( ఫైల్ ఫోటో )
సాక్షి, సిద్ధిపేట: మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, చర్యలు తీసుకోవాలని సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన రాజశేఖరరెడ్డి అనే వ్యక్తి 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ కేసుపై స్పందించిన పోలీసులు .. తాజాగా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 209, 506 సెక్షన్ల కింద రసమయిపై కేసు నమోదు చేశారు.
విచారణ కోసం కేసుకు సంబంధించిన సాక్ష్యాలను వారం రోజుల్లో అందించాలని పోలీసులు కోరారు. అయితే ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన రెండేళ్ల తర్వాత పోలీసులు రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా కళాకారుడిగా గుర్తింపు సాధించిన రసమయి 2014లో మానుకొండూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికలలోనూ ఆయన విజయం సాధించారు. ఏడాది క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్‌గా నియమించింది.
చదవండి: ఊపందుకున్న ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలోకి జయసుధ?
Comments
Please login to add a commentAdd a comment