‘‘గ్రామంలో అల్లరి చిల్లరిగా తిరిగే ఓ పూజారి అనిత అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.. మా ప్రేమకు చిన్న సమస్య వస్తుంది. మరోవైపు జయమ్మ (సుమ)కు ఓ సమస్య ఉంటుంది. ఆమె సమస్యకూ మా సమస్యకూ లింక్ ఉంటుంది.. అది ఏంటనేది సినిమాలో చూడాల్సిందే’’ అని హీరో దినేష్ కుమార్ అన్నారు. యాంకర్ సుమ కనకాల లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దినేష్ కుమార్, షాలినీ జంటగా నటించారు. బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా మే 6న విడుదల కానుంది.
ఈ సందర్భంగా దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. విజయ్ కుమార్‌ది మా ఊరే అయినప్పటికీ ఆడిషన్స్ ద్వారా నన్ను ఎంపిక చేశారు. ఎనిమిదేళ్లుగా నేను చేస్తున్న కృషి ఫలించి ఏకంగా సుమగారి సినిమాలో అవకాశం రావడం, అది కూడా ఆమెతో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నటుడిగా నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఇచ్చింది’’ అన్నారు.
చదవండి: నాతో కాకపోతే ఇంకొకరిని వెతుక్కో.. కాబోయే భర్త ఏమన్నాడంటే
నిజజీవితానికి భిన్నంగా..
హీరోయిన్ షాలినీ మాట్లాడుతూ– ‘‘మా అమ్మది మొగల్తూరు, నాన్నది హైదరాబాద్. నేను హైదరాబాద్‌లో పెరిగాను. సినిమాలపై ఆసక్తి ఎక్కువ. తమిళంలో షార్ట్ ఫిలిం చేశాను. ఆ తర్వాత కొన్ని రెస్టారెంట్ యాడ్స్ కూడా చేశాను. ‘జయమ్మ పంచాయితీ’ సినిమాకు ఆడిషన్ ద్వారా ఎంపిక చేశారు. నా పాత్రకూ, జయమ్మ పాత్రకు మధ్య పెద్దగా సన్నివేశాలు ఉండవు. ఈ సినిమాలో నా నిజ జీవితానికి భిన్నమైన పాత్ర పోషించాను. అందరూ మెచ్చుకునేలా నా పాత్ర ఉంటుంది’’ అన్నారు.
చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటానేమో! చెప్పలేం అంటున్న హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment