ప్రాణాంతకమైన కేన్సర్‌ను సులువుగా గుర్తించేందుకు స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. అయస్కాంత లక్షణాలున్న తీగలను ధమనుల్లోకి జొప్పించడం ద్వారా వ్యాధిని చాలా తొందరగా గుర్తింవచ్చునని వీరు అంటున్నారు. కేన్సర్‌ను నిర్ధారించేందుకు ప్రస్తుతం బయాప్సీనే మార్గం. రక్తపరీక్షల ద్వారా కూడా వ్యాధి నిర్ధారణకు తాజాగా కొన్ని పరీక్షలు అందుబాటులోకి వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. రక్తంలో ప్రవహిస్తూండే కేన్సర్ కణితి కణాలను ఆకర్శించే అయస్కాంత తీగను ఉపయోగించినప్పుడు మాత్రం వ్యాధి ఉన్నదీ లేనిదీ స్పష్టంగా తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సామ్ గంభీర్ తెలిపారు.
రక్తంలో అతితక్కువగా ఉండే ఈ రకమైన కణాలను ఇతర పద్ధతుల ద్వారా గుర్తించడం చాలా కష్టమని అన్నారు. ఈ కణాలకు అతుక్కుని అయస్కాంతాలకు ఆకర్శితమయ్యే నానో కణాలను తాము అభివద్ధి చేశామని.. తద్వారా అయస్కాంత తీగను ధమనుల్లోకి జొప్పించినప్పుడు కణితి కణాలు సులువుగా ఈ తీగకు అతుక్కుపోతాయని సామ్ వివరించారు. పందులపై జరిపిన ప్రయోగాల్లో ఈ పద్ధతి చక్కగా పనిచేసిందని అన్నారు. ఈ పరీక్షను కేవలం 2– నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చునని, త్వరలో మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని వివరించారు.
కేన్సర్ నిర్ధారణకు సరికొత్త పరీక్ష...
Published Fri, Jul 20 2018 1:07 AM | Last Updated on Fri, Jul 20 2018 1:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment