diagnosis
-
యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్: ధమనిలో సునామి..!
అసలు ‘యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్’ అంటే ఏమిటో తెలుసుకునే ముందర అన్యురిజమ్ అంటే ఏమిటో చూద్దాం. కొన్నిసార్లు రక్తనాళాల (ధమనుల) గోడలు కొన్ని చోట్ల పలుచబడి బెలూన్లా ఉబ్బే ప్రమాదం ఉంది. ఇలా ఉబ్బినట్లు కావడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అ పలచబడిన రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్ (యూఏపీఏ) అంటే... గర్భసంచికి (యుటెరస్‌కు) సప్లై అయ్యే రక్తనాళం ఉబ్బడం. అయితే ‘సూడో’ అంటే వాస్తవమైనది కాదనీ, ఉబ్బులా కనిపిస్తూ, చిట్లినప్పటికీ రక్తస్రావం చాలా కొద్ది ప్రాంతానికి పరిమితమవుతుందని అర్థం. అందుకే దీన్ని ‘యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్’ అని చెప్పవచ్చు. ఇది కాస్తంత అరుదుగా కనిపించే సమస్యే అయినప్పటికీ ప్రాణాంతకం అయ్యే అవకాశమున్నందున దీనిపై అవగాహన కోసం...నిజానికి సూడో అన్యురిజమ్ గురించి మరింత విపులంగా చెప్పుకోవాలంటే... అన్యురిజమ్స్ అనేవి దేహంలోని రక్తనాళాల్లో ఎక్కడైనా రావచ్చు. మెదడులో, గుండెకు రక్తాన్ని చేసే థొరాసిక్ ప్రాంతాల్లో వచ్చినప్పుడు ప్రమాదకరంగా మారతాయి. అయితే ఇప్పుడు యుటెరస్‌కు రక్తసరఫరా చేసే రక్తనాళం బాగా పలుచబారి ఒక చిన్న బెలూన్లా లేదా సంచిలా ఉబ్బి చిట్లితే అది రక్తస్రావం చాలా కొద్ది ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతుంది. చుట్టుపక్కల ఉండే కణజాలం ఆ రక్తస్రావాన్ని చాలాదూరం ప్రవహించనివ్వదు. అయితే ఈ కండిషన్ తీవ్రమైన బాధ కలిగిస్తుంది. యుటెరస్లోని ఫైబ్రాయిడ్స్ వంటి తిత్తులు చిట్లడం వల్ల గానీ లేదా కొన్నిసార్లు గర్భస్రావాలు అయినప్పుడుగానీ ఇలాంటి కండిషన్ ఏర్పడటానికి అవకాశాలెక్కువ. అయితే ఇది తక్షణం శస్త్రచికిత్సకు దారితీయవచ్చు. ఒక్కోసారి తుంటి ఎముక విరగడానికి కూడా అవకాశాలుంటాయి. లక్షణాలు... యోని నుంచి భారీగా రక్తస్రావం ఈ రక్తస్రావంలో మధ్య మధ్య అంతరాయాలు (అంటే... అదేపనిగా కాకుండా కాసేపు కనిపిస్తూ, మరికాసేపు ఆగుతూ అప్పుడప్పుడూ జరుగుతుండవచ్చు) పొత్తికడుపు నుంచి కింది భాగమంతా తీవ్రమైన నొప్పి కొన్నిసార్లు పై లక్షణాలేమీ కనిపించకపోవచ్చు కూడా (అసింప్టమేటిక్‌గా వచ్చే ఈ సమస్య... ఇతర కారణాలను అన్వేషిస్తూ ఇమేజింగ్ పరీక్షలు చేస్తున్నప్పుడు బయటపడవచ్చు). నిర్ధారణ... ఈ కింద పేర్కొన్న పరీక్షల వల్ల సూడో అన్యురిజమ్ కారణంగా జరుగుతున్న రక్తస్రావాలు తెలుస్తాయి. డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కాంట్రాస్ట్ ఎన్హ్యాన్స్డ్ అల్ట్రాసౌండ్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ స్కాన్) మేగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎమ్మారై) యాంజియోగ్రఫీ చికిత్సలు... మేనేజ్మెంటే తొలి చికిత్స...అన్యురిజమ్‌కు చికిత్స అన్నది రక్తనాళాల ఉబ్బు సైజు, బాధితురాలిలో కనిపిస్తున్న లక్షణాలను బట్టి ఉంటుంది. ఒకవేళ ఉబ్బు చిన్నగా ఉన్నట్లయితే ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్’ అనే ప్రక్రియను అనుసరిస్తారు. (ఇందులో చాలా చిన్న గాటుతో అక్కడికి రక్తం చేరకుండా ఆపుతారు). కొన్ని సందర్భాల్లో పూర్తిస్థాయి శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. అయితే చిన్నగాటుతో చేసే ఎంబోలైజేషన్కే డాక్టర్లు ప్రాధాన్యమిస్తుంటారు. చిన్న గాటుతోనే చికిత్స పూర్తి చేయడానికి అవకాశముండటంతో బాధితురాలికి ప్రాణాపాయం ముప్పు చాలా తక్కువగా ఉండటమే దీనికి కారణం.యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్‌కు అత్యాధునిక చికిత్సలు... సమస్య ఉన్న ప్రాంతం వంటి అంశాలను బట్టి మరికొన్ని ఆధునిక చికిత్సలను డాక్టర్లు అనుసరిస్తుంటారు. ఉదా: యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (యూఏఈ) : ఇది ప్రామాణికంగా చేసే చాలా మంచి చికిత్స (గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్). ఇందులో చాలా చిన్న గాటుతో రక్తనాళంలోకి మరో చిన్న పైప్‌ను (క్యాథెటర్)ను పంపుతారు. ఆ తర్వాత ఉబ్బు వచ్చిన రక్తనాళాన్ని అనేక చుట్లు చుట్టడం (కాయిలింగ్ చేయడం) ద్వారా ప్రభావితమైన ప్రాంతానికి రక్తసరఫరాను నిలిపివేస్తారు. దాంతో ఉబ్బిన చోటికి రక్తం ఆగడంతో అది చిట్లే ప్రమాదం తప్పిపోతుంది. ఇది చాలా మంచి చికిత్స ప్రక్రియగా అనేక సార్లు నిరూపితమైంది. శస్త్రచికిత (సర్జికల్ ఇంటర్వెన్షన్) : ఒకవేళ యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (యూఏఈ)కి అవకాశం లేకపోయినా లేదా యూఏఈ ప్రక్రియ విఫలమైన సందర్భాల్లో శస్త్రచికిత్సకు పూనుకుంటారు. ఇందులో పలుచబడ్డ ప్రాంతాన్ని తొలగించి, మళ్లీ రక్తనాళాలను కలపడమో లేదా మరీ ప్రాణాపాయ పరిస్థితి ఉన్నప్పుడు హిస్టరెక్టమీ ప్రక్రియ ద్వారా గర్భసంచిని తొలగించడమో చేస్తారు. హైబ్రీడ్ టెక్నిక్స్...కొన్ని సందర్భాల్లో ఇటు ఎంబోలైజేషన్తోపాటు అటు సర్జరీ... ఈ రెండూ కలగలసిన ప్రక్రియలను అనుసరిస్తారు. మరీ ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఏదైనా కారణాలతో గాయాలైనా లేదా క్యాథెటర్తో ఆ ప్రాంతాన్ని చేరడానికి కష్టమవుతున్న సందర్భాల్లో ఇలాంటి ఇరు ప్రక్రియల కలయికతో కూడిన హైబ్రీడ్ టెక్నిక్స్‌ను అవలంబిస్తారు. డా. సవితా రాథోడ్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్(చదవండి: టేస్టీ బర్గర్ వెనుకున్న సీక్రెట్ తెలిస్తే కంగుతినడం ఖాయం..!) -
క్షయ నిర్మూలన ఓ అత్యవసరం!
క్షయ (టీబీ) వ్యాధిని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ వ్యాధిపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీబీ నిర్మూలనలో మన దేశం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, రోగులు పూర్తిగా కోలుకునేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్‌పీవై)ని అమలుచేస్తోంది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి, స్వల్పకాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకూ అనుమతి ఇవ్వడం విశేషం.దేశం నుంచి క్షయ (టీబీ)ని పారదోలాలని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఆయన నాయకత్వంలో టీబీని నిర్మూలించేందుకు వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సల్లో మార్పు తీసుకువచ్చేందుకు గత కొన్నేళ్లుగా వినూత్న విధానాలను భారత్ అవలంబిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన ‘ప్రపంచ టీబీ నివేదిక – 2024’లో ఇప్పటి వరకు దేశంలో అవలంబిస్తున్న విధానాలను ప్రస్తావించింది. దేశంలో 2015 నుంచి 2023 వరకు 17.7 శాతం మేర టీబీ వ్యాప్తి తగ్గింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాధి క్షీణత రేటు విషయంలో ఇది రెట్టింపు. అలాగే దేశ వ్యాప్తంగా 25.1 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు. ఫలితంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకునేవారి శాతం 2015లో ఉన్న 59 నుంచి 2023 నాటికి 85 గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి దార్శనిక స్ఫూర్తితో టీబీని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. క్షయపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్య క్రమాన్ని పంచకుల నుంచి ప్రారంభించింది. వ్యాధి తొలిదశలో ఉండగానే క్షయ రోగులందరినీ గుర్తించి వారికి సకాలంలో అవస రమైన, నాణ్యమైన చికిత్సను అందించాలనే మా సంకల్పాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది. ‘జన్ భగీదారి’ స్ఫూర్తితో మనమంతా– ప్రజాప్రతినిధులు, ఆరోగ్య నిపుణులు, పౌరసమాజం, కార్పొరేట్ సంస్థలు, సంఘాల–సంయుక్తంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేద్దాం.భారత్ నుంచి టీబీని తరిమేసే ప్రయాణంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తున్న చురుకైన భాగస్వామ్యం... ఈ కార్యక్రమం మరో మైలురాయిగా నిలుస్తుందనే భరోసాను ఇచ్చింది. టీబీ నిర్మూలనలో మన దేశ సామాజిక విధానం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, టీబీ రోగులు పూర్తిగా కోలుకొనేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం... ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్‌పీవై)ని భారత్ అమలుచేస్తోంది. ఏప్రిల్ 2018 నుంచి 1.16 కోట్ల మంది లబ్ధి దారులకు ఎన్‌పీవై పథకం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రూ. 3,295 కోట్లు అందించారు. ఈ పథకం ద్వారా నెలవారీగా అందించే ఆర్థిక సాయం గత నవంబర్ నుంచి రూ. 500 నుంచి రూ. 1000కి పెంచడం క్షయ నిర్మూలనలో భారత్ నిబద్ధతను సూచించే మరో అంశం.మరో కీలక అంశం... పోషకాహర సమస్యను పరిష్కరించడంతో పాటు సమాజ భాగస్వామ్యం పెరిగేలా ‘టీబీ ముక్త భారత్ అభియాన్’ తోడ్పడింది. అలాగే సమాజంలో వివిధ వర్గాలను ఏకం చేసి అవగాహన పెంచడానికి, టీబీ రోగులకు పోషకాహారం, వృత్తిపరంగా, మానసికంగా సాయం అందించే దిశగా సామూహిక ఉద్య మాన్ని సృష్టించింది. జన్ భగీదారి స్ఫూర్తితో ప్రభుత్వ – పౌర భాగ స్వామ్యంతో చేపట్టిన ఈ ఉద్యమం 1.75 లక్షల మంది ని–క్షయ మిత్రల ద్వారా దేశవ్యాప్తంగా 21 లక్షల ఆహార కిట్లను సరఫరా చేసేందుకు స్ఫూర్తినిచ్చింది.టీబీని రూపుమాపడానికి వినూత్న విధానంఅనేక సంవత్సరాలుగా చికిత్స సఫలతా రేటును పెంపొందించేందుకు బెడాక్విలైన్, డెలామనిడ్ వంటి సరికొత్త ఔషధాలను భారత్ ప్రవేశపెట్టింది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి స్వల్ప కాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకు అనుమతి నిచ్చాం. ఇప్పటికే ఉన్న చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది మరింత ప్రభావ వంతంగా ఉంటుంది. ప్రస్తుతం మనకు 19 నుంచి 20 నెలల పాటు సాగే సంప్రదాయ చికిత్సా విధానంతో పాటు 9 నుంచి 11 నెలల పాటు సాగే చికిత్సా విధానం కూడా మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ బీపీఏఎల్ఎమ్ విధానంతో రోగులు ఆరు నెలల్లోనే చికిత్సను పూర్తి చేసుకోవచ్చు. క్షేత్ర స్థాయిలో రోగులందరినీ గుర్తించి సత్వరమే చికిత్స అందించడడానికి వీలుగా అందుబాటులో అధునాతన పరికరాలు ఉండేలా నిరంతర కృషి చేస్తున్నాం. దీని కోసమే సమర్థవంతమైన, కచ్చితమైన పరీక్షా పద్ధతులను ప్రవేశపెట్టాం. అవే జీవ పరమాణు పరీక్షలు (మాలిక్యులర్ టెస్ట్స్). 2014 –15లో కొన్ని వందల సంఖ్యలో మాత్రమే ఉన్న వ్యాధి నిర్ధారణ పరికరాల సంఖ్య ప్రస్తుతం 8,293 కు చేరుకున్నాయి. ఈ పరికరాలు అన్ని జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్నాయి.‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ స్ఫూర్తితో స్వదేశీ జీవ పరమాణు పరీక్షలను క్షేత్రస్థాయిలో పరీక్షించి రూపొందించిన పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. తద్వారా జిల్లా, బ్లాకు స్థాయిల్లో టీబీ నిర్ధారణకు వెచ్చించే సమయాన్ని తగ్గించడంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించగలిగాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన మన స్వదేశీ మాలిక్యులర్ పరీక్షలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాలు టీబీ నిర్మూలనలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాయి.2018 నుంచి టీబీ పరిశోధనలపై అధికంగా నిధులు వెచ్చిస్తున్న అగ్ర సంస్థల్లో ఒకటిగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్థిరంగా నిలవడం మనందరికీ గర్వకారణం. రోగులకు అతి చేరువలోనే సమర్థవంతమైన వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో సహా మరిన్ని నూతన సాధనాలను త్వరిత గతిన అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు కొనసాగిస్తాం. భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తూ...వివిధ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నిరూపి తమైన సాంకేతికతలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడం... టీబీ నిర్మూలనా దిశలో భారత్ నాయకత్వానికి నిదర్శనాలు. అధు నాతన రోగ నిర్ధారణ, చికిత్సలకు దారితీసే మార్గదర్శక పరిశోధనల నుంచి సార్వత్రిక సామాజిక తోడ్పాటును అందించే నియమాలను ప్రవేశ పెట్టేవరకూ... టీబీని పారదోలడంలో మన దేశం ముందంజలో ఉంది. టీబీని గుర్తించడం, నిర్ధారించడం, చికిత్స, నివారణలో సామాన్య ప్రజలను భాగస్వాములను చేయడం ఈ సమయంలో అత్యవసరం. 100 రోజుల పాటు ఉద్ధృతంగా సాగే ప్రచారం టీబీని రూపుమాపడంలో సామూహిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వంలో అందరి భాగస్వా మ్యంతో, మానవాళికి పెద్ద శత్రువుగా ఉన్న టీబీని ఓడించి, ఆరోగ్య కరమైన భవిష్యత్తును కల్పిస్తామని నేను విశ్వసిస్తున్నాను.జగత్ ప్రకాశ్ నడ్డా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి -
అలియా భట్‌కి ఏడీహెచ్‌డీ డిజార్డర్..అందువల్లే పెళ్లిలో..!
బాలీవుడ్ నటి అలియా భట్ గ్లామర్‌కి నటనకి నూటికి నూరు మార్కులు పడతాయి. అంతలా ప్రేక్షకుల మనుసులను గెలుచుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి దటీజ్ అలియా అని ప్రూవ్ చేసింది. ఫిట్నెస్ పరంగా గ్లామర్ పరంగా ఎంతో కేర్ తీసుకునే ఆమె ఏడీహెచ్‌డీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అందువల్లో తన పెళ్లిలో ఆ సమస్య దృష్ట్యా ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. ఏంటా సమస్య? ఎందువల్ల వస్తుంది?అలియా ఏడీహెచ్‌డీ లేదా టెన్షన్-డెఫిసిట్/హైపర్యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. బాల్యం నుంచే తాను ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్లు తెలిపింది. దీని కారణంగా ఏ విషయంపై గంటల కొద్ది దృష్టిపెట్టి పనిచేయలేను అని చెబుతోంది. ఈ ఇబ్బంది వల్లే స్కూల్లో కూడా ఒకదానిపై ఫోకస్ పెట్టలేకపోయేదాన్ని అని తెలిపింది. ఈ సమస్యకు భయపడే పెళ్లిలో కూడా మేకప్ అరగంటకి మించి ఎక్కువ తీసుకోవద్దని ముందుగానే మేకప్ మ్యాన్లకు చెప్పారట. ఆఖరికి షూటింగ్లలో కూడా ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటానని అంటోంది అలియాఏడీహెచ్డీ అంటే..చాలా సాధారణమైన న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్లలో ఒకటి. ఇది సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ పెద్దలల్లో కూడా నిర్ధారణ అవుతుంది. ఈ రుగ్మత ఉన్నవారి మెదడులోని నరాల నెట్‌వర్క్‌లు, న్యూరోట్రాన్స్మిటర్లలో తేడాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.దీని కారణంగా ఆయా వ్యక్తులు ఏ పని మీద ఒక అరగంటకు మించి అటెన్షన్ ఉంచలేరు. వెంటనే చికాకు, ఒత్తడికి గురవ్వుతారు. అంతేగాదు దీని వల్ల శ్రద్ధ వహించడం, ఎక్కువ సేపు చురుకుగా ఉండటం వంటి వాటిల్లో సమస్యలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..అజాగ్రత్తఒక దానిపై దృష్టి నిలపడంలో ఇబ్బందిఆర్గనైజ్ చేసి పనిలో ఉండలేకపోవడంఎక్కువ సేపు వింటూ కూర్చోవాలన్న ఇబ్బంది పడటం.మానసిక శ్రమతో కూడిన పనులకు రోజువారీ పనుల్లో మతిమరుపుఎందువల్ల వస్తుందంటే..ఏడీహెచ్‌డీతో బాధపుడుతున్న వ్యక్తుల్లో మెదడు నిర్మాణం, కార్యచరణలో తేడాలు ఉన్నట్లు మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లలో పూర్తి పరిక్వతతో మెదడు ఉండకుండా నెమ్మదిగా ఉంటుందట. వీళ్లలో నిర్దేశిత శ్రద్ధే ఉంటుందట. వీరి మెదడులో ఆటోమేటిక్ అటెన్షన్ నెట్వర్క్ అనేది డిఫాల్ట్ మోడ్‌లో ఉంటుందట. అందువల్ల ఇలా జరుగుతుందని అన్నారు. అయితే ఈ రుగ్మత ఎందువల్ల వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరావాల్సి ఉంది. దీనిపై అధ్యయనాలు జరుగుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ డిజార్డర్ కుటుంబ వారసత్వంగా వస్తుందని అన్నారు. (చదవండి: లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ) -
కోవిడ్ కక్కిన విషం.. స్వీట్ లిటిల్స్లో చేదు చక్కెర
కోవిడ్ తర్వాత పిల్లల్లో టైప్– 1 డయాబెటిస్ పెరిగే అవకాశం ఉందేమోనని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా ఇది జరిగేందుకు అవకాశముందనే పరిశోధకుల రిపోర్టులు ప్రముఖ మెడికల్ జర్నల్ ‘జామా’ (జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్)లో ప్రచురితమయ్యాయి.పరిశోధకుల అధ్యయన ఫలితాల వివరాలివి... వైరస్ తాలూకు ప్రభావంతో చిన్నారుల సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు.. వారి క్లోమ (ప్యాంక్రియాస్) గ్రంథిలోని బీటా కణాలు దెబ్బతీయడం వల్ల పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ వచ్చే ముప్పుందని పేర్కొంటున్నారు.అధ్యయన ఫలితాలు చెప్పేదేమిటంటే... జర్మనీలో ఫిబ్రవరి 2015 నుంచి అక్టోబరు 2023 వరకు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు పరిశోధకులు 509 మంది చిన్నారులపై ఓ సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. ఏడాది మొదలుకొని పదహారేళ్ల వయసున్న పిల్లల్లో మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీలనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఈ అధ్యయనం సాగింది. ఈ ‘మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీస్’ అనేవి ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీసే ్రపోటీన్లు. ప్యాంక్రియాస్‌ను అవి అలా దెబ్బతీయడంలో చిన్నారుల్లో అది టైప్–1 డయాబెటిస్‌కు కారణమవుతుంది. ఐలెట్ ఆటో యాంటీబాడీస్... ప్యాంక్రియాస్‌ను దెబ్బతీయడం జరిగితే ముందు లక్షణాలు కనిపించకపోయినప్పటికీ... తుదకు అది టైప్–1 డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఈ తరహా పరిశోధనల అవసరమెందుకంటే... డయాబెటిస్ వ్యాధిలో రక్తంలో చక్కెరను నియంత్రించాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగదు. లేదా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ దేహం దాన్ని సమర్థంగా ఉపయోగించుకోకపోవచ్చు. దాంతో రక్తంలో చక్కెర ఎక్కువవ్వడంతో తొలిదశల్లో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా నిశ్శబ్దంగా దెబ్బతీసే చక్కెర వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’గా నిపుణులు చెబుతుంటారు. జీవనశైలి సమస్యల్లో ఒకటైన ఈ వ్యాధిని దురదృష్టవశాత్తూ పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. దాంతో అది దేహంలోని కీలకమైన అవయాలను... మరీ ముఖ్యంగా గుండె, రక్తనాళాలు, కళ్లు, మూత్రపిండాలు, నరాలను దెబ్బతీస్తుంది. అందువల్ల చిన్నపిల్లల్లో కనిపించే చక్కెరవ్యాధి (జువెనైల్ డయాబెటిస్) అని పిలిచిన ఈ వ్యాధి... ఇప్పుడు యువత పెద్దయ్యాకా వారిని ప్రభావితం చేస్తుండటంతో మనదేశ నిపుణులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి్టపెడుతున్నారు.గట్ మైక్రోబియమ్ అసమతౌల్యత వల్ల... జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుందనీ, ఈ సూక్ష్మజీవుల సమూహాన్నే ‘గట్ బ్యాక్టీరియా’ లేదా ‘గట్ మైక్రోబియమ్’ అంటారనీ, దీనివల్లనే ప్రతి ఒక్కరిలోని వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఏదైనా వైరస్ సోకాక... ఈ గట్ మైక్రోబియమ్లో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య తగ్గి, కీడు చేసేవి పెరగడం వల్ల గట్ మైక్రోబియమ్ సమతౌల్యతలో మార్పుల వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, బలహీనమవుతుంది. ఈ పరిణామం డయాబెటిస్, గుండెజబ్బుల వంటి అనేక దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులకు కారణమవుతుంది.యాంటిజెన్స్కు ఎక్స్పోజ్ కానివ్వపోవడంతో... మునపటి తరంతో పోలిస్తే ఇటీవల పిల్లలను స్వాభావికమైన వాతావరణానికి ఎక్స్పోజ్ కానివ్వకుండా అత్యంత రక్షణాత్మకమైన రీతిలో తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. పిల్లలు ఆరుబయట ఆడుతూ, ్రపాకృతిక పర్యావరణానికీ, అందులోని కొన్ని వ్యాధికారకాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు చిన్నారుల్లో ఆ వ్యాధికారకాలను ఎదుర్కొనే యాంటిజెన్స్ ఉత్పన్నం అవుతాయి. కానీ తల్లిదండ్రుల అతిజాగ్రత్త కారణంగా వారు నేచురల్ ఎన్విరాన్మెంట్లో ఉండటం తగ్గిపోవడంతో కొన్ని రకాల హానికారక అంశాలకు యాంటిజెన్స్ ఉత్పాదన లేకుండా పోయి, సహజ రక్షణ కవచం ఏర్పడకుండా పోయింది. ఈ అంశం కూడా పిల్లల్లో సహజ రక్షణ వ్యవస్థను బలహీనం చేసిందనే అభి్రపాయం కూడా ఇంకొందరు నిపుణులనుంచి వ్యక్తమవుతోంది. అప్రమత్తంగా ఉండాల్సిందే... కనబడుతున్న తార్కాణాలను బట్టి, ప్రస్తుతానికి టైప్–1 డయాబెటిస్‌కు మందులేదనే వాస్తవానికి బట్టి రాబోయే భావితరాలను వ్యాధిగ్రస్తం కాకుండా చూసుకునేందుకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. డయాబెటిస్ ఉన్న పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు ... 👉చాలా ఎక్కువ నీరు తాగుతూ ఉండటం; మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్తుండటం. 👉రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటును మానేసిన పిల్లలు అకస్మాత్తుగా మళ్లీ పక్క తడపటం మొదలుపెట్టడం ∙బాగా ఆకలితో ఉండటం; మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గుతుండటం ∙చాలా తేలిగ్గా అలసిపోతుండటం, చాలా నిస్సత్తువగా, నీరసంగా ఉండటం ∙కొందరిలో చూపు మసగ్గా కనిపిస్తుండటం (బ్లర్డ్ విజన్) ∙జననేంద్రియాల దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్లు (క్యాండిడియాస్) వంటివి వస్తుండటం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల్లో డయాబెటిస్‌ను వెంటనే గుర్తించి, వెంటనే ఇన్సులిన్‌తో వైద్యం మొదలుపెట్టకపోతే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు సంభవించవచ్చు.టైప్–1 డయాబెటిస్‌ను ఎదుర్కొనే తీరు(మేనేజింగ్ టైప్–1 డయాబెటిస్) పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ కనిపించినప్పుడు కింద పేర్కొన్న ఆరు అంశాల ద్వారా దాన్ని మేనేజ్ చేయాలి. అవి... 1. ఇన్సులిన్ : డయాబెటిస్తో బాధపడే పిల్లల విషయంలో ప్రస్తుతానికి ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స. 2. పర్యవేక్షణ (మానిటరింగ్) : పిల్లల్లో కేవలం ఇన్సులిన్ ఇస్తుండటం మాత్రమే సరిపోదు. వారు తిన్న దాన్ని బట్టి ఎంత మోతాదులో ఇన్సులిన్ ఇస్తుండాలన్న అంశాన్ని నిత్యం పర్యవేక్షించుకుంటూ ఉండాలి. ఈ అంశాన్ని పిల్లలు ఎంత తిన్నారు, ఎలాంటి ఆహారం తీసుకున్నారు, దాని వల్ల రక్తంలో ఎంత గ్లూకోజ్ వెలువడుతుంది... వంటి అనేక అంశాలను పర్యవేక్షించుకుంటూ ఇన్సులిన్ ఇస్తుండాలి. 3. ఆహారం : కేవలం రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను చూసుకుంటూ యాంత్రికంగా ఇన్సులిన్ ఇవ్వడం కాకుండా... పిల్లలు ఎదిగే వయసులో ఉంటారు కాబట్టి వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనుగుణంగా ఆహారం ఉండేలా చూపుకోవాలి. ఆహారంలో తగిన పాళ్లలో పిండిపదార్ధాలను (కార్బోహైడ్రేట్స్) సమకూర్చే కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), మాంసకృత్తులు (్రపోటీన్లు), ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాలు ఇస్తుండాలి. వీటిని పిల్లల వయసు, బరువు, రోజంతా చేసే శ్రమ వంటి అంశాల ఆధారంగా ఓ ప్రణాళిక రూ΄÷ందించి, దానికి అనుగుణంగా అవసరమైన మోతాదుల్లో ఇవ్వాలి. 4. శారీరక శ్రమ : ఈ రోజుల్లో చిన్నారులు ఆరుబయట ఆడుకోవడం చాలా తక్కువ. పిల్లలు ఒళ్లు అలిసేలా ఆడుకోవడం వల్ల వారి ఒంట్లోని చక్కెర మోతాదులు స్వాభావికంగానే నియంత్రితమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పిల్లల్లో ఒళ్లు అలిసేలా ఆడుకోవడం చాలా అవసరం.5. గ్లూకోజ్‌ను పరీక్షించడం : పిల్లల రక్తంలో గ్లూకోజ్ మోతాదుల్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. 6. కీటోన్ మోతాదుల కోసం మూత్రపరీక్ష : మూత్రంలో కీటోన్ మోతాదులను పరీక్షించడం కోసం తరచూ మూత్రపరీక్షలు చేయిస్తూ ఉండాలి. చిన్నారుల్లో పెరుగుతున్న కేసులు... కోవిడ్–19 ఇన్ఫెక్షన్ అన్నది ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్‌ను పెంచడం వల్ల ఆ అంశం ఈ వ్యాధిని ప్రేరేపిస్తోందంటున్నారు మరికొందరు నిపుణులు. ఇక జామా రిపోర్టును అనుసరించి, కోవిడ్–19 బారిన పడ్డ పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన ఆర్నెల్ల నుంచి ఏడాది కాలంలోనే టైప్–1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు మామూలు పిల్లల కంటే 16% ఎక్కువ. మన దేశంలో నిర్దిష్టమైన గణాంకాలు లేకపోయినప్పటికీ... పాశ్చాత్య దేశాల అధ్యయనాల ప్రకారం చూస్తే కోవిడ్ (సార్స్–సీవోవీ2) ఇన్ఫెక్షన్ తర్వాత టైప్–1 డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఎంటరోవైరస్, సైటో మెగాలో వైరస్, రుబెల్లా వైరస్లు ఎటాక్ అయ్యా కూడా టైప్–1 డయాబెటిస్ రావడం జరిగినట్లే... కోవిడ్19 విషయంలోనూ జరుగుతోందని మరికొందరు నిపుణుల అభి్రపాయం.కారణాలుటైప్–1 డయాబెటిస్‌కు జన్యుపరమైన కారణాలను ముఖ్యంగా చెప్పవచ్చు. దాంతోపాటు బాధితులు కొన్ని వైరస్‌లకు గురికావడం కూడా మరో ముఖ్యమైన అంశం. కోవిడ్–19 కూడా ఒక రకం వైరల్ ఇన్ఫెక్షన్ కావడం కూడా ఈ ముప్పును పెంచుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్), 2022 నివేదిక ప్రకారం మన దేశంలో టైప్–1 డయాబెటిస్తో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 95,600 మంది 14 ఏళ్లలోపు చిన్నారులని తేలింది. -
అంతుపట్టని ఆ వ్యాధిని పది సెకన్లలో నిర్థారించిన పనిమనిషి..!
అతనొక అనుభవజ్ఞుడైన డాక్టర్ అయినప్పటికీ తన కుటుంబంలోని వ్యక్తికి వచ్చిన వ్యాధి ఏంటన్నది నిర్థారించలేకపోయాడు. పలు టెస్టులు చేసి ఆ వ్యాధి ఏంటనేది చెప్పలేకపోయాడు. కానీ ఆ వ్యాధి ఏంటనేది..అతడి ఇంట్లో పనిచేసే పనిమనిషి జస్ట్ 15 సెకన్లలో ఠక్కున చెప్పేసింది. ఆమె సమయస్ఫూర్తికి విస్మయానికి గురైన డాక్టర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆ పనిమనిషి ఎలా చెప్పిందంటే...డాక్టర్ ఫిలిప్స్ తన కుటుంబంలోని ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. విపరీతమైన చలి, కీళ్లనొప్పులు, దగ్గుతో బాధపడ్డాడు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా వచ్చాయి. దీంతో ఫిలిప్స్ కోవిడ్ 19, ఇన్ఫ్లుంజా, డెంగ్యూ వంటి వైద్య పరీక్షలన్నీ చేశాడు. కానీ ఆ వ్యక్తికి ఏం వ్యాధి వచ్చేందని నిర్థారించలేకపోయాడు. దీంతో అతనికి సరైన అందిచలేకపోయాడు. అసలు అతనకు వచ్చిన సమస్య ఏంటర్రా బాబు అంటు తలపంటుకున్నాడు. అప్పుడే వచ్చిన పనిమినిషి ఆ వ్యక్తికి వచ్చింది 'ఆంజంపి'ని అనే వ్యాధి అని స్థానిక భాషలో చెప్పింది. ఇది తన మనవళ్లకు వచ్చిందని, వారిలో ఈ లక్షణాలు చూశానని అంది. వెంటనే పనిమినిషి చెప్పిన వ్యాధికి సంబంధించిన పార్వోవైరస్ బీ19 అనే వైద్య పరీక్షలు చేశారు డాక్టర్ ఫిలిప్స్. చివరికి ఆమె చెప్పిందే నిజమయ్యింది. ఆ వ్యక్తికి వచ్చిన వ్యాధిని వైద్య పరిభాషలో రిథీమా ఇన్ఫెక్టియోసమ్ అని పిలుస్తారు. ఇది హ్యుమన్ పార్వోవైరస్ బీ19 వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది పిల్లలను బాగా ప్రభావితం చేస్తుంది. ఇది దగ్గినప్పుడూ, తుమ్మినప్పుడూ శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బుగ్గలపై వచ్చే ఎరుపు దద్దర్లను స్లాప్డ్ చీక్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఈ దద్దర్లు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. ఈ మేరకు సదరు డాక్టర్ ఫిలిప్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..17 ఏళ్ల వైద్య అనుభవం ఆ వ్యాధిని నిర్థారించలేదు. కేవలం పది సెకన్లలో ఆ వ్యాధి ఏంటో చెప్పగలిగిన తన పనిమినిషి ముందు తన అనుభవం కూడా సరిపోలేదని అన్నారు. అయితే నెటిజన్లు జనరల్ ప్రాక్టీషనర్(జీపి)ని ఎందుకు సంప్రదించలేదని వైద్యుడిని ప్రశ్నించగా..ఈ రోజుల్లో జీపీ ఆశించిన స్థాయిలో నిర్థారించడ లేదని అన్నారు. తనకు తన పనిమనిషి వ్యాది నిర్థారణ విలువైనదని, అందువల్లే ఒక రోజు సెలువు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదని అని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.(చదవండి: జీ7 సదస్సులో మోదీకి భారతీయ వంటకాలను అందించే రెస్టారెంట్ ఇదే..!) -
బోన్ మ్యారో క్యాన్సర్..నియంత్రణ ఇలా...!
క్రానిక్ మైలోయిడ్ లుకేమియా... (సిఎమ్ ఎల్) ఎముక మజ్జ లేదా బోన్ మ్యారోకి సోకే ఓ అరుదైన క్యాన్సర్.. (సిఎమ్ఎల్). ఇది మొత్తం లుకేమియా కేసుల్లో 15% దాకా ఉండే సీఎంఎల్ బోన్‌మ్యారోను ప్రభావితం చేస్తుంది, ఇది తెల్ల రక్త కణాల నియంత్రణలేని పెరుగుదలకు దారితీస్తుంది. క్యాన్సర్ నిర్ధారణ కాగానే మొదట్లో భయంకరంగా అనిపించినప్పటికీ, సీఎంఎల్ను సరైన విధానంతో నియంత్రించవచ్చునని గుర్తించడం చాలా ముఖ్యం అంటున్నారు హైదరాబాద్‌లోని నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ జి సదాశివుడు. ఆయన చెబుతున్న విశేషాలివి...సీఎంఎల్ నిర్ధారణ అయినప్పటికీ రోగులు సంతృప్తికరమైన జీవితాలను గడపవచ్చు. అయితే, సీఎంఎల్ నిర్వహణలో సరైన విధానాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే చికిత్స చేయని దీర్ఘకాలిక–దశ సీఎంఎల్ వేగంగా వృద్ధి చెందుతుంది. సమర్థవంతమైన చికిత్సకి, వ్యాధి పెరుగుదలని నివారించడానికి బిసిఆర్–ఎబిఎల్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, చికిత్స లక్ష్యాలకు కట్టుబడి ఉండటం అవసరం. అదనంగా మీ వైద్యునితో తాజా చికిత్సల గురించి చర్చించడం వలన మీరు చికిత్స ప్రక్రియను అర్థం చేసుకోవడానికి, మెరుగైన జీవన నాణ్యతకు సహాయపడుతుంది.కొన్ని సందర్భాల్లో సీఎంఎల్ ని ’మంచి క్యాన్సర్’ అని పిలిచినప్పటికీ, సీఎంఎల్ పురోగమిస్తున్న కొద్దీ అది ’మంచిది’ గా ఉండడం మానేస్తుంది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కొంత మంది రోగులు వారి దైనందిన జీవితాలను ప్రభావితం చేసే మందులకు నిరోధకంగా ఉండవచ్చు లేదా దుష్ప్రభావాలను అనుభవించవచ్చు. అయితే, సకాలంలో జోక్యం, జాగ్రత్తగా పర్యవేక్షించడం ఈ సవాళ్లను నివారించడంలో సహాయపడతాయి.వైద్యపరమైన అంశాలతో పాటు, సీఎంఎల్ కలిగించే భావోద్వేగ ప్రభావాన్ని విస్మరించలేం. సీఎంఎల్ రోగులు ఎదుర్కొనే ప్రారంభ సవాళ్లలో క్యాన్సర్‌తో సంబంధం ఉన్న సామాజిక కళంకం ఒకటి. సామాజిక అంశాల కారణంగా చాలా మంది వ్యక్తులు తమ రోగనిర్ధారణను దగ్గరి కుటుంబసభ్యులకు మించి బయటి వారికి వెల్లడించడానికి సంకోచిస్తారు. అయితే ఓపెన్ కమ్యూనికేషన్ అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య సహాయాన్ని కోరడం అనేది సంపూర్ణ సీఎంఎల్ నిర్వహణలో ముఖ్యమైనవి.సీఎంఎల్ రోగుల కోసం కొన్ని సూచనలు...నిరంతర పర్యవేక్షణ: చికిత్స ప్రభావాన్ని అంచనా వేయడానికి, ఏవైనా మార్పులను ముందుగానే తెలుసుకునేందుకు బిసిఆర్–ఎబిఎల్ స్థాయిలను ఎప్పటికప్పుడు గుర్తించాలి. సకాలంలో జోక్యం చేసుకోవ డానికి, వ్యాధి పురోగతిని నివారించడానికి రెగ్యులర్ పర్యవేక్షణ చాలా ముఖ్యమైనది.దినచర్యలో మానసిక ఆరోగ్య మద్దతు, ఆహారపు సర్దుబాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సీఎంఎల్ నియంత్రణకు వీలు కల్పిస్తుంది.ఆరోగ్య సంరక్షకులు, వైద్యులతో మనసు విప్పి, నిజాయితీగా సంభాషించడం అవసరం. సీఎంఎల్ తో ప్రయాణంలో ఎదుర్కొనే ఏవైనా ఆందోళనలు, లక్షణాలు లేదా సవాళ్లను పంచుకోవాలి.సపోర్ట్ నెట్‌వర్క్‌లు: అనుభవాలను పంచుకోవడానికి, భావోద్వేగ మద్దతును పొందడానికిÜపోర్ట్ గ్రూప్‌ల ద్వారా ఇతర సీఎంఎల్ రోగులతో సంబంధాలు ఏర్పరచుకోండి.నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 నుంచి 1.5 మిలియన్ల మంది సీఎంఎల్ తో జీవిస్తున్నారు. వైద్య శాస్త్రంలో పురోగతి కారణంగా చికిత్స ఫలితాలలో గణనీయమైన మెరుగుదల సాధ్యమవుతోంది. సీఎంఎల్ చికిత్సలో భాగమైన టైరోసిన్ కినేస్ ఇన్హిబిటర్స్ , రోగులకు ఫలితాలు జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరిచాయి.కౌన్సిలింగ్ చాలా ముఖ్యం...‘నేను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 9 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల అన్ని వయసుల రోగులను చూశా. దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా నిర్ధారణ తర్వాత, చాలా మంది రోగులు తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతారు. అందువల్ల, వారికి సరైన కౌన్సెలింగ్ అందించడం చాలా ముఖ్యంప్రొఫెసర్ డాక్టర్ జి సదాశివుడు, నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం(చదవండి: 'టీ'ని అతిగా మరిగిస్తున్నారా? ఎంత వ్యవధిలో చేయాలంటే..) -
పాపులర్ వీడియో గేమర్‌కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!
ఇటీవల కాలంటో ప్రముఖ సెలబ్రెటీలు, ఆటగాళ్లు కేన్సర్ బారిన పడుతున్నారు. ఒక్కసారిగా వారిలో చురుకుదనం కోల్పోయి డల్‌గా అయిపోతున్నారు. పాపం అక్కడకి లేని మనో నిబ్బరాన్నంతా కొని తెచ్చుకుని మరీ ఈ భయానక వ్యాధితో పోరాడుతున్నారు. కొందరూ ప్రాణాలతో బయటపడగా.. మరికొందరూ ఆ మహమ్మారికి బలవ్వుతున్నారు. అచ్చం అలానే ఓ ప్రసిద్ధ వీడియో గేమర్ ఈ కేన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. అతని కొచ్చిన కేన్సర్ ఏంటంటే.. ప్రోఫెషనల్ వీడియో గేమ్ ప్లేయర్ ట్విచ్ స్ట్రీమర్ నింజా చర్మ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ విషయం విని ఒక్కసారిగా అతని అభిమానులంత షాక్‌కి గురయ్యారు. అతడి పాదాలపై ఒక పుట్టుమచ్చ ఉంది. అది అసాధారణంగా పెద్దది అవ్వడం ప్రారంభించింది. దీంతో వైద్యులను సంప్రదించాడు స్ట్రీమర్. అన్ని పరీక్షలు చేసి మెలనోమా కేన్సర్ అని నిర్థారించారు వైద్యులు. అయితే వైద్యులు ప్రారంభ దశలోనే ఈ కేన్సర్‌ని గుర్తించారని పేర్కొన్నాడు సోషల్ మీడియా ఎక్స్‌లో. దయచేసి అందరూ చర్మానికి సంబంధించిన చెకప్‌లు చేసుకోండి అని అభిమానులను కోరాడు. ఇంతకీ అతనికి వచ్చిన మెలనోమా కేన్సర్ అంటే..! మెలనోమా అనేది మెలనోసైట్స్ నుంచి ఉద్భవించే ఒక రకమైన చర్మ కేన్సర్. ఇది మెలనిన్ వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మెలనోమా సాధారణంగా సూర్యరశ్మికి బహిర్గతమయ్యే చర్మంపై ప్రారంభమవుతుంది. చాలా మెలనోమాలు అతినీలలోహిత కాంతికి గురికావడం వల్ల సంభవిస్తాయి. మెలనోమా దశను అనుసరించి చికిత్స విధానం మారుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది. ఈ మెలనోమా కేన్సర్ చర్మంపై ఎక్కడైనా తలెత్తుతుందని నిపుణుల చెబుతున్నారు. చాలా పుట్టుమచ్చలు, గోధుమ రంగు మచ్చలు వంటి వాటిల్లో చర్మంపై అసాధారరణ పెరుగదల ఉంటే ఇది వస్తుంది. వీటిని ఏబీసీడీఈలు అనే అగ్లీ డక్లింగ్ గుర్తు ద్వారా మెలనోమాని గుర్తించడం జరుగుతుంది. అంతేగాదు ఆ ప్రదేశంలోని అనుమానాస్పద కణజాలాన్ని చర్మవ్యాధి నిపుణుడు బయాప్సీ చేయించి , క్యాన్సర్ కణాలు ఉన్నాయా, లేదా అని నిర్ణయిస్తాడు. అలా ఈ కేన్సర్‌ని గుర్తించడం జరిగాక, సిటీ స్కాన్లు, పీఈటీ స్కాన్లు సాయంతో ఏ దశలో ఉందనేది నిర్థారిస్తారు. చికిత్స.. ఇతర కేన్సర్ల కంటే ఇందులో చర్మం వద్ద కణాజాలం కాబట్టి తీసివేయడం కాస్త సులభం. గాయాన్ని తొలగించేటప్పడే క్యాన్సర్ ప్రమేయం ఎంతవరకు ఉందో నిర్థారించి తొలగించాక, పూర్తిగా తొలగిపోయాయా లేదా అని నిర్ధారించుకోవడానికి పాథాలజీ పరీక్షలకు కూడా పంపడం జరుగుతుంది. మెలనోమా చర్మంలోని పెద్ద ప్రాంతాలో ఉంటే మాత్రం చర్మాన్ని అంటుకట్టుట వంటివి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేన్సర్ శోషరస కణుపులకు వ్యాపించే ప్రమాదం ఉంటే.. శోషరస కణుపు బయాప్సీని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ వంటివి కూడా అవసరమవ్వచ్చు. ఇక నింజా 2011 నుంచి వృత్తిపరంగా పలు వీడియో గేమ్‌లు ఆడి స్ట్రీమర్‌గా మారాడు. ఇక్కడ ట్విచ్ అనేది ప్రధానంగా వీడియో గేమ్‌లపై దృష్టి సారించే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్. అయితే ఇది సంగీతం, సృజనాత్మక కళలు, వంట మరిన్నింటిని కవర్ చేసే స్ట్రీమ్‌లను కూడా కలిగి ఉంటుంది. దీనిద్వారా ఎంతో మంది ప్రముఖులతో లైవ్‌స్ట్రీమ్‌లో వీడియో గేమ్‌లు ఆడి పేరు తెచ్చుకున్నాడు. దీని కారణంగానే అతనికి వేలాదిమంది ఫాలోవర్లుఉన్నారు. మైక్రోసాఫ్ట్ స్ట్రీమిగ్ ఫ్లాట్‌ఫాం మిక్సర్ కోసం 2019లో ట్విచ్ని వదిలిపెట్టాడు. ఆ మిక్సర్ షట్‌డౌన్ అయ్యాక మళ్లీ ట్విచ్కి తిరిగి వచ్చాడు. ఈ స్ట్రీమింగ్ ద్వారా అంతర్జాతీయ ప్రశంసల తోపాటు మిలయన్ల డాలర్లును సంపాదించాడు. (చదవండి: తండ్రి మిలియనీర్..కానీ కొడుక్కి 20 ఏళ్ల వరకు ఆ విషయం తెలియదు!) -
మిథున్ చక్రవర్తికి వచ్చిన ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే..?
ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి గత శనివారమే తీవ్ర అస్వస్థతకు గురయ్యిన సంగతి తెలిసింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు కోల్‌కతాలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. 73 ఏళ్ల మిధున్ తన పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. వైద్య పరీక్షల్లో మిథున్ బ్రెయిన్‌కి సంబంధించిన ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్‌కి గురయ్యినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని పేర్కొంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించిన సంగతి తెలిసిందే. అది జరిగిన కొద్దిరోజులకే మిథున్ ఇలా అస్వస్థతకు గురవ్వడం బాధకరం. అయితే మిథున్ చక్రవర్తి ఎదుర్కొంటున్న ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ అంటే ఏమిటీ? ఎందువల్ల ఇది వస్తుంది? ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే.. మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా జరకపోయినా లేదా తగ్గినా ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ సంభవిస్తుంది. దీంతో మెదడు కణజాలానికి ఆక్సిజన్ వంటి పోషకాలు అందకుండా పోతాయి. వెంటనే మెదడు కణాలు నిమిషాల్లో చనిపోవడం ప్రారంభమవుతుంది. ఈ తర్వాత రోగి పరిస్థితి విషమంగా అయిపోతుంది. అలాగే మెదడుకు సంబంధించిన మరొక ప్రమాదకరమైన స్ట్రోక్ ఒకటి ఉంది. దీని గురించి తరుచుగా వింటుంటాం. అదే బ్రెయియన్ హెమరేజిక్ స్ట్రోక్. ఇది మెదడులోని రక్తనాళం లీక్ అయినప్పుడు లేదా పగిలిపోయి మెదడులో రక్తస్రావం జరిగితే ఈ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఇక్కడ రక్తం మెదడు కణాలపై ఒత్తిడి పెంచి దెబ్బతీస్తుంది. చాలమందికి ఎదుర్కొనే స్ట్రోక్ ఇది. అయితే ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది చాలా అరుదుగా వస్తుందని చెప్పొచ్చు. పైగా ఈ పరిస్థితి కాస్త క్రిటికల్ అనే చెప్పొచ్చు కూడా. లక్షణాలు.. BREAKING: PM @narendramodi dials #MithunChakraborty, inquiring about his health. https://t.co/MPrYMLT0J1 — Sai Ram B (@SaiRamSays) February 11, 2024 మాట్లాడటం, ఇతరులు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. ముఖం చేతులు లేదా కాలులో తిమ్మిరిగా లేదా పక్షవాతానికి గురవ్వడం ఒకటి లేదా రెండు కళ్లల్లో కనిపించే సమస్యలు తలనొప్పి నడకలో ఇబ్బంది ఆకస్మికంగా మైకం కమ్మడం ఏదీఏమైనా స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ అనే చెప్పాలి. దీనికి వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో రోగికి అత్యవసరమైన వైద్య సహాయం త్వరగా పొందితే మెదడు పూర్తి స్థాయిలో దెబ్బతినకుండా ఇతర స్ట్రోక్‌లు రాకుండా నియత్రించగలుగుతామని వైద్యులు చెబుతున్నారు. -
కింగ్ చార్లెస్‌కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కేన్సర్‌తో బాధపడుతున్న బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కోంది. ఆయన గత నెలలో ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా కేన్సర్‌గా నిర్దారణ అయినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన కేన్సర్ అనేది వెల్లడించలేదు. సోమవారం నుంచి చికిత్స మొదలైందని, కాబట్టి కొద్ది రోజు ప్రజావిధుల నుంఇచ తప్పుకుంటారని పేర్కొంది. ఇక బ్రిటిఫ్ ప్రెస్ ప్రకారం ఆయన కెరిర్లో కొన్ని గాయాలు, రెండుసార్లు కరోనా మహమ్మారి బారిని పడటం మినహా రాజ అద్భుతమైన ఆరోగ్యకరమ జీవితాన్నే గడిపారు. ఆయన చక్రవర్తిగా 2022లో సింహాసనాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. పైగా బ్రిటిష్ చరిత్రలో రాజుగా పట్టాభిషేకం అయిన అంత పెద్ద వయసు వ్యక్తి కూడా ఆయనే. ఇక ఆయన లైఫ్‌స్టైల్ విషయానికి వస్తే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారని అంతరంగికులు చెబుతున్నారు. అందులోనూ ఆయన ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని అంటునన్నారు. అలాంటి ఆయన ఈ కేన్సర్ మహమ్మారిన బారిన పడటం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయన ఆహార అలవాట్లు ఎలా ఉండేవి? రోజూవారి దినచర్య ఎలా ఉంటుంది తదితర విశేషాల గురించి తెలుసుకుందామా!. ఆయన ఒకసారి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిజీ షెడ్యూల్‌కు ఆటంకం కలిగించే భోజనం లగ్జరీ లాంటిదని విశ్వసిస్తానని అన్నారు. అంతేగాదు ఆయన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వంటివి చేస్తారని అధికారిక వర్గాల సమాచారం. 2018లో కార్లెస్ హౌస్‌లో తన 70వ పుట్టిన రోజు పురస్కరించుకుని తనకు సంబంధించిన 70 వాస్తవాల జాబితాలో తాను రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటానని అదికూడా అల్పహారం, రాత్రి భోజనం మాత్రమేనని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారంలో రెండు రోజులు పూర్తిగా శాకాహారం భోజనం తింటానని, పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువుగా మొక్కల ఆధారిత ఆహారమే ఎక్కువగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అల్పాహారంలో ఎక్కువగా చీజ్, ఉడకబెట్టిన గుడ్లు, పాలు, తేనేతో కూడిన డార్జిలింగ్ టీ తదితరాలే తీసుకుంటారని రాయల్ డైట్ పేర్కొంది. ఆయన ఎక్కువగా సేంద్రీయ ఉత్పత్తులనే ఇష్టపడతారని రాయల్ చెఫ్‌లు చెబుతున్నారు. ఇక ఫిట్నెస్ విషయానికి వచ్చేటప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయమాలు చేస్తారని ప్యాలెస్ పేర్కొంది. అలాగే కెనడియన్ ఎయిర్‌ఫోర్స్‌కి సంబంధించిన ఐదు ప్రాథమిక వ్యాయమాలను రోజుకు రెండుసార్లు చేస్తారని తెలిపింది. ముఖ్యంగా రెండు నిమిషాల స్ట్రెచింగ్ ఒక నిమిషం సిట్ అప్లు, మరో నిమిషం బ్యాక్ లెగ్ రైజ్‌లు పుష్ అప్లు 11 నిమిషాలు చేస్తారని వెల్లడించింది. వాటన్నింటి తోపాటు ఆరు నిమిషాల పాలు రన్నింగ్, ప్రతి 75 అడుగులకు డేగ జంప్‌లు చేయడం, వాతావరణం బాగుంటే ఎక్కువ సేపు బహిరంగ ప్రదేశంలో గడపడం వంటివి చేస్తారని రాయల్ ప్యాలెస్ పేర్కొంది. ఇంతలా పిట్‌నెస్‌గా ఉంటూ మంచి ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించనప్పటికీ కొన్ని రకాల వ్యాధులు ఎందుకు దాడి చేస్తాయనేది ఎవ్వరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్న. నిజం చెప్పాలంటే వ్యాధికి రాజు, పేద అనే తారతమ్యం ఉండదేమో రావాలి, వేదన అనుభవించాలి అని ఉంటే టైంకి వచ్చి దాని ప్రభావం చూపించేస్తుందేమో కదూ!. View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) (చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
పొరుగునే స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్! మన దగ్గరా అప్రమత్తత అవసరం!!
ఆంధ్రప్రదేశ్‌కు ΄పొరుగునే ఉన్న ఒడిశాలో కొంతకాలంగా ‘స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్వైరవిహారం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్కడ కనిపిస్తున్న ఈ కేసులు గత రెండు మూడు వారాలుగా ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల ఒక్క సుందర్ఘర్ జిల్లాలోనే దాదాపుగా 200కు పైగా కేసులు రావడంతో పాటు, కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలూ అప్రమత్తం కావాల్సిన అవసరమున్న ఈ తరుణంలో స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్పై అవగాహన కోసం ఈ కథనం. స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను ‘బుష్ టైఫస్’ అని కూడా అంటారు. ఈ ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియమ్ పేరు ‘ఓరియెంటియా సుసుగాముషి’. ఇది చిమ్మటలా కనిపించే చిగ్గర్ అనే ఒక రకం కీటకం ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబారడం, దురదరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ‘ఓరియెంటియా సుసుగాముషి’ అనే బ్యాక్టీరియమ్ దేహంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకసారి చిగ్గర్ కుట్టాక... బ్యాక్టీరియమ్ బాధితుల రక్తంలోకి చేరితే... దాదాపు పది రోజుల తర్వాత లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. చాలావరకు లక్షణాలు నిర΄ాయకరంగా ఉండవచ్చు. కానీ మొదటివారంలో దీన్ని గుర్తించకపోవడం లేదా సరైన చికిత్స ఇవ్వకపోవడం జరిగితే రెండోవారం నుంచి కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి. ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె, కొన్ని సందర్భాల్లో మెదడు కూడా ప్రభావితమై మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. నిర్ధారణ ఈ వ్యాధి నిర్ధారణకు చాలా పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు వెయిల్ ఫెలిక్స్ పరీక్ష, ఇన్‌డైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరోసెంట్ యాంటీబాడీ (ఐఎఫ్ఏ) పరీక్ష, ఇన్‌డైరెక్ట్ ఇమ్యూనో పెరాక్సైడేజ్ (ఐపీపీ) పరీక్ష, ఎలీజా, ఇమ్యూనో క్రొమాటోగ్రాఫిక్ టెస్ట్ (ఐసీటీ), పీసీఆర్ పరీక్షల ద్వారా దీన్ని నివారణ చేయవచ్చు. అయితే చాలా రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో కూడా దాదాపుగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో తగిన మోతాదులో యాంటీబయాటిక్ చికిత్స చేసి, బాధితుల పరిస్థితిని నార్మల్ చేయవచ్చు. అందుకే అన్నన్ని ఖరీదైన పరీక్షలకు బదులు కాస్తంత అనుభవజ్ఞులైన డాక్టర్లు కొన్ని లక్షణాల ఆధారంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తారు. ఉదాహరణకు మలేరియాలో ప్రోటోజోవన్ పారసైట్ రకాన్ని బట్టి కొన్ని రోజుల వ్యవధిలో జ్వరం మాటిమాటికీ వస్తుంటుంది. అదే వైరల్ జ్వరాలు చాలా తీవ్రంగా, ఎక్కువ ఉష్ణోగ్రతతో వస్తుంటాయి. ఈ లక్షణాలను బట్టి ఆయా జ్వరాలను గుర్తుబట్టి చికిత్స అందిస్తారు. దీనికి జ్వరం వచ్చిన తొలిదశలోనే సింపుల్‌గా ఇచ్చే యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే చాలు. ఒకవేళ చికిత్స అందించకపోతే కొన్నిసార్లు ఇది లంగ్స్, గుండె, నాడీ వ్యవస్థ, జీర్ణవ్యవస్థతోపాటు కిడ్నీలపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. నివారణ దీనికి టీకా ఏదీ అందుబాటులో లేదు. చిగ్గర్ కీటకాల కాటుకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇవి పొలాల్లో, మట్టిలో నివసిస్తూ, అక్కడే గుడ్లు పెడతాయి. కాబట్టి చేలూ, పొలాల్లో నడిచే సమయాల్లో చెప్పులు వాడటం వంటి జాగ్రత్తలతో దీన్ని చాలావరకు నివారించవచ్చు. ఫుల్ స్లీవ్ దుస్తులు, కాళ్లు పూర్తిగా కప్పేలాంటి దుస్తులు ధరించడం మేలు. ట్రెకింగ్ వంటి సాహసక్రీడల్లో పాల్గొనేవారు చిగ్గర్స్ ఉండే ప్రాంతాల్లోనే నడిచే అవకాశాలు ఎక్కువ. అందుకే... ట్రెక్కింగ్ చేసేవారు ఇప్పుడీ వ్యాధి విస్తరిస్తున్న ప్రాంతాలకు కొన్నాళ్లు ట్రెక్కింగ్‌కు వెళ్లకవడమే మంచిది. చికిత్స కొన్ని అరుదైన సందర్భాల్లో (అంటే కాంప్లికేషన్ వచ్చిన కేసుల్లో) మినహా... టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్ మందులతోనే ఇది అదుపులోకి వస్తుంది. కీమోప్రోఫిలాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే... అది కొంతవరకు దీని నివారణకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రాల నుంచి ఒడిశా వెళ్లాల్సినవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కిమో ప్రోఫిలాక్టిక్ తీసుకోవడం కొంత మేలు చేస్తుందని చెప్పవచ్చు. డా.. శివరాజు, సీనియర్ ఫిజీషియన్ (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
జ్వరం, జలుబే కదా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు!..అవే ఒక్కొసారి..
మనం సాధారణంగా చిన్నిపిల్లలకు వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను చాలా తేలిగ్గా తీసుకుంటాం. ట్యాబలెట్లు వేస్తున్నాం కదా తగ్గిపోతుందనుకుంటాం. చాలా సర్వసాధరణమైన వ్యాధిగానే భావిస్తాం. కొన్ని రకాల వ్యాధులు విజృంభించే క్రమంలో తొలి దశలో అలాంటి తేలికపాటి లక్షణాలనే చూపిస్తాయి. మనం తెలియక సాధారణమైన జ్వరంగా భావించి ఎప్పుడూ వాడే వాటినే వాడేస్తాం. కానీ మనం కంటిపాపల్లా కాపాడుకుంటున్న చిన్నారుల ప్రాణాలు పోయేంతవరకు కళ్లు తెరవవం. అచ్చం అలాంటి దురదృష్టకర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఆస్ట్రేలియాలోని బాథర్స్ట్ నివాసి క్యాథీ అనే 5 ఏళ్ల చిన్నారి గత కొద్దిరోజులుగా జలుబుతో బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడుతున్నారు. కానీ క్యాథీ కోలుకోవడం మాని ఆరోగ్యం రోజురోజుకి క్షీణించడం ప్రారంభమైంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. సాధారణమైన జలుబే కదా అనే భావించారు. సరిగ్గా తినక జబ్బు పడుటుందని భావించి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. తీరా జాయిన్ అయ్యాక కోలుకుందా అంటే.. లేకపోగా మరింత సీరియస్ అయ్యి మూసిన కన్ను తెరవకుండా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. చిన్న జలుబు లాంటి ఫీవర్ ఇంతలా మా చిన్నారిని కోల్పోయేంత ప్రాణాంతక మారడం ఏమిటిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో వారు మరోసారి ఆమె హెల్త్ రికార్డును చెక్ చేయించి ఇది జలుబు మరేదైనా అని పలు ఆస్పత్రుల్లో ఎంక్వైయిరి చేయగా అసలు విషయం బయటపడింది. స్ట్రెప్ఏ అనే బ్యాక్టీరియా బారిన పడినట్లు గుర్తించారు వైద్యులు. దీని కారణంగానే మూడు రోజుల తర్వాత ఆమె గొంతును పూర్తిగా కోల్పోయిందన్నారు. ఆమె పరిస్థితి మరింత దిగజారి, శ్వాసతీసుకోలేని స్థితికి వచ్చాక మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు తెలిపారు చిన్నారి తల్లిదండ్రులు. ఐతే వైద్య పరీక్షల్లో వైరల్ ఫీపర్ అని తేలింది దీంతో తాము తేలిగ్గా తీసుకున్నామని ఆవేదనగా చెబుతున్నారు చిన్నారి తల్లిదండ్రులు. ఇంటికి వచ్చకా చిన్నారి ఆరోగ్యం క్షీణించటం, పెదాలు నీలం రంగులోకి మారిపోవడం శ్వాసతీసుకోలేకపోవడం వంటి సమస్యలు తలెత్తినట్లు వివరించారు. ఎంతలా సీఆర్పీ చేసి బతికించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు తలిదండ్రులు. ఇంత చిన్నపాటి అనారోగ్యం తమ కూతురు ప్రాణాలను బలితీసుకోవడం జీర్ణించుకోలేక ఆ చిన్నారి శరీరాన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ విషయం తెలిసింది. ఆమె గొంతు స్టెప్ఏ బ్యాక్టీరియా ఇన్షెక్షన్‌కు గురైందని ఇది చాలా రకాలు లక్షణాలతో సంకేతాలిస్తుందని, వైద్యులు కూడా ఒక్కోసారి ఇలాంటి కేసులను గుర్తించడంలో విపలమతుంటారని వివరణ ఇచ్చింది వైద్య బృందం. విచిత్రమేమిటంటే ప్రాణాలతో పోరాడి చనిపోయిన ఆ చిన్నారి ముగ్గురికి అవయవదానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు కాస్త సీరియస్‌గా తీసుకుని పవర్ఫుల్ యాంటీబయోటిక్స్ ఇచ్చి ఉంటే మా చిన్నారి మా కళ్ల ముందు ఆడుతూ తిరిగి ఉండేదంటూ వేదనగా చెప్పారు. అందువల్ల పేరెంట్స్ అందరూ చిన్నారులకు వచ్చి కొన్ని రకలా వైరల్ ఫీవర్లను తేలిగ్గా తీసుకోవద్దు. మీ కంటి పాపలను దూరం చేసుకుని శోకాన్ని కొనితెచ్చుకోవద్దని బాధిత తల్లిందండ్రులు ఆవేదనగా వేడుకుంటున్నారు. (చదవండి: గుడ్డు ఆరోగ్యానికి మంచిది కాదా..?) -
మీనియర్స్ డిసీజ్ అంటే..!
మన లోపలి చెవి (ఇన్నర్ ఇయర్) వినికిడి సామర్థ్యానికీ, నిటారుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇక్కడ సమస్య వస్తే వినికిడి శక్తి తగ్గడంతో పాటు, నిటారుగా నిలబడి ఉండే సామర్థ్యం కూడా తగ్గిపోయి ఒళ్లంతా గిర్రున తిరుగుతూ, తూలి కిందికి పడిపోతామేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు... ఏదో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నిలబడిప్పుడు వినిపించే హోరు లాంటిది చెవిలోంచి వినబడుతుంటుంది. ఇలా వినికిడి తగ్గడం, తూలి కిందపడిపోయేలా బ్యాలెన్స్ కోల్పోవడం, చెవిలోంచి హోరు వినిపించడం వంటి లక్షణాలతో వ్యక్తమయ్యే మీనియర్స్ డిసీజ్‌పై అవగాహన కోసం ఈ కథనం. మీనియర్స్ డిసీజ్‌ను ‘ఇడియోపథిక్ ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్’ అని కూడా అంటారు. అది ప్రాణాంతకం కాదుగానీ... చికిత్స అందరకపోతే క్రమంగా వినికిడి శక్తి కోల్పోయే అవకాశమూ ఉంది. గతంలో కాస్త అరుదుగా కనిపించే ఈ సమస్య... ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుండటం వైద్యవర్గాల్లో ఆందోళనను కలిగిస్తోంది. లక్షణాలు: మీనియర్స్ డిసీజ్‌లో వర్టిగో, టినైటస్, వినికిడిలోపం (డెఫ్నెస్) ఈ మూడు లక్షణాలూ కలగలసి ఉంటాయి. వర్టిగో లక్షణాలు: పిల్లలు గిరగిరా తిరిగీ, తిరిగీ అకస్మాత్తుగా ఆగినప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి తూలికింద పడిపోతామేమో అనిపించినట్లుగా లేదా రంగుల రాట్నంపై నుంచి విసిరివేసినట్లుగా అనుభూతి చెందుతూ ఆందోళన పడుతుంటారు. వర్టిగోలో కనిపించే ఇదే లక్షణం మీనియర్లోనూ కనిపిస్తుంది. టినైటస్ లక్షణాలు : ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గరి గుయ్ అనే శబ్దమే కొందరికి చెవుల్లోంచి వినిపిస్తూ, చికాకు కలిగిస్తుంది. టినైటస్లోని ఇదే లక్షణం... మీనియర్స్ డిసీజ్‌లోనూ కనిపిస్తుంది. వినికిడి తగ్గడం : లక్షణాలను నిర్లక్ష్యం చేయడం, చికిత్స తీసుకోకపోవడం వల్ల శాశ్వతంగా వినికిడి కోల్పోయి... పర్మనెంట్ డెఫ్నెస్ వచ్చే అవకాశం ఉంది. వినికిడి లోపం అన్నది ఒక్కోసారి పెరుగుతూ ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఒకేరోజులోనే ఈ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. చెవి నిండిపోయినట్లుగా ఉండే ఫీలింగ్ చికాకు కలిగిస్తూ ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు: బాధితులు చెప్పే లక్షణాలతో ఆడియాలజిస్టుల ఆధ్వర్యంలో వినికిడి సామర్థ్యం పరీక్షలు (ఆడియోమెట్రీ టెస్ట్) , వెస్టిబ్యులార్ టెస్ట్ బ్యాటరీ పరీక్షలతో పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో మెదడు ఎమ్మారై, ‘ఎలక్ట్రో కాక్లియోగ్రఫీ’, ‘ఎలక్ట్రో నిస్టాగ్మోగ్రఫీ’ వంటి పరీక్షలు మీనియర్స్ డిసీజ్ నిర్ధారణకు తోడ్పడతాయి. ఇతర పరీక్షలు: మెదడులో గడ్డలు, కొన్ని రకాల మెదడు సమస్యలు ఉన్నప్పుడూ ఈ లక్షణాలే కనిపిస్తాయి కాబట్టి... ‘మీనియర్స్ ప్రోటోకాల్’ కూడా చేసి... సమస్య మెదడుకు సంబంధించింది కాదని రూల్ అవుట్ చేసుకుంటారు. నివారణ / వ్యాధి ఉన్నవారికి చెప్పే జాగ్రత్తలు : మీనియర్స్ డిసీజ్ ఉన్నవారిలో కొన్ని రకాల ఆహార నియంత్రణలను సూచిస్తారు. ఇవి కొంతమేరకు నివారణకూ తోడ్పడతాయి ఆహారంలో ఉప్పు తగ్గించడం చాక్లెట్లు, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, కోలాడ్రింక్స్ వంటి పానీయాలను పరిమితంగా తీసుకోవడం ∙ఆల్కహాల్, పొగ అలవాట్లకు దూరంగా ఉండటం చైనా సాల్ట్‌కు దూరంగా ఉండటం. చికిత్స : ►వికారం, వాంతుల వంటి లక్షణాలను తగ్గించేందుకు యాంటీ–నాసియా (యాంటీ–ఎమిటిక్) మెడిసిన్స్ ఇస్తారు ∙ చెవిలోని ఒక రకం ద్రవం పెరగడం వల్ల మీనియర్స్ డిసీజ్ ►వచ్చే అవకాశం ఉన్నందున దేహంలోని ద్రవాలను బయటకు పంపించేందుకు మూత్రం ఎక్కువగా వచ్చే మందులైన ‘డై–యూరెటిక్స్’ అనే మందుల్ని వాడతారు ►వర్టిగోలో కనిపించే కళ్లు తిరగడం, పడిపోవడం లాంటి లక్షణాలను తగ్గించేందుకు ‘వెస్టిబ్యులార్ రీ–హ్యాబిలిటీషన్’ అని పిలిచే ఫిజియోథెరపీ లాంటి చికిత్సలను అందిస్తారు. ఇందులో బాధితులతో కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తారు ►వినికిడి సామర్థ్యం కోల్పోయిన వారిలో... వారు ఏ మేరకు కోల్పోయారో దాన్ని బట్టి హియరింగ్ ఎయిడ్ మెషిన్‌నూ అమర్చవచ్చు. ►పై చికిత్సలేవీ పనిచేయనప్పుడు చాలా అరుదుగా కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఇందులో ‘ఎండోలింఫాటిక్ శాక్’ అనే ప్రొసీజర్ ద్వారా చెవిలో అత్యధికంగా స్రవించే ద్రవాన్ని డ్రైయిన్ చేస్తారు∙ ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన ‘ఇంట్రాటింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్’ థెరపీ కూడా ఉపయోగపడుతుంది. డాక్టర్ ఈ.సీ. వినయ కుమార్ సీనియర్ ఈఎన్టి సర్జన్ (చదవండి: అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్ నుంచి బయటపడాలంటే..?) -
లావైపోతున్నారు! ముంచేస్తున్న ఆహారపు అలవాట్లు
ఊబకాయం.. ఇప్పుడు సాధారణమైపోయింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య పీడిస్తోంది. దీని ప్రభావం శరీరంలోని మిగతా అవయవాల మీద పడుతోంది. ఫలితంగా గుండె, కిడ్నీ, మధుమేహం వంటి వ్యాధులకు మూలమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఊబకాయం నివారణకు జీవనశైలిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుత ఆహారపు అలవాట్లు లావు కావడానికి ఒక కారణమైతే, సరైన వ్యాయామం లేకపోవడం మరో కారణమని జాతీయ ఆరోగ్య మిషన్ చేసిన సర్వేలో తేలింది. శ్రమగల జీవన విధానం, సమతులాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సర్వే స్పష్టం చేసింది. సాక్షి, చిత్తూరు రూరల్: ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం పెరిగిపోతోంది. దానికి తోడు వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అధిక బరువు ఉన్న వారిని గుండె జబ్బులతో పాటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ, కీళ్ల సమస్యలు వెంటాడుతున్నాయి. ఊబకాయులు ఇటీవల అనేక దుష్ఫలితాలతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. కార్డియాలజీ రోగుల్లో 25 శాతం మంది ఊబకాయులే ఉంటున్నారు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, తగిన వ్యాయామం లేకపోవడం వల్ల ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిర్వహిస్తున్న నాన్ కమ్యూనికల్ డిసీజెస్ (ఎన్ఎసీడీ) సర్వేలో సైతం ఒబెసిటీ కారణంగా రక్త పోటు, మధుమేహం, గుండె జబ్బులు సోకుతున్నట్లు తేలింది. జిల్లాలో 17,54,254 మంది ఉండగా 12,99,758 మందిని ఎన్సీడీ సర్వే చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సర్వే 74.09శాతం పూర్తయింది. అయితే ఈ సర్వేలో బీపీతో బాధపడుతున్నవారు 1,96,772 మంది, మధుమేహంతో 1,96,957 మంది, రెండు ఉన్నవారు 17,675 మంది ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం ప్రజల ఆహార అలవాట్లు, జీవనశైలి, అధికబరువు వంటివి అని వైద్యులు చెబుతున్నారు. బరువుతో గుండె బలహీనత గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో ఊబకాయులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కార్డియాలజీ ఓపీల సంఖ్య పెరుగుతోంది. రోజుకు జిల్లాలో 200 నుంచి 250 మంది వరకూ రోగులు వస్తున్నట్లు వైద్యులు లెక్కలు చెబుతున్నాయి. వారిలో 25 శాతం మంది అంటే 55 మంది ఊబకాయులే. వారిలో గుండె రక్తనాళాలు సన్నబడి బ్లాకులు ఏర్పడటం, గుండెపై తీవ్ర ఒత్తిడి, పల్మనరీ ఎంబోలిజమ్, పల్మనరీ హైపర్ టెన్షన్ వంటి సమస్యలను వైద్యులు గుర్తిస్తున్నారు. రక్తనాళాల్లో బ్లాకులు ఉన్న వారికి వాటిని తొలగించి స్టెంట్లు వేస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఒబెసిటీ కారణంగా కిడ్నీలపై ఒత్తిడి పడుతోంది. ఆ కారణంగా ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. దీంతో యూరిన్‌లో ప్రొటీన్లు లీకవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాళ్ల వాపులు రావడం, కిడ్నీలు పూర్తిగా పాడైన వారిని చూస్తున్నారు. ఊబకాయుల్లో వచ్చే మధుమేహం, రక్తపోటు కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న వారు డయాలసిస్ కోసం వస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిత్యం 50 నుంచి 65 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇతర వ్యాధులు ఒబెసిటీ వారిలో రక్తపోటు, మధుమేహం వలన వచ్చే దుష్ఫలితాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒబెసిటీ ఉన్న వారిలో పదిశాతం మందికి గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఫ్యాటీ లివర్ ఏర్పడి, దీర్ఘకాలంలో తీవ్రమైన లివర్ సమస్యలు తలెత్తుతున్నాయి. మోకీళ్లపై ప్రభావం చూపి, నాలుగు పదుల వయసులోనే మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తోంది. బరువు పెరగడానికి కారణాలు పట్టణాల నుంచి పల్లెల వరకు జంక్‌ఫుడ్ వినియోగం పెరిగింది. పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్‌ఫుడ్, ఐస్‌క్రీమ్‌లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్‌గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్లోని కొన్ని యాప్‌లద్వారా జంక్‌ఫుడ్‌ను ఆర్డర్ పెడితే క్షణాల్లో గుమ్మం ముందు డెలివరీ చేస్తున్నారు. దీనికి తోడు రెస్టారెంట్లలో విక్రయించే ఆహారాల్లో బిర్యానిదే మొదటిస్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండడం, వీటికి తోడు కూల్‌డ్రింక్‌లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మగవారితోపాటు అధికంగా మహిళలకు ఊబకాయం వచ్చేస్తోంది. ఇలా చేస్తే మేలు దేశంలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23.5 దాటిన వారందరినీ ఊబకాయులుగా భావిస్తారు. వారు బరువు తగ్గేందుకు శ్రమగల జీవన విధానం, సమతుల ఆహారం తీసుకుంటే సత్పలితాలు రాబట్టవచ్చు. బరువు తగ్గేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక విధానాలు ఉన్నాయి. దీర్ఘకాల విధానంలో వారానికి మూడు, నాలుగు గంటలు వ్యాయామం ద్వారా బరువు చేయడం తగ్గించుకోవచ్చు. స్వల్పకాలంలో రోజుకు వెయ్యి కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. బీఎంఐ27 శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పద్ధతులను అనుసరించినా బరువు తగ్గకుంటే బీఎంఐ 30 శాతం దాటిన వారికి బేరియాట్రిక్ (మెటబాలిక్) సర్జరీలతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. బరువు తగ్గితే మంచిది ఊబకాయం ఉన్న మధుమేహులు తమ బరువులో ఐదు శాతం తగ్గించుకోగా తక్కువ మందులతో మెరుగైన వ్యాధి నియంత్రణా ఫలితాలు రాబట్టవచ్చు. హృద్రోగ సమస్యలను నివారించుకోవచ్చు. సమతుల ఆహారం, క్రమగల జీవన విధానం, జీవనశైలిలో మార్పులు పాటించడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ఊబకాయుల్లో మధుమేహ నియంత్రణకు ఆధునిక మందులు అందుబాటులోకి వచ్చాయి. – డాక్టర్ అరుణ్‌కుమార్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
Pneumonia: అశ్రద్ధ చేస్తే ‘ఊపిరి’ తీస్తుంది
గుంటూరు మెడికల్: ఊపిరితిత్తులకు వచ్చి, ప్రాణాలు తీసే వ్యాధుల్లో న్యుమోనియా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు న్యుమోనియా వ్యాధితో చనిపోతున్నారు. ప్రతి ఏడాది ఐదేళ్లలోపు పిల్లలు రెండు మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. భారత దేశంలో ప్రతి ఏడాది రెండులక్షల మంది పిల్లలు ఈ వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ వ్యాధి నివారణకు ఉన్న టీకాను వినియోగించటం ద్వారా ఒక మిలియన్ పిల్లల మరణాలు తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తుంది. చలికాలంలో న్యుమోనియా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి బారినపడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. వ్యాధి లక్షణాలు... ఈ వ్యాధి అన్ని వయస్సుల వారికి వస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లుదాటిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దగ్గు, కళ్లె పడటం, కళ్లె పసుపు లేదా పచ్చగా ఉండటం, దగ్గినప్పుడు రక్తం పడటం, ఆయాసం, అలసట, ఛాతీలో నొప్పి, ఊపిరి పీల్చుకోవటం కష్టంగా ఉండటం, జ్వరం, చలి, వణుకు ఉండటం, తలనొప్పి, కండరాల నొప్పులు, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవటం లేదా తక్కువగా కొట్టుకోవటం, వికారం, వాంతులు, విరేచనాలు, పిల్లలు పాలు తాగలేకపోవటం తదితర లక్షణాలు వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. చలికాలంలో న్యూమోనియా కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువ. ఆడవారితో పోల్చితే మగవారిలోనే వ్యాధి బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. కారణాలు... వ్యాధి ఉన్న వ్యక్తి ముఖానికి కర్చీఫ్ పెట్టుకోకుండా దగ్గినా, తుమ్మినా వారి నోటి తుంపర్ల ద్వారా పక్కన ఉండే వారికి వ్యాధి సోకుతుంది. వైరస్, బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారిలో, పొగతాగేవారిలో, మద్యపానం చేసేవారిలో, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం అధికం. నిర్ధారణ... ఛాతీ ఎక్సరే, సీటీ స్కాన్ పరీక్ష, రక్తపరీక్షలు, కళ్లె పరీక్ష, బ్క్రాంకోస్కోపీ, పల్స్ ఆక్సీమెట్రీ, ఫ్లూయిడ్ కల్చర్ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. వ్యాధి బాధితులు... ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మంది, పిల్లల వైద్య నిపుణులు, 300 మంది పల్మనాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ ఇద్దరు బాధితులు చికిత్స కోసం వస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. నివారణ చర్యలే ఉత్తమం.. వ్యాధి రాకుండా ముందస్తుగా పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సిన్లు చేయించాలి. వ్యాధి సోకకుండా నివారించే వ్యాక్సిన్లు పిల్లలకు, పెద్దవారికి అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఉచితంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లలకు వ్యాక్సిన్లు వేయిస్తుంది. విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ వినియోగించకూడదు. పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్ అడ్డుపెట్టుకోవటం చాలా మంచిది. – డాక్టర్ పి.పద్మలత, జీజీహెచ్ పిల్లల వైద్య విభాగాధిపతి జాగ్రత్తలు తీసుకోవాలి... వ్యాధి బాధితులు త్వరగా కోలుకోవటానికి వైద్యులు రాసిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ధూమపానం చేసేవారికి దూరంగా ఉండటంతోపాటుగా మద్యపానం, ధూమపానం చేయకూడదు. దగ్గినా, తుమ్మినా ముఖానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. తరచుగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వారంలో కనీసం ఐదురోజులపాటు వ్యాయామం చేయాలి. – డాక్టర్ గోపతి నాగేశ్వరరావు, పల్మనాలజిస్ట్, గుంటూరు -
జిల్లాల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: జిల్లాల్లోనూ బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఫలితంగా అవయవదానాలు విరివిగా పెంచి, బాధితులకు మార్పిడి చికిత్సలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ముందుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనంతరం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ ఏర్పాట్లు చేస్తారు. సంబంధిత మెడికల్ కాలేజీల్లోనూ అపస్మారకస్థితికి చేరిన రోగుల బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. తక్షణమే కాకతీయ, నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల్లో బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ, అవయవాల సేకరణ చర్యలు తీసుకోనున్నారు. డిమాండ్ ఎక్కువ... అవయవాలు తక్కువ కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులు, క్లోమం వంటి అవయవాలను అవసరమైనవారికి మార్పిడి చేయడానికి వైద్యపరంగా వీలుంది. రాష్ట్రంలో జీవన్‌దాన్ పథకం ద్వారా అవయవ దానాలు, అవయవమార్పిడి జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. వెబ్సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకుంటే, వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనర్ కార్డు అందజేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో తొలిసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. జీవన్‌దాన్‌లో ప్రస్తుతం 2,863 మంది అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. నమోదు చేసుకోనివారు 90 శాతం మంది బాధితులు ఉంటారని జీవన్‌దాన్ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రస్తుతం 10 వేల మంది బాధితులు కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్నారు. వారిలో సగం మందికైనా కిడ్నీ మార్పిడి చేయడానికి వీలుంది. కానీ, అవయవాల లభ్యత కొరవడింది. దానికి ప్రధాన కారణం బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ చేయడానికి అనువైన వసతులు లేకపోవడమే. హైదరాబాద్‌లో మాత్రమే నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతోపాటు 30 ప్రైవేట్ ఆసుపత్రుల్లో బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ జరుగుతోంది. జిల్లాల్లో ఇటువంటి ఏర్పాట్లు లేవు. దీంతో వేలాదిమంది బ్రెయిన్‌డెడ్ కేసులు నమోదవుతున్నా, నిర్ధారణ జరగక అవయవాలు వృథాగా పోతున్నాయి. బ్రెయిన్‌డెడ్‌ను ఎలా నిర్ధారిస్తారు? ప్రమాదం వల్లగాని, నివారణ కాని వ్యాధి వల్ల కాని మనిషి అపస్మారక స్థితిలోకి చేరుకుంటాడు. కృత్రిమ ఆక్సిజన్ ద్వారా రక్తప్రసరణ జరుగుతున్నప్పటికీ తిరిగి స్పృహలోకి రాని స్థితిని బ్రెయిన్ డెడ్‌గా పేర్కొంటారు.ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. అయితే రోగి ఎట్టి పరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని నిర్ధారించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్‌లతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్లతో కూడిన బృందం కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్‌డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. జిల్లాల్లో అనువైన పరిస్థితులు కరోనా కాలంలో పెరిగిన వైద్య మౌలిక సదుపాయాల కారణంగా అవయవ దానాలు, సేకరణకు అవకాశాలు విస్తృతమయ్యాయి. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయవాలను సేకరించాలన్నా, వారు చనిపోవడానికి ముందు అవసరమైన చికిత్స పొందాలన్నా తప్పనిసరిగా ఐసీయూ వసతి ఉన్న ఆసుపత్రులు కావాలి. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో 11,845 ఐసీయూ, వెంటిలేటర్లు ఉండగా, అందులో ప్రభుత్వంలో 2,143, ప్రైవేట్‌లో 9,702 ఐసీయూ, వెంటిలేటర్ పడకలు ఉన్నాయి. ఫలితంగా బ్రెయిన్‌డెడ్ అయిన కేసుల నిర్వహణ సులువని అంటున్నారు. కాగా, 2013లో 189 అవయవదానాలు జరిగితే, ఈ ఏడాది 662 జరగడం గమనార్హం. అవయవ మార్పిడికి డిమాండ్ పెరిగింది అవయవ మార్పిడికి రాష్ట్రంలో డిమాండ్ పెరిగింది. కానీ, ఆ మేరకు అవయవాలను అందించలేకపోతున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 10 వేల మంది కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇంకా అనేకమంది రిజిస్ట్రేషన్న్ చేయించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అవకాశం ఉన్నచోట బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. – డాక్టర్ స్వర్ణలత, జీవన్‌దాన్ ఇన్చార్జి -
Diabetes: బార్లీ, కొర్రలు.. వేపుళ్లు, నేతి వంటకాలు.. ఏవి తినాలి? ఏవి వద్దు?
ఇటీవలి కాలంలో ఎక్కువమందికి వస్తున్న జీవనశైలి వ్యాధులలో మధుమేహం ఒకటి. షుగర్ వ్యాధి పేరులోనే చక్కెర ఉంది కానీ, రుచికి మాత్రం చేదే. ఇది చాపకింద నీరులా కిడ్నీల పనితీరు మందగించేలా చేస్తుంది. ముఖ్యంగా కనుదృష్టిని క్షీణింపచేస్తుంది. అలాగని షుగర్ ఉన్న వారంతా భయపడాల్సిన పనిలేదు. చాలామంది మధుమేహం ఉన్నా దశాబ్దాల తరబడి చక్కగానే ఉంటున్నారు. అయితే ఏ వ్యాధినైనా వచ్చాక బాధపడేకంటే రాకుండా నివారించుకోవడమే చాలా మేలు. చిత్రం ఏమిటంటే బీపీ, షుగర్ చాలా మందికి అవి వచ్చినట్లే తెలియదు. ఏవో కొన్ని లక్షణాలను బట్టి డాక్టర్ దగ్గరకు వెళ్తే, వారి సలహా మేరకు పరీక్షలు చేయించుకుని ఉన్నట్లు తెలుసుకుని అప్పుడు చికిత్స తీసుకుంటున్నారు. అందువల్ల షుగర్ వ్యాధి లక్షణాలేమిటో, అది ఎందుకు వస్తుందో, అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం. లక్షణాలు ►ఆరోగ్యవంతులు 24 గంటల కాలాన విసర్జించే మూత్ర ప్రమాణం 800 – 2500 మిల్లీలీటర్లు ఇంతకన్నాఅధికంగా మూత్రవిసర్జన జరిగితే దానిని అతి మూత్రవ్యాధిగా చెప్పవచ్చు. ఇలా అతిగా మూత్రం పోవడం అన్నది డయాబెటిస్‌కు ఒక సూచన. ►మొదటి ప్రధాన లక్షణం మాటిమాటికీ మూత్ర విసర్జన చేయాల్సి రావడం... అదీ ఎక్కువ ప్రమాణంలో. అంతేగాకుండా చెమట ఎక్కువ పట్టడం, నిద్ర పట్టకపోవడం, ఆకలి, నిస్సత్తువ, నిస్త్రాణ, ఎక్కువ దాహం కావడం, కళ్లు తిరిగినట్లుండటం, కంటిచూపు మసకబారటం వంటివి ఇందులో ప్రధాన లక్షణాలు. అలాగని ఈ లక్షణాలు ఉన్నవారందరికీ షుగర్ ఉందని కాదు. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలోనూ ఇంచుమించు ఇటువంటి లక్షణాలే ఉంటాయి. అందులో అయితే గొంతు వద్ద వాపు, జుట్టు ఊడిపోవటం వంటివి అదనపు లక్షణాలు. యువ తరం నుంచి మధ్య వయసులోకి వస్తున్న వారు మధుమేహం, రక్తపోటు వంటివి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ►ఆఫీసుల్లో లేదా పని ప్రదేశాల్లో శారీరక శ్రమ లేకుండా అదే పనిగా కూర్చుండటం, ఎక్కువసేపు నిద్రించటం, పెరుగు, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం, పాలు, బెల్లం, తీపివస్తువులు, అరటి, సపోటా, మామిడి లాంటి తీపి ఎక్కువగా ఉండే పండ్లను అధికంగా తినడం, కొవ్వుపదార్థాలు తీసుకోవడం, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తరచు తీసుకోవడం మధుమేహానికి ప్రధాన కారణాలు. స్థూలకాయం... షుగర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని గుర్తించాలి. ►సక్రమమైన ఆహారాలు, క్రమం తప్పకుండా వ్యాయామం వలన చక్కెర అదుపులో ఉంటుంది. నివారణ ►మధుమేహ నివారణలో మందులతో పాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ►ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయపు నడక లేదా సాయంత్రపు నడకను కచ్చితంగా అలవర్చుకోవాలి. పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినడం మంచిది. అయితే పెరుగన్నం లేదా చిక్కటి మజ్జిగ బదులు పలుచటి మజ్జిగే మంచిది. ►పరగడుపునే ఒక లీటర్ నీటిని తాగడం, కాకర కాయ కూరను తరచు ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ►నెలకి ఒకసారి కచ్చితంగా ఉపవాసం చేయాలి. ఇది షుగర్ లేనివాళ్లకు మాత్రమే. ►యోగాసనాలు, సూర్య నమస్కారాలు దినచర్యలో భాగం చేసుకుంటే దాదాపుగా మధుమేహం, రక్తపోటు నుంచి బయటపడవచ్చు. తినవలసినవి.. బార్లీ, గోధుమలు , కొర్రలు , రాగులు, పాతబియ్యపు అన్నం , పెసలు , కాయగూరలు, ఆకుకూరలు , చేదుపొట్ల , కాకరకాయ , మెంతులు, దొండకాయ, వెలగపండు, మారేడు , నేరేడు గింజలు, ఉసిరిక పండు, పసుపు, పండ్లలో యాపిల్, బొప్పాయి, జామ, బత్తాయి. దానిమ్మ మంచిది. తినకూడనివి.. ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం, వేపుళ్లు, నేతి వంటకాలు, మద్యం, చెరుకు రసం, పుల్లటి పదార్థాలు, చింతపండు, పెరుగు, వెన్న , జున్ను , దుంప కూరలు, కొవ్వులు అధికంగా ఉండే పదార్థాలు వాడకూడదు. అదేవిధంగా రాత్రిపూట మేలుకొని పగలు ఎక్కువ నిద్రించటం, ధూమపానం, మద్యపానం మంచిది కాదు. మలమూత్రాలను ఆపుకోకపోవడం మంచిది. తనంతట తానుగా మన శరీరం దాదాపు ప్రతి వ్యాధిని నివారణ చేసుకోగలదు. కానీ మధుమేహం వస్తే అది కుదరకపోవచ్చు. అందుకే డయాబెటిస్ విషయంలో నివారణకే ప్రాధాన్యం ఇవ్వాలి. చదవండి: ఈ హెర్బల్ టీతో ఇమ్యునిటీని పెంచుకోండి ఇలా.. -
Covid: ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తున్నారా? అయితే ఓసీడే
కరోనా రాకముందే... అలాగే, దాని గురించి తెలిసిన కొత్తలో దాని కారణంగా చాలామందిలో కొన్ని మానసిక సమస్యలు కనిపించడం వైద్యులు గమనించారు. ఉదాహరణకు... యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి కొన్ని. అలాగే ఇప్పుడు రెండో వేవ్ కొనసాగుతూ ఉండగా... ఇందులోనూ తమకు సన్నిహితులూ... కొందరైతే తమ సొంత కుటుంబ సభ్యులను కోల్పోవడంతో మరింత తీవ్రమైన మానసిక సమస్యలను చవిచూశారూ...చూస్తున్నారు. అందులో ప్రధానమైనది ‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’. దాని గురించి తెలుసుకుందాం. గత ఏడాది మొదటి కరోనా వేవ్ సీజన్లో దాని గురించి పెద్దగా తెలియని పరిస్థితుల్లో చాలామంది తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు కొన్ని మానసిక లక్షణాలూ కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు తొందరగానే తగ్గిపోవచ్చు. అలా వచ్చి తగ్గిపోయిన సమస్యలను ‘అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్’ అంటారు. మరికొందరిలో అవి తీవ్రమైన ఒత్తిడి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, ఫోబియా, ఓసీడీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలుగా మారే అవకాశమూ ఉండింది. అప్పుడూ ఇప్పుడు కూడా కరోనా విషయమై బాగా టెన్షన్‌గా ఉండటం, తీవ్రమైన ఆందోళన, విపరీతమైన బెంగ... వ్యాధి వస్తుందా, వస్తే తగ్గుతుందా, లేక మరణానికి దారితీస్తుందా లాంటి సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పటి రెండో సీజన్లోనూ అలా అవుతున్నారు. దాన్ని కరోనా ఫోబియాగా చెప్పవచ్చు. వాళ్లలో కరోనా లేకపోయినా... లేదా వచ్చి తగ్గిన వారిలోనూ మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. వారిలో ఆ వ్యాధి లేదనీ... ఒకసారి వచ్చి తగ్గినందున మళ్లీ ఆ వెంటనే సాధారణంగా రాదని చెప్పినా భయం పోదు. ఇలా తమకు దూరంగా ఉన్న రక్తసంబంధీకులు, కావాల్సినవారు ఎలా ఉన్నారో అంటూ ఆందోళన పడవచ్చు. ఇలాంటి ఆందోళనతో టెన్షన్ పడటాన్ని ‘జనరలైజ్డ్ యాంగై్జటీ డిజార్డర్ (జీఏడీ)’గా చెప్పవచ్చు. టెన్షన్‌తోపాటు విపరీతంగా భయపడటాన్ని ప్యానిక్ డిజార్డర్‌గా చెప్పవచ్చు. అంటే వీళ్లు కరెన్సీనీ, కూరగాయలనూ, తమ ఇంటిలోని సొంత ఆత్మీయులనూ తాకడానికి కూడా తీవ్రమైన భయాందోళనలకు గురవుతూ ప్యానిక్ అవుతుంటారు. దీన్ని ‘ప్యానిక్ డిజార్డర్’గా చెప్పవచ్చు. ఇక చేతులకు మళ్లీ మళ్లీ శానిటైజర్ పూసుకోవడం, చేతులు అదేపనిగా కడుక్కోవడం చేస్తూ ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌కూ లోను కావచ్చు. ఒకసారి చేతులు కడుక్కున్నా లేదా శానిటైజర్ పూసుకున్నా దాదాపు గంటపాటు రక్షణ ఉందని తెలిశాక కూడా ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తుంటే ఓసీడీగా పేర్కొనవచ్చు. సెకండ్‌వేవ్‌లో కనిపిస్తున్న ప్రధాన మానసిక సమస్య... అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ మొదటివేవ్‌తో పోలిస్తే ఈసారి సెకండ్ వేవ్‌లో... కుటుంబ సభ్యులూ, తమకు కావాల్సిన సన్నిహితులు, ఆత్మీయులు మరణించడంతో... చాలామంది ఇప్పుడు ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ మానసిక సమస్యతో బాధపడుతుండటాన్ని చాలామంది సైకియాట్రిస్టులు చూస్తున్నారు. ఈ సమస్య తాలూకు కొన్ని కేస్ స్టడీలు కేస్ స్టడీ 1: డెబ్బయి ఏళ్ల పెద్దవయసు దంపతులు సొంతకూతుర్ని పోగొటుకున్నారు. యూఎస్‌లో ఉండే వారి కుమారుడు ఇక్కడికి వచ్చేసి వాళ్లకు చికిత్స అందిస్తున్నాడు. అతడు తన ఉద్యోగం కోసం యూఎస్‌కు వెళ్లే పరిస్థితి లేదు. కేస్ స్టడీ 2: మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్న ఓ యువకుడు ఇటీవల కరోనాతో మరణించాడు. దాంతో 58 ఏళ్ల వయసున్న అతడి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. వీళ్లంతా ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’’ గురైనట్లు తేలింది. అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అంటే... అంతకు ముందు ఉన్న సాకుకూల స్థితి తొలగిపోయి ఒకేసారి కొత్త పరిస్థితులకు ఎక్స్పోజ్ అయినప్పటుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, దానికి తగినట్లుగా తమను తాము ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియని అయోమయంలో వ్యక్తులు తీవ్రమైన వ్యాకులతకూ, కుంగుబాటుకు గురియ్యే అవకాశం ఉంది. దాన్నే ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’’గా పేర్కొనవచ్చు. లక్షణాలు: అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అవే లక్షణాలన్నీ అందరిలోనూ కనిపించకపోవచ్చు. బాగా దగ్గరివారు ఆ లక్షణాలను గమనిస్తూ ఉండటం అవసరం. అవి... ∙ఏదో తెలియని భయం/ఆందోళన/గుబులు/గాభరా ∙గుండెవేగంగా కొట్టుకోవడం/గుండెదడ/గుండెల్లో మంట / గుండె బిగబట్టినట్టుగా ఉండటం/ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ∙ అకస్మాత్తుగా అంతులేని భయానికీ లోనవ్వడం (ప్యానిక్ అటాక్) ∙విపరీతంగా చెమటలు పట్టడం ∙ఛాతీ బిగబట్టినట్టుగా అనిపించడం / ఛాతీలో మంట ∙శ్వాససరిగా అందకపోవడం లేదా బలంగా ఊపిరి తీసుకోవడం / ఆయాస పడటం ∙నోరు తడారిపోవడం ∙ఒళ్లు జలదరించడం ∙అయోమయం ∙కడుపులో గాభరా కడుపులో మంట ∙ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తూ ఉండటం ∙చేతులు, కాళ్లు వణకడం, ఒకచోట నిలకడగా ఉండలేకపోవడం ∙నిత్యం అలజడిగా ఉండటం ∙తీవ్రమైన నిద్రలేమి, నిద్రవేళల్లో మార్పులు, వేళకు నిద్రపట్టకపోవడం (ఇర్రెగ్యులర్ స్లీప్ పాట్రన్స్), అకస్మాత్తుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడం ఇక ఆ తర్వాత నిద్రపట్టకపోవడం... పై లక్షణాలతో పాటు కొత్త పరిస్థితులకు అడ్జెస్ట్ అయ్యేందుకు పడే ప్రయాసలో డిప్రెషన్‌కు గురైన వారిలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, నెగెటివ్ ఆలోచనలు రావడం, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించకపోవడం వంటి లక్షణాలూ కనిపించడంతో పాటు ఆత్మహత్యకు పాల్పడే లక్షణాలూ (సూసైడల్ టెండెన్సిస్) కూడా కనిపిస్తాయి. ఆత్మహత్యకు చేసుకోవలన్న ఆలోచనలు మాటిమాటికీ వస్తుంటాయి. దీని నుంచి బయటపడటం ఎలా? ► మీ ఇతర కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, తెలిసినవారు, మీ శ్రేయోభిలాషులు అనుకున్నవారితో భౌతికంగా కాకపోయినా... వర్చువల్‌గా (అంటే మొబైల్ లేదా ఫేస్‌టైమ్‌తో) వారితో సన్నిహితంగా ఉండండి. వారితో మీ సంతోషదాకయమైన క్షణాలను స్మరిస్తూ... ఆ ఆనందకరమైన సమయాలు మళ్లీ త్వరలోనే వస్తాయనే ఆశాభావంతో కూడిన సంభాషణలు చేయండి. ► మీ దగ్గరివారు కూడా కోవిడ్‌ను ఎదుర్కోవడమో, తమకు ఆత్మీయులైనవారిని కోల్పోవడమో చేసి ఉండవచ్చు. వారు ఈ క్రైసిస్‌ను ఎలా ఎదుర్కొన్నారు అనే లాంటి అంశాలను మాట్లాడుతూ... మీరూ ఆ మాటలతో మోటివేట్ అయ్యేలా మీ సంభాషణలు ఉండాలి. వారి నుంచి మీరు స్ఫూర్తి పొందేలాంటి సంభాషణలే వినండి. వారి ధైర్యసాహసాలను మెచ్చుకోండి. వాటిని మీరు మీలోనూ నింపుకోండి. ► మీకు ఇష్టమైనవారి ధైర్యసాహసాలను, వారు వారి క్రైసిస్ నుంచి బయటపడ్డ తీరును, వారి మంచి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచండి. దాంతో ఇతరులూ స్ఫూర్తి పొందుతారు. ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచినప్పుడు ఇతరులు వాటిని లైక్ చేస్తే... మీరు వాటిని మళ్లీ మళ్లీ చదువుతున్నప్పుడు మీరూ ఉత్తేజితులవుతారు. ► మీ అనుభవాలను ఉత్తరాలుగా రాసుకోండి. వాటిని మీరు మళ్లీ చదువుకోండి లేదా ఇష్టమైనవారికి పంపండి లేదా మీరే చించివేయండి. ► మీకు ఇష్టమైన హాబీలలో నిమగ్నం కావాలి. గతంలో మీరు ప్రదర్శించిన నైపుణ్యాలను మళ్లీ వెలికి తీయాలి. అంటే పెయిటింగ్, డాన్స్ వంటి వాటిలో నిమగ్నమవుతూ... వాటిని ఆస్వాదిస్తూ ఉండాలి. మీరు బాగా ప్రదర్శించిన వాటికి మీకు మీరే బహుమతులు ఇచ్చుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేవ్ చేసుకోవడమూ అవసరం. ► గతంలో మీరు ప్రదర్శించిన ధైర్యసాహసాలు మాటిమాటికీ తలచుకోవాలి. ‘అప్పుడు వాటిని చేసింది కూడా నేను కదా. మరలాంటప్పుడు నేను ఇప్పుడూ అవే ధైర్యసాహసాలను ప్రదర్శించగలను కదా’ అంటూ ధైర్యం చెప్పుకోవాలి. ► ఆటలూ, క్రీడలూ వంటివి క్రీడా స్ఫూర్తి పెంచుతూ... ఓటమిని తేలిగ్గా తీసుకునే అడ్జస్ట్మెంట్ బిహేవియర్‌ను వేగవంతం చేయడమే కాకుండా... కొత్త పరిస్థితులకు తేలిగ్గా సర్దుకుపోయే గుణాన్ని పెంపొందిస్తాయి. డిప్రెషన్ నుంచి వేగంగా బయటపడేస్తాయి. ► ఇంట్లోనే వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల మెదడులో ఎండార్ఫిన్స్ వంటి సంతోషకరమైన రసాయనాలు వెలువడుతాయి. అవి ఆనందాన్ని పెంచి డిప్రెషన్‌ను అధిగమించేందుకూ తోడ్పడతాయి. ఇవి కూడా చేయండి: ► రోజూ అన్ని పోషకాలు ఉండే సమతులాహారం, మంచి పౌష్టికాహారం తీసుకోండి. ► టీవీలో మీకు విపరీతమైన ఆందోళన కలిగించే వార్తలను చూడకండి, వినకండి. ► మీకు చాలా ఇష్టమైనవారితోనే సమయం గడపండి. ∙ఆహ్లాదకరమైన సంగీతం/పాటలు వినండి. ► ఇంట్లోనే మీకు ఇష్టమైన సినిమాలు చూడండి. ముఖ్యంగా హాస్యచిత్రాలు. ► బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడంతో పాటు... యోగా, ప్రాణాయామ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ► ఈ పరిస్థితేమీ ప్రమాదకరం కాదంటూ మీకు మీరు ధైర్యం చెప్పుకుంటూ ఉండండి. ఒకవేళ అది సాధ్యపడకపోతే... టెలిఫోన్లోనే మీ కుటుంబ డాక్టర్‌తో లేదా సైకియాట్రిస్ట్‌తో మాట్లాడి, ప్రొఫెషనల్స్ సలహా తీసుకోండి. అలాంటివారిలోనూ మీ పట్ల సహానుభూతితో ఉండేవారినే ఎంచుకుని వారిని సంప్రదించండి. - డాక్టర్ చరణ్ తేజ కోగంటి కన్సల్టెంట్ న్యూరోసైకియాట్రిస్ట్ -
జిల్లాకో డయాగ్నోస్టిక్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: రోగాన్ని ముందస్తుగా గుర్తిస్తే వేగంగా నయం చేయ వచ్చనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. క్యాన్సర్ లాంటి రోగాన్ని సైతం ప్రాథమిక దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చామని, వచ్చే నెలాఖరులోగా మరో 19 చోట్ల ఈ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. రూ.1.5 కోట్లతో సంబంధిత పరికరాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆనంద్ లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈటల వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లోని నారాయణగూడలో అత్యాధునిక పరికరాలతో లేబొరేటరీని అందుబాటులోకి తెచ్చామన్నారు. నగరంలో 20 చోట్ల శాంపిల్ కలెక్షన్ సెంటర్లను తెరిచి రోగుల నుంచి శాంపిల్స్ తీసుకుని నారాయణగూడ ల్యాబ్‌కు పంపిస్తున్నామని తెలిపారు. భూపాలపల్లిలో వంద పడకల ఆస్పత్రిని ఉద్యోగుల నియామకం పూర్తిచేసి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కరోనాపై అసెంబ్లీలో మంత్రి ఆరా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని ఆరోగ్య శాఖ ఈటల అధికారులను ఆదేశించారు. అధికారుల నుంచి అందే నివేదిక ఆధారంగా భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఈటల వద్ద ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అసెంబ్లీలోని తన చాంబర్ నుంచి వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్‌తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసి యేషన్లతో మంత్రి రాజేందర్ ఫోన్లో మాట్లాడారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, ఆస్పత్రుల్లో చేరుతున్న ఇన్‌పేషంట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నా, తీవ్రత మాత్రం అంతగా లేదని అధికారులు వివరించారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచడంతో పాటు కరోనా బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. -
కేన్సర్ నిర్ధారణకు సరికొత్త పరీక్ష...
ప్రాణాంతకమైన కేన్సర్‌ను సులువుగా గుర్తించేందుకు స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. అయస్కాంత లక్షణాలున్న తీగలను ధమనుల్లోకి జొప్పించడం ద్వారా వ్యాధిని చాలా తొందరగా గుర్తింవచ్చునని వీరు అంటున్నారు. కేన్సర్‌ను నిర్ధారించేందుకు ప్రస్తుతం బయాప్సీనే మార్గం. రక్తపరీక్షల ద్వారా కూడా వ్యాధి నిర్ధారణకు తాజాగా కొన్ని పరీక్షలు అందుబాటులోకి వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. రక్తంలో ప్రవహిస్తూండే కేన్సర్ కణితి కణాలను ఆకర్శించే అయస్కాంత తీగను ఉపయోగించినప్పుడు మాత్రం వ్యాధి ఉన్నదీ లేనిదీ స్పష్టంగా తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సామ్ గంభీర్ తెలిపారు. రక్తంలో అతితక్కువగా ఉండే ఈ రకమైన కణాలను ఇతర పద్ధతుల ద్వారా గుర్తించడం చాలా కష్టమని అన్నారు. ఈ కణాలకు అతుక్కుని అయస్కాంతాలకు ఆకర్శితమయ్యే నానో కణాలను తాము అభివద్ధి చేశామని.. తద్వారా అయస్కాంత తీగను ధమనుల్లోకి జొప్పించినప్పుడు కణితి కణాలు సులువుగా ఈ తీగకు అతుక్కుపోతాయని సామ్ వివరించారు. పందులపై జరిపిన ప్రయోగాల్లో ఈ పద్ధతి చక్కగా పనిచేసిందని అన్నారు. ఈ పరీక్షను కేవలం 2– నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చునని, త్వరలో మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని వివరించారు. -
కేన్సర్‌ను గుర్తించే సరికొత్త పరికరం
మహమ్మారి కేన్సర్‌ను చటుక్కున గుర్తించేందుకు తయారైన సరికొత్త పరికరం ఇది. పేరు బ్రెత్ బయాప్సీ. బిల్లీ బాయల్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త అభివృద్ధి చేసిన ఈ గాడ్జెట్ కేవలం మన ఊపిరి ఆధారంగానే వ్యాధి నిర్ధారణ చేస్తుంది. భార్య కేట్కు ఉన్న పెద్దపేగు కేన్సర్‌ను సకాలంలో గుర్తించకపోవడం.. ఫలితంగా చిన్న వయసులోనే ఆమె మరణించడం బాయల్ మనసును కలచివేసింది. ఇలాంటి చావు ఇతరులెవ్వరికీ రాకూడదని, వీలైనంత ముందుగా కేన్సర్‌ను గుర్తించే టెక్నాలజీని అభివద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బాయల్.. కేవలం నాలుగేళ్లలోనే దాన్ని సాధించడం విశేషం. మనిషికి రాగల వేర్వేరు కేన్సర్లలో కనీసం సగంవాటిని బ్రెత్ బయాప్సీ ద్వారా గుర్తించవచ్చు. తద్వారా శస్త్రచికిత్సతో చేసే బయాప్సీ అవసరం ఉండదు. కేన్సర్ సోకినప్పుడు మన కణాల్లో కొన్ని నాశనమై కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు ఊపిరి ద్వారా బయటకు వస్తూంటాయి. ఈ వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్‌ను గుర్తించేలా బ్రెత్ బయాప్సీని సిద్ధం చేశారు. ఎలాంటి లక్షణాలు కనబరచకపోయినా ఊపిరిత్తుల, కడుపులోని కేన్సర్‌ను ఇది సులువుగా గుర్తించగలదు. కొన్ని ఇతర వ్యాధుల నిర్ధారణకూ ఇది ఉపయోగపడుతుందని అంచనా. ఈ అద్భుత ఆవిష్కరణకు ఇంజనీరింగ్ నోబెల్ అవార్డుగా పరిగణించే మెక్రాబర్ట్ అవార్డు దక్కింది. -
ఉబ్బసం వ్యాధి నిర్ధారణకు తేలికైన పరీక్ష
ముక్కులో ఉండే ద్రవాలను పరీక్షించడం ద్వారా ఉబ్బసం వ్యాధిని నిర్ధారించేందుకు మౌంట్ సినాయి (అమెరికా) శాస్త్రవేత్తలు ఓ సులువైన పద్ధతిని ఆవిష్కరించారు. రైబో న్యూక్లియిక్ ఆసిడ్ నమూనాలను సేకరించడం ద్వారా ఈ పద్ధతి పనిచేస్తుంది. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్‌తో మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారించే అవకాశముండగా.. కొత్త పద్ధతి ద్వారా ఎవరైనా ఈ పరీక్షలు పూర్తి చేయడమే కాకుండా... కచ్చితమైన ఫలితాలూ పొందవచ్చు. అంతేకాకుండా ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. మౌంట్ సినాయి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పరీక్షను దాదాపు 190 మంది కార్యకర్తలపై ప్రయోగించి చూసినప్పుడు వారిలో 66 మందికి తక్కువస్థాయి నుంచి ఒక మోస్తరు స్థాయి ఉబ్బసం లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ముక్కులోని ద్రవాల ద్వారా సేకరించిన ఆర్ఎన్ఏలో ఉబ్బసం వ్యాధిగ్రస్తుల్లో మాత్రమే కనిపించే కొన్ని జన్యుపరమైన అంశాలను గుర్తించడం ద్వారా తాము వ్యాధి నిర్ధారణ చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ సుపింద బున్యావానిచ్ తెలిపారు. వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్’ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
రోగ నిర్ధారణలో రేడియాలజిస్టులే కీలకం
సాక్షి, హైదరాబాద్: రోగ నిర్ధారణలో రేడియాలజిస్టుల పాత్ర కీలకమని పలువురు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఐఆర్‌ఐఏ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ మానస సరోవర్‌లో ‘ఇండో–యూఎస్ ఇమేజింగ్ అప్డేట్ సదస్సు’జరిగింది. తెలంగాణ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, ఫ్యాకల్టీ డాక్టర్ వెంకట్రామ్రెడ్డి, డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ సికిందర్, డాక్టర్ రాజేశ్, డాక్టర్ టీఎల్ఎన్ ప్రసాద్, డాక్టర్ జాఫర్ హసన్, డాక్టర్ ఖదీర్ చింతపల్లి, డాక్టర్ జగన్మోహన్రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ప్రసాద్లతో పాటు దేశవిదేశాలకు చెందిన సుమారు 350 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాలేయం, మూత్రపిండాలు, ప్రాంకీయాస్, చిన్న, పెద్దపేగుల్లో తలెత్తే సమస్యలను ఎంఆర్ఐ, సీటీ, అల్ట్రాసౌండ్ల ద్వారా సులభంగా గుర్తించవచ్చన్నారు. రేడియాలజిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వం రూ.160 కోట్ల మంజూరు కూడా చేసిందని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రేడియాలజీ కోర్సులను అభ్యసిస్తున్న వారికి ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉందన్నారు. నాన్ ఆల్కాహాలిక్ కేసులు పెరిగాయి అతిగా మద్యం సేవించడంతో కాలేయం దెబ్బతింటున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ నాన్ ఆల్కాహాలిక్(మద్యం అలవాటు లేని) కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపొద్దుపోయిన తర్వాత తినడం వల్ల చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. వందలో 50 శాతం మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. – డాక్టర్ కేథర్ చింతపల్లి, ప్రముఖ రేడియాలజిస్టు టెక్నాలజీలో అనేక మార్పులు వైద్యరంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రతిదానికీ బయాప్సీ అవసరం ఉండేది. ప్రస్తుతం ఆ అవసరం లేదు. అత్యాధునిక ఎంఆర్ఐ, సీటీ, అల్ట్రాసౌండ్ వంటి వైద్యపరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా బాడీలో ఏ భాగం దెబ్బతిన్నదో ఇట్టే తెలిసిపోతుంది. – డాక్టర్ విజయభాస్కర్ నూరి, డైరెక్టర్, విస్టా ఇమేజింగ్ అండ్ మెడికల్ సెంటర్ -
డెంగ్యూ, చికున్ గున్యాకు చెక్
సత్వర వైద్యానికి చర్యలు ► రాష్ట్రంలో కొత్తగా 20 పరీక్ష కేంద్రాలు ► ఈ ఏడాది ఏడు ప్రారంభం వచ్చే ఏడాది మరో 13 ఏర్పాటు ► ఆరోగ్యశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: శరీరంలోని అన్ని వ్యవస్థల ను దెబ్బతీస్తూ... జీవితకాలం ఆరోగ్య సమస్య లను తెస్తున్న డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులను వెంటనే గుర్తించి వేగంగా చికిత్స అందించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆరోగ్య శాఖ భావిస్తోంది. నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 14 చోట్ల డెంగ్యూ, చికున్ గున్యా నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భద్రాచలం, కొత్తగూడెం కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమ య్యాయి. సిద్దిపేట, తాండూరు, కామారెడ్డి, నిర్మల్, బాన్సువాడలో త్వరలో కొత్త కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి కాక వచ్చే ఏడాది మరో 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలు ఉండడంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నవి, కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో 34 పరీక్ష కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీం తో వేగంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స జరగ నుంది. దోమల నిర్మూలన, పరిసరాల పరిశుభ్ర తపై అందరికీ అవగాహన కల్పిస్తూ నే... చికున్ గున్యా, డెంగ్యూ చికిత్సను వేగంగా అందించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ అదన పు సంచాలకురాలు ఎస్.ప్రభావతి తెలిపారు. చికున్ గున్యా, డెంగ్యూ పరీక్ష కేంద్రాలు ప్రస్తుతం పని చేస్తున్నవి: వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లోని ఐపీఎం, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, రొనాల్డ్ రాస్ ఆస్పత్రులు. ప్రతిపాదిత కేంద్రాలు యాదాద్రి, సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల, భూపాలపల్లి, జగిత్యాల, పెద్దపల్లి, మెదక్, జనగామ, మహబూబాబాద్, అర్మూర్, బోధన్. డెంగ్యూ కేసులు... జిల్లా పేరు 2016 2017 ఖమ్మం 1416 205 హైదరాబాద్ 780 71 రంగారెడ్డి 568 31 నిజామాబాద్ 258 18 కరీంనగర్ 210 15 వరంగల్ 207 08 మహబూబ్‌నగర్ 122 12 మెదక్ 93 11 నల్లగొండ 66 01 ఆదిలాబాద్ 39 04 వివరాలు.. 2017 ఆగస్టు 16 వరకు. చికున్ గున్యా కేసులు జిల్లాల వారీగా జిల్లా పేరు 2016 2017 హైదరాబాద్ 22 5 మహబూబ్‌నగర్ 23 3 ఖమ్మం 15 0 రంగారెడ్డి 7 2 నిజామాబాద్ 1 1 ఆదిలాబాద్ 0 1 వరంగల్ 0 1. -
చెమటతో వ్యాధిని గుర్తించొచ్చు!
బోస్టన్: చెమటను పరీక్షించి రోగాన్ని గుర్తించే సరికొత్త సెన్సర్‌ను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.రిస్ట్ బ్యాండ్ రూపంలో ధరించేందుకు అనువుగా ఉండే ఈ సెన్సర్ద్వారా మధుమేహం, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి రోగాలు గుర్తించవచ్చు. ఈ సెన్సర్ చెమటను సేకరించి దానిలోని క్లోరైడ్, గ్లూకోజ్ అణువులను విశ్లేషించి రోగ నిర్ధారణ చేస్తుంది. ఈ పరికరం వల్ల రోగ నిర్ధారణ కోసం గంటల తరబడి పరీక్షా కేంద్రాల్లో వేచిచూడాల్సిన అవసరం తప్పుతుంది. ఎలా కావాలంటే అలా వంచుకునే సౌలభ్యం ఉన్న ఈ సెన్సర్‌లో రెండంచెల వ్యవస్థ ఉంటుంది. ఇందులోని మైక్రోప్రాసెసర్ చర్మానికి అతుక్కుని ఉంటుంది.ఇది స్వేద గ్రంధులను ఉత్తేజపరిచి అందులోని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా చెమటలోని అణువులను విశ్లేషిస్తుంది. -
తక్కువ ఖర్చుతో నోటి క్యాన్సర్ నిర్ధారణ
– అందుబాటులోకి వచ్చిన ఓసీటీ పరికరం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): అతి తక్కువ ఖర్చుతో లేజర్ టెక్నాలజీని వినియోగించుకొని నోటి క్యాన్సర్‌ను నిర్ధారణ చేసే ‘ఆప్టికల్ కొహెరెంట్ టోమోగ్రఫీ(ఓసీటీ)’ పరికరాన్ని కనిపెట్టినట్లు అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పెట్రా విల్డర్ స్మిత్ పేర్కొన్నారు. గతంలో వ్యాధి నిర్ధారణకు 80 వేల డాలర్ల ఖర్చు అయ్యేదని, ఓసీటీ యంత్రంతో కేవలం 5 వేల డాలర్లకు నిర్ధారణ చేయవచ్చన్నారు. జి.పుల్లారెడ్డి దంత కళాశాలలో శుక్రవారం నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఓసీటీ యంత్రంపై దంత వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా కాంగిజేంట్–2016 పేరిట సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఓటీసీ పరికరం వినియోగంపై అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పెట్రా విల్డర్ స్మిత్ ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ వికాష్ అగర్వాల్ మాట్లాడుతూ..టీ స్కాన్ పరికరంతో దవడ కండరాల వ్యాధులను సులభంగా గుర్తించవచ్చని వివరించారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ దివాకర్ సైకో సోమాటిక్ డీసీజ్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వికాష్ అగర్వాల్, దివాకర్‌లను డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ విభాగాధిపతి సాయిరాం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మురళీధర్‌రెడ్డి, ప్రొఫెసర్లు ప్రవీణ్, వికాష్, నరేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.