యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం బబుల్‌గమ్. మానస చౌదరి కథానాయికగా నటిస్తోంది. క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఆదివారం(డిసెంబర్ 24న) బబుల్‌గమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగ్గా దీనికి యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించింది. ఇక ఈ వేదికపై తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు హీరో రోషన్.
వీడు హీరో ఏంట్రా అని కామెంట్స్
తనను నమ్మి.. నచ్చింది చేయడానికి అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తల్లిదండ్రులు సుమ-రాజీవ్ పాదాలకు నమస్కరించాడు రోషన్. తర్వాత అతడు మాట్లాడుతూ.. 'మా నానమ్మ, అత్త కూడా ఈ సినిమా చూసుంటే బాగుండు. వారి ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చాలామంది చాలాసార్లు నా వెనకాల మాట్లాడింది విన్నాను. నా గురించి అనుకుంది చదివాను. వీడు ఇంత నల్లగా ఉన్నాడు.. వీడు హీరో ఏంట్రా? వీడు హీరో మెటీరియల్ కాదని చులకనగా మాట్లాడారు. నేను ఇలాగే పుట్టా.. ఇలాగే ఉంటా.. ఒక మనిషికి నలుపు, తెలుపు అందం కాదు బ్రదర్.. ఒక మనిషి సక్సెస్‌ను డిసైడ్ చేసేది తన హార్డ్‌వర్క్, టాలెంట్, క్రమశిక్షణ మాత్రమే!
బబుల్‌గమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాసిపెట్టుకోండి.. ఓ రోజు వస్తది!
మనందరి నసీబులో ఏం రాసి పెట్టుందో ఎవరికీ తెలియదు. కానీ నచ్చినట్లు మార్చుకుంటాం. కావాల్సింది లాక్కుని తెచ్చుకుంటాం. అది ఏదైనా సరే.. ఓ రోజు వస్తది.. వద్దనుకున్నా వినబడ్తా.. చెవులు మూస్కున్నా వినబడ్తాను. రాసిపెట్టుకోండి' అని ఎమోషనలయ్యాడు. తనయుడి మాటలు విని భావోద్వేగానికి లోనైంది సుమ. రోషన్ మాటలు తన గుండెను తాకాయన్న సుమ.. కళ్లముందే కొడుకు తన చేదు అనుభవాలను చెప్తుంటే కన్నీళ్లు ఆపుకోవడానికి ప్రయత్నించింది. .
చదవండి: ధనుష్ మూడో సినిమా! సౌందర్య రజనీకాంత్ కామెంట్స్ వైరల్..
Comments
Please login to add a commentAdd a comment