వివస్త్రను చేసి ఊరంతా పరుగెత్తించారు! | Woman disrobed, thrashed and chased on streets in UP' | Sakshi
Sakshi News home page

వివస్త్రను చేసి ఊరంతా పరుగెత్తించారు!

Published Mon, Dec 31 2018 5:43 AM | Last Updated on Mon, Dec 31 2018 5:43 AM

Woman disrobed, thrashed and chased on streets in UP' - Sakshi

భదోహీ: ఈవ్‌టీజింగ్‌ను ప్రతిఘటించిన ఓ మహిళపై దాడిచేసిన పోకిరీలు, ఆమెను వివస్త్రను చేసి ఊరంతా పరుగెత్తించారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహీ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గోపీగంజ్‌ ప్రాంతంలో ఉన్న ఓ ఊరిలో శనివారం బాధితురాలిని లాల్‌చంద్ర యాదవ్‌ అనే ఆకతాయి వేధించాడు. దీన్ని సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో యాదవ్‌ మరో ముగ్గురితో కలిసి ఆమెపై విచక్షణారహితంగా    దాడిచేశారు. ఆతర్వాత ఆమెను వివస్త్రను చేసి ఊరంతా పరుగెత్తించారు.      ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయమై         పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. బాధితురాలు చికిత్స పొందుతోందని తెలిపారు. కేసు నమోదుచేయడంతో పాటు ఓ నిందితుడ్ని అరెస్ట్‌ చేశామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement