
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా (Maha Kumbh Mela) అత్యంత ఉత్సాహంగా కొన సాగుతోంది. ఇప్పటికే 60కోట్ల మంది భక్తులు తరలి వచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం త్వరలో ముగియనున్న నేపథ్యంలో భక్తుల సందడి మరింత పెరిగింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో స్నానాలు చేసిన తమభక్తిని చాటుకున్నారు.
రాజకీయ, వ్యాపారం, క్రీడారంగ ప్రముఖులతోపాటు, పలువురు సినీ స్టార్లు మహాకుంభమేళాను దర్శించు కున్నారు. ఇపుడు ఈ కోవలో ప్రముఖ యాంకర్ సుమ (sumakanakala) నిలిచారు. మహాకుంభ మేళా సందర్శనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తొలిసారి మహాకుంభమేళాకు వచ్చాను అంటూ సంతోషాన్ని ప్రకటించారు.
ఇదీ చదవండి:ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!
కాగా ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా. ఈ మహా వేడుక జనవరి 13న కుంభమేళా ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 21 వరకు సాగనుంది. ఇప్పటిదాకా మొత్తం 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.

ఓదెల -2 టీజర్ లాంచ్ సందర్బంగా మహాకుంభకు వెళ్లిన సుమ అక్కడ పవిత్న స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మూవీ టీంకు అభినందనలు తెలిపారు. మహా కుంభమేళాలో ‘ఓదెల 2’ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేసారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ నటిస్తున్నారు. నాగ సాధు పాత్రలో ఆమె స్టన్నింగ్ లుక్ లో కనిపించింది. 2022లో వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకి సీక్వెల్.
Comments
Please login to add a commentAdd a comment