ప్రస్తుతం మానవాళిని వణికిస్తోన్న అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో కేన్సర్ ఒకటి. దీనికి సంబంధించిన చికిత్సలతో పాటు కొత్త కొత్త కేన్సర్లు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం(ఫిబ్రవరి 4) కేన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యులు అందిస్తున్న కొన్ని కొత్త చికిత్సా విధానాలు ఒకసారి చూద్దాం.
అందుబాటులోకి అత్యాధునిక చికిత్సలు..
ఓ వైపు కేన్సర్ వ్యాధి విజృంభణతో పాటు మరోవైపు ఆ వ్యాధి చికిత్సకు సంబంధించి అనేక కొత్త కొత్త పద్ధతులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అన్ని కేన్సర్లకు సంబంధించి ఇటీవల ట్రీట్‌మెంట్ అడ్వాన్స్ చికిత్సా విధానాలు బాగా ఎక్కువయ్యాయి. రోగుల క్షేమం దృష్ట్యా ఎప్పటికప్పుడు ఆయా చికిత్సలను మేం అందిపుచ్చుకోవాల్సిందే.. అనుసరించాల్సిందే.
ఈ మధ్య కాలంలో రోబోటిక్ సర్జరీ ఎక్కువ ఉపయోగించడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. బ్రెస్ట్ కేన్సర్‌కు సంబంధించి సెంటినల్ లింఫ్ మోడ్ బయాప్సీ అనే కాన్సెప్ట్ ఒకటి. దీని ద్వారా సంక భాగంలో సర్జరీ అసవరాన్ని నివారించవచ్చు. ఇదే విధంగా రేడియేషన్స్‌లో కూడా కేవలం కేన్సర్ సోకిన ప్రదేశంలోని గడ్డ వరకే రేడియేషన్ చేసే టెక్నిక్స్ వచ్చాయి.
దీని వల్ల సైడ్ అఫెక్ట్స్ బాగా తక్కువ ఉంటాయి. అంతేకాకుండా రీ కన్‌స్ట్రక్షన్స్... అంటే సర్జరీ తర్వాత కాస్మెటిక్ సర్జరీ బాగా ఎక్కువైంది. కొంత మంది పేషెంట్స్‌కి బ్రెస్ట్ కేన్సర్‌కి రోబోటిక్ సర్జరీ కూడా చేస్తున్నాం. థైరాయిడ్ కేన్సర్ చికిత్సలో ‘స్కార్ లెస్ నెక్ సర్జరీ విత్ రోబోటిక్’ వంటివి వచ్చాయి. అంటే మెడ మీద మచ్చ లేకుండానే సర్జరీ చేసే ఛాన్సుంది.
ఇక పాంక్రియాటిక్ కేన్సర్ చికిత్సలో రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది దీని వల్ల అతి తక్కువగా లేదా అసలు ఐసీయూలో ఉండాల్సిన అవసరం లేకుండా, అలాగే హాస్పిటల్‌లో ఉండాల్సిన సమయం బాగా తగ్గించేస్తూ రికవరీ త్వరగా అవుతుంది.
అలాగే హైటెక్ అనే కొత్త కాన్సెప్ట్‌ను కూడా అండాశయ కేన్సర్లకు మాత్రమే కాకుండా ఇతర కేన్సర్లకు కూడా ఉపయోగిస్తున్నారు. అవయవాన్ని కాపాడుతూ కేన్సర్ చికిత్స చేసే ఆర్గాన్ కన్సర్వేషన్ కూడా కొత్తగా వచ్చిందే.
వ్యాధి రాక ముందే పోగొట్టవచ్చు...
అంతేకాకుండా కేన్సర్ చికిత్సలో జెనెటిక్ రీసెర్చ్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువైంది. ఈ జెనెటిక్ కౌన్సిలింగ్, జెనెటిక్ టెస్టింగ్ చేయడం వల్ల కేన్సర్‌ని రాక ముందుగానే గుర్తించి తగిన చికిత్స ఇవ్వొచ్చు తద్వారా . కేన్సర్ డెవలప్ రాకుండానే సర్జరీ చేసేస్తారు. అదే విధంగా పెట్ స్కాన్ లాగే పెట్ ఎంఆర్ అనే కొత్త డయాగ్నసిస్ కూడా ఒకటి.
–డా.మధు దేవరశెట్టి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్
రోబొటిక్ సర్జన్, కిమ్స్ ఆసుపత్రి.
Comments
Please login to add a commentAdd a comment