వీర్యంలో పస్‌సెల్స్ ఎక్కువ, ఏం చేయాలి? | Passels than in semen, what should happen? | Sakshi
Sakshi News home page

వీర్యంలో పస్‌సెల్స్ ఎక్కువ, ఏం చేయాలి?

Published Sun, Aug 23 2015 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

Passels than in semen, what should happen?

గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్
 
 ఆహారం సరిగా జీర్ణం కావడం లేదు!
నా వయసు 26 ఏళ్లు. బరువు 64 కేజీలు. నేను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాను. కొద్దిరోజులుగా పొట్ట అంతా ఉబ్బరంగా ఉంటోంది. తేన్పులు ఎక్కువగా వస్తున్నాయి. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కావడం లేదు. వీటితో పాటు కోపం, చిరాకు ఎక్కువగా కలుగుతున్నాయి. శారీరకంగానూ, మానసికంగానూ బాధపడుతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరని ప్రార్థిస్తున్నాను.
 - ఒక సోదరుడు, హైదరాబాద్

 మీరు రాసిన లక్షణాలను బట్టి చూస్తే మీరు పెప్టిక్ అల్సర్‌తో గానీ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధితో గాని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఈ సమస్యతో ఎంతకాలం నుంచి బాధపడుతున్నారో రాయలేదు. చాలావరకు అల్సర్స్‌కు సంబంధించిన వ్యాధి వల్ల కడుపులో నొప్పి రావడం, మంటరావడం జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత నొప్పి ఎక్కువ కావడం గానీ, తక్కువ కావడం గానీ జరుగుతుంది. ఒక్కోసారి కడుపులో అల్సర్స్ తీవ్రత ఎక్కువగా ఉంటే భోజనం తర్వాత వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు ముందుగా మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకొని, వ్యాధి నిర్ధారణ జరిగేలా చూసుకోండి. ఎండోస్కోపీ పరీక్షతో మీ వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ అయితే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది.
 
 నాకు ఆర్నెల్ల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు చేసిన రక్త పరీక్షల్లో హెపటైటిస్-బి పాజిటివ్ అని చెప్పారు. ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు మళ్లీ తిరిగి ఆ టెస్ట్ చేయిస్తే మళ్లీ పాజిటివ్ అని తెలిపారు. ఈ వ్యాధికి తగిన చికిత్స అందుబాటులో ఉందా? నాకు సరైన సలహా ఇవ్వండి.
 - సుదర్శన్‌నాయుడు, చిత్తూరు

 మీరు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే ఆరు నెలల తర్వాత కూడా మీకు మీ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది కాబట్టి మీకు క్రానిక్ హెపటైటిస్-బి ఉందని అర్థం. ఈ వ్యాధి ఉన్నవారు మొదట కొన్ని రక్తపరీక్షలు చేయించుకొని, వ్యాధి ఏ స్థాయిలో ఉందో నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి చాలామందిలో నిద్రాణ స్థితిలో ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి చైతన్యవంతం అయ్యే అవకాశం ఉంది. మీరు ప్రతి మూడు నెలలకోసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు నడుచుకోండి.
 
 
యాండ్రాలజీ కౌన్సెలింగ్

 
 
వీర్యంలో పస్‌సెల్స్ ఎక్కువ, ఏం చేయాలి?
నా వయుస్సు 34 ఏళ్లు. నాకు వివాహం జరిగి పదేళ్లు దాటింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. దాంతో దంపతులిద్దరం వైద్యపరీక్షలు చేయించుకున్నాం. ఆమెలో ఏ లోపం లేదు. కానీ నా వీర్యంలో పస్ సెల్స్ ఎక్కువగా (ప్లెంటీ ఆఫ్ పస్ సెల్స్) ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. పస్ సెల్స్ ఉన్నందువల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయా? మాకు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి?
 - కేజేఎన్., విజయవాడ

చాలాకాలంగా సంతానం లేనివారిలో మగవారికి మొదట సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఈ పస్ సెల్స్ ఉన్నప్పుడు వీర్యం నాణ్యత తగ్గుతుంది. దాంతో పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. డాక్టర్ సలహా మీద సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల వీర్యంలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ తగ్గితే వీర్యం నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. యూంటిబయూటిక్స్ మొదలుపెట్టిన వుూడు వారాల తర్వాత వుళ్లీ మరోసారి సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేసి, ఈసారి వీర్యం క్వాలిటీ వూవుూలుగా ఉన్నట్లు రిపోర్టు వస్తే మీకు పిల్లలు పుట్టే అవకాశాలు తప్పక మెరుగవుతాయి.
 
నాకు కుడిపక్కన వరిబీజం (బుడ్డ) వచ్చింది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అన్నారు. కానీ ఆపరేషన్ వల్ల సెక్స్‌లో ఇబ్బందులేమైనా వస్తాయేమోననీ, పిల్లలు కలగరేమో అని చేయించుకోవడం లేదు. నాకు మార్గం చెప్పగలరు.
 - జీడీఎస్‌పీ., గుణదల

 హైడ్రోసీల్, హెర్నియా... ఈ ఆపరేషన్లకూ అంగస్తంభనకూ ఎలాంటి సంబంధం లేదు. అంగస్తంభనకు కావాల్సిన నరాలు అంగంలో చాలా లోపలికి ఉంటాయి. మీకు ఆపరేషన్ వృషణాల దగ్గర చేస్తారు. దీని వల్ల సెక్స్ చేయడానికి ఇబ్బంది అయ్యే అవకాశమే లేదు. పిల్లలు పుట్టకపోవడం అనేది కూడా జరగదు. నిజానికి మీ సమస్యకు ఆపరేషన్ చేయించుకోకపోతేనే చాలా ప్రమాదం. సర్జరీ తర్వాత సమస్యలన్నీ తొలగి, అంతా నార్మల్ అయిపోతుంది. కాబట్టి నిశ్చింతగా సర్జరీ చేయించుకోండి.

నా వయసు 40. మూడేళ్లుగా షుగర్‌వ్యాధితో బాధపడుతున్నాను. ప్రస్తుతం చక్కెరపాళ్లు కంట్రోల్‌లోనే ఉన్నాయి. కానీ రెండు మూడు నెలల నుంచి మూత్రంలో మంట, పురుషాంగం చివరిభాగంలో చర్మంపై పగుళ్లు వస్తున్నాయి. సెక్స్ చేసేటప్పుడు పురుషాంగం చివరన ఉన్న చర్మం మంటపుడుతోంది. దాంతోపాటు సెక్స్ సమయంలో పురుషాంగం చివర ఉన్న చర్మం వెనక్కిపోవడం లేదు. నా సమస్యకు సరైన మార్గాన్ని సూచించండి.
 - ఎస్.ఆర్.ఎస్.ఎమ్., నెల్లూరు

షుగర్ వ్యాధి ఉన్నవారిలో పురుషాంగం చివరన ఉన్న చర్మంపై పగుళ్లు రావడం, ఇన్ఫెక్షన్ రావడం, తెల్లగా పాలిపోయినట్లుగా కావడం వంటి సమస్యలు చాలా సాధారణం. ఈ సమస్యను బెలనోఫ్తైస్ అంటారు. సాధారణంగా యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ క్రీమ్‌లతో ఇది తగ్గిపోతుంది. కాకపోతే పదే పదే వస్తుండటంతో పాటు... ప్రధానంగా చర్మం వెనక్కిపోకుండా సెక్స్‌లో సమస్యగా మారిన వారు దీనికోసం సున్తీ (సర్కమ్‌సిషన్) ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. అదేవిధంగా షుగర్ ఉన్న పేషెంట్స్‌లో యూరిన్‌లో ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తున్నా కూడా సున్తీ ఆపరేషన్‌ను సూచిస్తాం. ఈ ఆపరేషన్ తర్వాత మీరు పేర్కొన్న సమస్యలన్నీ దూరం కావడం వల్ల నిశ్చింతగా సెక్స్‌లో పాల్గొనవచ్చు.
 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
 
తుంటి ఎముక ఫ్రాక్చర్, సర్జరీ తప్పదా?

మా చిన్నమ్మగారి వయసు 77 ఏళ్లు. ఆమె ఆర్నెల్ల క్రితం బాత్‌రూమ్‌లో జారిపడింది. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఆయన ఎక్స్-రే తీసి, తుంటి ఎముక ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పడంతో మేం ఆమెను ఆర్థోపెడిక్ సర్జన్ వద్దకు తీసుకెళ్లాం. ఆమెకు మేజర్ సర్జరీ అవసరమనీ, దానికి సంబంధించిన అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా వివరించారు. మా కుటుంబ సభ్యులమంతా ఆ రిస్క్ ఫ్యాక్టర్లు విన్న తర్వాత చాలా ఎక్కువగా ఆందోళన పడ్డాం. కొందరు సన్నిహితుల సలహా మేరకు ఆమెను ఇంగ్లిష్ వైద్యులకు బదులుగా సంప్రదాయ వైద్యం చేస్తూ, ఎముకలను సరిచేసే వారిదగ్గరకు తీసుకెళ్లాం. వారేదో బ్యాండేజీ లాంటిది కట్టి, బెడ్‌రెస్ట్ తీసుకొమ్మని సలహా ఇచ్చారు. ఒక మూడు నెలల్లో ఆమె లేచి తిరుగుతుందని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆమె మంచం దిగలేపోతోంది. పైగా ఎప్పుడూ మంచం మీదే పడుకొని ఉండటం వల్ల వీపు మీద అంతటా పుండ్లు (బెడ్‌సోర్స్) వచ్చాయి. ఈ దశలో మాకు తగిన సలహా ఇవ్వమని ప్రార్థన.
 - వెంకటదుర్గారావు, విజయవాడ

 తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడం అన్నది పెద్ద వయసువారిలో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఆ వయసువారు సాధారణంగా డయాబెటిస్, గుండెజబ్బులతో బాధపడుతుంటారు. తుంటిఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు చాలా సందర్భాల్లో శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది. అయితే ఆ వయసు వారిలో శస్త్రచికిత్స అంటే ప్రపంచంలోని ఉత్తమమైన ఆసుపత్రికి వెళ్లినా ఆ వయసుకు సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్లు ఉండనే ఉంటాయి. అయితే ఆ రిస్క్ ఫ్యాక్టర్లకు జడిసి మీరు ఆపరేషన్ చేయించుకోకపోతే మున్ముందు మరింత తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇక ప్రస్తుత సమస్యకు వస్తే ఆమె మళ్లీ లేచి నిలబడి తిరగాలంటే శస్త్రచికిత్స తప్పనిసరి. కాకపోతే ఆర్నెల్ల కిందటితో పోలిస్తే ఈసారి రిస్క్ మరింత పెరుగుతుందని గుర్తించండి. ప్రమాదం జరిగినపుడు సాధ్యమైనంత త్వరలో శస్త్రచికిత్స చేయిస్తే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి.
 
 ఫెర్టిలిటీ కౌన్సెలింగ్

పిల్లల కోసంమీరంత నిరాశ పడనక్కరలేదు!
నా వయసు 26 ఏళ్లు. నేను రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నాను. నాకు పెళ్లయి నాలుగేళ్ల అవుతోంది. గత మూడేళ్లుగా పిల్లలు కావాలని కోరుకుంటున్నాను. అయితే నాకు పీరియడ్స్ నాలుగైదు నెలలకొకసారి వస్తున్నాయి. డాక్టర్‌ను కలిశాను. స్కానింగ్ తీసి పాలీ సిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని చెప్పారు. నాకు ఎప్పటికైనా పిల్లలు పుడతారా? దయచేసి తగిన సలహా ఇవ్వండి.
 - ఒక సోదరి, హైదరాబాద్

 పాలీ సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్యను చాలా మంది మహిళల్లో మేం రోజూ చూస్తుంటాం. మీకు పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సమస్య ఉంది కాబట్టి ఇలా రుతుస్రావం క్రమంగా రాదు. దాంతో మీలో అండాలు ఉత్పత్తి అయ్యే సంఖ్య కూడా బాగా తగ్గుతంది. ఫలితంగా మీలో గర్భధారణకు చాలా టైమ్ పట్టవచ్చు.

 మొట్టమొదట మీరు చేయాల్సిన పని... మీరు ఒకవేళ ఎక్కువ బరువు ఉంటే దాన్ని క్రమంగా తగ్గించుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చేసుకోండి. ఇదే జరిగితే...మీలో రుతుస్రావం క్రమబద్ధంగా రావడం మొదలవుతుంది. ఇక మీ ఆహారంలో ముదురాకుపచ్చటి తాజా ఆకుకూరలు చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పిజ్జా, బర్గర్, బేకరీ ఐటమ్స్ వంటి జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానేయండి.

 ఈరోజుల్లో మీలో అండం ఉత్పత్తి అయ్యేలా చేసేందుకు చాలా మంది మందులు, వైద్యప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. మొదట టాబ్లెట్స్‌తో ప్రారంభించి, చికిత్సకు మీరు స్పందిస్తున్న తీరు ఆధారంగా క్రమంగా మీకు గొనాడోట్రాపిన్ ఇంజక్షెన్ ఇవ్వడం వంటివి చేస్తాం. లేదా మందులూ, గొనాడోట్రాపిన్ ఇంజెక్షన్ కలిపి కాంబినేషన్లలో కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీలాంటి వారిలో చాలామంది చాలా ప్రాథమిక చికిత్సకే బాగా స్పందిస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. అప్పటికీ ఫలితం కనిపించకపోతే లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ఒవేరియన్ డ్రిల్లింగ్ చేస్తాం. ఐవీఎఫ్ అనే అధునాతన చికిత్స చాలా కొద్దిమందికి మాత్రమే అవసరమవుతుంది.

 మీరు అప్పుడే అంత నిరాశపడాల్సిన అవసరం లేదు. మీకు పిల్లలు పుట్టేందుకు చాలా అవకాశాలే ఉన్నాయి. ఇక మీకు పీసీఓఎస్ ఉందంటే దీంతోపాటు దీర్ఘకాలంలో డయాబెటిస్, యుటెరైన్ క్యాన్సర్, గుండెసమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మొదట మీరు మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోండి. సరైన చికిత్స తీసుకుంటూ క్రమబద్ధంగా రుతుస్రావం జరిగేలా చూసుకుంటే చాలా సమస్యలు వాటంతట అవే చక్కబడతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement