ఏథెన్స్: గ్రీస్‌లోని ఏథెన్స్ సమీప అటవీప్రాంతాలను కార్చిచ్చు దహించివేస్తున్న ఘటనలో చనిపోయిన వారి సంఖ్య బుధవారం 79కి పెరిగింది. అగ్నికీలల బారిన పడిన వారిని రక్షించేందుకు ఈశాన్య ఏథెన్స్‌లోని తీరప్రాంత ఇళ్లలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. అగ్నికీలల్లో కాలిపోయిన ప్రతీ ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాధితుల జాడ కోసం అగ్నిమాపక సిబ్బంది అన్వేషణ కొనసాగిస్తున్నారు. కార్చిచ్చు వ్యాపించిన నివాస ప్రాంతాల్లో తమ వారి జాడ గల్లంతయ్యిందంటూ అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని సంబంధిత ఉన్నతాధికారి స్టారోలా మలిరి చెప్పారు. ఇంతవరకూ ఎంత మంది జాడ తెలియకుండా పోయిందో సంఖ్య చెప్పలేమని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment