Rasamayi Balakishan
-
ఏడో తారీఖు ఏక్ దమ్ దవతిస్త
-
ప్రతికూల పరిస్థితుల మధ్యే హ్యాట్రిక్ విజయంపై ఫోకస్
తెలంగాణ ఉద్యమంలో ఆయనో ప్రత్యేకత సాధించారు. తన పాటతో ప్రజల్ని ఉర్రూతలూగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హ్యాట్రిక్ సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. కాని గ్రామాల్లో ఎదురవుతున్న వ్యతిరేకత ఆయన్ను షాక్‌కు గురిచేస్తోంది. నియోజకవర్గంలోని కీలక నేతలకు ఆ ఎమ్మెల్యేతో పొసగడంలేదట. మొత్తంగా పరిస్థితి ప్రతికూలంగా మారడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన నియోజకవర్గం ఎక్కడుంది? అంతా బానే ఉంది.. మళ్లీ తనదే గెలుపు.. ఈ గెలుపుతో హ్యాట్రిక్ కొట్టేయడమేనని భావించారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కానీ, అక్కడ సీన్ రివర్సవుతోంది. క్యాడర్ బలంగానే ఉన్నా.. నియోజకవర్గంలోని ఆ క్యాడర్ ను సమన్వయం చేసే కీలక నేతలతోనే బాలకిషన్‌కు బెడిసికొట్టింది. రసమయి వైఖరి నచ్చక అధికార బీఆర్ఎస్ నుంచి రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మీ వంటి పథకాలు తమ గ్రామాల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా అందలేదంటూ ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారధి చైర్మన్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న రసమయికి ప్రస్తుతం తన నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రసమయిపై అలక పూనిన ఇల్లంతకుంట మండలం ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, మానకొండూరు ఎంపీపీ ముద్ధసాని సులోచన శ్రీనివాస్ రెడ్డితో పాటుగా పలు గ్రామాల నాయకులు తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో బాటలోనే గన్నేరువరం, కేశవపట్నం ఎంపీపీలు కూడా రాజీనామాలు చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. వీరంతా మానకొండూరు నియోజకవర్గంలోని మండలాల్లో కీలక ప్రజాప్రతినిధులు. అక్కడి ఓటర్లను ప్రభావితం చేసి రేపటి ఎన్నికల్లో కారు పార్టీకి ఉపయోగపడేవారు. కానీ, వీరెవ్వరికీ.. సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయితో పొసగకపోవడంతో.. మానకొండూరు బీఆర్ఎస్ లో క్యాడర్ ఉన్నా.. స్థానికంగా లీడర్స్ కరువవుతున్న పరిస్థితి కళ్లకు కడుతోంది. గ్రామాల్లో ప్రచారం చేస్తున్న రసమయి బాలకిషన్‌కి అనేక ప్రాంతాల్లో తాగునీటి కోసమో.. లేక ప్రభుత్వ పథకాలపైనో నిరసనల పర్వం ఎదురవ్వడం సర్వసాధారణమైపోయింది. రెండు రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలోనూ ప్రభుత్వ పథకాలైన దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మీ వంటివి తమ గ్రామంలో ఒక్కరంటే ఒక్కరికీ కూడా ఇవ్వలేదంటూ అక్కడికొచ్చిన ఎమ్మెల్యే రసమయిపై జనం తిరగబడ్డారు. దాంతో ఖంగుతిన్న రసమయి ఏంచెప్పాలో తెలియక పోలీసుల సాయంతో అక్కడి నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. తన గెలుపుపై రసమయికి ధీమా ఏర్పడింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. తన హవా ఉంటుందన్న నమ్మకం మాత్రం రసమయిలో కనిపించేది. కానీ, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఇంతకాలం బీఆర్ఎస్ లో ఉన్న ఆరెపల్లి మోహన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయనకు స్థానికంగా మంచి పట్టుండటం..మానకొండూరు బీజేపీ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ అంటూ ప్రచారం జరుగుతుండటంతో.. ఇప్పుడు రసమయిలో కాసింత టెన్షన్ మొదలైంది. మొత్తంగా మానకొండూరులో రసమయి అగ్నిపరీక్షలను ఎలా ఎదుర్కొంటారు? సవాళ్లన్నింటినీ ఛేదించి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించగలరా అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. -
మానకొండూర్ (ఎస్సి) నియోజకవర్గంలో ఈ సారి గెలుపు ఎవరిదో..!
మానకొండూర్ (ఎస్సి) నియోజకవర్గం మానకొండూరు రిజర్వుడ్ నియోజకవర్గంలో ప్రముఖ గాయకుడు, తెలంగాణ సాంస్కతిక సంస్థ చైర్మన్ రసమయి బాలకిషన్ రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ పై 31509 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. రసమయికి 88997 ఓట్లు వస్తే, మోహన్‌కు 57488 ఓట్లు వచ్చాయి. కాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మోహన్ కూడా టిఆర్ఎస్లో చేరిపోయారు. ఇక్కడ నుంచి ఎస్.ఎఫ్ బి టిక్కెట్‌పై పోటీచేసిన ఎమ్. ప్రబాకర్కు 13600 ఓట్లు దక్కాయి. 2014లో కూడా బాలకిషన్, మోహన్ల మద్యే పోటీ జరిగింది. 2009లో గెలిచి శాసనసభలో విప్‌గా పనిచేసిన ఆరేపల్లి మోహన్‌ను 2014లో రసమయి 46922 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆ ఎన్నికలో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధి డాక్టర్ కవ్వంపల్లి సత్య నారాయణకు 23627 ఓట్లు వచ్చాయి. నేరెళ్ల (2009లో రద్దు) నేరెళ్ల నియోజకవర్గం 2009లో రద్దయిపోయింది. 2004 వరకు ఉన్న ఈ నియోజకవర్గంలో గొట్టె భూపతి రెండుసార్లు ఇండిపెండెంటుగా గెలిస్తే, పాటి రాజం కాంగ్రెస్ఐ అభ్యర్ధిగా మూడుసార్లు గెలిచారు. 1994,1999లో ఇక్కడ నుంచి గెలిచిన సుద్దాల దేవయ్య 2009లో చొప్పదండి ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పాటి రాజం గతంలో నేదురుమల్లి, కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్లలో పనిచేసారు. సుద్దాల దేవయ్య చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2004లో ఎన్నికైన కాశీపేట లింగయ్య టిఆర్ఎస్ అసమ్మతి నేతగా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్కుమద్దతు ఇచ్చి విఫ్ ఉల్లంఘన అభియోగానికి గురై శాసనసభ్యత్వానికి అనర్హులవడం రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు. అయితే తీర్పు రావడానికి ఒక రోజు ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. పాస్‌పోర్టు కుంభకోణానికి సంబంధించి కూడా లింగయ్య అరెస్టు అయ్యారు. నేరెళ్లలో పదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి నాలుగుసార్లు టిడిపి రెండు సార్లు, టీఆర్ఎస్ ఒకసారి, జనతాపార్టీ ఒకసారి గెలవగా, ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు. మానకొండూర్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
Karimnagar: ఉగాది వేళ.. జాతకాల్లో అదృష్టం వెతుక్కుంటున్న నేతలు
సాక్షి, కరీంనగర్: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. కరీంనగర్: బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎమ్మారెఫ్, స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వైస్సార్టీపీ నుంచి డాక్టర్ నగేశ్ బరిలో నిలవనున్నారు. చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్ (బీఆర్ఎస్)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్ బరిలో నిలవనున్నారు. మానకొండూరు: ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్‌కు ఈసారి ఇంటి పోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇక్కడే నుంచే పోటీ చేసిన ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు. హుజూరాబాద్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిరిసిల్ల: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్ నుంచి కె.కె.మహేందర్‌రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లేదు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుతం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు, ఈసారి కాంగ్రెస్ నేత ఠాకూర్ మక్కాన్ సింగ్ (కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (బీఆర్ఎస్)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాల: డాక్టర్ సంజయ్ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) వరుసగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్) గట్టి పోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జరిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)కు ఈసారి గట్టి పోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్), మాజీ ఎంపీ గడ్డం వివేక్ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు (కాంగ్రెస్)కు, పుట్ట మధు (బీఆర్ఎస్)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు. -
అయోధ్య తప్ప సయోధ్య ఎక్కడుంది.. ‘సెస్’ ఫుల్‌ఫామ్ చెబితే రాజీనామా!
సాక్షి, సిరిసిల్ల: ‘రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ‘సెస్’ ఎన్నికల్లో మా సీట్లు లాక్కున్నా రని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ అంటున్నారు. ఆయన ‘సెస్’ఫుల్‌ఫామ్ చెబితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సవాల్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు, ‘సెస్’ గురించి ఆయనకు ఏం తెలుసని, అయోధ్య తప్ప రైతులతో ఆ పార్టీకి సయోధ్య ఎక్కడుందని ప్రశ్నించారు. పోరగాళ్లకు మతం మందు కలిపి తాగిస్తున్నారని, వాట్సాప్ గ్రూపుల్లో బీఆర్ఎస్పై వాళ్లతో తప్పు డు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. చదవండి: ఏపీ పరిశీలకుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
ఎమ్మెల్యే బాలకిషన్ కాన్వాయ్ అడ్డగింత
గన్నేరువరం: నూతనంగా ఏర్పడిన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం అభివృద్ధిలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్‌ని శనివారం స్థానిక యువకులు అడ్డగించారు. గన్నేరువరం నుంచి మాదాపూర్ గ్రామానికి వెళ్లే సమయంలో మండల కేంద్రంలో అడ్డుకున్నారు. ప్రధాన రహదారి గుండ్లపల్లి నుంచి మండల కేంద్రం వరకు రోడ్డు అధ్వానంగా ఉందని, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అంబులెన్స్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ..రహ దారి విస్తరణ చేపడతామని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పోలీసుల జోక్యంతో ఎమ్మెల్యే కాన్వాయ్ ముందుకు కదిలింది. కాగా, ఘటనకు సంబంధించి నాగ రాజు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వదిలిపెట్టారు. -
రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు.. ఫిర్యాదు చేసిన రెండేళ్లకు
సాక్షి, సిద్ధిపేట: మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, చర్యలు తీసుకోవాలని సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన రాజశేఖరరెడ్డి అనే వ్యక్తి 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ కేసుపై స్పందించిన పోలీసులు .. తాజాగా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 209, 506 సెక్షన్ల కింద రసమయిపై కేసు నమోదు చేశారు. విచారణ కోసం కేసుకు సంబంధించిన సాక్ష్యాలను వారం రోజుల్లో అందించాలని పోలీసులు కోరారు. అయితే ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన రెండేళ్ల తర్వాత పోలీసులు రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా కళాకారుడిగా గుర్తింపు సాధించిన రసమయి 2014లో మానుకొండూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికలలోనూ ఆయన విజయం సాధించారు. ఏడాది క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్‌గా నియమించింది. చదవండి: ఊపందుకున్న ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలోకి జయసుధ? -
మైక్ కట్ చేయడంతో ఎమ్మెల్యే రసమయి అసంతృప్తి
-
వారికి ఎవుసం తెల్వదు
మానకొండూర్: తెలంగాణలో పండించిన ధాన్యా న్ని కేంద్రమే కొనుగోలు చేయాలని, లేకుంటే మెడలు వంచి కొనిపిస్తామని కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నా రు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మాన కొండూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీకి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు ఎవుసం అంటే తెలియదని, అందుకే రైతులతో ఆడుకుంటున్నారని విమర్శిం చారు. ‘యాసంగిలో కేంద్రం వరి పెట్టొద్దని అంటోంది. అదేమైనా నీ జాగీరా.. భూమి నీదా..? భూమి మీద హక్కు నీదా..? మా ఇష్టమున్న పంట పండించుకుంటాం. బాడకవ్.. కొంటే కొను.. లేకుంటే కొనబోమని చెప్పు.. ’అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. పెంపుడు కుక్కను ఉసి గొల్పుతున్నారు: ప్రధాని మోదీకి అంబానీ, అదానీలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని, అందుకే రైతు వ్యతిరేక చట్టాలపై పోరాడుతున్న రైతులను కేంద్రమంత్రి కారుతో గుద్ది చంపినా పట్టించుకోవడం లేదని రసమయి పేర్కొన్నారు. ‘కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నం. ప్రాజెక్టులు కట్టుకున్నం. కాల్వలు తవ్వుకున్నం. రైతులకు ఎకరాకు ఐదు వేలు ఇచ్చుకుంటున్నం. ఇలాంటివి చూసి మోదీకి కన్నుకుట్టినట్లయ్యింది. అందుకే తన పెంపుడు కుక్క బండి సంజయ్‌ని ఉసిగొల్పుతున్నాడు..’అంటూ మండిపడ్డారు. ‘సంజయ్ జనంలోకి వచ్చినోడు కాదు. ఏ ఊరిలోనూ తిరిగినోడు కాదు. యాడుంటడో తెల్వదు. భౌ భౌ మని ఒర్రుడు.. పేపర్లో ఫొటో వేసుకునుడు తప్ప ఏం తెల్వదు..’అని ఎద్దేవా చేశారు. యాసంగి పంట కొనేదాకా పోరాడతామని అన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
మరో మూడేళ్లు సాంస్కృతిక సారథిగా రసమయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవిలో మరో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. తనను సాంస్కృతిక సారథి చైర్మన్‌గా పునర్నియామకం చేయడంపై రసమయి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను రసమయి కలిశారు. ఉత్తర్వుల పత్రాన్ని రసమయికి సీఎం అందించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమంలో కష్టపడి పనిచేసిన సాంస్కృతిక కళాకారులను రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆ క్రమంలోనే కళాకారులకు ఉద్యోగాలిచ్చినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు అందరికీ సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక కళాకారుల పాత్ర మరువలేనిదనీ గుర్తుచేశారు. స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో సాంస్కృతిక సారథి కళాకారుల పాత్ర గొప్పదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు చేరేలా సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్‌లపై రసమయి బాలకిషన్ ఆగ్రహం
సాక్షి, కరీంనగర్: సర్పంచ్‌లు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల సర్పంచులు, రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గ్రామాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి సమీక్షా సమావేశంలో పాల్గొన్న రసమయి.. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి మాట్లాడడం లేదంటూనే సర్పంచ్‌లను సుతిమెత్తగా మందలించారు. సర్పంచ్‌లు ఇంట్లో ఉంటే సమస్యలు పరిష్కారం కావన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో చరిత్రలో గొప్పగా నిలిచిపోయే అవకాశం ఈసారి సర్పంచ్‌లకు ఉందన్నారు. కానీ పట్టణ పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో భూముల విలువ పెరిగిపోవడంతో కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తన నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం అగ్రస్థానంలో ఉండగా మానకొండూరు మండలం చివరి స్థానంలో ఉందని.. కరీంనగర్‌కు సమీపంలో ఉండటంతో స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి సమస్యలపై దృష్టి పెట్టి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని రసమయి కోరారు. -
ఎమ్మెల్యే రసమయిని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు..
-
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ఆందోళనల సెగ
సాక్షి, కరీంనగర్ : మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చుక్కెదురైంది. మానకొండూరు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉద్యోగుల పదవీ విరమణ వయసు ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. 33 జిల్లాలలో ఒక్కో జిల్లాకు 2000 ఉద్యోగాల చొప్పున 66000 వేల నూతన ఉద్యోగాల కల్పనను చేసి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వాహనానికి అడ్డం తిరిగి రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళగా ఎమ్మెల్యే వాహనం పక్కనుంచి వెళ్లిపోయింది. -
‘కేటీఆర్ సీఎం అయితే హరీశ్‌కే సమస్య’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడని, ఆయన సమర్థత ఏంటో కేసీఆర్‌కు తెలుసునని మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్లే కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ, కేటీఆర్ సీఎం పదవికి సమర్థుడు అయితే కేసీఆర్ అసమర్థుడా అని ప్రశ్నించారు. ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించారని, సీఎం ఎవరనేది ఆ కుటుంబ సమస్య అని చెప్పారు. కేటీఆర్ సీఎం అయితే కవిత, హరీశ్, సంతోష్‌లకే సమస్య అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందని కేసీఆర్ అనుకుంటే రసమయి బాలకిషన్‌ను సీఎం చేయాలని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కంటే ఎక్కువగా కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్నారు. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పోలేపల్లి ఎల్లమ్మపై ప్రమాణం చేసి చెప్పాలని, టీఆర్ఎస్ చెబుతున్నట్టు కొడంగల్ అభివృద్ధి వారి హయాంలో జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఎమ్మెల్యే రసమయి సంచలన వ్యాఖ్యలు: లిమిటెడ్ కంపెనీలో బతుకుతున్నా... సాక్షి, మహబూబాబాద్: అధికార పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను లిమిటెడ్ కంపెనీలో బతుకుతున్నానని, మాట, పాటను అదుపులో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నానని వాపోయారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆదివారం మహబూబాబాద్‌లో ప్రముఖ కవి జయరాజు తల్లి భోగిళ్ల అచ్చమ్మ సంతాప సభలో నటుడు ఆర్.నారాయణమూర్తితో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ ‘‘ఎవరు ఏమనుకున్నా నేను నిక్కచ్చిగా చెబుతున్నా. తెలంగాణ వచ్చినాక పాటల్లో మార్పు వచ్చింది. వ్యక్తుల చుట్టూ పాటలైనాయి. పండుగలు పబ్బాలు వాళ్ల నెత్తి మీదకే పోతున్నాయి. నాకు ఒక్కోసారి బాధనిపిస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే.. కలాలు, గళాలు మౌనంగా ఉంటే అది కేన్సర్ కంటే ప్రమాదకరమైంది. ప్రతి కవి, గాయకుడు ఆలోచించాల్సిన సమయం వచ్చింది’’అని పేర్కొన్నారు. -
అది నిజమే: గద్దర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమేనని ప్రజాగాయకుడు గద్దర్ తెలిపారు. పాటకు, కళకు, అక్షరానికి వయసు, కులం, ప్రాంతంతో సంబంధం ఉండదని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాను కోరుకున్నది కళాకారుని ఉద్యోగమేనని, ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలను వివరించేందుకు అవకాశం వస్తుందని భావించి దరఖాస్తు పెట్టుకున్నానని తెలిపారు. దయచేసి అందరూ తన కోసం కోట్లాడి ఉద్యోగం ఇప్పించాలని కోరారు. 73 ఏళ్ళ వయసులో తాను ఆడి, పాడకపోయినా ఫరవాలేదని, ఇప్పుడున్న కళాకారులు పాడుతుంటే వాళ్ళ వద్ద డప్పులు మోస్తానని తెలిపారు. రసమయి బాలకిషన్ తనను కలవలేదని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది మిత్రులతో నా గురించి ఆయన చర్చించారని తెలిపారు. ప్రస్తుతం నిశ్శబ్దమే ఒక ప్రొటెస్ట్ రూపంగా కనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో తాను ఉద్యోగం గురించి చేసిన దరఖాస్తుపై చర్చ జరిగితే అది సంతోషమేనని అన్నారు. -
‘తోటపెల్లి’ వరప్రదాయిని
సాక్షి, బెజ్జంకి(సిద్దిపేట): మెట్టప్రాంత రైతులకు వరప్రదాయిని తోటపెల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌బాబుతో కలిసి మంగళవారం మండలంలోని తోటపెల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం తిమ్మాపూర్ చిగురుమామిడి, కోహెడ మండలాలకు నీళ్లు వదిలేందుకు స్విచ్ ఆన్‌చేసి షటర్ ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో మిడ్ మానేరు ద్వారా గోదావరి జలాలు అందుతున్నాయని తెలిపారు. తోటపెల్లి రిజర్వాయర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని మిగితా పనులు త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్‌కు బెజ్జంకి మండలంలోని చెరువులను అనుసంధానం చేసి నీళ్లతో నింపుతామన్నారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతందని మరో మూడు నెలల్లో గౌరవెల్లి వరకు నీళ్లు వస్తాయని చెప్పారు. కల సాకారమైంది: ఎమ్మెల్యే ఒడితెల హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌బాబు మాట్లాడుతూ దశాబ్దలుగా వరద కాలువ ద్వారా నీళ్లు వస్తాయనే ఆశతో ఎదురు చేశామని, ఇప్పుడు సీఎం కేసీఆర్ కృషితో కల సాకారమయిందని పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్ నుంచి హుస్నాబాద్, కోహెడ, చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలాలకు నీళ్లు అందుతాయన్నారు. అనంతరం రిజర్వాయర్ పనులను, నీటి మట్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు మిడ్ మానేరు నుంచి 1.6735 టీఎంసీల నీల్లు వచ్చాయని అందులో నుంచి కాలువ ద్వారా 200 క్యూక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరి రాజిరెడ్డి, తన్నీరు శరత్‌రావు, ఈఈ రాములు, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, ఎంపీపీ లింగాల నిర్మల, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
రసమయికి మరోసారి చేదు అనుభవం
-
రసమయికి మరోసారి చేదు అనుభవం
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు, మానకొండూర్ తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ గ్రామంలో రసమయి ఆదివారం ప్రచారం నిర్వహిస్తుండా గ్రామస్తులు ఆయన్ను అడ్డుకున్నారు. గత నాలుగేళ్లలో తమకేం చేశారంటూ ఆయనను నిలదీశారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ మహిళలు రసమయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇరువర్గాల ఘర్షణకు దిగడంతో కంది కట్కూర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గతంలో కూడా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రసమయికి ఇదే రకమైన అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. -
కోర్టుకు హాజరయిన మంత్రి రామన్న
ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని జిల్లా కోర్టుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కాంగ్రెస్ నేత అరవిందరెడ్డి సోమవారం హాజరయ్యారు. 2012లో ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎన్నికల కోడ్ ఉల్లంగించారని అప్పటి ఎన్నికల అధికారి గుగ్లోత్ రవినాయక్ కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి ముగ్గురు కోర్టుకు హాజరుకాగా ఏప్రిల్ 4వ తేదీకి కేసు వాయిదా వేసింది. దీంతోపాటు 2010లో ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా సంపాదించారని వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నేత సంజీవ్‌రెడ్డి పరువు నష్ట దావా కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా జోగు రామన్న కోర్టుకు హాజరు కాగా, ఈ నెల 27కు వాయిదా పడింది. -
ఎమ్మెల్యే ఆఫీసు వద్ద ఆత్మహత్యాయత్నం
సాక్షి, మానకొండూరు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం వద్ద ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. బెజ్జంకి మండలం గూడెనికి చెందిన శ్రీనివాస్, పరుశరామ్ అనే యువకులు ఎమ్మెల్యే రసమయి ఆఫీసుకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్ర కాలిన గాయాలైన ఇద్దరికి కరీంనగర్ లో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. బాధితులను మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. దళితులకు భూపంపిణీ చేయడానికి ఎకరానికి రూ.20 వేలు వీఆర్వో రవి డిమాండ్ చేశాడని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడానికి వెళ్లి ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డాడని శ్రీనివాస్ భార్య తెలిపారు. వెంటనే మంత్రి ఈటల.. కలెక్టర్ తో మాట్లాడి వీఆర్వో రవిని సస్పెండ్ చేయించారు. బాదితులకు ప్రభుత్వ పరంగా వైద్యం అందిస్తామని మంత్రి ఈటల తెలిపారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదంటూ మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే టీఆర్ఎస్ నేత అయూబ్‌ఖాన్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇటీవల వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం సృష్టిం చింది. -
ఊరి చెరువు దుఃఖం తీరింది
మనసులో మాట ► కొమ్మినేని శ్రీనివాసరావుతో తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలంగాణలో ఊరి చెరువు దుఃఖం తీర్చినవాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని, దాదాపు 47 వేల చెరువులకు పునాది తీసి, వర్షం వస్తే లక్షల ఎకరాల్లో పంట పండేలా చర్యలు తీసుకున్నారని తెలంగాణ ఎమ్మెల్యే, కళాకారుడు రసమయి బాలకిషన్ చెప్పారు. తరాల పాటు దారి ద్య్రంలో మగ్గిన వారి పేదరికాన్ని తీర్చే పనులు మొదలైనప్పుడు ఆ పరిస్థితిలో మార్పును కనీసంగానైనా గుర్తించకుండా కోదండరామ్ వంటి పెద్దలు విమర్శ చేయడం బాధ కలిగిస్తోందన్నారు. ప్రాజెక్టులు కడుతుంటే వ్యతిరేకించడం, నీళ్లు లేని తెలంగాణకు నీళ్లు తెస్తూ ఉంటే ఎటువైపు ఉండాలో ఆలోచించుకోవాలన్నారు. ఉద్యమ పాటకు జీవం పోసిన కళాకారులు తిండి లేక బాధపడుతుంటే 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి చల్లటి బతుకిచ్చినవాడు కేసీఆర్ అన్నారు. పేదల కన్నీళ్లు తుడిచే పాలనను కేసీఆర్ అందిస్తుంటే.. ఏపీలో ఏ ఒక్కరూ సంతోషంగా లేని పాపిష్టి పాలనను చంద్రబాబు అందిస్తున్నారని.. పాలన విషయంలో కేసీఆర్‌కు, బాబుకు పోలికే లేదంటూ ‘మనసులో మాట’లో రసమయి చెబుతున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. జీవితంలో బాగా సంతోషం కలిగించిన సందర్భాలు చెబుతారా? రెండున్నాయి. ఎమ్మెల్యే కావడం కంటే ఎక్కువగా సంతోషపడ్డది మా ‘సాంస్కృతిక వారధి’ సంస్థకు కేసీఆర్ వచ్చి మాట్లాడినప్పుడే. ఆరోజు ఆయన ఒక గొప్పమాట చెప్పిండు. ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు వెన్నంటి ఎవడూ లేడు. వాడూ (రసమయి), నేనూ ఇద్దరమే ఉన్నాం. వాడి పాట, నా మాటతో ఇంతదూరం నడిచాం అని చెబుతూ ఇంతమందికి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు. స్టేజీ మీద పాటలు పాడి చాలామందిని ఏడిపించేవాడినే కాని నేను ఏడ్చేవాడిని కాదు. కేసీఆర్ ఆ మాట అనగానే మొదటిసారి వేదికమీదే ఏడ్చేశాను. మొదటిసారి నా కడుపునిండా ఏడ్చాను. దాచుకున్న దుఃఖాన్నంతా వెళ్లగక్కి ఆరోజు నాకు ఏడ్వాలనిపించింది. ఏడ్చాను కూడా. ఉద్యమం కోసం జీవితాలను అర్పించిన 550 మంది కళాకారులకు మేం ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్లు ఇవ్వాళ బైకులమీద తిరుగుతున్నారు. జీన్స్ వేసుకుంటున్నారు. ఇదిరా బాయ్ బతుకంటే. మంచిగా, సల్లగా బతకండి. ఇకపై ఎవ్వరినీ రూపాయి కోసం అడుక్కోవద్దు అంటున్నా. ఇంతకుమించి సంతోషం ఉంటుందా నాకు. బాధపడిన సందర్భాలు చెబుతారా? జీవితమంతా బాధలతోటే గడిచింది. మాది చాలా పేద కుటుంబం. తిండిలేని పూట నీళ్లు తాగి బతికిన రోజులున్నాయి. వర్షం పడుతుంటే తిండిలేక మొక్క జొన్న కంకులు ఉడకపెట్టి తిన్న రోజులున్నాయి. గొడ్డు కూర తీసుకొచ్చి ఉడకబెట్టుకుని కడుపు నింపుకున్న రోజులున్నాయి. మా కుటుంబానికి ఏమీ లేనప్పుడు అమ్మా నాన్న నన్ను బాగా సాకిండ్రు. కానీ నేను మంచిగయిన తర్వాత, నా పరిస్థితి కొంత బాగయిన తర్వాత వారిద్దరూ లేకుండా పోయారు. అదే నన్ను బాగా బాధించింది. మరి ఇప్పుడు తెలంగాణ అంతా పచ్చగా అయిపోయిందంటారా? పచ్చగా ఒకేసారి అయిపోతుందా? ప్రయత్నం అన్నది కొనసాగుతోంది. ఇప్పుడు 40 శాతం పని మాత్రమే పూర్తయింది. తెలంగాణలో ప్రశ్నించే పరిస్థితే లేకుండా పోతోందనీ కోదండరామ్ అంటున్నారు? 47 వేల చెరువులకు పునాది తీస్తే చెరువులు బాగు చేసిండ్రు అని ఒక్కమాట ఆయన ఏనాడైనా ప్రశంసించారా? ఇప్పటివరకూ నా జీవితంలో ఒక్కసారి కూడా కోదండరామ్ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మంచి పని చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు దాన్ని గుర్తించడం లేదన్నదే నా ప్రశ్న. కోదండరామ్‌ను కేసీఆర్ ఎప్పుడూ కూడా నువ్విలా చేస్తున్నావే అని అడగలేదు. బాధ ఏమిటంటే, ప్రాజెక్టులు కడతానంటే నువ్వు కోర్టులకు వెళ్లావు. ప్రభుత్వం ఏ పని చేస్తున్నా అడ్డం తిరిగి మాట్లాడుతున్నారు. సూడు తెలంగాణ మరి నీళ్లు లేని తెలంగాణ అని వందల పాటలు పాడాం. ఇప్పుడు నీళ్లు తీసుకువస్తా ఉంటే ఆయనలాంటి పెద్ద మనిషి ఏ వైపు ఉండాలి? మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి కేసీఆర్ తెలంగాణ కన్నీళ్లు తుడిచేస్తున్నారా? ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఊరి చెరువు దుఃఖాన్ని తీర్చినవాడు కేసీఆర్. ఇవ్వాళ నేను ఎమ్మెల్యేను కానీ నా జీవితమంతా పేదరికమే కదా. ఆ పేదరికాన్ని తీర్చే పనులు ఇప్పుడు మొదలయినప్పడు ఆ పరిస్థితిలో మార్పును పాటగా పాడటం తప్పేంటి? చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరి పాలనపై మీ అభిప్రాయం? చంద్రబాబుది పాలన ఎట్లవుతది. అది పాపిష్టి పాలన. అంతా హైటెక్కూ, హంగులూ గింగులే తప్ప ప్రజలకు కావలసిన పాలన ఎన్నడూ బాబు చేయడు. పచ్చి అవకాశవాది. ఏది కనబడితే దాంట్లో దూరతాడు. ఇమిడిపోతాడు. పదవి లేకపోతే పాగల్ అయిపోతాడు. చంద్రబాబుపై అంత స్థిరమైన అభిప్రాయానికి వచ్చేశారేంటి? ఎందుకంటే చంద్రబాబు చేసిన చరిత్ర కూడా మన కళ్లముందు కనబడుతోంది కదా. పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌నే పెరికేసిండు. సొంత మామనే దించి పదవి పట్టుకుని వేలాడిన బాబు గురించి టీవీలల్లో మాట్లాడుకోవడం వేస్ట్. బాబుకు కేసీఆర్‌కు పొంతనే లేదు. బాబు పదవులకోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే మా కేసీఆర్ పదవులు వదులుకున్నారు. మా సార్‌కి పదవి అంటేనే లెక్కలేదు. కేంద్ర మంత్రిపదవినే వదులుకునేశారు. అన్ని పార్టీల్లోంచి ఫిరాయింపుదారులను తీసుకెళ్లడం పద్ధతేనా? టీడీపీ లెక్క ఎలా ఉంటుందంటే.. వాళ్లు చేస్తేనే సంసారం. ఇంకొకళ్లు చేస్తే వ్యభిచారం. ఏపీలో ఏం చేశారండీ. అక్కడ నీ బలమెంత? అక్కడ మంచి మెజారిటీతో వైఎస్సార్సీపీ గెలిస్తే ఏం చేశాడో తెలవదా? మొదట్లో ఇక్కడా అదేవిధంగా మా పార్టీని ఏదో చేయబోయిండు.. పైసలిస్తే తలవంచుతారని అనుకున్నారు. కాని అది ఇక్కడ నడవలేదు కదా. ఎన్టీఆర్ విషయంలో చేసినట్లు జిమ్మిక్కులు, గిమ్మిక్కులు చేయాలని చూసిండు. ఆఖరుకు ఏమయింది? ప్రతివాడు రియలైజ్ అయిపోయాడు. నాయనా నువ్వు గాదురా మా నాయకుడే మాకు సరైనోడు.. నీ జాగాలో నువ్వు ఉండు నాయనా అని చెప్పి టీడీపీ వాళ్లంతా ఇటు వచ్చేసిండ్రు. ఆ విషయంలో బాబు, కేసీఆర్‌ను డిఫెన్సులో పడేశాడా లేదా? డిఫెన్సూ లేదు అఫెన్సూ లేదు. కేసీఆర్ ఎలా ఆలోచించారు? రెండుగా విడిపోయాం. ఇక కక్ష సాధింపులెందుకు? అనే అనుకున్నారు. కానీ బాబు చేసింది నూటికి నూరు శాతం తప్పు. తాను మాట్లాడిన టేప్ కూడా దొరికింది. నువ్వు ఎమ్మెల్యేను కొనడానికి పైసలు తీసుకొచ్చినవ్, కేసు కూడా కోర్టు పరిధిలో ఉంది. మరి బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అని కేసీఆర్ ఎందుకన్నారు? ఈరోజు చిదంబరం, ఆయన కొడుకు పరిస్థితి ఏంటి? తప్పు చేసినోడు ఏదో ఒక క్షణాన కచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. ఎప్పటికైనా అది జరిగి తీరుతుంది. కాకపోతే మనకు చట్టముంది. దానిమీద గౌరవం ఉంది. కానీ చట్టం చేసే పనుల్ని కూడా మన చేతుల్లోకి తీసుకుని మనమే వెళ్లి సంకెళ్లు వేసి తీసుకురాలేం కదా? కేసీఆర్ పాలనకు, చంద్రబాబు పాలనకు మీరెన్ని మార్కులిస్తారు? రెండే రెండు విషయాలు చెబుతాను. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా లేడు. దయచేసి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మేమే పరాయివాళ్లమా.. ఏపీతో మాకు సంబంధాలు లేవా.. మాకు అక్కడ బంధువులు లేరా? ఏపీలో ఏ ఒక్క వ్యక్తి అయినా సరే చంద్రబాబు ఆహా, ఓహో అంటున్నాడేమో చూపించండి చాలు. అంతా సోకుటాకుల కేసులు, హంగామా తప్ప ఇంకేమీ లేదక్కడ. అదే తెలంగాణలో చూసుకోండి. ఒక గొర్రె కావాలంటే అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి పోయింది. తెలంగాణలోని యాదవులకు ఒక్కొక్కరికి 20 గొర్రెలు ఇస్తున్నామే.. మత్స్యకారులు, రజకులు, మంగలి ఇలా.. ఊరికి సేవ చేసే కులాలుగా పేరుపడిన వాళ్లు ముందుగా ఆ ఊర్లలోనే స్థిరపడాలి. బతుకు నిచ్చిన ఊర్లకు మళ్లీ తిరిగి రావాలి. ఏపీలో బాబు పాలనకు, తెలంగాణలో కేసీఆర్ పాలనకు పోలికే లేదు. బతుక్కోసం బొంబాయి వెళ్లడానికి బస్సు ఏర్పాటు చేయండి అని గతంలో అన్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు బొంబాయి బస్సులను రద్దు చేయమంటున్నారు. చెరువులు నిండితే అందరికీ పని దొరికే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. ఎవరైతే ఊరికి సేవ చేసే కులాలుగా స్థిరపడ్డారో వాళ్లను ఊర్లలో స్థిరపడేలా చేస్తున్నాం. అదే బాబు పాలనలో ఏపీలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. (రసమయితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/TRQrBp https://goo.gl/C0yaqC -
ఆటా వేడుకల్లో రసమయి సందడి
-
'అందుకే గవర్నర్ పట్టించుకోవడం లేదు'
హైదరాబాద్: విశ్వవిద్యాలయాలు ఆధునిక దేవాలయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వవిద్యాలయాల చట్టాల పునర్నిర్మాణం అవసరమని భావించి కొన్ని మార్పులు సూచిస్తుందని చెప్పారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ చట్ట సవరణ బిల్లును తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతూ రసమయి ఈ విధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వర్సిటీల విషయంలో మంచి పరిజ్ఞానం ఉందని పేర్కొన్నారు. ఒకప్పుడు మేధావులను అందించిన వర్సిటీలు సమైక్య పాలనలో దెబ్బతిన్నాయని చెప్పారు. గవర్నర్ కు తక్కు వ సమయం ఉన్నందు వల్ల వర్సిటీలను పూర్తి స్థాయిలో పట్టించుకునే తీరిక లేకుండా పోయిందని వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో కూడా వీసీల నియామకం ప్రభుత్వం చేతిలో ఉందని గుర్తుచేశారు. -
పర్యాటక అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు
హైదరాబాద్ : సమైక్య పాలనలో తెలంగాణ టూరిజం గుర్తింపునకు నొచుకోలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రసమయి బాలకృష్ణ మాట్లాడుతూ... ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కట్టడాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎ.చందూలాల్ మాట్లాడుతూ... రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని వివరించారు. అందులోభాగంగా హెలీ టూరిజం ఏర్పాటు చేసిన విషయాన్ని చందూలాల్ గుర్తు చేశారు. -
పిక్క కొడితే కరీంనగర్‌కు కలెక్టర్ అవుతా:రసమయి
కరీంనగర్: పిక్క కొడితే కరీంనగర్‌కు కలెక్టర్ అవుతానని తెలంగాణ సాంస్కృతిక సారథి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ.. పీహెచ్డీ కోసం 500 మంది ప్రవేశ పరీక్ష రాస్తే జనరల్ కేటగిరీలో సీటు సంపాదించానని చెప్పుకొచ్చారు. అదే విధంగా తప్పుడు కథనాలు రాస్తున్న పత్రికలపై రసమయి తీవ్రంగా మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలను పతాక శీర్షికలో రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే దేశంలో అయితే తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టులను ఉరితీసిన దాఖలాలు ఉన్నాయన్నారు. రైతులకు భరోసా కల్పించేలా పత్రికలు వ్యవహరించాలని సూచించారు. -
ఆ ఇద్దరికి మంత్రి పదవులు సాధ్యమేనా?
కొప్పులను మంత్రిని చేస్తానన్న సీఎం ఇటీవల రసమయిని కేబినెట్లోకి తీసుకుంటానని హామీ ఇప్పటికే జిల్లా నుంచి ఇద్దరు మంత్రుల ప్రాతినిధ్యం ఈటల, కేటీఆర్ ఇద్దరూ కీలకమైన వారే మరో ఇద్దరికి ఎలా సాధ్యం? సిట్టింగ్ మంత్రుల్లో పదవి కోల్పోయేదెవరు? టీఆర్ఎస్లో చర్చనీయాంశమైన సీఎం హామీ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌ను కేబినెట్లోకి తీసుకుంటానంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా ధర్మారంలో ఆదివారం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, శ్రేణుల మధ్య విస్తృత చర్చకు దారి తీశాయి. సరిగ్గా నెల రోజుల క్రితం రాష్ర్ట సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్‌ను సైతం కేబినెట్లోకి తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అప్పట్లో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి కేసీఆర్ హాజైరె ప్రజలు, మీడియా సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ ఇద్దరూ కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే. కొప్పుల ధర్మపురి, రసమయి మానకొండూరు నియోజకవర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. అందులోనూ ఇద్దరు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారే. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఈటల రాజేందర్, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు కొనసాగుతున్నారు. ప్రభుత్వంలో, పార్టీలో ఇద్దరూ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నవారే. ఇప్పుడు కొప్పుల ఈశ్వర్, రసమయిలను కేబినెట్లోకి తీసుకుంటే ఒకే జిల్లాకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే సీఎంతో కలిపి రాష్ర్ట కేబినెట్ మంత్రుల సంఖ్య 18కి మించకూడదు. ఇప్పటికే ఆ సంఖ్యతో కేబినెట్ కొనసాగుతోంది. అందులోంచి ఇద్దరిని పక్కనపెడితే తప్ప ఈశ్వర్, రసమయిలకు అవకాశం దక్కడం అసాధ్యం. ప్రస్తుతం కేబినెట్లో కొనసాగుతున్న ఏకైక ఎస్సీ నేత కడియం శ్రీహరి. కొద్ది నెలల క్రితమే ఆయనకు డిప్యూటీ సీఎం పగ్గాలు అప్పగించారు. ఈ పరిస్థితుల్లో ఆయనను పక్కనపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. అయినప్పటికీ కేసీఆర్ ఆ ఇద్దరికీ కేబినెట్ బెర్త్ హామీలు ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటో గులాబీ శ్రేణులకు బోధపడటం లేదు. పార్టీ సీనియర్ నేతలు మాత్రం కేబినెట్లో కొత్త వారికి అవకాశం ఇస్తానని సీఎం అన్నారంటే... సరిగా పనిచేయని మంత్రులు తీరు మార్చుకోకుంటే తప్పిస్తానని హెచ్చరికలు పంపడమేనని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా మంత్రి పదవి రాలేదని బాధపడుతున్న వారికి కేసీఆర్ వ్యాఖ్యలు టానిక్‌లా ఉపయోగపడతాయని చెబుతున్నారు. కొందరు నేతలైతే కేసీఆర్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, గతంలో పలు సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. గత సాధారణ ఎన్నికల సమయంలో ధర్మపురి బహిరంగ సభలో కేసీఆర్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి 'కొప్పుల ఈశ్వర్‌ను మీరు గెలిపిస్తే... అధికారంలోకి రాగానే మంత్రిని చేస్తా'నంటూ బహిరంగంగానే హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేననని, ఇప్పటికి రెండుసార్లు కేబినెట్లో మార్పులు చేసినా ఈశ్వర్‌కు మాత్రం చోటు దక్కలేదని చెబుతున్నారు. పంచాయతీ వ్యవస్థపై సీఎం విమర్శల మర్మమేమి? ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది రోజులుగా రాష్ర్టంలో పంచాయతీ వ్యవస్థ దారుణంగా విఫలమైందని బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానిస్తున్నారు. పంచాయతీ అధికారుల పనితీరు ఏమాత్రం బాగోలేదని చెబుతున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జి ల్లాలో రెండ్రోజులు పర్యటించిన కేసీఆర్ పంచాయతీ వ్యవస్థ దారుణంగా విఫలమైంది. సర్పంచులు, ఎంపీటీసీలు తమ బాధ్యతలను విస్మరించి పైరవీలకోసం పట్టణాలకే పరిమితమవుతున్నారు. పంచాయతీ అధికారుల పనితీ రు ఏమాత్రం బాగోలేదు అని ఘాటుగా వ్యా ఖ్యానించారు. వాస్తవానికి కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారకరామారావే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆ శాఖ పనితీరు ఏమాత్రం బాగోలేదని కేసీఆర్ బహిరంగ వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మమేమిటనే దానిపై గులాబీ నేతల్లో చర్చ జరుగుతోంది. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత ఏప్రిల్‌లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలోనే కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తూ అధికారికంగా ప్రకటిస్తారని భావించారు. కానీ ఆనాడు కొన్ని రాజకీయ కారణాల వల్ల కేసీఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈసారి కేబినెట్లో మార్పులు చేస్తే కేటీఆర్‌ను కేబినెట్ నుంచి తప్పించి కీలకమైన పార్టీ పగ్గాలు అప్పగిస్తారని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు కేటీఆర్ నిర్వహిస్తున్న శాఖపై విమర్శలు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తే తప్పు చేస్తే కుటుంబ సభ్యులెవరైనా ఒకటేనని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారని, కేబినెట్ సహచరులకు నిరంతరం హెచ్చరికలా పనిచేసేందుకే పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారని విశ్లేషిస్తున్నారు. సామాజిక సమతుల్యం లోపించిన కేబినెట్ ప్రస్తుత కేబినెట్లో సీఎంతో కలుపుకుని 11 మంది అగ్రకులాలకు చెందిన మంత్రులున్నారు. వీరిలో ఆరుగురు రెడ్డి, నలుగురు వెలమ, ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. మిగిలిన నలుగురు బీసీలు కాగా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గానికి చెందిన వారు ఒక్కొక్కరు కొనసాగుతున్నారు. కేసీఆర్ కేబినెట్లో ఒక మహిళకు కూడా చోటు దక్కలేదు. మొత్తంగా చూస్తే కేబినెట్లో సామాజిక సమతుల్యం లోపించిందని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. గిరిజన, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ ఎన్నికల ప్రణాళికలోనే ప్రకటించిన నేపథ్యంలో ఈ సామాజికవర్గాలకు చెందిన చెరో ఇద్దరినీ కేబినెట్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కేబినెట్లో మహిళలకు మూడో వంతు చోటు కల్పించాల్సి ఉన్నప్పటికీ, కనీసం ఒక్క స్థానమైనా దక్కితే చాలని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ జరగాలంటే కేబినెట్లో ఓసీల సంఖ్యను కుదించాల్సిన అవసరముందని చెబుతున్నారు. అదే జరిగితే ఓసీ మంత్రుల్లో ఎవరికి ఎసరొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
’తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు’
-
'తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు'
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు దొరికిన దొంగ అని, చేసినతప్పును కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. ఆ క్రమంలోనే న్యూస్ ఛానెళ్లకు నోటీసులు ఇప్పించారని, బాబు చర్యలను ఏపీ ప్రజలు కూడా హర్షించడంలేదని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన రసమయి.. బాబు ఇప్పటికైనా తప్పు ఒప్పుకుంటే మంచిదని హితవుపలికారు. -
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుకండి
ఎన్నారైలకు రసమయి పిలుపు రాయికల్: బంగారు తెలంగాణ సాధనలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. ఆదివారం కెనడాలోని టొరంటోలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ నైట్-2015 కార్యక్రమంలో రసమయి బాలకిషన్, పారిశ్రామికవేత్త వసంత్‌రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ యూకే అధ్యక్షుడు కాల్వల విశ్వేశ్వర్‌రెడ్డి హాజరయ్యూరు. ఇందులో రసమయి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్నారైలంతా భాగస్వాములై అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు పవన్, వెంకట్, మహేశ్, జితేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
తక్కువ ఖర్చుతో పెద్ద స్థాయి సినిమా!
‘‘ ‘తురుం’ సినిమా కోసం సంగకుమార్ ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు. తక్కువ ఖర్చుతో పెద్ద సినిమా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించి, చాలామందికి ఆదర్శంగా నిలిచాడు’’ అని తెలంగాణ శాసన సభ్యుడు ‘రసమయి’ బాలకిషన్ అన్నారు. సంగకుమార్ నటించి, నిర్మించిన ‘తురుం’ చిత్రం ఇటీవలే విడు దలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ దర్శకుల సంఘం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో బాలకిషన్ మాట్లాడారు. తెలంగాణ సినిమాను అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అల్లాణి శ్రీధర్ చెప్పారు. చిత్ర బృందంతో పాటు తెలంగాణ ఫిలిం చాంబర్ కార్యదర్శి అమరేశ్‌కుమార్, మురళి, ప్రేమ్‌రాజ్ మాట్లాడారు. -
తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా బాలకిషన్
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను నియమించినట్టు సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులు, పునర్నిర్మాణంలో కూడా ముఖ్యపాత్ర వహించాలని చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని సాంస్కృతిక శాఖ భవనాన్ని తెలంగాణ సాంస్కృతిక సారథి వినియోనిగానికి కేటాయించనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ నెలలో తెలంగాణ వాటర్ గ్రిడ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్‌లో పైలాన్ ఆవిష్కరణ చేయనున్నారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో వంగూరు మండలంలో హత్యకు గురైన సర్పంచ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ 20లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. -
కువైట్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
కువైట్: బతుకమ్మ పండుగ వేడుకల్ని కువైట్ తెలంగాణ అసోసియేషన్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కువైట్ లో భారత రాయబారి సునీల్ రాజ్, ఎంఎల్ఎ రసమయి బాలకిషన్, కువైట్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్ లు హాజరయ్యారు. ఈ ఉత్సవాలకు మహిళలు, తెలంగాణ వాదులు భారీగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కువైట్ లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం సంతోషంగా ఉందని రసమయి బాలకిషన్ అన్నారు. -
పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేయను
తిమ్మాపూర్: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేయనని ధూం..ధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ...పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి తాను పోటీలో ఉండనున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అవన్నీ వట్టి మాటలేనని, మానకొండూర్ నుంచి తప్ప వేరే ఎక్కడా పోటీ చేయనని ఆయన తెలిపారు. పార్టీ ఆదేశించినా పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాలి. అందుకోసం పోరాడాలని పిలుపునిచ్చారు.