Greece
-
82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..!
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క స్త్రీని కూడా చూడకుండా ఉండే అవకాశం లేదు. సన్యాసీ జీవితాన్ని అనుసరించిన బాల్యదశలో అయిన తల్లి లేదా నానమ్మ, తోబుట్టువుల రూపంలో ఆడవాళ్లను చూడటం జరుగుతుంది. కానీ ఈ వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క స్త్రీని కూడా చూడలేదట. మరణాంతరం వరకు ఒక్క స్త్రీని కూడా చూడని, కలవని ఏకైక వ్యక్తిగా నిలిచాడు. అతడెవరంటే..గ్రీస్ దేశానికి చెందిన మిహైలో టొలటోస్ అనే వ్యక్తి 1856లో తను పుట్టిన నాలుగు గంటలకే తల్లి చనిపోయింది. ఆ పసికందుని పెంచుకునేందుకు ఎవ్వరు ముందుకు రాలేదు. ఆ పసికందుని మౌంట్ అతోస్ అనే పర్వతంపైన ఉన్న ఆశ్రమం మెట్లపై నిర్ధాక్షణ్యంగా వదిలేసి వెళ్లిపోయారు. ఆశ్రమం మెట్లపై కనిపించిన ఆ పసికందుని అక్కడ ఆశ్రమ వాసులు చేరదీశారు. అతడికి మిహైలో టొలటోస్ అనే నామకరణం చేసి ఆశ్రమ పద్ధతులకు అనుగణంగా పెంచారు. దీంతో మిహైలో బాల్యం మంతా ఆశ్రమంలోనే సాగింది. అక్కడే చదువుకుని పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే ఆశ్రమలో "మోక్స్ అవటోన్ అనే యూనిక్ రూల్"ని ఫాలో అవుతారు. ఈ రూల్ ప్రకారం మౌంట్ అథోస్ పర్వతం పైకి మహిళలకు ఎంట్రీ పూర్తిగా నిషేధం. అక్కడ కేవలం ఆశ్రమ జీవితమే గడపాలి, సన్యాసం తీసుకోవాలి. అంతేగాదు సన్యాసం తీసుకోవాలన్న పురుషులకు మాత్రమే ఎంట్రీ. ఈ కారణం చేతనే తన జీవిత కాలంలో ఎప్పుడూ స్త్రీలను చూడలేదు. అయితే సన్యాసం స్వీకరించేందుకు ఆశ్రమానికి వచ్చిన వారంతా ఏదోఒక సందర్భంలో మహిళలను చూసినవారే. కానీ మిహైలో విషయం అలా కాదు.తన జీవితాంతం ఆధ్యాత్మిక మార్గంలోనే పయనించి 1938లో 82 ఏళ్ల వయసులో మరణించాడు. అలా ఈ ప్రపంచంలో ఆడవాళ్లను చనిపోయేంత వరకు చూడని ఏకైక వ్యక్తిగా మిహైలో నిలిచాడు. అతడి గురించి వార్తాప్రతికల్లో రావడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే అథోస్ పర్వతాల సమీపంలో ఆడ జంతువులు ఉండటం గానీ గుడ్లు పెట్టే పక్షులు, పాలిచ్చే క్షీరదాలు గానీ కనిపించవట. అందువల్ల అక్కడ సన్యాసులకు ఏం కావల్సిన బయట నుంచి లభించేలా నుంచి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయట. అంతేగాదు ఈ ఆశ్రమాన్ని సందర్శించడానికి పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుందట. ప్రతి రోజు దాదాపు రెండువేల మంది పురుష పర్యాటకులు సందర్శిస్తుంటారని సమాచారం.(చదవండి: ‘నీల్’ కాన్సెప్ట్' ఒకే ఒక రంగుతో అద్భుతం ..!) -
గ్రీస్‌లో అక్కాచెల్లెళ్ల హల్చల్.. ఈ పోటోలు చూశారా? (ఫొటోలు)
-
కౌంట్‌డౌన్ @100
ఒలింపియా (గ్రీస్): ప్రపంచ క్రీడా పండుగ పారిస్ ఒలింపిక్స్–2024కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 100 రోజుల్లో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఒలింపిక్స్ పుట్టిల్లు గ్రీస్‌లో జ్యోతి ప్రజ్వలన ఘట్టాన్ని నిర్వహించారు. తొలి ఒలింపిక్స్ నిర్వహించిన ప్రాచీన ఒలింపియాలో ఈ ఆకర్షణీయమైన కార్యక్రమం జరిగింది. ప్రాచీన సంప్రదాయ వేషధారణలో గ్రీక్ నటి మారియా మినా జ్యోతిని వెలిగించింది. సాధారణంగా సూర్య కిరణాలను అక్కడే ఉంచిన ప్రత్యేక అద్దంపై ప్రసరింపజేసి దాని ద్వారా జ్యోతిని వెలిగిస్తారు. అయితే మంగళవారం అంతా చల్లగా మారి వాతావరణంగా అనుకూలంగా లేకుండా పోయింది. దాంతో అక్కడ అందుబాటులో ఉంచిన ఇతర ప్రత్యామ్నాయ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. లాంఛనం ముగిసిన తర్వాత తొలి టార్చ్‌ను రోయింగ్‌లో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అయిన గ్రీస్ ఆటగాడు స్టెఫనోస్ డూస్కస్ అందుకోగా...రెండో టార్చ్ బేరర్‌గా ఆతిథ్య ఫ్రాన్స్‌కు చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మింగ్ చాంపియన్ లారా మనాడూ నిలిచింది. ఈ టార్చ్ ఇక్కడినుంచి మొదలై గ్రీస్ దేశంలో సుమారు 5 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఏప్రిల్ 26న పారిస్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ వద్దకు ఇది చేరుతుంది. అనంతరం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు కూడా దీనిని తీసుకెళతారు. -
గ్రీస్ సమీపంలో సరకు నౌక మునక
ఏథెన్స్: గ్రీస్ పరిధిలోని లెస్బోస్ ద్వీపం సమీప మధ్యదరా సముద్ర జలాల్లో ఒక సరకు రవాణా నౌక మునిగిన ఘటనలో నలుగురు భారతీయుల ఆచూకీ గల్లంతైంది. సిబ్బందిలో ఒక్కరిని మాత్రమే కాపాడగలిగామని గ్రీస్ తీర గస్తీ దళాలు వెల్లడించాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో గాలింపు కష్టంగా మారింది. దాదాపు 6,000 టన్నుల ఉప్పుతో ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా నుంచి బయల్దేరిన నౌక తుర్కియేలోని ఇస్తాంబుల్‌కు వెళ్తోంది. మార్గమధ్యంలో గ్రీస్‌కు చెందిన లెస్బోస్ వద్ద మునిగిపోయింది. నౌకలోని 14 మంది సిబ్బందిలో నలుగురు భారతీయలు, ఎనిమిది మంది ఈజిప్ట్‌పౌరులు, ఇద్దరు సిరియన్లు ఉన్నారు. ఆదివారం ఉదయం ఏడింటపుడు మెకానికల్ సమస్య తలెత్తిందంటూ ఎమర్జెన్సీ సిగ్నల్ పంపిన నౌక తర్వాత కనిపించకుండా పోయింది. ఒక ఈజిప్ట్ పౌరుడిని మాత్రం రక్షించగలిగారు. ఎనిమిది వాణిజ్య నౌకలు, రెండు హెలికాప్టర్లు, ఒక గ్రీస్ నావికా యుద్ద నౌక గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ఘటన జరిగన చోట్ల గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. -
130 వేల ఏళ్ల నుంచే మానవుల ఉనికి !అందుకు ఆ గుహ..
ఆదిమానవులు ఉనికి ఉందని ఎప్పటి నుంచే చెబుతూనే ఉన్నారు చరిత్రకారులు. అందుకు చారిత్రక ఆధారాలు ఏమిటి అనేదాని గురించి పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రాచీన యుగంలో క్రీస్తూ పూరం 1300 ఏళ్ల క్రితం అని అంచనాలు వేసి చెప్పేరే గానీ అందుకు కచ్చితమైన ఆధారాలు లేకపోయాయి. తవ్వకాల్లో వారి ఉనికి ఉందని చెప్పే పనిమూట్లు, వారికి సంబంధించిన మానవ ఎముకల ఆధారంగా చెప్పడం జరిగింది. దీని గురించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న శాస్రతవేత్తల కృషి ఇప్పటికీ ఫలించింది. మానువులు ఎప్పటి నుంచి ఉన్నారు. ఆ తర్వాత నిష్క్రమించి ఎటు వెళ్లారనే వాటి గురించి వెలుగులోకి వచ్చిన ఆధారాలను చూసి పరిశోధకులే కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే..గ్రీస్‌లోని థెస్సాలీలోని మధ్య గ్రీకు ప్రాంతంలో థియోపెట్రా అనే గుహ వద్ద పురావస్తు శాఖ ఎన్నో ఏళ్లుగా తవ్వకాల్లో జరిపింది. ఆ తవ్వకాల్లో ఆ గుహ మానవజాతి మూలాలను గూర్చి వెల్లడించింది. ఆ తవ్వకాల్లో అనేక మనుషుల ఎముకలు, వారు ఉపయోగించిన రాతి పనిముట్లు, జంతువుల ఎముకలు, పూరాత మానవ నిర్మిత నిర్మాణాలను కనుగొన్నారు. 13 వేల ఏళ్ల క్రితం నుంచే మానువులు ఉన్నారని రేడియో కార్బన్ ఆధారాలు చెబతున్నాయి. వారిలో నియాండర్తల్‌లు అనే మానవ జాతి ఉనికిలో ఉన్న నాటి మానవ జాతుల్లో ఒకటని చెప్పారు. వారు బలిష్టంగా కండలు తిరిగి ఉండేవారని, విచిత్రంమైన కనుబొమ్మలు, పొడుచుకుని వచ్చినట్లు ముక్కులు కలిగి ఉండేవారని తెలిపారు. ఈ నియాండర్తల్‌లు మానవులు జీవించే విధానం కంటే భిన్నంగా జీవితాన్ని గడిపేవారని అన్నారు. కొన్ని రకాల అడవి జంతువులను వేటాడేవారని, తమను తాము రక్షించుకునేందుకు కఠినమైన గుహ వాతావరణంలో జీవించేవారని అన్నారు. ఐరోపా అంతటా ఉన్న గుహల్లో ఉండేవారని పరిశోధనలో వెల్లడించారు. అంతేగాదు థియో పెట్రా గుహ మానవ నిర్మిత ప్రదేశంలో ఇదే ఒకటిగా పేర్కొన్నారు. ఇక్కడ నుంచి మానవులు సుమారు 50 వేల ఏళ్ల క్రితం నుంచి నిష్క్రమించారని తెలిపారు. 1987 నుంచి తప్పకాలు.. ఈ గుహ ఒక లోయ పైన సుమారు వంద మీటర్లు(330 అడుగులు) వరకు విస్తరించి ఉందని చెప్పారు. దీన్ని థియోపెట్రా రాక్ అని పిలేచే వారని, ఇక్కడ సున్నపురాయి కొండ ఈశాన్యవాలు చూడవచ్చని చెప్పారు. ఈ గుహకు సమీపంలో పినయోస్ నదికి చెందిన లెథాయోస్ నది ప్రవహిస్తుంది. ఇక పురావస్తు శాఖ అధికారులు 1987 నుంచి ఈ గుహ వద్ద తవ్వకాలు జరపడం ప్రారంభించారు. అలా 2007వరకు కొనసాగింది. ఈ మధ్య కాలంలో అనేక విశేషమైన ఆవిష్కరణలు జరిగాయి. పురావస్తు పరిశోధన మొదట ప్రారంభించినప్పుడూ థియోపెట్రా గుహా స్థానిక గొర్రెల కాపరులు తమ జంతువులును ఉంచడానికి తాత్కాలిక ఆశ్రయంగా ఉపయోగించేవారని భావించారు. కానీ ఈ గుహ తవ్వేకొద్ది ఆధ్యాంతం కొంగొత్త విషయాలను వెల్లడించింది. ఇందులో బయటపడ్డ అవక్షేపాలన్నీ ఆసక్తికలిగించే సరికొత్త విషయాలను తెలియజేశాయి. ( చదవండి: అర్జున బెరడు గురించి విన్నారా? సైన్సు ఏం చెబుతుందంటే..) -
గ్రీస్‌లో జీఎంఆర్ మరిన్ని పెట్టుబడులు
ముంబై: గ్రీస్‌లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్న దేశీ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్.. ఆ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది. కెలమాటా ఎయిర్‌పోర్ట్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం జీఈకే టెర్నా సంస్థతో కలిసి గ్రీస్‌లోని క్రెటె ప్రాంతంలో హెరాక్లియోన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. హెరాక్లియోన్ విమానాశ్రయ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఇంధన, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపార విభాగం చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా గ్రీస్ ప్రధాన మంత్రి నిర్వహించిన విందులో శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. భారత్, గ్రీస్ మధ్య కనెక్టివిటీ మెరుగుపడితే ఇరు దేశాల స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి, వ్యాపార అవకాశాల కల్పనకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. -
The island of Hydra: ఇచట కార్లకు ప్రవేశం లేదు!
అక్కడ అడుగు పెడితే కాల స్పృహ కనుమరుగవుతుంది. అసలు కాలమే వెనక్కు వెళ్తుంది. కార్లన్నవి మచ్చుకు కూడా కానరాని కాలం కళ్ల ముందు కనిపిస్తుంది. గుర్రపు బగ్గీలే అక్కడ ప్రధాన ప్రయాణ సాధనాలు. కొండొకచో గాడిదలు, కంచర గాడిదలు బరువులు మోస్తూ కనిపిస్తుంటాయి. కనుచూపు మేరా ఎటు చూసినా పరుచుకున్న పచ్చదనం, దానికి దీటుగా పోటీ పడుతూ పరిశుభ్రత కనువిందు చేస్తాయి. ఎక్కడిదా ప్రాంతం? ఏమా కథ...?! గ్రీస్ దేశంలో అనగనగా అదో ద్వీపం. పేరు హైడ్రా. అక్కడి ఎజియన్ సముద్రంలోని ద్వీపాల్లో ఒకటి. వాటి మాదిరిగానే స్వచ్ఛమైన జలాలకు, అందమైన ప్రకృతికి పెట్టింది పేరు. కళ్లు చెదిరే అందాలకు, ఆహ్లాదకర వాతావరణానికి, పచ్చదనానికి కాణాచి. కాకపోతే వాటిల్లో దేనికీ లేని ప్రత్యేకత హైడ్రా దీవి సొంతం. ఆ కారణంగానే అది కొన్నేళ్లుగా అంతర్జాతీయ పర్యాటకుల నోళ్లలో తెగ నానుతోంది. అదేమిటంటే... అక్కడ కార్లు తదితర మోటారు వాహనాలు పూర్తిగా నిషేధం. గుర్రాలు, కంచర గాడిదలు మాత్రమే ప్రయాణ, రవాణా సాధనాలు. ఆ మేరకు కఠిన నిబంధనలు ఏర్పాటు చేసుకోవడమే గాక వాటిని తూచా తప్పకుండా పాటిస్తోంది కూడా. అంబులెన్సులు, అగి్నమాపక వాహనాలకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు. హైడ్రా దీవిలో అడుగు పెట్టగానే మనల్ని పలకరించేది గుర్రాలు, కంచర గాడిదలే. స్థానికుల్లో ఎవరిని చూసినా వాటి మీదే చకచకా సాగిపోతూ కనిపిస్తారు. దక్షిణాన అందాలకు ఆలవాలమైన కమీనియ అనే కుగ్రామం మొదలు పశి్చమాన అత్యంత పారదర్శకమూ, పరిశుభ్రమైన సముద్ర జలాలలో అలరారే మండ్రాకి దాకా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ఆ కాలపు దీవి హైడ్రా మనల్ని పాత కాలానికి తీసుకెళ్లి కట్టి పడేస్తుందని అంటారు హారియట్ జర్మన్. స్థానికంగా హార్స్ ట్రెక్కింగ్ కంపెనీ నడుపుతున్న ఆమె 24 ఏళ్ల క్రితం అనుకోకుండా అమ్మతో పాటు అక్కడికి విహార యాత్రకు వచ్చారు. ఆ ప్రాంతం ఎంతగా నచి్చందంటే, అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోయారు! తర్వాత పదేళ్ల క్రితం గ్రీస్‌ను అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం కారణంగా తనకు ప్రాణప్రదమైన గుర్రం క్లోను అమ్మాల్సిన పరిస్థితి తలెత్తింది. దాంతో హార్స్ ట్రెక్కింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుందామే. ఇప్పుడు గుర్రాల సంఖ్య 12కు పెరిగింది. ‘కార్లు లేవు గనుక ఇక్కడ అందరి జీవితాలూ హడావుడికి దూరంగా, నింపాదిగా గడుస్తుంటాయి‘ అంటూ నవ్వుతారామె. చరిత్రే కారణం హైడ్రా దీవి 18, 19వ శతాబ్దం దాకా ప్రముఖ సముద్ర వర్తక కేంద్రంగా ఓ వెలుగు వెలిగింది. 20వ శతాబ్దంలో మోటార్ వాహనాల శకం రాకతో ఆ వైభవం వెనకపట్టు పట్టింది. ఇరుకు సందులు, రాళ్ల ప్రాంతం కావడంతో హైడ్రాలో మోటార్ వాహనాల రాకపోకలు ఎప్పుడూ కష్టతరంగానే ఉంటూ వచ్చాయి. దాంతో, వాటిని పూర్తిగా నిషేధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన స్థానిక యంత్రాంగానికి పుట్టుకొచ్చింది. అదే ఇప్పుడు ఆ దీవిని ప్రత్యేకంగా నిలిపింది. వీఐపీలకు విశ్రామ స్థలం హైడ్రా దీవి అందచందాలు, కార్ల జాడే లేని ప్రత్యేకత ఎందరెందరో వీఐపీలను ఆకర్షిస్తోంది. అప్పుడెప్పుడో 1950ల్లోనే ప్రముఖ ఇటాలియన్ నటి సోఫియా లారెన్ హైడ్రాలో షూటింగ్ చేసే క్రమంలో ఆ దీవితో ప్రేమలో పడ్డారు. అక్కడే స్థిరపడ్డారు. బ్రైస్ మార్డన్, అలెక్సిస్ వెరోకస్, పనగియోసిస్ టెట్సిస్, జాన్ క్రాక్స్టన్ వంటి ప్రఖ్యాత చిత్రకారుల నుంచి హెన్రీ మిల్లర్ వంటి ప్రముఖ రచయితల దాకా ఎందరెందరో హైడ్రాలో ఆరామ్‌గా జీవిస్తున్నారు. కెనేడియన్ గాయకుడు, పాటల రచయిత లియోనార్డ్ కోహెన్ రాసిన అజరామర గీతం ’బర్డ్ ఆన్ ద వైర్’కు హైడ్రా దీవే స్ఫూర్తి! ఒక్క మాటలో చెప్పాలంటే హైడ్రా భూలోక స్వర్గమే అంటారాయన. నేషనల్ డెస్్క, సాక్షి -
India-Greece: ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
ఏథెన్స్: తమ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి, వివిధ కీలక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, గ్రీసు ప్ర«దానమంత్రి కిరియాకోస్ మిత్సొటాకిస్ ఒక అవగాహనకు వచ్చారు. గ్రీసు రాజధాని ఏథెన్స్లో శుక్రవారం ఇరువురు నేతలు ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని, రెండు దేశాల మధ్య పరస్పర వాణిజ్యాన్ని 2030 నాటికి రెండింతలు చేసుకోవాలని తీర్మానించుకున్నారు. రాజకీయ, రక్షణ, ఆర్థిక అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. రక్షణ, షిప్పింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సైబర్ స్సేస్, విద్య, సాంస్కృతికం, పర్యాటకం, వ్యవసాయం తదితర ముఖ్యమైన రంగాల్లో భారత్–గ్రీసు నడుమ మరింత సహకారం అవసరమని మోదీ, కిరియాకోస్ అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్(ఐఎస్ఏ)లోకి గ్రీసుకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ఈ మేరకు భారత్–గ్రీసు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశాయి. మోదీకి ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్’ గ్రీసుకు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్’ ప్రధాని నరేంద్ర మోదీకి లభించింది. గ్రీసు అధ్యక్షురాలు కటెరీనా ఆయనను ఈ గౌరవంతో సత్కరించారు. ఈ ఆర్డర్ ఆఫ్ హానర్‌ను గ్రీసు ప్రభుత్వం 1975లో నెలకొలి్పంది. తొమ్మిదేళ్లలో వివిధ దేశాలు మోదీని అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. ఇందులో గ్రీసు ఆర్డర్ ఆఫ్ హానర్ కూడా చేరింది. చంద్రయాన్–3.. మానవాళి విజయం చంద్రయాన్–3 విజయం కేవలం భారత్‌కే పరిమితం కాదని, ఇది ప్రపంచంలోని ప్రజలందరికీ చెందుతుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆయన శుక్రవారం ఏథెన్స్లో గ్రీసు అధ్యక్షురాలు కాటెరీనా ఎన్ సాకెల్లారోపౌలౌతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయానికొచ్చారు. చంద్రయాన్–3 మిషన్‌పై అధ్యక్షురాలు కటెరీనా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ప్రతిస్పందిస్తూ.. చంద్రయాన్ ఘనత మొత్తం మానవాళికి చెందుతుందని చెప్పారు. ఏథెన్స్లో మోదీకి ఘన స్వాగతం ఒక రోజు పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా నుంచి శుక్రవారం గ్రీసు రాజధాని ఏథెన్స్కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో మోదీకి గ్రీసు విదేశాంగ మంత్రి జార్జి గెరాపెట్రిటైస్ ఘనంగా స్వాగతం పలికారు. గ్రీసులో నివసిస్తున్న భారతీయులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మోదీకి సాదర స్వాగతం పలికారు. భారత ప్రధానమంత్రి గ్రీసులో పర్యటించడం గత 40 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
వారు కాపాడటానికి వచ్చారనుకున్నాం.. కానీ..
ఏథెన్స్: మధ్యధరా సముద్రంలో ప్రయాణిస్తూ గ్రీసు వైపుగా వచ్చి మునిగిపోయిన బోటులో ప్రాణాలు దక్కించుకున్న కొందరు విస్తుపోయే నిజాలను చెబుతున్నారు. గ్రీసు తీర రక్షక దళాల బృందాలను చూడగానే వారు మమ్మల్ని కాపాడతారని అనుకున్నాము కానీ వారే మా పడవ మునిగిపోవడానికి కారణమని చెప్పారు. ఇటీవల ఆఫ్రికా నుండి ఐరోపా దేశాలకు వలస వస్తోన్న ఒక బోటు నీటమునిగిన సంగతి తెలిసిందే. 750కు పైగా వలసదారులు ప్రయాణిస్తున్న ఆ బోటు ప్రమాదంలో 80 మంది మృతి చెందగా 104 మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. మిగతా వారంతా గల్లంతయ్యారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్, సిరియా, ఈజిప్టు దేశాలకు చెందినవారే. అయితే వీరిలో ప్రాణాలు దక్కించుకున్న ఈజిప్టు వ్యక్తిని అసలేం జరిగిందని ప్రశ్నించగా.. గ్రీసు సమీపంలోకి రాగానే దూరంగా రక్షక దళాలు కనిపించడంతో మమ్మల్ని కాపాడమని అరిచాము. వారు తాడు వేసి మమ్మల్ని రక్షిస్తారని అనుకుంటే మమ్మల్ని కిందకి లాగేశారని అన్నాడు. సిరియాకు చెందిన మరో మృత్యుంజయుడు చెబుతూ.. వారు మా పడవకు ఒకపక్కన తాడు కట్టి బలంగా లాగడంతో బోటు మునిగిపోయిందని అన్నాడు. వీరిద్దరూ చెప్పినదాని బట్టి చూస్తే గ్రీసు తీర రక్షక బృందాల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా పొట్ట చేతపట్టుకుని జీవనబండిని లాగించాలని ఐరోపా వైపు పయనమైన శరణార్థుల్లో 104 మంది మినహాయిస్తే మిగిలిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది కూడా చదవండి: ఇదేం విచిత్రమైన పోటీ.. గిన్నిస్ రికార్డు కూడానా? -
గ్రీస్ పడవ విషాదం.. 500 మందికి పైగా గల్లంతు!
ఏథెన్స్: గ్రీస్ సమీపంలోని మెస్సేనియా పైలోస్ తీరంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో 78 మంది మృతి చెందగా సుమారు 500 మంది గల్లంతై ఉంటారని అదే ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న ఇద్దరు యువకులు సిరియాకు చెందిన హసన్(23) పాకిస్తాన్ కు చెందిన రాణా(24) తెలిపారు. ఈ పడవలో 15 మంది సిబ్బంది, మొత్తంగా 700 మంది శరణార్థులు ప్రయాణిస్తున్నారని వారన్నారు. లిబియా నుండి అనేక మంది అక్రమ రవాణాదారులు చాలా ఏళ్లుగా శరణార్థులను ఇలా తరలిస్తూ ఉన్నారని, అక్కడ తనకు చాలా తక్కువ వేతనం లభిస్తుండటంతో జర్మనీ వెళ్లాలన్న ఆలోచనతో ప్రయాణమయ్యానని హసన్ అన్నాడు. మరో శరణార్థి రాణా తానూ ఇటలీ వెళ్లడం కోసం లిబియా అక్రమార్కులకు చాలా పెద్ద మొత్తంలో చెల్లించానని, కానీ వారు మాకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా చాలీచాలని నీళ్లు, ఆహారం ఇచ్చి నాలుగు రోజులు ప్రయాణంలో సర్దుకోమని చెప్పారన్నాడు. పడవలో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. మూడో రోజు పడవలోకి ఒక పక్క నుండి నీళ్లు రావడంతో జనమంతా కంగారుగా రెండో పక్కకు కదిలారు. అంతే క్షణాల్లో పడవ నీటమునిగింది. గ్రీస్ కోస్ట్ గార్డ్ బృందం వచ్చి కాపాడేంతవరకు మాకైతే ఏమీ తెలియలేదని వాళ్లిద్దరూ తెలిపారు. బోటులో సుమారుగా 500 మంది ప్రయాణిస్తున్నారని వారిలో 79 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించామని 104 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారని మిగిలిన వారు గల్లంతై ఉంటారని వారు ప్రాణాలతో దొరికే అవకాశాలున్నాయని గ్రీస్ కోస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇతర బోట్లతో పాటు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. ఇది కూడా చదవండి: 3 వేల ఏళ్లయినా ‘కత్తి’లా ఉంది! -
గ్రీస్‌లో పడవ మునక.. 79 మంది జలసమాధి
గ్రీస్: ఏథెన్స్: బతుకుదెరువు కోసం వలసపోతున్న డజన్లకొద్దీ శరణార్థుల ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. దక్షిణగ్రీస్ సముద్రజలాల్లో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తాపడటంతో కనీసం 79 మంది జలసమాధి అయ్యారు. డజన్లకొద్దీ జనం జాడ గల్లంతయ్యింది. పెలోపోన్నీస్ ప్రాంతం నుంచి తీరానికి 75 కిలోమీటర్లదూరంలో సముద్రంలో మంగళవారం రాత్రివేళ జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటికే 104 మంది కాపాడామని అధికారులు తెలిపారు. విషయం తెల్సుకున్న అధికారులు పెద్ద ఎత్తున గాలింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కాపాడిన వారిలో ఆరోగ్యం విషమంగా ఉన్న వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. 78 మంది మరణించారని అధికారులు చెబుతున్నా ఇంకా ఎంతమంది మరణించి ఉంటారనేది తెలియట్లేదు. ఆరు తీర గస్తీ నౌకలు, ఒక నావికాదళ యుద్ధనౌక, ఒక సైనిక రవాణా విమానం, వాయుసేన హెలికాప్టర్, ఇంకా కొన్ని ప్రైవేట్ పడవలు, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలను భారీ ఎత్తున కొనసాగిస్తున్నారు. తూర్పు లిబియా దేశంలోని తోబ్రక్ ప్రాంతం నుంచి ఈ శరణార్థుల పడవ బయల్దేరి ఇటలీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశానికి ఇలా ఒక వలసదారుల పడవ వస్తోందని ముందే గ్రీక్ అధికారులకు ఇటలీ అధికారులు సమాచారం ఇచ్చారు. వలసదారులను కలామటా నౌకాశ్రయానికి తరలించి అక్కడ ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ ఏర్పాటుచేసిన శిబిరాల్లో ప్రథమ చికిత్స అందించారు. లిబియా అదుపులో వేలాది మంది శరణార్థులు అక్రమంగా ఇలా ప్రయాణం సాగిస్తున్న వారిపై గతంలోనే లిబియా సర్కార్ తన అప్రమత్తతను కనబరిచింది. ఈజిప్ట్, పాకిస్తాన్, సిరియా, సూడాన్ తదితర దేశాలకు వేలాది మంది శరణార్థులు సముద్ర జలాల్లో అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుంది. ఈజిప్ట్‌కు చెందిన వారిని వెంటనే భూమార్గంలో తిరిగి వారి దేశానికి పంపేసింది. లిబియా దక్షిణ ప్రాంతంలో చూస్తే రాజధాని ట్రిపోలీసహా పలు ప్రాంతాల్లోని శరణార్థి హబ్‌లలో సోదాలు చేసి దాదాపు 1,800 మందిని అదుపులోకి తీసుకుందని ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ తెలిపింది. మధ్యధరా సముద్ర జలాల్లో స్థానిక తీర గస్తీ పెట్రోలియం దళాల కంటపడకుండా ఉండేందుకు చాలా మంది స్మగ్లర్లు పెద్ద సైజు పడవలను సమకూర్చుకుని అంతర్జాతీయ జలాల వెంట అక్రమంగా శరణార్థులను తరలిస్తున్నారు. ఆదివారం ఇదే మధ్యధరా సముద్ర జలాల్లో తమను కాపాడండంటూ అమెరికా తయారీ పడవలో వెళ్తున్న 90 మంది శరణార్థులు అత్యవసర సందేశం ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట! -
తీవ్ర విషాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు (ఫొటోలు)
-
Greece Train Crash: పెను విషాదం: ప్యాసింజర్ రైలును ఢీకొన్న గూడ్స్
రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 32 మంది మృతిచెందగా 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ విషాద ఘటన గ్రీస్ దేశంలో చోటుచేసుకుంది. ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వివరాల ప్రకారం.. గ్రీస్‌లోని టెంపే ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్యాసింజర్ రైలు, మరో గూడ్స్ ట్రైన్‌ని ఢీకొట్టింది. రెండు వేగంలో ఉండటంతో ప్రమాదం ధాటికి అనేక బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలకు మంటలు అంటుకున్నాయి. కాగా.. ప్రమాదానికి గురైన ప్యాసింజర్ రైలు.. ఏథెన్స్ నుంచి థెస్సలోనికి అనే ప్రాంతానికి వెళుతున్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 350మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఇక, ఈ ప్రమాద ఘటనపై థెస్సాలీ ప్రాంత గవర్నర్ కాన్సంటీనోస్ అగోరాస్టోస్ స్పందించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అగోరాస్టోస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద ధాటికి ప్యాసింజర్ రైలులోని మొదటి నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. మొదటి రెండు కోచ్‌లు దాదాపు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు. దాదాపు 250 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించినట్లు స్పష్టం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే గ్రీస్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. VIA @Quicktake: WATCH: Multiple cars derailed and at least three burst into flame after a passenger train collided with an oncoming freight train in northern Greece early Wednesday https://t.co/3BQLRxVHKt pic.twitter.com/IhiMG0sSpJ — Traffic Updates + Useful Info (@trafficbutter) March 1, 2023 -
గ్రీస్ తీరం సమీపంలో మునిగిన పడవ.. 59 మంది గల్లంతు
ఏథెన్స్: టర్కీలోని ఇజ్మిర్ నుంచి వలసదారులతో బయలుదేరిన పడవ గ్రీస్ తీరం సమీపంలో మునిగిపోయింది. ఈ ఘటనలో గల్లంతైన 59 మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు గ్రీస్ తీర రక్షక దళం తెలిపింది. ఎల్వియా, ఆండ్రోస్ ద్వీపాల మధ్యనున్న కఫిరియా జలసంధిలో ఆదివారం రాత్రి దాటాక ఘటన చోటుచేసుకుంది. అననుకూల వాతావరణం కారణంగా మునిగిన పడవలో మొత్తం 68 మంది ఉన్నారు. 9 మందిని సురక్షితంగా తీసుకువచ్చినట్లు గ్రీస్ తెలిపింది. -
నిమిషంలోపే హెయిర్ కట్.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్ డ్రస్సర్
అర్జెంట్‌గా హెయిర్ కట్ చేయించుకోవాలా? అస్సలు టైమ్ లేదా? అయితే మీకు ఈ గ్రీక్ హెయిర్ డ్రెస్సర్ కావాల్సిందే. సాధారణ హెయిర్‌కట్ కోసం గ్రీక్ హెయిర్ డ్రస్సరెందుకు? అనేగా సందేహం. ఒక్కసారి మైండ్‌లో ఫిక్సయిపోతే.. బ్లైండ్‌గా ఫాలో అయ్యే ప్రొఫెషనల్ హెయిర్ డ్రస్సర్ ఈయన. గ్రీస్‌లోని ఏథెన్స్కు చెందిన కాన్సాంటినోస్ కౌటోపీస్... నిమిషంలోపే హెయిర్ కట్ చేసేస్తాడు. 47 సెకన్లలోనే అందమైన హెయిర్‌స్టైల్ చేసి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించాడు. ఓపికతో, ఎంత ఎక్కువ సమయం తీసుకుని కట్ చేస్తే.. అంతమంచి హెయిర్ స్టైల్ వస్తుందనే భావనకు చెక్ పెట్టేశాడు. ట్రిమ్మర్, కోంబ్ సహాయంతో చకచకా కట్ చేశాడు. గిన్నిస్ అధికారులు విడుదల చేసిన ఈ వీడియోను లక్షల మంది చూసేశారు. కొందరు సూపరని పొగుడుతుండగా, మరికొందరు బాలేదంటూ పెదవివిరిచారు. Need a quick trim? How about a 45 second trim? 💇♂️ pic.twitter.com/DqeokLazg2 — Guinness World Records (@GWR) September 4, 2022 చదవండి: మా గడ్డ మీలాగా కాదు.. పాక్‌కు తాలిబన్ల కౌంటర్ -
వామ్మో.. ఈ విమానం ల్యాండింగ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఎథెన్స్: గ్రీస్‌లోని స్కియాథోస్ విమానాశ్రయం సుందరమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విమానాలు దిగడాన్ని చూడటానికి ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు ల్యాండింగ్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను వీక్షించేందుకు రోజుకు సుమారు 100 మందికిపైగా ఇక్కడి వస్తారు. ఈ విమానాశ్రయం ఇతర అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లా అంత పెద్దగా ఉండదు. చిన్న రన్‌వే ఉంటుంది. ఇక్కడ దిగేందుకు అనుమతి పొందిన అతిపెద్ద విమానం బోయింగ్ 757. ఇటీవల ఓ ప్రయాణికుల విమానం అత్యంత తక్కువ ఎత్తులో ల్యాండింగ్ చేసిన విధానాన్ని చాలా మంది ఆశ్వాదించారు. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. విజ్‌ఎయిర్ ఎయిర్‌బస్ ఏ321నియో ప్లేన్.. సముద్ర నీటిని తాకుందా అన్నట్లు వెళ్తూ.. అలెగ్జాండ్రోస్ పపడియామంటిస్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ల్యాండింగ్‌కు కొద్ది సెకన్ల ముందు విమానం ముందు టైర్లు రోడ్డుపై ఉన్న వారిని తాకుతాయా అన్నట్లు కనిపించింది. రన్‌వే ఫెన్సింగ్ దాటిన క్రమంలో ఆ గాలికి అక్కడి వారు దూరంగా పడిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోను గ్రేట్ఫ్లైయర్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. స్కియథోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 5,341 అడుగుల రన్‌వే కలిగి ఉంటుంది. అతితక్కువ పొడవు, తక్కువ వెడల్పుతో ఉండటం దీని ప్రత్యేకత. ఈ ఎయిర్పోర్ట్ 1972లో ప్రారంభమైంది. ఇదీ చదవండి: దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే! -
బంతి సాయంతో సముద్రంలో 18 గంటల పోరాటం
అథెన్స్: నడి సముద్రంలో పడిపోతే బయటకు రావటమన్నది దాదాపుగా అసాధ్యం. కానీ, సముద్రంలో పడిపోయిన ఓ వ్యక్తికి చిన్నారులు పడేసిన చిన్న బంతి వరంలా మారింది. బొమ్మ బంతి సాయంతో 18 గంటలు పోరాటం చేశాడు. ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటన గ్రీస్‌లోని కస్సాండ్రాలో జరిగింది. యూరప్‌లోని ఉత్తర మెసిడోనియాకు చెందిన ఇవాన్ అనే వ్యక్తి, అతడి సహచరుడు.. మైటీ బీచ్‌లో సేదతీరుతుండగా బలమైన అలలు వారిని సముద్రంలోకి లాక్కెళ్లినట్లు ఫాక్స్ 5 న్యూయార్క్ పేర్కొంది. కస్సాండ్రా మైటీ బీచ్ నుంచి 130 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయిన ఇవాన్.. ఓ చిన్న బంతి సాయంతో బయటపడినట్లు ఫాక్స్ 5 న్యూయార్క్ తెలిపింది. ఆ బంతిని ఇద్దరు బాలురు 10 రోజుల క్రితం సముద్రంలో పడేసుకున్నట్లు పేర్కొంది. 30 ఏళ్ల ఇవాన్ అలల్లో కొట్టుకుపోయిన క్రమంలో అతడి సహచరులు గ్రీక్ కోస్ట్‌గార్డ్స్‌కు సమాచారం అందించారు. దీంతో వారు హెలికాప్టర్ సాయంతో సుమారు 18 గంటల తర్వాత కాపాడారు. ఆ తర్వాత గ్రీక్ మీడియాతో మాట్లాడారు ఇవాన్. తన వైపు వచ్చిన ఓ చిన్న బంతి సాయంతో ఊపిరి తీసుకుంటూ బలమైన అలలను తట్టుకుంటూ బయటపడే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. మరోవైపు.. ఇవాన్ స్నేహితుడు మార్టిన్ జోవనోవ్స్కీ ఆచూకీ ఇంకా లభించలేదని ఫాక్స్ 5 న్యూయార్క్ తెలిపింది. ఇవాన్ బయటపడిన క్రమంలో ఓ మహిళ బంతి కోసం వచ్చారని, తన కుమారులు బీచ్‌లో పడేసుకున్నారని పేర్కొన్నట్లు తెలిపింది. ఈ సంఘటన అనంతరం స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఇవాన్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు స్పష్టం చేసింది. ఇదీ చదవండి: నడిరోడ్డులో వ్యక్తిపై బాలుడి కాల్పులు.. లైవ్ వీడియో -
French Open: సిట్సిపాస్‌కు చుక్కెదురు
పారిస్: రెండేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచిన గ్రీస్ స్టార్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్ ఈసారి మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టాడు. సోవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 40వ ర్యాంకర్, డెన్మార్క్‌కు చెందిన 19 ఏళ్ల హోల్గర్ రూనె 7–5, 3–6, 6–3, 6–4తో నాలుగో సీడ్ సిట్సిపాస్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ విజయంతో హోల్గర్ రూనె తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 3 గంటల ఒక నిమిషంపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హోల్గర్ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. సిట్సిపాస్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఈ డెన్మార్క్ టీనేజర్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. సిట్సిపాస్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేశాడు. రూడ్ ముందంజ ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) తమ ప్రత్యర్థులపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రూడ్ 6–2, 6–3, 3–6, 6–3తో 12వ సీడ్ హుర్కాజ్ (పోలాండ్)ను ఓడించి తన కెరీర్లో మొదటిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరగా... 11వ సీడ్ జాక్ సినెర్ (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో రుబ్లెవ్ తొలి సెట్‌ను 1–6తో కోల్పోయి రెండో సెట్‌ను 6–4తో నెగ్గి, మూడో సెట్లో 2–0తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో గాయం కారణంగా సినెర్ వైదొలిగాడు. ఈ గెలుపుతో రుబ్లెవ్ తన కెరీర్లో ఐదోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో వెరోనిరా కుదుర్మెతోవా (రష్యా) 1–6, 6–3, 6–1తో 22వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై, 20వ సీడ్ కసత్కినా (రష్యా) 6–2, 6–2తో కామిలా జార్జి (ఇటలీ)పై, 11వ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 4–6, 6–2, 6–3తో ఇరీనా బేగూ (రొమేనియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
సరదాగా ‘వెర్రి పని’.. పదేళ్ల జైలు శిక్ష
సాటి మనషుల మీదే కాదు.. మూగ జీవాల పట్లా వేధింపులు, హింసకు పాల్పడితే చట్టం ఊరుకోదు. అలా ఓ చిన్నప్రాణితో, అదీ తన పెంపుడు జంతువుతో వెర్రి వేషాలు వేసిన వ్యక్తికి.. కఠిన కారాగార శిక్ష స్వాగతం చెప్పింది. ఇంటర్నెట్లో(యూట్యూబ్‌లో) ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయ్యింది. సముద్రం ఒడ్డున రెండు పిల్లులను ఆహారం ఎరవేసి కొద్దిసేపు ఆడించాడు ఓ వ్యక్తి. అలా ఆడిస్తూ.. అదంతా వీడియో తీశాడు. చివరకు.. ఓ పిల్లిని సముద్రంలోకి లాగి పెట్టి తన్నాడు. వెకిలి చేష్టలకు తోడు నవ్వులు నవ్వాడు. రెండో పిల్లితో అలానే వ్యవహరించబోయాడు. గ్రీస్‌లోని ఎవియా ఐల్యాండ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అది తన పెంపుడు పిల్లే అని, అక్కడ నీళ్లు లేవని, ఆ పిల్లి సురక్షితంగానే ఉంది కదా! ఆ వ్యక్తి వాదించడం మొదలుపెట్టాడు. తనకు జంతువులంటే విపరీతమైన పనే అని చెప్తున్నాడు. కానీ, అతని నేరం మాత్రం రుజువైంది. దీంతో అక్కడి చట్టాల ప్రకారం.. అతనికి పేదళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక పౌర హక్కుల పరిరక్షణ మంత్రి టకిస్ థియోడోరికాకోస్ నిందితుడి అరెస్ట్‌ను ధృవీకరించారు. మూగ జీవాల పట్ల ఇలాంటి హింసను సహించే ప్రసక్తే లేదని అంటున్నారాయన. గ్రీస్ చట్టాల ప్రకారం.. ఎవరైనా మూగ జీవాలను హింసించినా, దాడులకు పాల్పడినా పదేళ్లు జైలు శిక్షతో పాటు ఐదు నుంచి పదిహేను వేల డాలర్ల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రమాదం నుంచి ఆ పిల్లి సురక్షితంగా బయటపడిందని, స్థానికంగా ఉన్న యానిమల్ సొసైటీ దాని సంరక్షణ చూసుకోవడంతో పాటు సదరు నిందితుడిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. -
గ్రీస్ ను కప్పేసిన మంచు దుప్పటి
-
ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రష్యన్ స్టార్, నిరుటి రన్నరప్ మెద్వెదెవ్, గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల ఈవెంట్లో సిమోనా హలెప్ (రొమేనియా), అరిన సబలెంక (బెలారస్), ఇగా స్వియటెక్ (పోలండ్)లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ మెద్వెదెవ్ 6–4, 6–4, 6–2తో వరుస సెట్లలో వాన్ డి జండ్షల్ప్ (నెదర్లాండ్స్)పై అలవోక విజయం సాధించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్... గంటా 55 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. క్రొయేషియా స్టార్ మారిన్ సిలిచ్ 7–5, 7–6 (7/3), 3–6, 6–3తో ఐదో సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా)కు షాకిచ్చాడు. మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ 6–3, 7–5, 6–7 (2/7), 6–4తో బెనాయిట్ పైర్ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ ఫెలిక్స్ అగర్ అలియసిమ్ (కెనడా) 6–4, 6–1, 6–1తో డానియెల్ ఇవాన్స్ (ఇంగ్లండ్)పై, 11వ సీడ్ జానిక్ సిన్నెర్ (ఇటలీ) 6–4, 1–6, 3–6, 6–1తో తరో డానియెల్ (జపాన్)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ సబలెంక (బెలారస్) 4–6, 6–3, 6–1తో మర్కెటా వొండ్రోసొవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) 6–2, 6–3తో డారియా కసత్కినా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. 14వ సీడ్ హలెప్ 6–2, 6–1తో డంకా కొవినిచ్ (మాంటెనిగ్రో)పై గెలిచింది. -
షెడ్యూల్ ప్రకారమే ‘గగన్‌యాన్’: ఇస్రో
బెంగళూరు: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ కార్యక్రమంపై కరోనా మొదటి, రెండో వేవ్‌లు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధికారులు వెల్లడించారు. హార్డ్వేర్లను సమకూర్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర య్యాయని తెలిపారు. డిజైన్, అనాలిసిస్, డాక్యుమెంటేషన్ వంటివి తామే సొంతంగా పూర్తి చేసినప్పటికీ హార్డ్వేర్లను మాత్రం దేశవ్యాప్తంగా వందలాది కంపెనీల నుంచి సమకూర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, రెండు వేవ్‌లు, లాక్డౌన్ల వల్ల వీటి ఉత్పత్తి, సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగినట్లు చెప్పారు. అయినప్పటికీ షెడ్యూల్ ప్రకారమే గగన్‌యాన్ కార్యక్రమం నిర్వహిస్తామని, ఇందు కోసం కాలంతో పోటీపడి పని చేస్తున్నామని చెప్పారు. గగన్‌యాన్‌లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్లో తొలి మానవ రహిత అంతరిక్ష నౌకను నింగిలోకి పంపాల్సి ఉంది. అలాగే 2022–23లో మరో మానవ రహిత స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపేలా షెడ్యూల్ రూపొందించారు. లో ఎర్త్ ఆర్బిట్‌లోకి మనుషు లను అంతరిక్ష నౌకలో పంపించి, క్షేమంగా వెనక్కి తీసుకురావాలన్నదే గగన్‌యాన్ కార్యక్రమం ఉద్దేశం. ఇందుకోసం నలుగురు భారత వ్యోమగాములు ఇప్పటికే రష్యాలో జనరిక్ స్పేస్ ఫ్లైౖట్ శిక్షణ పొందుతున్నారు. గగన్‌యాన్ కార్యక్రమాన్ని 2018 ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక్కడ చదవండి: నెంబర్ 1 గా నిలిచిన బెంగళూరు -
బంపర్ ఆఫర్: కోవిడ్ టీకా తీసుకుంటే రూ.13 వేలు
ఏథెన్స్: గ్రీస్‌లోని 26 ఏళ్లలోపు యువతకు ఆ దేశ ప్రధానమంత్రి బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించారు. కరోనా టీకా వేయించుకున్న వారికి 150 యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13,288. తొలి డోసు తీసుకున్న వారికి జూలై 15 నుంచి ఈ బహుమతిని అందజేస్తామన్నారు. గ్రీస్ దేశానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. దేశంలో అర్హులందరికీ కరోనా టీకా ఇచ్చి, పర్యాటకాన్ని పట్టాలెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వ్యాక్సినేషన్‌పై యువత ఆసక్తి చూపడం లేదు. (చదవండి: కిమ్ బరువు తగ్గడం వెనక కారణమిదేనట..!) -
French Open: సూపర్ సిట్సిపాస్
పారిస్: గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన గ్రీస్ యువ టెన్నిస్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్ నాలుగో ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో 22 ఏళ్ల సిట్సిసాస్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ 3 గంటల 37 నిమిషాల్లో 6–3, 6–3, 4–6, 4–6, 6–3తో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. తద్వారా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి గ్రీస్ ప్లేయర్‌గా సిట్సిపాస్ గుర్తింపు పొందాడు. గతంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సిట్సిపాస్ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్స్ (2019, 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్; 2020 ఫ్రెంచ్ ఓపెన్) కావడం విశేషం. ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరిన 24 ఏళ్ల జ్వెరెవ్ ఆరంభంలోనే తడబడ్డాడు. సిట్సిపాస్ ఆటతీరు ముందు ఎదురునిలువలేక వరుసగా రెండు సెట్లను కోల్పోయాడు. అయితే మూడో సెట్ నుంచి జ్వెరెవ్ ఆటతీరు గాడిలో పడింది. అనూహ్యంగా సిట్సిపాస్ ఒత్తిడికి లోనయ్యాడు. వరుసగా రెండు సెట్లను ఈ గ్రీస్ ప్లేయర్ సమర్పించుకున్నాడు. దాంతో మ్యాచ్ నిర్ణాయక ఐదో సెట్‌కు దారి తీసింది. నాలుగో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న సిట్సిపాస్ 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత సిట్సిపాస్ తన రెండు సర్వీస్‌లను నిలబెట్టుకున్నాడు. తొమ్మిదో గేమ్‌లోని తన సర్వీస్‌లో ఏస్ సంధించి సిట్సిపాస్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో సిట్సిపాస్ ఎనిమిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్‌వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 24 సార్లు పాయింట్లు సాధించాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి జ్వెరెవ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు జ్వెరెవ్ 11 ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్‌వద్దకు 35 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. సిట్సిపాస్ 43 అనవసర తప్పిదాలు... జ్వెరెవ్ 47 అనవసర తప్పిదాలు చేశారు. నాదల్, జొకోవిచ్ హోరాహోరీ డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) మధ్య రెండో సెమీఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. తొలి సెట్‌ను నాదల్ 6–3తో సొంతం చేసుకున్నాడు. అతను రెండుసార్లు జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. అనంతరం జొకోవిచ్ తేరుకొని రెండో సెట్‌ను 6–3తో గెల్చుకున్నాడు. ఈ సెట్లో నాదల్ సర్వీస్‌ను అతను రెండుసార్లు బ్రేక్ చేశాడు. -
‘అవును.. తప్పు చేశా.. నేరం అంగీకరిస్తున్నా’
మింక్: ‘‘అవును.. నేను తప్పు చేశాను. నేరాన్ని అంగీకరిస్తున్న. ప్రస్తుతం నేను మింక్లోని నంబర్ 1 డిటెన్షన్ సెంటర్లో సురక్షితంగా ఉన్నాను. నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. గుండెతో పాటు ఇతర అవయవాలు కూడా బాగా పనిచేస్తున్నాయి’’... బెలారస్ జర్నలిస్టు రోమన్ ప్రొటాసెవిక్ నేరం అంగీకరిస్తున్నట్లుగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. గ్రీస్ నుంచి లిథువేనియాకు విమానంలో వెళ్తున్న అతడిని బెలారస్ ప్రభుత్వం ఆదివారం అరెస్టు చేయించిన విషయం తెలిసిందే. రోమన్ ప్రయాణిస్తున్న రియాన్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందన్న సందేశంతో, యుద్ధ విమానం ఎస్కార్టుగా రాగా, దానిని తమ రాజధాని మింక్లో అత్యవసరంగా ల్యాండ్ కాగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే నిరసనలకు కేంద్ర బిందువు అయ్యాడన్న ఆరోపణల నేపథ్యంలో.. రోమన్‌ను బంధించేందుకే సుమారుగా 170 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని ‘హైజాక్’ చేయించారంటూ అంతర్జాతీయ సమాజం నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో... పోలీసుల అదుపులో ఉన్న రోమన్ ఆరోగ్యం చెడిపోయిందనే వార్తలు మరోసారి ఆగ్రహ జ్వాలలకు కారణమయ్యాయి. ఈ విషయంపై స్పందించిన బెలారస్ హోం మంత్రి.. రోమన్ బాగానే ఉన్నాడని, ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రోమన్‌తో స్వయంగా వీడియో విడుదల చేయించడం గమనార్హం. ఇందులో.. ‘‘నన్ను బాగా చూసుకుంటున్నారు. చట్టప్రకారం వాళ్లు చేస్తున్నది సరైనదే. విచారణాధికారులకు నేను పూర్తిగా సహకరిస్తాను. మింక్ సిటీలో మూకుమ్మడి నిరసన కార్యక్రమాలకు నేనే కారణం అన్న విషయాన్ని అంగీకరిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. అయితే, రోమన్ సహచర జర్నలిస్టు స్టెఫాన్ పుటిలో మాత్రం ఈ విషయాన్ని ఖండించారు. ‘‘తన చేత బలవంతంగా ఈ మాటలు చెప్పించారనడానికి, అతడి నుదురు మీద ఉన్న నల్లటి మచ్చలే ఉదాహరణ’’ అంటూ రోమన్ పట్ల అధికారుల వ్యవహారశైలిని విమర్శించారు. అతడిని కొట్టినట్లుగా ఆనవాలు కనబడుతుంటే, ఈ వీడియోను ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు. కాగా స్థానిక చట్టాల ప్రకారం.. బహిరంగ మూకుమ్మడి నిరసనకు కారణమైన వారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇక అధ్యక్ష ఎన్నికల సమయంలో రోమన్ చట్టవ్యతిరేకంగా వ్యవహరించాడని అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఇక గత రెండు దశాబ్దాలుగా బెలారస్‌ను పాలిస్తున్న అలెగ్జాండర్ లుకాషెంకో మరోసారి అధ్యక్ష పీఠం అధిరోహించిన నేపథ్యంలో.. ఉద్దేశపూర్వంగానే ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆయనను విమర్శిస్తున్నారు. చదవండి: Ryanair: ‘అతడి కళ్లల్లో భయం.. చావు తప్పదని చెప్పాడు’ "I confess and cooperate with the investigation" says Roman #Protasevich in a video released by the #Belarusian authorities. This obviously looks like a forced confession; + the marks on his forehead.. pic.twitter.com/a7L3gtQkP2 — inna shevchenko (@femeninna) May 24, 2021 -
Ryanair: ‘అతడి కళ్లల్లో భయం.. చావు తప్పదని చెప్పాడు’
‘‘అతడు భయంతో వణికిపోవడం నేను చూశాను. అతడి కళ్లు విషాదంతో నిండిపోవడం గమనించాను. ఇంతలో తను మా వైపు తిరిగి.. తాను మరణశిక్ష ఎదుర్కోబోతున్నట్లు చెప్పాడు’’ వెబ్‌డెస్క్: గ్రీస్ నుంచి లిథువేనియా వెళ్లాల్సిన రియాన్ఎయిర్ విమానం 4978 అది. దాదాపు పన్నెండు దేశాలకు చెందిన 170 మంది అందులో ప్రయాణిస్తున్నారు. అయితే, అకస్మాత్తుగా ఆ విమానం బెలారస్ వైపు మళ్లింది. యుద్ధ విమానం వెంబడి రాగా ఆ దేశ రాజధాని మింక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. లోపల ఉన్న ప్రయాణికులకు అసలేమీ అర్థం కాలేదు. లిథువేనియా వెళ్లాల్సిన విమానం ఇలా మధ్యలో ఎందుకు ఆపేశారు.. ఇందుకు గల కారణాలేమీటో వారికి అంతుపట్టలేదు.. అయితే, ఓ వ్యక్తి మాత్రం వెంటనే జరిగే పరిణామాలను ఊహించి, లగేజ్‌బ్యాగ్ నుంచి వడివడిగా తన లాప్టాప్, మొబైల్ తీసుకుని పక్కనే ఉన్న అమ్మాయికి అందించాడు. అంతలోనే అక్కడికి చేరుకున్న బెలారస్ పోలీసులు 26 ఏళ్ల ఆయువకుడిని అరెస్టు చేశారు. ఎట్టకేలకు 7 గంటల ఆలస్యం తర్వాత ఫ్లైట్ లిథువేనియాకు చేరుకోవడంతో ప్రయాణికులైతే ఊపిరి పీల్చుకున్నారు గానీ ఆ యువకుడి పరిస్థితి ఏమౌతుందో అనే ఆలోచన వాళ్ల మెదళ్లను తొలచివేస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. యూరోపియన్ దేశాలు సహా అమెరికా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తీరుపై తీవ్ర ఆగ్రహం చేస్తోంది. అసలు ఆ విమానాన్ని ఎందుకు ఆపారు? ఇందుకు బెలారస్ చెప్పిన కారణం ఏమిటి? ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అతడిని ఎందుకు తీసుకువెళ్లారు? ఫొటో కర్టెసీ: రాయిటర్స్ ఎవరా యువకుడు? రోమన్ ప్రొటాసెవిక్.. జర్నలిస్టు. నెక్స్టా గ్రూపు మాజీ ఎడిటర్. గతేడాది బెలారస్లో జరిగిన ఆందోళనకు సంబంధించి వరుస కథనాలు ప్రచురించాడు. అందుకుగానూ అతడిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇప్పటికే రోమన్‌పై అనేక అభియోగాలు నమోదుకాగా.. ఎప్పుడెప్పుడు అతడిని అరెస్టు చేయాలా అన్న అలోచనలో ఉంది. దీంతో అతడు పొలాండ్‌లో తలదాచుకుంటున్నాడు. అయితే, ఆదివారం లిథువేనియాకు వెళ్లే క్రమంలో బెలారస్లో రోమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణం తప్పదన్నాడు ఈ విషయం గురించి విమానంలో ఉన్న ప్రయాణికులు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అతడు భయంతో వణికిపోవడం నేను చూశాను. అతడి కళ్లు విషాదంతో నిండిపోవడం గమనించాను. ఇంతలో తను మా వైపు తిరిగి.. తాను మరణశిక్ష ఎదుర్కోబోతున్నట్లు చెప్పాడు. నిజానికి అతడు అరవడం లేదు, కానీ తను చాలా భయపడిపోతున్నట్లు అర్థమైంది. ఒకవేళ కిటికీ గనుక తెరిచే అవకాశం ఉంటే, కచ్చితంగా దూకేవాడేనేమో. తనను కిందకి తీసుకువెళ్లి ఏవేవో ప్రశ్నలు అడిగి తీసుకువెళ్లారు’’ అని పేర్కొన్నారు. హైడ్రామా.. ఏం చెప్పి విమానాన్ని ఆపారు? విమానంలో బాంబు ఉందన్న బెదిరింపులు రావడంతో అత్యవసరంగా మింక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాలంటూ బెలారస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సందేశం వచ్చింది. అంతలోనే ఓ యుద్ధ విమానం ఎస్కార్టుగా వస్తున్న విషయాన్ని ప్రయాణికులు గమనించారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత సాధారణ తనిఖీ చేశారు. కానీ అందులో బాంబు ఉన్న ఆనవాలు కనిపించలేదు. కానీ, రోమన్‌ను బయటకు పిలిచారు. అతడితో పాటు ఓ మహిళను పోలీసులు తమతో పాటు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బెలారస్ అధికార మీడియా ధ్రువీకరించింది. ‘‘బాంబు బెదిరింపు రావడంతో మిస్టర్ లుకాషెంకో వ్యక్తిగత ఆదేశాలు జారీ చేశారు. విమానాన్ని మింక్లో ల్యాండ్ చేయాలని ఆదేశించారు. ఇందుకు మిగ్-29 ఫైటర్ ఎస్కార్టుగా ఉండేందుకు అనుమతించారు’’ అని పేర్కొంది. అయితే, అప్పటికే విమానం మింక్ కంటే కూడా, లిథువవేనియా విల్నూయిస్కే దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బెలారస్ ఉద్దేశపూర్వకంగానే రోమన్ కోసం ఫ్లైట్‌ను మళ్లించి, బాంబు నాటకం ఆడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా రియాన్ ఎయిర్.. ప్రయాణికులను క్షమాపణ కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే రోమన్ మద్దతుదారులు మాత్రం. ‘‘రియాన్ఎయిర్ ... రోమన్ ఎక్కడ’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫొటో కర్టెసీ: రాయిటర్స్ భగ్గుమంటున్న అంతర్జాతీయ సమాజం ఒక జర్నలిస్టును అరెస్టు చేసేందుకు బెలారస్ ఇంతటి సాహసానికి పూనుకోవడం సరికాదంటూ అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బెలారస్‌పై ఆంక్షలు విధించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి విమానయాన విభాగం ఐసీఏఓ.. బలవంతంగా విమానాన్ని ల్యాండ్ చేయించారు. ఇది చికాగో కన్వెన్షన్ నిబంధనలు ఉల్లంఘించడమే’’ అని పేర్కొంది. కాగా చికాగో కన్వెన్షన్‌లో గగనతలం, విమానాల సురక్షిత ప్రయాణాలకై పలు నిబంధనలు ఉన్నాయి. ‘‘సాధారణ పౌరులతో వెళ్తున్న విమానాన్ని ఇలా ఆపడం అంటే హైజాక్ చేసినట్లే. ఇంతటి దుస్సాహసానికి పూనుకున్న బెలారస్ కచ్చితంగా శిక్షను ఎదుర్కోవాల్సిందే’’ అని పోలండ్ ప్రధాని మండిపడ్డారు. ఇక బెలారస్‌లోని అమెరికా రాయబారి జూలీ ఫిషర్.. ‘‘అంతర్జాతీయ సమాజం, పౌరులకు వ్యతిరేకంగా లుకాషెంకో ప్రభుత్వం వ్యవహరించింది. బాంబు ఉందన్న అబద్ధపు సందేశంతో మిగ్-29ను పంపించి రేనార్ను మళ్లించింది. నెక్స్టా జర్నలిస్టుపై రాజకీయ కక్షతో నమోదైన అభియోగాల నేపథ్యంలో అతడిని అరెస్టు చేసేందుకు చేపట్టిన ఈ చర్య చాలా ప్రమాదకరం’’ అని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇక లాటివియా, లిథువేనియా ఏకంగా బెలారస్ గగనతలాన్ని అసురక్షిత గగనతలంగా గుర్తించాలని విజ్ఞప్తి చేయడం విశేషం. రాజకీయ ప్యత్యర్థిని కిడ్నాప్ చేయడం కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టిన బెలారస్ గగనతలంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించకుండా ఆంక్షలు విధించాలని సూచిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై విచారణ జరిపే విధంగా అమెరికా యూరోపియన్ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. Lukashenka and his regime today showed again its contempt for international community and its citizens. Faking a bomb threat and sending MiG-29s to force @RyanAir to Minsk in order to arrest a @Nexta journalist on politically motivated charges is dangerous and abhorrent. — Julie Fisher (@USAmbBelarus) May 23, 2021 Today’s hijacking of #Ryanair flight by Lukashenko regime shows that Belarusian airspace is not safe, people’s lives were put at risk and kidnaping of a political opponent took place. Belarusian airspace must be closed for all international flights. — Edgars Rinkēvičs (@edgarsrinkevics) May 23, 2021 -
మృత్యువును జయించిన పసిపాప
ఇజ్మీర్(టర్కీ): టర్కీ, గ్రీస్‌లను అతలాకుతలం చేసిన భూకంపం ఎందరినో నిరాశ్రయులను చేసింది. అనేక మందిని క్షతగాత్రులుగా మిగిలి్చంది. నాలుగు రోజులుగా సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెవ్వరూ శిథిలాల కింద మిగిలిఉండరని భావిస్తూన్న తరుణంలో నాలుగు రోజుల అనంతరం కుప్పకూలిపోయిన ఓ అపార్ట్మెంట్ శిథిలాల కింద ఓ చిన్నారి పాపాయి ప్రాణాలతో ఉండడం అందర్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచేసింది. ప్రాణాలతో ఉన్న మూడేళ్ళ చిన్నారి ఐదా గెజ్‌గిన్‌ని సహాయక బృందాలు వెలికితీసి, ప్రజల హర్షాతిరేకాల మధ్య, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం భారీ భూకంపం సంభవించినప్పటి నుంచి 91 గంటల పాటు ఈ చిన్నారి శిథిలాల కింద చిక్కుకుపోయింది. ఐదా గెజ్గిన్ తల్లి ఈ విపత్తుకి బలయ్యారు. ఈ భూకంపం సంభవించినప్పుడు ఐదా తండ్రి, సోదరుడు ఆ భవనంలో లేరు. ఎనిమిది అంతస్తుల ఈ భవనం శిథిలాలను తొలగిస్తుండగా ఓ చిన్నారి ఏడుపు వినిపించడంతో అందర్నీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి పాపాయి కోసం వెతగ్గా డిష్వాషర్ పక్కన ఈ చిన్నారిని కనుగొన్నట్టు ఈ పాపను కాపాడిన నస్రత్ అక్సోయ్ చెప్పారు. భవనం శిథిలాలను వెలికితీస్తుండగా, చాలా బలహీనంగా ఉన్న ఈ చిన్నారి తాను ఇక్కడ ఉన్నానని చెప్పేందుకు ప్రయత్నించింనట్టు వారు చెప్పారు. చిన్నారి పిలుపు వినగానే శిథిలాలను తొలగించే మెషీన్‌ను ఆపి శబ్దం వచ్చిన వైపు వెళ్ళి చూడగా ‘ఇక్కడ ఉన్నాను’ అని చెప్పడం చూసి ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకున్నాయని నస్రత్ తెలిపారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆ అమ్మాయి తన తల్లి ఏదని అడిగినట్లు వారు తెలిపారు. -
భారీ భూకంపం; భయంకరమైన అనుభవాలు
ఇస్తాంబుల్/ఏథెన్స్: ‘‘అసలు ఇది ముగిసిపోతుందా? పది నిమిషాల పాటు ఇదే ఆలోచన నా మెదడును తొలిచివేసింది. కానీ ఆ తర్వాతే అర్థమైంది. ఇప్పట్లో ముగిసేది కాదు. ఆ సమయంలో నాకు ఏమవుతుందో అన్న బాధ కంటే, నా భార్య, నాలుగేళ్ల నా కుమారుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అన్న భయమే నన్ను వణికించింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి భయంకరమైన అనుభవాలు నాకు ఎదురుకాలేదు’’ అంటూ గోఖన్ కన్(32) ఆవేదన వ్యక్తం చేశాడు. టర్కీలో సంభవించిన భూకంపం తన వంటి ఎంతో మంది బాధితులను, వారి కుటుంబాలను చెల్లాచెదురు చేసిందంటూ అంతర్జాతీయ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. ఇక పశ్చిమ ఇజ్మిర్‌లోని ఉర్లాలో నివసించే రిటైర్డ్ బ్రిటీష్ టీచర్ క్రిస్ బెడ్ఫోర్డ్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘రాకాసి అలలు ముంచుకువచ్చాయి. నా పిల్లలతో కలిసి బయటకు పరిగెత్తుకు వచ్చాను’’ అంటూ భయానక అనుభవం గురించి చెప్పుకొచ్చారు. కాగా టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్ ద్వీపం సామోస్‌ల మధ్య ఏజియన్ సముద్రంలో సంభవించిన భారీ భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాల్లో భారీ విధ్వంసం సంభవించింది. ఈ నేపథ్యంలో పశ్చిమ టర్కీలోని ఇజ్మిర్ పట్టణంలోని భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రజల హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను కాపాడేందుకు రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి.(చదవండి: టర్కీ, గ్రీస్‌ల్లో భారీ భూకంపం) కఠిన సమయాల్లో కలిసే ఉంటాం: గ్రీస్, టర్కీ భారీ విపత్తు సంభవించిన నేపథ్యంలో దౌత్యపరంగా శత్రుదేశాలుగా ఉన్న టర్కీ, గ్రీస్ పరస్పరం సంఘీభావం ప్రకటించుకోవడం గమనార్హం. ‘‘టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్‌కు ఫోన్ చేశాను. భూకంపం కారణంగా మా రెండు దేశాల్లో సంభవించిన విషాదం గురించి మాట్లాడాను. మనలో మనకు ఎన్ని విభేదాలు ఉన్నా, ఇలాంటి విపత్కర సమయాల్లో ప్రజలంతా ఐకమత్యంగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది’’అని గ్రీక్ ప్రధాని కిరియాకోస్ మిసోటకిస్ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. ఇందుకు బదులిచ్చిన టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయీప్ ఎర్డోగన్..‘‘థాంక్యూ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. గ్రీస్ ప్రజలకు, బాధితులకు మా దేశం తరఫున సానుభూతి తెలుపుతున్నా. గ్రీస్ గాయాలు మానేందుకు అవసరమైన సాయం చేసేందుకు టర్కీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. విపత్కర సమయాల్లో ఇరుగుపొరుగు దేశాలు పరస్పరం సహకరించుకోవడమే మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం’’అని స్నేహహస్తం అందించారు. వాళ్లకు ఇక్కడ కూడా అదే దుస్థితి ఎదురైంది గ్రీస్ ద్వీపం సామోస్ కేంద్రంగా పనిచేసే వుమెన్ సెంటర్ కో- ఆర్డినేటర్ జూడ్ విగిన్స్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘అప్పుడు.. నేను కిచెన్‌లో ఉన్నా. వాషింగ్ మెషీన్ శబ్దం అనుకుని అలాగే ఉండిపోయా. కానీ వస్తువులన్నీ చెల్లాచెదురై పోవడం ఆరంభమైంది. మేము ఉన్న భవనం కంపించడం మొదలుపెట్టగానే విషయం అర్థమైంది. వెంటనే, బయటకు పరుగులు తీశాం. సిరియా వంటి దేశాల నుంచి వచ్చిన చాలా మంది మహిళా బాధితులకు ఇలాంటి అనుభవాలు ఎన్నోసార్లు ఎదురయ్యాయి. వారి సొంత దేశంలో అన్నీ కోల్పోయి ఇక్కడకు చేరుకున్నారు. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. వాళ్లు మరోసారి అన్నీ కోల్పోయారు. క్యాంపులోని టెంట్లు కూలిపోయాయి. అందరం బయటకు పరుగెత్తాం. అప్పటికే రోడ్లు మొత్తం ప్రజలతో నిండిపోయాయి. సునామీ ముంచుకొస్తుందని చాలా భయపడ్డాం. భవిష్యత్ ప్రణాళికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’అని చెప్పుకొచ్చారు. Thank you, Mr. Prime Minister. I offer my condolences to all of Greece on behalf of myself and the Turkish people. Turkey, too, is always ready to help Greece heal its wounds. That two neighbors show solidarity in difficult times is more valuable than many things in life. https://t.co/eo6iClofKZ — Recep Tayyip Erdoğan (@RTErdogan) October 30, 2020 -
నిట్ట నిలువునా కూలిన అపార్ట్మెంట్
ఇస్తాంబుల్: టర్కీ, గ్రీస్ దేశాల్లో శుక్రవారం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్ ద్వీపం సామోస్‌ల మధ్య ఏజియన్ సముద్రంలో సంభవించిన పెను భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. భారీగా దూసుకొచ్చిన రాకాసి అలలు తీరప్రాంతాలను ముంచెత్తాయి. ఇక్కడి విషాదాన్ని కళ్లకి కట్టే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ‘ప్రే ఫర్ టర్కీ’ పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలు అక్కడి విధ్వంసాన్ని కళ్లకి కడుతున్నాయి. ఇక టర్కీ ఏజీయన్ సిటీ ఇజ్మీర్‌లో అపార నష్టం వాటిల్లింది. ఇక్కడ సుమారు 30 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఈ నగరం ఎత్తైన అపార్ట్మెంట్లను కలిగి ఉంది. ఓ సీసీటీవీ వీడియోలో భూకంపం ధాటికి ఓ రెస్టారెంట్ కిచెన్ కంపించడం.. సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీయడం చూడవచ్చు. అలానే ఇజ్మీర్ సమీపంలోని ఒక పట్టణంలోకి సముద్రపు ఉప్పెన నీరు దూసుకువచ్చింది. వీధులన్ని జలమయమయ్యాయి. బహుళ అంతస్థుల భవనాలు క్షణాల్లో కుప్పకూలిపోయాయి. ఆ ప్రాంతాల్లో దటమైన తెల్లటి పొగ రావడం వీడియోలో చూడవచ్చు. ఈ భూకంపం కారణంగా టర్కీ, గ్రీస్‌ల్లో మొత్తం 14 మంది మరణించారు. టర్కీలో 12 మంది చనిపోయారని, అందులో ఒకరు నీళ్లలో మునిగి చనిపోయారని, 419 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. సామోస్ ద్వీపంలో గోడ కూలి ఒక యువతి, ఒక యువకుడు చనిపోయారని అధికారులు వెల్లడించారు. (చదవండి: టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం) ఇక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నష్టం కలిగించిన భూకంపాల్లో కొన్ని టర్కీ, గ్రీస్‌లో సంభవించాయి. వీటిలో 1999లో 7.4 తీవ్రతతో టర్కీ వాయువ్య దిశలో సంభవించిన భూకంపం ఒకటి. ఈ ఘటనలో ఇస్తాంబుల్‌లో 1000 మంది సహా 17 వేల మందికి పైగా మరణించారు. గ్రీస్‌లో 2017లో భయంకరమైన భూకంపం నమోదయ్యింది. సమోస్ సమీపంలో సంభవించిన ఈ భూకంపంలో ఇద్దరు మరణించారు. -
భారీ భూకంపం
-
టర్కీ, గ్రీస్‌ల్లో భారీ భూకంపం
ఇస్తాంబుల్: భారీ భూకంపం టర్కీ, గ్రీస్ దేశాల్లో విధ్వంసం సృష్టించింది. టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్ ద్వీపం సామోస్‌ల మధ్య ఏజియన్ సముద్రంలో సంభవించిన పెను భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. భారీగా దూసుకొచ్చిన రాకాసి అలలు తీరప్రాంతాలను ముంచెత్తాయి. ఈ భూకంపం కారణంగా టర్కీ, గ్రీస్‌ల్లో మొత్తం 14 మంది మరణించారు. టర్కీలో 12 మంది చనిపోయారని, అందులో ఒకరు నీళ్లలో మునిగి చనిపోయారని, 419 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. సామోస్ ద్వీపంలో గోడ కూలి ఒక యువతి, ఒక యువకుడు చనిపోయారని అధికారులు వెల్లడించారు. భూకంపం ప్రభావం పశ్చిమ టర్కీలోని ఇజ్మిర్ పట్టణంపై భారీగా పడింది. అక్కడ పలు భవనాలు నేల కూలాయి. విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభించాయి. మృతుల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. భవన శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కుప్పకూలిన భవనాల శిధిలాల నుంచి 70 మందిని రక్షించామన్నారు. భూమి 25 నుంచి 30 సెకన్ల పాటు కంపించిందని స్థానికుడొకరు తెలిపారు. 7.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా టర్కీలోని సెఫారిసర్‌లో స్వల్ప స్థాయిలో సునామీ వచ్చింది. గ్రీస్ ద్వీపం సామోస్‌లో సునామీ హెచ్చరిక జారీ చేశారు. సముద్ర జలాలు వీధులను ముంచెత్తాయి. భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. భారీ విధ్వంసం టర్కీలోని మూడో అతిపెద్ద నగరం ఇజ్మిర్. ఇక్కడే భూకంపం ఎక్కువ విధ్వంసం సృష్టించింది. ఇక్కడ 10కి పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయని, చాలా భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయని ఇజ్మిర్ గవర్నర్ యువుజ్ సెలిమ్ కోస్గర్ తెలిపారు. సుమారు 12 భవనాల వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 38 అంబులెన్స్‌లు, రెండు హెలీకాప్టర్లు, 35 మెడికల్ టీమ్స్ సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయన్నారు. సెఫారిసర్‌లో వరదలు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సామోస్ ద్వీపానికి ఉత్తర, ఈశాన్య ఉత్తరంగా 13 కిలోమీటర్ల దూరంలో ఏజియన్ సముద్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని యూరోపియన్–మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. భూకంప తీవ్రతను భూకంప లేఖినిపై ప్రాథమికంగా 6.9 గా నిర్ధారించింది. అయితే, అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం భూకంప తీవ్రతను 7.0 గా పేర్కొంది. 10 కిమీల లోతున మాత్రమే భూకంపం సంభవించినందున ప్రధాన భూకంపం అనంతర ప్రకంపనలు మరికొన్ని వారాల పాటు కొనసాగవచ్చని గ్రీక్‌కు చెందిన భూకంప నిపుణుడు ఎకిస్ సెలెంటిస్ హెచ్చరించారు. వాటిలో కొన్ని శక్తిమంతమైన భూకంపాలు కూడా ఉండవచ్చని అంచనా వేశారు. భూకంప ప్రకంపనలు గ్రీస్ రాజధాని ఏథెన్స్‌తో పాటు బల్గేరియా వరకు విస్తరించాయి. టర్కీలో ఇస్తాంబుల్, మర్మరా, ఏజియన్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. -
టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం
-
టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం
టర్కీ : పశ్చిమ టర్కీ, గ్రీస్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. కాగా రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూకంపం దాటికి ఆరు భవనాలు కూలడంతో పాటు.. సెంట్రల్ ఇజ్మీర్‌లోని 20 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. కాగా ఈ భూకంపం దాటికి పలువురు మరణించారని.. అయితే ప్రాణనష్టం అధికంగానే ఉండే అవకాశం ఉందని టర్కీ ప్రభుత్వం పేర్కొంది. కాగా భూకంపం దాటికి ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ సంభవించడంతో ఇజ్మీర్ పరిధిలోని సమోస్ తీర ప్రాంతానికి సముద్రం చొచ్చుకొచ్చింది. ఇజ్మీర్ పక్కనున్న ఏజియన్ సముద్రంలో 16 కి.మీ లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ తెలిపింది. భూకంపం కారణంగా సంభవించిన సునామీతో సముద్రపు నీరు వీధుల్లోకి రావడం కనిపించింది. కొన్నిచోట్ల బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలంతో వందల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రీస్ రాజధాని ఏథెన్స్ సహా పలు ప్రాంతాలలోనూ భూకంపం సంభవించింది (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) A strong and shallow Magnitude 7.0 #Earthquake has hit near the border of #Greece and #Turkey #earthquake pic.twitter.com/X1FqHlQ3vS — Michele Conenna (@mikyspeaker) October 30, 2020 A strong and shallow Magnitude 7.0 #Earthquake has hit near the border of #Greece and #Turkey #earthquake #Tsunami pic.twitter.com/X2myWZLz1t — Michele Conenna (@mikyspeaker) October 30, 2020 -
సినిమా చూసొద్దాం మామా..
ఓటీటీలు, ఏటీటీలు ఎన్ని ఉన్నా.. మన ఫేవరేట్ హీరో సినిమా థియేటర్లో చూస్తే ఆ మజాయే వేరు.. కానీ కరోనా వచ్చి.. ఆ మజాను మన నుంచిదూరం చేసింది.. ఇప్పుడు ఒకొక్కటి అన్‌లాక్ అవుతున్నాయి.. మరి థియేటర్లు?? ఇంకా తేలనే లేదు.. అటు గ్రీస్‌లోని ఏథెన్స్లో మాత్రం కరోనా భయం లేకుండా.. భౌతిక దూరం కూడా పాటించేలా చూసేందుకు ఇలా డ్రైవ్ ఇన్ సినిమాల బాటన పడ్డారు. చూశారుగా.. ఎవరి కారులో వారు కూర్చుని.. సినిమాను ఎంజాయ్ చేయడమన్నమాట. కొన్ని చోట కుర్చీల సదుపాయం కూడా ఉంది. నాలుగ్గోడల మధ్య వైరస్ వ్యాప్తి ఎక్కువుంటుందనిఅంటున్నారు కాబట్టి.. ఇలాంటి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు భవిష్యత్తులో క్రేజ్ బాగా పెరుగుతుందని చెబుతున్నారు. -
జపాన్‌కు ఒలింపిక్ జ్యోతి
టోక్యో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఆందోళన నేపథ్యంలో ఒలింపిక్ జ్యోతి శుక్రవారం జపాన్‌కు చేరింది. ఏథెన్స్లో జరిగిన కార్యక్రమంలో ఒలింపిక్ జ్యోతిని టోక్యో 2020 నిర్వాహకులకు గ్రీస్ అప్పగించింది. వేడుకగా జరగాల్సిన ఈ కార్యక్రమం కరోనా వ్యాప్తి కారణంగా ప్రేక్షకులు లేకుండానే ముగించారు. ఈ కార్యక్రమంలో గ్రీస్ ఒలింపిక్ కమిటీ చీఫ్ స్పైరోస్ కాప్రలోస్ చేతుల మీదుగా జ్యోతిని టోక్యో గేమ్స్ ప్రతినిధి నవోకో ఇమోటో అందుకున్నారు. కరోనా ఉదృతి నేపథ్యంలో ఒలింపిక్స్ నిర్వహించాలా వద్దా అనేది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. జపాన్‌కు చెందిన ప్రసిద్ధ క్రీడాకారులు సౌరి యోషిడా, తదాదాహిరో నోమురాలు జ్యోతిని అందుకొని.. నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీకి అప్పగించారు. మార్చి 26వరకు ఒలింపిక్ జ్యోతిని ఉత్తర జపాన్‌లో ఉంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
గ్రీస్ విమానాశ్రయం ప్రాజెక్ట్ జీఎంఆర్ చేతికి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) గ్రీస్ క్రీట్లోని హెరాక్లియోన్ అంతర్జాతీయ విమానాశ్రయం డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్, ఆపరేషన్, నిర్వహణ బిడ్‌ను దక్కించుకుంది. దీంతో యూరోపియన్ ఎయిర్పోర్ట్ నిర్వహణ బిడ్ గెలిచిన తొలి భారతీయ ఎయిర్పోర్ట్ ఆపరేటర్‌గా జీఎంఆర్ నిలిచింది. జీఏఎల్, దాని గ్రీస్ భాగస్వామి జీఈకే టెర్నా కన్సార్టియం గతేడాది ఫిబ్రవరిలో కన్సెషన్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసిన విషయం తెలిసిందే. విమానాశ్రయ అభివృద్ధికి ఈ కన్సార్టియం 500 మిలియన్ యూరోలకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీస్ ప్రధాన మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా జీఎంఆర్ గ్రూప్ ఎనర్జీ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాలా మాట్లాడుతూ.. హెరాక్లియోన్ విమానాశ్రయ బిడ్‌తో జీఎంఆర్ గ్రూప్ ఈయూ రీజియన్‌కు ఎంట్రీ ఇచ్చినట్లయిందన్నారు. ప్రతిష్టాత్మక ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తామని చెప్పారు. ప్రాజెక్ట్ కన్సేషన్ పీరియడ్ 35 ఏళ్లు. ఈ ప్రాజెక్ట్‌కు స్థానిక గ్రీస్ ప్రభుత్వం ఈక్విటీ, ఇప్పటికే ఉన్న ఎయిర్‌పోర్ట్స్ నుంచి నిధులను సమకూరుస్తుంది. హెరాక్లియోన్ గ్రీస్‌లోని రెండో అతిపెద్ద విమానాశ్రయం. గత మూడేళ్లుగా 10 శాతం ట్రాఫిక్ వృద్ధిని నమోదు చేస్తుంది. ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక ప్రాంతాల్లో గ్రీస్ ఒకటి. ఏటా 33 మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారు. క్రిట్ అత్యధిక పర్యాటకులను ఆకర్షించే ద్వీపం. -
రిఫ్రిజిరేటర్లో 41 మంది
తెస్సలోనికి: ట్రక్‌లో దాక్కొని గ్రీస్ దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన 41 మందిని పోలీసులు గుర్తించారు. ట్రక్ రిఫ్రిజిరేటర్లో వలసదారులు ఉండగా, జార్జియాకు చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. జాంతి, కొమొతిని నగరాల మధ్య ఈ ట్రక్కును కనుక్కున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాక్కున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, అవసరమైన ఏడు మందికి ప్రాథమిక చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. వీరు అఫ్గానిస్తాన్ వాసులుగా భావిస్తున్నారు. -
సెలబ్రిటీల స్వర్గమేమో కదా అదీ!
అది సెలబ్రిటీలకు, యువ రాజులకు స్వర్గధామం. ప్రైవేటు బీచుల మీదుగా వీచే చల్లటిగాలులు, అహ్లాదకరమైన వాతావరణంతో అలరారే పరిసరాల మధ్య అనంద డోలికల్లో తేలిపోతూ కమ్మని సువాసనల మధ్య కమనీయ ముచ్చట్లతో మురిసిపోతూ పసందైన వంటకాల రుచులను ఆస్వాదిస్తూ ‘స్వర్గమే కదా ఇదీ!’ అంటూ తూగే ప్రాంతమది. నిజంగా చెప్పాలంటే సెలబ్రిటీలకు అది ఓ రహస్య స్వర్గం. రసమయ లోకం. అన్యులకు అందని ఆనందాల తీరం. అక్కడి రాయల్ విల్లా నిజంగా రారాజుల విల్లానే. అందుకే ప్రముఖ హాలీవుడ్ సెలిబ్రిటీలు లియోనార్దో డికాప్రియా, మెరిల్ స్ట్రీప్, క్రిస్టినో రొనాల్డో, కైలి మినోగ్, మెల్గిబ్సన్లు తరచు వచ్చి పోతుంటారు. గ్రీస్‌లోని అథేనియా రివీరాలో ఓ ప్రైవేటు ద్వీపకల్పమే ఈ స్వర్గధామం. 72 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమై 16 హోటల్ బీచెస్, 8 ప్రైవేటు బీచెస్, రాయల్ విల్లాలు ఉన్నాయి. బంధు, మిత్రులతో కాకుండా సకల పని వారలతో కలసి వచ్చినా వారందరికి తగిన వసతులు అందుబాటులో ఉన్నాయి. విల్లాలలోనే కాకుండా హోటళ్లలో కూడా విశాలమైన పడక గదులు, విశ్రాంతి గదులతో పాటు, స్వీయ పాకానికి వంట శాలలు, అధునిక మధు శాలలు, వ్యాయామానికి ప్రైవేటు జిమ్ములు ఉన్నాయి. సూర్య చంద్రుల ఆగమ, నిష్క్రమణ సంధ్యా కాంతులకు అనుగుణంగా, అల్పాహార, మధ్యాహ్న, విందు భోజనాలను ఆస్వాదించేందుకు అన్ని దిక్కుల అహ్లాద ఏర్పాట్లు ఉన్నాయి. ఒకటేమిటీ మార్బుల్ బాత్రూమ్లతోపాటు ఇండోర్, అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అవసరాన్నిబట్టి వాటిలోని నీరును వేడినీరుగా కూడా మార్చుకునే వెసలుబాటూ ఉంది. 24 గంటలపాటు వంటవాడు అందుబాటులో ఉండడమే కాకుండా 24 గంటలపాటు సర్వీసు ఉంటుంది. సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా ఈ స్వర్గధామంలో అడుగుపెట్టేందుకు ఓ హెలిపాడ్‌తో పాటు హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా చెప్పుకుంటే అమ్మాయికి అబ్బాయి పెళ్లి ఆఫర్ చేసినప్పుడు హెలికాప్టర్ గుండా పుష్పాభిషేకం కూడా చేస్తారు. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా! అత్యంత ఖరీదు కాబోలు అనుకుంటే పొరపాటే! ఇక్కడి అన్నింటి కన్నా విలాసవంతమైన 400 చదరపు అడుగుల రాయల్ విల్లాలో ఒక రోజు ఉండేందుకు కేవలం లక్ష రూపాయలే. అతిథుల కోసం సూట్లతోపాటు హోటళ్లలో ఒకటేసి గదులు కూడా ఉన్నాయి. పనివారలు, వ్యక్తిగత సిబ్బంది కోసం ఇతర గదులు ఉన్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు ఇక్కడి సొంత వంటవాళ్లను వెంట తెచ్చుకుంటారు.‘మామ మియా’ సినిమాను 2008లో ఇక్కడే తీశారు. అప్పుడు ఆ సినీ తారలలోపాటు యావత్ నిర్మాణ సిబ్బంధి ఇక్కడే ఉన్నారు. అందుకనే వివిధ స్థాయిల వ్యక్తులను, వారి అవసరాలను, అభిరుచులను దష్టిలో పెట్టుకొని ఇక్కడ తగిన ఏర్పాటు చేశారు. ప్రముఖ గ్రీక్ ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్స్ ఇక్కడి వసతులను ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. రాల్ఫ్ లారెన్, కామెరిచ్, విల్లా లూమి, మురానో లాంటి ప్రముఖ నిపుణులు ఇక్కడి ఫర్నీచర్‌కు రూపకల్పణ చేశారు. అతిథుల అభిరుచులకు అనుగుణంగా పెద్ద పెద్ద చెట్లను తొలగించి కూడా వాటి స్థానంలో ఎప్పటికప్పుడు ఇతర చెట్లను రీప్లాంట్ చేయడం ఇక్కడ మరో విచిత్రం, విశేషం అని కూడా చెప్పవచ్చు. అందమైన అమ్మాయిలు మరింత అందంగా మెరిసి పోవాలనే ఉద్దేశంతోనేమోగానీ రాయల్ విల్లా నిర్వాహకులు ఇటీవల అమ్మాయిల కోసం 24 క్యారెట్ల బంగారు స్విమ్మింగ్ సూట్లుకు తెప్పించారట! -
హత్య చేసి.. శవంపై అత్యాచారం
ఏథెన్స్ : అమెరికా మహిళా సైంటిస్టును హత్య చేసి అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ గ్రీసు యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు నేరం అంగీకరించాడని త్వరలోనే కోర్టులో హాజరుపరుచనున్నట్లు పేర్కొన్నారు. వివరాలు... అమెరికాకు చెందిన సుజానే ఈటన్(59)... మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ డ్రెస్డెన్ యూనివర్సిటీలో మాలిక్యులర్ బయోలజిస్టుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కాన్ఫరెన్సులో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి గ్రీసులోని చనియా సిటీకి వెళ్లారు. అయితే జూలై 2 నుంచి సుజానే కనిపించకుండా పోవడంతో ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సుజానే ఆచూకీ కోసం వెదుకుతున్న క్రమంలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఓ బంకర్లో ఓ మహిళ శవం ఉందంటూ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అది సుజానే బాడీ అని గుర్తించారు. ఈ క్రమంలో లోతుగా విచారణ జరుపగా... చనియాకు చెందిన ఓ యువరైతు ఆమెను చంపినట్లుగా తేలింది. సుజానేను తొలుత కారుతో తొక్కించి..ఆమె మరణించిన తర్వాత శవంపై నిందితుడు అత్యాచారం జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా అతడు నేరం అంగీకరించినట్లు పేర్కొన్నారు. -
పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్!
గ్రీస్ : పర్యాటకులపై నుంచి కొద్ది అడుగుల దూరంలోనే విమానం వెళ్లి రన్‌వేపై ల్యాండ్ అయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రిటిష్ ఏయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పర్యాటకుల తలలపై నుంచి అతి తక్కువ దూరంలో వెళుతూ రన్‌వేపై ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అయ్యే సందర్భంలో కొంతమంది పర్యాటకులు మరింత దగ్గరగా చూడటానికి గోడపైకి ఎక్కడంతో గాలివేగానికి కిందపడబోయారు. ఈ సంఘటన గ్రీస్‌లోని స్కియాథోస్ విమానాశ్రయంలో జరిగింది. ఈ విమానాశ్రయం తక్కువ ఎత్తులో ల్యాండ్ అయ్యే విమానాలకు ప్రసిద్ధి చెందింది. స్కియాథోస్ విమానాశ్రయాన్ని ‘యూరోపియన్ సెయింట్ మార్టిన్’ అని పిలుస్తారు. ఇది యూరప్‌లోని అత్యంత క్రేజీ విమానాశ్రయాలలో ఒకటి. ఇక్కడ భారీ విమానాలు సైతం చిన్న రన్‌వేపై వెళ్తూ కనువిందు చేస్తుంటాయి. దీంతో ఈ దృశ్యాలను చూస్తూ, తమ వీడియోలలో బంధించడానికి వందల సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. అలాగే ఇక్కడ అందమైన బీచ్ కూడా ఉంది. బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ తలలపై వెళ్లే విమానాలకు బైబై చెప్తూ పర్యాటకులు సరదాగా గడిపేస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం పర్యాటకపరంగా ఉద్వేగాలకు గురిచేసే ప్రాంతంగా పేరుపొందింది. అలాగే ఇక్కడి సుందరమైన దృశ్యాలు పర్యావరణ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ‘ఈ ఎయిర్‌పోర్ట్‌లో తక్కువ ఎత్తులో విమానాలు ల్యాండ్ కావడం చాలా సహజం, రన్‌వే చిన్నగా ఉండటంతోనే ఇలా జరుగుతుందని’ స్థానికులు అంటున్నారు. ఈ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి అనుమతించబడిన అతిపెద్ద విమానం బోయింగ్ 757. నేడు ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తూ గ్రీసు దేశంలోని ప్రధాన పర్యాటకప్రాంతాలలో ఒకటిగా మారింది. -
2 లక్షల ఏళ్ల క్రితమే యూరప్‌కు మానవులు
న్యూఢిల్లీ : ఆధునిక మానవులు (నాగరికత నేర్చుకున్న) ఆఫ్రికా నుంచే యూరప్‌కు వలస వచ్చారని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చి చెప్పిన విషయం తెల్సిందే. రొమానియాలోని ఓ గుహలో దొరికిన 1,50,000 ఏళ్ల నాటి ఆధునిక మానవుడి పుర్రె ఆధారంగా 1,70,000 ఏళ్ల క్రితమే ఆఫ్రికా నుంచి మానవులు యూరప్‌కు వలసవచ్చారని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ రెండు లక్షల ఏళ్ల క్రితమే మానవులు ఆఫ్రికా నుంచి యూరప్‌కు వలసవచ్చారని గ్రీసులోని ఓ గుహలో దొరికిన ఆధునిక ఆది మానవుడి పుర్రె ఆధారంగా శాస్త్రవేత్తలు కొత్త అభిప్రాయానికి వచ్చారు. తాజాగా దొరికిన పుర్రె 2,10,000 ఏళ్ల నాటిదని ఎపిడిమా 2 ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. ఎపిడిమా 1, ఎపిడిమా 2 అనే రెండు విధాల సీటీ స్కాన్ ద్వారా పుర్రెల కాలాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. ఆఫ్రికా నుంచి ఆగ్నేయ యూరప్ గుండా మానవులు వలస వచ్చారని, వారంతా ఒకేసారి ఓ వెల్లువలా కాకుండా అప్పుడప్పుడు గుంపులు, గుంపులుగా వచ్చి ఉంటారని ఈ పుర్రెపై అధ్యయనం జరిపిన బ్రిటన్‌లోని మ్యాన్చెస్టర్ యూనివర్శిటీ, జర్మనీలోని టూబింగన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. యూరప్‌కు వలస రాకముందు ఆదిమానవులు (నియాండర్తల్స్) ఐదు లక్షల సంవత్సరాలకు ముందే ఆఫ్రికాలో నివసించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆధునిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం 5.50 కోట్ల సంవత్సరాల క్రితమే ఆదిమానవుడికి ప్రాథమిక కోతి రూపమైన ‘గిమాన్’లు ఉండేవి. 1.50 కోట్ల సంవత్సరాల నాటికి గిమాన్ నుంచి హోమినిడాగా పిలిచే తోకలేని నల్ల కోతులు వచ్చాయి. వాటిన ఉంచి 70 లక్షల ఏళ్ల క్రితం గెరిల్లా కోతులు వచ్చాయి, 55 లక్షల ఏళ్ల క్రితం గెరిల్లాలకు కాస్త మానవ రూపం వచ్చింది. 40 లక్షల సంవత్సరాల క్రితం ఆ గెరిల్లాకు మరికాస్త మానవ రూపం వచ్చింది. ఇక 39 లక్షల ఏళ్ల నుంచి 29 లక్షల ఏళ్ల మధ్య ఆస్ట్రోలోపితికస్ జాతి మానవులు, 27 లక్షల ఏళ్ల క్రితం పరంత్రోప్ ఆది మానవులు నివసించారు. 26 లక్షల ఏళ్ల క్రితం గొడ్డలి ఆయుధాన్ని ఆది మానవుడు కనుగొన్నారు. పద్దెనిమిది లక్షల ఏళ్ల క్రితం మానవుడికి ఆధునిక చేయి వచ్చింది. ఎనిమిది లక్షల ఏళ్ల క్రితం ఆది మానవుడి మెదడు పరిణామం పెరిగింది. నిప్పును నియంత్రించడం, మట్టి పాత్రలు తయారు చేయడం నేర్చుకున్నారు. మూడు లక్షల నుంచి రెండు లక్షల మధ్య ఆఫ్రికా నుంచి మానవులు యూరప్‌కు వలస వచ్చారు. -
గ్రీస్‌లో అధికార మార్పిడి
ఏథెన్స్ : గ్రీస్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ ఓటమి పాలయ్యారు. కిరియాకోస్ మిత్సోటకిస్ నేతృత్వంలోని న్యూడెమోక్రసీ పార్టీ, సిప్రాస్ నేతృత్వంలోని సిరిజా పార్టీపై గెలుపు సాధించింది. 75 శాతానికి పైగా ఓటింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో న్యూడెమోక్రసీ పార్టీ 39.6 ఓట్లు సాధించి అధికారం కైవసం చేసుకొంది. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దశాబ్ద కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వచ్చింది. ఓటమిని అంగీకరించిన సిప్రాస్ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెంకించడానికి చేయాల్సిందంతా చేశానని, అయితే గ్రీకు ప్రజల తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. గ్రీక్ ప్రజలకు కిరియాకోస్ మిత్సోటకిస్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానిగా అధ్యక్ష నివాసంలో ఆయన పదవీ స్వీకార ప్రమాణం చేశారు. గ్రీస్‌కు ముందున్న సవాళ్లు తెలుసని.. పారదర్శక పాలన, మరింత యోగ్యతతో మనం స్వరం యూరప్‌లో ఇకనుంచి గట్టిగా వినిపిస్తుందని మిత్సోటకిస్ అన్నారు. దేశాన్ని మరింత ప్రైవేటీకరణ దిశగా, బిజినెస్ ఫ్రెండ్లీగా మారుస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసిన ఈ పూర్వ హార్వర్డ్ విద్యార్థి 2013-15 మధ్య మంత్రిగా కూడా పనిచేశారు. గ్రీస్ సంక్షోభం దశాబ్దకాలంగా ఆర్థిక సంక్షభంలో కూరుకొని ‘యూరప్ సమస్యల పిల్లాడు’ అని ముద్ర వేసుకున్న గ్రీస్‌లో ఏ రాజకీయ పరిణామం జరిగినా యూరప్ యూనియన్ దేశాలు నిశితంగా గమనిస్తాయి. 2015కు పూర్వం గ్రీస్ దివాళా తీసే దిశగా ప్రయాణించింది. దీంతో వామపక్ష భావాలు ఉన్న ఆకర్షణగల నేత సిప్రాస్ నేతృత్వంలోని సిరాజ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు సరికొత్త పాలన అందిస్తానని, గ్రీస్ కష్టాలు తొలగాలంటే గ్రెగ్జిట్(యూరోపియన్ యూనియన్నుంచి బయటికి రావడం) కావాలని ఎన్నికల సమయంలో సిప్రాస్ పదేపదే చెప్పారు. పెట్టుబడీదారీ వ్యవస్థతో ముడిపడి ఉన్న ఈ దేశంలో వామపక్ష పార్టీ అధికారంలోకి రావడం జరగదని రాజకీయ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా సిప్రాస్ అధికారంలోకి వచ్చారు. గ్రెగ్జిట్పై రెఫరెండం నిర్వహించగా మెజార్టీ ప్రజలు అనుకూలంగానే తీర్పుఇచ్చారు. ఈ పరిమాణంతో యూరోపియన్ యూనియన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ సిప్రాస్ చివరి నిమిషంలో యూరప్ ఆర్థిక శక్తివంతులు జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల ఒత్తిడికి తలొగ్గారు. గ్రెగ్జిట్ను పక్కన పెట్టడమే గాక ఎన్నికల సమయంలో వ్యతిరేకించిన బెయిల్ అవుట్ ఒప్పందాన్ని తిరిగి చేసుకుని ప్రభుత్వం పెట్టే సంక్షేమ ఖర్చులో కోత విధించడం మొదలుపెట్టారు. దీంతో ప్రజలలో తీవ్ర ఆగ్రహం వక్తమైంది. గ్రీస్ ఆందోళనలతో అట్టుడుకింది. దీనికితోడు సిరియా, ఇరాక్‌ల నుంచి శరణార్థుల వలసలు కూడా గ్రీకు ప్రజలలో ఆందోళన పెంచాయి. దీంతో జాతీయతవాదం బయలుదేరి ఈ ఎన్నికలలో సిప్రాస్ ఓటమి పాలయ్యారని విశ్లేషకులు అంటున్నారు. సిప్రాస్ పాలనలో యూరప్‌కు దూరం జరిగిన గ్రీస్, సంస్కరణవాదిగా పేరుతెచ్చుకున్న కిరియాకోస్ వల్ల తిరిగి యూరప్ ప్రధాన స్రవంతిలో కలుస్తుందని, ఈ విజయంతో యూరప్‌ను ఆవహించిన వామపక్ష ఆకర్షణ భయాలకు కొంతకాలం తెరపడినట్లేనని అభిప్రాయపడుతున్నారు. -
అక్కడికి వెళితే నెలకు 40వేలు ఇస్తారు!
ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లి.. అక్కడ మనం నివసించాలంటే.. మనమే ఎంతకొంత అద్దె కట్టాల్సి ఉంటుంది. కానీ, మీరు వచ్చి మా ద్వీపంలో నివసిస్తే చాలు.. బదులుగా మేమే మీకు నెలకు రూ. 40వేలు చెల్లిస్తామని ఆఫర్ ఇస్తోంది ఓ దేశం. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. గ్రీస్ దేశంలోని అంటీకైథెరా ద్వీపానికి వెళ్లి నివసిస్తే.. నెలకు 450 పౌండ్లు (రూ. 40వేలు) అక్కడి స్థానిక ప్రభుత్వం చెల్లించనుంది. ఈ ద్వీపంలో నివసించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యధర సముద్రంలోని క్రెటా, కైథిరా దీవుల మధ్య అంటీకైథెరా ద్వీపం ఉంది. ప్రస్తుతం ఈ ద్వీపంలో 24మంది మాత్రమే నివసిస్తున్నారు. వేసవికాలం వస్తే ఇక్కడ నివసించే వారి సంఖ్య మరికొంత పెరిగే అవకాశముంది. అంతగా ఆధునీకరించని ఈ చిన్నీ నివాసయోగ్యమైన ద్వీపంలో ఆహారం తక్కువగా దొరుకుతుందని, అయితే, అపారమైన విశ్రాంతి, విహారాలకు ఈ ద్వీపం నెలవని అంటీకైథెరా అధికారిక వెబ్సైట్ పేర్కొంటుంది. శీతకాలంలో తమ ద్వీపం ఎంతో అందంగా ఉంటుందని, ఆ సమయంలో ఇక్కడ గడపడం కొంచెం కష్టమైనా.. ఎక్కువ కుటుంబాలు ఇక్కడికి వచ్చి నివసించాలని, మళ్లీ ఈ ద్వీపం పునర్వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుంటున్నట్టు ద్వీపం మేయర్ స్థానిక మీడియాకు తెలిపారు. -
గ్రీస్‌లో బీభత్సం సృష్టించిన దావానలం
-
79కి చేరిన గ్రీస్ కార్చిచ్చు మృతుల సంఖ్య
ఏథెన్స్: గ్రీస్‌లోని ఏథెన్స్ సమీప అటవీప్రాంతాలను కార్చిచ్చు దహించివేస్తున్న ఘటనలో చనిపోయిన వారి సంఖ్య బుధవారం 79కి పెరిగింది. అగ్నికీలల బారిన పడిన వారిని రక్షించేందుకు ఈశాన్య ఏథెన్స్లోని తీరప్రాంత ఇళ్లలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. అగ్నికీలల్లో కాలిపోయిన ప్రతీ ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాధితుల జాడ కోసం అగ్నిమాపక సిబ్బంది అన్వేషణ కొనసాగిస్తున్నారు. కార్చిచ్చు వ్యాపించిన నివాస ప్రాంతాల్లో తమ వారి జాడ గల్లంతయ్యిందంటూ అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని సంబంధిత ఉన్నతాధికారి స్టారోలా మలిరి చెప్పారు. ఇంతవరకూ ఎంత మంది జాడ తెలియకుండా పోయిందో సంఖ్య చెప్పలేమని ఆమె అన్నారు. -
హనీమూన్‌లో కార్చిచ్చు.. కష్టాలు!
ఏథెన్స్ : ఓవైపు చెలరేగిన కార్చిచ్చు గ్రామాన్ని మొత్తం బూడిద చేయగా.. మరోవైపు విదేశీయులు సైతం ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. అగ్నికీలలు స్థానికులతో పాటు పర్యాటకుల ప్రాణాలతో చెలగాడమాడాయని అధికారులు అంటున్నారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని మాటీ గ్రామంలో చెలరేగిన కార్చిచ్చులో 100 మంది మంటల్లో కాలిపోగా, మరో 1000 మందికి కాలిన గాయాలైన విషయం తెలిసిందే. హనీమూన్‌కు వచ్చిన ఎన్నో జంటల జీవితంలో కార్చిచ్చు పెను విషాదాన్ని నింపుతోంది. ఐర్లాండ్‌కు చెందిన జోయ్ హోలోహన్, బ్రేయిన్ ఓ కల్లాఘన్ల మనసులు కలిశాయి. కొంతకాలం ప్రేమించుకున్న అనంతరం గత గురువారం ప్రేయసి జోయ్‌తో కల్లాఘన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తమకు సమీపంలోని పర్యాటక ప్రాంతమైన ఏథెన్స్లోని మాటీకి వెళ్లారు. కానీ తమ హనీమూన్‌లో కార్చిచ్చు విషాదం నింపనుందని జోయ్ ఆందోళన చెందుతున్నారు. తాజా అగ్నిప్రమాదంలో తమ జంట వేరయిందని, భర్త కల్లాఘన్ జాడ తెలియటం లేదని ఆమె కన్నీటి పర్యంతమైంది. అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తనను సిబ్బంది రక్షించి ఆస్పత్రిలో చేర్పించారని, కళ్లు తెరిచి చూసేసరికి భర్త పక్కన లేడని చెప్పింది. పోలీసులకు భర్త ఫొటోతో పాటు వివరాలు ఇచ్చానని, దేవుడి దయ వల్ల అతడికి ఏం కాకూడదని నవ వధువు జోయ్ ప్రార్థిస్తోంది. పర్యాటనకు వచ్చి ఇలా పొరుగు దేశంలో ప్రాణాలు కోల్పోవడం నరక ప్రాయమని బాధిత టూరిస్టులు అంటున్నారు. దేవదారు వృక్షాల్లో మొదలైన చిన్న మంట.. కార్చిచ్చుగా మారి గ్రామాన్ని మొత్తం బూడిద చేసేసింది. ప్రాణాలు రక్షించుకునేందుకు స్థానికులతో పాటు పర్యాటకులు బీచ్‌ల వైపు పరుగులు తీశారు. అయినా వందల మందిని కార్చిచ్చు దహించివేసింది. ఆ ప్రాంతాల్లో అగ్గి పదే పదే రాజేసుకోవడంతో ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. పర్యాటకులు తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని గ్రీస్ అధికారులను కోరుతున్నారు. మహా దావానలం.. 100 మంది మృతి -
గ్రీస్‌ను గడగడలాడిస్తున్న కార్చిచ్చు
-
మహా దావానలం.. అగ్నికి 100మంది ఆహుతి
ఏథెన్స్ : కార్చిచ్చు ఓ గ్రామాన్ని అతలాకుతలం చేసింది. కొన్ని గంటలపాటు పదుల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఫైర్ సిబ్బంది యత్నించి మంటల్ని అదుపులోకి తెచ్చినా అప్పటికే జరగాల్సిన జరిగిపోయింది. తొలుత 74 మంది మృతిచెందారని భావించినా.. ఆ సంఖ్య 100కు చేరుకోగా , మరో 1000 మందికి కాలిన గాయాలైనట్లు సమాచారం. చనిపోయిన వారిలో ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదం గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని రిసార్ట్ టౌన్ మాటీలో చోటుచేసుకుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు అగ్నికీలలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మంటల్ని అదుపులోకి తెచ్చినా.. పదే పదే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రీస్ అధికారులు వెల్లడించారు. మంటలనుంచి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు బీచ్‌ల వైపు పరుగులు తీయగా, మరోవైపు కార్చిచ్చు వందల ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలను బుగ్గి చేసింది. మాటీ గ్రామంలో 26 మంది అక్కడికక్కడే మంటల్లో ఆహుతైనట్లు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. రెడ్‌క్రాస్‌కు చెందిన ఓ అధికారి మంగళవారం ఘటనకు సంబంధించి పలు విషయాలు తెలిపారు. వేడి కారణంగా అడవుల్లో ఏర్పడ్డ కార్చిచ్చు పట్టణాన్ని మొత్తం ఆహుతి చేసిందన్నారు. ఏథెన్స్ పరిధిలో జరిగిన ఈ దావానలం దేశాన్నే సంక్షోభంలో పడేసింది. ప్రాణభయంతో పర్యాటకుల పరుగులు గ్రీస్ అందాలు చూద్దామనుకుని వస్తే బూడిదే మిగిలిందంటూ ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వాపోతున్నారు. తమ కుటుంబసభ్యులను మంటలు సజీవదహనం చేస్తుంటే.. పరుగెత్తి మా ప్రాణాలు కాపాడుకోవడం తప్పా, ఏం చేయలేకపోయామంటూ మృతుల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవదారు వృక్షాల్లో ఏర్పడ్డ చిన్న మంట.. కార్చిచ్చుగా మారి గ్రామాన్ని మొత్తం బూడిద చేసేశాయని, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దీంతో తమ ప్రాంతానికి తిరిగి వెళ్లేందుకు ఏం చేయాలో అర్థంకాక పలు దేశాలకు చెందిన పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గ్రీస్ సంక్షోభానికి తెర...
ఏథెన్స్: దాదాపు ఎనిమిదేళ్లుగా బెయిలవుట్ ప్యాకేజీలపై నెగ్గుకొస్తున్న గ్రీస్ మొత్తానికి సంక్షోభం నుంచి గట్టెక్కింది. రుణాల చెల్లింపుపై గ్రీస్‌తో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో యూరోజోన్ గ్రూప్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఇచ్చిన రుణాల చెల్లింపు గడువును మరో 10 ఏళ్ల పాటు పొడిగించేందుకు, అదనంగా మరో 15 బిలియన్ యూరోలు అందించేందుకు యూరో జోన్ మంత్రులు అంగీకరించినట్లు యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవహారాల విభాగం కమిషనర్ పియర్ మాస్కోవిచి తెలిపారు. ఈ ఒప్పందంతో మూడో బెయిలవుట్ ప్యాకేజీ నుంచి గ్రీస్ బైటపడేందుకు వెసులుబాటు లభిస్తుంది. మరోవైపు, బెయిలవుట్ నుంచి బైటపడినప్పటికీ... గ్రీస్ నిలదొక్కుకోవాలంటే కఠిన సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఒప్పంద షరతుల కింద 2019లో పింఛనుల్లో మరోసారి కోత విధించేందుకు, ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని తగ్గించేందుకు గ్రీస్ అంగీకరించింది. దీంతోపాటు 75% రుణాలను తిరిగి చెల్లించేదాకా గ్రీస్‌పై ఆర్థిక పర్యవేక్షణ కొనసాగుతుందని యూరోపియన్ కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. 2010 నుంచి గ్రీస్ 273.7 బిలియన్ యూరోల మేర నిధులను బెయిలవుట్ కింద పొందింది. ఈ సంక్షోభం ధాటికి 4 ప్రభుత్వాలు మారాయి. ఎకానమీ 25% క్షీణించింది. నిరుద్యోగిత 20% పైగా ఎగిసింది. -
ఆ సమాధి ఏ కాలానిది?!
సాక్షి, ఏథెన్స్ : మానవ జాతి వృద్ధి ఎక్కడ జరిగింది..? మనిషి ప్రయాణం ఎక్కడనుంచి ఎక్కడకు సాగింది? ప్రపంచంలో పురాతన నాగరికతలు ఏవి? మనిషి నేడు సాధించిన టెక్నాలజీకన్నా.. ఇనుప, కాంస్య యుగంలోవారే.. అధికంగా సాధించారా? ఇటువంటి ప్రశ్నలు మనిషిని అప్పుడప్పుడూ వేధిస్తుంటాయి.. అందుకు అనుగుణంగానే ప్రపంచంలో ఏదోమూల ఏదో ఒక వింత, విశేషం బయటపడుతూ ఉంటుంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్కు 100 కిలోమీటర్ల దూరంలో అత్యంత పురాతన మైనటొక సమాధి బయటపడింది. పురాతనం అనుకుంటే.. ఏదో సాదాసీదా కాదు.. సుమారు 3,500 ఏళ్ల నాటిది అని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. ఈ సమాధి కాంస్య యుగం నాటికి అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమా సమాధి? ఏమిటా కథ? ఈ సమాధి ( చిన్నసైజు డబుల్‌బెడ్ రూం అంత ఉంటుంది) నాటి గ్రీస్‌లోని సంపన్నవర్గానికి చెందినదిగా పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సమాధిలో స్కెల్టెన్కు అత్యంత ఖరీదైన బంగారు ఆభరణాలు, చేతులకు స్వర్ణ కంకణాలు, ఇతర విలువైన సామగ్రి అందులో లభించింది. సమాధిలో..! సమాధిలో చనిపోయిన వ్యక్తికి 40 నుంచి 50 ఏళ్లు ఉంటాయని, మిసీనియన్ నాగరికతకు చెందిన వ్యక్తిగా పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సమాధిలో ఆభరణాలతో పాటు మృణ్మయపాత్రలు, విల్లంబులు, పురాతన మద్యం, బాణసంచా ఉన్నాయి సమాధి నిర్మాణం సమాధి నిర్మాణం కూడా అత్యంత పటిష్టంగా నిర్మించారు. సమాధిని పగలగొట్టడానికి కూడా సాధ్యం కాకుండా.. పెద్దపెద్ద బండరాళ్లతో నాలుగువైపులా.. పైన నిర్మించారు. సమాధి 21 అడుగుల ఎత్తు ఉంటుంది. చుట్టూ బంకమట్టి, ఇతర పదర్థాలతో సిమెంట్లా ప్లాస్టింగ్ చేశారు. ఈ సమాధి వల్ల కాంస్యయుగంలో ముఖ్యంగా గ్రీకు నాగరికత ఎలా విలసిల్లిందో తెలుసుకోవచ్చని ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆనాటి సామాజిక, ఆర్థిక, జీవన విధానాన్ని అర్థం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. -
గ్రీస్‌లో భారీ భూకంపం
గ్రీస్: గ్రీస్ ద్వీపాన్ని శుక్రవారం భారీ భూకంపం అతలాకుతలం చేసింది. తెల్లవారుజామున సంభవించిన భూకంపంలో ఇద్దరు మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. గ్రీస్‌లోని కోస్ ఐలాండ్‌కు చేరువగా భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూకంప తీవ్రత 6.5గా తెలిపారు. భూకంప ధాటికి వందల కొద్ది భవనాలు కోస్లో నేలకొరిగాయి. ముఖ్యంగా కోస్ నగరం దెబ్బతింది. మిగతా ప్రదేశాల్లో జరిగిన నష్టం తక్కువగానే ఉంది. రంగంలోకి దిగిన గ్రీస్ పోలీసులు, విపత్తు నిర్వహణ సంస్ధ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నష్టాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. -
గ్రీస్, టర్కీని కుదిపేసిన భారీ భూకంపం!
భారీ భూకంపం టర్కీ, గ్రీస్ దేశాలను కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంప కేంద్రాన్ని గ్రీక్ ద్వీపంలోని లెస్బోస్లో గుర్తించారు. భూకంపం ధాటికి తీరప్రాంత లెస్బోస్ పట్టణం అతలాకుతలంకాగా, పశ్చిమ టర్కీలోని ఏజియన్ తీరప్రాంతంలోని ఇజ్మీర్ ప్రాంతం కూడా బాగా దెబ్బతింది. భూకంపం ప్రభావంతో ఇజ్మీర్ పట్టణంలో భవనాలు, కట్టడాలు నేలమట్టమయ్యాయి. రోడ్లు రెండుగా చీలిపోయాయి. భూకంప ప్రభావంతో ఓ మహిళ మృతిచెందగా... మరో 10మంది గాయపడ్డారు. భూకంపం కారణంగా అటు గ్రీస్‌లోని లెస్బోస్‌లోనే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. భవనాలు కుప్పకూలడంతో రోడ్లన్నీ మూతపడ్డాయి. ఇక్కడ 500 మంది జనాభా కలిగిన వ్రిసా గ్రామం భూకంపం ధాటికి పూర్తిగా నేలమట్టమైంది. ఇక్కడ చాలా ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. ఇక్కడ ఓ మహిళ భూకంప శిథిలాల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడగా.. పలువురికి సాధారణ గాయాలు అయ్యాయని స్థానిక మేయర్ తెలిపారు. భౌగోళికంగా నెలకొన్న ప్రదేశాల దృష్ట్యా గ్రీస్, టర్కీలో భూమి తరచూ కంపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి తీవ్రత అధికంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ భూకంపం ధాటికి టర్కీ రాజధాని ఇస్తాంబుల్, గ్రీస్ నగరం ఎథెన్స్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 2011లో టర్కీలోని వాన్ ప్రావిన్స్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో భయంకరమైన భూకంపం 1999లో వచ్చింది. అప్పట్లో 20వేల మంది చనిపోయారు. -
బాంబు భయానికి 70 వేల మంది ఖాళీ
తెస్సాలోనికి: గ్రీసులో బయటపడిన రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబును నిర్వీర్యం చేయడానికి తెస్సాలోనికి అనే పట్టణం నుంచి సుమారు 70 వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించే ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. 250 కిలోలున్న ఈ బాంబును గత వారం రోడ్డు పనుల సందర్భంగా గుర్తించారు. తొలుత 20 అంబులెన్స్ లలో 300 మంది వికలాంగులను, రోగులను తరలించారు. బాంబు ఉన్న ప్రదేశానికి 1.9 కి.మీ పరిధిలో ఉన్న ప్రజలందరినీ ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల కల్లా తరలించాల్సి ఉంది. గ్రీస్‌లో జన సమ్మర్థ ప్రాంతాల్లో ఇంతకు ముందెప్పుడూ ఇంత పెద్ద బాంబును గుర్తించలేదని, అందుకే ప్రజల తరలింపు తప్పట్లేదని ఓ అధికారి తెలిపారు. బాంబును నిర్వీర్యం చేయడానికి సుమారు 8 గంటలు పట్టొచ్చని మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం వేల సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించారు. -
వావ్...‘అమ్మ’మ్మా...
తన కూతురి కోసం.. ఓ తల్లి ఎవరూ చేయని సాహసం చేసింది. 67 ఏళ్ల వయసులో సరొగేట్ తల్లిగా మారి.. ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత పెద్దవయసులోని సరొగేట్ తల్లిగా ఆమె నిలిచింది. ఈ ఘటన గ్రీస్‌లో జరిగింది. ఏడున్నర నెలల గర్భం అనంతరం సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు. ఆ బిడ్డ పుట్టినప్పుడు 1.2 కిలోల బరువుంది. ఇప్పుడు తనకు తల్లిలా కంటే అమ్మమ్మలాగే ఎక్కువ అనిపిస్తోందని అనస్టాసియా ఓంటు అనే ఆ వృద్ధురాలు చెప్పారు. ఈమె మధ్య గ్రీస్‌లోని లారిసా అనే గ్రామానికి చెందినవారు. గర్భం దాల్చిన సమయంలో తాను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నానన్నారు. తన కూతురు సొంత బిడ్డను కనలేదని తెలిసినప్పుడు ఆమె గుండె పగిలేలా ఏడ్చిందని అనస్టాసియా అన్నారు. విషయం ఏమిటంటే.. ఆమె కూతురు కాన్స్టాంటినా (43) కేన్సర్ కారణంగా 2009లోనే మరణించింది. అంతకుముందు ఆమెకు ఏడుసార్లు గర్భం పోయింది. దాంతో.. ఆమె చనిపోవడానికి ముందు.. ఆమె బిడ్డకు తాను తల్లినవుతానని చెబితే ఏమాత్రం నమ్మలేకపోయిందని, కానీ తాను చాలా ధైర్యం చేసి ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అంతర్జాతీయ రికార్డులను బట్టి చూస్తే, ఇప్పటివరకు ఇంత పెద్ద వయసులో సరొగేట్ మదర్‌గా ఎవరూ లేరని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ పాంటోస్ తెలిపారు. ఇది ప్రత్యేకమైన కేసు కావడంతో కోర్టు కూడా అనుమతి తెలిపిందని, ఆ తర్వాత తాను ముందుకెళ్లానని ఆయన వివరించారు. -
గ్రీస్‌లో భారీ వర్షాలు
-
అద్భుతం! ఆ సిటీని మనుషులు కట్టలేదు!
సముద్రం అంతర్భాగంలో ఉన్న ఆ నిర్మాణాన్ని తొలిసారి గుర్తించిన డైవర్లు.. ఇదేదో ప్రాచీన నగరమై ఉంటుందని భావించారు. భవంతులు, వాటి చుట్టు ఉన్న ప్రాంగణాలు, ఎత్తైన ప్రాకారాలను పోలిన కట్టడాలను చూసి.. ఏ పూర్వ నాగరికతకు చెందిన నగరమో ఇది అయి ఉంటుందని, కాలక్రమంలో ధ్వంసమై సముద్రంలో మునిగిపోయి ఉంటుందని అనుకున్నారు. ఈ కట్టడాలను గ్రీకు దేశంలోని జకింథోస్ వేసవి ద్వీపంలో ఇటీవల డైవర్స్ గుర్తించారు. సముద్ర అంతర్భాగంలోని ప్రాచీన గ్రీకు నగరంగా మొదటి నుంచి భావిస్తున్న ఈ కట్టడాలకు సంబంధించి తాజా పరిశోధనలు అనేక విషయాలు వెలుగుచూశాయి. ఇది ప్రాచీన గ్రీకు నగరం కాదని, సహజసిద్ధంగా ఏర్పడిన కట్టడమని పరిశోధకులు గుర్తించారు. 50 లక్షల సంవత్సరాలకు పూర్వం నవీన రాతియుగంలో ఇది ఏర్పడి ఉంటుందని, ఇది ప్రకృతి చేసిన అద్భుతమని వారు తెలిపారు. సముద్రంలో గుర్తించిన ఈ ప్రదేశాన్ని మొదట మునిగిపోయిన ప్రాచీన నగరంగా భావించారని, కానీ అక్కడ ఎలాంటి జీవ ఉనికి లభించలేదని, ఇది సహజసిద్ధంగా ఏర్పడిన ప్రదేశమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఇంగ్లండ్ ప్రొఫెసర్ జులియన్ ఆండ్య్రూస్ తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను జర్నల్ మెరీన్ అండ్ పెట్రోలియం జియోలజీ పత్రికలో ప్రచురించారు. -
ఈసారి 450మందిని మింగేసింది
జెనీవా/స్విట్జర్లాండ్: గ్రీస్ సముద్ర జలాల్లో మరో భారీ విషాదం చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700మందిలో సగానికిపైగా జలసమాధి అయినట్లు తెలుస్తోంది. సిరియా యుద్ధ భయంతో ఆ దేశానికి చెందిన ప్రజలంతా శరణార్థులుగా సమీప దేశాలకు ప్రాణభయంతో సముద్రాల మీదుగా వెళ్తున్న విషయం తెలిసిందే. అది కూడా పరిమితిమించిన సంఖ్యతో. ఈ నేపథ్యంలోనే శుక్రవారం గ్రీక్ ద్వీపంలోని తీరంలో 700 మందితో వస్తున్న పెద్ద నౌక ఒకటి అనూహ్యంగా మునిగిపోయినట్లు శరణార్థుల ప్రపంచ సంస్థ ఒకటి వెల్లడించింది. కాగా, వీరిలో 250మందిని రక్షించినట్లు సమాచారం. మిగితా వందల సంఖ్యలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో ఏ ఒక్కరు బతికి ఉన్నట్లు అధికారులు చెప్పడం లేదు. -
కంట నీరు పెట్టిన పోప్ ఫ్రాన్సిస్
లెస్బోస్(గ్రీస్): ‘మీరు ఒంటరి కాదు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు’ అంటూ గ్రీకులోని లెస్బోస్ ద్వీపంలో చిక్కుకున్న శరణార్థులకు పోప్ ఫ్రాన్సిస్ భరోసా ఇచ్చారు. వలసల సమస్యలు పరిష్కరించడానికి మానవత్వంతో సమిష్టిగా ముందుకు రావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అంతర్గత యుద్ధంతో సిరియా నుంచి పారిపోయి ఇక్కడి ఓడ రేవులో తలదాచుకున్న శరణార్థుల స్థావరాన్ని ఎక్యుమెనికల్ పాట్రియార్క్, గ్రీస్ చర్చ్ హెడ్, ఆర్చిబిషప్ ఐరోనిమస్‌తో కలసి శనివారం పోప్ సందర్శించారు. అక్కడున్నవారి దురవస్థను చూసి చలించిన పోప్ కంట నీరు పెట్టారు. దౌత్య, రాజకీయ మార్గాల ద్వారా ఈ సంక్షోభాన్ని అంతర్జాతీయ సమాజం, స్వచ్ఛంద సంస్థలు ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుతూ ముగ్గురు మత పెద్దలూ ఓ తీర్మానంపై సంతకం చేశారు. ‘మేము కూడా సముద్రమనే శ్మశానానికి వెళుతున్నాం. తలదాచుకునేందుకు సముద్ర మార్గంలో బయలుదేరిన చాలామంది జాడ లేకుండా పోయారు’ అని లెస్బోస్ బయలుదేరే ముందు పోప్ ఆవేదనగా చెప్పారు. లెస్బోస్లో అడుగుపెట్టిన ఫ్రాన్సిస్‌కు శరణార్థ శిబిరంలోని చిన్నారులు, మహిళలు, వృద్ధులు స్వాగతం పలికారు. చిన్నారులు కొన్ని చిత్రాలు వేసి పోప్‌కు బహూకరించారు. శిబిరంలో ఒకరు ఆశీర్వదించమంటూ కన్నీటితో పోప్ పాదాలపై పడ్డారు. మరికొందరు తమకు విముక్తి కల్పించమంటూ పెద్దగా అరుస్తూ వేడుకున్నారు. యూరప్‌కు గుణపాఠం... గ్రీస్ సందర్శించిన పోప్ ఫ్రాన్సిస్ అక్కడి శరణార్థుల శిబిరంలోని 12 మంది సిరియా ముస్లింలను తన చార్టర్ విమానంలో ఇటలీకి తీసుకువచ్చారు. తద్వారా శరణార్థులను ఎలా ఆదరించాలో యూరప్‌కు గుణపాఠం నేర్పారు. ఆరుగురు చిన్నారులు సహా మూడు కుటుంబాలకు చెందిన వీరికి హోలీ సీ మద్దతు తెలిపింది. ఇటలీ కేథలిక్ శాంటెజిదియో సమాజం వారి బాధ్యతలు తీసుకుంది. -
22 గంటల్లో ఆమెను 110 మంది రేప్ చేశారు!
-
గ్రీసులో మరో వలస విషాదం
ఏథెన్స్: ఏజియన్ సముద్రంలో రెండు పడవలు మునిగిపోయిన ఘటనలో 42 మంది వలసదారులు మృతి చెందారు. టర్కీ నుండి గ్రీసుకు సామర్థ్యానికి మించి వలసదారులతో పడవలు వెళ్తుండగా.. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఈ ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. గ్రీసు ద్వీపం కలోలిమ్నస్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 34 మంది మృతి చెందారు. వీరిలో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఫార్మకోనిసి ద్వీపం సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. గల్లంతైన వారికోసం గ్రీసు తీరప్రాంత భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇరాక్, సిరియా సంక్షోభం నేపథ్యంలో గత ఏడాది కాలంగా పది లక్షల మందికి పైగా ప్రజలు యూరప్‌కు వలస వెళ్లారు. ఈ క్రమంలో ఏజియన్ సముద్రంలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 700 మంది వలసదారులు మృతి చెందారు. గతంలో టర్కీకి చెందిన అలాన్ కుర్థి అనే బాలుడు విగత జీవిగా గ్రీసు తీరానికి కొట్టుకురావడం ప్రపంచవ్యాప్తంగా కలచివేసిన విషయం తెలిసిందే. -
22 గంటల్లో ఆమెను 110 మంది రేప్ చేశారు!
ఏథెన్స్: గ్రీకు దేశానికి ఆమె విహారయాత్ర జీవితంలో మరిచిపోలేని 'పీడకల'గా మారింది. 14 ఏళ్ల మేగన్ స్టీఫెన్స్ (పేరు మార్చారు) తన తల్లితో కలిసి 2009లో గ్రీస్ పర్యటనకు వెళ్లింది. కానీ విహారయాత్ర కాస్తా ఆమె పాలిట విషాదయాత్రగా మారింది. జీవితానికి సరిపడ నరకయాతనను మిగిల్చింది. మేగన్‌ను ఆమె ప్రియుడే 'సెక్స్ బానిస'గా అమ్మేశాడు. దీంతో ఆరేళ్లపాటు వేశ్యగా నరకయాతన అనుభవించిన మేగన్ ఎట్టకేలకు తప్పించుకొని బయటపడింది. ఇప్పుడు ఆ నరకయాతన, వ్యభిచార కూపపు అనుభవాలను మారుపేరుతో 'బాట్ అండ్ సోల్డ్'గా పుస్తకరూపంలో ప్రచురించింది. ఒక వ్యభిచారిగా తాను అనుభవించిన హృదయవిదారకమైన దుస్థితిని ఈ పుస్తకంలో మేగన్ వివరించింది. రోజుకు 50 మందితో పడుకునేలా ఆమెపై ఒత్తిడి తెచ్చేవారు. ఒక్కోసారి 22 గంటల్లో 110 మంది ఆమెతో బలవంతంగా శృంగారించేవారు. అక్రమ మానవ రవాణా దుండగులు మేగన్‌ను అనేకసార్లు అమ్మివేశారు. కొన్నిసార్లు వీధుల్లో, మరికొన్ని బ్రోతల్ గృహాల్లో ఆమె పడుపు వృత్తిని చేయాల్సి వచ్చింది. 14 ఏళ్ల వయస్సులో గ్రీకు వచ్చినప్పటి అనుభవాలను మేగన్ ఈ పుస్తకంలో వివరించింది. అప్పుడు తల్లితో కలిసి వచ్చిన ఆమె ఓ గ్రీకు బార్లో జాక్ (22)ను తొలిసారి కలిసింది. అప్పటికే ప్రేమ కోసం తహతహలాడుతున్న మేగన్ అతన్ని తొందరగానే వలచింది. తల్లికి జాక్ నచ్చకపోయినా అతనితో కలిసి ఉండేందుకు అంగీకరించింది. ఎందుకంటే ఆమె బార్ ఓనర్ నికోస్‌తో అప్పట్లో సన్నిహితంగా ఉండేది. విహారయాత్ర ముగిసాక జాక్‌తో గ్రీకులోనే ఉండిపోతానని మేగన్ తల్లిని ఒప్పించింది. తన అధీనంలోకి వచ్చిన తర్వాత టాప్‌లెస్ (అర్థనగ్న) బార్లో నర్తించాల్సిందిగా మేగన్‌ను జాక్ ఒత్తిడి తెచ్చాడు. అందువల్లే వచ్చే డబ్బుతో తన తల్లికి చికిత్స చేయిస్తానని బుకాయించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో చితకబాది బ్రోతల్ హౌస్ కి అమ్మేశాడు. క్రమంగా ఆమె పడుపువృత్తిలోకి నెట్టివేయబడింది. ఆమెతో ఐదు నిమిషాలు గడిపితే ఒక విటుడు 20 జీబీపీ (గ్రీకు కరెన్సీ) ఇచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో 22 గంటలపాటు ఏకధాటిగా ఈ వృత్తి కొనసాగేది. దాదాపు 110 మందితో ఆమె శంగారంలో పాల్గొనేలా దారుణాతి దారుణంగా అక్కడ పరిస్థితులు ఉండేవని మేగన్ తన పుస్తకంలో ఆ చీకటి అనుభవాలను గుర్తుచేసుకుంది. ఆ తర్వాత ఎలాగోల బయటపడి తిరిగి బ్రిటన్ వచ్చిన మేగన్ తల్లిని కలుసుకుంది. ఇప్పుడు 25 ఏళ్ల ఆమె ఓ వ్యక్తిని పెళ్లాడి గర్భవతి అయింది. అక్రమ రవాణా బారినపడి నరకయాతన అనుభవిస్తున్న అభాగ్యులైన మహిళలకు చేయూత అందించేందుకు ఓ చారిటీని స్థాపించాలని మేగన్ భావిస్తోంది. -
గ్రీకులో భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదు
ఏథెన్స్ : గ్రీకు పశ్చిమ భాగంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైందని గ్రీకు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. లెఫ్కడ ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందా లేదా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప కేంద్రం మధ్యధరాసముద్రంలో ఏర్పడి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
బయటపడినా భయం వీడలేదు
-
కంటి ముందు నుంచి మాయం కాని దృశ్యం... పాలినోప్సియా!
మెడి క్షనరీ ఏదైనా దృశ్యం మన కళ్ల ముందు కనిపించిందనుకోండి. అది మన దృష్టి నుంచి తప్పుకుపోయిన తర్వాత కూడా అదే దృశ్యం కంటి ముందే కొనసాగుతుందనుకోండి. ఆ కండిషన్‌ను పాలినోస్పియా అంటారు. గ్రీకు భాషలో పాలిన్ అంటే మళ్లీ మళ్లీ లేదా పదే పదే అని అర్థం. ఇక ఓప్సియా అంటే చూడటం. ఉదాహరణకు ఒక పులిని అకస్మాత్తుగా చూశామనుకోండి. అది మన దృష్టిపటలం నుంచి తప్పుకుపోయినా మన ఎదురుగా అదే ఉన్నట్లు భ్రాంతి పొందే భావనను ‘పాలినోప్సియా’ అంటారు. కొందరిలో ఈ తరహా భావన మామూలుగానే ఉంటుంది. ఉదాహరణకు మన కంటి ముందు కెమెరాఫ్లాష్ వెలిగి ఆరిన తర్వాత కూడా అదే వెలుగు కంటి ముందు కొనసాగుతుంది. అయితే ఈ భ్రాంతి దీర్ఘకాలం కొనసాగితే అప్పుడు వాళ్లకు వైద్యసహాయం అవసరమవుతుంది. కొందరిలో ఇది తలకు దెబ్బతగలడం వల్ల, ఏవైనా మందులు వాడటం వల్ల, ఏ కారణం లేకుండా (ఇడియోపథిక్గా) కూడా జరుగుతుంది. -
అర్ధరాత్రి మృత్యుసాగర తీరంలోకి..
-
గ్రీకువీరుడి సమాధిలో భారీ నిధి!
ఎథెన్స్: దాదాపు 3500 ఏళ్ల నాటి ప్రాచీన వీరుడి సమాధిని తాజాగా గ్రీస్ లో గుర్తించారు. 3500 ఏళ్ల నుంచి చెక్కుచెదరకుండా ఉన్న ఈ సమాధిలో నాటి వీరుడి అస్థిపంజరంతోపాటు భారీ నిధి కూడా లభించింది. అమెరికాకు చెందిన ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరిపి ఈ సమాధిని కనుగొన్నారు. గ్రీస్ లో గత 65 ఏళ్లలో కనుగొన్న ప్రాచీన అవశేషాలలో ఇదే అత్యంత కీలకమైనదని గ్రీకు సాంస్కృతిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. గ్రీస్ లోని పెలొపొన్నెస్ ప్రాంతంలో ఉన్న మైసినెయిన్ రాజభవనం వద్ద చెక్కతో చేయబడిన శవపేటికలో ఆనాటి సైనికుడి ఆస్థిపంజరం బయటపడింది. ఈ సైనికుడి గురించి ప్రస్తుతం ఎలాంటి వివరాలు తెలియకపోయినా.. తన కాలంలో అతను ముఖ్య వ్యక్తి అయి ఉంటాడని భావిస్తున్నారు. మెలిమి బంగారు నగలు, మంచి ముత్యాలు, వెండి ఖడ్గంతోపాటు అతన్ని ఖననం చేశారు. వీటితోపాటు ఎనుగు దంతంతో చేసిన హ్యాండిల్, దువ్వెనలు, వెండి పళ్లెము అతని శవపేటికలో ఉంచారు. క్రెట్ ద్వీపంలో క్రీస్తుపూర్వం 2000 ఏళ్ల కిందట వర్ధిల్లిన నాగరికతను పోలినవిధంగా దేవతా విగ్రహాలు, జంతువులు, పువ్వుల బొమ్మలతో ఈ నగలు రూపొందించారు. మినోయన్స్ నాగరికతగా పేరొందిన ఆనాటి కాలానికి సంబంధించి 1400 వస్తువులు దొరికాయని, మినోయన్స్ నాగరికత త్వరాత మైసినియన్ నాగరికతగా పరిణామం చెందిందని సిన్సినాటి యూనివర్సిటీ ఆర్కియాలజిస్టులు జాక్ ఎల్ డేవిస్, షరాన్ ఆర్ స్టాకర్ తెలిపారు. -
ఆటగాడితో ఆడుకున్నారు..
గ్రీస్: మందకొడిగా సాగుతున్న ఫుట్ బాల్ మ్యాచ్ మీద నిరాసక్తతో వైద్య సిబ్బంది ఓ ఆటగాడిపై తమ ప్రతాపం చూపించింది. గాయాలైన ఆటగాడు అని కూడా చూడకుండా దురుసుగా వ్యవహరిస్తూ పలుమార్లు స్ట్రెచ్చర్ పైనుంచి కిందపడేశారు. దీంతో గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ కన్నా ఈ సంఘటన ఎక్కువగా ఆసక్తి కలిగించింది. ఈ ఘటన గ్రీక్ సెకండ్ గ్రేడ్ డివిజన్ లీగ్ మ్యాచ్ లో భాగంగా రెండు జట్ల మధ్య శనివారం మ్యాచ్ నడుస్తుండగా చోటు చేసుకుంది. గాయాల కారణంగా ఆటగాళ్లు నిదానంగా ఆడుతుండటంతో మ్యాచ్ చప్పగా సాగుతోంది. అయితే ఒక ఆటగాడికి మ్యాచ్ మధ్యలో నడుం పట్టేయడంతో.. సహాయం కోరగా గ్రౌండ్లోకొచ్చిన వైద్యసహాయ సిబ్బంది అతన్ని ఎంత తొందరగా పిచ్ బయట వదిలేద్దామా అని ఉరుకులు పరుగులుగా అతన్ని స్ట్రెచ్చర్ పై తీసుకెళ్లారు. అయితే వేగంగా వెళ్లే క్రమంలో ఆటగాన్ని రెండుసార్లు కింద పడేసి, చివరకు పిచ్ బయటకు వచ్చే సరికి స్రెచ్చర్ తో పాటూ అతన్ని కిందపడేశారు. -
శరణార్థులకు 'శరణెక్కడ'
-
అధికారపార్టీలో భారీ చీలిక
ఎథెన్స్: ఆర్థిక సంక్షభం అనంతరం తలెత్తిన రాజకీయ సంక్షోభం గ్రీస్‌ను అతలాకుతలం చేస్తున్నది. ప్రధాని పదవికి రాజీనామాచేసి, మరోసారి ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రకటించిన సిరిజా పార్టీ అధ్యక్షుడు అలెక్సిస్ సైప్రస్‌కు శుక్రవారం మరో ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీలో సైప్రస్ వ్యతిరేకులుగా ముద్రపడ్డ దాదాపు 25 మంది ఎంపీలు.. సిరిజా పార్టీని వీడి వేరు కుంపటిపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టా నియా డైలీ పత్రిక సైతం ఈ విషయాన్ని నిర్ధారించింది. చీలిక ఎంపీల బృందం.. లెయికీ అనోటితా (ప్రఖ్యాత కూటమి) పేరుతో కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమయింది. దీనికి మాజీ విద్యుత్ శాఖ మంత్రి పానజియోటిస్ లఫాజనిస్ నేతృత్వం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో 300 స్థానాలున్న గ్రీక్ పార్లమెంట్లో సిరిజా పార్టీకి 149 స్థానాలు రాగా, 76 స్థానాలతో న్యూ డెమోక్రసీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. లెయికీ లనోటితా పార్టీ ఏర్పాటుతో గ్రీస్ రాజకీయ గమనం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. యూరోజోన్‌తో బెయిల్ అవుట్ ప్యాకేజీపై సొంతపార్టీలోనే వ్యతిరేకత రావడంతో గ్రీసు ప్రధాని అలెక్సిస్ సైప్రస్ గురువారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మెత్తం ప్రక్రియలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని ప్రజలకు వివరించిన ఆయన.. తర్వాతి ఎన్నికలు సెప్టెంబర్ 20న నిర్వహించనున్నట్లు చెప్పారు. -
గ్రీస్‌కు మరో తలపోటు
తాహతుకు మించి అప్పులు చేసి రుణదాతల నుంచి ఒత్తిడి ఎదుర్కొని.. కొత్త అప్పుతో తిరిగి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గ్రీస్‌కు మరో తలపోటు పెరిగింది. అంతర్యుద్ధంతో అట్టుడికిపోతోన్న లిబియా, సిరియా, ఆఫ్ఘన్ లాంటి దేశాల నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు గ్రీస్‌కు తరలిరావడమే ఇందుకు కారణం. ఇప్పటికే సంక్షేమ పథకాలు, పెన్షన్లలో భారీ కోతలు విధించి ఎలాగోలా కాలం నెట్టుకొస్తున్న సైప్రస్ ప్రభుత్వం.. వెల్లువలా దూసుకొస్తున్న వలసలను ఎలా అడ్డుకోవాలో అర్థంకాక మిన్నకుండిపోయింది. దీంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు జారీచేసింది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల సహాయ కమిషన్ (యూఎన్‌హెచ్‌సీఆర్) అధికార ప్రతినిధి విలియం స్ప్లిండ్లర్ మంగళవారం జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. గడిచిన వారం రోజుల్లోనే దాదాపు 21 వేల మంది శరణార్థులు గ్రీస్ లోకి ప్రవేశించారని, జనవరి 1 నుంచి ఆగస్టు 14 వరకు గ్రీస్‌కు వచ్చిన వలసదారుల సంఖ్య 15 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. వీరంతా ఏజియన్ సముద్రం గుండా గ్రీస్ ద్వీపాల్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రధాన భూభాగానికి తోడు దాదాపు 6 వేల ద్వీపాలు కూడా గ్రీస్ దేశంలో భాగంగా ఉన్నాయి. చెల్లాచెదురుగా విస్తరించిన ఈ ద్వీపాల వద్ద సైన్యాల మోహరింపు పరిమిత స్థాయిలో ఉండటం కూడా వలసదారుల పనిని సులువు చేసింది. సాధారణంగా శరణార్థులు లిబియా తీరం నుంచి మధ్యదారా సముద్రం గుండా యూరప్‌కు చేరుకుంటారు. అయితే గత కొద్దికాలంగా ఆ మార్గంలో పడవ ప్రమాదాలు జరిగి భారీ సంఖ్యలో శరణార్థులు చనిపోయారు. దీంతో యూరప్ కు వలసపోయేందుకు శరణార్థులు కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు. అటు ద్వీపాలతోపాటు ప్రధాన భూభాగంలోనూ భద్రతను కట్టుదిట్టం చేసి వలసలను నిరోధించకపోతే గ్రీస్‌కు మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు విలియం స్ప్లిండ్లర్. -
గ్రీస్‌లో పన్నుల మోత
- మళ్లీ తెరుచుకున్న బ్యాంకులు... - ఏటీఎం పరిమితుల సడలింపు... ఏథెన్స్: తాజాగా తీసుకుంటున్న బెయిలవుట్ ప్యాకేజీకి ప్రతిగా రుణదాతల షరతుల ప్రకారం గ్రీస్ కఠిన సంస్కరణల అమలు, పన్నుల మోత మోగింపు మొదలుపెట్టింది. చక్కెర మొదలుకుని కండోమ్స్, ట్యాక్సీలు, దహన సంస్కారాల దాకా అన్ని రకాల వస్తువులు, సేవలపైనా పన్నులను 13% నుంచి ఏకంగా 23%కి పెంచేసింది. అయితే, ఔషధాలు, పుస్తకాలు, పత్రికలు వంటి కొన్నింటిపై మాత్రం 6.5% నుంచి 6%కి తగ్గించింది. మరోవైపు, 3 వారాలుగా మూతబడిఉన్న గ్రీస్ బ్యాంకులు మళ్లీ తెరుచుకున్నాయి. 60 యూరోల రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని కాస్త సడలించి శుక్రవారం దాకా రోజుకు గరిష్టంగా 300 యూరోల దాకా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు గ్రీస్ బ్యాంకుల అసోసియేషన్ హెడ్ లూకా కట్సెలీ తెలిపారు. ఆ తర్వాత నుంచి దీన్ని 420 యూరోలకు పెంచనున్నట్లు వివరించారు. విదేశీ బ్యాంకులకు నగదు బదలాయింపు, కొత్త అకౌంట్లను తెరవడంపై నిషేధం మొదలైనవి కొనసాగనున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున విత్‌డ్రాయల్స్ చేయకుండా జూన్ 29 నుంచి బ్యాంకులను మూసివేసిన సంగతి తెలిసిందే. మూసివేత కారణంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న గ్రీస్ ఆర్థిక వ్యవస్థకి సుమారు 3 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. అటు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు(ఈసీబీ), అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లకు రుణాల చెల్లింపును గ్రీస్ ప్రారంభించింది. తమకు రావాల్సిన 2 బిలియన్ యూరోలను గ్రీస్ చెల్లించినట్లు ఐఎంఎఫ్ తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి 7.16 బిలియన్ డాలర్ల తాత్కాలిక రుణం లభించడంతో పాత బకాయిల చెల్లింపులకు గ్రీస్‌కు వెసులుబాటు లభిస్తోంది. -
గ్రీకు ట్రాజెడీ!
నమ్మకద్రోహానికి నిర్వచనం ఉండదు. అది ఫలానా రూపంలోనే ఉంటుందని చెప్పడం సాధ్యపడదు. ఈ సంగతిని గ్రీస్ చాలా ఆలస్యంగా గ్రహించింది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. గ్రీస్ ఇక పరాధీన. అప్పులిచ్చినట్టే ఇచ్చి దేశాన్ని పీల్చిపిప్పి చేసిన ‘యూరోత్రయం’ యూరొపియన్ సెంట్రల్ బ్యాంకు, యూరొపియన్ కమిషన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల ముందు అది నిస్సహాయంగా మోకరిల్లింది. ఊహించని రీతిలో తన సార్వభౌమత్వం తాకట్టుపడటాన్ని చూసి నిర్ఘాంతపోయింది. గత పక్షం రోజులుగా ఊహించని రీతిలో వేగంగా సంభవించిన పరిణామాల్లో గ్రీస్ ప్రధాని అలెక్సీ సిప్రాస్ యూరొపియన్ యూనియన్ పెట్టిన కఠిన షరతులన్నిటికీ అంగీకరిస్తున్నట్టు ప్రకటించడమే కాక... వారు కోరినట్టుగా పార్లమెంటులో అందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి గురువారం ఆమోదం కూడా పొందారు. పర్యవసానంగా దేశంలో ఇకపై అమలు కాబోయే పొదుపు చర్యలు గతంలో ఎన్నడూ లేనంత కఠినంగా ఉండబోతున్నాయి. పన్నులు భారీగా పెంచడం, ప్రభుత్వ వ్యయంలో...ముఖ్యంగా పింఛన్లలో గణనీయంగా కోత... కార్మిక సంఘాల ఏర్పాటుకు సంబంధించిన చట్టాలను కఠినం చేయడం వగైరా అందులో ముఖ్యమైనవి. రిఫరెండానికి ముందు ప్రభుత్వ వ్యయంలో 900 కోట్ల యూరోల కోత విధించాలన్న ఈయూ...గ్రీస్ పాదాక్రాంతమయ్యేసరికి దాన్ని 1,300 కోట్ల యూరోలకు పెంచింది! గత నెల 30 నాటికి యూరోత్రయానికి చెల్లించాల్సిన 170 కోట్ల డాలర్ల వాయిదా మొత్తాన్ని తీర్చలేమని సిప్రాస్ ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఈ మొత్తం డ్రామాకు తెరలేచింది. దేశంలో పొదుపు చర్యల పేరిట అమలవుతున్న కోతలపై సమరశంఖం పూరించి అధికారంలోకొచ్చిన సిప్రాస్ ప్రభుత్వం దేశాన్ని తాకట్టు పెట్టబోమని విస్పష్టంగా ప్రకటించింది. జనం దాన్ని విశ్వసించారు. అందుకే ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ సిరిజాకు అధికారం కట్టబెట్టారు. అధికార పగ్గాలు చేపట్టిన నాటినుంచీ సిప్రాస్, ఆర్థికమంత్రి యానిస్ వరోఫాకిస్లు బెర్లిన్ నుంచి బ్రస్సెల్స్ వరకూ అలుపు లేకుండా తిరిగారు. అసాధ్యమైనదేదో వారు సాధించుకొస్తారని దేశం మొత్తం ఈ ఆర్నెల్లూ ఎదురుచూసింది. షరతులన్నిటినీ అంగీకరించడానికి తాము సిద్ధమేనని... అందుకు కాస్త సమయం కావాలని ఈయూను కోరుతూ సిప్రాస్ రాసిన లేఖ వెల్లడై మధ్యలో అలజడి బయల్దేరినా పరిస్థితి సద్దుమణిగింది. వామపక్ష భావాలున్న యువ నేతలు తమ ఆశల్ని వమ్ము చేయరన్న విశ్వాసం పౌరుల్లో ఉంది. అందుకు తగినట్టుగా సిప్రాస్ కూడా ఈ నెల 5న రిఫరెండం నిర్వహించారు. అందులో వ్యక్తమయ్యే జనాభిప్రాయానికి అనుగుణంగానే తమ తదుపరి చర్యలుంటాయని, అవసరమైతే ఈయూనుంచి బయటికొస్తామని సిప్రాస్ ప్రకటించారు. అంతేకాదు... ఈయూ షరతులకు తలొగ్గరాదని జనానికి పిలుపునిచ్చారు. ఇదంతా ప్రజల్లో ఉత్సాహం కలిగించింది. యూరోత్రయం షరతులను రిఫరెండంలో 61 శాతంమంది...అంటే మూడింట రెండువంతుల మంది తిరస్కరించారు. ప్రజాస్వామ్యాన్ని ఎవరూ బ్లాక్మెయిల్ చేయలేరని రుజువైనట్టు సిప్రాస్ వ్యాఖ్యానించడంతో ఈయూ అయోమయంలో పడింది. రిఫరెండం ఇచ్చిన బలాన్ని ఆసరా చేసుకుని ఈయూ దేశాలతో, మరీ ముఖ్యంగా జర్మనీతో సిప్రాస్ బేరసారాలాడి వాటి మెడలు వంచుతారనుకుంటే అందుకు భిన్నంగా జరిగింది. గ్రీస్ చరిత్రలోనే ఎన్నడూలేని స్థాయి సంస్కరణలకు ఆయన అంగీకరించారు. కామాలు, ఫుల్స్టాప్లతోసహా దేన్నీ మార్చకుండా తాము చెప్పిన రీతిలో పార్లమెంటు తీర్మానం చేస్తేనే తదుపరి బెయిలవుట్ ప్యాకేజీ ఉంటుందని ఈయూ తేల్చిచెప్పింది. 17 గంటలపాటు కొనసాగిన అసాధారణ సమావేశంలో ఇందుకు సంబంధించిన పత్రాలు సిద్ధమయ్యాయి. గ్రీస్ పాలనా వ్యవస్థను ‘రాజకీయ ప్రభావం’నుంచి తప్పించాలన్నది అందులో ప్రధానమైనది. దాని ప్రకారం పొదుపు చర్యలు, ప్రైవేటీకరణ వంటివన్నీ ఈయూ నియమించిన కమిటీ పర్యవేక్షిస్తుంది. సిప్రాస్ ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందానికి భిన్నంగా పార్లమెంటు భవిష్యత్తులో ఏ తీర్మానం చేసినా ఈ కమిటీ దాన్ని వీటో చేస్తుంది. అంతేకాదు...పార్లమెంటు ముందు ప్రవేశపెట్టబోయే ఏ బిల్లునైనా ముందుగా కమిటీకి చూపి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ వ్యయం పెంచదల్చుకుంటే ఆ మేరకు ఆదాయం పెంపును కూడా చూపాల్సి ఉంటుంది. పారిశ్రామిక రంగంలో సమ్మెలపై ఆంక్షలు, ఈయూ విధానాలకు అనుగుణంగా కార్మిక చట్టాలు, నిబంధనలు ఉండేలా చూడటం...పింఛన్లలో కోత, మరింత ఆదాయాన్ని పెంచేలా పన్నుల సంస్కరణలు వగైరాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రీస్‌కు చెందిన 5,000 కోట్ల యూరోల విలువ చేసే పోర్టులు, విమానాశ్రయాలు, గ్రీస్ దీవులు వగైరా ప్రజా ఆస్తుల నిర్వహణను గ్రీస్ వెలుపలి తటస్థ సంస్థకు అప్పగించాలి. ఇప్పటికే రెండు దఫాల పొదుపు చర్యలతో కుంగిపోయి ఉన్న గ్రీస్ పౌరులు ఈ కఠిన షరతులతో మరింతగా కుప్పకూలడం ఖాయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సాక్షాత్తూ ఐఎంఎఫ్ సంస్థే ఈ షరతులవల్ల పనికాదని తేల్చింది. వచ్చే రెండేళ్లలో గ్రీస్ జీడీపీలో రుణం 200 శాతం కాబోతున్నదని అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రీస్ చెల్లించాల్సిన రుణాలను దీర్ఘకాలం పాటు వాయిదావేసి, దాని ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి అవసరమైన నిధులను అందించడమే మార్గమని అంటున్నది. ఈ వ్యవహారంలో సిప్రాస్‌ను సమర్థిస్తున్నవారూ ఉన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గ్రీస్ ఈయూ నుంచి తప్పుకుంటే దాని కరెన్సీ విలువ అత్యంత కనిష్ట స్థాయికి చేరుతుందని, అది దేశాన్ని పెను ప్రమాదంలోకి నెడుతుందని వారి వాదన. గ్రీస్ నిష్ర్కమిస్తే ఈయూ సైతం సంక్షోభంలో కూరుకుపోతుందన్నది నిజం. ఈ స్థితిని గమనించి దేశ పౌరులిచ్చిన బలంతో రాజకీయంగా దృఢ సంకల్పాన్ని ప్రదర్శించడానికి బదులు సిప్రాస్ చివరకు దేశ సార్వభౌమత్వాన్నే తాకట్టు పెట్టారు. రాబోయే రోజుల్లో దీని పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి. -
గ్రీస్ డీల్‌తో ర్యాలీ
- 300 పాయింట్ల లాభంతో 27,961కు సెన్సెక్స్ - 99 పాయింట్ల లాభంతో 8,460కు నిఫ్టీ గ్రీస్ తాజా బెయిలవుట్ ప్యాకేజీ యూరోజోన్ ఆమోదం పొందడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన స్టాక్ మార్కెట్ కూడా లాభాల బాట పట్టింది. మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బలహీనంగా ఉండటంతో కీలక రేట్లను ఆర్బీఐ తగ్గిస్తుందన్న అంచనాలు కూడా ర్యాలీకి జతయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, చైనా షాంఘై సూచి వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లో కూడా లాభాల బాట పట్టడం... ప్రభావం చూపాయి. ఫలితంగా అన్ని రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో 27,961 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 8,460 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, ఆయిల్, గ్యాస్ , వాహన, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభపడ్డాయి. గ్రీస్ మూడవ బెయిలవుట్ ప్యాకేజీకి యూరోజోన్ ఆమోదించడంతో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుందని, ఈ ప్యాకేజీతో యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలగాల్సి ఉండదని ప్రపంచ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయని విశ్లేషకులంటున్నారు. రెండు సెన్సెక్స్ షేర్లకే నష్టాలు... 30 సెన్సెక్స్ షేర్లలో 28 షేర్లు లాభపడ్డాయి. ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ..రెండు మాత్రమే నష్టపోయాయి. గెయిల్ 3.55 శాతం పెరిగి రూ. 373 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే. ఇదే బాటలో హెచ్డీఎఫ్సీ, మారుతీ, ఎన్టీపీసీ, విప్రో, హిందాల్కోలు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,545 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.14,257 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,08,956 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.528 కోట్ల నికర కొనుగోళ్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.172 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. -
యూరోజోన్ నిర్ణయంతో మార్కెట్ల జోరు
ఏథెన్స్: గ్రీస్ ఒప్పందానికి యూరోజోన్ నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించిందనే వార్తలతో ప్రపంచ మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించాయి. ముఖ్యంగా భారత మార్కెట్లు లాభాలబాట పట్టాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా, నేషనల్ స్టాక్ఎక్సేంజ్ నిఫ్టీ ప్రధాన మద్దతు స్థాయి 8450 దాటింది. యూరోపియన్ షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. డాక్స్, కాక్స్ సహా మిగిలిన యూరోపియన్ మార్కెట్లు రెండు శాతం లాభాలను సాధించాయి. కాగా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు వీలుగా గ్రీసు బెయిలవుట్ ప్యాకేజీకి యూరో జోన్ ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపింది. సుదీర్ఘ చర్చల అనంతరం మూడో ఉద్దీపన ప్యాకేజీకి ఏకగ్రీవ ఆమోదం తెలిపినట్టు ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ వెల్లడించారు. గ్రీసుకు బెయిలవుట్ ప్యాకేజీ సిద్ధంగా ఉందని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే ప్యాకేజీ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, ఒప్పందం అప్పుడే అమల్లోకి రాదని గ్రీక్ కార్మికమంత్రి ప్రకటించారు. -
గ్రీస్ బెయిలవుట్.. డైలమా!
రెండోరోజూ యూరోజోన్ ఆర్థిక మంత్రుల భేటీ - ఈయూ సదస్సు రద్దు... - యూరో నేతల మధ్య అభిప్రాయభేదాలే కారణం.. బ్రసెల్స్: పతనం అంచున వేళాడుతున్న గ్రీస్‌కు మరో విడత బెయిలవుట్ ప్యాకేజీ డైలమాలో పడింది. కొత్త బెయిలవుట్ కోసం గ్రీస్ చేసిన విజ్ఞప్తి, సంస్కరణల ప్రతిపాదనలపై యూరోజోన్ నేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడమే దీనికి కారణం. శనివారం అర్ధరాత్రిదాకా కొనసాగిన యూరోజోన్(19 దేశాలు) ఆర్థిక మంత్రుల సమావేశంలో బెయిలవుట్‌పై ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. ఆదివారం రెండో రోజు కూడా కొనసాగిన ఈ భేటీలో కూడా ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. అయితే, ఈ నెల 15కల్లా పన్నుల పెంపు, పెన్షన్లకోతకు సంబంధించిన గ్రీస్ చట్టాలను తీసుకురావాలని యూరో ఆర్థిక మంత్రుల గ్రూప్ డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. మరోపక్క, ఆదివారం జరగాల్సిన యూరోపియన్ యూనియన్(ఈయూ-28 దేశాలు) కీలక సదస్సు రద్దయినట్లు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ ప్రకటించారు. పెన్షన్లలో కోత, పన్నుల పెంపు వంటి కఠిన వ్యయ నియంత్రణ చర్యలు తీసుకుంటామని, తమకు 80 బిలియన్ యూరోలకుపైగా విలువైన మూడో బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే, గ్రీస్ ప్రణాళిక యూరోజోన్ నేతల్లో నమ్మకం కలిగించలేకపోయింది. ప్రధానంగా గ్రీస్‌కు అత్యధికంగా రుణాలిచ్చిన జర్మనీ కొత్త షరతులను తెరపైకి తెచ్చింది. తాత్కాలికంగా ఐదేళ్లపాటు గ్రీస్‌ను యూరో(సింగిల్ కరెన్సీ) నుంచి బయటికి పంపాలనేది జర్మనీ వాదన. ఫిన్లాండ్ కూడా గ్రీస్‌కు కొత్త ప్యాకేజీ ఏదీ ఇవ్వాల్సిన అవసరం లేదని కరాఖండీగా పేర్నొన్నట్లు సమాచారం. అయితే, గ్రీస్‌కు రుణాలిచ్చిన అంతర్జాతీయ రుణదాతలు(ఐఎంఎఫ్, ఈసీబీ) మాత్రం ఆ దేశం తాజాగా సమర్పించిన సంస్కరణ ప్రతిపాదనలపై సానుకూలత వ్యక్తం చేయడం గమనార్హం. రిఫరెండంలో గ్రీస్ ప్రజలు తిరస్కరించిన కఠిన షరతులనే ఆ దేశ ప్రభత్వం తాజాగా బెయిలవుట్ ప్యాకేజీ కోసం సమర్పించిన ప్రణాళికలో పొందుపరిచిన సంగతి తెలిసిందే. ఈ ప్రణాళికకు గ్రీస్ పార్లమెంటు శనివారమే ఆమోదముద్ర వేసింది. మరోపక్క, గ్రీస్‌లో ఆర్థిక నియంత్రణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏటీఎంలలో నగదు విత్‌డ్రా పరిమితుల(రోజుకు 60 యూరోలు)తో పాటు బ్యాంకులు కూడా మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి. దాదాపు రెండు వారాలుగా ఇదే తంతు. దేశంలో ఆహార, ఔషధాల నిల్వలు త్వరలోనే ఖాళీ అయ్యే ప్రమాదం కూడా పొంచిఉండటంతో ప్రజలు బిక్కుబిక్ముమంటూ గడుపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు అడుగంటిపోయాయని, త్వరలోనే బ్యాంకులు కుప్పకూలడం ఖాయమనే వార్తలు వినబడుతున్నాయి. -
నేడు గ్రీస్కథ కొలిక్కి వచ్చేఅవకాశం
-
గ్రీస్ కొత్త ప్రతిపాదనలకు యూరో గ్రూప్ ఓకే!
బ్రసెల్స్: ఇప్పటికే దివాలా తీసి ఆర్థికంగా కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న గ్రీస్.. ఈ ఉపద్రవం నుంచి తప్పించుకోవడానికి రుణదాతల కఠిన షరతులకు తలొగ్గింది. కొత్తగా బెయిలవుట్ ప్యాకేజీ కోరుతూ సవివర ప్రతిపాదనలను యూరోజోన్ నేతలకు అందజేసింది. ఇందులో ముఖ్యంగా పెన్షన్ల తగ్గింపు, విలువాధారిత పన్ను(వ్యాట్) పెంపు వంటి కీలక సంస్కరణ చర్యలు ఉన్నాయి. ప్రతిపాదనల సమర్పణకు గురువారం అర్ధరాత్రిని డెడ్‌లైన్‌గా విధించగా.. దీనికి రెండు గంటల ముందు గ్రీస్ వీటిని యూరో గ్రూప్ ప్రెసిడెంట్ జెరోన్ దిసెల్బ్లోయెమ్కు అందించింది. కాగా, గ్రీస్ సంస్కరణ ప్రతిపాదనలకు ప్రాథమికంగా యూరో గ్రూప్ వర్గాలు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, నేడు(శనివారం) యూరోజోన్ ఆర్థిక మంత్రుల సమావేశంలో దీనిపై కూలంకషంగా చర్చించనున్నారు. ఆ తర్వాత ఆది వారం జరిగే కీలకమైన 28 దేశాల యూరోపియన్ యూనియన్(ఈయూ) అధినేతల సదస్సులో బెయిలవుట్ ఇవ్వాలా, వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
గ్రీస్ ప్రభావం భారత్‌పై తక్కువే
అక్కడి సంక్షోభంతో రూపాయిపై ప్రతికూలత.. - పెట్టుబడులు కొంత వెనక్కివెళ్లే అవకాశం ఉంది - ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ న్యూఢిల్లీ: గ్రీస్‌లో ఆర్థిక సంక్షోభ ప్రభావం భారత్‌పై తక్కువగానే ఉండొచ్చని, మన ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటమే దీనికి కారణమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. బెయిలవుట్ ప్యాకేజీ షరతులను గ్రీస్ ప్రజలు రిఫరెండంలో తిరస్కరించిన నేపథ్యంలో అక్కడ సంక్షోభం మరింత తీవ్రతరమయ్యే సంకేతాలతో పాటు, యూరోజోన్‌లో గ్రీస్ భవితవ్యం కూడా డోలాయమానంలో పడిన సంగతి తెలిసిందే. ‘గ్రీస్ సంక్షోభంపై హైడ్రామా మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రతికూలతలను తట్టుకోగలిగే సామర్థ్యం మన ఆర్థిక వ్యవస్థకు ఉంది. ఎందుకంటే దేశంలో స్థూల ఆర్థిక పరిస్థితులు అత్యంత స్థిరంగా ఉన్నాయి. తగినన్ని విదేశీ మారక నిల్వలు కూడా ఉండటంతోపాటు పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది’ అని సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. అయితే, డాలర్ పెట్టుబడులు కొంతమేర తరలిపోయే అవకాశాలు ఉండటంతో రూపాయి మారకం విలువపై ప్రతికూల ప్రభావం పడొచ్చని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ ఎలాంటి అసాధారణ పరిస్థితులు తలెత్తలేదని స్పష్టం చేశారు. మనపై పరోక్ష ప్రభావం..: రాజీవ్ మహర్షి గ్రీస్ సంక్షోభం వల్ల అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురయ్యే ప్రమాదం ఉందని.. దీనిపై యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ), అమెరికా ఫెడరల్ రిజర్వ్‌లే తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి వ్యాఖ్యానించారు. అయితే, యూఎస్ ఫెడ్ గనుక వడ్డీరేట్లను పెంచితే మన మార్కెట్‌పై కొంత ప్రతికూలత ఉండొచ్చని ఆయన చెప్పారు. మనపై గ్రీస్ ప్రభావం పరోక్షోంగానే ఉంటుందని.. అక్కడి పరిణామాలన్నింటినీ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందన్నారు. అనిశ్చితిలో గ్రీస్, యూరో... ఎథెన్స్: బెయిలవుట్ ప్యాకేజీలను కొనసాగించాలంటే కఠినమైన సంస్కరణలు, పెన్షన్లలో కోత, పన్నుల పెంపు, ఇతరత్రా వ్యయ నియంత్రణ చర్యలకు ఒప్పుకోవాలంటూ యూరోపియన్ యూనియన్(ఈయూ), అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) విధించిన షరతులను గ్రీస్ ప్రజలు తిరస్కరించారు. రిఫరెండంలో 61 శాతం మంది ఓటర్లు షరతులకు నో చెప్పగా.. కేవలం 39 శాతం మాత్రమే ఓకే అన్నారు. దీంతో రుణదాతలకు చుక్కెదురైంది. మరోపక్క, ఈ పరిణామంతో ఆర్థిక సాయంలేక, ఇప్పటికే నెలకొన్న సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదంతో గ్రీస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యూరోజోన్‌లో ఆ దేశం ఉంటుందా, బయటికి పోతుందా అనేది తేలాల్సి ఉంది. అటు యూరోజోన్ దేశాల సింగిల్ కరెన్సీ యూరో మనుగడకూడా ప్రశ్నార్థంకంగా మారుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రీస్... గత నెల 30న ఐఎంఎఫ్‌కు కట్టాల్సిన 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయి విషయంలో చేతులెత్తేసి డిఫాల్ట్ అయింది. అధికారికంగా గ్రీస్ దివాలా తీసినట్లు యూరోపియన్ ఆర్థిక స్థిరత్వ యంత్రాంగం(ఈఎఫ్‌ఎస్‌ఎఫ్) ప్రకటించింది. మరో రెండు రోజులు బ్యాంకుల మూసివేత గ్రీసు బ్యాంకుల్ని మరో రెండు రోజులు(మంగళ, బుధవారాలు) మూసివేస్తున్నట్లు గ్రీక్ బ్యాంక్ అసోసియేషన్ తెలిపింది. ఏటీఎంలలో 60 యూరోల రోజువారీ విత్‌డ్రాయిల్ లిమిట్ కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం గెలిచిందన్న ఆనందం అందరిలోనూ కనబడుతోందని రిఫరెండం ఫలితాల తర్వాత గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ టెలివిజన్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘యూరప్ చరిత్రలో ఈ ఆదివారం ఎంతో ప్రకాశవంతమైన రోజు. ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని బ్లాక్మెయిల్ చేయలేరని ఈ రిఫరెండం నిరూపించింది. గ్రీస్ వాసులు ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు’ అని సిప్రస్ వ్యాఖ్యానించారు. 48 గంటల్లో బెయిలవుట్ డీల్ కుదరవచ్చని తమ ప్రభుత్వం భావిస్తోందని.. రుణదాతలతో సంప్రదించి తగిన పరిష్కారం కోసం కృషిచేస్తామని చెప్పారు. గ్రీస్ ఆర్థిక మంత్రి రాజీనామా... బెయిలవుట్ షరతులకు రిఫరెండంలో గ్రీస్ ప్రజలు నో చెప్పినప్పటికీ ఆశ్చర్యకరమైన రీతిలో ఆ దేశ ఆర్థిక మంత్రి యానిస్ వరోఫాకిస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘గ్రీస్‌కు బెయిలవుట్ విషయంలో రానున్న రోజుల్లో జరిపే చర్చల్లో నేను పాల్గొనకూడదని యూరప్, యూరోజోన్ భాగస్వామ్యపక్షాల్లో కొందరు కోరుకుంటున్నారు. డీల్ కుదుర్చుకునే విషయంలో ప్రధానికి సహకరించాలన్నదే నా ఉద్దేశం. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నా’ అని యానిస్ పేర్కొన్నారు. రుణదాతలతో జరుపుతున్న సంప్రతింపుల్లో షరతులపై చాలాసార్లు గ్రీస్ ఆర్థిక మంత్రి తీవ్రంగా విభేదించడం గమనార్హం. కాగా, గ్రీస్ కొత్త ఆర్థిక మంత్రిగా యుక్లిడ్ సాకలోటస్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల మంత్రిగా వ్యవహరించిన ఆయన బెయిలవుట్ చర్చల్లో పాలుపంచుకున్నారు. నేడు యూరోజోన్ సదస్సు.. బ్రసెల్స్/బెర్లిన్: రిఫరెండం ఫలితాలపై చర్చించేందుకు నేడు(మంగళవారం) యూరోజోన్ నేతలతో సదస్సును నిర్వహించనున్నట్లు ఈయూ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ ప్రకటించారు. ఈ సదస్సుకు ముందు యూరోజోన్ ఆర్థిక మంత్రులు కూడా సమావేశం కానున్నారు. మరోపక్క, తాజా పరిణామాలపై జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్ ఆదివారం పొద్దుపోయాక టెలిఫోన్లో చర్చించుకున్నారని... రిఫరెండంలో గ్రీస్ ప్రజల తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని వారు అభిప్రాయపడినట్లు మెర్కెల్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. యూరోపియన్ కమిషన్(ఈసీ) కూడా ఇదే విధమైన ప్రకటనను విడుదల చేసింది. ఈసీ ప్రెసిడెంట్ జీన్-క్లాడ్ జుంకర్, ఈసీబీ చీఫ్ మారియో డ్రాగి, యూరోజోన్ ఆర్థిక మంత్రుల బృందం హెద్ జెరోన్ డిసెల్బ్లోయెమ్లు రిఫరెండం తీర్పుపై సోమవారం చర్చించారు. కాగా, గ్రీస్‌తో తాజా చర్చలు జరిపేందుకు ప్రాతిపదిక ఏదీ లేదని మెర్కల్ ప్రతినిధి స్టెఫెన్ సీబెర్ట్ చెప్పారు. యూరోజోన్‌లో కొనసాగాలనుకుంటే, తాజా ప్రతిపాదనలతో గ్రీస్ ముందుకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. -
నేడు తేలనున్న గ్రీస్ భవితవ్యం
-
గ్రీస్ దారెటు?
రుణదాతల షరతులపై రిఫరెండం నేడే ఏథెన్స్: అప్పుల్లో పీకల్లోతు కూరుకుపోయిన గ్రీస్ భవితను తేల్చే రిఫరెండం నేడు(ఆదివారం) జరగనుంది. మరో బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడానికి రుణదాతలు విధిస్తున్న షరతులకు ఓకే చెప్పాలా లేదా అన్నదానిపై జరుగుతున్న రిఫరెండంలో ప్రజలు దేనికి ఓటేస్తారోనని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. యూరోజోన్‌లో గ్రీస్ కొనసాగాలా లేదా అనేది రిఫరెండంపై ఆధారపడి ఉంది. షరతులకు తలొగ్గద్దని, షరతులకు ఒప్పుకోబోమని రిఫరెండంలో తేల్చి చెప్పాలని నిర్వహించిన ర్యాలీలో గ్రీస్ ప్రధాని సిప్రాస్ పాల్గొన్నారు. అయితే, గ్రీస్ ఆర్థిక పరిస్థితులతో విసిగిపోయిన సగం మంది ప్రజలు ఎలాగోలా బెయిలవుట్ ప్యాకేజీ వస్తే కష్టాలు తీరతాయనే ఉద్దేశంతో.. షరతులకు ఓకే చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. రెఫరెండంకి సంబంధించి నిర్వహించిన పోల్స్‌లో 44.8% మంది అనుకూలంగా, 43.4 % మంది వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. షరతులేంటి.. గ్రీస్ ఇప్పటికే రెండు బెయిలవుట్ ప్యాకేజీలు దక్కించుకుంది. అయినా కష్టాలు పోలేదు. ఈ నేపథ్యంలో మరో ప్యాకేజీ ఇవ్వాలంటే గ్రీస్ ప్రభుత్వం బడ్జెట్లో కోతలు, పన్నుల పెంపు, కఠిన సంస్కరణలు అమలు చేయాలని రుణదాతలు షరతులు పెట్టారు. వీరికి నో చెప్పడం ద్వారా రుణదాతలతో బేరసారాలకు వీలు దొరుకుతుందన్నది గ్రీస్ ప్రభుత్వం వాదన. యూరోపియన్ యూనియన్, ఐఎంఎఫ్‌లు కలిసి 2010 నుంచి గ్రీస్‌కు సుమారు 240 బిలియన్ యూరోల రుణాలిచ్చాయి. నో చెబితే.. రిఫరెండంలో షరతులకు ప్రజలు నో చెబితే నిధుల కొరతతో బ్యాంకులు మూతబడి గ్రీస్ మరింత సంక్షోభంలోకి వెళ్తుంది. ఇంధనం నుంచి ఔషధాల దాకా ప్రతీ దానికీ కొరత ఏర్పడవచ్చు. యూరోజోన్‌లో భాగంగా యూరో కరెన్సీలో ఉన్న గ్రీస్ ఇకమీదట కొత్తగా సొంత కరెన్సీని ముద్రించుకోవాలి. గ్రీస్ బ్యాంకుల దగ్గర ప్రస్తుతం సుమారు బిలియన్ యూరోల నిధులు ఉన్నాయి. ఇవి సోమవారం దాకా సరిపోతాయి. రిఫరెండంలో నో చెబితే బ్యాంకులకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి నిధులు రావు. కొత్త డీల్ కుదుర్చుకోవడంలో ప్రధాని విఫలమైతే ఆయన గద్దె దిగాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే చెబితే.. ప్రజలు రిఫరెండంలో యస్ అని చెబితే, ప్రధాని వైదొలగాల్సి రావొచ్చు. ఎన్నికలు నిర్వహించాలి. అయితే, దేశ ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడమన్నది కష్టసాధ్యం కావొచ్చు. దీంతో అధికారిక సిరిజా పార్టీలోనే మితవాదిగా కాస్త పేరున్న ఉప ప్రధాని యానిస్ డ్రాగాసాకిస్ లాంటి వారికి పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.