Karimnagar district
-
గుడ్లు, చికెన్ తినేందుకు ఎగబడ్డారు
-
మమత హత్య కేసు.. వీడిన మిస్టరీ
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఐదురోజుల క్రితం వెలుగులోకొచ్చిన మహిళ అనుమానాస్పద మృతి కేసును చొప్పదండి పోలీసులు ఛేదించారు. బెల్లంపల్లికి చెందిన మమతను జనవరి 27న హత్య చేసి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో పడేసిన విషయం తెలిసిందే. అయితే, వివాహేతర సంబంధమే మమత హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాసిపేటకు చెందిన మమత.. గత నెల 27న తన కుమారుడితో కలిసి బెల్లంపల్లి నుంచి కారులో బయలుదేరింది. ఆ తర్వాత కనిపించకుండా పోయినా ఆమె.. కరీంనగర్ జిల్లా కొండనపల్లి శివారులో శవమై కనిపించింది. తల్లితో పాటు ఉన్న నాలుగేళ్ల కుమారుడు కూడా కనిపించకుండా పోయాడు. నిందితులు పరారైన కారు నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. చెన్నైలోని ఒక లాడ్జిలో బాలుడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని కాపాడి.. నానమ్మకు అప్పగించారు.మృతురాలు మమత.. భర్తతో విడిపోయి సింగరేణి ఉద్యోగి భాస్కర్‌తో కలిసి ఉంటుంది. దీంతో భాస్కర్ కుటుంబ సభ్యులు రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి మమతను హత్య చేయించినట్లు పోలీసులు నిర్థారించారు. భాస్కర్ సోదరి, ఆమె స్నేహితుడు రఘు, సుపారీ కిల్లర్ కల్యాణ్, భాస్కర్ తండ్రి, సోదరి సమీప బంధువును అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
వికసిస్తా.. విరుచుకుపడతా!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్లో శుక్రవారం మంత్రి పొంగులేటి ఉన్నతాధికా రులపై వ్యక్తంచేసిన ఆగ్రహం, మందలించేందుకు వాడిన పదాలు కలెక్టర్ పమేలా సత్పతిని బాధించాయని.. ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆమె తన ఇన్‌స్టాలో పెట్టిన భావోద్వేగ పోస్టు ఆమె లోలోపల కుమిలిపోతున్నారనడానికి నిదర్శనమని పలువురు ఉదహరిస్తున్నారు. కాగా.. కలెక్టర్ ఇన్‌స్టాలో పెట్టినపోస్టు శనివారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తీరును తప్పుపడుతూ సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి బహిరంగంగా కలెక్టర్‌ను అవమానకర రీతిలో మాట్లాడారంటూ పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే..శుక్రవారం పలుఅభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఖట్టర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీపీ మహంతి ప్రొటోకాల్ పాటించలేదని, నామమాత్రంగా వ్యవహరించారని మంత్రులు చిన్నబుచ్చుకున్నారు. బీజేపీ నాయకులూ అదే అభిప్రాయం వ్యక్తంచేశారు. అదే సమయంలో తోపులాట జరిగి.. ఓ గన్‌మెన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పదేపదే పడటంతో ఆయన ఆగ్రహించారు. ‘వాట్ దిస్ నాన్ సెన్స్, ఎక్కడ మీ ఏసీపీ, ఎక్కడ సీపీ? కామన్సెన్స్ లేదా? అని కలెక్టర్ ఎదుటే ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఏర్పాట్ల విషయంలో కలెక్టర్ ఎంత జాగ్రత్తగా ఉన్న మంత్రి అసంతృప్తి, ఆగ్రహం ఆమెను బాధించాయని పలువురు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన ఇన్‌స్టాలో ‘నేను మహిళను.. సందర్భానికి తగినట్లుగా ఉంటాను. మండిపడగలను, వికసించగలను, విరుచుకుపడగలను, మంచులా గడ్డకట్టిపోగలను, అవసరమైతే కరగిపోగలను’’ అంటూ ఆంగ్లంలో పోస్ట్ చేశారని అంటున్నారు. అయితే, ఈ పోస్టు కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలుమీడియాలోనూ వార్తగా వచ్చింది. తర్వాత ఆమె పెట్టినట్లుగా చెబుతున్న పోస్టు ఆమె ఇన్‌స్టాఖాతాలో కనిపించలేదు. ఈ విషయమై కలెక్టర్ పమేలా సత్పతిని సంప్రదించేందుకు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. పోలీసుల వల్ల తనకు పదిమందిలో పరాభవం ఎదురైందని, ఆమె నొచ్చుకున్నారని పలువురు కలెక్టరేట్ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?అధికారులు ప్రొటోకాల్ పాటించాలికరీంనగర్ కార్పొరేషన్: జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి హి తవు పలికారు. కేంద్ర పట్టణాభివృది్ధశాఖ మంత్రి ఖట్టర్ నగరంలో పర్యటిస్తే అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్‌గా ఉన్న తనకు ప్రొటోకాల్ వర్తింపజేయకపోవడం సరికాదన్నారు. శనివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టారన్నారు. మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలని సూచించారు. -
వికటించిన మధ్యాహ్న భోజనం
గంగాధర (చొప్పదండి): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. శుక్రవారం మధ్యాహ్నం అన్నం తిన్న పలువురు విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 205 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో శుక్రవారం 180 మంది హాజరయ్యారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలలో వండిన భోజనం తిన్నారు. కాసేపటికి ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.ఇది చూసిన మరో 20 మంది విద్యార్థులు కడుపునొస్తోందని ఉపాధ్యాయులకు చెప్పారు. వెంటనే వారు ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వైద్యం అందించి, మాత్రలు ఇచ్చారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్న భోజనానికి వండిన బియ్యం కొత్తవి కావడంతో పాటు అన్నం మెత్తగా కావడం వల్ల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఎంఈవో ప్రభాకర్‌రావు వివరించారు. -
కరీంనగర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
మార్క్‌ఫెడ్‌లో రూ.60 లక్షలు మాయం
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో ఎరువులు అమ్మగా వచ్చిన కోట్లాది రూపాయల సొమ్మును కొందరు ఉద్యోగులు కాజేస్తున్నారు. ఇది మంగళవారం వెలుగులోకి వచి్చంది. కరీంనగర్ జిల్లాలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఒక ఎరువుల యూనిట్‌కు చెందిన డబ్బును అందులో పనిచేసే ఒక ఉద్యోగి ఏకంగా రూ. 60 లక్షలు కాజేయడం వ్యవసాయశాఖను కుదిపేసింది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఎరువుల యూనిట్‌ను నడుపుకునేందుకు మార్క్‌ఫెడ్‌లో పనిచేసే ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగికి అవకాశం కలి్పంచారు.అంటే అందులో పనిచేసే ఉద్యోగే తాను ఒక లైసెన్స్డ్ షాపు నిర్వహిస్తున్నాడన్నమాట. దానికి ఎరువులను మార్క్‌ఫెడ్ నుంచి తెప్పించుకున్నాడు. ఆ షాపులో తాను అమ్మగా వచి్చన ఆదాయంలో మార్క్‌ఫెడ్‌కు 50 శాతం కమీషన్ చెల్లించాలి. కానీ ఆ సొమ్మును మార్క్‌ఫెడ్ రికార్డుల్లోని కాగితాల్లో మాత్రమే రాసి పెట్టి, డబ్బులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా రూ.60 లక్షలు కాజేసినట్టు తేలింది. అయినా అక్కడి అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించారు.గతంలోనూ అక్కడ ఇంకా ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా లేదా అన్నదానిపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం హైదరాబాద్‌లో మార్క్‌ఫెడ్ డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక అధికారి అక్కడి మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలోనూ ఇలాంటి సంఘటన జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. అతనిపైనా నిఘా పెట్టారు. ఆయన్ను వివరణ కోసం ప్రయతి్నంచగా, తనకు సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం.మరోవైపు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయా లేదా అన్నదానిపై నిఘా పెట్టినట్టు తెలిసింది. జిల్లాలో మార్క్‌ఫెడ్ అధికారుల ప్రమేయం లేకుండా ఈ ఘటనలు జరగవని అంటున్నారు. రాష్ట్రస్థాయిలో ఎక్కడెక్కడ ఇలాంటి కమీషన్లు కాజేసిన ఘటనలు జరిగాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘టెండర్ దక్కకుంటే నీ అంతుచూస్తా’ ఇదిలాఉండగా, మార్క్‌ఫెడ్‌లో ఎరువుల రవాణాకు సంబంధించి హైదరాబాద్‌లో టెండర్‌ప్రక్రియ జరుగుతోంది. అందులో పలు ఏజెన్సీలు టెండర్లు వేశాయి. కొన్ని ఏజెన్సీలు టెండర్లలో సాంకేతికంగా అర్హత పొందాయి. అయితే అందులో ఒక ఏజెన్సీ నిర్వాహకుడు మార్క్‌ఫెడ్‌లోని ఒక అధికారికి ఫోన్ చేసి తనకు ఈ టెండర్ దక్కకుంటే ‘నీ అంతు చూస్తాన’ని ఫోన్లో బెదిరించినట్టు సమాచారం. దానికి మార్క్‌ఫెడ్‌లోనే పనిచేసే సహ అధికారే వెనుక నుంచి కథ నడిపిస్తున్నట్టు సమాచారం. ఆ అధికారే ఆ ఏజెన్సీ నిర్వాహకుడికి టెండర్ దక్కేలా పావులు కదుపుతున్నాడు. అతని ప్రోద్బలంతోనే ఇలా జరిగి ఉంటుందని చర్చ జరుగుతోంది. దీంతో బెదిరింపులకు గురైన అధికారికి ఏం చేయాలో పాలుపోవడంలేదు. -
అత్తామామల కళ్లెదుటే.. భార్యను సజీవదహనం చేసిన భర్త
ఓదెల(పెద్దపల్లి): అదనంగా రూ.5 లక్షల కట్నం తేవడం లేదనే ఆగ్రహంతో భర్త, బావ, తోటికోడలు, అత్తామామ కలిసి వివాహిత యాట లావణ్యపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసినట్లు నేరం రుజు వు కావడంతో పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా జడ్జి హేమంత్‌కుమార్ శనివారం తీర్పు వెలువరించారు. పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీ పీ గజ్జి కృష్ణ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గ్రామానికి చెందిన యాట కుమారస్వామి పెద్దకూతురు యాట లావణ్యను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలనూర్ గ్రామానికి చెందిన వీర్ల రవీందర్‌కు 2013లో ఇచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.10లక్షల కట్నం, పది తులాల బంగారు ఆభరణాలు, ఇతర లాంఛనాలు అప్పగించారు. మూడు నెలల తర్వాత అదన ంగా రూ.ఐదు లక్షల కట్నం కావాలని భర్త రవీందర్, అత్తామామలు రాజమ్మ, కొమురయ్య, బావ కు మారస్వామి, తోటికోడలు భారతి కలిసి లావణ్య ను మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభిమచారు. ఈక్రమంలో 2014 మే 16వ తేదీన లా వణ్యపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితురాలు తల్లితండ్రులతో కలిసి కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ చేశారు. లావణ్యను ఇకనుంచి బాగా చూసుకుంటామని చెప్పడంతో తల్లితండ్రులు ఆమెను అత్తగారింటికి పంపారు. కొద్దికాలం త ర్వాత తనకు విడాకులు కావాలని భర్త కోర్టుకు వె ళ్లాడు. ఈక్రమంలోనే 25 సెప్టెంబర్ 2014న అదనపు కట్నం తేవాలని ఐదుగురు కలిసి లావణ్యను కొట్టారు. ఈవిషయాన్ని బాధితురాలు ఫోన్ ద్వారా తన తల్లిదండ్రుకు చెప్పింది. వారు వెంటనే కొలనూరు గ్రామానికి చెరుకున్నారు. ఇక్కడుంటే లావణ్య ప్రాణానికి ముప్పు ఉంటుందని భావించి, త మతో రావాలని కూతురుకు తల్లిదండ్రులు సూచించారు. లావణ్య బట్టలు తీసుకుని వచ్చేందుకు ఇంట్లోకు వెళ్లగానే భర్త, అత్తామామ, బావ, తోటికోడలు కలిసి ఇంట్లోకి వెళ్లి లావణ్యపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. తల్లిదండ్రుల కళ్లెదుటే ఈ అఘాయిత్యం జరిగింది. అయితే, తీవ్రంగా గాయపడిన లావణ్యను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందు తూ 28 సెప్టెంబర్ 2014న మృతిచెందింది. మృతురాలి లావణ్య తండ్రి యాట కుమారస్వామి ఫిర్యా దు మేరకు అప్పటి ఏసీపీ వేణుగోపాల్‌రావు కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జిషీట్ దాహలు చేశా రు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతి, డీసీపీ చేతన, ఏసీ పీ కృష్ణ పర్యవేక్షణలో కోర్టులో సాక్షలను ప్రవేశ పె ట్టారు. నేరం రుజువు కావడంతో భర్త, అత్తామామ, బావ, తోటికోడలుకు పదేళ్ల కారగారా శిక్ష, ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పు మొత్తం రూ.30వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. సాక్షులను ప్రవేశపె ట్టడానికి సహకరించిన సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై అశోక్‌రెడ్డి, కానిస్టేబుల్ శ్రీని వాస్‌ను రాంగుండం సీపీ శ్రీనివాస్ అభినందించారు. -
అత్తారింటికి దారేది?
శంకరపట్నం (మానకొండూర్): పొరుగింటి వ్యక్తిని ప్రేమపెళ్లి చేసుకుందని ఆ తల్లిదండ్రులు తమ కూతురుపై కోపం పెంచుకున్నారు. దీంతో పొరుగింటికి దారి లేకుండా సీసీరోడ్డుపై ఇటుకలతో గోడకట్టారు. దీనిపై గ్రామ పెద్దలతో చెప్పించినా వారు వినకపోవడంతో కూతురు తన తల్లిదండ్రులపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే వాళ్లుసైతం తన సమస్యను పట్టించుకోవడం లేదని శుక్రవారం మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన మమత తమ పొరుగింటి వ్యక్తి అయిన కనకం రత్నాకర్‌ను 2023 ఫిబ్రవరి 16న ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్లి మమత కుటుంబానికి ఇష్టం లేదు. దీంతో మమత, రత్నాకర్ కేశవపట్నంలో అద్దెకుంటున్నారు. అక్కడే జిరాక్స్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా, రత్నాకర్ తల్లిదండ్రులు మాత్రం ఎరడపల్లిలోనే నివాసం ఉంటున్నారు. మమత తల్లి ఇంటి ఎదుట నుంచే రత్నాకర్ ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. రత్నాకర్ కుటుంబం ఆ దారిగుండా నడవకుండా మమత కుటుంబసభ్యులు ఆరు నెలల క్రితం రోడ్డుపై అడ్డంగా సిమెంట్ ఇటుకలతో గోడ కట్టారు. ఇప్పటి నుంచి దొడ్డిదారి గుండా నడుస్తున్నామని, తన అత్తారింటికి వెళ్లేందుకు దారి లేకుండా చేసి, ఇబ్బందులు పెడుతున్న తన తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని మమత నాలుగు రోజల క్రితం కేశవపట్నం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మమత కోరింది. -
చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: చంద్రబాబు నాయుడిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గనుక చంద్రబాబు గెలిస్తే తన శిష్యుడితో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తాడని అన్నారు. వినోద్ కుమార్ కరీంగనగర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడింది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైద్రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాడు. బీజేపీ ఆలోచనలు కూడా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్నట్టుగానే సాగుతున్నాయి. పార్లమెంట్లో గళం విప్పాలంటే నేను గెలువాలి. బండి సంజయ్ బీజేపీ కుర్చోమంటే కూర్చుంటూ.. లెమ్మంటే లేచే వ్యక్తి’ అని మండిపడ్డారు. -
ఆన్లైన్ గేమ్‌లు వద్దన్నా.. వినకపోవడంతో కొడుకును చంపేసిన తండ్రి
కొత్తపల్లి(కరీంనగర్): ఆన్లైన్ గేమ్‌లు వద్దన్నా విననందుకు.. కన్న కొడుకునే తండ్రి కడతేర్చిన దారుణ ఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో చోటుచేసుకుంది. చేతికొచి్చన ఒక్కగానొక్క కొడుకును తండ్రే పొట్టన పెట్టుకోవడంపై గ్రామస్తులు విస్మయానికి లోనయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన పెరుమాండ్ల జ్యోతి–శ్రీనివాస్‌కు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు పెళ్లి కాగా, కొడుకు పెరుమాండ్ల శివసాయి(21) హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో శుభకార్యం కోసం బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. కాగా, హైదరాబాద్ వెళ్లి ఆన్లైన్ గేమ్‌లు ఆడి డబ్బులు పోగొట్టొద్దని, ఇక్కడే ఉండాలంటూ తరచూ తండ్రీకొడుకుల మధ్య వాదనలు చోటు చేసుకుంటున్నాయి. ఈక్రమంలో భూమి అమ్మాలని శివసాయి ఒత్తిడి తెస్తుండటంతో ఆగ్రహానికి గురైన తండ్రి శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రిస్తున్న కొడుకు తలపై రోకలి బండతో మోది కారం చల్లాడు. తీవ్రగాయాలతో శివసాయి మంచంపైనే మృతిచెందగా తండ్రి కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతుడి తల్లి ఉపాధి పనులకు వెళ్లగా ఈ దారుణం జరిగింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బీఆర్ఎస్కు పెద్దిరెడ్డి రాజీనామా
హుజూరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రెండుసార్లు మంత్రిగా, కార్మిక సంఘ నేతగా సేవలందించిన ఇనుగాల పెద్దిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గురువారం లేఖ రాశారు. 2021 జూలై 27న తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో పెద్దిరెడ్డి బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ తనను పార్టీ పరిగణనలోకి తీసుకోకపోవడం, ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన కదనభేరి సభకు ఆహ్వానించనందుకు మనస్తాపంతో పార్టీకి రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులు, ప్రజాభీష్టం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పెద్దిరెడ్డి వెల్లడించారు. -
కరీంనగర్లో ప్రేమోన్మాది ఘాతుకం
కొత్తపల్లి(కరీంనగర్): ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడిచేసి పరారైన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి కట్టేమిషన్ ఏరియాలో గురువారం సాయంత్రం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన బొద్దుల సాయి, ఓ యువతి ఎదురెదురు ఇంట్లో ఉంటున్నారు. సాయి ఇసుక క్వారీలో ఉద్యోగం చేస్తుండగా ఎమ్మెస్సీ పూర్తిచేసిన యువతి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. ఆమెను నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాంటూ సాయి వేధిస్తున్నాడు. విషయం తెలిసిన పెద్దలు సాయిని మందలించారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. తర్వాత కొన్నిరోజులు బాగానే ఉన్న సాయి ఇటీవల మళ్లీ ఆ యువతిని వేధించడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానని యువతి తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపాడు. ఇంట్లోకి చొరబడి.. గురువారం యువతి తండ్రి ఆడెపు వీరేశం బట్ట లు అమ్మేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు వెళ్లాడు. తల్లి స్థానికంగా కిరాణాదుకాణంలో సరుకులు అమ్ముతోంది. ఇదే సమయంలో సాయి ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న యువతిపై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి పన్ను విరిగి చేతికి గాయమైంది. అంతటితో ఆగ కుండా కత్తితో గొంతుకోసే ప్రయత్నం చేశాడు. ఆమె కేక లు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకునేసరికి పరారయ్యాడు. వెంటనే స్థానికులు యువతిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి పరారైన యువకుడి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. -
రైతురాజ్యం తీసుకొస్తాం
కొత్తపల్లి (కరీంనగర్): రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని, తెలంగాణలో అధికారంలోకి రాగానే రైతురాజ్యం తీసుకొస్తామని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం వరికి రూ. 3,100 మద్దతు ధర చెల్లిస్తామని, ఎకరానికి రూ. 24 వేల సాయం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి (హెచ్)లో చేపట్టిన సభలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రెండు పంటలకు కలిపి రైతులకు ఏటా రూ. 12 వేలు ఇవ్వడంతోపాటు డీఏపీ, ఇతర ఎరువుల సబ్సిడీ పేరుతో ఎకరానికి రూ. 18 వేలు చెల్లిస్తోందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఎకరాకు రూ. 6 వేలను బ్యాంకులో జమ చేస్తోందని చెప్పారు. ఈ లెక్కన రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 24 వేలు సాయం చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం అన్ని సబ్సిడీలు బంద్ పెట్టి రైతుబంధు పేరుతో రూ. 10 వేలు మాత్రమే సాయం చేస్తోందని బండి సంజయ్ వివరించారు. పేదలకు ఇప్పటికే ఉచితంగా ‘ఉజ్వల’సిలిండర్లు ఇస్తున్నామని, బీజేపీ అధికారంలోకి రాగానే ఏటా ఉచితంగా 4 సిలిండర్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి గంగుల కమలాకర్ అధికారంలో ఉండి ఏమీ చేయలేక.. తనపై అవినీతి ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మంత్రి తెచ్చిన ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయని... ఇప్పటివరకు ఒక్క కంపెనీ కూడా ఆ భవనంలోకి రాలేదని, ఒక్కరికీ ఉద్యోగం దొరకలేదని బండి సంజయ్ ఆరోపించారు. గొల్లకుర్మలకు గొర్రెలు ఇస్తామని రూ. 46 వేలు డిపాజిట్ చేయించుకొని మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్దని ఆయన దుయ్యబట్టారు. రేషన్ మంత్రిగా ఉండి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, బీసీ మంత్రిగా ఉండి ఒక్కరికి బీసీ బంధు ఇవ్వలేదని ఆరోపించారు. పౌరసరఫరాలశాఖ మంత్రిగా రూ. 1,300 కోట్లను గోల్మాల్ చేశారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు భూకబ్జాదారులని, ఎవరి చరిత్ర ఏమిటో బేరీజు వేసుకొని ఓటేయాలని ప్రజలను సంజయ్ కోరారు. -
కరీంనగర్ ఎవరిది పవర్..?
ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజ ఈ ఎన్నికల్లో ఎటువైపు నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపు ఏకపక్షంగా నిలిచిన ఈ జిల్లాలో ఈసారి చాలా నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు, కొన్నిచోట్ల త్రిముఖ పోటీ నెలకొంది. క్షేత్రస్థాయిలో అధికార బీఆర్ఎస్కు కొంత అసంతృప్తి, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. అయితే ప్రచారపర్వం వేగం పుంజుకుంటే తమకే పరిస్థితి అంతా అనుకూలమవుతుందన్న ఆశాభావం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. గత ఎన్నికల్లో ఈ ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకేఒక్క సీటును గెలిచిన కాంగ్రెస్ ఈసారి కచ్చితంగా ‘గతం కంటే ఎక్కువ’ ఫలితం సాధించే పరిస్థితులున్నాయి. ఇక జిల్లాలో బీజేపీ ప్రదర్శన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఇక్కడి 13 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సీట్లు సాధించి బీఆర్ఎస్ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధిస్తుందా? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవం సాధిస్తుందా?.. బీజేపీ పుంజుకునేందుకు ఈ ఎన్నికలు దోహదపడతాయా? లేక రాజకీయ విశ్లేషణలు, అంచనాలకు అతీతంగా ‘హంగ్’ ఫలితం వచ్చేలా ప్రజలేమైనా తీర్పునివ్వబోతున్నారా అన్న వాదనల నడుమ ‘సాక్షి’ క్షేత్రస్థాయి రిపోర్ట్ ఇది.. పెద్దపల్లి అసంతృప్తి లొల్లి పెద్దపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లలో కొందరు మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్)కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో కాంగ్రెస్‌కు అనుకూలంగా పరిస్థితులు చక్కబడుతున్నాయని, ఈ ఎన్నికల్లో విజయరమణారావు గెలిచే అవకాశాలు మెరుగయ్యాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. బీజేపీ నుంచి కొత్త అభ్యర్థిగా బరిలో దిగిన డి.ప్రదీప్‌రావు తన బలాన్ని కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. బీఎస్పీ నుంచి పోటీచేస్తున్న మహిళా అభ్యర్థి మహిళా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. మంథని గెలుపుపై మథనం ఇక్కడ శ్రీధర్‌బాబు (కాంగ్రెస్), పుట్ట మధు (బీఆర్ఎస్) మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నా శ్రీధర్‌కు ఒకింత మొగ్గు కనిపిస్తోందని అంటున్నారు. శ్రీధర్‌కు వ్యక్తిగత ఇమేజ్ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుండగా, అందరితో కలవకపోవడం, కొంత అహం ప్రదర్శించడం వంటివి ప్రతికూలంగా మారొచ్చునంటున్నారు. పుట్ట మధు సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ, స్థానికంగా అందుబాటులో ఉండడం, పోటీలో ఒక్కడే బీసీ అభ్యర్థి కావడంతో పరిస్థితులు అనుకూలించవచ్చనే చర్చ సాగుతోంది. బీజేపీ నుంచి చందుపట్ల సునీల్‌రెడ్డి పోటీలో ఉన్నారు. చొప్పదండి (ఎస్సీ) ఎవరికో ఓట్లు దండి! నియోజకవర్గ అభివృద్ధిలో రవిశంకర్ (బీఆర్ఎస్) వెనుకబ డ్డారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. 2014లో అప్పటి ఎమ్మెల్యే శోభ తీసుకొచ్చిన నిధులు, అభివృద్ధి పనులతోనే ఆయన నెట్టుకొస్తున్నారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత సత్యం (కాంగ్రెస్)కు సానుకూలంగా మారొచ్చునంటున్నారు. గత ఎన్నికల్లో బీ జేపీ తరఫునే పోటీచేసిన శోభకు డిపాజిట్ కూడా దక్కలేదు. ఈసారి పోటీలో ఉన్న ఆమె ఏ మేరకు సానుకూలత సాధిస్తారనేది చూడాల్సి ఉంటుందంటున్నారు. ఈ నియోజకవర్గంలో 1999 నుంచి చూస్తే.. ఎవరూ రెండోసారి ఎన్నికైంది లేదు. జగిత్యాల త్రిముఖ పోటీతో గజిబిజి ఎమ్మెల్యే సంజయ్ (బీఆర్ఎస్), జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. కంటి డాక్టర్‌గా సంజయ్‌కు మంచి పేరే ఉన్నా, ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తే ప్రతికూలంగా మారొచ్చునంటున్నారు. ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డికి ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నందున ఆయనను తప్పక గెలిపించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో కొందరున్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీలో ఉన్న డాక్టర్ భోగ శ్రావణి బీసీ పద్మశాలి. ఇక్కడ ఈ వర్గం ఓట్లు ఎక్కువున్నాయి. ఆమెకు ఈ ఓట్లు అధికంగా పడితే ఊహించని ఫలితం రావొచ్చునంటున్నారు. హుస్నాబాద్ ఏ పార్టీకి జిందాబాద్? ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావంతో వి.సతీశ్‌కుమార్ (బీ ఆర్ఎస్)కు ప్రతికూల పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కొంత సానుకూలత పెరగడంతో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు విజయావకాశాలు మెరుగయ్యాయని అంటున్నారు. గౌడ, ఇతర వర్గాలు ఎక్కువగా ఉండడం బీసీ ఓటింగ్ కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే అవకాశాలున్నా య ని చెబుతున్నారు. 2009లో గెలిచిన ప్రవీణ్‌రెడ్డికి ఈసారి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ప్రవీణ్ నుంచి ప్రభాకర్‌కు పూర్తి సహకారం అందితే గెలుపునకు ఢోకా ఉండదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. బీజేపీ టికెట్‌పై బొమ్మ శ్రీరాంచక్రవర్తి పోటీ చేస్తున్నారు. ధర్మపురి (ఎస్సీ) గెలుపు కోసం హోరాహోరీ వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)పై సౌమ్యుడు అనే ముద్ర ఉన్నా.. సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుండడంతో పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రభావం చూపే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దళితబంధు, బీసీబంధు వంటివి సరిగా అమలుకాకపోవడం, మంత్రితో సన్నిహితంగా ఉండే ద్వితీయశ్రేణి నాయకులు, అనుయాయుల వైఖరి, వారిపై ఆరోపణలు ప్రతికూలంగా మారతాయని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ పుంజుకునే అవకాశముందని, వరుసగా మూడు, నాలుగుసార్లు ఓడడంతో లక్ష్మణ్‌కుమార్‌పై సానుభూతి పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్‌కు వనరుల కొరత ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. పోటీకి దరఖాస్తు చేసుకోకపోయినా చివరి నిముషంలో అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఉన్నంతలో పార్టీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కోరుట్ల ఏ ఓటు మొగ్గు ఎట్లా? ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్ బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. గతంలో విద్యాసాగర్‌రావుపై పోటీచేసిన నర్సింగరావు (కాంగ్రెస్) ఈసారీ పోటీలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (బీజేపీ) కూడా బరిలో నిలవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. విద్యాసాగర్‌రావు గతంలో చేసిన అభివృద్ధి ఆయన కుమారుడు సంజయ్ గెలుపునకు దోహద పడొచ్చునని చెబుతున్నారు. ముస్లిం ఓట్లు చీలి కాంగ్రెస్, బీ ఆర్ఎస్కు పడే అవకాశాలున్నాయని అంటున్నారు. పూర్తిగా మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గితే ఫలితం మరోలా ఉండొచ్చునంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులిద్దరూ వెలమ సామాజికవర్గానికి చెందడంతో, మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన అర్వింద్‌కి బీసీ ఓటింగ్ ఉపయోగపడితే కొంత మార్పు రావొచ్చునని చెబుతున్నారు. సిరిసిల్ల నల్లేరుపై నడకేనా! నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసినందున ఇక్కడ కేటీఆర్ (బీఆర్ఎస్) గెలుపు దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. నియోజకవర్గంలో కేటీఆర్ తరచూ పర్యటిస్తున్నా ఎక్కువగా సామాన్య ప్రజలను కలుసుకునే అవకాశం లేకుండా ద్వితీయశ్రేణి నాయకులు అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఐదేళ్లలో ఇక్కడున్న 114 గ్రామాల్లో మూడోవంతు కూడా ఆయన పర్యటించ లేదని అంటున్నారు. గతంలోనూ కేటీఆర్‌తో పోటీ చేసి ఓడిన మహేందర్‌రెడ్డి (కాంగ్రెస్) ఈ ఎన్నికల్లో గట్టి పోటీనే ఇస్తారనే చెబుతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ స్థానికేతురాలు కావడంతో అంతగా ప్రభావం చూపించకపోవచ్చని అంచనా. బీఎస్పీ చీల్చే ఓట్లతో ఎవరికి నష్టం ? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ) పోటీలో ఉంది. వీటిలో పెద్దపల్లి, వేములవాడ, రామగుండం, హుజూరాబాద్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయిలో గణనీయమైన ఓట్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఓట్లను చీల్చడం ద్వారా ఇక్కడ ఫలితాన్ని వీరు ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. రామగుండం గండం దాటేదెవరు? ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్‌పై గెలిచిన కోరుకంటి చందర్ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి పోటీలో ఉన్న ఈయనపై అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత, ఆరోపణలు ప్రతికూల ప్రభావం చూపొచ్చని అంటున్నారు. నాలుగుసార్లు పోటీచేసి ఓడిపోయారనే సానుభూతి రాజ్‌ఠాకూర్ (కాంగ్రెస్)కు అనుకూలంగా మారొచ్చునంటున్నారు. కాంగ్రెస్ వేవ్ పనిచేస్తే గెలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. బీజేపీ తరఫున పోటీలో ఉన్న సంధ్యారాణి.. గతంలో బీఆర్ఎస్లో ఉన్నందున ఓటింగ్‌పై కొంత ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మానకొండూరు (ఎస్సీ) గెలిచేదెవరు? ఇక్కడ కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నట్టు ప్రచా రం జరుగుతోంది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగభృతి, డబు ల్ బెడ్రూం ఇళ్ల హామీని నామ్‌కే వాస్తే అమలు చేయడం, దళితబంధు, బీసీబంధు సరిగ్గా అమలుకాకపోవడం వంటి సమస్యలను ప్రస్తావిస్తున్నారు. రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న రసమయి (బీఆర్ఎస్)పై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. సత్యనారాయణ (కాంగ్రెస్) గతంలో పీఆర్పీ, టీడీపీ నుంచి మొత్తంగా మూ డుసార్లు పోటీ చేసి ఓడారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆరేపల్లి మోహన్‌కు మంచిపేరే ఉన్నా.. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి.. ఇప్పుడు బీజేపీలో చేరి పోటీలో నిలిచారు. వేములవాడ ఎవరికో ‘రాజన్న’ అండ! సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం కేసు కారణంగా ఈసారి బీఆర్ఎస్ టికెట్ లభించలేదు. గతంలో రమేశ్‌పై నాలుగుసార్లు పోటీచేసి ఓటమి పాలైన మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నా రు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు చెల్మడ లక్ష్మీ నరసింహారావు (బీఆర్ఎస్), మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు కు మారుడు వికాస్‌రావు (బీజేపీ) ఇక్కడ పోటీలో ఉన్నారు. బీసీ–కురుమ సామాజికవర్గానికి చెందిన తుల ఉమ (ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్)పేరును బీజేపీ ప్రకటించీ.. బీఫామ్ ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ సొంతగూడు బీఆర్ఎస్కు చేరుకున్నా రు. గతంలో నాలుగుసార్లు ఓడారనే సానుభూతి పనిచేస్తే ఆది శ్రీనివాస్ గెలిచే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈసారి ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. కరీంనగర్ పోటీ బరాబర్ కరీంనగర్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించి, మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలతో, ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరొందిన కమలాకర్, బీజేపీ ఎంపీగా, పార్టీ జాతీయ ప్ర ధానకార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. మంత్రి అనుయా యులు, ద్వితీయ శ్రేణి నాయకుల పనితీరు, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల మధ్య, వరుసగా నాలుగోసారి కమలాకర్ విజయం సాధిస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది. ఇటీవల సంజయ్ క్రమంగా పుంజుకుంటున్నారనే వాద న వినిపిస్తోంది. బీసీ సీఎం నినాదం, త్వరలోనే ఇక్కడ జరగబోయే మోదీ సభ, తదితరాలు ఆయనకు కలిసొచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ముస్లిం ఓటింగ్ గణనీయంగా ఉన్నందున ఆ ఓట్లు కాంగ్రెస్‌కు పడితే పరిస్థితిలో మార్పు వచ్చి సంజయ్‌కు అనుకూలంగా మారొచ్చునంటున్నారు. కాంగ్రెస్ నుంచి పురుమల్ల శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ‘అభివృద్ధి’కే నా తొలి ఓటు.. అభివృద్ధి చేసే వారికి నా మొదటి ఓటు. రైతులతో పాటు నిరుద్యోగులకు అండగా ఉండే పార్టీకి ఓట్లేసి గెలిపించుకుంటాం. యువత ఓటింగ్‌తో రాష్ట్రంలో, దేశంలో మా ర్పు రావాలి. డబ్బుకు మద్యానికి లొంగకుండా నిజాయితీగా ఓటు వేస్తాం. – మీస మౌనిక, తిమ్మాపూర్, మానకొండూరు అందరికీ న్యాయమేది? ప్రస్తుత ప్రభుత్వంలో పలు లోటుపాట్లున్నా యి. తెలంగాణ సాధించుకున్నా..అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నారు. కేవలం రైతుల సంక్షేమమే కాదు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. – పెద్ది మహేశ్వర్‌రెడ్డి, జగిత్యాల రైతులు హ్యాపీ కేసీఆర్ పాలన బాగుంది. నాకు రైతుబంధు తో పాటు, మా అమ్మకు వృద్ధాప్య పింఛన్ సకాలంలో వస్తోంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా రైతులకు మేలు చేయలే దు. ప్రస్తుత పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. –పెట్టం సాంబయ్య, మాణిక్యపూర్, హుస్నాబాద్ -ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కె.రాహుల్ -
సంక్షేమం కావాలా..? సంక్షోభం కావాలా?
హుజూరాబాద్: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. సంక్షోభం సృష్టించే పార్టీలు కావాలో ప్రజలే ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాందీచౌక్ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్వేలన్నీ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి గెలుస్తారని చెబుతున్నాయని అన్నారు. ఇక హుజూరాబాద్‌లో జీ హుజూర్ రాజకీయాలు నడవయని పేర్కొన్నారు. గత ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఈటల రాజేందర్ ఎన్నో మాయమాటలు చెప్పారని, దళితబంధు రాదని ఒక అపనమ్మకాన్ని సృష్టించారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌లో 100 శాతం దళితబంధు అమలుచేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్రానికి ఒరిగేదేంలేదన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు నెలకు రూ.3 వేలు, అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామని చెప్పారు. గ్యాస్ సిలిండర్‌ను రూ.400కు అందిస్తామని వివరించారు. కౌశిక్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తనదే అని మంత్రి హామీ ఇచ్చారు. ఈటల మాటలు వింటే పదేళ్లు వెనక్కి హుజూరాబాద్ ప్రజలు ఈటల మాటలు వింటే అభివృద్ధిలో పదేళ్లు వెనకబడిపోతారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. గెలిచాక హుజూరాబాద్‌ను విడిచిపెట్టి వెళ్లారని విమర్శించారు. ఈసారి హుజూరాబాద్, గజ్వేల్‌లో ఈటల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఢిల్లీ నాయకులను హుజూరాబాద్‌కు తీసుకొస్తున్న ఈటల.. వారితో ఈ నియోజకవర్గానికి ఒరిగే ప్రయోజనం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే ఉప్పల్ రైల్వే ఓవర్‌బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరూ ఒకేసారి శాసనసభ పక్ష నేతలుగా...
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చెన్నమనేని రాజేశ్వర్‌రావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావులు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వారిద్దరూ ఉమ్మడి శాసనసభలో కరీంనగర్ జిల్లాలో వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికవ్వడం, భిన్న ధ్రువాలు, విభిన్న సిద్ధాంతాలతో సీపీఐ, బీజేపీల నుంచి ప్రాతినిథ్యం వహించడం, శాసనసభలో సభాపక్ష నేతలుగా ఉండటం ఎప్పటికీ ఓ రికార్డే. ♦ చెన్నమనేని రాజేశ్వర్‌రావు 1957లో చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిరిసిల్ల నియోజక వర్గం నుంచి 1967, 1978, 1985, 1994 ఎన్నికల్లో సీపీఐ నుంచి, 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ♦ ఆయన సోదరుడైన చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1985,1989,1994 ఎన్నికల్లో బీజేపీ నుంచి మెట్పల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కరీంనగర్ ఎంపీగా 1998, 1999 ఎన్నికల్లో రెండుమార్లు ఎంపికై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆనంతరం మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ♦ 1994 నుంచి 1999 మధ్యకాలంలో ఉమ్మడి శాసనసభలో బీజేపీ శాసనసభ పక్షనేతగా సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీపీఐ శాసనసభ పక్షనేతగా సీహెచ్ రాజేశ్వర్‌రావు ఉన్నారు. అసెంబ్లీలో కాషాయదళపతిగా విద్యాసాగర్‌రావు, ఎరుపుదళానికి నాయకుడిగా రాజేశ్వర్‌రావు తమ పార్టీల వాణిని ఆయా సందర్భాల్లో బలంగా వినిపించారు. ఒకరి విధానాలను మరొకరు ఖండించి ఎండగట్టారు. ఎదుట నిలుచుంది సోదర బంధం, రక్త సంబంధమైనా విధానాలపరంగా ఒకరినొకరు విరుద్ధ వేదికలపై నిలిచారు. విధానాలపరంగా పరస్పరం ఎదుటి పార్టీలో ఉన్న సోదరుడిని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు ఏనాడూ వెనకడుగు వేయని అరుదైన సందర్భాలు వీరిద్దరి హయాంలో అనేకమున్నాయ. -
కలెక్టర్ ఇంట్లో చోరీ.. ల్యాప్ టాప్ మాయం
సాక్షి, కరీంనగర్: బదిలీపై మరోచోటికి వెళ్లేందుకు సామాన్లు సర్దుకున్న కలెక్టర్ ఇంట్లో చోరీ జరిగింది. ఎన్నికల వేళ బదిలీ అయి అసలే టెన్షన్ లో ఉన్న కరీంనగర్ కలెక్టర్ గోపీ ఇంట్లో దొంగలు పడ్డారు. ల్యాప్ టాప్ తో పాటు కలెక్టర్ కు చెందిన పలు డాక్యుమెంట్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సీసీ టీపీ ఫుటేజ్ లో బయటపడింది. ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్లో భాగంగా కరీంనగర్ కలెక్టర్ గోపీ బదిలీ అయిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన హైదరాబాద్ లో రిపోర్ట్ చేయాలి. దీని కోసం తన సామాన్లన్నింటిని రెడీ చేసుకుని ఆయన హాయిగా బెడ్ రూమ్ లో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి టైమ్ లో దొంగలు వెనుకవైపు గోడ నుంచి కలెక్టర్ బంగ్లా లోపలికి ఎంటర్ అయ్యారు. ఇంట్లో ముందు రూమ్ లో ఉంచిన కలెక్టర్ ల్యాప్ టాప్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్న బ్యాగు, మరికొన్ని వస్తువులు దొంగిలించారు. దొంగలే వస్తువులు చోరీ చేసినట్టు సీసీ టీవీలో రికార్ట్ అయింది. ఇరవై నాలుగు గంటలు పోలీసు పహారాలో ఉండే కలెక్టర్ బంగ్లాలో దొంగలు పడడం సంచలనంగా మారింది. చోరీపై కలెక్టర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
TS Election 2023: జగిత్యాల రాజకీయం.. ఎంతో ప్రత్యేకం!
సాక్షి, జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గం 1957లో ఆవిర్భవించింది. చారిత్రకంగా, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత డివిజన్ కేంద్రం కాస్తా 2014లో జిల్లా కేంద్రంగా మారడంతో జగిత్యాల రూపురేఖలు మారిపోయాయి. ఇక్కడ సుమారు రూ.26 కోట్లతో సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మించారు. ఎస్పీ కార్యాలయం, వైద్య, నర్సింగ్, వ్యవసాయ కళాశాలలు, మాతాశిశు సంరక్షణ, డయాగ్రోస్టిక్ కేంద్రాలు, 50 బెడ్లతో క్రిటికల్ కేర్ యూనిట్, న్యాక్ సెంటర్ ఏర్పాటయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి 330 బెడ్స్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. జగిత్యాల మున్సిపాలిటీతోపాటు, జగిత్యాల అర్బన్, రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాలున్నాయి. ఉమ్మడి జిల్లాలోనే గుర్తింపు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీయే ఎక్కువగా తొమ్మిదిసార్లు విజయం సాధించింది. 1983లో ఎన్టీ రామారావు టీడీపీని ప్రారంభించగా ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆ పార్టీ తరఫున పోటీ చేసి, గెలిచారు. కానీ, ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోవడంతో 1985లో బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు తెలుగుదేశం తరఫున ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ రాజేశంగౌడ్ గెలుపొందారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి, 1989లో విజయం సాధించారు. జీవన్ రెడ్డి గెలుపునకు బ్రేక్ వేసిన రమణ జీవన్‌రెడ్డి గెలుపునకు ఎల్.రమణ బ్రేక్ వేశారు. 1994లో అనూహ్యంగా తెలుగుదేశం టికెట్ దక్కడంతో జీవన్‌రెడ్డిని ఓడించారు. దీంతో రమణకు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి పదవి సైతం దక్కింది. కానీ, సంవత్సరానికే ఎంపీ ఎన్నికలు రావడంతో కరీంనగర్ నుంచి పోటీ చేసి, చొక్కారావును ఓడించి జాయింట్ కిల్లర్‌గా పేరుగాంచారు. 1996లో జరిగిన బై ఎలక్షన్లో జీవన్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వం టీడీపీ ఉంటే జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే మరో పార్టీకి చెందినవారు ఉండేవారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎమ్మెల్యేగా ఎల్.రమణ, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా జీవన్‌రెడ్డి కొనసాగారు. 2014లో బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్‌కుమార్ పోటీ చేసినప్పటికీ జీవన్‌రెడ్డినే ప్రజలు గెలిపించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా 60 వేల మెజారిటీతో డాక్టర్ సంజయ్‌కుమార్ గెలుపొందారు. ఎన్టీఆర్, వైఎస్సార్ మంత్రివర్గాల్లో చోటు.. జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత జీవన్‌రెడ్డికే దక్కింది. అలాగే మొదటిసారి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ఎకై ్సజ్ శాఖ మంత్రిగా, అనంతరం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా అవకాశాలు దక్కాయి. అలాగే, టీడీపీ నుంచి మొదటిసారి గెలిచిన ఎల్.రమణ చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చేనేత, జౌళిశాఖ మంత్రిగా, ఖాదీబోర్డు చైర్మన్‌గానూ పని చేశారు. మొదటిసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సంజయ్‌కుమార్ ఓటమిపాలవగా, రెండోసారి అత్యధిక మెజారిటీతో జీవన్‌రెడ్డిపై గెలుపొందారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపుపై ధీమాగా ఉండి, ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గ ఓటర్ల వివరాలు.. పురుషులు: 1,09,300 మహిళలు: 1,17,315 ట్రాన్స్జెండర్లు : 20 మొత్తం : 2,26,635 పలు హామీలు పెండింగ్.. జగిత్యాల నియోజకవర్గం వ్యవసాయాధారిత ప్రాంతం. రైతులు ఎక్కువగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలు పండిస్తుంటారు. ఎస్సారెస్పీ ప్రధాన నీటి వనరు. ఉద్యానవన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని నాయకులు చెబుతున్నా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. అలాగే, జగిత్యాలలో యావర్ రోడ్ విస్తరణ పెండింగ్ ఉంది. ఇటీవలే ప్రభుత్వం అనుమతించడంతో కదలిక వచ్చి, మార్కింగ్ చేశారు. నియోజకవర్గంలో మామిడి ఉత్పత్తి కూడా ఎక్కువే. మామిడి మార్కెట్ సైతం ఉంది. ఇక్కడి నుంచి విదేశాలకు మామిడికాయలను ఎగుమతి చేస్తున్నారు. ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేస్తే మామిడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నాయకులు ఏటా హామీ ఇస్తున్నా అమలులో సాధ్యం కావడం లేదు. రాయికల్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఇక్కడ డిగ్రీ కళాశాల, ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే, సారంగాపూర్‌లో రూ.135 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తయింది. -
ఇద్దరూ కరీంనగర్ బిడ్డలే
సాక్షి, కరీంనగర్ డెస్క్: రాజకీయ ఉద్ధండులు పీవీ నరసింహారావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావు కరీంనగర్ జిల్లా నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఈ ప్రాంతంలోనే పుట్టి, ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ఒకరు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఏకంగా దేశానికే ప్రధానమంత్రి అయ్యారు. మరొకరు గవర్నర్‌గా పనిచేశారు. మంథని నుంచి పీవీ.. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నరసింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. మెట్పల్లి నుంచి విద్యాసాగర్‌రావు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామానికి చెందిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఏబీవీపీలో చురుకుగా పనిచేశారు. 1983లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1985లో మెట్పల్లి నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా బరిలోకిదిగి విజయం సాధించారు. 1989, 1994 సంవత్సరాల్లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1998లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ మరోమారు గెలుపొందారు. ఆ సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో హోం, వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో మహారాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. -
ఈ కొండ గట్టెక్కిస్తుందని..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముడుపు కట్టి మొక్కడం తెలుగు ప్రజల సంప్రదాయం. అందులోనూ ఏదైనా మంచిపని చేసేముందు.. కొత్త వాహనం కొన్న తర్వాత పూజలు చేయించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల) కొండగట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయానికి తెలుగువారే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. ముఖ్యంగా తెలుగు రాజకీయ నేతలు ఇక్కడ పూజలు నిర్వహించి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలోనూ సీఎం కేసీఆర్ ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్రం సిద్దిస్తే.. కొండగట్టుకు వచ్చి మొక్కు తీరుస్తానని ఆయన ఉద్యమ సమయంలో అంజన్నకు మొక్కుకున్నారు. ఇటీవల జగిత్యాల పర్యటన సందర్భంగా అంజన్నకు తన మొక్కు చెల్లించుకున్నారు. కొండగట్టు అంటే సీఎం కేసీఆర్‌కు మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే ఇక్కడికి కుటుంబంతో వచ్చేవారు. ఎమ్మెల్సీ కవిత కూడా బాల్యం నుంచే కొండగట్టుకు వచ్చేవారు. ఎంపీ అయిన తర్వాత కూడా పలుమార్లు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. 2019లో ఎంపీగా గెలవకముందు సంజయ్ కూడా అంజన్నకు ముడుపు కట్టారు. ఆ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన సంజయ్, కొండగట్టులో మొక్కు చెల్లించుకున్నారు. ఈనెల 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కరీంనగర్ మీదుగా బోధన్ వెళ్లే దారిలో కొండగట్టును దర్శించుకోనున్నారు. రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాయుపుత్రుని దీవెనలు ఉండాలని కాంగ్రెస నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి కొండగట్టు పూజలు షెడ్యూలులో లేనప్పటికీ, రాహుల్‌గాం«దీని కొండగట్టు వద్ద ఆపి, పూజలు చేయించేలా ప్రణాళిక రచిస్తున్నారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలకు పూజలు కూడా చేయించనున్నారు. -
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
-
రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేసిన ఎలుగు బంటి
-
ఆపరేషన్‌కు డబ్బులు లేక ఇబ్బంది.. ఆదుకున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ
ప్రమాదంతో మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఆపరేషన్‌కు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆర్థిక సహాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన గండికోట శ్రీనివాస్ గతేడాది ప్రమాదంలో గాయపడి కుడి చేతిని కోల్పోవడంతో పాటు కుడికాలికి అయిన గాయాలతో మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే శస్త్రచికిత్సకు కావల్సిన ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నాడని ఓ మిత్రుని ద్వారా తెలుసుకున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ(సింగపూర్) మానవతా దృక్పథంతో డబ్బు సహాయం అందించారు. ఇటీవలె శ్రీనివాస్ తండ్రి మరణించడంతో పాటు, అతని తల్లి కూడా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారన్న విషయం తెలిసి తెలంగాణ కల్చరల్ సొసైటి ఇచ్చిన పిలుపు మేరకు కొందరు సభ్యులు, దాతలు ముందుకు వచ్చి రెండు లక్షల ఎనభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. సొసైటీ అధ్యక్షుడు గడప రమేశ్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి సహా మిగతా సభ్యులు శ్రీనివాస్ కుటుంబంతో వీడియో కాల్లో మాట్లాడి పరామర్శించారు. ఈ సందర్భంగా క్లిష్ట పరిస్థితుల్లో తనకు సహాయం అందించిన సొసైటీ సభ్యులకు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశాడు. -
రైతులేమైనా బిక్షగాళ్లా..?
శంకరపట్నం (మానకొండూర్)/రామడుగు(చొప్పదండి): భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్ట్ గండిని పరిశీలించారు. గండి పడటానికి దారితీసిన కారణాలను డీఈ కవితను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ.3వేల కోట్ల సాయం చేసిందన్నారు. అయితే అందులో సగం నిధులను దారిమళ్లించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30 వేల ఎకరాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. రోడ్లు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, 50 ఏళ్లనాటి కల్వల ప్రాజెక్ట్‌కు గండిపడితే అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించలేదని మండిపడ్డారు. ‘రైతు లేమైనా భిక్షగాళ్లు అనుకుంటున్నవా? ప్రతీసారి చేయిచాచి సాయం చేయాలని అడుక్కోవాలా? వారిని ఆదుకోని ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత’అని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కాగా, ఆగ మేఘాలపై ఆర్టీసీ బిల్లును పంపి గవర్నర్ సంతకం చేయలేదంటే ఎలా? ఆ బిల్లులో ఏమైనా లోపాలు ఉన్నాయా? న్యాయపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలన చేయకుండానే సంతకం పెట్టమంటే ఎలా? అని సంజయ్ ప్రశ్నించారు. నివేదికలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం.. భారీవర్షాలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఆస్తి నష్టాలు తెలుసుకునేందుకు కేంద్రబృందం పరిశీలనకు వస్తే ప్రభుత్వం నివేదికలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని బండి సంజయ్ విమర్శించారు. -
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ
-
కరీంనగరా మజాకా! ఇక్కడ పార్టీలతో పనిలేదు.. కాపు వర్సెస్ వెలమ, తగ్గేదేలే
రాజకీయాలు సహజంగా పార్టీల వారీగా నడుస్తుంటాయి. కాని తెలంగాణలో ఒక జిల్లాలో పార్టీల కంటే సామాజిక వర్గాలకే ప్రాధాన్యత కనిపిస్తుంది. అక్కడ పార్టీలు ఒక భాగమైతే.. సామాజికవర్గాలు మరో భాగంగా ఉన్నాయి. పార్టీ ఏదైనా ఒక ప్రధాన సామాజికవర్గం నేతలు అన్ని పార్టీల్లోని తమవారు గెలవాలని కోరుకుంటారు. ఎవరిని ఎలా గెలిపించాలా? ప్రత్యర్థి సామాజికవర్గాన్ని ఎలా దెబ్బ తీయాలా అని ప్లాన్స్ వేస్తుంటారు. ఇంతకీ ఆ జిల్లా ఎక్కడుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆది నుంచీ వెలమ సామాజికవర్గం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఓటింగ్ పరంగా అధికంగా ఉన్న మున్నూరు కాపు వర్గం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ మరోసారి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీగా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి హాజరవుతూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. రాబోయే ఎన్నికల కోసం అందరి కంటే ముందుగానే సిద్దమవుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే వినోద్‌కు దెబ్బ పడిందో ఈసారి కూడా అవే నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుందనే ప్రచారం మొదలైంది. ఇందుకోసం సామాజిక వర్గ లెక్కలు వేస్తున్నారు స్థానిక నాయకులు. బోయినపల్లి వినోద్‌కు దక్కుతున్న ప్రాధాన్యాన్ని భరించలేకే మున్నూరు కాపు వర్గానికి చెందిన కొందరు నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా మున్నూరు కాపు వర్సెస్ వెలమ సామాజికవర్గం మధ్య గ్యాప్ కొనసాగుతోంది. గతంలో వెలమ సామాజికవర్గం వారే కరీంనగర్ అసెంబ్లీ సీటుకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ హ్యాట్రిక్ సాధించడంతో.. వెలమ సామాజికవర్గానికి స్కోప్ లేకుండా పోయింది. ఈ క్రమంలో.. పార్లమెంట్ సెగ్మెంట్ లో వినోద్ తో పాటు.. కరీంనగర్ అసెంబ్లీలోనూ ఆ సామాజికవర్గాలకు సందు ఇవ్వొద్దనే రీతిలో మరి కొన్ని సామాజికవర్గాలు.. ఏకంగా పార్టీలకతీతంగా కంకణం కట్టుకోవడం.. కరీంనగర్ లో కనిపించే విభిన్న రాజకీయ తంత్రం. రాజకీయాలంటేనే వ్యూహ, ప్రతివ్యూహాలుగా భావించే రోజుల్లో.. నేతల స్వయంకృతాపరాధాలు కూడా ప్రత్యర్థి పార్టీలకు..అలాగే సొంత పార్టీలోని ప్రత్యర్థులకూ అడ్వాంటేజ్ గా మారుతాయి. గత పార్లమెంట్ ఎన్నికలే అందుకు నిదర్శనం. కరీంనగర్‌కు ఎన్నో పనులు చేసినా తనను ఓడించారని మాజీ ఎంపీ వినోద్ భావిస్తుండగా... ఎన్ని చేశామన్నది కాదు..ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకుని వాటిని చేశారా అని పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కామెంట్ చేశారు. చదవండి: మాటిస్తున్నా మహేంద్రా!.. వచ్చేది మనమే.. అటుఇటు వెళ్లి ఆగం కావొద్దు పైగా ప్రస్తుతం అధికారంలో లేనప్పుడే వినోద్ శైలి డామినేటింగ్ గా ఉందని ఫీలవుతున్న కొందరు కీలక ప్రజాప్రతినిధులు.. మరోసారి ఎంపీగా గెలిస్తే.. ఇక తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తమకు ప్రాధాన్యత లేకుండా పోతుందనే భావన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. కరీంనగర్ రాజకీయాల్లో ఒక పార్టీవారంతా ఒకే తాటిపైన ఉన్నారనుకుంటే పొరపాటే. ఒక సామాజికవర్గం వారైతే మాత్రం కచ్చితంగా ఒక్క తాటిపైనే ఉన్నట్టు సామాజిక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీది పై చేయి అనేకంటే.. ఏ సామాజికవర్గానిది పైచేయి అవుతుందని మాట్లాడుకోవాల్సిన భిన్నమైన పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తోంది. -
‘బండి సంజయ్ పాదయాత్రకు కేసీఆరే స్పాన్సర్’
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పాన్సర్ అంటూ ధ్వజమెత్తారు. చిన్న చిన్న విషయాలకు బండిని అరెస్ట్ చేసి కేసీఆరే హైప్ చేశారని విమర్శించారు. అదే సమయంలో లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయకుండా వదిలేయడం వెనుక ఆంతర్యం ఏమిటో బండి సంజయ్ చెప్పాలన్నారు. బండి సంజయ్ కి బుద్ధి ఉందా ..? .ఓసారి హాస్పిటల్లో చూపించుకోవాలి. కాంగ్రెస్‌కు అభ్యర్థులను ప్రకటించేది కేసీఆర్ అని సంజయ్ ఎలా మాట్లాడతారు..?, కరీంనగర్లో గంగుల కమలాకర్ బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటే. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఈటెలతో మాత్రం బండి మాట్లాడరు. కరీంనగర్ అభివృద్ధి విషయంలో జర్నలిస్టులు, బార్ అసోసియేషన్‌తో పాటు ఐదు సంఘాల పెద్ద మనుషులను జడ్జిలుగా ఉంచి చర్చిద్దాం. అందుకు ప్రస్తుత ఎంపీ సంజయ్, మాజీ ఎంపీ వినోద్ సిద్దమేనా..? ’ అంటూ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. -
రాజన్న సిరిసిల్లా: వేణుగోపాస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి (ఫొటోలు)
-
కరీంనగర్ జిల్లా వేగురుపల్లి ప్రభుత్వ స్కూలు ముందు తల్లిదండ్రుల ధర్నా
-
గుడ్‌న్యూస్..! కరీంనగర్–హసన్‌పర్తి రైల్వేలైన్‌కు కేంద్రం సుముఖం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త మోసుకొచ్చింది. చాలాకాలంగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న కరీంనగర్–హసన్‌పర్తి రైల్వేలైన్ సర్వేకు కేంద్ర రైల్వే బోర్డు ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.1.54 కోట్లు కూడా విడుదల చేసింది. దీంతో ఆగిపోయిందనుకున్న ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కనుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే కనెక్టివిటీ పరంగా మిగిలిన జిల్లాలతో పోలిస్తే వెనకబడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఈ ప్రాజెక్టు అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 21న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర రైల్వేబోర్డు సర్వేకు ఆమోదం తెలుపుతూ మే 8వ తేదీన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ప్రధాని పీవీ హయాంలో కదలిక వాస్తవానికి కరీంనగర్– ఖాజీపేట రైల్వేలైన్ ఇప్పటిది కాదు. 1976లోనే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. కానీ, సర్వే, అంచనా వ్యయం తదితర విషయాల్లో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు. ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు స్వీకరించాక 1994లో ఈ ప్రాజెక్టు తిరిగి తెరమీదకు వచ్చింది. గతంలో ఈ ప్రాజెక్టును కరీంనగర్–ఖాజీపేటగా పిలిచేవారు. వాస్తవానికి కరీంనగర్‌కు భౌగోళికంగా దారితీసే హసన్‌పర్తి రోడ్ స్టేషన్ నుంచి హుజూరాబాద్ మీదుగా మానకొండూరు తరువాత కరీంనగర్– పెద్దపల్లి రైల్వేలైన్ మీదుగా కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు చేరాలి. కరీంనగర్–హసనపర్తిల మధ్య రైల్వేలైన్ దూరం 45 కి.మీ మాత్రమే అని గతంలో అధికారులు తెలిపారు. తాజాగా ఈ కేంద్రం జారీ చేసిన ఫైనల్ లోకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)లో మాత్రం దీని దూరాన్ని 61.8 కిమీగా పేర్కొనడం విశేషం. కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి 2013లోనే సర్వే చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ అలసత్వంతో రైల్వేలైన్ నిర్మాణంలో పురోగతి లేకుండా పోయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యుల్ లోని ఐటం నంబర్–11 ప్రకారం కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ నిర్మాణం చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం. – ఎంపీ బండి సంజయ్ కనెక్టివిటీ ఇలా.. ► కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ అందుబాటులోకి వస్తే.. పాత వరంగల్– కరీంనగర్ జిల్లాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ– పశ్చిమ భారతదేశానికి ఈ రైల్వేలైన్ ఒక సంధానసేతువుగా నిలుస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర వెళ్తున్న కరీంనగర్, వరంగల్ ప్రజలకు దాదాపు 200 కి.మీ చుట్టూ తిరిగి వెళ్లాల్సిన ప్రయాణభారం తప్పుతుంది. ► ఈ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల ప్రజలు మహారాష్ట్రలోని ముంబై, గుజరాత్‌లోని అహ్మదాబాద్ వంటి ఇతర నగరాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలోని షిరిడీ, ఔరంగాబాద్, గుజరాత్‌లోని పలు పుణ్యక్షేత్రాలను కలిపేలైన్ కావడంతో పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుంది. ► ఇప్పటికీ వరంగల్ నుంచి నిజామాబాద్ రైలు ప్రయాణం సాకారం కాలేదు. కానీ, నిజామాబాద్–కరీంనగర్–పెద్దపల్లి రైల్వేలైన్ పూర్తి కావడంతో కరీంనగర్ వరకు రైల్వేలైన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు కేవలం హసన్‌పర్తి నుంచి కరీంనగర్ వరకు లైన్ వేస్తే నిజామాబాద్–వరంగల్ మధ్య ప్రయాణం సాకారమవుతుంది. ► ఇక వరంగల్–కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు ముంబై వెళ్లాలంటే ప్రస్తుతం మహరాష్ట్రలోని చంద్రాపూర్ మీదుగా దాదాపు 200 కి.మీ దూరం తిరిగి వెళ్లాలి. ఈ లైన్ పూర్తయితే.. ఆ ప్రయాణభారం తగ్గుతుంది. ► ప్రస్తుతం కరీంనగర్ ప్రజలు హైదరాబాద్ వెళ్లాలంటే కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ పూర్తయితే నేరుగా ఖాజీపేటకు లైన్ అందుబాటులోకి వస్తుంది. దీంతో కరీంనగర్ వాసులకు సికింద్రాబాద్‌కు వేగంగా రైల్లో ప్రయాణం చేసే వీలు దక్కుతుంది. గతంలో ప్రతిపాదన రద్దు వాస్తవానికి 2013 వరకు ఈ ప్రాజెక్టు అడపాదడపా తెరమీదకు రావడం ఆ తరువాత కనుమరుగవడం పరిపాటుగా మారింది. ఈ క్రమంలోనే కరీంనగర్– ఖాజీపేట రైల్వేలైన్ సర్వే జరిగింది. అప్పట్లో దాదాపు రూ.1.20 కోట్లు వెచ్చించి సర్వే చేసిన అధికారులు దాదాపు రూ.800 కోట్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును చేపట్టడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఈ ప్రాజెక్టు రద్దు అప్పట్లో కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల మంటలు పెట్టింది కూడా. తాజాగా రైల్వే బోర్డు మరోసారి సర్వే చేసేందుకు ముందుకు రావడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కరీంనగర్ జిల్లా మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం
-
ఏ హైదరాబాద్‌కే పోకుండా.. గీ గోదావరిఖనిల తీసుడు ఎందుకే బావా?
‘సిన్మా తీయాలంటే ఏ హైదరాబాద్‌కే పోకుండా.. గీ గోదావరిఖనిల తీసుడు ఎందుకే బావా?..’.. ‘ఏతులు గొట్టకుండా సింగిల్ లైన్లో ఒక్కటి చెప్పన్నారా? గోదావరి ఖనిల సిన్మా తియ్యాల్నంటే 100 దళపతులు, 100 రక్తచరిత్రలు తీయొచ్చు..’ .. ఇటీవల గోదావరిఖని నేపథ్యంలో వచ్చింన ‘కొత్త సినిమా’ చిత్రం ట్రైలర్‌లోని సంభాషణలివి.. ఇవి కేవలం సినిమాలో డైలాగులు మాత్రమే కాదు. జరుగుతున్న వాస్తవం కూడా. ఒకప్పుడు కేవలం బొగ్గు వెలికితీతకు కేంద్రంగా మాత్రమే సింగరేణి పారిశ్రామిక ప్రాంతానికి గుర్తింపు ఉండేది. అడపాదడపా సినిమాల షూటింగులు జరిగినా.. కార్మిక హక్కుల కోసం తీసిన సినిమాల్లో ఒకట్రెండు సన్నివేశాలనే చిత్రీకరించారు. కాలక్రమంలో పరిస్థితి మారింది. నాలుగేళ్ల కింద గనుల నేపథ్యంలో విడుదలైన ‘కేజీఎఫ్’ సినిమా మంచి జనాదరణ దక్కించుకుంది. ఓపెన్ మైన్లలో పోరాట సన్నివేశాలు ఆ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. అలాంటి సన్నివేశాలు, పోరాట దృశ్యాలు ఉండాలని కొందరు సినీహీరోలు, దర్శకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గనులకు నిలయమైన గోదావరిఖనికి ఆదరణ పెరిగింది. ఎన్నో ప్రత్యేకతలతో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) గోదావరి లోయను ఆనుకుని సింగరేణి పారిశ్రామిక ప్రాంతం ఉంది. విశాలమైన గోదావరి నది, దాని లోయను ఆనుకుని ఏర్పడిన సింగరేణి గనులు, ఎన్టీపీసీ, బొగ్గురవాణా కోసం ఏర్పాటైన ప్రత్యేక రైల్వే లైన్లు, రైల్వే బ్రిడ్జీలు, కన్వేయర్ బెల్టులు, 40 నుంచి 50 అడుగుల ఎత్తయిన భారీ డంపర్లు, క్రేన్లు ఇలా భారీ యంత్రాలు, హంగామా వంటివి ఇక్కడ కనిపిస్తాయి. రెండు రకాల గనులతో.. ఇక్కడి గనుల్లో రెండు రకాలు ఉంటాయి. బొగ్గు నిక్షేపాలను గుర్తించిన కొత్తలో ఏటవాలుగా క్రమపద్ధతిలో లోపలికి తవ్వి బొగ్గు తీస్తే అది భూగర్భ మైనింగ్. నిల్వలు చివరిదశకు వచ్చాక పేలుళ్లతో మిగతా బొగ్గును వెలికితీసి, భారీ యంత్రాలతో తరలిస్తే ఓపెన్‌కాస్ట్ (ఉపరితల మైనింగ్). ఇవి వందల మీటర్ల లోతు వరకు ఉంటాయి. బొగ్గు కోసం నిత్యం జరిపే పేలుళ్లతో బొగ్గు పెళ్లలు వందల అడుగులు పైకెగిరి పడుతూ ఉంటాయి. ఆ బొగ్గును తరలించేందుకు భారీ క్రేన్లు, డంపర్లు ఉంటాయి. బయటి ప్రాంతాల వారికి ఇదంతా కొత్త ప్రపంచం. కేజీఎఫ్ సినిమా కూడా ఇలాంటి ఓపెన్ కాస్ట్ ఇనుప ఖనిజం గనుల్లో తీసిందే కావడం గమనార్హం. మెల్లగా పెరుగుతున్నషూటింగ్లు.. భారీ యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో సింగరేణి ఓపెన్ కాస్టుల్లో షూటింగులు పెరుగుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ చిత్రంలోని పలు యాక్షన్ సన్నివేశాలను ఇటీవలే సెంటినరీ కాలనీ సమీపంలోని ఓపెన్‌కాస్టుల్లో షూట్ చేశారు. నాని నటించిన ‘దసరా’ సినిమా పూర్తిగా గోదావరిఖని పట్టణానికి ఆనుకుని ఉన్న ‘వీర్లపల్లె’ నేపథ్యంగా వచ్చింనదే. ఆ చిత్రాన్ని కూడా ఓపెన్‌కాస్టు గనుల్లోనే చిత్రీకరించారు. ఇక జాతిరత్నాలు సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు అనుదీప్ తొలిచిత్రం ‘పిట్టగోడ’ కూడా గోదావరిఖని నేపథ్యంలో తీసినదే. ఇక ఇటీవల విడుదలైన క్రైం థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు కూడా మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ‘సిరోంచ’ పేరుతో తీసిన సినిమాను నేరుగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఆ సినిమా నచ్చింనవారు దర్శకుడికి ఇప్పటికీ డబ్బులు పంపుతున్నారు. ఇవే కాకుండా ‘కొత్త సినిమా’ పేరుతో ఒక చిత్రం, మరికొన్ని సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకొంటున్నాయి. గతంలో ఆర్.నారాయణమూర్తి చీకటిసూర్యులు, రానా నటించిన లీడర్ వంటి సినిమాల్లోని పలు సీన్లను ఈ ప్రాంతంలోనే చిత్రీకరించారు. సినిమా షూటింగ్‌లకు అనుకూలం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం సినిమా షూటింగ్‌లకు ఎంతగానో అనుకూలం. సలార్ సినిమా షూటింగ్ ఓసీపీ–2లో రెండువారాల పాటు సాగింది. భూగర్భగనులు, ఓసీపీలు, ఓబీ ప్రాంతాల్లో షూటింగ్‌లు చేయవచ్చు. సినిమాలతోపాటు టెలిఫిల్్మలు, చిన్న సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది. – కె.నారాయణ, ఆర్జీ–1 గని జనరల్ మేనేజర్ -
నేడు కరీంనగర్లో కాంగ్రెస్ భారీ సభ
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ కేంద్రంగా గురువారం కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా తొలిదశలో మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి యాత్రలు పూర్తయిన సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నారు. సభకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్‌భగేల్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు హాజరు కానున్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించే ఈ సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు టీపీసీసీ వర్గాలు వెల్లడించారు. -
బావిలో పడిపోయి.. మృత్యువుతో పోరాడి
మానకొండూర్: మతిస్థిమితం లేక నడుస్తూ అదుపుతప్పి బావిలో పడిపోయిన ఒక వృద్ధురాలిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ సంజీవ్‌నగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మండల కేంద్రానికి చెందిన ఉండింటి మధునమ్మ (80)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఆమె.. మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో నిద్రలేచింది. అలాగే నడుస్తూ సమీపంలోని చేదబావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. బావిలోని బోర్‌మోటార్ పైపును పట్టుకొని అలాగే ఉండిపోయింది. ఉదయం 4.30 గంటల సమయంలో నిద్ర లేచిన ఓ మహిళకు బావిలోంచి వృద్ధురాలి అరుపులు వినిపించడంతో ఆమె సమీపంలోని వారికి చెప్పింది. వెంటనే స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. మధునమ్మ కుమారుడు రవి అందించిన సమాచారంతో మానకొండూర్ అగ్నిమాపక శాఖాధికారి భూదయ్య, లీడింగ్ ఫైర్‌మన్ ధర్మ్, ఫైర్‌మన్ పి.సంతోష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. లీడింగ్ ఫైర్‌మన్ ధర్మ్ చేదబావిలోకి దిగి వృద్ధురాలిని ఉదయం 6.30 గంటల సమయంలో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు మూడు గంటలపాటు చేదబావిలో ఉన్న వృద్ధురాలు ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన బుధవారానికి వాయిదా..!
సాక్షి, హైదరాబాద్/కొండగట్టు: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుధవారం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. దేవస్థానాన్ని రూ. 100 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక అభివద్ధి నిధి కింద గత వారమే ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ నిధులతో ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై ప్రత్యక్షంగా దేవాలయ ప్రాంతాన్ని పరిశీలించడంతోపాటు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మంగళవారం ఆయన ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉన్నా ఆ రోజు భక్తులు అధిక సంఖ్యలో ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి వస్తారని.. తన పర్యటన వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో సీఎం ఆలయ సందర్శనను ఒకరోజు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. యాదాద్రి ఆలయ అభివృద్ధి్ధ తరహాలోనే కొండగట్టును అభివృద్ధి చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. యాదాద్రి దేవస్థాన పునర్నిర్మాణానికి ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించిన ఆనంద్‌సాయికి ఈ దేవాలయ అభివృద్ధి నమూనాల రూపకల్పన, వాటి అమలును పర్యవేక్షించే బాధ్యత అప్పగించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి వెంట ఆనందసాయి కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. దేవాలయంలో భక్తులకు వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై సీఎం దృష్టిసారించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్ సోమవారం కొండగట్టును సందర్శించారు. సీఎం పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో 14న సాయంత్రం 4 గంటల నుంచి 15న మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
తాండ్రియాల ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం
-
కేసీఆర్ పాలన అరిష్టం
హుజూరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలన రాష్ట్రానికే అరిష్టమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజూరాబాద్ అన్నింటిలో ఆదర్శంగా నిలుస్తోందని, రేపటి తెలంగాణకు తొలికేక అని, బీజేపీ గెలుపులో ఇక్కడి నాయకులే పునాదిగా నిలిచారని తెలి పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని మధువని గార్డెన్స్‌లో శనివారం పార్టీ బూత్ సభ్యుల సమ్మేళనంలో మాట్లాడారు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించారన్న అక్కసుతో సీఎం కేసీఆర్ మానేరు నదిని చెరపట్టి ఇసుక తవ్వి...ఎడారి చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా టెంటు వేసి కొట్లాడుదామన్నారు. ధరణితో నష్టపోయిన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని, వారి తరఫున పోరాడుదామని తెలిపారు. -
Pakhal Tirumal Reddy: వేయి రేఖల వినూత్న సౌందర్యం
పీటీ రెడ్డిగా విఖ్యాతులైన పాకాల తిరుమల రెడ్డి (1915– 1996) ప్రపంచ స్థాయికి చెందిన తెలంగాణ కళాకారుల్లో అగ్రగణ్యుడు. కరీంనగర్ జిల్లా, అన్నవరం గ్రామంలో 1915 జనవరి 4వ తేదీన జన్మించారు. ప్రాథమిక విద్య చదివే రోజుల్లో ఆయన్ని ప్రోత్సహించింది ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సత్తార్ సుభాని. తన బంధువును కలిసేందుకు ఒక రోజు రెడ్డి హాస్టల్‌కు వెళ్లాడు పీటీ. ఆ రోజు స్కౌట్స్ డే. ముఖ్య అతిథి బాడెన్ పావెల్. బాడెన్ రూపానికి 17 ఏండ్ల పీటీ కాంతి వేగంతో ప్రాణం పోస్తున్నారు. అది గమనించిన కొత్వాల్ పీటీని పిలిపించుకొని తన పెయింటింగ్ వేస్తావా అని అడిగారు! మిడాస్ టచ్!! రెడ్డి హాస్టల్ నిబంధలను సవరించి ప్రతిభావంతులైన కళాకారులకూ స్కాలర్షిప్ ఇవ్వవచ్చని పీటీని ‘సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్’లో చేర్పించారు కొత్వాల్. ముంబైలోని ఆ వినూత్న ప్రపంచంలో సూజా, కేకే హెబ్బార్, ఎమ్ఎఫ్ హుస్సేన్ తదితరులు సహ విద్యార్థులు. తన 22వ ఏట చిత్రించిన సెల్ఫ్ పోర్ట్రెయిట్ అంతర్ వ్యక్తినీ చూపిందని అధ్యాపకులు మెచ్చుకున్నారు. జేజేలో 1935 నుంచి 42 వరకు చిత్రకళను అభ్యసించి డిప్లొమా పొందారు, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ర్యాంక్‌తో! దేశ విభజన సందర్భంలో హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ మాండలికాన్ని తన రచనలలో శాశ్వతం చేసిన యశోదా రెడ్డిని వివాహం చేసుకున్నారు. కార్పెంటరీ ఇండస్ట్రీ నెలకొల్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ హుందాతనాన్ని తెలిపే ఫర్నిచర్ పీటీ రెడ్డి సమకూర్చిందే. శిల్పీ, దారుశిల్పీ; ఆయిల్, వాటర్ కలరిస్ట్ అయిన పీటీ కళా ప్రపంచానికి కానుకగా ఏమి ఇచ్చారు? ఒక్క మాటలో భారతీయ సాంస్కృతిక తాత్విక సౌందర్య భరిత వేయి దళాల పరిమళ భరిత పుష్పం! మన జ్ఞాపకాల పొరల్లో మసకబారిన ఆ కళారూపాలు చూడవచ్చా? ‘స్వధర్మ’లో మూడు అంతస్తులలోని ప్రత్యేక గ్యాలరీలలో పీటీ రెడ్డి కళా రూపాలు కొలువై ఉన్నాయి. వారి కుమార్తె లక్ష్మీ రెడ్డి దంపతులు ఎంతో శ్రద్ధగా కాపాడుతున్నారు. చిరునామా సులభం. నారాయణగూడ మెట్రో పిల్లర్ 1155. కళాకారులు, చరిత్రకారులు అపా యింట్మెంట్ తీసుకుని సందర్శించవచ్చు. (క్లిక్ చేయండి: అతడి మరణం ఓ విషాదం!) - పున్నా కృష్ణమూర్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ (జనవరి 4న పీటీ రెడ్డి జయంతి) -
‘గంగాధర’ మరణాల మిస్టరీ.. ఆ చావులు హత్యలేనా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఇటీవల కలకలం రేపిన అనుమానాస్పద మరణాల మిస్టరీ త్వరలోనే వీడనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేముల శ్రీకాంత్ శనివారం మరణించడంతో అసలేం జరుగుతోందన్న గందరగోళం నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శ్రీకాంత్ విషం తీసుకున్నాక వాంతులయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు విషయం తెలియకుండా వైద్యం చేయడం కష్టమని తేల్చిచెప్పారు. దీంతో తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నానని వెల్లడించాడు. వెంటనే వారు చికిత్స ప్రారంభించినా శ్రీకాంత్‌ను కాపాడలేకపోయారు. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారి ఎస్సై రాజు కూడా ధ్రువీకరించారు. శ్రీకాంత్ భార్యా పిల్లలు కూడా ఇదే లక్షణాలతో మరణించారు. ముగ్గురు కూడా రక్తపు వాంతులు, విరేచనాలతో మరణించడంతో వారి శరీరంలోనూ ఇదే విషం కలిసిందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. శ్రీకాంత్ ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో పీజీ చేశాడు. కరీంనగర్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ఫుడ్ సైన్స్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. రసాయనాల గుణగణాలపై పూర్తి అవగాహన ఉండటంతో తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ.. అతనికి ఇది ఎక్కడ నుంచి వచ్చింది? అన్న ప్రశ్నకు ఇంకా సమాధానాలు దొరకాల్సి ఉంది. విద్యార్థులకు ప్రయోగాలు చేయించే ల్యాబ్ నుంచి తీసుకువచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 33 రోజుల్లో ముగ్గురి ఆకస్మిక మరణాలు..! తొలుత కుమారుడు అద్వైత్ (20నెలలు) బా బు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యాడు. తొలుత కరీంనగర్‌కు, ఆ తరువాత హైదరాబాద్ తరలించి చికిత్స అందించినా బాబు ప్రాణాలు నిలవలేదు. చివరికి నవంబరు 16న అద్వైత్ కన్నుమూశాడు. అద్వైత్ మరణించాక నవంబరు 29న అవే లక్షణాలతో కూతురు అమూల్య (6) అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ.. డిసెంబరు 1న ప్రాణాలు విడిచింది. ఈ రెండు మరణాలకు వైద్యులు కారణాలు చెప్పలేకపోయారు. ఈ మరణాలపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కుటుంబానికి చేతబడి చేశారని కొందరు, అంతుచిక్కని వ్యాధి వచ్చిందని రకరకాలుగా చెప్పుకున్నారు. తన పేగు తెంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డలు రెండువారాల వ్యవధిలో దూరమై తల్లడిల్లుతున్న శ్రీకాంత్ భార్య మమత (26) కూడా డిసెంబరు 15న ఆసక్మికంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ.. డిసెంబరు 18న మరణించింది. దీంతో మమత కుటుంబ సభ్యుల్లో అనుమానాలు మొదలయ్యాయి. కేవలం 33 రోజుల్లో ఒకే కుటుంబంలో మూడు మరణాలు సంభవించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. తమ మనవలు, కూతురు అనుమానాస్పద మరణాల వెనక అల్లుడి పాత్ర ఉందని మమత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీకాంత్ ఇంటి సమీపంలోని బావి నీళ్లను, బంధువుల రక్త నమూనాలను పరీక్షిస్తే వాటిలో ఏమీ తేలలేదు. పోలీసుల వినతి మేరకు మమత పోస్టుమార్టం సమయంలో వైద్యులు విస్రా (శరీరంలోని కీలక అంతర్భాగాలు)ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ వివరాలు వచ్చేందుకు దాదాపు నెలరోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దర్యాప్తు వేగవంతం చేశారు. శ్రీకాంత్ పనిచేస్తున్న కాలేజీకి వెళ్లారు. అతని ప్రవర్తన గురించి స్నేహితులను ఆరా తీశారు. ఇదే క్రమంలో ఆకస్మికంగా డిసెంబరు 30 అర్ధరాత్రి శ్రీకాంత్ విషం తీసుకున్నాడు. ఆసుపత్రిలో తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నానని వైద్యులతో చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో 31 తెల్లవారుజామున చికిత్స పొందుతూ మరణించాడు. అత్తామామ ఆరోపిస్తున్నట్లుగా శ్రీకాంత్ తన భార్యాపిల్లలను ఎందుకు చంపాల్సి వచ్చింది? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆస్తి గొడవలు, వరకట్నం, వివాహేతర సంబంధం కారణాలు అయి ఉ ంటాయా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతో ంది. ప్రస్తుతం పోలీసుల దృష్టి అంతా అసలు శ్రీకాంత్‌కు సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎప్పుడు ఇంటికి తె చ్చాడు? అన్న విషయాలపైనే కేంద్రీకతమైంది. ల్యాబ్ నుంచి తెచ్చాడా? బయట కొనుగోలు చేశాడా..? అన్న విషయాలు పోలీసులు తెలుసుకోగలిగితే.. అంతుచిక్కని మరణాల మిస్టరీ వీడినట్లే. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకువచ్చిన తేదీకి ముందు వెనకా జరిగిన మరణాలను పోల్చి చూస్తే శ్రీకాంత్ పాత్ర తేటతెల్లమవుతుందని ఓ సీనియర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డాడు. ఫోరెన్సిక్ రిపోర్టు రావాల్సి ఉంది: ఎస్సై రాజు వేముల శ్రీకాంత్ కుటుంబం విషయంలో ప్రస్తుతం దర్యాప్తు నడుస్తోంది. శ్రీకాంత్ ఆసుపత్రిలో వైద్యులకు తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నానని వెల్లడించాడు. పిల్లల ఆకస్మిక మరణాల తరువాత, శ్రీకాంత్ భార్య మమత కూడా మరణించడంతో ఆమె తల్లిదండ్రులు శ్రీకాంత్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో మమత పోస్టుమార్టం సమయంలో విస్రా (శరీర అంతర్భాగాలు)ను ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) హైదరాబాద్ పంపాం. ఆ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఏంటి సోడియం హైడ్రాక్సైడ్? స్కూళ్లు, కాలేజీల్లో రసాయన ప్రయోగాలు చేసేందుకు సోడియం హైడ్రాక్సైడ్ (ఎన్‌ఏఓహెచ్)ను వాడుతారు. దీన్ని కాస్టిక్ సోడా అని కూడా పిలుస్తారు. మామూలుగా ఇండ్లలో జామైన సింకులు, పైపులైన్లు క్లియర్ చేసేందుకు వాడుతుంటారు. స్పటికాల రూపంలో కర్పూరాన్ని తలపించేలా ఉంటుంది. ఇది మనుషులకు చాలా ప్రమాదకరమైన రసాయన సమ్మేళనం. పొరపాటున చేతులపై పడినా.. చర్మం పగిలి రక్తస్రావం జరుగుతుంది. ఇది నీటిలో సులువుగా కరుగుతుంది. కనీసం 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం మనిషి శరీరంలోకి వెళితే.. వెంటనే అది జీర్ణాశయం, కిడ్నీలు, కాలేయం, రక్తం ద్వారా ఊపిరితిత్తులు, మెదడుకు చేరిపోతుంది. శరీర అంతర్భాగాల ఉపరితాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది. అందుకే.. శ్రీకాంత్ కుటుంబంలోని నలుగురు రక్తపు వాంతులు, విరేచనాలు చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీకాంత్ విద్యార్హతలు, ప్రస్తుతం చేస్తున్న పని, అన్నీ వెరసి అతని భార్య మమత, కూతురు అమూల్య, కుమారుడు అద్వైత్ మరణాలు ఒకే విధానంలో సంభవించడంతో అందరి చావుకు ఇదే రసాయనం కారణమన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. అత్తింటి వేధింపులే కారణం..!? మరోవైపు వేముల శ్రీకాంత్ ఆత్మహత్యకు అతని అత్తింటి వేధింపులే కారణమని శ్రీకాంత్ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. మమత మరణానంతరం వివాహం సమయంలో ఇచ్చిన కట్నం ఇవ్వాలని వేధించారని, అతను పనిచేసే కాలేజీకి వెళ్లి నానా యాగీ చేశారని ఆరోపించారు. మరోవైపు ఈ విషయంలో రాజకీయ నేతల వద్ద పంచాయితీ పెట్టడంతో శ్రీకాంత్ మనస్తాపంతోనే విషం తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు. -
నింగికెగిసిన సాహిత్య శిఖరం
కరీంనగర్ కల్చరల్/సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి (86) కన్నుమూశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒకటిన్నర సమయంలో శ్రీపురంకాలనీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో 1936 మార్చి 10న నరసింహాచార్యులు, గోపమాంబ దంపతులకు జన్మించిన విజయసారథి చిన్నప్పటి నుంచే పద్య రచన చేశారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఉర్దూ మాధ్యమంలోనే అయినప్పటికీ సంస్కృత పండితుడిగా రాణించారు. భాష్యం విజయసారథి పాండిత్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి 25న పద్మశ్రీ అవార్డు ప్రకటించగా 2021 నవంబర్ 8న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. మందాకిని కావ్యంతో ‘మహాకవి’గా గుర్తింపు: ఏడు సంవత్సరాల వయసునుంచే విజయసారథి సంస్కృతం నేర్చుకున్నారు. విజయ సారథికి మహాకవిగా గుర్తింపు తెచ్చిన కావ్యం మందాకిని. మందాకిని రచనను ఆయన కేవలం 48 గంటల్లోనే పూర్తి చేశారు. 150కిపైగా గ్రంథాలను భిన్నమైన సంస్కృత ప్రక్రియల్లో ఆయన రచించారు. తెలంగాణ ప్రభుత్వం ‘విశిష్ట సాహిత్య పురస్కారం’, తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యా లయం అందించే మహామహోపాధ్యాయ పురస్కారం, బిర్లా ఫాండేషన్ వాచస్పతి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలను ఆయన అందుకున్నారు. సీఎం కేసీఆర్ సంతాపం సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. శ్రీభాష్యం సాహితీ సేవలను సీఎం స్మరించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా శ్రీభాష్యం మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
పత్తి @ రూ.9,150..
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవ సాయ పత్తి మార్కెట్లో తెల్ల బంగారం మెరిసింది. పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అంతర్జా తీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరుగుతుండటంతో సోమవారం రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి రూ.9,150 పలికింది. మార్కెట్‌కు 115 వాహనాల్లో 997 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకురాగా.. గరిష్ట ధర రూ.9,150, మోడల్ ధర రూ.9,000, కనిష్ట ధర రూ.8,000 పలికింది. గన్నీ సంచుల్లో 60 మంది రైతులు 107 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకురాగా క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.8,800, మోడల్ ధర రూ.8,500, కనిష్ట ధర రూ.6,000తో ఖరీదు చేశారు. -
యువజన సంఘాల మహాధర్నా ఉద్రిక్తం
గన్నేరువరం (మానకొండూర్)/తిమ్మాపూర్: డబుల్ రోడ్డు నిర్మాణం కోసం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఆదివారం యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. గుండ్లపల్లి నుంచి వయా గన్నేరువరం మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం యువజన సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. పోలీసులు గుండ్లపల్లికి చేరుకోవడంతో ఆందోళనకారులు రూటు మార్చి గుండ్లపల్లి దాబా వద్ద రాజీవ్ రహదారిపై ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని కోరినా.. ఆందోళనకారులు పట్టించుకోకపోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. యువజన సంఘాల నాయకుడు అల్లూరి శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ విషయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విఫలమయ్యారని విమర్శించారు. అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే రసమయి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసమర్థత ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నించారు. అదే సమయంలో కరీంనగర్ నుంచి బెజ్జంకి వైపు వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంపై ఆందోళనకారులు చెప్పులు విసురుతూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం కవ్వంపల్లి, శ్రీనాథ్‌రెడ్డి, యువజన సంఘాల సభ్యులను అదుపులోకి తీసుకుని తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శంకర్, అనంతరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మెర రవీందర్‌రెడ్డి, బామండ్ల రవీందర్, నాయకులు పాల్గొన్నారు. ఎల్ఎండీ ఠాణాను ముట్టడించిన టీఆర్ఎస్ రసమయి బాలకిషన్‌పై దాడికి నిరసనగా టీఆర్ఎస్ నాయకులు భారీగా ఎల్ఎండీ ఠాణాకు చేరుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను కఠినంగా శిక్షించాలని స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న సీపీ, పోలీస్ అధికారులు టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడి ఆందోళన విరమించాలని సూచించారు. గన్నేరువరంలో తనపై జరిగిన దాడి గురించి గన్నేరువరం జెడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి.. రసమయి బాలకిషన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలి: రసమయి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హెచ్చరించారు. వాహనంపై దాడి అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర్నా అంటే దాడులు చేయడమేనా? అని ప్రశ్నించారు. 40 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, 8 ఏళ్ల పాలనలో బీజేపీ ఏం చేసిందని నిలదీశారు. డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ప్రధాని మోదీ ఉమ్మడి జిల్లాకు వచ్చిన సమయంలో రహదారులకు నిధులు ఎందుకు అడగలేదని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. -
ఎమ్మెల్యే బాలకిషన్ కాన్వాయ్ అడ్డగింత
గన్నేరువరం: నూతనంగా ఏర్పడిన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం అభివృద్ధిలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్‌ని శనివారం స్థానిక యువకులు అడ్డగించారు. గన్నేరువరం నుంచి మాదాపూర్ గ్రామానికి వెళ్లే సమయంలో మండల కేంద్రంలో అడ్డుకున్నారు. ప్రధాన రహదారి గుండ్లపల్లి నుంచి మండల కేంద్రం వరకు రోడ్డు అధ్వానంగా ఉందని, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అంబులెన్స్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ..రహ దారి విస్తరణ చేపడతామని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పోలీసుల జోక్యంతో ఎమ్మెల్యే కాన్వాయ్ ముందుకు కదిలింది. కాగా, ఘటనకు సంబంధించి నాగ రాజు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వదిలిపెట్టారు. -
వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
పెద్దపల్లి రూరల్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలి స్తున్న 4 లారీలను పెద్దపల్లి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్, పౌరసరఫరాల అధికారులు శనివారం పట్టు కున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల నుంచి నాలుగు లారీల బియ్యాన్ని పెద్దపల్లికి అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు చేశారు. ఒక్కో లారీలో 270 క్వింటాళ్ల చొప్పున మొత్తం నాలుగు లారీల్లో 1,080 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. నాలుగు లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్ తెలిపారు. పట్టుబడ్డ లారీలను పెద్దపల్లిలోని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. తప్పించేందుకు యత్నం: పెద్దపల్లి మండలం రంగాపూర్ గోదాములకు ఎలాంటి వేబిల్లులు లేకుండా వచ్చిన బియ్యం లారీలను అధికారులు పట్టుకోగా.. కేసు నమోదు చేయకుండా తప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. అధికారులపై ఒత్తిళ్లు రావడంతో బోగస్ వేబిల్లులను సృష్టించి వాటి ఆధారంగా లారీలను వదిలేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అక్కడకు వెళ్లిన మీడియాకు.. బియ్యం అక్రమం కాదని కొందరు చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతోంది. టాస్క్‌ఫోర్స్ అధికారుల ఎంట్రీతో..: టాస్క్‌ఫోర్స్, రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల రాకతో కథ అడ్డం తిరిగింది. లారీలకు సంబంధించి బోగస్ వేబిల్లులను అధికారులకు చూపించగా.. లారీల వెంట లేని వేబిల్లులు ఇప్పుడెలా వచ్చాయన్న అధికారుల ప్రశ్నకు సమాధానం రాలేదు. దీంతోవారు లారీల డ్రైవర్ల గురించి ఆరా తీశారు. అప్పటివరకు అక్కడే ఉన్న డ్రైవర్లు, వాటి సంబంధిత వ్యక్తులు టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల రాకతో కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో వేబిల్లులు బోగస్‌వని, లారీల్లో ఉన్నవి రేషన్ బియ్యమేనని తేలడంతో నాలుగు లారీలను సీజ్ చేశారు. -
కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు
కరీంనగర్: జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆయా పార్టీల నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పట్టు సాధించే ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నారు. అభివృద్ధి, పథకాల పేరుతో టీఆర్ఎస్ హడావిడి చేస్తుండగా, పాదయాత్ర కార్యక్రమంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తోంది. ప్రధాని మోదీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. వామపక్షాలు ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తున్నాయి. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతుడటంతో ఆయా పార్టీల నేతలు పల్లెబాటతో పాటు శుభ, అశుభ కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మూడుచోట్ల అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, హుజూరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో టీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోకి వెళ్తుండగా, ప్రజా సమస్యలపై నిరసనలతో విపక్షాలు హోరెత్తిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు రాకపోయినా ఇదే వాతావరణం సాధారణ ఎన్నికలు జరిగే వరకు ఉండే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. బీజేపీలో ఉత్సాహం కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ ఊరూరా సంబరాలు నిర్వహించింది. నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో సమావేశాలకు ప్రణాళిక రూపొందించి రాష్ట్రస్థాయి నాయకులను ఆహ్వానించారు. మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని, ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ ధర్నాలు, నిరసనలతో ప్రజల్లోకి వెళ్లింది. ప్రస్తుతం కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో నాయకులు ఉన్నారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో అల్లర్లు జరుగుతున్నాయనే కారణంతో పాదయాత్రను అడ్డుకొని కరీంనగర్‌కు తీసుకరావడంతో రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలపై సంజయ్ ఇంట్లో నిరసన దీక్షకు దిగడంతో బీజేపీ కేంద్ర, రాష్ట్ర నేతలు కరీంనగర్‌కు రావడం అతడికి సంఘీభావం తెలుపడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. వరంగల్ డిక్లరేషన్‌తో కాంగ్రెస్.. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ వరంగల్‌లో సభ నిర్వహించినప్పటి నుంచి కాంగ్రెస్ శ్రేణులు కదనోత్సాహంతో పల్లెల్లో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, రైతులకు వద్దతు ధర హామీలతో ఆ నేతలు పలు కార్యక్రమాలు చేపట్టారు. మొన్నటి వరకు సభ్యత్వం పేరుతో, వరంగల్ డిక్లరేషన్‌తో ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిర్వహించిన యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఇన్చార్జి కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండిలో మేడిపల్లి సత్యం, హుజూరాబాద్‌లో బల్మూరి వెంకట్, కరీంనగర్లో నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తదితరులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. గులాబీ దళంలో జోష్ కేంద్రంపై టీఆర్ఎస్ విమర్శల బాణం ఎక్కుపెట్టింది. ధాన్యం కొనుగోలు చేయడం లేదనే విమర్శలు మొదలుకొని బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని ప్రచారం చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పల్లె, పట్టణ ప్రగతి, ఇతర కార్యక్రమాలతో ప్రజలను మచ్చిక చేసుకుంటోంది. దళితబంధు, నేతన్న బీమా, పింఛన్ల పంపిణీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ పనిలోపనిగా బీజేపీ వైఫల్యాలను ఎండగడుతోంది. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామక్రిష్ణారావు, మేయర్ సునీల్‌రావు విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. (క్లిక్: టీఆర్ఎస్లో కోల్డ్ వార్.. ఆడియో లీక్ కలకలం!) పోరుబాటలో కామ్రేడ్స్ ప్రజాసమస్యలపై వామపక్షాలు పోరుబాట పడుతున్నాయి. సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ తదితర లెఫ్ట్ పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. సీపీఐ జిల్లా మహాసభలు ఇటీవల పూర్తి చేసుకొని జిల్లా కార్యదర్శిగా మర్రి వెంకటస్వామిని ఎన్నుకున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శిగా మిల్కూరి వాసుదేవారెడ్డి ప్రజా సంఘాలను ఏకం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ పోరుబాటలో నిమగ్నమవుతున్నారు. అలాగే వైఎస్సార్టీపీ, బీఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. (క్లిక్: వచ్చే ఎన్నికల్లో పోటీ.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు) -
జిల్లాల్లో విస్తారంగా వానలు
సాక్షి, నెట్వర్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రిదాకా చాలా చోట్ల వర్షాలు కురిశాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరులో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కుండపోత వాన పడింది. జగిత్యాల బీర్పూర్ మండలంలో మొక్కజొన్న, పత్తి చేన్లలో నీళ్లు చేరాయి. బుగ్గారంలో పిడుగుపాటుకు ఒక ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. కోరుట్ల మండలంలో రహదారులపై వరద పోటెత్తి రాకపోకలు నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం మండలంలో ఈదురుగాలులకు విద్యుత్ లైన్లు దెబ్బతిని సరఫరా నిలిచిపోయింది. ►పెద్దపల్లి జిల్లా రామగుండం, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో వాన ముంచెత్తింది. గంజివాగు కల్వర్టుపై వరద పారుతుండటంతో వేములవాడ–బోయినపల్లి మధ్య రాకపోకలు నిలిపివేశారు. కోనరావుపేట మండలం కొండాపూర్ వద్ద సిరిసిల్ల–నిమ్మపల్లి ప్రధాన రహదారిపై కాజ్వే కొట్టుకుపోయింది. ►జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో శనివారం కుండపోత వాన పడింది. పోతుల్వాయి వద్ద బొర్రవాగు, చిద్నెపల్లిలో వాగోడ్డుపల్లి వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గూడురు చెరువుకు గతంలో గండి పడగా.. అది మరింత పెరిగి వరద దిగువకు పోటెత్తింది. దిగువన పొలాల్లో ఉన్న సుమారు 100 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయి మృత్యువాతపడ్డాయి. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. గుండువాగు ఉప్పొంగి జోగిపేట–టేక్మాల్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. మంజీరా నది పోటెత్తడంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. దీంతో ఏడు పాయల వన దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధమైంది. గోదావరి ప్రాజెక్టుల గేట్లన్నీ ఓపెన్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి లక్షా పదివేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. 22 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద చేరుతుండటంతో 8 గేట్లు ఎత్తి 80,800 క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. మొత్తంగా గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. ఇక పరీవాహక ప్రాంతం నుంచి ప్రవాహాలు వస్తుండటంతో కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు జలాశయం నిండుకుండలా మారింది. దీనితో ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి దూకుతున్న కృష్ణమ్మ ఎగువ నుంచి భారీ ప్రవాహాలు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తారు. ఇరువైపులా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వదులుతున్నారు. మొత్తంగా 4,38,185 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 884.3 అడుగుల నీటిమట్టం వద్ద 211.4 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. -
సమీకరణాలు మారుతున్నాయా? ఎవరి జాతకాలు ఎలా?
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? పార్టీల్లో కుమ్ములాటలు, వర్గ విభేదాలు ఎలా ఉన్నాయి? టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పరిస్థితేమిటి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు? మరో ఇద్దరు మంత్రుల పరిస్థితేమిటి..? ఈటల గజ్వేల్‌కి వెళితే.. హుజూరాబాద్ లో ఎవరు పోటీ చేస్తారు..? ఉమ్మడి కరీంనగర్ జిల్లా రౌండప్‌లో చూద్దాం.. చదవండి: మునుగోడు యాక్షన్ ప్లాన్ రెడీ.. కాళ్లు మొక్కనున్న కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదిన ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లా.. మలి విడత ఉద్యమం ఉవ్వెత్తున లేచి.. ఊరూరా జేఏసీలు ఏర్పడి ప్రజలే సైనికుల్లా మారి రాజకీయ యుద్ధం చేసిన పోరాట గడ్డ.. తొలి సింహగర్జన.. తెలంగాణ రాష్ట్ర సమితి సారథిగా కేసీఆర్ అరెస్ట్ అయ్యింది కరీంనగర్‌లోనే. ఉద్యమాలు చేసిన ప్రాంతం కావడం వల్లే.. రాజకీయంగా కూడా చైతన్యం ఏర్పడింది. ప్రజలు కూడా టీఆర్ఎస్కు బాసటగా నిలిచారు.. ఆనాటి నుంచి ఈనాటి వరకూ అండగా ఉంటూ వస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మంట్లో మాత్రం ప్రతిసారీ విభిన్నమైన తీర్పు వస్తోంది. 2009లో కాంగ్రెస్ గెలిస్తే.. 2014లో టీఆర్ఎస్ విజయం సాధించింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి బండి సంజయ్ గెలిచారు. ఇక పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో గతంలో కాంగ్రెస్ గెలవగా.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నారు. ఇదే నిజమైతే లోక్‌సభకు ఎవరిని దింపుతారో చూడాలి. పెద్దపల్లి ఎంపీ స్థానంలో మాత్రం టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతనే బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో 2009 వరకూ కాంగ్రెస్ హవా కొనసాగింది. టీఆర్ఎస్ రాకతో హస్తం చతికిలపడింది. గత రెండు ఎన్నికల్లోనూ 13 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్కొక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. ఇదిలా ఉంటే.. హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్ రాజకీయ చరిత్రను మార్చేసింది. కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కారు దిగి కాషాయ సేనలో చేరారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించి గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఈ ఉప ఎన్నికలోనే దళితబంధుకు అంకురార్పణ జరిగింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖల మంత్రిగా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సిరిసిల్ల నుంచే పోటీ చేస్తారనేది క్లియర్. కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డే ఈసారి కూడా బరిలో నిలబడతారని భావిస్తున్నారు. బీజేపీ నుంచి సీనియర్ నేత కటకం మృత్యుంజయంతో పాటు రెడ్డబోయిన గోపిల పేర్లు వినిపిస్తున్నాయి. గంగుల కమలాకర్ విషయానికి వస్తే కరీంనగర్లో ఆయన గ్రాఫ్ ఏమీ తగ్గలేదంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేస్తే తేలికగా గెలుస్తారనే టాక్ వినిపిస్తోంది. ధర్మపురికి ప్రాతినిథ్యం వహించే మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉందంటున్నారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ వరుస విజయాలతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల ముఖ్య నేతలు కారెక్కారు. వీరిలో కొందరు నేతలు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో అలజడి రేగింది. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి వర్గ విభేదాలు తలనొప్పిగా మారే పరిస్థితులున్నాయి. టీఆర్ఎస్లోనూ ఇలాంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. కరీంనగర్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తర్వాత కారెక్కిన చల్మెడ లక్ష్మీ నరసింహారావు వేములవాడలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మరీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పరిస్థితి ఏంటనేది ప్రశార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో పార్టీలకతీతంగా రాజకీయ నాయకులంతా జనం బాట పట్టారు. మంత్రుల్లో కేటీఆర్ సమయం దొరికినప్పుడల్లా సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్లు ఎక్కువగా జనాల్లోనే ఉంటున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా గజ్వేల్‌పై దృష్టి పెట్టి కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈటల లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. రసమయి బాలకిషన్ ప్రతి రోజూ ఏదో ఒక ఊర్లో దర్శనం ఇస్తున్నారు. రామగుండంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ చిన్న అవకాశం దొరికినా హడావుడి చేస్తున్నారు. మంథని ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు టీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ లేదనే చెప్పాలి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్రలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటూ రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా సమయం చిక్కినప్పుడల్లా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా పార్లమెంటరీ నియోజక వర్గంలో పాదయాత్రలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీల నేతలు ముందుగానే తమ తమ నియోజక వర్గాల్లో హల్ చల్ చేస్తున్నారు. చరిత్ర తిరగరాసిన నేతలు.. విలక్షణ తీర్పులు ఇచ్చిన కరీంనగర్ జిల్లా ప్రజలు వచ్చే ఎన్నికల నాటికి ఎవరెవరి జాతకాలు ఎలా మార్చుతారో చూడాలి. -
బురఖా ధరించి కోర్టుకు వచ్చిన వ్యక్తి.. ఎందుకంటే..?
సాక్షి, కరీంనగర్: భార్య తనపై పెట్టిన కట్నం వేధింపుల కేసులో కోర్టు వాయిదాలకు నిందితుడు బుధవారం బురఖా వేసుకొని జిల్లా కోర్టు ఆవరణలోని పీసీఆర్ కోర్టుకు హాజరయ్యేందుకు రావటం సంచలనం రేపింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాసరెడ్డిపై అతడిభార్య కట్నం వేధింపుల కేసు పెట్టింది. వాయిదాలకు కోర్టుకు హాజరవుతున్నాడు. మధ్యలో ఓ వాయిదాకు హాజరు కాకపోవడంతో కోర్టు అతడిపై వారెంట్ జారీ చేసింది. భార్య తరఫువారితో ప్రాణభయం ఉండటం, వారెంట్‌పై పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు బురఖా ధరించి కోర్టుకు వచ్చాడు. కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. టూటౌన్ పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనివెంట తండ్రి, తల్లి, చెల్లి రాగా.. పోలీసులు అరెస్టు చేయడంతో తండ్రి మల్లారెడ్డి వెంటతెచ్చుకున్న పురుగుల మందు తాగి కిందపడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. తరువాత తనపై ఉన్న వారెంటును తొలగించుకునేందుకు శ్రీనివాసరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు అనుమతి ఇచ్చింది. తన భార్య తప్పుడు కేసు పెట్టి ఇబ్బందికి గురి చేస్తోందని, ప్రాణ భయం ఉండడంతో ఇలా బురఖా ధరించి వచ్చానని శ్రీనివాస్‌రెడ్డి ఏడ్వడం కలవరపరిచింది. (క్లిక్: ‘ఊపిరి’ పోసిన ఎస్ఐ) -
కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు!?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు రాబోతున్నాయి. ఒకప్పుడు 57 మండలాల సువిశాల జిల్లాగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ తరువాత నాలుగు కొత్త జిల్లాలుగా ఆవిర్భవించింది. మరో మూడుజిల్లాల్లోనూ పాత మండలాలు కలిశాయి. మొత్తానికి జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016లో కేవలం 16 మండలాలతో చిన్న జిల్లాగా కరీంనగర్ ఆవిర్భవించింది. చాలాకాలంగా కొన్ని గ్రామాలను మండలాలుగా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఇటీవల సర్వే కూడా ప్రారంభించింది. చల్లూరు (వీణవంక), వావిలాల (జమ్మికుంట), గర్షకుర్తి (గంగాధర), గోపాలరావుపేట (రామడుగు), రేణికుంట (తిమ్మాపూర్) (పర్లపల్లి లేదా నుస్తులాపూర్ను సైతం పరిశీలిస్తున్నారని సమాచారం) గ్రామాలను కొత్త మండలాల కోసం గురువారం సర్వే నిర్వహించారు. గ్రామాల మ్యాప్‌లతో కొత్త మండలాల ప్రతిపాదనలను జిల్లా అధికారులకు అందజేసినట్లు తెలిసింది. వీటిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జగిత్యాలలో రాజారాంపల్లి జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం రాజారాంపల్లి– ఎండపెల్లి గ్రామాలను కలిపి మండలకేంద్రంగా చేయాలని ప్రతిపాదనలను తాజాగా రెవెన్యూ అధికారులు పంపారు. ఇందుకోసం ధర్మారం మండలంలోని మూడు గ్రామాలను విలీనం చేసేందుకు గతంలోనే గ్రామపంచాయతీలు తీర్మానం కూడా చేశాయి. వీటిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందని, ఆగస్టు 15 నాటికి ప్రతిపాదనలకు సంబంధించిన మండలాలపై అధికారిక ప్రకటన ఉండే అవకాశముందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజనలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న వేళ కొత్త మండలాల ప్రస్తావన ఆసక్తికరంగా మారింది. (క్లిక్: కాకతీయ ఉత్సవాలు అద్భుతం!) -
శభాష్... స్నితికా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: బావిలో పడిపోయి ఆరు గంటలు అల్లాడిన ఓ పిల్లి పిల్లను ఓ బాలిక సమయస్ఫూర్తి, దయాగుణం రక్షించాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఆదివారం సాయంత్రం ఓ ఇంటిలోని బావిలో పిల్లి పడింది. అక్కడే ఆడుకుంటున్న స్థానిక బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మనోహర్ పిల్లలు స్నితికా, వేద్ త్రిదామ్నా పిల్లిని కాపాడేందుకు రాత్రి 8.30 గంటల వరకు విఫలయత్నం చేశారు. అయితే పిల్లి పిల్లను కాపాడలేకపోయామన్న బాధ స్నితికాను వెంటాడింది. వెంటనే ఆ బాలిక స్మార్ట్‌ఫోన్ అందుకొని గూగుల్‌లో సెర్చ్ చేసి ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’ నంబర్ సేకరించింది. పిల్లి పిల్ల దయనీయస్థితిని వివరిస్తూ వారికి వీడియో పంపింది. సొసైటీవారి సూచనల మేరకు పిల్లిపిల్లను కాపాడేందుకు మళ్లీ ప్రయత్నించి విఫలమైంది. ఈలోగా రాత్రి 10.30 గంటలు సమయమైంది. మరోసారి సొసైటీవారికి ఆ విషయం చెప్పింది. సొసైటీ ప్రతినిధులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ఫోన్ చేసి విషయం చెప్పగా ఆయన ఏసీపీ తుల శ్రీనివాస్‌రావును అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్ అంజిరెడ్డి బృందం, ఫైర్ సిబ్బంది రాత్రి 11 గంటలకు స్థలానికి చేరుకుని కేవలం 15 నిమిషాల్లో ఆ పిల్లి పిల్లను కాపాడారు. ఎలాగైనా కాపాడాలనుకున్నా స్నితికా, ఇంటర్ ఫస్టియర్, కరీంనగర్ పిల్లి పిల్ల బావిలో పడి తల్లడిల్లుతుంటే నాకు బాధగా అనిపించింది. ఎలాగైనా దాన్ని కాపాడాలనుకున్నా. యానిమల్ రెస్క్యూ బృందం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి పిల్లిని కాపాడటంతో నా మనసు కుదుటపడింది. (క్లిక్: ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి.. ఇంటికి చేరిన బాలిక) -
వ్యభిచార కూపాలు.. విచ్చలవిడిగా సాగుతున్న దందా
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని తంగళ్లపల్లి, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో వ్యభిచార దంగా జోరుగా సాగుతోంది. అయితే ఈ మురికి కూపంలోకి బాలికలను బలవంతంగా దింపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తంగళ్లపల్లి, సిరిసిల్లలో సుమారు 12 మంది బాలికలు ఈ వృత్తిలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ మధ్య తంగళ్లపల్లికి చెందిన ఓ మహిళ విజయవాడకు చెందిన 3 ఏళ్ల చిన్నారిని రూ.2 లక్షలకు కొనుగోలు చేయగా ఏపీ పోలీసులు వచ్చి సదరు మహిళను అదుపులోకి తీసుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’లో ఈ నెల 15న ‘వ్యభిచార ముఠా గుట్టురట్టు’ శీర్షికన ప్రచురించడంతో వ్యభిచార మాఫియాలో మానవ అక్రమ రవాణా కూడా జరుగుతున్నట్లు బహిర్గతమైంది. పోలీసుల్లోనే లీకు వీరులు..? జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం రూరల్ సీఐ అనిల్‌కుమార్, తంగళ్లపల్లి ఎస్సై లక్ష్మారెడ్డి, ఇల్లంతకుంట ఎస్సై మహేందర్, సిబ్బంది వేశ్య గృహాలను తనిఖీ చేశారు. కాగా, తనిఖీలకు ముందే బాలికలను లీకు వీరుల మూలంగా తప్పించినట్లు చర్చ జరుగుతోంది. కొంత మంది పోలీస్ సిబ్బంది వేశ్య గృహాల వారికి ముందుగానే లీక్ చేస్తూ అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యభిచార కూపాల్లో ఉన్న బాలికలకు సంబంధించి పక్కా ఆధారాలు, డీఎన్ఏ టెస్టులు వంటివి నిర్వహిస్తే వారి సంతామేనా..? కాదా..? అని రుజువు చేసి బాలికలకు విముక్తి కలిగించవచ్చు. తంగళ్లపల్లిలో తనిఖీలు చేస్తున్న పోలీసులు వేశ్య గృహాల తనిఖీ సిరిసిల్లక్రైం: సిరిసిల్ల టౌన్, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని వేశ్య గృహాలను మంగళవారం పోలీసులు ఏకకాలంలో తనిఖీ చేశారు. తనిఖీ ల్లో బాలికలు పట్టుబడలేదని వెల్లడించారు. ఆ యా గృహాల్లో ఉంటున్న వారికి కౌన్సెలింగ్ ని ర్వహించారు. ధ్రువీకరణ పత్రాలు లేకుండా ని వాసం ఉండడానికి వీలు లేదని హెచ్చరించా రు. కుటుంబీకులు తప్ప వేరే వాళ్లు ఉంటే వారి కి సంబంధించిన అన్ని వివరాలు ఉండాలన్నా రు. వ్యభిచార గృహాలుగా పేరున్న వారందరి ఆధార్ గుర్తింపులు ఇవ్వాలని ఆదేశించారు. సీఐ అనిల్ కుమార్, ఎస్ఐలు రఫీక్‌ఖాన్, చిననాయక్, మహిళా పోలీసు సిబ్బంది ఉన్నారు. -
రాష్ట్రపతి ఎన్నికల్లో జమ్మికుంట వాసి నామినేషన్
హుజూరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరు శ్రీకాంత్ శనివారం ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాంత్ 2018లో హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత 2019లో కరీంనగర్ ఎంపీగా, 2019లో హుజూర్నగర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీలో నిలిచారు. 2020లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. 2021లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో.. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీలో నిలిచారు. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
అనన్యా .. సారీ! నువ్వు నాతో సంతోషంగా బతకలేవు
‘అనన్య సారీ.. నువ్వు నాతో సంతోషంగా ఉండలేవు.. బాపు, అమ్మా.. తమ్ముడు సారీ.. నాకు బతకాలని లేదు. అప్పులు బాగా పెరిగిపోయాయి. నాతో ఐతలేదు. మీకు చెప్పేధైర్యం వస్తలేదు. నా చావుకు కారణం ముద్రకోల రామాంజనేయులు. అవసరానికి అప్పు చేశాను. వడ్డీకి వడ్డీ వేశాడు. రూ.20 లక్షలు కట్టుమంటుండు. నా రక్తం తాగుతుండు. బయట పది లక్షలు అప్పుతెచ్చి కట్టిన. ఇంకో రూ.20 లక్షలు కట్టుమంటుండు. నీతో కాకుంటే పొలం అమ్ము అంటుండు. తమ్ముడూ... అమ్మ, బాపును, అమ్మమ్మను మంచిగ చూసుకో. నేను పెద్ద తప్పు చేశా అప్పు చేసి. పెళ్లి చేసుకొని ఇంకా పెద్ద తప్పు చేశా. బతుకుడు నాతో ఐతలేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్న’ అంటూ లేఖ రాసి మానకొండూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన మార్క ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కరీంనగర్ (మానకొండూర్) : అన్నారం గ్రామానికి చెందిన మార్క అంజయ్య– పద్మ దంపతుల పెద్ద కొడుకు ప్రశాంత్ (26). డిగ్రీ పూర్తిచేశాడు. ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం అనన్యతో వివాహమైంది. అవసరం నిమి త్తం ఇదే గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారి ముద్రకోల రామాంజనేయులు వద్ద 10, 12, 15 శాతం వడ్డీకి అప్పు తీసుకున్నాడు. కొన్నాళ్లకు చెల్లించాలని వేధించడంతో మరోచోట అప్పుచేసి రూ.10 లక్షలు చెల్లించాడు. మరో రూ.20 లక్షలు చెల్లించాలని వేధిస్తూ వచ్చాడు. పొలం అమ్మి అయినా అప్పు చెల్లించాలని, విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. వేధింపులు భరించలేని ప్రశాంత్ ఈ నెల 26న రాత్రి సూసైడ్ రాసి గ్రామ శివారులో పురుగుల మందు తాగాడు. విషయాన్ని ఫోన్‌ద్వారా కుటుంబసభ్యులకు చెప్పాడు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున చనిపోయాడు. గ్రామంలో ఉద్రిక్తత.. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అన్నారం గ్రామానికి తీసుకొచ్చా రు. రామాంజనేయులు ఇంటిఎదుట మృతదేహంతో ఆందోళనకు యత్నించగా.. సీఐ క్రిష్ణారెడ్డి అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలతో మాట్లాడారు. అయినా.. వినకుండా కుటుంబసభ్యులు రామాంజనేయులు ఇంటి వద్ద బైటాయించారు. చివరికి సీఐ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. తీసుకున్న అప్పు ఏం చేశాడు..? ప్రశాంత్ డిగ్రీ పూర్తిచేయగా.. ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అందరితో కలివిగా ఉండే వ్యక్తి. అధిక వడ్డీలకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ‘రామాంజనేయులుకు అప్పు చెల్లించవద్దని.. విక్రంబావకు రూ.3 లక్షలు, శ్రీకాంత్ అల్లుడికి రూ.3 లక్షలు, దేవన్నకి రూ.1.50 లక్షలు, చింటుకు 1.50 లక్షలు, ముద్రకోల మధుకు రూ.లక్ష చెల్లించు’ అంటూ నోట్లో అతడి తమ్ముడు అజయ్‌కి సూచించాడు. ‘అప్పు ఎందుకు చేశాడో తెలియదు.. ఎంత చేశాడో తెలియదు.. బాగానే ఉంటాడు అనుకున్నాం.. ఇంతలో ఇలా జరిగింది’ అని అతని తల్లిదండ్రులు అంజయ్య– పద్మ చెబుతున్నారు. ప్రాణాలు తీస్తున్న అధిక వడ్డీలు.. అధిక వడ్డీకి అప్పులు ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో పలు ఘటనలు చోటుచేసు కోగా.. పోలీసులు సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు పట్టణాల్లోనే ఉందనుకున్న దందా పల్లెలకు సైతం పాకడంతో ఆందోళన కలిగిస్తోంది. అనన్య ఐదు నెలల గర్భిణి ప్రశాంత్‌కు రామడుగు మండలం గుండికి చెందిన అనన్యతో 8 నెలల క్రితం వివాహం అయ్యింది. ప్రస్తుతం ఐదునెలల గర్భిణి. ప్రశాంత్ మృతితో అనన్య రోదనలు అరణ్య రోదనలు అయ్యాయి.‘నిండు నూరేళ్లు కలిసి ఉంటావనుకుంటే ఎనిమిది నెలలకే తీరని లోకాలకు వెళ్లిపోయావా.. నువ్వులేని నా జీవితం ఎలా గడుస్తుంది. కడుపులో బిడ్డ గుర్తుకురాలేదా’ అంటూ అనన్య రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. ‘అప్పు ఉందంటే మేము కట్టేవాళ్లం కదా కొడుకా.. మాకు దిక్కెవరు బిడ్డా అంటూ..’ తల్లిదండ్రులు, తమ్ముడు అజయ్ గుండెలవిసేలా రోదించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అనుమానంతో భార్యపై హత్యాయత్నం
భూపాలపల్లి: భార్యపై అనుమానంతో గొడవపడిన భర్త మద్యం మత్తులో ఆమెపై హత్యాయత్నం చేశాడు. రక్తపు మడుగులో ఉన్న భార్యను చూసి భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారంరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని బేతిగల్‌కు చెందిన అంబాల రమేశ్ (29) కొన్నేళ్ల క్రితం భూపాలపల్లికి వచ్చి రాంనగర్ లో నివసిస్తూ కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నాడు. రమేశ్‌కు ఆరేళ్ల క్రితం హుజూరాబాద్‌కు చెందిన శైలజతో వివాహం జరిగింది. ఆమెకు పిల్లలు కలగకపోవడంతో ఏడాదిన్నర క్రితం మల్హర్ మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి(24)ని వివాహం చేసుకున్నాడు. రాజ్యలక్ష్మిపై అనుమానంతో రమేశ్ కొద్ది రోజులుగా ఆమెతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి రమేశ్ బాగా మద్యం సేవించి వచ్చి గొడవపడ్డాడు. రాత్రి ఒంటిగంట సమయంలో రాజ్యలక్ష్మిపై హత్యాయత్నం చేశాడు. కడుపు, ఎడమ చేయిపై కత్తితో పొడవడంతో రాజ్యలక్ష్మి రక్తం మడుగులో కుప్ప కూలింది. తర్వాత రమేశ్ అదే కత్తి తో చేతి మణికట్టు వద్ద నరాన్ని కోసుకున్నాడు. అనంతరం బైక్‌పై కొద్దిదూరం వెళ్లి కిందపడిపోయాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో తీవ్ర రక్తస్రావం జరిగి కేటీకే 5వ ఇంక్లైన్ గని సమీపంలోని జామాయిల్ చెట్ల వద్ద మృతి చెందాడు. కాగా, రమేశ్ ఇంటి యజమాని ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాజ్యలక్ష్మిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. -
తలలోకి దూసుకెళ్లిన ఇనుపచువ్వ
హుజూరాబాద్/ఎంజీఎం: ప్రమాదవశాత్తు ఓ యువకుడి దవడ నుంచి తలలోకి ఇనుపచువ్వ గుచ్చుకోవడంతో రెండు గంటలపాటు నరకయాతన అనుభవించి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో శుక్రవారం జరిగింది. హుజూరాబాద్‌లోని బుడగజంగాల కాలనీకి చెందిన మౌటం రాజు(35) సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న డ్రైనేజీ పనుల్లో మూడు నెలల నుంచి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపో క్రాస్‌రోడ్‌లో నిర్మిస్తున్న డ్రైనేజీకి ఉదయం నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి రెయిలింగ్‌పై పడిపోయాడు. రెయిలింగ్‌పై మొనదేలి ఉన్న ఇనుపచువ్వ ఒకటి రాజు దవడ కింది నుంచి దూసుకెళ్లి తల వెలుపలికి వచ్చింది. ఈ హఠాత్పరిణామానికి షాక్‌కు గురైన రాజు ఇనుపచువ్వకు అతుక్కుపోయి ఎటూ కదల్లేక నొప్పితో విలవిల్లాడాడు. దవడ కదలించలేని దయనీయస్థితిలో సాయం కోసం సైగలు చేస్తున్న రాజును చూసి పలువురు కంటతడి పెట్టారు. వెంటనే అక్కడి సిబ్బంది ఆ ఇనుపచువ్వను కట్టర్‌తో కత్తిరించారు. సైట్ ఇంజనీర్ అశ్వి న్‌కుమార్, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 108 అంబులెన్స్ ఘటనాస్థలానికి చేరుకుని రాజును ఇనుపచువ్వతోపాటు హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మెరుగైన చికిత్స కోసం రాజును హుజూరాబాద్ నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వెంటనే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో రాజు ప్రాణాలు వదిలాడు. ఎంజీఎంకు వచ్చేసరికే రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కృతిమ శ్వాస అందిస్తూ చువ్వను తొలగిస్తున్న క్రమంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువచ్చే సమయంలో రాజు కొన ఊపిరితో ఉన్నాడని, దాదాపు 40 నిమిషాలు ప్రాణాలతో పోరాడాడని ఆయన బంధువు రవి ‘సాక్షి’కి తెలిపారు. -
భూమి పోతోందని.. పొలంలోనే గుండెపోటుతో రైతు మృతి
రామడుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ కాలువ లొల్లి మరొకరిని బలితీసుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లికి చెందిన మిట్టపల్లి రాధమ్మ(55)కు చెందిన పొలంతోపాటు షెడ్లు కాళేశ్వరం అదనపు కాలువ నిర్మాణంలో పోతున్నాయి. దీంతో రాధమ్మ మనోవేదనకు గురవుతోంది. ఈక్రమంలో ఎప్పటిలాగే సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లింది. గుండెపోటుకు గురై చనిపోయింది. గ్రామస్తులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. రాధమ్మ భర్త శివయ్య గత ఫిబ్రవరిలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వీరికి ముగ్గురు కుమారులు. వీరి భీవండిలో చేనేత పనులు చేస్తున్నారు. మృతదేహం వద్ద చొప్ప దండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం నివాళులర్పించారు. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 10 రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఒంటెల రాఘవరెడ్డి మనోవేదనతో మృతి చెందారు. -
దేశానికి బువ్వ పెడుతున్నాం: మంత్రి కేటీఆర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతూ.. భరతమాతకు బువ్వపెట్టే నాలుగో రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా కేంద్రం, చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు రూ.1,100 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా కరీంనగర్లో రూ.410 కోట్లతో నిర్మించతలపెట్టిన మానేరు రివర్‌ఫ్రంట్, రూ.615 కోట్లతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ, సీవరేజీ, రోడ్లు, 24 గంటల నీటిసరఫరా, జంక్షన్ల అభివృద్ధి, కమాండ్ కంట్రోల్ తదితర పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మార్క్‌ఫెడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను కరీంనగర్‌లోనే పుట్టి పెరిగానని, తన విద్యాభ్యాసం, చదివిన స్కూళ్లను గుర్తుచేసుకున్నారు. అప్పటితో పోలిస్తే.. ఇప్పటి కరీంనగర్ అభివృద్ధిలో ఎంతో మార్పు చెందిందన్నారు. తనకే కాదు సీఎం కేసీఆర్‌కు కూడా కరీంనగర్ అంటే ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. అందుకే ఉద్యమానికి ఊపిరిలూదిన సింహగర్జన సభను ఇక్కడ నుంచే ప్రారంభించారని తెలిపారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ రాష్ట్రాభివృద్ధితోపాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచించే వారన్నారు. అందుకే.. ఈరోజు లక్షలాదిమంది వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, దివ్యాంగులు పింఛన్లు అందుకుంటున్నారని, వారి అవసరాలు తీర్చేవిధంగా సాయం చేసి గౌరవప్రదంగా జీవించేలా చేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి పథకాలతో మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రగతిని మెచ్చుకుంటూ నీతి ఆయోగే కితాబిచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం కూడా కేసీఆర్ గొప్పతనమే అన్నారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు.. అయినా ఒకేరోజు భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఈ ప్రాంత పురోగతిపై తమకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. మతవిద్వేషాలు చిమ్మడమే బండి పని! కేటీఆర్ తన ప్రసంగంలో బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాము ఇక్కడ చేసిన వెయ్యి పనుల గురించి అనర్గళంగా చెప్పగలమని, మరి ఇక్కడ గెలిచిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇంతవరకు రూ.3 కోట్ల పనులైనా చేశారా? అని నిలదీశారు. ‘తన పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కనీసం మూడు పైసల పనిచేసుడు తెల్వదు కానీ, తెల్లారి లేస్తే డైలాగులు కొట్టడం మాత్రం బాగా తెలుసు’అని విమర్శించారు. చేతనైతే కాళేశ్వరానికి జాతీయ హోదా, కరీంనగర్‌కు ట్రిపుల్ఐటీ, సిరిసిల్లకు మెగాపవర్‌లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని సవాల్ విసిరారు. మాట్లాడితే హిందూ–ముస్లిం అంటూ మతాల మధ్య విద్వేషాలు చిమ్మడం తప్ప ఆయనకేమీ తెలియదని ఎగతాళి చేశారు. ఏదో అప్పుడు గాలికి గెలిచిన బండి.. ఢిల్లీలో ఇప్పుడు తన పలుకుబడితో రాష్ట్రానికి ఒక్క పనైనా చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న రూపాయిలో 50 పైసలే వెనక్కి వస్తున్నాయని.. మిగిలిన 50 పైసలు యూపీ, బిహార్‌లో ఖర్చవుతున్నాయని అన్నారు. ఇప్పటికే రెండుసార్లు గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయిన బండి సంజయ్, ఈసారి దమ్ముంటే ఆయనపై గెలవాలని సవాల్ విసిరారు. ఈసారి లక్ష ఓట్లతో గంగులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను ఎందుకు జైలుకు పంపుతారో చెప్పాలి.. అనంతరం మంత్రి చొప్పదండిలో దాదాపు రూ.55 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కొంతకాలంగా కొందరు సీఎం కేసీఆర్‌ను ఇష్టానుసారంగా తూలనాడుతున్నారని మండిపడ్డారు. ‘మరికొందరు కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని, దింపేస్తామని అంటున్నారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని జైలుకు పంపిస్తారు’అని ప్రశ్నించారు. ‘24 గంటల కరెంట్ ఇస్తున్నందుకా? రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నందుకా? రైతుబీమా ఇస్తున్నందుకా? కాళేశ్వరం కట్టినందుకా?’అంటూ ప్రశ్నించారు. చొప్పదండికి సైనిక్ స్కూల్ కావాలని ఎప్పటి నుంచో కేంద్రాన్ని అడిగితే ఎందుకు తేలేదని బండి సంజయ్‌ని నిలదీశారు. వేములవాడకు ఏమైనా నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. ఎప్పటికైనా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేది టీఆర్ఎసే అన్న విషయం మరిచిపోవద్దని కోరారు. నలుగురు బీజేపీ ఎంపీలు దద్దమ్మలు బీజేపీ పాలనలో దేశానికి ఒరిగిందేమి లేదని, నమ్మించి మోసం చేయడమే ఆ పార్టీ పని అని మంత్రి కేటీఆర్ అన్నారు. హిందూ, ముస్లిం లొల్లి తప్ప అభివృద్ధి మంత్రం ఆ పార్టీకి పట్టదని ధ్వజమెత్తారు. గురువారం కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఆ«ధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీకి చెందిన కార్పొరేటర్లు మెండి శ్రీలత చంద్రశేఖర్, నక్క కృష్ణ పద్మ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హయాంలో దేశం గందరగోళంలో ఉందని, యువతను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు దద్దమ్మలు, సన్నాసులని, కేంద్రం నుంచి ఒక్కరూపాయి కూడా తీసుకురాని వారు పెద్దపెద్ద డైలాగులు చెబుతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో వరదబాధితులకు నయా పైసా తేలేదని, అలాగే గతంలో మంజూరైన పథకాలు వేరే రాష్ట్రాలకు తరలిపోతుంటే బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పసుపుబోర్డు తెస్తానన్న వాగ్దానానికి ఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయిందని అన్నారు. మరో ఎంపీ సోయం బాపురావు చెప్పిన ట్రైబల్ యూనివర్సిటీ హమీ కలగానే మిగిలిందని మండిపడ్డారు. -
రహస్య సర్వే: హస్తం కేడర్‌పై.. అధిష్టానం నజర్..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ స్థితిగతులపై కాంగ్రెస్ దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీకి పునర్వైభవం కల్పించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరుపై రహస్య సర్వే ప్రారంభించింది. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పరిస్థితి, నాయకుల పనితీరు.. ఎవరెవరు క్రియాశీలకంగా ఉన్నారు? ఎవరెవరు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు? ఎవరు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు? అన్న విషయాలపై రేవంత్‌రెడ్డి నియమించిన ప్రత్యేక నిఘా బృందం వివరాలు తెప్పించుకుంటోంది. చదవండి: కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి జిల్లాలో పార్టీ ప్రాబల్యాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా చాటుకుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత కాంగ్రెస్ పార్టీ జిల్లాలో క్రమంగా జనాదరణకు దూరమవుతూ వస్తోంది. కీలకమైన నాయకులు టీఆర్ఎస్, ఇతర పార్టీలకు వెళ్లిపోవడంతో కేడర్పరంగా పార్టీ బాగా బలహీనంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక.. పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. వచ్చేవారంలో రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తారని, వేములవాడలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈలోపు జిల్లా కేడర్, స్థితిగతులపై రేవంత్‌కు పూర్తిస్థాయి నివేదిక అందించేందుకు గాంధీభవన్ వర్గాలు సిద్ధమయ్యాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భంగపాటు..! టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రోడ్‌షోల కు జనాల నుంచి అపూర్వ స్పందన వచ్చినా పార్టీ వాటిని ఓట్లుగా మలచుకోవడంలో విఫలమైంది. ♦ఉమ్మడి జిల్లా నాయకులంతా రేవంత్ సభలకు హాజరైనా.. కనీసం డిపాజిట్ దక్కించుకోలేక ఘోర పరాజయం మూటగట్టుకుంది. ♦అయితే.. అది ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగిన ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆ పరాజయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ♦ఆ వెంటనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకలేదు. ♦ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులంతా ఎవరికి నచ్చినట్లు వారు వ్యవహరించారు. ♦అయితే.. ఇటీవల చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదుకు మాత్రం మంచి స్పందన రావడం పార్టీలో ఆశలు చిగురిస్తున్నాయి. సీనియర్లకు సైతం ఫోన్స్.. కొంతకాలంగా కొత్త జిల్లాల వారీగా పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు లేదా ముగ్గురు నేతలు మాత్రమే క్రియాశీలకంగా ఉంటున్నారు. పార్టీపరంగా నిరసనలు, ధర్నాలకు వారు మాత్రమే హాజరవుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో వెలుగువెలిగిన చాలామంది సీనియర్లు పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లుగా ఉండటంతో కేడర్ కూడా నిస్తేజంలోకి జారిపోతోంది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఇప్పటి నుంచి పార్టీని సమాయత్తం చేయాలని టీపీసీసీ రేవంత్‌రెడ్డి వర్గం ఆలోచనగా తెలుస్తోంది. అందుకే.. సీనియర్ నేతలకు ఫోన్లు చేసి తిరిగి వారిని క్రియాశీలకంగా మార్చే యత్నాలను ప్రారంభించారు. యువత, పనిచేసేవారికే టికెట్లు..! అదేసమయంలో పార్టీలో కొత్తనాయకుల పనితీరుపై దృష్టి సారించారు. పార్టీలో ఎవరు నిత్యం వార్తల్లో ఉంటున్నారు? ఎవరు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు? ఎవరు నిరసనలు, ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయి? కొత్తగా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశిస్తున్నవారి ఆర్థిక స్థితిగతులు ఏంటి? వారి అంగబలం, ఆర్థిక సామర్థ్యం, జనాదరణ ఎలా ఉంది? తదితర విషయాలపై రేవంత్ స్పెషల్ టీమ్ రహస్య సర్వే నిర్వహిస్తోంది. ఉత్తర తెలంగాణలో అందులోనూ పార్టీకి కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెరికల్లాంటి యువ నాయకులకు ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేసేలా దిశానిర్దేశం చేసేందుకు సమాయత్తం అవుతోంది. మొత్తానికి ఎన్నికల ముందు చుట్టపు చూపులా వచ్చి టికెట్లు తీసుకునే సంప్రదాయానికి ఇకపై చెల్లదని, ప్రజాదరణే ప్రామాణికంగా టికెట్లు ఇచ్చే ఉద్దేశంతోనే ఈ సర్వే నిర్వహిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
శివరాత్రికి ఎములాడ సిద్ధం
వేములవాడ: పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎములాడ రాజన్న ఆలయం శివరాత్రి శోభ సంతరించుకుంది. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో సోమవారం నుంచి మార్చి రెండవ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జాతరకు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా రూ. 2 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాన్ని ఇప్పటికే రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేములవాడకు చేరుకునే 5 ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలికేలా భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాజన్న చెంతకు చేరుకోండిలా.. రాజధాని హైదరాబాద్‌కు 150 కిలోమీటర్లు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్ల దూరంలో వేములవాడ ఉంది. స్వామివారి సన్నిధికి చేరుకోవాలంటే రోడ్డు మార్గం ఒక్కటే. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి ప్రతి అరగంటకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతి 10 నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చేవారు సిద్దిపేట మీదుగా.. వరంగల్ నుంచి వచ్చేవారు కరీంనగర్ మీదుగా వేములవాడ చేరుకోవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా గుడి చెరువుకట్ట కింద ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేశారు. దాదాపు 770 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులకు ప్రసాదాలు అందించేందుకు ధర్మగుండం పక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్, దేవస్థానం దక్షిణ ద్వారం వద్ద, పూర్వపు ఆంధ్రాబ్యాంకులో కౌంటర్ ఏర్పాటు చేశారు. లడ్డూ రూ.20, పులిహోర ప్యాకెట్ రూ.15 చొప్పున విక్రయిస్తారు. రాజన్న జాతర పూజలు మహాశివరాత్రి సందర్భంగా నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ధర్మ దర్శనం, రూ.50తో స్పెషల్ దర్శనం, రూ.100తో శీఘ్రదర్శనం చేసుకోవచ్చు. రూ.100తో కోడె మొక్కులు, రూ.200తో స్పెషల్ కోడె మొక్కులు తీర్చుకోవచ్చు. మార్చి ఒకటిన ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అక్కడి అర్చకుల ప్రత్యేక బృందం, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శివస్వాములకు, 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అద్దాల మంటపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు (ఈ సమయంలో భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు) నిర్వహిస్తారు. జాతరకు 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
తెలంగాణ బీజేపీలో మళ్లీ అసంతృప్తి సెగలు
-
బీజేపీ ‘బండి’లో సీనియర్స్‌కు సీటేది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు క్రమంగా పెరుగుతున్నాయి. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక తమకు ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదంటూ వివిధ జిల్లాల్లోని పలువురు సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ తమ వాదనను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో అసంతృప్తనేతలు విడిగా సమావేశం కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. అసంతృప్త నేతల సమావేశాలు ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు, నిజామాబాద్, మరో ఒకట్రెండు జిల్లాల్లో జరిగాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన భేటీ సీనియర్లు–జూనియర్లు, పాత–కొత్త నేతల మధ్య పెరుగుతున్న దూరాన్ని ఎత్తిచూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలవారీగా చూస్తే... కరీంనగర్లో గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర రావు, అర్జున్‌రావు, వరంగల్‌లో డాక్టర్టి.రాజేశ్వరరావు, ఎం.ధర్మారావు, నిజామాబాద్‌లో యెండల లక్ష్మీనారాయణ, హైదరాబాద్ నుంచి వెంకటరమణి, మహబూబ్‌నగర్‌లో నాగూరావు నామాజీ, నల్లగొండలో కంకణాల శ్రీధర్‌రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో బొబ్బ భాగ్యరెడ్డి చాలాకాలంగా పార్టీ కోసం పనిచేయడమేకాక.. గుర్రంబోడు తండాలో గిరిజనుల భూముల విషయంలో అనేక కేసులు నమోదు కావడంతో జైలుకు సైతం వెళ్లి వచ్చారు. తాజాగా ఆ నియోజకవర్గంలో మరో నేత రావడంతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. కాగా, సీనియర్లు సుదీర్ఘకాలం రాష్ట్ర పదాధికారులుగా, వివిధ హోదాల్లో పదవులు నిర్వహించారని, పార్టీలో, ఇతరత్రా పదవులు తక్కువగా ఉన్నందున ఈసారి కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. సీనియర్లను విస్మరిస్తే ఎలా? హైదరాబాద్‌లో కలుసుకున్న సీనియర్ నేతల్లో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, టి.రాజేశ్వరరావు, చింతా సాంబమూర్తి, వెంకటరమణి తదితరులున్నారు. ‘ఇది రహస్య సమావేశమేమీ కాదు. పార్టీ బలపడుతున్న క్రమంలో కొత్తవారిని చేర్చుకోవాల్సిందే. ఏళ్ల తరబడి పార్టీ కోసం, సిద్ధాంతం కోసం కృషి చేసిన, త్యాగాలు చేసి పార్టీని రక్షించుకున్న సీనియర్లను విస్మరించడం సరికాదు. అందర్నీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిపై ఉంటుంది. ఒంటెద్దు పోకడలు అనుసరించడం సరికాదు. సమస్య పరిష్కారానికి పార్టీ ఇన్చార్జి తరుణ్ ఛుగ్, పార్టీ సంస్థాగత జాతీయ సంయుక్త కార్యదర్శి శివప్రకాష్‌జీ వెంటనే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం. ఈ అంశంపై పార్టీ స్పందించే తీరునుబట్టి తర్వాతి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం’అని భేటీలో పాల్గొన్న నాయకులు ‘సాక్షి’కి వెల్లడించారు. కాగా అసంతృప్త నేతల సమావేశాలు, చర్యలను తేలికగా తీసుకునే ప్రసక్తే లేదన్న సంకేతాలు రాష్ట్ర నాయకత్వం ఇస్తోంది. -
నలుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు
కాళేశ్వరం/గడ్చిరోలి: తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు పేలుడు పదార్థాల్లో ఉపయోగించే కార్డెక్స్ వైర్ బండల్స్‌ను సరఫరా చేస్తున్న నలుగురు ఆదివారం గడ్చిరోలి జిల్లా పోలీసులకు పట్టుబడినట్లు ఎస్పీ అంకిత్‌గోయల్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. అహేరి తాలూకా దామ్రాంచ–బంగారంపేట గ్రామాల అటవీ ప్రాంతాల మీదుగా 20 కార్డెక్స్ వైర్ బండిల్స్ రవాణా చేస్తున్నారనే సమాచారంతో పీఎస్సై సచిన్ ఘడ్కే ఆధ్వర్యంలో క్యూఆర్టీ పోలీసుల బలగాలతో మాటువేసి పట్టుకున్నారు. మావోయిస్టు సానుభూతిపరులైన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజుగోపాల్ సల్ల, మహ్మద్ ఖాసీం షాదుల్లా, గడ్చిరోలి జిల్లాకు చెందిన కాశీనాథ్, సాధుల లచ్చాతలండి పట్టుబడగా, వీరి నుంచి 3,500 కార్డెక్స్ వైర్ బండిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. పట్టుబడిన వీటిని వివిధ లాంచర్లు, హ్యాండ్‌గ్రనేడ్లు, ఐఈడీఎస్ తయారీలో ఉపయోగిస్తున్నారని ఎస్పీ తెలిపారు. -
బల్మూరి వెంకట్ అరెస్టు
జమ్మికుంట/హుజూరాబాద్: మూగజీవాలను దొంగిలించి, రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచారన్న ఆరోపణలపై ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను కరీంనగర్ జిల్లా జమ్మి కుంట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కరీంనగర్ అదనపు డీసీపీ శ్రీనివాస్ జమ్మికుంట స్టేషన్ లో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. గురు వారం సీఎం కేసీఆర్ జన్మదినాన్ని అభాసుపాలు చేశారని జమ్మికుంట అర్బన్ టీఆర్ఎస్ పార్టీ అధ్య క్షుడు టంగుటూరి రాజ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకట్, మరో 10 మంది కలసి ఒక గాడిదను దొంగతనంగా కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీకి తరలించి దానికి కేసీఆర్ చిత్రపటాన్ని తగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం దాని కాలితో కేక్ కోయించి బలవంతం గా గాడిదకు తినిపించారని ఆరోపించారు. సీఎంను అవమానించడంతోపాటు కాంగ్రెస్–టీఆర్ఎస్ పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన బల్మూరి వెంకట్‌పై చర్యలు తీసుకోవాలని గురువారం రాత్రి జమ్మికుంట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అర్ధరాత్రి దాటాక వెంకట్‌ను హుజూరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకట్‌తోపాటు గుర్తుతెలియని పది మందిపై కేసు నమోదు చేశామని, వెంకట్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని డీసీపీ తెలిపారు. అరెస్టులతో మా పోరాటం ఆపలేరు..: కాంగ్రెస్ నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని, ఇలాంటి చర్యలతో తమ పోరాటం ఆగ దని బల్మూరి వెంకట్ అన్నారు. శుక్రవారం ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. బెయిల్ మంజూరు చేసింది. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల బాధలు ప్రభుత్వానికి అర్థం కావడానికి నిరసన తెలిపితే, తాను గాడిదను చోరీ చేశానని తప్పుడు కేసు బనాయించారని తెలిపారు. నిరుద్యోగంపై పోరాడితే అరెస్టా?: రేవంత్ సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తున్న ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను ఎలాంటి నోటీసులు లేకుండా అర్థరాత్రి అరెస్టు చేయడం దుర్మార్గమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ హక్కులను కాలరాస్తూ పోలీసులు కాంగ్రెస్ నాయకులపై దౌర్జన్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
నేతన్న ఇంట విషాదం
చొప్పదండి: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంట్లో ఉరేసుకొని మృతి చెందడం కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. నేత కార్మిక కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి కుమారుడు ఇంట్లో బలవన్మరణం చెందడం మిస్టరీగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన నేత కార్మికుడు బైరి శంకరయ్య (54) సాంచాలు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య జమున (50) వ్యవసాయ కూలి. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వారి సంతానం. పెద్ద కుమార్తె అనితకు ఇదివరకే వివాహం కాగా భర్తతో కలసి విదేశాల్లో ఉంటోంది. చిన్న కుమార్తె అఖిలకు మూడు నెలల క్రితం పెళ్లి చేశారు. కుమారుడు శ్రీధర్ (25) బీటెక్ చదివాడు. అతను హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తుండగా, గతేడాది కరోనా కాలం నుంచి వర్క్‌ఫ్రమ్ హోంలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ, ఆదివారం రాత్రి సమయంలో భార్యాభర్తలు, కుమారుడు ఏక కాలంలో ఇంట్లో దూలాలకు ఉరేసుకున్నారు. కరీంనగర్లో ఉంటున్న చిన్న కూతురు సోమవారం ఉదయం తండ్రికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దాంతో ఇంటి పక్కవారికి ఫోన్ చేసి వాకబు చేయగా, వారు వచ్చి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. అదే సమయంలో ఇంట్లో నుంచి ఫోన్ రింగ్ అయిన శబ్దం రావడంతో కూతురుకు అదే విషయం తెలిపారు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామ పెద్దల సమక్షంలో పోలీసులు ఇంటి తలుపులు తొలగించి చూడగా, ముగ్గురూ దూలాలకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. తన వివాహ సమయంలో అప్పులు కావడంతో ఆర్థిక ఇబ్బందులతోనే కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని చిన్న కూతురు అఖిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ముఖం చాటేశాడు..
మానకొండూర్(కరీంనగర జిల్లా): న్యాయం చేయాలని ఓ భార్య భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన కవిత, మానకొండూర్‌కు చెందిన శ్రీనివాస్ కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి పాప సంతానం. కరీంనగర్లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. చదవండి: నిజామాబాద్‌లో గుట్టుగా వ్యభిచారం.. 11 మంది అరెస్ట్ కొద్ది రోజుల నుంచి శ్రీనివాస్ ఇంటికి వెళ్లడం లేదు. దీంతో కవిత మానకొండూర్‌లోని శ్రీనివాస్ ఇంటి ఎదుట శనివారం బైఠాయించింది. తనకు, కూతురుకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టింది. విషయం తెలుసుకున్న సీఐ కృష్ణారెడ్డి సదరు భార్యాభర్తలను పోలీస్‌స్టేషన్‌కు పిలుపించుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. కలిసి ఉండాలని చెప్పి స్టేషన్ నుంచి పంపించారు. -
కారం చల్లి, గొడ్డలితో సాఫ్ట్వేర్ ఉద్యోగిపై దాడి.. ఆయుధాన్ని బీరువా కింద దాచి..
సాక్షి, గన్నేరువరం(మానకొండూర్): మండలంలోని జంగపల్లిలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జక్కనపెల్లి ఆంజనేయులు, భారతి దంపతుల కుమారుడు అశోక్ హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం రాంహనుమాన్ నగర్‌కు చెందిన అతని తాత లింగయ్య(తల్లికి తండ్రి) ఇటీవల మృతి చెందాడు. గురువారం దినకర్మ ఉండటంతో అశోక్ బుధవారం రాత్రి గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి గురువారం ఉదయం రాంహనుమాన్ నగర్ వెళ్లాడు. మధ్యాహ్నం తండ్రితో కలిసి ఇంటికి చేరుకున్నాడు. అశోక్ వంటింట్లో నిద్రిస్తుండగా, తండ్రి ఆంజనేయులు, నానమ్మ రాజవ్వ గ్రామంలోనే కొద్ది దూరంలో ఉన్న మరో ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ ఉన్న ఇంట్లోకి గ్రామానికే చెందిన వెల్దిండి రవీందర్ ప్రవేశించాడు. అశోక్ ముఖంపై కారం చల్లి, గొడ్డలితో దాడి చేశాడు. బాధితుడు కేకలు వేయడంతో పారిపోయాడు. చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి ఒంటిపై ఉన్న గాయాలను చూసి, అశోక్ తండ్రి బోరున విలపించారు. బాధితుడిని కరీంనగర్ ఆస్పపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తేల్చారు. వారి సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. నిందితుడు గొడ్డలిని బాధితుడి ఇంట్లో బీరువా కింద దాచాడు. అనంతరం పోలీస్‌స్టేషన్ లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై మామిడాల సురేందర్‌లు పరిశీలించారు. గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మద్యానికి బానిస నిందితుడు రవీందర్ కొన్నేళ్ల కిందట దుబాయి వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి గ్రామంలోనే ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడని చెప్పారు. ఈ క్రమంలో మద్యానికి బానిసై కనిపించినవారిని డబ్బులు డిమాండ్ చేస్తుంటాడని అన్నారు. కానీ అశోక్‌తో అతనికి పరిచయం లేదని, రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు తేవని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. మద్యం, గంజాయి మత్తుకు మానిసై సైకోగా మారి, దాడి చేసి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. -
పోలీస్ పోస్టింగుల్లో అవినీతి పంట!
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల విభాగంలో పోస్టింగులకు ఇష్టమొచ్చినట్టుగా సిఫారసు లేఖలిచ్చిన ఓ ఎమ్మెల్యే.. లక్షల రూపాయలు దండుకున్న వ్యవహారం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు.. ఒక పోస్టింగ్ కోసం ముగ్గురు అధికారుల నుంచి డబ్బులు తీసుకొని, మరో ఇతర అధికారికి పోస్టింగ్ కల్పించిన ఉదంతం సంచలనంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ ఎమ్మెల్యే వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. లక్షల్లో వసూలు..ఒకరికని చెప్పి మరొకరికి కొద్దిరోజుల క్రితం ‘సాక్షి’ప్రచురించిన పొలిటికల్ పోస్టింగ్ కథనాలు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఇంటెలిజెన్స్ విచారణలో బయటకొచ్చిన ఈ ఎమ్మెల్యే అవినీతి బాగోతాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టు కోసం మొదట ఓ సీఐతో రూ.15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా తన ప్రైవేట్ పీఏ ద్వారా రూ.10 లక్షలు తీసుకున్న ఎమ్మెల్యే మరో సీఐకి రూ.18 లక్షలకు సిఫారసు లేఖనిచ్చి పోస్టింగు ఇప్పించారు. దీంతో ముందు డబ్బులిచ్చిన అధికారి వెళ్లి ఆరాతీయగా ఎక్కడైనా చూద్దాంలే అంటూ దాటవేశారని, తన డబ్బులు తిరిగివ్వాలని అడుగుతున్నా నాలుగు నెలలుగా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని విచారణలో బయటపడింది. ఇదే నియోజకవర్గంలో మరో సీఐ పోస్టు కోసం ఒక అధికారి నుంచి రూ.10 లక్షలకు డీల్ చేసుకొని సిఫారసు లేఖ ఇచ్చారు. ఇదే సీఐ పోస్టింగ్ కోసం కరీంనగర్లో పనిచేస్తున్న మరో సీఐ నుంచి రూ.13 లక్షలకు ఒప్పందం చేసుకొని అడ్వాన్స్‌గా రూ.3 లక్షలు తీసుకొని మరో సిఫారసు లేఖనిచ్చారు. ఇది తెలిసిన తొలి ఇన్స్పెక్టర్ వెళ్లి ఎమ్మెల్యేను అడగ్గా.. రూ.15 లక్షలిస్తే పోస్టింగ్ ఆర్డర్స్ ఇప్పిస్తానని చెప్పడంతో ముందు ఇచ్చిన రూ.10 లక్షలు వెనక్కి రావేమో అని భయపడి మరో రూ.5 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిసింది. ఇష్టారాజ్యంగా సిఫారసు లేఖలు నియోజకవర్గంలో భారీస్థాయిలో డిమాండ్ ఉన్న ఓ పోలీస్‌స్టేషన్‌లో పోస్టింగు కోసం ఓ ఎస్ఐకి రూ.11 లక్షలకు కమిట్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా ఓ మండల ఎంపీపీ భర్త ద్వారా రూ.4 లక్షలు అడ్వాన్స్ తీసుకొని పోస్టింగ్ కల్పించారు. పోస్టింగ్ వచ్చాక మిగతా మొత్తం చెల్లించారు. ఆరు నెలలు గడిచాయో లేదో.. సంబంధిత ఎస్ఐ తన మాట వినడం లేదని ఇంకో ఎస్ఐతో రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకుని సిఫారసు లేఖ ఇచ్చాడు. ఇంతలోనే విషయం తెలిసి ప్రస్తుతం ఉన్న ఎస్ఐ వెళ్లి అడగడంతో.. ఇంకో రూ.4 లక్షలు ఇస్తే ఏడాది కంటిన్యూ చేస్తానని చెప్పడంతో సదరు ఎస్ఐ మరో రూ.4 లక్షలు ముట్టజెప్పుకోవాల్సి వచ్చింది. ♦ఇదే మండల ఠాణాకు పక్కనే ఉన్న మరో మండల ఠాణా కోసం కరీంనగర్ త్రీటౌన్‌లో ఓ ఎస్ఐ నుంచి రూ.10 లక్షలకు కమిటై రూ.3 లక్షల అడ్వాన్స్ తీసుకొని సిఫారసు లేఖ ఇచ్చారు. మళ్లీ మానకొండూర్‌లో పనిచేస్తున్న ఓ ఎస్ఐతో రూ.15 లక్షలకు ఒప్పందం కుదరడంతో అతడికి పోస్టింగ్ ఇప్పించే ప్రయత్నం చేశారు. ♦ఇక ఓ మంత్రి సన్నిహితుడి సోదరుడి పోస్టింగు కోసం రూ.15 లక్షలు తీసుకొని పోస్టింగ్ వచ్చేలా చూడగా, మరో స్టేషన్‌కు ఇంకో మంత్రి సిఫారసు చేసినా, సంబంధిత ఎస్ఐ నుంచి రూ.5 లక్షలు తీసుకొని పోస్టింగ్ ఇప్పించినట్టు ఇంటెలిజెన్స్ విచారణలో బయటపడింది. పొలిటికల్ పోస్టింగులపై ప్రభుత్వ పెద్దల ఆగ్రహం పొలిటికల్ పోస్టింగుల వ్యవహారంలో డబ్బులు తీసుకొని మోసం చేసిన ఘటనలు ప్రభుత్వ పెద్దలను ఆగ్రహానికి గురిచేసినట్టు తెలిసింది. çసదరు ఎమ్మెల్యేపై పోలీస్ ఉన్నతాధికారులతో పాటు మంత్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అధికారుల నుంచి డబ్బులు తీసుకొని తిరిగివ్వకుండా చేస్తున్న వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలకు ఇంటెలిజెన్స్ నివేదిక అందినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. -
కరీంనగర్ జిల్లాలో ఇండోర్ స్టేడియం ప్రారంభం
-
కరీంనగర్ జిల్లా: యువతిని హత్య చేసిన యువకుడు
-
న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైన కరీంనగర్
-
కేసీఆర్‌తో రవీందర్ సింగ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి శాసన మండలి స్థానిక సంస్థల కోటాలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గురువారం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. సీఎం నుంచి అందిన ఆహ్వానం మేరకే రవీందర్‌సింగ్ ప్రగతిభవన్‌కు చేరుకున్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. భేటీ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలు సిక్కు సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను రవీందర్ సింగ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందిం చిన సీఎం రాబోయే రోజుల్లో పరిష్కారానికి హామీ ఇచ్చారు. రవీందర్‌సింగ్ వెంట సాదవేణి శ్రీనివాస్, గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము, వినయ్‌తో పాటు సిక్కు సామాజికవర్గం నాయకులు ఎక్బాల్ సింగ్, అర్బన్ సింగ్, ఇందర్‌సింగ్, దర్శన్‌సింగ్ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవిని ఆశించినా దక్కక! టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సర్దార్ రవీందర్ సింగ్ ఉద్యమ సమయంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో కరీంనగర్ మేయర్ పదవిని చేపట్టి దక్షిణ భారతదేశంలో ఈ పదవిని చేపట్టిన ఏకైక సిక్కు నాయకుడిగా రవీందర్‌సింగ్ నిలిచారు. స్థానిక సంస్థల ప్రతినిధిగా 20 ఏండ్ల అనుభవం కలిగిన రవీందర్ సింగ్‌కు కరీంనగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. అయితే మంత్రి గంగుల కమలాకర్, రవీందర్ సింగ్ నడుమ నెలకొన్న విభేదాలు హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మరింత ముదిరినట్లు ప్రచారం జరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించక పోవడం, ఈటల రాజేందర్‌తో కుమ్మక్కయినట్లు ప్రచారం జరగడంపై రవీందర్ సింగ్ మనస్తాపం చెందినట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తూ గత నెల 18న ఇందిరాపార్క్ ధర్నా వేదిక సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యపడక పోవడంతో రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్ సింగ్ 230కి పైగా ఓట్లు సాధించి టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులు, రెండు దశాబ్దాలతో తనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని తనను కలవాలని రవీందర్ సింగ్‌కు సీఎం కబురు పంపినట్లు సమాచారం. కేసీఆర్‌తో విభేదించిన నేతలెవరూ తర్వాతి కాలంలో ఆయనను కలిసిన దాఖలాలు లేవు. దీంతో రవీందర్ సింగ్ ఎపిసోడ్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. -
సర్కారు రథం.. సంక్షేమ పథం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ‘తెలంగాణ దళితబంధు పథకం’సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకంతో శ్రీకారం చుట్టింది. దేశంలోనే పెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని అత్యధిక కుటుంబాలకు అందించే పథకం ఇదే. దీనికింద రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున లబ్ధి కలగనుంది. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు వాసాలమర్రి గ్రామంలో మొత్తంగా 18,064 మందిని ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఒక్కో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో రూ.10లక్షల చొప్పున జమ చేసింది. భారీ మొత్తంలో సాయం అందించే ఈ పథకం 2021 సంవత్సరంలో రాజకీయరంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ పథకాన్ని తెస్తున్నారనే అంశంపై వివిధ పార్టీలు దుమారం రేపాయి. కానీ దళితుల సంక్షేమమే ముఖ్యమంటూ చెప్పిన ప్రభుత్వం హుజూరాబాద్‌లో సంతృప్తికరస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేసింది. లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఈ పథకాన్ని మరో నాలుగు మండలాల్లో సంతృప్తికరస్థాయిలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులోభాగంగా తిరుమలగిరి, చింతకాని, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో జాబితాను పూర్తి చేసిన ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. ప్రాథమికంగా ఎంపికైన లబ్ధిదారులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్ సిద్ధమయ్యాయి. ఇదిలావుండగా, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ఉద్దేశంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారుల ఎంపికకు ఉపక్రమించింది. ఎంపిక బాధ్యతలను స్థానిక శాసనసభ్యులకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ సాయం రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యానిధి పేరిట విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున సాయం అందిస్తోంది. ఒక లబ్ధిదారుకు అత్యంత ఎక్కువ సాయాన్ని అందించే పథకం విద్యానిధి అయినప్పటికీ... ఏటా లబ్ధిదారుల సంఖ్య వెయ్యికి మించడం లేదు. అయితే దళితబంధు కింద అందించే సాయం రెండో పెద్దది కాగా, వేల సంఖ్యల లబ్ధిదారులకు సాయం అందించడంతో ఈ పథకం రికార్డు సృష్టించడం విశేషం. -
Kondagattu: ఔషధాల ‘కొండగట్టు’
కొండగట్టు(చొప్పదండి): ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక నిలయం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని కొండపై ఈ క్షేత్రం ఉంది. సంవత్సరం పొడవునా ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఆరోగ్యం బాగోలేకపోయినా, మతిస్థిమితం సరిగా లేకపోయినా కొద్దిరోజులు కొండపై నిద్రచేస్తే నయం అవుతుందని భక్తుల విశ్వాసం. అయితే కొండపై ఆధ్యాత్మికతతో పాటు ఔషధ మూలికలు ఉన్నాయని ఇటీవల శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర ఆచార్యుల పరిశోధనలో వెల్లడైంది. 333 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండపై 300 రకాల ఔషధ మూలికల చెట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ చెట్టుపేరు కుమ్మరిపోనికి. ఇలాంటి మొక్కలు, చెట్లు కొండపై వందల సంఖ్యలో ఉన్నాయి. తెలుపు రంగులో ఉంటుంది. ప్రత్యేకంగా నిర్మల్ కొయ్యబొమ్మల తయారీలో వాడుకోవచ్చు. ఈ మొక్కలను వెటర్నరీ మందుల తయారీకి కూడా వాడుకోవచ్చని, మొత్తంగా కొండగట్టు అటవీ ప్రాంతాన్ని ‘కుమ్మరిపోనికి’ ఫారెస్టుగా కూడా పిలుస్తారని శాతవాహనయూనివర్సిటీ వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు నరసింహమూర్తి వెల్లడించారు. 333 ఎకరాలు.. 300 రకాల మొక్కలు కొండగట్టు గుట్ట విస్తీర్ణం 333 ఎకరాల్లో ఉంటుంది. కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ దాటాక కొండపైకి చేరుకునే మార్గంలో, ఘాట్‌రోడ్డు మార్గంలో, ఆలయం ఆవరణలో 300 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. గతంలోనూ కొండగట్టు అటవీప్రాంతంపై ఎస్సారార్ కళాశాల అధ్యాపకులు పరిశోధన చేశారు. మళ్లీ కొన్నేళ్లతరువాత శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు నరసింహమూర్తి, విద్యార్థి బాణవత్ సురేశ్ నాయక్ పరిశోధనలు చేయగా.. ఔషధమొక్కల గురించి తెలిసింది. జీవవైవిధ్యపరంగా ఇవి చాలా ముఖ్యమైనవని, వస్తువుల తయారీ, మనుషులు, జంతువుల మందుల తయారీలో ఉపయోగపడతాయని వారు వెల్లడించారు. మొక్కలు.. లాభాలు కొండగట్టు ప్రాంతంలో ఉన్నవి గిరి అడవులు(హిల్ఫారెస్ట్). ఎక్కువగా కుమ్మరిపోనికి చెట్లు ఉంటాయి. ఇవీ తెలుపు రంగులో ఉంటాయి. వృక్షశాస్త్ర పరంగా కైరోకార్పస్ అమెరికాన్స్గా పిలవబడతాయి. ప్రధానంగా ఎడ్లపాల, పాలకొడిసె, బిల్లుడు, తపసి, ఎర్రబోరుగా, నల్లకోడిసా, అందుకు, నల్లగా, ఎక్కువశాతం కుమ్మరిపోనికి, బ్యూటియా మోనోస్పెర్మ, టేకు, పోంగా, మియాపిన్, ఏటా కానుగు, తెల్లపోనికి, టేకు, నల్లాకోడిషా చెట్లతో పాటు వందల సంఖ్యలో ఔషధమొక్కలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తంగా కొండగట్టులోనే ఇలాంటి ఔషధమొక్కలు ఉన్నాయి. ఇవీ కొండపై ఆక్సిజన్ కలుషితం కాకుండా చేస్తాయి. వివిధ రకాల రోగాలు నయమయ్యేందుకు పనిచేస్తాయి. వర్షపాతం నమోదుకు దోహదపడి వర్షాలు పడేందుకు ప్రధానభూమిక పోషిస్తాయి. రామగిరి గుట్టల్లోనూ ఇలాంటి చెట్లు ఉన్నాయి. ఇతిహాసం చెబుతోందిదే..! ఇతిహాసంలో రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడి ప్రాణానికి అపాయం ఏర్పడినప్పుడు హనుమంతుడు సంజీవనిని తీసుకెళ్తున్న క్రమంలో కొండనుంచి ఓ రాయి పడి.. కొండగట్టుగా వెలిసిందని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలోనే వందలాది ఔషధమొక్కలు కొండపై పెరిగాయని, అవన్నీ ప్రాణాపాయంలో, దీర్ఘకాలికవ్యాధులతో బాధపడేవారికి సంజీవనిగా పనిచేస్తాయని, అందుకే చాలామంది అనారోగ్యంతో బాధపడేవారు కొండపై నిద్రచేస్తే, రోగాలు నయం అవుతున్నాయని భక్తుల విశ్వాసం. అడవి రక్షణ మనబాధ్యత వందలాది ఔషధమొక్కలున్న కొండప్రాంతంలోని అడవిని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పటికే ఇక్కడ వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. రోడ్డు, రైలుమార్గంతో ప్రజారవాణా పెరుగుతోంది. కొండపైకి వచ్చే భక్తులు విలువైన చెట్లను వంటచెరుకుగా వినియోగించడంతో అడవులు అంతరించిపోతున్నాయి. కొండగట్టు జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు మార్గాలు సిద్ధం చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవవైవిధ్యమండలికి అందిస్తాం. రాబోయేకాలంలో గుట్టపై సీట్బాల్ విసిరేలా సర్కారును కోరుతాం. కొండగట్టు పరిసర ప్రాంతాల వారు, వచ్చే భక్తులకు ఈ విషయంలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. మా పరిశోధన కూడా ఇంకా పూర్తికాలేదు... కొనసాగిస్తాం. – డాక్టర్ ఎలగొండ నరసింహమూర్తి, శాతవాహన విశ్వవిద్యాలయం, వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు మొక్కల సంరక్షణకు కృషి చెట్లతోనే మానవ మనుగడ. అవిలేకుంటే మనమూ లేము. కొండపై ఉన్న విలువైన ఔషధమొక్కల సంరక్షణ కోసం తోటమాలిని ఏర్పాటు చేశాం. ప్రతీ మొక్కకి నిత్యం నీరు పట్టడమే కాకుండా, నిత్యం సంరక్షిస్తున్నాం. కొండకు వచ్చే భక్తులకు చెట్ల ద్వారా ప్రశాంత వాతవరణం అందుబాటులో ఉంటోంది. నిత్యం నేనూ మై లైఫ్.. మై ట్రీస్ అనే విధంగా ఉంటా. – వెంకటేశ్, ఈవో, కొండగట్టు -
విషాదం: ఎయిర్ బ్యాగ్‌లూ పగిలి ప్రాణాలు గాల్లోకి, నలుగురు దుర్మరణం
మానకొండూర్: కారు డ్రైవర్ నిద్రమత్తు అతనితో సహా నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకున్నా ప్రమాద తీవ్రతకు అవి పగిలిపోవడంతో ముందు కూర్చున్న ఇద్దరి ప్రాణాలు నిలవలేదు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బంధువు దశదినకర్మకు కారులో వెళ్లి వస్తుండగా నిద్రమత్తులో డ్రైవర్.. కారును చెట్టుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో ముగ్గురు అన్నదమ్ములతోపాటు, కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి గాయప డ్డారు. కరీంనగర్ జిల్లా కేంద్రం జ్యోతినగర్‌కు చెందిన కొప్పుల శ్రీనివాస్‌రావు సిరిసిల్ల జిల్లా పంచాయతీరాజ్ ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. కొప్పుల బాలాజీ శశిధర్ పెద్దపల్లిలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కొప్పుల శ్రీరాజు ఆర్కిటెక్చర్ ఇంజనీర్. ఈ ముగ్గురు సోదరులు తమ బావ పెంచాల సుధాకర్‌రావుతో కలసి ఖమ్మం జిల్లా లో బంధువు దశదిన కర్మకు హాజరయ్యేందుకు గురువారం ఉదయం కరీంనగర్ నుంచి ఖమ్మంకు కారులో వెళ్లా రు. రాత్రి 10.30 గం. సమయంలో ఖమ్మం నుంచి కారు లో తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే కారు అతివేగంతో చెట్టును బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ ఇందూరి జలందర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎయిర్ బ్యాగ్‌లు ఓపెన్ అయినా.. దుర్ఘటన జరిగిన సమయంలో కారు ముందు భాగంలో ఉన్న ఎయిర్ బ్యాగ్‌లు ఓపెన్ అయినా ప్రాణాలు దక్కలేదు. కారు మితిమీరిన వేగంతో చెట్టును ఢీకొట్టడంవల్ల ఎయిర్ బ్యాగ్‌లు పగిలిపోయి ముందు భాగంలో కూర్చు న్న వ్యక్తితోపాటు, డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. ముందు భాగంలో కూర్చున్న మృతుల రక్తంతో రెండు ఎయిర్ బ్యాగ్‌లు తడిసిపోవడం ప్రమాద తీవ్రతను తెలి యజేస్తోంది. ప్రమాద సమయంలో కారు 100 కి.మీ.లకుపైగా వేగంతో ఉన్నట్లు భావిస్తున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. వాహనం హెడ్లైట్లు 30 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటనా స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారిథి, మానకొండూరు సీఐ కృష్ణారెడ్డి పరిశీలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సుధాకర్‌రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఓటరు ఎటువైపు?.. కీలకంగా చివరి 24 గంటలు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఇంకా ఒక్క రోజే ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల తీర్పు ఎటువైపు ఉం టుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది. శనివారం ఉద యం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండటంతో.. ప్రధాన పార్టీలు ఓటర్లకు గాలం వేసేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. కీలక నేతలు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లినా కూడా ఫోన్ల ద్వారా స్థానిక నేతలతో పూర్తిస్థాయిలో టచ్‌లో ఉంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ఉన్న కాస్త సమయాన్ని ఎలా ‘సద్వినియోగం’ చేసుకోవాలనే దానిపై ఆదేశాలు, సూచనలు ఇస్తున్నారు. ఏ మాత్రం పరిస్థితి చేయి దాటిపోకుండా అభ్యర్థులు, వారి అనుచరులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో డబ్బు, మద్యం, ఇతర బహుమతుల పంపిణీ భారీ ఎత్తున కొనసాగుతోందని స్థానికులు చెప్తున్నారు. (చదవండి: Jagtial Crime News: ముగ్గురు స్నేహితురాళ్ల ఆత్మహత్య?) అంచనాలకు అందకుండా.. ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో మాత్రం పరిస్థితి అంచనాలకు అందడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు నువ్వా, నేనా అన్నట్టుగా వ్యవహరించాయని.. పోలింగ్ మొదలైతేగానీ ఎవరి ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది స్పష్టంగా తెలిసే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఓటర్లలో చాలా వరకు గుంభనంగా వ్యవహరిస్తున్నారని ప్రధాన పార్టీల స్థానిక నేతలు చెప్తున్నారు. ఎవరినైనా పలకరిస్తే.. ఇప్పుడే ఏమీ చెప్పలేం అంటున్నారని, పోలింగ్ నాడే నిర్ణయించుకుంటామని చెప్తున్నారని పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఈటల రాజేందర్.. ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈటలను ఓడించి, తమ అభ్యర్థిని గెలిపించుకుని ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలతో వ్యవహరిస్తోంది. మరోవైపు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడం, రాష్ట్రంలో తిరిగి బలం పుంజుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు అన్నట్టుగా శ్రమిస్తున్నాయి. భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందంటూ ప్రచారం జరుగుతుండటంతో ఎన్నికల సంఘం కూడా స్పందించింది. గట్టిగా నిఘా పెట్టాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, పోలీసు సిబ్బందిని ఆదేశించింది. (చదవండి: బద్వేలు బరిలో లోపాయికారీ పొత్తులు!) ప్రలోభాల ‘వార్’! డబ్బులు, మద్యం పంపిణీకి సంబంధించి వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా యాప్స్‌లో విపరీతంగా పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఒకపార్టీ ఓటుకు రూ.6 వేలు, ప్రతిగా మరోపార్టీ రూ.10 వేలు పంచుతున్నట్టుగా వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా తమకు డబ్బులు రావడం లేదంటూ పలు గ్రామాల్లో జనం ఆందోళనలు చేయడం మరింత ఆసక్తిగా మారింది. బుధవారం హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో రెండు, మూడు చోట్ల కొందరు నిరసనలు తెలిపారు. గురువారం కూడా హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లో, రెండు మున్సిపాలిటీల పరిధిలోని పలుప్రాంతాల్లో కొందరు గుమిగూడి తమకు డబ్బులు రాలేదంటూ ధర్నాలు చేశారు. స్థానిక నేతలు తమకు పంచాల్సిన డబ్బును నొక్కేస్తున్నారని కొందరు ఆరోపణలు చేయడం, తమకు ఇవ్వడం లేదని నిలదీయడం వంటి ఘటనలు జరిగాయి. జోరుగా బెట్టింగ్‌లు రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొనగా.. దీనిని సొమ్ము చేసుకునేందుకు బెట్టింగ్ దందాలు మొదలైనట్టు సమాచారం. శనివారం ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోంది? పోలింగ్ శాతం పెరుగుతుందా, తగ్గుతుందా? ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? అన్న దానిపై విస్తృతంగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతమున్న అంచనాల మేరకు పోటాపోటీ నెలకొనే అవకాశం ఉందని.. అందువల్ల ప్రధాన పార్టీల మధ్య సమాన స్థాయిలో పందేలు నమోదవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. శనివారం పోలింగ్ సరళిని బట్టి బెట్టింగ్ ఊపందుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఎవరి ధీమా వారిదే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు తమదంటే తమదని టీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కాంగ్రెస్ గణనీయంగా ఓట్లు సాధిస్తుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టీఆర్ఎస్ తరఫున అన్నీతానే ప్రచారాన్ని ఉరకలెత్తించిన మంత్రి హరీశ్‌రావు.. ఏడున్నరేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తరహాలోనే హుజూరాబాద్‌లోనూ బీజేపీ ఊపు ఉంటుందని, గెలిచేది తామేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమాగా చెప్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ అధికార దుర్వినియోగానికి, ప్రలోభాలకు దిగాయని.. ప్రజలు తమ కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు. (చదవండి: ఎవరిని మభ్య పెట్టడానికి దీక్ష?) -
4 నెలల తర్వాత ఇంటిదారి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్‌లో ప్రచారం ముగియడంతో అన్నిపార్టీలకు చెందిన ఇతర ప్రాంతాల నేతలు, కార్యకర్తలు ఇంటిముఖం పట్టారు. నియోజకవర్గ ప్రజలు మినహా స్థానికేతరులంతా వెళ్లిపోవాలంటూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు, అధికారులు నియోజకవర్గం వ్యాప్తంగా నేతలు బస చేసిన ఇళ్లు, హోటళ్లు, అపార్ట్మెంట్లు, ఫంక్షన్‌హాళ్లలో తనిఖీలు నిర్వహించారు. బయటి ప్రాంతాల వారు వెళ్లిపోవాలని సూచించారు. కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు బుధవారం మధ్యాహ్నం నుంచే ఇంటిదారి పట్టారు. ముఖ్య నేతలు సాయంత్రం 7 గంటల వరకు కూడా ప్రచారం నిర్వహించి అక్కడి నుంచి బయలుదేరారు. ఈటల రాజేందర్ జూన్ 12న రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో వేడి మొదలైంది. అప్పటి నుంచి బుధవారం వరకు 130 రోజులకుపైగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు హుజూరాబాద్‌లో మకాం వేశారు. చాలా మంది మధ్యలో పండుగలు, ఇతర అత్యవసర సమయాల్లో తప్ప.. అక్కడే గడిపి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంత సుదీర్ఘంగా గడపడంతో చాలా మంది నేతలు, కార్యకర్తలకు హుజూరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని అంటున్నారు. నాలుగు నెలలకుపైగా ఇక్కడే ఉండి, అందరితో కలిసి పోయామని.. హుజూరాబాద్‌ను వీడుతున్నందుకు బాధగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరికొందరు నేతలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఏమిచ్చినా తీసుకోండి.. ఒట్టు వేయకండి
ఇల్లందకుంట (హుజూరాబాద్)/ కమలాపూర్: ‘టీఆర్ఎస్ పార్టీ ఏమిచ్చినా తీసుకోండి. కానీ ఒట్టు పెట్టకండి. అధికార పార్టీ ఓడిపోతుందని నిర్ధారణ అయింది. అందుకే నా మీద దాడికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు అండగా ఉండండి’ అంటూ మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి, కనగర్తి, లక్ష్మాజిపల్లి, మల్యాల గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, డబ్బులు ఇచ్చి ప్రమాణం చేయమని మాట తీసుకుంటున్నారని, ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కేసీఆర్ అహంకారం వల్ల వచ్చిన ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఇప్పటివరకు తడిసిపోయిన వడ్ల మొఖం చూడలేదుగానీ.. తనను ఓడగొట్టడమే లక్ష్యంగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు ప్రజల గొంతుకగా అసెంబ్లీలో అడుగుపెడతానని అన్నారు. ఈటల గెలిస్తే ప«థకాలు వెనక్కిపోతాయని అంటున్నారని, ఏ ఒక్క పథకం కూడా పోదని పేర్కొన్నారు. దళితబంధు పథకం దళితులందరికీ షరతులు లేకుండా ఇవ్వాలని, అలాగే బీసీబంధు కూడా ఇవ్వాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బాబూమోహన్, జూజుల శ్రీనివాస్, బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛ, హక్కులను కాలరాస్తున్నారు.. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, హక్కులను టీఆర్ఎస్ కాలరాస్తోందని ఈటల రాజేందర్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ లో ఆరు నెలలుగా లిక్కర్ బాటిళ్లు, నోట్ల కట్టలు, కుట్రలు, కుతంత్రాల పర్వం కొనసాగుతోం దన్నారు. టీఆర్ఎస్కు ప్రచారం చేయకపోయినా, ఓటు వేయకపోయినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని, పర్మనెంట్ ఉద్యోగులను బదిలీ చేస్తున్నారని.. ఇన్ని ప్రతిబంధకాల మధ్య హుజూరాబాద్ ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమ గుండెలో ఉన్న ఈటలకే ఈనెల 30న ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు. -
ఇంటికో ఓటు వేయండి...
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇంటికో ఓటు తమ పార్టీకి వేయాలంటూ వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. నియోజకవర్గంలోని 80వేల ఇళ్లలో ఇంటికో ఓటు తమకు వేయాలని, తద్వారా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై పోరాడేందుకు తమకు బలం ఇవ్వాలని కోరుతూ ముందుకెళ్తోంది. నియోజకవర్గంలోని నిరుద్యోగులు, ఫీజు రీయింబర్స్మెంట్ అందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్న నియోజకవర్గానికి చెందిన వేలాదిమంది నిరుద్యోగులకు త్వరలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పక్షాన లేఖలు రాయనున్నట్టు సమాచారం. ఈ లేఖలో నిరుద్యోగ సమస్యలను ప్రస్తావించడంతోపాటు పార్టీ నిరుద్యోగుల పక్షాన చేస్తున్న పోరాటాన్ని వివరిస్తూ తమకు ఓటు వేయాలని నిరుద్యోగుల తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేయనున్నారు. అదేవిధంగా గ్రామస్థాయి ప్రచారంలో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్ అందని విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నామని, వారి ఇళ్లకు ప్రత్యేకంగా వెళ్లి ప్రచారం చేస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చివర్లోనే ఉధృతంగా.. ఇప్పటికే నియోజకవర్గంలో పెద్దఎత్తున ప్రచారం చేపడుతున్న కాంగ్రెస్ ప్రచార చివరిదశలో మరింత ఉధృతం చేయాలని భావిస్తోంది. ఈనెల 25, 26, 27 తేదీల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. చివరి మూడు రోజుల్లో ఆయన దాదాపు 10 చోట్ల ప్రచారం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ అక్కడే ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఓమారు ప్రచారానికి వెళ్లి వచ్చిన వీహెచ్ శుక్రవారం మళ్లీ వెళ్లనున్నారు. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా ప్రచారానికి వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంమీద టీఆర్ఎస్, బీజేపీలకు దీటుగా ప్రచారం ముగించాలనే యోచనతో కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తుండటం గమనార్హం. -
ఆపింది.. మీరంటే మీరే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు పథకం నిలిపివేత రాజకీయ రగడకు దారితీసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసే వరకు ఆ పథకాన్ని ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆదేశించడంతో స్థానికంగా ఉన్న ప్రధాన పార్టీల నేతలు, దళితులు ఆందోళనలకు దిగారు. పథకం నిలిచిపోవడానికి కారణం ‘మీరంటే.. మీరు’అంటూ పోటాపోటీ నిరసనలకు దిగారు. సోమవారంరాత్రి సీఈసీ నుంచి ప్రకటన వెలువడగానే హుజూరాబాద్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అర్ధరాత్రి దాటాక మొదలైన ఈ నిరసనలు మంగళవారం కూడా కొనసాగాయి. ఇటు గులాబీ శ్రేణులు, అటు కాషాయదళాలు పరస్పరం సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్–బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నిరసనలకు దిగారు. ►జమ్మికుంటలో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ►జమ్మికుంట అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ విజయ ఆధ్వర్యంలో ఈటలదహనానికి వచ్చారు. అక్కడ బీజేపీ నేతలు ఎదురుపడటంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ►జమ్మికుంట మండలం కోరపల్లిలోనూ బీజేపీ–టీఆర్ఎస్ నాయకులు దిష్టిబొమ్మ దహనాలకు యత్నించడంతో తోపులాట జరిగింది. ►వీణవంక మండలం వలబాపూర్ రహదారిపై ఈటలకు వ్యతిరేకంగా దళితులు ధర్నా చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశా రు. వీణవంక బస్టాండ్ వద్ద మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 15 గ్రామా ల్లో ఈటల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. జమ్మికుంటలో పోలీసులు, బీజేపీ నేతల వాగ్వాదం -
బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి: హరీశ్
హుజూరాబాద్/కమలాపూర్: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పలువురు ఆ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘చేనేత కార్మికులు బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్పాలి. ఏడేళ్లలో నేత కార్మికులకు బీజేపీ ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలి’అని హరీశ్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల కోసం ఏ ఒక్క పథకమైనా ఆ పార్టీ తెచ్చిందా.. అని ప్రశ్నించారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డును బీజేపీ రద్దు చేయగా, నేతన్నకు టీఆర్ఎస్ చేయూతనందించిందని పేర్కొన్నారు. చేనేత కార్మికుల నోట్లో మట్టికొట్టిన పార్టీకి ఓటేయ్యొద్దని సూచించారు. మూణ్ణెళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన ఈటల రాజేందర్ ఇప్పుడు ఆ పార్టీకి ఎలా కొమ్ముగాస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ ఉందని, గెల్లు శ్రీనివాస్ బ్రహ్మండంగా గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. బీజేపీ నాయకులు మోకాళ్ల మీద యాత్ర చేసినా ఈ విజయాన్ని ఆపలేరని ఎద్దేవా చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ఆదివారం రాత్రి జరిగిన ధూంధాం కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ కమలాపూర్ గడ్డ.. టీఆర్ఎస్ అడ్డా అని, ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి రాకముందే ఇక్కడ గులాబీ జెండా ఎగిరిందని, ఆయన పార్టీని వీడిపోయిన తర్వాత కూడా ఇక్కడ గులాబీ జెండానే ఎగురుతుందని అన్నారు. ఈటల తాను రాసుకున్న బురదను మనందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నాడని, తన బాధను మన బాధగా మార్చుకుని ఆగం కావద్దని, మనందరి బాధలు తీర్చే కేసీఆర్‌కు అండగా ఉండాలని హరీశ్‌రావు కోరారు. కాగా, ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చారు. గులాబీ గూటికి దాసరి భూమయ్య తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రెండేళ్ల క్రితం పోలీసుశాఖలో ఉద్యోగ విరమణ పొందిన ఆయన మొదటగా కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం తీన్మార్ మల్లన్న టీమ్‌లో సభ్యుడిగా పనిచేశారు. తాజాగా తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భూమయ్య గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. -
భూములు లాక్కున్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
వీణవంక: ‘నా భార్య, నేను ఎవరినుంచైనా భూములు లాక్కున్నామని నిరూపిస్తే.. ముక్కు నేలకు రాస్తా. మేము తప్పు చేయలేదని తేలితే కేసీఆర్.. ముక్కు నేలకు రాస్తావా’అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ‘ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇచ్చినా సీఎం సీటుకు ఈటల ఎసరు పెట్టిండని హరీశ్‌రావు అంటున్నారు. ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెట్టానని నన్ను తీసేశారా..? లేక భూములు ఆక్రమించుకున్నానని తీసేశారా? ఏది నిజం, ఏది అబద్ధమో తేల్చాలి’అని అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కోర్కల్, నరసింహులపల్లి గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీఆర్ఎస్ నేతల అండదండలతో అధికారులు పిచ్చి పనులు చేస్తే వారి భరతం పడతామని హెచ్చరించారు. ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు ఈటల వెంట తిరిగితే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని, వీఆర్ఏ, వీఆర్వో, జీపీ కార్యదర్శులను సైతం బెదిరిస్తున్నారని అన్నారు. ఐదు నెలలుగా నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు ఊర్లను బార్లుగా మార్చారని మండిపడ్డారు. టీఆర్ఎస్ వాళ్లు బెదిరిస్తే బెదిరే వాళ్లు ఎవరూ లేరని, తిరగబడే వాళ్లు ఈటల వైపు ఉన్నారని పేర్కొన్నారు. అన్ని మండలాలు ఒక ఎత్తైతే వీణవంక మండలం ఒక ఎత్తు అని, వీణవంక ప్రజలు మర్యాదలకు లొంగుతారని, బెదిరిస్తే మాత్రం భరతం పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హుజురాబాద్ ప్రజలు నా వెంటే ఉన్నారు: ఈటల
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ప్రజలు తన వెంటే ఉన్నారని, ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేస్తే శిక్ష తప్పదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని, రాజీనామా చేసి ఐదు నెలలు అయిందని అన్నారు. ఐదు నెలల నుంచి ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి మంత్రి హరీష్ రావు రంగనాయక సాగర్ నుంచి అరడజను మంది మంత్రులు హుజురాబాద్ మీద పడ్డారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఆపహస్యం చేసేలా వ్యవహరించారని, హుజురాబాద్ ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేసి అనేక ప్రలోభాలకు గురి చేశారని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన తొనకకుండా జంకకుండా అండగా హుజురాబాద్ ప్రజానీకం నిలిచిందన్నారు. చదవండి: హుజురాబాద్, బద్వేల్ నియోజకవర్గాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల స్వయంగా మంత్రి హరీష్‌రావు సర్పంచ్ల మీద ఎంపీటీసీల మీద చిందులేశాడని ఫైర్ అయ్యారు. తాను దమ్మనపేటలోని సమ్మిరెడ్డి ఇంటికి వెళితే 10 రోజుకు అతన్ని ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. హుజురాబాద్‌లో సర్పంచ్‌లు ఇతర ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల మీద నమ్మకము లేదని, సిద్దిపేట, ఇతర ప్రాంతాలను నుంచి జనాల్సి తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇసుక ట్రాక్టర్ నడవాలంటే, పెన్షన్ రావాలంటే టీఆర్ఎస్కు ఓటు వేయాలని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. దళితబంధు రావాలంటే టీఆర్ఎస్ జెండా కట్టాలని, ఆశ వర్కర్, ఏఎన్ఎమ్ల కుటుంబ సభ్యులు వేరే పార్టీలతో తిరగవద్దని హుకుం జారీ చేశారని మండిపడ్డారు. తనలో ఓ కండక్టర్ కరచాలము చేస్తే అతన్ని తీసుకుపోయి సిరిసిల్లకు పంపారని తెలిపారు. ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా పోరాడాలని అన్నారు. తాను చేసిన 18 సంవత్సరాల సేవ ఇప్పుడు కనబడుతుందని తెలిపారు. బెదిరింపులు, కుట్రలతో హుజురాబాద్ ప్రజలను ఏమి చేయలేరని ఈటల అన్నారు. -
మీ బెదిరింపులకు ఎవరు భయపడరు: హరీష్‌రావు
-
TS: 50 వేల మెజార్టీతో గెల్లు గెలుపు ఖాయం
హుజూరాబాద్/సిద్దిపేటరూరల్: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 50 వేల మెజార్టీతో గెలుస్తారని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని జమ్మికుంట రోడ్లో ఆదివారం మున్నూరుకాపు భవనానికి మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి భూమిపూజ చేసిన అనంతరం వారి ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ప్రజలకు చేసిందేమీ లేకనే హుజూరాబాద్‌లో బొట్టు బిళ్లలు, గోడ గడియారాలు, కుట్టుమెషీన్లు, గ్రైండర్లు పంచుతున్నారని, ప్రజలు వాటిని పట్టించుకోకుండా ఇక్కడ ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అనంతరం మున్నూరుకాపు సంఘం నాయకులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానపత్రాన్ని మంత్రికి అందజేశారు. కేంద్రానికి రైతుల ఉసురు రైతు వ్యతిరేక చట్టాల అమలు, దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయమని చెప్పడం, డీజిల్ ధరల పెంపు, మార్కెట్ల ఎత్తివేత వంటి చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు జరుగుతున్నా కేంద్రం మొండిపట్టుదలకు పోతుందని ఆయన విమర్శించారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం చింతమడక మధిర గ్రామం అంకంపేటలో నిర్మించిన డబుల్బెడ్రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. రాబోయే రోజుల్లో సంగారెడ్డి వరకు మల్లన్నసాగర్ జలాలను తరలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీదేవిచందర్‌రావు, సర్పంచ్ హంసకేతన్‌రెడ్డి, సీనియర్ నాయకులు బాలకిషన్‌రావు పాల్గొన్నారు. -
Heavy Rain: కరీంనగర్.. అతలాకుతలం
సాక్ష, కరీంనగర్: భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఆగకుండా వాన కురుస్తూనే ఉండటంతో.. జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. వాగులు ఉప్పొంగడంతో పెద్ద సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. శాతవాహన వర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ► కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో కమాన్‌పూర్ వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. సైదాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి మండలాల్లో రోడ్లు తెగిపోయాయి. కరీంనగర్ పట్టణంలోని ఆర్టీసీ వర్క్ షాప్, విద్యానగర్, కట్టరాంపూర్, జ్యోతినగర్, రాంనగర్, మంకమ్మతోట, హోసింగ్‌బోర్డ్ ప్రాంతాలు నీటమునిగాయి. జగిత్యాలకు వెళ్లే హైవేపై భారీగా నీరు నిలిచింది. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. కరీంనగర్లో ఆర్టీసీ వర్క్‌షాప్ ప్రాంతంలో రోడ్డుపై భారీగా నిలిచిన నీరు ► కుండపోత వానతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం చెరువుగా మారిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. కొత్త చెరువు పొంగడంతో కరీంనగర్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సిరిసిల్ల కొత్త కలెక్టరేట్ మళ్లీ వరదలో చిక్కుకుంది. సిరిసిల్ల పట్టణంలో చేనేత పరిశ్రమలు ఉండే పలు ప్రాం తాలు నీటమునిగాయి. ► కుండపోత కారణంగా జగిత్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇబ్రహీంపట్నం మండలంలో గోదావరిలో ముగ్గురు గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. కథలాపూర్ మండ లం తుర్తి గ్రామం వద్ద బ్రిడ్జి కూలిపోయింది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్లో పలు కాలనీలు నీటమునిగాయి. సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామ శివారులోని చెరువు మత్తడి నీటిలో కారు కొట్టుకుపోగా, చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్న ఉత్తరప్రదేశ్ యువకుడు ► సిరిసిల్లను వరద ముంచెత్తడంతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి సమీక్షించారు. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. మంత్రి ఆదేశాల మేరకు.. హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందాలు, జీహెచ్ఎంసీ నుంచి మరో బృందం సిరిసిల్లకు చేరి సహాయక చర్యలు చేపట్టింది. ముంపు ప్రాంతాల్లోని బాధితులను బోట్లలో పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ఉధృతికి వేములవాడలోని మూల వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. కాగా, ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం జల దిగ్బంధమైంది. ఇక, ఆసియా ఖండంలోనే మొదటిదైన సరళాసాగర్ ప్రాజెక్టు సైఫన్లు మరోసారి ఆటోమేటిగ్గా తెరుచుకున్నాయి. వరద పోటెత్తడంతో ఉడ్ సైఫన్లు తెరుచుకుని నీరు దిగువనకు విడుదలవుతోంది. -
16 గేట్లు ఎత్తి నీళ్లు వదులుతున్న అధికారులు
-
కరీంనగర్ జిల్లాలో విజృంబిస్తున్న విష జ్వరాలు
-
Dalit Bandhu: రాధమ్మ మీ ఇంటికొచ్చి చాయ్ తాగుతా..
రాజే తలచుకుంటే దెబ్బలకు కొదువా..? ప్రభుత్వమే తలచుకుంటే పథకం ఇవ్వలేదా? పథకం కేవలం 15 మందికేనా అని కొందరు ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో ఉన్న 21,000 దళిత కుటుంబాలకు రెండు నెలల్లో పథకం అమలు చేస్తాం. నియోజకవర్గానికి ఇచ్చిన రూ. 500 కోట్లకు అదనంగా 15 రోజుల్లో మరో రూ. 2,000 కోట్లు మంజూరు చేస్తాం. రూ. 1.75 లక్షల కోట్లు.. నాయకుడికి చేసే పనిమీద వాక్శుద్ధి, చిత్తశుద్ధి, అవగాహన ఉంటే పనులు అవే సాగుతాయి. దళితబంధు పథకాన్ని ముమ్మాటికీ 100 శాతం విజయవంతం చేసి తీరుతాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. వీరందరి కోసం రూ.1.75 లక్షల కోట్లను మూడు, నాలుగేళ్లలో ఖర్చు చేస్తాం. అయితే నిరుపేదలకు ముందు ఇస్తాం, తర్వాత మిగతా కుటుంబాలకు ఇస్తాం. ఇప్పటికీ పేదరికంలోనే.. రిజర్వేషన్ల వల్ల విద్య, ఉపాధి రం గాల్లో దళితులకు కొన్ని అవకాశాలు చిక్కాయి. అయినా 95% మంది ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నారు. అందుకే ఆఖరి దశలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ‘దళితబంధు’అందజేయాలని అనుకుంటున్నాం. దీని లబ్ధిదారులకు ఇతర పథకాలేవీ రద్దు కావు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘రాష్ట్రంలో దళితుల సామాజిక ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు.. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే ‘దళితబంధు’పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. దళితవాడలు బంగారు మేడలవ్వాలి.. దళిత జాతి రత్నాలను, దళిత శక్తిని బయటికి తీయాలన్నది మా సంకల్పం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పేదరికం, ఆకలి, వివక్ష, అవమానాలతో వెనుకబడిన దళిత సమాజం అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి వేదికగా సీఎం కేసీఆర్ సోమవారం దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభా వేదికపై అంబేడ్కర్, జగ్జీవన్రామ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి మాట్లాడారు. చివరిలో జైభీమ్, జై దళితబంధు అంటూ ముగించా రు. ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా.. ‘‘సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ‘దళితబంధు’పథకానికి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఎనిమిదేళ్ల నాటి సర్వే కావడంతో ఇప్పుడు అదనంగా రెండుమూడు వేల మంది లబ్ధిదారులు పెరిగినా నష్టమేమీ లేదు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ అమలు చేసి తీరుతాం. హుజూరాబాద్ ఒక ప్రయోగశాల. గతంలో ఇక్కడే రైతు బంధును ప్రారంభించాం. ఇప్పుడు అదే సెంటిమెంటుతో దళిత బంధును ప్రారంభిస్తున్నాం. దీనిని నూటికి నూరుపాళ్లు విజయవంతం చేసితీరుతాం. ఈ పథకాన్ని ప్రకటించాక కొందరు చిల్లరమల్లర విమర్శలు చేశారు. నేను స్పందించలేదు. స్పందించి మొత్తం వివరాలు చెప్పి ఉంటే.. ఆనాడే ఆ నాయకుల గుండెలు ఆగి మరణించేవారు. అలాంటి వారిని చూసి ఆగం కావొద్దు. సోమవారం హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, దళితబంధు లబ్ధిదారులు 25 ఏళ్లనాటి ఆలోచన.. ఈ పథకం ద్వారా దళిత వాడలను బంగారు మేడలు చేయడమే మా లక్ష్యం. వాస్తవానికి దళితబంధు ఆలోచన ఈనాటిది కాదు. 25ఏళ్ల క్రితం నేను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి పేరిట వారి అభ్యున్నతికి పాటుపడ్డాం. గత ఏడాదే ఈ పథకం ప్రారంభించాల్సి ఉంది. కరోనా కారణంగా ఏడాది వాయిదా పడింది. దళితబంధు పథకం నిధులతో మీకు నచ్చిన, వచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు. వాహనాలు, సూపర్ మార్కెట్లు, హార్వెస్టర్లు, బార్లు, వైన్‌షాపులు, ఎలక్ట్రిక్ వ్యాపారాలు ఏది చేసినా.. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు మీకు మార్కెటింగ్ కల్పిస్తాయి. ఈ మేరకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తాం. పొరపాటున లబ్ధిదారులు మరణిస్తే వారి కుటుంబం ఆపదకు లోనుకాకుండా దళిత రక్షణనిధి నుంచి సాయం అందిస్తాం. కొత్తగా ‘దళిత బంధు’ఖాతాలు దళితబంధు పథకం కింద ఇచ్చే సొమ్ముకు బ్యాంకుల నుంచి కిస్తీల బాధ ఉండదు. మీ డబ్బుకు మీరే యజమానులు. బ్యాంకు వారు పాత బకాయిలు కట్ చేసుకోకుండా కొత్తగా దళితబంధు పేరుతో ఖాతాలు తెరిపించే బాధ్యతలను జిల్లా కలెక్టర్లు తీసుకుంటారు. దళితబంధు పథకం కాదు.. ఇదొక మహా ఉద్యమం. దేశమంతా ఈ ఉద్యమం పాకాలి. అందుకు హుజూరాబాద్ పునాది రాయి కావాలి. పథకం అమలుకోసమే కర్ణన్‌ను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నియమించాం. దళిత జాతి అభ్యున్నతికి, ఉద్యమకారులకు అండగా నిలిచిన బొజ్జా తారకం కుమారుడు ఐఏఎస్ అ«ధికారి, ఎస్సీ వెల్ఫేర్ సెక్రెటరీ రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీగా ప్రకటించాం. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లిలో దళితబంధు ప్రారంభోత్సవ సభకు హాజరైన ప్రజలు విద్యార్థులు గ్రామాలకు వెళ్లాలి దళితబంధు పథకం విజయవంతం అయ్యేలా దళిత మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు చైతన్యం కల్పించాలి. ముఖ్యంగా విద్యార్థులు ప్రతీ గ్రామానికి వెళ్లి ‘గో టు విలేజేస్ అండ్ ఎడ్యుకేటెడ్ అవర్ మాసెస్’అన్న నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టాలి. ఎక్కడా లేని స్థాయిలో సంక్షేమ పథకాలు కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతులకు రూ.లక్ష కోట్లకుపైగా, యాదవులకు రూ.11 వేల కోట్లకుపైగా కేటాయించాం. మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వృద్ధాప్య పింఛన్లు తదితర విజయవంతమైన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు..’’ మీ ఇంటికొచ్చి చాయ్ తాగుతా.. సభలో ప్రసంగం అనంతరం సీఎం కేసీఆర్ 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. తొలి చెక్కును రాధమ్మ అనే మహిళకు ఇచ్చారు. ఈ డబ్బుతో ఏం చేస్తావని కేసీఆర్ ఆమెను అడగ్గా.. తనకు డెయిరీ అంటే ఆసక్తి ఉందని రాధమ్మ చెప్పింది. దీనిపై స్పందించిన సీఎం.. ‘‘అయితే.. మళ్లీ వచ్చినప్పుడు మీ ఇంట్లో చాయ్ తాగుతా’ అని పేర్కొన్నారు. జంబో వేదిక.. శాలపల్లి సభలో విశాల వేదికను ఏర్పాటు చేశారు. కీలక మంత్రులు, ఎమ్మెల్యేలంతా వేదికపై ఆసీనులు కావడం గమనార్హం. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు కె.కేశవరావు, లక్ష్మీకాంతరావు, సురేశ్‌రెడ్డి, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, సుంకె రవిశంకర్, దానం నాగేందర్, తాటికొండ రాజయ్య, శంకర్‌నాయక్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, రేఖానాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్‌బాబు, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, కోరుకంటి చందర్, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తాజా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వేదికపై కూర్చున్నారు. గోప్యంగా లబ్ధిదారుల తరలింపు – చివరి నిమిషం దాకా బయటపెట్టని వైనం – వేదిక వెనుక నుంచి తీసుకువచ్చిన అధికారులు సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ‘దళితబంధు’ పథకాన్ని అందుకునే లబ్ధిదారుల పేర్లను అధికారులు చివరివరకు గోప్యంగా ఉంచారు. వారికి ఆదివారం రాత్రే సమాచారం ఇచ్చారు. సోమవారం ఉదయమే వెళ్లి లబ్ధిదారులను, వారి కుటంబసభ్యులను ప్రత్యేక వాహనాల్లో సభ వద్దకు తీసుకువచ్చారు. సభ వద్ద కూడా వారు ఎవరికంటా పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. వెనుకవైపు వీఐపీ మార్గం ద్వారా వేదికపైకి పంపించారు. సభ వద్ద ఆయా లబ్ధిదారులు ‘సాక్షి’ ప్రతినిధులతో మాట్లాడారు. డెయిరీ పెట్టుకుంటా.. మేం కూలి పనిచేసుకొని బతుకున్నాం. ఈ 10 లక్షలతో పాడి పశువులు కొని డెయిరీ పెట్టాలనుకుంటున్నాం. సాయం రావడం కలలో కూడా ఊహించలేదు. కేసీఆర్ సార్.. మా బతుకుల్లో వెలుగులు నింపిండు. -కొత్తూరిరాధ–మొగిలి, కనుకులగిద్ద, హుజూరాబాద్, తొలి లబ్ధిదారు ట్రాక్టర్ తీసుకుంటం అధికారులు వచ్చేంత వరకూ నా పేరు ఎంపికయిందని తెలియదు. ఆర్థిక సాయంతో ట్రాక్టర్ కొనుక్కోవాలని అనుకుంటున్నా. నా కుమారుడికి ట్రాక్టర్ అప్పజెబుతా. మాకున్న ఎకరం భూమికి మరింత భూమి కౌలు తీసుకుని, దున్నుకోవాలని ఆలోచిస్తున్నం. -రవీందర్, కన్నూరు, కమలాపూర్ భూమి కొనుక్కుంటా.. మాకు భూమి లేదు. మేమిద్దరం కూలీలమే. ప్రభుత్వం అందించిన రూ.10 లక్షలతో 20 గుంటల భూమి కొనుక్కుంటాం. సీఎం చేసిన ఈ సాయాన్ని ఎన్నటికీ మరువలేం. మాకు వస్తదనుకోలే.. - రాధిక, శనిగరం, కమలాపూర్ మండలం అధికారులు సూచించినట్టు చేస్తా.. నేను దినసరి కూలీని. దళిత బంధు సాయానికి ఎంపికైనట్టు ఉదయం దాకా తెలియదు. ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. అధికారులు ఎట్ల చెప్తే అట్ల చేసుకుంటా. -బాజాల సంధ్య, హుజూరాబాద్ మండలం సీఎం చేతుల మీదుగా చెక్కులు అందుకున్నది వీరే.. 1. కొత్తూరి రాధ–మొగిలి, హుజూరాబాద్ రూరల్ 2. రొంటల రజిత– సరిత, హుజూరాబాద్ అర్బన్ 3. కొత్తూరి స్రవంతి – కనకం 4. శనిగరపు సరోజన – రవీందర్ 5. చెరువు ఎల్లమ్మ – రాజయ్య, జమ్మికుంట మండలం నగరం గ్రామం 6. రాచపల్లి శంకర్– మౌనిక, జమ్మికుంట టౌన్ 7. పిల్లి సుగుణ– మొగిలి, జమ్మికుంట రూరల్ 8. సంధ్య బాజాల– గంగయ్య 9. కడెం రాజు– వినోద, ఇల్లందకుంట 10. కసరపు స్వరూప– రాజయ్య, వీణవంక 11. ఎలుకుపల్లి కొమురమ్మ– రాజయ్య, చల్లూరు 12. కనకం రవీందర్– హరిత, కమలాపూర్ 13. నామపెల్లి రాజేందర్ 14. మాట్ల సుభాష్– మనెమ్మ 15. రాజేందర్, కమలాపూర్ -
బీజేపీ నేతపై మంత్రి గంగుల కమలాకర్ ఫిర్యాదు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని బీజేపీ నాయకుడు, న్యాయవాది భేతి మహేందర్ రెడ్డిపై మంత్రి గంగుల కమలాకర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన వ్యక్తిగత రాజకీయ పరువుకు నష్టం కలిగించేలా మహేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల పోలీసులను కోరారు. మంత్రి ఫిర్యాదుపై స్పందించిన టూ టౌన్ పోలీసులు భేతి మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. -
పెట్రోల్‌లో నీళ్లు..
-
మధ్యలో ఆగిన బండి.. మొత్తం నీరే పెట్రోల్ లేనే లేదు!
కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్‌లో నీరు కలిపి పోశారంటూ వాహనదా రులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ఉదయం 11 గంటలకు దుర్శేడ్‌కు చెం దిన బత్తిని శివ తన వాహనంలో పెట్రోల్ పోయించుకున్నాడు. కొంతదూరం వెళ్లినతర్వాత వాహనం ఆగిపోవడంతో స్థానికంగా ఉన్న మెకానిక్కు చూ పించాడు. కల్తీ పెట్రోల్ పోసినట్లు అతను చెప్ప డంతో బంకుకు తిరిగి వచ్చిన శివ, అక్కడి సిబ్బంది తో వాగ్వాదానికి దిగాడు. అనుమానంతో బాటిల్లో పెట్రోల్ పోసి చూడగా సగానికిపైగా నీళ్లు ఉండటంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. వారు సిబ్బందిని ప్రశ్నించగా సాంకేతిక సమస్యతో నీళ్లు వచ్చాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పలువురు వాహనదారులు అక్కడికి వచ్చి కల్తీ పెట్రోల్ పోశారని ఆందోళనకు దిగారు. దీంతో బంకు సమీపంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీళ్లు నిల్వ ఉండి పెట్రోల్ ట్యాంకు లోపలికి రావడంతో నీళ్లు వస్తున్నాయంటూ నిర్వాహకులు చెప్పారు. చివరకు వాహనదారుల ఆందోళనతో నిర్వాహకులు పెట్రోల్ బంకును మూసివేశారు. కల్తీ పెట్రోల్‌పై బత్తిని శివ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
రోడ్డు పక్క బావి.. కారును మింగేసింది..
కరీంనగర్ క్రైం/చిగురు మామిడి: రోడ్డు పక్కనే ఉన్న ఓ వ్యవసాయ బావి మృత్యు బావిగా మారి ఓ కారును మింగేసింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ శివారులో జరిగింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న కారు గురువారం ఉదయం 11.00 సమయంలో అదుపుతప్పి రోడ్డుకు కుడివైపున ఉన్న బావిలో పడింది. వెనుకాలే కారులో వస్తున్న ఓ వ్యక్తి ఈ విషయం గమనించి కాపాడాలని ప్రయత్నించినా ఎవరూ లేకపోవడంతో కుదరలేదు. దీంతో వెంటనే స్థానికులను పిలుచుకొచ్చాడు. సుమారు 30 నిమిషాల పాటు కారు నీటిపై తేలి ఆ తర్వాత మునిగిపోయింది. క రీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారథి, తిమ్మాపూర్ సీఐ శశిధర్‌రెడ్డి, చిగురుమామిడి ఎస్సై మధుకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్లతో సహాయక చర్య లు చేపట్టగా, కారు ఆచూకీ లభించలేదు. గజ ఈతగాళ్లతో గాలించగా, ఫలితం లేకుండాపోయింది. 8 గంటలు శ్రమించి.. మొదట కారులో ముగ్గురు లేదా నలుగురు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఫైరింజన్, రెండు క్రేన్ల ద్వారా కారును వెలికితీసేందుకు చేపట్టిన చర్యలు మొదట విఫలమయ్యాయి. రెండు, మూడు సార్లు క్రేన్‌కు చిక్కినా జారిపోయింది. రెండు మోటార్ల సాయంతో నీటిని తోడించినా ఫలితం దక్కలేదు. ఆఖరికి రాత్రి 8 గంటలకు పెద్ద క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. మృతుడు రిటైర్డ్ ఎస్సై.. కారును బయటికి తీశాక.. అందులో ఒక్కరి మృతదేహం లభించింది. మృతుడు కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో నివాసం ఉండే రిటైర్డ్ ఎస్సై అని పోలీసులు గుర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ తండాకు చెందిన రిటైర్డ్ ఎస్సై పాపయ్య నాయక్ (62)గా గుర్తించారు. గతంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఎస్సైగా విధులు నిర్వహించి రిటైర్ అయినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. పాపయ్యనాయక్కు భార్య భారతి, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బుద్ధయ్య నీ కోసమే డ్యూటీ చేసిన్నా అన్నా.. మానకొండూర్ డివిజన్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అందులో పాపయ్య నాయక్ సొంత తమ్ముడు బుద్ధయ్య నాయక్ కూడా ఉన్నాడు. బావిలో పడి చనిపోయింది తన అన్న అని తెలియకుండానే.. 9 గంటల పాటు సాయం అందించాడు. చివరకు మృతుడు తన అన్న తెలియడంతో ‘అన్నా ఇంతసేపు నీకోసమే డ్యూటీ చేసిన్నా.. బాయిల పడ్డది నువ్వేనా’అంటూ కన్నీరు మున్నీరయ్యాడు. -
వలలో 20 కిలోల చేప.. మనోడికి పండగే పండగ
రుద్రంగి (వేములవాడ): ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, కలికోట శివారులోని సూరమ్మ చెరువు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత అలుగు దూకింది. దీంతో శుక్రవారం సూరమ్మ ప్రాజెక్టులో నుంచి భారీ ఎత్తున చేపలు బయటకు వచ్చాయి. వాటిని పట్టేందుకు రెండు గ్రామాల ప్రజలు పోటెత్తారు. పెద్ద చేపలు పడడంతో జాలరుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కలికోటకు చెందిన ఎల్ల రాజు వలకు దాదాపు 20 కిలోల చేప చిక్కింది. దాన్ని విక్రయించగా రూ.1,600 వచ్చినట్లు రాజు చెప్పాడు. మానేరు అందాలు.. చూడగానే వాహ్.. అనిపించే ఈ సుందర దృశ్యం కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు ప్రాజెక్టుది. ఎగువ నుంచి వస్తున్న వరదకుతోడు స్థానికంగా కురుస్తున్న వానలతో మానేరు డ్యామ్ జలకళతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. భారీగా వరద వస్తుండడంతో అధికారులు గురువారం రాత్రి 12 గేట్లను తెరిచారు. శుక్రవారం మరో ఆరు గేట్లను తెరిచారు. మొత్తం 18 గేట్ల ద్వారా లోయర్ మానేరు డ్యామ్ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. నిండుకుండలా కనిపిస్తున్న డ్యామ్.. పచ్చని పొలాలు.. ఆ పక్కన కరీంనగర్ నగరం.. ఆకట్టుకునే హైదరాబాద్ హైవే.. తీగల వంతెనను తాకుతూ వరద వెళ్తుండడంతో ఆ దృశ్యం మరింత ఆకర్షణీయంగా మారింది. – కరీంనగర్ సీనియర్ ఫొటోగ్రాఫర్, శైలేంద్రారెడ్డి చెరువు అలుగే జలపాతమై.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని జానకీబాయి చెరువు పూర్తిగా నిండటంతో 40 అడుగుల ఎత్తు ఉన్న అలుగు నుంచి జలపాతాన్ని తలపిస్తూ నీరు కిందికి జాలువారుతోంది. వర్షాకాలం ముగిసేంత వరకు ఈ అలుగు పర్యాటకులను ఆకర్షిస్తోంది. గత రెండేళ్లుగా పర్యాటకులు పెరగడంతో వారి భద్రతకోసం మరిన్ని సౌకర్యాలు కల్పించినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. – ఇందల్వాయి, రాజ్‌కుమార్ -
భయపడే ప్రసక్తే లేదు.. చావుకైనా సిద్ధం: ప్రవీణ్ కుమార్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోలీసు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్వేరోస్ వ్యవస్థాపకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. బహుజన రాజ్యాధికార సాధన కోసం మరణించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. పదవీ విరమణ చేసిన మరుసటి రోజే పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని తెలిపారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన స్వేరోస్ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోట్లాది మంది ప్రవీణ్‌కుమార్‌లు పుట్టుకొస్తారు అంబేడ్కర్ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఒక్క ప్రవీణ్‌కుమార్‌పై కేసులు పెడితే కోట్లాది మంది ప్రవీణ్‌కుమార్‌లు పుట్టుకొస్తారని వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావని తన తల్లి ప్రశ్నిస్తే కోట్లాది మంది దళిత బిడ్డలను బాగు చేసేందుకే రాజీనామా చేశానని చెప్పానని తెలిపారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి నాలుగేళ్ల చిన్నపిల్ల ఎంతో చక్కగా మాట్లాడిందని, అలాంటి ధైర్యం ఆ 29 మంది ఎమ్మెల్యేలకు ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేదని విమర్శించారు. హుజురాబాద్‌లో దళితబంధు పథకాన్ని రూ.వెయ్యి కోట్లతో అమలు చేయాలని అనుకుంటున్నారని, ఆ డబ్బులతో దళిత బిడ్డలను అమెరికా, ఆస్ట్రేలియాల్లో చదివించేందుకు పంపితే సత్య నాదెళ్ల, బిల్‌గేట్స్, సుందర్ పిచాయ్‌లు అవుతారని పేర్కొన్నారు. తమ బిడ్డలు ఎన్ని రోజులు రోడ్లు ఊడ్వాలని, ఎన్ని రోజులు కల్లు గీయాలని, గొర్లు.. బర్లు కాయాలని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. అమెరికా, ఆస్ట్రేలియా ఎందుకు వెళ్లకూడదని అన్నారు. మన రాజ్యం వస్తుందని ప్రచారం చేయాలి వందల సంవత్సరాలుగా దళితులు అణచివేతకు గురవుతున్నారని, వారిపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ప్రవీణ్‌కుమార్ అన్నారు. మటన్, చికెన్ దావత్, బీరు, బిర్యానీలు, తాయిలాలకు మోసపోయే జాతులు మనవి కావని, రాజ్యాధికారం సాధించుకునేందుకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మన రాజ్యం వస్తుందని అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, తాండూర్ నుంచి నల్లగొండ వరకు ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. వీణ్‌కుమార్‌పై కేసు నమోదు కరీంనగర్ క్రైం: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరొకరిపై కరీంనగర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మార్చిలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్(దూళికట్ట) గ్రామంలో జరిగిన స్వేరోస్ కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్, ఎన్.శంకర్‌బాబు హిందువుల మత విశ్వాసాలను కించపరిచే విధంగా వ్యవహరించారంటూ న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి మార్చి 22న తన న్యాయవాది ద్వారా కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం గురువారం రాత్రి ప్రవీణ్‌కుమార్, శంకర్‌లపై కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మూల మూలకూ గోదారి పారాలి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీజలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి ఎకరం ఆ నీటితో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అనంతరం, సిరిసిల్ల జిల్లా తెలంగాణ జలకూడలిగా మారిందన్నారు. సిరిసిల్ల సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నియోజకవర్గాల పరిధిలో ఏ మూలనా సాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం చెప్పారు. ‘నేను కష్టపడి నీళ్లు తెచ్చిపెట్టిన. వాటిని వినియోగించుకునే బాధ్యత మీదే’అని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇంజనీర్లకు కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి పారుదలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోహిణి కార్తెలోనే నాట్లు వేయాలి ‘జూలై 10 తర్వాత, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, మండల స్థాయి ఇరిగేషన్ అధికారులు కూర్చొని, సాగు నీటిని మూల మూలకు ఎట్లా పారించాలో చర్చలు జరపాలి. ఇకనుంచి జిల్లాలో రైతులు రోహిణీ కార్తెలోనే నాట్లు వేసుకునేలా చూసే బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులదే..’అని సీఎం చెప్పారు. నిజాంసాగర్ నుంచి నీటి విడుదలకు ఆదేశం మిషన్ కాకతీయ తర్వాత అన్ని నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు పటిష్టంగా మారిన నేపథ్యంలో వాటిని నూటికి నూరు శాతం నింపాలని సీఎం ఆదేశించారు. మానకొండూరు నియోజకవర్గ పరిధిలో సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రతిపాదనలు తయారుచేయాల్సిందిగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట మండలం అనంతగిరిని సందర్శిస్తానని తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల విజ్ఞప్తి మేరకు నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి సామర్థ్యంతో వినియోగించుకోవాలి గోదావరి నదీ జలాలను తెలంగాణ సాగు భూములకు మళ్లించడానికి ప్రాణహితను ఆధారంగా చేసుకుని కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎన్నో కష్టాలు పడి లిప్టుల ద్వారా సాగునీటిని ఎత్తిపోసుకొని తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటున్నాము. ప్రాణహిత నుంచే కాకుండా ఎల్లంపల్లి ఎగువ నుంచి కూడా గోదావరి జలాల లభ్యత పెరుగుతోంది. ఏ కాలం లోనైనా పుష్కలంగా నీళ్లు లభించేలా ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను పూర్తి సామర్ధ్యంతో వినియోగించుకోవాల్సిన అవసరముంది. ఇప్పుడు నీళ్ళు మన చేతిలో ఉన్నయ్. వాటిని ఎట్లా వాడుకుంటామనేది మన తెలివితో ముడిపడి ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాలైన కరీంనగర్, వరంగల్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి సమస్య అనేమాటే వినబడకూడదు. చిన్నపాటి లిఫ్టులు ఏర్పాటు చేసుకొని వానాకాలం ప్రారంభంలోనే నదీజలాలను ముందుగా ఎత్తైన ప్రదేశాలకు ఎత్తి పోసుకోవాలి..’అని కేసీఆర్ సూచించారు. -
హుజూరాబాద్: పక్కా ప్రణాళికతో ఈటలకు చెక్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టే దిశగా ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈటల రాజీనామాను స్పీకర్ ఆమోదించిన పక్షంలో, ఆరు నెలలలోపు హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పడుతుందని భావిస్తున్న సమయంలో ఉపఎన్నిక నిర్ణీత గడువులోగానే పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంపై ఈటల ముద్రను తుడిచేయడానికి, ఆయన ప్రాభవాన్ని తగ్గించడానికి, ఏకాకిని చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఆత్మగౌరవం కోసం రాజీనామా చేస్తున్నట్లు ఈటల ప్రకటించిన నేపథ్యంలో.. ఆత్మ గౌరవం కాదు, ఆత్మరక్షణ అన్న ట్టుగా ప్రచారం చేయాలని, ఆయన బీజేపీలో చేరడాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే యోచన లో టీఆర్ఎస్ అధిష్టానం ఉంది. రాజీనామా చేస్తున్నట్టుగా ఈటల ప్రకటించిన వెంటనే చోటు చేసుకున్న పరిణామాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. హరీశ్‌తో గంగుల ఏకాంత చర్చలు శుక్రవారం ఓ వివాహానికి హాజరయ్యేందుకు కరీంనగర్‌కు వచ్చిన మంత్రి హరీశ్‌రావును కలిసిన మరో మంత్రి గంగుల కమలాకర్ కొద్దిసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈటల తన రాజీనామా ప్రకటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడం ద్వారా ప్రజల్లో సానుభూతి పెరగకుండా నిరోధించడం వంటి అంశాలను చర్చించినట్లు తెలిసింది. ఉప ఎన్నిక అనివార్యం కానున్న నేపథ్యంలో హుజూరాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నెల 11, 12 తేదీల్లో హుజూరా బాద్‌లో పర్యటించాలని నిర్ణయించారు. కాగా, మాజీమంత్రి బస్వరాజు సారయ్య శుక్రవారం హుజూరాబాద్‌లో ఓ కులసంఘం నాయకులతో సమావేశమయ్యారు. చదవండి: 19 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నా.. -
కరీంనగర్లో రోడ్డు ప్రమాదం
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని మానకొండూరు మండలం ఖాదర్‌గూడెం శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు డీపీఎం వ్యాన్‌ను ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పెళ్లి బృందం హన్మకొండ నుంచి లక్షెట్టిపేటకు కారులో బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తిని పోలీసులు డేవిడ్‌గా గుర్తించారు. చదవండి: Himayat Nagar: బయటకు వస్తే చంపేస్తా..! -
ఆక్సిజన్ ట్యాంకర్‌పై మంటలు
సాక్షి, పెద్దపల్లికమాన్: కరోనా బాధితులకు అందించేందుకు గూడ్స్‌లో తరలిస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్‌పై మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెద్దపల్లి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నుంచి రాయ్‌పూర్‌కు ఆరు ఖాళీ ట్యాంకర్లతో బయల్దేరిన గూడ్స్ రైలు శనివారం పెద్దపల్లి రైల్వే జంక్షన్‌కు చేరుకుంది. ఉదయం 11.02 గంటలకు చీకురాయి సమీపంలోని ఎల్సీ గేట్ నంబర్ 38కి చేరుకోగానే ఓ ట్యాంకర్ నుంచి పెద్దగా శబ్ధం వచ్చి మంటలు చెలరేగాయి. గమనించిన గేట్‌మన్ రాజసాగర్ డ్యూటీలో ఉన్న పెద్దపల్లి స్టేషన్ మాస్టర్‌కు సమాచారమందించారు. స్పందించిన స్టేషన్‌మాస్టర్ వెంకట్ ఫైర్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. వెం టనే రైలును ఆపించి మంటలున్న ట్యాంకర్ నుంచి మిగతా బోగీలను వేరుచేశారు. సమయానికి సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ట్యాంకర్‌కున్న మంటలను అదుపులోకి తెచ్చారు. రైల్వే అధికారులు, లిండే ఆక్సిజన్ కంపెనీ ప్రతినిధులు ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. ట్యాంకర్ ఖాళీచేసిన తర్వాత కొంత ఆక్సిజన్ ట్యాంకర్‌లోనే ఉంటుందని, అది లీకై మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా తెలిపారు. చదవండి: అంబులెన్స్ ధరలు.. మోటారుసైకిల్‌పై మృతదేహం తరలింపు -
దారుణం: కన్నతల్లిని చూడకుండానే కవలల మృతి
కరీంనగర్‌టౌన్: నిండు గర్భిణీ.. కాన్పు కోసం వస్తే ‘మీది ఈ జిల్లా కాదు.. ఎవరి జిల్లాలో వారే ప్రసూతి చేయించుకోవాలి..’ అని వెనక్కి పంపించారు కరీంనగర్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం వైద్యులు. దీంతో బాధితురాలు సొంత జిల్లాకు వెళ్లగా.. అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. ఇలా రెండుమూడు చోట్లకు తిరగడంతో ప్రసవానికి ముందే ఓ బిడ్డ కన్నుమూయగా.. చికిత్స పొందుతూ మరో బిడ్డ చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరుబేగంపేటకు చెందిన బెజ్జంకి కమల రెండో కాన్పు కోసం ఈనెల 18న కరీంనగర్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అయితే అక్కడి వైద్యులు ఎవరి జిల్లాలో వారే వైద్యం చేయించుకోవాలని వెనక్కి పంపించారు. దీంతో బంధువులు ఆమెను సిద్దిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు.. ఇక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, గజ్వేల్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అయితే అక్కడి వైద్యులు సైతం ఆమెను చేర్చుకోకుండానే హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో అయోమయానికి గురైన కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లలేక తిరిగి కరీంనగర్‌కే చేరారు. ఇక్కడి వైద్యులను బతిమిలాడుకున్నారు. దీంతో వైద్యులు ఈనెల 20న ఆపరేషన్ చేసి కవలలకు పురుడు పోశారు. అయితే అప్పటికే ఆడ శిశువు చనిపోయింది. మగ శిశువు బరువు తక్కువగా ఉండటంతో ఐసీయూలో పెట్టారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ ఆ శిశువు కూడా శనివారం మృతిచెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, ముందే ఆపరేషన్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొంటూ బంధువులు మాతాశిశు ఆరోగ్యం కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. కరోనా కారణం చెబుతూ వైద్యులు గర్భిణుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారని, ఆపదలో ఉన్న వారికి వైద్యం చేయకుండా సొంత జిల్లాలకు వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. కరోనాతో తండ్రి, కొడుకు మృతి మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో కరోనాతో తండ్రీకొడుకులు గంటల వ్యవధిలో మృతిచెందారు. గ్రామానికి చెందిన మూల తిరుమల్ (52), అతడి కొడుకు మూల గిరి (30) గీత వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరిద్దరూ నాలుగు రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. కాగా, తిరుమల్ పరిస్థితి విషమించి శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. అతడికి రాత్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. అదేరోజు రాత్రి 11 గంటలకు గిరి కూడా మృతిచెందాడు. శనివారం ఉదయం గిరి అంత్యక్రియలు పూర్తిచేశారు. చదవండి: Black Fungus: బ్లాక్‌ఫంగస్‌కు ‘ఆయుర్వేదం’ -
లాయర్ల హత్య: ‘అప్పటి ఆరోగ్య మంత్రిపై అనుమానం’
సాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రం భీమవరంలో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్న మధును తాము అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ కోసం శనివారం ఆయనను రామగుండం తీసుకొచ్చారు. వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు గతనెల 16న ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదులో పుట్ట మధు ప్రమేయంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘నా కొడుకు, కోడల్ని కత్తులతో పొడిచిన తరువాత పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో వారికి సకాలంలో వైద్య సేవలు అందలేదు. దీనికి అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కారణమని నాకు అనుమానం. మొదట ప్రైవేటు అంబులెన్స్ వచ్చినప్పటికీ దాన్ని కాదని 108 వాహనం వచ్చే దాకా కావాలనే ఆలస్యం చేశారు. ఆస్పత్రికి చేరిన తర్వాత తీవ్ర గాయాలతో ఉన్న వామన్‌రావుకు వైద్య సేవలు సకాలంలో అంది ఉంటే కొద్ది రోజులైనా బతికేవాడు’ అని తెలిపారు. ‘పుట్ట మధుకు, ఈటలకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే నా కుమారుడికి వైద్య సేవలు అందలేదు. పంచనామా పోస్టుమార్టం రిపోర్టు విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి. పెద్దపల్లి ప్రజాప్రతినిధి కూడా ఆసుపత్రికి వచ్చిన వామన్‌రావుకు మందులు ఇవ్వవద్దని చెప్పారు. నిందితులందరికీ చట్ట పరంగా శిక్షలు పడతాయనే విశ్వాసం ఉంది. మధు, ఆయన భార్య శైలజ, రామగిరికి చెందిన సత్యనారాయణ ప్రమేయం ఉన్నట్లు ఏప్రిల్ 16న ఐజీ నాగిరెడ్డికి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపా. హత్యకు రెక్కీ నిర్వహించడం, అందులో పాల్గొన్న వ్యక్తి పేరును ఇతర వివరాలు తెలియజేశా. వీరందరినీ విచారిస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి. న్యాయం జరగకపోతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తా’ అని తెలిపారు. చదవండి: వామన్‌రావు దంపతుల హత్య కేసుపై సర్కారు ఫోకస్ -
Etela Rajender:రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటున్నారు
మేడ్చల్: అందరి అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోనని, ఆచితూచి అడుగులు వేస్తానని స్పష్టం చేశారు. మేడ్చల్ మండలం పూడూర్ గ్రామ పరిధిలోని ఈటల నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, వీణవంక, ఇల్లంతకుంట మండలాలకు చెందిన నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఈటల వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రస్తుత పరిణామాలు, తన రాజకీయ జీవితం, వ్యాపారం, తన భూముల వ్యవహారాలు, నియోజకవర్గంలో జరగబోయే పరిణామాల గురించి వారికి వివరించారు. కొందరు తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని, కానీ అది జరిగే పనికాదని అన్నారు. గతంలో మన అనుకున్న నాయకులు కూడా మోసాలు చేశారని విచారం వ్యక్తం చేశారు. తాను మరికొంత మందితో సమావేశాలు నిర్వహిస్తానని, మనతో కలసి వచ్చేవారు ఎవరు.. ఎవరి తీరు ఎలా ఉంది.. అనే అంశాలను గుర్తించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాకే ముందడుగు వేస్తానన్నారు. ‘ఆగం కాకుండా మీ పనుల్లో మీరు ఉండాలి, నా ప్రయోజనాల కోసం మీ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు కలగవద్దని నేను భావిస్తున్నాను. మీరు కూడా కొద్ది రోజులు ఓపికగా ఉండాలి’అని వారికి సూచించారు. చదవండి: ఏ నిర్ణయమైనా నీ వెంటే..! ఈటలకు కొండా మద్దతు -
ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..?
-
ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..?
కొంత కాలంగా పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరిందా..? మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో అసైన్డ్ భూముల ఆక్రమణ అంశంలో ఈటలపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు..? తనకు ఆత్మగౌరవం కన్నా.. ఏ పదవి ముఖ్యం కాదని ఈటల చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మమేంటి..? ఈటల భవిష్యత్ అడుగులు ఎటువైపు పడబోతున్నాయి..? రాజకీయ వర్గాలతోపాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆద్యంతం నెలకొన్న ప్రశ్నలివి. సాక్షి, కరీంనగర్ : ఈటల రాజేందర్.. 2004 నుంచి ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్‌గా, మంత్రిగా టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుల్లో కీలక నేత ఈటల. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ, అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన పలుమార్లు తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా చెపుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. అయితే.. ప్రజల పక్షాన మాట్లాడుతున్నానంటూ... కొన్ని సార్లు ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించేందుకూ వెనుకాడలేదు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల చురుకైన పాత్ర పోషిస్తున్న ఈటల తన సమర్ధతను చాటుకున్నారు. వ్యాక్సిన్ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అంతా సర్దుకుంటుందనుకునే లోపే శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చిన మాసాయిపేట మండలంలోని అసైన్డ్ భూముల వివాదం కొత్త చర్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్లో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఏం జరగబోతోంది..? మెదక్ జిల్లా భూముల వ్యవహారంలో 100 ఎకరాల అసైన్డ్ భూములు కబ్జా చేశారని కొన్ని ఛానెళ్లలో ప్రసారం కావడాన్ని మంత్రి ఈటల తప్పు పట్టారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేసేందుకు న్యాయంగా తాను సాగించిన ప్రయత్నాలను వివరిస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎంవోలో ముఖ్యుడైన నర్సింగారావుకు కూడా అసైన్డ్ భూముల గురించి చెప్పానని, ఎక్కడా ఎకరం కూడా తాను కబ్జా చేయలేదని చెప్పుకొచ్చారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి విచారణకు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తూనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, తాను తప్పు చేసినట్లు తేలితే దేనికైనా సిద్ధమన్నారు. తాను తప్పు చేసినట్లు తేలే వరకు మంత్రిగా రాజీనామా చేసే అంశమే ప్రస్తావనకు రాదన్న రీతిలో వివరణ ఇచ్చారు. అయితే.. ముఖ్యమంత్రి సీరియస్ అయి వెంటనే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని మెదక్ కలెక్టర్‌ను ఆదేశించడం.. టీఆర్ఎస్ నేతలెవరూ మంత్రికి అనుకూల వ్యాఖ్యలు చేయకపోవడం.. ఈటల ధిక్కార స్వరం.. వెరసి కథ క్లైమాక్స్‌కు చేరిందనే సంకేతాలు వెలువడుతున్నాయి. రెండోసారి గెలిచిన నాటి నుంచి దూరంగా... 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల మరోసారి విజయదుందుబి మోగించారు. అయితే.. మంత్రివర్గ కూర్పులో ఆయనకు స్థానం లేదనే సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి టికెట్టు విషయంలో ఈటల అధిష్టానానికి వ్యతిరేకంగా వెళ్లాడనేది అప్పటి ప్రచారం. అయితే.. చివరి నిమిషంలో కేసీఆర్‌కు సన్నిహితుడైన జిల్లాకు చెందిన ఓ నాయకుడు రంగ ప్రవేశం చేశారని, దాంతో ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం లభించిందని అప్పట్లో వినిపించింది. కాగా.. ఈటల తనకు మంత్రి పదవి లభించినా.. తెలంగాణ ఉద్యమ నాయకుడైన తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించలేదనే అభిప్రాయంలోనే ఉండేవారు. తరువాత జిల్లాకు చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తన ప్రాధాన్యత తగ్గించారని ఆయన భావించినట్లు సన్నిహితులు చెపుతారు. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రి పదవి భిక్ష కాదు.. గులాబీ జెండాకు ఓనర్లం.. పార్టీ, పదవి ఉన్నా లేకున్నా నేనుంటా..’ వంటి వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు. గత ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సాగిన పోరాటానికి బాహాటంగా మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ విధానాలను కూడా తోసిరాజన్నారు. రైతుల కోసం తానుంటానని, ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోకూడదని అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో కూడా రాజకీయాల్లో నైతికత గురించి, ఆత్మగౌరవం గురించి వ్యాఖ్యలు చేస్తూ తనదైన శైలిని కొనసాగించారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజు మంత్రి కేటీఆర్ తన కారులో ఈటలను ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారు. ఆ తరువాత ఈటల వాయిస్‌లో మార్పు వస్తుందని అంతా భావించారు. అయితే.. తనదైన నర్మగర్భపు వ్యాఖ్యలతో ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. కేసీఆర్‌కు సన్నిహితుడిగా.. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి ఈటల రాజేందర్ అధినేతకు సన్నిహితుడిగానే వ్యవహరించారు. బీసీ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో ముందున్న నాయకుడిగా పార్టీలో పట్టు సాధించారు. తొలుత 2004లో కరీంనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఈటల.. 2009 నుంచి హుజూరాబాద్‌ను అడ్డాగా మార్చుకున్నారు. ఇప్పటివరకు ఉప ఎన్నికలతో కలిపి ఆరు సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. టీఆర్ఎస్ అధికారంలో లేనప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా, అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ అంతరంగికులైన సన్నిహిత వ్యక్తుల్లో ఈటల రాజేందర్ ఒకరుగా నిలిచారు. అలాంటి ఈటల కొంతకాలంగా పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు.. ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతున్నానని’ అసైన్డ్ బూముల ఆక్రమణ ఆరోపణలపై హైదరాబాద్ శివారు శామీర్ పేటలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన మాటల అంతరార్థం కూడా ఇదే. చదవండి: ఈటలపై ఆరోపణలు.. కేసీఆర్ సంచలన నిర్ణయం అంతా తప్పుడు ప్రచారం.. విచారణ చేస్కోండి: ఈటల సవాల్ టీఆర్ఎస్ సర్కార్‌లో 'భూ'కంపం -
ఎమ్మెస్సార్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
-
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా విలయతాండవం
-
కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (87) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెస్సార్ తుదిశ్వాస విడిచినట్లు ఆయనకు వైద్యం అందించిన వైద్యులు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఆయన స్వగ్రామం. ఆయన మృతితో వెదిర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, మూడు పర్యాయాలు ఎంపీగా, 2004లో వైఎస్సార్ కేబినెట్లో ఎమ్మెస్సార్ మంత్రిగా పనిచేశారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్‌గా, పీసీసీ అధ్యక్షులుగా ఆయన సేవలు అందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎమ్మెస్సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెస్సార్ విసిరిన సవాల్‌తో 2006లో తొలిసారి తెలంగాణ కోసం కేసిఆర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎమ్మెస్సార్ సహకరించారు. ► ఎమ్మెస్సార్ మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను అదేశించారు. ► ఎమ్మెస్సార్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని సీఎం జగన్ తెలియజేశారు. చదవండి: కరోనా పీడ విరగడయ్యేది అప్పుడేనా..? -
వైరల్: మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి!
సాక్షి, కోల్‌సిటీ(రామగుండం): కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రజలు అప్రమత్తమయ్యారు. ‘దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి..’ అంటూ ఇళ్లముందు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. రామగుండం నగరపాలక సంస్థ 31వ డివిజన్లోని ఎల్బీనగర్ వాసులు ‘కలిసికట్టుగా పోరాడుదాం.. కరోనా మహమ్మారిని ఖతం చేద్దాం.. మాస్క్ ధరిద్దాం, భౌతికదూరం పాటిద్దాం’అంటూ తమ ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు ఆలోచింపజేస్తున్నాయి. గేటు దాటి రావొద్దు.. సాక్షి, జడ్చర్ల టౌన్: ‘నాతో పని ఉందా.. అయితే సెల్ నంబర్‌కు ఫోన్ చేయండి. ఎన్నికల ప్రచారమా.. కరపత్రాలు పక్కన బ్యాగులో వేసి వెళ్లండి. ఇంట్లోకి మాత్రం రావద్దు..’అంటూ తాళం వేసిన ఇంటిగేటుకు బోర్డు పెట్టాడు ఓ వ్యక్తి. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న క్రాంతి ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జడ్చర్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకోవడంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ మేరకు ఏర్పాటు చేశానని అతను చెప్పారు. కరోనాతో తండ్రీకొడుకుల మృతి రాయికల్ (జగిత్యాల): జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్‌కు చెందిన తండ్రీకొడుకులు కరోనా బారిన పడి తొమ్మిది రోజుల వ్యవధిలో మృతిచెందారు. కొడుకు గంట రంజిత్ (30) ఈ నెల 9న మృతి చెందగా.. తండ్రి గంట మల్లారెడ్డి (63) ఆదివారం ప్రాణాలు వదిలారు. కరోనాతో తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సామాజిక కార్యకర్తలు ఎనగందుల రమేశ్, కట్ల నర్సయ్య, సతీశ్ పీపీఈ కిట్లు ధరించి తండ్రీకొడుకుల అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: రికార్డు స్థాయిలో కరోనా: కొత్తగా 2,73,810 పాజిటివ్ కేసులు -
పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చిన రోజే..
సాక్షి, హుజూరాబాద్ రూరల్: రెండో కాన్పు తర్వాత పుట్టింటి నుంచి అత్తింటికి చంటిపాపతో వచ్చిన ఓ బాలింత అదేరోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హుజూరాబాద్ మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. రాంపూర్‌కు చెందిన గోశికొండ ధనుంజయ్‌కు మానకొండూరు మండలం చెంజర్లకు చెందిన వాసాల సత్యనారాయణ–రమ దంపతుల రెండో కుమార్తె మౌనికతో 2018 ఆగస్టులో వివాహం జరిగింది. ధనుంజయ్ హుజూరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. వివాహం జరిగిన తొలిరోజు నుంచే అతను మౌనికను అనుమానించడం మొదలు పెట్టాడు. దీనికితోడు అత్త తార వేధింపులకు గురిచేసేది. రెండు, మూడుసార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినా వారిలో మార్పు రాకపోగా మౌనికపై వేధింపులు ఎక్కువయ్యాయి. ధనుంజయ్–మౌనిక దంపతుల కు ఒక బాబు ఉన్నాడు. మౌనిక ఆరు నెలల కిందట రెండో కాన్పులో పాపకు జన్మనిచ్చింది. శనివారమే ఆ పసిగుడ్డుతో అత్తింటికి వచ్చింది. ఏమైందో తెలియదుగానీ విగతజీవిగా మారింది. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని కేకలు.. తన భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందంటూ ధనుంజయ్ శనివారం సాయంత్రం కేకలు వేశాడు. దీంతో చుటుపక్కల వాళ్లు అతని ఇంటికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుజూరాబాద్ టౌన్ సీఐ మాధవి ఘటనాస్థలికి చేరుకున్నారు. మౌనిక మృతదేహాన్ని పరిశీలించి, ఆమె భర్త ధనుంజయ్‌ని విచారించారు. తల్లి మృతదేహం వద్ద చిన్నారులు వెక్కివెక్కి ఏడవడం స్థానికులను కంటతడి పెట్టించింది. భర్త, అత్తపై కేసు.. తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని ఆమె భర్త ధనుంజయే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు రమ–సత్యనారాయణ ఆరోపించారు. మౌనిక తల్లి ఫిర్యాదు మేరకు తార, ధనుంజయ్‌లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మాధవి తెలిపారు. చిన్నారిని అక్కున చేర్చుకున్న సీఐ.. మౌనిక మృతదేహం వద్ద ఆమె ఇద్దరు చిన్నారులు వెక్కివెక్కి ఏడుస్తుండటంతో సీఐ మాధవి చలించిపోయారు. పాపను అక్కున చేర్చుకొని, ఏడుపు ఆపే వరకు ఎత్తుకొని ఆడించారు. చదవండి: మహిళ గొంతుకోసిన కానిస్టేబుల్ కాలేజ్‌కు వెళ్తుండగా.. తండ్రి కళ్లెదుటే ఘోరం -
గులాబీకి ‘ఈటల’ ముల్లు?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గులాబీ పార్టీకి ఓనర్లమని నినదించి తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రకంపనలు పుట్టించిన నాటి నుంచి జిల్లాకు చెందిన మంత్రి ఈటల రాజేందర్ తనదైన పంథాను వీడడం లేదు. పార్టీ అగ్ర నాయకత్వంపై ఉన్న అసంతృప్తిని తన వ్యాఖ్యల ద్వారా వెల్లడిస్తున్న ఆయన పార్టీలో చర్చనీయాంశంగా మారారు. తాజాగా వీణవంకలో మాట్లాడుతూ ‘కల్యాణలక్ష్మి, పెన్షన్లు, రేషన్‌కార్డులు పేదరిక నిర్మూలనకు పరిష్కారం కాదు’ అని ప్రభుత్వ పథకాలపైనే వ్యంగ్యాస్త్రాలు సంధించి పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా మారారు. ఈ నేపథ్యంలో సోమవారం శాసనసభ కార్యక్రమాలు ముగిసిన తరువాత రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు మంత్రి ఈటలను తన కారులో తీసుకెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేటీఆర్, ఈటల పలు అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. వీరు ఏయే అంశాలపై వీరు చర్చించారనేది తెలియకపోయినా ఈటల వ్యాఖ్యలను అధిష్టానం కొంచెం సీరియస్‌గానే తీసుకున్నట్లు అర్థమవుతోంది. రైతు నేతగా మరోసారి కీలక వ్యాఖ్యలు ‘నేను మంత్రిగా ఉండొచ్చు.. లేకపోవచ్చు.. రైతు ఉద్యమం ఎక్కడ ఉన్నా నా మద్దతు ఉంటుంది. రైతుబంధు పథకం మంచిదే కానీ... ఇన్‌కంటాక్స్ కట్టే వాళ్లకు, రియల్ ఎస్టేట్ భూములకు, వ్యవసాయం చెయ్యని గుట్టలకు, లీజుకిచ్చే భూములకు రైతుబంధు ఇవ్వొద్దు అని వీణవంక మండలం రైతులు కోరుతున్నారు. ఢిల్లీలో రైతులు చేసే ఉద్యమానికి మద్దతుగా నిలుస్తా’ అని గత జనవరి ఆఖరులో, ఫిబ్రవరి మొదటి వారంలో హుజూరాబాద్‌లో రైతువేదికల ప్రారంభోత్సవాల సందర్భంగా పార్టీ విధానాలకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతుబంధు’ పథకంలోని లోపాలను వీణవంక సభలో రైతుల మాటలుగా వ్యాఖ్యానించడం, రైతు చట్టాలపై వ్యతిరేక ఆందోళనలను పార్టీ వ్యూహాత్మకంగా పక్కన బెట్టగా, అదే సమయంలో ఈటల ఆ చట్టాలలోని లోపాలు, రైతుల ఆందోళనలను పాలకుల తీరును తూర్పారపట్టారు. అదే సమయంలో ‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా తగిన సమయం కేటాయించలేక పోతున్నందున త్వరలోనే కేటీఆర్ సీఎం కావచ్చు’ అని వ్యాఖ్యానించి కొత్త చర్చకు దారితీశారు. దాంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ‘ముఖ్యమంత్రిగా కేటీఆర్ సమర్థుడు’ అనే పల్లవి ఎత్తుకోవడం, స్వయంగా కేసీఆర్ ఆ వివాదానికి తెరదించడం జరిగిపోయాయి. కేసీఆర్‌తో సమావేశం తరువాత కొంతకాలం ‘కామ్’గా ఉన్న ఈటల మరోసారి వీణవంకలో చేసిన వ్యాఖ్యానాలు కొత్త చర్చకు దారితీశాయి. పార్టీ, జెండా కాదు మనిషిని గుర్తు పెట్టుకోమన్న ఈటల ‘పరిగె ఏరుకుంటే రాదు... పంట పండితే వస్తది’ అనే సామెతను ఊటంకిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, రేషన్‌కార్డులను పరిగెలతో పోల్చడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చని, నేను ఇబ్బంది పడ్డా, గాయపడినా మనసును మార్చుకోనని బరువైన వ్యాఖ్యలు చేయడంలో గల కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. ఒకవైపు రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన హుషారులో పార్టీ నాయకులు సంబురాలు చేసుకుంటుంటే, ఈటల తనలోని అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడం వెనుక గల మతలబు ఏంటని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా కేటీఆర్‌తో ప్రగతిభవన్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనం చేసిన ఈటల ‘గాయపడ్డ’ మనసును మార్చుకుంటాడో లేదో వేచి చూడాలి. అసంతృప్తి సెగలు 2018 నుంచే 2018లో రెండోసారి తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచే మంత్రి ఈటల రాజేందర్లో అసంతృప్తి సెగలు మొదలయినట్లు తెలుస్తోంది. అప్పటి మంత్రివర్గ కూర్పులో ఈటల పేరును తొలుత చేర్చలేదని, సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన అప్పటి ఎంపీ సూచనల మేరకు చివరి నిమిషంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆరుసార్లు గెలిచి, బీసీ నేతగా గుర్తింపు పొందిన తనకు అవమానం జరిగిందని ఈటల ‘గాయపడ్డట్టు’ ఆయన పలు సందర్భాల్లో మాట్లాడిన తీరుతో అర్థమైంది. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ ఓడిపోవడం, జిల్లాకు చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి దక్కడం తదితర కారణాలతో ఆయనకు, పార్టీ అధిష్టానానికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చదవండి: ఇది మారాలి.. మీరు మార్చాలి: వైఎస్ షర్మిల -
రోడ్డు ప్రమాదం: బంగారం వ్యాపారులు మృతి
పెద్దపల్లి: రామగుండం ఎన్టీపీసీ సమీపంలోని మల్యాలపల్లి వద్ద ఉన్న రాజీవ్ రహదారిపై మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అతి వేగంగా వెళ్లి బోల్తా పడడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనలోని మృతులు, క్షతగాత్రులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బంగారం వ్యాపారం చేసే కొత్త రాంబాబు, కొత్త శ్రీనివాస్, శ్రీనివాస్ బావమరిది సంతోష్ మరో వ్యక్తి కారులో రామగుండం మీదుగా మంచిర్యాల బెల్లంపల్లి వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కారు బోల్తా పడడంతో నలుగురు అందులో ఇరుక్కుపోయారు. స్థానికులు గమనించి బయటకు తీసే లోపే బంగారం వ్యాపారం చేసే రాంబాబు ప్రాణాలు కొల్పోయారు. ఆసుపత్రికి తరలించగా శ్రీనివాస్ మృతి చెందారు. డ్రైవర్ సంతోష్, శ్రీనివాస్ బావమరిది సంతోష్‌కు తీవ్రగాయాలు కాగా వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను రామగుండం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారులో కిలోన్నర బంగారం లభించిందని పోలిసులు పేర్కొన్నారు. ముందుగా సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది బంగారం ప్యాకెట్లను రామగుండం పోలీసులకు అప్పగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: దాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి బంగారం ఉందో లేదో అడుగుతూ -
వారంలో ఐదు హత్యలు: కారణమేదైనా కడతేర్చుడే!
సాక్షి, జగిత్యాల: అనుమానం, ఇంట్లో గొడవ, ఆర్థిక పరమైన అంశాలు, మంత్రాలు, పాత కక్షలు.. కారణమేదైనా ఎదుటి మనిషిని చంపడమే పరిష్కారమని పలువురు అనుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత వారం రోజుల వ్యవధిలో ఐదుగురు హత్యకు గురవడం కలకలం సృష్టిస్తోంది. వరుసగా చోటుచేసుకుంటున్న హత్యోదంతాలు తాజా మానవ సంబంధాలకు అద్దం పడుతున్నాయి. మనుషుల్లో సున్నితత్వం లోపించడం, కక్షపూరిత ధోరణి పెరగడం వల్లే హత్యలు జరుగుతున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదని పేర్కొంటున్నారు. హంతకులను పట్టుకొని, తక్షణమే శిక్షించడం ద్వారా ఇలాంటి ఘోరాలు తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వరుస హత్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. భర్తను హతమార్చిన భార్య.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన ఒడ్నాల రాజగంగారాం (45) అతని భార్య భాగ్యలక్ష్మి చేతిలోనే ఈ నెల 18న హత్యకు గురయ్యాడు. రాజగంగారాం నిత్యం మద్యం సేవించి, అనుమానంతో తన భార్యను వేధించేవాడు. గత గురువారం తెల్లవారుజామున ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆమె తనను తాను కాపాడుకునేందుకు భర్తను కత్తెరతో పొడిచి, తలపై రోకలి బండతో మోదడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మంత్రాల నెపంతో వ్యక్తి హత్య.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ శివారులో ఈ నెల 19న మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం గూడెంకు చెందిన సూర దుర్గయ్య (55) దారుణ హత్యకు గురయ్యాడు. మంత్రాలు చే స్తున్నాడనే నెపంతో స్థానికులే అతన్ని చంపినట్లు నిర్ధారణకు వచ్చామని పోలీసులు తెలిపారు. మద్య ం తాగించేందుకు బైక్‌పై తీసుకెళ్లి, తలపై బండతో కొట్టడంతో ప్రాణాలు విడిచాడన్నారు. క్షణికావేశంలో దారుణాలు.. కుటుంబ కలహాలు, అనుమానం, ఆవేశంతో కట్టుకున్న భార్యలను కడతేర్చేందుకు కూడా కొందరు భర్తలు వెనకాడటం లేదు. తాగుడుకు బానిసై చిన్న చిన్న గొడవలనే పెద్దవి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి, క్షణికావేశంలో కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. పాత కక్షలు, భూ వివాదాలను మనసులో పెట్టుకొని, బహిరంగంగానే హత్యలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు. నేరం చేసిన వారిని వెంటనే శిక్షించేలా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. నడిరోడ్డు పైనే దారుణం... ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, వెంకటనాగమణి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హంతకులు కత్తులతో ఘాతుకానికి పాల్పడటం కలకలం రేపింది. కళ్లముందే కత్తులతో దాడి చేస్తున్నప్పటికీ చుట్టూ ఉన్నవారు మిన్నకుండి పోయారు. ఆ సమయంలో ఎవరైనా స్పందించినా ప్రాణాలు దక్కే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. కళ్లముందు దారుణం జరుగుతున్నప్పటికీ మనకెందుకులే అన్న (బైస్టాండెడ్ అపతి) స్థి తిలో ప్రత్యక్ష సాక్ష్యులు ఉండిపోయారని మానసిక నిపుణులు అంటున్నారు. సమాజంలో ఈ పరిస్థితి ప్రమాదకరమని చెబుతున్నారు. మనుషుల్లో సున్నితత్వం లోపిస్తోంది.. నేటి సమాజంలో మానవ సంబంధాలు క్రమంగా దిగజారుతున్నాయి. మనుషుల్లో సున్నితత్వం లోపిస్తున్న కారణంగా నేరం చేయడం తప్పుకాదన్న భావన పెరుగుతోంది. క్షణికావేశం, పాత కక్షలు, సహనం కోల్పోవడం కారణంగా హత్యలు జరుగుతున్నాయి. హంతకులకు త్వరితగతిన శిక్షలు అమలు చేస్తే కొంతవరకు నేర ప్రవృత్తి తగ్గే అవకాశం ఉంది. పాఠశాల స్థాయి నుంచే నైతిక విలువల బోధన సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గౌతమ్, సైకాలజిస్ట్ దోషులకు త్వరగా శిక్ష పడాలి.. ఇటీవల జరిగిన వరుస హత్యలను పరిశీలిస్తే ఆవేశాలు, అనుమానాలతోనే చేసినట్లు స్పష్టమవుతోంది. ఉద్ధేశపూర్వకంగా చేసే ఇలాంటి నేరాలపై కోర్టులు త్వరితగతిన విచారణ చేపట్టాలి. నేరారోపణ రుజువైన వెంటనే దోషులకు కఠిన శిక్షలు విధించాలి. ప్రభుత్వ యంత్రాంగం సైతం ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. – బండ భాస్కర్‌రెడ్డి, న్యాయవాది, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు, జగిత్యాల చదవండి: కీలకంగా మారిన బిట్టు.. మధుపై అనుమానం! న్యాయవాదుల హత్య: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వామన్‌రావు హత్య కేసులో కీలక విషయాలు -
యువతులకు జీవిత పాఠం.. కవితత్త కథ
చదువు అర్ధంతరంగా ఆగిపోయింది. అత్తగారింట్లో అడుగుపెట్టడం కోసమే ఆమె పుస్తకాలు అటకెక్కాయి. తండ్రి అనారోగ్యం ఆ నిర్ణయానికి కారణమైంది. అత్తగారిల్లు పూర్తిగా కొత్త... అక్కడి వాతావరణం కొత్త... ఈ సమస్య ఏ అమ్మాయికైనా ఉండేదే. అయితే ఈ అమ్మాయికి భాష కూడా కొత్త. తెలుగమ్మాయి మరాఠా కుటుంబంలో అడుగుపెట్టింది. వాళ్లు తెలుగు మాట్లాడేవాళ్లే అయినా ప్రతి ఆచారం, సంప్రదాయం మరాఠా పద్ధతిలోనే జరిగేది. ఈ తెలుగమ్మాయికి మరాఠా సంప్రదాయం కాదు కదా పెళ్లి నాటికి తెలుగు సంప్రదాయాలు కూడా పెద్దగా తెలియవు. అలా బేలగా అత్తగారింట్లో అడుగుపెట్టి... రెండు సంప్రదాయాలను కలబోసుకుంటూ తనను వ్యక్తిగా మలుచుకుని ఒక శక్తిగా నిర్మించుకున్న రేణిగుంట కవిత పరిచయం ఇది. ఇప్పుడామె సామాజికంగా వెనుకబడిన యువతులకు జీవితం విలువ తెలియ చేస్తున్నారు. అనవసరమైన అపోహలతో అత్తగారింటి పట్ల, అత్తింటి వారి పట్ల దూరం పెంచుకుంటున్న యువతులకు తన జీవితాన్ని ఒక పాఠంలా వివరిస్తున్నారు. అలాగే పిల్లలకూ కథలు చదివి వినిపిస్తున్న ఈ ‘కవితత్త’ కథ ఇది. భర్తతో కవిత ‘‘పుట్టింట్లో పదిహేనేళ్లు చదువుకున్నాను, ఆపేసిన చదువును అత్తగారింట్లో పదహారేళ్లపాటు కొనసాగించగలిగాను. నాన్న సింగరేణి ఉద్యోగి. రామకృష్ణాపూర్లో ఉద్యోగం. ఐదవ తరగతి వరకు సింగరేణిలోనే చదువుకున్నాను. ఆరవ తరగతికి జవహర్ నవోదయ విద్యాలయకు వెళ్లాను. ఇంటర్ వరకు నవోదయలో చదివాను. పరిస్థితులకు అనుగుణంగా మెలగగలిగే నేర్పు నాకు నవోదయ విద్యావిధానమే నేర్పించింది. ఆ విద్యావిధానం వల్ల జీవితాన్ని చూసే దృష్టి కోణం మారిపోతుంది. ఇంటర్ తర్వాత బీఫార్మసీలో సీటు వచ్చింది. అయితే అదే సమయంలో నాన్న ఆరోగ్యం దెబ్బతిన్నది. నేను పెద్దదాన్ని. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు. ఆడపిల్ల బాధ్యత తీర్చుకుంటే చాలన్నట్లు హడావుడిగా నాకు పెళ్లి చేసేశారు. అలా 1998లో ఇరవై ఏళ్లకు సిర్పూర్ కాగజ్ నగర్లో అత్తగారింట్లో అడుగుపెట్టాను. వాళ్లది మరాఠా సంప్రదాయ కుటుంబం. మా వారు గవర్నమెంట్ టీచర్. ఉమ్మడి కుటుంబంలో కొత్త సంప్రదాయాల మధ్య ఊపిరిసలపని మాట నిజమే. మానసికంగా పెళ్లికి సిద్ధంగా లేకపోవడంతో అమ్మవాళ్లు నాకు ఇంటి పనులేవీ నేర్పించలేదు. బలహీనంగా ఉన్నానని బాగా గారం చేస్తూ ఏ పనీ చేయనిచ్చేవారు కాదు. అత్తగారింట్లో అలా కుదరదు కదా! అయితే అన్నింటినీ తట్టుకుని నిలబడి నన్ను వాళ్లు అర్థం చేసుకునే వరకు ఎదురు చూశాను. నా విజయ రహస్యం అదే. ఇంట్లో వాళ్లు నన్ను ఆదరించడంతోపాటు నాకు చదువుకోవాలని ఉందనే కోరికను కూడా గౌరవించారు. నేను పరీక్షలకు ప్రిపేరవుతుంటే మా అత్తగారు భోజనం ప్లేట్లో పెట్టి ఇచ్చేవాళ్లు. అత్తగారు పోయాక మామగారు కూడా అంతే ఆదరంగా చూశారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో క్లాసులకు వెళ్లినప్పుడు, పరీక్షలకు వెళ్లినప్పుడు మా మామగారు మా ఇద్దరబ్బాయిలకు స్వయంగా వండిపెట్టి మరీ, పిల్లల బాగోగులు చూసుకున్నారు. అత్తగారింటితో మనల్ని మనం మమేకం చేసుకోగలగాలి. మన జీవిత నిర్మాణంలో అత్తగారిల్లు ప్రధానమైన పునాది అని మర్చిపోకూడదు’’ అని అన్నారు కవిత. పెళ్లి తర్వాతే ఆమె ఎం.ఎ. ఇంగ్లిష్, ఎమ్మెస్సీ సైకాలజీ, సైకాలజీలో డాక్టరేట్ చేశారు. ‘షీరోజ్’ ఆవిర్భావం నాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చినప్పుడు ఏదో సాధించాననే సంతృప్తి కలిగింది. అప్పటి వరకు నా లక్ష్యం ఏమిటి? అనేది తెలియకుండా... ఇద్దరు బిడ్డల తల్లిగా పిల్లల్ని పెంచుకుంటూ, అర్ధంతరంగా ఆగిపోయిన అక్షర ప్రయాణాన్ని కొనసాగించడంలో మునిగిపోయాను. టీచర్ ఉద్యోగంలో చేరిన తర్వాత నన్ను నేను నిలబెట్టుకోగలిగాననే ఆత్మసంతృప్తి కలిగింది. ఆ తర్వాత ఇంకా ఏదో చేయాలనే ఆసక్తి పెరిగింది. కథల పుస్తకాల సేకరణ సమయంలో ఒక అవసరం తెలిసింది. మా తరంలో పిల్లలున్న ఇళ్లలో చందమామ కథల పుస్తకాలు కనిపించేవి. ఇప్పుడు పిల్లలకు కథల పుస్తకాల అలవాటు తప్పి పోయింది. కొంతమంది పిల్లల కోసం ఇంగ్లీష్ కథల పుస్తకాలు తెప్పించుకుంటున్నారు. కానీ తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారనిపించింది. తెలుగులో చదవడం రాని పిల్లల తరం తయారవుతోంది. అందుకే పిల్లలకు కథలు వినిపించే బాధ్యత తీసుకున్నాను. ‘కవితత్త కథలు’ పేరుతో నీతి కథలు చెప్పి రికార్డు చేశాను. వాటికి ఫీజు చెల్లించాల్సిన పని లేదు, ఉచితంగా వినవచ్చు. ఇక మా మంచిర్యాల వంటి అభివృద్ధి చెందని పట్టణాలు, గ్రామాల్లో అమ్మాయిలకు కెరీర్ అవకాశాల పట్ల అవగాహన ఉండడం లేదు. వారికి గైడెన్స్ ఇచ్చే వాళ్లు కూడా తక్కువే. అందుకే రెండేళ్ల కిందట ‘షీరోజ్’ సంస్థను స్థాపించాను. ఇది మా మంచిర్యాల దాటి బయట ప్రపంచం పెద్దగా తెలియని వాళ్లకు అవగాహన వేదిక. యూఎస్ కల... కలగానే మా తమ్ముళ్లిద్దరూ యూఎస్‌లో స్థిరపడ్డారు. నన్ను కూడా వచ్చేయమన్నారు. నాక్కూడా యూఎస్ క్రేజ్ బాగానే ఉండేది. ఎండాకాలం సెలవుల్లో పిల్లల్ని మా అమ్మ దగ్గర పెట్టి, నేను హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఉండి మరీ టెస్టింగ్ టూల్స్ వంటి కోర్సులు చేశాను. అవకాశం అంది వచ్చింది. కానీ మా వారికి పెద్దగా ఇష్టం లేకపోయింది. వద్దని చెప్పలేదు కానీ, నీ యిష్టం అనే మాటను మనస్ఫూర్తిగా చెప్పడం లేదనిపించింది. ‘లక్షలాది మంది సాఫ్ట్వేర్ నిపుణుల్లో ఒకదానివిగా ఉండడం కంటే, మంచి టీచర్‌గా పేరు తెచ్చుకోవడం ఇంకా బాగుంటుంది కదా! నీ లాగ ఉత్సాహం ఉన్న వాళ్లు మహిళల కోసం ఏదైనా చేయవచ్చు కూడా’’ అన్నారు. ఇక యూఎస్ ఆలోచన మానుకున్నాను. మా వారి సూచనలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ‘షీరోజ్’. ఇక నేను సైకాలజీ చదివాను కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ కూడా చేస్తున్నాను. మహిళల కోసం చేస్తున్న సేవకు ఒక వ్యవస్థగా నిర్మించాలనేది ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. దీనిని చేరుకున్న తర్వాత మరో లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాను’’ అన్నారు కవిత చిరునవ్వుతో. – వాకా మంజులారెడ్డి, ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎం. సతీశ్ కుమార్, పెద్దపల్లి -
ఒమన్‌లో వలస కార్మికులకు క్షమాభిక్ష
సాక్షి, జగిత్యాల: ఉపాధి కోసం వచ్చి సరైన పత్రాలు లేక చట్టవిరుద్ధంగా తమ దేశంలో ఉంటున్న వలస కార్మికులకు ఒమన్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాదిమంది కార్మికులకు ఊరట లభించనుంది. వీసా గడువు ముగిసిన కార్మికులు తమ స్వదేశానికి వెళ్లేందుకు డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. వీసా గడువు ముగిసి, చట్టవిరుద్ధంగా ఉంటున్న వారంతా అక్కడి ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లించి, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కానీ లక్షల సంఖ్యలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారితో తమ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఒమన్ ప్రభు త్వం భావిస్తోంది. దీంతో అలాంటి వారందరికి క్షమాభిక్ష ద్వారా తమ స్వదేశాలకు వెళ్లేలా వెసులుబాటు కల్పించింది. 25 లక్షల మంది వలసదారులు ఒమన్ దేశంలో భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంకతోపాటు పలు ఇతర దేశాలకు చెందిన సుమారు 25 లక్షల మంది వలస కార్మికులు ఉపాధి పొందుతున్నారు. క్షమాభిక్ష ద్వారా చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని స్వదేశాలకు పంపిస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, స్వస్థలాలకు తిరిగి వచ్చే వలస కార్మికులకు సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నోడల్ ఆఫీసర్‌ను ప్రత్యేకంగా నియమించాలని, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు అందించి అవుట్ పాస్‌పోర్టు జారీ చేయాలని భారత కార్మికులు కోరుతున్నారు. ఉచిత విమాన సదుపాయం కల్పించి కార్మికులను ఆదుకోవాలని ఒమన్–తెలంగాణ ఫ్రెండ్స్ సంస్థ సభ్యుడు నరేంద్ర పన్నీర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
రాజన్న రాజ్యం: ఏపీకి పాదయాత్ర
సాక్షి, మానకొండూర్/శంకరపట్నం: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆదిలాబాద్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కంపెల్లి గంగాధర్ మండిపడ్డారు. తెలంగాణలో రాజన్నరాజ్యం రావాలని, వైఎస్సార్సీపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని, సంక్షేమ పథకాలు కొనసాగాలని వైఎస్సార్ సీపీ నాయకులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు నుంచి ఏపీలోని తాడేపల్లిగూడెం వరకూ చేపట్టిన పాదయాత్ర శనివారం మానకొండూర్ మీదుగా సాగింది. కేశవపట్నం చేరుకోగా శంకరపట్నం వైసీపీ మండల అధ్యక్షుడు తాళ్ల సురేశ్, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి పాదయాత్రకు స్వాగతం పలికారు. శంకరపట్నంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. మానకొండూర్, శంకరపట్నంలో గంగాధర్ మాట్లాడుతూ ఈనెల18న ఉట్నూరు నుంచి పాదయాత్ర ప్రారంభం అయిందని తెలిపారు. సుమారు వంద కిలోమీటర్లు పూర్తి చేశామని తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు తెలంగాణ ప్రభుత్వం తూట్లుపొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువస్తే వైఎస్సార్ ఆశయాలు నెరవేరుతాయన్నా రు. ప్రతీ నిరుపేద సొంతింటి కల వైఎస్సార్‌తోనే నెరవేరిందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి నిర్మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆరోపించారు. ఉట్నూర్ నుంచి తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం వరకూ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. పాదయాత్రలో జిల్లా మహిళా నాయకురాలు రాయశీలం రమ, మేకల భీమ్రావు, దత్తూరి పోశెట్టి, మేకల పోషవ్వ ఉన్నారు. -
ఓటమి భయంతో అడ్డదారులు
కరీంనగర్ టౌన్: దుబ్బాక ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలంగాణ ప్రభుత్వం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ రాచరిక, నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని, ఇందుకు సిద్దిపేట సంఘటనే నిదర్శనమన్నారు. ఫాంహౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం లాగానే మంత్రులు సైతం బరితెగించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిచేందుకు కార్యకర్త కారులో డబ్బుపెట్టి రికవరీ అంటూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని, సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులు మహిళలు, చిన్నపిల్లల పట్ల సంస్కారహీనంగా వ్యవహరించారని ఆరోపించారు. దుబ్బాక ఎన్నికలకు సిద్దిపేటకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సిద్దిపేటకు వెళ్తున్న తన కారును అడ్డగించి అరెస్ట్ చేసే సమయంలో గొంతు పట్టి కారులో పడేశారని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటే.. ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తోందని పేర్కొన్నారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ఉందో లేదో కూడా తెలియడం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధం గా ఎన్నికలు నిర్వహించకుంటే ఫాంహౌస్, ప్రగతిభవన్‌పై సైతం దాడి చేస్తామని హెచ్చరించారు. సీపీని సస్పెండ్ చేయాలనే డిమాండ్‌తో ఎంపీ కార్యాలయంలోనే సంజయ్ నిరాహారదీక్షకు దిగారు. -
సద్దులు.. పాటల సుద్దులు
సాక్షి, కరీంనగర్: ప్రపంచంలో ఎక్కడా మహిళలకంటూ ప్రత్యేక పండుగ లేదు. కానీ తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ ఆ లోటును పూడ్చింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తొమ్మిది రోజులపాటు పూలను పూజించే గొప్ప సంస్కృతికి మన రాష్ట్రం వేదిక. పండుగ ముగిసేవరకు పల్లె, పట్టణం తేడా లేకుండా సందడి వాతావరణం నెలకొంటుంది. ఏడాదికోసారి ఆడబిడ్డలు తమ కష్టాలు, బాధలను మరిచి, ఆనందంగా గడిపే సమయమిది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గత వారం రోజులుగా ఆటపాటలతో పూల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. శనివారం జరిగే సద్దుల బతుకమ్మతో గౌరమ్మను సాగనంపేందుకు సిద్ధమవుతున్నారు. గునుగు పూలు తెలుగు లోగిళ్లలో సందడి... తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలుగు లోగిళ్లన్నీ సందడిగా మారుతాయి. పండుగ సందర్భంగా అత్తవారింటి నుంచి తమ ఆడబిడ్డలను పుట్టింటికి ఆహ్వానిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచిన మహిళలు, యువతులు ఇల్లు, వాకిలిని శుభ్రం చేస్తారు. కొత్త దుస్తులు ధరిస్తారు. మధ్యాహ్న సమయానికి అన్నదమ్ములు తీసుకుచ్చిన పూలతో బతుకమ్మను అందంగా పేర్చి, పూజ చేస్తారు. చివరి రోజు రెండు బతుకమ్మలు తొమ్మిది రోజులపాటు ఆటపాటలతో సాగే వేడుకల్లో చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు మాత్రం రెండు బతుకమ్మలు పేరుస్తారు. ముఖ్యంగా మన ఇళ్లలో ఆడబిడ్డకు వివాహం చేసి, అత్తారింటికి సాగనంపినప్పుడు తోడు పెళ్లికూతురుగా మరొకరని పంపిస్తాం. ఇదే సంప్రదాయాన్ని బతుకమ్మకూ కొనసాగిస్తున్నారు. నిమజ్జనం రోజు పెద్ద బతుకమ్మను తల్లిగా, చిన్న బతుకమ్మను కూతురుగా భావించి, పూలతో అందంగా పేర్చి సాగనంపుతారు. చామంతి పూలు పిండి పదార్థాలకు ప్రత్యేకత.. వానకాలం ముగిసి, చలికాలం ప్రారంభమయ్యే సమయంలో వచ్చే సద్దుల బతుకమ్మ రోజు వాయినాలు ఇచ్చుకునేందుకు పిండి పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. పెసలు, బియ్యం పిండితో సత్తు, పులిహోర, పెరుగన్నం తదితరాలు సిద్ధం చేస్తారు. ఇవన్నీ వాతావరణం మార్పునకు లోనైన సమయంలో మానవ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచే ఔషధీయ విలువలను కలిగి ఉంటాయి. బతుకమ్మల నిమజ్జనం తర్వాత ఈ పిండిపదార్థాలను మహిళలు వాయినం ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ప్రత్యేక బడ్జెట్‌తో రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందుకోసం సర్కారు చాలా చోట్ల బతుకమ్మ ఘాట్లను నిర్మించింది. ఇదీ పండుగ నేపథ్యం.. తెలంగాణ జానపదుల పండుగగా ప్రారంభమై ఆ తర్వాత నగరాలకు, విదేశాలకు సైతం విస్తరించిన బతుకమ్మ పుట్టుక వెనక ఆసక్తికర కథనాలెన్నో ఉన్నాయి. కాకతీయ చక్రవర్తుల కాలంలో అంటే 12వ శతాబ్ది నుంచి ఈ పండుగ ఉన్నట్లు ఆధారాలు న్నాయి. పూలను బతుకుగా భావించి, మహిళలు పూబొడ్డెను గౌరమ్మగా పూజించడం వల్ల బతుకమ్మ అనే పేరు వచ్చిందని భావన. మహిషాసుర సంహారం కోసం అవతరించిన దుర్గాదేవి తొమ్మిది రోజుల్లో పెరిగి, పెద్దదై రాక్షస సంహారం చేయడంతో ఆమె అనుగ్రహం కోరి మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ అనేది ఒక నేపథ్యం. గంగాగౌరీ సంవాదంలో భాగంగా శివుడు తన తలపై పెట్టుకున్న గంగను చూసి, పార్వతి అసూయ పడుతుంది. గంగను అందరూ పూజిస్తున్నారని తన తల్లితో చెబుతుంది. అప్పడు తల్లి ఓదార్చి గంగ మీద నిన్ను పూల తెప్పలా తేలించి, పూజించేలా చేస్తానంటుంది. అదే బతుకమ్మగా రూపాంతతరం చెందిందని కూడా చెబుతారు. పూర్వం అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలుంటే పెద్ద వదిన పాలలో విషం కలిపి, మరదలికి తాగించి చంపుతుంది. ఆ తర్వాత ఆమె శవాన్ని ఊరి బయట పాతి పెడుతుంది. అక్కడ అడవి తంగేడు చెట్టు పుట్టి విరగబూస్తుంది. ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు చెల్లెకు పూలిద్దామని తెంపబోతే ఆమె ఆత్మ తన మరణం గురించి చెబుతుంది. అప్పుడు అన్నలు నీకు ఏం కావాలో కోరుకొమ్మంటే ఈ తంగెడు పూలల్లో నన్ను చూసుకోమని, ఏటా నా పేర పండుగ చేయండని అంటుంది. ఇలా ఈ పండుగ ప్రారంభమైనట్లు మరో కథ. చాలా కాలం కిందట సంతానం కోసం పరితపిస్తున్న దంపతులకు ఓ అమ్మాయి దొరకగా అమ్మవారి ప్రసాదంగా భావించి, పెంచి పెద్ద చేస్తారు. ఆమె పలు మహిమలు చూపుతూ లోకహిత కార్యాలు చేస్తుంది. దీంతో మహిళలు ఆమె చుట్టూ చేరి, దైవ స్వరూపంగా భావించి, పూజలు చేస్తారు. ఇది క్రమంగా బతుకమ్మ పండుగ నిర్వహించేందుకు కారణమైందని ఇతిహాసం. మరో కథలో ఓ దంపతులకు కలిగిన పిల్లలు కలిగినట్లుగా మరణిస్తుంటే పార్వతిని ప్రార్ధించారట. ఆమె దయతో ఒక కూతురు కలిగి, బతుకుతుందట. ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేయడంతో ఈ పండుగ వచ్చిందని ప్రతీతి. తీరొక్క పూల కూర్పు ‘బతుకమ్మ’ మహిళలు గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, చామంతి, కట్ల, గోరింట తదితర పూలతో గోపురం ఆకారంలో బతుకమ్మను పేరుస్తారు. దాని పైభాగంలో గౌరీదేవికి ప్రతిరూపమైన గుమ్మడి పువ్వు, పసుపు ముద్దలను ఉంచుతారు. అనంతరం అగర్బత్తీలు, ప్రమిదలు వెలిగించి, వీధుల కూడళ్లకు తీసుకెళ్లి బతుకమ్మలను ఒక్కచోట చేర్చుతారు. పాట తెలిసిన పెద్దావిడ ఒకరు బతుకమ్మ పాటను ఆలపిస్తే మిగిలిన వాళ్లంతా ఆమెను అనుసరిస్తూ గొంతు కలుపుతారు. బతుకు పాటలు, శ్రమజీవుల వెతలు, గౌరీదేవి మహత్యం, పతివ్రతల ఇతివృత్తాలు ప్రధానాంశాలుగా బతుకమ్మ పాటలు పాడుతారు. అర్ధరాత్రి వరకు ఆడిపాడి, సమీపంలోని చెరువులు, కుంటలు, జలాశయాల్లో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. కరీంనగర్లో నిమజ్జన ప్రాంతాలు నగరంలోని మానేరు వాగు బ్రిడ్జి సమీపంలోని వేద పాఠశాల వద్ద, రాంచంద్రపూర్ కాలనీలోని మానేరు డ్యాం, కొత్తపల్లి చెరువు, కిసాన్నగరలోని గర్లకుంట, చింతకుంట కాలువ వద్ద బతుకమ్మ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రట..
సాక్షి, మల్యాల(చొప్పదండి): బిగ్‌బాస్ షోలో కనబడితే చాలు అనుకునే వేలాది మందికి రాని అవకాశం గంగవ్వ తలుపు తట్టింది. చాంపియన్ కావాలనే సంకల్పంతో అడుగుపెట్టే వారికి భిన్నంగా తన ఇంటి కల నెరవేరితే చాలు అనుకుంటూ ఆ షోలో అడుగుపెట్టింది. రూ.లక్షలు కావాలనే కోరిక లేదు.. ఇల్లు కట్టుకుంటే చాలు అనే కల తప్ప.. ఆ మాటే చెప్పింది బిగ్‌బాస్ షోలో.. గంగవ్వ ఇంటి కల నెరవేరుస్తా అని బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున మాట ఇవ్వడంతో తాను అనుకున్నది సాధించినంత సంబరపడింది. రియాల్టీ షో.. నటన అంటే తెలియదు.. తెలిసిందల్లా తనకు తోచింది చేసుడే.. నిర్మలమైన హృదయం.. కల్మషం లేని మనసు.. అందరూ మంచిగ ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం.. అక్షరం నేర్వకపోయినా కష్టాలు, కన్నీళ్లు జీవిత పాఠాలు నేర్పాయి. ఐదేళ్ల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు అందరూ గంగవ్వ కోసం బిగ్‌బాస్ చూశారనడంలో అతిశయోక్తి లేదు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల నుంచి తెలుగువారు లక్షలాది మంది ఆమెకు అభిమానులయ్యారు. బిగ్‌బాస్ రియాల్టీ షో నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చిన యూ ట్యూబ్ స్టార్ గంగవ్వకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆమె షోను వీడుతుంటే అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన గంగవ్వ బిగ్‌బాస్ షోలో తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఇల్లు కోసం పైసలత్తయంటే పోయిన.. అవ్వగారి ఊరు పొలాస నుంచి అత్తగారి ఊరు లంబాడిపల్లికి అచ్చిన అంటే ఇంకో ఊరుకు పోలే. ఎప్పుడూ పొలం, ఇల్లు, చెట్టు, పుట్ట తప్ప ఏం తెల్వదు. మై విలేజ్ షో శ్రీరాం శ్రీకాంత్ తీసిన 200 సినిమాల్ల చేసిన. నేను పలుకబలుపం పట్టుకోని బడికిపోలే. సదువురాదు. శ్రీకాంత్ చెప్పింది చేసుడే వచ్చు. బిగ్బాసోళ్లు అడుగుతుండ్రు బిగ్‌బాస్‌కు పోతవా గంగవ్వ అని శ్రీకాంత్ అడిగిండు. మూడు నెలలు ఉంటవా మరి అని అంటే ఉంటా.. ఇల్లు కట్టుకునేందుకు ఉంట అని చెప్పిన. ఇగ ఏం ఆలోచించలేదు. బిగ్‌బాస్ పోత. ఇల్లు కట్టుకునేందుకు ఎన్ని రోజులైన ఉంటా అన్న. బిగ్‌బాస్‌కు పోవాల్నా అని నా బిడ్డలను అడిగిన.. పో అవ్వ అన్నరు. పోతే పైసలత్తే బిడ్డలకు కూడా ఇయ్యచ్చని అనుకొని పోయిన. కారంటైన్ చెయ్యంగ మైండ్ కరాబైంది.. ఇక్కడి నుంచి పెయినంక.. కారంటైన్ అని ఒకటే రూంల 18 రోజులు ఉంచిన్రు. గప్పుడే మైండ్ అంత కరాబైంది. ఇంక బిగ్‌బాస్‌ల ఎంట్ల ఉంటదో అనిపించింది. కండ్లకు బట్టకట్టి బిగ్‌బాస్ షోకు తీసుకపోయిండ్రు. అక్కడికి పోయిన రోజే చెప్పిన నాకు ఇల్లు లేదు సారు.. మీరిచ్చే పైసలతోని ఇల్లు కట్టుకుందామని ఆశతో వచ్చిన అన్న. రెండు వారాలకే ఇంటి మొకాన పానం కొట్టుకునుడు మొదలైంది. కొడుకు, బిడ్డలు, మనవలు, మనవరాండ్లు ఎట్ల ఉన్నరో అని మనాది వడ్డది. ఇగ ఇంటిమీద రందితో జరం అచ్చింది. సూదులు ఇచ్చిండ్రు. మందులు ఇచ్చిండ్రు. మంచిగ సూసుకున్నరు. ఎవలన్న తప్పు సేత్తె తిట్టెదాన్ని.. బిగ్‌బాస్ ఇంట్లకు పోయినాక అందరు నన్ను గంగవ్వ అనుకుంట మంచిగ సూసుకున్నరు. ఆట ఆడినప్పుడు ఒక్కలుగూడ నన్ను ఏం అనలేదు. ఎవలన్న తప్పు సేత్తె నేనే తిట్టెదాన్ని. అవ్వ.. అవ్వ అనుకుంట అందరూ నా సుట్టే తిరిగెటోళ్లు. అఖిల్ కాళ్లు ఒత్తుకుంట.. ఎట్ల ఉంది అవ్వ అనుకుంట నాతోనే ఉండెటోడు. బిగ్‌బాస్ ఇంట్ల నన్ను ఏం పని చెయ్యనియ్యలేదు. కానీ బిగ్‌బాస్ ఇంట్ల నుంచి ఎటూ పోరాదు. తెల్లందాక ఎప్పుడు ఏవో ఆటలు ఆడాలి. నిద్ర పోవుడు లేదు. బువ్వ తిందామంటే తినబుద్ది కాలేదు. ఓ టీవీ లేదు. గడియారం లేదు. చెట్టు కనవడది.. పుట్ట కనవడది.. ఎప్పుడు తెల్లారిందో.. ఎప్పుడు రాత్రయిందో తెల్వకపోతుండె. ఎట్లయినా ఇల్లు కట్టుకోవాలే అనే ఆలోచనతో అక్కడనే ఉండాలె అనుకున్న. కానీ ఎప్పుడు నలుగుట్ల తిరిగిన గదా అంత పెద్ద బంగుళాలో ఉండలేకపోయిన. నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రట.. బిగ్‌బాస్ ఇంట్ల అందరు నాతోని మంచిగున్నరు. కానీ నాకు నా ఇంటి రంది వట్టుకొని రెండుసార్లు జరమచ్చింది. మొదటిసారి జరమచ్చినప్పుడు నా కొడుకును తీసుకచ్చి సూపెట్టినంక రెండు వారాలు ఉన్న. ఇగ వానలకు నా ఇల్లు ఏమైందో.. నా మనవలు, మనవరాండ్లు, బిడ్డలు ఎట్లున్నరో అని రందైంది. బిగ్‌బాస్ ఇల్లు పెద్దగ మంచిగుంది. నాకే ఏసీ వడలేదు. తిండి తినబుద్ది కాలే. నిద్ర పట్టలేదు. గందుకే బయటకు వచ్చిన. నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రని పిలగాండ్లు చెప్తున్నరు. -
ఎంపీ గారూ.. రూ.7 వేల కోట్లు ఎక్కడ?
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ ఎంపీ గారూ.. కరోనా కట్టడికి కేంద్రం నుంచి రూ.7 వేల కోట్లు వచ్చాయని చెబుతున్నారు అవెక్కడ ఉన్నాయో చూపించాలని మేయర్ వై.సునీల్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేశారని ఎంపీ బండి సంజయ్‌కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో స్వయంగా కేంద్ర మంత్రి తెలంగాణకు రూ.290 కోట్లు కేటాయించామని వెల్లడించారన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ యువతను రెచ్చగొడుతూ రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో ఆసరా పెన్షన్ల విషయంలో కేంద్రం రూ.800 ఇస్తోందని తప్పుడు ప్రచారం చేసి, ఓట్లు దండుకున్నాడని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ది మీరేనని, గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు దేశంలో ఏం అభివృద్ధి చేశారో, ఎన్ని నిధులు ఇచ్చారో వెల్లడించాలని, అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ చొరవతోనే స్మార్ట్‌సిటీతో పాటు జాతీయ రహదారులు వంటి ఎన్నో పనులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో ఎంపీ కోటా నిధులు తప్ప ప్రత్యేకంగా నిధులు తీసుకురావడంలో, అభివృద్ధి పనులు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్ బిల్లులు పేద ప్రజలకు, రైతాంగానికి గుదిబండగా మారనున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో బీజేపీపై పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు గందె మాధవి, కాశెట్టి లావణ్య, బండారి వేణు, ఐలేందర్ యాదవ్, చాడగొండ బుచ్చిరెడ్డి, తోట రాములు, గుగ్గిళ్ల జయశ్రీ, గంట కల్యాణి, నాంపెల్లి శ్రీనివాస్, తాడెపు శ్రీదేవి, నేతికుంట యాదయ్య, కుర్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ‘బండి’ చొప్పదండి: ఎంపీ బండి సంజయ్‌కుమార్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరోనా నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.200 కోట్లు ఇచ్చామని పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటిస్తే, రూ.7వేల కోట్లు ఇచ్చారని ఎంపీ పేర్కొనడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. చొప్పదండిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిధుల మంజూరుపై జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఎంపీగా గెలిచి, కరీంనగర్‌కు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ బకాయిలు రాష్ట్రానికి ఇప్పించి, నిజమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనిపించుకోవాలని సూచించారు. ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, ఏఎంసీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం..
-
గంగవ్వను గెలిపించేందుకు ఓటు
మల్యాల(చొప్పదండి): ఎండిన డొక్కను అడిగితే.. గంగవ్వ పేరు చెబుతుంది. పుట్టీపుట్టగానే తల్లి ఒడికి దూరమైంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని వారి ప్రేమకు దూరమైంది. పలక, బలపం చేతబట్టకపోయినా ఇంగ్లిష్ నేర్చింది. ఐదేళ్లలోనే పెళ్లిపీఠలపై కూర్చుంది. కన్నీళ్లు.. కష్టాలే తోడునీడగా పెరిగింది. ఇక జీవితం అయిపోయిందనుకున్న తరుణంలో మై విలేజ్ షో.. గంగవ్వలోని తెలంగాణ గడుసుతనాన్ని..యాసను. భాషను ఒడిసిపట్టింది. మట్టిలోని మాణిక్యాన్ని వెలికితీసి, ప్రపంచపు నలుమూలలకు పరిచయం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఐరోపా దేశాలతోపాటు సౌదీ అరేబియా, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి గంగవ్వ ఆరాధ్యదైవమైంది. ఐదేళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముదుసలి వాళ్లు సైతం గంగవ్వ అంటే తెలియని వారు లేరు. కష్టాల కడలిని దాటుకుంటూ లంబాడిపల్లి నుంచి బిగ్‌బాస్ షో వరకు వెళ్లిన బహుదూరపు బాటసారి గంగవ్వ. గంగవ్వను గెలిపించేందుకు ఓటు మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన మిల్కూరి గంగవ్వ బిగ్‌బాస్ రియాలిటీ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె నామినేషన్ కోసం వేలాదిమంది ఇతర దేశాల్లోని అభిమానులు, స్థానికులు, తెలంగాణ భాషా ప్రేమికులు ఆన్లైన్ ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ సంప్రదాయం..కట్టు..బొట్టు..అమాయకత్వానికి నిదర్శనంగా నిలిచిన గంగవ్వ ఫొటో వాట్సాప్ స్టేటస్‌లలో, ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. గంగవ్వను గెలిపించేందుకు యూట్యూబ్ గంగవ్వ ఫాలోవర్స్ తపన పడుతున్నారు. విదేశాల్లోని తెలుగు వారుసైతం తమతోపాటు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులుసైతం ఓటు వేస్తున్నారు. ఎనిమిదేళ్లలో లంబాడిపల్లి టు బిగ్‌బాస్.. లంబాడిపల్లికి చెందిన ఎంటెక్ విద్యార్థి శ్రీరాం శ్రీకాంత్ పల్లె సంస్కృతిని, సంప్రదాయాలను పల్లెల్లోని అనుబంధాలు, ప్రేమలు, పండుగలు ప్రపంచానికి చాటి చెప్పేందుకు 2012లో ‘మై విలేజ్ షో’ ఛానల్ ప్రారంభించాడు. ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతమైన లంబాడిపల్లిలోని పచ్చని పొలాలు, పండుగలను యూట్యూట్‌లో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. తన ఇంటి పక్కనే ఉన్న గంగవ్వతోపాటు స్థానికులతో షార్ట్ ఫిల్మŠస్లో నటింపజేశారు. సుమారు 200 షార్ట్ ఫిల్మŠస్లో నటించింది. గంగవ్వ అమాయకత్వం..తెలంగాణ తిట్లు..భాష..యూట్యూబ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పల్లె ప్రజల్లో ఇంటి మనిషిగా మారిపోయింది. ఇక వెనకకు తిరిగిచూడలేదు. గంగవ్వకు ఫాలోవర్స్ పెరిగిపోయారు. గంగవ్వ ఎక్కడ కనపడినా ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో ఆమె సహజనమైన నటనను సినిమా దర్శకులను సైతం ఆకట్టుకుంది. పూరి జగన్నాథ్ సినిమాలో అవకాశం కల్పించారు. ఇస్మార్ట్ జోడీ వంటి టీవీ ప్రోగ్రాంలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆమె ప్రతిభను గుర్తించి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై నుంచి జ్ఞాపిక అందుకున్నారు. -
అమ్మమ్మా.. ఇదేందమ్మా!
వీణవంక (హుజూరాబాద్): నెల రోజుల శిశువును అమ్మమ్మ అమ్మేసింది. మనవరాలి ఆలనా పాలనా చూడాల్సిన ఆమె అప్పులు తీర్చుకోవడం కోసం రూ లక్షకు విక్రయించింది. శిశువు కనిపించకపోవడంపై కూతురు నిలదీయడం.. తల్లీకూతుళ్ల గొడవను ఓ వ్యక్తి డయల్ 100కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన జమల్పూరి పద్మ, రమేశ్ నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నెల రోజుల క్రితం పద్మ ఆడశిశువుకు జన్మనిచ్చింది. వారం క్రితం భర్తతో గొడవ పడిన పద్మ.. స్వగ్రామంలోని తల్లి కనకమ్మ ఇంటికి వచ్చింది. కూతురికి మాయమాటలు చెప్పిన కనకమ్మ.. నాలుగు రోజుల క్రితం శిశువును పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి రూ.1.10 లక్షలకు విక్రయించింది. శిశువు కనిపించకపోవడంతో తల్లిని నిలదీయగా మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీసింది. పద్మ గట్టిగా నిలదీయడంతో డబ్బులకు అమ్మేశానని చెప్పడంతో రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. ప్రేమ వివాహం నచ్చనందుకే..! పద్మకు గతంలోనే వివాహమైంది. కుమారుడు, కూతురు ఉన్నారు. రమేశ్‌ను రెండో వివాహం చేసుకుంది. కులాంతర వివాహం చేసుకోవడంతో తల్లికి నచ్చలేదు. కూతురుపై కక్ష పెంచుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అదునుగా తీసుకున్న కనకమ్మ.. కూతురును తన ఇంటికి తీసుకొచ్చింది. శిశు విహార్‌కు తరలింపు శిశువు విక్రయంపై ఎస్సై కిరణ్‌రెడ్డి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పర్చేందుకు కరీంనగర్‌లోని శిశువిహార్‌కు తరలించారు. కాగా, శిశువు విక్రయంలో కొందరు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలిసింది. కనకమ్మ రూ.2 లక్షలు డిమాండ్ చేయగా రూ.1.10 లక్షలకు బేరం కుదిర్చినట్లు సమాచారం. -
ప్రభుత్వాసుపత్రిలో కాంగ్రెస్‌నేత కలకలం..
-
కరోనా భయం.. విషాదం
గొల్లపల్లి(ధర్మపురి): కరోనా భయంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండంలోని బొంకూర్ గ్రామంలో సోమవారం విషాదం నింపింది. వివరాలిలా.. గ్రామానికి చెందిన మాదాసు మల్లేశం–సత్తవ్వ దంపతులకు ముగ్గురు కూతుర్లు. చిన్న కూతురు నారా మేఘన(22) బీఫార్మసీ చదువుకుంది. ధర్మారం మండలకేంద్రానికి చెందిన నారా మధుసూదన్‌కు ఇచ్చి రెండునెలలక్రితం వివాహం చేశారు. పెళ్లింట్లో, తల్లి గారింట్లో ఎలాంటి గొడవలు లేవు. పెళ్లి అయిన కొద్దిరోజులకు హైదరాబాద్ వెళ్లారు. మేఘన ఫార్మసీలో ఉద్యోగం చేస్తుండగా ఆమె భర్త ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. (ట్విట్టర్ ద్వారా వెల్లడించిన బయోకాన్ ఎండీ) వారంక్రితం జ్వరంకాగా జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించాడు. కరోనా లక్షణాలు లేవనిచెప్పినప్పటికీ తల్లిగారింటికి వెళ్లానని చెప్పడంతో భర్త బొంకూర్‌లో దింపి వెళ్లాడు. టైపాయిడ్ జ్వరంతో బాధపడుతున్న మేఘన కరోనా అనుమానంతో ఆదివారం రాత్రి ఇంట్లో అందరూపడుకుని నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు తెల్లవారు లేచి చూసే సరికి శవమై కనిపించింది. కరోనా వచ్చిందేమోననే భయంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మేఘన తండ్రి మాదాసు పెద్దమల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ నవీన్ పంచనామా నిర్వహించడంతో ఎస్సై జీవన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పెళ్లి అయిన రెండునెలలకే మేఘన ఆత్మహత్యకు పాల్పడడంతో రెండుకుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులరోదనలు మిన్నంటాయి. -
కరీంనగర్లో భారీ వర్షం..
సాక్షి, కరీంనగర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది. జిల్లాలోని చిగురుమామిడి మండలంలో అత్యధికంగా 12.5 సెంటీ మీటర్ల వర్షపాతంనమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలుజలకళను సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షానికి చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో పోచమ్మ చెరువు, సుందరగిరిలోని కోమటికుంట మత్తడి దూకుతున్నాయి. పంట పొలాలు నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్నపల్లిలో 11.2 సెంటీమీటర్లు, రేణికుంటలో 10.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట 10.3 సెంటి మీటర్లు, కొహెడ మండలంలో 9.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల రోడ్లపై నుంచి వరద పొంగిపొర్లడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షం, వరదలతో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. -
చిరుత చిక్కలే!
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో సీసీ కెమెరాలకు చిక్కిన చిరుతను పట్టుకునేందుకు అటవీ, పోలీసు శాఖల అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గ్రేహౌండ్స్, ఫైరింగ్రేంజ్, నార్మ్, గగన్‌పహాడ్ అటవీ ప్రాంతాన్ని శుక్రవారం ఇరు శాఖల అధికారులు సంయుక్తంగా జల్లెడ పట్టారు. అటవీ శాఖ రంగారెడ్డి జిల్లా రేంజ్ అధికారి విక్రమ్‌చంద్ర, రాజేంద్రనగర్ ఎస్సై సురేశ్ తమ సిబ్బందితో సీసీ కెమెరాలలో కనిపించిన ప్రాంతంతో పాటు బయోడైవర్సిటీ పార్క్, చెరువు, గ్రేహౌండ్స్ రేంజ్ పరిసరాలను పరిశీలించారు. చెరువుతో పాటు బయోడైవర్సిటీ పార్కు, గ్రేహౌండ్స్ ఖాళీ ప్రదేశాల్లో చిరుత అడుగు జాడలు కనిపించాయి. బుద్వేల్ రైల్వే అండర్ పాస్ వద్ద కనిపించిన చిరుత గురువారం రాత్రి నార్మ్లో కనిపించిన చిరుత ఒకటే అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వర్సిటీ ఖాళీ ప్రదేశంలో కనిపించిన అడుగుల ముద్రలు, శుక్రవారం కనిపించిన అడుగుల ముద్రలు పోలి ఉన్నాయని తెలిపారు. చెరువు ప్రాంతంలో చిరుత అడుగు జాడలు స్పష్టంగా కనిపించగా..చిరుత జాడ కోసం మధ్యాహ్నం వరకు వెతికిన అధికారులు అనంతరం తిరిగి వెళ్లిపోయినట్లు చెప్పారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని ప్రజలందరినీ అప్రమత్తం చేశామని అధికారులు తెలిపారు. స్థానికుల భయాందోళన నార్మ్ ప్రాంతంలో చిరుత జాడ కనిపించడంతో రాజేంద్రనగర్ వాసులు ఉలిక్కిపడ్డారు. బుద్వేల్ రైల్వే అండర్ పాస్ వద్ద కనిపించి జాడ తెలియకుండా పోయి గురువారం రాత్రి చిరుత సీసీ కెమెరాలకు చిక్కింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. నార్మ్ ప్రధాన రహదారి పక్క నుంచే మాణిక్యమ్మ కాలనీ, అంబేడ్కర్ బస్తీ, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయా లని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. వామ్మో.. చిరుత! రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి అడవి పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరించడం కలకలం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం మల్కపేట రిజర్వాయర్ కాలువ మరమ్మతు పనులు జరుగుతుండగా.. సమీప ప్రాంతం నుంచి చిరుత వెళ్లడాన్ని ఓ టిప్పర్ డ్రైవర్ తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు చేరవేశాడు. చిరుత నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి జూ పార్కుకు తరలించాలని అక్కపల్లి సర్పంచ్ మధుకర్ కోరారు. మల్కపేట రిజర్వాయర్ కాలువ వెంట వెళ్తున్న చిరుత మళ్లీ పెద్దపులి కలకలం మంచిర్యాల జిల్లా తాండూర్‌తో పాటు గిరిజన గూడేల్లో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మారుమూల అటవీ ప్రాంతం శివారు గూడేల వైపు పెద్దపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తాజాగా గుర్తించారు. నర్సాపూర్, అబ్బాపూర్, బెజ్జాల గిరిగూడేల మీదుగా మాదారం త్రీఇంక్లైన్ శివారు అటవీ ప్రాంతం వరకు పులి అడుగులను శుక్రవారం బెల్లంపల్లి అటవీ రేంజ్ అధికారి మజారొద్దీన్, డిప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి, బీట్ అధికారి తన్వీర్‌ఖాన్ సేకరించారు. పులి పాదముద్రలను కొలతలు తీసుకున్నారు. పులి కదలికలపై నిఘా వేసి ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పులి తిష్ట వేసిన లొకేషన్‌ను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పెద్దపులి పాదముద్ర కొలత తీసుకుంటున్న దృశ్యం -
ఇండోనేసియన్లతో మొదలై.. మర్కజ్‌తో పెరుగుతున్నాయి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాను కరోనా భయం వీడడం లేదు. ఇండోనేసియన్లతో మొదలైన కరోనా పాజిటివ్ కేసులు ఆగుతున్నాయనుకునేలోపే... ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారితో పెరుగుతున్నాయి. ఇండోనేసియన్ల ద్వారా కరీంనగర్ జిల్లాకే పరిమితమైన కరోనా పాజిటివ్ కేసులు ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వారి వివరాలు తెలిసిన తరువాత పెరగడం మొదలైంది. ఉమ్మడి జిల్లా నుంచి తబ్లిగీ జమాత్ సమావేశానికి 59 మంది వెళ్లొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరందరిని క్వారంటైన్‌కు తరలించగా ఇప్పటికి హుజూరాబాద్‌లో ఇద్దరికి, కరీంనగర్లో ఒకరికి, జగిత్యాలలో ముగ్గురికి కరోనా సోకింది. పెద్దపల్లిలో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారితో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా, వీరు ప్రయాణించిన రైలులో వచ్చిన మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. తాజాగా హుజూరాబాద్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ద్వారా మరొకరికి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మర్కజ్ వెళ్లొచ్చిన వారి నుంచి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా రెండో దశ కరోనా వ్యాపించింది. పెద్దపల్లిలో ఆదివారం నిర్ధారణ అయిన వ్యక్తికి సైతం ప్రైమరీ కాంటాక్ట్ ద్వారానే వ్యాధి సోకిందని అధికారులు నిర్ధారించారు. ఇండోనేషియన్ల ద్వారా సోకింది నలుగురికే.. మార్చి 14న కరీంనగర్‌కు వచ్చి 16 వరకు బస చేసి హైదరాబాద్ క్వారంటైన్‌కు తరలి వెళ్లిన పది మంది ఇండోనేసియన్ల ద్వారా ఇద్దరికి, వారిలో ఒకరి ద్వారా అతని కుటుంబంలోని మరో ఇద్దరికి కరోనా ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా సోకింది. ఇప్పటి వరకు ఇండోనేసియన్ల ద్వారా వ్యాధి సోకింది నలుగురికే. రెండవ ఫేజ్‌లో నిజాముద్దీన్ ఘటన భయభ్రాంతులకు గురి చేస్తుంది. కరీంనగర్ జిల్లా నుంచి మర్కజ్‌కు వెళ్లొచ్చిన 19 మందిలో ముగ్గురికి సోకగా, వారిలో ఒకరు కరీంనగర్ అయితే, ఇద్దరు హుజూరాబాద్ వాళ్లు. హుజూరాబాద్‌లో పాజిటివ్ వ్యక్తి ద్వారా మరో వ్యక్తికి సోకడంతో జిల్లా మొత్తంలో 18 మందికి సోకినట్లయింది. కాగా వీరికి మళ్లీ పరీక్షలు జరపగా, 13 మందికి నెగెటివ్ అని తేలింది. వీరిలో పది మంది ఇండోనేసియన్లు కూడా ఉండడం గమనార్హం. మరో ఐదుగురు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కాకుండా పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున పాజిటివ్‌తో బాధ పడుతున్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పాజిటిక్ కేసులు 23కు చేరాయి. భయపెడుతున్న మర్కజ్ యాత్రికులు నిజాముద్దీన్ మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన ఉమ్మడి జిల్లాకు చెందిన 59 మంది ద్వారా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతాయని అధికార యంత్రా ంగం ఆందోళన చెందుతోంది. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి ద్వారా ఏడుగురుకి, వీరిలో ఒకరి ద్వారా çసోమవారం హుజూరాబాద్ వ్యక్తికి పాజిటివ్ రావడంతో సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యాధికా రులు భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన వారు జిల్లాలో ఎంత మందిని కలిశారనే విషయంలో ఆందోళన చెందుతున్నారు. ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేసిన వారు, వారి కుటు ంబాల పరిస్థితి ఏంటనే విషయం అర్థం కావడం లేదు. లాక్డౌన్ నేపథ్యంలో కరోనా సోకిన వారి నుంచి కేవలం వారి కుటుంబసభ్యులకే తప్ప వేరే వ్యక్తులకు ట్రాన్స్మిట్ కావడం లేదని తెలుస్తోంది. ప్రజల సహకారంతోనే అడ్డుకట్ట ఇండోనేషియన్లకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన 18వ తేదీ తరువాత నుంచి కరీంనగర్ ప్రజలు, అధికారులు సంఘీభావంతో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 18 పాజిటివ్ కేసులు రాగా, వాటిలో రెండోసారి పరీక్షల్లో 13 మందికి నెగిటివ్ వచ్చింది. వారిని డిశ్చార్జి చేశారు కూడా. ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌గా ఉంది. మరో ఇద్దరికి సంబంధించిన ఫలితాలు రావలసి ఉంది. మర్కజ్ వెళ్లొచ్చిన వారందరినీ క్వారంటైన్ చేశాం. వారి కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్, హోం క్వారంటైన్లలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.– గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి -
ఐదుగురిని బలిగొన్న గ్రానైట్ లారీ
గంగాధర(చొప్పదండి): గ్రానైట్ లారీ అతివేగం ఐదుగురి ప్రాణాలను బలిగొంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కొడిమ్యాల మండలం లోని గౌరాపూర్ గ్రామానికి చెందిన మ్యాక నర్సయ్య(55) కుమారుడు మ్యాక బాబు ఇంటివద్ద బైక్ పైనుంచి పడ్డాడు. తలకు గాయాలు కావడంతో స్థానికంగా ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నర్సయ్య తన సమీప బంధువు, పూడూరు గ్రామానికి చెందిన వాహనం యజమాని గడ్డం అంజయ్య(47)ను సంప్రదించాడు. అంజ య్య కరీంనగర్ రావడానికి అంగీకరించడంతో బాబు(27), నర్సయ్య, బంధువైన మ్యాక బాణయ్య(60) కరీంనగర్ వెళ్లారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. చికిత్స అనంతరం కరీంనగర్లో పని చేసే మరో బంధువు మ్యాక శేఖర్(27)తో కలసి స్వగ్రామానికి బయల్దేరారు. ఎదురొచ్చిన మృత్యువు.. వీరు ప్రయాణిస్తున్న వాహనం గంగాధర మండలం కురిక్యాల సమీపంలోకి రాగానే జగిత్యాల నుంచి కరీంనగర్‌వైపు వెళుతున్న గ్రానైట్ లారీ వేగంగా వచ్చి టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టడంతో డ్రైవర్ అంజయ్య నర్సయ్య, శేఖర్, బాబు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బాణయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. సమాచారం అందుకున్న గంగాధర ఎస్సై వివేక్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్డీవో ఆనంద్‌కుమార్ మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామన్నారు. వివిధ ప్రమాదాల్లో 37 మందికి గాయాలు జనగామ శివారులో జాతీయ రహదారిపై నెల్లుట్ల బైపాస్ క్రాసింగ్ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 37 మంది స్వల్పంగా గాయపడ్డారు. ములుగు జిల్లాలో మేడారం మహాజాతరకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో స్వగ్రామాలకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఘోర ప్రమాదం : గ్రానైట్ లారీ, టాటా మ్యాజిక్ డీ..!
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న గ్రానైట్ లారీ, టాటా మ్యాజిక్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్‌లో ఉన్న ఐదుగురు మృతి చెందారు. మృతులు కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. మృతులు మేకల నర్సయ్య అతని కుమారుడు మేకల బాబు, సొదరుడు బానయ్య, సోదరుని కుమారుడు శేఖర్, మేనల్లుడు ఆటో డ్రైవర్ గడ్డం అంజయ్యగా పోలీసులు గుర్తించారు. కాగా ఇటీవల బైక్‌పై నుంచి పడి గాయపడ్డ బాబుకు కరీంనగర్ ఆసుపత్రిలో వైద్యం చేయించి ఆటోలో ఇంటికి తీసుకు వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ జరిందని పోలీసులు పేర్కొన్నారు. ఆటో క్యాబిన్లో డ్రైవర్ అంజయ్య మృతదేహం ఇరుక్కుపోవడంతో అతి కష్టం మీద పోలీసులు బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మొక్కజొన్న చేనులో లైంగిక దాడి?
గన్నేరువరం(మానకొండూర్): నమ్మిన స్నేహితుడి భార్యను దారుణ హత్య చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని మాదా పూర్ గ్రామంలో వివాహిత ఎల్లాల లచ్చవ్వ(45) మొక్కజొన్న చేనులో దారుణహత్యకు గురైంది. సంఘటన స్థలాన్ని సీపీ కమలాసన్‌రెడ్డి పరిశీలించా రు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు..సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి ఎల్లాల లచ్చిరెడ్డి, చెక్కిల శ్రీనివాస్‌గౌడ్ మధ్య కొద్ది కాలంగా స్నేహంగా ఉంటున్నారు. మాదాపూర్ శివా రులో భార్య ఎల్లాల లచ్చవ్వ తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. లచ్చిరెడ్డి రైతుకాగా, చెక్కిల శ్రీని వాస్‌గౌడ్ ్రౖడైవర్గా పని చేస్తున్నాడు. ఇద్దరు కలిసి గ్రా మంలో ఒక బెల్టుషాపులో మద్యం తాగారు. లచ్చిరెడ్డి భార్య బావి వద్ద ఉండగా చెక్కిల శ్రీనివాస్‌గౌడ్‌కు బైక్ ఇచ్చి ఆమెను తీసుకురావాలని చెప్పాడు. అక్కడికి వెళ్లిన అతడు తన తండ్రి చెక్కిల స్వామికి ఫోన్ చేశా డు. ఎల్లాల లచ్చవ్వ మొక్కజొన్న చేనులో చనిపోయి ఉందని తెలిపాడు. అతడు గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు లచ్చిరెడ్డికి సమాచారం ఇచ్చి బావి వద్దకు వెళ్లారు. గాలింపు చేపట్టగా లచ్చవ్వ చేనులో వివస్త్రగా మృతిచెంది ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా గన్నేరువరం, బెజ్జంకి మండలాల ఎస్సైలు వంశీకృష్ణ, కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు సిద్దిపేట జిల్లా బేగంపేట గ్రామ శివారులో చెక్కిల శ్రీనివాస్‌గౌడ్‌ను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సీపీ కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారధి, తిమ్మాపూర్ సర్కిల్ సీఐ మహేశ్‌గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడి వివరాలు, అతడితో ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించి కేసుపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏసీపీని సీపీ ఆదేశించారు. మొక్కజొన్న చేనులో లైంగిక దాడి? లచ్చవ్వ భర్త లచ్చిరెడ్డి, చెక్కిల శ్రీనివాస్‌గౌడ్ ఇద్దరు మద్యం తాగారు. మద్యం మత్తులోనే శ్రీనివాస్‌గౌడ్ లచ్చవ్వను తీసుకురావడానికి బైక్‌పై బావి వద్దకు వెళ్లాడు. అదేమత్తులో లచ్చవ్వను మొక్కజొన్న చేనులోకి లాక్కెళ్లి లైంగికదాడి చేసి హత్యచేసినట్లు తెలుస్తోంది. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు లచ్చవ్వ ప్రయత్నించగా బలవంతంగా వివస్త్రను చేసి లైంగిక దాడి చేసే క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రపెనుగులాట జరిగినట్లు సంఘటన ప్రదేశాన్ని బట్టి తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలుస్తుందనే భయంతో లచ్చవ్వను హత్యచేసి పారిపోయేందుకు ప్రయత్నించాడని స్థానికులు తెలిపారు. అనంతరం తన తండ్రికి ఫోన్‌చేసి విషయాన్ని తప్పుదోవ పట్టించేలా లచ్చవ్వ చనిపోయిందని తెలిపాడని, అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది. మొదటగా మండలంలోని మాదాపూర్ గ్రామ వైపు వెళ్లగా తరువాత బెజ్జంకి మండలం బేగంపేట వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మృతురాలి ముఖం, మెడపై తీవ్రమైన గాయాలయ్యాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలి శ్రీనివాస్‌గౌడ్‌ను కఠినంగా శిక్షించాలని లచ్చవ్వ భర్త లచ్చిరెడ్డి సీపీకి మొరపెట్టుకున్నాడు. ఏసీపీతో సమగ్ర విచారణ చేపట్టి నిందితుడు చెక్కిల శ్రీనివాస్‌గౌడ్‌కు కఠిన శిక్ష పడేలా కేసు నమోదు చేస్తామని సీపీ హామీ ఇచ్చారు. లచ్చిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. -
కేసీఆర్ చర్చలు జరిపేవరకు అంత్యక్రియలు చేయం
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం బుధవారం తలపెట్టిన సకలజనుల సమరభేరి సభకు వెళ్లి మృతి చెందిన డ్రైవర్ నంగునూరి బాబు అంత్యక్రియలపై ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని గురువారం మృతుడి కుటుంబ సభ్యులతో పాటు ఆర్టీసీ కార్మికులు బైఠాయించారు. మృతుడి ఇంటివద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులను అరెస్ట్ చేయడంతో.. జిల్లాలోని ఆరెపల్లి గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన జేఏసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపేవరకూ.. మృతదేహాన్ని కదలనివ్వబోమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు. చదవండి: ఆర్టీసీ సమ్మె: ఆరెపల్లిలో విషాదం -
వీడిన కట్ట లోగుట్టు
సాక్షి, కరీంనగర్: ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన మిడ్‌మానేరు రిజర్వాయర్ కట్ట భద్రతపై నెలకొన్న సందేహాలకు పుల్‌స్టాప్‌పడనుంది. నిండుకుండలా ఉండాల్సిన మిడ్‌మానేరు 2 టీఎంసీల నీటి నిలువలకు పడిపోవడం వెనుక రిజర్వాయర్ కట్ట పటిష్టంగా లేకపోవడమే కారణమని తేలింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, కేంద్ర ప్రతినిధి బృందం పలుమార్లు కట్టను సందర్శించి, రిజర్వాయర్ నుంచి లీకవుతున్న నీరుకు అడ్డుకట్ట వేయాలంటే ఆ ప్రాంతంలో కట్ట అడుగుభాగాన్ని పునర్నిర్మించడం ఒక్కటే మార్గమని తేల్చారు. ఈ మేరకు బోగంఒర్రె ప్రాంతంలో 200 మీటర్ల పొడవున కట్ట అడుగుభాగంలో పునాదిగా వేసిన రాతి కట్టడాల(రాక్టో నిర్మాణాలు)ను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం నుంచి పనులు ప్రారంభించిన అధికారులు శనివారం కూడా కొనసాగించారు. కట్ట అడుగు భాగంలో పదిమీటర్ల లోతు, పది మీటర్ల వెడల్పులో తవ్వకాలు జరిపి, తిరిగి పటిష్టవంతంగా మట్టితో నింపాలని నిర్ణయించినట్లు సమాచారం. చర్చనీయాంశంగా రాక్టో తొలగింపు మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట భద్రతపై గత ఆగస్టు నెలలోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆగస్టులో కురిసిన వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పెరగడంతో నీటిని దిగువన ఉన్న మిడ్‌మానేరుకు వదిలిన విషయం తెలిసిందే. ఆగస్టు 31న రాత్రి 10 గంటలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే సహకారంతో 25 గేట్లు ఎత్తి నీటిని లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేశారు. అంత అర్జెంట్‌గా నీటిని ఎందుకు విడుదల చేశారన్న అంశంపై అనుమానాలు వ్యక్తమైనా.. ఎల్లంపల్లి నుంచి మళ్లీ నీటిని నింపేందుకే అనుకున్నారు. 10 టీఎంసీల నీటిని దిగువకు వదిలిన అధికారులు మళ్లీ మిడ్‌మానేరు నింపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్ బృందం స్పందించారు. ‘మిడ్‌మానేరుకు ఏమైంది?’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించడంతో అందరి దృష్టి ప్రాజెక్టు భద్రతపై పడింది. ఈ నేపథ్యంలో లీకేజీ కాదు సీపేజీ అంటూ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి స్పందించారు. ‘సాక్షి’ దినపత్రికలో మిడ్‌మానేరు ప్రాజెక్టు భద్రత, రిజర్వాయర్ నీటిని పూర్తిగా దిగువకు వదలడం అంశాలపై వరుస కథనాలు ప్రచురించడంతో అందరి దృష్టి ప్రాజెక్టుపై పడింది. ఆసక్తి రేపిన కట్ట నాణ్యత పరీక్షలు మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట భద్రతపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో, అధికారులు ప్రాజెక్టుకు పలు పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో కట్టపైన ఫిజోమీటర్లను ఏర్పాటు చేశారు. బోగెంఒర్రె పరిసరాల్లో కట్ట నాణ్యత, భద్రత అంశాలు పరిశీలించడానికి ఢిల్లీకి చెందిన పర్సాన్ అనే సంస్థతో నీటిపారుదల శాఖ అధికారులు పలు రకాల జియో ఫిజికల్ టెస్టులు(పరీక్షలు) చేయించారు. ఇందులో భాగంగా కట్ట కింద 25 మీటర్ల లోతులో పలు చోట్ల ఎలక్ట్రికల్ సర్వే చేశారు. ఎలక్ట్రికల్ సర్వేలో భూమి అడుగు భాగానా.. తవ్వే అవసరం లేకుండా భూమి కింద 25 మీటర్ల లోపల కట్ట పరిస్థితి ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. దీనికోసం అధికారులు కట్ట కింద ఎలక్ట్రికల్ సర్వేలు, సెప్మో రిట్రాక్టివ్(కట్ట స్కానింగ్) టెస్టులు చేశారు. దీంతో లోపల కట్ట బలంగా ఉందా..? రాక్ ఉన్నదా.. మట్టి బలంగా ఉందా.. లేదా అనే విషయాలు తెలుస్తాయి. ఈ టెస్టులన్నీ ఇటీవల పూర్తి చేశారు. టెస్టులపై ఢిల్లీ సంస్థ ఇచ్చిన నివేదిక అనంతరం డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టును సందర్శిస్తారని అధికారులు తెలిపారు. డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని చర్యలకు శ్రీకారం చుట్టారు. 200 మీటర్లు వెడల్పు... 10 మీటర్ల లోతు ప్రాజెక్టు కట్ట నుంచి సీపేజీ జరుగుతున్న బోగం ఒర్రె ప్రాంతంలో 2475 నెంబర్ నుంచి 2675 నెంబర్ వరకు 200 మీటర్ల పొడవున కట్ట కింద సుమారు రాతి కట్టడాల(రాక్టో)ను తొలగిస్తున్నారు. 10 మీటర్ల లోతు, వెడల్పులో రాతి నిర్మాణాలను తొలగించి తిరిగి పనులు చేస్తున్నారు. కట్టకింద భాగంలో తొలగించడం వల్ల కట్ట కూడా దెబ్బతినే అవకాశం ఉన్నందున 200 మీటర్ల మేర పూర్తిగా కొత్త నిర్మాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాక్టో తొలగింపునకు పెద్ద మొత్తంలో జేసీబీలు, టిప్పర్లు వాడుతుతున్నారు. 200 మీటర్ల మేర కట్ట కిందనే తొలగిస్తారా? లేదా మొత్తం తొలగిస్తారా..? రాక్టో తొలగింపుల అనంతరం డ్యాం సేఫ్టీ, సెంట్రల్ డిజైనింగ్ అధికారులు ఏమంటారు..? తదితర సందేహాలపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కాగా శనివారం సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఎస్ఈ చంద్రశేఖర్, మిడ్‌మానేరు ఎస్ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ అశోక్‌కుమార్ కట్టను సందర్శించారు. కట్టకు భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు రక్షణ చర్యలు చేపట్టామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కాగా రిటైర్డ్ ఇంజినీర్ల బృందం కూడా శనివారం మరోసారి మానేరు కట్టను సందర్శించింది. 200 నుంచి 300 మీటర్ల పొడవున కట్టను పునర్నిర్మించాలని అధికారులు సూచించారు. గతంలో ఓసారి తెగిన కట్ట మిడ్‌మానేరు రిజర్వాయర్ నిర్మాణం సమయంలోనే ఓసారి గండిపడింది. 2016, సెప్టెంబర్ 24న మిడ్‌మానేరు ఎగువన కురిసిన భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఎడమవైపు కట్ట తెగింది. కట్ట తెగిన తరువాత మరింత పటిష్టంగా నిర్మించాల్సి ఉండగా, లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు జరగలేదని ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. గతంలో తెగిన ఎడమవైపే బోగం ఒర్రె ప్రాంతంలో కట్ట సీపేజీ రావడం, దానిని పునర్నిర్మించాలని నిర్ణయించి పనులు ప్రారంభించడం గమనించాల్సిన విషయం. కాగా, ఇంత జరుగుతున్నా... రిజర్వాయర్ కట్ట విషయంలో అధికారులు వాస్తవాలు తెలియజేయకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కాని విషయం. -
సమ్మెకు కాంగ్రెస్, ప్రజాసంఘాల మద్దతు
సాక్షి, గోదావరిఖని: సమ్మెకు దిగిన కార్మికులు, ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోబోమంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో ఆర్టీసీలో సమ్మె మరింత ఉధృతమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే తదితర డిమాండ్లతో చేపట్టిన సమ్మె సోమవారం మూడో రోజుకు చేరింది. వివిధ పార్టీల నాయకులు సంఘీభావం, పలు సంఘాల నిరసన కార్యక్రమాలతో తీవ్రతరమైంది. కార్మి కులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. ఉదయం 6గంటలకే డిపో వద్దకు చేరు కుని నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి సూచనల మేరకు నిరసనలు చేపట్టారు. మంథని, గోదావరిఖని డిపోల పరిధిలో పనిచేసే డ్రైవర్లు, కం డక్టర్లు, ఉద్యోగులు బస్టాండ్లకు సమీపంలో నిరసన తెలిపారు. గోదావరిఖనిలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ కాలనీలో ఆర్టీసీ ఉద్యోగులు బస్ డిపోకు 300 మీటర్ల దూరంలో ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి, మంథని ఎమ్మె ల్యే శ్రీధర్‌బాబు మంథనిలో, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి బస్టాండ్‌లో ప్రదర్శనలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల కోసం ఏమాత్రం ఆలోచించకుండా నియంతలా వ్యవహర్తిస్తున్నా డని ఆరోపించారు. ఉద్యోగుల హక్కుల కోసం అన్నివర్గాల ప్రజలు సహకరించాల ని కోరారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జేఏసీ నాయకులు వంగర శ్రీనివాస్, రాజయ్య, లక్ష్మణ్, మసూద్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రీజియన్‌లో 505 బస్సులు ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ కరీంనగర్ రీజియన్‌లో ఆర్టీసీ బస్సులు 302, అద్దె బస్సులు 203 మొత్తం 505 బస్సులు నడిపించారు. తాత్కాలిక కండక్టర్లు 302, డ్రైవర్లు 302మందితో బస్సులు నడిచాయి. -
పండుగ పూట.. మద్యం ధరలు ప్రియం
సాక్షి, సిరిసిల్ల: మందుబాబులకు దసరాకు ధరల కిక్కు ఎక్కుతోంది. పండుగ పూట మద్యం ధరలు ప్రియమయ్యాయి. ఇవి సర్కారు పెంచిన ధరలు అనుకుంటే పొరపాటే.. జిల్లాలోని వైన్స్ యజమానులు సొంతంగా ఇష్టారీతిన ధరలు పెంచుకుని మద్యం అమ్ముతున్నారు. ఇదేందని అడిగితే.. ‘అంతా మా ఇష్టం’ అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. వైన్స్‌ల్లోనే కాదు బార్లలోనూ రేట్లు పెంచి మద్యంప్రియుల ను నిలువుదోపిడీ చేస్తున్నారు. బీరుకు రూ.10.. క్వార్టర్‌కు రూ.10.. ఫుల్‌బాటిల్‌కు రూ.50 చొప్పున అధికంగా వసూలు చేస్తూ.. మద్యం వ్యాపారులు పండుగ చేసుకుంటున్నారు. బీరుపై రూ. 10.. ఫుల్‌పై రూ. 50 జిల్లాలోని 75శాతం మద్యం దుకాణాల్లో అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదేందని మద్యం ప్రియులు అడిగితే.. ‘ప్రభుత్వం వద్దనంగా నెల రోజుల పాటు మద్యం దుకాణాలు నడపాలని ముక్కుపిండి ఫీజులు కట్టించింది. చెల్లించిన పైసలు చేతికి రావాలంటే ఇక ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు పదో పరకో వేసి అమ్మకాలు జరిపితే నెల గడుస్తుంది’ అంటూ వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. అందుకే మద్యం దుకాణదారులు ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీలపై రేట్లు పెంచి అమ్మడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇలా బీ రుపై పది రూపాయలు ఫుల్ బాటిల్‌పై యాబై రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇలాంటి అమ్మకాలు వెన్స్‌లోనే కాదు బార్ అండ్ రెస్టారెంట్స్‌లో జరుగుతుండడం గమనార్హం. బార్‌లోని మద్యాన్ని బయటకు అమ్మడానికి వీలులేకున్నా.. అడ్డదారిలో అమ్మకాలు జరుపుతున్న వారిపై అబ్కారీ అధికారులు నిఘా వేయడం విఫలమవుతున్నట్లు విమర్శలున్నాయి. దసరాపై దండిగా ఆశలు దసరా పండక్కు మన ప్రాంతంలో మద్యం ఎక్కువగా అమ్ముడు పోతుంది.ఇదే అవకాశంగా అనధికార పెంపును అమలు చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వానికి చెల్లించిన సొమ్మును ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేజిక్కించుకో వడానికి కాస్త రేట్ల పెంచుకున్నట్లు తెలుస్తోంది. బెల్టుషాపుల్లో మరింత అదనం జిల్లాలో ప్రభుత్వం అనుమతితో 42వైన్ షాపులు, ఆరు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా అనధికారికంగా జిల్లాలో దాదాపు వెయ్యి వరకు బెల్ట్‌షాపుల నిర్వహణ జరుగుతోంది. వీటిలో ఎమ్మార్పీకన్నా కనిష్టంగా రూ.10నుంచి గరిష్టంగా రూ.50 అధికం తీసుకుని మద్యాన్ని గ్రామాల్లో అమ్మకాలు జరుçపుతున్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం వైన్స్‌షాపుల్లోనే అధిక ధరలకు విక్రయిస్తుండడంతో ఇక బెల్టుషాపుల్లో మద్యంప్రియుల జేబులకు చిల్లుపడినట్లే అని పలువురు భావిస్తున్నారు. అకున్ సబర్వాల్‌కు ఫిర్యాదు అకున్ సబర్వాల్‌కు ఫిర్యాదు చేసినపోస్టు రుద్రంగి(వేములవాడ): మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి వసూలు చేస్తున్నారని రుద్రంగి మండలకేంద్రానికి చెందిన దేశవేని వినోద్‌కుమార్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అకున్‌సబర్వాల్‌కు శుక్రవారం ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఎక్సైజ్ డిపార్టుమెంటు వారికి తగు చర్యల నిమిత్తం ఈ పోస్టును శనివారం ఫార్వర్డ్ చేశారు. అయితే ఆదివారం కూడా రుద్రంగిలోని మద్యం దుకాణంలో అధిక ధరలకే మద్యం విక్రయించడంతో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రేట్లు పెరగలేదు.. మద్యం ఎమ్మార్పీ రేట్లకు అమ్మాలి. ప్రస్తుతం రేట్లు పెంచారన్న దానిలో వాస్తవం లేదు. బార్ అండ్ రెస్టారెంట్లలో అమ్మకాలు గురించి తెలియదు. బార్లో సేవించేందుకు మద్యం అమ్మకాలు జరపాలన్న నిబంధన ఉంది. బయటకు బాటిల్స్ అమ్మకాలు జరగవు. పండుగలున్నాయని నిబంధనలను పాటించకుంటే అలాంటి వారిపై వచ్చిన ఫిర్యాదుపై చట్టపరిధిలో చర్యలకు వెళ్తాం. – చంద్రశేఖర్, ఎక్సైజ్ సీఐ, ఎల్లారెడ్డిపేట -
బాధ్యతలు స్వీకరించిన మంత్రి ‘గంగుల’
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రిగా ఇటీవల నియామకమైన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న బీసీకమిషన్ కార్యాలయంలో కుటుంబసభ్యుల సమక్షంలో గురువారం బాధ్యతలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు గంగులను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలి పారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తనకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండుశాఖల ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సేవ చేసే అవకాశం ఇచ్చారని అన్నారు. ఖరీఫ్‌లో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశం ఉందని రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. పలువురి అభినందనలు మంత్రిగా కమలాకర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం, కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయ ర్ గుగ్గిళ్లపు రమేష్, నాయకులు వై.సునీల్‌రావు, చల్ల హరిశంకర్, ఎడ్ల అశోక్, బండారి వేణు, గందె మహేశ్, తదితరులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
‘అభయహస్తం’ కోసం ఎదురుచూపులు
సాక్షి, హుజూరాబాద్: చెల్పూర్ గ్రామానికి చెందిన మల్లమ్మ ఒక్కరే కాదు కరీంనగర్ జిల్లాలోని ఐదు వేలకు పైగా మంది మహిళలు అభయహస్తం పథకంలో అందే పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లోని వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2016 చొప్పున పింఛన్ అంది స్తోంది. వికలాంగులకు రూ.3016 పింఛన్ అందిస్తున్నారు. అభయహస్తం పథకంలో లబ్ధిదారులుగా ఉంటూ నెలకు రూ.500 పింఛన్ పొందేవారిని ప్రభుత్వం విస్మరించడంపై ఆందోళన చెందుతున్నారు. మహిళా సంఘాల సభ్యులకు బీమా, వృద్ధాప్యంలో పింఛన్ సౌకర్యం కల్పించేందుకు అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. 65 ఏళ్లు నిండిన మహిళా సంఘంలోని సభ్యులకు నెలకు రూ.500 చెల్లించేవారు. అభయహస్తం పింఛన్‌ను 2017 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం నిలిపివేయగా, రెండేళ్ల నుంచి జిల్లాలో 5150 మంది లబ్ధిదారులు పింఛన్ సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబ సమగ్ర సర్వే సమయంలో కుటుంబంలో వివిధ రకాలుగా పింఛన్ పొందుతున్న వారి వివరాలను అధికారులు ఇంటింటికి వెళ్లి నమోదు చేసుకున్నారు. ఆయా గ్రామాల్లో అభయహస్తం ద్వారా పింఛన్ వస్తుందన్న విషయాన్ని తెలుసుకొని మరోమారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని లబ్ధిదారులకు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తమకు మొండి చేయి చూపారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు అందని మార్గదర్శకాలు అభయహస్తం పథకం అమలుపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారులకు మార్గదర్శకాలు అం దలేదని తెలుస్తోంది. ఆసరా పథకంలో గతంలో నే 65 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ అం దజేయగా, అభయహస్తంలో పింఛన్ నిలిచిన వారు ఆసరా పథకంలో దరఖాస్తు చేసుకోవా లని సూచించగా, కొంతమంది పొందుతున్నా రు. ఒకే ఇంట్లో వృద్ధాప్య పింఛన్ ఇద్దరికి ఇచ్చే అవకాశం లేకపోవడంతో చాలామంది అభయహస్తం పింఛన్ లబ్ధిదారులు ఆసరా పింఛన్ అందుకోలేకపోతున్నారు. 65 ఏళ్లు నిండిన వారికి అందుతున్న వృద్ధాప్య పింఛన్ ఇక నుంచి 57 ఏళ్లు నిండిన వారందరికీ ఇస్తామని ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల హామీలో భాగంగా 57 ఏళ్ల పింఛన్ పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లుగా కూడా ఇటీవలనే ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనతో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో రూ.1000 ఉన్న పింఛన్ తాజాగా రూ.2 వేలకు పెంచారు. 57 ఏళ్ల పింఛన్ హామీ అమలుకు కూడా మార్గదర్శకాలు రాకపోవడంతో ప్రస్తుతం పాత వారే కొత్త పింఛన్ తీసుకుంటున్నారు. జిల్లాలో సుమారుగా 14 వేల మంది 57 ఏళ్లు నిండిన వారు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. కొంతమంది ఆసరా పథకంలో పింఛన్ పొందడానికి అర్హత ఉన్న అభయహస్తం పింఛన్ లబ్ధిదారులు ఆసరా పథకంలో పింఛన్ తీసుకుంటున్నారు. చాలామందికి అర్హత లేకపోవడంతో అభయహస్తం పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అభయహస్తం లబ్ధిదారులకు కూడా ఆసరా పథకంలో లబ్ధి చేకూరే విధంగా ఆలోచన చేయాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో అభయహస్తం లబ్ధిదారుల వివరాలు హుజూరాబాద్ మండలంలో 535 మంది, వీణ వంకలో 512, జమ్మికుంటలో 254, ఇల్లందకుంటలో 176, సైదాపూర్‌లో 296, శంకరపట్నంలో 480, చిగురుమామిడిలో 358, చొప్పదండిలో 365, గంగాధరలో 362, గన్నేరువరంలో 164, కరీంనగర్‌రూరల్‌లో 289, కరీంనగర్(మున్సిపాలిటీ)లో 24, కొత్తపల్లిలో 215, మానకొండూర్‌లో 350, రామడుగులో 473, తిమ్మాపూర్‌లో 297 మంది ఉన్నారు. ప్రభుత్వ పరిశీలనలో ఉంది అభయహస్తం పథకం అమలు విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఆసరా పథకం ప్రారంభమైన నేపథ్యంలో 2017 నుంచి అభయహస్తం పథకం నిలిచింది. ఆసరా పథకంలోనే ప్రస్తుతం 65 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ ఇస్తున్న నేపథ్యంలో అర్హులైన వారు ఆసరా పథకంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పింఛన్ మంజూరుకు ప్రతిపాదించడం జరుగుతుంది. అభయహస్తం ప£థకం విషయాన్ని ఇప్పటికే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – వెంకటేశ్వర్రావు, డీఆర్డీఏ పీడీ ‘‘మూడేళ్లుగా అభయహస్తం పింఛన్ రావడం లేదు. మహిళా సంఘంలో సభ్యురాలైన నాకు గతంలో అభయహస్తం పథకంలో నెలకు రూ.500 వచ్చేవి. మూడేళ్ల సంది రావడం లేదు. పింఛన్ పైసలు వత్తలేవని ఊళ్లకు వచ్చే సార్లకు చాన సార్ల చెప్పిన ఆసరా పథకంలోనన్న పింఛన్ వచ్చేలా చూడాలె.’’ – ఇదీ హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన మల్లమ్మ ఆవేదన -
నేటి నుంచి 'తెలంగాణ వైభవం'
సాక్షి, సిరిసిల్ల: ఏ జాతి మనుగడైనా దాని చారిత్రక, సాంస్కృతిక పునాదులపైనే ఆధారపడి ఉంటుందనేనది కాదనలేని వాస్తవం. చరిత్ర విస్మరించిన జాతి ఉనికి కోల్పోతుందనేది అంతే తిరుగులేని నిజం. విభిన్న సంస్కృతులకు, ఆచార వ్యవహారాలు తెలంగాణ ప్రాంతానికి విశేష ఆభరణాలు. కళలు, ప్రజాజీవన శైలి, సాంస్కృతిక రూపాలు వైవిధ్యమైన ఆచార, సంప్రదాయాలు ఈ ప్రాంతానికి పెట్టని సుగుణాలు. తెలంగాణ వైభవం.. కనుమరుగైన చరిత్రను శాస్త్రీయంగా పరిశోధించి, సిసలైన ఇతిహాసాన్ని భావి తరాలకు అందించేందుకు ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ‘తెలంగాణ వైభవం’ పేరిట మూడు రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఉమ్మడి కరీంనగర్‌లోని మానేరు బ్రిడ్జి సమీపంలోని కొండా సత్యలక్ష్మి గార్డెన్ ఈ వైభవానికి వేదికగా మారింది. విశ్లేషకులు, విశిష్ట వ్యక్తులు, ఆయా రంగాల్లో లబ్ధప్రతిష్టులైన వారి విస్తృత ప్రసంగాల ద్వారా నిజమైన చరిత్రను రేపటి తరానికి అందించనున్నట్లు నిర్వాహకులు ప్రజ్ఞాభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎల్. రాజభాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డి.నిరంజనాచారి తెలిపారు. ఇవీ చర్చనీయాంశాలు తెలంగాణ చారిత్రక వైభవం, కావ్యం, పురాణ ఇతిహాసాలు, శాస్త్ర, సాహిత్య గ్రంథాలు, పండుగలు, పర్వదినాలు, ఉత్సవాలు, జాతరలు, వాస్తు శిల్పం, నగర నిర్మాణ ప్రణాళికలు, జల వినియోగం, ప్రదర్శన కళా ప్రక్రియలు, ప్రయోజనాలు, చేనేత నైపుణ్యాలు, రత్నాలు, పగడాలు, నిల్వ ఉంచే ఆహార పదార్థాలు, ప్రాచీన కాలంలో వెల్లి విరిసిన నౌకానిర్మాణం, నౌకాయానం, తెలంగాణ స్వాతంత్రోద్యమం తదితర అంశాలపై సాధికార ప్రసంగాలు ఏర్పాటు చేశారు. ఈ మూడు రోజుల్లో ప్రతి రోజు చర్చల తరువాత తెలంగాణ కళలు, సాంస్కృతిక, జానపద కళారూపాలు ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. ఇదీ కార్యక్రమ అనుసారిణి.. తొలిరోజు శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో సదస్సు ప్రారంభమవుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ విశిష్ట అతిథిగా హాజరవుతారు. అతిథులు ప్రసంగాల అనంతరం కాకతీయుల కాలంలో యుద్ధ సన్నాహక ప్రేరేపిత నృత్య రూపకం పేరిణీ శివతాండవం ప్రదర్శిస్తారు. రెండో రోజు శనివారం ప్రాచీన తెలంగాణ వైభవంపై సదస్సు నిర్వహిస్తారు. చరిత్ర, సాహిత్య, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలుంటాయి. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. డాక్టర్ సాగి కమలాకరశర్మ, డాక్టర్ సంగనభట్ల నర్సయ్య, డాక్టర్ భాస్కర్‌యోగి, డాక్టర్ మనోహరి, ప్రొఫెసర్లు ఎల్లప్రెగడ సుదర్శన్‌రావు, కేపీ రావు డాక్టర్ గిరిజామనోహర్ బాబు, తదితరుల ప్రసంగాలుంటాయి. అనంతరం కవి గండ్ర లక్ష్మణ్‌రావు సారథ్యంలో కవి సమ్మేళనం, ప్రతాప రుద్రీయం నాటక ప్రదర్శన ఉంటుంది. మూడో రోజు ఆదివారం జానపద, సాహిత్య, సంస్కృతులపై ప్రసంగాలు ఏర్పాటు చేశారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరవుతారు. డాక్టర్ బండారు ఉమామహేశ్వర్రావు, ప్రొఫెసర్ పాండురంగారావు, సూర్యధనుంజయ్, డాక్టర్ శంకర్రావు, డాక్టర్ వడ్లూరి ఆంజనేయరావు ప్రొఫెసర్లు కె.యాదగిరి, డాక్టర్ కసిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రసంగాలుంటాయి. సాయంత్రం ముగింపు సమావేశంలో ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తదితరులు హాజరవుతారు. సత్యమైన చరిత్ర కోసం.. నిజమైన చరిత్ర ఈ తరానికి తెలియాలి. పాలకుల ప్రభావంతో రాయబడిందే చరిత్రగా భావిస్తున్నాం. పరిశోధకులు, శాస్త్రీయ ఆధారాలతో నిరూపించగలిగిన తెలంగాణ చరిత్రను కళ్లముందుకు తెస్తున్నాం. ఇతిహాసాల ఆధారంగా లభించిన ఆనవాళ్లు, సాక్ష్యాలతో నేటి తరానికి ఆనాటి తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక సంపదను పరిచయం చేయబోతున్నాం. – డాక్టర్ ఎల్. విజయభాస్కర్‌రెడ్డి, ప్రజ్ఞాభారతి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ప్రజల పండుగ తెలంగాణ సంస్కృతి మిగిలిన ప్రాంతాలతో పోల్చితే పూర్తి భిన్నమైనది. సుమారు రెండున్నర వేల ఏళ్ల చరిత్ర ఈ ప్రాంతానిది. ఇప్పటి వరకు మన దృష్టికి రాని చరిత్రను వెలికితీసి ఈ సదస్సుల రూపంలో అందిస్తున్నాం. ఎనిమిది సదస్సులు, మనదైన సంస్కృతి రూపాల ప్రదర్శన ఏర్పాటు చేశాం. తెలంగాణ ప్రజల పండుగలా నిర్వహిస్తున్న కార్యక్రమానికి అందరూ రండి. అసలైన చరిత్రను ఆస్వాదించండి. – గిరిధర్ మామిడి, సీఏ, నిర్వాహక కార్యదర్శి, ప్రజ్ఞాభారతి రాష్ట్రశాఖ -
ఈ సర్కార్ నౌకరీ మాకొద్దు!
పెద్దపల్లిరూరల్: పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని సంపాదించామన్న ఆనందాన్ని చాలా మంది ఉద్యోగులు నిలుపుకోలేక వాటికి రాజీనామాలు చేసి ఇతర ఉద్యోగాల వైపు చూస్తున్నారు. ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పదవులను ప్రభుత్వం భర్తీ చేయడంతో అర్హత గల వారంతా ఆయా ఉద్యోగాలను దక్కించుకున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అమలయ్యే నిబంధనలు కఠినతరంగా ఉండడం, విధులు నిర్వహణలో ఒత్తిడి అధికం కావడంతో వాటిని వదులుకునేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 263 పంచాయతీలు ఉండగా, ఇందులో 57 మంది రెగ్యూలర్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. వీటికి తోడు 198 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరారు. అందులో 20 మంది పంచాయతీ కార్యదర్శులు తమ అవసరాలను బట్టీ పదవులను వదులుకుంటున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు రాజీనామా లేఖలను సమర్పించారు. ఆన్లైన్ అనుమతులతో అవస్థలు.. నూతన పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ పద్ధతినే అనుమతులు ఇవ్వాల్సి ఉండడం కూడా ఇబ్బందులకు కారణంగా పేర్కొంటున్నారు. గ్రామపంచాయతీ జనాభా కొత్తగా ఇళ్లు నిర్మించే స్థలం తదితర వివరాలకు అనుగుణంగా ఆన్లైన్లో అనుమతులను ఇవ్వాల్సి ఉంటుందని ఈ విషయమై జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా చేరిన తమకు అవగాహన పెంచేలా శిక్షణ తరగతుల ను నిర్వహించాల్సిన అవసరం ఉంటుందన్నా రు. గ్రామంలో వార్డుసభ్యుడు మొదలు సర్పం చ్, ఎంపీటీసీతోపాటు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామపెద్దలు తమ తమ అవసరాల నిమిత్తం పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడిని పెంచి తాము చెప్పినట్టే మసులుకోవాలని హుకూం జారీ చేస్తున్నారని వాపోతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామాలు.. పంచాయతీరాజ్ కొత్త చట్టం అమలుతో బాధ్యతలు పెరగడంతోపాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడిలు విపరీతంగా పెరగడంతో ఈ ఉద్యోగాన్ని వదిలి మరో ఉద్యోగం చూసుకోవడం మేలంటూ కుటుంబీకుల నుంచి సూచనలు అందుతున్న కారణంగానే పలువురు పంచాయతీ కార్యదర్శులు ఇతర ఉద్యోగాల్లో చేరేందుకు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామాల్లో అనేక రకాల సమస్యలు, సవాళ్లు ఒకేసారి చుట్టు ముట్టుతుండడంతో వాటిని తట్టుకోలేక మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డ స్రవంతి ఉదంతమే ఇందుకు నిదర్శనంగా పలువురు పేర్కొంటున్నారు. 20 మంది కార్యదర్శుల రాజీనామా... జిల్లాలో పంచాయతీ కార్యదర్శులుగా చేరిన వారిలో 20 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వారిలో చాలా మంది ఇతర శాఖల్లో ఉద్యోగాలు రావడంతో పనిభారం అధికంగా ఉండడంతోపాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి తట్టుకోలేక తమ ఉద్యోగాలను వదులుకున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి మండలంబ్రాహ్మణపల్లి, పెద్దబొంకూరు గ్రామపంచాయతీ కార్యదర్శులతోపాటు అంతర్గాం మండలం ఎల్లంపల్లి, ఎలిగేడు మండలంలోని లాలపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలం చినరాత్పల్లి, సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి, మంథని మండలం గోపాల్పూర్, నాగెపల్లి, అక్కెపల్లి, కన్నాల, ముత్తారం మండలం దర్యాపూర్, కమ్మంపల్లి, ఓదెల మండలం గుంపుల, గుండ్లపల్లి, కొలనూర్, పాలకుర్తి మండలం జయ్యారం, రామగిరి మండలం సుందిళ్ల, చందనాపూర్, ఆదివరంపేటకు చెందిన కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేశారు. శిక్షణ ఇవ్వకుండానే విధులా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమలులోకి తెచ్చి వాటి నిర్వహణ బాధ్యతలను పంచాయతీ సర్పంచ్, కార్యదర్శులకే కట్టబెట్టడం సమంజసం కాదని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు పేర్కొంటున్నారు. కొత్తగా విధుల్లో చేరిన తమకు తమ విధులు, బాధ్యతల గురించి ఏమాత్రం అవగాహన లేదని, తమకు వృత్యంతర శిక్షణను ఇప్పించి నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసం ధాన కర్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల ఒత్తిడిలతోపాటు ఉన్నతాధికారులు కూడా తమనే బాధ్యులుగా చేస్తుండడంతో విధి నిర్వహణలో తాము ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తుందని పలువురు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. -
‘స్వచ్ఛత’లో నం.1
సాక్షి, కరీంనగర్: స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో కరీంనగర్ జిల్లాకు మొదటిర్యాంకు వచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛదర్పణ్‌లో కరీంనగర్ జిల్లాకు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో మొదటిర్యాంకు రావడంతో గుర్తింపు వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు జిల్లాలు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లాలు వందశాతం మార్కులతో మొదటిర్యాంకు సొంతం చేసుకున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఉపయోగం, తడి,పొడి చెత్తనిర్వహణ, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం జిల్లావ్యాప్తంగా చేపట్టిన ప్రచార కార్యక్రమాలు, ప్రజలను భాగస్వాములను చేయడం, మహిళాసంఘాలు, స్వచ్ఛగ్రాహీల భాగస్వామ్యం, గ్రామస్థాయి ప్రజల సమన్వయంతో వివిధ అంశాలతో చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రాతిపదికన తీసుకున్నారు. ఓడీఎఫ్ కోసం విస్తృతప్రచారం.. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం చేపట్టింది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. మండలాలు, గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి యుద్ధప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 2017లోనే జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించారు. స్వచ్ఛభారత్‌కు సంబంధించిన ఐదు విభాగాల్లోనూ జిల్లాప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ–32, స్వచ్ఛభారత్‌పై అవగాహనలో 32మార్కులు లభించాయి. తడి,పొడి చెత్త సేకరణ, ఘన, ద్రవవ్యర్ధాల నిర్వహణలో 16మార్కులు, జియోట్యాగింగ్, కమ్యూనిటీ మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం, స్వచ్ఛభారత్ అనుబంధ కార్యక్రమాల విభాగంలో 20 మార్కులతో కలుపుకుని వందమార్కులు సాధించింది. జాతీయ,రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంకు సాధించడంతో గుర్తింపు లభించింది. బోర్డులతో గ్రామాల్లో స్వాగతం.. జిల్లావ్యాప్తంగా ఓడీఎఫ్ ప్లస్‌లో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రవేశానికి ముందు బోర్డులు ఏర్పా టు చేస్తున్నారు. ‘బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి పొందిన గ్రామం’ మీకు స్వాగతం పలుకుతుందంటూ అన్ని గ్రామాల్లో స్వాగతబోర్డులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతీ గ్రామంలో ప్రధాన చౌరాస్తాల్లో మరుగుదొడ్ల వినియోగం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై వాల్‌పెయింటింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లను వినియోగించడంపై అవగాహన కల్పిస్తున్నారు. -
సీసీఐకి మిల్లర్ల షాక్!
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ పత్తి మిల్లర్లు షాకిచ్చారు. 2019–20 సీజన్‌కు సంబంధించి జిన్నింగ్, బేళ్ల తయారీకి సీసీఐ ఇటీవల టెండర్లు ఆహ్వానించగా.. రాష్ట్రం నుంచి ఎవరూ దాఖలు చేయలేదు. సీసీఐ అమలు పరుస్తున్న నిబంధనలను నిరసిస్తూ వ్యాపారులు మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. టెండర్లకు గడువు ముగియడంతో ఆ సంస్థ ఇప్పుడు పునరాలోచనలో పడింది. సీజన్ సమీపిస్తుండడంతో వ్యవహారం రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ చెంతకు చేరినట్లు తెలుస్తోంది. మద్దతు ధరల కోసం.. తెలంగాణలో పత్తి క్రయవిక్రయాల సీజన్ అక్టోబర్‌లో మొదలవుతుంది. నవంబర్ నుంచి కొనుగోళ్లు ఊంపదుకుని మార్చి వరకు నడుస్తాయి. ప్రధాన మార్కెట్లలో ఏడాది పొడవునా అమ్మకాలు సాగుతాయి. యార్డులో తొలుత ప్రైవేటు వ్యాపారులే పత్తి కొంటారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నూలు, దూది డిమాండ్‌ను బట్టి స్థానికంగా పత్తి ధరలు నిర్ణయిస్తారు. రైతులు తెచ్చే సరకుల్లో తేమ, పింజ పొడవుకు అనుగుణంగా తేడాలు వేస్తారు. మార్కెట్లో ధరలు పతనమైతే మద్దతు ధరల కల్పనకు సీసీఐ రంగంలోకి దిగుతుంది. సరకుల నాణ్యత పరీక్షించి నాలుగు గ్రేడ్లుగా విభజిస్తుంది. తేమశాతం 8 నుంచి 12 లోపు ఉన్న విడిపత్తినే కొంటుంది. నిబంధనల మేరకు ధరలు నిర్ణయించి రొక్కాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరిగితే వాణిజ్య కొనుగోళ్లూ చేపడుతుంది. ఇలా వివిధ కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన సరకులను సమీపంలోని జిన్నింగు మిల్లులకు తరలించి దూదిగా మారుస్తుంది. బేళ్ల రూపంలో దూదిని నిల్వ చేసి, సమయానుకూలంగా వ్యాపారం నిర్వహిస్తుంది. బేళ్ల ఎగుమతిలోనూ సీసీఐ పాత్ర కీలకం. టెండర్లకు దూరంగా మిల్లర్లు.. సీజన్‌కు ముందే సీసీఐ అధికారులు రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఎంపిక చేస్తారు. సేకరించే పత్తిని జిన్నింగు, ప్రెస్సింగు చేసి బేళ్లుగా మార్చేందుకు సమీపంలోని పత్తి మిల్లుల నుంచి ఆన్లైన్ టెండర్లు ఆహ్వానిస్తారు. నిబంధనల ప్రకారం కోట్‌చేసిన వ్యాపారులకు పనులు అప్పగిస్తారు. ఈ తంతు ఏటా నిర్వహిస్తారు. కాగా.. గతంలో పత్తి జిన్నింగు, ప్రెస్సింగు కలుపుకొని బేలు తయారీకి రూ.1050 చొప్పున మిల్లర్లకు చార్జీ ఇచ్చేవారు. 2013–14 సంవత్సరం నుంచి 2017–18 వరకు ఈ ధరనే వర్తింపజేశారు. 2018–19 నుంచి సీసీఐ అధికారులు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. బేలు తయారీ చార్జీని రూ.1104 దాకా పెంచారు. దీనికితోడు మిల్లర్లకు లింట్, ట్రాష్, షార్టేజీ లింకు పెట్టారు. క్వింటాలు పత్తి నుంచి తీసే లింట్ (దూది) శాతాన్ని ఒకే సీజన్లో 30.9 నుంచి 33 కిలోలకు పెంచుతూ(నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు) పోయారు. క్వింటాలు పత్తిలో షార్టేజీని 3.25 నుంచి 2.25 శాతం వరకు, దూదిలో ట్రాష్(దుమ్ము)ను 3.5 నుంచి 2.5 శాతం వరకు తగ్గిస్తూ వచ్చారు. వ్యతాస్యం ఏర్పడితే మిల్లర్లకు ఇచ్చే చార్జీల్లో కోత విధించారు. దీన్ని వ్యాపారులు వ్యతిరేకించినా రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ జోక్యంతో అమలుపర్చారు. ఈ విధానం నష్టాలు కలిగించడంతో బేళ్ల తయారీకి మిల్లర్లు వెనకడుగు వేశారు. సీజన్లో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చివరికి తలొగ్గారు. ఈ క్రమంలో 2019–20 సీజన్ కోసం జూలై 26న సీసీఐ టెండర్లు పిలిచింది. దాఖలుకు ఆగస్టు 14 వరకు గడువు విధించింది. ఈ నెల 15న టెండర్లు తెరిచిన సీసీఐ అధికారులు విస్తుపోయారు. రాష్ట్రంలో 350 పత్తిమిల్లులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 45 పత్తి మిల్లులు ఉండగా.. ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు. సీసీఐ షరతులపై విముఖంగా ఉన్న వ్యాపారులు సమష్టిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బేళ్ల తయారీకి ఇస్తున్న చార్జీని మరింత పెంచాలని, లింట్, ట్రాష్, షార్జేజీ శాతాన్ని సడలించాలనే పట్టుతో ఉన్నారు. దీనిపై పునరాలోచనలో పడిన భారత పత్తి సంస్థ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. సర్కారు దరికి సమస్య.. సీసీఐకి వ్యాపారులకు మధ్య తలెత్తే వివాదాలపై రాష్ట్ర సర్కారే చొరవ చూపుతోంది. నిరుడు సమస్య ఉత్పన్నమైనప్పుడు కూడా మార్కెటింగ్‌శాఖ జోక్యం చేసుకుని సమస్యకు తెరదింపింది. ఈయేడు మిల్లర్లు టెండర్లకు దూరంగా ఉండడంతో ప్రభుత్వం మళ్లీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 14 లక్షల హెక్టార్లలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2.50లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతోంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 18 లక్షల టన్నుల దిగుబడి రావొచ్చని అంచనా. మరో నెలన్నరలో పత్తి క్రయవిక్రయాల సీజన్ మొదలు కానుండగా.. రైతులకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండాల్సిన అవసరం నెలకొంది. మద్దతు ధరల కల్పనకూ ఇది అనివార్యం. రాష్ట్రంలో సీసీఐ ఏటా సుమారు 150 కేంద్రాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 కేంద్రాలను నెలకొల్పుతోంది. జిన్నింగు మిల్లుల సమస్య తీర్చకుంటే పత్తి కొనుగోళ్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అదే జరిగితే రైతులకు ఇబ్బందులు తప్పవు. ఇదే అదునుగా దళారులు రెచ్చిపోతారు. రైతుల శ్రమఫలాన్ని గద్దల్లా తన్నుకుపోతారు. మార్కెట్లోనూ ధరలు పతనం అవుతాయి. సీసీఐ, మిల్లర్లకు మద్య నడుస్తున్న కోల్డ్‌వార్ ఇప్పటికే మార్కెటింగ్‌శాఖ దరికి చేరింది. రేపోమాపో ఇరువర్గాలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. -
కొండగట్టు మాస్టర్‌ప్లాన్‌కు పట్టిన శని!
సాక్షి, మల్యాల(చొప్పదండి): కొండగట్టుపై వెలిసిన అంజన్నను దర్శించుకుంటే శని వదిలి అంతా మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. అయితే భక్తుల సౌకర్యార్థం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌కు పట్టిన శని మూడేళ్లుగా వీడడం లేదు. సీఎం వస్తే తప్పా పరిస్థితిలో మార్పు రాదనే భావన భక్తుల్లో నెలకొంది. కొండగట్టు పుణ్యక్షేత్రం మాస్టర్‌ప్లాన్ కాగితాలకే పరిమితమైంది. నివేదిక రూపొందించి దేవాదాయ శాఖకు సమర్పించి మూడేళ్లు గడుస్తున్నా..నేటికీ మాస్టర్‌ప్లాన్ అమలు ఊసే లేదు. కొండగట్టు పుణ్యక్షేత్రానికి సీఎం కేసీఆర్ వస్తేనైనా మాస్టర్‌ప్లాన్ అమలుకు నోచుకుంటుందనే ఆశతో భక్తులు ఎదురుచూస్తున్నారు. టూరిజం డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో రోప్ నిర్మాణం ప్రతిపాదనలు చేసి, ఐదేళ్లయినా అతీగతీలేదు. మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది వస్తుంటారు. కొండగట్టులో భక్తులసంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణ జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఏటా వేలాది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మాస్టర్‌ప్లాన్ అమలెప్పుడో? భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం ముందుకు సాగడం లేదు. కొండగట్టు ఆలయ పరిధిలో ప్రభుత్వ భూమి 333 ఎకరాలు ఉంది. వీటిలో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మూడేళ్లు గడుస్తున్నా మాస్టర్‌ప్లాన్ అమలుకు నోచుకోవడం లేదు. కాగితాలకే పరిమితమైంది. మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వస్తే.. కొండగట్టులో మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వస్తే, భక్తులకు మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. భక్తులుకోసం 100 గదుల వసతి గృహం, మెట్లదారి వెంట రూఫ్ వేయనున్నారు. రోప్ వే నిర్మాణం, ఆలయ రెండో ప్రాకారం నిర్మాణం, కొండగట్టు దిగువన ఆర్చి గేటు నిర్మాణం, నిత్యాన్నదాన సత్రం భవనం, అభిషేక మండపం, సంతోల్లలొద్ది నుంచి గుట్టపైకి నీటిసరఫరా పైపులైన్, రెండస్తుల దీక్ష విరమణ భవనం, పార్కింగ్ స్థలం అభివృద్ధి, రెండు డార్మిటరీ హాళ్ల నిర్మాణం, యాత్రికులకోసం 500 గదుల భవనం, వీఐపీలకోసం 50 ఏసీ సూట్స్ నిర్మాణం, రెండు ఎకరాల్లో ఉద్యానవనం ఏర్పాటు, దేవాలయం ఆవరణలో క్యూలైన్ల కంపార్ట్మెంట్ నిర్మాణం చేయనున్నారు. సీఎంకోసం ఎదురుచూపులు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారంటూ మూడేళ్లు గడుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం ఆలయాలకు వచ్చినప్పటికీ, కొండగట్టుకు మాత్రం సీఎం రాకపోవడంపై భక్తులు నిరాశలో ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ కొండగట్టుకు వస్తారంటూ చెబుతున్నా, నేటికీ నెరవేరడం లేదు. మాస్టర్ ప్లాన్ నివేదిక అందజేశాం కొండగట్టులో మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన నివేదిక దేవాదాయశాఖకు అందజేసినం. మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వస్తే ఏటా పెరుగుతున్న భక్తులకు అవసరమైన వసతిగృహం, పార్కింగ్ స్థలం, మెట్లదారిలో రూఫ్ అందుబాటులోకి వస్తాయి. – అమరేందర్, కొండగట్టు ఆలయ ఈవో -
ముంచుకొస్తున్న మున్సి‘పోల్స్’
సాక్షి, కరీంనగర్ : మున్సిపాలిటీలకు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ప్రభుత్వం ఈ నెల మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, నెలాఖరున ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండడంతో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల విభజన, ఓటర్ల గణన వంటి అంశాలను ఖరారు చేయడంలో అధికారులు తలమునకలు అవుతున్నారు. ప్రతీ రోజు అర్ధరాత్రి వరకు పనులు చేస్తూ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఫొటో ఓటర్ల జాబితాను డివిజన్ల వారీగా తయారు చేస్తున్నారు. 10న ముసాయిదా జాబితా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించి 14న తుది జాబితా వెలువరించనున్నారు. అదే రోజు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. దీంతో పోటీ చేయడానికి ఆశావహులు, తాజా మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సన్నద్ధం అవుతుండగా... మున్సిపాలిటీలపై పట్టు సాధించడానికి రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. డివిజన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల గణన సిద్ధమవుతుండడంతో రిజర్వేషన్లపై ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఏ డివిజన్ అనుకూలంగా వస్తుందోననే ఆందోళన నెలకొంది. దీంతో పక్కపక్కనే ఉన్న రెండు, మూడు డివిజన్లపై దృష్టి సారించి ఆయా డివిజన్లు, వార్డుల ప్రజలతో ఇప్పటికే తాను పోటీలో ఉంటున్నానని, తనకు మద్దతు తెలపాలని కోరుతూ అందరినీ కలుస్తున్నారు. మొత్తంమీద పట్టణప్రాంతాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. రిజర్వేషన్లు ఖరారైతే ఇక నోటిఫికేషన్ రాకున్నా ప్రచారం ఊపందుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రచారానికి ఎక్కువగా సమయం ఉండదనే భావన నాయకుల్లో ఇప్పటికే చోటుచేసుకుంది. దీంతో ఒక్క రోజు కూడా వృథా చేయకుండా కాలనీల్లోనే గడుపుతున్నారు. పట్టణాల్లో వేడెక్కిన రాజకీయం... మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో పట్టణాల్లో రాజకీయ సందడి ప్రారంభమైంది. డివిజన్లు, వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు ఏ మేరకు తమకు అనుకూలిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. మేయర్/చైర్మన్, కార్పొరేటర్/కౌన్సిలర్లుగా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు తమ తమ ప్రయత్నాలను ప్రారంభించారు. ఆయా పార్టీల నేతల చుట్టు ప్రదక్షిణలు చేస్తూ టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో వైపు స్థానికంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి యత్నాలు ప్రారంభించారు. కొంతమంది ఎన్నికల ఖర్చు కోసం నిధుల వేటను ప్రారంభించగా, మరికొందరు ఓటర్లకు అడ్వాన్స్‌గా తాయిలాల హామీలను కూడా ఇస్తున్నారు. ఇక రాజకీయ పార్టీలు మున్సిపాలిటీల్లో పట్టు సాధించడానికి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. జిల్లా అధికార టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలతోపాటు మున్సిపల్ ఎన్నికలపై పట్టు కోల్పొకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. బీజేపీ సైతం సభ్యత్వ నమోదును ప్రారంభించి డివిజన్ల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈసారి తమకు అవకాశం కల్పించాలని కోరుతోంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాలతో మున్సిపల్ ఎన్నికల బరిలో దిగడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడానికి స్థానికగా అర్ధబలం, ప్రజాబలం ఉన్న నేతల కోసం దృష్టి సారిస్తున్నారు. బ్యాలెట్‌తోనే ఎన్నికలు.. 2014లో మున్సిపల్ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించిన ఎన్నికల సంఘం ఈసారి బ్యాలెట్‌తో నిర్వహించాలని నిర్ణయించింది. డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ముసాయిదాను ఈ నెల 14న ప్రకటించి, వెంటనే రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంది. జిల్లాలో కార్పొరేషన్‌తోపాటు నాలుగు మున్సిపాలిటీలకు ఒకే విడతలో ఎన్నికలు జరపనుండడంతో పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు, హుజూరాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డులు, జమ్మికుంటలో 30, చొప్పదండిలో 14, కొత్తపల్లిలో 12 వార్డులుగా విభజించారు. ఆయా డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసిన పోలింగ్స్టేషన్ల వారీగా బ్యాలెట్ పత్రాల ముద్రణ చేపట్టనున్నారు. ఓటర్ల జాబితా ప్రచురణతోపాటు ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకునే అధికారులు, సహాయ అధికారులు, సిబ్బంది నియామకం చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. నేడో, రేపో పునర్విభజన గెజిట్.. డివిజన్లు, వార్డుల పునర్విభజన గెజిట్ నేడో, రేపో ప్రభుత్వ వెలువరించే అవకాశం ఉంది. మొదట ప్రకటించిన ముసాయిదా పునర్విభజన జాబితాలో స్వల్ప మార్పులు, చేర్పులు జరిగినట్లు తెలిసింది. డివిజన్ల పునర్విభజనలో ఆనవాళ్లు కోల్పోయిన వార్డులకు సంబంధించి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు న్యాయబద్ధంగా ఉన్నవాటిని పరిష్కరించి ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం గెజిట్ రూపంలో డివిజన్ల తుది స్వరూపాన్ని వెలువరించనుంది. -
టార్గెట్ బీజేపీ షురూ !
సాక్షి, కరీంనగర్ : రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో పట్టణాలపై గులాబీ జెండాను మరోసారి ఎగురేయాలని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని కలలుగంటున్న బీజేపీని నిలువరించేందుకు గులాబీ నేతలు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చి పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించడంతోపాటు 2023లో జరిగే శాసనసభ ఎన్నికలే టార్గెట్‌గా ముందుకు సాగాలని పార్టీ యంత్రాంగానికి దిశానిర్ధేశం చేశారు. అమిత్‌షా ఇచ్చిన స్ఫూర్తితో టీఆర్ఎస్పై కమలదళం గొంతు పెంచింది. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్కు కంచుకోట వంటి కరీంనగర్, నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్, సికింద్రాబాద్ సీట్లు గెలుచుకొని ఊపు మీదున్న బీజేపీ పట్టణాలపై పట్టు బిగించాలని భావిస్తోంది. బీజేపీకి క్షేత్రస్థాయిలో సానుభూతిపరులే తప్ప బలమైన యంత్రాంగం లేదు. ఆ పార్టీ బలపడేలోపే మునిసిపల్ ఎన్నికలు ముగిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా బీజేపీని తేలిగ్గా తీసుకోకుండా, బలపడేలోపే దెబ్బ కొట్టాలనే యోచనతో గులాబీదళం పావులు కదుపుతోంది. బీజేపీకి తెలంగాణలో ఏమాత్రం బలం లేదనే మైండ్‌గేమ్ ప్రారంభించిన ఆ పార్టీ నాయకులు మునిసిపల్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావనే ప్రచారానికి తెరలేపారు. పార్లమెంటు ఫలితాలు పునరావృతం కాకుండా.. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ధీమా టీఆర్ఎస్ కొంప ముంచింది. మోదీ హవాను తక్కువగా అంచనా వేయడం, బీజేపీకి గ్రామాల్లో ఓట్లు లేవనే అతి నమ్మకం, సంజయ్ పట్ల పెరిగిన సానుభూతిని గుర్తించపోవడంతో సిట్టింగ్ ఎంపీ వినోద్‌కుమార్ సుమారు 90వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పట్టణ ఓటర్లతోపాటు గ్రామీణ ఓటర్లు కూడా గత ఎన్నికల్లో సంజయ్‌కు అండగా నిలిచారు. మునిసిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనే విషయంలో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మైండ్‌గేమ్‌తో బీజేపీకి చెక్ పెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మీడియా సమావేశాల్లో, బహిరంగసభల్లో విమర్శలు చేసేలా ప్లాన్ అమలు చేస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.టి.రామారావు ఇప్పటికే బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తూర్పార పట్టగా, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సోమవారం మీడియా సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తీరును ఎండగట్టారు. హోంమంత్రిగా ఉండి వీధిపోరాటాలు చేయాలని పిలుపునివ్వడం, హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నిస్తూనే తెలంగాణ రాష్ట్రాన్నే శాంతిమార్గంలో తీసుకొచ్చిన టీఆర్ఎస్కు, జనాలను రెచ్చగొట్టే బీజేపీకి గల వ్యత్యాసం ఇదని చురకలు అంటించారు. స్మార్ట్ సిటీ ఘనత టీఆర్‌ఎస్‌దేనంటూ... కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చిన ఘనత టీఆర్ఎస్దేనని ప్రచారం ఇప్పటికే ప్రారంభించారు. స్మార్ట్‌సిటీ ఇచ్చింది తామేనని బీజేపీ చెబుతున్న మాటలను తిప్పికొడుతూ కేసీఆర్ సూచనల మేరకు తాము చేసిన ప్రతిపాదనల వల్లనే కేంద్రం కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా గుర్తించిందని ప్రచారం చేస్తున్నారు. స్మార్ట్‌సిటీకి నిధులు కూడా విడుదల చేయని విషయాన్ని టీఆర్ఎస్ నేతలు జనం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. పట్టణాల అభివృద్ధి తమతోనే సాధ్యమని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెబుతున్న బీజేపీని ఐదేళ్లలో చేసిందేంటనే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేందుకు సన్నద్ధమయ్యారు. తామిచ్చిన ప్రతిపాదనలకు ఇప్పటికీ మోక్షం లేదని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ జాబితాను చదివి వినిపించారు. ఇతర మునిసిపాలిటీల్లో సైతం.. కరీంనగర్‌తోపాటు రామగుండం కార్పొరేషన్లో కూడా బీజేపీని ఎదగకుండా మొగ్గ స్థాయిలోనే తుంచేయాలనే పకడ్బందీ ప్రణాళిక టీఆర్ఎస్ రూపొందించినట్లు తెలుస్తోంది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇక్కడ బీజేపీ ప్రస్తావన కూడా తీయకుండా టీఆర్ఎస్ వల్లనే సింగరేణి, రామగుండం అభివృద్ధి సాధ్యమైందనే ప్రచారం ప్రారంభించారు. గత పాలకమండలి అవినీతి ఆరోపణలు, మేయర్ మార్పు, టీఆర్ఎస్లో లుకలుకలు తదితర అంశాలన్నీ పలు డివిజన్లలో సిట్టింగ్ కార్పొరేటర్లకు ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ గురించి ఆలోచించకుండా గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి హుజూరాబాద్, జమ్మికుంటల్లో కమలంకు బలం తెస్తానని చెబుతున్నా, ఈటలను తట్టుకోవడం కష్టమేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో బీజేపీకి బలం ఉన్నప్పటికీ, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి విషయంలో టీఆర్ఎస్కు పెద్దగా అంచనాలు లేవు. చొప్పదండిలో గెలుపును మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో కేటీఆర్ ప్రభావం పనిచేస్తుందని, ఇక్కడ బీజేపీకి గెలుపు సీన్ లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లోని మునిసిపాలిటీలలో బీజేపీ ప్రభావం కనిపించకుండా స్థానిక ఎమ్మెల్యేలు సమాయత్తమవుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా టీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహంతో బల్దియా పోరుకు సిద్ధమవుతోంది. -
ముగ్గురు మహిళల ఆత్మహత్య
సాక్షి, మేడిపెల్లి(కరీంనగర్) : మేడిపెల్లి మండలం లింగంపేటకు చెందిన పల్లికొండ గీత ఊరాఫ్ తోపారపు గీత(32) యాసిడ్‌తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం.. లింగంపేటకు చెందిన తోపారపు లక్ష్మయ్య–గంగరాజుల కూతురు గీతను 13ఏళ్లక్రితం వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన పల్లికొం డ గంగాధర్కిచ్చి వివాహం చేశారు. వీరికి ప్రణీత్, పల్లవి అనే ఇద్దరు పిల్లలున్నారు.గంగాధర్ ఉపాధి నిమిత్తం గల్ఫ్వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన పల్లికొండ నర్సయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. నెలరోజుల క్రితం గల్ఫ్‌నుంచి ఇంటికొచ్చిన గీత భర్త గంగాధర్‌కు విషయం తెలిసింది. దీంతో గీతను పుట్టినిల్లయిన లింగంపేటలో రెండ్రోజుల క్రితం వదిలిపెట్టి వెళ్లాడు. తండ్రి లక్ష్మయ్య కూతురును నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. విషయం అందరికి తెలిసిందని, నర్సయ్య వద్దకు వెళ్తే.. దురుసుగా ప్రవర్తించాడని చెప్పింది. శుక్రవారం ఉదయం బాత్రూంలోకి వెళ్లి యాసిడ్తాగింది. సిరిసిల్ల ఆస్పత్రికి తరలించి... అక్కడినుంచి కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందు తూ శనివారం చనిపోయింది. హెడ్ కానిస్టేబుల్ రవి గీత తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పల్లికొండ నర్సయ్యపై కేసు నమోదు చేశారు. గీతకు స్వగ్రామం హన్మాజీపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. ఉరివేసుకొని వివాహిత.. మెట్పల్లి : పట్టణంలోని మఠంవాడకు చెందిన మౌనిక(23) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. మౌనికకు ఎనిమిది సంవత్సరాల క్రితం మధుకర్‌తో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా అనార్యోగంతో బాధపడుతున్న మౌనికకు పలు ఆసుపత్రిలో చికిత్స చేయించిన అది తగ్గలేదు.మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. చెరువులో దూకి వృద్ధురాలు.. కోరుట్ల : కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బకు చెందిన శారద(70) జీవితంపై విరక్తితో శనివారం ఉదయం స్థానిక మద్దుల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం సమయంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఆత్మహత్యాయత్నం ధర్మపురి : ధర్మపురి మండలంరాయపట్నం గ్రామానికి చెందిన గటికె బుచ్చక్క(55) శనివారం సాయంత్రం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బుచ్చక్కకు పుట్టుకతోనే మాటలు రావు. వివాహకం కాలేదు. ఇంటివద్దే ఉంటోంది. వయసు పైబడిన కొద్ది జీవితంపై విరక్తి చెందింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పటించుకుంది. మంటలకు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి మంటలార్పారు. 50శాతం గాయాలపైన బుచ్చక్కను కుటుంబసభ్యులు జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
తల్లి అంత్యక్రియలకు కూతుళ్ల భిక్షాటన
సాక్షి, జగిత్యాల : తల్లి అంత్యక్రియలకు డబ్బు లేక కూతుళ్లు భిక్షాటన చేసిన దైన్య ఘటన శనివారం జగిత్యాల జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. భర్త, కొడుకు సైతం భిక్షాటన చేయగా... స్పందించిన ముస్లిం నాయకులు ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. కూతుళ్లు కన్నతల్లి చివరి చూపునకు నోచుకోలేకపోయారు. మహారాష్ట్రలోని బిలోలి ప్రాంతానికి చెందిన మస్తాన్ తన భార్య ముంతాజ్, చిన్నాన్న పెద్ద మస్తాన్, ముగ్గురు పిల్లలతో కలిసి జగిత్యాలకు నెల రోజుల క్రితం వచ్చారు. ఇక్కడే భిక్షాటన చేస్తూ జిల్లాకేంద్రంలోని టౌన్హాల్లో సేద తీరుతున్నారు. ఓ వైపు అర్ధాకలి, మరోవైపు అనారోగ్యంతో మస్తాన్ భార్య ముంతాజ్ శనివారం ప్రాణాలు విడిచింది. భార్య మృతితో మస్తాన్ నిశ్చేష్టుడయ్యాడు. మస్తాన్ కూతుళ్లు ముంతాజ్(10), మున్నీ(7) తాతతో కలిసి తల్లి అంత్యక్రియలకు అవసరమైన డబ్బు కోసం భిక్షాటనకు వెళ్లారు. మస్తాన్ చిన్నకొడుకు అబ్దుల్లాతో కలిసి భార్య శవం వద్ద ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న మెకానిక్‌లు స్పందించి అంత్యక్రియల కోసం తలాకొంత డబ్బు జమచేశారు. భిక్షాటనకు వెళ్లిన వారు సాయంత్రమైనా తల్లి శవం వద్దకు చేరుకోలేదు. ఈ విషయం తెలిసిన ముస్లిం మైనార్టీ నాయకులు అంత్యక్రియలు చేసేందుకు ముందుకొచ్చారు. చీకటి పడుతుండటంతో కూతుళ్లు రాకుండానే ముంతాజ్ శవాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. భిక్షాటనకు వెళ్లిన కూతుళ్లు తల్లి చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయారు. రాత్రయినా పిల్లలు తండ్రి వద్దకు చేరుకోలేదు. -
వామ్మో.. ఇవేం డివిజన్లు
సాక్షి, కరీంనగర్ : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు హడావుడిగా జరిపిన డివిజన్ల పునర్విభజన రాజకీయ పార్టీల నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య 50 నుంచి 60కి పెరగడంతో తదనుగుణంగా డివిజన్లను విభజించారు. కరీంనగర్ సిటీలో 2,50,484 మంది ఓటర్లు ఉండగా, 60 డివిజన్లకు విభజిస్తే ఒక్కో వార్డుకు 4,174 మంది ఓటర్లు ఉండాలి. డివిజన్ల భౌగోలిక స్వరూపం, రోడ్లు, కాలువలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక్కో డివిజన్‌కు 3,800 నుంచి 4,500 వరకు ఓటర్లను తీసుకొని విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మునిసిపల్ అధికారులు తమకున్న తక్కువ సమయంలో ఇంటి నెంబర్లను ప్రాతిపదికగా తీసుకొని ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా డివిజన్ల విభజన జరిపి ముసాయిదా డివిజన్ల జాబితాను ఈ నెల ఒకటో తేదీన ప్రకటించారు. ఇది గందరగోళంగా తయారైంది. ఇప్పటివరకు కొనసాగిన డివిజన్ల స్వరూపం చాలా చోట్ల మారిపోయింది. కొన్ని ఇంటి నెంబర్లు ఏ వార్డుల్లో కూడా లేని పరిస్థితి నెలకొంది. దీంతో అధికార పార్టీ మాజీ కార్పొరేటర్లతోపాటు కొత్తగా పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ మునిసిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లను కలిసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పునర్విభజన సిత్రాలు మచ్చుకు కొన్ని... ఇప్పటివరకు 20వ డివిజన్‌గా కొనసాగిన డివిజన్ ఇప్పుడు 17వ డివిజన్‌గా మారింది. ఇక్కడ కార్పొరేటర్‌గా ప్రాతినిధ్యం వహించిన కళావతి నివాసం ఉన్న గల్లీ మాత్రం 16వ డివిజన్‌లోకి చేరింది. 19వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సుజాత నివాసం 17వ డివిజన్‌లోకి వచ్చింది. హౌసింగ్‌బోర్డు కాలనీ ఇప్పటి వరకు 21వ డివిజన్‌గా ఉండగా, ప్రస్తుతం అది 18వ డివిజన్‌గా రూపాంతరం చెందింది. కానీ ఇందులోని 300కు పైగా నివాసాలు వేరే డివిజన్‌లోకి వెళ్లాయి. ఇక 41వ డివిజన్లోని ప్రాంతాలు కొన్ని 40, 42 డివిజన్లలోకి చేరాయి. 30వ డివిజన్ పరిస్థితి కూడా అదే. 47, 40, 15 నెంబర్లు గల పాత డివిజన్లు ఇప్పుడు పూర్తిగా స్వరూపాన్ని కోల్పోయాయని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 40వ డివిజన్లో 2–10–185æ నెంబర్ నుంచి 2–10–310 వరకు గల ఇళ్లు ఏ వార్డులోనూ కనిపించడం లేదు. జ్యోతినగర్‌ను 45వ డివిజన్‌గా ప్రకటించిన అధికారులు కట్టరాంపూర్‌ను 46వ డివిజన్‌గా ప్రకటించారు. ఇక ఓటర్ల సంఖ్య విషయంలో కూడా ఎలాంటి శాస్త్రీయత లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక డివిజన్లో 3000 పైచిలుకు ఓటర్లు ఉంటే మరో డివిజన్లో 4500 మంది ఓటర్లుగా ముసాయిదా జాబితాను ప్రకటించడం గమనార్హం. సమయాభావం వల్లనే... జూలై నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలనే ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగా డివిజన్ల విభజనలో శాస్త్రీయత లోపించింది. డివిజన్ల సంఖ్య 60కి అనుగుణంగా ఓటర్ల సంఖ్యను విభజిస్తూ హద్దులు నిర్ణయించడంతో డివిజన్లు ముక్కలు ముక్కలుగా తయారయ్యాయి. గతంలో డివిజన్ల పునర్విభజనకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకునే వారు. ఇంటి నెంబర్లతో సంబంధం లేకుండా ఒక వార్డు భౌగోళిక స్వరూపాన్ని ప్రామాణికంగా తీసుకొని తదనుగుణంగా ఇళ్లను చేర్చేవారు. రోడ్లు, రైల్వే లైన్లు, పార్కులు, కాలువలు, తదితర వాటిని హద్దులుగా నిర్ణయించి పునర్విభజన ప్రక్రియ సాగేది. ఈసారి శాస్త్రీయ విధానం లేకపోవడంతో ముసాయిదాలోనే గందరగోళం ఏర్పడింది. నేటితో అభ్యంతరాలకు ముగుస్తున్న గడువు ఈ నెల 1న ముసాయిదా డివిజన్ల జాబితాను అధికారులు ప్రకటించగా, శుక్రవారం వరకు అభ్యంతరాలు తెలియజేసేందుకు గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ కార్పొరేటర్లు, స్థానిక బస్తీ పెద్దలు, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కమిషనర్, కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు అందజేశారు. వార్డులను శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన జరపాలని కోరుతున్నారు. కాగా వచ్చిన అభ్యంతరాల మేరకు ఇప్పటికే మునిసిపల్ అధికారులు, సిబ్బంది వార్డుల్లో తిరుగుతూ వాస్తవాలను తెలుసుకుంటున్నారు. శుక్రవారం అభ్యంతరాలకు గడువు ముగిస్తే శనివారం ఒక్కరోజులేనే వాటిని సరిచేసి, ఆదివారం తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. హడావుడిలో ఎంత మేరకు న్యాయం జరుగుతుందో చూడాలి. -
శాతవాహనకు మళ్లీ నిరాశే..!
సాక్షి, కరీంనగర్ : డిగ్రీ సీట్ల కేటాయింపు మూడో దశలోనూ నిరాశే మిగిల్చింది. జూన్ 30న మూడో దశ సీట్లు కేటాయింపు జరిగింది. ఇందులో 3,438 సీట్లు కేటాయించగా సీట్ల భర్తీ శాతం తగ్గుతూ వచ్చింది. ఇప్పటికే మొదటి, రెండో దశ సీట్ల కేటాయింపుల్లో ఆశించనంతంగా సీట్ల భర్తీ కాలేదు. మూడో దశపైనే ఆశలన్నీ పెట్టుకోగా.. ఆశించినంత సీట్ల భర్తీ కాక ప్రైవేటు యాజమాన్యాలు తల పట్టుకున్నారు. గత సంవత్సరం కంటే కూడా తక్కువగా భర్తీ అవుతుండడంతో ఆవేదన మొదలైంది. ప్రభుత్వం ఆది నుంచి డిగ్రీలో ప్రవేశాలు పెంచాలని వివిధ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సాంప్రదాయ కోర్సులతోపాటు వివిధ నూతన కోర్సులను కూడా ప్రవేశపెట్టింది. ఏంచేసినా సీట్ల భర్తీ శాతం పడిపోతూనే ఉంది. దీనికి కారణం ఏమిటో తెలియక తికమక పడుతున్నాయి. ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎక్కువశాతం మంది సాంప్రదాయ డిగ్రీ కోర్సుపై ఆనాసక్తి కలిగి ఉండడంతో నూతన మార్గాలతోపాటు బీటెక్, ఫార్మసీ వంటి కోర్సులకు వెళ్లడానికి మార్గాలు అన్వేషించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో సీట్ల నిండకుంటే దాదాపు 5 దశల్లో ప్రవేశాలు చేపట్టారు. ఇప్పటికి మూడు దశలు పూర్తయినా పెద్దగా సీట్ల భర్తీ కాలేదు. దీనివల్ల ప్రభుత్వం డిగ్రీ ప్రవేశాల శాతం పెంచడానికి ప్రత్యేకంగా ఇంకా ఒకటి రెండు దశలు పెట్టే అవకాశాలు లేకపోలేదని విద్యారంగనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రవేశాలు చేపడితేనే సీట్ల భర్తీ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు దశల్లో అంతంతే... దోస్త్ ద్వారా డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు ఇప్పటికి మూడు దశలు పూర్తయ్యాయి. మూడో దశ సీట్ల కేటాయింపు కూడా జూన్ 30 సాయంత్రం జరిగింది. మొదటి దశలో 12,354 సీట్లు కేటాయించగా.. 5,126 సీట్లు నిర్ధారించుకున్నారు. రెండో దశలో 4,881 సీట్లు కేటాయించగా ఇందులో బాలురు 1,872, బాలికలు 3,009 ఉన్నారు. మూడో దశలో 3,438 సీట్లు కేటాయింపు జరగడంతో శాతవాహన యూనివర్సిటీలో మొత్తం సీట్లలో సగం కూడా కాకపోవడం గమనార్హం. ఏటేటా కూడా ప్రవేశాలు కూడా నేలచూపే చూస్తున్నాయి. మూడో దశలో సీట్లు కేటాయించిన వారు జూలై 1 నుంచి 4 వరకు సెల్ఫ్‌రిపోర్టింగ్ చేసుకొని కళాశాలల్లో ప్రవేశాలు పొందడానికి గడువుంది. మరో అవకాశమిస్తే వివిధ కారణాల వల్ల సీట్లు పొందని వారు, నమోదు చేసుకోని వారితో ఖాళీ సీట్లను భర్తీ చేసుకునే అవకాశం లభిస్తుంది. సగం కూడా భర్తీకాలేదు.. శాతవాహన యూనివర్సిటీ 3 దశలు సీట్ల కేటాయింపు తర్వాత చూస్తే మొత్తం సీట్లలో సగం కూడా భర్తీ కాలేదు. యూనివర్సిటీ వ్యాప్తంగా బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సుల్లో మొత్తం 43,820 సీట్లున్నాయి. ఇందులో గిరిజన, సాంఘిక సంక్షేమ కళాశాలల్లో కలుపుకొని 1,230 సీట్లున్నాయి. వీటికి దోస్త్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఇవి పోగా మిగిలిన 42,040 సీట్లు దోస్త్ ద్వారా భర్తీ చేయాల్సినవి ఉన్నాయి. ఇందులో మొదటి దశలో 12,355 సీట్లు, 2వ దశలో 4,881 సీట్లు, 3వ దశలో 3,438 సీట్లు కేటాయించారు. మొత్తం 42,040 సీట్లకు మూడు దశల్లో కలుపుకొని 20,677 సీట్లు మాత్రమే కేటాయించారు. ఇంకా ఇందులో కేటాయించబడిన వారందరూ సీట్లు నిర్ధారించుకుంటారో లేదో తెలియదు. అంటే ఈ సంఖ్య మరింత తగ్గే ప్రమాదముంది. తల పట్టుకుంటున్న యాజమాన్యాలు... యూనివర్సిటీ పరిధిలోని కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమానులు సీట్లు నిండక తల పట్టుకుంటున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన నాటి నుంచి పలు కళాశాలలు తీవ్రమైన ప్రచారాలు, ప్రలోభాలు చేస్తూ వచ్చాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సీట్లు మాత్రం భర్తీ కాలేదు. దాదాపు రెండు మూడు నెలల నుంచే లక్షల్లో ఖర్చు చేస్తూ క్యాన్వేసింగ్ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. మరికొన్ని కళాశాలల పరిస్థితి కొనసాగించే బదులు మూసుకుంటేనే మంచిదనే ఆలోచనలో యాజమాన్యాలున్నట్లు తెలిసింది. కరీంనగర్, జగిత్యాల వంటి ప్రాంతాల్లో ప్రముఖ కళాశాలల్లో మాత్రమే సీట్లు చెప్పుకునే స్థాయిలో నిండినట్లు సమాచారం. అది కూడా వేళ్లమీద లెక్కబెట్టే కళాశాలల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది. చాలావరకు కళాశాలలు నిరాశతోనే ఉన్నాయని, సీట్ల భర్తీకి కొట్టుమిట్టాడుతూ కష్టాలతోనే నెట్టుకొస్తున్నాయని సమాచారం. ఇలాగే కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరం కళాశాలల సంఖ్య కూడా తగ్గుతుందని, స్వచ్ఛందంగా కళాశాలలు మూతబడే పరిస్థితులు ఎదురవుతాయని యూనివర్సిటీ ఆచార్యడొకరు తెలిపారు. ఏదేమైనా ప్రవేశాలకు గతంలో వలే మరో అవకాశమిస్తేనే ఇంకొన్ని సీట్లు భర్తీ అవుతాయని విద్యారంగనిపుణుల విశ్లేషణ. -
అనగనగా ఓ ‘శాతకర్ణి’ కథ
సాక్షి, ధర్మపురి : ఎల్లంపల్లి జలాశయం మధ్యలో నాలుగు రోజుల క్రితం చిక్కుకున్న పర్యాటక శాఖ బోటు ‘శాతకర్ణి’ని ఎట్టకేలకు అధికారులు సోమవారం ఒడ్డుకు చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. చారిత్రక సుందర ప్రదేశమైన కోటిలింగాలలోని ఎల్లంపల్లి జలాశయంలో పర్యాటక శాఖ రెండు పెద్ద బోట్లు, ఒక స్పీడ్ బోట్‌ను బోటింగ్ కోసం ఏర్పాటు చేసింది. ప్రతీరోజు చాలా మంది వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు రోజుల క్రితం శాతకర్ణి అనే పేరుగల బోటులో 8 మంది పర్యాటకులతో డ్రైవర్ బోటింగ్ చేస్తూ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బోటు జలాశయం మధ్యలో బండరాయికి తాకి అక్కడే చిక్కుకు పోయింది. అయితే అందులో ప్రయాణిస్తున్న పర్యాటకులతో పాటు డ్రైవర్‌ను స్పీడు బోటును సహాయంతో అదేరోజు ఒడ్డుకు చేర్పగలిగారు. కాని శాతకర్ణి బోటును మాత్రం కదలకుండా మొరాయించడంతో డ్రైవర్ దానిని అక్కడే వదిలేశాడు. శాతకర్ణి బోటు నాలుగు రోజులుగా నదిలోనే ఉండిపోయింది. బోటింగ్‌ను పూర్తిగా నిలిపివేశారు. నది మట్టం బాగా తగ్గిపోవటంతో ఇతర బోట్లను కూడా అధికారులు తీరంలోనే ఉంచారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారి ఉపేందర్ కరీంనగర్ నుంచి తెచ్చిన రెండు స్పీడ్ బోట్ల ఇంజన్ల సహాయంతో శాతకర్ణిని బండరాయి నుంచి తప్పించి తీరానికి చేర్చారు. నదిలో చిక్కుకున్న బోటుకు ఎలాంటి నష్టం జరుగలేదని తెలిపారు. బోటింగ్ కోసం ప్రత్యేకంగా మేనేజర్‌ను నియమించకపోవడంతో నిర్వహణ గాడితప్పిందని విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరిలో నీటి మట్టం బాగా తగ్గిందని తెలిసి కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా బోటును నదిలోకి తీసుకెళ్లడం నిర్వాహకుల పనితీరుకు అద్దం పడుతోంది. బోటింగ్ నిర్వహణను ప్రత్యేకంగా ఒక మేనేజర్‌ను నియమించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. -
వేములవాడలో బాలికపై దారుణం
సాక్షి, వేములవాడ : అతను ఆ బాలికకు వరుసకు బావ.. చనువుగా ఉండడాన్ని చూసి బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాలరామన్నపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం. శాలరామన్నపల్లి గ్రామానికి చెందిన లచ్చయ్య–సారవ్వ దంపతుల కూతురు(15) గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌లోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. వరుసకు బావ అయిన సాయి బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడు. బంధువుల ద్వారా కుటుంబసభ్యులకు విషయం తెలిసింది. దీంతో ఇటీవల కులపెద్దల సమక్షంలో పంచాయితీ జరి గింది. ఈక్రమంలోనే యువకుడికి మరో యువతితో వరపూజ జరిగింది. సమస్య జటిలమైంది. బాలిక అంశం పంచాయితీకి రావడవంతో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఆ తర్వాత అబార్షన్ చేయించాలని నిర్ణయించుకున్నారు. సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్‌కు సంబంధించి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బాలిక ను తీసుకుని వేములవాడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా.. బాలి కకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమెను ఠాణా ఎదుట గల సులభ్ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లారు. అక్కడే బాలికకు గర్భస్రావమైంది. బాధితురాలిని తక్షణమే స్థానకంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తల్లి సారవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
జన్మదిన వేడుకల్లో విషాదం
సాక్షి, హుస్నాబాద్ : మండలంలోని సుందరగిరి గ్రామంలో ఓ యువకుడి జన్మదిన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారి పక్కన నిలబడి ఉన్న నలుగురు యువకులను కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తున్న లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందగా ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..సుందరగిరి గ్రామానికి చెందిన అందె శంకర్ ఇంటి ఎదుట తన స్నేహితుడి జన్మదినం వేడుక జరుపుకుంటున్న సందర్భంలో ఎనగందుల అరుణ్‌కుమార్, రాకేశ్, జేరిపోతుల సాయికుమార్, అందె శంకర్ ఇంటిముందు నిలబడ్డారు. రాత్రి 12 గంటల సమయంలో కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న (టీఎన్–52 ఎల్–3476) లారీ అదుపుతప్పి వారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నలుగురిని 108లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలో ఎనగందుల అరుణ్‌కుమర్ మృతిచెందాడు. రాకేశ్, సాయికుమార్, శంకర్ చికిత్స పొందుతున్నారు. కాగా అరుణ్‌కుమార్‌కు తల్లిదండ్రులు రాజవ్వ–మల్లయ్య, ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఉన్నారు. డిగ్రీ చదువుకున్నాడు. జీవనోపాధి కోసం పేయింటర్గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై మామిడాల సురేందర్ తెలిపారు. -
సోదరి కోసం పట్టపగలే హత్య
సాక్షి, వేములవాడ(కరీంనగర్) : పదేళ్లుగా వెంటపడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఎప్పటికైనా నాగుల రవి అనే వ్యక్తితో తనకు ఇబ్బందులేనని తరచూ తమ సోదరి రోదిస్తూ చెప్పడంతో ఆవేశానికి లోనైన ముగ్గురు సోదరులు పట్టపగలే కత్తులతో దాడిచేసి హత్య చేసినట్లు వేములవాడ డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఈనెల 21న వేములవాడలోని సుబ్రమణ్యంనగర్‌లో పట్టపగలే నాగుల రవి(32)ను కత్తులతో నరికి చంపిన ఘటనలో వేములవాడకు చెందిన అక్రమ్, అహ్మద్, జావిద్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. రూరల్ సీఐ కార్యాలయంలో ఆదివారం హత్యకు దారితీసిన వివరాలు ఆయన వెల్లడించారు. పదేళ్ల క్రితం నుంచే రవి, శాకెరల మధ్య ప్రేమ వ్యవహారం ఉండేదని, పెద్దల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగిందని, అనంతరం శాకెరకు పెళ్లి చేయడంతో ఇద్దరు పిల్లలు పుట్టారన్నారు. భర్త జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లగా అత్తగారింటిలో ఉంటున్న శాకెర వేములవాడకు వచ్చేసింది. ఈ క్రమంలో రవి శాకెరను నిత్యం వేధింపులకు గురి చేయడంతో తమ సోదరులకు బాధ చెప్పుకుంది. రవిని చంపేస్తే తప్ప నాకు విముక్తి లభించదని సోదరి చెప్పడంతో ముగ్గురు సోదరులు అక్రమ్, అహ్మద్, జావిద్‌కు రవిని చంపేందుకు సిద్ధపడ్డారన్నారు. ఈ క్రమంలో వీరి మేనబావలైన ఇంతియాజ్, రియాజ్‌లతోపాటు స్నేహితులైన సోమినేని వేణు, మండలోజు సందీప్, గుండా బాలులను సైతం సంప్రదించారు. ఈక్రమంలో వీరంతా రవిని చంపేయాలని, ఇందుకు తాము కూడా సహకరిస్తామని ఒప్పుకున్నారని డీఎస్పీ చెప్పారు. ఇందుకు బాలు, వేణు, సందీప్‌లకు రవి మూమెంట్స్ తమకు తెలియజేయాలని ముగ్గురు సోదరులు కోరగా అప్పట్నుంచి ఈ ముగ్గురు స్నేహితులు రవి మూమెంట్స్‌ను గమనిస్తూ హత్య ప్లాన్‌లో నిమగ్నమయ్యారు. కొద్ది కాలంగా వీరిప్లాన్ కొనసాగగా ఈనెల 21న కోరుట్ల బస్టాండు నుంచి రవి మూమెంట్స్లను గమనించిన వేణు, సందీప్, బాలులు అక్రమ్, అహ్మద్, జావిద్‌లకు సమాచారం ఇచ్చారని చెప్పారు. దీంతో ఇంట్లో ఉన్న కత్తులను తీసుకుని ద్విచక్రవాహనాలపై సుబ్రమణ్యంనగర్లోని నాగుల రవి ఇంటి వద్దకు చేరుకుని జావిద్ కాపలా ఉండగా, అహ్మద్, అక్రమ్‌లు తమ వెంట తీసుకొచ్చిన కత్తులతో బైక్‌పై ఇంటికి వచ్చిన రవిని నరికి చంపేశారని తెలిపారు. హత్య అనంతరం వీరంతా కలసి శాబాష్పల్లికి చేరుకుకుని.. వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇంతియాజ్, రియాజ్‌లు బుల్లెట్ తీసుకుని వస్తారని, ఆయుధాలను బైపాస్‌రోడ్డులోని ఖబ్రస్తాన్లో పడేసి బుల్లెట్‌పై వెళ్లిపోయినట్లు చెప్పారు. ఆదివారం ఉదయం వేములవాడ శివారులోని అయ్యప్ప ఆలయం వద్ద జావిద్, అక్రమ్, అహ్మద్‌లు ఉన్నారన్న సమాచారం అందుకున్న టౌన్ సీఐ వెంకటస్వామి, హెడ్‌కానిస్టేబుల్ దేవేందర్‌రెడ్డి, కానిస్టేబుల్ మనోహర్‌లు పట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే సోదరి శాకెరను ఈనెల 22న పట్టుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ఐదుగురు రియాజ్, ఇంతియాజ్, సోమినేని వేణు, మండలోజు సందీప్, గుండా బాలులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.