Blood Test
-
ముట్టుకున్నా నొప్పి?!
నాకు డెలివరీ అయ్యి సంవత్సరం అవుతోంది. నార్మల్ డెలివరీనే! కానీ ఇప్పటికీ ఎక్స్టర్నల్ వెజైనా ఏరియాలో చాలా నొప్పిగా ఉంటోంది. ముట్టుకున్నా నొప్పి అనిపిస్తుంది. ఏ మందులు వాడినా, ఇన్ఫెక్షన్కి మందులు వాడినా ఏమీ తగ్గలేదు. నాకు సలహా ఇవ్వండి.విశాల, నాచారంమీరు చెప్పే నొప్పిని వల్వల్ పెయిన్ అంటారు. ఏ ఇన్ఫెక్షన్ లేనప్పుడు, ఏ కారణం తెలియనప్పుడు దీనిని డయాగ్నైజ్ చేస్తారు. కొన్నిసార్లు ప్రసవం జరిగే సమయంలో గాయపడినా, భయానికీ ఒత్తిడికీ గురైనా ఈ నొప్పి మొదలవుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా వస్తుంది. ఈ నొప్పికి గైనకాలజిస్ట్‌ని కలవాలి. ఇంటర్నల్‌గా చెక్ చేసి వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూస్తారు. అవసరమైతే వెజైనల్ స్వాబ్ చేస్తారు. లిడోకేయిన్ 2% లోకల్ అప్లికేషన్ జెల్లీ వాడమని చెబుతారు. ఈ ఆయింట్మెంట్ని వెజైనా, వల్వా భాగంలో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి. ఇది బాగా పని చేస్తుంది. ఈ ఆయింట్మెంట్ని ప్రతిరోజూ 3–4 సార్లు అప్లై చేసుకుంటూ, మీరు రోజువారీ పనులు చేసుకోవచ్చు. నడుము కండరాలు బలం పుంజుకోవడానికి ఎక్సర్సైజ్ కూడా చెయ్యాలి. ఈ క్రీమ్‌కి అలర్జీ చాలా అరుదుగా రావచ్చు. చాలా మందికి ఈ క్రీమ్‌తో నొప్పి తగ్గుతుంది. వెజైనల్ వాషెస్, స్ట్రాంగ్ సోప్స్, ఫెర్ఫ్యూమ్లు వాడకూడదు. కొంతమందికి సెన్సిటివిటీ తగ్గడానికి ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. నొప్పి ఎక్కువకాలం కొనసాగుతుంటే, ఫిజియోథెరపిస్ట్ ద్వారా నడుము కండరాల బలానికి ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు.నాకు మొదటి నుంచీ రక్తంలో ఐరన్ శాతం తక్కువ అని చెప్పారు. ఇప్పుడు 3వ నెల. వయసు 22 సంవత్సరాలు. రక్త పరీక్ష చేయించినప్పుడు ఐరన్ శాతం మాత్రమే ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?– సృజన, శంకరపల్లిఐరన్ తక్కువ ఉన్న వాళ్లకి నీరసం, అలసట ఎక్కువ ఉంటాయి. హీమోగ్లోబిన్ 10 శాతం కన్నా తక్కువ ఉంటే రక్తహీనత అంటారు. గర్భధారణ సమయంలో రక్తంలో ఐరన్ శాతం బాగా ఉన్నప్పుడే రక్తకణాలు బాగా ఉంటాయి. ఈ రక్తకణాలు ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని అవయవాలకు పంపిస్తాయి. మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ శాతం పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహార పదార్థాలు అంటే చికెన్, మటన్, చేప, పౌల్ట్రీలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. లివర్, లివర్ ఉత్పత్తుల్లో ఐరన్ శాతం ఎక్కువ ఉన్నా గర్భధారణ సమయంలో తీసుకోకూడదు. వాటిలోని విటమిన్–ఎ పెరిగే బిడ్డకి ప్రమాదం. శాకాహార పదార్థాలు చాలావాటిలో ఐరన్ శాతం ఎక్కువగానే ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, రాజ్మా, బఠాణీ వంటి గింజలు, బ్రొకొలీ, సోయా ఉత్పత్తులు, పనీర్‌లలో ఐరన్శాతం ఎక్కువ ఉంటుంది. ఐరన్ శాతం పెరగాలంటే విటమిన్–సి కూడా అవసరం. అందుకే ఐరన్ ఎక్కువ ఉండే ఆహర పదార్థాలతో పాటు విటమిన్–సి కూడా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్– నారింజ, కివీ, నిమ్మ వంటివి తీసుకోవాలి. టీ, కాఫీలు తాగకూడదు. భోజనంతో పాటు అస్సలు తీసుకోకూడదు. గర్భిణీలకు 3, 7, 9 నెలల్లో తప్పనిసరిగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే రక్తపరీక్ష చేస్తారు. దీనిలో మీ ఐరన్ శాతం తెలుస్తుంది. డైట్‌తో పాటు కొంతమందికి ఐరన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వవలసి వస్తుంది. కొంతమందికి రక్తహీనతతో పాటు విటమిన్– బి12 కూడా తక్కువ ఉండొచ్చు. అలాంటి వారికి అదనంగా సప్లిమెంట్స్ ఇవ్వాలి. డైట్, మందులతో ఐరన్ పెరగనప్పుడు హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్, ఐరన్ స్టడీస్ అనే అడ్వాన్స్డ్ టెస్ట్ చేసి సమస్య ఎక్కడ ఉందో కనిపెట్టి, ఫిజీషియన్ సూచన మేరకు ట్రీట్మెంట్ చేస్తారు. -
ఒక్క నెత్తుటి చుక్కతో.. అరవైకి పైగా పరీక్షలు!
రక్తంలో చక్కెర ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే, వేలిమొనపై సూదితో గుచ్చుతారు. అప్పుడు వచ్చే నెత్తుటి చుక్కను గ్లూకోమీటర్ మీద పెట్టి పరీక్షిస్తారు. గ్లూకోమీటర్ ద్వారా నెత్తుటి చుక్కను పరీక్షిస్తే, కేవలం రక్తంలో చక్కెర స్థాయి మాత్రమే తెలుస్తుంది. దానివల్ల శరీరంలోని ఇతరేతర లోపాలేవీ బయటపడవు. అయితే, ఒకే నెత్తుటి చుక్కతో అరవైకి పైగా అంశాలను తెలుసుకునే పరీక్షను లండన్ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు.వేలిమొన నుంచి సేకరించిన ఒకే ఒక్క నెత్తుటి చుక్కతో శరీరంలోని అరవైకి పైగా లోపాలను తెలుసుకోగల పరీక్షను లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్లాడియా లాంజెన్బర్గ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరీక్ష ద్వారా పందొమ్మిది రకాల క్యాన్సర్, నరాలకు సంబంధించిన మోటార్ న్యూరాన్ డిసీజ్, గుండెజబ్బులు సహా అరవైఏడు రకాల వ్యాధులను ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది. బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 40 వేల మంది రోగులపై ఈ పరీక్ష నిర్వహించి శాస్త్రవేత్తలు విజయవంతమైన ఫలితాలను సాధించారు. ఈ వివరాలను ‘నేచర్ మెడిసిన్’ తాజా సంచికలో ప్రచురించారు. -
కదలండి బాస్!
నగరంతో పాటు దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన తాజా సమాచారం ప్రకారం.. గత 2022లో ప్రతీ ఇద్దరు వయోజనులలో ఒకరు ఆరోగ్యానికి అవసరమైన కనీసపు శారీరక శ్రమ స్థాయిని కూడా అందుకోలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా, శారీరక శ్రమ లేని పెద్దల శాతం 31% కాగా మన దేశంలో మాత్రం ఇది 49.4% గా ఉంది. మగవాళ్లతో పోలిస్తే మహిళల్లో 57 శాతం మంది కనీసపు శారీరక శ్రమకు సైతం దూరంగా ఉన్నారని అధ్యయనం తేల్చింది. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి 59.9%కి చేరుతుందని రోగాల నిలయంగా మారుస్తుందని హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫిజికల్ యాక్టివిటీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిశ్చల జీవనశైలి కారణంగా పలు రకాల వ్యాధులకు చిరునామాగా నగరం మారబోతోందని గతంలోనే జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. నగరంలో 53.6 శాతం మంది శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని ఉస్మానియా ఆసుపత్రి, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనం అప్పట్లో ఇండియన్ జర్నల్ ఆఫ్ బేసిక్ అండ్ అప్లైడ్ మెడికల్ రిసెర్చ్‌లో ప్రచురితమైంది. అదే విధంగా అబ్డామినల్ ఒబెసిటీ (పొత్తికడుపు పైన కొవ్వు పేరుకుపోవడం) అనేది మన నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతోందని గత ఏడాది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. 15–49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలు, పురుషుల్లో ఈ పరిస్థితికి కారణం నిశ్చల జీవన శైలేనని స్పష్టం చేసింది.శ్రమనోచని శరీరం.. వ్యాధుల కుటీరంఏదైనా సరే శారీరక కదలికను శారీరక శ్రమగా పరిగణిస్తారు. శరీరాన్ని కాకుండా మెదడుకు అధికంగా కలి్పంచే పని ఒత్తిడితో నగర జనజీవనం ఒక్కసారిగా మారిపోయింది. ఆఫీసుల్లో గంటల తరబడి పని, ఇంటికి ఆఫీసులకు మధ్య ప్రయాణం, వారాంతపు విరామంలో విశ్రాంతి.. ఇది శారీరక శ్రమ తగ్గిపోవడానికి పోషకాహార లోపాలకు దారితీసింది. శారీరక శ్రమ లోపం.. ప్రపంచ ఆరోగ్యానికి నిశ్శబ్ద ముప్పు, ఇది దీర్ఘకాలిక వ్యాధుల భారానికి గణనీయంగా దోహదం చేస్తుంది. అని డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ప్రమోషన్ డైరెక్టర్ డాక్టర్ రూడిగర్ క్రెచ్ అన్నారు. గుండెపోటు స్ట్రోక్‌లతో సహా çహృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని ఇది పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి కాక మధుమేహం, చిత్తవైకల్యం, రొమ్ము పెద్దపేగు క్యాన్సర్లు ముప్పు వీటన్నింటికీ దారి తీస్తుందంటున్నారు.అనారోగ్యాలతో ఆస్పత్రుల చుట్టూ..దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు రక్త పరీక్షలు పోషకాహార మార్గదర్శకాల కోసం ప్రతిరోజూ దాదాపు 5–10 మంది నగర ఆస్పత్రులకు వస్తున్నారు. ఈ ధోరణి పేలవమైన ఆహారపు అలవాట్లు అధిక ఒత్తిడి స్థాయిల కలయిక కారణమని, వీటన్నింటికీ మూలం నిశ్చల జీవనశైలి అని చెబుతున్నారు. జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకం, ఉబ్బరం ఆమ్లత్వంతో సహా రోగులలో జీర్ణాశయ సమస్యలు సర్వసాధారణంగా మారా యని చెప్పారు. అలాగే.. అధిక ట్రైగ్లిజరైడ్స్, అధిక రక్తపోటు, డైస్లిపిడెమియా అధిక బరువుతో కూడిన మెటబాలిక్ సిండ్రోమ్ కేసులలోనూ పెరుగుదల కనిపిస్తోంది. ఈ పరిస్థితులకు అనారోగ్య జీవనశైలి, ఒత్తిడి క్రమరహిత నిద్ర విధానాలు కారణమని పేర్కొన్నారు. సరైన పోషకాహారం, వ్యాయామం ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులను అవలంబించడం ద్వారా మాత్రమే ఈ సమస్యలను ఎదుర్కోవచ్చునని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.వర్కవుట్.. వ్యాధులు అవుట్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కథనం ప్రకారం.. వారానికి 150 నిమిషాల మితమైన–తీవ్రతతో కూడిన శారీరక శ్రమ లేదా 75 నిమిషాల తీవ్రమైన–తీవ్రతతో కూడిన శారీరక వ్యాయామంలో పెద్దలు పాల్గొనాలి. నడక, సైక్లింగ్, ఆటలు మాత్రమే కాదు శారీరక శ్రమతో కూడిన ఇంటి పనులు చేయడం కూడా శారీరకంగా చురుగ్గా ఉండటానికి వీలు కల్పిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. సాధారణ శారీరక శ్రమ మధుమేహం ప్రమాదాన్ని 17%, గుండె జబ్బులు, పక్షవాతం 19%, డిప్రెషన్, చిత్తవైకల్యం 28–32% అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాలను 8–28% తగ్గిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల్లో చురుకుదనం అవసరమైనంత పెరిగితే , ఏటా 4–5 మిలియన్ల మరణాలను నివారించవచ్చని అంచనా. కదలికల లోపానికి కారణాలెన్నో.. కోవిడ్ తర్వాత ఒక విధానంగా మారిపోయిన వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో వండిన భోజనం కంటే ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఇష్టపడటానికి ఫుడ్ డెలివరీ సేవల సౌలభ్యం దారితీసింది దాంతో విపరీతంగా పెరిగిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవల వినియోగం, పెరిగిన రెడీ–టు–ఈట్ మీల్స్‌కు ప్రాధాన్యం వంటివి నిశ్చల జీవనశైలి పెరగడానికి కారణమని నగర వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పులు సిటీజనుల ఆహారపు అలవాట్లను తద్వారా ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేశాయని నగరానికి చెందిన పోషకాహార నిపుణురాలు రుచికా చెప్పారు. ఇటీవల రకరకాల ఆరోగ్య సమస్యలు, శారీరక చురుకుదనం లోపించిన కారణంగా నిపుణులను సంప్రదించే వారిలో యువకుల సంఖ్య గణనీయంగా ఉండడం గమనార్హం అంటున్నారామె. 100 కిలోలకు దగ్గరగా ఉన్న 17–19 సంవత్సరాల నగర యువతకు ట్రీట్ చేశానని తెలిపారు. ఈ భయంకరపరిస్థితికి తీవ్రమైన నిశ్చల జీవనశైలి కారణమని స్పష్టం చేశారు. వీరిలో కొందరు ప్రీ–డయాబెటిస్ పరిస్థితిలో ఉన్నారని చెప్పారు.కనీస నడక లేకుంటే కష్టాలే.. ప్రస్తుతం నగరవాసుల్లో చాలా మందికి కనీసపు శారీరక శ్రమ ఉండడం లేదు. వృద్ధాప్యంలో రావాల్సిన రోగాలు యుక్త వయసులోనే వచ్చేస్తున్నాయి. మేం ప్రిస్క్రిప్షన్‌లో మందులు మాత్రమే కాదు వాకింగ్, వ్యాయామాల గురించి కూడా చెబుతున్నాం. ఓ వ్యక్తి రోజుకు కనీసం 5వేల నుంచి 6వేల అడుగులు నడవాలి. యుక్త వయసు్కలు 2వేల అడుగులు కూడా నడవడం లేదు. మరి రోగాలు రాకుండా ఎలా ఆపగలం? ముఖ్యంగా హృద్రోగాలు, హార్ట్ ఎటాక్స్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోవడానికి కదలిక లేని జీవనశైలే కారణం. ముందుగా 15 నుంచి 20 నిమిషాల నడకతో ప్రారంభించి ఏదైనా ఆసక్తి ఉన్న ఆటలు ఆడడం.. ఇలా శారీరక కదలికల్ని రోజువారీ జీవితంలో భాగం చేయాల్సిందే దీనికి ప్రత్యామ్నాయం లేదని అందరూ గుర్తించాలి. – డా.కిరణ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇనిస్టిట్యూట్ -
గుర్తిద్దాం... నివారిద్దాం
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ మహమ్మారికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా చికిత్స అందించడం కన్నా నివారణ మార్గాలే అత్యంత ప్రామాణికమని కాంటినెంటల్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఒకే రక్త పరీక్షతో కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించేలా కాంటినెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నూతనంగా ‘కేన్సర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్’విభాగాన్ని ఏర్పాటు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ స్పెషలిస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ ప్రోగ్రామ్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరోల్ సికోరా ఈ విభాగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రఖ్యాత కేన్సర్ సెంటర్ ఎండీ అండర్సన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్లో 40 ఏళ్ల పాటు పనిచేసి, ఆ అనుభవాన్నంతా దేశంలోనే సేవలందించాలనే లక్ష్యంతో కాంటినెంటల్ ఆసుపత్రిని స్థాపించానని తెలిపారు. ఇప్పటికే 40 వేల మందిని పైగా కేన్సర్ కోరల నుంచి బయటికి తీసుకొచ్చిన తమ కేన్సర్ కేర్ టీమ్... రాబోయే రోజుల్లో ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మరింత ఎక్కువ మందిని కేన్సర్ బారి నుంచి కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. లిక్విడ్ బయాప్సీ టెస్ట్‌తో కేన్సర్ గుర్తింపు ముంబయిలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ వంటి సంస్థల్లో కేన్సర్ విభాగంలో 40 ఏళ్లపాటు సేవలందించిన డాక్టర్ జగన్నాథ్ నిర్వహణలో కేన్స ర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్ విభాగం కొనసాగుతుందని గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగమైన లిక్వి డ్ బయాప్సీ టెస్ట్‌తో ముందుగా కేన్సర్‌ను గుర్తించే సామర్థ్యాన్ని అందిస్తుందన్నారు. ఈ మూడు టెస్ట్‌లతో... ఆస్పత్రిలో మూడు రకాల జన్యు పరీక్షలను ప్రారంభించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు మొదటగా కేన్సర్ ప్రిడిస్పోజిషన్ టెస్ట్... జన్యు అమరిక, వాటిలోని తేడాలను అర్థం చేసుకుని, భవిష్యత్‌లో ఏ రకమైన కేన్సర్ వ్యాధి బారిన పడతామో ముందుగానే గుర్తిస్తుందన్నారు. రెండోది కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్.. వంశపారంపర్యంగా వచ్చే కేన్సర్లను గుర్తించడానికి ఈ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ జెనెటిక్ మేకప్‌ను సమగ్రంగా పరిశీలిస్తుందన్నారు. యూఎస్ఏలోని నేషనల్ కాంప్రహెన్సివ్ కేన్సర్ పేర్కొన్న విధంగా... రొమ్ము కేన్సర్, ఓవరిన్ కేన్సర్, పాంక్రియాటిక్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలొరెక్టల్ కేన్సర్ వంటి ఐదు కేన్సర్లకు కారణం అయ్యే వంశపారంపర్యంగా వచ్చే జన్యువులను ఈ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చన్నారు. మూడోది నెక్స్ట్ – జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్) ఆధారిత సీఎఫ్డీఎన్ఏ పరీక్ష. దీని ద్వారా రక్త ప్రవాహంలో తిరుగుతున్న సెల్ ఫ్రీ డీఎన్ఏను విశ్లేషించి కేన్స ర్ను చాలా ముందుగా గుర్తించవచ్చన్నారు. ఇలా 3 దశల్లో జన్యువులోని కేన్సర్ బారినపడ్డ, పడబోతున్న ప్రాంతాలను ఈ రక్త పరీక్ష ద్వారా చాలా కచ్చితత్వంతో తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమగ్ర విశ్లేషణతో కేన్స ర్ చికిత్స మరింత సులభతరం అవుతుందన్నారు. అపోహలను తొలగించాలి: కరోల్ సికోరా ప్రొఫెసర్ కరోల్ సికోరా మాట్లాడుతూ... కేన్సర్ నివారించడం సాధ్యమేనా అనుకునే అపోహలను ప్రయత్నమనే ఒక్క అడుగుతో తొలగించవచ్చన్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రయత్నాన్ని మొదలుపెట్టిన కాంటినెంటల్ ఆసుపత్రికి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంటినెంటల్ కేన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జగన్నాధ్, డాక్టర్ రవీంద్రనాథన్, డాక్టర్ ఏవీ సురేష్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. అవగాహనతో భయాందోళనలు తొలగింపు.. కేన్సర్‌ను ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయని అందుకే వీటిపై అవగాహన కల్పించడానికి కాంటినెంటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు. ఆస్పత్రి వైద్యుల నేతృత్వంలో ఫిబ్రవరి నెలలో వందలాది మందికి అవగాహన కల్పించామని చెప్పారు. ఆడవారిలో వచ్చే కేన్సర్లు, లక్షణాలు, జాగ్రత్తలపైన, గ్యాస్ట్రో ఇంటస్టైన్, లివర్ కేన్సర్లపైన ఊపిరితిత్తులు, తల, మెడ కేన్సర్లు, గ్లాడర్, కిడ్నీ, ప్రొస్టేట్, చర్మ కేన్సర్ల పైన అవగాహన కల్పి ంచామన్నారు. మంచి చికిత్సను అందించడమే కాకుండా కేన్సర్ రాకుండా అవగాహన కల్పించడం బాధ్యతగా అలవర్చుకున్నామన్నారు. ఇన్సూరెన్స్ సంస్థలు వారి సేవల్లో కేన్సర్ బాధితులను చేర్చాల్సిన అవసరముందని, 70 శాతం మంది బాధితులు ఆర్థిక సమస్యలతోనే మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
మెడాల్ అక్రమాలకు బీజం అనంతలోనే
తెలుగుదేశం పాలనలో జరిగిన భారీ కుంభకోణానికి అనంతపురం జిల్లాలోనే బీజం పడింది. 2015–19 మధ్య కాలంలో ప్రభుత్వాస్పత్రుల్లో రక్తపరీక్షల నిర్వహణను చంద్రబాబు సర్కారు ఔట్ సోర్సింగ్ కింద ‘మెడాల్’ సంస్థకు కట్టబెట్టింది. పైలట్ ప్రాజెక్ట్ కింద అనంతపురంలో ‘బ్రహ్మాండం’గా రక్తపరీక్షలు నిర్వహించారంటూ నివేదిక ఇప్పించి ఆగమేఘాల మీద ఆ సంస్థకే రాష్ట్ర వ్యాప్తంగా రక్తపరీక్షల నిర్వహణను కట్టబెట్టింది. మెడాల్ సంస్థ డాక్టర్లతో కుమ్మక్కై అవసరం ఉన్నా లేకున్నా రక్త పరీక్షలు రాయించి దాదాపు రూ.300 కోట్లు లూటీ చేసింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు వైద్య సేవల ముసుగులో భారీ దోపిడీ జరిగింది. రోగులకు ఉచితంగా చేసే రక్త పరీక్షల నిర్వహణను ఔట్సోర్సింగ్ ద్వారా ప్రైవేట్‌కు కట్టబెట్టడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగమైంది. రక్త పరీక్షల సేవల ఫ్రాంచైజీలు దక్కించుకున్న టీడీపీ నేతలు సైతం అందినంత దోచుకున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో రక్తపరీక్షల నిర్వహణను టీడీపీ ప్రభుత్వం 2015లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థకు ఇవ్వాలనుకుంది. ఇందు కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద అనంతపురాన్ని ఎంపిక చేసింది. ఈ మేరకు జీఓ 17 జారీ చేసింది. తొలుత జిల్లాలో ఆరు నెలల పాటు రక్తపరీక్షలు నిర్వహించి, విజయవంతమైతే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనేది జీఓ సారాంశం. ఆ మేరకు ఆ ఏడాది జూన్‌లో పైలట్ ప్రాజెక్టు మొదలైంది. సెప్టెంబర్ 4న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాధినిర్ధారణ పరీక్షలు ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం సెపె్టంబర్ 28న జీఓ 606 ఇచ్చారు. కుంభకోణం.. అలా మొదలైంది.. అనంతపురంలో మొదలైన పైలట్ ప్రాజెక్టు మూణ్నెల్లు కూడా పూర్తి కాకముందే.. అంతా బ్రహా్మండంగా జరిగిందని నివేదిక ఇచ్చారు. కమిటీ నివేదికకు ఆరు మాసాలు గడువు ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ తుంగలో తొక్కారు. ఓవైపు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఆస్పత్రుల్లోనే సొంతంగా నిర్ధారణ పరీక్షలు చేసి ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసుకుంటుండగా, ఏపీలో మాత్రం ప్రైవేటుకు అప్పజెప్పి భారీ స్కామ్‌కు తెరలేపారు. ఒక్కో టెస్టుకు రూ.234 అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 2016 జనవరి నుంచి ఔట్‌సోర్సింగ్‌కు రక్తపరీక్షల నిర్వహణ అప్పగించారు. ఇందులో 32 రకాల టెస్టులుంటాయి. ఒక టెస్టు చేసినా, అన్ని రకాల టెస్టులు చేసినా ఒక్క నమూనాకు రూ.234 ప్రకారం ప్రభుత్వం ‘మెడాల్’ సంస్థకు ఇవ్వాలి. దీంతో ‘మెడాల్’ పంట పండించుకుంది. కేవలం హిమోగ్లోబిన్, యూరిన్ పరీక్షలే లక్షల సంఖ్యలో చేసేవారు. దీనికి ఒక్కో పరీక్షకు బల్్కలో నాలుగు రూపాయలే అవుతుంది. ఇలా లక్షల టెస్టులు చేస్తే ఎంతవుతుందో అంచనా వేయొచ్చు. నేడు తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి.. ఒకప్పుడు ఒక్కో పీహెచ్సీలో రక్తపరీక్షల కోసం ప్రైవేటు కంపెనీకి సగటున నెలకు రూ.6 లక్షలు వ్యయం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రక్తపరీక్షలకు అవసరమయ్యే అన్ని రకాల పరికరాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లోనే ఇప్పుడు మెడాల్ చేసిన వాటికంటే ఎక్కువ రక్త పరీక్షలు చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో ల్యాబ్ టెక్నీíÙయన్లను నియమించింది. ప్రతినెలా పీహెచ్సీలో మెరుగైన వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ ఉచిత రక్తపరీక్షలు, సొంత ల్యా»ొరేటరీలు ఏర్పాటయ్యాయి. ప్రజారోగ్య వ్యవస్థ ఇప్పుడు ఏపీలో కేరళ, తమిళనాడులకు దీటుగా ఉందన్నది నీతి ఆయోగ్ లాంటి సంస్థలే చెబుతున్నాయి. అప్పుడంతా అవినీతే ► ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల డాక్టర్లతో కుమ్మక్కయిన మెడాల్ ప్రతినిధులు యూరిన్, హిమోగ్లోబిన్, లేదా షుగర్ టెస్టులు వేల సంఖ్యలో రాయించుకునేవారు. ► ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఫ్రాంచైజీల పేరిట ప్రైవేటు ల్యాబ్‌లు అప్పగించారు. ► కొన్ని ఆస్పత్రుల్లో గర్భిణుల రక్తనమూనాలు సేకరించి టెస్టు చేయకుండానే ఫలితాలు ఇచ్చేవారు. ► రాష్ట్రంలో ఏటా 5వేలకు మించి మలేరియా కేసులు నమోదయ్యేవి కావు. అలాంటిది డబ్బు కోసం 2018లో 50 వేల మలేరియా కేసులకు టెస్టులు చేసినట్టు డ్యాష్‌బోర్డులో పొందుపరిచారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ దినపత్రిలో పతాక శీర్షికతో రాయగా డ్యాష్‌బోర్డులో ఉన్న మలేరియా టెస్టులు తొలగించి 6వేలకు కుదించారు. ► ఔట్‌సోర్సింగ్‌కు రక్తపరీక్షలు నిర్వహిస్తున్నామన్న సాకుతో ఒక్క పీహెచ్సీలో గానీ, సీహెచ్‌సీలో గానీ ల్యాబ్ టెక్నీషియన్లను నియమించలేదు. ► మెడాల్ సంస్థ అప్పట్లో తెలుగుదేశం నేతలకు ఫ్రాంచైజీలు ఇచ్చినందుకు భారీగా ముడుపులు అందినట్టు తేలింది. -
ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ ఇదే.. వారిలో రిస్క్ తక్కువ
మానన శరీరంలో అన్నింటికన్నా ముఖ్యమైనది రక్తం. ఊపిరితిత్తులోని గాలి నుంచి ఆక్సిజన్‌ను సేకరించి.. శరీరంలోని అన్ని కణాలకు అందించడమే రక్తం ప్రధాన కర్తవ్యం. అంతేకాదు శరీరంలో ఉత్పత్తైన కార్భన్ డయాక్సైడ్ను కూడా కణాల నుంచి తొలగిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఐదు లీటర్ల రక్తం అవసరం. సాధారణంగా మనుషుల్లో అనేక రకాల రక్త సమూహాలు (Human Blood Groups) కనిపిస్తాయి. A, B, AB, O పాజిటివ్.. అలాగే నెగెటివ్ గ్రూప్స్ ఉంటాయన్నది తెలిసిందే. వీటిలో రేర్ బ్లడ్ గ్రూప్ ఏది? ప్రపంచంలో ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లు ఎంతెంత మంది ఉన్నారన్నది ఇప్పుడు చూద్దాం. మామూలు బ్లడ్ గ్రూపులలోని ఎర్ర రక్త కణాల్లో షుగర్ మాలిక్యుల్స్ ఉంటాయి. ఆ మాలిక్యుల్స్ని బట్టి బ్లడ్ గ్రూపులను నిర్ణయిస్తారు. A- యాంటిజన్ ఉంటే A గ్రూపు, B-యాంటిజన్ ఉంటే B గ్రూపు, రెండూ ఉంటే AB గ్రూపు, అవేవీ లేకపోతే O గ్రూపుగా పరిగణిస్తారు. అలాగే ఎర్ర రక్త కణాలపై RH ప్యాక్టర్ ఉంటే పాజిటివ్‌గా లేకపోతే నెగిటివ్‌గా భావిస్తారు. Group A –ఇందులో యాంటిజన్ A, యాంటిబాడీస్ B ఉంటుంది Group B –యాంటిజన్ B and యాంటిబాడిస్ A ఉంటుంది Group AB –యాంటిజన్స్ AB ఉంటుంది కానీ యాంటిబాడీస్ ఉండవు (neither A nor B). Group O – యాంటిజన్స్ ఉండవు కానీ AB యాంటిబాడీస్ ఉంటాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అందించిన వివరాల ప్రకారం.. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లు ఎంతెంత మంది ఉన్నారంటే.. O పాజిటివ్ బ్లడ్: 42% A పాజిటివ్ బ్లడ్: 31% B పాజిటివ్ బ్లడ్: 15% AB పాజిటివ్ బ్లడ్ : 5% O నెగిటివ్ బ్లడ్ : 3% A నెగిటివ్ బ్లడ్ : 2.5% B నెగిటివ్ బ్లడ్ : 1% AB నెగిటివ్ బ్లడ్ : 0.5% మందిలో ఉంది. ఈ గణాంకాలు బట్టి అరుదైన బ్లడ్ గ్రూపులు ఏంటన్నది సులభంగా అర్థమవుతోంది. దేశంలో B నెగిటివ్ బ్లడ్ కేవలం 1% మందిలోనే ఉండగా, అత్యల్పంగా AB నెగిటివ్ బ్లడ్ 0.5% మందిలో ఉంది. దీంతో దీంతో అత్యవసర సమయాల్లో దాతల నుంచి రక్తం లభించడం చాలా కష్టతరంగా ఉంటుంది. ఒక్కోసారి సమయానికి సమయానికి రక్తం లభించక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే B నెగిటివ్, AB నెగిటివ్ బ్లడ్ గ్రూపులను అరుదైన బ్లడ్ గ్రూప్స్‌గా పేర్కొంటారు. అన్ని బ్లడ్ గ్రూప్స్‌లో కంటే O పాజిటివ్ బ్లడ్ ఉన్నవారు ఎవరికైనా రక్తాన్ని దానం చేయవచ్చు. అందుకే వీరిని యూనివర్సల్ డోనర్స్ అంటాం. అంతేకాకుండా మిగిలిన బ్లడ్ గ్రూపుల వారికంటే వీరికి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తక్కువని పలు పరిశోధనల్లో వెల్లడైంది. భారత్‌లో O(+,-) బ్లడ్ గ్రూప్ ఉన్నవారు సుమారు 29% మంది ఉండగా అత్యధికంగా పెరు దేశంలో O(+,-) బ్లడ్ గ్రూప్ ఉన్నవారు 71% మంది ఉండటం విశేషం. -
రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగితే.. ప్రమాదం ఎక్కువే.. లక్షణాలేంటి? చికిత్స ఉందా?
సాధారణంగా ఇతర అవయవాలకు వచ్చే ఇన్ఫెక్షన్ తెలుసుగానీ... రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇక్కడ ఓ కీలకం దాగి ఉంది. మిగతా అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకితే... మెల్లగా పాకుతూ అంత త్వరగా ప్రమాదం రాకపోవచ్చు. కానీ రక్తానికి ఇన్ఫెక్షన్ గనక సోకితే అది అన్ని అవయవాలకూ, కణాలకూ వెళ్తూ ఆహారాన్నీ, ఆక్సిజన్‌ను తీసుకెళ్తూ వెళ్తూ ఇన్ఫెక్షన్ను కూడా దేహమంతటికీ వ్యాప్తి చేస్తుంది కాబట్టి ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి. రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగించే ఈ కండిషన్‌ను 'సెప్టిసీమియా’ అని పిలుస్తారు. దీనిపై అవగాహన కోసం ఈ కథనం. మామూలుగా ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని వాడుకగా ‘సెప్టిక్’ అయిందని అంటారు. రక్తానికి ఇన్ఫెక్షన్ వచ్చి అది దేహాన్నంతటినీ విషపూరితం చేసే కండిషన్‌ను ‘సెప్సిస్’ లేదా ‘సెప్టిసీమియా’ అంటారు. దీని గురించి కొన్ని వివరాలివి... సెప్టిసీమియాకు కారణాలు బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, ఏవైనా పరాన్నజీవులతో పాటు మరికొన్ని అంశాలు కూడా సెప్టిసీమియాకు దారితీయవచ్చు. చాలాకాలంగా ఆల్కహాల్‌కు తీసుకుంటూ ఉండటం, దీర్ఘకాలంగా అదుపులేకుండా డయాబెటిస్ బారిన పడటం, తగిన పోషకాహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల మందుల్ని దీర్ఘకాలికంగా వాడటం, రోగనిరోధక వ్యవస్థను మందకొడిగా చేసే ఇమ్యునోసప్రెసెంట్స్ వాడుతుండటం, కొన్ని రకాల యాంటీబయాటిక్ మందులను విచక్షణరహితంగా వాడటం సెప్టిసీమియాకు దారితీయవచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్లలో సెస్టిసీమియా ముప్పు మరీ ఎక్కువ... ♦ గుండెజబ్బులు వచ్చి చికిత్స పొందని సందర్భాల్లో ♦ ఊపిరితిత్తుల జబ్బులు వచ్చిన వాళ్లలో దాదాపు సగం మందిలో కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ప్రధానంగా నిమోనియా వచ్చినప్పుడు ఇది మరీ ఎక్కువ. ♦ ఏదైనా కారణంతో పొట్ట (అబ్డామిన్)లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాదాపు మూడోవంతు కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ♦ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భాల్లో దాదాపు 11 శాతం కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ముఖ్యంగా పైలోనెఫ్రైటిస్ అనే కిడ్నీ వ్యాధి వచ్చిన వారిలో లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో అది సెప్టిసీమియా ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ♦ మెదడు తాలూకు ఇన్ఫెక్షన్స్ కూడా సెప్టిసీమియాగా మారవచ్చు. ♦ ఎముకలు, కీళ్లకు ఇన్ఫెక్షన్ సోకితే చాలా కొద్దిమందిలో (2% మందిలో) అది సెప్టిసీమియాగా మారే అవకాశముంది. నిర్ధారణ పరీక్షలు రక్త పరీక్ష, మూత్రపరీక్షలతో పాటు ఎక్స్–రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ వంటి రేడియాలజికల్ పరీక్షలతో సెప్టిసీమియా ఉనికి, తీవ్రతను అంచనా వేయవచ్చు. ఈ పరీక్షల ఆధారంగా తర్వాత చేయాల్సిన చికిత్సనూ నిర్ణయిస్తారు. నివారణ బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ వంటి సూక్ష్మజీవుల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవడం ద్వారా చాలావరకు సెప్టిసీమియా నుంచి రక్షించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం, తాగేనీరు, పీల్చే గాలి కూడా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే మరికొన్ని అంశాలూ సెప్సిస్ నుంచి కాపాడతాయి. అవి... ♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ♦ నీటిని కాచి, చల్లార్చి లేదా ఫిల్టర్ అయిన నీటినే తాగాలి. ♦ వంటకాల్ని వేడివేడిగా ఉండగానే తినేయాలి. బయటి ఫుడ్‌కు (వీలైనంతవరకు) దూరంగా ఉండాలి. ♦ కూరగాయలను, ఆకుకూరలను శుభ్రంగా కడిగాకే వంటకు ఉపక్రమించాలి. తొక్క ఒలిచి తినే పండ్లు మినహా మిగతా వాటిని కడిగే తినాలి. ♦ తినడానికి ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ♦ మల, మూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ♦ గాయాలను, పుండ్లను నేరుగా చేతితో ముట్టుకోకూడదు. వాటిని ముట్టుకోవాల్సి వస్తే చేతులకు గ్లౌవ్స్ వేసుకోని, సేవలందించాలి. ♦తుమ్ముతూ, దగ్గుతూ ఉండేవారి నుంచి, ముక్కు నుంచి స్రావాలు వస్తున్నవారి నుంచి, జ్వరంతో బాధపడుతున్నవారి నుంచి దూరంగా ఉండాలి. వాళ్లతో మాట్లాడాల్సి వస్తే ఫేస్‌మాస్క్ ధరించాలి. ♦ చెప్పులు, బూట్లు వంటి పాదరక్షల్ని బయటే విడవాలి. ♦ పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ♦ డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాలి. డాక్టర్ల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. లక్షణాలు ♦ చలితో వచ్చే జ్వరం ( ఫీవర్ విత్ చిల్స్) ♦ ఊపిరి అందకపోవడం (బ్రెత్‌లెస్‌నెస్) ♦ గుండె వేగంగా కొట్టుకోవడం (ర్యాపిడ్ హార్ట్‌బీట్) ♦ అయోమయం / మూర్ఛ (ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ / సీజర్స్) ♦ మూత్రం పరిమాణం బాగా తగ్గడం ♦ దేహంలోని చాలా చోట్ల నుంచి రక్తస్రావం ♦ పొట్టలో నొప్పి / వాంతులు / నీళ్ల విరేచనాలు ♦ కామెర్లు (జాండీస్). చికిత్స సెప్టిసీమియా రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా డాక్టర్లు ఈ కింది ప్రొసీజర్స్ చేస్తారు. ♦ రక్తనాళం ద్వారా ద్రవపదార్థాలు అందజేయడం (ఇంట్రావీనస్ ఫ్లుయిడ్స్) ♦రక్తనాళం ద్వారా యాంటీబయాటిక్స్ (ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్) ♦ రక్తపోటు అకస్మాత్తుగా పెరగడాన్ని నివారించే మందులతో సపోర్ట్ ♦ ఆక్సిజెన్ తీసుకోలేకపోతున్న రోగికి కృత్రిమ శ్వాస ఇవ్వడం, వెంటిలేటర్‌తో శ్వాస అందించడం ♦ కిడ్నీ రోగుల్లో డయాలసిస్ ♦ అవసరమైన సందర్భాల్లో రక్తమార్పిడి లేదా రక్తంలోని కొన్ని అంశాలు తగ్గితే కోల్పోయిన వాటిని తిరిగి భర్తీ చేయడం (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా బ్లడ్ ప్రోడక్ట్స్‌ను ఎక్కించడం) ♦ పేషెంట్‌కు ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా రక్తనాళం ద్వారానే అందిస్తారు. (ఇంట్రావీనస్ న్యూట్రిషనల్ సపోర్ట్). - డాక్టర్ ఆరతి బెల్లారి ,సీనియర్ ఫిజీషియన్ -
అర్బన్ హెల్త్ సెంటర్లలో ఆగిన రక్త పరీక్షలు
కడప సెవెన్‌రోడ్స్: ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యుని వద్దకు వెళతాం. అవసరమైన పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాతే ఆ వ్యాధిని పోగొట్టేందుకు తగిన మందులు ఇస్తారు. ఎక్కడైనా జరిగేది, జరగాల్సింది కూడా ఇదే. కానీ కడప అర్బన్ హెల్త్ సెంటర్లలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. రోగ నిర్ధారణ జరగకుండానే ఏవో మందులు ఇచ్చి రోగులను పంపేస్తున్నారు. అందుకు అక్కడి సిబ్బందిని తప్పుబట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే రక్త పరీక్షలకు అవసరమైన రీ ఏజెంట్స్ (కారకాలు) సరఫరా లేకపోవడంతో వారు అలా చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికార యంత్రాంగం దీనిపై దృష్టి సారించకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉంది. ఇది వర్షాకాలం. దోమకాటు, కలుషిత నీరు తాగడం వల్ల డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఇతర వైరల్ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దీంతో వ్యాధి బారిన పడిన ప్రజలు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అంతో ఇంతో స్థోమత ఉన్న వారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. వేల రూపాయలు ఖర్చు చేయలేని పేదలు రిమ్స్, అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీలను ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రులు, డయోగ్నోస్టిక్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం అక్కాయపల్లె అర్బన్ హెల్త్ సెంటర్‌కు పలువురు రోగులు వైద్యం చేయించుకోవడానికి వచ్చారు. తనకు ఐదారు రోజులుగా జ్వరం వస్తోందని, ఇంతకుమునుపు ఇక్కడ చూపించగా పారాసిటమాల్ మాత్రలు ఇచ్చారని ఓ రోగి వైద్యుడికి తెలిపారు. కానీ జ్వరం తగ్గలేదని, రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరారు. ఇందుకు వైద్యుడు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకు రావాలని చీటీ రాయించారు. అక్కడే ఉన్న ల్యాబ్‌లోకి వెళ్లి పరీక్ష చేయించగా 11.9 శాతం ఉన్నట్లు తెలిసింది. తనకు కావాల్సింది హిమోగ్లోబిన్ టెస్ట్ కాదని, తనను పీడిస్తున్న జ్వరం ఏదో చెప్పాలని ఆ రోగి అడిగాడు. డెంగీ, మలేరియా, టైఫాయిడో రక్త పరీక్షల ద్వారా తేల్చాలంటే అందుకు అవసరమైన రీ ఏజెంట్స్ ప్రభుత్వం నుంచి సరఫరా కాలేదని సిబ్బంది కుండబద్దలు కొట్టారు. ఇక చేసేది లేక వైద్యుని వద్దకు వెళ్లగా పారాసిటమాల్ ఇంజెక్షన్, పారాసిటమాల్ మాత్రలు, అజిత్రోమైసిన్ యాంటిబయాటిక్ మాత్రలు వాడాలని సూచించారు. అయితే హెల్త్ సెంటర్లో అజిత్రోమైసిన్ మాత్రలు లేవు. అందుకు బదులు అమోక్సీలిన్ క్యాప్సూల్స్ ఇచ్చారు. దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటంటే ఏ జ్వరం పీడిస్తున్నదో నిర్ధారణ కాకున్నా, జ్వరం అనగానే రొటీన్‌గా ఇచ్చే మాత్రలు ఇచ్చి పంపేస్తున్నారు. ఈ పని మందుల షాపు వారైనా చేస్తారు. ఇంత మాత్రానికి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఏముందని పలువురు రోగులు ప్రశ్నిస్తున్నారు. కాదు, కూడదని అడిగితే రిమ్స్‌కు వెళ్లాలని సలహా ఇస్తున్నారు. జ్వరాలు వంటి చిన్నచిన్న వ్యాధులకు దూరం వెళ్లకుండా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అవసరమైన సిబ్బంది, పరికరాలు ఉన్నా రీ ఏజెంట్స్ వంటివి సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం విచారకరం. రీ ఏజెంట్స్ కొరత నిజమే రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయడానికి అవసరమైన రీ ఏజెంట్స్ (కారకాలు) లేని మాట వాస్తవమే. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ (సీడీఎస్) నుంచి సరఫరా కావాల్సి ఉంది. రీ ఏజెంట్స్ కొరత ఉంది గనుకే ఎవరైనా ఇన్సిస్ట్ చేస్తేనే రక్త పరీక్షలు చేస్తున్నాం. అర్బన్ సెంటర్లలో లేకపోతే రిమ్స్ వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించుకోవచ్చు. హెల్త్ సెంటర్లలో అజిత్రోమైసిన్ లేకపోతే అందుకు బదులు అమోక్సీలిన్ క్యాప్సూల్స్ వాడినా సరిపోతుంది. – డాక్టర్ కె.నాగరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కడప -
రక్తం నోటితో పీల్చాలా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అన్న చందంగా మారింది.. ఆశ (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్–ఏఎస్హెచ్ఏ) కార్యకర్తల పరిస్థితి. చాలీచాలని వేతనాలతో గ్రామస్థాయిలో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్య వారధులు.. ఆశా కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం అయ్యేలా చూడటం, పిల్లలకు టీకాలు వేయించడం తద్వారా మాతాశిశు మరణాలు తగ్గించడం వీరి ప్రధాన విధులు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ఆశ వర్కర్ల సంక్షేమంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధుల గుర్తింపులోనూ వీరి సేవలు వినియోగించుకుంటున్న ప్రభుత్వం వారికి కనీస భద్రతా సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతోంది. ప్రస్తుతం హిమోగ్లోబిన్ పరీక్ష, క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తుల నుంచి శాంపిల్స్ సేకరించే క్రమంలో తామెక్కడ వ్యాధుల బారిన పడతామోనని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఇవి ల్యాబ్ టెక్నీషియన్ వంటి నిపుణులతో చేయించాలి్సన పనులను తూతూ మంత్రంగా శిక్షణ ఇప్పించి.. తమతో చేయించడం అన్యాయమని వాపోతున్నారు. 20 తెమడ శాంపిళ్లు మోసుకురావాలా? ఇదే క్రమంలో వీరికి అప్పగించిన మరో పని టీబీ నిర్ధారణ. గతంలో రెండువారాల పాటు రాత్రిళ్లు జ్వరంతో బాధపడుతూ.. నిర్విరామంగా దగ్గుతూ, బరువు తగ్గిన వారికి మాత్రమే ఉదయంపూట ఆశ కార్యకర్తలు తెమడ సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపేవారు. ► ఈ క్రమంలో వీరిలో నూటికి 99 శాతం పాజిటివ్ రేటు ఉండేది. కానీ, ప్రస్తుతం జిల్లా వైద్యాధికారులు టీబీ పరీక్షల శాంపిల్స్ సేకరణలో టార్గెట్ విధించారు. ప్రతీ సబ్సెంటర్కు ముగ్గురు లేదా నలుగురు (వెయ్యిమందికి ఒక ఆశ) కార్యకర్తలు ఉంటారు. ► వీరు తలా 20 తెమడ పరీక్షలు తేవాలని లక్ష్యం విధించారు. ఆ స్థాయిలో అనుమానిత కేసులు లేవని ఆశ కార్యకర్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా.. అధికారులు మాత్రం ససేమీరా అంటున్నారు. నెలనెలా నిర్వహించే రివ్యూ మీటింగుల్లో ఆశ కార్యకర్తలపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ► ఈ క్రమంలో తెమడ శాంపిల్స్ ఉన్న డబ్బాలను తాము చేతులతో మోసుకుపోతున్నామని, వీటిని పట్టుకుని బస్సు, ఆటో ఏది ఎక్కినా.. భయంతో తోటి ప్రయాణికులు కిందకు దించేస్తున్నారని వాపోతున్నారు. ► వాస్తవానికి హిమోగ్లోబిన్, తెమడ పరీక్షలు రెండూ ఆశలకు కేటాయించిన విధులు కావు. వీటికి ప్రత్యేకంగా టీఏ, డీఏలు ఏమీ రావు. అయినా, వీరు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ పనులు చేస్తున్నారు. ► క్షయ అంటువ్యాధి అని, సరైన రక్షణ లేకుండా రోగి వద్దకు వెళ్లినా, ఏమరుపాటుగా ఉన్నా.. తాము రోగాల బారిన పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులతో భోజనం చేయలేకపోతున్నామని, తమతో కుటుంబ స భ్యులు ఏం వ్యాధులు సంక్రమిస్తాయో అని నిత్యం భయపడుతున్నారని అంటున్నారు. రక్తం నోటితో పీల్చాలా? ► ఫీవర్ సర్వే కోసం ఆశ కార్యకర్తలు ఇల్లిళ్లూ తిరిగి హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రతీ ఆశకు వైద్యాధికారులు ఒక కిట్ ఇచ్చారు. దానిసాయంతో జ్వరంతో బాధపడుతున్న వారికి హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలి. ► కిట్‌లో డీఅయోనైజ్డ్ వాటర్, హైడ్రో క్లోరిక్ యాసిడ్ (హెచ్‌సీఎల్), పరీక్షనాళిక, హి మోగ్లోబినో మీటర్, పిప్పెట్, సూదులు, కాటన్ తదితరాలు ఉంటాయి. ఇందులో సూది సాయంతో రోగి వేలిపై పొడిచి ఆ రక్తాన్ని నేరుగా పిప్పిట్లోకి 20 మైక్రోలీటర్ మార్కు వచ్చేంత వరకు నోటితో పీల్చాలి. ► తరువాత ఈ రక్తాన్ని అంతే ఓపికతో హెచ్‌సీఎల్ కలిపిన ట్యూబ్‌లో నోటితో ఊదుతూ వదలాలి. దానికి డీ అయోనైజ్డ్ వాటర్ కలుపుతూ హిమోగ్లోబిన్ పరీక్ష నిర్వహిస్తారు. అయితే, ఇక్కడే ఆశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ► రోగి రక్తాన్ని పిప్పెట్లోకి ఎక్కించే క్రమంలో ఆ రక్తం నోటిలోకి వెళితే? అన్న ఆందోళన వీరిని వెంటాడుతోంది. ఎవరికి ఏ వ్యాధులు ఉన్నాయో? అవి తమకు ఎక్కడ సంక్రమిస్తాయో అని భయపడుతున్నారు. రెక్కాడితే గానీ, డొక్కాడని పేద బతుకులు తమవని, అలాంటి తమకు ఇలాంటి పనులు చెప్పడం తగదని అంటున్నారు. మా బతుకులకు రక్షణ ఏది వాస్తవానికి టీబీ, హిమోగ్లోబిన్ పరీక్షలు చేసే క్రమంలో ఎలాంటి రక్షణను వైద్యాధికారులు కల్పించడం లేదు. కనీసం అవసరాలైన మా స్కు, శానిటైజర్, గ్లోవ్స్, కళ్లద్దాలు లాంటి కనీస సదుపాయాలు లేవు. దీంతో ఎప్పుడు ఏ వ్యాధి బారిన పడతామోనని భయంభయంగా విధులు నిర్వహిస్తున్నాం. రక్తం నోట్లోకి వెళితే ఎలా? టీబీ అనుమానితుడి తెమడ ద్వారా వ్యాధి సంక్రమిస్తే ఎలా? అన్న భయంతో.. బిక్కుబిక్కుమంటూ విధులు ని ర్వహిస్తున్నాం. మా బతుకులకు రక్షణ లేదు. – మారెళ్ల శ్రీలత, ఆశా యూనియన్ కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శి -
ఈఎంఎం బ్లడ్ గ్రూప్.. ఎప్పుడైనా విన్నారా?
అహ్మదాబాద్: మనుషుల్లో బ్లడ్ గ్రూప్‌లు సాధారణంగా ఏ, బీ, ఓ, లేదా ఏబీ అని ఉంటాయని అందరికీ తెలుసు. కానీ, గుజరాత్‌కు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తిలో కొత్తరకం బ్లడ్ గ్రూప్ కనుగొన్నారు వైద్యులు. దేశంలోనే అరుదైన రక్తం కలిగిన తొలి వ్యక్తిగా నిలిచాడు. అయితే.. ఇలా ప్రత్యేక రక్త సమూహం కలిగిన వ్యక్తులను గుర్తించటం ప్రపంచవ్యాప్తంగా ఇది 10వ కేసుగా పలు నివేదికలు వెల్లడించాయి. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తిలో 'ఈఎంఎం నెగెటివ్' బ్లడ్ గ్రూప్‌ను కనుగొన్నారు వైద్యులు. సాధారణంగా మానవ శరీరంలో నాలుగు రకాల బ్లడ్ గ్లూప్‌లు ఉంటాయి. అందులో ఏ, బీ, ఓ, ఆర్‌హెచ్, డఫ్పీ అంటూ 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. అలాగే.. ఈఎంఎం అధికంగా ఉండే 375 రకాల యాంటీజెన్లు ఉంటాయి. ఈఎంఎం నెగెటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు ఇతరులకు తన రక్తాన్ని ఇవ్వలేరు.. ఇతరుల నుంచి తీసుకోలేరు. ఎలా నిర్ధారించారు? రాజ్‌కోట్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరారు. గుండె ఆపరేషన్ చేయాల్సి రావటం వల్ల రక్తం అవసరమైంది. ఆసుపత్రిలోని ల్యాబ్‌లో రక్తం పరీక్షించగా గ్రూప్ తెలుసుకోలేకపోయారు. దీంతో రక్తం నమూనాలను సూరత్‌లోని రక్త నిధి సేకరణ కేంద్రానికి పంపించినట్లు అక్కడి వైద్యులు సన్ముఖ్ జోషీ తెలిపారు. ఆ రక్తాన్ని పరీక్షించగా ఏ గ్రూప్‌తోనూ సరిపోలలేదు. దీంతో వృద్ధుడితో పాటు అతడి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను అమెరికాకు పంపించినట్లు చెప్పారు జోషీ. దీంతో అరుదైన బ్లడ్ గ్రూప్‌గా తేలిందన్నారు. రక్తంలో ఈఎంద్ లేకపోవటం వల్ల దానిని ఈఎంఎం నెగెటివ్‌గా ఐఎస్బీటీ నామకరణ చేసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 10 మంది మాత్రమే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 మందిలో మాత్రమే ఇలాంటి అరుదైన ప్రత్యేక బ్లడ్ గ్రూప్‌లను కనుగొన్నారు. తాజాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తిలో అలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్‌ను కొనుగొన్న నేపథ్యంలో ఆ సంఖ్య 10కి చేరింది. ఇదీ చూడండి: ప్లాస్టిక్‌ను తినేసే 'రోబో ఫిష్'.. సముద్రాల స్వచ్ఛతలో కీలక అడుగు! -
అరచేతిలో ఆరోగ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరుల ఆరోగ్యవంతమైన జీవనానికి ముందడుగు పడింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని పరిశీలించి ఆ వివరాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా ఈ కార్యక్రమాన్ని ములుగు, సిరిసిల్ల జిల్లాలో శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు 30 రకాల పరీక్షలు నిర్వహించనుంది. వాటి ఫలితా లను ప్రత్యేక పోర్టల్‌లో నిక్షిప్తం చేయనుంది. ఆ వ్యక్తికి మాన్యువల్ రిపోర్టులు ఇవ్వడం, ఫలితాల్లో తేడాలను గుర్తిస్తే మందులను ఉచితంగా పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు అవసరమైతే పెద్దాసుపత్రికి రిఫర్ చేయడం జరిగిపోనుంది. కార్యక్రమాన్ని అతి త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. కీలక పరీక్షలతో ప్రొఫైల్.. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు నిండిన వారికే పరిమితం చేశారు. రోగాలు, ఇతర అనారోగ్య సమస్యలు 18 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా నమోదవుతున్నందున ప్రభుత్వం ఈ మేరకు నిర్ధారించింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ 30 రకాల పరీక్షలు చేయనుంది. ప్రధానంగా బ్లడ్ గ్రూపింగ్, మూత్రపిండాల పనితీరు, కాలేయం పనితీరుతో పాటు కొలెస్టరాల్, బ్లడ్ షుగర్, బ్లడ్ యూరియా తదితరాలు పరిశీలించనుంది. పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేయనుంది. ప్రతి పౌరుడికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తుంది. ఈ సంఖ్య ఆధారంగా ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ ప్రొఫైల్ పోర్టల్‌లో వివరాలను నిక్షిప్తం చేస్తుంది. పోర్టల్ రూపకల్పనలో హైదరాబాద్ ఐఐటీ సహకారం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఇలా.. ‘హెల్త్ ప్రొఫైల్’అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్రే కీలకం. కార్యక్రమంలో భాగంగా హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేస్తారు. హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు ముందుగా కుటుంబానికి చేరుకుని అర్హుల వివరాలు సేకరిస్తారు. వారికి విశిష్ట గుర్తింపు సంఖ్యను జనరేట్ చేసిన తర్వాత శాంపిల్స్ (నమూనాలు) తీసుకుంటారు. వాటిని ప్యాక్ చేసి బ్లడ్ గ్రూపింగ్, సీబీపీ కోసం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు. మిగతా పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నస్టిక్స్‌కు చేరవేస్తారు. అక్కడ పరీక్షలు ముగిశాక ఉన్నతాధికారు లు, వైద్యనిపుణుల ఆమోదం తర్వాత విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా వివరాలను పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు వ్యక్తులకు యూనిక్ డిజిటల్ హెల్త్ కార్డుతో పాటు పరీక్షల ఫలితాల ప్రతులను ఇస్తారు. పరీక్షల్లో లోపాలు గుర్తించిన వారికి మెడిసిన్ కిట్, ఆరోగ్యశాఖ మంత్రి సందేశాన్ని ఇస్తారు. ఇతర జబ్బులున్నట్టు తెలిస్తే జిల్లా ఆస్పత్రి, నగరంలోని ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రులకు రిఫర్ చేసి ప్రత్యేక చికిత్సను అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం కృషి చేస్తుంది. -
దేశంలోనే తొలి సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్
సాక్షి, కొరుక్కుపేట(తమిళనాడు): దేశంలోనే తొలిసారిగా కాంటాక్ట్ లెస్ సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్‌ను చెన్నైలో అందుబాటులోకి తెచ్చారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్, సినీ దర్శకురాలు కృతికా ఉదయనిధి అతిథులుగా పాల్గొని సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆప్టిమిస్ట్ సంస్థకు చెందిన వేల్ మురుగన్, సరస్వతి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో భాగంగా రక్త పరీక్షల కోసం వినూత్నమైన, సులువైన విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ మాట్లాడుతూ పేదలకు ఉపయోగకరంగా సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్ ఎంతో దోహదపడుతుందని దీనిని రూపొందించిన నిర్వాహకులను అభినందించారు. చదవండి: Helicoter Crash: మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ -
‘బి’ బ్లడ్ గ్రూప్ వారికే ఎక్కువగా కరోనా!
సూర్యాపేట: పలానా గ్రూపు రక్తం వారికి కరోనా వైరస్ ఎక్కువగా సోకుతుందట.. పలానా వారికి చాలా తక్కువగా సోకుతుందట అని చాలాసార్లే విని ఉంటాం. అయితే దీని శాస్త్రీయత గురించి తెలుసుకునేందుకు సూర్యాపేట మెడికల్ కాలేజీ వైద్య బృందం ఓ అధ్యయనం చేపట్టింది. రెండు నెలల పాటు జరిపిన ఈ అధ్యయనంలో ‘బి’బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కరోనా వైరస్ ఎక్కువగా సోకుతున్నట్లు గుర్తించారు. ‘ఒ’బ్లడ్ గ్రూప్ వారికి కూడా ఎక్కువగానే సోకుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ అధ్యయనానికి యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ మెడికల్ మెడ్రివ్ జర్నల్ గుర్తింపు దక్కింది. కరోనా వైరస్ మొదటి, సెకండ్ వేవ్‌ల సమయంలో సూర్యాపేట మెడికల్ కాలేజీలో కోవిడ్ చికిత్సపొందిన 200 మంది రోగుల రక్తనమూనాలను పాథాలజీ వైద్య బృందం సేకరించింది. సేకరించిన రక్తనమూనాలపై కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ శారద ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, పాథాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ అనునయిల, పాథాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రావూరి స్వరూప పాల్గొన్నారు. -
‘ఇలా చేస్తే వారి ప్రాణాలు దక్కుతాయి’
లండన్: కోవిడ్ చికిత్సకు ఉపకరించే కీలక విషయాలు తమ పరిశోధనలో వెల్లడయ్యాయని యునైటెడ్ కింగ్డమ్కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. కోవిడ్ బాధితుల రక్త నమూనాలను పరిశీలించగా వారి ప్లాస్మాలోని ప్రొటీన్స్ స్థాయుల్లో తేడాలున్నట్టు తెలిసిందన్నారు. బాధితుల ప్రొటీన్ స్థాయుల్లో మార్పులకు కారణమయ్యే బయోమేకర్స్‌ను పరిశీలించడం ద్వారా.. బాధితుల్లో వ్యాధి తీవ్రత ఎలా ఉండబోతోందో తెలుసుకోవచ్చన్నారు. కోవిడ్ బాధితుల్లో కొందరు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే. మరికొందరు తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారని, కొన్ని సందర్భాల్లో మరణిస్తున్నారని అధ్యయనంలో భాగమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: భారత్‌లో అమెరికా కంటే ఎక్కువ కేసులు: ట్రంప్) ప్లాస్మాలో ప్రోటీన్ స్థాయులను బట్టి ఎవరికి అత్యవసర, ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరమో తెలుసుకోవచ్చన్నారు. తద్వారా ఎందరో ప్రాణాలకు కాపాడుకోవచ్చని వారు ధీమా వ్యక్తం చేశారు. త్వరగా రక్త నమూనాలను పరీక్షించి ప్రోటీన్లలో తేడాలను గమనిస్తే.. ఆ వ్యక్తిలో కోవిడ్ తీవ్రత ఎలా ఉండనుందో తెలిసిపోతుందన్నారు. తమ స్టడీలో వెల్లడైన విషయాలు రోగి పరిస్థితి అంచనా వేసేందకు ఉపయోగపడతాయని అధ్యయనానికి నేత్వత్వం వహించిన ఫ్రాన్సిక్ క్రిక్ యూనివర్సిటీకి చెందిన మార్కస్ రాల్సర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యాధి నిర్ధారణ కోసం ఇవే కీలకం కానున్నాయని తెలిపారు. వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వివిధ దశలకు చెందిన 31 మందిపై తమ అధ్యయనం జరిగిందని రాల్సర్ వెల్లడించారు. వారిలో వ్యాధి తీవ్రతను బట్టి 27 రకాల ప్రొటీన్ స్థాయుల్లో వైవిధ్యతలు గుర్తించినట్టు చెప్పారు. మరో 17 మంది కోవిడ్ రోగులను, 15 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల ప్రొటీన్ స్థాయులను కూడా పరిశీలించి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ నియమాల ప్రకారం.. రోగులను వర్గీకరించామని తెలిపారు. కాగా, సెల్ సిస్టమ్స్ అనే జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. (చదవండి: డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగుతాం: బోల్సోనారో) -
రక్త పరీక్ష..శిక్ష
ఎవరైనా అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళితే రక్త పరీక్షలు చేసి.. ఫలితం ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తారు. ఇక సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు.. జ్వరపీడితులకు రక్తపరీక్షలు తప్పనిసరి. రోజూ 2 వేల ఓపీ ఉండే అనంతపురం సర్వజనాస్పత్రిలో రక్త పరీక్షలు సకాలంలో చేయడం లేదు. రక్త పరీక్ష నిర్వహించేందుకు రూ.లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్లు తెచ్చినా వాటినిి వాడే కెమికల్స్ లేకపోవడంతో సిబ్బంది మాన్యువల్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో రక్త పరీక్షల ఫలితం ఆలస్యమవుతుండగా.. రోగులకు సకాలంలో సరైన వైద్యం అందక అల్లాడిపోతున్నారు. ఈ చిత్రంలోని బాలిక పుట్టపర్తి మండలం నిడిమామిడికి చెందిన సాహితి. నవంబర్ నెలలో డెంగీతో సర్వజనాస్పత్రిలో చేరింది. వెంటనే రక్త పరీక్ష చేయాల్సి ఉన్నా.. సెల్‌కౌంటర్ పనిచేయకపోవడంతో సిబ్బంది వైద్య పరీక్షలు వాయిదా వేశారు. చివరకు చిన్నారి ప్లేట్లెట్ కౌంట్ 30వేలకు తగ్గిపోవడంతో టెక్నీషియన్లు స్పందించి పరీక్షలు చేశారు. చిన్నవార్డులోనే రోజూ 200 మందికిపైగా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమయం సరిపోకపోవడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర సమయంలో కీలకం కానున్న రక్త పరీక్షల నివేదికలు అందక వైద్యులు కూడా సరైన వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రి.. జిల్లా వాసులందరికీ పెద్ద దిక్కు. ఎవరికి ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ఇక్కడికే పరుగున వస్తారు. అందుకే ఇక్కడ రోజూ 2 వేల మంది ఔట్‌పేషంట్లు, 1,300 మంది ఇన్‌పేషంట్లు ఉంటున్నారు. డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో దాదాపుగా వెయ్యి మందికి వివిధ రక్త పరీక్షలు నిర్వహిస్తారు. అందుకోసమే పెథాలజీ విభాగంలో రక్తపరీక్షల కోసం రూ.20 లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్ మిషన్లు(హెమటాలజీ అనలైజర్) తెప్పించారు. కానీ సర్వజనాస్పత్రి ఉన్నతాధికారులు వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. కెమికల్స్ లేవన్న కారణంతో ఐదు నెలలుగా వాటిని మూలకుపెట్టారు. దీంతో వివిధ వార్డుల్లో వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. సెల్‌కౌంటర్ సేవలు ఇలా... సెల్‌కౌంటర్ మిషన్ ద్వారా ప్లేట్లెట్స్, టీసీ, డీసీ, సీబీపీ, హెచ్‌బీ తదితర పరీక్షలు నిమిషాల్లో చేయవచ్చు. ఈ మిషన్ ద్వారా చేసే పరీక్షలు దాదాపుగా 500 వరకు ఉంటాయి. ఫలితం కూడా వేగవంతంగా అందుతుంది. దాన్నిబట్టి పరిస్థితి విషమించిన రోగులను ఇతర ఆస్పత్రులకు పంపడమో, లేదా మెరుగైన వైద్యం అందించడమో చేయవచ్చు. కానీ సెల్‌కౌంట్ మిషన్లు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డు, ఎఫ్ఎం, ఎంఎం, చెస్ట్, ఆర్థో, గైనిక్ తదితర వార్డుల్లో టెక్నీషియన్లు మాన్యువల్‌గా పరీక్షలు చేస్తున్నారు. వివిధ వార్డుల్లో రక్తపూతలు తీయడానికే గంటల సమయం వ్యవధి పడుతోంది. రక్తపూతలు తీసిన వెంటనే వారే మాన్యువల్‌గా పరీక్షలు చేయడానికి కనీసం రెండు గంటల సమయం పడుతోంది. దీంతో ఫలితం ఆలస్యమవుతుండగా.. వైద్య సేవల్లోనూ జాప్యం జరుగుతోంది. పోని ప్రైవేట్‌గా రక్త పరీక్షలు చేయించాలంటే రూ.300 నుంచి రూ.400 ఖర్చు అవుతుంది. సర్వజనాస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఇది మరింత భారంగా మారింది. పనిభారంతో పరీక్షలు వాయిదా.. సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో రెండు యూనిట్లు ఉన్నాయి. సెల్‌కౌంట్ మిషన్లు అందుబాటులో లేక ఒక్కోరోజు ఒక్కో యూనిట్ చొప్పున టెక్నీషియన్లు మాన్యువల్‌గా పరీక్షలు చేయాల్సి వస్తోంది. ఇక శనివారం, ఆదివారం వస్తే రక్త పరీక్షలకు మూడ్రోజుల సమయం పట్టే పరిస్థితి నెలకొంది. రక్త పరీక్ష ఫలితం వచ్చే వరకూ వైద్యులూ సరైన చికిత్స అందించలేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చిన్నపిల్లల వార్డులోనే కాదు.. ఆస్పత్రిలోని ఎంఎం, ఎఫ్ఎం, ఆర్థో, చెస్ట్, ఓపీ, గైనిక్ తదితర విభాగాల్లో రక్త పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనిభారంతో టెక్నీషియన్లు రక్తపరీక్షలు వాయిదా వేస్తుండటంతో రోగులకు ప్రాణసంకటంగా మారింది. అందుబాటులోకి రావాలంటే.. సెల్‌కౌంటర్ మిషన్లు అందుబాటులోకి రావాలంటే కెమికల్స్ కావాల్సి ఉంది. సెల్‌కౌంటర్ మిషన్‌లో 8 రకాల కెమికల్స్‌ను వినియోగిస్తారు. వాటికోసం ప్రతి నెలా రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది రెండు మినీ సెల్‌కౌంటర్ మిషన్లను సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీర్లు ల్యాబ్‌లలో ఎలక్ట్రికల్, ఏసీ తదితర పనుల్లో జాప్యం చేశారు. దీంతో వాటిని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఆస్పత్రి యాజమాన్యం మేలుకుని రూ.లక్షలు విలువ చేసే సెల్‌కౌంటర్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, జిల్లా ప్రజలు కోరుతున్నారు. కెమికల్స్‌కు ఆర్డరిచ్చాం కెమికల్స్ లేకపోవడంతో సెల్‌కౌంటర్ మిషన్లను ఉపయోగించడం లేదు. కెమికల్స్‌కు ఆర్డర్ ఇచ్చాం. త్వరలోనే కెమికల్స్ వస్తాయి. ప్రస్తుతం అందుబాటులో రెండు మినీ సెల్‌కౌంటర్ మిషన్లున్నాయి. వాటి ద్వారా రక్త పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రామస్వామి నాయక్,ఆస్పత్రి సూపరింటెండెంట్ రక్తనమూనాలు సేకరిస్తున్న టెక్నీషియన్ -
నొప్పి తెలియకుండా పాట పాడిన డాక్టర్
-
వైరల్ : నొప్పి తెలియకుండా పాట పాడిన డాక్టర్
సాధారణంగా చిన్న పిల్లలు సూదిని చూస్తేనే గజగజ వణికిపోతారు. అలాంటిది ఒక డాక్టర్ మాత్రం తన దగ్గరకు వచ్చిన చిన్నారికి మాత్రం ఏ నొప్పి తెలియకుండా పాట పాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. షానన్ తన కూతురుకు రక్తపరీక్ష చేయించడానికి దగ్గర్లోని ఒక క్లినిక్‌కు తీసుకెళ్లారు. అయితే చిన్నారిని పరీక్షించిన డాక్టర్ ర్యాన్ కోట్జీ రక్తం తీసేటప్పడు తనకు నొప్పి తెలియకుండా ఉండేందుకు ప్రముఖ పాప్ సింగర్ నాట్ కింగ్ కోల్స్ 'అన్ఫర్గెటబుల్' పాటను పాడారు. అయితే రక్త పరీక్ష నిర్వహిసున్న సమయంలో ఒక్క సెకను కూడా ఏడ్వకుండా డాక్టర్ పాడిన పాటను చిన్నారి ఎంతో ఇష్టంగా వినడం ఆశ్చర్యం కలిగించింది . ఇదంతా గమనించిన చిన్నారి తల్లి షానన్ డాక్టర్ పాడిన పాటను వీడియో రూపంలో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ' డాక్టర్ ర్యాన్ కోట్జీ చేసిన పని నాకు ఆనందాన్ని కలిగించింది. నా బిడ్డకు నొప్పి తెలియకుండా పాట పాడిన డాక్టర్‌కు కృతజ్ఞతలు. రక్త పరీక్ష చేసేటప్పుడు తను ఏడుస్తుందేమోనని ఎంతో బయపడ్డా. కానీ డాక్టర్ వ్యవరించిన తీరు నన్ను ఆకట్టుకుంది' అంటూ ఆమె తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. షానన్ షేర్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభిస్తుంది. షేర్ చేసిన కాసేపటికే 43 వేల కామెంట్లు వచ్చాయి. చిన్నారికి నొప్పి తెలియకుండా డాక్టర్ కోట్జీ చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. -
పెద్దలకూ పరీక్షలు
మనం ముఖం చూసుకోడానికి అద్దం వాడతాం. ఏమైనా తేడా వస్తే వెంటనే గుర్తిస్తాం. ముఖం మీద ఏదో గాయమో, అలర్జీయో లాంటిది కనిపిస్తే వెంటనే తగిన చికిత్స తీసుకునేందుకు హాస్పిటల్‌కు పరుగెడతాం. ఇక మిగతా ఒళ్లు భాగం కూడా అంతే. కాకపోతే ముంజేతి కంకణానికి అక్కర్లేనట్టే మిగతా శరీరభాగాలకూ అద్దం అవసరం లేదు. ఇలా బయట కనిపించే తేడాలను గుర్తించడం సరే... కానీ మరి ఒంట్లోని మిగతా శరీర భాగాలు, అంతర్గత అవయవాలు, వాటి పనితీరులో తేడాలు ఇవన్నీ గుర్తించడం ఎలా? అందుకు వైద్య పరీక్షలు తోడ్పడతాయి. మరీ ముఖ్యంగా నలభై, యాభై ఏళ్లు దాటాక ప్రతి వ్యక్తిలోనూ అంతర్గత అవయవాల పనితీరులో మార్పులు రావడం మొదలవుతుంది. అయితే ఒంటి మీద వచ్చినట్టుగా అవి బయటకు కనిపించవు కదా. అందుకే ఒక వయసు దాటాక తరచూ వైద్య పరీక్షలు చేయిస్తూ ఉండాలనీ, అందులో కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు లేదా వైద్య సమస్యలు రాబోతున్న విషయం ముందగానే తెలుసుకుంటే మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. యాభై ఏళ్లు దాటినవారిలో మరీముఖ్యంగా పురుషుల్లో ఎలాంటి వైద్య పరీక్షలు అవసరమో, అవి ఎందుకు చేయించాలో తెలిపేందుకు ఉపయోగపడేదే ఈ ప్రత్యేక కథనం. సాధారణంగా యాభై, అరవైలలో వచ్చే ఆరోగ్య సమస్యలు చాలావరకు వెన్వెంటనే బయటకు తమ లక్షణాలను కనిపించనివ్వవు. బయటకు అంతా బాగున్నట్లు అనిపించినా, లోపల ఆరోగ్యం అంతే బాగుండకపోవచ్చేమో! ఉదాహరణకు హైబీపీ. అది ఉన్నట్లే తెలియదు. కానీ లోపలంతా డొల్ల చేసేస్తుంది. ఆరోగ్యాన్ని గుల్లబారుస్తుంది. అలాగే డయాబెటిస్. ఇలాంటిదే కొలెస్ట్రాల్. అందుకే యాభై, అరవైలలో ఆ వయసు పురుషుల ఆరోగ్యానికి కొన్ని పరీక్షలు అవసరం. ఇక మధ్య వయసు వచ్చే వరకూ వాళ్లకు పొగతాగే అలవాటు ఉంటే పైన పేర్కొన్న జబ్బులతో పాటు గుండెపోటూ, క్యాన్సర్ వంటి వాటికీ అవకాశం ఎక్కువ. ఇక క్యాన్సర్ వంటి కొన్ని జబ్బులను ముందుగానే కనుగొంటే మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణకు చాలా రకాల క్యాన్సర్లను మొదటి దశలోనే కనుగొన్నామనుకోండి. 85కి పైగా రకాలను దాదాపుగా నూరుపాళ్లు పూర్తిగా నయం చేయవచ్చు. యాభై ఏళ్ల పురుషులకు చేయించాల్సిన పరీక్షలు చక్కెర వ్యాధి కోసం: సాధారణంగా ఉదయాన్నే పరగడుపున ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించాలన్న విషయం ఈ రోజుల్లో చాలామందికి తెలిసిందే. అనంతరం భోజనం చేసిన రెండు గంటల తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ కూడా చేయించాలి. ఈ రెండు పరీక్షలతో రక్తంలోని చక్కెర పాళ్ల ఆధారంగా డయాబెటిస్ తీవ్రతను నిర్ధారణ చేస్తారు. ఇక వీటితో పాటు సీరమ్ క్రియాటినిన్, సీయూఈ అనే పరీక్షలు కూడా అవసరమవుతాయి. డయాబెటిస్ కారణంగా మూత్రపిండాలూ ప్రభావితం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి క్రియాటినిన్ పరీక్షలో మూత్రపిండాలు ఏమైనా ప్రభావితం అయ్యాయా అన్న విషయం తెలుస్తుంది. అలాగే సీయూఈ పరీక్ష అన్నది మూత్రపరీక్ష. దీని ద్వారా జాండిస్ ఏమైనా వచ్చాయా అన్నది తెలుసుకుంటారు. అంతేగాక చక్కెర పాళ్లు నియంత్రణలో ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోడానికి హెచ్‌బీఏ1సీ, జీటీటీ (గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్) అనే పరీక్షలు అవసరమవుతాయి. గుండె జబ్బుల నిర్ధారణ కోసం: ► గుండెజబ్బుల నిర్ధారణ కోసం కొన్ని సాధారణ వైద్య పరీక్షలు ►ఈసీజీ, ►లిపిడ్ ప్రొఫైల్ వంటివి చేయిస్తారు. ఇక గుండెజబ్బల కోసమే చేయించాల్సిన ప్రత్యేక పరీక్షలు... ►2డి ఎకో ►టీఎమ్‌టీ ►సీటీస్కాన్‌తో పాటు అవసరాన్ని బట్టి ►కరోనరీ యాంజియో వంటివి డాక్టర్ల సలహా మేరకు చేయించాల్సి ఉంటుంది. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు: ►క్యాన్సర్ నిర్ధారణ కోసం ఈ కింది సాధారణ పరీక్షలు చేస్తారు. ►పురుషుల్లో ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్ఏ) అనే పరీక్షను ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ కోసం చేస్తారు. చాలా చిన్న రక్త పరీక్ష అయిన దీని ద్వారా త్వరగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను దాదాపుగా నయం చేయవచ్చు. ►ఛాతీ ఎక్స్–రే (ఇది అనేక వ్యాధులతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లనూ నిర్ధారణ చేస్తుంది), అల్ట్రాస్కాన్ అబ్డామిన్ ప్రత్యేక పరీక్షలు కూడా చేస్తారు. ►బోన్‌స్కాన్ పరీక్ష, ► పెట్ స్కాన్ పరీక్ష వంటివి ఎముకల పరిస్థితిని ఎలా ఉందో తెలుసుకోవడం కోసం, పెట్ స్కాన్ ద్వారా ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్ కణం ఉందేమో తెలుసుకునేందుకు చేస్తారు. (ఇవి క్యాన్సర్ నిర్ధారణలో ముందుగా చేసే ప్రాథమిక పరీక్షలు, వీటిలో ఏదైనా తేడా ఉన్నట్లు తెలిస్తే మరి కాస్త అడ్వాన్స్డ్ పరీక్షలు అవసరమవుతాయి. వీటిలో ఏమీ లేదని తెలిస్తే ఇప్పటికి క్యాన్సర్ ముప్పేమీ లేదని నిశ్చింతగా ఉండవచ్చు. అయితే యాభై ఏళ్ల వయసు దాటాక ఈ క్యాన్సర్‌ను కనుగొనే స్క్రీనింగ్ పరీక్షలను డాక్టర్ చెప్పిన వ్యవధుల్లో (ఇంటర్వెల్స్‌లో) చేయించాలి.) పళ్లకు సంబంధించిన పరీక్షలు: మన నోటి ఆరోగ్యం (ఓరల్ హెల్త్) మీదే అనేక ఒంటి సమస్యలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మన నోటిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది గుండె సమస్యలకూ దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి నోటిని శుభ్రంగా ఉంచుకుంటే దేహంలోని అంతర్గత అవయవాల్లో చాలా వాటిని ఆరోగ్యంగా ఉంచవచ్చు. అందుకే దంతాలను పరీక్షింపజేసుకోవడం కోసం ప్రతి ఆర్నెల్లకు ఒకమారు డెంటిస్ట్‌ను సంప్రదించాలి. వాటి సలహా మేరకు అవసరాన్ని బట్టి పళ్లు క్లీన్ చేయించుకోవాలి. ఇక చిగుళ్ల వ్యాధులు ఏవీ లేవని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండాలి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చిగుళ్ల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. కంటి పరీక్షలు: మీ కళ్లను ప్రతి రెండేళ్లకు ఒకసారి కంటి నిపుణులకు చూపించుకోవాలి. ఎందుకంటే ఓ వయసు దాటాక కళ్లలో ఇంట్రాఆక్యులార్ ప్రెషర్ అనే ఒక రకం ప్రెషర్‌ను చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఇది ఎక్కువైతే గ్లకోమాకు దారితీయవచ్చు. అందుకే ఇంట్రాఆక్యులార్ ప్రెషర్‌ను పరీక్ష చేయించుకుని గ్లకోమా అవకాశాలు ఏవీ లేవని తెలుసుకుని నిర్భయంగా ఉండవచ్చు. మీకు మద్యం, సిగరెట్ అలవాట్లు ఉంటే... ►పురుషుల్లో చాలామందికి పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు ఉంటాయి. మీరు పొగతాగేవారైతే... గుండె పరీక్షలతో పాటు... ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునే పీఎఫ్‌టీ పరీక్ష కూడా చేయించుకోవాలి. ►ఇక ఆల్కహాల్ అలవాటు ఉన్నవారైతే... కాలేయ సామర్థ్యాన్ని తెలుసుకుని లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్ఎఫ్టీ పరీక్ష), గుండె పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్షలు చేయించుకోవాలి. ►స్థూలకాయం ఉంటే... మీరు ఏ మేరకు స్థూలకాయులో తెలుసుకునేందుకు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ)తో పాటు, థైరాయిడ్ సమస్యలను తెలుసుకునేందుకు అవసరాన్ని బట్టి టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్షలనూ చేయించుకోవాలి. ఇక స్థూలకాయులు ఎఫ్బీఎస్, లిపిడ్ ప్రొఫైల్స్ చేయించడం కూడా అవసరం. ►ఇక్కడ ప్రస్తావించిన సమస్యలేగాక ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే... వాటిని బట్టి మీ ఫిజీషియన్ సలహా మేరకు అవసరమైన మరికొన్ని పరీక్షలు చేయించుకోవాలి. అరవైలలో ఆరోగ్య పరీక్షలివే... పురుషుల్లో వయసు అరవైకి చేరాక ఆ వయసుకు తగినట్లుగా కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. అవి... ►అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్ స్క్రీనింగ్: పురుషుల వయసు 65–75 మధ్య ఉన్నవాళ్లు... గతంలో వాళ్లకు పొగతాగిన అలవాటు ఉంటే... అయోర్టిక్ అన్యురిజమ్ అనే కండిషన్ కోసం ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. బీపీ స్క్రీనింగ్: ఒక వయసు దాటాక ఇక తరచూ బీపీ చెక్ చెయించుకోవడం అవసరం. ఇకవేళ డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఏవైనా జబ్బులు ఉంటే దానికి సంబంధించి డాక్టర్ పేర్కొన్న పరీక్షలను క్రమం తప్పకుండా చేయంచాలి. కొలెస్ట్రాల్ స్క్రీనింగ్: యాభై దాటాక ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించి, అది నార్మల్ గనక వస్తే ఇక అప్పట్నుంచి ప్రతి ఐదేళ్లకోమారు కొలెస్ట్రాల్ స్థాయులు తెలుసుకుంటూ ఉండటం మంచిది. ►ఒకవేళ వారికి డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ పరీక్ష చేయిస్తూ ఉండాల్సిందే. ►డయాబెటిస్ కోసం తరచూ పరీక్షలు చేయిస్తూనే ఉండాలి. ఒకవేళ అది ఉన్నట్లు తేలితే డాక్టర్ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా చక్కెర నిర్ధారణ పరీక్షలు చేయించాలి. గుండె పరీక్షలు: ఈసీజీ, 2 డి ఎకో, టీఎమ్‌టీ వంటి పరీక్షలు డాక్టర్ సలహా మేరకు చేయించాలి. పెద్ద వయసులో ఈ పరీక్షలతో ఇక నిశ్చింత ►ఏడాదిలో ఒకసారి మల పరీక్ష ►ప్రతి ఐదేళ్లకోసారి ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపీ. దీనితో పాటు స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ కొలనోస్కోపీ అనే పరీక్ష యాభై దాటిన నాటి నుంచి ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది. ►కొలనోస్కోపీ అనే పరీక్షను ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది. ►ఇక వ్యక్తిగతంగా ఉన్న లక్షణాలను, కుటుంబ చరిత్రను, రిస్క్ ఫ్యాక్టర్స్‌ను బట్టి డాక్టర్ సూచించిన ఇతర పరీక్షలు చేయించుకోవాలి. వయసు పైబడ్డాక తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు : పురుషులు 65 ఏళ్లు దాటాక అంతకు ముందు ఎప్పుడూ తీసుకుని ఉండకపోతే ‘న్యూమోకోకల్ వ్యాక్సిన్’ తీసుకోవాలి. ఒకవేళ గతంలో తీసుకుని ఉండి, ఐదేళ్లు దాటినా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ► ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాధి నుంచి రక్షణకోసం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ► ప్రతి పదేళ్లకోమారు టెటనస్–డిఫ్తీరియా బూస్టర్ డోస్ తీసుకుంటూ ఉండాలి. ►గతంలో ఎప్పుడూ తీసుకోకపోతే 65 ఏళ్లు దాటక టీ–డాప్ వ్యాక్సిన్ తీసుకోవాలి. (ఇది డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది). ►అరవై దాటక షింగిల్స్ లేదా హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. గతంలో తీసుకుని ఉండకపోతే ఇది వెంటనే తీసుకోవడం మేలు. చివరగా... ఇవేగాక సాధారణంగా చూసుకునే పరీక్షలైన బరువు చెక్ చేయించుకోవడం, కింద జారిపడకుండా చూసుకోవడం, చెవులు చక్కగా వినిపిస్తున్నాయేమో చూసుకోవడం, ఆహ్లాదంగా లేకపోతే డిప్రెషన్‌కు గురికాకుండా జాగ్రత్త పడటం వంటి ఎవరికి వారు చేసుకునే పరీక్షలతోపాటు పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటే వయసు పైబడ్డా సరే... ఆ సమయంలోనూ దీర్ఘకాలం ఆరోగ్యంగా, ఎలాంటి సమస్యలూ లేకుండా చాలాకాలం ఆరోగ్యంగా ఉంటారు. మహిళల కోసంఉద్దేశించిన ప్రత్యేక పరీక్షలివి... ఇక మహిళల విషయానికి వస్తే... పైన పేర్కొన్న పరీక్షలతో పాటు (పురుషుల కోసం ఉద్దేశించిన పీఎస్ఏ వంటివి కాకుండా... వారికే ప్రత్యేకమైన మామోగ్రామ్ పరీక్షలు, పాప్‌స్మియర్ పరీక్షల వంటివి చేయించుకుంటూ ఉండాలి. మహిళల్లో మెనోపాజ్ దాటాక వారిలో కొన్ని సమస్యలు కనిపించడం చాలా సాధారణం. వారి వచ్చే ఆ సమస్యలను బట్టి అవసరమైతే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వంటివి అవసరం కావచ్చు. అందుకోసం డాక్టర్లు సూచించిన మరికొన్ని ప్రత్యేక పరీక్షలు అవసరమవుతాయి. ఇక మెనోపాజ్ దశకు చేరకముందు... మహిళల్లో వారిలోని ఈస్ట్రోజెన్ హార్మోన్ కారణంగా వారి గుండెకు ఒక స్వాభావికమైన రక్షణ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత ఆ స్వాభావిక రక్షణ తొలగిపోతుంది కాబట్టి గుండెకు సంబంధించిన పరీక్షలనూ దాంతోపాటు క్రమం తప్పకుండా హైబీపీ, షుగర్ పరీక్షలను చేయించుకుంటూ ఉండాల్సిందే. డాక్టర్ జి. హరిచరణ్ సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
బాలుడికి హెచ్ఐవీ రక్తం ఎక్కిస్తారా?
సాక్షి, చెన్నై : శస్త్రచికిత్స సమయంలో ఓ తొమ్మిది నెలల బాలుడికి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఘటనపై చెన్నై కోర్టు సివిల్ కోర్టు తీవ్రంగా స్పందించింది. 20 ఏళ్ల నాటి ఈ కేసులో బాధిత బాలుడికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్’ ను ఆదేశించింది. అలాగే ఆ యువకుడికి ఉద్యోగం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 1999లో జరిగిన ఈ ఘటన వివరాలు.. చెన్నై నగరంలో దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్న ఓ పేద దంపతుల కుమారునికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో నగరంలోకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్ర చికిత్స వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి, రక్తాన్ని ఎక్కించారు. అయినప్పటికీ బాలుడి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. మరోచోట రక్త పరీక్ష చేయగా హెచ్ఐవీ ఉన్నట్టు తేలడంతో కోర్టును ఆశ్రయించారు. 20 ఏళ తర్వాత కోర్డు తీర్పును వెల్లడించింది. కాగా ఆ బాలుడి కుటుంబానికి ఇప్పటికే రూ.50 వేలు చెల్లించామని ఆస్పత్రి అధికారులు పేర్కొనగా.. అది అతని వైద్య ఖర్చులకే సరిపోవని కోర్టు అభిప్రాయపడింది. హెచ్ఐవీ బ్లడ్‌ను ఎలా ఎక్కించారని సిబ్బందిపై మండిపడింది. సిబ్బంది నిర్లక్ష్యంగానే ఆ బాలుడికి హెచ్ఐవీ సోకిందని..పరిహారంగా రూ. 20లక్షలు చెల్లించాలని కోర్టు తేల్చిచెప్పింది. యువకుడి తల్లిదండ్రులు పేదవారని, కుటుంబ పోషణ కోసం ఆ యుకుడికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి... రాకుండా జాగ్రత్తలేమిటి?
ఈమధ్య ‘హార్ట్ ఫెయిల్యూర్’తో చనిపోయారు అనే వార్తలు తరచూ వింటున్నాం. అసలు హార్ట్‌ఫెయిల్యూర్ అంటే ఏమిటి? ఎందుకిలా జరుగుతుంది? అసలు హార్ట్ ఫెయిల్యూర్ అయితే మనిషి ఎలా బతుకుతాడు? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరంగా తెలపండి. గుండె మన శరీరంలో ఒక ప్రధానమైన అవయవం. శరీరంలో అవయవాలన్నింటికీ నిరంతరం రక్తం సరఫరా చేస్తుండే ఒక అద్భుతమైన పంపింగ్ మోటార్ ఇది. ఈ రక్తప్రసరణ వల్లనే అన్ని అవయవాలకూ పోషకాలు, ఆక్సిజన్ అందడం మాత్రమే కాకుండా రక్తంలో చేరిన కార్బన్ డై ఆక్సైడ్, శరీరంలోని జీవక్రియల వల్ల ఉత్పన్నమైన ఇతర వ్యర్థపదార్థాల తొలగింపు జరుగుతుంటుంది. ఈ విధంగా దేహంలో ప్రసరణ వ్యవస్థ నిర్వహణలో గుండె కీలకమైన బాధ్యతను నిర్వహిస్తూ ఉంటుంది.ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను గ్రహించడం, కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు పంపించే ప్రక్రియను నిర్వహించడంలో ఊపిరితిత్తులతో కలిసి పనిచేస్తుంది. అనేక రకాల పరిస్థితుల్లో గుండె దెబ్బతింటుంది. వీటిలో ముఖ్యమైనది అధికరక్తపోటు (హైపర్‌టెన్షన్/హైబీపీ), కరోనరీ ఆర్టరీ డిసీజ్, డయాబెటిస్, స్థూలకాయం (ఒబేసిటీ). వీటితో పాటు వాల్వ్‌లార్ డిసీజ్, వైరల్ ఇన్ఫెక్షన్లు, మితిమీరిన మద్యపానం, పోషకాహార లోపం, కీమో–రేడియేషన్ల (క్యాన్సర్ చికిత్సల్లో) అనంతర స్థితి, వాపు (ఇన్ఫ్లమేటరీ స్టేట్) వల్ల కూడా గుండె దెబ్బతింటుంది.ఈ పరిస్థితులను నివారించడం, ఇందుకు కారణమయ్యే అంశాల నుంచి దూరంగా ఉండటం వల్ల గుండెకు జరిగే నష్టాన్ని చాలావరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం తొలిదశలోనే వ్యాధిని గమనించడం, దానికి దారితీస్తున్న కారణాలకు దూరంగా ఉండటం వల్ల గుండెకు వాటిల్లబోయే నష్టాన్ని చాలావరకు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం తొలిదశలోనే వ్యాధిని గమనించడం, దానికి దారితీస్తున్న కారణాలను గుర్తించడం ముఖ్యం. ఒకసారి గుండె దెబ్బతింటే మళ్లీ మునపటి స్థితిని పునరుద్ధరించుకునే సామర్థ్యం గుండెకు ఉండదు. అందుకే గుండె దెబ్బతినకుండానే తీసుకునే నివారణ చర్యలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా కీలకమైన భూమిక నిర్వహిస్తాయి. లక్షణాలు ఇటు డాక్టర్లు, అటు పేషెంట్లు హార్ట్‌ఫెయిల్యూర్ లక్షణాలను వెంటనే గుర్తించాలి. కొద్దిపాటి శారీరక శ్రమ చేసినా, పడుకొని ఉన్నా శ్వాస అందకపోవడం, అలసట, కాళ్లవాపు, ఊపిరితిత్తుల్లో ఒత్తిడి ఏర్పడటం, పొట్ట ఉబ్బడం మొదలైనవి హార్ట్‌ఫెయిల్యూర్ లక్షణాలు. ఇవి కనిపించిన వెంటనే రోగి పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి, తీవ్రతను అంచనా వేయాల్సి ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈసీజీ, 2–డి ఎకో కార్టియోగ్రఫీ, మరికొన్ని రక్తపరీక్షల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్‌ను డాక్టర్లు నిర్ధారణ చేస్తారు.ఇటీవల మరిన్ని ఆధునిక విధానాలు వాడుకలోకి వచ్చాయి. బయోమార్కర్లను ఉపయోగించి హార్ట్‌ఫెయిల్యూర్‌ను గుర్తించడం, వర్గీకరించడం చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఇమేజింగ్ పద్ధతులు కూడా చాలా అభివృద్ధి చెందాయి. వీటివల్ల వ్యాధిని వేగంగా, ఖచ్చితంగా నిర్ధారణ చేయగలుగుతున్నారు. వీటిలో 3–డితో కూడిన ఎకోకార్డియోగ్రఫీ వ్యాధి నిర్ధారణ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచింది. ఇది గుండెపనితీరు, గుండె కవాటాల పనితీరు, గుండెలోని ఒత్తిడిని అధ్యయనం చేయడానికి సాయపడుతుంది. ఎకో ద్వారా పూర్తిగా నిర్ధారణకు రాలేని సందర్భాల్లో కార్డియాక్ ఎమ్మారై ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం. వీటితోపాటు కార్డియాక్ కాథటరైజేషన్, న్యూక్లియార్ స్కాన్ (పెట్, స్పెక్), ఎండోకార్డియల్ బయాప్సీ, టాక్సికాలజీతో రోగనిర్ధారణ చేస్తున్నారు. గుండెను కాపాడుకోవడం ఇలా... మనం ముందుగా మన అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవాలి. అయితే అధిక రక్తపోటు విషయంలో చాలామంది నిర్లక్ష్యంగానో లేదా ఉదాసీనంగానో వ్యవహరిస్తుంటారు. అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచడం ద్వారా రక్తనాళాలకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. అలా జరగకపోతే గుండె దమనులు తీవ్రంగా దెబ్బతీసి, గుండెకండరాలను మందంగా తయారుచేస్తుంది. దాంతో గుండెకు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం చాలావరకు తగ్గిపోతుంది. డయాబెటిస్, స్థూలకాయం ఉన్నప్పుడు కూడా దాదాపు ఇలాంటి అంశాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా హార్ట్‌ఫెయిల్యూర్‌కు దారితీస్తాయి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అటు హైబీపీ, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం, ఇటు స్థూలకాయాన్ని నివారించుకొని ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం అవసరమవుతుంది. జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా గుండెకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. రోజుకు కనీసం 30 – 35 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, తాజా పండ్లు, కూరగాయలు–ఆకుకూరలతో కూడిన పోషకాహారం తీసుకోవడం, ఆహారంలో ఉప్పు చాలా తక్కువగా తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత వంటి ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొగతాగడం వల్ల గుండె మీద తీవ్రమైన భారం పడుతుంది. మద్యం కూడా గుండెకు అనర్థాలను తెచ్చిపెడుతుంది. ఆ అలవాట్లను వెంటనే ఆపేయాలి. ఇక రక్తంలో కొలస్ట్రాల్ ఉంటే దానివల్ల కరొనరీ దమనల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అందుకే రక్తంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి.మొత్తంమీద పూర్తిగా నష్టం జరగకమునుపే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం వల్ల గుండెకు వాటిల్లే నష్టం నివారించడానికి వీలవుతుంది. తద్వారా హార్ట్‌ఫెయిల్యూర్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఒకసారి గుండెపోటుకు గురైతే ఆలస్యం చేయకుండా గుండెకు రక్తసరఫరాను పునరుద్ధరించడం కూడా చాలా కీలకం. దానివల్ల తక్షణ రక్షణతో పాటు మున్ముందు మరింత నష్టం జరగకుండా చూసుకోడానికి, దీర్ఘకాలంలో దుష్ఫలితాలు ఏర్పడకుండా చూడవచ్చు. డా. రాజశేఖర్ వరద, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్ -
బాబుకు పొత్తికడుపులో నొప్పి, మూత్రంలో ఎరుపు
మా బాబుకి తొమ్మిదేళ్లు. మూడు నెలల క్రితం బాబుకి మూత్రంలో రక్తం పడింది. అల్ట్రాసౌండ్ స్కాన్, ఎంసీయూ... ఇలా కొన్ని టెస్ట్‌లు చేశారు. రిపోర్ట్స్ నార్మల్ అనే వచ్చాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్ అని యాంటిబయటిక్స్ రాశారు. అయితే మూత్రం పోసేటప్పుడు పొత్తికడుపులో నొప్పిగా ఉందంటూ బాబు మళ్లీ బాధ పడుతున్నాడు. పదిరోజుల కిందట మళ్లీ మూత్రంలో రక్తం పడింది. డాక్టర్ దగ్గరకెళితే మళ్లీ పరీక్షలు చేశారు. అవి కూడా నార్మలే. అసలు మా బాబుకి ఏమై ఉంటుంది, రక్తం ఎందుకు పడుతోంది? మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను హిమెచ్యూరియా అంటారు. ఇది చాలా సాధరణమైన సమస్య. ఈ లక్షణం చూడటానికి భయపెట్టేదిగా అనిపించినా చాలా వరకూ ఎలాంటి ప్రమాదం ఉండదు. కొంతమందిలో మాత్రమే ఈ లక్షణం సీరియస్ సమస్య ఉండటానికి సూచన. పిల్లల యూరిన్‌లో రక్తం కనబడానికి గల కొన్ని కారణాలు: మూత్రనాళంలో రాళ్లు, రక్తానికి సంబంధించిన సికిల్ సెల్ డిసీజ్, కోయాగ్యులోపతి వంటి హెమటలాజికల్ సమస్యలు. వైరల్ / బ్యాక్టీరియల్, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్, మూత్రనాళంలో ఏవైనా అడ్డంకులు, కొల్లాజెన్ వ్యాస్క్యులార్ డిసీజ్, వ్యాస్క్యులైటిస్, పీసీజీఎన్, ఐజీఏ నెఫ్రోపతి వంటి ఇమ్యున్లాజికల్ సమస్యలు, పుట్టుకతోనే మూత్రపిండాల్లో లోపాలు ఉండటం వల్ల పిల్లలు మూత్రవిసర్జన చేసే సమయంలో రక్తం కనిపించవచ్చు. ఇక పిల్లల్లో అన్నిసార్లూ కంటికి కనబడేంత రక్తం రాకపోవచ్చు. అందుకే దీన్ని తెలుసుకోవాలంటే మైక్రోస్కోపిక్, కెమికల్ పరీక్షలు అవసరమవుతాయి. మీ అబ్బాయికి చేసిన అన్ని పరీక్షల్లో నార్మల్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్, హైపర్ కాల్సీ యూరియా అంటే మూత్రంలో అధికంగా కాల్షియం ఉండటం లేదా రక్తానికి సంబంధించిన సమస్యలతో పాటు థిన్ బేస్మెంట్ మెంబ్రేన్ డిసీజ్, ఐజీఏ నెఫ్రోపతి వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం ప్రధానం. కొన్ని సందర్భాల్లో ఇటువంటి సమస్యలు కొన్ని జన్యుపరంగా వస్తుంటాయి. మీ అబ్బాయికి మూడు నుంచి ఆరు నెలలకోసారి సాధారణ మూత్రపరీక్షలతో పాటు యూరిన్‌లో ప్రొటీన్ల శాతం, రక్త కణాల మార్ఫాలజీ, క్రియాటినిన్ లెవెల్స్ వంటి పరీక్షలు తరచూ చేయిస్తుండటం ముఖ్యం. బాబుకి పొత్తికడుపులో నొప్పి వస్తుందంటున్నారు కాబట్టి ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అవసరం. అయితే ఈ సమస్య కిడ్నీ వల్లగాని, జన్యుపరంగా గాని ఉత్పన్నమవుతున్నట్టు అనిపిస్తే బయాప్సీ చేయడం కూడా చాలా ముఖ్యం. మీ అబ్బాయికి రొటీన్ పరీక్షలు నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కాబట్టి, పైన చెప్పిన విషయాలను మీ డాక్టర్‌తో మరోసారి చర్చించి తగిన సలహా, చికిత్స తీసుకోండి. రోజుల పాప... తలలో తెల్ల వెంట్రుకలు మాకు కొద్దిరోజుల క్రితం పాప పుట్టింది. పాపకు తలలో కొంత మేర వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. ఇదేమైనా భవిష్యత్తులో ల్యూకోడెర్మా వంటి జబ్బుకు దారితీసే ప్రమాదం ఉందా? మీ పాపకు ఉన్న కండిషన్ (లోకలైజ్డ్ ప్యాచ్ ఆఫ్ వైట్ హెయిర్)ను పోలియోసిస్ అంటారు. సాధారణంగా ఇది తల ముందు భాగంలో అంటే నుదుటిపై భాగంలో కనిపిస్తుంటుంది. అయితే మరెక్కడైనా కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలా ఉందంటే అది ప్రతీసారీ తప్పనిసరిగా ఏదో రుగ్మతకు సూచిక కానక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని జన్యుపరమైన సమస్యలకు సూచన కావచ్చు. చర్మంలోని పిగ్మెంట్లలో మార్పుల వల్ల కూడా రావచ్చు. కంట్లో పిగ్మెంట్కు సంబంధించిన ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లల్లో ఏదైనా హార్మోనల్ సమస్యలు (అంటే థైరాయిడ్, జననేంద్రియాలకు సంబంధించినవి) ఉండటానికి సూచన కావచ్చు. ఇలాంటి అసోసియేటెడ్ సమస్యలేవీ లేకపోతే మీ పాపకు ఉన్న ఈ లక్షణం... ల్యూకోడెర్మా లాంటి సమస్యకు దారితీసే అవకాశం లేదు. పాపను ఒక్కసారి పీడియాట్రీషియన్‌కు చూపించండి. మీరు రాసినదాన్ని బట్టి పాపకు తక్షణ చికిత్స ఏదీ అవసరం లేదు. మీరూ ఈ విషయంలో ఆందోళన పడకుండా ఒకసారి డాక్టర్‌ను కలిసి ఇతరత్రా ఏ సమస్యలూ లేవని నిర్ధరించుకొని నిశ్చింతగానే ఉండండి. పాపకు తలలో ర్యాష్... పరిష్కారం చెప్పండి మా పాపకు ఆరు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. మా డాక్టర్గారికి చూపించాం. మొదట తగ్గిందిగానీ, కొన్నాళ్లకు మళ్లీ వచ్చింది. పాపకు తలలోని కొన్నిప్రాంతాల్లో జుట్టు సరిగా రావడం లేదు. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఏదైనా సూచనా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో కూడా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్. పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనకభాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న కీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్ల తప్పనిసరిగా వీళ్లకు నయమవుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం. ఇదేమీ భవిష్యత్తు వ్యాధులకు సూచిక కాదు. మీరు ఒకసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఈ సమస్య తప్పక తగ్గిపోతుంది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
సచివాలయంలోనే మందుల్లేవ్..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పాలనకు కేంద్రంగా ఉండే సచివాలయంలోనే మందులకు దిక్కులేని పరిస్థితి నెలకొని ఉంది. గత రెండు మాసాలుగా మధుమేహం నివారణ (షుగర్)కు ఇచ్చే మాత్రలు లేకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మందులను రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) సరఫరా చేయాలి. కానీ గడిచిన రెండు మాసాలుగా మధుమేహం నివారణ మందులు సరఫరా చేయలేదు. సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ ఇక్కడి నుంచే మందులు సరఫరా అవుతాయి. సచివాలయ ఉద్యోగులు 2 వేల మంది ఉండగా, వారికే సకాలంలో సరఫరా చేయలేకపోతున్నారు. చాలా మంది ఉద్యోగులు సచివాలయంలోని డిస్పెన్సరీకి వెళ్లడం, మందులు లేవని చెప్పడంతో వెనుదిరిగి వస్తున్నారు. ఈ మందులతో పాటు మరికొన్ని యాంటీబయోటిక్స్, బీకాంప్లెక్స్, విటమిన్ మాత్రలు కూడా అందుబాటులో లేవని చెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ సచివాలయంలోని డిస్పెన్సరీలో ఎప్పుడూ మందులు లేవని చెప్పేవారు కాదని, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు మందులు ఉంటాయో, ఎప్పుడు ఉండవో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. అలాగే సచివాలయం ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తయినా ఇప్పటివరకూ రక్తపరీక్షలు కూడా చేయలేని పరిస్థితి నెలకొని ఉందని ఉద్యోగులు వాపోయారు. ఏ రక్తపరీక్ష చేయించుకోవాలన్నా బయటికి వెళ్లి చేయించుకోవాల్సి వస్తోందని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని రెవెన్యూ విభాగానికి చెందిన ఓ అధికారి వాపోయారు. ఇప్పటివరకు లేబొరేటరీ కూడా ఏర్పాటు చేయలేక పోవడం దారుణమని, అంబులెన్సు కూడా అందుబాటులో ఉండదన్నారు. ఎవరైనా ఉద్యోగులు 108కు ఫోన్ చేస్తే తూళ్లూరు నుంచి గాని, మరెక్కడనుంచో ఇక్కడకు రావాలని, దీనికి బాగా సమయం పడుతోందని పేర్కొన్నారు. -
హాజీపూర్ బాధితుల రక్త నమూనాల సేకరణ
బొమ్మలరామారం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లోని మర్రిబావి, తెట్టెబావులలో లభించిన కల్పన, మనీషాల మృతదేహాల నిర్ధారణ కోసం పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా సోమవారం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులనుంచి రక్త నమూనాలను సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. -
నిద్రపట్టడం లేదు... సలహా ఇవ్వండి
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 33 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ప్రతి రెండు వారాలకు ఒకసారి షిఫ్ట్ మారుతుంది. ఈ మధ్యే డే–షిఫ్ట్ కు మారాను. అయినా రాత్రివేళ సరిగా నిద్రపట్టడం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఎమ్. నవీన్, హైదరాబాద్ మనిషికి గాలి, నీరు, తిండి లాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే కళ్లలో కళాకాంతులు తగ్గుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. అలసట, ఆందోళన మాత్రమే గాక అనేక ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమవుతుంది. శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెలకువ రావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన ఒకటి రెండు లక్షణాలు. అయితే ఇవి అన్నీ గాని... కొన్ని గాని ఉండటాన్ని వైద్యపరిభాషలో ఇన్సామ్నియా (నిద్రలేమి)గా చెప్పవచ్చు. నిద్రలేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచన గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కారణాలు : ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శారీరకంగా వచ్చే మార్పులు ∙చికాకులు ∙చీటికిమాటికి కోపం తెచ్చుకోవడం ∙దీర్ఘకాలిక వ్యాధులు ∙వంశపారంపర్యం ∙అంతులేని ఆలోచనలు లక్షణాలు: ∙నిద్రలోకి జారుకునేందుకు కష్టపడిపోవడం ∙నిద్రపట్టినా మధ్య మధ్య మెలకువ వస్తూ ఉండటం, నాణ్యమైన నిద్ర లోపించడం ∙తెల్లవారుజామున మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టకపోవడం ∙నిద్రలేచిన తర్వాత విశ్రాంతిగా అనిపించకపోవడం నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, పాలీసామ్నోగ్రామ్ (పీఎస్జీ) చికిత్స: హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్‌వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బమ్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 – 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ గౌట్ సమస్యకు పరిష్కారం ఉందా? నా వయసు 43 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. సలపరంతో కూడిన తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌గారు గౌట్ అని చెప్పారు. ఎన్ని మందులు వాడినా ఉపశమనం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఆర్. కళ్యాణ్, గుంటూరు గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీళ్లు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు: సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు : మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగ, పేగుల వంటివి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటున్నారు... నా వయసు 62 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటంతోబాటు కీళ్లవద్ద ఎర్రగా మారాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. మాలకొండారావు, ఒంగోలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే తన వ్యాధి నిరోధక శక్తి తన పట్ల ప్రతికూలంగా పనిచేయడం. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి.ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకేకీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు.రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగానియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ఇలా మాటిమాటికీ రక్తం ఎక్కించాల్సిందేనా?
మా పాప పుట్టిన తర్వాత తెల్లగా పాలిపోయినట్లుగా ఉంటే పరీక్షచేసి హీమోగ్లోబిన్ పాళ్లు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. అప్పటినుంచి నెలనెలా రక్తం ఎక్కిస్తూ ఉండాలని చెప్పారు. మూడేళ్ల తర్వాత ప్లీహం (స్లీ్పన్) తొలగిస్తే ఇలా తరచూ రక్తం ఎక్కించే అవసరం తగ్గుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్ చేయించాం. తర్వాత రెండు నెలలకోసారి రక్తం ఎక్కిస్తున్నారు. మంచి ఆహారం పెడుతూ నెలకోసారి పెనిడ్యూర్ ఇంజెక్షన్ చేయిస్తున్నాం. రక్తం ఎక్కించాక నెలన్నరకే... పాప పాలిపోయి నీరసంగా తయారవుతోంది. ఇలా మాటిమాటికీ రక్తం ఎక్కించే బాధ తప్పదా? దీనికి శాశ్వత చికిత్స లేదా? సాధారణంగా మన రక్తంలోని ఎర్ర రక్తకణాలు మధ్యన కాస్తంత నొక్కినట్లుగా బిళ్లలలా ఉంటాయి. కానీ మీ పాపకు ఉన్న సమస్య వల్ల తయారయ్యే ప్రక్రియలోనే అవి బంతిలా గుండ్రంగా తయారవుతుంటాయి. పాపకు ఇది పుట్టుకతో జన్యుపరంగా వచ్చిన సమస్య. ఇలా కణాల ఆకృతి భిన్నంగా ఉండటంతో మన శరీరంలోని ప్లీహం (స్పీ›్లన్) వాటిని లోపభుయిష్టమైన కణాలుగా గుర్తించి, ఎప్పటికప్పుడు నాశనం చేసేస్తుంటుంది. అందుకే పాపకు తరచూ రక్తహీనత వస్తోంది. సాధారణంగా ఒక ఎర్రరక్తకణం జీవితకాలం 120 రోజులు. కానీ ప్లీహం ఈ రక్తకణాలన్నింటినీ చాలా ముందుగానే నాశనం చేస్తుండటంతో వాటి సంఖ్య తగ్గిపోయి, తరచూ రక్తహీనత వస్తుంది. అందుకే చికిత్సలో భాగంగా బయటి నుంచి రక్తం ఎక్కిస్తున్నారు. అలాగే ఉన్న రక్తకణాలు నాశనం కాకుండా కాపాడుకునేందుకు ప్లీహాన్ని కూడా తొలగించారు. ఇక పుట్టిన ఎర్రరక్తకణాలు త్వరత్వరగా నాశనమైపోతున్నాయి. కాబట్టి ఎముక మూలుగ/మజ్జ ఇంకా ఎక్కువెక్కువ ఎర్రరక్తకణాలను తయారు చేస్తుంటుంది. అది అవసరం కూడా. అందుకే దానికి కావాల్సిన మూలవనరులైన ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, ఐరన్ తదితరాలను మనం మాత్రల రూపంలో బయటి నుంచి ఇస్తుండాలి. దీనివల్ల పుట్టిన ఎర్రరక్తకణాలు ఎంతోకొంత సమర్థంగా ఉంటాయి. ప్లీహాన్ని తొలగించారు కాబట్టి ఒంట్లో నుంచి హానికారక/వ్యాధికారక సూక్ష్మక్రిముల వంటివి త్వరగా బయటకు పోవు. ఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చే ముప్పు ఎక్కువ. దీన్ని నివారించేందుకు పాపకు తరచూ నెలనెలా పెనిడ్యూర్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇది చాలా అవసరం. ►ఇక మీ పాప విషయంలో ప్రతి రెండు నెలలకోసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సి రావడం ఇబ్బందికరమే. మామూలుగా ప్లీహం తొలగించిన తర్వాత కొందరిలో రక్తం ఎక్కించాల్సిన అవసరమే తలెత్తదు. కానీ సమస్య తీవ్రంగా ఉన్న కొద్దిమందిలో మాత్రం ఇలా తరచూ రక్తం ఎక్కించాల్సి వస్తుంటుంది. ►తరచూ రక్తం ఎక్కిస్తున్నప్పుడు ఒంట్లో నుంచి ఇనుమును తొలగించే మందులు వాడుకోవడం తప్పనిసరి. ఎందుకంటే రక్తం ఎక్కించిన ప్రతిసారీ దాదాపు 100–150 మి.గ్రా. ఇనుము మన శరీరంలో పేరుకుపోతుంది. దీన్ని తొలగించేందుకు పాపకు నిత్యం మందులు ఇవ్వాలి. లేకపోతే ఆ ఇనుము... కాలేయం, గుండె వంటి అవయవాల్లో పేరుకుపోయి వాటిని దెబ్బతీస్తుంది. ►నిజానికి జన్యుపరంగా వచ్చే ఇలాంటి వ్యాధులన్నింటికీ రక్తం ఎక్కించడం తప్పించి, ఇతరత్రా చికిత్స ప్రక్రియలు తక్కువనే చెప్పాలి. ఇలాంటి వారికి కచ్చితమైన చికిత్స ఎముక మూలుగ మార్పిడి (బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్). మిగతా చికిత్సలన్నీ సమస్యను నియంత్రణలోకి తెచ్చేందుకే. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని రక్తవ్యాధుల నిపుణుడిని సంప్రదించండి. పచ్చకామెర్లకు కారణం ఏమిటి? జాగ్రత్తలు చెప్పండి మా బాబుకు పదమూడేళ్లు. అతడికి ఈ మధ్య పచ్చకామెర్లు వచ్చాయి. దయచేసి దానికి కారణాలు, జాగ్రత్తలతోపాటు వీలైతే నివారణోపాయాలు కూడా చెప్పగలరు. రక్తంలోని ఎర్ర రక్తకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురుబిన్ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురుబిన్ పరిమాణం రెట్టింపు అవ్వడం వల్ల వచ్చేవే పచ్చకామెర్లు. వీటినే జాండిస్ అని కూడా అంటారు. కామెర్లు వచ్చిన వారి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి. పచ్చకామెర్లు వ్యాధి కాదు. ఇది వ్యాధి తాలూకు ఒక లక్షణం. మనం సాధారణంగా బాధపడే పచ్చకామెర్లు మన శరీరంలోని కాలేయం అనే అవయవం సూక్ష్మజీవుల బారిన పడటం వల్ల వస్తుంది. ఇది రావడానికి మూడు ముఖ్య కారణాలు. అవి... 1) రక్తంలో ఎర్రరక్తకణాలు అత్యధికంగా విచ్ఛిత్తికావడం. దీన్ని హీమోలిటిక్ జాండీస్ అంటారు. 2) ఎర్రరక్తకణాల విచ్ఛిత్తి వల్ల చోటు చేసుకున్న బిలురుబిన్ లివర్ కణాలలోకి చేరలేకపోవడం. దీన్ని ‘హెపాటిక్ జాండీస్’ అంటారు. 3) లివర్‌లో ఉత్పత్తి అయిన పైత్యరసం (బైల్) ప్రవాహమార్గంలో అవరోధం ఏర్పడి, అది పేగులలోకి చేరలేకపోవడం. దీన్ని ‘అబ్స్ట్రక్టివ్ జాండిస్’ అంటారు. లివర్ ఇన్ఫెక్షన్కు గురైనట్లయితే ‘హెపటైటిస్’ అని వ్యవహరిస్తారు. హెపటైటిస్ కేసుల్లో హెపాటిక్ జాండిస్ చోటుచేసుకుంటుంది. హెపటైటిస్‌కు ప్రధాన కారణాలు: ►ఇన్ఫెక్షన్ ►ఆల్కహాల్ ► పౌష్టికాహార లోపం. ఇన్ఫెక్షన్ పరంగా ఐదు రకాల వైరస్‌లను గుర్తించారు. ఇవి... హెపటైటిస్ ఎ, బి, సి, డి. చికిత్స: నీటి ప్రభావానికి లోనై వచ్చే వ్యాధులలో పచ్చకామెర్లు వ్యాధి ఒకటి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సత్వర నివారణ చర్యలు చేపట్టకుంటే ఇది మన శరీరంలోని అత్యంత ప్రధాన భాగమైన కాలేయాన్ని పనిచేయకుండా చేసి పరిస్థితిని మరింత విషమింపజేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ వ్యాధి వస్తే మళ్లీ రాకూడదన్న నియమం లేదు. దీని నివారణకు ఆహారంలోని కొన్ని నియమాలు పాటించాలి. ►ఏ ప్రాంతంలో ఉన్నా, తాగే నీటిని కాచి, వడబోసి, చల్లార్చి వాడటం మంచిది. లేదా ఫిల్టర్ చేసిన నీటిని మరగబెట్టయినా వాడవచ్చు. ►పచ్చకామెర్లు వ్యాధి సోకితే దుంపలు వాడకూడదు. అలాగే సరిగా జీర్ణం కానివి ఏవీ వాడకూడదు. ►మజ్జిగ బాగా వాడాలి. కొబ్బరినీళ్లు తాగాలి. అరటిపండ్లు బాగా తినాలి. ►మాంసాహారులు మాంసానికీ, చేపలకు దూరంగా ఉండాలి. ►గోంగూరకు దూరంగా ఉండాలి. ఆవకాయ, మాగాయ లాంటి పచ్చళ్లకు కొన్నాళ్లు వాటికి దూరంగా ఉండాలి. కారం, పులుపు, ఉప్పు తగ్గించక తప్పదు. డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీసీనియర్ హిమటాలజిస్ట్, హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, స్టార్ హాస్సిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్