Uttar Prades
-
ఘోర బస్సు ప్రమాదం.. పది మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలోని సేలంపూర్ వద్ద ఓ వ్యాన్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. #Bulandshahr #बुलंदशहर: बस और पिकअप की टक्कर में 9 लोगों की #मौत, 16 #घायल #गाजियाबाद की एक कंपनी से मैक्स में सवार सभी लोग अपने घर अलीगढ़ रक्षाबंधन का त्यौहार मनाने जा रहे थे#Accident #ghaziabad #RoadAccident @bulandshahrpol @myogioffice @dmbulandshahr @Uppolice @UPGovt pic.twitter.com/TLETZCCwMw— Goldy Srivastav (@GoldySrivastav) August 18, 2024 ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా అలీగఢ్ జిల్లా రాయ్ పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ చంద్రప్రకాశ్ సింగ్, ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ జిల్లా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, మృతులను అలీఘర్ జిల్లా అత్రౌలీ తహసీల్‌లోని రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. -
జువెనైల్ హోమ్‌లో అమానుషం.. పిల్లలను చెప్పుతో కొట్టిన అధికారి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జువెనైల్ హోమ్‌లో పిల్లలకు రక్షణ కల్పించాల్సిన ఓ ప్రభుత్వ అధికారి చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించింది. బాల ఖైదీలుగా హోమ్‌లోకి వచ్చిన పిల్లలకు మంచి బుద్దులు, సత్ప్రవర్దన అలవాటు చేయాల్సిన ఓ మహిళా అధికారి తన బాధ్యతలు మరిచి వారిపై చేయి చేసుకుంది. చిన్న పిల్లలనే కనికరం లేకుండా కర్కశంగా కొట్టింది. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. మహిళా సూపరింటెండెంట్ చిన్నారులను కొడుతున్న దృశ్యాలు జువెనైల్ హోమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ గదిలో ఆరుగురు చిన్నారులు బెడ్స్ మీద పడుకొని ఉన్నారు. అక్కడికి వచ్చిన సూపరిండెండ్ పాల్ ఇతర ఉద్యోగులు చూస్తుండానే ఒక్కసారిగా ఓ చిన్నారిపై దాడి చేసింది. చెప్పుతో పదే పదే చెంపదెబ్బలు కొట్టింది. మిగతా పిల్లలను కూడా తిడుతుండటం వీడియోలో కనిపిస్తుంది. అదే జువెనైల్ హోమ్‌లో నుంచి మంగళవారం మరో వీడియో బయటకు వచ్చింది. ఇందులో మళ్లీ సూపరిండింట్ ఏడేళ్ల వయస్సున్న ఓ అమ్మాయి చేతులు, కాళ్లు మంచానికి కట్టేసి పడుకోబెట్టింది. విడిపించుకనేందుకు ఆమె ప్రయత్నించినా సాధ్యపడలేదు. మంచం కిందకు జారిపోతుంది. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారి ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జువెనైల్ హోమ్‌లో చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సందరు సూపరింటెండెంట్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. In #Agra's govt run children shelterhome (Pachkuiyaan), Poonam Lal, the center superintendent was caught slapping a girl with slippers. Earlier she was booked for abetment to suicide in #Prayagraj district in 2021 after a 15-yr-old girl allegedly killed her self in shelter home pic.twitter.com/JE5V56jR7l — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 12, 2023 రెండు ఘటనలపై ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపారు. క్రూరంగా వ్యవహరించిన హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్‌ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అంతేగాక కొన్ని రోజుల క్రితం ఆ హోమ్‌లో ఓ చిన్నారి ఆత్మహత్యకు సైతం ప్రయత్రించింది. కాగా పూనమ్ పాల్ గతంలోప్రయాగ్ రాజ్‌లో పనిచేసింది. అక్కడ కూడా పిల్లలపట్ల ఇంతే క్రూరంగా వ్యవహరించారని అధికారుల విచారణలో తేలింది. The department of woman and child development #UttarPradesh has suspended the accused superintendent Poonam Pal based on the investigation of #Agra DM. pic.twitter.com/jnLIxQtiQq — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 12, 2023 ఆగ్రా డివిజన్ కమీషనర్ రీతూ మహేశ్వరి మాట్లాడుతూ.. ఈ సంఘటనలతో సంబంధం ఉన్న హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్,ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆమెపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యిందని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించామని పేర్కొన్నారు. -
ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. 15 నిమిషాల్లోనే
ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇన్‌స్టా, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, పోలీసులు సకాలంలో స్పందించడంతో యువకుడిని క్షేమంగా రక్షించారు. మెటా ఈమెయిల్ అలారం ద్వారా స్పందించిన పోలీసులు 15 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకోవడంతో వ్యక్తి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు..యూపీలోని కన్నౌజ్ ప్రాంతానికి చెందిన 23ఏళ్ల అభయ్ శుక్లా అనే యువకుడు ప్రస్తుతం ఘజియాబాద్‌లోని విజయ్ నగర్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈవీడియోను గమనించిన కాలిఫోర్నియాలోని మెటా హెడ్‌క్వార్టర్స్ ఉత్తర ప్రదేశ్ పోలీసులకు చెందిన సోషల్ మీడియా సెంటర్‌కు ఈమెయిల్ అలర్ట్ పంపింది. శుక్లా రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌ను కూడా పంపించింది. చదవండి: జమ్మూ కశ్మీర్లో జోషిమఠ్ పరిస్థితులు.. కుంగుతున్న భూమి, ఇళ్లకు పగుళ్లు వెంటనే అప్రమత్తమైన యూపీ పోలీసులు వ్యక్తి వివరాలను ఘజియాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు.. అటు నుంచి విజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఫోన్ నెంబర్ ఆధారంగా కేవలం 15 నిమిషాల్లోనే లోకేషన్ ట్రేస్ చేసి సంఘటన స్థలానికి చేరుకొని వ్యక్తి ప్రాణాలు రక్షించారు. బాధితుడిని కుటుంబ సభ్యులకు అప్పగించే ముందు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే సోదరి వివాహం కోసం తల్లి కూడబెట్టిన 90,000 రూపాయలను శుక్లా అప్పుగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ మెత్తాన్ని బిజినెస్ వెంచర్లో తనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఉపయోగించడంతో డబ్బులు అన్నీ పోగొట్టుకోవడంతో ఆత్మహత్యకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయం ఇక మీదట తీసుకోవద్దని హెచ్చరించినట్లు చెప్పారు. చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? -
అతనికి 90.. అమెకు 75.. పెళ్లితో ఒక్కటైన జంట
లక్నో: జీవితంలో తోడు అనేది తప్పనిసరి.. పుట్టి పెరిగేదాక తల్లిదండ్రులు, పెళ్లయ్యాక భర్త, భార్య తోడు, వృద్ధాప్యంలో పిల్లలు తోడు ఎంతో అవసరం. ఒకవేళ అనుకోని కారణాలతో పెళ్లి తరువాత భర్త, భార్య చనిపోతే, వదిలేసి వెళ్లినా మరొకరిని వివాహం చేసుకుని తోడుగా ఉంటారు. తాజాగా 90 ఏళ్ల తాత, 75 ఏళ్ల బామ్మ పెళ్లి చేసుకొని జీవితంలో భాగస్వామి అవసరాన్ని తెలియజేశారు. అయితే వీరిద్దరికి ఇది రెండో వివాహం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జనపథ్ రామ్‌పూర్ పరిధిలోని నర్ఖేడీ నివాసి షఫీ అహ్మద్(90) భార్య చాలాకాలం క్రితమే మరణించింది. ఇతనికి అయిదుగురు కుమార్తెలు. చిరు వ్యాపారం చేస్తూ పిల్లలందరి పెళ్లిళ్లు చేసిన అహ్మద్ ప్రస్తుతం వయసు మీదపడటంతో ఇంట్లోనే ఉంటున్నాడు. కుమార్తెలకు పెళ్లిళ్లు కావడంతో వారి వారంతా అత్తగారింటికి వెళ్లిపోయారు. అయితే తండ్రి ఒంటరివాడైపోవడంతో అతనికి కుమార్తెలు మళ్లీ వివాహం చేయాలనుకున్నారు. ఆలోచనతోనే ఆగిపోకుండా ఆచరణలోనూ ముందుండి నడిపించారు. 75 ఏళ్ల ఆయషా అనే వృద్ధురాలితో తండ్రికి వివాహం జరిపించి, తండ్రి ఒంటరితనాన్ని దూరం చేశారు. చివరి దశలో తన తండ్రిని ఆమె జాగ్రత్తగా చూసుకుంటుందని ఇలా చేసినట్లు కూతుళ్లు తెలిపారు. ఏది ఏమైనా వృద్ధాప్యంలో తోడు ఆవశ్యకతను తెలుపుతూ ఒక్కటైన ఈ జంట పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్ నాతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు.. దిమ్మతిరిగిందా! -
ఊరిని మార్చడం కోసం 81 ఏళ్ల వృద్ధురాలు
ఊరే ముందు పుట్టిందో, రాణిదేవే ముందు పుట్టారో ఆ ఊళ్లో ఎవరికీ తెలియదు. ఊళ్లోని చెట్టూ పుట్టా, చేనూ చెరువూ, కొండా కోన ఆమె కళ్ల ముందే ఎదిగాయి. ఎదగకుండా ఉన్నది మాత్రం ఊరే. ఎదగని ఆ ఊరిని చూస్తూ.. ఇక చూస్తూ ఊరుకోకూడదని నిర్ణయించుకున్నారు రాణి దేవి. రాణిదేవి బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యురాలో, లేక ‘గ్రామ ప్రధాన్’నో కానవసరం లేదు. ఆమెకై ఆమె వెళ్లి అడిగితే గ్రామంలోని ఏ ప్రభుత్వ ఉద్యోగి, అధికారి అయినా వెంటనే కుర్చీలోంచి లేచి, ఎదురెళ్లి ఆమెకు నమస్తే పెట్టి, అవసరమైన పని చేసిపెట్టేంత గౌరవనీయమైన పెద్ద వయసులో ఉన్నారు రాణిదేవి. 81 ఏళ్లు! అసలైతే ప్రభుత్వమే ఆమె దగ్గరకు రావాలి. ఆమె ప్రభుత్వం దగ్గరకు వెళ్లే అవసరం లేదు. ఉందీ అంటే ఆ గ్రామంలో ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే! ఎలాగంటే ఒక వృద్ధ మహిళ అడిగితేనే లక్ష్య పెట్టని ప్రభుత్వ సిబ్బంది.. తక్కినవారు అడిగితే పని చేసి పెడతారా?! అలా చేసి పెట్టి ఉంటే ఈ ఎనభై ఏళ్లలో.. రాణిదేవికి ఊహ తెలిసినప్పటి నుంచైతే.. ఈ డెబ్బై ఏళ్లలో రుద్రాపూర్ ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి. అభివృద్ధి అంటే పెద్దగా ఏం కాదు.. మంచి రోడ్లు, మంచి నీరు, శుభ్రమైన పరిసరాలు.. ఇలా మనిషి మనుగడకు అవసరమైన కనీస వసతులు. కానీ రుద్రాపూర్‌లో ఏడు దశాబ్దాలుగా ఇవేవీ లేవు. చిత్రంగా ఉంటుంది.. వచ్చి వెళ్లిన పాలకులు, అధికారులు ఏం చేసినట్లు?! ∙∙ ఏం చేయలేదని, ఏం చెయ్యరు కూడానని చివరికి రాణిదేవే బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యురాలిగా నిలబడేందుకు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్ 15 నుంచి విడతల వారిగా పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. మే 2 న కౌంటింగ్. అదే రోజు ఫలితాలు రావచ్చు. ఏ పంచాయితీకి ఏ ఫలితం వచ్చినా.. కాన్పూర్ జిల్లా చౌబేపుర్ బ్లాక్ కౌన్సిల్ సభ్యురాలిగా రాణిదేవి గెలవడం అత్యుత్తమ ఫలితం అవుతుంది. రాణిదేవి స్వగ్రామమైన రుద్రాపూర్ ఆ బ్లాక్ పరిధిలోనిది. ఆమె గెలుపు ఎలా అత్యుత్తమమైన ఫలితం అవుతుందో చూడండి. ఆమేమీ అధికారం కోసం, పదవి కోసం, నాలుగు రాళ్లు సంపాదించుకోవడం కోసం ఈ వయసులో నామినేషన్ వేయలేదు. ఏదైనా ఒక పార్టీ తరఫున అసలే పోటీ చేయడం లేదు. తనకై తను సొంతంగా, స్వతంత్ర అభ్యర్థిగా, ఊరిని మార్చడం కోసం ఎన్నికల్లో నిలబడ్డారు. ‘‘నన్ను గెలిపిస్తే ఊరిని నివాస యోగ్యం చేస్తాను’’ అని రాణిదేవి అంటున్నారు. మంచి మాటే! ఆకాశాన్ని కిందికి తెస్తాం, భూమిని పైకి తీసుకెళతాం అని హామీలు ఇవ్వడం కాకుండా.. ఊళ్లో నివాసం ఉండే పరిస్థితుల్ని కల్పిస్తాను అని రాణిదేవి అనడం.. ‘ఊరొదిలి ఎక్కడికీ వెళ్లనవసరం లేదు’ అని నమ్మకమైన హామీని ఇవ్వడమే. అయినా రుద్రాపూర్ గ్రామ ప్రజలు ఊరెందుకు వదలి వెళ్లాల్సి వస్తుంది?! ∙∙ ఇన్నేళ్లుగా ఊరిని చూస్తూనే ఉన్నారు కదా రాణిదేవి.. ఊళ్లో సరైన రోడ్లు లేవు. ఆ ఊళ్లో కాలి నడక కూడా మనిషిని కిందపడేస్తుంది. ఎగుడు దిగుడు దిబ్బలే అక్కడి రహదారులు. ఎక్కడ పడితే అక్కడ చెత్త కొండలా పేరుకుపోయి ఉంటుంది. ఊరి నిండా మురికి కుంటలే. అంత ‘సౌకర్యవంతంగా’ ఉంటే దోమలు తమ సంతతి ని వృద్ధి చేసుకోకుండా ఉంటాయా, మనుషుల్ని ఆసుపత్రులకు చేర్చకుండా ఉంటాయా?! పరిశుభ్రత అన్న మాటే కనిపించదు. చెప్పీ చెప్పీ ఊళ్లో వాళ్ల నోళ్లు పోయాయి తప్పితే, వాళ్ల ఓట్లతో గెలిచిన పంచాయితీ పాలకులు సక్రమంగా చెత్తను ఎత్తి పారేయించింది లేదు. మురికి కాలవల్ని సాఫీగా పారించింది లేదు. దోమల్ని తరిమిందీ లేదు. ‘‘ఇదిగో ఈ దుస్థితినంతా పోగొట్టి ఊరిని చక్కబరుస్తాను’’ అంటున్నారు రాణిదేవి పట్టుపట్టినట్లుగా. ‘‘పూర్వపు పాలకుల వైఫల్యాలను మా అమ్మ ఎత్తి చూపించడమే కాకుండా, ఎత్తి పారేయబోతున్నారు కూడా’’ అని రాణిదేవి కుమారుడు చాంద్ పాల్ అంటున్నారు. రాణిదేవి మనవరాలు కూడా తన నానమ్మను గెలిపిస్తే ఊరెంత వెలిగిపోతుందో చెబుతూ ఆమె తరఫున ప్రచారం చేస్తోంది. అయితే ఎవరూ ‘ఓట్ ఫర్’ అని చెప్పకుండానే... రుద్రాపుర్ బ్లాక్‌లోని వారంతా ఇప్పటికే మూకుమ్మడిగా రాణిదేవికే ఓటు వేయాలని తీర్మానించుకున్నారు. -
అయోధ్య: 4 లక్షల లడ్డూలు సిద్ధం
లక్నో (ఉత్తర ప్రదేశ్): రామ మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ప్రధానితోపాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 50 మంది అతిథులు కూడా హాజరుకానున్నారు. అయోధ్య నిర్మాణాన్ని పర్యవేక్షించే ఆలయ పాలక మండలి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భూమి పూజ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు లడ్డూలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు నాలుగు లక్షల ప్యాకెట్ల లడ్డూలను ఆర్డర్ ఇచ్చినట్లు ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 5న జరిగే కార్యక్రమానికి మొత్తం 1,11,000 వేల లడ్డూలు సిద్ధమవుతునన్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటిని రామ్ దాస్ చావ్ని అనే వ్యక్తి వద్ద తయారు చేస్తున్నట్లు తెలిపారు. (అయోధ్యలో హైఅలర్ట్) ఆగస్టు 3వ తేదీన గణేశుడి పూజతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఆగస్టు 5వ తేదీన గర్భగుడిలో జరిగే పూజ కోసం 11 మంది పండితులు వేదమంత్రాలు చదవనున్నారు. ప్రధాని మోదీ చేత భూమిపూజ చేపట్టనున్నారు. పూజా కార్యక్రమానికి 600 మంది సాధువులను ఆహ్వానించాలని ట్రస్ట్ నిర్ణయించింది. అలాగే కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేవలం 200 మందిని మాత్రమే వేడుకకు ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. పూజ నిర్వహించనున్న రామ మందిరం పూజారి ప్రదీప్ దాస్ తాజాగా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పూజారికి కరోనా సోకడంతో ఏం చేయాలనే దానిపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. (అయోధ్య పూజారికి కరోనా) -
ఇందుకే క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయేది..
లక్నో : కరోనా వైరస్ కట్టడి కోసం ఏర్పాటుచేసిన కంటైన్మెంట్ జోన్లలో ఆగ్రా- మోడల్ ఆదర్శంగా నిలుస్తుందని గొప్పలు చెప్పుకొని ప్రచారం చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడి అధికారులు షాక్ ఇచ్చారు. కంటైన్మెంట్ జోన్లలో పాటించాల్సన కనీస జాగ్రత్త చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆదివారం ఓ క్వారంటైన్ సెంటర్లో బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు లాంటి వాటిని గేటు అవతలివైపు నుంచి విసిరేశారు. కొన్నింటిని గ్రిల్స్‌కి దగ్గర్లో ఉంచారు.దీంతో వాటిని తీసుకోవడానికి అక్కడున్న వారు ఎగబడ్డారు. ఏ మాత్రం సామాజిక దూరం పాటించకుండా గ్రిల్స్ దగ్గరగా ప్రజలు ఒక్కసారిగా గుమిగూడారు. కనీస జాగ్రత్త చర్యలు చేపట్టకుండా అధికారులు గేటు అవతలి వైపు చోద్యం చూస్తూ నిల్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన జిల్లా మెజిస్ట్రేట్ ప్రభు నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఫిర్యాదుల తలెత్తకుండా చూడాల్సిందిగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆగ్రాలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా మరణాల రేటు ఇప్పటికే 10దాటింది. ఈ నేపథ్యంలో ఆగ్రాలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని..ఇది వూహాన్‌లా మారొచ్చని మేయర్ నవీన్ జైన్ అన్నారు. పరిస్థితిపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసిన ఆయన.. కరోనా వ్యాప్తిని అడ్డకట్ట వేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు. క్వారంటైన్ సెంటర్లో ప్రజలను జంతువుల్లా చూస్తారనడానికి ఇదొక ఉదాహరణ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అఖిలేష్‌ప్రతాప్ సింగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆగ్రా రోల్ మోడల్ ఇదేనా అని ప్రశ్నించారు. -
మంటల్లో బస్సు
కన్నౌజ్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో ఆ రెండు వాహనాలూ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది జాడ తెలియాల్సి ఉంది. బస్సుకు నిప్పంటుకుని 21 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రక్‌తో ఢీ కొనడంతో డీజిల్ ట్యాంక్ పేలిపోయి బస్సుకు నిప్పంటుకుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని పోలీసులు తెలిపారు. ఫరుఖాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న బస్సులో మొత్తం 45 మంది ప్రయాణీకులున్నారు. చిలోయి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలియగానే, పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు. 21 మందిని రక్షించి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని ఐజీపీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. మంటలను అదుపుచేశామని, సహాయచర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రమాద సమాచారం తెలియగానే సీఎం ఆదిత్యనాథ్ తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. -
వివస్త్రను చేసి ఊరంతా పరుగెత్తించారు!
భదోహీ: ఈవ్‌టీజింగ్‌ను ప్రతిఘటించిన ఓ మహిళపై దాడిచేసిన పోకిరీలు, ఆమెను వివస్త్రను చేసి ఊరంతా పరుగెత్తించారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహీ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గోపీగంజ్ ప్రాంతంలో ఉన్న ఓ ఊరిలో శనివారం బాధితురాలిని లాల్‌చంద్ర యాదవ్ అనే ఆకతాయి వేధించాడు. దీన్ని సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో యాదవ్ మరో ముగ్గురితో కలిసి ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఆతర్వాత ఆమెను వివస్త్రను చేసి ఊరంతా పరుగెత్తించారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. బాధితురాలు చికిత్స పొందుతోందని తెలిపారు. కేసు నమోదుచేయడంతో పాటు ఓ నిందితుడ్ని అరెస్ట్ చేశామన్నారు. -
మహిళలకు మాజీ మంత్రి షాకింగ్ సలహా
రాంపూర్: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజంఖాన్ మరోసారి తనదైన శైలిలో వార్తలు నిలిచారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరగకుండా ఉండాలంటే మహిళలు ఇళ్లలో ఉండటమే మేలు అని ఆయన షాకింగ్ సలహా ఇచ్చారు. తన జిల్లా రాంపూర్‌లో ఇద్దరు అమ్మాయిలను 14మంది ఆకతాయిలు అత్యంత దుర్మార్గంగా లైంగికంగా వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో వెలుగుచూసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలో యోగి సర్కారు వచ్చిన తర్వాత నేరాలు అమాంతం పెరిగిపోయాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ఒకవైపు సమాజ్‌వాదీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా అందుకు భిన్నంగా ఆజంఖాన్ స్పందించారు. 'రాంపూర్‌లో అమ్మాయిలను వేధించిన ఘటనలో ఆశ్చర్యపోవడానికేముంది. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు పెరిగిపోయాయి' అని ఆయన అన్నారు. బులంద్‌షహర్ గ్యాంగ్‌రేప్ ఘటన తర్వాత మహిళలు ఇంట్లో ఉండేలా పురుషులు చూసుకోవడమే మంచిది. అమ్మాయిలు కూడా అసభ్య ఘటనలు చోటుచేసుకునే ప్రదేశాలకు వెళ్లకూడదు' అంటూ ఆయన సలహా ఇచ్చారు. 14 ఏళ్ల కూతురిని, తల్లిని గ్యాంగ్‌రేప్ చేసిన బులంద్‌షహర్ ఘటనపై అప్పట్లో మంత్రిగా ఉన్న ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అఖిలేశ్ ప్రభుత్వాన్ని బద్నా చేసే రాజకీయ కుట్రతోనే ఈ ఘటన జరిగిందని ఆయన పేర్కొనడం దుమారం రేపింది. -
అమ్మాయిలపై వేధింపుల షాకింగ్ వీడియో!
-
అమ్మాయిలపై వేధింపుల షాకింగ్ వీడియో!
రాంపూర్: పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఇద్దరు అమ్మయిలను 14 మంది ఆకతాయిలు అత్యంత కిరాతకంగా లైంగికంగా వేధించిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగుచూసింది. ఇద్దరు అమ్మాయిలను ఆకతాయిలు లైంగికంగా వేధించి.. అసభ్యంగా తాకుతూ, తిడుతూ అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. రాంపూర్ జిల్లా తాండ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి.. ఇతర నిందితులను పట్టుకునేందుకు గాలింపులు చేపడుతున్నారు. ఆకతాయిల చేతిలో వేధింపులు ఎదుర్కొన్న ఇద్దరు బాధితులను సైతం గుర్తించారు. చుట్టూ చెట్లు ఉన్న పరిసరాల్లో బైకుల వచ్చినట్టు కనిపించిన ఆకతాయిల ఇద్దరు అమ్మాయిలపైనే చెలరేగిపోయారు. అత్యంత దుర్మార్గంగా ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించారు. వారిని అసభ్యంగా తాకుతు, తోసేస్తూ, తిడుతూ కనిపించారు. నిస్సహాయస్థితిలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు కేకలు పెడుతూ, తమను విడిచిపెట్టాలని దీనంగా అర్థించారు. అయినా ఆ కిరాతకులు పట్టించుకోకుండా వారిని లైంగికంగా వేధించి.. తమలోని క్రూరత్వాన్ని చాటుకున్నారు. యూపీలో భారీ మెజారిటీతో బీజేపీకి చెందిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో నేరాలు అమాంతం పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణిస్తుండటంతో ప్రతిపక్షాలు అదేపనిగా యోగి సర్కారుపై మండిపడుతున్నాయి.