eveteasing
-
Shivani Sisodia: ఈ శివానీ శివంగి!
సమస్యలు ఎదురైనప్పుడు పారిపోయేవారు కొందరైతే.. సమస్య మూలాలను కనుక్కొని దానిని కూకటివేళ్లతో సహా పెకలించేసేవారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే 18 ఏళ్ల శివానీ సిసోడియా. రాజస్థాన్‌కు చెందిన శివానీ జీవితంలో ఎదురైన ఓ సంఘటన తన ఆలోచనా విధానాన్ని మార్చడంతో సెల్ఫ్ డిఫెన్స్ తను నేర్చుకుని, వందలమంది అమ్మాయిలకు శిక్షణనిస్తూ ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతోంది. దీని వెనకాల ఒక కథ ఉంది. శివానీ పదోతరగతిలో ఉన్నప్పుడు.. ఒకరోజు స్కూలు అయిపోయిన తరువాత తన స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయం లో అటుగా వెళ్తున్న కొందరు పోకిరీలు శివానీ వాళ్లను అసభ్యంగా కామెంట్ చేస్తూ.. ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఏం చేయాలో వాళ్లకు అర్థం కాలేదు. దాంతో వారినుంచి ఎలాగో తప్పించుకుని అక్కడినుంచి పారిపోయారు. మరుసటిరోజు స్కూలుకు వెళ్లిన శివానీ ముందురోజు జరిగిన విషయాన్ని తన స్నేహితులతో పంచుకోగా... వాళ్లు తాము కూడా అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పడంతో శివానీకి ఆశ్చర్యమేసింది. ‘ఎందుకు మీరు వాళ్లను ఎదుర్కోలేదు’ అని స్నేహితులను ప్రశ్నించింది. అప్పుడు వాళ్లు ‘ఏమో ఆ సమయంలో ఏం చేయాలో తట్టలేదు, వాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు’ అని చెప్పారు. అప్పుడే నిర్ణయించుకుంది శివానీ... నేను మాత్రం ఇంకోసారి ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు అస్సలు భయపడకూడదు అని. ఇందుకోసం ఆమె తన మనసును, శరీరాన్ని దృఢం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు, స్కూలు టీచర్, యోగా టీచర్ల సాయంతో ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. తరువాత రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని రాజస్థాన్ కరాటియన్స్ స్కూల్లో చేరింది. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు శ్రద్ధతో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంది. తనలా అమ్మాయిలందర్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో శివానీ తన కోచ్ ఓంకార్‌తో కలిసి ఆడపిల్లల కోసం ఆత్మరక్షణపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలా రెండేళ్లలో.. స్కూళ్లు, కాలేజీకెళ్లే 1500 మందికి పైగా విద్యార్థినులకు శివానీ శిక్షణ నిచ్చింది. ‘‘మా కరాటే స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తీసుకుంటున్న అమ్మాయిలందరిలోకి, శివానీ చాలా చురుకైనది. ఆత్మరక్షణ మెళకువలను సులువుగా నేర్చుకుంది. జాతీయస్థాయి కుస్తీపోటీలలో రజత పతకం కూడా గెలుచుకుంది. శివానీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే పద్ధతి చాలా విలక్షణంగా ఉంటుంది’’ అని శివానీ ట్రైనర్ ఓంకార్ పంచోలి చెప్పారు. శివానీ మాట్లాడుతూ..‘‘నాకు అద్భుతమైన ట్రైనర్ దొరకడంతో ఆత్మరక్షణ విద్యలను ఎంతో బాగా నేర్చుకున్నాను. నేటి తరం అమ్మాయిలకు తమని తాము కాపాడుకోగల శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా ఉండాలి. అందుకే నేను నేర్చుకోవడమేగాక ఎంతోమందికి నేర్పిస్తున్నాను. ఎవరైనా ఆకతాయులు దాడిచేసినప్పుడు వారి నుంచి తప్పించుకోవడమేగాక వారిపై ఎదురు దాడికి ఎలా దిగాలో నేర్పిస్తుండడం వల్ల వాళ్లు ఎంతో కాన్ఫిడెంట్ గా తమ ఇళ్లకు ఒంటరిగా వెళ్లగలుగుతున్నారు’’ అని చెప్పింది. శివానీకి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వాళ్లలో ఒకరు జూడో ఛాంపియన్, మరొకరు తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ హోల్డర్. -
వివస్త్రను చేసి ఊరంతా పరుగెత్తించారు!
భదోహీ: ఈవ్‌టీజింగ్‌ను ప్రతిఘటించిన ఓ మహిళపై దాడిచేసిన పోకిరీలు, ఆమెను వివస్త్రను చేసి ఊరంతా పరుగెత్తించారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహీ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గోపీగంజ్ ప్రాంతంలో ఉన్న ఓ ఊరిలో శనివారం బాధితురాలిని లాల్‌చంద్ర యాదవ్ అనే ఆకతాయి వేధించాడు. దీన్ని సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో యాదవ్ మరో ముగ్గురితో కలిసి ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఆతర్వాత ఆమెను వివస్త్రను చేసి ఊరంతా పరుగెత్తించారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. బాధితురాలు చికిత్స పొందుతోందని తెలిపారు. కేసు నమోదుచేయడంతో పాటు ఓ నిందితుడ్ని అరెస్ట్ చేశామన్నారు. -
ఈవ్‌టీజింగ్‌కు అడ్డుచెప్పినందుకు..
లక్నో : ఈవ్‌టీజింగ్‌ను వ్యతిరేకించినందుకు పదిమంది దుండగులు ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు దారుణంగా కొట్టిన ఘటన యూపీలోని షమ్లి జిల్లాలో ఆదివారం వెలుగుచూసింది. జింఝన ప్రాంతంలోని మచురౌలి గ్రామంలో ఈవ్‌టీజింగ్‌ను వ్యతిరేకించిన మహిళ ఇంటిపై పదిమంది దాడి చేసి పదునైన ఆయుధాలతో ఆమెను, కుటుంబ సభ్యులను గాయపరిచారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయని, కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఇక ముజఫర్‌నగర్‌లో ఏడు నెలల కిందట 15 ఏళ్ల దళిత బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులు కులదీప్, మాలతిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పుర్కాజీ బ్లాక్ పరిధిలోని గ్రామంలో బాలికను అటవీ ప్రాంతంలోకి వీరు తీసుకెళ్లారని, అక్కడ వేచిఉన్న మరో ఏడుగురు కలిసి బాలికపై సామూహిక లైంగిక దాడికి తెగబడి హత్య చేశారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
రైళ్లలో ఈవ్‌టీజింగ్ చేస్తే మూడేళ్ల జైలు
న్యూఢిల్లీ: రైళ్లలో మహిళలను వేధించే వారికి కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడేలా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యోచిస్తోంది. ఈ దిశగా రైల్వే చట్టంలో మార్పులు చేసేలా ప్రతిపాదన తెస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే భారత శిక్షాస్మృతిలో పేర్కొన్న శిక్ష కన్నా.. ఈ శిక్ష భారీగా ఉండే అవకాశం ఉంది. ‘ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే మేం వేగంగా స్పందించేందుకు వీలవుతుంది’’ అని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. రైళ్లలో మహిళలపై నేరాలకు సంబంధించి 2014–16 మధ్య కాలంలో 1,607 కేసులు నమోదయ్యాయి. -
మహిళలకు మీరే భద్రత
► మహిళలకు మీరే భద్రత ► వారికి భరోసా కల్పించేలా విధులు నిర్వర్థించాలి ► ఈవ్‌టీజింగ్‌ను రూపుమాపాలి ► లింగ వివక్ష లేని సమాజం నిర్మిద్దాం ► డీఐజీ అకున్ సబర్వాల్ మహబూబ్‌నగర్ క్రైం : ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు భద్రత లేకుండా పోయింది.. ఇంకా మహిళ బస్సులో ఒంటరిగా ప్రయాణించడానికి భయపడుతోంది. మీకు మేమున్నాం అంటూ భరోసా కల్పించాల్సిన బాధ్యత మన పోలీస్‌శాఖదే.. అని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ అన్నారు. పోలీస్ శాఖ, పీపుల్ ఫర్ పారిటి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మహిళల రక్షణ అనే అంశంపై మూడురోజులపాటు నిర్వహించే వర్క్‌షాప్‌నను డీఐజీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట పోలీస్ అతిథిగృహంలో ఎస్పీ రెమారాజేశ్వరి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి చేరుకోగా సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డీఐజీ సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సుమారు 480 అత్యాచార కేసులను పరిశీలిస్తే సమాజంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఇతర దేశాల్లో ఎక్కడాలేని విధంగా ఇక్కడి మహిళలు ఈవ్‌టీజింగ్ బారిన పడుతున్నారని, ఇలాంటి ఘటనలకు ఇక నాంది పలకలన్నారు. లింగ వివక్ష లేని సమాజ నిర్మాణానికై పోలీస్‌శాఖ ప్రధాన భూమిక పోషించాలని ఆదేశించారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, దాడుల గురించి క్లుప్తంగా తెలుసుకుని వాటిని అరికట్టాడానికి మీవంతుగా కృషి చేయాలని సూచించారు. ఈ వర్క్‌షాప్ మహబూబ్‌నగర్‌లో విజయవంతమైతే రాష్ట్రంలో అన్ని సబ్ డివిజన్లలో ప్రారంభిస్తామన్నారు. గ్రామీణపోలీస్ వ్యవస్థ బలపడాలి : ఎస్పీ రమారాజేశ్వరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం శుభ పరిణామమని, శిక్షణ ఇక్కడ విజయవంతం చేసి మహిళల్లో మార్పు తీసుకరావడానికి కృషి చేయాలని కోరారు. గ్రామీణ పోలీస్ అధికారి వ్యవస్థను బలోపేతం చేస్తే నేరాలను అదుపు చేయడం సులభమన్నారు. అనంతరం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు ఆధిత్య గుప్తా, మనీషాలు మహిళలపై జరుగుతున్న దాడులు, నివారణపై వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు గిరిబాబు, గంగాధర్, రామకృష్ణ, డివిపిరాజు, వై.రామకృష్ణ పాల్గొన్నారు. మొక్కలు నాటిన డీఐజీ మధ్యాహ్నం జిల్లాకేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను డీఐజీ అకున్ సబర్వాల్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. పలు రకాల ఫైల్స్, పెండింగ్ కేసులను పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉండటంతో సీఐ సీతయ్యను డీఐజీ అభినందిచారు. -
మహిళలకు మీరే భద్రత
► మహిళలకు మీరే భద్రత ► వారికి భరోసా కల్పించేలా విధులు నిర్వర్థించాలి ► ఈవ్‌టీజింగ్‌ను రూపుమాపాలి ► లింగ వివక్ష లేని సమాజం నిర్మిద్దాం ► డీఐజీ అకున్ సబర్వాల్ మహబూబ్‌నగర్ క్రైం : ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు భద్రత లేకుండా పోయింది.. ఇంకా మహిళ బస్సులో ఒంటరిగా ప్రయాణించడానికి భయపడుతోంది. మీకు మేమున్నాం అంటూ భరోసా కల్పించాల్సిన బాధ్యత మన పోలీస్‌శాఖదే.. అని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ అన్నారు. పోలీస్ శాఖ, పీపుల్ ఫర్ పారిటి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మహిళల రక్షణ అనే అంశంపై మూడురోజులపాటు నిర్వహించే వర్క్‌షాప్‌నను డీఐజీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట పోలీస్ అతిథిగృహంలో ఎస్పీ రెమారాజేశ్వరి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి చేరుకోగా సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డీఐజీ సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సుమారు 480 అత్యాచార కేసులను పరిశీలిస్తే సమాజంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఇతర దేశాల్లో ఎక్కడాలేని విధంగా ఇక్కడి మహిళలు ఈవ్‌టీజింగ్ బారిన పడుతున్నారని, ఇలాంటి ఘటనలకు ఇక నాంది పలకలన్నారు. లింగ వివక్ష లేని సమాజ నిర్మాణానికై పోలీస్‌శాఖ ప్రధాన భూమిక పోషించాలని ఆదేశించారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, దాడుల గురించి క్లుప్తంగా తెలుసుకుని వాటిని అరికట్టాడానికి మీవంతుగా కృషి చేయాలని సూచించారు. ఈ వర్క్‌షాప్ మహబూబ్‌నగర్‌లో విజయవంతమైతే రాష్ట్రంలో అన్ని సబ్ డివిజన్లలో ప్రారంభిస్తామన్నారు. గ్రామీణపోలీస్ వ్యవస్థ బలపడాలి : ఎస్పీ రమారాజేశ్వరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం శుభ పరిణామమని, శిక్షణ ఇక్కడ విజయవంతం చేసి మహిళల్లో మార్పు తీసుకరావడానికి కృషి చేయాలని కోరారు. గ్రామీణ పోలీస్ అధికారి వ్యవస్థను బలోపేతం చేస్తే నేరాలను అదుపు చేయడం సులభమన్నారు. అనంతరం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు ఆధిత్య గుప్తా, మనీషాలు మహిళలపై జరుగుతున్న దాడులు, నివారణపై వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు గిరిబాబు, గంగాధర్, రామకృష్ణ, డివిపిరాజు, వై.రామకృష్ణ పాల్గొన్నారు. మొక్కలు నాటిన డీఐజీ మధ్యాహ్నం జిల్లాకేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను డీఐజీ అకున్ సబర్వాల్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. పలు రకాల ఫైల్స్, పెండింగ్ కేసులను పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉండటంతో సీఐ సీతయ్యను డీఐజీ అభినందిచారు. -
ఈవ్‌టీజింగ్ చిదిమేసింది
వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. అక్క శ్రీగౌతమి కలెక్టర్ కావాలనే సంకల్పంతో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. చెల్లెలు పావని ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. వీళ్లిద్దరూ స్కూటర్‌పై వెళుతుండగా.. మద్యం సేవించిన కొందరు యువకులు కారులో వెంబడించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటమే కాకుండా.. కారుతో ఆ స్కూటర్‌ను ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో శ్రీగౌతమి అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన పావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాలకొల్లు అర్బన్/నరసాపురం రూరల్ : మద్యం మత్తు, ఈవ్‌టీజింగ్ ఓ యువతిని బలి తీసుకున్నాయి. ఇదే ఘటనలో మృతురాలి చెల్లి తీవ్రంగా గాయపడింది. ఈ దుర్ఘటన పాలకొల్లు–నరసాపురం రోడ్డులో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నరసాపురం పట్టణంలోని కోవెల వీధికి చెందిన దంగేటి శ్రీగౌతమి, పావని అక్కాచెల్లెళ్లు. పూలపల్లి సంధ్యామైరైన్స్లో పావని ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. బుధవారం రాత్రి శ్రీగౌతమి, పావని పూలపల్లి నుంచి స్కూటర్‌పై నరసాపురం వెళ్తుండగా, కారు ఢీకొంది. ఈ ఘటనలో శ్రీగౌతమి అక్కడిక్కడే దుర్మరణం పాలైంది. పావని తీవ్రంగా గాయపడింది. నరసాపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈవ్‌టీజింగే కారణం స్కూటర్‌పై వస్తున్న పావని, శ్రీగౌతమిని మద్యం సేవించిన కొందరు యువకులు కారులో వెంబడించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కారు స్కూటర్‌ను ఢీకొంది. ఫలితంగా గౌతమి అక్కడికక్కడే మరణించింది. పావని ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. కొందరు కారులో వెంబడించారని పావని కూడా చెబుతోంది. వైజాగ్ రిజిస్ట్రేషన్‌తో కారు స్కూటర్‌ను ఢీకొన్న కారు విశాఖపట్టణంలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్టు పాలకొల్లు రూరల్ ఎస్సై బి.ఆదిప్రసాద్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. సివిల్స్ ప్రిపరేషన్లో శ్రీగౌతమి శ్రీగౌతమి చిన్ననాటి నుంచి బాగా చదివే విద్యార్థిని. నరసాపురం వైఎన్ కళాశాలలో డిగ్రీ చదివిన ఆమె ఎన్సీసీ నేవీ విభాగంలో సీ సర్టిఫికెట్ పొందింది. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌డే పరేడ్‌లోనూ పాల్గొని ప్రశంసలందుకుంది. అదే కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం సివిల్స్‌కి ప్రిపేర్ అవుతోంది. విశాఖపట్నంలో శిక్షణ పొందుతోంది. తండ్రి మరణం నుంచి తేరుకోకుండానే... శ్రీగౌతమి తండ్రి నరసింహరావు వ్యవసాయ పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. గత ఏడాది అనారోగ్యంతో ఆయన మృతిచెందారు. ఆ దుఃఖం నుంచి కోలుకోకుండానే శ్రీగౌతమి మరణించడం, పావని ఆస్పత్రి పాలుకావడం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. బంధువులు, స్నేహితులు గౌతమి మృతదేహాన్ని చూసి తీవ్రంగా రోదిస్తున్నారు. -
మితిమీరుతున్న పోకిరీలు
– కళాశాలల ఎదుట వెకిలిచేష్టలు – తట్టుకోలేకపోతున్న విద్యార్థినులు – పట్టించుకోని పోలీసులు అనంతపురం సెంట్రల్ : అనంతపురంలో వారం రోజుల క్రితం కళాశాల ముగించుకొని ఇంటికి వెళుతున్న ఓ విద్యార్థిని (పేరు రాయలేదు) అంబేడ్కర్ విగ్రహం వద్ద కొంతమంది ఆకతాయిలు కామెంట్ చేశారు. ఆ అమ్మాయి పట్టించుకోకపోవడంతో ఆ రోజు నుంచి అమ్మాయికి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయం ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఏకంగా కళాశాలనే మాన్పించారు. నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల ఎదుట వారి చేష్టలు అంతా ఇంతా కాదు. విద్యార్థినులు వారి ముందు నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. విద్యార్థినులు బయటకు చెప్పుకోలేక తీవ్రంగా కలత చెందుతున్నారు. పోకిరీలకు కళ్లెం వేయాల్సిన కళాశాల యాజమాన్యాలు, పోలీసులు పెద్దగా దష్టి సారించకపోవడంతో వారి ఆగడాలకు అడ్డే లేకుండాపోతోంది. ముఖ్యంగా ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్న ఎస్ఎస్బీఎన్ కళాశాల, కేఎస్ఆర్ ప్రభుత్వ కళాశాల ఎదుట పోకీరీలు తిష్టవేస్తున్నారు. జీసస్‌నగర్, అరవిందనగర్, ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న పలు ప్రైవేటు కళాశాలల వద్ద కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో సమస్య పరిష్కారం నగరంలో ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో వీటిని అమర్చారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి ఆధారంగా నిఘా కఠినతరం చేస్తే ఈవ్‌టీజింగ్ సమస్యకు చెక్ పడుతుందనే అభిప్రాయం విద్యార్థినుల నుంచి వినిపిస్తోంది. అయితే ఇంత వరకూ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కనీసం కళాశాలల్లో ఫిర్యాదుల బాక్సును ఏర్పాటు చేస్తే అందులోనైనా విద్యార్థినులు వారి సమస్యలను చెప్పుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ కళాశాలల యాజమాన్యాలు ఈ అంశంపై దష్టి సారించడం లేదు. నిఘా పట్టిష్టం చేస్తాం కళాశాలల వద్ద పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ఏదో ఒక సమయంలో పరిశీలిస్తున్నారు. నిఘా ఇంకా పటిష్టపర్చేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థినులు వారి సమస్యలు చెప్పుకునేందుకు ప్రత్యేకంగా ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయిస్తా. వారి ఫిర్యాదుల ఆధారంగా పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం. – మల్లికార్జునవర్మ, డీఎస్పీ, అనంతపురం -
ప్రత్యేక చట్టం అవసరం
► ప్రభుత్వానికి ప్రతిపాదించిన ‘షీ టీమ్స్’ అధికారులు ► తమిళనాడు తరహా ముసాయిదా సమర్పణ ► ఈవ్టీజర్ల ఆట కట్టించేలా రూపకల్పన ► న్యాయ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైలు సాక్షి, హైదరాబాద్: రోడ్లపై పోకిరీల మొదలు అదును చూసి కాటేస్తున్న నయవంచకుల వరకు.. ఎందరో మృగాళ్ల బారినుంచి అతివల్ని రక్షిస్తున్నాయి షీ టీమ్స్ ఈ టీమ్స్ అమలులోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికే గణనీయమైన ఫలితాలు సాధిస్తున్న ఈ బృందాల పని తీరును మరింత మెరుగుపరచడంతో పాటు మహిళలకు పూర్తి స్థాయి భరోసా ఇవ్వడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈవ్‌టీజర్లకు కఠిన శిక్షలు పడేలా చేయడానికి ప్రత్యేక చట్టం అవసరమని నిర్ణయించారు. తమిళనాడు తరహాలో రూపొందించిన ‘తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ యాక్ట్’ ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించారు. చిక్కుతున్నా చిన్న కేసులే: బహిరంగ ప్రదేశాల్లో మహిళ ల్ని వేధిస్తున్న పోకిరీలను నిత్యం ‘షీ టీమ్స్’ పట్టుకుంటున్నా... తీవ్రత, ఆధారాలు ఉంటే తప్ప అందరి పైనా ఐపీసీతో పాటు నిర్భయ, యాంటీ ర్యాగింగ్ యాక్ట్‌ల ప్రకారం కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. దీంతో ఏడాదిలో సీసీఎస్ ఆధీనంలోని ‘షీ టీమ్స్’కు చిక్కిన 281 మందిలో 126 మందిపై చిన్న (పెట్టీ) కేసులు, నామమాత్రపు జరిమానాతో సరిపెట్టాల్సి వచ్చింది. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ రెండోసారీ చిక్కిన ఓ వ్యక్తితో పాటు తీవ్రమైన స్థాయిలో రెచ్చిపోయిన వారిపైనే కేసులు నమోదు చేయగలిగారు. ప్రత్యేకంగా ఉంటేనే... ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న సీసీఎస్ ఉన్నతాధికారులు ఈవ్ టీజర్లను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ప్రత్యేక చట్టం అవసరమని భావించారు. దీంతో పలు ప్రాంతాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేశా రు. చివరకు తమిళనాడులో ఉన్న చట్టం ఉపయుక్తంగా ఉందని నిర్థారించారు. ఈవ్ టీజింగ్ బారినపడి పలువురు అతివలు గాయపడటం, కొందరు మరణించడం సైతం జరగడంతో అక్కడి సర్కారు 1998లోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ ఏడాది జూలై 30 ఆర్డినెన్స్ రూపంలో, కొన్ని నెలలకే చట్టంగా అమలులోకి వచ్చిన ఈ యాక్ట్ మంచి ఫలితాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అక్కడి చట్టంలోని అంశాలతో పాటు మరికొన్ని అంశాలను చేరుస్తూ ఉన్నతాధికారులు ఓ ముసాయిదా రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ప్రస్తుతం న్యాయ మంత్రిత్వ శాఖ వద్ద ఈ ఫైల్ పెండింగ్‌లో ఉంది. ముసాయిదాలో ముఖ్యాంశాలివీ... 1. బహిరంగ ప్రదేశాలు, పని చేసే ప్రాంతాలు, మాల్స్... ఇలా ఎక్కడైనా ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ చిక్కిన పోకిరీలపై నేరం నిరూపణైతే ఏడాది జైలు లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండూ పడతాయి. 2. ఈవ్‌టీజింగ్ చేయడానికి పోకిరీలు వాహనాలు ఉపయోగిస్తే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకోవచ్చు 3. దేవాలయాలతో పాటు మాల్స్, సినిమా హాల్స్, విద్యాసంస్థలు తదితర చోట్ల జరిగే ఈవ్ టీజింగ్‌ను నిరోధించాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులపై ఉంటుంది. అలాంటి సమాచారాన్ని తక్షణం సంబంధిత పోలీసులకు చేరవేయాల్సిందే. 4. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ నేరానికి యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయవచ్చు. వీరికి న్యాయస్థానం జరిమానా విధించే అవకాశం ఉంటుంది. -
ఇదేం పని తాతా!
హైదరాబాద్: నగరంలో ఈవ్ టీజింగ్ నిరోధానికి పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. బుధవారం షీ టీమ్స్ దాడులు చేసి వివిధ ప్రాంతాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వీరిలో 71 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి కూడా ఉండటం గమనార్హం. నిజామాబాద్ జిల్లా అర్మూర్ మండలం వాల్మీకినగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి మహమ్మద్ సాధిక్ ఆలీ (71) కోఠి బస్టాప్‌లో మహిళలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని గుర్తించిన షీటీమ్ సభ్యులు అతడి వెకిలిచేష్టలను వీడియో తీయడమే గాక నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా కోర్టు అతనికి రెండు రోజుల కస్టడీ విధించింది. మరో ఘటనలో గత ఆరునెలలుగా ఓ మహిళను వేధిస్తున్న ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన బి.రాములును అఫ్జల్‌గంజ్ బస్టాండ్‌లో షీటీమ్ సభ్యులు అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఐదు రోజుల కస్టడీ విధించారు. వీరితోపాటు మహిళలను వేధిస్తున్న మెదక్ జిల్లా రామచంద్రపురం కొల్లూరు గ్రామానికి చెందిన మహమ్మద్ మోసిన్, మెహిదీపట్నంలో ఉంటున్న బీహర్‌కు మహమ్మద్ ఇస్తియాక్‌లను ఆధారాలతో సహా అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.