
సాక్షి,హన్మకొండజిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హడావుడి చేస్తోందని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.హన్మకొండలోని గిరిజన భవన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు సభకు తమ్మినేని మంగళవారం(సెప్టెంబర్17) హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ‘రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అమలు చేయాలి.పేద,మధ్య తరగతి ప్రజలకు ప్రత్యామ్నాయం చూపాలి.కాంగ్రెస్ ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి.పేదలకు భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్ట్ లది.చట్టాలు చేసి మోసం చేసిన చరిత్ర ప్రభుత్వాలది. కేసీఆర్ పదేండ్లలో 16వేల ఎకరాలు మాత్రమే పంచారు.
ప్రస్తుతం 16లక్షల మంది భూమి కోసం ఎదురు చూస్తున్నారు.ప్రజా సమస్యల పరిస్కారం కోసం పోరాటం చేసేది కమ్యూనిస్ట్ లే.చరిత్ర ను వక్రీకరించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం, హిందూ పోరాటంగా బీజేపీ చిత్రీకరిస్తోంది.తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చెరపలేరు’అని తమ్మినేని అన్నారు.
ఇదీ చదవండి.. హైడ్రా ఆగేదే లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment