Bubblegum Movie
-
ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో బబుల్గమ్ చిత్ర యూనిట్ సందడి
-
బబుల్ గమ్ మూవీ ట్రైలర్
-
Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ
టైటిల్: బబుల్ గమ్ నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష వర్ధన్, అను హాసన్ తదితరులు నిర్మాత: మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్: రవికాంత్ పేరేపు మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు విడుదల తేదీ: 2023 డిసెంబర్ 29 నిడివి: 2h 27m సుమ పేరు చెప్పగానే గలగలా మాట్లాడే యంకర్ గుర్తొస్తుంది. ఎంతోమంది హీరోల సినిమాల ఇంటర్వ్యూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి హోస్టింగ్ చేసింది. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు తన కొడుకుని హీరోగా లాంచ్ చేసింది. 'బబుల్ గమ్' పేరుతో తీసిన సినిమా సుమ కొడుకు రోషన్ హీరోగా నటించాడు. తాజాగా థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? సుమ కొడుకు హీరోగా ఎలా చేశాడు? హిట్టు కొట్టాడా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం. కథేంటి? ఆది(రోషన్ కనకాల) పక్కా హైదరాబాదీ కుర్రాడు. డీజే కావాలనేది గోల్. ఓరోజు పబ్‌లో అనుకోకుండా జాన్వీ(మానస చౌదరి)ని చూస్తాడు. నచ్చేస్తుంది. దీంతో ఆమెని ఫాలో అయిపోతుంటాడు. మరోవైపు జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్-రిలేషన్స్ అంటే పెద్దగా పడవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇలాంటి భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరూ చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే 'బబుల్ గమ్' స్టోరీ. ఎలా ఉంది? ఓ అమ్మాయి, అబ్బాయి.. ఇద్దరి మధ్య ప్రేమ.. ముద్దులు, హగ్గులు.. కొన్నాళ్లకు గొడవలు.. ఇలా లవ్ స్టోరీలన్నీ దాదాపు ఒకే ఫార్మాట్లో ఉంటాయి. అయితే సినిమా ఎలా తీసినా సరే ఫైనల్‌గా ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఈ విషయంలో 'బబుల్ గమ్' పాసైపోయింది. యాంకర్ సుమ కొడుకు.. ఈ సినిమాలో హీరో కావడంతో చాలామంది దృష్టి దీనిపై పడింది. ట్రైలర్ వచ్చినప్పుడే ఇది యూత్‌కి నచ్చే, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గ సినిమా అని అర్థమైపోయింది. ఫస్టాప్ విషయానికొస్తే.. కేవలం చెడ్డీతో బైక్‌పై హీరో అరుస్తూ, ఏడుస్తూ హైదరాబాద్ రోడ్‌పై వెళ్లే సీన్‌తో సినిమా ఓపెన్ అవుతుంది. ఇక్కడి నుంచి కథ ఆరు నెలల వెనక్కి వెళ్తుంది. పక్కా హైదరాబాదీ కుర్రాడిగా ఆదిత్య(రోషన్ కనకాల) ఎంట్రీ.. ఓ డీజే దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా పెద్ద డీజే కావాలని కలలు కనడం. ఎప్పుడూ తిట్టే తండ్రి, ఏం చేసినా సరే సపోర్ట్ చేసే తల్లి.. ఓ ఇద్దరు ఫ్రెండ్స్.. అనుకోకుండా ఓసారి జాన్వీ(మానస చౌదరి)ని చూడటం, ఆమెతో అనుకోని విధంగా ప్రేమలో పడటం.. ఇలా పెద్దగా మెరుపుల్లేకుండానే ఫస్టాప్ అలా అలా వెళ్లిపోతుంది. ఓ డిఫరెంట్ సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. దీంతో స్టోరీపై కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అయితే అసలు కథంతా సెకండాఫ్‌లోనే చూపిస్తారు. అప్పటివరకు ప్రేమకథగా ఉన్నది కాస్త రివేంజ్ డ్రామాగా మారుతుంది. ఫస్టాప్ అంతా సరదసరదాగా ఉన్న హీరోహీరోయిన్.. సెకండాఫ్‌లో సీరియస్ డ్రామా పండిస్తారు. ఇక క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నప్పటికీ.. రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీలతో పోలిస్తే కాస్త డిఫరెంట్ అనిపిస్తుంది. 'బబుల్ గమ్' అని టైటిల్ కి తగ్గట్లే ఫస్టాప్ అంతా సాగదీసి వదిలిన డైరెక్టర్.. సెకండాఫ్ మాత్రం మంచిగా తీశాడు. దీంతో ఓ ఫీల్ గుడ్ మూవీ చూసినట్లు అనిపిస్తుంది. అయితే కొత్త యాక్టర్స్‌తో ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ కమ్ డ్రామా తీస్తున్నప్పుడు కాస్త రిస్క్ ఎక్కువే. అయితే డైరెక్టర్ ఈ విషయంలో పాస్ అయిపోయాడు. అలానే లస్ట్ తప్ప పెద్దగా ఎమోషన్ లేకుండా సాగిపోయే లవ్ ట్రాక్.. అక్కడక్కడ బూతు డైలాగ్స్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారు? హీరోగా చేసిన రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ బాగున్నాయి. ఫస్ట్ మూవీకే ఈ మాత్రం ఔట్పుట్ ఇచ్చాడంటే.. మంచి ఫ్యూచర్ ఉన్నట్లే. హీరోయిన్ మానస చౌదరి కూడా బాగుంది. రొమాంటిక్స్ సీన్స్‌లో రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో మాత్రం పర్వాలేదనిపించింది. ఇక హీరో తండ్రి క్యారెక్టర్ చేసిన చైతు జొన్నలగడ్డ.. మంచి కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్ చేశాడు. హర్షవర్థన్, అనుహాసన్ లాంటి సీనియర్స్ ఉన్నప్పటికీ పెద్దగా సీన్స్ పడలేదు. టెక్నికల్ విషయాలకొస్తే.. 'క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన రవికాంత్ పేరేపు.. 'బబుల్ గమ్' సినిమా విషయంలో కాస్త క్లారిటీ మిస్సయ్యాడు. కానీ కొత్తోళ్లు అయిన రోషన్, మానస దగ్గర నుంచి యాక్టింగ్ బాగానే రాబట్టుకున్నాడు. ఇందులో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. 'జిలేబీ' పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు అయితే టాప్ నాచ్ ఉన్నాయని చెప్పొచ్చు. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే యూత్‌ఫుల్ ప్రేమకథని చూడాలనుకుంటే 'బబుల్ గమ్' ట్రై చేయొచ్చు. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
సినిమా చూసి నాన్న ఎమోషన్ అయ్యారు
‘‘నటన పరంగా అమ్మానాన్న (సుమ, రాజీవ్ కనకాల) సలహాలు తీసుకుంటాను. ‘బబుల్గమ్’ మూవీని వారు చూశారు.. బాగా నచ్చింది. ఆ టైమ్‌లో నేను అక్కడ లేను. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు నాన్న ఎమోషన్ అయి, ఏడ్చారని అమ్మ చెప్పింది. నాన్నని అడిగితే ‘బాగా చేశావ్’ అన్నారు. ఆయన్నుంచి ప్రశంస రావడం ఆనందంగా అనిపించింది’’ అని రోషన్ కనకాల అన్నారు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల, మానసా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా రోషన్ కనకాల మాట్లాడుతూ– ‘‘నా బాల్యం అంతా దాదాపుగా తాతగారి (దేవదాస్ కనకాల) నటనా శిక్షణ కేంద్రంలో గడిచింది. నాకు చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం. అది తెలియని ఒక థ్రిల్ ఇస్తుంది. నటుడు కావాలనే నా కల ‘బబుల్గమ్’తో నెరవేరడం ఆనందంగా ఉంది. న్యూ ఏజ్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా షూటింగ్‌కి వెళ్లే నెల రోజుల ముందే వర్క్ షాప్ నిర్వహించడం మాకు ప్లస్ అయింది. ఈ మూవీలో ఓ సీన్ కోసం దాదాపు మూడు గంటలు పాటు షర్టు లేకుండా తిరిగాను. మొదట్లో సిగ్గుపడ్డా... ఆ తర్వాత పోయింది (నవ్వుతూ). మా అమ్మానాన్నలకు పరిశ్రమలో చాలా మంచి పేరుంది. నేను హీరోగా వస్తుండటం బాధ్యతగా అనిపిస్తోంది. ఫలానా జోనర్ మూవీ చేయాలనే ఆలోచన నాకు లేదు. ప్రేక్షకులను అలరించే మంచి సినిమాలు చేయడం ఇష్టం’’ అన్నారు. -
నాన్న ఏడ్చారు.. నాకు ఆనందంగా అనిపించింది: రోషన్ కనకాల
నా బాల్యం అంతా తాతగారి(దేవదాస్ కనకాల) యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లోనే గడిచింది. ఆ ప్రభావం నాపై పడింది. చిన్నప్పటి నుంచే యాక్టింగ్‌పై ఇష్టం పెరిగింది. సినిమాని ముందుకు తీసుకెళ్ళే కథానాయకుడిగా చేయలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. బబుల్గమ్ చిత్రంతో ఆ కోరిక నెరవేరింది. ఇకపై నటుడిగానే నా జీవితాన్ని కొనసాగిస్తాను’అని యంగ్ హీరో రోషన్ కనకాల అన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్గమ్'. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రోషన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► చిన్నప్పటి నుంచి నటుడు కావాలనేది నా కోరిక. హీరోగా సినిమా చేయాలని చాలా రోజుల ఎదురుచూశాను. అలా దర్శకుడు రవికాంత్ ని కలవడం, ఆయనకి నాతో సినిమా చేయాలని అనిపించడంతో ఈ ప్రయాణం మొదలైయింది. ►నటన పరంగా తాతగారి(దేవదాస్ కనకాల)దగ్గర రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత లాస్ ఏంజలెస్లో ఒక కోర్సు చేశాను. పాండిచ్చేరి లో ఒక కోర్స్ చేశాను. అలాగే నాన్నతో చర్చించి కొన్ని ప్రాక్టీస్ చేస్తుంటాను. ►బబుల్గమ్ సెట్‌పైకి వచ్చినప్పుడు నాకు న్యూ కమ్మర్ లా అనిపించలేదు. ఎందుకంటే షూటింగ్‌కి నెల ముందే మేము వర్క్ షాప్ చేసుకున్నాం. స్క్రిప్ట్ ని రిహార్సల్ చేసుకున్నాం. ఒక సీన్ లో ఎలా చేయాలి, ఎలాంటి ఎమోషన్ కన్వే అవ్వాలి, ఎలాంటి కాస్ట్యూమ్ ఉండాలి.. ఇవన్నీ ముందు అనుకున్నాం. ఆ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అయ్యింది. ► అమ్మానాన్నలకు(యాంకర్ సుమ, రాజీవ్ కనకాల)పరిశ్రమలో మంచి పేరుంది.ఆ ప్లెజర్ నాపై ఉంది.నటన పరంగా వారి నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాను. ఏవైనా సందేహాలు వున్నా అడుగుతుంటాను. అమ్మా నాన్న సినిమా చూశారు. అయితే అప్పుడు అక్కడ నేను లేను. నాన్న కొన్ని సీన్స్ లో ఏడ్చారని అమ్మ చెప్పింది. నాన్నని అడిగితే ‘బాగా చేశావ్’ అన్నారు. నాన్న సహజంగా ఒప్పుకోరు. ఆయన నుంచి అలాంటి కాంప్లిమెంట్ రావడం ఆనందంగా అనిపించింది. అమ్మకు కూడా చాలా నచ్చింది. ► ఈ సినిమాలోని ఇజ్జత్ పాట లాంచ్ చేయడానికి చిరంజీవి గారిని కలిశాం. ఆ సమయంలో వారి జీవితంలో ఎదురైన అనుభవాలు గురించి చెప్పారు. అలాగే బిగ్ బాస్ కి వెళ్ళినపుడు నాగార్జున గారితో వీడియో చేశాం. మొదట ఆడియో రికార్డ్ కాలేదు. ఆయన్ని అడిగితే .. మరోసారి చేశారు. అది చాలా గొప్పగా అనిపించింది. ► ఈ సినిమాలో షర్ట్‌లెస్ సీన్ ఉంటుంది. దాదాపు మూడు గంటలు పాటు షర్టు లేకుండా సిటీ అంతా తిరిగాను. ఒక పాయింట్ లో నా సిగ్గు అంతా పోయింది( నవ్వుతూ). నా దృష్టి అంతా ఆ సీన్, అందులోని ఎమోషన్ పైనే పెట్టాను. ఆ సీన్ షూటింగ్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభువం. చాలా విషయాలు నేర్చుకున్నాను. ► ఈ సినిమా కోసం శ్రీచరణ్ చాలా కొత్త సౌండ్ ని క్రియేట్ చేశాడు, పాటలన్నీ ఇప్పటికే హిట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చిన మ్యూజిక్ గూస్ బంప్స్ వస్తాయి. సినిమా మొత్తం చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.ఇందులో ఒక పాట పాడాను. అయితే దీనికి కోసం ప్రత్యేక శిక్షణ ఏమీ తీసుకోలేదు. దర్శకుడు, సంగీత దర్శకుడు కోరడంతో అది అలా జరిగిపోయింది. ► నాకు ప్రత్యేకమైన జోనర్ అంటూ ఏమీ లేదు. మంచి సినిమా ఏదైనా ఇష్టం. ప్రేక్షకులని ఎంగేజ్ చేసే ప్రతి సినిమా ఇష్టం.కథలు వింటున్నాను. ప్రస్తుతం నా దృష్టి 'బబుల్గమ్’ విడుదలపైనే ఉంది. -
అలా జడ్జ్ చేయడం బాధగా ఉంది
‘‘మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ఖరీదైన మ్యూజిక్ పరికరాలు అవసరం లేదు. ‘క్షణం’, ‘మేజర్’లో కొన్ని సీన్లకు మేం ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్‌నే వాడాం. ఇక ఇప్పుడు యూ ట్యూబ్ వ్యూస్, ఇన్‌స్టా రీల్ వ్యూస్‌తో మ్యూజిక్ డైరెక్టర్స్‌ను జడ్జ్ చేయడం కాస్త బాధగా ఉంది. అందుకే ఇప్పుడు నేను సినిమాలు తగ్గించుకున్నాను. ఇండిపెండెంట్ మ్యూజిక్, ఆల్బమ్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నాను’’ అని అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. రోషన్ కనకాల, మానస జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూ΄÷ందిన సినిమా ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘గడిచిన పదేళ్లలో నేను చేయాల్సింది చేశాను. ఇక నన్ను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ‘బబుల్గమ్’తో ఈ ప్రయత్నం మొదలైంది. ఈ సినిమాలో హీరోది డీజే రోల్. నా ఫ్రెండ్స్‌లో ఎక్కువమంది డీజేలు ఉండటంవల్ల ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌పై అవగాహన ఉంది. ట్యూన్ కంటే లిరిక్స్ ముఖ్యమని నమ్ముతాను. ‘బబుల్గమ్’ చూశాను. రోషన్ మంచి నటుడు, డ్యాన్సర్. డబ్బింగ్ కూడా బాగా చెప్పాడు. ప్రస్తుతం ‘సత్యభామ’, ‘గూఢచారి 2’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ప్రతి రంగంలోనూ సాంకేతిక విప్లవం వచ్చింది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల మ్యూజిక్ కం΄ోజర్స్కు ప్రమాదం ఉండొచ్చు. కానీ ‘ఏఐ’ని అప్లై చేయడానికీ హ్యూమన్ టచ్ కావాలి. సప్తస్వరాలు ఏడే. సౌండింగ్ ఎలా ఇస్తున్నామన్నదే ముఖ్యం. ‘గూఢచారి’ వల్ల కాదు.. ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ సినిమాలోని మ్యూజిక్ నచ్చి నాకు చాన్స్‌లు ఇచ్చినట్లుగా కొందరు నాతో చెప్పారు. నాకదో హ్యాపీ సర్ప్రైజ్’’ అని చెప్పుకొచ్చారు. -
'ఇంత నల్లగా ఉన్నాడు, వీడు హీరో ఏంట్రా?..' రోషన్ ఎమోషనల్
యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం బబుల్గమ్. మానస చౌదరి కథానాయికగా నటిస్తోంది. క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఆదివారం(డిసెంబర్ 24న) బబుల్గమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగ్గా దీనికి యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించింది. ఇక ఈ వేదికపై తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు హీరో రోషన్. వీడు హీరో ఏంట్రా అని కామెంట్స్ తనను నమ్మి.. నచ్చింది చేయడానికి అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తల్లిదండ్రులు సుమ-రాజీవ్ పాదాలకు నమస్కరించాడు రోషన్. తర్వాత అతడు మాట్లాడుతూ.. 'మా నానమ్మ, అత్త కూడా ఈ సినిమా చూసుంటే బాగుండు. వారి ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చాలామంది చాలాసార్లు నా వెనకాల మాట్లాడింది విన్నాను. నా గురించి అనుకుంది చదివాను. వీడు ఇంత నల్లగా ఉన్నాడు.. వీడు హీరో ఏంట్రా? వీడు హీరో మెటీరియల్ కాదని చులకనగా మాట్లాడారు. నేను ఇలాగే పుట్టా.. ఇలాగే ఉంటా.. ఒక మనిషికి నలుపు, తెలుపు అందం కాదు బ్రదర్.. ఒక మనిషి సక్సెస్‌ను డిసైడ్ చేసేది తన హార్డ్‌వర్క్, టాలెంట్, క్రమశిక్షణ మాత్రమే! బబుల్గమ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రాసిపెట్టుకోండి.. ఓ రోజు వస్తది! మనందరి నసీబులో ఏం రాసి పెట్టుందో ఎవరికీ తెలియదు. కానీ నచ్చినట్లు మార్చుకుంటాం. కావాల్సింది లాక్కుని తెచ్చుకుంటాం. అది ఏదైనా సరే.. ఓ రోజు వస్తది.. వద్దనుకున్నా వినబడ్తా.. చెవులు మూస్కున్నా వినబడ్తాను. రాసిపెట్టుకోండి' అని ఎమోషనలయ్యాడు. తనయుడి మాటలు విని భావోద్వేగానికి లోనైంది సుమ. రోషన్ మాటలు తన గుండెను తాకాయన్న సుమ.. కళ్లముందే కొడుకు తన చేదు అనుభవాలను చెప్తుంటే కన్నీళ్లు ఆపుకోవడానికి ప్రయత్నించింది. . చదవండి: ధనుష్ మూడో సినిమా! సౌందర్య రజనీకాంత్ కామెంట్స్ వైరల్.. -
Bubblegum Movie: యాంకర్ సుమ కుమారుడు 'బబుల్గమ్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
'బబుల్గమ్' రొమాంటిక్ వీడియో సాంగ్‌తో హీట్ పెంచిన రోషన్
'బబుల్గమ్' సినిమాతో వెండితెరపై కనిపించనున్నాడు యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల. ఈ సినిమాలో ఆయనకు జోడీగా మానస చౌదరి నటిస్తుంది. రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అడివి శేష్‌తో ‘క్షణం’ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ రవికాంత్.. దీంతో బబుల్గమ్ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేమకథను ప్రధానమైన కాన్సెప్ట్‌గా మంచి రిలేషన్షిప్ డ్రామాగా ‘బబుల్గమ్’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ తెలిపాడు. ఈ చిత్రంలో ఆది పాత్రలో రోషన్, జాన్వీ పాత్రలో తెలుగు అమ్మాయి మానస నటించడం విషేశం అని ఆయన చెప్పాడు. కొత్తవారితో చేయాల్సిన సినిమా ఇది అని రోషన్ హీరోగా పరిచయమవుతున్నాడని తెలిసి, ఈ కథను చెప్పాను అన్నాడు. కాలేజీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత యువకుల కెరీర్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. దానిని ఈ సినిమాలో చూపించామని ఆయన తెలిపాడు. 'బబుల్గమ్' సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'జస్ట్ ఈజీ పీసీ' రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శ్రీ చరణ్ ఈ చిత్రానికి చక్కటి సంగీతం అందించాడు. -
ఇక స్పీడ్‌గా సినిమాలు చేస్తాను
రోషన్ కనకాల, మానసా చౌదరి జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో రవికాంత్ పేరేపు చెప్పిన విశేషాలు. ∙ప్రేమకథ ప్రధానంగా సాగే రిలేషన్షిప్ డ్రామా ‘బబుల్గమ్’. ఈ చిత్రంలో ఆది పాత్రలో రోషన్, జాన్వీ పాత్రలో తెలుగు అమ్మాయి మానస నటించారు. కొత్తవారితో చేయాల్సిన సినిమా ఇది. రోషన్ హీరోగా పరిచయమవుతున్నాడని తెలిసి, ఈ కథ చె΄్పాను. కాలేజీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత యువకుల కెరీర్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకు ఇష్టమైనది చేయాలా? సంపాదన కోసం ఏ ఉద్యోగమైనా చేయాలా? అనే అయోమయంలో ఉంటారు. అలాంటి ఓ కన్ఫ్యూజన్లో ఉన్న ఓ కుర్రాడు ప్రేమలో పడితే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథాంశం. రోషన్‌కు ఇది తొలి సినిమా అయినా అతని తల్లిదండ్రులు సుమ, రాజీవ్ కనకాల ఈ సినిమాలో జోక్యం చేసుకోలేదు. ‘ప్రేమ బబుల్గమ్ లాంటిది. మొదట్లో తీయగా ఉంటుంది. ఆ తర్వాత చప్పగా ఉంటుంది. ఆ నెక్ట్స్ అతుక్కుంటే వదలదు’ అనే డైలాగ్ ఉంటుంది. కథానుసారం ఈ సినిమాకు ‘బబుల్గమ్’ టైటిల్ పెట్టాం. ఇక నా ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఇప్పుడు ‘బబుల్గమ్’ సినిమాలకు శ్రీ చరణ్ సంగీతం ఇచ్చాడు. మేమిద్దరం ఒకే ఊరివాళ్లం కాబట్టి కంఫర్ట్ కుదిరింది. ‘బబుల్గమ్’ ట్రైలర్‌ను చిరంజీవిగారికి చూపించాం. ఈ సినిమాలోని ‘ఇజ్జత్..’ సాంగ్ ఆయనకు బాగా నచ్చింది. ‘క్షణం’ మంచి విజయం సాధించింది. ఎందుకో కానీ ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ నాకు అంతగా రాలేదు. దర్శకత్వంలో అడివి శేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే ప్రచారం జరిగింది. నిజానికి ‘అడివి’ శేష్, శ్రీచరణ్ పాకాల ‘క్షణం’ క్రెడిట్ నాకే ఇస్తారు. ఓ అవుట్‌సైడర్‌గా ఇండస్ట్రీ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నాకు కొంత టైమ్ పట్టింది. ఇకపై దర్శకుడిగా స్పీడ్‌గా సినిమాలు చేస్తాను. -
సలార్‌లో లేనిది ‘బబుల్గమ్’లో ఉంది: దర్శకుడు
‘సలార్ సినిమాకి హిట్ టాక్ రావడం సంతోషంగా ఉంది. వచ్చేవారం(డిసెంబర్ 29) 'బబుల్గమ్' సినిమా రిలీజ్ కాబోతుంది. సలార్‌లో లేని కంటెంట్ మా సినిమాలో ఉంది. మా సినిమాలో లేని కంటెంట్ సలార్‌లో ఉంది(నవ్వుతూ..). కాబట్టి ప్రభాస్ సినిమా థియేటర్స్‌లో ఉన్నప్పటికీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆడియన్స్‌కి నచ్చితే రెండు సినిమాలను చూస్తారు. ‘బబుల్గమ్’ అందరికి కనెక్ట్ అయ్యే సినిమా. కచ్చితంగా ప్రేక్షకులను నచ్చుతుందనే నమ్మకం మాకు ఉంది’ అని దర్శకుడు రవికాంత్ పేరేపు అన్నారు. ఆయన దర్శకత్వంలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం ‘బబుల్గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రవికాంత్ పేరేపు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ‘క్షణం’ తర్వాత కృష్ణ అండ్ లీల చేశాను. నిజానికి కృష్ణ అండ్ లీల థియేటర్స్ లో రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయింది. లాక్ డౌన్ కారణంగా యాక్టర్స్ షెడ్యుల్స్ మారిపొయాయి. చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో కొత్తవాళ్ళతో చేయడానికి 'బబుల్గమ్' కథ రాశాను. రోషన్ నాకు ముందే తెలుసు. తను హీరోగా పరిచయం అవుతున్నారని తెలిసి రోషన్ కలిశాను. ఈ కథకు తను పర్ఫెక్ట్ ఫిట్ అనిపించాడు. తర్వాత మా జర్నీ మొదలైయింది. ► ఇది కొత్తవాళ్ళతోనే చేయాల్సిన కథ. 22 ఏళ్ల తర్వాత కాలేజ్ పూర్తి చేసుకొని రియల్ వరల్డ్ లోకి అడుగుపెడతాం. అప్పటి వరకూ మన ఫ్యామిలీ, పేరెంట్స్ మనల్ని ప్రోటక్ట్ చేస్తారు. ఒక్కసారి మన ప్యాషన్ ని వెదుక్కుంటూ బయటికి వెళ్ళినపుడు అంతా కొత్తగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి కెరీర్ ని ఎంచుకోవాలి ? డబ్బులు వుంటే సరిపోతుందా ? మనకి ఇష్టమైనది చేయాలా? ఇలా చాలా కన్ఫ్యుజన్స్ వుంటాయి. ఇలాంటి సమయంలో అనుకోకుండా జీవితంలో ప్రేమ వస్తే ఎలా డీల్ చేస్తాం.. ఇలాంటి కథకు కొత్తవాళ్ళు వుంటేనే బెటర్ అనిపించింది. ► ఇది ప్రధానంగా ప్రేమకథ. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇది రాక్ స్టార్ లా ఉంటుందా ? లేదా ఒక మ్యుజిషియన్ ఫిల్మ్ లా వుంటుందా అని అడిగారు. అయితే ఇది ప్రేమకథ ప్రధానంగా వుండే రిలేషన్ షిప్ డ్రామా. ► రోషన్ ఫెంటాస్టిక్. ట్రైలర్ లో చూసింది పది శాతమే. సినిమాలో చాలా అద్భుతంగా చేశాడు. రోషన్, మానస ఇద్దరూ చాలా చక్కగా నటించారు. అలాగే ఇందులో నటించిన మిగతా నటీనటులు కూడా చక్కని ప్రతిభ కనపరిచారు. ► మానస తెలుగమ్మాయి. చాలా అద్భుతంగా నటించింది. తనకి తెలుగు అర్ధం కావడం వలన మన రైటింగ్ లోని సబ్ టెక్స్ట్ కూడా తనకి అర్ధమౌతుంది. దీంతో మరింత ఈజీ అయ్యింది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా వస్తున్నారు. దీంతో నేటివిటీ ఇంకొంచెం బిలీవబుల్ గా వుంటుంది. ►ప్రస్తుతానికి నా దృష్టి 'బబుల్గమ్' విడుదలపై ఉంది. ఈ సినిమా విడుదల తర్వాత కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి పెడతాను. -
ఒక రోజు వస్తది..
ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘బబుల్గమ్’. మానసా చౌదరి హీరోయిన్గా నటించారు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో రానా, దర్శకుడు కె. రాఘవేంద్ర రావు, దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ట్రైలర్ లాంచ్ అనంతరం రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే సూపర్‌హిట్ కళ కనిపిస్తోంది. రోషన్, మానసల కెమిస్ట్రీ బాగుంది’’ అన్నారు. ‘‘రోషన్‌కు ప్రేక్షకుల అభిమానం దక్కాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రానా. ‘‘యూత్‌కు కావాల్సిన అంశాలు ఉన్న చిత్రమిది. రోషన్ యూనిక్‌గా ఉన్నాడు’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘జీవితంలో ఏదో ఒక సందర్భంలో పగ తీర్చుకోవాలనిపిస్తుంటుంది. ఈ సినిమాలో ఆది (రోషన్ పాత్ర పేరు) పాత్ర మాటల్లో చెప్పాలంటే ‘ఒక రోజు వస్తది.. ఆ రోజు చెవులు మూసుకున్నా వినపడతా.. కళ్లు మూసుకున్నా కనపడతా..’. రానా అన్న మా అందరికీ స్ఫూర్తి. రాఘవేంద్రరావు, అనిల్గార్లు ఈ వేడుకకు రావడం హ్యాపీగాగా ఉంది’’ అన్నారు రోషన్. ‘‘ట్రైలర్ కంటే సినిమా ఇరవై రెట్లు హై ఇస్తుంది’’ అన్నారు రవికాంత్ పేరేపు. ‘‘బబుల్గమ్’ ట్రైలర్ యూత్‌ఫుల్‌గా ఉంది. ఈ మధ్య ‘బేబీ’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్టవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు నిర్మాత వివేక్ కూచిభొట్ల. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల పాల్గొన్నారు. -
బబుల్గమ్ ట్రైలర్‌తో యూత్‌ను టార్గెట్ చేసిన రోషన్ కనకాల
'బబుల్గమ్' సినిమాతో వెండితెరపై కనిపించనున్నాడు యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల. ఈ సినిమాలో ఆయనకు జోడీగా మానస చౌదరి నటిస్తుంది. రవికాంత్ పేరెపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌తో మంచి ఇంపాక్ట్ చూపించాడు రోషన్ కనకాల. ప్రధానంగా యూత్‌ను టార్గెట్ చేసినట్లు ట్రైలర్‌తో అర్థమౌతుంది. ప్రియురాలి వల్లే ప్రియుడికి అవమానం ఎదురైతే ఆ యువకుడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో పర్ఫెక్ట్గా చూపించాడు రోషన్. అలాంటి సమయం ఎదురైతే జీవితంలో ఆ యువకుడు ఎలా సక్సెస్ అయ్యాడు..? అదే విధంగా ఆమెపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు..? అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్ ఉంది. ఇందులో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. పాటలకు కూడా శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం యువతను మెప్పిస్తుంది. మొదటి సినిమాతోనే రోషన్ నటన సూపర్ అనిపించేలా ఉంది. యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్న ఈ ట్రైలర్‌ను చూసేయండి. డిసెంబర్ 29న బబుల్గమ్ విడుదల కానుంది. -
రాజీవ్ కనకాల- జూనియర్‌కు మధ్య దూరం నిజమేనా?.. అసలు నిజం చెప్పిన రోషన్!
టాలీవుడ్ యాంకర్ అనగానే ఠక్కున అందరికీ గుర్తొచ్చే పేరు సుమ. ఆమె తర్వాతే ఎవరైనా అన్నవిధంగా సుమ తెలుగు ఇండస్ట్రీలో అంతలా పేరు తెచ్చుకుంది. కేరళకు చెందిన సుమ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగమ్మాయిగా స్థిరపడిపోయింది. ప్రస్తుతం రాజీవ్ కనకాల వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజీవ్ -యాంకర్ సుమ దంపతుల తనయుడు రోషన్ కనకాల బబుల్ గమ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రోషన్.. రాజీవ్ కనకాల, జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రోషన్ మాట్లాడుతూ.. 'ఫ్రెండ్షిప్ అనేది ఒక బంధం. వీరిద్దరి రిలేషన్ స్టూడెంట్ నెం-1 మూవీ నుంచి ఉంది. నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి స్నేహితున్ని వదులుకోకూడదు. తారక్ అన్నను చూసి డ్యాన్స్ నేర్చుకోమని నాన్న ఎప్పుడు చెప్పేవారు. ఆయన స్థాయికి చేరుకోవాలనేది నా కోరిక. రాజీవ్, జూనియర్‌కు మధ్య దూరం పెరిగిందన్న వార్తలపై రోషన్ స్పందించారు. అలాంటిదేం జరగలేదు. నాకు తెలిసి ఎప్పుడు వాళ్లు ఇప్పటికీ కలిసే ఉన్నారు. ఎప్పుడు ఎవరు అలా ఫీలవ్వలేదు. అసలు జరిగితేనే కదా ఫీలయ్యేది.' అని అన్నారు. సుమ కుమారుడు కాబట్టి చిరంజీవి సపోర్ట్ చేశారనేది నిజమేనా? అని యాంకర్ ప్రశ్నించారు. ఆయన ఎప్పుడలా సపోర్ట్ చేయరు. ఆయనకు టీజర్ నచ్చింది. సాంగ్ కూడా నచ్చిందని చెప్పారు. నువ్వు కూడా పాట పాడావా?అని అడిగారు. నా వాయిస్ చాలా బాగుందన్నారు. దీంతో చిరంజీవి మాటలకు నాకే ఆశ్చర్యమేసింది' అని రోషన్ అన్నారు. ఆ తర్వాత ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేయడం కోసం దాదాపు 150 టేక్స్ తీసుకున్నారా? అంటూ రోషన్‌ను యాంకర్ ప్రశ్నించారు. దీనికి కాస్తా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన రోషన్.. హీరోయిన్ మానస చౌదరిని తీసుకొచ్చాడు. ఎన్ని టేకులు తీసుకున్నానో చెప్పు అంటూ ఆమెను అడిగారు. అయితే ఇదంతా ఫన్నీ కోసమే చేసినా సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు రోషన్. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. -
నాకు డ్యాన్స్ చేయాలనిపించింది
‘‘బబుల్గమ్’ సినిమాలోని ‘ఇజ్జత్..’పాట చాలా హుషారుగా అనిపించింది. శ్రీచరణ్ పాకాల చక్కని సంగీతం అందించారు. ‘ఇజ్జత్..’ అనే ర్యాప్ సాంగ్‌లో రోషన్‌తో కలసి డ్యాన్స్ చేయాలనిపించింది. ప్రతి క్లబ్, పబ్, యూత్ వేడుకల్లో ఈ పాట మార్మోగుతుంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. రోషన్ కనకాల, మానస చౌదరి జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన చిత్రం ‘బబుల్గమ్’. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఇజ్జత్..’ పాటను చిరంజీవి రిలీజ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పాటకి ఎం.ఎస్. హరి సాహిత్యం అందించగా, రోషన్ కనకాల, ఎం.ఎస్. హరి పాడారు. -
Bubblegum Teaser Launch Event Pics: యాంకర్ సుమ తనయుడు రోషన్ ‘బబుల్గమ్’చిత్రం టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
మరో సక్సెస్ఫుల్ హీరో వచ్చాడు – హీరో నాని
‘‘బబుల్గమ్’ టీజర్ చూస్తే చాలా బలమైన కథ అనిపించింది. రోషన్‌ని స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా కనిపించాడు. మరో సక్సెస్ఫుల్ హీరో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడని నమ్మకంగా చెప్పగలను. టీజర్ చూసినప్పుడు నాకు ఆ నమ్మకం వచ్చింది’’ అని హీరో నాని అన్నారు. నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమల తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్’. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మానసా చౌదరి కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘రవికాంత్‌కి ఒక యునిక్ స్టయిల్ ఉంది. అది టీజర్లో కనిపిస్తోంది. తెలుగులో క్వాలిటీ ఫిలిమ్స్‌కి మారుపేరుగా మారిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారికి ‘బబుల్గమ్’ మరో హిట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘నాకు ఇష్టమైన పని (సినిమాలు) చేయడానికి ప్రోత్సహించిన అమ్మానాన్నలకి థ్యాంక్స్’’ అన్నారు రోషన్ కనకాల. ‘‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌తో పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు రవికాంత్ పేరెపు. ‘‘బబుల్గమ్’ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. హీరోయిన్ మానస, నటుడు రాజీవ్ కనకాల మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, కెమెరా: సురేష్ రగుతు, క్రియేటివ్ప్రోడ్యూసర్: దివ్య విజయ్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: మధులిక సంచన లంక. -
కొడుకు లిప్‌లాక్ సీన్స్.. రాజీవ్ కనకాల అలాంటి కామెంట్స్!
కొన్నేళ్ల ముందు తెలుగు సినిమాల్లో శృంగారం, ముద్దు సన్నివేశాలు ఉంటే వామ్మో అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అదసలు పెద్ద విషయమే కాదన్నట్లుగా చూస్తున్నారు. దీంతో చాలా సినిమాల్లో రొమాన్స్ డోస్ పెరిగింది. సుమ కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. రొమాంటిక్ మూవీ అని అందరికీ అర్థమైపోయింది. (ఇదీ చదవండి: చిరంజీవి క్లాసిక్ హిట్ సినిమా.. ఇప్పుడు కొత్త గొడవ?) టీజర్ ఎలా ఉంది? సుమ కొడుకు హీరోగా ఎలా చేశాడు? ఇలాంటి విషయాలన్నీ పక్కనబెడితే.. ఈ టీజర్లో కిస్ సీన్ ఉంది. దానిపై స్వయంగా రాజీవ్ కనకాల మాట్లాడటం అవాక్కయ్యేలా చేసింది. హైదరాబాద్‌లో మంగళవారం టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. కొడుకు సినిమానే కాబట్టి రాజీవ్ కనకాల వచ్చారు. 'రోషన్ చాలా బాగా చేశావ్. సినిమాలో కూడా బాగా చేసుంటావని అనుకుంటున్నాను. టీజర్లో చివరాఖరి షాట్ చూసి..' అని రాజీవ్ కనకాల మాట్లాడటం ఆపేసి నవ్వుతూ ఉండిపోయాడు. ఇక వెంటనే దగ్గరకొచ్చిన సుమ.. 'కొన్ని మాట్లాడకుండా ఉంటేనే బెటర్ రాజా, పద' అని రాజీవ్ కనకాల నుంచి లాక్కుని వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ మాట్లాడిన రాజీవ్.. 'సరే అలాగే.. జనరల్‌గా వాళ్లకు అనిపించింది నేను చెప్పాను. అవునా కాదా?' అని అనేసరికి అందరూ అరిచారు. 'ఇంకా మనం ఏమేం చూడటానికి మిగిలుందో? ఇది టీజర్ మాత్రమే' అని పక్కనే ఉన్న సుమ అంది. ఇదంతా ఫన్నీగానే సాగినప్పటికీ.. కొందరికి మాత్రం కొడుకు గురించి తల్లిదండ్రులు అలా మాట్లాడటం ఎబ్బెట్టుగా అనిపించింది. (ఇదీ చదవండి: రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?) -
యాంకర్ సుమ కొడుకు మూవీ టీజర్ చూశారా?
ప్రముఖ యాంకర్ సుమ కనకాల తయనయుడు రోషన్ హీరోగా మారాడు. ఆయన నటించిన తొలి చిత్రం ‘బబుల్గమ్’. 'క్షణం' ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హేశ్వరీ మూవీస్ - పీపుల్ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ‘ప్రేమ అనేది బబుల్గమ్ లాంటిదని, ముందు తియ్యగా ఉన్నా ఆ తర్వాత అంటుకుంటుందంటూ’ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమతుంది. ఆ తర్వాత హీరోయిన్ను పబ్‌లో చూసి ప్రేమలో పడడం.. ఆ తర్వాత హీరో గురించి హీరోయిన్‌కి నిజం తెలిసి గొడవ పడడం ఇందులో చూపించారు. సముద్రం ఒడ్డున హీరోహీరోయిన్ లిక్లాక్తో బబుల్గమ్ సినిమా టీజర్ ముగిసింది. లవ్,రొమాన్స్, యాక్షన్.. ఇలా అన్ని అంశాలతో యూత్ఫల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. డిసెంబర్ 29న ఈ చిత్రం విడుదల కానుంది.