
ప్రతీకాత్మకచిత్రం
లక్నో : ఈవ్‌టీజింగ్‌ను వ్యతిరేకించినందుకు పదిమంది దుండగులు ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు దారుణంగా కొట్టిన ఘటన యూపీలోని షమ్లి జిల్లాలో ఆదివారం వెలుగుచూసింది. జింఝన ప్రాంతంలోని మచురౌలి గ్రామంలో ఈవ్‌టీజింగ్‌ను వ్యతిరేకించిన మహిళ ఇంటిపై పదిమంది దాడి చేసి పదునైన ఆయుధాలతో ఆమెను, కుటుంబ సభ్యులను గాయపరిచారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయని, కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
ఇక ముజఫర్‌నగర్‌లో ఏడు నెలల కిందట 15 ఏళ్ల దళిత బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులు కులదీప్, మాలతిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పుర్కాజీ బ్లాక్ పరిధిలోని గ్రామంలో బాలికను అటవీ ప్రాంతంలోకి వీరు తీసుకెళ్లారని, అక్కడ వేచిఉన్న మరో ఏడుగురు కలిసి బాలికపై సామూహిక లైంగిక దాడికి తెగబడి హత్య చేశారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment