live death
-
పపువా న్యూ గినియా విషాదం..
మెల్బోర్న్: దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియా శుక్రవారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో 670 మంది వరకు చనిపోయి ఉంటారని మొదట ఐరాస విభాగం అంచనా వేసింది. అయితే, మట్టిదిబ్బల కింద రెండు వేలమందికి పైగానే గ్రామస్తులు సజీవ సమాధి అయి ఉంటారని పపువా న్యూ గినియా ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ మేరకు ఐరాసకు సమాచారం పంపింది. ఈ విషాద సమయంలో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఐరాస వలసల విభాగం మాత్రం నేలమట్టమైన 150 నివాసాలను పరిగణనలోకి తీసుకునే మృతుల సంఖ్య 670గా నిర్ణయించామని, ప్రభుత్వ గణాంకాలపై మాట్లాడబోమని తెలిపింది. మృతుల సంఖ్యను 2 వేలుగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రధాని జేమ్స్ మరాపేను మీడియా ప్రశ్నించగా ఆయన బదులివ్వలేదు. కాగా, దేశంలో దశాబ్దాలుగా జనగణన జరగలేదు. సైన్యం కాపలా మధ్య.. గ్రామంలోని 200 మీటర్ల ప్రాంతంలో ఉన్న నివాసాలను 6 నుంచి 8 మీటర్ల మేర భారీ రాళ్లు, చెట్లు, మట్టి భూస్థాపితం చేశాయి. స్థానికులే తమ వ్యవసాయ పరికరాలైన పార, గొడ్డలి వంటి వాటితో వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. స్థానిక కాంట్రాక్టర్ పంపించిన బుల్డోజర్తో ఆదివారం నుంచి పని చేయిస్తున్నారు. -
ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏడంతస్తుల షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి 46 మంది సజీవ దహనమయ్యారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గ్యాస్ లీకేజీయే కారణమని భావిస్తున్నారు. బైలీ రోడ్డు ప్రాంతంలోని గ్రీన్ కోజీ కాటేజీలో పలు రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఈ భవనం మొదటి అంతస్తులోని రెస్టారెంట్లో రాత్రి 9.50 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు పై అంతస్తులకు శరవేగంగా వ్యాపించాయి. దీంతో అందులోని వారంతా ప్రాణభయంతో పై అంతస్తులకు చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది సుమారు 75 మందిని నిచ్చెనల సాయంతో కిందికి దించారు. మంటలను అర్ధరాత్రి 12.30 గంటలకు అదుపులోకి తీసుకురాగలిగారు. ఘటనపై ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
చైనాలో భారీ అగ్ని ప్రమాదం
బీజింగ్: చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోగా మరో 38 మంది గాయపడ్డారు. లియులింగ్ నగరంలోని లిషి ప్రాంతంలో గురువారం ఉదయం 6.50 గంటలకు ఘటన చోటుచేసుకుంది. బొగ్గు గని కంపెనీకి చెందిన అయిదంతస్తుల భవనంలోని రెండో అంతస్తులో మొదలైన మంటలు భవనమంతటికీ వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది శ్రమించి మంటలను మధ్యాహ్నం 1.45కి అదుపులోకి తెచ్చారని చెప్పారు. చైనాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. భద్రతా ప్రమాణాలను పట్టించుకోకపోవడం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే వీటికి కారణమని చెబుతున్నారు. -
దాల్ సరస్సులో ఘోర అగ్ని ప్రమాదం
శ్రీనగర్: శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు హౌస్బోట్లలో శనివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో విదేశీ ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మాడి మసైన హౌస్‌బోట్ శిథిలాల నుంచి గుర్తుపట్టలేని విధంగా కాలిన మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. మృతులు బంగ్లాదేశ్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. వీరిని అనిందయ కౌశల్, మహ్మద్ మొయినుద్, దాస్ గుప్తా అని తెలిసిందన్నారు. వీరున్న సఫీనా అనే హౌస్‌బోట్ పూర్తిగా దగ్ధమైందన్నారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం అయిదు హౌస్బోట్లు, వాటికి పక్కనే ఉన్న ఏడు నివాస కుటీరాలు, కొన్ని ఇళ్లు కూడా పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఘటనలో కోట్లలో ఆస్తినష్టం సంభవించింది. తొమ్మిదో నంబర్ ఘాట్‌లో అగ్ని ప్రమాదంపై ఉదయం 5.15 గంటల సమయంలో ఫోన్లో సమాచారం అందగానే రంగంలోకి దిగి, ఎనిమిది మంది పర్యాటకులను రక్షించగలిగామని స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఫైర్ సర్వీస్) ఫరూక్ అహ్మద్ తెలిపారు. ఒక హౌస్‌బోట్‌లో చెలరేగిన మంటలు వేగంగా మిగతా బోట్లకు వ్యాపించాయన్నారు. అతికష్టమ్మీద మంటలను అదుపులోకి తేగలిగామని వివరించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. ఒక బోటులోని హీటింగ్ పరికరాల్లో లోపం కారణంగానే మంటలు అంటుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 2022లోనూ డాల్, నగీన్ సరస్సుల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడు హౌస్బోట్లు బూడిదగా మారాయి. అప్పటి ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
వియత్నాంలో ఘోర అగ్ని ప్రమాదం
హనోయి: వియత్నాం రాజధాని నగరం హనోయి ఘోర అగ్నిప్రమాదానికి నిలయంగా మారింది. హనోయిలో మంగళవారం రాత్రి తొమ్మిది అంతస్తుల భవంతి పార్కింగ్ ప్రాంతంలో మొదలైన అగి్నకీలలు వెనువెంటనే భవనం మొత్తాన్నీ చుట్టేశాయి. అత్యవసరంగా బయటపడే మార్గం ఈ భవనానికి లేదు. దీంతో తప్పించుకునే మార్గం కానరాక ఏకంగా 56 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. 37 మంది గాయపడ్డారు. 150 కుటుంబాలు నివసిస్తున్న ఈ భవనం ఇరుకైన దారిలో నిర్మించారు. దీంతో మంటలు ఆర్పే అగి్నమాపక సిబ్బంది భవనం దాకా చేరుకోలేకపోయారు. ఇరుకైన మార్గం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మంటలు అంటుకుంటాయనే భయంతో కొందరు భవనం మీద నుంచి కిందకు దూకారు. ఇలా గాయపడిన వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. పొగపీల్చడంతో ఇబ్బందులు పడుతున్న వారికీ చికిత్సచేస్తున్నారు. -
దక్షిణాఫ్రికాలో పెను విషాదం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద నగరం జొహన్నెస్‌బర్గ్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 73 మంది చనిపోయారు. మరో 52 మంది గాయపడ్డారు. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన ఈ ఘటనలో బాధితులంతా బతుకుదెరువు కోసం వచ్చిన వలసదారులేనని అధికారులు తెలిపారు. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో భవనంలో చెలరేగిన మంటలకు కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ప్రమాదం విషయం తెలియగానే తమ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పారని నగర అత్యవసర సేవల విభాగం ప్రతినిధి రాబర్ట్ ములౌడ్జి అన్నారు. భవనంలోని అయిదంతస్తుల్లోనూ మంటలు వ్యాపించాయన్నారు. అందులో చిక్కుకున్న వారిని సాధ్యమైనంత వరకు రక్షించామన్నారు. మొత్తం 73 మృతదేహాలను వెలికితీశామని చెప్పారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన, ఊపిరాడక స్పృహతప్పిన మరో 52 మందిని ఆస్పత్రులకు తరలించామన్నారు. ‘భవనంలోని ప్రతి అంతస్తులోనూ అనధికారికంగా పలు నిర్మాణాలు ఉండటంతో చాలా మంది లోపలే చిక్కుకుపోయారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. నేరగాళ్ల ముఠాలు తిష్ట వేయడంతో భవనానికి కరెంటు, నీరు, శానిటేషన్ వసతులను మున్సిపల్ అధికారులు కట్ చేశారు. ఇవి లేకున్నా వలసదారుల కుటుంబాలు ఉంటున్నాయి. కొందరికి పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి భవనాలు ఇక్కడ చాలానే ఉన్నాయి’అని రాబర్ట్ చెప్పారు. -
రష్యా కేఫ్‌లో అగ్నికీలలు
మాస్కో: రష్యాలోని కోస్ట్రోమా పట్టణంలో శనివారం ఓ కేఫ్‌లో ఇరు వర్గాల మధ్య గొడవలో ఫ్లేర్ గన్ను పేల్చడంతో చెలరేగిన మంటలకు 13 మంది బలయ్యారు. ఏకంగా 37,000 చదరపు అడుగుల మేర విస్తరించిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చెమటోడ్చారు. సమీప భవనాల వారిని ఖాళీ చేయించారు. అనుమానితున్ని అరెస్టు చేశారు. 2009లోనూ పెర్మ్ నగరంలో నైట్‌క్లబ్‌లో బాణసంచా పేల్చడంతో మంటలంటుకుని 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. -
సునామీ భయం ప్రాణాలు తోడేసింది
మనీలా: సునామీ భయం ఫిలిప్పీన్స్ పర్వతప్రాంత ప్రజల ప్రాణాలు తీసింది. అక్కడ కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం భారీ అలలు వచ్చి పడటంతో సునామీ ముంచుకొస్తోందని మగుందనావో ప్రావిన్స్‌లోని కుసియాంగ్ గ్రామవాసులు భయపడ్డారు. గతంలో ఆ గ్రామాన్ని భయంకర సునామీ ముంచెత్తింది. నాటి నేటికీ వెంటాడుతున్నాయి. దాంతో వారంతా హుటాహుటిన కొండ వద్దకు చేరుకున్నారు. అప్పటికే కుండపోతగా కురుస్తున్న వర్షాల ధాటికి అక్కడ మట్టి, బురదచరియలు విరిగిపడి ఉన్నాయి. ఆ ఊబిలో చిక్కి దాదాపు 20 మంది సజీవ సమాధి అయ్యారు. అయితే, ఈసారి మృత్యువు మరో రూపంలో వారిని కబళించింది. వాయవ్య ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తున్న నాల్గే తుపాను కారణంగా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయ. ఈ తుపాను ప్రభావ వర్షాల కారణంగానే కుసియాంగ్ గ్రామంలో బురదచరియలు విరిగిపడ్డాయి. ‘ఏటా ఇక్కడి వారు సునామీ వస్తే ఎలా అప్రమత్తంగా ఉండాలనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఘటన జరిగినప్పుడు సైతం వార్నింగ్ బెల్స్ మోగడంతో చాలా మంది కొండ వద్ద ఉన్న చర్చి వద్దకు పరుగులు తీశారు. అదే వారి ఉసురు తీసింది’’ అని ఆ ప్రావిన్స్ మంత్రి చెప్పారు. -
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది సజీవదహనమయ్యారు. 450 మందికిపైగా కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రసాయనాలు ఉంచిన ఒక కంటైనర్ డిపోలో తొలుత అగ్నికీలలు చెలరేగి ఆ తర్వాత వరస పేలుళ్లు సంభవించడంతో భారీ ప్రమాదం జరిగింది. దేశంలో ప్రధాన రేవు పట్టణమైన చిట్టగాంగ్‌కి సమీపంలోని సీతాకుంద్‌లో షిప్పింగ్ కంటైనర్లు ఉంచే బీఎం కంటైనర్ డిపోలో శనివారం రాత్రి అగ్గి రాజుకుంది. ఆ తర్వాత వరసపెట్టి పేలుళ్లు సంభవించాయని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. రాత్రి 11.45 గంటలకు మంటలు మొదలయ్యాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనం నింపిన కంటైనర్లు కావడంతో ఒక దాని తర్వాత మరొకటి పెద్దగా శబ్దాలు చేస్తూ పేలిపోయాయి. అగ్నిమాపక సిబ్బందికి మంటల్ని అదుపులోకి తీసుకురావడం శక్తికి మించిన పనైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. ప్రమాదం విషయం తెల్సి ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. వణికిపోయిన చుట్టుపక్కల ప్రాంతాలు ఈ పేలుడు ధాటి ప్రభావం నాలుగు కిలో మీటర్ల వరకు చూపించింది. భవనాలు ఊగాయి. పైకప్పులు చెదిరిపడ్డాయి. హుటాహుటిన 19 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఆరు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలతో నింపిన కంటైనర్లు కావడంతో ఒక దానికి నిప్పు అంటుకోగానే వరుసగా వెంట వెంట నే అన్నీ పేలిపోయాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. -
Birbhum Violence: బీర్భూమ్ హత్యాకాండ.. 21 మందిపై ఎఫ్ఐఆర్
రామ్పుర్హత్: బీర్భూమ్ హత్యాకాండపై విచారణకు 30 మంది సభ్యుల సీబీఐ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. సజీవదహనాలపై విచారణ ఆరంభించింది. విచారణ అనంతరం ఎఫ్ఐఆర్లో 21 మంది నిందితుల పేర్లను సీబీఐ నమోదు చేసింది. స్థానిక నేత హత్యకు ప్రతీకారంగా సజీవదహన ఘటన జరిగిఉండవచ్చని అంచనా వేసిది. మరో 70– 80 మంది గుంపునకు ఈ సంఘటనతో సంబంధం ఉందని భావిస్తున్నట్లు తెలిపింది. డెడ్‌లైన్ లోపు విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక అందించాల్సిఉన్నందున సమయం వృథా చేయమని సీబీఐ అధికారులు చెప్పారు. డీఐజీ అఖిలేశ్ సింగ్ ఆధ్వర్యంలో వచ్చిన సీబీఐ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. బోగ్తాయ్ గ్రామంలో అధికారులు దాదాపు ఐదుగంటలు గడిపారు. ఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించి ఆధారాల కోసం అన్వేషించారు. తాము జరిపే విచారణను వీడియో తీయడంతో పాటు తమతో ఒక ఫోరెన్సిక్ నిపుణుడిని కూడా సీబీఐ అధికారులు వెంటపెట్టుకుతిరుగుతున్నారు. మరికొందరు అధికారులు పోలీసుస్టేషన్లో కేసు డైరీని అధ్యయనం చేశారు. బోగ్తాయ్‌లో శ్మశాన నిశబ్దం బోగ్తాయ్: సజీవదహనం జరిగిన బెంగాల్‌లోని బోగ్తాయ్ గ్రామంలో శ్మశాన నిశబ్దం తాండవిస్తోంది. గ్రామస్తులు చాలామంది ఊరువిడిచి పొరుగు గ్రామాలకు పారిపోయారు. స్థానిక టీఎంసీ నేత భాదు షేక్ హత్య, అనంతర హింసాకాండతో గ్రామస్తులు భీతిల్లిపోతున్నారు. ఈ ఘటనలు కొనసాగవచ్చని భయపడుతున్నారు. దీంతో చాలామంది పెళ్లాంబిడ్డలతో కలిసి బంధువుల ఊర్లకు పారిపోయారు. గ్రామాన్ని సందర్శించిన జర్నలిస్టులకు తాళం వేసిన గృహాలు స్వాగతమిచ్చాయి. కొందరు వృద్ధ మహిళలు, పెద్దవారు మాత్రమే ఊర్లో కనిపించారు. యువకులంతా భయంతో గ్రామం విడిచిపోయారన్నారు. సీబీఐ విచారణ పూర్తయితే నిజానిజాలు బయటపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
సజీవదహనం వెనుక కుట్రకోణం
బీర్భూమ్ (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఎనిమిది మంది నిండు ప్రాణాలను బలితీసుకున్న హింసాత్మక గృహదహనాలు జరిగిన రామ్‌పూర్‌హట్ గ్రామాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆధునిక బెంగాల్లో ఇలాంటి అనాగరిక ఘటనలు జరుగుతాయని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. మీ కుటుంబ సభ్యులు మరణిస్తే, నా గుండె పిండేసినట్టుందని భావోద్వేగంతో మాట్లాడారు. ఈ ఘటన వెనుకాల భారీ కుట్ర ఉందన్న మమత ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉంటే వెంటనే అరెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. రామ్‌పూర్‌హట్ మారణకాండకు బాధ్యులైన వారిని విడిచిపెట్టమన్న మమత ఈ ఘటనని అడ్డుకోలేకపోయిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించారు. మరోవైపు మృతుల పోస్టుమార్టమ్ నివేదికలో సంచలన వాస్తవాలు బయటపడ్డాయి. ఆ ఎనిమిది మందిని సజీవంగా దహనం చేయడానికి ముందు వారిని బాగా చితక బాదినట్టుగా పోస్టుమార్టమ్ నివేదిక వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బాద్ షేక్ హత్యకి ప్రతీకారంగా మార్చి 21న పలు ఇళ్లకు నిప్పటించి తగుల బెట్టిన ఘటనలో ఎనిమిది కాలిన మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మమతా బెనర్జీ బాధితుల్ని పరామర్శించిన వెంటనే గృహదహనాల వెనుక హస్తం ఉందని అనుమానిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు అనిరుల్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటన వెనుకనున్న వాస్తవాలను వెలికి తీయడానికి బీజేపీకి చెందిన కేంద్ర కమిటీలో గ్రామంలో పర్యటిస్తోంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. -
న్యూయార్క్ అపార్ట్మెంట్లో అగ్నికీలలు
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బ్రోన్స్ ప్రాంతంలోని 19 అంతస్తుల భవంతిలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు మంటలు వ్యాపించడం మొదలైంది. భారీ స్థాయిలో మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ వేగంగా విస్తరించడంతో వాటిల్లో చిక్కుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. ఆఫ్రికాలోని గాంబియా నుంచి వలస వచ్చిన ముస్లిం కుటుంబాలు ఆ డూప్లెక్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ట్వీట్ చేశారు. దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని ఆయన చెప్పారు. ఒక బెడ్రూమ్లోని ‘గదిని వేడిగా ఉంచే ఎలక్ట్రిక్ హీటర్’ నుంచి మంటలు మొదలై గది మొత్తం విస్తరించి, తర్వాత అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయని న్యూయార్క్ అగ్నిమాపక విభాగం కమిషనర్ డేనియల్ నీగ్రో వివరించారు. బిల్డింగ్‌లోని ప్రతీ ఫ్లోర్‌లోని మెట్ల వద్ద అపార్ట్మెంట్ వాసులు విగతజీవులై కనిపించారని ఆయన తెలిపారు. విపరీతంగా కమ్మేసిన పొగకు ఊపిరాడక, గుండె ఆగిపోవడంతో కొందరు మరణించారని కమిషనర్ వెల్లడించారు. 32 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ ఆస్పత్రిలో చేర్పించారు. -
మహారాష్ట్రలో మరో ఘోరం..
సాక్షి ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. ముంబైకి సమీపంలోని విరార్‌లోని ఓ ఆసుపత్రిలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. పాల్ఘర్ జిల్లా విరార్‌లోని విజయ్ వల్లబ్ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రెండో అంతస్తులోని ఏసీలో షార్ట్ సర్క్యూట్‌తో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్న 17 మందిలో ముగ్గురు రోగులు బయటికి వెళ్లగలిగారు. కానీ మిగతా 14 మంది కదల్లేని పరిస్థితిలో ఉండటం వల్ల వారందరు సజీవదహనమయ్యారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 90 మంది రోగులున్నారు. నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఆక్సిజన్ లీకేజీ కారణంగా ప్రాణవాయువు అందక 24 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఢిల్లీ ఆసుపత్రిలో 25 మంది మృతి దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత సర్ గంగారాం హాస్పిటల్లో సరిపడా ప్రాణవాయువు లేక 24 గంటల్లో 25 మంది కరోనా బాధితులు చనిపోయారు. తక్కువ పీడనంతో ఆక్సిజన్ సరఫరా కావడమే ఈ మరణాలకు కారణమని అధికారులు తెలిపారు. వారికి అవసరమైన ఆక్సిజన్ అందక చనిపోయినట్లు భావిస్తున్నారు. మరో 60 మంది బాధితుల పరిస్థితి ఆదోళనకరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిలో 500 మందికిపైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 150 మంది హై ఫ్లో ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నారు. వీరికి అధిక పీడనంతో ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. అయితే, గంగారాం ఆసుపత్రిలో సరిపడా ఆక్సిజన్ నిల్వ లున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. -
టర్కీలో వరుస హిమపాతాలు..
అంకారా: టర్కీలోని వాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న రెండు వరుస హిమపాతాల కారణంగా 38 మంది మంచులో సజీవసమాధి అయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన మొదటి హిమపాతంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వీరిని వెలికితీసేందుకు దాదాపు 300 మంది అత్యవసర విభాగం ఘటనా స్థలికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం మరో హిమపాతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో 8 మంది మిలిటరీ ఆఫీసర్లు, 9 మంది వాలంటీర్లు, మరో ముగ్గురు ప్రభుత్వం నియమించిన గార్డులు ఉన్నట్లు చెప్పారు. గల్లంతైన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. -
మంటల్లో బస్సు
కన్నౌజ్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో ఆ రెండు వాహనాలూ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది జాడ తెలియాల్సి ఉంది. బస్సుకు నిప్పంటుకుని 21 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రక్‌తో ఢీ కొనడంతో డీజిల్ ట్యాంక్ పేలిపోయి బస్సుకు నిప్పంటుకుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని పోలీసులు తెలిపారు. ఫరుఖాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న బస్సులో మొత్తం 45 మంది ప్రయాణీకులున్నారు. చిలోయి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలియగానే, పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు. 21 మందిని రక్షించి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని ఐజీపీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. మంటలను అదుపుచేశామని, సహాయచర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రమాద సమాచారం తెలియగానే సీఎం ఆదిత్యనాథ్ తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. -
కాలిఫోర్నియాను చుట్టేసిన కార్చిచ్చు
-
25కు చేరిన కార్చిచ్చు మృతులు
ప్యారడైజ్: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకు వ్యాప్తి స్తోంది. కార్చిచ్చు బారినపడి ఇప్పటివరకు 25 మంది మృతి చెందారు అధికారులు ప్రకటిం చారు. శనివారం మరో 14 మృతదేహాలను గుర్తించారు. ఇందులో 10 మృతదేహాలు ఒక్క ప్యారడైజ్ నగరంలోనే స్వాధీనం చేసుకున్నారు. ప్యారడైజ్‌లో ఇప్పటివరకు 6,700కు పైగా ఇళ్లు అగ్ని అహుతి కాగా, మొత్తం 19 మంది మరణించారు. కార్చిచ్చు ధాటికి లక్ష ఎకరాలకు పైగా అడవి అగ్నికి ఆహుతి కాగా, ఒక్క వెంచురాకౌంటీ ప్రాంతంలోనే 15వేల ఎకరాలు బూడిదయింది. మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు మరో 3 వారాలు పడుతుందని అధికారులు అంటున్నారు. -
కాంగోలో 60 మంది సజీవ దహనం
కిన్షాసా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో 60 మంది సజీవ దహనమయ్యారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కిన్షాసా– మతాడి ఓడరేవును కలిపే జాతీయ రహదారిపై కిసాంతు నగరం సమీపంలో ఆయిల్ ట్యాంకర్, మరో వాహనం ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇతర వాహనాలకు, చుట్టుపక్కల నివాసాలకు అంటుకున్నాయి. అగ్నికీలల్లో చిక్కుకుని దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. -
‘మిర్చ్‌పూర్’ దోషులకు యావజ్జీవం
న్యూఢిల్లీ: 2010లో సంచలనం సృష్టించిన మిర్చ్‌పూర్ దళితుల సజీవ దహనం కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. జాట్ వర్గానికి చెందిన 12 మందికి యావజ్జీవ శిక్ష, మరో 21 మందికి వేర్వేరు జైలు శిక్షలు విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. దోషులకు విధించిన జరిమానాను బాధితుల పునరావాసానికి ఖర్చు చేయాలని సూచించింది. 2010, ఏప్రిల్‌లో హరియాణాలోని హిసార్ జిల్లా మిర్చ్‌పూర్ గ్రామంలో దళితులు, జాట్లకు మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో 60 ఏళ్ల తారాచంద్ అనే వ్యక్తిని, దివ్యాంగురాలైన ఆయన కూతురిని సజీవదహనం చేశారు. జాట్ వర్గీయుల దాడుల్లో పలువురు దళితులు తీవ్రంగా గాయపడ్డారు. భారీఆస్తినష్టం జరిగింది. ఈ కేసులో 98 మందిని నిందితులుగా చేర్చగా, ట్రయల్ కోర్టు 15 మందిని దోషులుగా తేల్చి, వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు నిర్దోషులుగా తేల్చిన 20 మందిని తాజాగా హైకోర్టు దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. వాల్మీకి వర్గానికి చెందిన వారి ఇళ్లే లక్ష్యంగా, ప్రణాళికతో జాట్లు దాడులకు పాల్పడినట్లు విచారణలో స్పష్టమైందని వ్యాఖ్యానించింది. తీర్పు వెలువరిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘వాల్మీకీ వర్గీయులకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే దాడులు జరిగాయి. ఇది కుల విభేదాలకు సంబంధించిన హింస. స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లు గడచినా దళితులపై అగ్రవర్ణాల దాడులు ఆగట్లేవు. సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రెండు అంశాలు భారతీయ సమాజంలో ఏ మాత్రం కనిపించడం లేదు అంటూ 1949లో రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ ముందు ఉంచుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వాస్తవాలుగానే కనిపిస్తున్నాయి’ అని ధర్మాసనం పేర్కొంది. మిర్చ్‌పూర్‌లో లోహర్లు, చమర్లు, వాల్మీకీలు, బ్రాహ్మణులు, జాట్లు ఎక్కువగా ఉంటారు. వీరిలో జాట్లది ప్రాబల్య వర్గం. -
79కి చేరిన గ్రీస్ కార్చిచ్చు మృతుల సంఖ్య
ఏథెన్స్: గ్రీస్‌లోని ఏథెన్స్ సమీప అటవీప్రాంతాలను కార్చిచ్చు దహించివేస్తున్న ఘటనలో చనిపోయిన వారి సంఖ్య బుధవారం 79కి పెరిగింది. అగ్నికీలల బారిన పడిన వారిని రక్షించేందుకు ఈశాన్య ఏథెన్స్లోని తీరప్రాంత ఇళ్లలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. అగ్నికీలల్లో కాలిపోయిన ప్రతీ ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాధితుల జాడ కోసం అగ్నిమాపక సిబ్బంది అన్వేషణ కొనసాగిస్తున్నారు. కార్చిచ్చు వ్యాపించిన నివాస ప్రాంతాల్లో తమ వారి జాడ గల్లంతయ్యిందంటూ అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని సంబంధిత ఉన్నతాధికారి స్టారోలా మలిరి చెప్పారు. ఇంతవరకూ ఎంత మంది జాడ తెలియకుండా పోయిందో సంఖ్య చెప్పలేమని ఆమె అన్నారు. -
క్యూబాలో ఘోర విమాన ప్రమాదం!
హవానా: క్యూబాలో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ విమానయాన సంస్థ క్యూబానాకు చెందిన ఓ విమానం రాజధాని హవానాలోని జోస్ మార్టి విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉండగా ఎంతమంది మరణించిందీ కచ్చితంగా తెలియరాలేదు. బోయింగ్ 737 రకం విమానం హవానా నుంచి హోల్గ్యిన్ పట్టణానికి వెళ్తుండగా హవానాకు దగ్గర్లోనే పంట పొలాల్లో కూలి కాలిపోయింది. ప్రమాదం వల్ల దట్టమైన పొగ కమ్ముకున్న ఆ ప్రాంతానికి సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్–కేనెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మరణించిన వారి సంఖ్య భారీగానే ఉంటుందని చెప్పారు. -
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 27మంది మృతి
-
బస్సులో మంటలు
పట్నా: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చంపారన్ జిల్లాలో బస్సు రోడ్డుపక్కనున్న లోతైన గుంతలో పడి మంటలు చెలరేగటంతో దాదాపు 20 మంది వరకు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్య కచ్చితంగా తెలియట్లేదు. 28వ నంబర్ జాతీయ రహదారిపై కొట్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వా గ్రామ సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముజఫర్‌పూర్ నుంచి ఢిల్లీ వైపు వస్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న లోతైన గుంతలో పడింది. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల్లో 20 మందికి పైగా చనిపోయినట్లు తూర్పు చంపారన్ కలెక్టర్ ధ్రువీకరించారని మంత్రి దినేష్ చంద్ర యాదవ్ తెలిపారు. బస్సు కిటికీ అద్దాలు పగులగొట్టుకుని గాయాలతో బయటపడిన 11 మందిని వెంటనే ఆస్పత్రికి తరలించామని డీఎస్పీ మురళి మాంఝీ చెప్పారు. అయితే, ఘటన సమయంలో బస్సులో డ్రైవర్, హెల్పర్ కాకుండా 13 మంది మాత్రమే ఉన్నారని స్థానిక టీవీ చానెల్ పేర్కొంది. -
కూలిన విమానం.. 257 మంది మృతి
-
257 మంది దుర్మరణం
అల్జీర్స్: ఆఫ్రికా ఖండంలోని ఉత్తరాది దేశమైన అల్జీరియాలో బుధవారం ఘోర విమాన దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబాలతో వెళ్తున్న సైనిక విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతిచెందారు. రాజధాని అల్జీర్స్‌కి దగ్గరలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి టేకాఫ్ అయిన విమానం.. సమీపంలోని పొలాల్లో కూలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ఆ మంటల్లో చాలా మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డారని రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. విషయం తెలియగానే ప్రమాద స్థలానికి భారీగా అంబులెన్స్‌లు, ఫైరింజన్లు తరలివచ్చాయి. విమానం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించామని అల్జీరియా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2014లో ఉక్రెయిన్ గగనతలంలో ప్రయాణిస్తున్న మలేసియా విమానాన్ని వేర్పాటువాదులు కూల్చిన దుర్ఘటనలో 298 మంది మరణించిన అనంతరం జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే. ప్రమాదంపై అల్జీరియా రక్షణ శాఖ ప్రకటన చేస్తూ.. ‘మొత్తం 247 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. రక్షణ శాఖ సహాయ మంత్రి అహ్మద్ సలాహ్ ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణాలపై ఆయన విచారణకు ఆదేశించారు. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఇతరులతో కూడిన ఇల్యుషిన్ 2–76 రవాణా విమానం దక్షిణ అల్జీరియాలోని బౌఫరిక్ నుంచి పశ్చిమ సహారా సమీపంలోని బెచార్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మధ్యలో టిన్డౌఫ్లో విమానం ఆగాల్సి ఉంది. పశ్చిమ సహారా ప్రాంతం ప్రస్తుతం మొరాకో అధీనంలో ఉండగా.. దాని స్వాతంత్య్ర పోరాటానికి అల్జీరియా మద్దతిస్తోంది. 300 మంది అత్యవసర సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, విమానమే మంటల్లో కాలిపోవడంతో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ ఇల్యుషిన్ 2–76 రవాణా విమానం రష్యాలో తయారైంది. గతంలోనూ.. గత ఆరేళ్లలో అల్జీరియాలో అనేక సైనిక, పౌర విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. డిసెంబర్ 2012న రెండు సైనిక విమానాలు ఆకాశంలో ఢీకొనడంతో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. ఫిబ్రవరి 2014న టమన్రస్సెట్ నుంచి కాన్స్టాంటిన్కు ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న సీ–130 హెర్క్యులస్ ఆర్మీ విమానం కూలడంతో 77 మంది మరణించారు. ప్రతికూల వాతావరణం వల్ల ప్రమాదం జరిగిందని అప్పట్లో రక్షణ శాఖ ప్రకటించింది. జూలై, 2014న బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు వెళ్తున్న ఎయిర్ అల్జేరీ విమానం ఉత్తర మాలిలో కూలిపోవడంతో 116 మంది మరణించారు. వీరిలో 54 మంది ఫ్రెంచ్ జాతీయులున్నారు.