రోషన్‌ కనకాల కొత్త మూవీ.. ఆశ్చర్యపోయిన యాంకర్‌ సుమ | Roshan Kanakala Second Movie Titles as Mowgli | Sakshi
Sakshi News home page

రోషన్‌ కనకాల కొత్త అవతార్‌... కండలు తిరిగిన దేహంతో..

Sep 7 2024 6:44 PM | Updated on Sep 7 2024 11:11 PM

Roshan Kanakala Second Movie Titles as Mowgli

బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు వచ్చినా సుమ స్థానం సుమదే! షోలు, ఈవెంట్లు, సినిమా ఫంక్షన్స్‌తో అనునిత్యం బిజీగా ఉంటుంది. అటు రాజీవ్‌ కనకాల కూడా పవర్‌ఫుల్‌ పాత్రలతో సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. వీరి తనయుడు రోషన్‌ కూడా గ్లామర్‌ ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు. ఇప్పటికే అతడు బబుల్‌గమ్‌ అనే సినిమాలో హీరోగా నటించాడు. 

ఫస్ట్‌ సినిమాకే మంచి పేరు
ఇది తనకు ఫస్ట్‌ సినిమా అయినప్పటికీ ఎటువంటి తత్తరపాటు లేకుండా చాలా చక్కగా యాక్ట్‌ చేశాడని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడతడు రెండో సినిమా చేస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ప్రకటించారు. కలర్‌ ఫోటో డైరెక్టర్‌ సందీప్‌ రాజ్‌ ఈ మూవీకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇంతకీ సినిమా టైటిల్‌ మోగ్లీ. ఈమేరకు ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్‌ చేశారు.

మోగ్లీ..
ఇందులో రోషన్‌ కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ అడవి మధ్యలో గుర్రంతో కనిపించాడు. ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ చూస్తుంటే ఈ కథ అటవీ నేపథ్యంలోనే సాగనుందని తెలుస్తోంది. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించనున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

రోషన్‌ను చిన్నప్పుడు..
మోగ్లీ పోస్టర్‌ను యాంకర్‌ సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. రాజీవ్‌.. రోషన్‌ను చిన్నప్పుడు మోగ్లీ అని పిలిచేవాడు. ఇప్పుడదే పేరుతో అతడు సినిమా చేయడం నిజంగానే మ్యాజిక్‌ కదా! అని రాసుకొచ్చింది.

 

 

చదవండి: ఆ ఆనవాయితీ రిపీట్‌! తనే ఎలిమినేట్‌ కానుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement