ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క స్త్రీని కూడా చూడకుండా ఉండే అవకాశం లేదు. సన్యాసీ జీవితాన్ని అనుసరించిన బాల్యదశలో అయిన తల్లి లేదా నానమ్మ, తోబుట్టువుల రూపంలో ఆడవాళ్లను చూడటం జరుగుతుంది. కానీ ఈ వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క స్త్రీని కూడా చూడలేదట. మరణాంతరం వరకు ఒక్క స్త్రీని కూడా చూడని, కలవని ఏకైక వ్యక్తిగా నిలిచాడు. అతడెవరంటే..
గ్రీస్ దేశానికి చెందిన మిహైలో టొలటోస్ అనే వ్యక్తి 1856లో తను పుట్టిన నాలుగు గంటలకే తల్లి చనిపోయింది. ఆ పసికందుని పెంచుకునేందుకు ఎవ్వరు ముందుకు రాలేదు. ఆ పసికందుని మౌంట్ అతోస్ అనే పర్వతంపైన ఉన్న ఆశ్రమం మెట్లపై నిర్ధాక్షణ్యంగా వదిలేసి వెళ్లిపోయారు. ఆశ్రమం మెట్లపై కనిపించిన ఆ పసికందుని అక్కడ ఆశ్రమ వాసులు చేరదీశారు. అతడికి మిహైలో టొలటోస్ అనే నామకరణం చేసి ఆశ్రమ పద్ధతులకు అనుగణంగా పెంచారు.
దీంతో మిహైలో బాల్యం మంతా ఆశ్రమంలోనే సాగింది. అక్కడే చదువుకుని పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే ఆశ్రమలో "మోక్స్ అవటోన్ అనే యూనిక్ రూల్"ని ఫాలో అవుతారు. ఈ రూల్ ప్రకారం మౌంట్ అథోస్ పర్వతం పైకి మహిళలకు ఎంట్రీ పూర్తిగా నిషేధం. అక్కడ కేవలం ఆశ్రమ జీవితమే గడపాలి, సన్యాసం తీసుకోవాలి. అంతేగాదు సన్యాసం తీసుకోవాలన్న పురుషులకు మాత్రమే ఎంట్రీ. ఈ కారణం చేతనే తన జీవిత కాలంలో ఎప్పుడూ స్త్రీలను చూడలేదు. అయితే సన్యాసం స్వీకరించేందుకు ఆశ్రమానికి వచ్చిన వారంతా ఏదోఒక సందర్భంలో మహిళలను చూసినవారే. కానీ మిహైలో విషయం అలా కాదు.
తన జీవితాంతం ఆధ్యాత్మిక మార్గంలోనే పయనించి 1938లో 82 ఏళ్ల వయసులో మరణించాడు. అలా ఈ ప్రపంచంలో ఆడవాళ్లను చనిపోయేంత వరకు చూడని ఏకైక వ్యక్తిగా మిహైలో నిలిచాడు. అతడి గురించి వార్తాప్రతికల్లో రావడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే అథోస్ పర్వతాల సమీపంలో ఆడ జంతువులు ఉండటం గానీ గుడ్లు పెట్టే పక్షులు, పాలిచ్చే క్షీరదాలు గానీ కనిపించవట. అందువల్ల అక్కడ సన్యాసులకు ఏం కావల్సిన బయట నుంచి లభించేలా నుంచి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయట. అంతేగాదు ఈ ఆశ్రమాన్ని సందర్శించడానికి పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుందట. ప్రతి రోజు దాదాపు రెండువేల మంది పురుష పర్యాటకులు సందర్శిస్తుంటారని సమాచారం.
(చదవండి: ‘నీల్’ కాన్సెప్ట్' ఒకే ఒక రంగుతో అద్భుతం ..!)
Comments
Please login to add a commentAdd a comment