హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను నియమించినట్టు సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులు, పునర్నిర్మాణంలో కూడా ముఖ్యపాత్ర వహించాలని చెప్పారు. జూబ్లీహిల్స్లోని సాంస్కృతిక శాఖ భవనాన్ని తెలంగాణ సాంస్కృతిక సారథి వినియోనిగానికి కేటాయించనున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ నెలలో తెలంగాణ వాటర్ గ్రిడ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో పైలాన్ ఆవిష్కరణ చేయనున్నారు. కాగా, మహబూబ్నగర్ జిల్లాలో వంగూరు మండలంలో హత్యకు గురైన సర్పంచ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ 20లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.
తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్గా బాలకిషన్
Published Fri, Dec 5 2014 3:08 PM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement
Advertisement