తగులబడుతున్న బస్సు
కన్నౌజ్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో ఆ రెండు వాహనాలూ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది జాడ తెలియాల్సి ఉంది. బస్సుకు నిప్పంటుకుని 21 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రక్‌తో ఢీ కొనడంతో డీజిల్ ట్యాంక్ పేలిపోయి బస్సుకు నిప్పంటుకుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని పోలీసులు తెలిపారు. ఫరుఖాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న బస్సులో మొత్తం 45 మంది ప్రయాణీకులున్నారు.
చిలోయి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలియగానే, పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు. 21 మందిని రక్షించి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని ఐజీపీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. మంటలను అదుపుచేశామని, సహాయచర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రమాద సమాచారం తెలియగానే సీఎం ఆదిత్యనాథ్ తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment