Hepatitis
-
హెపటైటిస్-బి అంటే ఏంటి? సూదులు, సిరంజీలతో ఇంత డేంజరా?
ఒకసారి హెపటైటిస్-బి వైరస్ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దానిసంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతీయడం ఆరంభిస్తుంది. ఈ వైరస్ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. రక్తమార్పిడి, సూదులు, సిరింజిలు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు. 1. పరీక్షల్లో - HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్జైమ్) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్ లోడ్ 5లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని! 2. ఈ వ్యాధిని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. వీళ్లు ముందుగానే మందులు తీసుకోవటం ద్వారా వ్యాధి నివారించుకునే అవకాశం ఉంది. 3. వైరస్ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. 4. సిర్రోసిస్ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం. 5. హెపటైటిస్-బి సోకిన వారు ఆల్కహాల్ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ చాలా అవసరం. కొందరికి ఇతరత్రా లివర్ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్-బి వైరస్ ఉన్న కారణంగా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ఇది సోకుండా ముందస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. హెపటైటిస్ - బి సెక్స్ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గోనవద్దు. ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు, నెయిల్‌కట్టర్లు వంటివి మరోకరు వాడొద్దు. బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి. ఇంజక్షన్ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరు ఉపయోగించవద్దు. డిస్పోజబుల్ సూదులు, సిరంజీలు వాడటం ఉత్తమం. చెవులు కుట్టటం, ముక్కులు కుట్టటం, పచ్చబొట్లు వేయించుకోవటం వీటికి ఒకరికి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి. రక్తం ఎక్కించేటప్పుడు, రక్తమార్పడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం చాలా అవసరం! పెళ్లి చేసుకోవచ్చా? టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్ -బి బాధితులు ఈ విషయం ముందుగానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్ - బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్అఫెక్టెడ్ క్యారియర్స్ కూడా) పిల్లలను కూడా కనొచ్చు. అలా చేస్తేనే బిడ్డకు క్షేమం గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు. గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు Hepatitis-B ఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్, మరో తొడకి హెపటైటిస్-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి. నెల రోజులకు మరో టీకా, ఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించకుండా 95 శాతం వరకూ నివారించవచ్చు. తప్పకుండా టీకాలు 1. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఏ ప్రామాణిక సంస్థా కూడా ప్రజలంతా హెపటైటిస్ టీకా తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చెయ్యటం లేదు. కొంతమంది మాత్రం తప్పకుండా తీసుకోవాలి. 2. చిన్న పిల్లలకూ, స్కూలు వయసు పిల్లలందరకీ తప్పకుండా టీకా ఇప్పించాలి. 3. కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్ -బి ఉంటే, ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. వైద్య సిబ్బంది, తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధి పీడితులకు కూడా టీకా తప్పనిసరి. 4. ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే - మళ్ళీ సరిగ్గా నెలకు ఒకటి, ఆర్నెల్లకు మరోకటి, మొత్తం మూడు టీకాలే తీసుకోవాలి , మరియు నివారణ కోసం తప్పనిసరిగా హోమియో మందులు వాడితే మంచి ఫలితాలు వస్తాయి , - డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఫోన్ -9703706660 -
కొనసాగుతున్న హెపటైటిస్ – బీ టీకా పంపిణీ
సాక్షి, అమరావతి: హెపటైటిస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హెపటైటిస్–బీ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్న హెచ్ఐవీ బాధితులకు టీకా పంపిణీని గత నెలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. రాష్ట్రంలోని 55 యాంటి రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉంచింది. హెచ్ఐవీ బాధితులకు స్క్రీనింగ్ నిర్వహించి హెపటైటిస్–బీ నెగెటివ్‌గా నిర్ధారణ అయిన వారికి టీకా వేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 54,805 మందికి తొలి డోసు వేశారు. రెండో డోసు 3,002 మందికి వేశారు. వచ్చే వారంలో హెచ్ఐవీ హైరిస్క్ వర్గాలకు టీకా పంపిణీ ప్రారంభిస్తున్నారు. ఏపీ శాక్స్ హై రిస్క్ వర్గాలుగా గుర్తించిన 3,923 మంది ట్రాన్స్జెండర్లు, 1,16,616 మంది మహిళా సెక్స్ వర్కర్లు, 23,623 మంది పురుష స్వలింగ సంపర్కులు, 1,741 ఇన్‌జెక్టింగ్ డ్రగ్ యూజర్స్.. మొత్తం 1,45,903 మందికి టీకా పంపిణీ లక్ష్యం. ఈ క్రమంలో దేశంలోనే హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాలకు టీకా ఇస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. తొలి డోసు వేసుకున్న నెలకు రెండో డోసు, తరువాత రెండు నెలలకు చివరి డోసు టీకా వేస్తారు. హెపటైటిస్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే వైద్యులు, వైద్య సిబ్బందికి వందశాతం టీకా పంపిణీ చేశారు. కొత్తగా విధుల్లో చేరుతున్న వారికి కూడా టీకా వేస్తున్నారు. వైద్యశాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో 2.3 శాతం జనాభా హెపటైటిస్ – బీ, 0.3 శాతం హెపటైటిస్–సీతో బాధపడుతున్నారు. శృంగారం, రక్తమార్పిడి, సిరంజిలు, టూత్‌బ్రెష్, రేజర్లు వంటి వివిధ రూపాల్లో హెపటైటిస్–బీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాల వారు హెపటైటిస్–బీ బారిన పడటానికి ఎక్కువ అవకాశాలుంటాయని, అందువల్ల వీరు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని రాష్ట్ర హెపటైటిస్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం ప్రత్యేకాధికారి డాక్టర్ నీలిమ తెలిపారు. దగ్గరలోని ఏఆర్టీ కేంద్రానికి వెళ్లి స్క్రీనింగ్ చేయించుకుని టీకా వేయించుకోవాలన్నారు. హెపటైటిస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించి, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
బీ, సీ వైరస్లు ప్రమాదకరమైనవి.. హెపటైటిస్-బీకి వ్యాక్సిన్ ఉంది.. కానీ,
హెపాటో లేదా హెపాటిక్ అని పిలిచే ఈ గ్రీకు పదానికి కాలేయం అని అర్థం. జీవక్రియల్లో కీలకపాత్ర పోషించే మన కాలేయం దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తిస్తుంది. కాస్త తొలగించినా... తిరిగి పెరిగేలా... పూర్తిగా పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన ఏకైక అవయవం. మన శరీరం లోపలి అవయవాల్లో అతి పెద్దదైన కాలేయాన్ని అతి పెద్ద గ్రంథిగా పేర్కొనవచ్చు. నాలుగు భాగాలుగా విభజితమై ఉండే కాలేయం దాదాపు కిలోన్నర వరకు బరువుంటుంది. దానికి వచ్చే క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. విష పదార్థాలు, కలుషిత ఆహారం, నీరు, మద్యం, ధూమపానం వల్ల కాలేయం మీద ప్రభావం పడి వాపునకు గురవుతుంది. దాన్ని ‘హెపటైటిస్’ అంటారు. హెపటైటిస్‌కు గురిచేసే వైరస్లు... ఏ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలుగా ఉంటాయి. వీటిల్లో బీ, సీ వైరస్లు ప్రమాదకరమైనవి. రక్తమార్పిడి, అరక్షిత శృంగారం వల్ల, అలాగే తల్లి నుంచి బిడ్డకు...ఇవి సోకే ప్రమాదం ఎక్కువ. హెపటైటిస్–బి వైరస్ సోకకుండా వ్యాక్సిన్ ఉంది. కానీ... హెపటైటిస్–సి కు వ్యాక్సిన్ లేదు. అప్పటికే హెపటైటిస్–బి ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఈ వ్యాక్సిన్ వేయించుకునే ముందర పరీక్ష చేయించుకుని నెగెటివ్ ఉంటే ఏ వయసువారైనా వేయించుకోవచ్చు. ఆకలి తగ్గడం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నప్పుడు చెట్ల వైద్యం, నాటువైద్యం వంటి సొంతవైద్యాలు చేసుకోకుండా... కారణం తెలుసుకుని అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. లివర్ ఇన్ఫెక్షన్స్, ఫ్యాటీ లివర్, లివర్ యాబ్సెస్, విల్సన్ డిసీజ్, గిల్బర్ట్ సిండ్రోమ్ వంటి కాలేయ వ్యాధులున్నప్పుడు... హెపటైటిస్ బి, సి వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకితే... వాటి ప్రభావంతో కొన్నేళ్ల తర్వాత కాలేయం గాయపడినట్లుగా లేదా గట్టిగా మారడం (సిర్రోసిస్), అటు తర్వాత కాలేయ క్యాన్సర్‌కు దారితీయడం ఎక్కువమందిలో జరుగు తుంది. కాలేయంలోనే మొదలయ్యే హెపాటో సెల్యులార్ కార్సినోమా అనే క్యాన్సర్... దేహంలో ఇతర ్రపాంతాల్లో క్యాన్సర్ వచ్చి అది కాలేయానికి పాకే మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ అనే రెండు రకాలు ఉంటాయి. జీర్ణవ్యవస్థలోని క్యాన్సర్స్, బ్రెస్ట్‌క్యాన్సర్, లంగ్ క్యాన్సర్... ఇలాంటి ఏ క్యాన్సర్ అయినా కాలేయానికి పాకే ప్రమాదం ఎక్కువ. ఆలస్యంగా బయటపడే లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనదిగా పేర్కొనవచ్చు. కాలేయ క్యాన్సర్ తొలిదశలో లక్షణాలు అంత తీవ్రంగా కనిపించకపోవడం వల్ల ఇతర సమస్యలుగా ΄÷రబడే అవకాశం ఎక్కువ. కడుపునొప్పి, బరువుతగ్గడం, కామెర్లు, ΄÷ట్టలో నీరు చేరడం, వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు లివర్ క్యాన్సర్ ముదిరిన దశలో తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినా... హెపటైటిస్ బి, సి వైరస్లు పాజిటివ్ ఉన్నా, మద్యం వంటి అలవాట్లు ఉన్నా... రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్యను, షుగర్, క్యాల్షియం, కొలెస్ట్రాల్, ఆల్ఫా ఫీటో ప్రోటీన్ (ఏఎఫ్‌పీ)ను రక్తపరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్, డాక్టర్ సలహా మేరకు ట్రిపుల్ ఫేజ్ సీటీ, ఎమ్మారై, పీఈటీ స్కాన్లు చేయించాలి. లివర్ బయాప్సీ చేయించడం వల్ల క్యాన్సర్, దాని స్టేజ్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ క్యాన్సర్ పెరిగే గుణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో నెలలోపే గడ్డ (కణితి) సైజు రెట్టింపు అయితే... మరికొందరిలో ఏడాది పైగా తీసుకోవచ్చు. కణితిని చిన్న సైజులో ఉన్నప్పుడే గుర్తించినా... లివర్ సిర్రోసిస్‌కు గురికావడం వల్ల చాలామందిలో సర్జరీ కుదరకపోవచ్చు. ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ, ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైటేషన్ (టీఏసీఈ), రేడియో అబ్లేషన్,ప్రోటాన్ బీమ్ థెరపీ, క్రయో అబ్లేషన్, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ వంటి అనేక పద్ధతుల్లో కణితిని తొలగించే లేదా తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. గడ్డ చిన్నగా ఉండి, మిగతా కాలేయం బాగానే ఉండి ఫెయిల్యూర్‌కు గురికాకుండా ఉంటే సర్జరీయే సరైన మార్గం. కణితి పరిమాణం పెద్దగా ఉన్నా, అనేక కణుతులు ఉన్నా, లివర్ ఫెయిల్యూర్‌కు గురవుతూ ఉంటే... కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడంతో పాటు, గతంలో ఎప్పుడైనా ఇతర క్యాన్సర్స్‌కు గురయి, చికిత్స తీసకున్నా ఎప్పటికప్పుడు కాలేయానికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండటం చాలా మంచిది. చాలామందిలో హెపటైటిస్–బి పాజిటివ్ ఉన్నా, ఏళ్లతరబడి ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా ఆరోగ్యకరంగానే ఉండవచ్చు. కానీ వారి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే పరీక్షలు చేయించుకోవడం, ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లయితే పుట్టిన బిడ్డకు వెంటనే 12 గంటలలోపు హెపటైటిస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ (హెచ్‌బీఐజీ) ఇప్పించడం మంచిది. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తితో కలిసి ఉన్నట్లు అనుమానం ఉన్నా, వాళ్ల రక్తం... శరీరంలో ప్రవేశించినట్లు అనుమానం ఉన్నా ముందుజాగ్రత్త చర్యగా ఆ సంఘటన జరిగిన 14 గంటలలోపే హెచ్‌బీఐజీ ఇంజెక్షన్ తీసుకుంటే హెపటైటిస్–బి పాజిటివ్ కాకుండా కాపాడుకోవచ్చు. - Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421 -
ఇక జిల్లా ఆస్పత్రుల్లోనూ హెపటైటిస్‌కు వైద్యం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో వైరల్ హెపటైటిస్ కేసులు క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ హెల్త్‌మిషన్ కేంద్ర అదనపు కార్యదర్శి, కేంద్ర ఎన్హెచ్ఎం డైరెక్టర్ వికాస్ షీల్ రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 11 బోధనాస్పత్రులు, 2 జిల్లా ఆస్పత్రుల్లో హెపటైటిస్ బీ వైరస్‌కు సంబంధించిన వ్యాధులకు స్క్రీనింగ్‌తో పాటు వైద్యం అందిస్తున్నారు. ఇక నుంచి అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ హెపటైటిస్‌కు వైద్యం అందించాలని నిర్ణయించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో 13 ఆస్పత్రుల్లోనూ హెపటైటిస్ బాధితులకు వైద్యం అందనుంది. అంటే మొత్తం 26 ఆస్పత్రుల్లో హెపటైటిస్ బీ, సి వ్యాధులకు పరీక్షలతో పాటు వైద్యం చేస్తారు. హెపటైటిస్ బీ లేదా సీ అనుమానిత కేసులైనా సరే ఇక్కడ వైద్యం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిర్ధారిత కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ఎన్‌వీహెచ్‌సీపీ (నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం) పోర్టల్‌కు అనుసంధానం చేయాలి. ప్రతి ఆస్పత్రిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్రప్రభుత్వం సూచించింది. హెపటైటిస్ వైరస్ వ్యాధులపై దేశంలోనే ఎక్కువ మందికి స్క్రీనింగ్ చేసి ఏపీ రికార్డు సృష్టించింది. ప్రత్యేక వైద్యుడి నియామకం జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో హెపటైటిస్ బాధితులకు వైద్యం అందించడానికి ప్రత్యేక డాక్టర్‌ను ఏర్పాటు చేస్తారు. జనరల్ మెడిసిన్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజీ లేదా హెపటాలజీ వైద్యుల్లో ఒకరిని నియమిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గడిచిన ఒక్క ఏడాదిలోనే 5,334 మంది హెపటైటిస్ బాధితులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందగా.. 71 మంది మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. -
ఏపీ, తెలంగాణాల్లో ప్రాణాంతక హెపటైటిస్.. నివారణ మార్గాలు తెలుసుకోండి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశ వ్యాప్తంగానే కాదు.. రాష్ట్రంలో వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు భయం గొల్పుతున్నాయి. ఇప్పటికే కరోనాతో విలవిలలాడుతున్న జనం..మరోవైపు అత్యంత ప్రమాదకరమైన హెపటైటిస్ బారిన పడుతున్నారు. 15 ఏళ్ల వయసు దాటిన వారిలో దేశవ్యాప్తంగా 0.9 శాతం మంది హెపటైటిస్ బి, హెపటైటిస్ సి బాధితులుండగా..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2.3 శాతం మంది ఉన్నట్లు తాజాగా ఎన్సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ) వెల్లడించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు దీనిపై తక్షణమే సత్వర చర్యలు చేపట్టాలని సూచించింది. హెపటైటిస్ ఎ, బి, సి, డితో పాటు హెపటైటిస్ ఇ వైరస్ కూడా ఉంది. ఈ వైరస్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికోసం ఏపీ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా నియంత్రణకు చర్యలు చేపట్టింది. లక్ష మంది హెల్త్‌కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ పూర్తి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే లక్ష మంది హెల్త్‌కేర్ వర్కర్లకు హెపటైటిస్ వ్యాక్సిన్ పూర్తి చేశారు. అంతేకాదు 101 జైళ్లలో ఉన్న 5,900 పైచిలుకు ఖైదీలకూ స్క్రీనింగ్ నిర్వహించి వ్యాక్సిన్ వేశారు. ఖైదీల్లో మరింత ఎక్కువగా హెపటైటిస్ బి వ్యాధులు కనిపించాయి. రాష్ట్రంలో సగటున 2.3 శాతం ఉండగా.. ఖైదీల్లో 2.7 శాతం మందికి నిర్ధారణ అయ్యింది. మరో 8 లక్షల మందికి వ్యాక్సిన్ రాష్ట్రంలో రిస్క్ గ్రూపులుగా చెప్పుకునే వాళ్లకు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఐవీ, క్షయ బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, సెక్స్ వర్కర్లు, ఎంఎస్ఎం (మేల్ సెక్స్ విత్ మేల్)కు వేస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వమే రూ.5 కోట్లు వ్యయం చేసి వ్యాక్సిన్ వేయనుంది. 560కి పైగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో అందరికీ హెపటైటిస్ స్క్రీనింగ్ చేయనున్నారు. నివారణ ఇలా.. ► శుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్–ఏ వైరస్‌ను నివారించవచ్చు ► హెపటైటిస్ బి, సి రక్తమార్పిడి వల్ల వస్తాయి. శుభ్రంగా లేని సిరంజీలు, నీడిల్స్ వాడడం వల్ల వస్తాయి. ► ప్రతి గర్భిణికి ప్రసవానికి ముందు హెపటైటిస్ టెస్టు చేసి, బిడ్డకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► హెపటైటిస్ –సి మూడు నెలలు మందులు వాడితే పూర్తిగా నయమవుతుంది. ► మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉచితంగా ఇస్తారు. ► విశృంఖల శృంగారం వల్ల హెపటైటిస్ బి, సి వస్తాయి. చిన్న పిల్లలకూ విధిగా హెపటైటిస్ టీకాలు వేయించాలి -
కాలేయ వాపుతో జాగ్రత్త.. లక్షణాలు లేకుండానే ముంచేస్తుంది!
శరీరంలో కీలకమైన భాగం కాలేయం (లివర్). ఈ అవయవం మనకు తెలియకుండానే ‘హెపటైటీస్’ (లివర్ వాపు)కు గురి అవుతోంది. దీంతో చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి. కాలేయంను కాపాడుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు. సాక్షి, కడప: ‘హెపటైటీస్’ వ్యాధి సోకిందని తెలియక చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమందిలో వ్యాధి తీవ్రత పెరగడంతో మృత్యువాత పడుతున్నారు. ఈ వ్యాధి నివారణకు.. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రతి ఏటా జూలై 28వ తేదీన ప్రపంచ హెపటైటీస్–బి నివారణ దినోత్సవంను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ‘హెపటైటీస్’ అంటే... ‘హెపటైటీస్’ ఇది కాలేయంకు సంబంధించిన వ్యాధి. వైద్య భాషలో ‘హెప’ అంటే లివర్, టైటీస్ లేదా ఐటస్ అంటే వాపు అని అర్ధం. ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు రకాల వైరస్ల సమూహమే ‘హెపటైటీస్’. అందులో ఎ, ఈ వైరస్ కలుషిత నీరును తాగడం, కలుషిత ఆహరంను తీసుకోవడం వలను వస్తుంది. ‘డి’ అంటే డెల్టా వైరస్. ఇది హెపటైటీస్‌కు చెందిన ఒక వైరస్. ఈ వైరస్లు ప్రమాదకరమైనవి కావు. బి, సి వైరస్‌లే అనారోగ్యానికి దారి తీస్తాయి. చాప కింద నీరులా... ఈ వ్యాధి చాప కింద నీరులా ప్రవేశిస్తుంది. అసలు ఈ వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు. వ్యాధి ఉందని తెలిసేలోపు ‘లివర్’ తీవ్ర ఇన్ఫెక్షన్కు గురి అవుతోంది. దీంతో వ్యాధి సోకిన వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నారు. బాధితుల్లో దాదాపు 70 శాతం మందికి ఇన్ఫెక్షన్ బాగా ముదిరిన తరువాతనే అసలు విషయం తెలుసుకుంటున్నారు. ఈ వైరస్ల కారణంగా దశల వారీగా కాలేయ వాపు, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ఇందుకు ‘హెపటైటీస్’. కారణం. ఎందుకు వస్తుందంటే... ► సురక్షితంకాని ఇంజక్షన్లు వాడటం. ► శుధ్ధి లేని రక్త మారి్పడి.. ► హెపటైటీస్ వ్యాధి సోకిన తల్లి నుంచి బిడ్డకు.. ► అవాంచిత సెక్స్ వలన. ► ఒకరు ఉపయోగించిన బ్లేడ్లు, రేజర్లు, టూత్ బ్రెష్‌లు వాడటం వలన. ► కలుషితమైన నీరు, ఆహరం తీసుకోవడం వలన. లక్షణాలు.. ► కామెర్లు, జ్వరం తదితర అనారోగ్య సమస్యలు ఉంటాయి. ► చాలా మందిలో వ్యాధి లక్షణాలు కనిపించవు. ► వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే కడపు నొప్పితో పాటు కడుపు ఉబ్బరం ఉంటుంది. రక్తపు వాంతులు అవుతాయి. తీసుకోవలసిన జాగ్రత్తలు... ► హెపటైటీస్ నిర్ధారణ రక్త పరీక్ష చేసుకోవాలి. ► ముందస్తు టీకా వేయించుకోవాలి. ► ఈ వ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా చికిత్స చేసుకోవడం వలన హెపటైటీస్‌ను నివారించవచ్చు. క్రమం తప్పకుండా టీకా వేయాలి హెపటైటీస్ నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి బిడ్డ జన్మించిన 24 గంటల్లోపు టీకాను వేస్తున్నాం. తరువాత ఐదు టీకాల మిశ్రమం కలిగిన ‘పెంటావాలెంట్’ టీకాను ఆరు వారాలకు, 10 వారాలకు, 14 వారాలకు ఒక సారి ఒక డోసు చొప్పున వ్యాక్సిన్ వేస్తున్నాం. ఈ పెంటావాలంట్ టీకా హెపటైటీస్–బితో అంటే కామెర్లతో పాటు కోరింత దగ్గు, ధనుర్వాతం, న్యుమోనియా నివారణకు పనిచేస్తుంది. ఈ టీకా 10 సంవత్సరాల వరకు పని చేస్తుంది. తరువాత ఒక బూస్టర్ డోస్‌ను వేయాలి. ప్రతి బూస్టర్ డోసు ఐదేళ్ల పాటు పనిచేస్తుంది. ఈ వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. వైద్యుల సూచనల ప్రకారం టీకా వేయాలి. – డాక్టర్ అనిల్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి -
రాష్ట్రవ్యాప్తంగా హెపటైటిస్ స్క్రీనింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా హెపటైటిస్ స్క్రీనింగ్ చేయాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ మేరకు అధికంగా కేసులు నమోదవుతున్న గద్వాల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయించింది. గద్వాల జిల్లాలోని ఐజా, రాజోలి మండలాల్లోని పలు గ్రామాల్లో 20 నుంచి 25 శాతం మంది రకరకాల కాలేయ వ్యాధులతో బాధపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 10వేల మందికి ఆరోగ్య పరీక్షలు చేయించనున్నారు. వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ప్రమాదమున్న నేపథ్యంలో స్క్రీనింగ్‌లో పాల్గొనే ఆరోగ్య సిబ్బందికి ఇప్పటికే వ్యాక్సిన్లు ఇచ్చారు. డిసెంబర్ తొలి వారంలో స్క్రీనింగ్ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్క్రీనింగ్‌కు అవసరమైన మెడికల్ కిట్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులకు అందజేసింది. ఈ స్క్రీనింగ్‌లో వ్యాధి ఉన్నట్లు తేలితే నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో ఉచితంగా చికిత్స అందించనున్నారు. -
హెపటైటిస్ టెన్షన్ !
విజయవాడ నగరంలో హెపటైటిస్ విజృంభిస్తోంది. దీనివల్ల వందలాది మంది కామెర్లు, టైఫాయిడ్ వ్యాధుల బారినపడుతున్నారు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో విషజ్వరాలు వస్తాయి. ఈ ఏడాది మాత్రం వింత పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్ మొదటి వారం గడుస్తున్నప్పటికీ జ్వరాలు తగ్గుముఖం పట్టలేదు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరాలతో అల్లాడుతూనే ఉన్నారు. మరోవైపు ప్రతి పది మంది జ్వరపీడితుల్లో ముగ్గురు కామెర్లు, టైఫాయిడ్ వ్యాధులతో బాధపడుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా మారడం, కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు చెబుతున్నారు. లబ్బీపేట(విజయవాడ తూర్పు) : స్థానిక మొగల్రాజపురానికి చెందిన వెంకట్, సురేష్ అన్నాదమ్ములు. ఇరవై రోజుల కిందట వెంకట్‌కు జ్వరం రావడంతో నగరంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. తొలుత మలేరియా నిర్ధారణ పరీక్ష చేయగా, నెగిటివ్ వచ్చింది. ఐదు రోజుల అనంతరం టైఫాయిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. వెంకట్‌కు జ్వరం తగ్గిన మరో పది రోజులకు తమ్ముడు సురేష్‌కు కూడా జ్వరం వచ్చింది. అతనికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించగా, టైఫాయిడ్, జాండీస్(కామెర్లు) పాజిటివ్ వచ్చాయి. ఇలా ఎంతో మంది టైఫాయిడ్, కామెర్ల వ్యా«ధుల బారిన పడున్నారు. ఇటీవల టైఫాయిడ్, కామెర్లుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో ప్రభుత్వాస్పత్రుల్లో సుమారు 80వేల మందికి రక్త పరీక్షలు నిర్వహించగా, ఎక్కువ మంది విషజ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నట్లు తేలింది. ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న జ్వరం కేసులు సా«ధారణంగా వర్షాల కారణంగా జూలైలో దోమకాటు వల్ల మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులు సోకుతాయి. విషజ్వరాలు కూడా ప్రబలుతాయి. ఆగస్టు నెలాఖరుకు సాధారణ పరిస్థితి నెలకొంటుంది. ఈ ఏడాది మాత్రం విష జ్వరాలతోపాటు డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. సెప్టెంబర్ మొదటి వారం వచ్చినా... జ్వరం కేసులు ఎక్కువగానే నమోదవుతూనే ఉన్నాయి. డెంగీ కేసులతోపాటు టైఫాయిడ్, కామెర్లు వ్యాధులు సోకుతున్న వారు పెరుగుతున్నారు. వీరిలో ఎక్కువగా పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తొలుత రోగులు సాధారణ జ్వరంగా భావించి వైద్య నిపుణుల వద్దకు వెళ్లకుండా కేవలం మందులు వాడటం, అనుభవం లేని ఆర్ఎంపీలను ఆశ్రయించడంతో పరిస్థితి విషమిస్తున్నట్లు సీనియర్ డాక్టర్లు చెబుతున్నారు. కలుషిత నీరు, ఆహారం వల్ల కలిగే హెపటైటిస్ ఏ–వైరస్, ఈ–వైరస్ (ఫీకో వైరస్) కారణంగా వందలాది మంది కామెర్లు, టైఫాయిడ్ వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు తెలిపారు. కామెర్ల వ్యాధి సోకడానికి కారణాలు.. ♦ మలేరియా జ్వరం వచ్చిన వారికి, హెపటైటిస్ వైరస్ వల్ల పిత్తాశయంలో పసర కారణంగా కామెర్ల వ్యాధి సోకుతుంది. ♦ ఒక్కో సమయంలో క్షయ వ్యాధికి వాడే మందుల వల్ల కూడా కామెర్లు వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. ♦ ప్రస్తుతం కలుషిత నీరు, ఆహారం కారణంగా హెపటైటిస్ ఏ–వైరస్, ఈ–వైరస్ (ఫీకో వైరస్)ల కారణంగా కామెర్లు సోకుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ♦ క్వాలిఫైడ్ వైద్యుల వద్దకు వెళ్లకపోవడం, సరైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకపోవడం, రక్తకణాలు త్వరగా చనిపోవడం వల్ల కామెర్లు సోకిన వారి పరిస్థితి విషమంగా మారుతుంది. -
హెచ్చరిక లేని జబ్బు హెపటైటిస్
ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో హెపటైటిస్ ఒకటి. వైరస్ కారణంగా సోకే హెపటైటిస్ వ్యాధిలో ఎ, బి, సి, డి, ఇ రకాలు ఉన్నాయి. అన్ని రకాల హెపటైటిస్‌ను లెక్కలోకి తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య దాదాపు 50 కోట్ల వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. వీరిలో ముఖ్యంగా హెపటైటిస్–బి, హైపటైటిస్–సి రకాలతో బాధపడుతున్న వారు సుమారు 35 కోట్ల వరకు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ బారిన పడి ఏటా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య పది లక్షలకు పైగానే ఉంటోంది. గత ఏడాది హెపటైటిస్ కారణంగా 13.4 లక్షల మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్ఓ లెక్కలు చెబుతున్నాయి. హెచ్ఐవీ, క్షయ వ్యాధులతో మరణిస్తున్న వారి కంటే ఈ సంఖ్య ఎక్కువగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి సోకిన చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. రక్తపరీక్షలు జరిపిస్తే తప్ప వ్యాధి సోకిన విషయం తెలుసుకోవడం సాధ్యం కాదు. హెపటైటిస్ లక్షణాలు ఒక్కోసారి కొద్దికాలం ఉండి తగ్గిపోవచ్చు. ఒక్కోసారి దీర్ఘకాలం కూడా ఉండవచ్చు. హెపటైటిస్ సోకినట్లు గుర్తించిన వెంటనే తగిన చికిత్స తీసుకోకుంటే కాలేయం పూర్తిగా దెబ్బతిని ప్రాణాంతక పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. హెపటైటిస్ ముదిరితే కాలేయంపై మచ్చలు ఏర్పడటం, లివర్ క్యాన్సర్ తలెత్తి చివరకు కాలేయం పూర్తిగా విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవీ విశేషాలు... ప్రధానంగా హెపటైటిస్ వైరస్ కారణంగా సోకే వ్యాధి. అపరిశుభ్రమైన నీరు, ఆహారం, రక్తమార్పిడి, లైంగిక చర్యలు, ఒకరు వాడిన సిరంజీలు మరొకరు వాడటం, మితిమీరి మద్యం తాగడం, కొన్ని రకాల మందులు వాడటం, ఆటో ఇమ్యూన్ వ్యాధులకు లోనవడం వంటి కారణాల వల్ల హెపటైటిస్ సోకే అవకాశాలు ఉంటాయి. తల్లిపాల ద్వారా చిన్నారులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. కొందరిలో మద్యం అలవాటు లేకపోయినా ఇతర కారణాల వల్ల కూడా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. హెపటైటిస్–ఎ, ఇ రకాల వైరస్లు ఎక్కువగా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తాయి. హెపటైటిస్–ఎ, బి, డి రకాలకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్లతో వీటిని పూర్తిగా నిరోధించే అవకాశాలు ఉన్నాయి. హెపటైటిస్ సోకిన చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే, కొందరిలో ఆకలి లేకపోవడం, చర్మం కాస్త పసుపు రంగులోకి మారడం, అలసట, కడుపు నొప్పి, వికారం, వాంతులు, డయేరియా, కీళ్లనొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలికంగా బాధించే ఇతర రకాల హెపటైటిస్‌ను కూడా మందులతో నయం చేసే అవకాశాలు ఉన్నాయి. మెరుగైన ఔషధాలు, చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపు 95 శాతం మేరకు హెపటైటిస్–సి కేసులను వైద్యులు పూర్తిగా నయం చేయగలుగుతున్నారు. హెపటైటిస్‌ను 2030 నాటికి పూర్తిగా నిర్మూలించాలని డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా, ఇతర పరాన్నజీవుల ద్వారా కూడా హెపటైటిస్ సోకే అవకాశాలు ఉంటాయి. అరుదుగా ఈ వ్యాధి జన్యు కారణాల వల్ల సోకే అవకాశాలు కూడా లేకపోలేదు. సాధారణంగా రక్తపరీక్షల ద్వారా హెపటైటిస్‌ను గుర్తిస్తారు. దీర్ఘకాలికంగా ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్నవారిలో హెపటైటిస్‌ను గుర్తించడానికి లివర్ బయాప్సీ పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. హెపటైటిస్ నిర్మూలన లక్ష్యంగా డబ్ల్యూహెచ్ఓతో పాటు వరల్డ్ హెపటైటిస్ అలయన్స్ కృషి చేస్తోంది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 3 వరకు బ్రెజిల్‌లోని సావో పాలోలో జరిగే ప్రపంచ హెపటైటిస్ సదస్సుకు బ్రెజిల్ ప్రభుత్వం కూడా చేయూత అందిస్తోంది. -
బయటి పదార్థాలు తింటే కామెర్లు తప్పదా?
గ్యాస్ట్రో కౌన్సెలింగ్ ఇటీవల కురుస్తున్న వర్షాలను చూస్తుంటే నాకు ఆందోళనగా ఉంది. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా ప్రయాణాలు చేసే వృత్తిలో ఉన్నాను. కలుషితమైన బయటి ఆహారాలు తింటే కామెర్లు వస్తాయని అందరూ అంటున్నారు. ఇది వాస్తవమేనా? నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - సుదర్శన్, వరంగల్ కామెర్లు అని చెప్పేది ఒక వ్యాధి కాదు. ఇది కలుషితమైన నీటి వల్ల వచ్చే హెపటైటిస్లలో రకాలైన హెపఐటిస్-ఏ, హెపటైటిస్-ఈ వైరస్లు వచ్చినప్పుడు కనిపించే ఒక లక్షణం మాత్రమే. సాధారణంగా కలుషితమైన నీళ్లలోని ఈ వైరస్ల వల్ల కాలేయం దెబ్బతిని కామెర్లు కనిపిస్తుంటాయి. కామెర్లలో రక్తంలోని బిలురుబిన్ పాళ్లు పెరుగుతాయి. రక్తంలో బిలురుబిన్ పెరిగినప్పుడు దాని రంగు కనుగుడ్లు, చర్మంలోని మ్యూకస్ పొరల్లో పేరుకుపోతుంది. దాంతో అవి పచ్చగా కనిపిస్తాయి. మామూలు పరిస్థితుల్లో వ్యర్థాలను కాలేయం సేకరించి పైత్యరసంతో పాటు కాలేయ వాహిక ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడి నుంచి అది మలంలోకి వెళ్లి బయటకు వెళ్తుంది. మలం పసుపు రంగులో కనిపించడానికి కారణం ఆ వ్యర్థాలే. అయితే కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల బైలురుబిన్, బైలివర్దిన్ అనే పదార్థాలు ఒంట్లోనేరుకుపోతాయన్నమాట. ఇదే పచ్చదనం కళ్లలోనూ కనిపిస్తుందన్నమాట. కామెర్లు వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు... కళ్లు పచ్చబడతాయి మూత్రం పసుపు రంగులోకి మారుతుంది మలం బూడిదరంగులో వస్తుంది జ్వరం, ఒళ్లునొప్పులు, ఆకలి తగ్గడం, దురదలు, వాంతులు కనిపిస్తాయి కాలేయానికి జరుగుతున్న నష్టం కనిపించకపోతే కామెర్లు తీవ్రతరమవుతాయి. అప్పుడు పాదాల వాపు, నిద్రపట్టకపోవడం, రక్తపు వాంతులు, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : సాధారణంగా బయటి పదార్థాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. మీ వృత్తి కారణంగా మీరు ఇంట్లో వండిన పదార్థాలను తినలేరు కాబట్టి ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినేయండి. మీ వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లండి. కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగండి. మద్యం అలవాటుకు, పొగతాగే అలవాట్లకు దూరంగా ఉండండి పరిశుభ్రమైన పరిసరాల్లోనే ఉండండి. చెట్ల మందులు, పసర్ల వంటి నాటు మందులు వాడకండి. - డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఉచిత హెపటైటిస్ శిబిరం
ఖమ్మంవైద్య విభాగం : సాయిరాం గ్యాస్ట్రో లివర్ ఆస్పత్రి, రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి ఆధ్వర్యంలో గురువారం స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో ఉచిత హెపటైటిస్ శిబిరాన్ని నగర మేయర్ పాపాలాల్ ప్రారంభించారు. హెపటైటిస్ బీ,సీ పరీక్షలు నిర్వహించి, హెపటైటిస్ బీ వ్యాక్సినేషన్ చేపట్టారు. శిబిరంలో 521 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్, ఐఎంఏ కార్యదర్శి బొల్లికొండ శ్రీనివాసరావు, రోటరీక్లబ్ ఆఫ్ స్తంబాద్రి ప్రెసిడెంట్ వందనపు శ్రీనివాస్, జంగాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. -
హెపటైటిస్-బి పూర్తిగా నయమవుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. నాకు ఈమధ్య పచ్చకామెర్లు అయ్యాయి. వాంతులు, అన్నం తినబుద్ధికాకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి హెపటైటిస్-బి అని నిర్ణయించారు. ఇప్పుడు తగ్గినా మళ్లీ ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు. హెపటైటిస్-బికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - గోపాల్‌రావు, నల్లగొండ హెపటైటిస్-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. ఇది వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. మొత్తం జనాభాలో 3-5 శాతం మంది దీనితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారిలో కాలేయానికి వాపురావడం, వాంతులు, పచ్చకామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. వ్యాధి వ్యాప్తి: ఒకసారి వ్యాధి ఒంట్లోకి ప్రవేశించిందంటే, హెపటైటిస్-బి వైరస్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.రక్తంలోనూ, లాలాజలంలోనూ, వీర్యంలోనూ, మానవుడి శరీర స్రావాల్లో ఈ వైరస్ ఉంటుంది. ఈ వ్యాధి ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సూదుల ద్వారా, గర్భవతి అయిన తల్లి నుంచి బిడ్డకు వ్యాపించవచ్చు. తొలి దశ : వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్ది రోజులకు కామెర్లు వస్తాయి. దీన్ని అక్యూట్ దశ అంటారు. ఆమెర్లతో పాటు వికారం, అన్నం తినాలపించకపోవడం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలు ఉండవచ్చు. ఈ దశలో ఎలీజా అనే పరీక్ష చేయిస్తే పాజిటివ్ వస్తుంది. రెండోదశ: ఈ దశలో వైరస్ శరీరంలో చాలాకాలం నుంచి ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని దీర్ఘకాలిక సమస్యగా పరిగణిస్తారు. అంటే వైరస్ శరీరంలో ఉండిపోవడానికి ప్రయత్నిస్తుందన్నమాట. ఈ దశలో కామెర్లు తగ్గినా కూడా హెచ్‌బీఎస్‌ఏజీ వైద్య పరీక్ష పాజిటివ్ అనే వస్తుంది. ఇలాంటి వారికి శరీరంలో వైరస్ ఉన్నా ఏ బాధలూ ఉండవు. వీరిలో వైరస్ ఉన్నట్లే తెలియదు. అది వారికి ఇతరత్రా ఏవైనా వైద్య పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు, మహిళలకు గర్భధారణ సమయంలో మిగతా పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు, రక్తదానం సమయంలో... వైరస్ ఉన్నట్లు బయటపడుతుంది. తమకు ఏ సమస్య లేకపోయినా... వారి నుంచి ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది. తొలిదశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ దశలో పదే పదే కామెర్లు వచ్చిపోతుంటాయి. వీరిలో 99.5 శాతం మందికి ప్రాణభయం ఉండదు. కానీ వైరస్ శరీరంలో ఉండిపోయి బాధిస్తుంది. కాబట్టి మీరు మంచి (పౌష్టిక) ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. అంతేకాకుండా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. ప్రతి ఆర్నెల్లకొకసారి పరీక్ష చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వైరస్ శరీరం నుంచి పూర్తిగా పోవడానికి చాలా సమయం పడుతుంది. రెండో దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వీరి శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ ఏ బాధలు / సమస్యలు ఉండవు. అయినప్పటికీ వీరి శరీరం నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ప్రతి ఆరెల్లకొకసారి పరీక్ష చేయించుకుంటూ, తగిన చికిత్స తీసుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. పొగ/మద్యం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. వీళ్లకు ఎప్పుడో ఒకసారి భవిష్యత్తులో లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కొందరిలో సమస్యలేమీ లేకపోయినా ఉన్నట్లుండి అకస్మాత్తుగా లక్షణాలు మొదలు కావచ్చు. హెపటైటిస్-బి వ్యాధి ఒక్కోసారి భవిష్యత్తులో క్యాన్సర్‌కి కారణం కూడా కావచ్చు. లివర్ ఫైబ్రోసిస్ మొదలై మెల్లగా లివర్ సిర్రోసిస్‌కు దారితీసే అవకాశం ఉంది. చికిత్స : హోమియోలో ఎలాంటి సమస్యకైనా కాన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా చికిత్స చేయవచ్చు. రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని క్రమేపీ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తారు. ఇలా క్రమక్రమంగా వ్యాధిని పూర్తిగా తగ్గిస్తారు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
భారత్‌ను భయపెడుతున్న హెపటైటిస్
న్యూఢిల్లీ: రక్షిత మంచినీరు దొరక్క ఏటా వేలాది మంది భారతీయులు ప్రాణాంతకమైన హెపటైటిస్ జబ్బున పడుతున్నారు. తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ సారి దేశంలో ఎక్కువ హెపటైటిస్ కేసులు నమోదవుతాయని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది దేశంలోని ఏడున్నర కోట్ల మంది భారతీయులు అధిక ధరలకు తాగునీటిని కొనుగోలు చేయడం లేదా రసాయనాలు, డ్రైనేజ్ వాటర్ కలసిన నీటిని తాగుతున్నారని ‘ఇంటర్నేషనల్ చారిటీ వాటర్ ఎయిడ్’ తెలియజేసింది. రసాయనాలు లేదా మురుగునీరు కలసిన నీటిని తాగడం వల్ల హెపటైటిస్ ఏ, ఈ, జబ్బులు వస్తాయని, వీటి వల్ల మనుషుల్లో కాలేయం పాడువుతుందని, గర్భవతులు మృత్యువాత కూడా పడతారని కేంద్ర వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జబ్బు నీరు, ఆహారం ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. సకాలంలో వైద్య చికిత్స అందిస్తే రోగులు కోలుకుంటారని వారు చెబుతున్నారు. ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్’ లెక్కల ప్రకారం దేశంలో గతేడాది 1,33,625 హెపటైటిస్ కేసులు నమోదయ్యాయి. వారిలో 397 మంది మరణించారు. బీహార్‌లో 25, 808 కేసులు, మధ్యప్రదేశ్‌లో 12,938, ఉత్తరప్రదేశ్‌లో 11,088, దేశరాజధాని ఢిల్లీలో 8,362, పశ్చిమ బెంగాల్లో 3,865 కేసులు నమోదయ్యాయి. బెంగాల్లో 81 మంది, ఢిల్లీలో 76 మంది, యూపీలో 62 మంది మరణించారు. దేశ జనాభాలో రెండు నుంచి ఐదు శాతం మంది హెపటైటిస్ వ్యాధితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తాగేందుకు రక్షిత మంచినీరు అందించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ఒక్కటే పరిష్కారమార్గమని ఆ సంస్థ సూచించింది. -
గ్యాస్ట్రో కౌన్సెలింగ్
నాకు ఎనిమిది నెలల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో జరిగిన రక్తపరీక్షలో హెపటైటిస్-బి పాజిటివ్ అని చెప్పారు. ఆర్నెల్ల తర్వాత మళ్లీ టెస్ట్ చేస్తే మళ్లీ హెపటైటిస్-బి పాజిటివ్ అని అన్నారు. ఈ వ్యాధికి చికిత్స ఉందా లేదా? - లక్ష్మయ్య, వరంగల్ మీకు ఆర్నెల్ల తర్వాత కూడా హెపటైటిస్-బి పాటిజివ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు క్రానిక్ హెపటైటిస్-బి అనే వ్యాధి ఉన్నట్లు చెప్పవచ్చు. ఈ వ్యాధి ఉన్నవారు మొదట కొన్ని రక్తపరీక్షలు చేయించుకొని (ఉదా: హెచ్బీఈఏజీ, యాంటీ హెచ్బీఈఏజీ, ఎల్ఎఫ్టీ, హెచ్‌బీవీ డీఎన్ఏ అనే పరీక్షలు) వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకోవాలి. వ్యాధి చాలా మందిలో సుషుప్తావస్తలో (ఇనాక్టివ్‌గా) ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి చురుకైన (యాక్టివ్) దశలోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాధి సుషుప్తావస్థలో ఉన్నవారికి ఏ మందులూ అవసరం లేదు. కానీ మీరు చేయాల్సిందల్లా ప్రతి 3 నుంచి 6 నెలలకోసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి ఎల్ఎఫ్టీ పరీక్ష చేయించుకుంటూ వ్యాధి చురుకైన దశలోకి ఏమైనా వచ్చిందా అని చూసుకోవాలి. యాక్టివ్ దశలోకి వెళ్తే దానికి వివిధ రకాల మందులు వాడాల్సి ఉంటుంది. ఏ మందు వాడాలో డాక్టర్గారే నిర్ధారణ చేస్తారు. -
హెపటైటిస్‌కు హోమియో మందులు
1. జెల్సీమియమ్ 200: విపరీతమైన భయం, ఆందోళన కలవారికి; అక్యూట్ హెపటైటిస్ లక్షణాలు అంటే... నీరసం, ఆకలి మందగించడం, విరేచనాలు ఉన్నవారికి. 2. అకోనైట్ 200: హెపటైటిస్‌తో పాటు కళ్లు ఎర్రబారడం, చర్మం గులాబిరంగులోకి మారడం, మూత్రం ఎర్రగా మారడం, విపరీతమైన జ్వరం గలవారికి. 3. టారెన్టులా 200: సాలెపురుగు నుంచి ఈ మందు తయారు చేస్తారు. హెపటైటిస్ లక్షణాలతో పాటు ఉలిక్కిపడటం, అతిభయం, దాహం తక్కువగా ఉండటం, విపరీతమైన జ్వరం ఉన్నవారికి. 4. సిక్యూటా వీరోజా: చెట్ల నుంచి తయారు చేసే ఈ మందు మూర్చవ్యాధిని అణచివేయడం వల్ల వారికి వచ్చే జబ్బులకు పనిచేస్తుంది. ఇక జబ్బును పెద్దగా ఊహించుకుని ఆందోళన చెందేవారికీ మంచి మందు. దీన్ని 200 పొటెన్సీలో రెండుపూటలా ఉపయోగించాలి. 5. బ్రయోనియా: విపరీతమైన ఒళ్లునొప్పులు, గ్యాస్ అధికంగా ఉండటం, అధిక దాహం, ఆకలి మందగించడం; వ్యాపార లావాదేవీల గురించి ఎక్కువగా ఆలోచించడం చేసేవారికి. క్రానిక్ హెపటైటిస్: 1. సల్ఫర్: శుభ్రత సరిగా పాటించనివారికి, చర్మవ్యాధులు అణచివేసిన తర్వాత జబ్బు వచ్చిన వారికి ఈ మందు డాక్టర్ పర్యవేక్షణలో 200 పొటెన్సీతో వాడాలి. 2. చెలిడోనియమ్: దీర్ఘకాలిక హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవారికి, కడుపులో ఉబ్బరంగా ఉండటం, అసైటిస్ (జలోదరం), కాళ్లవాపులు ఉన్నవారికి ఇది మంచి మందు. 3. లైకోపోడియమ్: జబ్బు గురించి ఎక్కువగా ఆందోళన చెందేవారికి ఈ ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది. చిరాకు, కోపం ఉండటం; తీపి పదార్థాలను ఇష్టపడటం, దాహం తక్కువగా ఉండటం, త్వరగా ఏడ్చేసే స్వభావం ఉన్నవారికి, వేడిని తట్టుకోలేని వారికి ఇది బాగా పనిచేస్తుంది. 4. యాంటిమోనియమ్ క్రూడమ్: సున్నితమనస్కులు, ఊహాలోకంలో ఉండేవారికి ఇది బాగా పనిచేస్తుంది. 5. పల్సటిల్లా: తెలివైనవారికి, ఇంటిగురించి అధికంగా ఆలోచించేవారికి, శాంతస్వభావం గలవారికి త్వరగా ఏడ్చే స్వభావం ఉన్నవారికి ఇది మంచి మందు. 6. మెర్క్‌సాల్: అతిగా ఆహారం తీసుకోవడం, జబ్బును నిర్లక్ష్యం చేసేవారికి, అధిక చెమటలు, అధిక దాహం, చెడువాసన కలిగిన చెమట వచ్చేవారికి దీన్ని 200 పొటెన్సీలో నెలకు ఒక డోస్ ఇవ్వాలి. 7. నేట్రమ్మూర్: సున్నిత మనస్కులు, అసంతృప్తి భావన, ఉప్పు, పులుపు ఇష్టపడేవారికి బాగా పనిచేసే మందు. 8. చైనా: అసంతృప్తి, దురదృష్టజీవితం, చిరాకు, కోపం, మాటిమాటికీ మలేరియాతో బాధపడిన వాళ్లలో వచ్చిన హెపటైటిస్‌కు ఇది మంచి మందు. హెపటైటిస్‌లో ఐదు రకాలు ఉంటాయి కాబట్టి వచ్చిన ఇన్ఫెక్షన్ను బట్టి, అతడి జబ్బు లక్షణాలు, వ్యక్తిగత స్వభావాలను పరిగణనలోకి తీసుకుని, గత వైద్యచరిత్రను కూడా పరిశీలించి మందు ఇవ్వాలి. చికిత్స చేసి, జబ్బునయం చేయడం కంటే రోగనిరోధకశక్తిని పెంపొందించడానికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. - డా. ఏ.ఎమ్. రెడ్డి, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
డేంజరస్ హెపటైటిస్...
‘‘పునరాలోచించండి...’’ ఇదీ ఈ ఏడాది ప్రపంచ హెపటైటిస్ డే థీమ్‌గా నిర్ణయించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) దాని అనుబంధంగా ఆరోగ్య రంగంలో పనిచేసే అనేక రంగాలకు చెందిన నిపుణులు. హెపటైటిస్ గురించి పునరాలోచించాలంటూ వీళ్లంతా అన్ని దేశాల ప్రభుత్వాలనూ, విధాన నిర్ణేతలనూ, ఆరోగ్య కార్యకర్తలనూ, చికిత్సారంగ నిపుణులనూ ఎందుకు కోరుతున్నారు? ఎందుకంటే... హెపటైటిస్ చడీచప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ప్రాణం తీసుకోగలదు. ప్రపంచ జనాభాలో చాలామంది హెపటైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ, అది తమకు ఉన్నట్లే తెలియదు. అందుకే ఈ థీమ్ అవసరం ఏర్పడింది. హెపటైటిస్పై సమగ్ర అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం... హెపటైటిస్ అంటే... నిజానికి హెపటైటిస్ అనేది ఒక జబ్బు కాదు. కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్ ఏ; బి; సి; డి; ఈ అనే ఐదు రకాల హెపటైటిస్‌లు కోట్లాది మంది ప్రజల్లో వ్యాపించి ఉన్నాయి. పై ఇన్ఫెక్షన్లలో దేనికైనా గురైన వారికి దీర్ఘకాలంలో క్రమంగా కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్ వ్యాధితో ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటీ యాభై లక్షల మంది మరణిస్తున్నారు. హెపటైటిస్ అన్న పదం గ్రీకు నుంచి వచ్చింది. ఈ పదంలోని మొదటిభాగం ‘హెపార్ స్టెమ్ ఆఫ్ హిప్యాట్’... అంటే కాలేయం అనీ, ‘ఐటిస్’ అంటే ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) అని అర్థం. A- హెపటైటిస్ చాలా సందర్భాల్లో ఈ వ్యాధి ఉన్నవారికి (ముఖ్యంగా యుక్తవయస్కుల్లో) బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. కొందరిలో లక్షణాలు కనిపించవచ్చు. ఇలా వ్యాధి సోకిన నాటి నుంచి లక్షణాలు బయటకు కనిపించడానికి రెండు నుంచి ఆరు వారాలు పట్టవచ్చు. ఇక లక్షణాలు కనిపించేవారిలో వికారం, వాంతులు, కామెర్లతో ఇది బయటపడుతుంది. ఇది సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధి కాదు. చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఇది సంభవించిన ఒక శాతం మందిలో ఇది మరణానికి దారితీస్తుంది. వ్యాప్తి ఇలా: ఇది కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాప్తిచెందుతుంది. మలవ్యర్థాలు తాగు నీటితో కలవడం వల్ల కలుషితమైనా లేదా ఆ నీటితో పదార్థాలు తయారు చేయడం వల్ల ఇది వ్యాప్తిచెందుతుంది. అంటే సురక్షితం కాని నీరు, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. తీవ్రత: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కోటీ నలభై లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. లక్షణాలు: హెపటైటిస్- ఏ తీవ్రత స్వల్పం మొదలుకొని తీవ్రం వరకు ఉండవచ్చు. ఈ వైరస్ ఉన్నవారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, కడుపులో ఇబ్బంది, మూత్రం పచ్చగా రావడం, కామెర్లు (చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుగా మారడం) కనిపించవచ్చు. అందరిలోనూ అన్ని లక్షణాలూ ఉండకపోవచ్చు. నిర్ధారణ: హెపటైటిస్- ఏ ను కేవలం బయటి లక్షణాల ఆధారంగా నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ వైరస్‌ను నిర్ధారణ చేసే ప్రత్యేక రక్తపరీక్ష ఆధారంగా యాంటీబాడీస్‌తో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. దీనితో పాటు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలీమెరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టీ-పీసీఆర్) అనే మరో అదనపు పరీక్ష కూడా ఈ వైరస్ నిర్ధారణ కోసం చేసేదే. ప్రత్యేకమైన ల్యాబ్‌లలో ఈ పరీక్ష ద్వారా ఈ వైరస్ తాలూకు ఆర్ఎన్ఏను గుర్తించడం ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. చికిత్స: ఈ వ్యాధి చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. కాకపోతే కాలేయానికి భారం పడని విధంగా తేలికపాటి ఆహారం, లక్షణాలను బట్టి చేసే చికిత్సలు (సింప్టమాటిక్ ట్రీట్మెంట్స్) చేస్తే చాలు. లక్షణాలు తగ్గడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఒక్కోసారి వారాలు మొదలుకొని నెలలు కూడా పట్టవచ్చు. నివారణ: సురక్షితమైన, పరిశుభ్రమైన నీరు తాగడం / వాడటం ఆరుబయట మల విసర్జన లాంటి అలవాట్లు మానుకుని, మలం బయటకు కనిపించని విధంగా కట్టించిన టాయెలెట్లలోనే మలవిసర్జన చేయడం (దీని వల్ల నీరు కలుషితమయ్యే అవకాశాలు తగ్గుతాయి). వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం (అంటే భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత పరిశుభ్రంగా కాళ్లూ,చేతులు కడుక్కోవడం వంటివి). వ్యాక్సిన్: హెపటైటిస్-ఏ కు చాలారకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్ ఏదైనప్పటికీ అవన్నీ ఈ వ్యాధి నుంచి రక్షణ కల్పించే విధానం మాత్రం ఒకటే. అయితే ఏడాది లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి లేదు. కేవలం ఒక్క మోతాదు వ్యాక్సిన్‌తో నెల రోజుల్లోనే ఈ వ్యాధి పట్ల నూరు శాతం భద్రత ఒనగూరుతుంది. B- హెపటైటిస్ ఇది హైపటైటిస్లోని అన్ని వైరస్లలోనూ అత్యంత ప్రమాదకరమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రతి ఏటా రెండు బిలియన్ ప్రజల్లో వారికి తెలియకుండానే ఈ వైరస్ ఉంది. 35 కోట్ల మందిలో ఇది దీర్ఘకాలిక వ్యాధి (క్రానిక్)గా మారి వేధిస్తోంది. వ్యాప్తి ఇలా: ఇది ఎంత చురుకైనదంటే... సూదిపోటు ద్వారా వ్యాపించడం అనే ఒక్క అంశంలోనే హెచ్ఐవీతో పోలిస్తే దాదాపు 50 నుంచి 100 రెట్లు వేగంగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ప్రతి ఏటా దాదాపు 7,80,000 మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. ఇది ప్రధానంగా మూడు రకాలుగా వ్యాపిస్తుంది. గర్భవతి వ్యాధిగ్రస్తురాలైతే... తల్లి నుంచి బిడ్డకూ సోకుతుంది. లేదా మరీ నెలల పిల్లల్లో ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంది సెక్స్ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది ఇక ఒకరు వాడిన ఇంజెక్షన్ సూది మరొకరు వాడటం వల్ల ఇది వ్యాపిస్తుంది. అలాగే సరైన పరిశుభ్రత పాటించకుండా వేసుకునే పచ్చబొట్టు పరికరాల వల్ల కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఎంత ప్రమాదకరమైనదంటే.. : హెచ్ఐవీ వైరస్‌ను మానవ శరీరం నుంచి వేరు చేయగానే కొద్ది క్షణాల్లోనే అది మరణిస్తుంది. కానీ హెపటైటిస్-బి వైరస్ వ్యక్తి శరీరం బయటకు వచ్చాక కూడా కనీసం ఏడురోజుల పాటు సజీవంగా ఉండగలదు. అందుకే దీని వ్యాప్తి చాలా వేగవంతం, తీవ్రం. వ్యాక్సిన్ వేయని వ్యక్తిని రక్తమార్పిడి వల్లనో, సెక్స్ వల్లనో లేదా సూదిపోటు వల్లనో వ్యాపించడం జరిగితే అది అతి వేగంగా ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించాక దాదాపు 30 నుంచి 180 రోజుల్లో లక్షణాలు బయట పడతాయి. అంటే సగటున 75 రోజుల్లో బయటపడవచ్చు. లక్షణాలు: వ్యాధి సోకిన కొందరిలో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే కొందరిలో మాత్రం కామెర్లు, మూత్రం చాలా పచ్చగా రావడం, తీవ్రమైన అలసట, నీరసం, వికారం, వాంతులు, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వైరస్ దీర్ఘకాలంగా కాలేయంపై ప్రభావం చూపితే అది సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్‌గా పరిణమించవచ్చు. అయితే అదృష్టవశాత్తు 90 శాతం మంది యువకుల్లో ఇది ఆర్నెల్లలో దానంతట అదే తగ్గిపోవచ్చు కూడా. నిర్ధారణ: చాలా సాధారణ రక్త పరీక్షతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ఇదే పరీక్షతో రక్తంలో వైరస్ తీవ్రతనూ తెలుసుకరోవచ్చు. చికిత్స: దీనికి నిర్దిష్ట చికిత్స లేదు. కేవలం సమతుల ఆహారం ఇస్తూ రోగిని సౌకర్యవంతంగా ఉంచడం, తరచూ ఎదురయ్యే లక్షణాలను తగ్గించే మందులు ఇవ్వడం (సింప్టమాటిక్ ట్రీట్మెంట్) మాత్రమే ఈ వ్యాధి ఉన్నవారికి చేయగల చికిత్స. ఈ వ్యాధి ఉన్న రోగుల్లో కాలేయంపై దాని ప్రభావ తీవ్రతను బట్టి ఇంటర్ఫెరాన్, యాంటీవైరల్ ఏజెంట్స్ వంటి మందులు ఇస్తారు. ఒకవేళ దీని కారణంగా కాలేయ క్యాన్సర్ వస్తే... దాన్ని చాలా త్వరితంగా గుర్తించినప్పుడు క్యాన్సర్‌కు గురైన భాగం వరకు తొలగించవచ్చు. నివారణ: హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు ఈ వ్యాక్సి పిల్లలకు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది. ఇక చిన్నప్పుడు వ్యాక్సిన్ ఇవ్వని 18 ఏళ్ల లోపు వారికి (ఆ ప్రాంతంలో హెపటైటిస్-బి వ్యాప్తిని గుర్తిస్తే) వ్యాక్సిన్ ఇప్పించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. దీనితోపాటు రిస్క్ గ్రూప్‌లో ఉన్నవారు అంటే... చికిత్సారంగంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, డయాలసిస్ పేషెంట్స్, ఇంజెక్షన్స్ చేయించుకునే వారు, సెక్స్వర్కర్స్, ఒకరి కంటే ఎక్కువగా సెక్స్ భాగస్వాములు ఉన్నవారు, దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. C - హెపటైటిస్ ఇది చాలామందిలో, చాలావరకు దీర్ఘకాలికంగా ఉండే ఇన్ఫెక్షన్. కానీ కొద్దిమందిలో ఇది స్వల్పకాలిక ఇన్ఫెక్షన్గా కూడా ఉండవచ్చు. ఇది సోకిన వారిలో 15% నుంచి 45% మందిలో ఆర్నెల్లలో వ్యాధి దానంతట అదే ఆకస్మికంగా తగ్గిపోతుంది. మిగతా 55% నుంచి 85% మందిలో అది దీర్ఘకాలిక హెపటైటిస్- సి ఇన్ఫెక్షన్గా పరిణమిస్తుంది. అయితే ఈ వ్యాధి వల్ల లివర్ సిర్రోసిస్ వచ్చేందుకు చాలా ఎక్కువ కాలం పడుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న 15% నుంచి 30% మందిలో ఇది సిర్రోసిస్‌గా పరిణమించడానికి 20 ఏళ్లు కూడా పడుతుంది. వ్యాప్తి ఇలా: ఇది సరిగా స్టెరిలైజ్ చేయకుండా వాడే వైద్య పరికరాలతో ముఖ్యంగా ఒకరు వాడిన ఇంజెక్షన్ సూదులను మరొకరు వాడటం వల్ల వ్యాప్తి చెందుతుంది. సెక్స్ వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. గర్భవతికి ఇది ఉంటే బిడ్డకూ వచ్చే ప్రమాదం ఉంది. లక్షణాలు: వైరస్ సోకాక లక్షణాలు బయటపడటానికి రెండు వారాల నుంచి ఆరు వారాల సమయం పడుతుంది. 80 శాతం మందిలో ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. కానీ కొందరిలో జ్వరం, నీరసం/అలసట, ఆకలి తగ్గడం, వికారం, వాంతులు, కడుపునొప్పి, మూత్రం పచ్చగా రావడం, మలం నల్లరంగులో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ: లక్షణాలు బయటకు కనిపించని కారణంగా సోకిన తర్వాత తొలి దశల్లోనే దీన్ని గుర్తించడం అరుదుగా జరుగుతుంది. అందుకే దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా పరిణమించినవారిలో అది కాలేయాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేశాకే బయటపడుతుంది. దీని నిర్ధారణ ప్రక్రియల్లో భాగంగా రక్తపరీక్షతో సీరలాజికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా యాంటీ హెచ్‌సీవీ యాంటీబాడీస్‌ను గుర్తించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో ఫలితం పాజిటివ్ అని వస్తే అప్పుడు మరో వైద్య పరీక్ష చేస్తారు. ఇందులో హెచ్‌సీవీ ఆర్ఎన్ఏ ను గుర్తించడానికి ఒక న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష చేస్తారు. ఇది పూర్తిస్థాయి నిర్ధారణ పరీక్ష. ఇది చేయాల్సిన అవసరం ఏమిటంటే... దాదాపు 15 శాతం నుంచి 45 శాతం మందిలో ఈ వ్యాధి సోకి దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి వారికి యాంటీ హెచ్‌సీవీ యాంటీబాడీస్ పరీక్ష చేస్తే అది పాజిటివ్ అని వస్తుంది. కాబట్టి అసలు వ్యాధి ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఆర్ఎన్ఏ ని గుర్తించే న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష అవసరం. ఇక రోగికి హెపటైటిస్-సి ఉన్నట్లు నిర్ధారణ అయితే అది కాలేయాన్ని ఏ మేరకు ప్రభావితం చేసింది (ఫైబ్రోసిస్ / సిర్రోసిస్) అన్న అంశాన్ని తెలుసుకునే పరీక్ష చేస్తారు. ఇందుకోసం కొందరిలో బయాప్సీ లేదా మరికొందరిలో ఇతర మార్గాలను అనుసరిస్తారు. దీనితో పాటు కొన్ని ల్యాబ్ పరీక్షలూ అవసరమే. ఎందుకంటే వైరల్లోడ్ ఎంత ఉందో తెలుసుకోవడంతో పాటు ఈ వైరస్‌లోనే ఆరు రకాల జీనోటైప్లు ఉంటాయి. ఒక జీనోటైప్ వైరస్‌కు ఇచ్చే చికిత్స మరో జీనోటైప్కు పనిచేయదు. కాబట్టి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే అది నిర్దిష్టంగా ఏ జీనోటైప్ అన్నది తెలుసుకోవడం చికిత్స కోసం చాలా అవసరం. దీని ఆధారంగానే చేయాల్సిన చికిత్సనూ, వ్యాధిని అదుపులో ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలనూ నిర్ణయిస్తారు. నివారణ: ఇప్పటివరకూ హెపటైటిస్-సి కి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి వ్యాపించే మార్గాలను తెలుసుకుని, వాటినుంచి దూరంగా ఉండటమే మంచి నివారణ చర్య. కొన్ని సమర్థమైన నివారణ చర్యలివే.... చేతులు శుభ్రంగా ఉంచుకోవడం; చికిత్సారంగంలో ఉన్నవారు సర్జికల్ గ్లౌజ్ వంటివి వాడటం, గ్లౌజ్ వేసుకునే ముందర చేతులు శుభ్రంగా కడుక్కుని తుడుచుకోవడం. చికిత్సరంగంలో ఉపయోగించిన వ్యర్థాలను సమర్థంగా పారేయడం (సేఫ్ డిస్పోజింగ్) అన్ని ఉపకరణాలను శుభ్రంగా ఉంచుకోవడం స్టెరిలైజ్ చేసుకోవడం వంటివి నివారణ చర్యల్లో కొన్ని. D- హెపటైటిస్ ఇది వర్తులాకరంలో ఉన్న చాలా చిన్న ఆర్ఎన్ఏ కలిగి ఉండే వైరస్. దీన్ని ఒక పూర్తిస్థాయి వైరస్‌గా కాకుండా ఒక ఉప-వైరస్‌లాగే పరిగణిస్తారు. ఎందుకంటే హెపటైటిస్-బి అండ లేకుండా ఇది స్వతంత్రంగా వ్యాప్తిచెందలేదు. కాబట్టి ఇది హెపటైటిస్-బితో పాటూ రావచ్చూ (కో-ఇన్ఫెక్షన్)... లేదా హెపటైటిస్-బి వచ్చాక ఆ తర్వాతా రావచ్చు (సూపర్ ఇన్ఫెక్షన్). అది కో-ఇన్ఫెక్షన్ అయినప్పటికీ లేదా సూపర్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ ఒకవేళ ఇది వస్తే మాత్రం కేవలం హెపటైటిస్-బి ఉన్నప్పటి కంటే కాలేయం పై తీవ్రత అధికంగా ఉంటుంది. అంటే లివర్ ఫెయిల్యూర్ చాలా వేగంగా జరగడం లేదా సిర్రోసిస్ కండిషన్/కాలేయ క్యాన్సర్ రావడం వంటివి చాలా త్వరితంగా రావడం జరగవచ్చు. కేవలం హెపటైటిస్-బి మాత్రమే ఉన్నవారితో పోలిస్తే దాంతోపాటు హెపటైటిస్-డి కూడా ఉన్నప్పుడు రోగి మరణాల రేటు ఎక్కువ. (దాదాపు 20 శాతం ఎక్కువ). వ్యాప్తి ఇలా: హెపటైటిస్-బి వ్యాపించే అన్ని మార్గాల్లోనూ ఇది కూడా వ్యాపిస్తుంది. కాబట్టి హెపటైటిస్-బి వ్యాప్తిని నిరోధించే మార్గాలే ఈవ్యాధి నివారణకూ తోడ్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా కోటీ యాభై లక్షల మందిలో ఇది హెపటైటిస్-బి వైరస్‌తో పాటూ ఉంది. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో దీని ఉనికి అంతగా లేనప్పటికీ, డ్రగ్స్ వాడే వారిలో మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంటుంది. చికిత్స / నివారణ: హెపటైటిస్-బి వ్యాక్సిన్ కూడా దీని బారి నుంచి రక్షణ కలిగిస్తుంది. ఎందుకంటే అది హెపటైటిస్-బి సోకితేనే వస్తుంది కాబట్టి ఈ తరహా రక్షణ లభిస్తుందన్నమాట. ఇక హైపటైటిస్-బి నివారణ కోసం అవలంబించాల్సిన అన్ని జాగ్రత్తలనూ దీని వ్యాప్తి నివారణకూ అవలంబించాలి. E- హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్ హెపటైటిస్-ఈ అనే వైరస్ వల్ల సోకుతుంది. ఇది కూడా కలుషితమైన నీరు, ఆహారం వల్ల వ్యాప్తి చెందుతుంది. చాలావరకు ఇది దానంతట అదే తగ్గిపోయే వ్యాధి. సాధారణంగా నాలుగు నుంచి ఆరువారాల్లో పూర్తిగా తగ్గుతుంది. అయితే చాలా అరుదుగా కొందరిలో లివర్ ఫెయిల్యూర్ పరిస్థితి ఏర్పడి అది మృత్యువుకు దారితీయవచ్చు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మంది కొత్తరోగులు దీని బారిన పడుతున్నారు. వ్యాప్తి ఇలా: సాధారణంగా మలంతో కలుషితమైన నీరు మంచినీటితో కలవడం వల్లనే ఇది వ్యాపిస్తుంది. కాబట్టి కలుషితమైన ఆహారం, నీటిని పూర్తిగా నివారించాలి. కేవలం సురక్షితమైన నీటినే తాగాలి/ఉపయోగించాలి. అలాగే రక్తమార్పిడి, రక్తంతో సంబంధం ఉన్న చర్యల వల్ల కూడా వ్యాప్తిచెందుతుంది. ఇక గర్భవతికి ఇన్ఫెక్షన్ ఉంటే తల్లి నుంచి బిడ్డకు సోకుతుంది. ప్రధానంగా ఇది కలుషితమైన నీటి వల్లనే వస్తుంది కాబట్టి సురక్షితం కాని నీళ్లు తాగడం, ఉడికించని ఆహారం పదార్థాలు తీసుకోవడం అంత మంచిది కాదు. లక్షణాలు: హెపటైటిస్‌కు ఉండే అన్ని సాధారణ లక్షణాలూ దీనిలోనూ ఉంటాయి. అంటే... కామెర్లు (చర్మం, కళ్లలోని తెలుపు భాగం పచ్చగా మారడం, మూత్రం పచ్చగా రావడం, మలం తెల్లగా ఉండటం) ఆకలి పూర్తిగా లేకపోవడం (అనొరెక్సియా), కాలేయవాపు (హెపటోమెగాలీ), పొత్తికడుపులో నొప్పి, పొత్తికడుపు భాగాన్ని ముట్టుకుంటే కూడా నొప్పి (టెండర్నెస్) వికారం/వాంతులు జ్వరం. ప్రభావం: హెపటైటిస్-ఈ వల్ల కలిగే లక్షణాలు సాధారణంగా వారం లేదా రెండు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ చాలా అరుదుగా ఫల్మినెంట్ హెపటైటిస్ (అంటే కాలేయం పూర్తిగా వైఫల్యం కావడం) వంటి కండిషన్ ఏర్పడి మరణానికి దారితీయవచ్చు. గర్భిణుల్లో ఈ వైరస్ ప్రభావం వల్ల కలిగే దుష్ఫలితాలు ఎక్కువ. సాధారణంగా ఈ వైరస్ సోకిన గర్భిణుల్లో 20 శాతం మంది మూడో త్రైమాసికంలో దీని వల్లనే మరణించిన దాఖలాలు ఉన్నాయి. చికిత్స: హెపటైటిస్-ఈ వ్యాధి చాలా వరకు దానంతట అదే తగ్గుతుంది. సమతుల ఆహారం ఇవ్వడం, లక్షణాలను బట్టి మందులు ఇవ్వడం (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్) మాత్రమే చేస్తారు. అయితే ఈ లక్షణాలు ఉన్న గర్భిణులను మాత్రం ఫల్మినెంట్ హెపటైటిస్ బారి నుంచి రక్షించడానికి ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తారు. ప్రస్తుతానికి హెపటైటిస్-ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ఆధారంగా చాలా త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
హెపటైటిస్, హెర్పిస్‌లకు మెరుగైన వైద్యచికిత్స
కొన్ని వైరస్లు శరీరంలో ప్రవేశించి నిద్రాణంగా ఉండిపోతాయి. ఆ సమయంలో లక్షణాలేవీ కనిపించడం లేదని నిర్లక్ష్యంగా ఉంటే అది ఒక్కోసారి ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. వాటిలో ముఖ్యమైనవి హెపటైటిస్ బి, సి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లు. ఈ వైరస్‌లకు హోమియోలో మెరుగైన చికిత్స ఉందని అంటున్నారు హోమియో వైద్యనిపుణులు డా. రవికిరణ్. హెపటైటిస్ అనగానే మామూలుగా హెపటైటిస్ బి గుర్తుకు వస్తుంది. కానీ హెపటైటిస్ సి,ఏ, ఇ అనే చాలా రకాలూ ఉన్నాయి. హెపటైటిస్‌తో కాలేయం పనితీరు మెల్లగా మందగించి ప్రాణాంతకంగామారుతుంది. కాలేయ కేన్సర్‌కూ దారి తీయవచ్చు. హెపటైటిస్ బి రాకుండా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ వ్యాధి వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారాన్ని చూపే చికిత్స ఇతర వైద్యవిధానాలలో లేదు. కానీ హోమియో వైద్యంలో అద్భుతమైన చికిత్స ఉంది. ఇవీ కారణాలు సురక్షితం కాని శృంగారంలో పాల్గొనడం. స్వలింగ సంపర్కం. అపరిచితుల నుంచి రక్తం స్వీకరించడం. కలుషితమైన సిరంజులను వాడటం. తల్లి నుంచి బిడ్డకు వైరస్ వ్యాప్తిచెందడం. ప్రధానంగా ఈ మూడు మార్గాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంటుంది. వ్యాధి లక్షణాలు ఇది పేషెంట్ తాలూకు రోగనిరోధక శక్తి మీద దాడి చేస్తుంది. ఆకలి లేకపోవడం, వికారం, ఒంటినొప్పులు, పసుపు రంగులో మూత్రం వంటి లక్షణాల తర్వాత మెల్లిగా పచ్చకామెర్లు మొదలవుతాయి. దీంతోపాటుగా చర్మంపైన దద్దుర్లు కనిపిస్తాయి. చాలామందిలో ఇవి తర్వాత కనుమరుగయిపోతాయి. కొన్ని కేసులలో కాలేయం పనిచేయటం ఆగిపోయి మరణం సంభవిస్తుంది. దీనినే ఫల్మినంట్ హెపటిక్ ఫెయిల్యూర్ అంటారు. కొన్ని సందర్భాల్లో హెపటైటిస్ బి వ్యాధి చాలా ఆలస్యంగా... అంటే కొన్నేళ్ల తర్వాత బయటపడవచ్చు. దీన్ని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్లేదా క్రానిక్ హెపటైటిస్ అంటారు. వీరిలో కామెర్ల వ్యాధి తగ్గకుండా అలాగే ఉంటుంది. వాంతులు, ఒళ్ళంతా దురదలు, విరేచనాలు, కడుపుబ్బరం, పొట్టలో నొప్పి, రక్తనాళాల వాపు, కిడ్నీ సమస్యలు, ప్లేట్లెట్స్ తగ్గడం, తలనొప్పి, రక్తహీనత, రక్తకణాల సంఖ్య పడిపోవడం జరుగుతుంది. లివర్ కేన్సర్‌కూ దారితీయవచ్చు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు హెపటైటిస్ బి, సి లను గుర్తించడానికిహెచ్బిఎస్ఎజి; సి గురించి హెచ్సివి యాంటీబాడీ ఎంజైమ్ ఇమ్యూనో అస్సే; హెపటైటిస్ బి, సి వైరల్ లోడ్ పీసీఆర్ టెస్ట్ వంటివి వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడతాయి. ఎల్ఎఫ్టీ, ఈఎస్సార్ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి. హోమియో చికిత్స హెపటైటిస్ బి, సి వైరస్లు కాలేయాన్నే తమ ఆవాసంగా చేసుకోడానికి కారణం... అవి వృద్ధి చెందే అవకాశం ఎక్కువ. దీన్నే రిప్లికేషన్ అంటారు. ఈ రిప్లికేషన్‌ను హోమియో మందుల ద్వారా అడ్డుకోవచ్చును. అంతేగాక రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి వైరస్‌ను పెరగకుండా చేయవచ్చు. లైకోపోడియం, హెపర్‌సల్ఫ్, మెర్క్‌సాల్, బ్రయోనియా, ఫాస్ఫరస్ వంటి మందులు వ్యాధిని సమర్థంగా తగ్గిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే... హెపటైటిస్ వైరస్ ఉన్నా లక్షణాలు కనిపించడం లేదని నిర్లక్ష్యం చేస్తే సిర్రోసిస్‌కు దారితీసి లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. లివర్ కేన్సర్‌కూ దారితీయవచ్చు. కొన్నిసార్లు కిడ్నీలు, స్ల్పీన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. హెర్పిస్ సింప్లెక్స్ ఒక గుండు సూది మొనమీద కోటి వైరస్లు ఇమిడిపోయేంత సూక్ష్మమెన ఈ వైరస్ రెండు రకాలుగా ఉంటుంది. హెచ్ఎస్వి 1: ఇది నోటి దగ్గర పొక్కుల రూపంలో బయటపడుతుంది. పెదవుల చుట్టూ తెల్లని నీటిపొక్కులలాగా వస్తాయి. ఇది తల్లిదండ్రులు, తోటి పిల్లల నుంచి వ్యాపిస్తుంది. తరచు వచ్చిపోతుంటుంది. హెచ్ఎస్వి 2: జననావయవాల దగ్గర బయటపడే దీన్ని జెనిటల్ హెర్పిస్ అని అంటారు. ఇది నిత్యం వేధించే లైంగిక సమస్య. హెర్పిస్ వైరస్ పురుషుల నుంచి స్త్రీలకు, స్త్రీల నుంచి పురుషులకు లైంగికంగా కలయిక సమయంలో వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ వెన్నెముక చివరిభాగం శాక్రమ్ చుట్టూ ఉండే నాడుల సముదాయంలో చేరి అక్కడ నిద్రావస్థలో ఉండిపోతుంది. ఈ నిద్రాణస్థితిలో ఎలాంటి లక్షణాలు చూపించకుండా అవసరమైనపుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. గుర్తుపట్టడం ఎలా? తొలిదశలో జననాంగాల్లో మంట, నొప్పి, మూత్రంలో దురద, జ్వరం వచ్చినట్లుగా ఉంటుంది. ఒళ్లునొప్పులు, గజ్జలలో, చంకలలో గడ్డలు కట్టినట్లుగా ఉంటుంది. తరువాత క్రమంగా జననాంగాల వద్ద చిన్న చిన్న నీటిపొక్కులు కనిపించి, రెండు మూడు రోజులలో పగిలి పుండ్లలాగా తయారవుతాయి. ఈ దశలోనే రోగికి సమస్య వచ్చినట్లు తెలుస్తుంది. తొలిసారి లక్షణాలు కనిపించినపుడు సరియైన చికిత్స తీసుకుంటే ప్రారంభదశలోనే తగ్గిపోతుంది. కానీ చాలామందిలో వైరస్ ఉండిపోవడం వల్ల నిదానంగా ఉంటూ తిరిగి బయటపడుతూ ఉంటుంది. దీన్ని హెర్పిస్ రికరెంట్ అటాక్ అని అంటారు. నిర్ధారణ ఎలా? అపరిచిత వ్యక్తులతో లైంగిక సంపర్కం తరువాత వారం రోజులలో నీటి పొక్కులలా పుండ్లు కనిపిస్తాయి. కొన్నిరోజుల తరువాత మానిపోయి తిరిగి వస్తుంటాయి. దీన్ని బట్టి హెర్పిస్ని గుర్తించవచ్చు. పీసీఆర్ టెస్ట్, హెచ్ఎస్వి. 1, 2 ఐజీజీ, ఐజీఎమ్ పరీక్షలు ఉపయోగపడతాయి. పుండ్ల దగ్గర ఉండే స్రావాలను సేకరించి చేసే కల్చర్ టెస్ట్, డీఎన్ఏ టెస్ట్, యూరిన్ టెస్ట్ మొదలైనవి వ్యాధి నిర్ధారణకు ఉపకరిస్తాయి. కాంప్లికేషన్స్ హెర్పిస్ ఎక్కువగా స్త్రీలను బాధిస్తుంది. గర్భిణుల్లో మొదటినెలలో హెర్పిస్ వస్తే గర్భస్రావానికి అవకాశాలు ఎక్కువ. ప్రసవ సమయంలో హెర్పిస్ ఉంటే పిల్లలకు వచ్చే ప్రమాదం ఉంది. దీనిని నియోనాటల్ హెర్పిస్ అంటారు. శరీరంలో హెర్పిస్ ఉంటే చర్మం మీద దద్దుర్లు. అలర్జీలాంటి సమస్యలు; వెన్నెముకలోని నాడీమండలానికి హెర్పిస్ వస్తే అంగస్తంభన సమస్యలు; కొందరిలో నాడీమండలానికి హెర్పిస్ వస్తే మెదడులో మెనింజైటిస్ రావచ్చు. హోమియో చికిత్స హెర్పిస్ సింప్లెక్స్ వంటి లైంగిక వ్యాధుల నివారణకు హోమియో చికిత్స అద్భుతంగా పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా రోగనివారణకు అవకాశం ఏర్పడుతుంది. హెర్పిస్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించినపుడు శృంగారానికి దూరంగా ఉండాలి. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. హెర్పిస్ ఉన్నవారు కండోమ్ ఉపయోగిస్తే మంచిది. అనుభజ్ఞులైన హోమియో వైద్యుని దగ్గర చికిత్స తీసుకుంటే హెర్పిస్ వ్యాధిని సమూలంగా తరిమేయవచ్చు. డాక్టర్ రవికిరణ్, ఎం.డి. ప్రముఖ హోమియో వైద్యనిపుణులు మాస్టర్స్ హోమియోపతి, అమీర్‌పేట, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, హైదరాబాద్, విజయవాడ ph: 7842 108 108 / 7569 108 108