శుభకార్యాలకు హాజరైన ఎంపీ పొంగులేటి | MP ponguleti srinivasa reddy attends to Marriages at Vyra | Sakshi
Sakshi News home page

శుభకార్యాలకు హాజరైన ఎంపీ పొంగులేటి

Published Mon, Mar 9 2015 4:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

శుభకార్యాలకు హాజరైన ఎంపీ పొంగులేటి

శుభకార్యాలకు హాజరైన ఎంపీ పొంగులేటి

వైరా: వైరాలో ఆదివారం జరిగిన పలు శుభకార్యాలకు వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజయ్యారు. వైరా గ్రామ పంచాయతీ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐవిఎస్.రెడ్డి కుమార్తె చైత్రిక, రాజశేఖర్‌రెడ్డి వివాహానికి హాజరయ్యూరు. నూతన దంపతులను ఆశీర్వదించారు. స్థానిక హనుమాన్ బజార్‌లోని వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు బుడిగి వెంకన్న ఇంటికి వెళ్లారు. ఈ నెల 12న పెళ్లి పీటల పైకి ఎక్కనున్న ఆయన కుమార్తె శ్రీలక్ష్మిని ఆశీర్వదించారు.
 
శాంతినగర్‌లోని పమ్మి విజయరాజు, కళ్యాణి నిశ్చితార్థానికి వెళ్లి వారిని ఆశీర్వదించారు. పొంగులేటి వెంట పార్టీ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జి బొర్రా రాజశేఖర్, మండల కన్వీనర్ సూతకాని జైపాల్, పట్టణ అధ్యక్షుడు ఏలూరి శ్రీను,  నాయకులు శీలం వెంకట్రామిరెడ్డి, రేచర్ల సత్యం, ధార్న శేఖర్, మోదుగు లక్ష్మయ్య, జాలాది రామకృష్ణ, అప్పం సురేష్, బుడిగి వెంకన్న, పర్సా రవి తదితరులు ఉన్నారు.
 
గార్లఒడ్డు (వైరా): గార్లఒడ్డులో ఆదివారం జరిగిన జూలూరుపాడు జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి వెంకటేశ్వరావు కుమారుడు నరేష్ వివాహానికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం హాజరయ్యారు. నరేష్‌ను దీవించారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొర్ర రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement