటేజ్ ఆధారంగా, స్థానికుడు ఇస్మాయిల్ ఇచ్చిన సమాచారంతో ఆటో డ్రైవర్ మలక్‌పేట్‌కు చెందిన మెరుగు గణేష్‌గా గుర్తించారు. అతని కోసం గాలిస్తున్న క్రమంలో అతనే స్వయంగా ఆదివారం మధ్యాహ్నం పోలీసు ష్టేషన్కు వచ్చి తన ఆటోలో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడంటూ ఆభరణాలు గల కవర్‌ను అందజేశాడు. సుల్తాన్‌బజార్ ఏసీపీ దేవేందర్, అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ పీజీ రెడ్డి బాధితుడిని పిలిచి ఆభరణాలను అందజేయడంతో పాటు ఆటో డ్రైవర్ గణేష్‌ను, సహకరించిన ఇస్మాయిల్‌ను ఘనంగా సత్కరించారు. -
పల్లెబాట పట్టిన మహానగరం
సాక్షి, హైదరాబాద్: విజయదశమి నేపథ్యంలో గ్రేటర్ నుంచి భారీగా సొంతూళ్లకు తరలివెళ్లారు. అయితే, ఈ ఏడాది ప్రయాణికులకు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ సమ్మెట పోటులా మారింది. ప్రజా రవాణా సాధనాలైన రైళ్లు, బస్సుల కంటే ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి సొంత వాహనాల్లోనే మెజార్టీ సిటీజన్లు స్వగ్రామాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని జిల్లాలు, ఏపీలోని పలు నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు సుమారు 24 లక్షల మంది బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఎంజీబీఎస్‌లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఆర్టీసీ బస్సులు ఆర్థికంగా భారమే అయినప్పటికీ విధి లేని పరిస్థితుల్లో ఈసారి రైళ్లు, బస్సుల కంటే వ్యక్తిగత వాహనాలనే లక్షలాది మంది ఆశ్రయించారు. ద్విచక్ర వాహనాల్లో సుమారు ఏడు లక్షలు.. కార్లు, జీపుల్లో మరో మూడు లక్షల మంది గమ్యస్థానాలకు చేరుకున్నట్లు అంచనా. అంటే వ్యక్తిగత వాహనాల్లోనే ఏకంగా 10 లక్షల మంది సిటీ దాటినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల క్యూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తగ్గిన ప్రయాణికులు గ్రేటర్ సిటీకి ఆవల ఉన్న తూప్రాన్, షాద్‌నగర్, పంతంగి, బీబీనగర్ టోల్గేట్ల వద్ద వారం రోజులుగా నిత్యం వేలాది వాహనాలు బారులు తీరాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు ఆపరేటర్లు సాధారణ టిక్కెట్లపై వందశాతం రెట్టింపు చార్జీలతో ప్రయాణికులను నిలువుదోపిడీ చేశారు. ప్రయాణం అనేక వ్యయ ప్రయాసలతో కూడినదైనప్పటికీ 100–150 కిలోమీటర్ల దూరం లోపు ఉన్న ప్రాంతాలకు ద్విచక్రవాహనాలపై లక్షలాది మంది బయలుదేరి వెళ్లారు. తమ గమ్యస్థానాలు 200 కి.మీ పైగా ఉన్నవారు ప్రైవేటు బస్సులు, కార్లు, జీపులతో పాటు రైళ్లను ఆశ్రయించారు. జేబీఎస్లో కనిపించని ప్రయాణికుల సందడి మొత్తం దసరా పండగ జర్నీ గ్రేటర్ సిటీజన్లకు ఆనందం లేకుండా చేసింది. ప్రయాణ అవస్థలు వర్ణనాతీతంగా మారడం గమనార్హం. ఆర్టీసీ కార్మికులు పండగ రోజుల్లోనే సమ్మెకు దిగడంతో అల్పాదాయ, మధ్యాదాయ, వేతన జీవులకు పండగ ఖర్చులకు అదనంగా ప్రయాణ ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. తెలంగాణా జిల్లాల్లో అంగరంగ వైభవంగా జరిగే బతుకమ్మ, దసరా నవరాత్రులకు పల్లెబాట పట్టిన సిటీజన్లు ప్రయాణం భారమైనా వెనక్కు తగ్గకుండా వ్యక్తిగత వాహనాల్లో ముందుకు సాగడం ఈసారి దసరా ప్రత్యేకత కావడం విశేషం. సమ్మె.. దశమి ప్రభావంతో ఖాళీగా మారిన బషీర్‌బాగ్ చౌరస్తా దసరాకు గ్రేటర్ నుంచి గత నాలుగు రోజులుగా పల్లెబాట పట్టినవారు (సుమారుగా).. రవాణా వెళ్లినవారు ద్విచక్రవాహనాలు 7 లక్షలు ఆర్టీసీ బస్సులు 3 లక్షలు ప్రైవేటు బస్సులు 5 లక్షలు రైళ్లు 6 లక్షలు కార్లు/జీపులు 3 లక్షలు మొత్తం 24 లక్షలు -
దారి దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు ఆపరేటర్లు తెరతీసిన దారి దోపిడీ పర్వం సోమవారం కూడా కొనసాగింది. దసరాకు సొంతూళ్లకు బయలుదేరిన వారి నుంచి ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్ నిర్వాహకులు వందశాతం అదనపు చార్జీలు వసూలు చేశారు. యథావిధిగా విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, తిరుపతి ప్రాంతాలకు వెళ్లేవారి నుంచి సాధారణ టికెట్ ధరపై రెట్టింపు చార్జీలు వసూలు చేసి జేబులు గుల్ల చేశారు. నగరం నుంచి తెలంగాణా రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సుమారు 1400 బస్సులు తరిగినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గ్రేటర్లో 1500 బస్సులు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 29 ఆర్టీసీ డిపోల్లో మొత్తం 3800 బస్సులకుగాను.. సోమవారం సుమారు 1600 మంది తాత్కాలిక సిబ్బంది సాయంతో 1500 బస్సులు తిప్పారు. వీటిలో 500 వరకు ఆర్టీసీ అద్దె బస్సులు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ఈ బస్సుల్లోనూ తాత్కాలిక కండక్టర్లు చేతివాటం ప్రదర్శించి ప్రయాణికుల జేబులు గుల్లచేశారు. రూ.10 చార్జీకి రూ.20 వసూలు చేసి జేబులు నింపుకోవడం గమనార్హం. ప్రయాణికులు విధిలేక వారు అడిగినంత సమర్పించుకున్నారు. సీఎం ప్రకటన నేపథ్యంలో పలు ఆర్టీసీ డిపోల వద్ద రెగ్యులర్ కార్మికులు బతుకమ్మ ఆడి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆటోలు, క్యాబ్‌లు సైతం ప్రయాణికులపై దోపిడీకి తెగబడ్డాయి. నగరంలో వివిధ రూట్లలో రాకపోకలు సాగించిన సెవన్‌సీటర్ ఆటోలు, సాధారణ ఆటో డ్రైవర్లు సైతం ప్రయాణికుల అవసరాన్ని సొమ్ముచేసుకున్నారు. పలు ప్రధాన రూట్లలో స్వల్ప దూరాలకే రెట్టింపు చార్జీలు ముక్కుపిండి మరీ దోచుకున్నారు. క్యాబ్ సర్వీసులు సైతం అదనపు శ్లాబు రేట్లు, సర్‌చార్జీల పేరిట నిలువునా ముంచేశాయి. ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు కిటకిట సమ్మె ప్రభావంతో నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు కిక్కిరిశాయి. సోమవారం 125 సర్వీసుల్లో సుమారు 1.50 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ రూట్లలో రద్దీని బట్టి ప్రతి మూడు.. ఐదు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. సుమారు వంద అదనపు సర్వీసులను నడిపినట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఈ సర్వీసుల్లో సోమవారం సుమారు 3 లక్షల మంది ప్రయాణించినట్టు తెలిపారు. పండగకు మెజార్టీ సిటీజన్లు పల్లెబాట పట్టడంతో మెట్రో రద్దీ కాస్త తగ్గింది. దూరప్రాంత రైళ్లు బిజీబిజీ.. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు బయలుదేరి వెళ్లిన 80 ఎక్స్‌ప్రెస్.. మరో 100 ప్యాసింజర్ రైళ్లు సైతం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. రైళ్లలో సీట్లు, బెర్తులు దొరక్క నానా అవస్థలు పడ్డారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు రైళ్లలో నానా ఇబ్బందులు పడ్డారు. -
నేపాల్ వాసికి అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: నేపాల్ నుంచి పొట్ట చేతబట్టుకొని నగరానికి వచ్చిన రమేష్(32) అనే యువకుడు మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లోని మెట్రోస్టేషన్ పార్కింగ్‌లో మృతి చెందాడు. ఇతడి భార్య మీనా తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందడంతో ఆమె నేపాల్‌లో ఉంది. భర్త మరణ వార్త తెలిసిన ఆమె అక్కడి నుంచి రాలేని పరిస్థితుల్లో కన్నీరుమున్నీరైంది. రమేష్ బంధుమిత్రులు ఇక్కడే ఉన్నా మృతదేహాన్ని నేపాల్‌కు తరలించే ఆర్థిక స్తోమత లేదు. దీంతో హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు చేయాలంటూ మృతుడి భార్య సూచించింది. ఇక్కడ అంత్యక్రియల ఖర్చులు భారం కావడంతో బంధుమిత్రులు కూడా చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో యూసుఫ్‌గూడకు చెందిన రవి తాప అనే సంఘసంస్కర్త పంజగుట్ట స్మశాన వాటికలో దగ్గరుండి చితికి నిప్పంటించి హైందవ సంస్కృతి ప్రకారం అంత్యక్రియలు తంతు పూర్తి చేశారు. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి తనకు సంబంధం లేని వారితో ఇలా అంత్యక్రియలు నిర్వహించుకున్న రమేష్ పరిస్థితిని చూసినవారు కంట తడిపెట్టారు. -
రోడ్డు భద్రత, ట్రాఫిక్ మెరుగుదలపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవన్’లో సోమవారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ మెరుగుదలపై ఒక రోజు సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ‘రోడ్ సేఫ్టీ ఆడిట్ ఫర్ ఇంప్రూవ్ మెంట్ ఆఫ్ ట్రాఫిక్ సేఫ్టీ’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నగరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలకు తగ్గట్లు రహదారులు పెరగకపోవడం, చాలాచోట్ల రోడ్లపై అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడంతో నగరవాసులకు రద్దీ ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీంతో ట్రాఫిక్ కట్టడితో పాటు ప్రమాదాలకు చెక్ పెట్టడానికి అధికారులు సమావేశమయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్లు రవాణా భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాక విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్, డీజీపీ కృష్ణ ప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. -
జైట్లీ సేవలు చిరస్మరణీయం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూయడంతో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్. కే లక్ష్మణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి, దేశానికి, న్యాయ వ్యవస్థకు అరుణ్ జైట్లీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి ఉద్యమంలో జైట్లీ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. అంతేకాక తెలంగాణ ఉద్యమంలో పార్టీ, ప్రజల తరపున ప్రతిపక్ష నాయకుడిగా తన గళాన్ని గట్టిగా వినిపించారని, రాజ్యసభలో తెలంగాణ విభజన బిల్లు పాస్ అయ్యేందుకు కృషి చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు పలు విలువైన సూచనలు, సలహాలు జైట్లీ ఇచ్చారని లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ మృతి పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. -
లాంఛనంగా అమెజాన్ క్యాంపస్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ నెలకొల్పిన అతి పెద్ద క్యాంపస్ భవనాన్నిబుధవారం తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్, అమెజాన్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ డైరెక్టర్ జాన్ స్కోట్లర్ పాల్గొన్నారు. ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద సంస్థ అమెజాన్ ప్రపంచంలోనే తన అతిపెద్ద కార్యాలయాన్ని నగరంలోని నానక్ రామ్ గూడలో ఏర్పాటు చేసింది. కార్యాలయాన్ని ప్రారంభించి హోంమంత్రి మాట్లాడుతూ.. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్ తెలంగాణలోనే అతిపెద్ద బిల్డింగ్ కావడం విశేషమని, ఇది మనకు గర్వకారణమని అన్నారు. అమెజాన్ ఇండియా మేనేజర్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. 9.5 ఎకరాల్లో విస్తరించిన అమెజాన్ క్యాంపస్‌లో సుమారు 15వేల మంది పనిచేయనున్నారని వివరించారు. -
‘రాజ్యాధికారంతో బీసీల సాధికారత’
సాక్షి, హైదరాబాద్: కోట్లాడి తెచుకున్న హక్కులు, రిజర్వేషన్లకు న్యాయం జరిగే వరకు పోరాడాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మన దేశంలో ఏ కులానికైతే అన్యాయం జరుగుతుందో అప్పుడే ఆ కులం సంఘటిత మవుతుందని తెలిపారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 4వ నేషనల్ కన్వెన్షన్ రాష్ట్రీయ ఓబీసీ మహాసభకు ముఖ్య అతిధులుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతి పట్ల సభ నివాళి అర్పించి, వచ్చిన అతిధులను సన్మానించారు. ఈ సందర్భగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... మహారాష్ట్ర, కేరళ, పాండిచేరీ, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. 72 సంవత్సరాలుగా దేశంలో ఓబీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇలాంటి సమావేశాలు ఏ కులాలకు వ్యతిరేకం కాదని, వీటికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉందన్నారు. తెలంగాణలో మొత్తం 85 శాతం అణగారిన వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ‘వీపీ సింగ్ హయాంలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిన ఆగస్టు 7నే మహా సభలను నిర్వహిస్తున్నామని, ఈ జాతీయ మహా సభలోనే బీసీలకు సంబంధించిన వెబ్ సైట్‌ను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పొందుపర్చామని, ఈ వెబ్సైట్ ద్వారా సభ్యత్వం కూడా తీసుకోవచ్చని తెలిపారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య మాట్లాడుతూ.. రాజ్యాధికారంతో అన్ని సమస్యలకు పరిష్కరం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లతో ఆడుకునే అలవాటు పరిపాటి అయిందని, బీసీల ఆర్థిక ఎదుగుదలతోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో 52 శాతం వరకూ ఉన్న బీసీ జనాభాలో సమస్యలపై పోరాడే నాయకులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీసీ సభ డిమాండ్లను జాతీయ స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీలను ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు చేస్తే బీసీల సమస్యలు తీరవని.. భారత రాజ్యాంగంలో బీసీలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలన్నారు. దేశంలో బీసీ కార్పొరేషన్లకు మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణలో బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. తెలంగాణలో బీసీలకు అమలు చేసే పథకాలు, అన్ని రాష్ట్రాల్లోని సీఎంలు అమలు చేస్తే బీసీలకు ఎటువంటి సమస్యలు ఉండబోవని అన్నారు. సమావేశంలో టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఫోరమ్ అధ్యక్షుడు జైపాల్ యాదవ్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సినీ నటుడు సుమన్, ఆర్. నారాయణమూర్తి, తెలంగాణ రాష్ట్ర బీసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, వివిధ రాష్ట్రల నుంచి వచ్చిన ఓబీసీ నాయకులు, ఓబీసీ మహిళా నేత, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్లో భవన నిర్మాణ పర్మిషన్ ఇక ఈజీ
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే డీపీఎంఎస్ విధానంలో ఆన్లైన్ ద్వారానే భవన నిర్మాణ అనుమతులు, ఓసీలు జారీ చేస్తున్న జీహెచ్ఎంసీ...నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకుంటున్నవారు ఇతర శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరమైతే పలు కార్యాలయాల చుట్టూ తిరిగి వాటిని పొందుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్ తదితర శాఖల నుంచి వీటిని పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇకపై ఈ శ్రమ లేకుండా ఆన్లైన్లో కామన్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇతర విభాగాల నుంచి క్లియరెన్స్ అవసరమైన పక్షంలో నో అబ్జెక్షన్ కోసం జీహెచ్ఎంసీయే ఆయా విభాగాలకు ఆన్లైన్లో పంపిస్తుంది. ఈమేరకు తగిన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ట్రయల్‌రన్ నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఇక ఈ కామన్ అప్లికేషన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత ఇళ్లు కట్టుకునే వారి నుంచి బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలు నిర్మించే వారి వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. పరిశ్రమలకు టీఎస్ఐపాస్ తరహాలో జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణాలకు ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. నోఅబ్జెక్షన్ అవసరమైన రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్సర్వీసెస్, ఫారెస్ట్, ఎలక్ట్రిక్, ఎయిర్పోర్ట్, ట్రాఫిక్,అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ మాన్యుమెంట్ అథారిటీలతో జీహెచ్ఎంసీ నెట్వర్క్ అనుసంధానం చేసుకుంది. దరఖాస్తు రాగానే పై వాటిల్లో ఏ శాఖనుంచైనా నో అబ్జెక్షన్ అవసరమైతే ఆన్‌లైన్‌ద్వారా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు వెళ్తుంది. ఎలాంటి అభ్యంతరం లేనట్లయితే ఓకే చేస్తారు. అభ్యంతరాలుంటే, ఆ విషయాన్నీ తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో భవననిర్మాణాలకు దరఖాస్తుచేసుకునే వారికి ఎంతో సమయం, వ్యయం తగ్గుతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈఓడీబీ)లో భాగంగా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం ఇప్పటికే పలు సంస్కరణలు అమల్లోకి తేవడం తెలిసిందే. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు, బిల్డర్లు, ఫైర్ సర్వీస్, రెవెన్యూ తదితర అధికారులతో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఈ సింగిల్‌విండో అనుమతుల విధానాన్ని ప్రకటించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో దరఖాస్తుల పరిశీలన త్వరితంగా జరుగుతున్నప్పటికీ, ఇతర శాఖల నుంచి ఎన్ఓసీలు రావడంలో జాప్యం జరిగేదని, ఇక ఈసమస్య ఉండదన్నారు. డీపీఎంఎస్‌లో ఈ కామన్ అప్లికేషన్ విధానాన్ని పొందుపరిచినట్లు తెలిపారు. ఒక్కరోజులోనే అనుమతి.. భవననిర్మాణ అనుమతులు త్వరితంగా జారీ చేసేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు దానకిశోర్ తెలిపారు. ముఖ్యంగా 500 గజాల్లోపు స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు వచ్చే దరఖాస్తులు నిబంధనల ప్రకారం అన్నీ సవ్యంగా ఉంటే ఒకే రోజులో అనుమతి జారీ చేసే ప్రతిపాదన ఉందని వెల్లడించారు. దీంతోపాటు 200 గజాల్లోపు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు సెల్ఫ్ అప్రూవల్ ప్రతిపాదన కూడా ఉందన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్‌సిటీప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి, ఫైర్సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ పాపయ్య, డా.సుబ్రహ్మణ్యం (ఆస్కి) పాల్గొన్నారు. అందుబాటులోకి నెట్వర్క్ రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్సర్వీసెస్, ఫారెస్ట్, ఎలక్ట్రికల్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ మాన్యుమెంట్ అథారిటీ శాఖల నుంచి నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. వీటిల్లో నివాస గృహాలకు ముఖ్యంగా యూఎల్సీ, ప్రభుత్వభూమి వంటి సమాచారం కోసం రెవెన్యూతోపాటు ఇరిగేషన్ విభాగాల నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)అవసరం అయ్యే అవకాశం ఉందన్నారు. మిగతా శాఖల నుంచి పెద్దగా ఎన్ఓసీ అవసరం ఉండదని, వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాలకు మాత్రం మిగతా శాఖలనుంచీ ఎన్ఓసీ అవసరమవుతుందన్నారు. -
మాజీ స్నేహితురాలిని వేధించిన కేసులో నిందితుడి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: మాజీ స్నేహితురాలిని ఆన్లైన్లో వేధించిన కేసులో నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మేల్ నర్సుగా పని చేస్తున్న గణేష్ గతంలో కాచిగూడలోని ఆస్పత్రిలో పని చేశాడు. అప్పట్లో పరిచయమైన సహోద్యోగినితో స్నేహం చేశాడు. ఆ సందర్భంలో కొన్ని ఫొటోలు సేకరించి భద్రపరుచుకున్నాడు. ఆపై ఇద్దరూ వేర్వేరు చోట్ల స్థిరపడిన తర్వాత ఆమెను సోషల్‌మీడియా ద్వారా సంప్రదించిన అతను తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించడంతో అభ్యంతరకరమైన ఫొటోలు పంపి వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం, అభ్యున్నతి కోసం కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో వినియోగిస్తామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం హజ్‌హౌస్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో జరిగిన డ్రైవర్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమం కోసం దేశంలో రూ. 4వేల కోట్ల బడ్జెట్ కేటాయించగా తెలంగాణ రాష్ట్రంలోనే రూ. 2 వేల కోట్లు కేటాయించి మైనారిటీ సంక్షేమం, అభ్యున్నతికి పెద్దపీట వేసిందన్నారు. నిధులను పూర్తిగా వినియోగించి మైనారిటీల అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. మైనారిటీ సంక్షేమానికి షాదీముబారక్, మసీదుల నిర్మాణం, మరమ్మతులు, ఇమాంలకు పారితోషికం, స్వయం ఉపాధి పథకాలు, మైనారిటీ గురుకులాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. డైవర్ ఎంపవర్మెంట్ కార్యక్రమం కింద ప్రభుత్వ సబ్సిడీతో మైనారిటీ యువతకు కార్లను అందజేసి వారి జీవనోపాధికి కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సౌజన్యంతో కార్ల వితర ణ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వసతిని వినియోగించుకొని వారి జీవితాలను మెరుగుపర్చుకోవాలని మంత్రి హితవు పలికారు. మైనారిటీ సంక్షేమ పథకాల అమల్లో ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలోనే తెలంగాణ ఆదర్శం... దేశంలోనే మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మైనారిటీ విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మైనారిటీ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని తమ జీవితాలను దిశా నిర్ధేశం చేసుకోవాలని సూచించారు. నాంపల్లి శాసన సభ్యుడు జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో వినియోగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. డ్రైవర్ ఎంపవర్ మెంట్ కార్యక్రమాన్ని మరింత విస్తరించి పెద్ద సంఖ్యలో మైనారిటీలకు అందేలా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖాధికారులను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ అన్సారీ, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీమ్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి మహేష్ దత్ ఏక్కా, ఎంఎఫ్సీ ఎండీ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా 67 మంది మైనారిటీ యువకులకు కార్లను పంపిణీ చేశారు. -
బీసీ జాబితాలో మరో 30 కులాలు
సాక్షి, అంబర్‌పేట: వెనుకబడిన కులాల జాబితాలో మరో 30 కులాలను చేర్చేందుకు సమాయత్తమయ్యామని, కొత్తగా చేరే కులాలకు చెందిన వారికి ఏవైనా ఆక్షేపణలు ఉంటే జూలై 5లోపు తుది గడువుగా నిర్ణయించామని హైదరాబాద్ జిల్లా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విమలాదేవి వెల్లడించారు. గురువారం అంబర్‌పేట గోల్నాకలోని బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టంలోని 9(1)వ విభాగం ద్వారా ఈ నెల 15న నిర్వహించిన సమావేశంలో నిర్ణయించిన బీసీ జాబితాలోకి చేర్చే కులాల పేర్లను ఆమె వెల్లడించారు. కాకిపడగల, మందెచ్చెల సన్నాయోళ్లు/బత్తిన, మాసయ్యలు/ పటంవారు, సాధనశూరులు, రుంజ, పాపల, పనస, పెక్కర, పాండవులవారు, గౌడజెట్టి, ఆదికొడుకులు, తెరచీరల, సారోళ్లు, అరవ కోమటి, ఆహీర్ యాదవులు, గౌవిలి తదితర ముప్పై కులాలు వెనుకబడిన తరగతుల కులాల జాబితాలోకి చేరనున్నాయని ఆమె తెలిపారు. పైన పేర్కొన్న కులాలకు చెందిన వారు ఏవైనా ఆక్షేపణలు, అభ్యంతరాలతో పాటు సలహాలు, సూచనలు ఉంటే ఈ నెల 28 నుంచి జూలై 5 వరకు (సెలవు రోజులు మినహాయించి) హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ కార్యాలయంలో అఫిడవిట్‌తో పాటు తగిన ఆధారాలతో తెలియపరచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారులు మురళి, వరలక్ష్మి, సుధాకర్, రాధాకిషోరి పాల్గొన్నారు. -
పాలన పడక!
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని కేంద్రమైన హైదరాబాద్ జిల్లా పరిపాలనా యంత్రాంగానికి మళ్లీ కష్టకాలం వచ్చింది. ‘ముఖ్య’ అధికారి విషయంలో ఈ జిల్లాకు తరచు ఏదో ఒక రూపంలో సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఎక్కువ కాలం ముఖ్య అధికార విభాగం ఇన్‌చార్జిలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కలెక్టర్ రఘునందన్‌రావు స్టడీ టూర్ కోసం విదేశాలకు వెళ్లడంతో ప్రస్తుత జాయింట్ కలెక్టర్ రవి తాత్కాలికంగా ఇన్చార్జి కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్వో)గా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మరోవైపు జిల్లా రెవెన్యూ అధికారి కూడా సెలవుపై వెళ్లడంతో జిల్లా భూ పరిరక్షణ అధికారి వెంకటేశ్వరరావు ఇన్చార్జి డీఆర్వోగా కొనసాగుతున్నారు. దీంతో పలు కీలకమైన నిర్ణయాలు, ఫైళ్లు ఎక్కడక్కడే పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. రెండేళ్ల వ్యవధిలో ముగ్గురు కలెక్టర్లు ఇలా వచ్చి...అలా వెళ్లిపోయారు. నాలుగు నెలలుగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఎలాంటి ఫైళ్లు, ఇతర పనులు ముందుకు సాగక పోగా, తాజాగా ఇన్చార్జిల పాలనతో అదే తీరు ఇంకా కొనసాగుతోంది. డివిజన్, మండల రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఉన్నప్పటికి పనితీరు మాత్రం అంటీముట్టనట్లుగా తయారైంది. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ దరిమిలా జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులందరూ ఇతర జిల్లాలకు బదిలీ కాగా, ఇతర జిల్లాకు చెందిన అధికారులకు ఇక్కడ పోస్టింగ్ లభించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో తిరిగి చేర్పులు, మార్పులకు ఆస్కారం లేకండా పోయింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల గడువు సైతం ముంచుకోస్తోంది. ప్రస్తుత డివిజన్, మండల బాధ్యులు నామమాత్రపు అంశాలు మినహా కీలకమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. ఆర్థిక చేయూతకు గ్రహణం జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆర్ధిక చేయూతకు గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వ పథకాలు, సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల నామమాత్రపు పనితీరు, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై క్షేత్ర స్థాయి విచారణ ముందుకు సాగడం లేదు. ఇప్పటికే క్షేత్రస్థాయి విచారణ పూర్తయి లబ్ధిదారుల ఎంపిక జరిగినా చెక్కుల పంపిణీ మాత్రం జరగడం లేదు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు రుణాలు అందని ద్రాక్షగా మారాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ విడుదలైనా...బ్యాంకులు సవాలక్ష కొర్రీల కారణంగా లక్ష్యం మాత్రం చేరడం లేదు. నిరుద్యోగ యువత కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ధూల్‌పేట్‌లో గుడుంబా తయారీ నుంచి బయటకు వచ్చిన యువతకు పునరావాసం కల్పించేందుకు కొన్ని యూనిట్ల కేటాయింపులు కాగితాలకు పరిమితమయ్యాయి. ఇలా చాల పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా ఇన్చార్జి అధికారుల పద్ధతికి స్వస్తి పలికి..అన్ని ముఖ్యవిభాగాలకు రెగ్యులర్ అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఓట్లు డౌట్లు
-
బేకరీ నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో వైరల్
హైదరాబాద్, అబిడ్స్ : నగరంలో పేరుగాంచిన ఓ బేకరీ నిర్లక్ష్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీహెచ్ఎంసీ ఫుడ్ విభాగం అధికారులు నిత్యం పర్యవేక్షించే బేకరీలు, హోటళ్లలో నాణ్యతతో పాటు కనీసం ప్యాకింగ్ తేదీలను కూడా సక్రమంగా ముద్రించడంలేదు. ఇందుకు ఉదాహరణే బుధవారం ఎంజే మార్కెట్ సమీపంలోని ఓబేకరీ నిర్వాకం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బిల్క్‌బ్రెడ్‌పై ముందుగా ప్యాకింగ్ తేదీని 05–10–2017 అని ప్రచురించి బేకరీ యాజమాన్యం పప్పులో కాలేసింది. ఇలా ఒకరోజు ముందుగా ఎలా తేదీని ప్యాకెట్‌పై ఎలా వేస్తారని వాట్సాప్, ఫేస్బుక్లో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ కేసు నమోదయ్యేనా... బహిరంగంగా నిర్లక్ష్యంగా వహించిన బేకరీ యాజమాన్యం జీహెచ్ఎంసీ ఫుడ్ అధికారులుగానీ, పోలీసులుగానీ ఏ మేరకు కేసు నమోదు చేస్తారో అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై బేగంబజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును వివరణ కోరగా తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. -
కొత్త జిల్లాలకు సీపీఎం కార్యదర్శులు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు పార్టీపరంగా కార్యదర్శులు, కమిటీల నియామకాన్ని పూర్తి చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం తెలిపారు. ఇందులో హైదరాబాద్ జిల్లాకు రెండు కమిటీలు (వన్ అండ్ టూ) ఏర్పాటు చేశామని, కొత్తగా నియమించిన జిల్లా కార్యదర్శుల మొదటి సమావేశం శనివారం సంగారెడ్డిలో జరగనుందని చెప్పారు. జిల్లాల కార్యదర్శులు వీరే...: ఆదిలాబాద్-బండి దత్తరి, మంచిర్యాల-బి.సత్యనారాయణ, నిర్మల్-గౌతమ్ కృష్ణ, కొమురంభీం (ఆసిఫాబాద్)-కె.రాజన్న, కరీంనగర్-జి.ముకుందరె డ్డి, పెద్దపల్లి-వై.యాకయ్య, జగిత్యాల-బి.సారంగపాణి, రాజన్న (సిరిసిల్ల)-పంతం రవి, మహబూబాబాద్-సాదుల శ్రీనివాస్, వరంగల్ (అర్భన్)-ఎస్.వాసుదేవరెడ్డి, వరంగల్ (రూరల్)-ఎం.చుక్కయ్య, జయశంకర్(భూపాలపల్లి)-సూది కృష్ణారెడ్డి, జనగామ-ఉడతా రవి, సిద్దిపేట-ఆముదాల మల్లారెడ్డి, మెదక్-ఎ.మల్లేశం, సంగారెడ్డి-బి.మల్లేశం, నిజామాబాద్-బి.గంగాధరప్ప, కామారెడ్డి-కె.చంద్రశేఖర్, నల్లగొండ-ఎం.సుధాకరరెడ్డి, సూర్యాపేట-ములకలపల్లి రాములు, యాదాద్రి-ఎండీ జహంగీర్, మహబూబ్‌నగర్-ఎ.రాములు, నాగర్‌కర్నూలు-వి.పర్వతాలు, వనపర్తి- ఎండీ జబ్బార్, జోగులాంబ(గద్వాల)-వెంకటస్వామి, ఖమ్మం-పొన్నం వెంకటేశ్వరరావు, భద్రాద్రి (కొత్తగూడెం)-కాసాని ఐలయ్య, వికారాబాద్-జి.నర్సింహులు, రంగారెడ్డి-భూపాల్, మేడ్చల్ (మల్కాజిగిరి)-కె.రవి, హైదరాబాద్ 1-ఎం.శ్రీనివాస్, హైదరాబాద్ 2-ఎన్.సోమయ్య. -
మనదిక రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా
సాక్షి, సిటీబ్యూరో: జిల్లాల పునర్విభజనలో హైదరాబాద్ జిల్లాను యథాతథంగా ఉంచారు. వాస్తవంగా హైదరాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి రెండుగా విభజించాలని మొదట అధికార యంత్రాంగం ప్రతిపాదనలు చేసింది. కానీ విపక్షాల వ్యతిరేకతతో ఈ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద హైదరాబాద్ జిల్లా పాత ప్రాంతాలతోనే చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. ఇక సికింద్రాబాద్(లష్కర్) కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తారన్న ఆశ నిరాశ అయింది. మహానగరంలో రెవెన్యూ జిల్లాలు – కలెక్టర్ల పాత్ర పూర్తి నామమాత్రమే అయినప్పటికీ, రెవెన్యూ సరిహద్దులను మార్చొద్దని ఎంఐఎం పార్టీ ఏకగ్రీవంగా తీర్మాణించి ప్రభుత్వానికి నివేదించింది. దీంతో జిల్లాల విభజన కోసం రాసుకున్న మార్గదర్శకాలకు భిన్నంగా హైదరాబాద్ అతిపెద్ద జిల్లాగానే ఉంది. జిల్లా పరిధిలో అదనంగా మరో రెవెన్యూ డివిజన్‌తోపాటు రెండు మండలాలను పెంచాలనే యంత్రాంగం ప్రతిపాదనలకు కూడా బ్రేక్ పడింది. దీంతో హైదరాబాద్ జిల్లాలో పాతగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్లతో సహా 16 మండలాలు యథాతథంగా ఉన్నాయి. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అలాగే ఉన్నాయి. పెరగని రెవెన్యూ డివిజన్లు, మండలాలు హైదరాబాద్ జిల్లాలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా పెరగలేదు. జిల్లా జనాభా దాదాపుగా 40 లక్షల వరకు ఉంది. మండలాల పరిధిలో కూడా జనాభా అధికంగా ఉంది. రెండు, మూడు మండలాలు మినహాయించి మిగతా మండలాల్లో జనాభా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల పునర్విభజనలో భాగంగా అదనంగా ఒక రెవెన్యూ డివిజన్‌తో పాటు రెండు మండలాలను కొత్తగా> పెంచాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు చేసింది. జిల్లాల పునర్విభజనలో హైదరాబాద్‌కు స్థానం దక్కక పోవటంతో కొత్త రెవెన్యూ డివిజన్, మండలాలకూ మోక్షం లభించలేదని తెలుస్తున్నది. 1.50 లక్షల జనాభాకు ఒక మండలం ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనను పరిగణనలోకి తీసుకున్నట్లయితే...తర్వాతనైనా మండలాల పెంపునకు అవకాశం ఉండగలదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇది ఎంత మేరకు సాధ్యమవుతుందనే అంశం సర్కారు నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది. -
పంతం నెగ్గించుకున్న ఎంఐఎం
సాక్షి,సిటీబ్యూరో: జిల్లా విభజనలో ఎంఐఎం పార్టీ పంతం నెగ్గించుకుంది. పునర్విభజనలో హైదరాబాద్ జిల్లాను అలాగే ఉంచాలన్న ఆ పార్టీ హుకుంనకు ప్రభుత్వం సరేనంది. దీంతో హైదరాబాద్ జిల్లా యథావిధిగా ఉండే అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్ (లష్కర్) కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తారన్న ఆశ నీరుగారింది. మహానగరంలో రెవెన్యూ జిల్లాలు–కలెక్టర్ల పాత్ర నామమాత్రమే అయినప్పటికీ, రెవెన్యూ సరిహద్దులను మార్చొద్దని ఎంఐఎం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. దీంతో జిల్లాల విభజన కోసం రాసుకున్న మార్గదర్శకాలకు భిన్నంగా హైదరాబాద్ అతి పెద్ద జిల్లాగానే ఉండనుంది. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ తాజా ప్రతిపాదనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నగరంలో జీహెచ్ఎంసీ, జలమండలి అతి కీలకమైన సందర్భంలో.. రెవెన్యూ జిల్లాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, జీహెచ్ఎంసీ మొత్తాన్ని ఒకే జిల్లాగా ఏర్పాటు చేసి, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిని కమిషనర్‌గా నియమిస్తే విశ్వనగరం దిశగా అభివృద్ధి సులువవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త జిల్లాలు–కలెక్టర్లు కేవలం కుల, ఆదాయ ధ్రువపత్రాలు ఇచ్చేందుకే పరిమితం కావాల్సి ఉంటుందని, బీజేపీ నేత కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శివారు.. ఈస్ట్, వెస్ట్ జిల్లాలు ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్‌ను విభజించిన తీరులో హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రాంతాలను రంగారెడ్డి తూర్పు (మల్కాజిగిరి కేంద్రం), రంగారెడ్డి అర్బన్ (శంషాబాద్ కేంద్రం) జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా పరిధిలో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నంతో పాటు షాద్‌నగర్ ప్రాంతాన్ని కలపనున్నారు. మల్కాజిగిరి పేరుతో ఏర్పాటయ్యే జిల్లాలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాలుండే అవకాశం ఉంది. -
పీఈటీ, పండిట్ పోస్టులను అప్‌గ్రెడ్ చేయాలి
గన్‌ఫౌండ్రీ: రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న భాషా పండితులు గ్రేడ్–2 ఉపాధ్యాయులపై వేతనంలోను, హోదాలోను వివక్ష కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆరోపించింది. పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్ చేయాలని కోరుతూ గురువారం కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఉన్నత పాఠశాల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టులే ఉండాలన్నారు. చేసే పనిలో తేడా లేకుండా హోదా, వేతనాలలో ఈ ఉపాధ్యాయులపై వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పండిట్, పీఈటీ పోస్టులకు వారితో సమానంగా వేతనాలను అందజేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పీఈటీ, పండిట్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం జేసీ భారతీ హోలికేరికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కొండల్రావు, రవీందర్, సంజీవ, మల్లయ్య, దేవదాస్ పాల్గొన్నారు. -
టెన్నిస్ చాంప్ నిహారిక
తెలంగాణ అండర్-19 స్కూల్ టెన్నిస్ ఎల్బీ స్టేడియుం: తెలంగాణ రాష్ట్ర స్కూల్ అండ ర్-19 టెన్నిస్ టోర్నమెంట్లో బాలికల సింగిల్స్ టైటిల్‌ను నిహారిక (రంగారెడ్డి జిల్లా) కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సవూఖ్య ఆధ్వర్యంలో సైనిక్‌పురిలోని భవాన్స్ జూనియుర్ కాలేజి టెన్నిస్ కోర్టులో బుధవారం జరిగిన ఫైనల్లో నిహారిక 11-8 స్కోరుతో సారుు నిఖిత (రంగారెడ్డి జిల్లా)పై విజయుం సాధించింది. వుూడో స్థానం కోసం జరిగిన వ్యూచ్‌లో అనూష (హైదరాబాద్) 11-6 స్కోరుతో విభ (రంగారెడ్డి జిల్లా)పై గెలిచింది. ఈ పోటీల విజేతలకు భవాన్స్ కాలేజి డెరైక్టర్ కెప్టెన్ డి.రావుయ్యు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రవుంలో టీఎస్‌జీఎఫ్ పర్యవేక్షకులు హనువుంత్ రెడ్డి, హెచ్డీఎస్ఎఫ్ కార్యదర్శి ఎల్.రాజేంద్ర ప్రసాద్, రావుు తదితరులు పాల్గొన్నారు. -
‘స్ట్రాంగ్‌మాన్’ స్టీఫెన్
హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్‌లిఫ్టింగ్ ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్టీఫెన్ మెరిశాడు. జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన 61 కేజీల విభాగం ఫైనల్లో స్టీఫెన్ అత్యుత్తమ పవర్లిఫ్టర్గా ఎంపికయ్యాడు. దీంతో అతనికి హైదరాబాద్ ‘స్ట్రాంగ్ మాన్’ అవార్డు దక్కింది. ఈ పోటీల విజేతలకు బేగంబజార్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ ప్రధాన కార్యదర్శి గోవింద్ రాజ్, తెలంగాణ పవర్ లిఫ్టింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: 59 కేజీలు: 1.జి.రమేష్ (460 కేజీలు), 2.బి.పవన్ కుమార్, 3.ఎం.భాను ప్రకాష్. 66 కేజీలు: 1.కె.స్టీఫెన్ (565 కేజీలు), 2.కె.దినేష్, 3.డి.శివకుమార్. 74 కేజీలు: 1.ఎం.జానకిరామ్ (570 కేజీలు), 2.జి.శేషు, 3. కె.మనోజ్ యాదవ్. 83 కేజీలు:1.ఎన్.అంజయ్య (572.5 కేజీలు), 2.ఎస్.కృష్ణ, 3.జె.నరేందర్. 93 కేజీలు: 1.కె.సంతోష్ (425 కేజీలు), 2. కె.శ్రీకాంత్, 3.ఎ.విక్టర్. 105 కేజీలు: 1.వై. రాఘవేంద్ర గౌడ్ (765 కేజీలు), 2.ఆర్.ఉదయ్ కృష్ణ. 120 కేజీలు: 1.ఎల్.ప్రవీణ్ (752 కేజీలు). ప్లస్ 120 కేజీలు: 1.బి.సుమిత్ (747.5 కేజీలు). -
22 నుంచి స్కూల్ హ్యాండ్‌బాల్ లీగ్ టోర్నీ
ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ జిల్లా స్కూల్ హ్యాండ్‌బాల్ లీగ్ టోర్నమెంట్ ఈనెల 22 నుంచి 24 వరకు ఎల్బీ స్టేడియంలో జరగనుంది. హైదరాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్డీహెచ్బీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈటోర్నీని విశాల్ సింగ్ స్మారకార్థంగా నిర్వహిస్తున్నట్లు సి.హెచ్ ఫ్రాంక్లిన్ తెలిపారు. బాల బాలికల విభాగాల్లో ఈపోటీలు నిర్వహిస్తున్నట్లు, ఆసక్తి గల స్కూల్ జట్లు తమ ఎంట్రీలను ఈనెల 21లోగా పంపించాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. ఇతర వివరాలకు పి.జగన్మోహన్ గౌడ్(98491-94841), డాక్టర్ రవి కుమార్(98662-29937)లను సంప్రదించవచ్చు. -
రాజధానిలో 482 మద్యం దుకాణాలకు లైసెన్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం 482 మద్యం దుకాణాలకు లెసైన్సులు కేటాయించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 212 దుకాణాలుండగా 312 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 147 దుకాణాలకు లాటరీ విధానం ద్వారా లెసైన్సులు కేటాయించారు. మరో 65 దుకాణాలు ఖాళీగా మిగిలాయి. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో 390 దుకాణాలుండగా 3368 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం 335 దుకాణాలకు లాటరీ విధానంలో లెసైన్సులు కేటాయించారు. ఈ జిల్లాలో 55 దుకాణాలు ఖాళీగా మిగిలాయి. ఖాళీగా మిగిలిన దుకాణాలకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అబ్కారీశాఖ వర్గాలు తెలిపాయి. అత్యధిక దరఖాస్తులు ఇక్కడే.. గ్రేటర్ నగరం పరిధిలోని బండ్లగూడలోని ఓ మద్యం దుకాణానికి అత్యధికంగా 56 దరఖాస్తులు అందాయి. ఆ తర్వాత వనస్థలిపురంలోని మరో దుకాణానికి 49 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక రియాసత్‌నగర్,మలక్పేట్ల్లోని దుకాణాలకు 14 చొప్పున దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు ప్రకటించారు. చాలా దుకాణాలకు సింగిల్ టెండర్లు మాత్రమే దాఖలయ్యాయని తెలిపారు. -
ఒలింపిక్ పరుగుపై సద్దుమణిగిన వివాదం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జంటనగరాల్లో ఈ నెల 23న జరగనున్న ఒలింపిక్ పరుగును ఎవరు నిర్వహించాలనే విషయంపై నెలకొన్న వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. శాప్ కమిటీ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం తమ తప్పని కొందరు క్రీడా సంఘాల నేతలు అంగీకరించడంతోపాటు రాష్ట్ర ఒలింపిక్ సంఘం నిబంధనల ప్రకారం నడుచుకొంటామని హెచ్‌డీఓఏ అధ్యక్షుడు బి.విజయకుమార్ యాదవ్‌కు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ పరుగు నిర్వహించాలని, ఇది తెలంగాణ ప్రభుత్వ పరుగు కాదని వారు అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ క్రీడా సంఘాలు, జూనియర్ కాలేజీలు, పాఠశాలల వ్యాయామ విద్య ఉపాధ్యాయులు, పీడీలు, కోచ్‌ల సమావేశాన్ని ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫతేమైదాన్ క్లబ్లో ఏర్పాటు చేసినట్లు హెచ్‌డీఓఏ ప్రధాన కార్యదర్శి ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్ తెలిపారు. -
రాష్ట్ర అథ్లెటిక్ మీట్‌కు హైదరాబాద్ జట్టు ఎంపిక
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే హైదరాబాద్ జిల్లా జట్టును ప్రకటించారు. ఈ పోటీలు ఈనెల 3 నుంచి రెండు రోజులపాటు వరంగల్‌లో జరుగుతాయి. పురుషుల జట్టు: ఎం.అఖిలేష్, విధాతరెడ్డి,ఎస్.సంతోష్, రాకేష్, పి.ఎన్.సాయి కుమార్, జి.శ్రీనివాస్, ఎస్.వెంకటేష్, విజ్ఞాష్, సి.హెచ్.బుచ్చయ్య, సయ్యద్ వజార్ ఘోరి,జె,రజనీకాంత్, చంద్రబాగు, బాలస్వామి, అకింత్ కుమార్ పఠక్, ప్రవీణ్ మూర్తి, ఎస్.కె.ముజిహిద్, భరత్ రాజ్, బి.సంతోష్, నిసార్ అహ్మద్. మహిళల జట్టు: జి.ఉమామహేశ్వరి, జరీనా బేగం, సయ్యద్ ఆఫ్రీనా, బి.సాహితి, శ్రీలత, డి.హెమలత. తెలంగాణ టి20 జట్టు ఎంపిక తెలంగాణ ట్వంటి-20 క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కిషోర్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టు ఆలిండియా నేషనల్ టి20 చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. ఈ టోర్నీ ఆగ్రాలో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది. జట్టు: కిషోర్ (కెప్టెన్), విజయ్ కుమార్ (వైస్ కెప్టెన్), ప్రశాంత్ కుమార్, ఓబులేశ్, రాజ్‌కుమార్, నాగరాజు, రాంబాబు, వీరబాబు, సాయిరాం, చంద్రమౌళి, గణేష్, చైతన్య, సాయి సంకేశ్, ప్రశాంత్‌రెడ్డి, ప్రసాద్. -
రోహిత, కార్తీక్‌లకు టైటిల్స్
సబ్ జూనియర్ చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా సబ్ జూనియర్ అండర్-15 చెస్ సెలక్షన్ చాంపియన్‌షిప్‌లో జేసీ కార్తీక్, సబ్బి రోహిత విజేతలుగా నిలిచారు. జాంబాగ్‌లోని వివేకవర్ధని కళాశాలలో రెండు రోజుల పాటు ఈ టోర్నీ జరిగింది. బాల బాలికల విభాగాల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. బాలుర విభాగంలో 5 రౌండ్ల ద్వారా 5 పాయింట్లు సాధించిన కార్తీక్‌కు తొలి స్థానం దక్కింది. 4 పాయింట్లు సాధించిన షణ్ముఖ తేజ రెండో స్థానంలో నిలిచాడు. బాలికల విభాగంలో రోహిత, మేఘనలకు తొలి రెండు స్థానాలు దక్కాయి. వివేకవర్ధని సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆనంద్ అబ్కారి విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతల వివరాలు బాలురు: 1. జేసీ కార్తీక్, 2. షణ్ముఖ తేజ, 3. కె. విశ్వజిత్ అరవింద్, 4. రుత్విక్ పొన్నపల్లి. బాలికలు:1. సబ్బి రోహిత, 2. మేఘన సిరిగుడి, 3. పి. లాస్య ప్రియ, 4. ఆర్. హరి లాస్య. -
800 మీ. పరుగులో అనీశ్‌కు స్వర్ణం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా జూనియర్ అథ్లెటిక్ మీట్లో అండర్-18 బాలుర విభాగం 800 మీ. పరుగు పందెంలో అనీశ్ కుమార్ పాఠక్ స్వర్ణపతకం గెలుపొందాడు. పోటీని అతను 2ని. 10.3 సెకన్లలో పూర్తి చేశాడు. ప్రమోద్ కుమార్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకోగా, కుందన్ మూడోస్థానంతో కాంస్యం నెగ్గాడు. ఈ పోటీలు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగాయి. ఫైనల్స్ ఫలితాలు: అండర్-18 బాలురు: 100 మీ.: 1.శివం జయంత్, 2.పాణిరామ్, 3. కమలేష్ కుమార్; 200 మీ.: 1.శివం జయంత్, 2. భరత్ కుమార్, 3.వంశీకృష్ణ; 1500 మీ.: 1. సమన్విత్, 2.కుందన్, 3. శివ శంకర్; లాంగ్‌జంప్: 1.విక్రాంత్ జయంత్, 2. చంద్ర ప్రకాష్, 3.ఎం.కుమార స్వామి; డిస్కస్‌త్రో: 1. సమరసింహారెడ్డి, 2.ఎం.అవినాష్, 3.పి.సాయికృష్ణ; అండర్-20 బాలురు: 100 మీ.: 1.ప్రవీణ్ మూర్తి, 2.అమీర్, 3.కె.సాయి ప్రదీప్; 200 మీ.: 1.అమర్, 2.టి.గోపాల్‌శర్మ, 3.పి.సాయి కిషోర్; 5000 మీ.: 1.అజయ్, 2.రాంగోపాల్ శర్మ, 3.డి.పవన్ ; లాంగ్‌జంప్: 1.ప్రవీణ్ మూర్తి, 2.ధనమేంధ్రీ, 3.లక్ష్మణ్; డిస్కస్‌త్రో: 1.అంకిత్ పాఠక్, 2. ఫరూక్ 3. ఉదిత్. -
నిరంతర సాధనతో విజయాలు: నైనా
జింఖానా, న్యూస్‌లైన్: నిరంతర సాధనతోనే ఎవరికైనా విజయాలు లభిస్తాయని టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ తెలిపింది. సాధనతో పాటు గురువు పట్ల గౌరవం ఉంటేనే అనుకున్నది సాధిస్తామని చెప్పింది. శ్రీవైష్ణవి ఒలంపియాడ్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి అశ్విన్ కుమార్, నైనా సోదరుడు అగస్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ‘పిల్లలందరూ ఒకే స్థాయిలో జ్ఙాపక శక్తి కలిగి ఉంటారు. వారికి సరైన శిక్షణ అవసరం. దాని ద్వారానే వారు ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లగలరు. అయితే విజయం మాత్రం నిరంతర సాధన, విద్య నేర్పే గురువు పట్ల గౌరవం అనే రెండు సూత్రాలను పాటిస్తేనే సాధ్యపడుతుంది’అని చెప్పింది. అనంతరం నైనా జైస్వాల్‌ను శ్రీవైష్ణవి ఒలంపియాడ్ స్కూల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ సత్కరించారు. -
చెస్ చాంపియన్ షణ్ముఖ తేజ
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ చాలెంజర్స్ చెస్ సెల క్షన్ టోర్నీలో షణ్ముఖ తేజ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. చిక్కడపల్లిలోని హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఈ టోర్నీలో బిపిన్ రాజ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మిధుష్ మూడో స్థానంలో, పూజాంజలి నాలుగో స్థానంలో నిలిచారు. వీరు మేలో జరగనున్న ఏపీ స్టేట్ చాంలెంజర్స్ పోటీల్లో హైదరాబాద్ జిల్లా తర ఫున పాల్గొంటారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం (ఏపీసీఏ) జనరల్ సెక్రటరీ కన్నా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీఏ నిర్వాహక కార్యదర్శి శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సింగిల్స్ చాంప్ అహ్మద్
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో ఎండీ అహ్మద్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అహ్మద్ 25-12, 11-25, 22-12తో వసీమ్‌పై నెగ్గాడు. నాలుగో బోర్డ్ చివరలో వసీమ్ 12-11తో ఆధిక్యంలో నిలవగా... అహ్మద్ చక్కటి ఆట తీరుతో ప్రత్యర్థిని నిలువరించాడు. తర్వాతి గేమ్‌లో అహ్మద్ 11-25తో ఓటమి చవిచూసినప్పకీ, మూడో గేమ్‌లో తిరిగి పుంజుకుని 22-12తో గెలుపు దక్కించుకున్నాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో అహ్మద్ 18-10, 23-6తో సాయిబాబాను, వసీమ్ 25-5, 19-12తో రమేష్‌ను ఓడించారు. మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన పోటీలో రమేష్ 25-5, 25-17తో సాయిబాబాపై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో సవితాదేవి 25-0, 25-5తో శ్వేతపై గెలిచి టైటిల్‌ను సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సవితాదేవి 25-0, 25-0తో శ్రీవాణిపై, శ్వేత 10-24, 25-0, 25-6తో మౌనికపై గెలిచారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో శ్రీవాణి 25-15, 25-10తో మౌనికపై విజయం సాధించింది. -
క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించాలి: రాజారామ్ సింగ్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: క్రీడల్లో ఇంటర్ విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని హైదరాబాద్ జిల్లా జూనియర్ కాలేజి గేమ్స్ సమాఖ్య అధ్యక్షుడు డీవీఈఓ రాజారామ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం విజయనగర్ కాలనీలోని విజయనగర్ జూని యర్ కాలేజి విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించగలరని ఆయన తెలిపారు. ప్రతి కాలేజి తప్పనిసరిగా వార్షిక క్రీడోత్సవాలను నిర్వహించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలేజి సొసైటీ కార్యదర్శి బి.వేణుగోపాల్‌రెడ్డి, కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ మాలతీ, ఫిజికల్ డెరైక్టర్ ఎం.వి.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
రంగారెడ్డి జట్టుకు మూడో స్థానం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర పైకా మహిళల హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను అనంతపురం జట్టు చేజిక్కించుకుంది. హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని హాకీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో అనంతపురం జట్టు 2-0 స్కోరుతో వైఎస్ఆర్ కడప జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి జిల్లా 3-0తో విశాఖపట్నంపై గెలిచింది. సెమీఫైనల్లో అనంతపురం 4-0తో రంగారెడ్డి జిల్లాపై, వైఎస్ఆర్ కడప 2-0తో విశాఖపట్నంపై గెలిచాయి. విజేతలకు హాకీ ట్రిపుల్ ఒలింపియన్ ఎన్.ముఖేష్ కుమార్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాప్ డిప్యూటీ డెరైక్టర్ జి.ఎ.శోభ, రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి డాక్టర్ కె.నర్సయ్య, హైదరాబాద్ జిల్లా క్రీడాధికారి ఎ.అలీమ్ ఖాన్ తదితరలు పాల్గొన్నారు. రాజు అదుర్స్ జింఖానా, న్యూస్‌లైన్: బ్యాట్స్‌మన్ రాజు (106) సెంచరీతో చెలరేగడంతో తారకరామ జట్టు 14 పరుగుల తేడాతో సాక్రెడ్ హార్ట్స్ జట్టుపై గెలుపు దక్కించుకుంది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన తారకరామ 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. శేఖర్ 35 పరుగులు చేశాడు. తర్వాత బరిలోకి దిగిన సాక్రెడ్ హార్ట్స్ 188 పరుగుల వద్ద ఆలౌటైంది. జమీర్ (40), జెరాద్ (43) మెరుగ్గా ఆడారు. తారకరామ బౌలర్లు సిద్ధార్థ్, తరుణ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్‌లో హెచ్‌యూసీసీ బౌలర్ బిలాల్ అహ్మద్ (5/19) తన బౌలింగ్‌తో ఇంపీరియల్ జట్టును కట్టడి చేశాడు. దీంతో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఇంపీరియల్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంపీరియల్ 180 పరుగులు చేసి ఆలౌటైంది. ఉత్తేజ్ (56) అర్ధ సెంచరీతో రాణించగా... అర్ఫాన్ (42) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బరిలోకి దిగిన హెచ్‌యూసీసీ 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి నెగ్గింది. ఇబ్రహీమ్ (76) అర్ధ సెంచరీతో చెలరేగగా... అతీఖ్ 30 పరుగులు చేశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఎంపీ యంగ్‌మెన్: 215/6 (ఆదర్శ్ 41, ఉదయ్ 43, శ్రీవంత్ 44; అభిషేక్ 4/16); సెయింట్ ప్యాట్రిక్స్: 161/9 (అభిషేక్ 52). పీకేఎంసీసీ: 235/9 (జయేష్ 50, కుమార్ 44, విజయ్ 40, మణికాంత్ 33; శ్యామ్ 5/50); విజయ్ సీసీ: 212/9 (సుధాకర్ 76 నాటౌట్, కిరణ్ 43, భార్గవ్ 35; కుమార్ 3/13). హైదరాబాద్ పాంథర్స్: 155 (హైదర్ 32, రేహాన్ 34 నాటౌట్; శ్రీకాంత్ 3/22); డబ్ల్యూఎంసీసీ: 156/4 (ప్రదీప్ 63 నాటౌట్, హర్యాంక్ 30; విలాయత్ 3/26). స్టార్లెట్స్: 178 (అజయ్ జశ్వంత్ 40; కేసరి 4/28); యూనివర్సల్: 111. యాదవ్ డెయిరీ: 164 (మహ్మద్ 55, శ్రీనాథ్ 35, స్వామి 3/11); ఎంపీ బ్లూస్: 168/2 (విక్రమ్ 41 నాటౌట్, స్వామి 35 నాటౌట్). పీఎన్ యంగ్‌స్టర్స్: 138 (జావిద్ 40; ప్రకాష్ 3/40); సూపర్‌స్టార్: 139/3 (మహేష్ 51, రాకేష్ 31). మయూర సీసీ: 197/9 (ఆశిష్ శ్రీవాస్తవ్ 46, అఖిలేష్ 44 నాటౌట్ , రిషబ్ 37; మహ్మద్ ఐజాజ్ 5/17); ఆడమ్స్ ఎలెవన్: 52 (సంజయ్ 3/11, అఖిలేష్ 3/10). ధృవ్ ఎలెవన్: 161 (సంపత్ 41, అశోక్ 31; భార్గవ్ ప్రసాద్ 3/22); గగన్‌మహల్: 112 (కిరణ్ 34; సంపత్ 3/13, మోహన్ 3/31). -
రైల్వే జట్టుకు అథ్లెటిక్స్ టీమ్ టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రైల్వే జూనియర్ కాలేజి సత్తాచాటింది. బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో 15 పాయింట్లు సాధించిన పి.గోపాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. 800 మీ. 1500 మీ. 400 మీ హర్డిల్స్‌లో అతను అగ్రస్థానంలో నిలిచాడు. 400 మీటర్లలో సాయిరామ్ రెండో స్థానంలో; లాంగ్‌జంప్, ట్రిపుల్ జంప్‌లో దుర్గాప్రసాద్ మూడో స్థానంతో సంతృప్తిపడ్డాడు. భరత్ కుమార్ 200 మీటర్లలో రెండో స్థానంలో; 800 మీటర్లలో మూడో స్థానంలో నిలిచాడు. హైజంప్‌లో రూడీ స్టాన్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 4ఁ100 మీ. రిలేలో పరమేశ్, సాయిరామ్, రాకేష్, గోపాల్ బృందం విజేతగా నిలవగా; దుర్గా ప్రసాద్, సాయిరామ్, హేమంత్ సావిన్ కుమార్ల జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. -
నేటి నుంచి అంతర్జాతీయ త్రోబాల్ టెస్ట్ మ్యాచ్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: నగరంలో తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ త్రోబాల్ టెస్ట్ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. హైదరాబాద్ జిల్లా త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత్, శ్రీలంక పురుషుల జట్ల మధ్య శనివారం నుంచి ముషీరాబాద్ జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్స్‌లో టెస్ట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో మొత్తం మూడు మ్యాచ్‌లు జరుగుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.బి.నర్సిములు తెలిపారు. ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు 13 మంది సభ్యులు గల శ్రీలంక జట్టు శుక్రవారం నగరానికి చేరుకుంది. హర్యానా నుంచి భారత జట్టు ఇప్పటికే వచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు శుక్రవారం సాయంత్రం ప్రాక్టీస్ చేశారు. నేడు జరిగే పోటీల ప్రారంభ వేడుకలకు సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఆదివారం సాయంత్రం జరిగే ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి వి. సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.ఎస్.విద్యాసాగర్, జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఆర్. ప్రేమ్‌రాజ్, అంతర్జాతీయ వాలీబాల్ మాజీ ఆటగాడు సి.మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొంటారు. సత్తా చాటుతాం: భారత కెప్టెన్ అఖీబ్ భారత జట్టుకు విజయావకాశాలున్నాయని కెప్టెన్ మహ్మమద్ అఖీబ్ (కర్ణాటక) చెప్పారు. మన జట్టులో అపారమైన అనుభవం గల నలుగురు అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారని అతను తెలిపాడు. భారత జట్టు ఈ టెస్ట్ మ్యాచ్ కోసం హార్యానా, బెంగళూరులో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొంది. గతంలో మహారాష్ట్రలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు 2-1తో శ్రీలంక పై విజయం సాధించిన విషయాన్ని అతను గుర్తు చేశాడు. శ్రీలంక యువ జట్టు కెప్టెన్ అథుకొరల శ్రీలంక జట్టు కుర్రాళ్లకు పెద్ద పీట వేసిందని కెప్టెన్ ఎ.టి.ఎన్.అథుకొరల తెలిపాడు. త్రోబాల్ అభివృద్ధికి భారత్ వచ్చిన తమ జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అన్నాడు. తమ జట్టులో పలు అంతర్జాతీయ త్రోబాల్ టోర్నీ అడిన ఇద్దరు ఆటగాళ్లున్నారని అతను తెలిపాడు. దుబాయ్‌లో జరిగే ఆసియా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే శ్రీలంక జట్టు ఆటగాళ్లు అనుభవం కోసం భారత్‌తో టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నట్లు అతను వివరించాడు.