
ప్రముఖ నటుడి స్థలం కబ్జా
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ సుమా మామా, ప్రముఖ నటుడు దేవదాసు కనకాలకు చెందిన భూమి ఆక్రమణకు గురైంది. దాంతో దేవదాసు కనకాల ఆయన కుమారుడు రాజీవ్ కనకాల బుధవారం హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని దేవదాసు కనకాలకు చెందిన స్థలంలో గత ఆర్థరాత్రి దుండగులు ప్రవేశించి... అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఆ విషయాన్ని స్థానికులు వెంటనే దేవదాసు కనకాలకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే హయత్నగర్లోని భూమికి చేరుకుని... దుండగులకు వెళ్లిపోమ్మని ఆదేశించారు. అందుకు దుండగులు ససేమిరా అనడంతో.. దేవదాసు కనకాల, రాజీవ్ కనకాల హయత్నగర్ పోలీసులను ఆశ్రయించారు.