
ఎమ్మెల్యే రసమయితో యువకుల వాగ్వాదం
గన్నేరువరం: నూతనంగా ఏర్పడిన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం అభివృద్ధిలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్‌ని శనివారం స్థానిక యువకులు అడ్డగించారు. గన్నేరువరం నుంచి మాదాపూర్ గ్రామానికి వెళ్లే సమయంలో మండల కేంద్రంలో అడ్డుకున్నారు. ప్రధాన రహదారి గుండ్లపల్లి నుంచి మండల కేంద్రం వరకు రోడ్డు అధ్వానంగా ఉందని, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అంబులెన్స్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ..రహ దారి విస్తరణ చేపడతామని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పోలీసుల జోక్యంతో ఎమ్మెల్యే కాన్వాయ్ ముందుకు కదిలింది. కాగా, ఘటనకు సంబంధించి నాగ రాజు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వదిలిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment