
కొన్నేళ్ల ముందు తెలుగు సినిమాల్లో శృంగారం, ముద్దు సన్నివేశాలు ఉంటే వామ్మో అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అదసలు పెద్ద విషయమే కాదన్నట్లుగా చూస్తున్నారు. దీంతో చాలా సినిమాల్లో రొమాన్స్ డోస్ పెరిగింది. సుమ కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. రొమాంటిక్ మూవీ అని అందరికీ అర్థమైపోయింది.
(ఇదీ చదవండి: చిరంజీవి క్లాసిక్ హిట్ సినిమా.. ఇప్పుడు కొత్త గొడవ?)
టీజర్ ఎలా ఉంది? సుమ కొడుకు హీరోగా ఎలా చేశాడు? ఇలాంటి విషయాలన్నీ పక్కనబెడితే.. ఈ టీజర్‌లో కిస్ సీన్ ఉంది. దానిపై స్వయంగా రాజీవ్ కనకాల మాట్లాడటం అవాక్కయ్యేలా చేసింది. హైదరాబాద్‌లో మంగళవారం టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. కొడుకు సినిమానే కాబట్టి రాజీవ్ కనకాల వచ్చారు. 'రోషన్ చాలా బాగా చేశావ్. సినిమాలో కూడా బాగా చేసుంటావని అనుకుంటున్నాను. టీజర్‌లో చివరాఖరి షాట్ చూసి..' అని రాజీవ్ కనకాల మాట్లాడటం ఆపేసి నవ్వుతూ ఉండిపోయాడు.
ఇక వెంటనే దగ్గరకొచ్చిన సుమ.. 'కొన్ని మాట్లాడకుండా ఉంటేనే బెటర్ రాజా, పద' అని రాజీవ్ కనకాల నుంచి లాక్కుని వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ మాట్లాడిన రాజీవ్.. 'సరే అలాగే.. జనరల్‌గా వాళ్లకు అనిపించింది నేను చెప్పాను. అవునా కాదా?' అని అనేసరికి అందరూ అరిచారు. 'ఇంకా మనం ఏమేం చూడటానికి మిగిలుందో? ఇది టీజర్ మాత్రమే' అని పక్కనే ఉన్న సుమ అంది. ఇదంతా ఫన్నీగానే సాగినప్పటికీ.. కొందరికి మాత్రం కొడుకు గురించి తల్లిదండ్రులు అలా మాట్లాడటం ఎబ్బెట్టుగా అనిపించింది.
(ఇదీ చదవండి: రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment