
ఏథెన్స్: టర్కీలోని ఇజ్మిర్ నుంచి వలసదారులతో బయలుదేరిన పడవ గ్రీస్ తీరం సమీపంలో మునిగిపోయింది. ఈ ఘటనలో గల్లంతైన 59 మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు గ్రీస్ తీర రక్షక దళం తెలిపింది.
ఎల్వియా, ఆండ్రోస్ ద్వీపాల మధ్యనున్న కఫిరియా జలసంధిలో ఆదివారం రాత్రి దాటాక ఘటన చోటుచేసుకుంది. అననుకూల వాతావరణం కారణంగా మునిగిన పడవలో మొత్తం 68 మంది ఉన్నారు. 9 మందిని సురక్షితంగా తీసుకువచ్చినట్లు గ్రీస్ తెలిపింది.