
కొత్త జిల్లాలకు సీపీఎం కార్యదర్శులు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు పార్టీపరంగా కార్యదర్శులు, కమిటీల నియామకాన్ని పూర్తి చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం తెలిపారు. ఇందులో హైదరాబాద్ జిల్లాకు రెండు కమిటీలు (వన్ అండ్ టూ) ఏర్పాటు చేశామని, కొత్తగా నియమించిన జిల్లా కార్యదర్శుల మొదటి సమావేశం శనివారం సంగారెడ్డిలో జరగనుందని చెప్పారు.
జిల్లాల కార్యదర్శులు వీరే...: ఆదిలాబాద్-బండి దత్తరి, మంచిర్యాల-బి.సత్యనారాయణ, నిర్మల్-గౌతమ్ కృష్ణ, కొమురంభీం (ఆసిఫాబాద్)-కె.రాజన్న, కరీంనగర్-జి.ముకుందరె డ్డి, పెద్దపల్లి-వై.యాకయ్య, జగిత్యాల-బి.సారంగపాణి, రాజన్న (సిరిసిల్ల)-పంతం రవి, మహబూబాబాద్-సాదుల శ్రీనివాస్, వరంగల్ (అర్భన్)-ఎస్.వాసుదేవరెడ్డి, వరంగల్ (రూరల్)-ఎం.చుక్కయ్య, జయశంకర్(భూపాలపల్లి)-సూది కృష్ణారెడ్డి, జనగామ-ఉడతా రవి, సిద్దిపేట-ఆముదాల మల్లారెడ్డి, మెదక్-ఎ.మల్లేశం, సంగారెడ్డి-బి.మల్లేశం, నిజామాబాద్-బి.గంగాధరప్ప, కామారెడ్డి-కె.చంద్రశేఖర్, నల్లగొండ-ఎం.సుధాకరరెడ్డి, సూర్యాపేట-ములకలపల్లి రాములు, యాదాద్రి-ఎండీ జహంగీర్, మహబూబ్‌నగర్-ఎ.రాములు, నాగర్‌కర్నూలు-వి.పర్వతాలు, వనపర్తి- ఎండీ జబ్బార్, జోగులాంబ(గద్వాల)-వెంకటస్వామి, ఖమ్మం-పొన్నం వెంకటేశ్వరరావు, భద్రాద్రి (కొత్తగూడెం)-కాసాని ఐలయ్య, వికారాబాద్-జి.నర్సింహులు, రంగారెడ్డి-భూపాల్, మేడ్చల్ (మల్కాజిగిరి)-కె.రవి, హైదరాబాద్ 1-ఎం.శ్రీనివాస్, హైదరాబాద్ 2-ఎన్.సోమయ్య.