Anchor Suma Kanakala
-
Maha Kumbh : పవిత్ర త్రివేణీ సంగమం వద్ద యాంకర్ సుమ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా (Maha Kumbh Mela) అత్యంత ఉత్సాహంగా కొన సాగుతోంది. ఇప్పటికే 60కోట్ల మంది భక్తులు తరలి వచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం త్వరలో ముగియనున్న నేపథ్యంలో భక్తుల సందడి మరింత పెరిగింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో స్నానాలు చేసిన తమభక్తిని చాటుకున్నారు. రాజకీయ, వ్యాపారం, క్రీడారంగ ప్రముఖులతోపాటు, పలువురు సినీ స్టార్లు మహాకుంభమేళాను దర్శించు కున్నారు. ఇపుడు ఈ కోవలో ప్రముఖ యాంకర్ సుమ (sumakanakala) నిలిచారు. మహాకుంభ మేళా సందర్శనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తొలిసారి మహాకుంభమేళాకు వచ్చాను అంటూ సంతోషాన్ని ప్రకటించారు. ఇదీ చదవండి:ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!కాగా ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా. ఈ మహా వేడుక జనవరి 13న కుంభమేళా ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 21 వరకు సాగనుంది. ఇప్పటిదాకా మొత్తం 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.ఓదెల -2 టీజర్ లాంచ్ సందర్బంగా మహాకుంభకు వెళ్లిన సుమ అక్కడ పవిత్న స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మూవీ టీంకు అభినందనలు తెలిపారు. మహా కుంభమేళాలో ‘ఓదెల 2’ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేసారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ నటిస్తున్నారు. నాగ సాధు పాత్రలో ఆమె స్టన్నింగ్ లుక్ లో కనిపించింది. 2022లో వచ్చిన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకి సీక్వెల్. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ
'డాకు మహారాజ్'(Daaku Maharaaj) భారీ విజయం సాధించడంతో బాలకృష్ణ (Balakrishna) ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే సుమారు రూ. 130 కోట్లు సాధించింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు. సినిమా సక్సెస్‌లో భాగంగా మూవీటీమ్ తాజాగా యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే, బాలయ్యకు సండేతో(Sunday) ఉన్న ఒక సెంటిమెంట్ గురించి పంచుకున్నారు.నిజ జీవితంలో ఒక సెంటిమెంట్ అనుసరిస్తానని బాలకృష్ణ ఇలా అన్నారు. ఆదివారం రోజు నేను నలుపు రంగు దుస్తులు అసలు ధరించను. ఆదివారం అంటే నాకు బ్లాక్ డేంజర్. ఒకవేళ అలా వేసుకుంటే నాకు చాలా ప్రమాదం. నాది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో దానిని పాటిస్తున్నాను. ప్రత్యాది దేవతలు ఉంటారనేది నమ్ముతాను. అందుకే ఆదివారం నలుపు ధరించను. అయితే, ఓసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం బ్లాక్ డ్రెస్ ధరించాల్సి వచ్చింది. అయితే, ఈ డ్రెస్ వద్దని నేను ముందే చెప్పాను. కానీ, దర్శకులు చెప్పారు కాబట్టి తప్పలేదు. ఏదో నష్టం జరగబోతుందని ముందే గ్రహించాను. అదేరోజు రాక రాక బాలసుబ్రమణ్యం కూడా షూటింగ్ సెట్స్‌లోకి వచ్చారు. ఆయన కళ్ల ముందే కిందపడిపోవడంతో నా నడుము విరిగింది. అయితే, ఆయన రావడం వల్లే ఇలా జరిగిందనుకొని ఆ తర్వాత బాలసుబ్రమణ్యం మళ్లీ షూటింగ్ ప్రాంతంలోకి రాలేదు. ఆయన కూడా చాలా కంగారుపడ్డారు.' అని ఆదివారంతో తనకు ఉన్న సెంటిమెంట్‌ను బాలయ్య పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానున్న నయనతార, సిద్ధార్థ్ సినిమా)యాంకర్ సుమతో మూవీ టీమ్ పాల్గొన్న ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది. బాలకృష్ణతో పాటు ఈ సినిమా డైరెక్టర్ బాబీ, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. తాను షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని బాలయ్య వెల్లడించారు. ఇంటి పక్కనే షూటింగ్ జరుగుతున్నా కూడా అక్కడి ఆహారమే తింటానని ఆయన చెప్పారు.బాలకృష్ణ జాతకాలను ఎక్కువగా నమ్ముతారనే సంగతి చాలామందికి తెలిసిందే.. ఏదైనా ఒక శుభకార్యం అంటూ మొదలుపెడితే ముహూర్తాలను అనుసరిస్తూనే ప్లాన్ చేసుకుంటారు. సినిమా రిలీజ్ డేట్, ట్రైలర్ రిలీజ్ డేట్ విషయంలో కూడా బాలయ్య సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయన మెడలో రుద్రాక్షతో పాటు చేతికి జాతక ఉంగరాలు ధరిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామునే తన ఇంట్లో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాతే దిన చర్య ప్రారంభిస్తారు. -
యాంకర్ సుమ ముఖ్య పాత్రలో ప్రేమంటే?
ప్రియదర్శి (Priyadarshi) హీరోగా, ఆనంది, సుమ కనకాల ప్రధాన పాత్రల్లో నటించనున్న సినిమాకు ‘ప్రేమంటే?’ అనే టైటిల్ ఖరారైంది. ‘థ్రిల్– యూప్రాప్తిరస్తు’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, స్పిరిట్ మీడియా పతాకాలపై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.తొలి సీన్‌కి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో రానా క్లాప్ ఇచ్చారు. ‘‘నిర్మాతగా జాన్వీ నారంగ్‌కు ఇది తొలి సినిమా. సునీల్, భరత్ నారంగ్‌ల మార్గదర్శకత్వంలో జాన్వీ నారంగ్ కంటెంట్–బేస్డ్ సినిమా ప్రపంచంలోకి తన ప్రయాణాన్నిప్రారంభించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో సునీల్ నారంగ్, అభిషేక్ నామా, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రావు, జనార్ధన్ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, సహ–నిర్మాత: ఆదిత్య మెరుగు. -
ఆ బాధతో 18వ అంతస్తు నుంచి దూకేద్దామనుకున్న గౌతమ్..
గత కొన్నిరోజులుగా నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్ చేస్తున్న ఫైనలిస్టులను చివరిసారి ఏడిపించే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. మీ జీవితంలోని అత్యంత బాధాకరమైన సంఘటనను పంచుకోమని చెప్పడంతో అందరూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. మరి ఎవరెవరు ఏమేం చెప్పారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సోనియాను బ్లాక్ చేస్తానన్న ప్రేరణషో అయిపోయాక ఎవరితో కలిసుండాలనుకుంటున్నారు? ఎవరిని కలవకూడదనుకుంటున్నారో చెప్పమంటూ ఫాలో- బ్లాక్ గేమ్ ఆడించాడు బిగ్‌బాస్. దాదపు అందరితోనూ కలవాలనుకుంటున్న చెప్పారు టాప్ 5 కంటెస్టెంట్లు. ఎవరిని కలవకూడదన్న విషయానికి వస్తే.. సోనియా పర్సనాలిటీ నచ్చలేదంటూ తనను బ్లాక్ చేస్తానంది ప్రేరణ. తక్కువ పరిచయం వల్ల పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేశాడు గౌతమ్. నబీల్.. హరితేజ, సోనియాను బ్లాక్ చేస్తానన్నాడు. నిఖిల్.. బేబక్క, సీతను బ్లాక్ చేశాడు. అవినాష్.. పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేస్తానన్నాడు.మూడేళ్లు ఇంట్లో ఖాళీగా..తర్వాత చలిమంట వేసిన బిగ్‌బాస్.. జీవితంలోని బెస్ట్, వరస్ట్ సంఘటనలను పంచుకోమన్నాడు. నబీల్ మాట్లాడుతూ.. బైక్ యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్పాలయ్యాను. అదే నా చేదు జ్ఞాపకం అన్నాడు. నిఖిల్ మాట్లాడుతూ.. నేను ఆర్కిటెక్ట్ కోర్స్ చేస్తున్నప్పుడు సినిమా ఆఫర్ వచ్చింది. చదువు మధ్యలోనే వదిలేశాను. మూడేళ్లపాటు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను. రోజూ అమ్మ దగ్గర రూ.30 అడుక్కునేవాడిని. నువ్వు ఇంటికి భారమయ్యావు, నీకు తిండి పెట్టడమే కాకుండా ఖర్చులకు కూడా డబ్బివ్వాలా? అని తిట్టింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చాకే..తర్వాత కన్నడ సీరియల్లో ఆఫర్ వచ్చింది. రోజుకు రూ.2500 ఇస్తామన్నారు. అంటే నెలకు రూ.75వేలు వస్తాయనుకున్నాను. కానీ పదిరోజులే షూటింగ్ జరిగింది. ఆ తర్వాత తెలుగు సీరియల్ చేశాను. అప్పటినుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు అని చెప్పాడు. ప్రేరణ నానమ్మ చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేసింది.ఏ పాపం చేశానో..గౌతమ్ మాట్లాడుతూ.. మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒకమ్మాయితో బ్రేకప్ అయింది. ఆ బాధ తట్టుకోలేక నేను ఉంటున్న 18వ అంతస్థులోని బాల్కనీలో నుంచి దూకి చనిపోదామనుకున్నాను. కానీ నాతోపాటు నన్ను ప్రేమించేవాళ్లు గర్వపడేలా చేస్తే ఈ ప్రపంచమే దాసోహం అవుతుందని ఆలోచించి ఆగిపోయాను అన్నాడు. అవినాష్ మాట్లాడుతూ.. నేను, నా భార్య అను ఎన్నో కలలు కన్నాం. ఏ జన్మలో ఏ తప్పు చేశానో మాకు బాబు పురిటిలోనే చనిపోయాడు. నా చేతిలో కొడుకున్నాడు, కానీ వాడికి ప్రాణం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.యష్మిపై ఫీలింగ్స్?తర్వాత యాంకర్ సుమ వచ్చి సరదా టాస్కులు ఆడించింది. అలాగే ప్రేక్షకుల మనసులోని ప్రశ్నలను ఫైనలిస్టులను అడిగేసింది. కావాలని స్ట్రాటజీతో రెచ్చగొట్టి గొడవలు పెట్టుకుంటారా? అని గౌతమ్‌ను అడగ్గా అలా ఏం లేదని, దేనికైనా హర్ట్ అయితేనే గొడవపడతానన్నాడు. యష్మిపై నీకు నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయా? లేదా లవ్ యాంగిల్ కోసం వేసిన స్ట్రాటజీయా? అని అడగ్గా మొదట్లో కొంచెం ఫీల్ ఉండేది కానీ ఒకసారి అక్క అన్నాక అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవని గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు.ఫైర్ తగ్గలేదన్న నబీల్రాయల్స్(వైల్డ్ కార్డ్స్) వచ్చాక నీలో ఎందుకు ఫైర్ తగ్గింది? అని నబీల్ను అడగ్గా.. తనలో ఫైర్ ఎక్కడా తగ్గలేదని, కాకపోతే కొన్నిసార్లు కనిపించకపోయుండొచ్చన్నాడు. పృథ్వీ కాకుండా ఈ ఇంట్లో ఎవరిని ఎక్కువ నమ్ముతారు? అని నిఖిల్‌ను అడగ్గా ఆ రేంజ్లో ఎవరినీ నమ్మలేనన్నాడు. సీజన్ 4 లేదా సీజన్ 8లో ఏది బెస్ట్ అని ప్రశ్నించగా అవినాష్ క్షణం ఆలోచించుకోకుండా నాలుగో సీజన్ అని చెప్పాడు.అక్కడే అసలు గొడవనిఖిల్, గౌతమ్.. మీరిద్దరూ ఎందుకు ఎప్పుడూ గొడవపడతారు? అన్న ప్రశ్నకు అభిప్రాయబేధాలు అని ఇద్దరూ బదులిచ్చారు. తర్వాత ఓ టాస్క్‌లో నిఖిల్ గెలవడంతో అతడి తమ్ముడి వీడియో సందేశాన్ని చూపించాడు. అనంతరం ప్రేరణ గెలవడంతో తనకు ఓ ఫోటోఫ్రేమ్ ఇచ్చారు. అలా ఎమోషన్స్, ఆటపాటలతో ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss: ఆగిపోయిన లైవ్ స్ట్రీమింగ్, చివరి గెస్టుగా సుమ
యాంకర్ సుమ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే! బిగ్‌బాస్ హౌస్‌లోకి చివరి గెస్టుగా యాంకర్ సుమ ఎంట్రీ ఇచ్చింది. ఫైనలిస్టులతో టాస్కులాడిస్తూ వారిని ఓ ఆటాడుకుంది. ఈ క్రమంలోనే కొన్ని సరదా ప్రశ్నలడిగింది. మూడు రోజులు స్నానం చేయకుండా ఉన్నారా? అంటే మూడు కాదు నాలుగు రోజులు స్నానం చేయలేదని తెలిపింది ప్రేరణ.వేరేవాళ్ల టూత్ బ్రష్‌ను వాడారా? అంటే నబీల్, నిఖిల్, అవినాష్, గౌతమ్.. నలుగురూ అవునని తలూపారు. ఛీ బాయ్స్.. ఇలా ఉన్నారేంట్రా బాబూ అని సుమ, ప్రేరణ తల పట్టుకున్నారు. తర్వాత వీళ్లతో మరిన్ని గేమ్స్ ఆడించింది. ఇకపోతే రేపే బిగ్‌బాస్ ఫైనల్. ఇప్పటికే హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఆగిపోయింది. ప్రేక్షకులు ఓట్లు వేయడం కూడా ముగిసిపోయింది. విజేతను ప్రకటించడమే మిగిలి ఉంది. నిఖిల్, గౌతమ్ మధ్య భారీ పోటీ నెలకొనడంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కూకట్‌పల్లిలో యాంకర్ సుమ సందడి (ఫొటోలు)
-
పండగ సీజన్ యాంకర్ సుమ స్టైలిష్ వేర్ అదుర్స్ (ఫొటోలు)
-
రోషన్ కనకాల కొత్త మూవీ.. ఆశ్చర్యపోయిన యాంకర్ సుమ
బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు వచ్చినా సుమ స్థానం సుమదే! షోలు, ఈవెంట్లు, సినిమా ఫంక్షన్స్‌తో అనునిత్యం బిజీగా ఉంటుంది. అటు రాజీవ్ కనకాల కూడా పవర్ఫుల్ పాత్రలతో సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. వీరి తనయుడు రోషన్ కూడా గ్లామర్ ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు. ఇప్పటికే అతడు బబుల్గమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఫస్ట్ సినిమాకే మంచి పేరుఇది తనకు ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎటువంటి తత్తరపాటు లేకుండా చాలా చక్కగా యాక్ట్ చేశాడని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడతడు రెండో సినిమా చేస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ప్రకటించారు. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ మూవీకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇంతకీ సినిమా టైటిల్ మోగ్లీ. ఈమేరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.మోగ్లీ..ఇందులో రోషన్ కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ అడవి మధ్యలో గుర్రంతో కనిపించాడు. ఫస్ట్ లుక్, టైటిల్ చూస్తుంటే ఈ కథ అటవీ నేపథ్యంలోనే సాగనుందని తెలుస్తోంది. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.రోషన్‌ను చిన్నప్పుడు..మోగ్లీ పోస్టర్‌ను యాంకర్ సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. రాజీవ్.. రోషన్‌ను చిన్నప్పుడు మోగ్లీ అని పిలిచేవాడు. ఇప్పుడదే పేరుతో అతడు సినిమా చేయడం నిజంగానే మ్యాజిక్ కదా! అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) చదవండి: ఆ ఆనవాయితీ రిపీట్! తనే ఎలిమినేట్ కానుందా? -
యాంకర్ సుమకు స్టేజీపై ముద్దు పెట్టిన నటుడు
యాంకర్ సుమ ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. పంచ్‌లు వేయడమే కాదు, ఎదుటివాళ్లు వేసే పంచ్‌లకు రివర్స్ కౌంటర్ ఇవ్వడమూ తెలుసు. ఎప్పుడూ కూల్‌గా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సుమకు తాజాగా ఓ ఇబ్బందిరక పరిస్థితి ఎదురైంది. తంగలాన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు డేనియల్ కాల్టగిరోన్ను స్టేజీపైకి ఆహ్వానించిన సుమ.. అతడితో తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేసింది. షేక్ హ్యాండ్ ఇస్తే..అందరూ బాగున్నారా? మీరు తప్పకుండా ఈ సినిమాను ఆగస్టు 15న చూడాలి అని చెప్పించింది. చివర్లో చిన్న ఫన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించింది. ఇక్కడ ఉండే అమ్మాయిల్లో సుమయే అందంగా ఉంది అని నటుడితో అనిపించింది. ఆ లైన్ కరెక్ట్‌గా చెప్పడంతో సంతోషంతో షేక్ హ్యాండ్ ఇచ్చింది. కానీ డేనియల్.. ఆమె చేతికి ముద్దు పెట్టడంతో అవాక్కయింది. వెంటనే తమాయించుకుని సరదాగా స్పందించింది. కవర్ చేసిన సుమఓరి నాయనో.. రాజా, ఈయన మా అన్నయ్య.. రాఖీ పండగ వస్తోంది అంటూ కవర్ చేసి.. అన్నయ్య సన్నిధి.. అని పాటందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్. పార్వతి తిరువోతు, మాళివక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఆగస్టు 15న విడుదల కానుంది. చదవండి: ధనుష్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా..: హీరో సోదరి -
కలర్‌ఫుల్ లంగావోణీలో యాంకర్ సుమ లుక్స్.. ఫోటోలు
-
Holi 2024 యాంకర్ సుమ వీడియో: చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండేదట!
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్, యాక్టింగ్, స్టేజ్ షోలు,సినిమాలు.. ఇలా ప్రతీ అంశంలోనూ నా స్టయిలే వేరు అన్నట్టు దూసుకుపోవడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. దాదాపు ప్రతీ పండుగకు ఒక సందేశంతో ప్రాంక్ వీడియోలను చేయడం అలవాటు. ఫన్నీగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం ఆమె స్టయిల్. తాజాగా హోలీ సందర్భంగా కూడా ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) ముఖ్యంగా నీటిని వేస్ట్ చేయొద్దు అనే సందేశంలో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మీకు తప్ప ఎవరికి ఇలాంటి ఐడియాస్ రావు సుమ గారు ఒకరు కామెంట్ చేయగా, ఇలాంటి వీడియోలు చేయడం మీకే సాధ్యం మేడమ్.. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అందించారు ఇంకొందరు. అయితే చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండు మరొకరు ఫన్నీగా కామెంట్ చేయడం గమనార్హం. -
ఆ విషయంలో గొడవపడేవాళ్లం: యాంకర్ సుమ
ఒకరు సినీ సెలబ్రిటీ.. మరొకరు బుల్లితెర సెలబ్రిటీ.. వీరిద్దరి జోడీ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆ జంట మరెవరో కాదు రాజీవ్ కనకాల- యాంకర్ సుమ. ఈ మధ్యే వీరు 25వ పెళ్లి రోజు జరుపుకున్నారు. పాతికేళ్ల వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సుమ తన యూట్యూబ్ ఛానల్లో ఓ కొత్త వీడియో వదిలింది. ఇందులో ఎన్నో ప్రశ్నలకు ఈ దంపతులు సమాధానాలు చెప్పారు. ఎప్పుడో చెక్ చేశా.. మీ పార్ట్నర్కు తెలియకుండా పార్ట్నర్ ఫోన్ చెక్ చేశారా? అని అడగ్గా రాజీవ్ లేదన్నాడు. కానీ సుమ మాత్రం చెక్ చేశానంది. ఏదో పదేళ్ల క్రితం చెక్ చేశాను అంటూ నవ్వేసింది. ఫోన్ చెక్ చేయడమేంటని షాకైన రాజీవ్ తాను కూడా తన జాగ్రత్తలో ఉన్నానని కౌంటరిచ్చాడు. ఏ విషయంలో గొడవపడేవారన్న ప్రశ్నకు.. తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా రాజీవ్ దెయ్యాల సినిమాలకు తీసుకెళ్లేవాడని.. ఆ విషయంలో గొడవపడేవాళ్లమని సుమ సమాధానమిచ్చింది. ఇన్నాళ్లకు సారీ చెప్పిన రాజీవ్ రాజీవ్‌కు ఫోన్ చేసినప్పుడల్లా ఐదు నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తానంటాడు.. కానీ ఎప్పుడూ చెప్పిన సమయానికి రాలేదని రాజీవ్‌పై కంప్లైంట్ ఇచ్చింది సుమ. పెళ్లైన ఆరేడేళ్ల వరకు అతడి గురించి ఎదురుచూసేదాన్నని.. తనకోసం ఎదురుచూసి చివరకు ఒక్కదాన్నే తినేసేదాన్నని చెప్పింది. దీంతో రాజీవ్.. అప్పుడు చేసిన పనికి ఇప్పుడు పశ్చాతాప్పపడుతూ సారీ చెప్పాడు. ఈ మాటతో సుమ ఫుల్ ఖుషీ అయింది. కాగా సుమ తన పెళ్లిరోజును గుర్తు చేసుకుంటూ.. '25 ఏళ్ల క్రితం మేము పెళ్లి చేసుకుంటామంటే ఇంట్లో వ్యతిరేకత ఉన్నా తర్వాత అందరూ ఒప్పుకున్నారు. నాలుగో ముడి కూడా.. ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్నాం. మూడుముళ్లు రాజీవ్ వేశాక నాలుగో ముడి ఆడపడుచు వేయాల్సి ఉంది. కానీ రాజీవ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎంతో కష్టపడి ప్రేమించా.. ఆ ముడి కూడా నేనే వేస్తా అంటూ నాలుగోది కూడా అతడే వేశాడు. ఆ జ్ఞాపకాన్ని ఎప్పటికీ మర్చిపోలేను' అంటూ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంది. అలాగే దగ్గర్లోని వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడే ఈ జంట యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది. పెద్దల సమక్షంలో కేక్ కట్ చేసుకుని ఇరువురు దండలు మార్చుకున్నారు. వృద్ధులకు అన్నదానం చేశారు. చదవండి: వాలంటైన్స్ డే.. ప్రియుడి తల పగలగొట్టిన హీరోయిన్ -
ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో బబుల్గమ్ చిత్ర యూనిట్ సందడి
-
'ఇంత నల్లగా ఉన్నాడు, వీడు హీరో ఏంట్రా?..' రోషన్ ఎమోషనల్
యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం బబుల్గమ్. మానస చౌదరి కథానాయికగా నటిస్తోంది. క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఆదివారం(డిసెంబర్ 24న) బబుల్గమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగ్గా దీనికి యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించింది. ఇక ఈ వేదికపై తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు హీరో రోషన్. వీడు హీరో ఏంట్రా అని కామెంట్స్ తనను నమ్మి.. నచ్చింది చేయడానికి అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తల్లిదండ్రులు సుమ-రాజీవ్ పాదాలకు నమస్కరించాడు రోషన్. తర్వాత అతడు మాట్లాడుతూ.. 'మా నానమ్మ, అత్త కూడా ఈ సినిమా చూసుంటే బాగుండు. వారి ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చాలామంది చాలాసార్లు నా వెనకాల మాట్లాడింది విన్నాను. నా గురించి అనుకుంది చదివాను. వీడు ఇంత నల్లగా ఉన్నాడు.. వీడు హీరో ఏంట్రా? వీడు హీరో మెటీరియల్ కాదని చులకనగా మాట్లాడారు. నేను ఇలాగే పుట్టా.. ఇలాగే ఉంటా.. ఒక మనిషికి నలుపు, తెలుపు అందం కాదు బ్రదర్.. ఒక మనిషి సక్సెస్‌ను డిసైడ్ చేసేది తన హార్డ్‌వర్క్, టాలెంట్, క్రమశిక్షణ మాత్రమే! బబుల్గమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రాసిపెట్టుకోండి.. ఓ రోజు వస్తది! మనందరి నసీబులో ఏం రాసి పెట్టుందో ఎవరికీ తెలియదు. కానీ నచ్చినట్లు మార్చుకుంటాం. కావాల్సింది లాక్కుని తెచ్చుకుంటాం. అది ఏదైనా సరే.. ఓ రోజు వస్తది.. వద్దనుకున్నా వినబడ్తా.. చెవులు మూస్కున్నా వినబడ్తాను. రాసిపెట్టుకోండి' అని ఎమోషనలయ్యాడు. తనయుడి మాటలు విని భావోద్వేగానికి లోనైంది సుమ. రోషన్ మాటలు తన గుండెను తాకాయన్న సుమ.. కళ్లముందే కొడుకు తన చేదు అనుభవాలను చెప్తుంటే కన్నీళ్లు ఆపుకోవడానికి ప్రయత్నించింది. . చదవండి: ధనుష్ మూడో సినిమా! సౌందర్య రజనీకాంత్ కామెంట్స్ వైరల్.. -
'బబుల్గమ్' రొమాంటిక్ వీడియో సాంగ్‌తో హీట్ పెంచిన రోషన్
'బబుల్గమ్' సినిమాతో వెండితెరపై కనిపించనున్నాడు యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల. ఈ సినిమాలో ఆయనకు జోడీగా మానస చౌదరి నటిస్తుంది. రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అడివి శేష్‌తో ‘క్షణం’ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ రవికాంత్.. దీంతో బబుల్గమ్ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేమకథను ప్రధానమైన కాన్సెప్ట్‌గా మంచి రిలేషన్షిప్ డ్రామాగా ‘బబుల్గమ్’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ తెలిపాడు. ఈ చిత్రంలో ఆది పాత్రలో రోషన్, జాన్వీ పాత్రలో తెలుగు అమ్మాయి మానస నటించడం విషేశం అని ఆయన చెప్పాడు. కొత్తవారితో చేయాల్సిన సినిమా ఇది అని రోషన్ హీరోగా పరిచయమవుతున్నాడని తెలిసి, ఈ కథను చెప్పాను అన్నాడు. కాలేజీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత యువకుల కెరీర్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. దానిని ఈ సినిమాలో చూపించామని ఆయన తెలిపాడు. 'బబుల్గమ్' సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'జస్ట్ ఈజీ పీసీ' రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శ్రీ చరణ్ ఈ చిత్రానికి చక్కటి సంగీతం అందించాడు. -
బబుల్గమ్ ట్రైలర్‌తో యూత్‌ను టార్గెట్ చేసిన రోషన్ కనకాల
'బబుల్గమ్' సినిమాతో వెండితెరపై కనిపించనున్నాడు యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల. ఈ సినిమాలో ఆయనకు జోడీగా మానస చౌదరి నటిస్తుంది. రవికాంత్ పేరెపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌తో మంచి ఇంపాక్ట్ చూపించాడు రోషన్ కనకాల. ప్రధానంగా యూత్‌ను టార్గెట్ చేసినట్లు ట్రైలర్‌తో అర్థమౌతుంది. ప్రియురాలి వల్లే ప్రియుడికి అవమానం ఎదురైతే ఆ యువకుడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో పర్ఫెక్ట్గా చూపించాడు రోషన్. అలాంటి సమయం ఎదురైతే జీవితంలో ఆ యువకుడు ఎలా సక్సెస్ అయ్యాడు..? అదే విధంగా ఆమెపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు..? అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్ ఉంది. ఇందులో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. పాటలకు కూడా శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం యువతను మెప్పిస్తుంది. మొదటి సినిమాతోనే రోషన్ నటన సూపర్ అనిపించేలా ఉంది. యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్న ఈ ట్రైలర్‌ను చూసేయండి. డిసెంబర్ 29న బబుల్గమ్ విడుదల కానుంది. -
విడాకులు తీసుకుంటున్నారా? అని నాన్నను అడిగా: రోషన్
నటుడు రాజీవ్ కనకాల-యాంకర్ సుమ దంపతుల తనయుడు రోషన్ కనకాల వెండితెరపై పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. బబుల్గమ్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. ఇప్పటికే తాను పోలీసులకు దొరికిపోయినట్లు ఓ ప్రాంక్ వీడియో చేసి సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాడీ యంగ్ హీరో. చిన్నప్పటి నుంచే కోరిక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'చిన్నప్పటి నుంచి తెలియకుండానే యాక్టింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. బాల్యంలో ఉన్నప్పుడు అమ్మతో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించినప్పుడు చాలా సంతోషమేసింది. అలా చిన్నప్పుడే నటుడినవ్వాలని నా మనసులో బలంగా అనుకున్నాను. యాక్టింగ్ కోర్సు కూడా నేర్చుకున్నాను. ఒక మనసు సినిమాలో చిన్న పాత్ర చేశాను. నిర్మలా కాన్వెంట్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలక్ట్ అయ్యాక అందులో ఓ పాత్ర చేశాను. బబుల్గమ్ సినిమా కూడా ఆడిషన్స్ జరిగాకే హీరోగా సెలక్ట్ చేశారు. విడాకులు తీసుకుంటున్నారా? అని అడిగా అమ్మానాన్న విడాకులు తీసుకుంటున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అవి చదుతున్నప్పుడు అమ్మానాన్న జాలీగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కాక.. ఏంటి? మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని అడిగేశాను. దానికి వాళ్లు.. ఛీఛీ, ఏం మాట్లాడుతున్నావ్‌రా.. అలాంటిదేం లేదని చెప్పారు. రెండుమూడుసార్లు ఈ విడాకుల వార్తలు చూసినప్పుడు అంతా గందరగోళంగా అనిపించేది. తర్వాత ఊరికే పుకార్లు రాస్తున్నారని అర్థమైంది. పేరెంట్స్ మధ్య గొడవలు? నిజంగా అలాంటిదేమైనా ఉంటే ఇంట్లో ఉండే మాకు తెలుస్తుందిగా.. నాకు తెలియకుండా బయటవాళ్లకు ఈ వార్తలు వెళ్లడమేంటి? అనుకున్నాను. ఆ వార్తల్లో ఒక్క శాతం కూడా నిజం లేదు. భార్యాభర్తల మధ్య గొడవలుంటాయి. కానీ అమ్మానాన్న మధ్య అలాంటి పెద్ద గొడవలు ఏం జరగలేదు. పొద్దున త్వరగా నిద్ర లేకపోతే అమ్మ నాన్నపై అరుస్తుంటుంది. అలాంటి చిన్నచిన్న సరదా గొడవలే ఉంటాయి' అని చెప్పుకొచ్చాడు రోషన్ కనకాల. చదవండి: శివాజీ బ్యాచ్‌ని ఉతికారేసిన నాగార్జున.. ఆ విషయమే కారణమా? -
పోలీసులకు దొరికిపోయిన యాంకర్ సుమ తనయుడు, ఏమైందంటే?
యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల పోలీసులకు దొరికాడు. ఓ పార్టీకి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న ఇతడిని పోలీసులు అడ్డుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా? మరేం లేదు ప్రాంక్.. ఈ మధ్య రచ్చ చేయడం, చివర్లో అది తూచ్, ఉత్తుత్తే అనేయడం ఫ్యాషన్ అయిపోయింది. సినిమా వాళ్లయితే ఒక్కొక్కరు ఒక్కోలా తమ చిత్రాలకు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. యాంకర్ సుమ తనయుడు రోషన్ కూడా ఇదే అనుసరించాడు. వెరైటీ స్టంట్.. 'బబుల్గమ్' సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. మానస చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు రవిక్రాంత్ దర్శకత్వం వహించాడు. ఆ మూవీ కోసం తాజాగా కొత్త రీతిలో ప్రమోషన్ చేశారు.. పోలీసులకు దొరికిపోయినట్లు ఓ స్కిట్ వేశారు. అందులో భాగంగా తన ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా కారులో వెళ్తున్న రోషన్‌ను ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. అసలే ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు ఏరులై పారుతుంది. కారు డిక్కీలో సూట్‌కేసులు.. వాటిని నియంత్రిచడం కోసం కార్లు, ఇతర వాహనాలను పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు. అలా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీసులు రోషన్ కారును అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అని అడిగితే రోషన్ స్నేహితులు తలతిక్క సమాధానాలు చెప్పారు. చివరకు కారు డిక్కీ ఓపెన్ చేయించగా అందులో సూట్‌కేసులు కనిపించాయి. అవి తెరవడానికి తటపటాయించడమే కాకుండా పోలీసులతోనే డీల్ కుదుర్చుకోవాలని చూశారు. కానీ పోలీసులు వినకుండా సూట్‌కేసులు ఓపెన్ చేయాల్సిందేనని పట్టుపట్టారు. అప్పుడు సుమ.. ఇప్పుడు ఆమె తనయుడు.. చేసేదేం లేక సూట్‌కేసులు ఓపెన్ చేయగా వాటిలో స్వీట్లు ఉండటం చూసి పోలీసులు షాకవుతారు. అక్కడ జిలేబీలు, బబుల్ గమ్స్ ఉన్నాయి. అంటే మీకీపాటికే అర్థమై ఉంటుంది. ఇది బబుల్ గమ్ సినిమా కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ అని! ఇది చూసిన జనాలు.. మరీ ఇలాంటి స్టంట్లు అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు. అప్పుడేమో అల్లరి నరేశ్ ఉగ్రం రిలీజ్ సమయంలో యాంకర్ సుమను అరెస్ట్ చేసినట్లు నమ్మించి సినిమాకు కావాల్సినంత హైప్ తెచ్చుకున్నారు. ఇప్పుడేమో సుమ కుమారుడు పోలీసులకు దొరికినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. చదవండి: నెలసరి ఆలస్యం.. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్ -
గిన్నిస్ రికార్డు.. సంతోషంలో మునిగి తేలుతోన్న యాంకర్ సుమ
ప్రముఖ యాంకర్ సుమ కనకాల సంతోషంలో మునిగితేలుతోంది. ఇంతకీ ఆమె సంతోషానికి కారణం ఎవరనుకుంటున్నారా? ఆమె తాతయ్య పి.బి. మీనన్. ఈయన 98 ఏళ్ల వయసులో గిన్నిస్ రికార్డు గెలుచుకున్నారు. ఈ విషయాన్ని సుమ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు వెల్లడించింది. 'మా తాతయ్య(అమ్మమ్మ తమ్ముడు) మీనన్ 73 ఏళ్లుగా న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఎక్కువకాలం న్యాయవాది వృత్తిలో ఉంటూ సేవలందిస్తున్నందుకుగానూ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. ఈయన నాతో పాటు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. మా తాతయ్యే నా సూపర్ హీరో' అని రాసుకొచ్చింది. ఆయన చాలా గ్రేట్.. ఇందుకు తన తాత గిన్నిస్ రికార్డు అందుకున్న ఫోటోను జత చేసింది. అలాగే గిన్నిస్ బుక్ వారు అందించిన సర్టిఫికెట్‌ను సైతం జోడించింది. దీనిప్రకారం సుమ తాతయ్య 73 ఏళ్ల 60 రోజులగా న్యాయవాద వృత్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. అన్నేళ్ల పాటు వృత్తిలో కొనసాగడం మామూలు విషయం కాదు, నిజంగా ఆయన చాలా గ్రేట్ అని పొగుడుతున్నారు. సుమ కూడా తన యాంకరింగ్‌ను అలాగే కొనసాగించాలని.. భవిష్యత్తులో ఎక్కువకాలం యాంకరింగ్ చేసిన హోస్ట్‌గా గిన్నిస్ రికార్డు అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తిరుగులేని యాంకర్ ఇకపోతే మలయాళీ కుటుంబానికి చెందిన సుమ అచ్చ తెలుగమ్మాయిలా అనర్గళంగా తెలుగు మాట్లాడుతుంది. తన నోటి నుంచి వచ్చే పంచ్లకైతే లెక్కే లేదు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సుమ టాలీవుడ్లో యాంకర్‌గా బోలెడంత క్రేజ్ తెచ్చుకుంది. పెద్ద సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలకు అయితే సుమ కచ్చితంగా ఉండి తీరాల్సిందే! చాలామటుకు విమర్శలు, వివాదాల జోలికి పోని సుమ ఈ మధ్య ఆదికేశవ పాట లాంచ్ ఈవెంట్లో మాత్రం నోరు జారింది. 'స్నాక్స్, భోజనంలా చేస్తున్నారు' అంటూ మీడియా వాళ్లపై సెటైర్లు వేసింది. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో అందరికీ సారీ చెప్పి ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) చదవండి: బాలకృష్ణ VS తారక్.. పోటీగా దిగుతున్న బాలయ్య.. అప్పటి రిజల్ట్ రిపీట్ కానుందా? -
నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా!
యాంకర్ సుమ పేరు చెప్పగానే అద్భుతమైన యాంకర్ అని అంటారు. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ లేవు. కానీ కొన్నిసార్లు స్టేజీపై అతి చేసిన సందర్భాలు ఉన్నాయి. సెలబ్రిటీలు కాబట్టి ఆయా సందర్భాల్లో నవ్వి ఊరుకునేవాళ్లు. ఇప్పుడు ఏకంగా మీడియా వాళ్లతోనే సుమ పెట్టుకుంది. దీంతో ఓ జర్నలిస్టు ఈమెకి గట్టిగా కౌంటర్ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) తెలుగమ్మాయి కాకపోయినా సరే తెలుగు యాంకర్‌గా సుమ వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకుంది. టీవీ షోల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు కచ్చితంగా సుమ ఉండాల్సిందే అనే రేంజుకి వెళ్లిపోయింది. కానీ గత కొన్నాళ్ల నుంచి ఈమె యాంకరింగ్‌లో మొనాటనీ వచ్చేసింది. అంటే బోర్ కొట్టించేస్తుంది. తాజాగా 'ఆదికేశవ' పాట లాంచ్ ఈవెంట్లోనే అలానే కాస్త అతి చేసింది. ఈవెంట్ ప్రారంభానికి ముందు మీడియా వాళ్లని ఉద్దేశిస్తూ.. 'స్నాక్స్, భోజనంలా చేస్తున్నారు కదా! త్వరగా వచ్చి కెమెరాలు పెట్టండి' అని అంది. ఈ విషయమై సీరియస్ అయిన ఓ జర్నలిస్ట్.. అలా అనుకుండా ఉండాల్సిందని అన్నాడు. దీనిపై సెటైరికల్‌గా మాట్లాడిన సుమ.. 'స్నాక్స్ స్నాక్స్‌లానే తిన్నారు సరేనా' అని వ్యంగంగా మాట్లాడింది. 'ఇదే తగ్గించుకుంటే మంచిది' అని సదరు జర్నలిస్టు ఆమెపై సీరియస్ అయ్యాడు. దీంతో సుమ చివరకు క్షమాపణలు చెప్పి వాదన అక్కడితో ముగించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. వేడుక ముగిసిన తర్వాత మరోసారి మీడియా వారికి క్షమాపణలు చెబుతూ ఒక వీడియో మేసేజ్‌ను సుమ పంపారు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) మీడియా మిత్రులకు సారీ చెప్పిన Suma Kanakala గారు 👍#sumakanakala pic.twitter.com/8I9pUVUMmH — Kiran Mahesh (@kiranmahesh026) October 25, 2023 Words War Between Film Journalist and Anchor #Suma At #Aadikeshava Song Launch event pic.twitter.com/nf6Ld5GO8R — Tollywood insights (@Tollywoodinsigh) October 25, 2023 -
బెడ్‌పై కదల్లేని స్థితిలో శ్రీలక్ష్మి, మాట రాక కంటనీరు..: రాజీవ్ కనకాల ఎమోషనల్
కొద్ది నిమిషాల నిడివి ఉన్నా, సినిమా ఆసాంతం ఉన్నా తను పోషించే పాత్రలు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ ఎమోషన్స్ చూపించడం, సీన్‌ను రక్తికట్టించడంలో రాజీవ్ కనకాల దిట్ట. జీవితంలో కష్టనష్టాలు ఎన్నో చూసిన ఆయన సినీ కెరీర్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'అమ్మ, నాన్న, చెల్లి.. అందరినీ కోల్పోయాను. ఆ సమయంలో చాలా ఇబ్బందిపడ్డాను. రెండు,మూడు నెలలపాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా చెల్లి పేరు శ్రీలక్ష్మి. తను సీరియల్స్ కూడా చేసింది. తనకు క్యాన్సర్ వచ్చింది, దాన్నుంచి దాదాపు బయటపడింది. పూజలు, హోమాలు చేయించమంటే అవి కూడా చేయించాం. 85 శాతం రికవరీ అయింది. ఇక ఆందోళన చెందాల్సిన పని లేదనుకున్నాం. రెండు రోజుల్లో లాక్డౌన్ అనగా మా బావ నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వెళ్లి చూశాక తన పరిస్థితి దిగజారుతోందని అర్థమైంది. కీమోథెరపీ చేయిద్దామంటే అప్పుడే పచ్చకామెర్ల వ్యాధి సోకింది. అది తగ్గితేకానీ ఏ చికిత్స చేయరు. రోజురోజుకీ తన పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. అది కరోనా సమయం కావడంతో ఎవరూ ఆస్పత్రిలో జాయిన్ చేసుకునే పరిస్థితిలో లేరు. ఒకవేళ అడ్మిట్ చేసుకున్నా తన ప్రాణ్యాలకు గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. అందుకే ఉన్నంత వరకు కుటుంబమంతా ఒకే దగ్గర ఉన్నాం. బెడ్‌పై కదల్లేని స్థితిలో ఉన్న తను ఎప్పుడో ఒకసారి స్పృహలోకి వచ్చి కళ్లు తెరిచి చూసేది. మాట్లాడటానికి కూడా రాకపోయేది. తన కంట నుంచి కన్నీళ్లు కారేవి. రాత్రిపూట తన మూలుగు విని ఇంకా బతికుందని అనుకునేవాడిని. ఎక్కువరోజులు తను బతకదని తెలుసు, అదే జరిగింది. నా మేనకోడళ్లు (చెల్లి పిల్లలు) ఇద్దరూ చాలా స్ట్రాంగ్‌గా ఉండేవారు. తల్లి చనిపోయాక తనకోసం లేఖ రాశారు. ఆ మధ్య అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సమయంలో సుమ వచ్చి ఇప్పటి నుంచి మనకు నలుగురు పిల్లలు అంది. ఇప్పటికీ వాళ్లకు ఏం కావాలన్నా సుమ దగ్గరుండి చూసుకుంటుంది' అంటూ ఎమోషనలయ్యాడు రాజీవ్ కనకాల. చదవండి: అనాథలా చనిపోయిన తెలుగింటి హీరోయిన్.. -
సుమతో విబేధాలు? అందుకే అలా చేస్తున్నా: రాజీవ్ కనకాల
బుల్లితెరపై యాంకర్ సుమ స్టార్.. వెండితెరపై రాజీవ్ కనకాల ఓ చిన్నపాటి స్టార్. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఎందుకో మరి గతంలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. సంపాదన విషయంలోనూ అభిప్రాయబేధాలు వచ్చాయని పుకార్లు షికార్లు చేశాయి. అదంతా ఏమీ లేదని చెప్పినా వీరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల తన వైవాహిక జీవితం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చనిపోతాను అనగానే బాధ్యత తీసుకున్నా 'మా అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు. చెన్నైలో సినిమా ఇన్స్టిట్యూట్ పెడుతున్నారనగానే జాబ్ మానేసి అక్కడికి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికే ఇన్స్టిట్యూట్ మూసేశారు. అమ్మ మళ్లీ రాష్ట్ర ఉద్యోగం కొట్టింది. నాన్న నటుడిగా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ గుర్తింపు పొందాడు. తర్వాత ఆయన దర్శకుడిగా మారి సినిమాలు తీశాడు. 1985లో సొంతంగా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం. అప్పటినుంచి వరుసగా కష్టాలే! ఎప్పుడూ డబ్బులుండేవి కాదు. రూ.100, రూ.500 కోసం కూడా అప్పు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో నాన్నకు వారి సోదరులతో కలహాలు వచ్చాయి. వీటన్నింటిని తట్టుకోలేకపోయిన ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. నేనున్నా కదా నాన్న అని సర్ది చెప్పి పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్నా. వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ పోయాను. సుమతో విబేధాలు.. అందుకోసమే అలా చేస్తున్నా కంటి మీద కునుకు లేకుండా వరుస సీరియల్స్ చేసేవాడిని. పెళ్లయిన తర్వాత ఇద్దరం కలిసి అప్పులు అంతా తీర్చేశాం. మధ్యలో ఒకసారి ఓ సీరియల్‌కు డైరెక్షన్ చేశాను. ఏడాదిదాకా ఏ సినిమా ఛాన్సూ రాలేదు. అందుకే నేను నటనకే అంకితమయ్యాను. సుమ, నేను సంతోషంగా ఉన్నాం. మా మధ్య దూరం పెరిగిందని లేనిపోనివి రాస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే అప్పుడప్పుడూ తన ప్రోగ్రామ్‌లకు హాజరవుతున్నాను. కలిసి రీల్స్ కూడా చేస్తున్నాం. ఈ విడాకుల రూమర్స్ విని నేను బాధపడ్డాను. కానీ సుమ అయితే ఏమాత్రం పట్టించుకోలేదు. తర్వాత నేను కూడా లైట్ తీసుకోవడం మొదలుపెట్టాను' అని చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల. చదవండి: అందుకే సౌత్‌ను పట్టించుకోను.. అక్కడ హీరో, దర్శకుడు కాంప్రమైజ్ అడిగారు: నటి రెండో భార్యతో కలిసి తిరుమలను దర్శించిన ప్రభుదేవా -
బాలయ్య మాస్ ర్యాగింగ్.. ఏయ్ ఆపు, ఊరికే లొడలొడా వాగుతున్నావ్..
జగపతిబాబు, ఆశిష్ గాంధీ, విమలా రామన్, మమతా మోహన్‌దాస్, గానవి లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రుద్రంగి. ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు. జూలై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం (జూన్ 29న) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజీపై ఉన్న యాంకర్ సుమపై ఆయన సెటైర్లు వేశారు. ముందుగా రుద్రంగి సినిమాను తన భుజాలపై వేసుకుని ప్రమోష్స్ చేస్తున్న జగపతిబాబుపై ప్రశంసలు కురిపించింది సుమ. అతడిని మాట్లాడాల్సిందిగా కోరుతూ మైక్ జగపతిబాబు చేతికి అందించింది. జగపతిబాబు స్పీచ్ మొదలుపెట్టేలోపు పక్కనే ఉన్న బాలయ్య ఏయ్, ఆపు.. ముందు మాట్లాడనివ్వు.. ఓ లొడలొడా వాగేస్తున్నావ్.. అన్నాడు. దీంతో సుమ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ స్టేజీ పై నుంచి వెళ్లిపోయింది. తర్వాత కాసేపటికే స్టేజీపైకి వచ్చిన ఆమె.. బాలకృష్ణను మాట్లాడాల్సిందిగా కోరుతూ అతడి చేతికి మైక్ ఇచ్చింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. 'బాలయ్యబాబు సెక్సీ అంటే విమలా రామన్, మమతా మోహన్‌దాస్.. వాళ్లంతా ఎంత జెలసీగా ఫీలవుతారు? కదా! అయినా ఇంతకుముందు సుమ ఒక మాట అంది. నేను ఏమీ మాట్లాడకముందే అభిమానులు చప్పట్లు కొడతారంది. ఈవిడకు అప్పుడప్పుడూ చెంపదెబ్బలు అవసరం. కానీ ఒకటి జాగ్రత్తగా ఉండాలి. ఈమె తిరిగి చెప్పు తీసుకుని కొడుతుంది.. అదొక బాధ మళ్లీ! పాపం రాజీవ్ కనకాల ఎలా భరిస్తున్నాడో..' అంటూ సుమను టీజ్ చేశాడు. చదవండి: చనిపోయే కొద్ది గంటలముందు అవి కావాలన్న సౌందర్య -
ప్రభాస్ అక్కగా యాంకర్ సుమ.. ఆ సినిమా పేరేంటో తెలుసా?
ఎక్కడ చూసినాసరే హీరో ప్రభాస్ కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. 'ఆదిపురుష్'పై వివాదాలు, మరోవైపు 'సలార్' రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు.. ఇలా డార్లింగ్ హీరోని సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మార్చేశాయి. ఇదే టైంలో ప్రభాస్ గురించి ఓ విషయం వైరల్ అవుతోంది. ఓ చిత్రంలో ప్రభాస్‌కి అక్కగా యాంకర్ సుమ నటించిందని అంటున్నారు. మరి ఆ మూవీ ఏంటో మీలో ఎవరికైనా తెలుసా? (ఇదీ చదవండి: 'సలార్' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకేమో టెన్షన్!) తెలుగులో యాంకర్ అనే పేరు వినిపించగానే అందరికీ గుర్తొచ్చేది సుమ కనకాల. తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ మనలో కలిసిపోయింది. నటుడు రాజీవ్ కనకాలని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో సినిమాలు, సీరియల్స్ లో నటించిన సుమ.. ఆ తర్వాత మాత్రం రూట్ మార్చి యాంకర్ గా సెటిలైపోయింది. గతేడాది 'జయమ్మ పంచాయతీ' చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. లీడ్ రోల్ లో నటించింది గానీ హిట్ కొట్టలేకపోయింది. సరే అసలు విషయానికొచ్చేస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. 'ఈశ్వర్'తో హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటికీ 'వర్షం'తో తొలి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలోనే ప్రభాస్ కి అక్కగా సుమ నటించింది. కాకపోతే అది ఆమె కెరీర్ ప్రారంభంలో కావడంతో ఎవరూ పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు. 'రామబాణం' ప్రమోషన్స్ టైంలోనూ గోపీచంద్ ఇదే విషయమై సుమని ఆటపట్టించాడు! బహుశా స్టోరీ చదువుతున్న మీలో చాలామందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు!? (ఇదీ చదవండి: మొదటి ముద్దు.. డెటాల్‌తో నోరు కడుక్కున్నా: ప్రముఖ నటి) -
బిచ్చగాడు 2 మూవీ టీమ్ తో యాంకర్ సుమ చిట్ చాట్
-
అమ్మకు బంగారు బహుమతిచ్చిన యాంకర్ సుమ
యాంకరింగ్‌లో సుమను ఢీ కొట్టేవారే లేరు. ప్రస్తుతం టాప్ యాంకర్లుగా రాణిస్తున్నవారు కూడా సుమ యాంకరింగ్‌కు ఫ్యాన్సే! పంచులు, కౌంటర్లు, జోక్స్లతో ప్రతి ఒక్కరినీ ఎంటర్టైన్ చేస్తుంది సుమ. ఎంతటివారైనా ఆమె మాటల ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే! అంతటి ధీశాలి సుమ అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా సుమ మదర్స్‌డే(మే 14)ను పురస్కరించుకుని తన తల్లి విమల కోసం ఏదైనా గిఫ్ట్ కొనేందుకు షాపింగ్ చేసింది. ఈ మేరకు ఓ వీడియోను తన సొంత యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఇక్కడ కూడా తన చలాకీ మాటలతో అభిమానులను ఎంటర్టైన్ చేసింది చివరగా తన తల్లి కోసం ఒక సింపుల్ ఐటం సెలక్ట్ చేసుకున్నట్లు చెప్పింది. చివరగా.. అమ్మకు ఏమిచ్చినా సరిపోదు కాబట్టి వీటన్నిటితోపాటు బోలెడంత ప్రేమను కూడా ఇచ్చేయండి అని చెప్పుకొచ్చింది. ఇకపోతే టాలీవుడ్లో జరిగే చిన్నాపెద్ద ఈవెంట్లకు సుమ ఉండాల్సిందే! ఏ కార్యక్రమాన్ని అయినా సక్సెస్ఫుల్ చేయడంలో సుమ దిట్ట. తను టీవీ షోలు, ఇంటర్వ్యూలే కాకుండా ప్రీరిలీజ్ ఈవెంట్లు కూడా చేస్తుందన్న విషయం తెలిసిందే! కెరీర్ తొలినాళ్లలో నటిగా కొన్ని సినిమాలు చేసిన సుమ ఇటీవల జయమ్మ పంచాయితీ సినిమాతో మెప్పించింది కూడా! చదవండి: రూ.132 కోట్ల నష్టం.. భర్త కోమాలోకి.. మూడుసార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా -
Anchor Suma: భర్తతో కలిసి లక్ష్మీ పూజలో పాల్గొన్న సుమ (ఫొటోలు)
-
యాంకర్ సుమ అరెస్ట్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
యాంకర్ సుమ.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మాటల ప్రవాహంతో 15ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతుందామె. టీవీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కానీ, యాంకర్ సుమ మాత్రం పర్మినెంట్. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టాక్ షోలైనా, గేమ్ షోలైనా సుమ ఉండాల్సిందే. పేరుకు మలయాళీ అయినా తెలుగులో గలగల మాట్లాడుతూ తన కామెడీ, పంచ్ టైమింగ్‌లతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఆమె లేకుండా స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లు దాదాపు ఉండవని చెప్పాలి. అంతటి సామర్థ్యం ఉన్న సుమను తాజాగా అరెస్ట్ చేశారన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె చేతికి బేడీలు వేసి వ్యాన్‌లో తీసుకెళ్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సుమకి ఏమైంది? ఎందుకు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే సుమను నిజంగా అరెస్ట్ చేయలేదట. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా అరెస్ట్ చేశారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల ప్రమోషన్స్ చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అల్లరి నరేస్ నటిస్తున్న సినిమా ఉగ్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సుమతో ఇలా స్పెషల్ ఇంటర్వ్యూను ప్లాన్ చేసారన్నమాట. CI Shiva Kumar on duty! Your favourite anchor is in my control. The #Ugram begins. Details at 5.04 PM. https://t.co/5aQDlhlNdN — Allari Naresh (@allarinaresh) April 12, 2023 -
కేరళ అయినా.. పక్కా తెలంగాణ అమ్మాయినే: యాంకర్ సుమ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వని కల్చరల్ ఫెస్ట్‌లో తొలి రోజు శుక్రవారం లెట్స్టాక్ ప్రోగ్రాంలో యాంకర్ సుమ కనకాల సందడి చేశారు. ‘చమ్కీల అంగిలేసి ఓ వదినె’ అంటూ డ్యాన్స్‌తో ఆమె ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు దంపతులు, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ పులి రవికుమార్, ఫ్యాకల్టీ కో–ఆరి్డనేటర్ హీరాలాల్, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా.. స్ప్రింగ్‌స్ప్రీ కోర్ టీం కో–ఆరి్డనేటర్ జీవన్‌రెడ్డి నాలుగు రౌండ్లలో యాంకర్ సుమను అడిగిన ప్రశ్నలకు ఆమె ఉత్సాహంగా సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాలివే.. కేరళ అయినా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు? మానాన్న నారాయణ్ కుట్టి, అమ్మ విమల కుట్టి. నేను ఏకైక సంతానాన్ని. నాన్న రైల్వే ఉద్యోగి. ఉద్యోగంలో భాగంగా కేరళ నుంచి హైదరాబాద్ లాలాగూడకు వచ్చి సెటిల్ అయ్యాడు. నా స్వస్థలం కేరళ అయినా.. నేను పక్కా తెలంగాణ, హైదరాబాదీ అమ్మాయిని. నా కు లాలాగూడ రైల్వే డిగ్రీ కళాశాల అంటే ఇష్టం. నేను యాక్టింగ్, ప్రొడ్యూసింగ్, సామాజిక సేవ చేస్తున్నా. నా తొలి ప్రాధాన్యం యాంకరింగ్‌కే. అంత చిన్నవయసులో బుల్లితెరకు ఎలా వచ్చారు? సుమ: నాన్న రైల్వే ఉద్యోగంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కల్చరల్ ఈవెంట్లో చాందిని సినిమాలో శ్రీదేవి నటించిన ‘మేరే హతోమే నౌనౌ చూడియా’ పాటకు డ్యాన్స్ చేశాను. అక్కడ అప్పుడు నన్ను చూసిన దూరదర్శన్ నిర్వాహకులు నాకు సీరియల్లో ఛాన్స్ ఇచ్చారు. 1991లో 15 ఏళ్ల వయస్సులోనే బుల్లితెరతో నా కలల ప్రయాణం ప్రారంభమైంది. ఇష్టమైన సెలబ్రిటీలు? తల్లిదండ్రులే మనకు మొదటి సెలబ్రిటీలు. మా అమ్మ నాకు కూచిపూడి నృత్యం నేర్పించడం వల్లే నాట్యం, యాక్టింగ్‌పై పట్టు సాధించి యాంకర్‌గా రాణిస్తున్నా. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రతీ కళాశాలలో కల్చరల్ టీం ఉండాలి. నిట్ వరంగల్ కల్చరల్ టీం ఉండడమే కాకుండా కల్చరల్ ఫెస్ట్‌ను ప్రత్యేకంగా నిర్వహించడం.. అందులో భాగంగా నేను రావడం చాలా ఆనందంగా ఉంది. యాక్టింగ్‌తో పాటు సమాజానికి ఏం చేస్తున్నారు? విద్యార్థులు విద్యనభ్యసించి ఉత్తమ స్థాయికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరం మన బాధ్యతగా సమాజానికి సేవ చేయాలి. నేను ఏడేళ్ల క్రితం ఖమ్మంలో ప్రారంభించిన ఓల్డేజ్ హోమ్‌కు పవన్ కల్యాణ్‌తోపాటు ప్రభాస్ ఎంతో సాయం చేశారు. త్వరలో నేను హైదరాబాద్‌లో ప్రారంభించే వంద పడకల ఓల్డేజ్ హోమ్‌కు మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి. ఫెస్టివల్ ఫర్ జాయ్(ఎఫ్ఎఫ్జే) పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాను. అనాథలకు సైతం పండుగ సంతోషాన్ని అందజేస్తున్నాను. భద్రకాళి మాతకు పూజలు హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శుక్రవారం యాంకర్ సుమ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం వేద పండితులు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. -
నాన్న పొలానికి వెళ్లి పురుగుల మందు తాగారు.. పోసాని భావోద్వేగం
సినీ ప్రేమికులకు పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. నటుడిగా, కమెడియన్‌గా, దర్శకనిర్మాతగా, రచయితగా పనిచేసిన పోసాని తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు. తాజాగా ఆయన యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తాను వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు ఏవీ వాడనని కేవలం చిన్న మొబైల్‌నే వాడతానని చెప్పాడు. తర్వాత తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనలయ్యాడు పోసాని. 'మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. తనకు ఎలాంటి చెడ్డ అలవాటు లేకపోయేది. కానీ ఎవడో పేకాట నేర్పాడు. నాన్న పేకాట ఆడటం చూసి ఊళ్లోవాళ్లు ఎందుకు సుబ్బారావు.. ఇలా చేస్తున్నావు? అని విమర్శించారు. దానికి ఆయన సమాధానం చెప్పలేక పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి చనిపోయారు' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: ప్రాజెక్ట్ కేపై ప్రభాస్ షాకింగ్ నిర్ణయం ఆ హీరోతో 15 ఏళ్ల తర్వాత నటించనున్న త్రిష -
యాంకరింగ్‌కు బ్రేక్? టీవీ కోసమే పుట్టానన్న సుమ
తెలుగు బుల్లితెర టాప్ యాంకర్ ఎవరని అడిగితే సుమ కనకాల అని టపీమని చెప్తారు. 15 ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతుందామె. టీవీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వచ్చినా ఎవ్వరూ ఆమె స్థానాన్ని పొందడం కాదు కదా దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఆ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది సుమ. టీవీ షోలే కాదు, ప్రీరిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు.. ఏదైనా సరే సుమ ఉండాల్సిందే.. ఆమె మలయాళీ అయినా పదహారణాల తెలుగమ్మాయిగా రెడీ అయి అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఆమెది. తన కామెడీ, పంచ్ టైమింగ్లకు కొదవే లేదు. తాజాగా ఆమె యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై సుమ స్పందించింది. 'ఇటీవల న్యూఇయర్ ఈవెంట్ చేశాం. ఆ ప్రోమో రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. అందులో నేను కొంత ఎమోషనలైన మాట వాస్తవమే. కానీ ఈవెంట్ అంతా చూస్తే అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్‌లు పెడుతున్నారు.. ఏం కంగారుపడకండి. నేను టీవీ కోసమే పుట్టాను, ఎంటర్టైన్మెంట్ కోసమే పుట్టాను. ఎక్కడికీ వెళ్లడం లేదు. కాబట్టి మీరు హాయిగా ఉండండి' అని ఓ వీడియో రిలీజ్ చేసింది సుమ. చదవండి: తొలి సంపాదన రూ.350: భరత్ ధమాకా.. కలెక్షన్స్ ఎంతంటే -
అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన యాంకర్ సుమ
యాంకర్ సుమ కనకాల అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. 15ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతున్న సుమకు తెలుగు రాష్ట్రాల్లో బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా, టాక్ షో అయినా సుమ ఉండాల్సిందే అనేంతగా క్రేజ్ దక్కించుకుంది. ఆమె పంచులు కామెడీ టైమింగ్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతటి క్రేజ్ సంపాదించుకున్న సుమ తాజాగా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న సుమ తాను యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి ఎమోషనల్ అయ్యింది. "నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు" అంటూ సుమ కన్నీటి పర్యంతం అయ్యింది. యాంకరింగ్ నుంచి విరామం తీసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో మిగతా ఆర్టిస్టులు అందరూ ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా సుమ లేని టెలివిజన్ అంటే కాస్త కష్టమేనంటున్నారు ఆమె ఫ్యాన్స్. -
యాంకర్ సుమ సంపాదనే ఎక్కువా?: రాజీవ్ కనకాల ఏమన్నాడంటే?
సుమ- రాజీవ్ కనకాల.. ఒకరు బుల్లితెర స్టార్, మరొకరు వెండితెర ప్రముఖ నటుడు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో రాణిస్తున్న వీరిద్దరూ ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే సంపాదన విషయంలో వీరి మధ్య అభిప్రాయబేధాలు వస్తుంటాయని తరచూ కొన్ని పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. ఈ రూమర్‌పై స్పందిస్తూ రాజీవ్ కనకాల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 'మా మధ్య ఎప్పుడూ అభిప్రాయబేధాలు రాలేవు. సుమ వర్కింగ్ ఉమెన్, సంపాదిస్తుంది. టీవీలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆమెకు ఎక్కువ ఆదాయం వస్తుందని జనాలు అనుకుంటారు. నేను సంపాదించేది నేను సంపాదిస్తాను. సవాలక్ష మంది సవాలక్ష రకాలుగా అనుకుంటారు.. నేను అదేం పట్టించుకోను. ఆమె టీవీలో బిజీ అవకముందు నేను బోలెడన్ని సినిమాలు చేసి సంపాదించిన ప్రాపర్టీలు ఉన్నాయి. అయినా మా మధ్య అలాంటి ప్రస్తావనే రాదు. మీ దృష్టిలో.. నా కంటే సుమ సంపాదన ఎక్కువే' అని చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల. చదవండి: దమ్ముంటే అడ్డుకో.. తొడకొట్టి సవాల్ విసిరిన శ్రీహాన్ ఓరి దేవుడా దివాలి దావత్ -
ఓటీటీలో జయమ్మ పంచాయితీ, ఎప్పటినుంచంటే?
యాంకర్ సుమ కనకాల ప్రధానపాత్రలో నటించిన మూవీ జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మించారు. దినేష్ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా నటించగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అదించారు. మే6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుమ సహజ నటనతో అదరగొట్టేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. జూన్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరి థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే జయమ్మ పంచాయితీ ఏంటో ఓ లుక్కేయండి. చదవండి: భర్తకు నయన్ రూ.20 కోట్లు విలువ చేసే గిఫ్ట్, మరి విఘ్నేశ్ ఏమిచ్చాడో తెలుసా? సుకృతి ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ -
‘జయమ్మ పంచాయితీ’ట్రైలర్ రివ్యూ
‘చావడం సులువే.. బతికి బాధ్యతలు తీసుకోవడమే కష్టం’ అంటుంది యాంకర్ సుమ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జయమ్మ పంచాయితీ. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా జయమ్మ పంచాయితీ ట్రైలర్‌ని విడుదల చేశారు. కామెడీ డ్రామాతో పాటు భావోద్వేగాలు ఉండేలా ట్రైలర్‌ని కట్ చేశారు మేకర్స్. ట్రైలర్లో ఏముందంటే.. పిల్ల ఫంక్షన్ చేసి వచ్చిన డబ్బులతో భర్తకు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటుంది జయమ్మ. అది జరగదు.దీంతో తీవ్ర నిరాశకు లోనవుతుంది. ఎలాగైన భర్తకు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటుంది. అదే సమయంలో గ్రామంలోని ఓ యువకుడు తన కూతురితో సరసాలాడడానికి ప్రయత్నిస్తాడు. అతని నుంచి కూతురిని కాపాడుకుందా? జయమ్మ పెట్టిన పంచాయితీ ఏంటి? దాని వల్ల గ్రామ పెద్దలకు ఎదురైన సమస్యలు ఏంటి? తెలియాలంటే మే 6న థియేటర్స్‌లో ‘జయమ్మ పంచాయితీ’ చూడాల్సిందే. (చదవండి: సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు.. సీక్రెట్ రివీల్ చేసిన యాంకరమ్మ) కామెడీ డ్రామాతో పాటు ఎమోషనల్‌గా ‘జయమ్మ పంచాయితీ’ మూవీ సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘నా ఎనబైయేళ్ల జీవితంతో ఇలాంటి గొడవ వినలేదు, చూడలేదు’అని ఓ పెద్దాయన అనడం.. ‘తెల్లారికల్లా నా విషయం తేల్చలేదంటే.. ఊళ్లో ఎవరెవరైతే పెద్ద మనుషులని తిరుగుతున్నారో ఆలింటిముందే ఆళ్లకు పిండం పెట్టకపోతే సూడండి’అంటూ జయమ్మ వార్నింగ్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమ తన సహజ నటనతో ఆదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ‘గుండాలు తొక్కిన గండం గట్టేకినట్టే ఉంది’.‘చావడం సులువే.. బతికి బాధ్యతలు తీసుకోవడమే కష్టం’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. దినేష్ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అదించారు. -
‘జయమ్మ పంచాయితీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పక్కింట్లో టీవీ చూసే బుడ్డి సుమ సినిమాల్లోకి రావడం అదృష్టం
‘‘సుమ పంచాయితీ పెడుతుందని కాదు.. పిలిచిందని ప్రేమతో వచ్చాను (నవ్వుతూ). సుమ ప్రతిభను దర్శకులు, టెక్నిషియన్స్ పది శాతం వినియోగించుకున్నా చాలు ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది. సుమకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు హీరో నాగార్జున. ప్రముఖ యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్లో దినేష్ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున, నాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటుడు రాజీవ్ కనకాల (సుమ భర్త) బిగ్ టికెట్ అందుకున్నారు. నాని మాట్లాడుతూ.. ‘‘సుమగారికి నేను పెద్ద అభిమానిని. ఇండస్ట్రీలో పెద్దలు, ప్రభుత్వాలు, అసోసియేషన్స్ సినిమాకు ఏం చేశాయో నాకు తెలియదు కానీ సుమగారు మాత్రం తెలుగు సినిమాకు చాలా చేశారు. ప్రతి సినిమాకు సుమగారు పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు. ‘జయమ్మ పంచాయితీ’ ట్రైలర్ చూశాను. సుమగారు బాగా చేశారు’’ అన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూసి సుమగారికి ఆడియన్స్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందమైన ఆడవాళ్లను చూశాను. తెలివితేటలున్న ఆడవాళ్లను చూశాను. మంచి మనసున్న ఆడవారిని చూశాను. ఈ మూడూ సుమలో ఉన్నాయి’’ అన్నారు. సుమ మాట్లాడుతూ – ‘‘టీవీ చూసేందుకు పక్కింటికి వెళ్లిన ఓ బుడ్డి సుమ.. టీవీకి వచ్చి, సినిమాకు కూడా రావడం అనేది నిజంగా అదృష్టం. ఆడియన్స్ ప్రోత్సాహంతోనే నాకు ఎనర్జీ వస్తుంది. అందరి హీరోల ఫ్యాన్స్ మా సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. విజయం సాధించిన ప్రతి మగాడి వెనక ఓ మహిళ ఉందంటారు. కానీ విజయం సాధించిన ప్రతి మహిళ వెనక ఓ కుటుంబం ఉంటుంది. మీరందరూ (ప్రేక్షకులను ఉద్దేశించి) నా ఫ్యామిలీ’’ అన్నారు. ‘‘సుమగారు మంచి ప్రతిభావంతురాలు. ఓ రెండు షాట్స్‌లో తప్పులు కనిపెట్టి, వాటిని మ్యూజిక్‌తో ఎలివేట్ చేద్దామన్న కీరవాణిగారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు విజయ్ కుమార్. ‘‘నేను సిక్కోలు బిడ్డను. సుమగారు లేకపోతే ‘జయమ్మ పంచాయితీ’ లేదు. కీరవాణిగారు మా సినిమాకు సంగీతం అందిస్తా అన్నప్పుడే మా సినిమా విజయం సాధించినట్లు భావించాను. సక్సెస్ మీట్లో మరింత మాట్లాడతాను’’ అన్నారు నిర్మాత బలగ ప్రకాశ్. ఓ సినిమా సాంగ్ షూట్లో ఉన్నందువల్ల దర్శకులు రాఘవేంద్రరావు, వెకేషన్లో ఉన్నందువల్ల రాజమౌళి ఈ వేడుకకు రాలేకపోతున్నట్లుగా వీడియో సందేశాలు పంపారు. చిత్రయూనిట్‌కి దర్శకులిద్దరూ శుభాకాంక్షలు తెలిపారు. రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, గాయకుడు రేవంత్, డీవోపీ అనుష్కుమార్, ఆర్ట్ డైరెక్టర్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఒకే రోజు ముచ్చటగా 3 సినిమాలు.. దేనికి ఆడియెన్స్ ఓటు ! -
8 ఏళ్ల కృషి ఫలించి సుమతో నటించే ఛాన్స్ దక్కింది
‘‘గ్రామంలో అల్లరి చిల్లరిగా తిరిగే ఓ పూజారి అనిత అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.. మా ప్రేమకు చిన్న సమస్య వస్తుంది. మరోవైపు జయమ్మ (సుమ)కు ఓ సమస్య ఉంటుంది. ఆమె సమస్యకూ మా సమస్యకూ లింక్ ఉంటుంది.. అది ఏంటనేది సినిమాలో చూడాల్సిందే’’ అని హీరో దినేష్ కుమార్ అన్నారు. యాంకర్ సుమ కనకాల లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దినేష్ కుమార్, షాలినీ జంటగా నటించారు. బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా మే 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. విజయ్ కుమార్‌ది మా ఊరే అయినప్పటికీ ఆడిషన్స్ ద్వారా నన్ను ఎంపిక చేశారు. ఎనిమిదేళ్లుగా నేను చేస్తున్న కృషి ఫలించి ఏకంగా సుమగారి సినిమాలో అవకాశం రావడం, అది కూడా ఆమెతో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నటుడిగా నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఇచ్చింది’’ అన్నారు. చదవండి: నాతో కాకపోతే ఇంకొకరిని వెతుక్కో.. కాబోయే భర్త ఏమన్నాడంటే నిజజీవితానికి భిన్నంగా.. హీరోయిన్ షాలినీ మాట్లాడుతూ– ‘‘మా అమ్మది మొగల్తూరు, నాన్నది హైదరాబాద్. నేను హైదరాబాద్‌లో పెరిగాను. సినిమాలపై ఆసక్తి ఎక్కువ. తమిళంలో షార్ట్ ఫిలిం చేశాను. ఆ తర్వాత కొన్ని రెస్టారెంట్ యాడ్స్ కూడా చేశాను. ‘జయమ్మ పంచాయితీ’ సినిమాకు ఆడిషన్ ద్వారా ఎంపిక చేశారు. నా పాత్రకూ, జయమ్మ పాత్రకు మధ్య పెద్దగా సన్నివేశాలు ఉండవు. ఈ సినిమాలో నా నిజ జీవితానికి భిన్నమైన పాత్ర పోషించాను. అందరూ మెచ్చుకునేలా నా పాత్ర ఉంటుంది’’ అన్నారు. చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటానేమో! చెప్పలేం అంటున్న హీరోయిన్ -
‘జయమ్మ పంచాయతీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్స్‌గా ఈ స్టార్ హీరోలు
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తాన్ని ఖరారు చేసింది చిత్ర బృందం. రేపు (ఏప్రిల్ 30) ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇక ఈ సినిమాకి ముఖ్య అతిథులుగా స్టార్ హీరోలైన నాగార్జున అక్కినేని, నేచురల్ స్టార్ నాని వస్తున్నారు. జయమ్మ పంచాయి ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు మేకర్స్. Get ready for the Grand Pre release event of #JayammaPanchayathi. Chief guests King @iamnagarjuna & Natural 🌟 @NameisNani 📍Daspalla convention ⏰Tomorrow 6PM onwards#JayammaPanchayathiOnMay6th@ItsSumaKanakala @VijayKalivarapu @vennelacreation @adityamusic @shreyasgroup pic.twitter.com/iTBPj5aYsk — Vennela Creations (@vennelacreation) April 29, 2022 -
వరంగల్‌లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న యాంకర్ సుమ
ప్రముఖ యాంకర్ సుమ లీడ్‌లో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయతీ. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా చిత్రం బృందం మంగళవారం హనుమకొండలో పర్యటించింది. ముందుగా భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. భద్రకాళి అమ్మవారి అనుగ్రహంతో జయమ్మ పంచాయితీ విజయం ఖాయమైందన్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యోంలో ఈ మూవీని రూపొందించామని, తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు మా సినిమా బాగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.ఈ చిత్రంలో తాను ముఖ్య పాత్ర పోషించానని, చదివింపుల చుట్టూ ఈ కథ ఉంటుందని చెప్పారు. మనిషికి మనిషి ఎలా సహాయంగా నిలబడాలో ఈ చిత్రం తెలుపుతుందన్నారు. కాగా ఈ సమావేశంలో సుమతో పాటు మిగతా నటీనటులు శాలిని, భవన్, దినేశ్ కుమార్, త్రినాథ్‌లు పాల్గొన్నారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కిన ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహించారు. -
రాజీవ్‌తో విబేధాలపై స్పందించిన యాంకర్ సుమ
నవ్వుల రాణి, మాటల మహారాణి సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకర్‌గా, నటిగా, సింగర్‌గా ఇలా తనలోని ఎన్నో టాలెంట్లతో ప్రేక్షకులను అలరించి, అలరిస్తూనే ఉందావిడ. హీరోహీరోయిన్లకన్నా ఎక్కువ బిజీగా ఉండే ఈ స్టార్ మహిళ తాజాగా ఓ షోకి హాజరైంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తనకు చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ ఓ మంచి సినిమా చేద్దామని ఇంతకాలం ఆగినట్లు తెలిపింది. అలా చివరకు జయమ్మ పంచాయితీ చేస్తున్నట్లు తెలిపింది. తన పూర్తిపేరు పల్లెశెన పాచిమిట్టిన సుమ అని పేర్కొంది. తెలుగు సినిమాల్లో పంచాయితీ పెద్దగా నటించిన ఐదుగురు హీరోల పేర్లు చెప్పమనగానే సుమ తడుముకోకుండా రజనీకాంత్, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, సంపూర్ణేశ్‌బాబు అని టపీమని చెప్పింది. తన కొడుకు గురించి మాట్లాడుతూ.. వాడు చిన్నప్పటి నుంచే హీరోలా మాట్లాడేవాడని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇక రాజీవ్, సుమ విడిపోయారంటూ గతంలో వచ్చిన వార్తలపై స్పందించింది. రాజీవ్‌కు, తనకు ఇద్దరి మధ్యలో గొడవలు జరిగిన విషయం నిజమేనని, ఈ 23 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు గొడపడ్డామని తెలిపింది. కానీ భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం సులువే కానీ తల్లిదండ్రులుగా డివోర్స్ తీసుకోవడం మాత్రం చాలా కష్టం అని భావోద్వేగానికి లోనైంది సుమ. కాగా సుమ ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయితీ మే 6న థియేటర్లలో విడుదల కానుంది. చదవండి: ఏంటి, ఓవరాక్షనా? దీపికానే కాపీ కొడుతున్నావా? ఆలియాపై ట్రోలింగ్ బద్రి భామపై చీటింగ్ కేసు, బికినీ ఫొటోలు వైరల్ -
షోరూమ్ ఓపెనింగ్‌లో జయమ్మ సందడి
సాక్షి, హైదరాబాద్: యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ జనాలను ఆకట్టుకుంటోంది. తాజాగా జయమ్మ ఓ షోరూమ్ ఓపెనింగ్‌లో సందడి చేసింది. కొత్తపేటలో కాంచీపురం హరిప్రియ సిల్క్స్ను ప్రారంభించింది. ఈ షోరూమ్‌లో బెనారస్ పట్టు, ఇక్కట్ పట్టు, ఉప్పాడ పట్టు, గద్వాల్ పట్టు, కుప్పాడం పట్టు, ఆరని పట్టు, కోల్‌కతా వర్క్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, ఎంబ్రాయిడరీ సారీస్, ఫ్యాన్సీ సారీస్ అందుబాటులో ఉన్నాయి. కొత్తపేటలో తమ స్టోర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు జానపాటి శ్రీనివాసరావు తెలిపారు. వినియోగదారులకు నాణ్యత గల వస్త్రాలను అందిస్తామని, అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు. చదవండి: కేజీఎఫ్ 2 దూకుడుకు దద్దరిల్లుతున్న బాక్సాఫీస్ -
బాలీవుడ్ ఎంట్రీపై స్పందించిన యశ్
కన్నడ స్టార్ యశ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ కేజీఎఫ్. దీనికి సీక్వెల్‌గా వస్తోంది కేజీఎఫ్ చాప్టర్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 14) విడుదల కాబోతోంది. ఈ క్రమంలో యాంకర్ సుమ కేజీఎఫ్ చిత్రయూనిట్‌ను ఇంటర్వ్యూ చేసింది. యశ్, ప్రశాంత్‌నీల్‌లకు వరుస ప్రశ్నలు విసురుతూ ఎన్నో ఆసక్తికర అంశాలను రాబట్టింది. తుఫాన్ సాంగ్ 24 గంటల్లో 26 మిలియన్ వ్యూస్ రాబట్టడం మామూలు విషయం కాదని చెప్పుకొచ్చింది. మీరు ఇండియాకే కాదు ప్రపంచానికే నచ్చారంటూ యశ్‌ను ఆకాశానికెత్తింది. హిందీ సినిమాలు చేస్తారా? అన్న ప్రశ్నకు యశ్ మాట్లాడుతూ.. నన్ను ఇన్నిరోజులు సపోర్ట్ చేసిన ఆడియన్స్‌ను వదిలేసి ఎక్కడికో ఎందుకు వెళ్తాను? కాకపోతే నా సినిమాలు అంతటా డబ్ చేస్తాను అని ఆన్సరిచ్చాడు. అనంతరం సుమ.. ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు అన్న డైలాగ్ అద్భుతమని, ఇది ఎవరు రాశారని అడిగింది. దీనికి యశ్ స్పందిస్తూ అది రాసింది తానేనని బదులిచ్చాడు. మరి కేజీఎఫ్ టీమ్‌తో సుమ ఇంకా ఏమేం మాట్లాడిందో తెలియాలంటే కింది ఇంటర్వ్యూ చూసేయండి.. చదవండి: వెండితెరపై సైనికులుగా పోరాడనున్న హీరోలు వీళ్లే -
బిగ్‌బాస్ షోలోకి యాంకర్ సుమ ఎంట్రీ, నవ్వులే నవ్వులు
బిగ్‌బాస్ షోకు, సుమకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రతి సీజన్‌కు ఆమె ఆహ్వానం అందుతూనే ఉంది. పిలిచినప్పుడల్లా కాదనుకుండా ఆమె వస్తూనే ఉంది. నేడు ఉగాదిని పురస్కరించుకుని బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది జయమ్మ. అవును, ఈసారి యాంకర్ సుమగా కాకుండా జయమ్మ పంచాయితీ కథానాయిక జయమ్మగా షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే తన హుషారైన మాటలతో హౌస్‌లో జోష్ నింపింది. అలాగే కొందరు కంటెస్టెంట్లపై చమత్కారాలు కూడా పేల్చింది. పంపు కాదు పాతాళగంగ అంటూ మిత్రను ఆటపట్టించింది. మరోవైపు అఖిల్ సార్థక్ గిఫ్టులు వచ్చాయంటూ హౌస్‌లోని అమ్మాయిలను ఏప్రిల్ ఫూల్ చేశాడు. ఈ సరదా ఎపిసోడ్ చూడాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే! చదవండి: 'దరిద్రం, ఎన్నిసార్లు చెప్పినా మారడు అని చిరంజీవి తిట్టారు' -
యాంకర్ సుమకు చాదస్తం ఎక్కువ, నోరేసుకుని పడిపోతుంది
MM Keeravaani Chit Chat with NTR and Ram Charan: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. తాజాగా తారక్, చెర్రీలను సంగీతదర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఇంటర్వ్యూ చేశారు. ఇందులో హీరోలిద్దరూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కీరవాణి కంపోజ్‌చేసిన పాటల్లో భీమవరం బుల్లోడా పాలు కావాలా.. సాంగ్ అస్సలు నచ్చదన్నాడు ఎన్టీఆర్. ఫేవరెట్ సింగర్ ఎవరన్న ప్రశ్నకు మోహన భోగరాజు, గీతామాధురి గొంతు నచ్చుతుందన్నాడు. యాంకర్ సుమకు మీ సినిమాలో ఏ రోల్ ఇస్తారని కీరవాణి ప్రశ్నించగా దీనికి తారక్ స్పందిస్తూ.. ఆమెకు నాయనమ్మ లేదా అమ్మమ్మ లాంటి ముసలమ్మ రోల్ ఇవ్వాలన్నాడు. సుమకు చాదస్తం ఎక్కువని, నోరేసుకుని పడిపోతుందని, ఆమెను చూడగానే గయ్యాలి అత్త పాత్ర గుర్తొస్తుందని అన్నాడు. రామ్‌చరణ్ మాట్లాడుతూ.. సుమకు పంచాయితీలు పరిష్కరించే మధ్యవర్తి పాత్రను ఇవ్వాలన్నాడు. చదవండి: మళ్లీ ప్రేమలో పడ్డ హీరో, సహజీవనం కూడా?! -
జయమ్మ పంచాయితీ: ఓ రేంజ్లో పారితోషికం తీసుకుంటున్న సుమ!
యాంకర్ సుమ. ఈమె హోస్టింగ్‌కు సాధారణ జనాలే కాదు సెలబ్రిటీలు సైతం జై కొడుతుంటారు. వరుస షోలు చేస్తూ బుల్లితెర మహారాణిగా పేరు తెచ్చుకున్న సుమ వీలు చిక్కినప్పుడల్లా కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే ఈసారి సహాయక పాత్రల్లో కాకుండా ఏకంగా లీడ్ రోల్లో నటించింది సుమ. దీనికి 'జయమ్మ పంచాయితీ' అని టైటిల్ ఫిక్స్ చేశారు. విజయ్ కుమార్ కలివారపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బలగ ప్రకాశ్ నిర్మించారు. ఈ సినిమాకుగానూ సుమ ఓ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుందట! ఒకరోజు హోస్టింగ్‌కు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా తీసుకునే సుమ ఇప్పుడీ సినిమా కోసం ఏకంగా యాభై లక్షలు డిమాండ్ చేసిందని టాక్. తనకున్న క్రేజ్‌ను బట్టి అంత మొత్తం ఇవ్వడానికి కూడా వెనుకాడట్లేదట నిర్మాతలు. ఇప్పటికే సుమకున్న పాపులారిటీతో సినిమా చుట్టూ మంచి బజ్ ఏర్పడింది. గతంలో రిలీజైన టీజర్ కూడా వినోదాత్మకంగా ఉండటంతో మూవీ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి చాలాకాలానికి వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న సుమ 'జయమ్మ పంచాయితీ'తో సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి! -
యాంకర్ సుమ చేతిపై పచ్చబొట్టు!
యాంకర్ సుమ.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. వాక్చాతుర్యంతో, కామెడీ పంచులతో ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీలను సైతం పొట్టచెక్కలయ్యేలా నవ్వించగలదీ లేడీ యాంకర్. ఆమె యాంకర్‌గా కెరీర్ ఆరంభించడాని కంటే ముందు నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సీరియళ్లు, సినిమాల్లో నటించింది. తర్వాత నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుని యాంకర్‌గా సెటిలైంది. అయితే రెండు, మూడు రోజులుగా ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై సుమ కూడా ఇంతమంది అడుగుతున్నారంటే చేస్తే పోలే.. అని క్లూ వదిలింది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సుమ. ఈమేరకు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టర్ వదిలింది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించింది. టైటిల్, ఫస్ట్ లుక్ నవంబర్ ఆరున రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ పోస్టర్లో బియ్యం దంచడానికి సుమ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కానీ ఆమె ముఖం మాత్రం చూపించలేదు. ఆమె చేతిపై వెంకన్న అనే పేరు పచ్చబొట్టు వేయించుకున్నట్లుగా చూపించారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియలాంటే ఇంకో మూడు రోజులు ఆగాల్సిందే! View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
యాంకర్ 'సుమ కనకాల' బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
నాట్యం చేస్తున్న ఈ యాంకర్ ఎవరో తెలుసా?
గలగలపారే సెలయేరు, కనకాల సుమ నోటి నుంచి వచ్చే మాటల ప్రవాహం రెండూ సేమ్ టు సేమ్. అలుపెరగకుండా ముందుకు సాగే ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం చాలా కష్టం. స్వస్థలం కేరళ అయినా ఇక్కడి అబ్బాయిని పెళ్లాడి తెలుగింటి అమ్మాయిగా మారిపోయిందావిడ. కేవలం యాంకరింగే కాకుండా నటన, నాట్యం, సంగీతంలోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. మొదట్లో అడపాదడపా సినిమాల్లో నటనతో ఆకట్టుకున్న సుమ తర్వాత యాంకరింగ్‌కే పెద్ద పీట వేస్తూ తెలుగునాట నెంబర్ 1 వ్యాఖ్యాతగా నిలిచింది. ఏళ్లు గడుస్తున్నా బుల్లితెర మీద సుమ స్థానం చెక్కు చెదరలేదు. పలు టీవీ షోలతో బిజీబిజీగా ఉన్న సుమ తాజాగా ఓ ఫొటోను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) "అమ్మకు నాట్యం అంటే చాలా ఇష్టం. నేను నాట్యం చేస్తుంటే చూడాలని ఎంతో ఇష్టపడేది. నేను కూడా డ్యాన్స్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేసేదాన్ని. బద్ర అని నాకో డ్యాన్స్ టీచర్ ఉండేది. ఆమె నేతృత్వంలో స్కూల్ డేస్‌లో పర్ఫామ్ చేసినప్పుడు తీసిన ఫొటో ఇది" అని రాసుకొచ్చింది. ఇక ఈ ఫొటో చూసిన అభిమానులు 'నువ్వు సూపర్ టాలెంటెడ్ అక్కా..' అని పొగుడుతున్నారు. మరికొందరేమో 'ఈ ఫొటోలో సుమను గుర్తుపట్టడం కాస్త కష్టంగానే ఉంది' అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: సింగర్ సునీతకు సుమ కాస్ట్లీ గిఫ్ట్? విజయ్‌తో సారా అలీఖాన్ సెల్ఫీ.. ఫొటో వైరల్ ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్ రూ. 50 కోట్లు -
మాస్టర్ అవుట్: మెహబూబ్‌కు కెప్టెన్సీ, కానీ!
ఈసారి ప్రేక్షకుల అంచనా మిస్సవలేదు. తన చేష్టలతో ఇంటి సభ్యులను బెంబేలెత్తించిన అమ్మ రాజశేఖర్ బిగ్‌బాస్ హౌస్ నుంచి తొమ్మిదో వారం ఎలిమినేట్ అయ్యాడు. మరోవైపు సుమ స్పెషల్ గెస్ట్‌గా రావడంతో శనివారం రావాల్సిన దీపావళి వారం రోజుల ముందే వచ్చినట్లైంది. స్టేజీ పైకి వస్తూనే నవ్వుల బాణాలను వదిలింది. అందరినీ ఇరిటేట్ చేసే అరియానాను ఇమిటేట్ చేస్తూ, ప్రతి ఒక్కరి మీదా జోకులు పేల్చే అవినాష్ మీద కామెడీ చేస్తూ కంటెస్టెంట్లను మారు మాట్లాడనీయకుండా చేసింది. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే ఈ స్టోరీ చదివేసేయండి.. అఖిల్‌కు మోనాల్ చాక్లెట్లు, మరి ఆమెకు? దీపావళి సందర్భంగా ఇంటిసభ్యులకు బహుమతులు వచ్చాయని, వాటిని అందుకోవాలంటే కొన్ని చాలెంజ్‌లు పూర్తి చేయాలని నాగార్జున తెలిపారు. మొదట సోహైల్ కోసం మెహబూబ్ నేల మీద బౌల్లో ఉన్న బిస్కెట్లను చేయితో పట్టుకోకుండా తినేశాడు. దీంతో సోహైల్‌కు తను పంపిన బ్రేస్లెట్ గిఫ్ట్‌ను మెహబూబ్ తొడిగాడు. తర్వాత అఖిల్ కోసం అభిజిత్.. తల మీద బుట్టలో బంతులు వేసే ఆట ఆడాడు. దీంతో అఖిల్ గిఫ్ట్ ఓపెన్ చేయగా మోనాల్ పంపించిన చాక్లెట్లు కనిపించాయి. అనంతరం అభిజిత్ కోసం అఖిల్ సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని బంతులు వేరు చేసే గేమ్ ఆడాడు. కానీ విఫలమయ్యాడు. దీంతో అభికి వచ్చిన గిఫ్ట్ వెనక్కు వెళ్లిపోయింది. (చదవండి: మోనాల్ మాత్రం కోడలిగా రాదు: అఖిల్ తల్లి) మాస్టర్‌కు, మోనాల్‌కు గిఫ్టులు పంపిన నాగ్ లాస్య కోసం హారిక నడుముకు టిష్యూ బాక్స్ కట్టుకుని గెంతుతూ, అందులో నుంచి 20 బంతులు బయట పడేలా చేయాల్సి ఉంటుంది. కానీ ఓడిపోవడంతో లాస్య బహుమతి పోగొట్టుకుంది.. మెహబూబ్ కోసం అవినాష్, అమ్మ రాజశేఖర్ జడ వేయించుకున్నారు. దీంతో మెహబూబ్‌కు సోహైల్ కాఫీ కప్పును అందించాడు. తర్వాత అవినాష్ కోసం మాస్టర్, అరియానా కోసం మెహబూబ్ గేమ్ ఆడారు. కానీ ఓడిపోవడంతో వాళ్ల గిఫ్ట్ కూడా చేజారిపోయింది. హారిక కోసం.. అభిజిత్, లాస్య బంతుల టాస్కు ఆడి గెలిచారు. దీంతో హారికకు అభి నువ్వుండలు, లాస్య డ్రెస్ పంపించింది. మిగిలిన మోనాల్, అమ్మ రాజశేఖర్‌కు ఎవరూ గిఫ్టులు పంపకపోవడంతో తానిస్తానని నాగ్ స్వయంగా ముందుకొచ్చారు. మాస్టర్‌కు చేపల కూర, మోనాల్‌కు అహ్మదాబాద్ నుంచి స్వీట్లు తెప్పించారు. (చదవండి: నా గురించి మాట్లాడకు అరియానా: అవినాష్ ఫైర్) వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ప్రాంక్ తర్వాత సుమను సూపర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని లోపలకు ఆహ్వానించారు. కానీ అదంతా ప్రాంక్ అని కొన్ని క్షణాల్లోనే తేలిపోయింది. అయితే సుమ కంటెస్టెంట్లతో సహా నాగార్జున మీద కూడా పంచులు విసరడం గమనార్హం. ఆ తర్వాత ఇంటిసభ్యుల కోసం తెచ్చిన వస్తువుల చిట్టాను ఏకరువు పెట్టింది. మోనాల్‌కు టిష్యూలు, అరియానాకు లాలీపాప్, లాస్యకు తెలుగు జోక్స్ పుస్తకం తెచ్చింది. దీంతో లాస్య జలుబు ముక్కుకే ఎందుకు చేస్తుందని ప్రశ్నించింది. ఈ జోకును పట్టేసిన సుమ.. ఐస్ మధ్యలో ఉంటుందని జవాబిచ్చింది. ఎక్సర్సైజ్ చేయడం లేదని అభితో గెంతులు వేయించింది. హారికతో తెలుగు టంగ్ ట్విస్టర్, అవినాష్‌తో ఇంగ్లీష్ టంగ్ ట్విస్టర్ చెప్పించేందుకు ప్రయత్నించింది కానీ వారి వల్ల కాలేదు. (చదవండి: రాజీవ్‌పై సుమ ఎమోషనల్ ట్వీట్.. వైరల్) అవినాష్ నీ కాళ్లు పట్టుకుంటా.. తర్వాత అవినాష్‌కు బిస్కెట్లు, మాస్టర్‌కు ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చానని చెప్తూ, అఖిల్‌కు లవ్ లెటర్ రాసేందుకు పెన్నూ పేపర్ తేవడం మర్చిపోయినట్లు తెలిపింది. అయితే ఆమె కోరిక మేరకు అఖిల్.. ఏమైపోయావే... అని పాట పాడి అందరినీ బుట్టలో వేసుకున్నాడు. నీకోసం ఎవరైనా పాడారా? అని నాగ్ లాస్యను అడగ్గా.. పాడారు కనుకే రెండు జోల పాటలు పాడానని పంచ్ విసిరింది. ఇక హౌస్‌లోకి వెళ్లమనగానే గంగవ్వ వయసొచ్చాక వెళ్తానంటూ షో నుంచి జారుకుంది. అనంతరం మోనాల్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో మాస్టర్, అవినాష్ డేంజర్ జోన్లో పడ్డారు. పొరపాటున అవినాష్ వెళ్లిపోతాడేమోనని అరియానా వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఏం జరిగినా నువ్వు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని మదర్ ప్రామిస్ వేయించుకుంది. 'నీ కాళ్లు పట్టుకుంటా, నాకోసం ఎదురు చూడు, నువ్వు బతికుంటే చాలు' అంటూ ఎమోషనల్ అయింది. అభిజిత్ విలన్: అమ్మ రాజశేఖర్ ఇంతలో డబుల్ ఎలిమినేషన్‌కు ఛాన్స్ ఉందని చెప్పడంతో అరియానా షాక్ తింది. కానీ అలాంటిదేమీ లేదని కొన్ని క్షణాల్లోనే తేలిపోయింది. ఇక అవినాష్ సేఫ్ అయ్యాడు కానీ గుండాగినంత పనైంది అని భోరున ఏడ్చాడు. "మళ్లీ జీరోకు వచ్చాను, బిగ్‌బాస్ వల్లే నాకు మళ్లీ లైఫ్ వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవగా అతనితో గేమ్ ఆడించాడు. అందులో భాగంగా సోహైల్, లాస్య, అరియానా, మోనాల్, మెహబూబ్, అవినాష్.. అసలు అని, అఖిల్‌ను హీరో అంటూ, అభిజిత్‌ను విలన్ అంటూ ఈ ఇద్దరూ నకిలీ మనుషులు అని తేల్చి చెప్పాడు. హారికను కూడా ఈ నకిలీ జాబితాలోనే చేర్చాడు. తన కెప్టెన్సీని మెహబూబ్‌కు ఇచ్చేశాడు. అయితే ఇమ్యూనిటీ మాత్రం లభించిందని నాగ్ స్పష్టం చేశారు. బిగ్‌బాంబ్ లేకపోవడం ఇంటిసభ్యులకు ఊరట కలిగించింది. (చదవండి: బిగ్‌బాస్: నాగ్ వెనుక స్టైలిష్ ఫ్యాషన్ డిజైనర్) -
ఎంత శుభ్రంగా ఉంటే అంత ధీటుగా..
బంజారాహిల్స్: ప్రతి ఒక్కరు 20 నుంచి 30 సెకన్ల పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరని, ఎంత శుభ్రంగా ఉంటే కరోనాను అంత ధీటుగా ఎదుర్కోవచ్చునని ప్రముఖ యాంకర్ సుమ స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె కరోనా వైరస్ ముందు జాగ్రత్త చర్యలపై తన వంతు బాధ్యతగా ఓ సందేశాన్ని పంపించారు. కరోనా వైరస్ గురించి ఎక్కువగా భయపడాల్సిన పని లేదని, మనం చేయాల్సిందల్లా బాధ్యతాయుతంగా ప్రవర్తించడమేనన్నారు. వీలైనంత వరకు మాస్క్‌లు ధరించాలని, వేళ్లను ఎక్కువగా ముఖం మీద టచ్ చేయకుండా చూసుకోవాలన్నారు. ఒకవేళ దగ్గు, జలుబు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. మన చుట్టు పక్కల వారు ఎవరైనా ఉంటే కూడా వారికి కూడా సలహా ఇవ్వాలన్నారు. ఎవరైనా కలిసినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలన్నారు. ఆలింగనాలు, షేక్ హ్యాండ్లకు దూరంగా ఉండాలన్నారు. ఏదైనా వైరస్ వ్యాప్తి చెందాలంటే మన చేతుల నుంచి మాత్రమే పాకుతుందని సాధ్యమైనంత వరకు చేతులను ముఖంమీద పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటే కరోనా వైరస్ తరిమికొట్టవచ్చన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తాను కూడా తీసుకుంటున్నట్లు శానిటైజర్లను చేతులకు రాసుకుంటున్న దృశ్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Hi guys, in alert of the recent pandemic #COVID19, I request you all to be precautious and responsible in being safe. Just a few cautionary steps can stand a long way in our safety and help breaking the chain.#StaySafe #BreakTheChain #coronavirus #CoronavirusOutbreak pic.twitter.com/6J7LCnRNXq — Suma Kanakala (@ItsSumaKanakala) March 16, 2020 -
బిగ్‌బాస్ ఇంట్లో సుమ రచ్చ రంబోలా..
తను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల జల్లులే. పిల్లోడి నుంచి ముసలోళ్లదాకా ఆమె పేరు తెలియని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర నుంచి సినీ పరిశ్రమ దాకా అందరికీ ఆమె సుపరిచితురాలే. క్యాలెండర్లు మారుతున్నా ఆమె స్థానం మాత్రం సుస్థిరంగా కొనసాగుతోంది. బుల్లితెర కార్యక్రమాల్లోనూ ఆమెదే పైచేయి. తను ఏ కార్యక్రమం చేపట్టినా దానికి తిరుగే ఉండదు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎవరి గురించి చెప్తున్నామో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును మీరు ఊహించింది నిజమే.. ఆవిడే ప్రముఖ యాంకర్.. సుమ కనకాల. వారం రోజుల్లో బిగ్‌బాస్ షోకు శుభం కార్డు పడనుండటంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి సుమను పంపించారు. సుమను చూడగానే ఇంటి సభ్యులు సర్ప్రైజ్ అయ్యారు. పనిలో పనిగా వాళ్లందరితో సుమ ఫన్నీ టాస్క్‌లు చేయిస్తోంది. తన పంచ్‌లతో ఒక్కొక్కరినీ రఫ్ఫాడిస్తోంది. సుమ ఎంట్రీ వల్ల ఇంట్లో సంతోషాల సరదాలు తారస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. మరి టీవీ కార్యక్రమాల్లో తనదైన శైలిలో ఆటపాటలతో అలరించే సుమ బిగ్‌బాస్ హౌస్‌లో ఇంకా ఎలాంటి సందడి చేయనుందో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! Special guest #Suma in the house#BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa pic.twitter.com/O84sZSmf04 — STAR MAA (@StarMaa) October 28, 2019 -
యాంకర్ సుమ ఫన్నీ వీడియో.. వైరల్
యాంకర్ సుమ తన మాటలతో, విసిరే పంచ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలోనూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి నెటిజన్లను అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవల ఆమె ఐస్‌క్రీమ్ తింటూ వీడియో సుమ తీసుకుంది. అది సాధారణ ఐస్‌క్రీమ్ కాదని, ప్రత్యేకమైందని తెలుస్తోంది. ఎందుకంటే అది తినేటప్పుడు నోట్లో నుంచి, ముక్కులో నుంచి పొగలు రావాల్సిందేనట. ఆ సమయంలో సుమ తనదైన శైలిలో హావభావాలు ఒలకిస్తూ, ఐస్‌క్రీమ్ రుచిన ఆస్వాదించింది. ఈ వీడియోలో ఐస్‌క్రీమ్ తింటూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తోంది సుమ. అంతేకాక ఓ డ్రాగన్ వదిలే శ్వాసలా పొగ వస్తుందని ఆమె పేర్కొంది. ఫేస్బుక్లో సుమకు దాదాపు మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. -
ముక్కంటి సేవలో సుమ దంపతులు
చిత్తూరు, శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి సోమవారం యాంకర్ సుమ, రాజీవ్ కనకాల దంపతులు కుటుంబసభ్యులతో విచ్చేశారు. ప్రత్యేకంగా రాహుకేతు పూజలు చేయించుకున్నారు. తర్వాత స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల ఆశీర్వాదం పొందారు. వారికి ఆలయాధికారులు స్వామి, అమ్మవార్ల జ్ఞాపికను, తీర్థప్రసాదాలను అందజేశారు. వారితో పాటు ఆలయ ట్రస్టు బోర్డు మాజీ సభ్యులు కండ్రిగ ఉమ,మల్లెమాల ప్రమీలమ్మ,అత్తింజేరి బాలాజీ ఉన్నారు. -
అమ్మమ్మ వందో బర్త్‌డే వేడుకల్లో సుమ
హైదరాబాద్: రెండు దశాబ్దాలుగా టెలివిజన్ రంగంలో యాంకర్ గా కొనసాగుతున్న సుమ.. ఇప్పటికీ ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తారు. ఆమె ఆరోగ్య రహస్యం ఏమిటని అభిమానులు తరచూ ప్రశ్నిస్తుంటారు. అరుదైన వేడుక సందర్భంగా సుమ తన శక్తి రహస్యాలను వెల్లండించారు. ఆ వేడుక.. సుమ అమ్మమ్మగారి వందో పుట్టినరోజు! పెదవులపై చిరునవ్వు, నిర్మలమైన మనసు, ఒత్తిడిలేని జీవితం, అందరూ బాగుండాలనే ఆకాంక్ష.. ఇవే అమ్మమ్మ వందేళ్ల నిండు జీవితానికి కారణాలని, ఆమె అడుగుజాడల్లోనే తాను కూడా నడుస్తున్నానని, ఆ లక్షణాలే తనకు శక్తినిస్తాయని సుమ చెప్పారు. మంగళవారం సుమ అమ్మమ్మ పల్లసన పచ్చువిట్టిల్ సావిత్రమ్మ వందో పుట్టినరోజు వేడులను కేరళలోని ఆమె కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భర్త రాజీవ్ కనకాలతో కలిసి సుమ కేరళ వెళ్లారు. అమ్మమ్మ వందేళ్ల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం జీవితంలో మర్చిపోలేని రోజని, అరుదైన ఈ రోజును ఆనందంగా గడుపుతున్నానని సుమ చెప్పారు.