ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా హెపటైటిస్ స్క్రీనింగ్ చేయాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ మేరకు అధికంగా కేసులు నమోదవుతున్న గద్వాల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయించింది. గద్వాల జిల్లాలోని ఐజా, రాజోలి మండలాల్లోని పలు గ్రామాల్లో 20 నుంచి 25 శాతం మంది రకరకాల కాలేయ వ్యాధులతో బాధపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 10వేల మందికి ఆరోగ్య పరీక్షలు చేయించనున్నారు. వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ప్రమాదమున్న నేపథ్యంలో స్క్రీనింగ్‌లో పాల్గొనే ఆరోగ్య సిబ్బందికి ఇప్పటికే వ్యాక్సిన్లు ఇచ్చారు. డిసెంబర్ తొలి వారంలో స్క్రీనింగ్ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్క్రీనింగ్‌కు అవసరమైన మెడికల్ కిట్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులకు అందజేసింది. ఈ స్క్రీనింగ్‌లో వ్యాధి ఉన్నట్లు తేలితే నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో ఉచితంగా చికిత్స అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment