వెన్ను నొప్పి కేన్సర్‌కు దారితీస్తుందా..? | Spinal Cancer: Causes Symptoms Treatments How To Recognize Spinal Tumors | Sakshi
Sakshi News home page

వెన్ను నొప్పి కేన్సర్‌కు దారితీస్తుందా..?

Published Wed, Oct 16 2024 4:36 PM | Last Updated on Wed, Oct 16 2024 5:29 PM

Spinal Cancer: Causes Symptoms Treatments How To Recognize Spinal Tumors

ఈ రోజుల్లో వెన్ను నొప్పి అత్యంత సర్వసాధారణం. కంప్యూటర్ల ముందు గంటలకొద్ది కూర్చొని చేసే ఉద్యోగాలు కావడంతో ప్రతి ఒక్కరూ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఇవి ఎక్కువైపోయాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యనే ఎదుర్కొంటున్నారు. అయితే ఇది కాల్షియం లోపం వల్లనో లేక కూర్చొనే భంగిమ తేడా వల్లనో అని తేలిగ్గా తీసుకుంటే మాత్రం అసలుకే తేడా వచ్చి ప్రాణాంతకంగా మారిపోతున్న కేసులు కోకొల్లలు. ఇవాళ ప్రపంచ వెనుముక దినోత్సవం పురుస్కరించుకుని అసలు ఇలాంటి సమస్యని ఎలా గుర్తించగలం? అందుకు చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలేంటో సవివరంగా నిపుణుల మాటల్లోనే తెలుసుకుందామా..!.

వెన్నుముక సమస్యలు లేదా తరచుగా వెన్నునొప్పి వేధిస్తుంటే తక్షణమే వైద్యుని సంప్రదించి ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ వంటి స్కానింగ్‌లు తప్పనిసరిగా తీయించుకోవాలి.అలాగు వీటి తోపాటు పెట్‌ సీటీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. అ‍ప్పుడు వెన్నుముక కణితులు వెన్నుపాము వెలుపల ఉన్నాయా..? దాని లోపలే ఉన్నాయా అనేది నిర్థారించాల్సి ఉంటుంది. 

వెన్నుముక కేన్సర్‌ లక్షణాలు..

  • వెనుముకలోనే కేన్సర్‌ కణితులు ఉన్నట్లయితే ఎముక నిర్మాణ విస్తరించడం లేదా బలహీనపడటం జరుగుతుంది. 

  • అలాగే వెన్నుముక నరాలు కుదింపుకు గురై నొప్పి కలిగించొచ్చు.

  • వెన్నుముక అస్థిరత వంటి కారణంగా నొప్పి వచ్చే అవకాశం ఉంది. 

  • ఈ నొప్పి క్రమంగా ప్రారంభమై కాలక్రమేణ తీవ్రమవుతుంది. 

  • విశ్రాంతితో సెట్‌ కాదు. పైగా రాత్రి సమయాల్లో మరింత తీవ్రమవుతుంది. 

  • అలాగే ఎగువ లేదా దిగువ భాగంలో షాక్‌లాంటి నొప్పిన కలిగిస్తాయి. 

  • కండరాల బలహీనత

  • తిమ్మిరి

  • జలదరింపు

  • ఉష్ణోగ్రత సంచలనం

  • మూత్రాశయం లేదా ప్రేగు నియంత్రణ కోల్పోవడం

  • లైంగికంగా బలహీనం కావడం

  • నడవడంలోనూ సమస్య

ఎలా నిర్థారిస్తారంటే..
వెనుముక కణితిని నిర్థారించడం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. వెన్నుముక కదలికలు గురించి తెలుసుకోవడానికి నరాల ద్వారా పరీక్ష చేసి గుర్తిస్తారు. వీటి తోపాటు కొన్ని ఇతర పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది.

  • రక్త పరీక్షలు

  • వెన్నెముక అమరికలు

  • మూత్ర పరీక్షలు

  • మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ లేదా ఎంఆర్‌ఐ

  • మాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ లేదా ఎంఆర్‌ఎస్‌

  • సింగిల్-ఫోటాన్ ఎమిషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ లేదా స్పెక్ట్‌

  • యాంజియోగ్రఫీ

  • మాగ్నెటెన్సెఫలోగ్రఫీ

  • కణజాల బయాప్సీలు

(చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement