క్రానిక్ మైలోయిడ్ లుకేమియా... (సిఎమ్ ఎల్) ఎముక మజ్జ లేదా బోన్ మ్యారోకి సోకే ఓ అరుదైన క్యాన్సర్.. (సిఎమ్‌ఎల్). ఇది మొత్తం లుకేమియా కేసుల్లో 15% దాకా ఉండే సీఎంఎల్ బోన్‌మ్యారోను ప్రభావితం చేస్తుంది, ఇది తెల్ల రక్త కణాల నియంత్రణలేని పెరుగుదలకు దారితీస్తుంది. క్యాన్సర్ నిర్ధారణ కాగానే మొదట్లో భయంకరంగా అనిపించినప్పటికీ, సీఎంఎల్‌ను సరైన విధానంతో నియంత్రించవచ్చునని గుర్తించడం చాలా ముఖ్యం అంటున్నారు హైదరాబాద్‌లోని నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ జి సదాశివుడు.
ఆయన చెబుతున్న విశేషాలివి...
సీఎంఎల్ నిర్ధారణ అయినప్పటికీ రోగులు సంతృప్తికరమైన జీవితాలను గడపవచ్చు. అయితే, సీఎంఎల్ నిర్వహణలో సరైన విధానాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే చికిత్స చేయని దీర్ఘకాలిక–దశ సీఎంఎల్ వేగంగా వృద్ధి చెందుతుంది. సమర్థవంతమైన చికిత్సకి, వ్యాధి పెరుగుదలని నివారించడానికి బిసిఆర్–ఎబిఎల్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, చికిత్స లక్ష్యాలకు కట్టుబడి ఉండటం అవసరం. అదనంగా మీ వైద్యునితో తాజా చికిత్సల గురించి చర్చించడం వలన మీరు చికిత్స ప్రక్రియను అర్థం చేసుకోవడానికి, మెరుగైన జీవన నాణ్యతకు సహాయపడుతుంది.
కొన్ని సందర్భాల్లో సీఎంఎల్ ని ’మంచి క్యాన్సర్’ అని పిలిచినప్పటికీ, సీఎంఎల్ పురోగమిస్తున్న కొద్దీ అది ’మంచిది’ గా ఉండడం మానేస్తుంది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కొంత మంది రోగులు వారి దైనందిన జీవితాలను ప్రభావితం చేసే మందులకు నిరోధకంగా ఉండవచ్చు లేదా దుష్ప్రభావాలను అనుభవించవచ్చు. అయితే, సకాలంలో జోక్యం, జాగ్రత్తగా పర్యవేక్షించడం ఈ సవాళ్లను నివారించడంలో సహాయపడతాయి.
వైద్యపరమైన అంశాలతో పాటు, సీఎంఎల్ కలిగించే భావోద్వేగ ప్రభావాన్ని విస్మరించలేం. సీఎంఎల్ రోగులు ఎదుర్కొనే ప్రారంభ సవాళ్లలో క్యాన్సర్‌తో సంబంధం ఉన్న సామాజిక కళంకం ఒకటి. సామాజిక అంశాల కారణంగా చాలా మంది వ్యక్తులు తమ రోగనిర్ధారణను దగ్గరి కుటుంబసభ్యులకు మించి బయటి వారికి వెల్లడించడానికి సంకోచిస్తారు. అయితే ఓపెన్ కమ్యూనికేషన్ అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య సహాయాన్ని కోరడం అనేది సంపూర్ణ సీఎంఎల్ నిర్వహణలో ముఖ్యమైనవి.
సీఎంఎల్ రోగుల కోసం కొన్ని సూచనలు...
నిరంతర పర్యవేక్షణ: చికిత్స ప్రభావాన్ని అంచనా వేయడానికి, ఏవైనా మార్పులను ముందుగానే తెలుసుకునేందుకు బిసిఆర్–ఎబిఎల్ స్థాయిలను ఎప్పటికప్పుడు గుర్తించాలి. సకాలంలో జోక్యం చేసుకోవ డానికి, వ్యాధి పురోగతిని నివారించడానికి రెగ్యులర్ పర్యవేక్షణ చాలా ముఖ్యమైనది.
దినచర్యలో మానసిక ఆరోగ్య మద్దతు, ఆహారపు సర్దుబాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సీఎంఎల్ నియంత్రణకు వీలు కల్పిస్తుంది.
ఆరోగ్య సంరక్షకులు, వైద్యులతో మనసు విప్పి, నిజాయితీగా సంభాషించడం అవసరం. సీఎంఎల్ తో ప్రయాణంలో ఎదుర్కొనే ఏవైనా ఆందోళనలు, లక్షణాలు లేదా సవాళ్లను పంచుకోవాలి.
సపోర్ట్ నెట్‌వర్క్‌లు: అనుభవాలను పంచుకోవడానికి, భావోద్వేగ మద్దతును పొందడానికిÜపోర్ట్ గ్రూప్‌ల ద్వారా ఇతర సీఎంఎల్ రోగులతో సంబంధాలు ఏర్పరచుకోండి.
నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 నుంచి 1.5 మిలియన్ల మంది సీఎంఎల్ తో జీవిస్తున్నారు. వైద్య శాస్త్రంలో పురోగతి కారణంగా చికిత్స ఫలితాలలో గణనీయమైన మెరుగుదల సాధ్యమవుతోంది. సీఎంఎల్ చికిత్సలో భాగమైన టైరోసిన్ కినేస్ ఇన్హిబిటర్స్ , రోగులకు ఫలితాలు జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరిచాయి.
కౌన్సిలింగ్ చాలా ముఖ్యం...
‘నేను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 9 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల అన్ని వయసుల రోగులను చూశా. దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా నిర్ధారణ తర్వాత, చాలా మంది రోగులు తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతారు. అందువల్ల, వారికి సరైన కౌన్సెలింగ్ అందించడం చాలా ముఖ్యం
ప్రొఫెసర్ డాక్టర్ జి సదాశివుడు, నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం
(చదవండి: 'టీ'ని అతిగా మరిగిస్తున్నారా? ఎంత వ్యవధిలో చేయాలంటే..)
Comments
Please login to add a commentAdd a comment