Athens
-
India-Greece: ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
ఏథెన్స్: తమ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి, వివిధ కీలక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, గ్రీసు ప్ర«దానమంత్రి కిరియాకోస్ మిత్సొటాకిస్ ఒక అవగాహనకు వచ్చారు. గ్రీసు రాజధాని ఏథెన్స్లో శుక్రవారం ఇరువురు నేతలు ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని, రెండు దేశాల మధ్య పరస్పర వాణిజ్యాన్ని 2030 నాటికి రెండింతలు చేసుకోవాలని తీర్మానించుకున్నారు. రాజకీయ, రక్షణ, ఆర్థిక అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. రక్షణ, షిప్పింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సైబర్ స్సేస్, విద్య, సాంస్కృతికం, పర్యాటకం, వ్యవసాయం తదితర ముఖ్యమైన రంగాల్లో భారత్–గ్రీసు నడుమ మరింత సహకారం అవసరమని మోదీ, కిరియాకోస్ అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్(ఐఎస్ఏ)లోకి గ్రీసుకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ఈ మేరకు భారత్–గ్రీసు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశాయి. మోదీకి ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్’ గ్రీసుకు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్’ ప్రధాని నరేంద్ర మోదీకి లభించింది. గ్రీసు అధ్యక్షురాలు కటెరీనా ఆయనను ఈ గౌరవంతో సత్కరించారు. ఈ ఆర్డర్ ఆఫ్ హానర్‌ను గ్రీసు ప్రభుత్వం 1975లో నెలకొలి్పంది. తొమ్మిదేళ్లలో వివిధ దేశాలు మోదీని అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. ఇందులో గ్రీసు ఆర్డర్ ఆఫ్ హానర్ కూడా చేరింది. చంద్రయాన్–3.. మానవాళి విజయం చంద్రయాన్–3 విజయం కేవలం భారత్‌కే పరిమితం కాదని, ఇది ప్రపంచంలోని ప్రజలందరికీ చెందుతుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆయన శుక్రవారం ఏథెన్స్లో గ్రీసు అధ్యక్షురాలు కాటెరీనా ఎన్ సాకెల్లారోపౌలౌతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయానికొచ్చారు. చంద్రయాన్–3 మిషన్‌పై అధ్యక్షురాలు కటెరీనా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ప్రతిస్పందిస్తూ.. చంద్రయాన్ ఘనత మొత్తం మానవాళికి చెందుతుందని చెప్పారు. ఏథెన్స్లో మోదీకి ఘన స్వాగతం ఒక రోజు పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా నుంచి శుక్రవారం గ్రీసు రాజధాని ఏథెన్స్కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో మోదీకి గ్రీసు విదేశాంగ మంత్రి జార్జి గెరాపెట్రిటైస్ ఘనంగా స్వాగతం పలికారు. గ్రీసులో నివసిస్తున్న భారతీయులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మోదీకి సాదర స్వాగతం పలికారు. భారత ప్రధానమంత్రి గ్రీసులో పర్యటించడం గత 40 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
Greece Train Crash: పెను విషాదం: ప్యాసింజర్ రైలును ఢీకొన్న గూడ్స్
రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 32 మంది మృతిచెందగా 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ విషాద ఘటన గ్రీస్ దేశంలో చోటుచేసుకుంది. ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వివరాల ప్రకారం.. గ్రీస్‌లోని టెంపే ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్యాసింజర్ రైలు, మరో గూడ్స్ ట్రైన్‌ని ఢీకొట్టింది. రెండు వేగంలో ఉండటంతో ప్రమాదం ధాటికి అనేక బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలకు మంటలు అంటుకున్నాయి. కాగా.. ప్రమాదానికి గురైన ప్యాసింజర్ రైలు.. ఏథెన్స్ నుంచి థెస్సలోనికి అనే ప్రాంతానికి వెళుతున్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 350మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఇక, ఈ ప్రమాద ఘటనపై థెస్సాలీ ప్రాంత గవర్నర్ కాన్సంటీనోస్ అగోరాస్టోస్ స్పందించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అగోరాస్టోస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద ధాటికి ప్యాసింజర్ రైలులోని మొదటి నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. మొదటి రెండు కోచ్‌లు దాదాపు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు. దాదాపు 250 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించినట్లు స్పష్టం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే గ్రీస్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. VIA @Quicktake: WATCH: Multiple cars derailed and at least three burst into flame after a passenger train collided with an oncoming freight train in northern Greece early Wednesday https://t.co/3BQLRxVHKt pic.twitter.com/IhiMG0sSpJ — Traffic Updates + Useful Info (@trafficbutter) March 1, 2023 -
గ్రీస్ తీరం సమీపంలో మునిగిన పడవ.. 59 మంది గల్లంతు
ఏథెన్స్: టర్కీలోని ఇజ్మిర్ నుంచి వలసదారులతో బయలుదేరిన పడవ గ్రీస్ తీరం సమీపంలో మునిగిపోయింది. ఈ ఘటనలో గల్లంతైన 59 మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు గ్రీస్ తీర రక్షక దళం తెలిపింది. ఎల్వియా, ఆండ్రోస్ ద్వీపాల మధ్యనున్న కఫిరియా జలసంధిలో ఆదివారం రాత్రి దాటాక ఘటన చోటుచేసుకుంది. అననుకూల వాతావరణం కారణంగా మునిగిన పడవలో మొత్తం 68 మంది ఉన్నారు. 9 మందిని సురక్షితంగా తీసుకువచ్చినట్లు గ్రీస్ తెలిపింది. -
ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. రాత్రయితే..
సాక్షి, వెబ్‌డెస్క్: దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా.. లేవా.. అన్న సంగతి పక్కన పెడితే.. చిన్న తనంలో మనం విన్న కథల్లో దెయ్య కథలది ఓ ప్రత్యేక స్థానం. పెద్దలు, స్నేహితులు దెయ్యం కథలు చెబుతున్నపుడు భయపడుతూ వినేవాళ్లం. ఆ రాత్రి వాటిని గుర్తుకు తెచ్చుకుని విపరీతంగా భయపడి సరిగా నిద్రకూడా పోయేవాళ్లం కాదు. ‘ఇంకోసారి దెయ్యం కథలు వినకూడదు బాబోయ్’ అని ఆ రాత్రే తీర్మానం కూడా చేసుకునేవాళ్లం. అయితే, మళ్లీ దెయ్యం కథలు వినడానికి తీరుకునేవాళ్లం. దెయ్యం కథల మీద ఆసక్తి మనల్ని దెయ్యం పట్టినట్లు పట్టి పీడించేది మరి. ప్రాంతాల వారీగా కొన్ని దెయ్యం కథలు బాగా ప్రచారంలో ఉండేవి. కొందరు కొన్నింటిని తమ ఇంట్లో వారికి.. తమకే జరిగినట్లుగా పిల్లలకు చెప్పేవారు. గీకుర మల్లయ్య.. దెయ్యం కొంప.. మేక దెయ్యం లాంటి కథలు ఒక్క మనదగ్గరే కాదు ప్రపంచ నలుమూలలా ప్రచారంలో ఉన్నాయి. అలాంటిదే సంకెళ్ల దెయ్యం కథ.. ప్రాచీన ఏథెన్స్లో ప్రచారంలో ఉండిన సంకెళ్ల దెయ్యం కథ : ప్రాచీన ఏథెన్స్ నగరంలో ఓ పాడు బడ్డ ఇళ్లు ఉండేది. ఆ ఇంట్లో దెయ్యం తిరుగుతోందనే కథ ప్రచారంలో ఉండటంతో అక్కడ ఉండటానికి జనం భయపడేవారు. అయితే, ఈ విషయం తెలియని ఓ వ్యక్తి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి ఆ ఇంటిలోకి చేరాడు. ఆ రోజు రాత్రినుంచి ఇంటి సభ్యులకు గొలుసుల చప్పుడు వినపడసాగింది. ఆ చప్పుడు చాలా భయంకరంగా ఉండేది. గొలుసుల శబ్ధానికి మేలుకున్న వారికి మసి కొట్టుకుపోయి, చిరిగిన దుస్తులు వేసుకున్న గడ్డం వ్యక్తి ఇంట్లో తిరుగుతూ కనిపించేవాడు. సంకెళ్లతో ఉన్న ఆవ్యక్తి ఇంటి సభ్యుల దగ్గరకు వచ్చి, తనను సంకెళ్లనుంచి విముక్తున్ని చేయాలని ప్రాథేయపడేవాడు. ఆ వ్యక్తి ప్రతి రోజు రాత్రి అలా సంకెళ్లతో వచ్చి కుటుంబసభ్యులను ప్రాథేయపడుతుంటంతో వాళ్లు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ సంకెళ్ల వ్యక్తి ఎవ్వరికీ కనిపించలేదు. ఎవరైనా ఆ ఇంట్లో దిగితే వారికి మాత్రమే కనిపించేవాడు. తనను సంకెళ్లనుంచి విముక్తున్ని చేయమని ప్రాథేయపడేవాడు. ఈ దెయ్యం కథను విన్న ‘‘అథెనోడొరస్’’ అనే వ్యక్తి ఆ ఇంట్లో దిగాడు. ఆ ఇంట్లో ఏ దెయ్యమూ లేదని నిరూపించటం అతడి ఉద్ధేశ్యం. అయితే, అతడి ఆలోచనలను తలకిందులుచేస్తూ ప్రతి రోజు రాత్రి ఇంటి బయటినుంచి సంకెళ్ల చప్పుడు వినపడేది. తనను సంకెళ్లనుంచి విముక్తుని చేయమని ఓ వ్యక్తి మాటలు కూడా వినపడేవి. ఓ రోజు రాత్రి అథెనోడొరస్ ధైర్యం తెచ్చుకుని శబ్ధం వస్తున్న వైపు వెళ్లాడు. అలా ఆ శబ్ధాన్ని ఫాలో అవుతూ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోకి వచ్చాడు. అక్కడ ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడి కాళ్లు భూమిలో కూరుకుపోయి ఉన్నాయి. అథెనో అక్కడికి రాగానే ఆ వ్యక్తి తనను సంకెళ్లనుంచి బయటకు విడిపించమని ప్రాథేయపడ్డాడు. కొన్ని నిమిషాల తర్వాత మాయమయ్యాడు. ఉదయం కాగానే అథెనో సంకెళ్ల మనిషి నిలబడ్డ చోటుని తవ్వాడు. అక్కడో కుళ్లిన శవం బయటపడింది. రాత్రి చూసిన విధంగా ఆ శవం సంకెళ్లతో బంధించి ఉంది. అథెనో సంకెళ్లను తీసి, ప్రజలతో కలిసి శవానికి దహన సంస్కారాలు నిర్వహించాడు. ఆ తర్వాత ఎవ్వరికీ ఆ సంకెళ్ల దెయ్యం మళ్లీ కనిపించలేదు. -
బంపర్ ఆఫర్: కోవిడ్ టీకా తీసుకుంటే రూ.13 వేలు
ఏథెన్స్: గ్రీస్‌లోని 26 ఏళ్లలోపు యువతకు ఆ దేశ ప్రధానమంత్రి బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించారు. కరోనా టీకా వేయించుకున్న వారికి 150 యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13,288. తొలి డోసు తీసుకున్న వారికి జూలై 15 నుంచి ఈ బహుమతిని అందజేస్తామన్నారు. గ్రీస్ దేశానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. దేశంలో అర్హులందరికీ కరోనా టీకా ఇచ్చి, పర్యాటకాన్ని పట్టాలెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వ్యాక్సినేషన్‌పై యువత ఆసక్తి చూపడం లేదు. (చదవండి: కిమ్ బరువు తగ్గడం వెనక కారణమిదేనట..!) -
చేతిలో బీర్ గ్లాస్.. ఈ అమ్మాయి గుర్తుందా
ప్రేక్షకుల స్టాండ్‌లో.. చేతిలో బీర్ గ్లాస్‌తో...ఆవేశంగా పంచ్ విసురుతూ వీరాభిమానం ప్రదర్శిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..! మహిళల టెన్నిస్ వరల్డ్ నంబర్‌వన్, ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ కూడా అయినా యాష్లే బార్టీ ఉత్సాహమిది. కరోనా కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ ఆడలేనంటూ తప్పుకున్న ఆమె ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్ (ఏఎఫ్ఎల్)ను ప్రేక్షకురాలిగా ఎంజాయ్ చేస్తోంది. క్వీన్స్‌లాండ్‌కు చెందిన 24 ఏళ్ల బార్టీ శుక్రవారం ‘గాబా’ స్టేడియంలో రిచ్మండ్ క్లబ్‌తో తలపడిన తన అభిమాన జట్టు బ్రిస్బేన్ లయన్స్‌కు మద్దతిస్తూ ఇలా కనిపించింది. ఏథెన్స్ మారథాన్ రద్దు ఏథెన్స్: కరోనా వైరస్ దెబ్బకి మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ రద్దయింది. మహమ్మారి ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఎంతో చరిత్ర ఉన్న ఏథెన్స్ మారథాన్‌ను ఈ ఏడాది నిర్వహించడం లేదంటూ గ్రీస్ ట్రాక్ సమాఖ్య (జీటీఎఫ్) పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 8న జరగాల్సిన ఈ పరుగును తక్కువ మంది అథ్లెట్లతో, పాల్గొనే ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరమే నిర్వహించాలని జీటీఎఫ్ భావించింది. ఇందుకోసం అనుమతి కావాలంటూ గ్రీస్ ఆరోగ్య శాఖను కోరింది. అయితే వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు జీటీఎఫ్ తెలిపింది. మారథాన్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే రుసుము చెల్లించిన వారికి డబ్బును తిరిగి చెల్లించడమో లేదా వచ్చే ఏడాది ఈ రేసుకు అనుమతించడమో చేస్తామంది. -
సినిమా చూసొద్దాం మామా..
ఓటీటీలు, ఏటీటీలు ఎన్ని ఉన్నా.. మన ఫేవరేట్ హీరో సినిమా థియేటర్లో చూస్తే ఆ మజాయే వేరు.. కానీ కరోనా వచ్చి.. ఆ మజాను మన నుంచిదూరం చేసింది.. ఇప్పుడు ఒకొక్కటి అన్‌లాక్ అవుతున్నాయి.. మరి థియేటర్లు?? ఇంకా తేలనే లేదు.. అటు గ్రీస్‌లోని ఏథెన్స్లో మాత్రం కరోనా భయం లేకుండా.. భౌతిక దూరం కూడా పాటించేలా చూసేందుకు ఇలా డ్రైవ్ ఇన్ సినిమాల బాటన పడ్డారు. చూశారుగా.. ఎవరి కారులో వారు కూర్చుని.. సినిమాను ఎంజాయ్ చేయడమన్నమాట. కొన్ని చోట కుర్చీల సదుపాయం కూడా ఉంది. నాలుగ్గోడల మధ్య వైరస్ వ్యాప్తి ఎక్కువుంటుందనిఅంటున్నారు కాబట్టి.. ఇలాంటి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు భవిష్యత్తులో క్రేజ్ బాగా పెరుగుతుందని చెబుతున్నారు. -
గ్రీస్‌లో బీభత్సం సృష్టించిన దావానలం
-
79కి చేరిన గ్రీస్ కార్చిచ్చు మృతుల సంఖ్య
ఏథెన్స్: గ్రీస్‌లోని ఏథెన్స్ సమీప అటవీప్రాంతాలను కార్చిచ్చు దహించివేస్తున్న ఘటనలో చనిపోయిన వారి సంఖ్య బుధవారం 79కి పెరిగింది. అగ్నికీలల బారిన పడిన వారిని రక్షించేందుకు ఈశాన్య ఏథెన్స్లోని తీరప్రాంత ఇళ్లలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. అగ్నికీలల్లో కాలిపోయిన ప్రతీ ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాధితుల జాడ కోసం అగ్నిమాపక సిబ్బంది అన్వేషణ కొనసాగిస్తున్నారు. కార్చిచ్చు వ్యాపించిన నివాస ప్రాంతాల్లో తమ వారి జాడ గల్లంతయ్యిందంటూ అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని సంబంధిత ఉన్నతాధికారి స్టారోలా మలిరి చెప్పారు. ఇంతవరకూ ఎంత మంది జాడ తెలియకుండా పోయిందో సంఖ్య చెప్పలేమని ఆమె అన్నారు. -
హనీమూన్‌లో కార్చిచ్చు.. కష్టాలు!
ఏథెన్స్ : ఓవైపు చెలరేగిన కార్చిచ్చు గ్రామాన్ని మొత్తం బూడిద చేయగా.. మరోవైపు విదేశీయులు సైతం ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. అగ్నికీలలు స్థానికులతో పాటు పర్యాటకుల ప్రాణాలతో చెలగాడమాడాయని అధికారులు అంటున్నారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని మాటీ గ్రామంలో చెలరేగిన కార్చిచ్చులో 100 మంది మంటల్లో కాలిపోగా, మరో 1000 మందికి కాలిన గాయాలైన విషయం తెలిసిందే. హనీమూన్‌కు వచ్చిన ఎన్నో జంటల జీవితంలో కార్చిచ్చు పెను విషాదాన్ని నింపుతోంది. ఐర్లాండ్‌కు చెందిన జోయ్ హోలోహన్, బ్రేయిన్ ఓ కల్లాఘన్ల మనసులు కలిశాయి. కొంతకాలం ప్రేమించుకున్న అనంతరం గత గురువారం ప్రేయసి జోయ్‌తో కల్లాఘన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తమకు సమీపంలోని పర్యాటక ప్రాంతమైన ఏథెన్స్లోని మాటీకి వెళ్లారు. కానీ తమ హనీమూన్‌లో కార్చిచ్చు విషాదం నింపనుందని జోయ్ ఆందోళన చెందుతున్నారు. తాజా అగ్నిప్రమాదంలో తమ జంట వేరయిందని, భర్త కల్లాఘన్ జాడ తెలియటం లేదని ఆమె కన్నీటి పర్యంతమైంది. అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తనను సిబ్బంది రక్షించి ఆస్పత్రిలో చేర్పించారని, కళ్లు తెరిచి చూసేసరికి భర్త పక్కన లేడని చెప్పింది. పోలీసులకు భర్త ఫొటోతో పాటు వివరాలు ఇచ్చానని, దేవుడి దయ వల్ల అతడికి ఏం కాకూడదని నవ వధువు జోయ్ ప్రార్థిస్తోంది. పర్యాటనకు వచ్చి ఇలా పొరుగు దేశంలో ప్రాణాలు కోల్పోవడం నరక ప్రాయమని బాధిత టూరిస్టులు అంటున్నారు. దేవదారు వృక్షాల్లో మొదలైన చిన్న మంట.. కార్చిచ్చుగా మారి గ్రామాన్ని మొత్తం బూడిద చేసేసింది. ప్రాణాలు రక్షించుకునేందుకు స్థానికులతో పాటు పర్యాటకులు బీచ్‌ల వైపు పరుగులు తీశారు. అయినా వందల మందిని కార్చిచ్చు దహించివేసింది. ఆ ప్రాంతాల్లో అగ్గి పదే పదే రాజేసుకోవడంతో ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. పర్యాటకులు తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని గ్రీస్ అధికారులను కోరుతున్నారు. మహా దావానలం.. 100 మంది మృతి -
గ్రీస్‌ను గడగడలాడిస్తున్న కార్చిచ్చు
-
మహా దావానలం.. అగ్నికి 100మంది ఆహుతి
ఏథెన్స్ : కార్చిచ్చు ఓ గ్రామాన్ని అతలాకుతలం చేసింది. కొన్ని గంటలపాటు పదుల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఫైర్ సిబ్బంది యత్నించి మంటల్ని అదుపులోకి తెచ్చినా అప్పటికే జరగాల్సిన జరిగిపోయింది. తొలుత 74 మంది మృతిచెందారని భావించినా.. ఆ సంఖ్య 100కు చేరుకోగా , మరో 1000 మందికి కాలిన గాయాలైనట్లు సమాచారం. చనిపోయిన వారిలో ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదం గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని రిసార్ట్ టౌన్ మాటీలో చోటుచేసుకుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు అగ్నికీలలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మంటల్ని అదుపులోకి తెచ్చినా.. పదే పదే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రీస్ అధికారులు వెల్లడించారు. మంటలనుంచి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు బీచ్‌ల వైపు పరుగులు తీయగా, మరోవైపు కార్చిచ్చు వందల ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలను బుగ్గి చేసింది. మాటీ గ్రామంలో 26 మంది అక్కడికక్కడే మంటల్లో ఆహుతైనట్లు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. రెడ్‌క్రాస్‌కు చెందిన ఓ అధికారి మంగళవారం ఘటనకు సంబంధించి పలు విషయాలు తెలిపారు. వేడి కారణంగా అడవుల్లో ఏర్పడ్డ కార్చిచ్చు పట్టణాన్ని మొత్తం ఆహుతి చేసిందన్నారు. ఏథెన్స్ పరిధిలో జరిగిన ఈ దావానలం దేశాన్నే సంక్షోభంలో పడేసింది. ప్రాణభయంతో పర్యాటకుల పరుగులు గ్రీస్ అందాలు చూద్దామనుకుని వస్తే బూడిదే మిగిలిందంటూ ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వాపోతున్నారు. తమ కుటుంబసభ్యులను మంటలు సజీవదహనం చేస్తుంటే.. పరుగెత్తి మా ప్రాణాలు కాపాడుకోవడం తప్పా, ఏం చేయలేకపోయామంటూ మృతుల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవదారు వృక్షాల్లో ఏర్పడ్డ చిన్న మంట.. కార్చిచ్చుగా మారి గ్రామాన్ని మొత్తం బూడిద చేసేశాయని, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దీంతో తమ ప్రాంతానికి తిరిగి వెళ్లేందుకు ఏం చేయాలో అర్థంకాక పలు దేశాలకు చెందిన పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తెలుగు తేజం మానస
ఆమె అడుగులు నటరాజకు నాట్యాభిషేకం చేస్తాయి.ఆమె పాద మంజీరాలు భరతముని నాట్యాశాస్త్రానికి చిరునామాగామారుతాయి. ఆమె ప్రదర్శించే అంశాలు భారతీయ నృత్య సంప్రదాయ విలువలను చాటుతాయి. ఆమె ప్రముఖ నాట్య కళాకారిణి అచ్యుత మానస, నగరానికి చెందిన అచ్యుత మానస ఈ నెల 4 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు గ్రీసులోని ప్రపంచ ప్రఖ్యాత ఎథెన్స్ ప్రాంతంలో 51 అంతర్జాతీయ వేదికమీద కూచిపూడి నాట్యంలోని తరంగం అంశంగా ప్రదర్శన(అంతర్జాతీయ డాన్స్ కౌన్సిల్) ఇవ్వటానికి వెళుతున్నసందర్భంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. విజయవాడ కల్చరల్: 25 సంవత్సరాల నాట్యప్రస్ధానం, ఆరేళ్ల వయస్సులోనే నృత్యంలో శిక్షణ ప్రారంభం, తల్లి రాజ్యలక్ష్మి తండ్రి రవిచంద్ర(పోలీస్ ఉన్నతాధికారి)ప్రేరణతో నాట్యరంలోకి ప్రవేశించిన అచ్యుత మానస నాట్యాచార్యులు కాజ వెంకటసుబ్రహ్మమణ్యం పర్యవేక్షణలో కూచిపూడి, భరతనాట్యం, కథక్ అంశాలను అలవొకగా ప్రదర్శంచగల తెలుగు తల్లి ముద్దుబిడ్డ అచ్యుత మానస. నాట్యమేకాదు, అటు చిత్రలేఖనం, సంగీతం, యోగాలో విశేష ప్రతిభ కనపరుస్తున్న అచ్యుత మానస దేశవిదేశాలలో 1200పైగా ప్రదర్శనలు ఇచ్చింది. పురస్కారాలు యునెస్కో బెస్ట్ కల్చరల్ అంబాసిడర్‌గా ఎంపిక, 2016లో నాట్యరంలో ఉగాది పురస్కారం, దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన సంస్థలు, కళాసరస్వతి, నాట్యమయూరి, నాట్యకళామయి బిరుతులతో సత్కరించాయి. ఉచిత శిక్షణ కూచిపూడి మై లైఫ్ పేరుతో దిగువ తరగతికి వారికి నాట్యంలో శిక్షణ ఇచ్చివారిని అంతర్జాతీయ నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో కొత్తగా కూచిపూడి నాట్య కళాక్షేత్ర అనే నృత్య అకాడమీని స్థాపించారు. ఔత్సాహికుల కోసం సీడీల నిర్మాణం భావితరాలకు భారతీయ నృత్య సంప్రదాయమైన కూచిపూడిని అందించటానికి కూచిపూడి నాట్యాభినయ వేదం మోక్షం అనే సీడీని తయారుచేసి జీయర్ స్వామి, దర్శకుడు విశ్వనా«థ్, విశ్వంజీ చేతులమీదుగా ఆవిష్కరించి దాని ద్వారా వచ్చిన సొమ్మును మై లైఫ్ పేరుతో శిక్షణ తీసుకొనే వారి సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు ప్రతినిధిగా.. జూలై 4 నుంచి 8వ తేదీ వరకు ఎథెన్స్(అంతర్జాతీయ స్టేడియం)లో 51వ అంతర్జాతీయ డాన్స్ రెసెర్చి సంస్థ 50 దేశాల ప్రతినిధులతో సమ్మేళనం నిర్వహిస్తోంది. అదే వేదిక మీద అచ్యుత మానస భారతదేశ ప్రతినిధిగా కూచిపూడి అంశంగా ప్రసంగించనున్నది. జీవితాశయం ఉన్నత విలువలుగల భారతీయ మహిళాగా ఎదగాలని, భారతీయ నృత్యసంప్రదాయ రీతులు ప్రపంచమంతా పాకాలని, అతి పేద వారికి కూడా సంప్రదాయ నృత్యరీతులను నేర్పించి భావితరాలకు ఉన్నత విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశయమని ఆమె వివరించారు. -
రాయబార కార్యాలయంలోకి గ్రనేడ్ విసిరారు
ఏథెన్స్: ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి గ్రీకులోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంపైకి గ్రనేడ్ విసిరారు. ఈ పేలుడులో ఓ పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడికి సంబంధించి గ్రీక్ యాంటీ టెర్రరిజం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం గురువారం ఉదయం 5గంటల ప్రాంతంలో ఈ దాడి చోటుచేసుకుంది. దాడి జరిగిన ప్రాంతం గ్రీకు దేశ పార్లమెంటుకు సమీపంలో ఉంది. కొంతమంది ప్రలోభంతో స్థానికులే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావించిన పోలీసులు గతంలో ఈ తరహా దాడులకు పాల్పడిన స్థానికుల జాబితా తిరగేస్తున్నారు. -
ముందుచూపు లేకుంటే...
ముందుచూపు లేకుంటే ముందడుగు వేయలేం. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున (ఆగస్టు 13న) ఏథెన్స్ ఒలింపిక్స్ క్రీడలకు తెరలేచింది. ఎన్నో ప్రతికూలతలు ఉన్నా... విశ్వ క్రీడలకు పుట్టిల్లు అయిన ఏథెన్స్ ఆనాడు నభూతో నభవిష్యత్ అన్నరీతిలో ఈ క్రీడలను నిర్వహించాలని తలచింది. కొత్త స్టేడియాల నిర్మాణాల కోసం ఏకంగా అప్పట్లోనే 12 బిలియన్ డాలర్లను (రూ. 7 లక్షల 35వేల కోట్లు) వెచ్చించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ స్టేడియాల్లో ఎక్కువ శాతం నేడు ఏమాత్రం ఉపయోగంలో లేకుండా పోయాయి. దీనావస్థలో ఏథెన్స్ ఒలింపిక్స్ స్టేడియాలు - పదేళ్లలో ఎంతో మార్పు - కనీస ఉపయోగంలోని పలు వేదికలు ‘స్టేడియాలు కట్టేశాం. క్రీడలు ఘనంగా నిర్వహించేశాం’ అని ఏథెన్స్ నిర్వాహకులు సంబరపడ్డారు. కానీ క్రీడలు ముగిశాక ఈ వేదికల పరిస్థితి ఏంటి? అన్న విషయంలో మాత్రం వారికి ముందుచూపు లేకుండా పోయింది. ఫలితంగా ఆనాడు కోట్ల డాలర్లతో కట్టిన స్టేడియాలు నేడు తెల్ల ఏనుగులుగా మారిపోయాయి. ప్రస్తుతం గ్రీస్ 465 బిలియన్ డాలర్ల అప్పుల్లో ఉంది. ఈ పాపంలో నాటి ఒలింపిక్స్ నిర్వహణ కూడా భాగమేనని అక్కడి మేధావులు అభిప్రాయపడ్డారు. ‘ఒలింపిక్ పుట్టినిల్లు కాబట్టి వాటి నిర్వహణ కోసం దేశం ఉత్సాహం చూపించింది. అయితే దురదృష్టకరం ఏమిటంటే అంతర్జాతీయ స్థాయిలో చూస్తే క్రీడల్లో గ్రీస్‌కు పెద్దగా గుర్తింపు లేదు. ఎన్నో పాపులర్ క్రీడాంశాల్లో అక్కడి ఆటగాళ్ల పేరు కూడా వినిపించదు. దాని ఫలితమే ఈ పరిస్థితి. స్టేడియాలు ఉన్నా వాటిని ఉపయోగించేవారు ఎక్కడ? లండన్ ఒలింపిక్స్‌లో గ్రీస్ కేవలం 2 కాంస్యాలు మాత్రమే సాధించిందంటే ఇక్కడి ఆటల పరిస్థితి అర్థమవుతుంది’ అని మాజీ ఆటగాడు ఒకరు వ్యాఖ్యానించారు. జాతీయ క్రీడల కోసం, ఆఫ్రో ఆసియా క్రీడల కోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్మించిన స్టేడియాల్లోనూ గతంతో పోలిస్తే క్రీడల నిర్వహణ తగ్గింది. కోట్ల రూపాయలు వెచ్చించి కట్టే స్టేడియాలు... క్రీడల తర్వాత కూడా అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఏథెన్స్ తరహా అనుభవాలను మనం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది..! - సాక్షి క్రీడావిభాగం