యాంకర్‌ సుమ ఆడపడుచు మృతి | Rajiv Kanakala Sister Sri Laxmi Last Breath | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ కనకాల సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి

Published Mon, Apr 6 2020 3:32 PM | Last Updated on Mon, Apr 6 2020 4:40 PM

Rajeev Kanakala Sister Sri Laxmi Last Breath - Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందారు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ‍ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో రాజీవ్‌ కనకాల, సుమ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె భర్త రచయిత పెద్ది రామారావు కాగా ఆమె తండ్రి ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాలకు శ్రీలక్ష్మీ ఏకైక కుమార్తె. ఆమె ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె పలు టీవీ సీరియల్స్‌లో నటింటి మంచి నటిగా గుర్తింపుపొందారు. కాగా రాజీవ్‌ కనకాల తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. (కనకాల.. చెరగని జ్ఞాపకంలా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement