rajiv kanakala
-
హఠాత్తుగా నేను చనిపోతే.. పిల్లల గురించి 'సుమ' ఎమోషనల్ వర్డ్స్
టాలీవుడ్ స్టార్స్ సినిమాల వేడుకల్లో తన మాటలతోనే అందరినీ కట్టిపేడుస్తుంది సుమ కనకాల. కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించిన ఆమె రాజీవ్‌ను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిపోయింది. 48 ఏళ్ల వయసులో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా వ్యాఖ్యాతగా తనదైన టాలెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారామే.. అలా ట్రెండ్‌లో ఉన్నప్పుడే తన కుమారుడిని సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించాలని అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రోషన్ కనకాల 'బబుల్గమ్' చిత్రంతో హీరోగా రాబోతున్నాడు. ఈ క్రమంలో సుమ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. సమాజంలో చాలామంది మహిళలు తన భర్త చనిపోయాక ఎలాగైనా పిల్లలను పోషించుకోవాలని పని కోసం అనేకపాట్లు పడుతుంటారు. కొందరైతే ఇళ్లల్లో పనులు అయినా చేసేందుకు వెనుకాడరు. వారికి కనీసం బ్యాంక్, డబ్బులు దాచుకోవాలి, ఇన్సూరెన్స్‌లు.. ఇలాంటివి ఏమి తెలియవు. వారి భర్త ఇన్సూరెన్స్ చేసి ఉంటే అతను చనిపోయాక ఎంతో కొంత డబ్బులు వచ్చేవి. కానీ వాళ్లకు ఇవి తెలీదు. కాబట్టి మనకు తెలిసినంత వరకు చుట్టూ ఉన్నవారిలో కొందరికైనా వీటి గురించి చెప్పాలని సుమ తెలిపింది. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్) ఈ క్రమంలోనే తన కుటుంబం గురించి ఇలా చెప్పుకొచ్చింది. ' నాకు సంబంధించిన ఇన్సూరెన్స్‌ల విషయాల గురించి పిల్లలకు అంతా చెప్పాను. ఏదైనా కారణాలచేత హాఠాత్తుగా నేను చనిపోతే ఇన్యూరున్స్ ద్వారా ఎవరకి ఎంత వస్తుంది..? ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బు అందుతుంది..? అనే విషయాలన్నీ నా పిల్లలను ఒకరోజు కూర్చోబెట్టి చెప్పాను. కానీ ఆ సమయంలో ఎందుకు మమ్మీ ఇలాంటి మాటలు మాట్లాడుతావు..? అని పిల్లలు తిరిగి ప్రశ్నించారు. ఏదేమైనా మనం పిల్లలకు రియాల్టీ చెప్పాలి. ఈ క్షణం అనేది పక్కన పెడితే రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి విషయాలు పిల్లలు ధైర్యంగా షేర్ చేయాల్సిన బాధ్యత మనమీదే ఉంది. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమ చెప్పింది నిజమే కదా అంటూ కొందరు వాటిని షేర్ కూడా చేస్తున్నారు. -
కొడుకు లిప్‌లాక్ సీన్స్.. రాజీవ్ కనకాల అలాంటి కామెంట్స్!
కొన్నేళ్ల ముందు తెలుగు సినిమాల్లో శృంగారం, ముద్దు సన్నివేశాలు ఉంటే వామ్మో అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అదసలు పెద్ద విషయమే కాదన్నట్లుగా చూస్తున్నారు. దీంతో చాలా సినిమాల్లో రొమాన్స్ డోస్ పెరిగింది. సుమ కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. రొమాంటిక్ మూవీ అని అందరికీ అర్థమైపోయింది. (ఇదీ చదవండి: చిరంజీవి క్లాసిక్ హిట్ సినిమా.. ఇప్పుడు కొత్త గొడవ?) టీజర్ ఎలా ఉంది? సుమ కొడుకు హీరోగా ఎలా చేశాడు? ఇలాంటి విషయాలన్నీ పక్కనబెడితే.. ఈ టీజర్లో కిస్ సీన్ ఉంది. దానిపై స్వయంగా రాజీవ్ కనకాల మాట్లాడటం అవాక్కయ్యేలా చేసింది. హైదరాబాద్‌లో మంగళవారం టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. కొడుకు సినిమానే కాబట్టి రాజీవ్ కనకాల వచ్చారు. 'రోషన్ చాలా బాగా చేశావ్. సినిమాలో కూడా బాగా చేసుంటావని అనుకుంటున్నాను. టీజర్లో చివరాఖరి షాట్ చూసి..' అని రాజీవ్ కనకాల మాట్లాడటం ఆపేసి నవ్వుతూ ఉండిపోయాడు. ఇక వెంటనే దగ్గరకొచ్చిన సుమ.. 'కొన్ని మాట్లాడకుండా ఉంటేనే బెటర్ రాజా, పద' అని రాజీవ్ కనకాల నుంచి లాక్కుని వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ మాట్లాడిన రాజీవ్.. 'సరే అలాగే.. జనరల్‌గా వాళ్లకు అనిపించింది నేను చెప్పాను. అవునా కాదా?' అని అనేసరికి అందరూ అరిచారు. 'ఇంకా మనం ఏమేం చూడటానికి మిగిలుందో? ఇది టీజర్ మాత్రమే' అని పక్కనే ఉన్న సుమ అంది. ఇదంతా ఫన్నీగానే సాగినప్పటికీ.. కొందరికి మాత్రం కొడుకు గురించి తల్లిదండ్రులు అలా మాట్లాడటం ఎబ్బెట్టుగా అనిపించింది. (ఇదీ చదవండి: రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?) -
విడాకులపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ సుమ
ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న సుమ కనకాల.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కలివారపు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరణవాణి మ్యూజిక్ అందించారు. మే19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది సుమ. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల రూమర్స్‌పై స్పందించింది. 'మనస్పర్థల కారణంగా విడాకుల వరకు వెళ్లారు అన్న వార్తలు నిజమేనా అని యాంకర్ అని ప్రశ్నించగా.. రాజీవ్‌తో నాకు పెళ్లయి 23ఏళ్లు అవుతుంది. ఈ 23ఏళ్లలో మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇలా రూమర్స్ వచ్చినప్పుడుల్లా మా పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా పుకార్లకు కొంతవరకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాను. ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు సాధారణమే. సెలబ్రిటీలు అన్న తర్వాత ఇలాంటివి తప్పదు. వీటి వల్ల మానసికంగా బాధ కలిగినా అందుకు అలవాటుపడి ఉన్నాం' అంటూ చెప్పుకొచ్చింది. -
రాజీవ్ కనకాల సోదరి మృతి
-
యాంకర్ సుమ ఆడపడుచు మృతి
సాక్షి,హైదరాబాద్ : ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందారు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో రాజీవ్ కనకాల, సుమ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె భర్త రచయిత పెద్ది రామారావు కాగా ఆమె తండ్రి ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాలకు శ్రీలక్ష్మీ ఏకైక కుమార్తె. ఆమె ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె పలు టీవీ సీరియల్స్‌లో నటింటి మంచి నటిగా గుర్తింపుపొందారు. కాగా రాజీవ్ కనకాల తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. (కనకాల.. చెరగని జ్ఞాపకంలా..) -
దేవదాస్ కనకాలకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: సీనియర్ నటుడు, దర్శకుడు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు దేవదాస్ కనకాల (75) అంత్యక్రియలు శనివారం బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్ కనకాల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తండ్రి చితికి నిప్పంటించే సమయంలో రాజీవ్ కనకాల రోదించడం అందరినీ కలచి వేసింది. అంతకుముందు మణికొండలోని దేవదాస్ నివాసానికి ఆయన వద్ద నటనలో శిక్షణ పొందిన అనేక మంది శిష్యులు చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి దేవదాస్‌కు నివాళులు అర్పించి కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మిని ఓదార్చారు. భార్య మరణించినప్పటి నుంచి దేవదాస్ ముభావంగా ఉంటున్నారని, ఈ క్రమంలో ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆయన బంధువులు పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మణికొండ, రాయదుర్గం మీదుగా విస్పర్ వ్యాలీ కూడలి నుంచి మహాప్రస్థానానికి దేవదాస్ కనకాల భౌతికకాయాన్ని తరలించారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో సినీనటులు, ఆయన శిష్యులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. -
లక్ష్మీదేవి కనకాల కన్నుమూత
రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్స్‌కి నటనలో మెళకువలు నేర్పించిన లక్ష్మీదేవి కనకాల ఇక లేరు. శనివారం హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. కళలంటే లక్ష్మీదేవికి అభిమానం. ప్రముఖ నాటకోద్యమ కర్త ఎ.ఆర్. కృష్ణ వద్ద శిక్షణ పొందారామె. ఎ.ఆర్. కృష్ణ ఆమెతో ‘కన్యాశుల్కం’ నాటకంలో బుచ్చమ్మ పాత్ర చేయించారు. అనంతరం సాంగ్ మరియు డ్రామా డివిజన్లో పని చేసిన లక్ష్మీదేవికి దేవదాస్ కనకాల పరిచయమయ్యారు. 1971లో దేవదాస్‌ను పెళ్లాడారామె. వివాహం తర్వాత లక్ష్మీ దేవి కూడా నటీనటులకు శిక్షణ ఇచ్చే లñ క్చరర్‌గా దేవదాస్ శిక్షణ ఇస్తున్న మద్రాస్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాపించిన ఇన్స్టిట్యూట్లో చేరారు. ఆ సమయానికి నటుడు రాజేంద్రప్రసాద్ మొదటి సంవత్సరం, రజనీకాంత్ రెండో బ్యాచ్‌లో శిక్షణ పొందుతున్నారు. చిరంజీవి ఆమెకు ఐదో బ్యాచ్ విద్యార్థి. ఆ తర్వాత కొంత కాలానికి భర్త దేవదాస్ కనకాల స్థాపించిన ఇన్స్టిట్యూట్ ద్వారా నటీనటులు కావాలనుకునే అనేక మందికి శిక్షణ ఇచ్చారామె. లక్ష్మీదేవి కొన్ని సినిమాల్లోనూ నటించారు. ‘ప్రేమ బంధం’ చిత్రంలో జయప్రదకు తల్లిగా నటించారు.ఆ తర్వాత ‘ఒక ఊరి ప్రేమకథ’, ‘మాస్టారి కాపురం’, ‘పోలీస్ లాకప్’, ‘కొబ్బరి బోండాం’ చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. లక్ష్మీదేవికి ఇద్దరు సంతానం. రాజీవ్ కనకాల. శ్రీలక్ష్మీ కనకాల. రాజీవ్ కనకాల టీవీల్లో, సినిమాల్లో నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. కోడలు సుమ తిరుగు లేని యాంకర్. కుమార్తె లక్ష్మీ కనకాల టీవీ సీరియల్స్ చేస్తున్నారు. అల్లుడు పెద్ది రామారావు కూడా నాటక రంగంలో పేరున్నవారే. సినీ రచయితగా కూడా ఆయన సుపరిచితులు. లక్ష్మీదేవి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె నాకు సరస్వతి – చిరంజీవి లక్ష్మీదేవి మరణం పై చిరంజీవి స్పందిస్తూ– ‘‘ఆవిడ పేరుకు లక్ష్మీదేవి అయినా నాకు సరస్వతి. ఆమె పాఠాలే నా పాఠవాలకు మూలం. ఆమె నేర్పిన మెళకువలే నటుడిగా నాకు మెలుకువలు. ఇంతమంది అభిమానుల అభిమాన కథానాయకుడిగా ఎంత గర్వపడుతున్నానో, ఆవిడ శిష్యుడిగా కూడా అంతే గర్వపడుతున్నాను. తెలుగు సినిమాతో అనుబంధం ఉన్న ప్రతి మనసుకి బరువైన క్షణాలు ఇవి. అలా బరువెక్కిన మనసుతో నా చదువులమ్మకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నాను. ఆవిడ మరణం మనందరికి తీరని లోటు. కనకాల కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అన్నారు. -
నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం
-
గ్యారేజ్‌లో గణపతి పూజ
-
చారుశీల ఏం చేసింది?
రష్మీ గౌతమ్, రాజీవ్ కనకాల, జశ్వంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘చారుశీల’. శ్రీనివాస్ ఉయ్యూరు దర్శకుడు. కొండపల్లి సమర్పణలో జోత్స్న ఫిలింస్ పతాకంపై ప్రముఖ దర్శకులు వి.సాగర్, సిద్ధిరెడ్డి, జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. చూస్తున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠకు లోనవుతారు. చారుశీలగా రష్మీ నటనకు అవార్డులు రావడం ఖాయం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ ఈ చిత్రం. బ్రహ్మానందం, మెల్కోటి, జబర్దస్త్ టీం మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. మాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: కుమార్ మల్లారపు, సంగీతం: సుమన్ జూపూడి, కథ-కథనం- ఛాయాగ్రహణం- దర్శకత్వం: శ్రీనివాస్ ఉయ్యూరు. -
రోడ్డు భద్రతా ఉద్యమంలో మేము సైతం
సాక్షి,సిటీబ్యూరో: రోడ్డు భద్రతా ఉద్యమంలో తాము కూడా భాగస్వాములమవుతామని, రవాణాశాఖ కార్యక్రమాలకు మద్దతునిస్తామని సినీనటుడు రాజీవ్ కనకాల,ఆయన సతీమణి యాంకర్ సుమ అన్నారు. గురువారం డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ కోసం వారు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రాంతీయ రవాణా అధికారులు దశరథం, జీపీఎన్ ప్రసాద్ వారిని సాదరంగా ఆహ్వానించి ఇద్దరి డ్రైవింగ్ లెసైన్సుల రెన్యువల్ ప్రక్రియను ముగించారు. -
ఆమె అపురూపం
ప్రతి భర్త తన భార్యను బంగారంలా భావిస్తూ, అపురూపంగా చూసుకుంటే ప్రతి ఇల్లు నందనవనం అవుతుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘శ్రీమతి బంగారం’. రిషి, రాజీవ్ కనకాల, ప్రియాంక ముఖ్య తారలుగా శ్రీ మహేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై చెన్న శ్రీనివాస్, కొత్త సత్యనారాయణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో రొమాన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్ధ బాపు, నిర్వహణ: జీవీ సత్యనారాయణ. -
ప్రముఖ నటుడి స్థలం కబ్జా
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ సుమా మామా, ప్రముఖ నటుడు దేవదాసు కనకాలకు చెందిన భూమి ఆక్రమణకు గురైంది. దాంతో దేవదాసు కనకాల ఆయన కుమారుడు రాజీవ్ కనకాల బుధవారం హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని దేవదాసు కనకాలకు చెందిన స్థలంలో గత ఆర్థరాత్రి దుండగులు ప్రవేశించి... అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ విషయాన్ని స్థానికులు వెంటనే దేవదాసు కనకాలకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే హయత్‌నగర్‌లోని భూమికి చేరుకుని... దుండగులకు వెళ్లిపోమ్మని ఆదేశించారు. అందుకు దుండగులు ససేమిరా అనడంతో.. దేవదాసు కనకాల, రాజీవ్ కనకాల హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు.