Sri laxmi
-
బెడ్‌పై కదల్లేని స్థితిలో శ్రీలక్ష్మి, మాట రాక కంటనీరు..: రాజీవ్ కనకాల ఎమోషనల్
కొద్ది నిమిషాల నిడివి ఉన్నా, సినిమా ఆసాంతం ఉన్నా తను పోషించే పాత్రలు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ ఎమోషన్స్ చూపించడం, సీన్‌ను రక్తికట్టించడంలో రాజీవ్ కనకాల దిట్ట. జీవితంలో కష్టనష్టాలు ఎన్నో చూసిన ఆయన సినీ కెరీర్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'అమ్మ, నాన్న, చెల్లి.. అందరినీ కోల్పోయాను. ఆ సమయంలో చాలా ఇబ్బందిపడ్డాను. రెండు,మూడు నెలలపాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా చెల్లి పేరు శ్రీలక్ష్మి. తను సీరియల్స్ కూడా చేసింది. తనకు క్యాన్సర్ వచ్చింది, దాన్నుంచి దాదాపు బయటపడింది. పూజలు, హోమాలు చేయించమంటే అవి కూడా చేయించాం. 85 శాతం రికవరీ అయింది. ఇక ఆందోళన చెందాల్సిన పని లేదనుకున్నాం. రెండు రోజుల్లో లాక్డౌన్ అనగా మా బావ నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వెళ్లి చూశాక తన పరిస్థితి దిగజారుతోందని అర్థమైంది. కీమోథెరపీ చేయిద్దామంటే అప్పుడే పచ్చకామెర్ల వ్యాధి సోకింది. అది తగ్గితేకానీ ఏ చికిత్స చేయరు. రోజురోజుకీ తన పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. అది కరోనా సమయం కావడంతో ఎవరూ ఆస్పత్రిలో జాయిన్ చేసుకునే పరిస్థితిలో లేరు. ఒకవేళ అడ్మిట్ చేసుకున్నా తన ప్రాణ్యాలకు గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. అందుకే ఉన్నంత వరకు కుటుంబమంతా ఒకే దగ్గర ఉన్నాం. బెడ్‌పై కదల్లేని స్థితిలో ఉన్న తను ఎప్పుడో ఒకసారి స్పృహలోకి వచ్చి కళ్లు తెరిచి చూసేది. మాట్లాడటానికి కూడా రాకపోయేది. తన కంట నుంచి కన్నీళ్లు కారేవి. రాత్రిపూట తన మూలుగు విని ఇంకా బతికుందని అనుకునేవాడిని. ఎక్కువరోజులు తను బతకదని తెలుసు, అదే జరిగింది. నా మేనకోడళ్లు (చెల్లి పిల్లలు) ఇద్దరూ చాలా స్ట్రాంగ్‌గా ఉండేవారు. తల్లి చనిపోయాక తనకోసం లేఖ రాశారు. ఆ మధ్య అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సమయంలో సుమ వచ్చి ఇప్పటి నుంచి మనకు నలుగురు పిల్లలు అంది. ఇప్పటికీ వాళ్లకు ఏం కావాలన్నా సుమ దగ్గరుండి చూసుకుంటుంది' అంటూ ఎమోషనలయ్యాడు రాజీవ్ కనకాల. చదవండి: అనాథలా చనిపోయిన తెలుగింటి హీరోయిన్.. -
60 ఏళ్ల మహిళకు..20 ఏళ్ల కుర్రాడితో పెళ్లి
హాస్యనటిగా ఎన్నో పాత్రల్లో ప్రేక్షకులను నవ్వించిన శ్రీలక్ష్మి టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. ‘కేరింత’లో నూకరాజు పాత్రలో ఆకట్టుకున్న పార్వతీశం హీరో. అరవయ్యేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. గోగుల నరేంద్ర నిర్మించిన ఈ సినిమా ద్వారా పూరి జగన్నాథ్ శిష్యుడు చైతన్య కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు మూడో వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. గోగుల నరేంద్ర మాట్లాడుతూ– ‘‘కుటుంబం అంతా కలిసి చూడదగ్గ మంచి వినోదాత్మక చిత్రమిది. పార్వతీశం, శ్రీలక్ష్మిగారి జంట నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాతో ముగ్గురు కొత్త కథానాయికలను పరిచయం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్య కశ్యప్, కెమెరా: ఆనంద్ డోల. -
రాజీవ్ కనకాల సోదరి మృతి
-
యాంకర్ సుమ ఆడపడుచు మృతి
సాక్షి,హైదరాబాద్ : ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందారు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో రాజీవ్ కనకాల, సుమ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె భర్త రచయిత పెద్ది రామారావు కాగా ఆమె తండ్రి ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాలకు శ్రీలక్ష్మీ ఏకైక కుమార్తె. ఆమె ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె పలు టీవీ సీరియల్స్‌లో నటింటి మంచి నటిగా గుర్తింపుపొందారు. కాగా రాజీవ్ కనకాల తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. (కనకాల.. చెరగని జ్ఞాపకంలా..) -
మీ మేనత్త శ్రీలక్ష్మి సిఫార్సు చేయలేదా?
సినిమా: మహానటి లాంటి చిత్రాలు ఎప్పుడో పదేళ్లకొక్కసారి వస్తాయని నటి ఐశ్వర్యారాజేశ్ అన్నా రు. ఆరణాల అచ్చతెలుగు అమ్మాయి అయిన ఈ బ్యూటీ తమిళసినిమాలో మంచి నటిగా రాణిస్తున్నా రు. నటనకు అవకాశం ఉంటే చాలు అది పెద్దదా? చిన్నదా? అన్న ఆలోచన లేకుండా నటించడానికి సి ద్ధం అంటున్న ఐశ్వర్యారాజేశ్ ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలా కాక్కాముట్టై చి త్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో చెక్క సివంద వానం(తెలుగులో నవాబ్) నటించే అరుదైన అవకాశాన్ని కూ డా దక్కించుకున్న ఐశ్వర్యారాజేశ్ ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్ర సక్సెస్ అనుభవిస్తున్నారు. ఈ సందర్భంగా తన అనుభవాలను ఈ బ్యూటీ సాక్షితో పంచుకున్నారు. ఆ ముచ్చట్లేమిటో చూసేద్దామా! ప్ర: మణిరత్నం దర్శకత్వంలో నటించిన అనుభవం గురించి? జ:చాలా ఆనందంగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ప్రతి నటీ కలలు కంటుంది. అలాంటి అవకాశం ఇంత త్వరలో వస్తుందని నేను ఊహించలేదు. ప్ర: సెక్క సివంద వానం చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చింది? జ:నిజం చెప్పాలంటే కాట్రువెలియిడై(తలుగులో చెలియా) చిత్రం నిర్మాణం సమయంలో మణిరత్నం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. అయితే అది నటి అధితిరావు పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి అని తెలిసింది. అయినా నా వాయిస్ ఆమెకు సెట్ కాలేదు. మరోసారి అలాంటి ఫోన్‌నే వచ్చింది. ఈ సెక్క సివంద వానం చిత్రం ప్రారంభం సమయంలోనూ మణిరత్నం కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో అదీ అలాంటిదేదో అయ్యి ఉంటుందిలే అనుకున్నాను. అయితే చిత్రంలో నటించాలని చెప్పినప్పుడు నిజమేనా? అని నమ్మలేకపోయాను. నిజం కావడంతో కల నిజమైందని సంతోష పడ్డాను. నేను ఇంతకు ముందు చాలా చిత్రాల్లో నటించినా, యాక్టింగ్ అంటే ఎలా ఉంటుందన్నది మణిరత్నం నుంచి నేర్చుకున్నాను.ఆయనలో మ్యాజిక్ ఉంది. ఈ చిత్రం నాకోక పాఠం. ప్ర: సెక్క సివంద వానం చిత్రంలో మీ పాత్ర గురించి? జ:ఇందులో నేను సిలోన్ అమ్మాయిగా నటించాను. ప్ర: ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది.మీకు అలాంటి చిత్రంలో నటించాలన్న కోరిక ఉందా? జ: నిజం చెప్పాలంటే బయోపిక్ కథా చిత్రాలు ఎప్పుడో గానీ రూపొందవు. మహానటి చిత్రంలో కీర్తీసురేశ్ చాలా బాగా నటించారు. అయితే అలాంటి పాత్రలు అరుదుగానే లభిస్తుంటాయి. అలాంటి కథా చిత్రం అమిరితే కచ్చితంగా నటిస్లాను. నా కేరీర్లో ఒక మరపురాని చిత్రంగా కనా చిత్రం నిలిచిపోతుంది. ప్ర: తెలుగు అమ్మాయి అయ్యి ఉండి తెలుగు చిత్రాల్లో నటించడం లేదే? జ:నిజం చెప్పాలంటే తెలుగులో నటించాలని నాకూ ఉంది. అయితే అక్కడ సరైన అవకాశాలు రాలేదు. కొన్ని వచ్చినా మంచి కథా పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను. అయితే అలాంటి అవకాశం ఒకటి ఇప్పుడు వచ్చింది. త్వరలోనే ఒక భారీ చిత్రంలో నటించనున్నాను. ఆ వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ప్ర: మీ మేనత్త శ్రీలక్ష్మి తెలుగులో ప్రముఖ నటి. ఆమె సిఫార్సు చేయలేదా? జ: అత్త శ్రీలక్ష్మి కొన్నాళ్లు హైదరా బాద్, కొన్నాళ్లు చెన్నైలో నివశిస్తుంటారు. చెన్నైకి వచ్చినప్పుడు మా ఇంటికి వస్తారు. అయితే ఎందుకనో సిఫార్సు చేయమని నేనూ అడగలేదు. ఆమె చేయలేదు. ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? జ:ధనుష్‌కు జంటగా నటించిన వడచెన్నై త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. అదే విధంగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో విక్రమ్‌కు జంటగా ధ్రువనక్షత్రంలో పాలు మరి కొన్ని చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ప్ర: తెలుగులో ఏ హీరోతో నటిం చాలని కోరుకుంటున్నారు? జ: తెలుగులో మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇలా చాలా మంది నచ్చిన హీరోలు ఉన్నారు. ముఖ్యంగా ప్రభాష్ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే వదులుకోను. -
కో‘ఢీ’ అంటే చర్యలు తప్పవు!
సాక్షి, కదిరి: కదిరి, పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి హెచ్చరించారు. పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం ఎమ్మార్వో పీవీ రమణ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ ప్రసంగించారు. గ్రామాల్లో ఆయా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పోలీస్‌కు సహకరించి కోడిపందేలు జరగకుండా చూడాలని కోరారు. గతంలో కోడిపందేల కేసుల్లో ఉన్నవారిని ఆయా ఎమ్మార్వోల ఎదుట బైండోవర్ చేయిస్తామన్నారు. కోడి పందేల నిర్వహణకు ఎవరైనా తమ స్థలాలు, తోటలు ఇచ్చినట్లు తెలిస్తే వారిపై కూడా కేసులను నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడిపందేలు నిర్వహించిన వారిపై ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్టు, ఏపీ గేమింగ్ యాక్టుల కింద కేసులు బనాయిస్తామని తెలిపారు. ఇప్పటి నుండి ఈ నెల 24 వరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్టు అమలులో ఉంటుందన్నారు. కోడి పందేల బదులు సంక్రాంతిని పురష్కరించుకొని పట్టణంలో ముగ్గుల పోటీలు నిర్వహిద్దామని, అందులో ప్రతిభ కనబరచిన మహిళలు బహుమతులు అందజేద్దామని సీఐ గోరంట్ల మాధవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు హేమంత్‌కుమార్, సహదేవరెడ్డి, మగ్బుల్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి పోస్టింగ్!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సస్పెన్షన్‌లో ఉన్న ఆమెకు ప్రభుత్వ రంగ సంస్థ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇవ్వనున్నట్లు తెలిసింది. సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఇవ్వాలని ఆమె పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్న నేపథ్యంలో పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. -
శుభకార్యాలకు హాజరైన ఎంపీ పొంగులేటి
వైరా: వైరాలో ఆదివారం జరిగిన పలు శుభకార్యాలకు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజయ్యారు. వైరా గ్రామ పంచాయతీ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐవిఎస్.రెడ్డి కుమార్తె చైత్రిక, రాజశేఖర్‌రెడ్డి వివాహానికి హాజరయ్యూరు. నూతన దంపతులను ఆశీర్వదించారు. స్థానిక హనుమాన్ బజార్‌లోని వైఎస్ఆర్ సీపీ నాయకుడు బుడిగి వెంకన్న ఇంటికి వెళ్లారు. ఈ నెల 12న పెళ్లి పీటల పైకి ఎక్కనున్న ఆయన కుమార్తె శ్రీలక్ష్మిని ఆశీర్వదించారు. శాంతినగర్‌లోని పమ్మి విజయరాజు, కళ్యాణి నిశ్చితార్థానికి వెళ్లి వారిని ఆశీర్వదించారు. పొంగులేటి వెంట పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జి బొర్రా రాజశేఖర్, మండల కన్వీనర్ సూతకాని జైపాల్, పట్టణ అధ్యక్షుడు ఏలూరి శ్రీను, నాయకులు శీలం వెంకట్రామిరెడ్డి, రేచర్ల సత్యం, ధార్న శేఖర్, మోదుగు లక్ష్మయ్య, జాలాది రామకృష్ణ, అప్పం సురేష్, బుడిగి వెంకన్న, పర్సా రవి తదితరులు ఉన్నారు. గార్లఒడ్డు (వైరా): గార్లఒడ్డులో ఆదివారం జరిగిన జూలూరుపాడు జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి వెంకటేశ్వరావు కుమారుడు నరేష్ వివాహానికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం హాజరయ్యారు. నరేష్‌ను దీవించారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొర్ర రాజశేఖర్ తదితరులు ఉన్నారు.