లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలోని సేలంపూర్ వద్ద ఓ వ్యాన్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
#Bulandshahr #बुलंदशहर: बस और पिकअप की टक्कर में 9 लोगों की #मौत, 16 #घायल #गाजियाबाद की एक कंपनी से मैक्स में सवार सभी लोग अपने घर अलीगढ़ रक्षाबंधन का त्यौहार मनाने जा रहे थे#Accident #ghaziabad #RoadAccident @bulandshahrpol @myogioffice @dmbulandshahr @Uppolice @UPGovt pic.twitter.com/TLETZCCwMw
— Goldy Srivastav (@GoldySrivastav) August 18, 2024
ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా అలీగఢ్ జిల్లా రాయ్ పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ చంద్రప్రకాశ్ సింగ్, ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ జిల్లా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.
ఈ ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, మృతులను అలీఘర్ జిల్లా అత్రౌలీ తహసీల్‌లోని రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment