కలెక్టర్ ‘పోస్ట్’ కలకలం
పొంగులేటిపై జాతీయ మహిళా కమిషన్‌కు బక్క జడ్సన్ ఫిర్యాదు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్‌లో శుక్రవారం మంత్రి పొంగులేటి ఉన్నతాధికా రులపై వ్యక్తంచేసిన ఆగ్రహం, మందలించేందుకు వాడిన పదాలు కలెక్టర్ పమేలా సత్పతిని బాధించాయని.. ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆమె తన ఇన్‌స్టాలో పెట్టిన భావోద్వేగ పోస్టు ఆమె లోలోపల కుమిలిపోతున్నారనడానికి నిదర్శనమని పలువురు ఉదహరిస్తున్నారు. కాగా.. కలెక్టర్ ఇన్‌స్టాలో పెట్టినపోస్టు శనివారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తీరును తప్పుపడుతూ సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి బహిరంగంగా కలెక్టర్‌ను అవమానకర రీతిలో మాట్లాడారంటూ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
శుక్రవారం పలుఅభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఖట్టర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీపీ మహంతి ప్రొటోకాల్ పాటించలేదని, నామమాత్రంగా వ్యవహరించారని మంత్రులు చిన్నబుచ్చుకున్నారు. బీజేపీ నాయకులూ అదే అభిప్రాయం వ్యక్తంచేశారు. అదే సమయంలో తోపులాట జరిగి.. ఓ గన్‌మెన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పదేపదే పడటంతో ఆయన ఆగ్రహించారు.
‘వాట్ దిస్ నాన్ సెన్స్, ఎక్కడ మీ ఏసీపీ, ఎక్కడ సీపీ? కామన్‌సెన్స్ లేదా? అని కలెక్టర్ ఎదుటే ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఏర్పాట్ల విషయంలో కలెక్టర్ ఎంత జాగ్రత్తగా ఉన్న మంత్రి అసంతృప్తి, ఆగ్రహం ఆమెను బాధించాయని పలువురు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన ఇన్‌స్టాలో ‘నేను మహిళను.. సందర్భానికి తగినట్లుగా ఉంటాను.
మండిపడగలను, వికసించగలను, విరుచుకుపడగలను, మంచులా గడ్డకట్టిపోగలను, అవసరమైతే కరగిపోగలను’’ అంటూ ఆంగ్లంలో పోస్ట్ చేశారని అంటున్నారు. అయితే, ఈ పోస్టు కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలుమీడియాలోనూ వార్తగా వచ్చింది. తర్వాత ఆమె పెట్టినట్లుగా చెబుతున్న పోస్టు ఆమె ఇన్‌స్టాఖాతాలో కనిపించలేదు. ఈ విషయమై కలెక్టర్ పమేలా సత్పతిని సంప్రదించేందుకు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. పోలీసుల వల్ల తనకు పదిమందిలో పరాభవం ఎదురైందని, ఆమె నొచ్చుకున్నారని పలువురు కలెక్టరేట్ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.
వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?
అధికారులు ప్రొటోకాల్ పాటించాలి
కరీంనగర్ కార్పొరేషన్: జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి హి తవు పలికారు. కేంద్ర పట్టణాభివృది్ధశాఖ మంత్రి ఖట్టర్ నగరంలో పర్యటిస్తే అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా ఉన్న తనకు ప్రొటోకాల్ వర్తింపజేయకపోవడం సరికాదన్నారు. శనివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టారన్నారు. మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment