గ్యాస్ట్రో కౌన్సెలింగ్ | Gastro counseling | Sakshi
Sakshi News home page

గ్యాస్ట్రో కౌన్సెలింగ్

Published Tue, May 26 2015 11:41 PM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

Gastro counseling

నాకు ఎనిమిది నెలల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో జరిగిన రక్తపరీక్షలో హెపటైటిస్-బి పాజిటివ్ అని చెప్పారు. ఆర్నెల్ల తర్వాత మళ్లీ టెస్ట్ చేస్తే మళ్లీ హెపటైటిస్-బి పాజిటివ్ అని అన్నారు. ఈ వ్యాధికి చికిత్స ఉందా లేదా?
 - లక్ష్మయ్య, వరంగల్

మీకు ఆర్నెల్ల తర్వాత కూడా హెపటైటిస్-బి పాటిజివ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు క్రానిక్ హెపటైటిస్-బి అనే వ్యాధి ఉన్నట్లు చెప్పవచ్చు. ఈ వ్యాధి ఉన్నవారు మొదట కొన్ని రక్తపరీక్షలు చేయించుకొని (ఉదా: హెచ్‌బీఈఏజీ, యాంటీ హెచ్‌బీఈఏజీ, ఎల్‌ఎఫ్‌టీ, హెచ్‌బీవీ డీఎన్‌ఏ అనే పరీక్షలు) వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకోవాలి. వ్యాధి చాలా మందిలో సుషుప్తావస్తలో (ఇనాక్టివ్‌గా) ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి చురుకైన (యాక్టివ్) దశలోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాధి సుషుప్తావస్థలో ఉన్నవారికి ఏ మందులూ అవసరం లేదు. కానీ మీరు చేయాల్సిందల్లా ప్రతి 3 నుంచి 6 నెలలకోసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి ఎల్‌ఎఫ్‌టీ పరీక్ష చేయించుకుంటూ వ్యాధి చురుకైన దశలోకి ఏమైనా వచ్చిందా అని చూసుకోవాలి. యాక్టివ్ దశలోకి వెళ్తే దానికి వివిధ రకాల మందులు వాడాల్సి ఉంటుంది. ఏ మందు వాడాలో డాక్టర్‌గారే నిర్ధారణ చేస్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement