Telangana movement
-
ఆంధ్రా రియల్ ఎస్టేట్.. టీడీపీ విజన్ డాక్యుమెంట్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే, పేపర్–4 పరీక్షలో కొన్ని ప్రశ్నలు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేవని, కేవలం సమాచారం కోణంలో మాత్రమే ఉన్నాయని కొందరు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఆంధ్రా నిర్మాణ రంగ సంస్థలు, 1983 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ చేసిన వాఖ్యలు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల నినాదం, విజన్–2020 డాక్యుమెంట్ రూపొందించిన అంతర్జాతీయ సంస్థ, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు తదితర ప్రశ్నలు రావడం పట్ల అభ్యర్థులు కొంత గందరగోళానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నల్లో వాస్తవాధారిత ప్రశ్నలు వచ్చాయని మరికొందరు అభ్యర్థులు చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ప్రశ్న వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన కొత్త విగ్రహానికి సంబంధించినది కాకుండా పాత రూపురేఖల గురించి ఇవ్వడంతో అభ్యర్థులు కొంత ఇబ్బంది పడ్డారు. తెలంగాణ పోరాటయోధుడు వెలిచాల జగపతిరావుకు సంబంధించి రెండు ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ కోసం త్యాగం చేసిన మరికొందరికి సంబంధించిన ప్రశ్నలు కూడా వచ్చాయి. మొత్తంగా పేపర్–4 ప్రశ్నపత్రంలో కొన్ని ప్రశ్నలు మినహాయిస్తే మధ్యస్తంగానే ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. పేపర్–3 లో ప్రశ్నలు కష్టతరంగా...: ఎకానమీ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన ప్రశ్నల్లో చాలావరకు కష్టతరంగానే ఉన్నట్టు పరీక్ష రాసిన అభ్యర్థులు చెప్పారు. ప్రశ్నలు చాలా లోతుగా ఉండడంతో వాటికి సమాధానాలు ఎంచుకునేందుకు ఎక్కువ సమయం పట్టిందని, దీంతో చివరి వరకు సమయం చాలక ఆందోళనకు గురైనట్టు వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రశ్నల్లో నాణ్యత పెరిగిందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. రెండ్రోజులపాటు నాలుగు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా తొలిరోజు(ఆదివారం) జరిగిన రెండు పరీక్షలకు కేవలం 2,55,490(46.30%) మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. సోమవారం ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్), మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–4 (తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్) పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన పేపర్–3 పరీక్షకు 2,51,738 (45.62%) మంది హాజరు కాగా, మధ్యాహ్నం జరిగిన పేపర్–4 పరీక్షకు 2,51,486(45.57%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ గణాంకాలు ప్రాథమికంగా మాత్రమే నని, ఓఎంఆర్ షీట్లు పూర్తిస్థాయిలో అందిన తర్వాత హాజరుశాతంపై స్పష్టత వస్తుందని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్‌నికోలస్ తెలిపారు. -
ఉద్యమంతోనే తెలంగాణను సాధించాం: కేటీఆర్
-
ఉద్యమ వాస్తవ చరిత్ర..
ప్రపంచీకరణ అనంతరం వ్యక్తివాదం పెరిగి పోయి ఉద్యమాలు ఉండవు అనే ప్రచారం బలంగా నడుస్తున్న కాలంలో ప్రాంతీయ అస్తిత్వ వేదనలోంచి ఎగిసిన విముక్తి పోరాటం తెలంగాణ ఉద్యమం. పల్లెల నుండి పట్టణాల దాకా తెలంగాణ అనని మనిషి లేడు. కులాలు, మతాలకతీతంగా అందరూ ఒక్క గొంతుకగా నినదించిన నినాదం ‘జై తెలంగాణ’. అందులో ముఖ్య భూమిక విద్యార్థులది. మంటలై మండింది, రైళ్ళకు ఎదురెళ్లి ముక్కలైంది, ఉరిపోసుకున్నది, పురుగుల మందు తాగింది. ఏది చేసినా తెలంగాణ అనే ఉద్యమ కాగడను ఆరిపోకుండా చమురు పోసి మండించేందుకే. పాలకులు, ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు ఉద్యమానికి ద్రోహం చేసినప్పుడు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది విద్యార్థులే.విద్యార్థులు ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం వెనుక స్వాతంత్య్ర ఉద్యమం, రైతాంగ సాయుధ పోరాటం, తొలిదశ తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ పోరాటాల స్పూర్తి, ప్రభా వాలు ఉన్నాయి. ఆ చైతన్యమే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. అట్లా ఎగిసిన విద్యార్థి ఉద్యమం రాజకీయ పార్టీల కనుసన్నల్లోకి ఎలా పోయింది? దానికి పని చేసిన శక్తులేవి? తెలంగాణ ఉద్యమం ఏకశిలా సదృశ్యం అనుకుంటున్న చోట నిలబడిన, కలబడిన, వెనక్కి తగ్గిన శక్తులను బహిర్గత పరచిన పరిశోధన ఈ పుస్తకం. ఒక్కమాటలో, కళ్ళముందే వక్రీకరణలకు గురవుతున్న తెలంగాణ ఉద్యమ వాస్తవ చరిత్ర ఇది. ఈ పరిశోధన తెలంగాణ ఉద్యమకారుడే (నలమాస కృష్ణ) పరిశోధకుడిగా చేసిన ప్రయత్నం.ఇది అకడమిక్ పరిశోధన కాబట్టి దీనికి పరిమితులు ఉన్నా... ఇది ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని సమగ్రంగా నమోదు చేసిందని మాత్రం చెప్పవచ్చు. అలా భవిష్యత్తు పరిశోధనకు దారులు వేసిందన్నమాట. ఉద్యమం నడుస్తుండగానే తీరికలేని కార్యాచరణలో దాని తీరూ తెన్నులపై చేసిన ఓ విశ్లేషణ ఇది. ఆ పరిమితుల్లో దీన్ని అర్థం చేసుకుంటూ అధ్యయం చేయాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో జరుగనున్న ఈ పుస్తకావిష్కరణకు అందరూ ఆహ్వానితులే. – అరుణాంక్, డేవిడ్ (నేడు హైదరాబాద్‌లో ‘ఉస్మానియా వెలుగులో తెలంగాణ విద్యార్థి ఉద్యమం’ పుస్తకావిష్కరణ) -
ఉద్విగ్న జ్ఞాపకం
మహోన్నత తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన భాగ్యనగరంతొలి, మలిదశ పోరాటాలకు వేదికైన వేళ నాలుగు వందల ఏళ్ల మహోన్నతమైన చరిత్ర కలిగిన భాగ్యనగరంలో కోటి గొంతుకల ఉద్యమ ఆకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం హైదరాబాద్ మహానగరం ఎలుగెత్తి చాటింది. ‘జై తెలంగాణ’ నినాదమై మార్మోగింది. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఎన్నెన్నో వీరోచితమైన పోరాటాలు ఇక్కడే ఊపిరిపోసుకున్నాయి. రహదారులు మానవ హారాలై, మిలియన్ మార్చ్లై హోరెత్తాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఈ నేల నెత్తురోడింది. ఉద్యమకారులు పోలీసు తూటాలకు ఎదురొడ్డి నిలిచారు. ప్రాణాలను తృణప్రాయంగా సమరి్పంచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా అగ్నికీలలై ఎగిసిపడ్డారు. ఉరితాళ్లను ముద్దాడారు. పాతబస్తీ, అలియాబాద్, చార్మినార్, రాజ్‌భవన్, గన్‌పార్కు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సికింద్రాబాద్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, ఎల్బీనగర్, తార్నాక తదితర ప్రాంతాలు తొలి, మలిదశ ఉద్యమాలతో దద్దరిల్లాయి. నగరమంతటా భావోద్వేగాలు ఉప్పెనలా ఎగిసిపడ్డాయి. వందలాది మంది అమరుల బలిదానాల కలలను సాకారం చేస్తూ పదేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా జరిగిన తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ ఘట్టాలపైన ‘సాక్షి’ ప్రత్యేక కథనం. గైర్ ముల్కీ గో బ్యాక్... 👉 తెలంగాణేతరులు ఇక్కడి ఉద్యోగాలను కొల్లగొట్టుకొనిపోవడాన్ని నిరసిస్తూ మొదటిసారి 1952లో ‘గైర్ ముల్కీ గో బ్యాక్’ నినాదం నగరంలో ఆందోళనలు వెల్లువెత్తాయి. విద్యార్థులు చార్మినార్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. విద్యార్ధుల ప్రదర్శనపై పోలీసులు విరుచుకుపడ్డారు. పెద్ద ఎత్తున లాఠీచార్జి చేశారు. పోలీసుల దమనకాండను నిరసిస్తూ పాతబస్తీలో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ప్రదర్శనలను అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో అలియాబాద్ ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. 👉 1952 సెప్టెంబర్ 4వ తేదీన సిటీకాలేజీ నుంచి విద్యార్థులు భారీ ఊరేగింపు చేపట్టారు. గైర్ ముల్కీ గో బ్యాక్ నినాదాలు మార్మోగాయి. ఈ ఊరేగింపును నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకు పోలీసులు మరోసారి కాల్పులకు దిగారు. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులు నేలకొరిగారు. ఈ దుర్ఘటనను నిరసిస్తూ సెప్టెంబర్ 5న హైదరాబాద్ నగరమంతటా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆందోళనకారులు పత్తర్‌గట్టి పోలీస్‌స్టేషన్‌ను దహనం చేశారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు 16 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. అదేరోజు అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ముల్కీ నిబంధనలపై శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు బూర్గుల కారుకు సైతం నిప్పుపెట్టారు. ఆ తర్వాత జరిగిన ఆందోళనల్లో మరో నలుగురు ఉద్యమకారులు పోలీసు తూటాలకు బలయ్యారు. ‘జై తెలంగాణ’ ఒక్కటే పరిష్కారం.. 👉 ముల్కీ వ్యతిరేక ఉద్యమాలు క్రమంగా చల్లారాయి. ప్రభుత్వం పలు కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి ఏకైక పరిష్కారం ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడమే అనే స్పష్టమైన లక్ష్యంతో 1969 జనవరి నుంచి ‘జై తెలంగాణ’ ఉద్యమం ఆరంభమైంది. ఆ ఏడాది జనవరి 13వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి’ ఏర్పాటైంది. ఉస్మానియా వర్సిటీ నుంచి అన్ని ప్రాంతాలకు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలు విస్తరించుకున్నాయి. జనవరి 24వ తేదీన సదాశివపేటలో చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరిపారు. శంకర్ అనే 17 ఏళ్ల యువకుడు చనిపోయాడు. 👉మార్చి 11వ తేదీన హైదరాబాద్ అంతటా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు నిరవధిక సమ్మెకు దిగారు. పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం విధించారు. పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు. మార్చి 15వ తేదీన ఉస్మానియా వర్సిటీ స్వరో్ణత్సవాల్లోనూ ప్రత్యేక రాష్ట్రం నిరసనకారులు తమ ఆందోళన కొనసాగించారు. ఆ నెల ఉద్యమం ఉద్ధృతమైంది. ఏప్రిల్ 5న కమ్యూనిస్టులు సికింద్రాబాద్‌లో తెలంగాణకు వ్యతిరేకంగా భారీ బహిరంగసభను నిర్వహించారు. ఆ సందర్భంగా జరిగిన అల్లర్లను అణచివేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 👉1969 మే 1న హైదరాబాద్ చరిత్రలో మరో అత్యంత విషాదకరమైన రోజుగా నిలిచిపోయింది. మే డేను ‘డిమాండ్స్ డే’గా పాటించాలని కోరుతూ ఉద్యమకారులు పిలుపునిచ్చారు. చారి్మనార్ నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించారు. కానీ ఈ ప్రదర్శనకు పోలీసులు అనుమతించలేదు. దీంతో ఉద్యమకారులు కొందరు సాధారణ స్త్రీ పురుషులుగా చారి్మనార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో పూజలు చేసేందుకు కొబ్బరికాయలతో చేరుకున్నారు. ఒక్కసారిగా ‘జై తెలంగాణ’ నినాదంతో చారి్మనార్ మార్మోగింది. ఆ ప్రాంతమంతా జన సంద్రాన్ని తలపించింది. భారీ ప్రదర్శన మొదలైంది. ఈ ఊరేగింపుపైన పోలీసులు ఎక్కడికక్కడ విరుచుకుపడ్డారు. లాఠీలు విరి గా యి. తూటాలు పేలాయి. అయినా ప్రదర్శన ముందుకు సాగించింది. మొత్తం 20 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. 👉 గాందీ, ఉస్మానియా తదితర ప్రభుత్వ ఆస్తుల్లో నమోదైన రికార్డుల ప్రకారమే తొలిదశ ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు. ప్రపంచం చూపు.. తెలంగాణ వైపు.. 👉మహత్తరమైన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని ఆసక్తిగా గమనించాయి. విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, వివిధ కులవృత్తులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, కళాకారులు సకలజనులు ఏకమై సాగించిన వైవిధ్యభరితమైన ఉద్యమంగా చరిత్రకెక్కింది. 2009 నుంచి 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొనేవరకు ఉద్యమం అనేక మలుపులు తిరిగింది. అనేక పరిణామాలు జరిగాయి. అన్నింటికి హైదరాబాద్ వేదికైంది. ఎంతోమంది యువతీ యువకులు బలిదానాలు చేశారు. 👉 2009 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమ శిఖరమై నిలిచింది. వేలాది మంది విద్యార్థుల ఆందోళనలు, నినాదాలతో విశ్వవిద్యాలయం హోరెత్తింది. భగ్గుమన్న ఓయూ.. 👉ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఉద్యమ సారథి కేసీఆర్ తన దీక్షను విరమించినట్లు వార్తలు రావడంతో ఉస్మానియా ఒక్కసారిగా భగ్గుమన్నది. 2009 నవంబర్ 29న ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3న కన్నుమూశాడు. దీంతో ఉద్యమం మరింత ఉద్ధృతంగా మారింది. 👉 తెలంగాణ విద్యార్థి జేఏసీ 2010 ఫిబ్రవరి 20న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచి్చంది. పోలీసులు పెద్దఎత్తున ఉద్యమాన్ని అణచివేశారు. ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ సందర్భంగా అనేక మంది గాయపడ్డారు. ఈ దమనకాండను నిరసిస్తూ ఎన్సీసీ గేటు వద్ద సిరిపురం యాదయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన అనంతరం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వేణుగోపాల్‌రెడ్డి అనే మరో విద్యార్థి సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.హోరెత్తిన మిలియన్ మార్చ్.. 👉 ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మరో ఉద్యమం మిలియన్ మార్చ్. 2011 మార్చి 10న ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన మిలియన్ మార్చ్ మహా జనసంద్రాన్ని తలపించింది. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు 144వ సెక్షన్ విధించినా, తీవ్ర నిర్బంధాన్ని అమలు చేసినా లెక్కచేయకుండా జనం తరలివచ్చారు. 👉 అదే సంవత్సరం 42 రోజుల పాటు తలపెట్టిన సకల జనుల సమ్మెలో బడి పిల్లలు మొదలుకొని యావత్ తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వంటా వార్పు వంటి కార్యక్రమాలు జరిగాయి. ఆర్టీసీ, రవాణా ఉద్యోగులు,కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె కొనసాగించారు. 👉 2012 సెప్టెంబర్ 30న జరిగిన సాగరహారం మరో అద్భుతమైన పోరాటం. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు నెక్లెస్‌రోడ్డు జనసాగరమైంది. గన్‌పార్కు, ఇందిరాపార్కు, సికింద్రాబాద్, ఖైరతాబాద్, తదితర ప్రాంతాలన్నీ భారీ ప్రదర్శనలతో హోరెత్తాయి. తెలంగాణ నినాదమై పిక్కటిల్లాయి, 👉 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసే వరకు తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ కేంద్రంగా అనేక మలుపులు తిరిగింది. -
మాకు కొట్లాట కొత్తేం కాదు: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. పరస్పర ఆరోపణల మొదలు.. అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలు వాడే భాష దాకా.. విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధవారం నాటి పరిణామాలు మరింత నాటకీయంగా సాగాయి. పదేళ్లపాటు అధికారపక్షంలో ఉన్న బీఆర్ఎస్.. తొలిసారి ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. ఇది ఇక్కడితోనే అయిపోలేదు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు యత్నించగా.. సభ జరుగుతుండగా నిబంధనలు అందుకు అనుమతించవంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. అక్కడే రోడ్డు మీదే బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. మాకు కొట్లాట కొత్తేమీ కాదు! గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి.. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా BRS పార్టీకి ఉంది. జై తెలంగాణ అంటూ పోస్ట్ చేశారాయన. అసెంబ్లీలో నిన్నటి నిరసన.. తెలంగాణఉద్యమ కాలం నాటి రోజుల్ని గుర్తు చేసిందంటూ సందేశం ఉంచారు. Yesterday’s protest in Assembly brought back memories of Telangana Agitation Days మాకు కొట్లాట కొత్తేమీ కాదు! గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి… రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా BRS పార్టీకి ఉంది. జై… pic.twitter.com/Zn1IidXhQS — KTR (@KTRBRS) February 15, 2024 -
నా మనోవ్యధను అర్థం చేసుకున్నారు: మాజీ డీఎస్పీ నళిని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో.. తన డీఎస్పీ పదవికి దూరమై వార్తల్లోకి ఎక్కారు నళిని. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆమె పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యమకారులకు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందని.. ఆమె కోరుకుంటే అదే ఉద్యోగం కుదరకుంటే వేరే ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సీఎస్‌ను ఆదేశించారు కూడా. ఈ తరుణంలో.. శనివారం ఆమె రేవంత్‌రెడ్డిని కలిశారు. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనను ఆమె ఇదివరకే తిరస్కరించారు. తనకు ఉద్యోగంలో ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేవలం మర్యాదపూర్వక భేటీ జరిగిందంతే. గత సమీక్షలో తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అధికారులు సమాచారం అందించగా ఆమె సీఎం రేవంత్‌ను ఇవాళ కలిశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డిని కలువడం సంతోషంగా ఉంది. ఉద్యోగం ఇప్పుడు నాకు అవసరం లేదు. డబ్బు, భౌతిక ప్రపంచం నుండి బయట పడ్డాను. ఇప్పుడు నాది ఆధ్యాత్మిక మార్గం. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను.. సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వేదం , యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నా. సనాతన ధర్మం ప్రచారం చేస్తా. గతంలో నేను, సహఉద్యోగులు డిపార్ట్ మెంట్లో ఎదుర్కొన్న సమస్య పై సీఎంకు రిపోర్ట్ ఇచ్చాను. నాలాగా ఎవరు భాద పడవద్దన్నదే నా అభిప్రాయం. అప్పుడే నాకు బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయింది. అందుకే ఆధ్యాత్మిక బాట ఎంచుకున్నా. నా విషయంలో జరిగిన అన్ని పరిణామాలు సీఎం దృష్టికి తీసుకెళ్లా. ఇప్పుడు నా మనసుకు నచ్చినట్లు సేవ చేస్తున్నా. ఇన్నాళ్ల నా మనోవ్యధను గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి.. సీఎం రేవంత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారామె. -
తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు తెలంగాణ పోలీస్ శాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2009 నుంచి 2014 జూన్ రెండో తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు సమర్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమీషనర్లను తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఆదేశాలు జారీ చేశారు. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండవ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసులను ఎత్తివేయనుంది. ఇది కూడా చదవండి: దింపుడు కళ్లెం ఆశలన్నీ ఆవిరి..! -
గజ్వేల్ జేజేల కోసం..
యెన్నెల్లి సురేందర్ : మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. గజ్వేల్ గడ్డ పై మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదంతో బరిలోకి దిగారు. కేసీఆర్ : అభివృద్ధి ఎజెండా ఈటల : బీసీ మంత్రం నర్సారెడ్డి : లోకల్ ఫ్లేవర్ అభివృద్ధి మంత్రం.. బహుముఖ వ్యూహం ‘సెంటిమెంట్’గా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన కేసీఆర్ గజ్వేల్‌ను రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనాగా మలచడంలో సఫలమయ్యారు. నియోజకవర్గంలోని మర్కూక్ వద్ద కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, కొండపాక మండలంలో మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం, ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ యూనివర్సిటీ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో రింగురోడ్డు, వంద పడకల జిల్లా ఆస్పత్రి, మరో వంద పడకలతో మాతా శిశురక్షణ ఆస్పత్రి, ఎడ్యుకేషన్ హబ్ వంటి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి. గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా జరిగిన అభివృద్ధిని చూపిస్తూ కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం బహుముఖ వ్యుహంతో ముందుకు సాగుతోంది. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తూ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అన్నింటికీ మించి బూత్‌లెవల్ మేనేజ్మెంట్ సక్రమంగా జరిగేలా వంద ఓట్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. ప్రజా ఉద్యమాలకు ఊపిరి... గజ్వేల్, తూప్రాన్, మనోహరాబాద్, ములుగు, మర్కూక్, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, కుకునూర్‌పల్లి మండలాలతో కూడుకొని ఉన్న గజ్వేల్ నియోజకవర్గం యాదాద్రి, జనగామ, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సరిహద్దున ఉన్నది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకొని ఉండటం వల్ల ఇక్కడ నగర వాతావరణం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 179 పంచాయతీలున్నాయి. నిర్వాసితులను ఆకట్టుకునే ప్రయత్నం గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లన్నసాగర్ నిర్వాసితులను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తొగుట మండలంలో పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురైన సంగతి తెలిసిందే. ఆయా గామాల్లో 10వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటిస్తే పోరాడుతామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తున్నారు. ఈటల ముమ్మర ప్రచారం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బీసీ నినాదం, స్థానిక సమస్యలే ఎజెండాతో ఎన్నికల బరిలో దిగారు. నియోజకవర్గంలో సుమరుగా 1.40లక్షల బీసీ ఓటర్లు ఉండగా..అందులో తన సొంత సామాజికవర్గం ముదిరాజులు 55వేల వరకు ఉంటారు. వీరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పేరిట 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, సరైన నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో రోడ్డున పడ్డారని చెబుతూ...వారందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తి నేతలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 1992 నుంచి సుమారు పదేళ్లకుపైగా ఈటల ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి ’లోకల్’ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నేను లోకల్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే 24గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా స్థానిక వ్యక్తి కాదని, ఆయన గెలిచినా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. -
దేశానికి కాంగ్రెస్ చోర్ టీం
సాక్షి, హైదరాబాద్: దేశానికి కాంగ్రెస్ పార్టీ ‘సీ టీం’ (చోర్ టీమ్) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు ఆరోపించారు. తమ పార్టీ బీజేపీకి ‘బీ–టీం’ అన్న కాంగ్రెస్ విమర్శలపై ఆయన మండిపడ్డారు. కుంభకోణాలతో ఆకాశం నుంచి పాతాళం దాకా దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన ‘దివ్యాంగుల కృతజ్ఞత సభ’లో కేటీఆర్ మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ రామప్ప గుడికి వచ్చి గొంగడిలో వెంట్రుకలు ఏరినట్లు కుటు ంబ పాలన గురించి మాట్లాడారు. ఆయన లీడర్ కాదు.. ఇతరులు రాసింది చదివే రీడర్. రేవంత్ లాంటి ఒక 420ని, గజదొంగను పక్కన పెట్టుకొని రాహుల్ మాట్లాడటం సిగ్గుచేటు. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్‌ను మించిన గజదొంగ రేవంత్. నాడు నోటుకు ఓటు.. నేడు సీటుకు రేటు. ఒకవేళ ఎన్నికల్లో 10, 12 మంది ఎమ్మెల్యేలు గెలిచినా రాష్ట్ర కాంగ్రెస్‌ను బీజేపీకి గంపగుత్తగా రేవంత్ అమ్మేయడం ఖాయం’ అని కేటీఆర్ విమర్శించారు. రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఎక్కడైనా రూ. లక్ష కోట్ల అవినీతి జరుగు తుందా? అని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో సోనియా, రాహుల్ విచారణ ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. మోదీ, రాహుల్‌కు తెలంగాణ పౌరుషం చూపాలి.. ‘తెలంగాణ ఉద్యమంలో ప్రజల మీదకు తుపాకీతో వెళ్లిన రైఫిల్‌రెడ్డి ఒకరైతే... రాజీనామా చేయకుండా అమెరికా పారిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరొకరు. ఇలాంటి వారితో కేసీఆర్‌కు పోటీనా? ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి బుద్ధిచెప్పేలా తెలంగాణ పౌరుషం చూపాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ఈ శతాబ్దంలో ఒకే ఒక్కడు.. ‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నా రు. కేసీఆర్ లాంటి నాయకుడు శతాబ్దానికి ఒకరు వస్తారు. ఆయన ప్రభుత్వాన్ని వదులుకోవద్దు. దివ్యాంగుల సంక్షేమానికి తొమ్మిదిన్నరేళ్లలో రూ. 10,300 కోట్లు ఖర్చు చేశాం. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్ గఢ్‌లో దివ్యాంగులకు రూ. 200 చొప్పున, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ. 500 నుంచి రూ. వె య్యి వరకు మాత్రమే పింఛన్ ఇస్తున్నారు. మేం మ ళ్లీ అధికారంలోకి రాగానే ప్రస్తుతమున్న రూ. 4,016 పింఛన్‌ను రూ. 6,016కు పెంచుతాం. దివ్యాం గులకు ఊత కర్రలా నిలిచిన కేసీఆర్‌కు ఎన్నికల్లో అండగా నిలవండి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కె.వాసుదే వరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నా థం, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమం నుంచి నేషనల్ హైవే పైకి..
కల్వల మల్లికార్జున్‌రెడ్డి : రాష్ట్రసాధనే లక్ష్యంగా ఉద్యమపార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్రసమితి తొలిసారిగా ‘భారత్ రాష్ట్రసమితి’ రూపంలో ఎన్నికల పరీక్షకు సిద్ధమవుతోంది. జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి ఓవైపు రంగం సిద్ధం చేసుకుంటూనే, మరోవైపు రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. దక్షిణ భారతదేశంలో తొలి హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించేందుకు పార్టీ అధినేత కే.చంద్రశేఖర్‌రావు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్రసాధన ఉద్యమంలో ఎన్నికలను అ్రస్తాలుగా మలుచుకొని ఫలితాలు రాబట్టుకున్న కేసీఆర్ ‘హ్యాట్రిక్ అధికారం’ కోసం త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను సాధనంగా చేసుకుంటున్నారు. తద్వారా దేశ రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఉపఎన్నికలతోనే ప్రస్థానం షురూ ..: తెలంగాణ రాష్ట్ర సాధనకు టీడీపీకి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి, సిద్దిపేట శాసన సభ్యత్వానికి ఏకకాలంలో రాజీనామా చేసిన కేసీఆర్ ఉపఎన్నిక ద్వారా టీఆర్ఎస్ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. 2001లో సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి భారీ విజయం సాధించారు. కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహన..: టీఆర్ఎస్ 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహనకు వచ్చింది. ఉమ్మడి ఏపీలో 46 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన టీఆర్ఎస్ 26 చోట్ల విజయం సాధించింది. రాష్ట్ర ఏర్పాటుపై మాట తప్పిందనే కారణంతో కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ నుంచి బయటకు వచ్చారు. 2006 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో ఎంపీగా మరోమారు కేసీఆర్ విజయం సాధించారు. 2008లో టీఆర్ఎస్కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లగా, కేవలం ఏడుగురు మాత్రమే గెలుపొందారు. భారీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఆ తర్వాత పార్టీ నేతల ఒత్తిడితో ఉపసంహరించుకున్నారు. ముందస్తు ఎన్నికలతో రెండోసారి అధికారం..: ఆరు నెలలు ముందుగానే అసెంబ్లీని రద్దు చేస్తూ 2018 సెపె్టంబర్ 6న కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు రద్దు నిర్ణయంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ ఏకకాలంలో 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అన్ని చోట్లా పోటీ చేసి 88 చోట్ల విజయం సాధించింది. వరుసగా రెండోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాతి కాలంలో కోరుకంటి చందర్ (ఏఐఎఫ్బీ), రాములునాయక్ (ఇండిపెండెంట్)తో పాటు 12 మంది కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో అసెంబ్లీలో పార్టీ సంఖ్యాబలం 104కు చేరింది. గడిచిన నాలుగేళ్లలో 2018–22 మధ్యకాలంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగ్గా నాగార్జునసాగర్, హుజూర్నగర్, మునుగోడులో టీఆర్ఎస్ హుజూరాబాద్, దుబ్బాకలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్ రూపంలో తొలి పరీక్ష ..: జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టే లక్ష్యంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు. బీఆర్ఎస్ పేరిట తొలిసారిగా ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ ఒకే జాబితాలో 115 మంది పేర్లు కేసీఆర్ ప్రకటించారు. తొలిసారిగా చేజిక్కిన అధికార పగ్గాలు..: 2014 ఎన్నికల్లోఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్ 119 స్థానాల్లో పోటీ చేసి 63 చోట్ల విజయం సాధించింది. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, బీఎస్పీ, సీపీఐ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో అసెంబ్లీలో సంఖ్యాబలం భారీగా పెరిగింది. నారాయణఖేడ్, పాలేరు ఎమ్మెల్యేల(కాంగ్రెస్) మరణంతో 2016లో వచ్చిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. మహాకూటమితో కేసీఆర్ జట్టు..: 2009లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమితో టీఆర్ఎస్ జట్టు కట్టింది. 45 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేయగా, 10 సీట్లే గెలిచింది. తర్వాత పార్టీలో చేరిన చెన్నమనేని రమేశ్ (వేములవాడ) సహా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 2010 జూలైలో జరిగిన ఉప ఎన్నికల్లో 11 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. 2011 ఉపఎన్నికలో బాన్సువాడలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పోచారం విజేతగా నిలిచారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుతున్న దశలో టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు జోగు రామన్న, గంప గోవర్దన్, జూపల్లికృష్ణారావు, తాటికొండ రాజయ్య 2012లో రాజీనామా చేసి మళ్లీ గెలిచారు. నాగర్‌కర్నూలు నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన నాగం జనార్దన్‌రెడ్డికి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇదే ఉప ఎన్నికలో మహబూబ్‌నగర్ నుంచి ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి (బీజేపీ) టీఆర్ఎస్ అభ్యర్థి ఇబ్రహీంపై గెలుపొందారు. -
చరిత్ర వక్రీకరణ మహానేరం
చరిత్రను వక్రీకరించడం జనసంహారం చేసే ఆయుధాల కన్నా ప్రమాదకరం. అది ప్రజలను తరతరాలుగా తప్పుదోవ పట్టిస్తుంది. చరిత్ర ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది భావి తరాలకు మార్గదర్శి. తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక అవసరాలకు చరిత్రను ఒక సాధనంగా చూడటమనేది స్వార్థ చింతన. చరిత్రకు మసిపూసి మారేడు కాయ చేయడమనేది ఒక రాజకీయ దృక్పథంగా మారిపోవడం విషాదం. ప్రస్తుతం తెలంగాణ సమాజం అదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తెలంగాణ విమోచన, విలీనం, విద్రోహం, సమైక్యత అనే వాదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిష్పాక్షిక దృష్టితో చూడాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరికీ ఉంది.తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తోన్న శక్తుల సంఖ్య గణ నీయంగా పెరిగిపోతున్నది. అందుకుగానూ అసత్యాలను, అర్ధ సత్యాలను తమ అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. సమత, మమత, కరుణ, ప్రేమలకు ప్రతీకగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్వేషపు విషంతో నింపాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషాప్రాంతాల కలయిక. హిందూ, ముస్లిం, ఇతర సామాజిక వర్గాల సమ్మేళనంతో కలిసి నడిచిన గంగా–జమునా తెహెజీబ్. హైదరాబాద్ రాజ్యం కేవలం ముస్లింలు పాలించినది కాదు. రాజ్యానికి కేంద్రం నిజాం అయితే, గ్రామీణ ప్రాంతాలు హిందూ సామాజిక వర్గానికి చెందిన జమీం దారులు, జాగీర్దారుల కబంధ హస్తాల్లో ఉండేవి. నిజానికి పరోక్షంగా నిజాంలు సాగించిన దుర్మార్గాల కన్నా, ఎందరో జమీందారులు, జాగీర్దారులు సాగించిన అమానుషాలు ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ నిజాం పాలన అనగానే కేవలం నిజాం గుర్తుకు రావడమే సహజంగా జరుగుతోంది. ‘మానుకోట’(ఇప్పటి మహబూబాబాద్) జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి లాంటి జమీందారులు జరిపిన దారుణాలు మనం చరిత్రలో మరెక్కడా చూడం. వీటన్నింటికీ రజాకార్ల దాడులు, దౌర్జన్యాలు తోడయ్యాయి. హిందూ జమీందార్లు, ముస్లిం రజాకార్లు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రజాకార్ ఉద్యమం 1938లో ప్రారంభమైంది. కానీ 1947 నుంచి దౌర్జన్యాలకు వేదికగా తయారైంది. రజాకార్ అంటే స్వయం సేవకులు అని అర్థం. రజాకార్లలో కొందరు హిందువులు కూడా ఉండేవారు. ప్రభుత్వానికి అండగా ఉండడానికి రజాకార్లను వినియోగించాలన్న కొందరు ముస్లిం జమీదారుల ఒత్తిడికి తలొగ్గి వారికి ప్రత్యేకమైన అధికారాలను ప్రకటించారు. దీనితో రజాకార్లు కమ్యూనిస్టులపైనా, ఇతర ఉద్యమకారులపైనా దాడులు కొనసాగించారు. 1947 జూలై 30 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు రజాకార్లు విచ్చలవిడి దౌర్జన్యాలు చేసిన మాట నిజం. వాళ్ళను ప్రతిఘటించి ప్రజలకు రక్షణగా నిలి చింది కమ్యూనిస్టులే. జమీందారుల, భూస్వాముల దౌర్జన్యాలకు పరాకాష్ఠగా నిలిచిన దొడ్డి కొమరయ్య హత్యతో అంటే 1946 జూలై 4న కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం స్వతంత్రమైంది. ఆనాటికి 565 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి హైదరాబాద్ స్వతంత్ర పాలనా ప్రాంతంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసు కొన్నప్పకీ అన్ని విషయాల్లో స్వేచ్ఛగానే నిర్ణయాలు తీసుకునేది. బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తన సైన్యాన్ని హైదరాబాద్‌లో ఉంచింది. అదే మనం ఇప్పుడు చూస్తోన్న హైదరా బాద్‌లోని కంటోన్మెంట్. 1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం అన్ని సంస్థానాలను భారత యూనియన్‌లో కలపాలని అడిగింది. అందరూ ఒప్పుకున్నారు. కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు తాము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకున్నాయి. అందుకుగానూ భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యం ఒక ఒడంబడికను కుదుర్చు కున్నాయి. దానినే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధ నలను పెట్టింది. అందులో ఒకటి, ఇప్పటివరకూ బ్రిటిష్ పాలనలో లేని సంస్థానం అటు పాకిస్తాన్‌లోగానీ, ఇటు భారతదేశంలో గానీ చేర వచ్చు. లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే నిజాం స్వతంత్ర పాకి స్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. భారతదేశంతో మాత్రం స్నేహంగా ఉండడానికి అంగీకరించాడు. 1947లో ఉనికిలోకి వచ్చిన రజాకార్ల దాడులను ఆసరాగా తీసుకొని భారత ప్రభుత్వం నిజాం మీద ఆంక్షలను పెంచింది. ఆర్థికంగా దిగ్బంధనం చేసింది. భారత ప్రభుత్వం పెంచుతోన్న ఒత్తిడిని తట్టుకోలేక నిజాం ప్రభుత్వం 1948 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం కొన సాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలనీ, తాము స్వతంత్రంగా కొనసాగే అవకాశం కల్పించాలనీ నివేదించింది. అది 1948 ఆగస్టు 21న చర్చలకు వచ్చింది. ఆ అభ్యర్థనను స్వీకరించాలా లేదా అనేది చర్చకు వచ్చినప్పుడు అందులో ఉన్న పది దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా, కెనడా, కొలంబియా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా అభ్యర్థనను స్వీకరించ డానికి తమ మద్దతును తెలియజేశాయి. రష్యా, చైనా, ఉక్రెయిన్ తటస్థంగా ఉన్నాయి. ఇది 1948 సెప్టెంబర్ 16న జరిగింది. అయితే దానిని ఒక రెండు రోజులు వాయిదా వేయాలని భారత ప్రభుత్వ ప్రతినిధులు తెరవెనుక కథ నడిపారు. అప్పటికే భారత సైన్యం హైదరాబాద్‌లో సైనిక చర్యలను ప్రారంభించింది. దాదాపు హైదరా బాద్ సంస్థానం పూర్తిగా ఆక్రమణకు గురైంది. తెల్లారితే సెప్టెంబర్ 17. ఆరోజు హైదరాబాద్‌ను హస్తగతం చేసుకున్నారు. సెప్టెంబర్ 17 మధ్యాహ్నంకల్లా నిజాం చేత భారత ప్రతినిధి కె.ఎం.మున్షీ ఒక ప్రకటన చేయించారు. హైదరాబాద్ ప్రభుత్వం తరఫున భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామనేది అందు లోని ప్రధానాంశం. సెప్టెంబర్ 12న మొదలుపెట్టిన సైనికదాడి మొదటి లక్ష్యం ఐక్యరాజ్య సమితి నుంచి ఫిర్యాదును వెనక్కి తీసుకునేటట్టు చేయడం. సైనిక చర్య జరిగిన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సైన్యం చేతిలో గానీ, అక్కడక్కడా జరిగిన ఘర్షణల్లోగానీ 25 వేల నుంచి 30 వేల మంది వరకు మరణించినట్టు నిజాం ప్రభుత్వం నియమించిన సుందర్‌లాల్ కమిటీ నివేదిక వెల్లడించింది. ఇది ఒక ఘట్టం. దీనినే మనం విమోచన అంటున్నాము. విమోచన అంటే శత్రువును పదవీ చ్యుతుడిని చేయాలి. కానీ అలా జరగలేదు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుమీదనే 1950 జనవరి 26 వరకు ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాతనే హైదరాబాద్ భారత ప్రభుత్వంలో అధికారికంగా భాగమైంది. 1948 సెప్టెంబర్ 17న నిజాంను లొంగదీసుకున్న తరువాత భారత సైన్యం కమ్యూనిస్టులపై యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలను దోచుకున్న దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దార్లు కమ్యూనిస్టుల పోరాటంతో ఊళ్ళొదిలి పెట్టారు. భారత సైన్యం రావడంతో, కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని మళ్ళీ పల్లెలకు వచ్చారు. భారత సైన్యం, భూస్వాములు, గూండాలు కలిసి ఊరూరునీ వల్లకాడుగా మార్చేశారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి 1951 అక్టోబర్ సాయుధ పోరాట విరమణ వరకూ దాదాపు 4 వేల మంది కమ్యూనిస్టులతో పాటు, వేలాది మంది సాధారణ ప్రజలు చనిపోయారు. మరి 1948 సెప్టెంబర్ 17న విమోచన అయితే, 1951 వరకు భారత సైన్యం తెలంగాణ పల్లెలపై ప్రకటించిన యుద్ధం ఎవరి విమోచనం కోసం జరిగింది? కాబట్టి సెప్టెంబర్ 17న జరిగింది నిజాం బలవంతపు లొంగుబాటుగానే చరిత్ర మనకు చెబుతున్నది. ఆ తర్వాత మూడేళ్ళ పాటు తెలంగాణ పల్లెల్లో నెత్తురు ప్రవహించింది. అందువల్ల మనం సెప్టెంబర్ 17న జరపాల్సింది సంబురాలు కాదు. మనల్ని మనం సింహావలోకనం చేసుకోవడమే. రజాకార్ల దౌర్జన్యా లనూ, అమానుషాలనూ ఎండగట్టాల్సిన సమయమిదే. కానీ భారత సైన్యం జరిపిన నరమేధాన్ని తక్కువ చేసి చూడటం ముమ్మాటికీ సరికాదు. తెలంగాణ ప్రజలు అటు నిజాం రాజు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల దోపిడీ, దౌర్జన్యాలకు బలైపోయారు. రజాకార్ల అమానుషాలను అనుభవించారు. అదేవిధంగా భారత సైన్యం చేసిన విధ్వంసాన్ని, వినాశనాన్ని కూడా చవిచూశారు. ఇదే వాస్తవం. ఇదే నగ్న సత్యం. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
తెలంగాణ సాయుధ పోరాట వీరుడి సతీమణి కన్నుమూత
సాక్షి, మద్దూరు(మెదక్): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న చేర్యాల మండలంలోని కమలాయపల్లి గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య సతీమణి రాములమ్మ(75) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని కుమార్తె ఇంటిలో మృతి చెందింది. రాములమ్మ మృతికి సర్పంచ్ ఓరుగంటి అంజయ్య, కొమురవెళ్లి ఆలయ మాజీ డైరెక్టర్ శంకరాచారి సంతాపం తెలిపారు. -
'తెలంగాణ దేవుడు' వచ్చేస్తున్నాడు
ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. జిషాన్ ఉస్మాన్ హీరోగా సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్ , తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. ఈ నెల 12న సినిమా విడుదల కానున్న సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ ‘‘1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి, ప్రజల కష్టాలను తీర్చిన ఒక ఉద్యమ ధీరుడి జీవిత చరిత్రతో ఈ సినిమా రూపొందించాం. ఉద్యమం చేసి, సాధించుకున్న తర్వాత తెలంగాణలో ఏర్పడిన పరిణామాలను చూపించాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్ ఖాన్. -
తెలంగాణ తొలి పోరాట భేరి
మూడు తరాల తెలం గాణవాది ముచ్చర్ల సత్య నారాయణ. అతని జీవితం ఒక మహా ప్రవాహం. అలాంటి నాయకులు అతి తక్కువ. ఆ విలక్షణతే అతడిని ప్రజలకు దగ్గర చేసింది. స్కూలు విద్యా ర్థిగా ఉన్నప్పుడే ఊరిని గెలిచాడు. పాటలు పాడి, బుర్రకథలు చెప్పి ఊరి ప్రజల తరపున నిలబడ్డాడు. ఊళ్లో భూపోరాటా లకు అక్షరమై మద్దతునిచ్చాడు. కంఠస్వరమై వారికి రక్షణ కవచమయ్యాడు. కాసం లింగారెడ్డి దొర ప్రజల భూములు లాక్కుంటుంటే ప్రజలు ప్రతిఘ టించారు. తన భూముల్లోకి ఎవరూ రాకుండా దారికి అడ్డంగా దొర గోడ కట్టించాడు. అది గమ నించిన ముచ్చర్ల ఓ అర్థరాత్రి తన స్నేహితుల్ని తీసుకెళ్ళి గోడల్ని పగలగొట్టి ఆధిపత్యాల్ని ధిక్క రించాడు. సత్యనారాయణ ఇంటిపేరు సంగంరెడ్డి. సొంతూరు హనుమకొండ పక్కనే ఉన్న ముచ్చర్ల. అందుకే ముచ్చర్ల ఇంటిపేరైంది. ముందు తన ఊరికి సేవ చేయాలను కున్నాడు. తన బాల్య స్నేహితులలో ఎరుకల, యానాది, హరిజన, గిరి జన కులాల వారు ఎందరో. చివరివరకు వారి స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించిన ప్రజల బంధువు. వ్యవసాయ కుటుంబమే అయినా ఎన్నో ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొన్నాడు. ఒకే జత బట్టలతో స్కూలు విద్య పూర్తి చేశాడు. స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే పొరుగురాష్ట్రం నుండి కుప్పలు తెప్పలుగా వచ్చిన అధికారులు, టీచర్ల వివక్షని ఎదుర్కొన్నాడు. ఫీజు కట్టలేదనే నెపంవేసి పరీక్షలు రాయనివ్వలేదు. ఐతే ఇలాంటి ఎన్నో విషయాలను తనదైన శైలిలో ఎదుర్కొని నిలబడ్డాడు. ఒకవైపు రైతాంగం, ప్రజలు నిజాంకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే ముచ్చర్ల గ్రామ ప్రజలు ఊళ్ళోని దొరలకు వ్యతిరేకంగా పోరాడు తుంటే ఆ ప్రజలకు అనుకూలంగా నిలిచాడు. ఆయన తండ్రి నర్సయ్య, తల్లి నర్సమ్మ. ఐదుగురు అన్నదమ్ములు. అందరు కూడా అన్యాయాలను ఎదిరించే గుణం కలిగినవారే. ఇదే లక్షణం చివరి కంటా సత్యనారాయణని వదిలిపెట్టలేదు. ఎన్టీ రామారావు పిలిచి తెలుగుదేశం టిక్కెట్టు ఇప్పిం చాడు. గెలిచాక రవాణా శాఖ మంత్రిగా నియమిం చాడు. కానీ తన ఆత్మగౌరవానికి ప్రజాశ్రేయస్సుకు భంగం కలిగినప్పుడు చేస్తున్న పదవిని తృణ ప్రాయంగా పడేసి వచ్చాడు. ఆ తరువాత ప్రజా జీవితంలో అతి సామాన్య జీవితం గడిపాడు. చదువులకు దూరమైన కుటుం బంలో పుట్టినా తన స్వంతశక్తితో పై చదువులు చదివాడు. ధిక్కార కెరటం లాంటి అతనిలో బలమైన కవి, కళాకారుడు దాగి ఉన్నాడు. పాటలు పాడుతూ బుర్రకథలు చెబుతూ అన్యాయంపై యుద్ధభేరి ప్రకటించాడు. అందుకే ‘‘ తెలంగాణ తొలి పోరాట భేరి’’ అని తనను పిలుచుకున్నారు. ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ అని నినదించిన తొలితరం ఉద్యమకారుల్లో ముచ్చర్ల మొదటి శ్రేణిలో నిలు స్తాడు. ఈయన వేసే నాటకాలలో ప్రొ. జయ శంకర్ గారు స్త్రీ వేషాలు వేసేవారు. అంతేకాదు ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు. తెలంగాణ వారిని మరింత దగ్గరకు చేర్చింది. ఏనాడు అనుచర ప్రవృత్తిని దరిచేరనివ్వలేదు. నాయకుని గానే నిలి చాడు. ప్రజలకు దూరంగా ఉండి సేవ చేయాలని ఏనాడు భావించలేదు. అందుకే ప్రజల మధ్య, ప్రజలలో ఒకడిగా ఉంటూ కలెక్టర్ల దగ్గరికి, పోలీసుల దగ్గరికి అన్యాయం జరిగిన వాళ్ళని తీసు కెళ్ళి న్యాయం జరిగేలా చూసే వాడు. ప్రేక్షక పాత్ర వహించడానికి ఆమడదూరంలో ఉండేవాడు. తన దైన స్థానాన్ని తాను నిర్మించుకో గల దిట్ట. అది ఉపన్యాసం కావచ్చు. పాట కావచ్చు. అక్షరశక్తి అతనికి వరం. తెలంగాణ సోదరా తెలు సుకో నీ బతుకు అని పాడినా ‘రావోయి రావోయ్ మర్రి చెన్నా రెడ్డి ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి’ అని గళ మెత్తినా ఇసుక వేస్తే రాలని జనం ఏకగాన ప్రవాహంలో లీనం కావలసిందే. ముచ్చర్ల పాటల మాటలు వినడానికి వేలాదిమంది జనం పిలవ కున్నా వచ్చేవారు. అతని పాటలు ఒక్కొక్కటి ఆయా సందర్భంలో పిడిబాకులవలె దిగేవి. శ్రోతలు అగ్రహోదగ్రులు అయ్యేవారు. ఆలోచించే వారు. తన మాటలతో వారిని కనికట్టు చేసేవారు. మంత్రముగ్ధులై వినేవారు. అంతటితో తనపని పూర్తయిందని ఇంటికెళ్ళి పడుకుంటాడు. ముచ్చర్ల ఆశావాది. గాలికెదురీదుతాడు. సభా నంతరం వారిలో వెలిగిన చైతన్యాన్ని ఏ రూపంలో ఏ దారిలో ముందుకు తీసుకెళ్ళాలో ప్రణాళికలు వేసేవాడు. గాలివాటిన్ని బట్టి పోడు. తానే సుడి గాలై దారిచూపుతాడు. సాహిత్యంలోనే కాదు రాజకీయ ఎత్తుగడలు నిర్మించడంలో అతను దిట్ట. పట్టువిడుపులు లేవని కాదు. కానీ తనకు, తన జాతి, ప్రాంతాలకు అన్యాయం ఎదురైనా, ఆత్మ గౌరవానికి దెబ్బతగిలినా సహించలేడు. వరంగల్ లోనే తనకు పోటీగా ఎన్టీఆర్ మరొకరిని ప్రోత్స హిస్తే దానిని వ్యతిరేకించాడు. కులమో, స్థలమో, బంధు త్వమో, ఏదో ఒక పేరుతో గ్రూపులు పెట్ట డాన్ని సహించలేదు. ఆ విష యాన్ని అధిష్టానానికి స్పష్టం చేసిన గుండెదిటవు గల మనిషి. అందుకే ఒకచోట ఇలా అన్నాడు. ఊరిలో సర్పం చుగా పనిచేసిన ప్పుడు ఇంట్లో ఉన్నట్లు అనిపిం చింది. సమితి ప్రెసిడెంట్ అయ్యాక స్కూల్లో విద్యార్థులతో ఉన్నట్లు అనిపిం చింది. మంత్రి అయినాక మాత్రం జైల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అని తన పరిస్థితి వివరించాడు. ఇల్లు గడవకుంటే ముచ్చర్ల చివరి దశలో కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాడు. ఉన్న ఆస్థిని కరిగించడంలో దిట్ట. ఏనాడూ వెనకంజ వేయలేదు. 1969 తొలి తెలంగాణ ఉద్యమానికన్నా సుమారు రెండు దశాబ్దాల క్రితమే తెలంగాణ ఇంటా బయటా ఎలా మోసపోతున్నదో కళ్ళారా చూసినవాడు. భవిష్యత్‌ని అంచనా వేశాడు. అందుకు వ్యతిరేకంగా పావులు కదిలించాడు. తాను కదలుతూ ప్రజలను కదిల్చాడు. మలి ఉద్యమం ఆరంభం నుండి నగారాలా మోగిన వాడు. తెలంగాణ కోసం ఒక సెంట్రీలాగ పనిచేశాడు. తానే ఒక సైరన్ అయి మోగాడు. తెలంగాణ ప్రయో జనాలకు పరిరక్షకుడిగా నిలబడ్డాడు. ముచ్చర్ల జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. కానీ అన్ని మలుపుల్లో కూడా తెలంగాణానే శాసించాడు. ఒక రాష్ట్రం కోసం దాని ఏర్పాటు నుండి సాధించిన దశ వరకు జీవించిన వ్యక్తి మరొకరు లేరు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఎందుకోగాని ముచ్చర్ల పక్కనే ఉండిపోయాడు. ఎంతో గుర్తింపు పొందాల్సిన వాడు చాలా మందిలాగే సైడ్‌లైన్ కాబడ్డాడు. అలాంటివాడికి ఒక విగ్రహం కూడా లేకపోవడం వింతే. ఒక రాష్ట్రం కోసం ఒక వ్యక్తి జీవితాన్ని ధారపోసి కనుమరుగయ్యాడు. అలా కావాలనే కనుమరుగు చేశారని అతని మిత్రులు అంటారు. ఏమైనా ముచ్చర్ల రాష్ట్రం కోసం చేసిన కృషి చరిత్ర పుటల నుండి బయటపడక తప్పదు. మలి పోరా టంలో కనిపించీ కనబడని వాళ్ళకే అందలాలు, తాయిలాలు, అందుతున్న కాలంలో చరిత్రకే ముచ్చెమటలు పోయించిన ముచ్చర్లల చరిత్ర రేపటి అవసరం. వలపోతల మధ్య చరిత్ర మరో మహోజ్వల ఉద్యమాన్ని కలగంటున్న వేళ అది అవసరం. జయధీర్ తిరుమలరావు వ్యాసకర్త కవి, పరిశోధకులు మొబైల్: 99519 42242 (ముచ్చర్ల సత్యనారాయణ ఐదో వర్ధంతి సందర్భంగా నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంస్మరణ సభ) -
కేసీఆర్ ఎవ్వరినీ వదిలిపెట్టడు!
కమలాపూర్: ‘ఎక్కడ కూడా నేను పద్ధతి తప్పలేదు, నేనొక్కడినే కాదు.. నాలాగ మంత్రులుగా ఉన్న వాళ్లు కూడా కొందరు పద్ధతి తప్పలేదు. ఇవాళ నాకు జరిగింది.. రేపు వాళ్లకు జరిగే ఆస్కారం ఉంటది తప్ప కేసీఆర్ ఎవ్వరినీ వదిలి పెట్టడనేది మర్చిపోవద్దు. సిద్దిపేటల ఉన్న మంత్రి ఎగిరెగిరి పని చేస్తాండు. ఇవాళ నాకు జరిగినట్లు రేపు నీక్కూడా జరుగుతదని గుర్తుపెట్టుకో..’అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కొందరు మంత్రులను ఉద్దేశించి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం అంబాల, నేరెళ్ల, గూడూరు, ఖాసింపల్లి, తంగిడిపల్లి, వంగపల్లిలో మంగళవారం రెండో రోజు ప్రజాదీవెన పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా చోట్ల జరిగిన సభల్లో ఈటల మాట్లాడుతూ ‘అయినోన్ని వాకిట్ల పెట్టి కానోన్ని కంచంలో పెట్టుకున్నడు కేసీఆర్. ఎవడు కొట్లాడిండు తెలంగాణ ఉద్యమంలో.. ఎవరి మీద కేసులు ఉన్నయి, ఎవరు జైళ్లకు పోయిండ్లు, తిట్టినోడు ఎవ్వడో, కాపాడినోడు ఎవ్వడో తెల్వదా’అని అన్నారు. కాపాడినోళ్లందరినీ బయటకు పంపించారని, తిట్టినోళ్లంతా ఇవాళ మంత్రులై వెలగబెడుతున్నారని ధ్వజమెత్తారు. ‘పింఛన్లిచ్చే మంత్రివి నువ్వే కదా.. నీ చేతుల్లో ఉన్నదా పింఛన్లిచ్చే దమ్ము, అధికారం’ అని మంత్రి ఎర్రబెల్లిని ప్రశ్నించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, మూడెకరాల భూమి, ఇళ్లు ఇవ్వకుండా దళిత బంధు పేరిట రూ.10 లక్షల చొప్పున ఇస్తామంటే నమ్మశక్యంగా లేదన్నారు. ‘దళితుడిని ముఖ్యమంత్రి చేసినవా, ఉన్న ఒక్క ఉప ముఖ్యమంత్రిని నెల రోజుల్లోనే పీకేసిన చరిత్ర కేసీఆర్‌ది కాదా’అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో 17 శాతం దళిత జనాభా ఉంటే కనీసం ఇద్దరు మంత్రులుం డాలె, కానీ ఒక్కరే ఉంటడు, ఒకసారి మాల, ఇంకోసారి మాదిగ, ఇదీ దళితుల ను గౌరవించిన తీరు’ అని విమర్శించారు. ‘పోలీసోళ్లను కూడా చూస్తున్నా.. ఫొటోలు తీస్తాండ్లు, మేం నక్సలైట్లం అనుకుంటున్నారా ఏమన్నా. నౌకరీ చేయడం చేతకాకపోతే గులాబీ గులాబీ డ్రెస్ వేసుకుని కేసీఆర్ బానిసలం అని చెప్పుకోండి’ అంటూ మండిపడ్డారు. ఇలాంటి ప్రయత్నాలు ఆపాలని పోలీసు అధికారులను కోరారు. -
తెలంగాణ ఉద్యమానికి గాంధే స్ఫూర్తి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఇరవై ఏళ్ల కిందట తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మహాత్ముడి అహింసాపూరిత స్వాతంత్య్ర ఉద్యమ పంథానే స్ఫూర్తిగా నిలిచింది’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ అహింసనే ఆయుధంగా చేసుకుని ఉద్యమాన్ని ప్రారంభిం చినప్పుడు ఆయన అనుచరుల్లోని కొందరు ఉద్రేకపరులు నిరాశ చెందారని, అదే తరహాలో తెలంగాణ ఉద్యమం తీరుపై కూడా కొందరు సంశయాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. చివరకు దేశ స్వాతంత్య్ర ఉద్యమం గొప్ప విజయాన్ని సాధించి ఇప్పుడు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు కారణమైందని, అదే తరహాలో తెలంగాణ ఉద్యమం కూడా గొప్ప విజయం సాధించిందన్నారు. భారత జాతికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతత్య్ర ఉద్యమ స్ఫూర్తిని మరవకుండా మరో సారి మననం చేసుకునే గొప్ప అవకాశంగా వచ్చిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రారంభమైన ఈ ఉత్సవాలు 75 వారాలపాటు సాగుతున్నందున రాజకీయాలు, పార్టీలకతీతంగా అందరూ పాల్గొని ప్రపంచానికే ఉద్యమ పంథాను నేర్పిన మన స్వాతంత్య్రోద్యమ ఔన్నత్యాన్ని మరో సారి గుర్తుచేసుకుని ముందుకు సాగాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను సీఎం కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు కేవీ రమణాచారి ప్రారంభోపన్యాసం చేశారు. ఒగ్గుడోలు, కొమ్ముబూర కళాకారులు చివరలో సందడి చేశారు. సమావేశంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. గాంధీకి ముందు.. ఆ తరవాత.. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘మన స్వాతంత్య్ర ఉద్యమాన్ని గాంధీకి ముందు.. గాంధీ తర్వాత అని పేర్కొనచ్చు. మహాత్ముడు ఉద్యమంలో కాలుమోపక ముందే ఎంతో మంది పోరాట పంథాను ఎంచుకున్నారు. కానీ గాంధీ వచ్చి ఉద్యమానికి నేతృత్వం వహించిన తర్వాత రగిలిన స్ఫూర్తే వేరు. ఆయన ఆధ్వర్యంలో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. ఆహింసే ఆయు« దంగా సాగిన ఆ ఉద్యమంపై ప్రారంభంలో కొంత మందిలో సందేహాలు వెల్లువెత్తాయి. ఆయన అనుచరుల్లోని ఉద్రేకపరులు కూడా సందేహపడ్డారు. కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ అద్భుత ఫలితాన్ని ఆయన పంథా అందుకుంది. చివరకు ప్రపంచానికే ఆయన ఉద్యమ స్ఫూర్తి ఆదర్శవంతమైంది. అమెరికాలో మానవ హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూదర్ కింగ్‌కు కూడా ఆయన ఆదర్శంగా నిలిచారు’’అని కొనియాడారు. ఉత్సవాలకు రూ. 25 కోట్లు.. ఇప్పుడు మొదలైన ఈ వేడుకలు వచ్చే ఆగస్టు 15 నుంచి తదుపరి పంద్రాగస్టు వరకు కొనసాగుతాయి. అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధు లు, ఇతర నేతలు, ప్రజలు పార్టీలు రాజకీయాలకతీతంగా వీటిల్లో పాల్గొనాలి. ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆధ్వర్యంలో నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశాం. ఉత్సవాలకు రూ. 25 కోట్లు మం జూరు చేశాం. దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించా లని కేంద్రం నిర్ణయించింది. అదే రీతిలో రాష్ట్రంలో నిర్వహిస్తాం. నేను కూడా పలు చోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటా. జాతి స్వేచ్ఛను ప్రసాదించిన ఉద్యమ స్ఫూర్తిని మరువకుండా ఇది పునఃశ్ఛరణగా ఉపయోగపడుతుంది’’ అని సీఎం పేర్కొన్నారు. మీరు చప్పట్లు కొట్టాలి.. దేశంలో బ్రిటిష్ పాలన అంతానికి ఉప్పు సత్యాగ్రహం ఓ సంకేతమని గాంధీజీ పేర్కొనడాన్ని సీఎం కేసీఆర్ వివరించే సందర్భంలో సభికులు మౌనంగా ఉండటంతో.. అది చప్పట్లు కొట్టాల్సిన సందర్భమని సీఎం గుర్తు చేశారు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. -
ఖైదీ నంబర్ 3077 : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వరంగల్ జైలులో తాను గడిపిన రోజులకు సంబంధించిన ఓ ‘ఖైదీ గుర్తింపు కార్డు’ను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘దీక్షా దివస్ రోజున కేసీఆర్, ప్రొ. జయశంకర్ అరెస్టయ్యారు. ఆ సందర్భంలో నన్ను అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.’అని కేటీఆర్ ట్వీట్లో రాసుకొచ్చారు. గుర్తింపు కార్డులో ఉన్న వివరాల ప్రకారం.. 2009 నవంబర్ 29న హన్మకొండ పోలీసులు 447/2009 కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయగా వరంగల్ ఆరో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ రిమాండు విధించారు. వరంగల్ సెంట్రల్ జైలులో కేటీఆర్‌కు 3077 నంబరును కేటాయించారు. -
నిజామాబాద్ మాజీ ఎంపీ కన్నుమూత
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ ఉద్యమం తొలితరం నాయకుడు, నిజామాబాద్ మాజీ ఎంపీ ఎం.నారాయణరెడ్డి కన్నుమూశారు. గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. నారాయణ రెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నారాయణరెడ్డి మృతి పట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించారు. పౌర సన్మానం ఏర్పాట్లు... అంతలోనే..! ప్రముఖ తెలంగాణవాది నారాయణరెడ్డికి ఇవాళ పౌర సన్మానం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా ఆయన మరణవార్త విషాదాన్ని నింపింది. న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన నారాయణరెడ్డి 1967లో నిజామాబాద్ నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత గురించి పార్లమెంట్లో ఏకధాటిగా 45 నిముషాలు ప్రసంగించారు. 1972లో నిజామబాద్ ఎమ్మెల్యేగా సేవలందించారు. నిజామాబాద్‌లో మొట్టమొదటి మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు. 1969 నుంచి 2001 వరకు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. నారాయణరెడ్డి టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు. -
నేడు చంద్రన్న సంస్మరణ
తెలుగునేల మీద అలలు, అలలుగా ఎదిగిన అనేక ప్రజా ఉద్యమాలతో అర్ధ శతాబ్దం పైబడి నడిచిన దళిత సామాజిక ఉద్యమకారులు, నాటి ఇఫ్టూ కార్మిక నాయకులు, 2004లో నాటి ప్రభుత్వంతో విప్లవ పార్టీ తరఫున శాంతి చర్చల ప్రతినిధి, కల్లెపు చంద్రన్న అలియాస్ చర్చల చంద్రన్న అలియాస్ ఐడీపీఎల్ చంద్రన్న ఈ నెల 12న అమరులైనారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆలేరు దగ్గర టంగుటూరులో 1945 మే, 15న నిరుపేద దళిత కుటుంబంలో ముత్తమ్మ, ఎల్లయ్యలకు జన్మించిన పెద్దకొడుకు చంద్రన్న. చదువుల కోసం అష్టకష్టాలు పడి జనగామలో పదో తరగతి ముగించుకొని పొట్ట చేతపట్టు కుని సికింద్రాబాద్ చిలకలగూడలోని చింతబాయి బస్తీ చేరిండు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న కాలంలో ఈశ్వరీ బాయిగారి వెంట ఉండి ఆందోళనలో పొల్గొంటూ ఐడీపీఎల్ ఉద్యోగిగా, ప్రాగాటూల్స్, ఆల్విన్, తుంగభద్ర ఇండస్ట్రీస్, బిర్లాప్లాంట్ సహా అనేక ఫ్యాక్టరీలలో విప్లవకార్మిక నాయకుడిగా ఎదిగాడు. దేశం నలు మూలల జాతీయ కార్మిక సంఘాల సభల్లో పాల్గొని, విప్లవ పార్టీ నిర్మాణంలోకి వెళ్ళి అడ్డగుట్ట, పార్సీగుట్ట, జగద్గిర్గుట్ట బతుకమ్మకుంట, భగత్‌సింగ్ నగర్ ఒకటేమిటి మురికివాడల పేదలకోసం, అసంఘటిత కార్మికుల కోసం అనేక పోరాటాలకు ఆయన నాయకత్వం వహించి జనశక్తి పార్టీ తరఫున 2004లో శాంతి చర్చలో పాల్గొన్న చర్చల చంద్రన్నగా మనకు తెలుసు. ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో బహుజన నాయకత్వం ఎదగాలని రాజకీయ ఆచరణకు శ్రీకారం చుట్టి మాదిగ ఉప కులాల ఫ్రంట్ ఏర్పాటుచేశారు చంద్రన్న. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటు చేసి, అసంఘటిత కార్మిక సంఘాల ఫ్రంట్ నడిపి, తెలంగాణ కోసం పోరా డిన యోధులకు ఒక సంఘం ఉండా లని ‘తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల సంఘం’ నడిపిన చంద్రన్నను స్మరించుకోవడం మన బాధ్యత. సంస్మరణ సభకు జెండా మనమే, ఎజెండా మనమే. నిన్న అంతిమ యాత్రలో కదిలింది మనమే, సంస్మరణ సభలో కదం తొక్కాల్సింది మనమే. జనం కొరకు నిలబడ్డ యోధుడు ‘అన్సంగ్ హీరో’గా కాల గర్భంలో కలిసిపోవద్దు. మన యోధుల చరిత్ర మనమే ఎత్తి పట్టాలి. ఈ సంస్మరణ సభను ఇంటి పార్టీ సమన్వయం చేస్తున్నది. చంద్రన్న అందరివాడు... సభను జయప్రధం చేద్దాం. (నేటి సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కల్లెపు చంద్రన్న సంస్మరణ సభ) -పోతిరెడ్డిపల్లి రామన్న మాదిగ, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర సెక్రటరీ మొబైల్ : 90006 00744 -
సాహిత్యం ఉద్యమానికి ఊపిరైంది
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం కీలక పాత్ర పోషించిందని, వెయ్యి ప్రశ్నలకు కేవలం ఒక కవిత, పాటతో మన కవులు, కళాకారులు జవాబు ఇచ్చారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పట్టణం లో నిర్వహించిన మంజీర రచయితల సంఘం (మరసం) 32వ వార్షికోత్సవ సభకు ఆయన హాజరై మరసం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంజీరా నది ప్రవహించినట్లుగా మరసం సభ్యులు తమ కవితలు, రచనలు, కళలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. ఉద్యమంలో మరసం సభ్యులు కీలక పాత్ర పోషించి, ఉద్యమానికి ఊపిరిలూదారన్నారు. యాచించడం కాదు శాసించి తెలంగాణ సాధించుకోవాలని నాడు ప్రొఫెసర్ జయశంకర్ అన్న మాట ప్రజల్లో చొచ్చు కెళ్లిందన్నారు. రాష్ట్రాలు విడిపోతే సంక్షోభాలు వస్తాయని అంటూ ఉద్యమాన్ని నీరుగారుస్తున్న వేళలో ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న ఇద్దరు విడిపోతే భూగోళం బద్దలవుతదా అనే వాక్యంతో వెయ్యి మందికి సమాధానం చెప్పారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను అనేక మంది హేళన చేసినపుడు, నాడు సిపాయిల తిరుగుబాటు విఫలమైనప్పుడు అలాగే ఉంటే నేడు స్వతంత్ర భారత్ సిద్ధించేదా అని రాసిన కేసీఆర్ పాట ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. -
నైజామోన్ని తరిమిన గడ్డ..!
సొంతిల్లు.. సొంతూరు.. అయినా అనుక్షణం భయం.. భయం. అయినవాళ్ల మధ్యనే ఉన్నా.. ఉలికిపాటు.. గుర్రపు డెక్కల చప్పుడు వింటే గుండె దడ. రజకార్ల పొలికేక విన్పిస్తే మృత్యువు ముంచుకొచ్చినట్లే. జీవితమే రణరంగంలా మారిన తరుణంలో ఆంధ్ర మహాసభ – కమ్యూనిస్టు పార్టీ నేతృత్యంలో అయ్యా నీ భాంచన్ దొర కాల్మొక్తాన్న చేతులు బంధూకులు పట్టాయి. పలుగు, పార, కారం, రోకలి, వరిసెల, బరిసే అందిందల్లా ఆడ, మగ తేడా లేకుండా అందరికి ఆయుధాలుగా మారాయి. నైజాం రాజులను తరిమికొట్టడానికి ప్రత్యేక ఉద్యమ బలగాలు తయారయ్యాయి. నిజాం రాజులకు ఎదురుతిరిగి ముచ్చేమటలు పట్టించాయి. మహోన్నత చరిత్ర కలిగిన రైతాంగ సాయుధ పోరాటంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాది విశిష్ట స్థానం. ఇక్కడ రాజుకున్న నిప్పు.. తెలంగాణ అంతా పాకింది. నాటి వీరుల వీరోచిత పోరాటానికి తలొగ్గిన నిజాం నవాబు 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశాడు. సాయుధ పోరాటంలో.. వీర వనితలు తుపాకీ శిక్షణలో మొదటగా ఉన్న మహిళ మల్లు స్వరాజ్యం, చివరగా లలితాదేవి (ఫైల్) సూర్యాపేట : దేశచరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొని తుపాకీలు చేతపట్టి భూ మి, భూక్తి, విముక్తి కోసం పోరాడారు. అలాంటి వారిలో తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితురాలు, సూర్యాపేట ప్రాంతా నికి చెందిన మల్లు స్వరాజ్యం ఒకరు కాగా.. చకిలం లలి తాదేవి మరొకరు. ఇందులో మల్లు స్వరాజ్యం మనముందే ఉండగా చకిలం లలితాదేవి ఇటీవల కన్నుమూశారు. లలితాదేవి (ఫైల్), మల్లు స్వరాజ్యం భీంరెడ్డి అడుగుజాడల్లో.. తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామానికి చెందిన భీంరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మల కూతురు స్వరాజ్యం. సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు భీంరెడ్డి నర్సింహారెడ్డికి స్వయానా సోదరి. భీంరెడ్డి అడుగు జాడల్లోనే సాయుధ పోరాటంలో బందూకు చేతబట్టి ముందుకు సాగింది. ఆమె సోదరీమణులు శశిరేఖమ్మ, సరస్వతమ్మతో కలిసి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పోరాటంలో అనేక కష్టానష్టాలను ఎదుర్కొన్నారు. పోరాట విరమణ అనంతరం సాయుధ పోరాటంలో పాల్గొన్న మామిళ్లమడవ గ్రామానికి చెందిన మల్లు వెంకటనర్సింహారెడ్డిని వివాహమాడి కమ్యూనిస్టు పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు. 1978, 1983లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో ప్రజాసమస్యలపై తన వాణిని వినిపించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలిగా, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా అనేక ఏళ్ల పాటు పనిచేశారు. నేటికీ అలుపెరగకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏడాది నిండని బిడ్డతో పోరాటంలో పాల్గొన్న లలితాదేవి.. సూర్యాపేట తాలూకా కొత్తపల్లి గ్రామానికి చెందిన సీతారామారావు, వెంకటరామనర్సమ్మ కూతురు లలితాదేవి. లలితాదేవికి 14 ఏళ్ల వయస్సులో మోతె మండలం నామావరం గ్రామానికి చెందిన సాయుధ పోరాట యోధుడైన చకిలం తిర్మల్రావుతో వివాహం జరిగింది. 1946లో నిజాం సర్కారుకు వ్యతిరేకంగా తుపాకీపట్టి సంవత్సరం కూడా నిండని కూతురుతో సహా ఉద్యమంలో పాల్గొంది. తుపాకులు పేల్చ డంలో శిక్షణ తీసుకుని మల్లు స్వరాజ్యం, ప్రియంవద, శశిరేఖలతో అడవులకు వెళ్లారు. లలితాదేవి, తిర్ముల్రావు ఆచూకీ తెలుకునేందుకు నామవరం గ్రామంలో వారి ఇంటిపై దాడులు చేసి అత్తమామలను చిత్రహింసలకు గురి చేశారు. తొలి ఆంధ్రమహాసభలో పాలుపంచుకున్నారు. అజ్ఞాతంలో ఉండగా ఖమ్మంలో అరెస్టు చేయబడ్డారు. వరంగల్‌కు, ఔరంగాబాద్, గుల్బర్గా జైళ్లలో 3 సంవత్సరాల కూతురుతో గడిపారు. జైలు జీవితం తర్వాత పెరోల్‌పై విడుదల చేశారు. బయటికి వచ్చే సరికి భూమి, ఇలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. వీరులెందరో.. నాగార్జునసాగర్ : నిజాం నవాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రజకార్లతో పోరాడి అమరులైన వారు ఎందరో ఉన్నారు. అదేకోవకు చెందినవారు వడ్లపల్లి వీరారెడ్డి అలియాస్ వీరన్న వడ్లపల్లి రామచంద్రారెడ్డి అలియాస్ రామన్న. పోతునూరు శివారు ఏనెమీదిగూడెం (ఇప్పుడు పెద్దవూర మండలం) గ్రామానికి చెందిన నర్సమ్మ, మదార్రెడ్డి మూడో సంతానం వీరారెడ్డి 20–22సంవత్సరాల వయస్సులో ఎర్రజెండా నీడకు ఆకర్షితుడయ్యాడు. నంబాపురం అడవుల్లో గెరిళ్లా దళాలులకు భోజన అందిచేవాడు. ఈ విషయాన్ని మేడారం కరణం పసిగట్టాడు. ఈ ఘటనతో వడ్లపల్లి వీరారెడ్డి, వడ్లపల్లి రామచంద్రారెడ్డిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. ప్రతీకారంగా కొద్దిరోజులకే మేడారం కరణాన్ని దళాలు పట్టుకుని నరికి చంపాయి. ఈ ప్రాంతంలో వీరులు.. అల్వాల నరసింహారెడ్డి అల్వాల గ్రామస్తుడు ప్రస్తుతం తిరుమలగిరి(సాగర్) మండలంలో ఉంది. ఈయన జోనల్ కమాండర్ సాయుధ చర్య సందర్భంగా జనవరి 1949 తెప్పలమడుగులో మృతిచెందాడు. బీసం మట్టపల్లి వెంకటాద్రిపాలెం దళసభ్యుడు 1949లో చంపివేయబడ్డాడు. వెంకటయ్య నందికొండ. 1950 ఏప్రిల్‌లో నెల్లికల్లు (తిరుఏమలగిరి(సాగర్) మండలం)వద్ద కాల్చి చంపారు. సైదులు కుక్కడం దళసభ్యుడు 1950లో గ్రామంలో ఉండగానే కాల్చి చంపారు. నంబాపురం, కొత్తపల్లిలో మరో ఇద్దరి కాల్చి చంపారు. ఈవిధంగా ఎంతో ఆనాటి బలగాల చేతిలో అమరులయ్యారు. వడ్డెపల్లి వీరారెడ్డి ఉధృతమైన పోరాటం.. యాదగిరిగుట్ట (ఆలేరు) : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లాది ప్రముఖ స్థానం. 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభలో రావి నారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గ్రామగ్రామానికి ఆంధ్ర మహాసభ విస్తరించింది. అప్పటికే ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభలో కీలక పాత్రదారిగా మారింది. నిజాం తాబేదార్లుగా జాగీర్దార్లు, జమిందార్లు, దొరలు, దేశ్ముఖులు, భూస్వాములు విచ్చలవిడి దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నించే, ఎదురించే శక్తిలేని ప్రజలు కష్టాలను భరిస్తూ, వెట్టిచాకిరి చేస్తూ కన్నీళ్లు మింగుతున్న తరుణంలో ఆంధ్ర మహాసభ రూపంలో కమ్యూనిస్టుపార్టీ ప్రజలను సమాయత్తపర్చింది. గ్రామాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. కాచారంలో అమరవీరుల స్థూపాలు సంఘ సభ్యులపై నిజాంతొత్తులు దాడులకు గుండాలను ప్రయోగించాయి. అక్రమ కేసులు బనాయించి జైళ్ల కు పంపారు. ఇక దెబ్బకు దెబ్బ తప్పదని ఆంద్ర మహాసభ–కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయిం చాయి. ఈ నేపథ్యంలోనే 1947 సెప్టెంబర్ 11వ తేదీన ఆంధ్ర మహాసభ–కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్ధుం మోహినోద్దిన్ సాయుధ పోరుకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో తెలంగాణ ప్రజలు సమరశంఖం పూరించారు. రజాకార్లను, నిజాం బలగాలను ఎదుర్కొనడానికి సంసిద్దులైనారు. 10వేల మంది గేరిల్లా దళ సభ్యులుగా, లక్ష మందికి పైగా రక్షక దళ సభ్యులుగా చేరారు. తెలంగా ణాలోని దొరలు– భూస్వాములు, ప్రభుత్వ ఏజెంట్లు తప్ప, తెలంగాణా ప్రజలంతా ఒక్కటిగా కదిలారు. ప్రాణాలకు తెగించారు. లక్ష్యసాధనకు నడుంబిగించారు. ఊరూరా ఒక విప్లవ కేంద్రమయింది. ప్రతి వ్యక్తీ ఒక సైనికుడయ్యాడు. తెలంగాణ ఎరుపెక్కింది. ఆ సమయంలో పది లక్షల ఎకరాలు పేదలకు పంచిన కమ్యూనిస్టు పార్టీ వెయ్యి గ్రామాలకు పైగా పట్టుసాధించింది. భూస్వాములు, దొరలు గ్రామాలను వదిలి పట్టణాలకు పారిపోయారు. గుండాల మండలం సుద్దాలలో సుద్దాల హనుమంత్ స్థూపం ఎంతో మంది యోధులు... బాంచన్ దొరా.. నీ కాల్మొక్తా అన్న అమాయకులు బందూకులు చేతబట్టి నిజాం నవాబులను తరిమికొట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో జిల్లాలో ఆరుట్ల కమాలాదేవి, రాంచంద్రారెడ్డి, చింతలపురి రాంరెడ్డి, బీంరెడ్డి నర్సింహరెడ్డి, చాకలి అయిలమ్మ, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పి.చెన్నారెడ్డి, జిట్ట రాంచంద్రారెడ్డి, కట్కూరి రాంచంద్రారెడ్డి, సుశీల దేవి, సుద్దాల హనుమంతు, బొందుగుల నారాయణరెడ్డి, కుర్రారం రాంరెడ్డి, గడ్డమీ రామ య్య, బద్దం నర్సింహారెడ్డిలతో పాటు మరెందరో వీరులు పోరాటానికి దన్నుగా నిలిచారు. చివరి దశలో సెప్టెంబర్ 11, 1948లో ఈ వీరుల పోరాటానికి తలొంచిన నైజాం నవాబులు 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి కలిగించారు. పాటే ప్రాణంగా పోరాటం.. భూమి, భుక్తి విముక్తి కోసం మట్టి మనుషుల పోరాటాన్ని ఎదుర్కోవడానికి ఆనాడు పాటే ఉపిరి పోసిందని పలువురు చెబుతున్నారు. అణచివేత ఎక్కడ ఉంటుందో అక్కడే పాట పుడుతుంది అన్న మాటలకు ఆనాటి సాయుధ పోరాట యోధులు నిదర్శనమయ్యారు. ప్రజలు పాటలను తమ బలంగా ఎంచుకుని ఉద్యమించారు. గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన సుద్దాల హనుమంత్ రాసిన ‘బండేనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో పోతావు కొడకో.. నైజాం సర్కారోడా..’ అనే పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి నైజాం రాజులపై తిరుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించిందని అప్పటి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు చెబుతున్నారు. రజాకార్లకు ఎదురొడ్డిన గుండ్రాంపల్లి చిట్యాల (నకిరేకల్) : నిజాం నిరంకుశత్వ పాలన, రజాకార్ల కిరాతక చర్యలకు ఎదురొడ్డిన ఈ ప్రాంతం సాయుధ పోరాటానికి సాక్ష్యంగా నిలుస్తుంది చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం. గుండ్రాంపల్లి గ్రామం నుంచి నాటి పోరాటంలో ఎందరో యువకులు రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి అసువులు బాశారు. మరెందరో రజాకార్ల దమనకాండకు బలయ్యారు. ప్రాణాలకు తెగించి సాయుధ పోరాటంలో ఈ ప్రాంత ప్రజలు పాల్గొనడం ద్వారానే తమ లక్ష్యాన్ని సాధించారు. గుండ్రాంపల్లిలోని స్థూపం ఇత్తేహదుల్ ముసల్మాన్ సంస్థ ఏర్పాటుతో.. సాయుధ పోరాట సమయంలో సూర్యాపేట తాలుకాలోని వర్థమానకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ అనే వ్వక్తి తన అక్క నివాసముంటున్న గుండ్రాంపల్లి గ్రామానికి తన కుటుంబసభ్యులతో వలస వచ్చాడు. ఆనంతరం బతుకుదెరువుకు గాను ఏపూరు గ్రామంలోని ఒక భూస్వామి వద్ద పనిలో చేరాడు. ఆనంతరం ఆతను రజాకార్ల బృందంలో చేరాడు. ఇక ఆ తరువాత మక్బూల్ అరాచకాలకు ఈ ప్రాంతంలో అంతేలేకుండా పోయింది. మక్బూల్ అరాచాకాలకు వ్వతిరేకంగా.. గుండ్రాంపల్లి కేంద్రంగానే నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధులు తమ పోరాటాన్ని కొనసాగించేవారు. ఈ పోరాటాంలో ఏపూర్, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు దళాలుగా ఏర్పాడ్డారు. వీరు రజాకార్లకు ఎదురొడ్డి దాడులు చేసేవారు. దీనిని సహించని మక్బూల్ తిరుగుబాటుదారులపై దాడులు చేశాడు. ఒకసారి ఆతని దాడిలో దొరికిన 30 మంది యువకులను గుండ్రాంపల్లిలో బంధించాడు. వీరందరిని ఎడ్ల బండికి కట్టిపడేసి గుండ్రాంపల్లి నడిబోడ్డున గల (నేడు ఏపూరు గ్రామానికి వెళ్లే దారిలోని కూడలి) బావిలో పడేసి సజీవ దహనం చేశాడు. ఈ సంఘటనతో సాయుధ పోరాటంలో పాల్గొంటున్న వారు తమ పోరాటాలను ఉధృతం చేశారు. పలివేలకు చెందిన కొండవీటి గురున్నాథరెడ్డి నాయకత్వంలో మక్బూల్‌పై ఒకేసారి దళాలు దాడి చేసేందుకు ప్రణాళికను రూపొందించాయి. దీనిని గ్రహించి ఈ దాడి నుంచి మక్బూల్ తప్పించుకున్నాడు. దీంతో దళాల్లో పాల్గొన్న యువకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. మరోసారి వీరు జరిపిన దాడిలో మక్బూల్ చేయి విరిగినప్పుటికీ ప్రాణాలతో తప్పింకుని పారిపోయాడు. కానీ అతని భార్య, కూతురు ప్రాణాలను కోల్పోయారు. అనంతరం మక్బూల్‌కు సహకరించిన వారి ఇండ్లపై దాడి చేసి వారిని చంపివేశారు. అమరవీరుల స్థూపం ఏర్పాటు.. నాటి పోరాటంలో 30 మందిని బావిలో పడేసిన చోట 1992 జూన్ 4వ తేదీని సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించి ఆవిష్కరించారు. ఇటీవల హైవే విస్తరణలో స్తూపాన్ని తొలగించగా.. మరోచోట నిర్మించారు.ఈ స్థూపం వద్దనే ఏటా నివాళులర్పించడం ఆనవాయితీ. రావులపెంట కేంద్రంగా సాయుధ పోరాటం మిర్యాలగూడ : నిజాం నవాబులను ఎదిరించడానికి వేములపల్లి మండలంలోని రావులపెంట కేంద్రంగా సాయుధ రైతాంగ పోరాటం సాగింది. రావులపెంటతో పాటు సమీప గ్రామాల ప్రజలంతా సాయుధ పోరాటంలో భాగస్వాములయ్యారు. నాడు నిజాం నవాబు తోపుచర్ల పిర్కాలోని గ్రామాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతుండగా జనం తిరగబడటంతో రావులపెంటలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. వేములపల్లి మండలంలో ప్రధానంగా అమనగల్లు, పాములపాడు, రావులపెంటలో క్యాంపులు నిర్వహించడంతో పాటు రావులపెంటను కేంద్రంగా చేసుకొని నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. రావులపెంటలో భూస్వామ్య కుటుంబంలో పుట్టిన చల్లా సీతారాంరెడ్డి నిజాం నవాబులను ఎదిరించేందుకు ఎన్నో క్యాంపులు నిర్వహించి వారి స్థావరాలపై దాడులు చేశారు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపుల్లో ఎంతో మంది తలదాచుకున్నారు. రావులపెంటలో ఆనాటి కోట బురుజు నిజాం పోలీసులు రావులపెంట, ఆగామోత్కూర్, తడకమళ్ల గ్రామాలలో చొరబడి ప్రజలపై దాడులు చేశారు. కానీ 1939లో ఉపాద్యాయుడిగా ఉద్యోగం పొందిన చల్లా సీతారాంరెడ్డి పాఠశాలల్లో ఉద్యమాలు బోధించడంతో పాటు 1946 కమ్యూనిస్టులతో ఉన్న సంబంధాల వల్ల ఉద్యోగాన్ని వదులుకొని సాయుధ పోరాటంలోకి వెళ్లారు. రావులపెంటల కేంద్రంగా చల్లా సీతారాంరెడ్డితో పాటు నారబోయిన నర్సయ్య, గట్టికొప్పుల రాంరెడ్డితో కలిసి మొదటి సారిగా రావులపెంటలో సభ నిర్వహించారు. అనంతరం ధరణికోట సుబ్బయ్య, గుంటి వెంకటనర్సయ్య, అవిరెండ్ల ఎల్లయ్య, జిన్నె పెద్ద సత్తిరెడ్డి, చిన్న సత్తిరెడ్డి, రామనర్సయ్య, దొంతిరెడ్డి వెంట్రామ్‌రెడ్డి, దొంతిరెడ్డి చెన్నారెడ్డి, పోలగోని గోపయ్య, అవిరెండ్ల రామచంద్రయ్యలతో కలిసి ఉద్యమ రూపకల్పన చేశారు. పాములపాడు, అమనగల్లు గ్రామాల్లో కూడా బహిరంగసభలు నిర్వహించారు. చల్లా సీతారాంరెడ్డిని పట్టకోవడానికి ఒకరోజు నిజాం పోలీసులు రావులపెంటలో మాటు వేశారు. కానీ ఆ గ్రామ ప్రజలంతా కలిసి నిజాంకు వ్యతిరేకంగా ఒక్కసారిగా వారి స్థావరంపై దాడి చేయడంతో పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు. దళాలకు కొరియర్‌గా పనిచేశా నల్లగొండ టౌన్ : నా 14ఏళ్ల వయస్సులో దళాలకు కొరియర్‌గా పనిచేశా. రాజాకార్లు, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న సాయుధ పోరాటంలో ఈదులూరు అంజయ్య, పాదూరి జానపరెడ్డి దళాలకు కొరియర్‌గా పనిచేశా. ఆ సమయంలో నేను చిన్నవాడిని కావడంతో పాటు మానాన్నగారు సీతారామయ్య పేరొందిన బ్రాహ్మణుడు కావడంతో నాపై ఎలాంటి అనుమానం వచ్చేది కాదు. సీతారామయ్య కొడుకుగా ఎలాంటి అనుమానం రాకుండా దళాలకు కొరియర్‌గా సమాచారాన్ని అందించే వాన్ని. 1947 స్వాతంత్య్రం వచ్చిన తరువాత సైన్యం గ్రామాలపై దాడులు చేస్తూ దళాలను ఏరివేసే పనిలో పడింది. కట్టంగూరు మండలం కల్మె ర గ్రామంలో సమీపంలోని తెల్లకుం ట వద్ద గుర్రాలపై వచ్చిన సైన్యం పాదూరి జానపరెడ్డి దళం పొలాల వద్ద పడుకున్న వారిపై దాడులు చేసి కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో పొలం నుంచి పరిగెడుతున్న పాదూరి జానపరెడ్డిపై సైన్యం విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. దీంతో ఆయన అక్కడే ప్రాణాలు వదిలారు. మా ఇల్లు ఊరి బయట ఉండడం వల్ల పిట్టగోడ పైనుంచి సైన్యం జరిపిన కాల్పులను స్వయంగా చూశాను. ఆ కాల్పుల్లో పాదూరి జానపరెడ్డి మరణాన్ని చూసిన నేను ఇప్పటికీ మరవలేకపోతున్నా. పెన్నా అనంతరామశర్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధులు విముక్తి కోసం పోరాటం.. హాలియా (నాగార్జునసాగర్) : రజాకార్ల కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజల కు విముక్తి కలిగించేందుకు త్యాగాలు చేశా రు.. లాఠీ దెబ్బలు తిన్నారు.. జైళ్లల్లో మగ్గా రు.. ఆలిబిడ్డలకు దూరంగా అడవుల్లో ఉంటూ తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచారు.. త్రిపురారం మండలంలోని కామారెడ్డిగూడెం, త్రిపురారం గ్రామాలకు చెందిన టంగుటూరి సత్యం, జొన్నలగడ్డ చల్మారెడ్డి, జొన్నలగడ్డ కోదండరామిరెడ్డి, కుందేటి సైదులు. నిజాం నవాబులు, దొరలు ప్రజలపై దారుణాలకు పాల్పడుతుంటే తట్టుకోలేక వారి ఆగడాలకు అడ్డువేశారు. నేడు వారు మన నుంచి శాశ్వతంగా దూరమైనా వారు చేసిన పోరాట ఫలితంతో ప్రజలకు విముక్తి లభించింది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడా.. నకిరేకల్ : నిజాం పాలనకు వ్యతిరేంగా పోరాడాను. నా 18వ ఏట సూర్యాపేట ప్రాంతంలో బాలెంలలో మా బంధువులు ఉంటే అక్కడికి వెళ్లాను. ఆనాడు బాలెంల ప్రజలు నిజాం ప్రభుత్వ లేవీ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రజలు పడుతున్న బాధలు చూసి చలించి పోయినాను. రైతులంతా ఏకమై వారిని తరమారు. ఆ సమంలో బాలెంలకు చెందిన ఇద్దరు రైతులు అసువులు బాశారు. అక్కడి ప్రజలు, రైతుల ఆవేదన చూసి నిజాం వ్యతిరేకం పోరాటంలోకి దిగాను. ఆ సయమంలో మూసీ నది కేంద్రంగా సాయుధ పోరాట యోధులకు గెరిల్లా శిక్షణ ఇచ్చారు. అక్కడ కర్రసాము, కత్తిసాము, తూపాకి పేల్చడం వంటి శిక్షణలు పొందాను. నా చిన్నతనం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నా. నేను మునగాల పరగణాకు చేరుకుని రేపాల గ్రామంలో కోదాటి నారాయణరావు దళం బార్డర్ క్యాంప్ ఏర్పాటు చేసి రజాకారుల ఆగడాలను అరికట్టాడానికి కృషి చేశారు. దానిలో భాగంగా రామసముద్రం గ్రామంలో ఎనిమిది నెలలు ఉండి ఈ క్యాంప్‌కు వెళ్లి శ్రీరెడ్డి పెదవెంకట్‌రెడ్డి దళంలో పనిచేశాను. ఆ సమయంలో ఇటుకులపహాడ్‌లో మా ఇంటిని రజాకారులు తగులబెట్టారు. పాలవరపు లక్ష్మీనర్సయ్య, సాయుధ పోరాట యోధుడు, నకిరేకల్ 16 నెలలు జైలు జీవితం గడిపిన దొడ్డా.. చిలుకూరు (కోదాడ) : తెలంగాణ సాయుధ పోరాటంలో పటేల్, పట్వారీల దోపిడీని అడ్డుకోవడంలో కీలక భూమిక పోషించారు చిలుకూరు గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు దొడ్డా నారాయణరావు. ఉద్యమంలో భాగంగా 16 నెలల జైలు జీవితం గడపడంతో పాటు, దాదాపుగా మూడేళ్ల పాటు అడవిలో రహస్య జీవితం గడిపి తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. చిలుకూరు గ్రామానికి చెందిన దొడ్డా అప్పయ్య, వెంకమ్మకు ఏడుగురు మగ సంతానం. వారిలో ఆరోవాడు దొడ్డా నారాయణరావు. ఈయన నాలుగో తరగతి వర కు చదువుకున్నాడు. నారాయణరావు అన్న హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య. దొడ్డా ఉద్యమంలోకి రావడానికే అన్నే స్ఫూర్తితో సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. దళాలకు కొరియర్‌గా పని చేశారు. 1948లో చిలుకూరులో ఐదుగురు సభ్యులతో కమ్యూనిస్టు పార్టీ సెల్ ఏర్పాటు చేసి నారాయణరావును కార్యదర్శిగా నియమించారు. అనంతరం 1959లో చిలుకూరు పథమ సర్పంచ్‌గా దొడ్డా నారాయణరావు ఎన్నికయ్యాడు. దొడ్డా నారాయణరావు బేతవోలు గడి కూల్చివేత.. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా అనాడు సూర్యాపేట తాలుకాలో ఉన్న బేతవోలు పరగణాలో బేతవోలు జమీందారు తడకమళ్ల సీతరామాచందర్రావు కోటను తన అన్న దొడ్డా నర్సయ్య నాయకత్వంలో ఆరు వేల మందితో గడ్డపారాలతో పొడిచి తగుల బెట్టారు. నాలుగు రోజుల్లో కోటను కూల్చివేశారు. దొరకు చెందిన 1100 ఎకరాల భూమిని దొరల భూమిని, ఆస్తులను రైతులు స్వాధీనం చేసుకున్నారు. -
నిరంకుశత్వం తలవంచిన వేళ
సాక్షి, కరీంనగర్ : కరడుగట్టిన నిజాం, వీర తెలంగాణ దిశను, దశను మార్చేందుకు సంకల్పించిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ముందు మోకరిల్లిన రోజు. వందల ఏళ్ల బానిసత్వపు సంకెళ్లనుంచి బాంచన్ కాల్మొక్త బతుకులకు స్వేచ్ఛ దొరికిన రోజు. దక్కన్ పీఠభూమిలోని ప్రజలందరూ సంబరాలు జరుపుకున్న రోజు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత, తాడిత ప్రజల విముక్తి కోసం దశాబ్దాలుగా సాగించిన పోరాటానికి ఫలితం లభించిన రోజు. స్వతంత్ర భారతంలో హైదరాబాద్ సంస్థానం కలిసిపోయిన రోజు. అదే సెప్టెంబర్ 17. నాటి తెలంగాణ భౌగోళిక స్వరూపం దేశంలోని అన్ని సంస్థానాల్లో కెల్లా హైదరాబాద్ ఎస్టేట్ పెద్దది. తెలుగు మాట్లాడే ప్రజలు సుమారు 90 లక్షలతో ఎనిమిది జిల్లాలు, మహారాష్ట్రలోని 5 జిల్లాల్లో 45లక్షల జనాభా, కర్నాటకలోని మూడు జిల్లాల్లో 20లక్షల జనాభాతో కలిపి 8 జిల్లాలు. కోటి 70 లక్షల జనాభా. 83 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించింది. భూమి స్వరూపం.. సంస్థానంలో 60శాతం ప్రాంతాన్ని ఖాల్సా (నేరుగా నిజాం ఆధీనంలో ఉండేది. సారవంతమైన భూములన్నింటిని స్వంత ఆస్తిగా ప్రకటించుకున్నాడు. 30 శాతం గైర్ ఖాల్సా, దీన్ని జాగీర్లు, మఖ్తాలు, బంజరుదార్లు, ఈనాందార్లు, అగ్రహారాల పేర్లు పెట్టి దోపిడీ ప్రభువులకు అప్పగించారు. 10 శాతం సర్ఫేఖాస్ ప్రాంతం. ఇది పూర్తిగా నిజాం ప్రభువు జాగీర్. ఇపుడున్న హైదరాబాద్ (అత్రఫ్ అల్దా) మొత్తం నిజాం సొంత ఖర్చుల కోసం ఉద్దేశించింది. అప్పట్లోనే ఏటా రెండు కోట్లు ఆదాయం లభించేది. దీనికి తోడు ఖజానా నుంచి మరో 70 లక్షలు ఇస్తుండేవారు. ఆపరేషన్ పోలో.. దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే హైదరాబాద్ ఎస్టేట్‌లో రజాకార్ల దురాగతాలు కొనసాగుతున్నాయి. ప్రజల్లో ఆందోళనలు పెరిగాయి. విద్యార్థులు, రైతులు, నిజాంపై తిరగబడ్డారు. సంస్కృతి, సంప్రదాయాలు, వేషభాషల విధ్వంసంపై రజాకర్లపై ధిక్కార స్వరం వినిపించారు. తెలంగాణ పరిస్థితి చూసిన జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మేజర్ జనరల్ జేఎన్ చౌదరి సారథ్యంలో ఆపరేషన్ పోలోకి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 13న భారత సైన్యం దక్కన్ పీఠభూమిని ఆక్రమించుకుంది. విజయవాడ నుంచి ఒకటి, బీదర్ దిశగా మరో దళం హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. మూడురోజులు ఎదురించే ప్రయత్నాలు చేసి చివరికి రజాకర్ల సైన్యం చేతులెత్తేసింది. నిజాం వ్యతిరేక పోరాటంలో సామాన్యులు(ఫైల్) ఓటమి అంగీకరిస్తూ దిక్కుతోచని పరిస్థితిలో నిజాం 17వ తేదీన పటేల్ ముందు తల వంచాడు. బేగంపేట విమానాశ్రయంలో పటేల్‌కు స్వాగతం పలికి సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో చేర్చేందుకు అంగీకరించాడు. దీంతో భారత రిపబ్లిక్లో తెలంగాణ కలిసిపోయింది. ఆ క్షణం నుంచి జేఎన్ చౌదరి నేతృత్వంలో సైనిక గవర్నర్‌గా, ఎంకే వెల్గొడి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. నిజాం తన ప్రధాని లాయక్ అలీని పదవినుంచి తొలగించాడు. ప్రజలకు నరకయాతను చూపించిన ఖాసిం రజ్వీని అరెస్టు చేశారు. పూణె జైలుకు తరలించారు. అక్కడినుంచి విడుదలై పాకిస్తాన్‌కు వెళ్లాడు. 1948 నుంచి 1951 వరకు సాయుధ పోరాటం జరిగింది. 1952లో జరిగిన సాధారణ ఎన్నికలతో తిరిగి ప్రజాస్వామ్యం అవతరించింది. ఎదురుతిరిగిన ఎల్లప్ప కోరుట్ల: భారత్ చేపట్టిన ఆపరేషన్ పోలోను ప్రతిఘటించేందుకు ఖాసీం రజ్వీ దళాలు కొత్తగా సైనికులను నియమించే క్రమంలో 1947 ఆగస్టు నెలలోనే కోరుట్ల వాగుకు అవతల వైపు సంగెం గ్రామ శివారులో మకాం వేశాయి. ఒక్క రోజు గడిస్తే రజ్వీ దళాలు కోరుట్లలోకి చొరబడి ఆరాచకాలు పాల్పడే అవకాశాలున్నాయన్న సమాచారం అందుకున్న కస్తూరి ఎల్లప్ప ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చక్కని పథకం వేశారని ఆయన సహచరులు వేముల విశ్వనాథం చెప్పుకొచ్చారు. ఎల్లప్ప తన సహాచరులతో కలిసి సుమారు 20 మందిని పోగు చేసుకుని రాత్రి వేళ చీకట్లో కోరుట్ల వాగు సమీపంలో బొంగు కట్టెలకు నూలు బట్టలను చుట్టి నూనేలో ముంచి కాగడాలు చేతపట్టుకుని పెద్ద ఎత్తున భారత మాతాకు జై అన్న నినాదాలు చేస్తూ భారత సైన్యం కోరుట్లకు చేరుకుందన్న సమాచారం ఖాసీం రజ్వీ దళాలకు చేరేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో రజ్వీ దళాలు భయంతో అక్కడి నుంచి పరారైపోయినట్లు విశ్వనాథం తెలిపారు. కస్తూరి ఎల్లప్ప(ఫైల్), వేముల విశ్వనాథం బీడీ కార్మిక కుటుంబం కోరుట్లకు చెందిన బీడీ కార్మిక కుటుంబంలో 1905లో కస్తూరి ఎల్లప్ప జన్మించారు. తల్లిదండ్రులు పుణేకు వలస వెళ్లడంతో యుక్త వయసు వరకు అక్కడే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు ఆకర్షితులైన ఎల్లప్ప కోరుట్లలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిర్వహించేవారు. 1947లో కోరుట్లలో భారత జాతీయ జెండాను ఆలయంపై ఎగురవేయడం..ఖాసీం రజ్వీ సేనలను బెదరగొట్టడం వంటి చర్యలు చేపట్టారు. ఎల్లప్ప 1991లో తుదిశ్వాస విడిచి చిరస్మరణీయుడిగా మిగిలారు. పెద్దపల్లిలో నిజాం ఏజెంట్ల పెద్దరికం.. పెద్దపల్లి: పెద్దపల్లి జాగీరి కింద ఆదిలాబాద్ జిల్లా నస్పూరు, తపాలాపూర్ ప్రాంతాలు విస్తరించి ఉండేవి. ఆయా ప్రాంతాలకు దేశ్‌ముఖ్‌లు పెద్దరికం చలాయిస్తూ పేదల నుంచి వసూలు చేసే పన్నులు నిజాంకు కట్టేవారు. నిజాం ఏజెంట్ల దౌర్జన్యాన్ని ఎదురించేందుకు పెద్దపల్లి ప్రాంతంలోని గట్టెపల్లి మురళీ నాయకత్వంలో సాదుల నంబయ్య, లొట్ల ముత్తయ్య, మద్దిరాల పురుషోత్తం తదితరులు పన్ను వసూలుకు వచ్చే నిజాం పోలీసులపై తిరుగుబాటు చేశారు. మంథనికి చెందిన గుల్లకోట శ్రీరాములు దళాన్ని ఏర్పాటు చేసి సిరివంచ పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిపారు. నిజాయితీగా ఉద్యోగం చేస్తే బదిలీ.. కరీంనగర్ కలెక్టర్ కింద నా భర్త రాంచందర్‌రావు పేష్కార్గా పని చేశారు. ప్రజల నుంచి పన్నులు బలవంతంగా వసూలు చేయరాదని అన్నందుకు నాగపూర్ దగ్గరలోని షరీశ్రాపూర్కు బదిలీ చేశారు. అక్కడి నుంచి మళ్లీ మహబూబ్‌నగర్ అన్నసాగర్‌కు బదిలీ చేశారు. నిజాం పాలనలోని కలెక్టర్లు సైతం దుర్మార్గంగా వ్యవహరించేవారు. పోలీసుల ఆకృత్యాలైతే చెప్పతరం కాదు. నిజాం పోలీసులు గ్రామాలకు వస్తే గజగజ వణికిపోయే వాళ్లం. – లక్ష్మీకాంతమ్మ, 98 ఏళ్లు, పెద్దపల్లి చదువు పక్కనబెట్టి.. పోరాటబాట పట్టి.. మంథని: ‘అమ్మానాన్నకు ఒక్కగా నొక్క కుమారున్ని. మూడేళ్ల వయస్సులో అమ్మ చనిపోయింది. నాన్నే అన్ని తానై అల్లారుముద్దుగా పెంచాడు. పెద్దవాన్ని చేశారు. చదువు పక్కనబెట్టి నిజాంపై పోరాటం చేస్తుంటే ఓ రోజు నాన్న నన్ను కలిశాడు. ఉద్యమం వదిలిపెట్టు నీకు ఎన్ని డబ్బులైనా ఇస్తా. ఎక్కడికైనా వెళ్లు, జల్సాగా బతుకు అని బతిమిలాడాడు. ఓక్క కొడుకువి ఉద్యమంలో చనిపోతే నేను ఎట్లా బతకాలని వేడుకున్నాడు. కాని అప్పుడు నా మనస్సులో ఓకటే లక్ష్యం ఉండే. నేను ఉద్యమంలో చనిపోతే దేశంలోని ప్రతి ఓక్కరిని కన్నకొడుకులా భావించు అని అక్కడి నుంచి వెళ్లిపోయా. మా నాన్నను ఆ మాటలు ఎంతో బాధ పెట్టాయని తర్వాత తెలుసుకొని మదనపడ్డ’ అని సమరయోధుడు రాంపెల్లి కిష్టయ్య అన్నారు. చాందా క్యాంపు శిక్షణలో స్వాతంత్య్ర సమరయోధులు(ఫైల్) ప్రస్తుతం ఆయనకు 92 ఏళ్లు. హైదరాబాద్‌లోని తన కూతురు ఇంట్లో ఉంటున్నారు. ఇండియన్ యూనియన్‌లో హైదరా బాద్‌ను చేర్చాలని సాగిన పోరాట పటిమ, సాధించిన విజ యాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. 1947లో భారతదేశంలోని 600 రాష్ట్రాలకు స్వాతంత్య్రం లభించినా హైదరా బాద్‌ను ఏడవ నిజాం ఉ స్మాన్ అలీఖాన్ బహుదుర్ వదిలి వె ళ్లకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయామని తెలిపారు. మధ్యప్రదేశ్ (ప్రస్తుత మహారాష్ట్ర)లోని చందాలో మంథనికి చెం దిన గులుకోట శ్రీరాములు ఆధ్వర్యంలో ఉద్యమ శిక్షణ పొ ందినట్లు వెల్లడించారు. ఇండియన్ యూనియన్ ఆధ్వర్యం లో గెరిల్లా శిక్షణ పొంది పోలీస్స్టేషన్లు, నాకాలపై దాడులకు శ్రీకారం చుట్టామని, రోజుల తరబడి దట్టమైన అడవుల్లో తలదాచుకునే వాళ్లమని, ఎన్నో రోజులు అన్నం తినకుండా గడిపినట్లు వివరించారు. అయితే ఉద్యమం తీవ్రం కావడంతో ఇండియన్ యూనియన్ పోలీస్ యాక్షన్‌ను రంగంలోకి దింపడంతో స్వేచ్ఛ లభించినట్లు పేర్కొన్నారు. రాంపెల్లి కిష్టయ్య త్యాగధనుల పురిటి గడ్డ.. కరీంనగర్: ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసిన కరీంనగర్ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటంలోనూ కీలక భూమిక పోషించింది. జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరులో అమరులయ్యారు. సి.నారాయణరెడ్డి , కొండల్రావు, దేశిని చినమల్లయ్య, అనభేరి ప్రభాకర్‌రావు రణభేరి మోగించిన ‘అనభేరి’ జమీందారి కుటుంబంలో పుట్టిన అనభేరి ప్రభాకర్‌రావు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి దళ నాయకుడిగా తుపాకి పట్టి పేదప్రజలకు బాసటగా నిలిచి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలను ఫణంగా పెట్టిన యోధుడు. రజకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా దళాన్ని ఏర్పాటు చేసి నిజాం గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక మిలటరీ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 1948 మార్చి 14న ప్రభాకర్ సాయుధ దళాన్ని హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ పోలీస్ పటేల్ భోజనానికి పిలిచి అ సమాచారాన్ని నిజాం ప్రభుత్వానికి తేలియజేశారు. దీంతో మహ్మదాపూర్ గు ట్టలను మిలటరీ, రజకార్లు చుట్టుముట్టి కాల్పులు జరి పారు. తూటాలకు ఎదురొడ్డి పోరాడి అనభేరితో పాటు సిం గిరెడ్డి భూపతిరెడ్డి, ముస్కు చొక్కారెడ్డి, ఏలేటి మల్లారెడ్డి, అ యిరెడ్డి భూంరెడ్డి, తూమేజు నారాయణ, బి.దామోదర్‌రెడ్డి, ఇల్లందుల పాపయ్య, పోరెడ్డి రాంరెడ్డి, నల్గొండ రాజరాం, చిక్కుడు సాయిలు, రోండ్ల మాధవరెడ్డి అమరులయ్యారు. కొరియర్‌గా చినమల్లయ్య.. తెలంగాణ సాయుధ పోరాటంలో కొరియర్‌గా పాల్గొన్న దేశిని చినమల్లయ్య మలి విడత తెలంగాణ ఉద్యమంలో నూ క్రియాశీలంగా వ్యవహరించారు. 1948 ఫిబ్రవరిలో అ నభేరి ప్రభాకరరావును కలువగా ఆయన దళానికి కొరియర్‌గా పని చేయాలని చెప్పి కొన్ని గ్రామాల బాధ్యతలు ఇ చ్చారు. ఆయా గ్రామాల్లో తిరిగి వివరాలు సేకరించి, ద ళానికి చేరవేసేవారు. నాలుగు సార్లు సర్పంచ్‌గా, ఎమ్మెల్యే గా, ఒకసారి సమితి ప్రెసిడెంట్‌గా పదవులు చేపట్టారు. విద్యార్థిగా దశలోనే.. విద్యార్థి దశలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారు జువ్వాడి గౌతంరావు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని కరీంనగర్, వరంగల్ జైళ్లలో శిక్ష అనుభవించారు. 1947లో ఔరంగాబాద్ జైల్ నుంచి తప్పించుకొని వచ్చి మళ్లీ ఉద్యమంలో పాల్గొన్నారు. బద్దం ఎల్లారెడ్డి లాంటి ఎందరో వీరుల మార్గదర్శకత్వంలో పనిచేశారు. జువ్వాడి గౌతంరావు ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్క నూర్‌కు చెందిన బోజ్జపురి వెంకటయ్య స్వాతంత్య్ర ఉద్యమాలకు ఆకర్షితులై ఉద్యోగం వదిలి, పోల్సాని నర్సింగరావుతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో భాగంగా రాయికల్ పోలీసు స్టేషన్‌పై దాడి సంఘటనలో పాల్గొన్నారు. ముల్కనూర్ సర్పంచ్‌గా సేవలందించారు. అక్షరాలే ఆయుధాలుగా.. వేములవాడ తాలూకా పరిధిలో హనుమాజీపేట గ్రామానికి చెందిన సి. నారాయణరెడ్డి చిన్న వయసులోనే ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం నిరంకుశ విధానాల వల్ల తప్పని సరై ఉర్దూ మాధ్యమంలో విద్యాభ్యాసం గావించారు. నిరంకుశ పాలన విధానాలకు, రజాకార్లు సాగించిన హింసాకాండలకు వ్యతిరేకంగా స్వయంగా జానపదగేయాలు రాసి, ఆలపించి, ప్రజా చైతన్యానికి సాహిత్యాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. కొరియర్‌గా కొండల్రావు.. వెలిచాల కొండల్రావు హైదరాబాద్‌లో చదువుకుంటూనే విద్యార్థి కార్యకర్తగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 15 ఏళ్ల వయసులో కోర్టు విచారణలో మెజిస్ట్రేట్‌కే ఎదురు తిరిగినందుకు 7 రోజుఏల జైలు శిక్ష గడపాల్సివచ్చింది. చంచల్‌గూడ జైలులో గడిపిన జీవితం తర్వాత హాస్టల్లో చదువుకుంటూ కాంగ్రెస్ పార్టీలో సోషలిస్టు వర్గానికి మద్దతునిచ్చేవారు. నాయకులకు కోరియర్‌గా పని చేశారు. పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ధీశాలి.. మహదేవ్పూర్కు చెందిన ఎస్.శంకరయ్య భద్రాచలంలో ప్రైవేట్ గుమాస్తాగా పని చేస్తూ 1947లో ఉద్యమానికి ఆకర్షితుడయ్యారు. ఖమ్మం నుంచి వచ్చిన వెంకటేశ్వర్రావుతో కలిసి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు అప్పట్లో ఎస్ఐ గురుదయాళ్‌సింగ్ వీరిని అరెస్ట్ చేశారు. మంథని వీధుల్లో లాఠీ దెబ్బలు కొడుతూ ఊరేగించారు. అనంతరం తప్పించుకుని చాందా క్యాంపులో చేరిపోయారు. ఆపైన మహదేవ్పూర్ పోలీస్‌స్టేషన్‌గా భావించి కాళేశ్వరం ఔట్‌పోస్ట్‌పై దాడి చేశారు. పోరాటాల గడ్డ.. సిరిసిల్ల సిరిసిల్ల: తెలంగాణ విముక్తి ఉద్యమం చురుగ్గా సాగుతున్న దశలో 1935 డిసెంబర్లో సిరిసిల్లలో నాల్గో ఆంధ్ర మహాసభ మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో తీసుకున్న కీలక నిర్ణయాలతో విముక్తి పోరాటం ఉవ్వెత్తున ఎగి సింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బద్దం ఎల్లారెడ్డి, అమృత్‌లాల్‌శుక్లా, చెన్నమనేని రాజేశ్వర్‌రావు, దామోదర్‌రావు, తిరుపతిరెడ్డి, భూపతిరెడ్డి, రాజారాం లాంటి ఎందరో యోధులు అజ్ఞాతవాసంతో చారిత్రాత్మక పోరాటాన్ని సాగించారు. సిరిసిల్లలో జరిగిన ఆంధ్రామహాసభలో సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బూరుగుల రామకృష్ణారావు, పి.వి.నర్సింహరావు, బద్దం ఎల్లారెడ్డి, కె.వి.రంగారెడ్డి లాంటి వారితో జిల్లాలోని పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి తెలంగాణ విముక్తి ఉద్యమంలో ప్రధానంగా ముందున్నారు. గెరిల్లా దళాలకు మానాల క్యాంపులో శిక్షణ ఇస్తూ.. పోరాటానికి బాటలు వేశారు. రుద్రంగి శివారులోని మానాల శిక్షణ శిబిరం సాయుధ పోరాటానికి ఊపిరి పోసింది. ఇక్కడ శిక్షణ పొందిన తెలంగాణ యోధులు రజాకార్లను ఉరికించారు. త్రివర్ణపతాకం ఎగురవేయడమే నేరమైనట్లుగా ఖాసీంరజ్వీ రెచ్చిపోతే.. ఆయన ప్రైవేటు సైన్యమైన రజాకార్ల అకృత్యాపై పేదోళ్లు తిరుగుబాటు చేశారు. బద్దం ఎల్లారెడ్డి(ఫైల్), అమృత్లాల్ శుక్లా (ఫైల్), రాజేశ్వరరావు(ఫైల్) సాయుధపోరుకు శ్రీకారం.. 1948 మార్చి 12న ఇల్లంతకుంట పోలీసు క్యాంపుపై సాయుధ ఉద్యమకారులు దాడి చేసి ఎస్సైతో సహా ఆరుగురు పోలీసులను హతమార్చారు. ఈ ఘటనలో అప్పటి సాయుధ దళనేత అనభేరి ప్రభాకర్‌రావు దళం పాల్గొంది. ఈ దాడితో గెరిల్లా తరహాదాడులకు తెలంగాణ ఉద్యమకారులు తెగించి తెగువను చాటుకున్నారు. మరసటి రోజే అప్పటి ఉద్యమనేత అనభేరి ప్రభాకర్‌రావు దళం 1948 మార్చి 14న హుస్నాబాద్ మండలం మహ్మదాపురం గుట్టల వద్ద ఆశ్రయం పొందగా.. పోలీసులు దాడి చేశారు. పరస్పరం కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. దీంతో విచక్షణ కోల్పోయిన పోలీసులు అనభేరి ప్రభాకర్‌రావుతో సహా.. సిరిసిల్ల మండలం లక్ష్మీపూర్‌కు చెం దిన సింగిరెడ్డి భూపతిరెడ్డి, దామోదర్‌రెడ్డి, నారాయణ, భూం రెడ్డి, పాపయ్య, మల్లారెడ్డిలను కాల్చి చంపారు. ఈ ఘటన తెలంగాణ సాయుధ పోరాటంలో రక్తచరిత్రగా మిగిలింది. అమృత్లాల్... నిజాంను ఎదిరించిన వారిలో సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అమృత్లాల్ శుక్లా ప్రముఖుడు. 1950లో సిరిసిల్ల పోలీస్‌స్టేష న్పై దాడి చేసి సంచలనం సృష్టించిన వీరుడు. శుక్లాను నిజాం పోలీసులు నిర్బంధించి 13 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. చంచల్‌గూడ జైలు నుంచి తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తప్పించుకున్నాడు. 1957లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 85 ఏళ్ల వయస్సులో 1991 నవంబర్ 14న అమృత్లాల్ శుక్లా అస్తమించారు. త్యాగాల గాలిపెల్లి.. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి చెందిన కమ్యూనిస్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఇది జీర్ణించుకోలేని నిజాం పోలీసులు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతూ నిర్బంధాన్ని అమలు చేశారు. నాటి రజాకార్లకు వ్యతిరేకంగా కొడవళ్లు, గొడ్డళ్లు, బరిసెలు, గుల్లెర్లతో పోరుసాగించారు. ఈ పోరులో గాలిపల్లితో పాటు సమీప గ్రామాలకు చెందిన పదకొండు మంది ఒకే రోజు అమరులయ్యారు. ఉద్యమంతో సంబంధం లేని గాలిపెల్లికి చెందిన పెరంబుదూరి అనంతయ్య, రంగమ్మ వృద్ధ దంపతులు బలయ్యారు. గ్రామ సమీపంలోని మొక్కజొన్న చేనులో తలదాచుకున్న వీరిని రజాకార్లు వృద్ధులనికూడా చూడకుండా నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపారు. రజాకార్ల కళ్లు గప్పి.. తప్పించుకుని.. గాలిపెల్లిలో రజాకారర్ల దాడిలో బద్దం ఎల్లారెడ్డి, రాజ లింగం, అమృత్లాల్ శుక్లా చాకచక్యంగా తప్పించుకున్నారు. ఆగ్రహం తో రజాకార్లు గాలిపెల్లి ఊరును తగులబెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ఉద్యమకారులు సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి తుపాకుల్ని అపహరించారు. ఆయుధాల సేకరణకు అప్పట్లోనే ఠాణాను లక్ష్యంగా చేసుకున్నారు. సాయుధ పోరాటానికి గాలిపెల్లి ఊపిరి పోసింది. ప్రతి దాడులకు వేదికైంది. సాయుధ యోధుడు ‘చెన్నమనేని’ సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న వారిలో సిరిసిల్ల మాజీ శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వర్‌రావు ముఖ్యులు. వి ద్యార్థి దశలో తొలిపోరాటం సాగించారు. దున్నేవాడికే భూమి కావాలని నినదించారు. చిరోంచ ప్రాంతంలో సాయుధ ద ళాలకు రాజేశ్వర్‌రావు శిక్షణ ఇచ్చారు. అక్కడే మాజీ ప్రధాని పీ. వి. నర్సింహారావుతో చెన్నమనేనికి పరిచయం ఏర్పడింది. హై దరాబాద్‌లో అరెస్టయి 12 నెలల పాటు కరీంనగర్, వరంగల్, చంచల్‌గూడ, గుల్బర్గా జైళ్లలో గడిపారు. 1948 సెప్టెంబర్ 17 తర్వాత సాయుధ పోరాటం వద్దని రాజేశ్వర్‌రావు చెప్పారు. దీంతో కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయాయి. తొలిసారి చొప్పదండి ఎమ్మెల్యేగా 1957లో ఎన్నికయ్యారు. తరువాత సిరిసిల్ల ఎమ్మెల్యేగా 1967, 1978, 1985, 1994, 2004లో ఎన్నికయ్యారు. 2016 మే 9న 93 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. రాజేశ్వర్‌రావు తన రాజకీయ, సాయుధ పోరాటంపై ‘సత్యశోధన’ ఆత్మకథ పుస్తకాన్ని రాశారు. చెన్నమనేని రాజేశ్వర్‌రావు 16వ ఏటనే ఉద్యమాల్లోకి.. వేములవాడ: ఉద్యమమే ఊపిరిగా 96 ఏళ్ల వయసులోనూ చలాకీగా ఉన్న నమిలకొండ పుల్లయ్య అలియాస్ గుమ్మి పుల్లన్న వేములవాడ వాసి. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలోనైనా.. భూపోరాటమే పంథాగా ఉద్యమంలో భాగస్వామి అయ్యాడు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. 16వ ఏట కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. నేటికీ వేదాలు, మంత్రాలు పటిస్తూనే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడం ఆయనకే సొంతం. ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్న పుల్లన్నకు నేటికీ స్వాతంత్య్ర సమరయోధుడి పెన్షన్ మంజూరు కాకపోవడం బాధాకరం. స్వాతంత్య్ర సమరయోధుడు రాజేశ్వర్‌రావుకు వెన్నంటి ఉంటూ భూపోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ దున్నేవాడికే భూమి అనే నినాదంతో రైతులను జాగృత పరుస్తూ ఊరూరా ఉద్యమాలను కొనసాగించారు. గుమ్మి పుల్లన్న సిరిసిల్ల ఠాణాపై దాడులు.. రైతు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న క్రమంలో సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌పై దాడి నిర్వహించి 9 తుపాకులు ఎత్తుకెళ్లారు. అలాగే తిమ్మాపూర్ మిలటరీ క్యాంపుపై నాలుగువేల మంది రైతులతో కలసి దాడి చేసి 110 తుపాకులను ఎత్తుకెళ్లారు. తుపాకులు ఎత్తుకెళ్లడంతో పుల్లన్నను పోలీసులు గుర్తించే అవకాశం ఉన్నందున పార్టీ తీర్మానం మేరకు అతడిని మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు బదిలీ చేశారు. దీంతో వారంపాటు కాలినడకన చంద్రపూర్‌కు చేరుకున్నారు. మూడేళ్లు అక్కడే కోయ, గోండు, నేతకాని, గుత్తికోయల వారితో పార్టీ పునర్నిర్మాణం చేశారు. మూడేళ్ల అనంతరం చంద్రపూర్ కమిటీ ఇద్దరు కొరియర్ల సాయంతో పుల్లన్నను కరీంనగర్‌కు పంపించింది. ఈక్రమంలో ధర్మపురి గంగ వద్ద స్నానాలు చేస్తున్న వీరిపై పోలీసులు దాడులు చేశారు. ఇరువురు కొరియర్లను చంపేసి అక్కడే గడ్డిలో తగులబెట్టారు. పుల్లన్నను అరెస్టు చేసి గుల్బర్గా జైలుకు తరలించగా, మూడేళ్లు గడిపాడు. చివరకు ఎలాగోలా బయటిపడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పుల్లన్న చురుకుగా పాల్గొన్నారు. పోరాటయోధుడిగా పేరొందిన పుల్లన్నను ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇక్కడి ప్రజాప్రతినిధులు పౌరసన్మానం చేస్తారు. -
మీరే మార్గదర్శకం
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): ‘మీరు నాడు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చూపిన పోరాట స్ఫూర్తే మాకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో దివ్య ఔషధంలా పని చేసింది. మీరు చూపిన బాట లోనే పయణించి తెలంగాణ సాధించాం..’అని 1969 తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమం జరిగి 50 ఏళ్లు ముగిసిన సందర్భంగా నాటి ఉద్యమకారులను ఆదివారం సన్మానించారు. సిద్దిపేట పట్టణంలో ‘సమర స్ఫూర్తికి స్వరో్ణత్సవం’పేరిట జిల్లాకు చెందిన 70 మంది 1969 ఉద్యమకారులను సన్మానించారు. అంతకుముందు పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అనంతరం సభలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపానికి, తెలంగాణ తల్లి, జయశంకర్ చిత్రప టాలకు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. గౌరవించుకోవాల్సిన బాధ్యత మనదే అనంతరం హరీశ్ మాట్లాడుతూ.. నాడు 1919 లో నిజాం సర్కార్ హయాంలోనే నాన్‌ముల్కి ఉద్యమం ద్వారా తెలంగాణ ఆకాంక్షను నాటి ఉద్యమకారులు వెలువరించారని, అనంతరం 1952లో ఈ ఉద్యమ సెగలు పెరిగాయని చెప్పా రు. 1969లో ఉధృతమైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే దాకా ఆగలేదన్నారు. ఆ ఉద్యమకారుల్లో కొంతమందే నేడు జీవించి ఉన్నారని వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఉద్యమానికి వెలుగురేఖగా సిద్దిపేట నాటి పాలకులు ప్రాంతీయ విభేదాలు చూప డంతోనే ఈ ఉద్యమం ఎగిసిపడిందని.. నీరు, నియామకాలు, నిధుల కోసమే ఈ పోరాటం జరిగిందని హరీశ్ తెలిపారు. తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాన్ని సీఎం కేసీఆర్ నెరవేర్చారన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట వెలుగురేఖగా దిశను చూపించిందన్నారు. 1969 తెలంగాణ ఉద్యమకారులను గౌరవించటం రాష్ట్రంలోనే తొలిసారని, ఇది తన ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉందని హరీశ్ చెప్పారు. 1969 చరిత్ర సిద్దిపేట జిల్లా అనే పుస్తకాన్ని ముద్రించాలని ఆయన ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డిలను కోరారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుఖ్‌హుస్సేన్, సరోత్తంరెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, బెవరెజ్ చైర్మన్ దేవీప్రసాద్, ఎలక్షన్‌రెడ్డి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సూడా చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోస్టుకార్డుకు 141 ఏళ్లు
ఇంటి ముందు నుంచి పోస్ట్ అని గట్టిగా పిలుపు వినపడగానే ఏదో ఉత్తరం వచ్చిందనుకునే పరుగెత్తే దృశ్యాలు పాతకాలంలో కనిపించేవి. ఆ చిన్ని ఉత్తరం రాగానే ఇంటిల్లిపాది ఒకచోట చేరి దానిని చదివి ఎంతో ఆనందించేవారు. అదే పోస్టుకార్డు. చిన్నగా ఉండే ఆ పోస్టు కార్డు ఎన్నో పెద్దపెద్ద విషయాలను మోసుకొచ్చేది. ఆ చిట్టి పోస్టుకార్డే కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచేది. మనుషుల మధ్య బలమైన సంబంధాలను ఏర్పర్చేది. అంతటి ఘన కీర్తి కలిగిన ఆ పోస్టుకార్డుకు ప్రస్తుతం ఆదరణ లేదు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఆ పోస్టుకార్డుకు స్థానం లేదు. తమ భావాలను పంచుకునేందుకు, విషయాలను వివరించేందుకు ఆ పోస్టుకార్డు ఉనికి లేదు. సర్వం మొబైల్ మయం. నేడు పోస్టుకార్డు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం సాక్షి, పాల్వంచరూరల్(ఖమ్మం) : నాడు ఎంతో ఆదరణ పొందిన పోస్టుకార్డుకు మారుతున్న ఆధునిక సమాజంలో ఆదరణ కరువైంది. సాంకేతిక విప్లవంతో అధునాతమైన మొబైళ్లు అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ యుగం రాకెట్ స్పీడుతో దూసుకుపోతుండటంతో 14 దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన, మంచిచెడుల సమాచారాన్ని చేరవేసే తోకలేని పిట్ట పోస్టుకార్డు నిరాదరణకు గురై కనుమరుగు అయ్యే పరిస్థితి నెలకొంది. భారతదేశంలో నాడు పాలించిన అంగ్లేయుల పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసినట్లు చెబుతున్న పోస్టుకార్డు 1879 జూలై 1న ఆవిర్భవించింది. నాడు ఈ కార్డును అణాపైసకు విక్రయించేవారు. అన్ని వర్గాల ప్రజలు ఈ పోస్టుకార్డును వినియోగించుకునేవారు. సూదూర ప్రాంతాల్లోని బంధువుల యోగ క్షేమాల సమాచారం కార్డు ద్వారానే తెలుసుకునే అవకాశం ఉండేది. గతంలో ప్రభుత్వాలు కూడా పోస్టు కార్డు మీద ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముద్రించి ప్రచారం చేసేవి. కానీ, గతంతో పరీశీలించి చూస్తే ప్రస్తుతం కార్డు ప్రభావం గణనీయంగా తగ్గింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల ప్రవేశంతో పోస్టుకార్డు నేడు ఉనికిని కోల్పోయే దశకు చేరింది. ప్రజలకు ఈ కార్డు ఆవసరం లేకుండా పోయింది. తొలి తెలంగాణ ఉద్యమంలో పోస్టుకార్డు కూడా కీలక భూమిక పోషించిందని నాటి స్వాతంత్య్ర సమరయోధులు అంటున్నారు. మలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను వివరించడానికి రాష్ట్రపతికి, ప్రధాన మంత్రులకు పోస్టుకార్డు ద్వారా లేఖలు రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందు నియమించిన శ్రీకృష్ణ కమిటీకి కూడా ప్రజలు పోస్టుకార్డు ద్వారా అభిప్రాయాలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల ప్రభావంతో పోస్టుకార్డుల వినియోగాన్ని ప్రజలు మరిచిపోయారు. దీంతో ప్రస్తుతం అర్ధ రూపాయి ధర కలిగిన పోస్టుకార్డును పోస్టు ఆఫీస్‌లోకి వెళ్లి కొనుగోలు చేసే దిక్కులేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కనుమరుగవుతున్న పోస్టుకార్డుకు భవిష్యత్లోలైనా పూర్వవైభవం రావాలని అశిద్దాం. అదరణలేక పోవడం బాధాకరం మారుతున్న కాలంలో పోస్టుకార్డులకు ఆదరణ లేకపోవడం బాధాకరంగా ఉంది. నాకు ఉద్యోగం రాకముందు గొళ్లపూడిలో 1983 నుంచి 87 వరకు పోస్టుమాస్టర్‌గా పనిచేశాను. సంక్రాంతి పండగ, రాఖీ, నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు భారీగా పోస్టుకార్డులు వచ్చేవి. వాటిని పంపిణీ చేయించడానికి రెండురోజులు పట్టేది. పోటీ పడి వాటిని తీసుకునేవారు. అంతటి ఆదరణ కలిగిన పోస్టుకార్డులు నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. -రామశాస్త్రి, ఈఓఆర్డీ, పాల్వంచ నేటి ప్రజలు మరిచిపోయారు.. తక్కువ ఖర్చుతో పోస్టుకార్డు ద్వారా ఎక్కువ సమాచారం అందించవచ్చు. నేను చదువుకునే రోజుల్లో హాస్టల్‌కు గానీ, కళాశాలల్లోగానీ పోస్టుకార్డు వస్తే నోటీస్ బోర్డులోకి వెళ్లి చూసుకునేది. కార్డుపై రాస్తే అందరికీ కనిపిస్తుందని భయమేసేది. అందరూ చదువుకునేవాళ్లు. అప్పట్లో ఎంతో అదరణ పొందిన పోస్టుకార్డును నేటి ప్రజలు మరిచిపోయారు. డాక్టర్ వై.చిన్నప్ప, ప్రిన్సిపాల్, జీడీసీ పాల్వంచ పోస్టుమెన్ కోసం ఎదురుచూసే వాళ్లం.. సెల్ఫోన్లు, వాట్సాప్‌లు, ట్విట్టర్లు, ఈమెయిళ్లు లేని రోజుల్లో కేవలం పోస్టుకార్డులపై ఆధారపడ్డాం. పోస్టుమెన్ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ నిరీక్షించేవాళ్లం. పొరుగు ఊరు నుంచి బంధువులు పోస్టుకార్డుపై యోగ క్షేమాలు రాసి పంపేవారు. కార్డులు చదువుకుని తిరిగి మళ్లీకార్డుపై రాసి పంపించాం. డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల క్షేమ సమాచారం తెలుసుకునేవాళ్లం.. దూర ప్రాంతాల్లో బంధువులు, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలను కేవలం పోస్టుకార్డుపై రాసి తెలుసుకునేవాళ్లం. నాటికి నేటికి ఎంతో తేడా ఉంది. వెంకటేశ్వర్లు, వ్యాపారి, కొత్తగూడెం -
కేసీఆర్, కేటీఆర్‌లపై కేసులు ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సందర్భంగా పలువురు నేతలపై రైల్వే శాఖ నమోదు చేసిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, స్వామిగౌడ్‌లతో పాటు ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో పాటు మరో 130 మందిపై నమోదు చేసిన కేసులను రద్దు చేసింది. గత నవంబర్‌లో జారీ చేసిన ఈ ఉత్తర్వులను ఆ తర్వాత తాత్కాలికంగా నిలిపివేస్తూ (అబయన్స్) జారీ చేసిన ఉత్తర్వులను ఇప్పుడు రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం కేసులు ఉపసంహరించడంపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. దీంతో ప్రభుత్వం కేసుల ఉపసంహరణ జీవోను అబ యన్స్‌లో పెడుతూ మరో జోవో ఇచ్చింది. తాజా గా శనివారం మరో జీవో ఇచ్చింది -
చైతన్యానికి చిరునామా ‘చిట్యాల’
సాక్షి, చిట్యాల (నకిరేకల్) : చైతన్యానికి చిరునామా చిట్యాల మండలం. ఈ మండలంలో నాటి సాయుధ తెలంగాణ పోరాటంతో పాటు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న చరిత్ర చిట్యాల మండల ప్రజలది. అంతేకాదు ఈ మండలం రాజకీయ చైతన్యానికి కూడా పెట్టింది పేరుగా ఉంటూ వస్తోంది. చిట్యాల మండలానికి చెందిన ఎందరో నాయకులు చట్ట సభలకు ప్రాతి నిధ్యం వహించారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో చిట్యాల మండలానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. నకిరేకల్ శాసనసభ(ఎస్సీ రిజర్వుడు)కు పదిహేను మంది అభ్యర్థులు రంగంలో ఉండగా అందులో చిట్యాల మండలానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మరొకరు నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా చిట్యాలలో నివాసం ఉంటూ జెడ్పీహెచ్ఎస్లో పదవ తరగతి వరకు చదువుకున్న పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు. అభ్యర్థి పార్టీ గ్రామం నియోజకవర్గం కాసర్ల లింగయ్య బీజేపీ గుండ్రాంపల్లి నకిరేకల్ మేడి సత్యనారాయణ తెలంగాణ ప్రజాపార్టీ పిట్టంపల్లి నకిరేకల్ జిట్ట నగేష్ సీపీఎం చిట్యాల నకిరేకల్ నూనె వెంకటస్వామి బీఎస్పీ చిట్యాల నకిరేకల్ మేడి నరేష్ సమాజ్‌వాదిపార్టీ వనిపాకల నకిరేకల్ గాదె శ్రీను బహుజన ముక్తి పార్టీ శివనేనిగూడెం కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్ ఉరుమడ్ల నల్లగొండ -
ఆమడ దూరంలో!
సాక్షి, పెద్దపల్లి : రామగుండం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వాలు మారినా.. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పట్టణవాసులు మా పరిస్థితి ఇంతేనా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీ-థర్మల్ పరిరక్షణతో పాటు నూతన విద్యుత్కేంద్రం ఏర్పాటు, బీపీఎల్ భూముల సమస్య, రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా మార్చడం, పెద్ద చెరువును మినీట్యాంక్ బండ్‌గా చేయడం.. అంతర్గాం టెక్స్టైల్ కార్మికుల సమస్యలు ఏళ్లకు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడంలేదు. విస్తరణకు నోచుకోని బీథర్మల్.. రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)ను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1965 జూలై 19న శంఖుస్థాపన చేశారు. అప్పుడు రూ. 14.8 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత దీనిని జవహర్లాల్ నెహ్రూ థర్మల్ విద్యుత్తు కేంద్రంగా నామకరణం చేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడడంతో ఆంధ్రాలోనూ థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయాలని తలిచి విజయవాడ సమీపంలో నిర్మించతలపెట్టారు. దీంతో రామగుండం బి-థర్మల్ను 62.5 మెగావాట్లకు సరిపెట్టారు. ఆ తర్వాత బిథర్మల్ కేంద్రం విస్తరణకు నోచుకోలేదు. నేటి పాలకులు రామగుండంను విద్యుత్ హబ్‌గా మార్చుతామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. నిరుపయోగంగా వేలాది ఎకరాలు.. 1994లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం బెంగళూరుకు చెందిన మారుబెని, తోషీబా, ఎలక్ట్రిక్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జపాన్)లకు దశలవారీగా పనులు చేపట్టేందుకు ప్రాజెక్టును కట్టబెట్టారు. స్థానికంగా ఉన్న ఏపవర్‌హౌస్ స్థలం 750 ఎకరాలతో పాటు మరిన్ని అవసరాల నిమిత్తం మరో 1,050 ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ చేశారు. 520 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో రూ.2813.9 కోట్ల వ్యయంతో అంచనా రూపొందించి రూ. 150 కోట్ల వ్యయమంతో ప్రహరీ నిర్మాణాలు ఎకరాల విలువైన భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ఎవరికీ పట్టని రాముని గుండాలు.. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిన రామగుండం సమీపంలోని రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేపట్టాల్సిన అవసరం ఉంది. స్థానికంగా రామునిగుండాలు ఉండడం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయం కావడంతోనే ప్రపంచ దేశ, రాష్ట్ర చిత్రపటాలలో రామగుండంకు ప్రత్యేక పేరుంది. రామునిగుండాలలో రామలక్ష్మణుడు సంచరించినట్లు ఆనవాళ్లుఉన్నాయి. కొండపై 108 గుండాలున్నాయి. గుట్టపై 200 ఫీట్ల లోతు, 50 ఫీట్ల వెడల్పుతో ఓలోయ ఉంది. లోయకు పైభాగాన ఉన్న బావిలో సీతాదేవి స్నానమాచరించిందని ప్రతీతి. రాముడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పాదముద్రికల స్థానంలో ఏర్పడిన గుంతలు గుండాలుగా మారి రామగుండంగా పేరువచ్చింది. 108 గుండాలలో అన్ని కాలాల్లో నీరు సమృద్ధిగా ఉండడం విశేషం. దీనిని ఆధ్యాత్మికంతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవికూడా నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆమడదూరం పెద్ద చెరువు.. పట్టణంలోని 210 ఎకరాల విస్తీర్ణంలో నియోజకవర్గ పరిధిలోనే పెద్దచెరువు. ఇందులోకి ఎన్టీపీసీకి చెందిన బూడిద నీరు చేరుతుండడంతో పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్క పెరగడంతో పాటు కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్లలో సేకరించిన చెత్తను ఇందులో వేయడంతో చెరువు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయి కలుషితమవుతుంది. దీని కింద సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిని గడిచిన పాలకవర్గం మినీ ట్యాంకుబండ్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ రాజకీయ వర్గ విభేధాలతో మరో చెరువును ఎంపిక చేశారు. దీంతో అభివృద్ధికి పుల్‌స్టాప్ పడింది. -
టీఆర్ఎస్కు ఉద్యమకారుల హెచ్చరిక..!
సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల మనోభావాలు, ఆశయాలకు అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నడుచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద అమరవీరుల స్థూపం పునర్నిర్మించాలని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉద్యమకారులు డిమాండ్ చేశారు. చిమ్మపూడి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమకారులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో.. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా అభ్యర్థుల్ని ఎన్నికల బరిలోకి దింపుతామని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తొలిదశ తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలోనే ప్రారంభమైందనీ, మలిదశ ఉద్యమంలోనూ జిల్లాకు చెందిన ఎంతో మంది పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని చెప్పారు. దాడులను తట్టుకొని ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. -
పోరు తెలంగాణమా!
భారతదేశం స్వాతంత్య్రం పొందిన.. ఏడాది తర్వాత (1948 సెప్టెంబర్ 17న) తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చింది. అప్పటివరకు పూర్తి రాచరిక పాలనలో మగ్గిన ఈ రాష్ట్రం.. ఆ తర్వాత కేంద్రం నియమించిన ముఖ్యమంత్రి ఎంకే వెల్లోడి పాలనలోకి వెళ్లింది. నాలుగేళ్ల తర్వాత.. అంటే 1952లో తొలిసారిగా నిజాం స్టేట్‌లో భాగంగా ఉన్న మహా రాష్ట్ర, కర్ణాటకల్లోని పలు ప్రాంతాలను కలుపుకుని తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టులకు హోరాహోరీ జరిగిన ఈ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. దేశవ్యాప్తంగా పటిష్టంగా కనిపించిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. అప్పటికే తమ పోరాటాల ద్వారా తెలంగాణ ప్రజల్లో తమదైన ముద్రవేసుకున్న మహామహులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. కమ్యూనిస్టు పార్టీ తరఫున బరిలో దిగిన రావి నారాయణరెడ్డి అయితే.. నెహ్రూ కన్నా ఎక్కువ మెజారిటీతో లోక్‌సభకు ఎంపికయ్యారు. 1952నాటి ఈ ఎన్నికల విశేషాలను గమనిస్తే.. ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావుతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సాయుధ పోరాటం నుంచి ఎన్నికలకు.. తెలంగాణలో అరాచకాలకు పాల్పడ్డ రజాకార్లు, జమీందార్లకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం జరిపిన వామపక్ష, ప్రగతిశీల శక్తులు కమ్యూనిస్టు జెండా కింద ఏకమయ్యాయి. హైదరాబాద్ విమోచనం తర్వాత కూడా కమ్యూనిస్టు సంఘాలు అదే ఉద్యమస్ఫూర్తిని కొనసాగించాయి. దీని కారణంగా.. దేశవ్యాప్తంగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని పరిస్థితులున్నప్పటికీ.. తెలం గాణలో మాత్రం కమ్యూనిస్టుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు క్షేతస్థాయిలో ఆర్థికంగా, ఇతరత్రా ఎదురవుతున్న ఇబ్బందులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగడం.. అప్రకటిత నిషేధం కొనసాగింపు వంటి పరిణామాలు కమ్యూనిస్టులకు ఇబ్బంది కరంగా మారాయి. దీంతో ఈ పార్టీ నాయకులు, ప్రగతి శీల నాయకులు, ప్రజాస్వామ్య వాదులు.. కమ్యూనిస్టు పార్టీ తరఫున కాకుండా ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరిట 1952లో ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. రైతాంగ సాయుధ పోరాటం కారణంగా తెలంగాణలో పీడీఎఫ్‌కు బలమైన శక్తిగా అవతరించగా, కమ్యూనిస్టుల ప్రభావం లేని కన్నడ, మరాఠీ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న తెలంగాణలోని ప్రాంతాలతో పాటు రాయచూర్, గుల్బర్గా, బీదర్, ఉస్మానాబాద్, బీడ్, ఔరంగాబాద్, పర్భని, నాందేడ్ జిల్లాలను కలుపుకుని మొత్తం 175మంది సభ్యులతో హైదరాబాద్ శాసనసభ – హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దరిమిలా హైదరాబాద్ అసెంబ్లీలోని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు 101 మంది 1956 డిసెంబర్ 3న ఏపీ శాసనసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ద్విసభ్య నియోజకవర్గాలు మొదటిసారి ద్విసభ్య నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. 1952లో హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పడినపుడు మొత్తం 33 ద్విసభ్య (ఒక జనరల్ సీటు, ఒక రిజర్వ్ సీటు కలిపినవి) నియోజకవర్గాలుండగా, వాటిలో 21 తెలంగాణ ప్రాంతం లోనే ఉండేవి. 1956లో ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడినపుడు 29 ద్విసభ్య నియోజకవర్గాలుండేవి. 1957లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ద్విసభ్య నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. 1961లో ద్విసభ నియోజకవర్గాల రద్దు చట్టం అమల్లోకి రావడంతో ఈ విధానం రద్దయింది. దీంతో 1962 ఎన్నికల నుంచి ఏకసభ్య నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. 1952లో హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి (నిజాం స్టేట్ పరిధిలోని ప్రాంతాలకు) జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులతో సహా మొత్తం ఏడు జాతీయ పార్టీలు, ఏడు రాష్ట్ర పార్టీల అభ్యర్థులు పోటీచేశారు. జాతీయపార్టీల్లో ఆల్ ఇండియా భార తీయ జనసంఘ్, అఖిల భారతీయ హిందూ మహాసభ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, అఖిల భారతీయ రామరాజ్య పరిషద్, అఖిల భారత షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్, సోషలిస్ట్ పార్టీలున్నాయి. రాష్ట్ర పార్టీల్లో హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్, ప్రజా పార్టీ (హెచ్‌ఎస్‌పీపీ), ఇండిపెండెంట్ లీగ్, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్, పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, ఆల్ ఇండియా రిపబ్లికన్ పార్టీ, యునైటెడ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ ఉన్నాయి. కార్మిక నేత మఖ్దూం ఓటమి..! కమ్యూనిస్టు యోధుడు, సుప్రసిద్ధ కవి, కార్మికనేత మఖ్దూం మొహియుద్దీన్ 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ అసెంబ్లీ సీటు నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీచేశారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మాసుమా బేగం చేతుల్లో 780 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొత్తం 45,195 ఓట్లకు గాను, 21,560 ఓట్లు పోలవగా అందులో మఖ్దూంకు 9,373 ఓట్లు వచ్చాయి. కార్మిక, కర్షక వర్గాల హక్కుల కోసం మఖ్దూం అలుపెరగని పోరాటం చేశా రు. నిరంకుశ నిజాం సైన్యం, రజాకార్లకు వ్యతి రేకంగా చిన్న, సన్నకారు రైతులు, మహిళలు, రైతు కూలీలు, ఇతరవర్గాల పేదలు జరిపిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక స్థానం దక్కింది. అలాంటి సాయుధ పోరాట ప్రకటనపై సంతకం చేసిన ముగ్గురు నేతల్లో మఖ్దూం (రావి నారాయణరెడ్డి, రాజ్‌బహదూర్ గౌడ్‌తో కలిసి) ఒకరు. జలగం, కోదాటి పరాజయం ఖమ్మం జిల్లా వేంసూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంగళరావు, మరో ఇండిపెండెంట్ కందిమళ్ల రామకృష్ణారావు చేతుల్లో 549 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మొత్తం 51,987 ఓట్లకు గాను 36,215 ఓట్లు పోల్ కాగా, వెంగళరావుకు 15,543 ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత జలగం.. రాష్ట్ర హోం మంత్రిగా, ఏపీ సీఎంగా, కేంద్రమంత్రిగా వివిధ పదవుల్లో పనిచేశారు. ఇప్పగూడ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ అభ్యర్థి విఠల్‌రావు చేతిలో కాంగ్రెస్‌కు చెందిన కోదాటి నారాయణరావు 5,463 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో, స్వాతంత్య్ర సమరయోధుడిగా, గ్రంథాలయ ఉద్య మంలో.. నారాయణరావు క్రియాశీల భూమిక నిర్వహించిన విషయం తెలిసిందే. పరిగి అసెంబ్లీ సీటు నుంచి కాంగ్రెస్ తరఫున షాజహాన్ బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ టికెట్‌పై శాంతాబాయి రెండు నియోజక వర్గాల నుంచి పోటీచేశారు. కొల్లాపూర్‌లో పీడీఎఫ్ అభ్యర్థి అనంత రామచంద్రారెడ్డి చేతుల్లో ఓడిన ఆమె.. మక్తల్–ఆత్మకూరు ద్విసభ్య నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వెల్లివిరిసిన మహిళా చైతన్యం ఈ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది మహిళలు కూడా గెలుపొందడం.. ఆనాటి మహిళా చైతన్యాన్ని, సామాజికంగా, సాంఘికంగా అభ్యు దయ భావజాలం వెల్లివిరియడానికి నిదర్శనం. ఇందులో తెలంగాణ ప్రాంతం నుంచే ఆరుగురు న్నారు. వారిలోనూ ఇద్దరు ముస్లిం మహిళలు, ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి మరో మహిళ గెలుపొందడం గమనార్హం. హైదరాబాద్ స్టేట్‌లోని రాయచూర్ జిల్లా కొప్పళ స్థానం నుంచి మహాదేవమ్మ బస వన్నగౌడ ఇండిపెండెంట్‌గా గెలుపొందగా, ఔరంగా బాద్‌లోని వైజాపూర నుంచి ఆషాటి వాగ్మారే (కాంగ్రెస్) విజయం సాధించారు. 1956లో ఏపీలో విలీనమైన సందర్భంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఆరుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రావి నారాయణరెడ్డి రికార్డు 1952లో హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. హైదరా బాద్ స్టేట్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండేవి. ఇందులో నాలుగు ద్విసభ్య స్థానాలు (తెలం గాణలో మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, కర్ణాటకలో బీదర్) ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 17, పీడీఎఫ్‌కు 7, పీడబ్ల్యూపీ, ఎస్పీ, ఎస్సీఎఫ్, ఇండి పెండెంట్లకు చెరో స్థానం లభించాయి. ఈ ఎన్ని కల్లో నల్లగొండ నుంచి లోక్‌సభకు పోటీచేసిన.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సేనాని రావినారాయణరెడ్డి రికార్డు విజయాన్ని నమోదు చేశారు. ప్రధాని నెహ్రూ కంటే కూడా ఎక్కువ ఓట్లు సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన నారా యణరెడ్డికి 3,09,162 ఓట్లు వచ్చాయి. అలహాబాద్ (తూర్పు), కమ్ జౌన్పూర్ (పశ్చిమ)ల నుంచి ద్విసభ్య స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నెహ్రూకు 2,33,571 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ పోరాటంలో కీలక భూమిక పోషించిన రామానంద తీర్థ 1952 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై గుల్బర్గా నుంచి గెలుపొందారు. సోషలిస్ట్ పార్టీ నుంచి సి.మాధవరెడ్డి ఆదిలాబాద్ నుంచి గెలి చారు. పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీచేసిన పెండ్యాల రాఘవరావు వరంగల్ నుంచి విజయం సాధించారు. ఆయన ఎంపీ సీటుకే కాకుండా మూడు అసెంబ్లీ సీట్లకు కూడా పోటీచేసి ఒక చోట ఓడిపోయారు. గెలిచిన మహామహులు 1952 హైదరాబాద్ శాసనసభలో వివిధరంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, మహామహులుగా చెప్పుకోదగ్గవారు చాలామందే ఉన్నారు. వారి వివరాలను ఓసారి గమనిస్తే.. గోపాలరావు ఎగ్బోటే 1948 నుంచి 1951 వరకు న్యాయవాదిగా పనిచేసిన జీఎస్ ఎగ్బోటే.. 1952 ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందారు. 1954– 56 మధ్యకాలంలో విద్య, స్థానిక ప్రభుత్వం, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రిగా పనిచేశారు. 1957లో మరోసారి ఏపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1962లో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1972లో హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బూర్గుల రామకృష్ణారావు కాంగ్రెస్ టికెట్‌పై షాద్‌నగర్ నుంచి గెలుపొందారు. ఈయన దాదాపు నాలుగేళ్ల ఎనిమిది నెలల పాటు సీఎంగా కొనసాగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్.. రాజ్‌ప్రముఖ్ హోదాలో 1952 ఎన్నికల్లో గెలిచిన బూర్గులతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ హైదరాబాద్‌లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించిన బూర్గుల న్యాయ రంగంలో పేరుప్రఖ్యాతులు గడించారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సంస్థాపక సభ్యుల్లో ఈయన ఒకరు. దేవరకొండలో జరిగిన మూడో ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించారు. మానవహక్కులపై ప్రజలను చైతన్యపరిచారు. రాష్ట్రంలో గ్రంథాలోద్యమ వ్యాప్తికి తీవ్రంగా కృషిచేశారు. సురవరం ప్రతాపరెడ్డి నాటి హైదరాబాద్ స్టేట్‌లో గ్రంథా లయ ఉద్యమానికి ఆద్యుడిగా నిలిచిన సురవరం ప్రతాపరెడ్డి వనపర్తి నుంచి కాంగ్రెస్ టికెట్‌పై శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన సంఘ సంస్కర్తగానే కాకుండా తెలుగు పత్రికారంగ వికాసానికి ఎనలేని కృషి చేశారు. రావి నారాయణరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి పీడీఎఫ్ టికెట్‌పై నల్లగొండ లోక్‌సభ స్థానంతోపాటు భువనగిరి నుంచి అసెంబ్లీకి గెలుపొందారు. బొమ్మగాని ధర్మభిక్షం తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించిన ధర్మభిక్షం పీడీఎఫ్ టికెట్‌పై సూర్యాపేట నుంచి విజయం సాధించారు. ఆరుట్ల దంపతులు.. కమ్యూనిస్టు ఉద్యమంలో అంకిత భావంతో పనిచేసిన ఆరుట్ల రామచంద్రా రెడ్డి, ఆరుట్ల కమలాదేవి దంపతులిద్దరూ ఈ శాసనసభకు సభ్యులుగా ఎన్నికై.. అరుదైన రికార్డును నెలకొల్పారు. కమలాదేవి పీడీఎఫ్ టికెట్‌పై ఆలేరు నుంచి గెలుపొందారు. ఆమె భర్త రామచంద్రారెడ్డి తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మెదక్ జిల్లా రామాయంపేట నుంచి పీడీఎఫ్ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాఘవరావు పీడీఎఫ్ నేత పెండ్యాల రాఘవరావు మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ సీటు (మొత్తం 4 సీట్లు)కు పోటీ చేశారు. కేవలం ఒక అసెంబ్లీ స్థానంలో (వరంగల్) మినహా, వరంగల్ లోక్‌సభ, హనుమకొండ, వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గాల నుంచి ఆయన గెలుపొందారు. లోక్‌సభ సభ్యుడిగానే కొనసాగారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ టికెట్‌పై వికారాబాద్ నియోజకవర్గం నుంచి డా.మర్రి చెన్నారెడ్డి గెలిచారు. ఆ తర్వాత కూడా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను చాటారు. తెలంగాణ ప్రజా సమితి ద్వారా కాంగ్రెస్‌పైనే తిరుగుబాటు చేశారు. కేవీ రంగారెడ్డి.. మర్రి చెన్నారెడ్డి మేనమామ కొండా వెంకట రంగారెడ్డి షాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. తర్వాత ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. వీబీ రాజు.. వల్లూరి బసవరాజు సికింద్రాబాద్ ద్విసభ్య స్థానం నుంచి జనరల్ అభ్యర్థిగా కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికయ్యారు. తర్వాత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూమంత్రిగా, కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ.. తొలిసారి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫా బాద్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మంత్రిగానూ పనిచేసిన బాపూజీ.. తెలంగాణ తొలి, మలి విడత ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నేను జైలుకెళ్లా.. మీరు వెళ్లారా?: జీవన్‌రెడ్డి
జగిత్యాల రూరల్: తెలంగాణ ఉద్యమంలో తాను జైలుకెళ్లానని, మీ కుటుంబంలో ఎవరు వెళ్లారో చెప్పాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1983 నుంచి 1999 వరకు కేసీఆర్, తానూ ఎమ్మెల్యేలుగా పనిచేశామని, ఆ సమయంలో ఏనాడూ తెలంగాణ ఊసే ఎత్త లేదని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ తన కొడుకు కేటీఆర్, కుమార్తె కవితను అమెరికాలో ఉంచి.. తెలంగాణ రాగానే.. వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. ఉద్యమంలో పాల్గొన్న యువకులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఏమీ మిగలకుండా చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే మన నిధులు, మన నీరు, మన ఉద్యోగాలని చెప్పిన కేసీఆర్.. నాలుగేళ్లలో 16 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని విమర్శించారు. ఇప్పటికీ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టిన కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. వాగ్దానాలు అమలు చేయకపోగా విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ తొలగించారని, మైనార్టీలు, క్రిస్టియన్లు, దళిత, గిరిజనుల నిధులను మళ్లించి వారికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. -
ఉద్యమ ఆకాంక్షల మేరకే మేనిఫెస్టో: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2014లో ఉద్యమ పార్టీగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతుందని టీఆర్ఎస్ కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తే పూర్తి మెజార్టీ ఉండి కూడా నాలుగున్నరేళ్లకే కాడెత్తేసిందని ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ముం దస్తు ఎన్నికలను తెరపైకి తెచ్చారన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. మిషన్ భగీరథ పథకంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, ప్రజ లపై అప్పుల భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే చేపట్టిన మిషన్ భగీరథ వల్ల రోడ్లన్నీ గుంతలమయం చేశారని ధ్వజమెత్తారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వనిదే ఓట్లు అడగబోనన్న కేసీఆర్.. ఇప్పుడు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఆకాంక్షల కోసమే ప్రజాస్వామ్యబద్ధంగా కలిసి వచ్చే పక్షాలతో తాము ఎన్నికల కూటమి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. -
కేసీఆర్ నీడలోనే కోదండరాం ఎదిగారు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఏకం చేసిన సీఎం కేసీఆర్.. కోదండరాంను దగ్గరకు తీశారని, కేసీఆర్ నీడలోనే కోదండరాంకు బలం వచ్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అయితే దీనిని గుర్తించకుండా తనకే సొంత బలం ఉందని కోదండరాం అనుకోవడం శోచనీయమని అన్నారు. నిజంగా ఆయనకే అంత బలం ఉంటే కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. అదీ ఒకటి, రెండు సీట్ల కోసం గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. సత్తా ఉంటే ఒంటరిగానే పోటీ చేయాలన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే.. దానిని అడ్డుకునేందుకు కోదండరాం కూడా ప్రయత్నం చేశారని ఆరోపించారు. రైతులకు మేలు జరిగే పనిని అడ్డుకున్న కోదండరాంకు వారి ఉసురు తగులుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా, సిద్దిపేట రూరల్ మండలం గుర్రాలగొంది, చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరై మాట్లాడారు. దీవిస్తున్నాం.. లక్ష మెజారిటీతో గెలిచి రండి.. ‘మీరు మా గ్రామానికి అన్నీ చేశారు.. మా కుటుంబ సభ్యునిలా ఉండి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారు. ఎన్నికల ప్రచారం మా గ్రామం నుంచి ప్రారంభించినందుకు మా గ్రామస్తులం దీవిస్తున్నాం. మీకే ఓటు వేస్తామని తీర్మానం చేస్తున్నాం. మా గ్రామంలోని మహిళా సంఘాలు, కుల సం ఘాలు.. అందరం రూపాయి, రూపాయి పోగుచేసిన డబ్బులు రూ.30,218 ఇస్తున్నాం. ఈ డబ్బులతోనే నామినేషన్ వేయండి. లక్ష మెజారిటీతో గెలిచి రండి’ అంటూ గుర్రాలగొంది గ్రామస్తులు మంత్రి హరీశ్‌కు తాము విరాళంగా సేకరించిన డబ్బులను అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి ‘నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా మీ రుణం తీర్చుకోలేను’ అం టూ ఉద్వేగంగా అన్నారు. తనపై నమ్మకంతో ఆరోసారి కూడా సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు.. తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటు వెయ్యరని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల్లో బలం లేదని గ్రహించిన కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీలతో పొత్తుకు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2009 లో ప్రకటించిన విధంగా తెలంగాణను ఇచ్చి ఉంటే వందలాది మంది విద్యార్థులు చనిపోయేవారు కాద న్నారు. వందలాది మంది తెలంగాణ బిడ్డల చావుకు బాధ్యత కాంగ్రెస్‌దే అని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేసీ, సీపీఐ.. ఇలా ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లుగా కనిపించని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అసత్యపు, ఆచరణకు సాధ్యం కాని హామీలిస్తూ కాం గ్రెస్ ప్రజల వద్దకు వస్తోందని, ఎన్ని ఎత్తులు వేసినా కనీసం ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్‌కు దక్కదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పడం శోచనీయమని అన్నారు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అటువంటి కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకోవడాన్ని చూసిన ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ పొత్తుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ.. తెలంగాణకు బీజేపీ కూడా అన్యాయం చేసిందని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధికి నిధులు కావాలని కోరినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అదే మన పక్కన ఉన్న మహారాష్ట్రకు నిధులు వరదలా మంజూరు చేసిందన్నారు. నాలుగేళ్లుగా హైకోర్టు విభజన గురించి పట్టించుకోలేదన్నారు. ఇటువంటి బీజేపీకి కూడా తెలంగాణలో స్థానం ఉండదన్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారులకు న్యాయం జరగలేదు
పాలకుర్తి (వరంగల్): తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి పని చేసిన నాయకులకు న్యాయం జరగలేదని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో తక్కెళ్లపల్లి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తొలుత శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ద్విచక్రవాహనాల ర్యాలీతో బృందావన్ గార్డెన్స్‌కు చేరుకున్నారు. పబ్బతి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉద్యమ కారులసభలో తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ నా రాజకీయ గురువు ఎన్. యతిరాజారావు ఆశీస్సులు తీసుకుని సభకు హాజరయ్యానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించిన నాయకులు, కార్యకర్తలను ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు విస్మరించారని ఆరోపించారు. 2004లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన దుగ్యాల శ్రీనివాస్‌రావు పార్టీని మోసగించి కాంగ్రెస్‌లో చేరాడని గుర్తు చేశారు. 2009లో పాలకుర్తి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న తనకు అవకాశం ఇవ్వకుండా మహాకూటమిలో భాగంగా టీడీపీలో ఉన్న దయాకర్‌రావుకు ఇచ్చారని అన్నారు. 2014లో ఇతర పార్టీ నుంచి వచ్చిన డాక్టర్ సుధాకర్‌రావుకు అవకాశం ఇస్తే ఆయన ఓడిపోయారని తెలిపారు. ఉద్యమకారులకు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో సరైన న్యాయం చేయాలని, వారిని కష్టపెట్టొద్దని ఎమ్మెల్యే దయాకర్‌రావు చెప్పారని చెప్పారు. ఉద్యమకారులకు గుర్తింపునివ్వని ఎమ్మెల్యే ఉద్యమంలో పని చేసిన నాయకులకు తగిన గుర్తింపు స్థానిక ఎమ్మెల్యే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గ్రామస్థాయి నుంచి ఉద్యమకారులు ఐక్యమవుతతున్నారని అన్నారు. ఉద్యమ నేతకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రినే కోరడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. మూడు రోజుల్లో ఉద్యమకారులను సంప్రదించి సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. సమావేశంలో సుమారు 3 వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల సంఘం జిల్లా నాయకులు సందెల సునీల్, గణగాని రాజేందర్, కాశబోయిన యాకయ్య, ప్రభాకర్, కర్ర రవీందర్‌రెడ్డి, అల్లబాబు, తాళ్లపల్లి నర్సయ్య గౌడ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
జయశంకర్ సార్ స్మృతిలో..
ఆత్మకూరు (పరకాల): తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్ 9 ప్రకటన తర్వాత విద్యార్థులు జరుపుకున్న సంబరం మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం. వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకొని వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయనాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా..అని విశ్వవిద్యాలయాల విద్యార్థుల గురించి మదనపడ్డ గురువర్యులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష గురించి ఏమన్నారంటే.. మా వనరులు మాకున్నాయి.మా వనరులపై మాకు అధికారం కావాలి.యాచక దశ నుంచి శాసించే దశకు తెలంగాణ చేరుకోవాలి. మా తెలంగాణ మాకు కావాలి అన్నారు. అక్కంపేటలో పుట్టిన ఆచార్యుడు... ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ప్రస్తుత వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో లక్ష్మికాంతరావు, మహాలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా ఆగస్టు 6,1934న జన్మించాడు. బాల్య దశ నుంచి ఉద్యమ స్వభావం కలిగిన వ్యక్తి కావడంతో వివాహం చేసుకోకుండా సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోకుండా బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. విద్యాభ్యాసం.. పుట్టిన గ్రామంలో రెండోతరగతి వరకు ప్రాథమిక విద్యను అభ్యసించి ఆపై చదువుకు హన్మకొండకు వెళ్లారు. అక్కడే ఉర్దూ మీడియంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఇంటర్, డిగ్రీ చదివారు. అనంతరం బెనారస్, అలీఘడ్ విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకుని ఉస్మానియా వర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. బోధనా రంగంలో.. 1975నుండి1979వరకు సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.1979 నుంచి 1981వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ,1982 నుంచి 1991వరకు సీఫెల్ రిజిస్ట్రార్‌గా 1994వరకు ఇదే యూనివర్సిటీలో వీసీగా పనిచేశారు. ఉద్యమ ఆలోచన మొదలైందిలా.. మొట్టమొదట హైదరాబాద్ రాష్ట్రంలో జయశంకర్‌కు హైదరాబాద్‌లో ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. అయితే సెలవులు రావడంతో ఇంకా జాయిన్‌కాలేదు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. అప్పుడు జయశంకర్ సార్ జాయిన్ కావడానికి వెళ్లగా తిరిగి రిపోర్ట్ చేయమని చెప్పారు. జయశంకర్ ఎందుకని ప్రశ్నిస్తే జీతాలు మారాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వారికి ఎంత అన్యాయమని జరుగుతుందని అప్పుడే సార్ మదిలో బీజం పడింది. ఇదే ఆయనను సిద్ధాంతకర్తగా తయారు చేసింది. ఎమర్జెన్సీలో సాహసాలు.. సార్ సీకేఎం కళాశాలలో పనిచేస్తున్న సమయంలో ఎమర్జెన్సీ ప్రారంభమైంది. విప్లవ కవి వరవరరావు కూడా ఇదే కళాశాలలో పని చేసేవారు. ఆ సమయంలో సార్ చాకచాక్యంతో అధ్యాపకులను, విద్యార్థులను తన సామర్థ్యాలతో నిర్బంధం నుంచి కాపాడారు. విద్యార్థులను గుర్తుపెట్టుకుని పిలిచేవారు..సార్ పనిచేసిన మల్టీపర్పస్ పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు తన దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థి పేరు గుర్తుపెట్టుకొని పిలిచేవారు. ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో సార్ వెంట నడిచారు. వరంగల్‌లో ఉపన్యాసం పెట్టించారు.. 1952లో విశాలాంధ్రకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న సమయంలో సార్ అయ్యదేవర కాళేశ్వర్రావు ద్వారా ఉపన్యాసం ఇప్పించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో అఫ్జల్‌గంజ్‌లో జరిగిన సమావేశానికి సార్ వెళుతుండగా భువనగిరి వద్ద బస్‌ఫెయిల్ కావడంతో వెళ్లలేదు. అప్పుడు కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు బలయ్యారు. తాను వెళితే అమరుల జాబితాలో ఉండేవాడినని సార్ పలు సమావేశాల్లో ప్రస్తావించారు. ఇడ్లీ సాంబర్ గో బ్యాక్, నాన్‌ముల్కీలో కీలకపాత్ర పోషించారు. ఎన్నో రచనలు.. జయశంకర్ తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణలో ఏం జరుగుతోంది, వక్రీకరణలు–వాస్తవాలు, తల్లడిల్లుతున్న తెలంగాణ, తెలంగాణ వంటి ఎన్నో పుస్తకాలు రాశారు. నిరంతరం ఉద్యమ భావాలే.. జయశంకర్‌కు 2011జూన్21న తుదిశ్వాస విడిచేవరకు తెలంగాణ మీదే ధ్యాస ఉండేది. నిరంతరం ఉద్యమ భావాలను రగిలిస్తూ జీవించారు. పాఠశాలకు స్థలం విరాళం.. సార్ పుట్టిన గ్రామంలో జెడ్పీహైస్కూల్‌కు గ్రౌండ్ కోసం వారి సొంత స్థలం 1.10 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. -
నా పేరు జై తెలంగాణ
మెదక్ మున్సిపాలిటీ : నా పేరు జై తెలంగాణ అని పెట్టడం గర్వంగా ఉంది. మా అమ్మానాన్న వ్యవసాయ కూలీలు. నాన్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ప్రతి రూపంగా నా పేరు పెట్టాడు. నాన్న తెలంగాణ ఉద్యమంలో పని చేసిన తీరు నాకు పదేపదే చెబుతుంటాడు. నేను చిన్నప్పుడు ఉద్యమంలో నాన్న వెంట పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఊహ తెలిసినప్పుటి నుంచి కేసీఆర్ సార్‌ను కలవాలన్నది నా కోరిక. మే నెలలో కేసీఆర్ సార్∙ మెదక్ వచ్చినప్పుడు ఆయనను కలవాలని బహిరంగ సమావేశానికి నాన్నతో కలిసి వెళ్లాను. కానీ ఆయనను కలిసే అవకాశం నాకు దక్కలేదు. ఎప్పుటికైనా కేసీఆర్ సార్‌ను కలవాలన్నదే నా కోరిక. -
ఉద్యమ నేత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కన్నుమూత
-
ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. నగరంలోని హుస్సేని ఆలంలో 1933 జనవరి 27న జాదవ్ జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటం, ముల్కీ ఉద్యమం, జై తెలంగాణ పోరాటంలో కేశవరావ్ జాదవ్ చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలోనూ జేఏసీ ద్వారా జయశంకర్, కోదండరామ్‌తో కలిసి కేశవరావు జాదవ్ పనిచేశారు. ఆయన పౌరహక్కుల సంఘం అధ్యక్షునిగా, తెలంగాణ జనపరిషత్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సోషలిస్టు నాయకుడు లోహియా అనుచరుడిగా జాదవ్‌కు గుర్తింపు ఉంది. కాగా, జాదవ్ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి శివం రోడ్డులోని ఆయన ఇంటికి తరలించారు. పార్ధీవ దేహానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌తో పాటు పలువురు నివాళులర్పించారు. (కేశవరావు జాదవ్ బౌతిక కాయం వద్ద కోదండరాం) ప్రముఖుల సంతాపం ప్రొఫెసర్ కేశవ రావు జాదవ్ మృతి పట్ల ప్రతిపక్ష నేత జానారెడ్డి సంతాపం ప్రకటించారు. ఒక గొప్ప వ్యక్తిని రాష్ట్రం కోల్పోయిందని, వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూరాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో జాదవ్ కీలకమైన పాత్ర వహించారన్నారు. సమాజ సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేశారన్నారు. -
న్యాయవాదుల సంక్షేమానికి కృషి
షాద్‌నగర్‌టౌన్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాదులు చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర బార్ అసోసియోషన్ చైర్మన్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాదులు ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని పోరాటం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ ఏడాది ఏపీ, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు వేర్వేరుగా ఎన్నికలు జరగనున్నాయన్నారు. మరోసారి న్యాయవాదులు అవకాశం కల్పించి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా తనను ఎన్నుకోవాలని కోరారు. న్యాయవాదుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో అడ్వకేట్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులను లాభం చేకూర్చే విధంగా వారికి ఉపకార వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. విశ్రాంత న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరికీ ఉపయోగపడే విధంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా న్యాయవాదులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, తెలంగాణ అడ్వకేట్స్ ఫండ్ కింద వంద కోట్ల నిధులు ఉన్నాయని, వీటిని న్యాయవాదుల సంక్షేమానికి ఖర్చు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. షాద్‌నగర్‌లో సబ్‌కోర్టు ఏర్పాటు కావడానికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమమే «ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. జూన్ 29న నిర్వహించే రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన కోరారు. 22 ఏళ్ల పాటు బార్ కౌన్సిల్ సభ్యుడిగా, వైస్ చైర్మన్‌గా, చైర్మన్‌గా ఎన్నో సేవలు అందించానని, మరిన్ని సేవలు అందించేందుకు తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో న్యాయవాదులు చెంది మహేందర్‌రెడ్డి, మోముల బసప్ప, కంచి రాజ్‌గోపాల్, పాతపల్లి కృష్ణారెడ్డి, మధన్‌మోహన్‌రెడ్డి, జగన్, శ్రీనివాస్, ప్రణీత్‌రెడ్డి, కవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాంతాచారి త్యాగాన్ని అవమానిస్తున్నారు
సాక్షి, యాదాద్రి: తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆగ్రహించారు. తన కుమారుడు శ్రీకాంతాచారి త్యాగాన్ని యాదాద్రి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్కువ చేస్తున్నారని మండిపడ్డారు. ‘అమరవీరులను స్మరించకుండానే సమావేశాన్ని నిర్వహిస్తారా? సన్మానం కోసం నన్ను చివరగా పిల్చి అవమానిస్తారా?’ అంటూ స్టేజీపై నుంచి దిగిపోతుంటే ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతులు నాయక్ వెళ్లి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోసారి తప్పు జరగకుండా చూస్తామని చెప్పి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత.. శాలువా, పూలదండతో ఆమెను సన్మానించారు. కాగా, శంకరమ్మ స్టేజీపైనే శాలువాను వదిలేసి ఆగ్రహంతో వెళ్లిపోయారు. తర్వాత అక్కడ ఉన్న విలేకరులతో ఆమె మాట్లాడుతూ ‘నల్ల గొండ జిల్లాకు ఏ మంత్రి వచ్చినా, ఏ సమావేశం నిర్వహించినా శ్రీకాంతాచారి పేరు జిల్లాలో ఎక్కడా ఎత్తడం లేదు. నా బిడ్డ త్యాగం మట్టిలో కలిసిందా.. 4 కోట్ల ప్రజలకు తన మాంసాన్ని నూనె చేసిండు.. నరాన్ని ఒత్తి చేసిండు.. ప్రజల్లో ఉద్యమం లేపింది శ్రీకాంతాచారి’అని పేర్కొన్నారు. తమకు లక్షలు, కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, అమరుల కుటుంబాలను గౌరవించినప్పుడే వారి ఆత్మకు శాంతి ఉంటుందని అన్నారు. ‘గతేడాది నేను భువనగిరికి రాను అన్న.. అయినా రమ్మన్నారు. వస్తే చివరగా పిలిచి సన్మానం చేశారు. ఈ సారి కూడా నేను రాను అనుకున్నా. కచ్చితంగా రావాలని పిలిస్తే వచ్చాను. అందర్నీ పిలిచిన తర్వాత ఆఖరున శ్రీకాంతాచారి తల్లి అని పిలిచారు. శ్రీకాంతాచారి నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకొని అమ్మా.. నాన్నా అనకుండా జై తెలంగాణ నినాదాలు ఇచ్చాడు. ఇవాళ బిడ్డ చావుకు అర్థం లేకుండా పోతుంది. అమరవీరుడి తల్లిని ఇలా అవమాన పరుస్తారా’అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన బిడ్డ వర్ధంతిని ఘనంగా నిర్వహించారని వివరించారు. అలాగే పొడిచేడులో మంత్రి హరీశ్‌రావు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని,. శ్రీకాంతాచారి గౌరవం సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు తెలుసని, కానీ కింది స్థాయిలో ఉన్న జిల్లా నాయకులకు తెలియడం లేదని అన్నారు. -
కేసీఆర్ ప్రధాని కావాలి
బహరైన్ : బహరైన్ లో జరిగిన టీఅర్ఎస్ ఎన్నారై కార్యవర్గ సమావేశంలో 2019 ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ ప్రధాని కావాలని కోరుతూ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎన్నారై టీఅర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు బొలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చాలామార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాలు సాగాలని ఆకాక్షించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి తెలంగాణ ప్రయోగశాలగా మారటం హర్షించదగ్గ విషయమన్నారు. మూస విధానాలకు స్వస్తి చెప్పడం ద్వారా తెలంగాణా దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. ఈ కారణంగానే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటాన్ని మరిపించే రీతిలో గాంధీ మహాత్ముడు, అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ విముక్తి పోరాటంలో విజయం సాధించి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. 70 ఏళ్లుగా రెండు జాతీయ పార్టీలు రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నించాయే తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోలేదన్నారు. పేదవాడు మరింత పేదవానిగా, ధనవంతుడు మరింత ధనవంతుడిగా మారుతున్నారే తప్ప పరిస్థితిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే విధానాలనే కాంగ్రెస్, బీజేపీపలు అవలంభించాయని విమర్శించారు. కేవలం 4 సంవత్సరాల వయసున్న రాష్ట్రం అన్ని వర్గాల అభివృద్ధి చేసుకంటూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందన్నారు. దేశ రాజకీయాల్లో బలమైన మార్పు కోసం కేసీఆర్ ముందుకు రావాలని కోరారు. అసాధ్యమన్న తెలంగాణ రాష్ట్రాన్ని తనదైన వ్యూహంతో, ఉద్యమంతో సుసాధ్యం చేసిన కేసీఆర్ తప్పకుండా జాతీయ రాజకీయాల్లో కూడా గుణాత్మక మార్పు తీసుకొస్తారనే విశ్వాసం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, జనరల్ సెక్రటరీలు లింబాద్రి, డా. రవి, సెక్రటరీలు రవిపటేల్, గంగాధర్, సుధాకర్, జాయింట్ సెక్రటరీలు దేవన్న, విజయ్, సుధాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాజేష్, నర్సయ్య, రాజు, రాజేందర్, వెంకటేష్, సాయన్న, వసంత్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమాల గడ్డపై అణచివేతలా?
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్ని సాధించుకుని అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ ఉద్యమాలను దెబ్బతీయడానికి ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మరోసారి ఉద్యమించిన మందకృష్ణ మాదిగను అరెస్టు చేసి జైళ్లో పెట్టడం యావత్ సమాజాన్ని నివ్వెరపర్చింది. ఉద్యమాలు చేస్తే జైళ్లో పెడతారా అని ప్రజల్లో చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన మందకృష్ణపై కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంబించడం దారుణం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మరణించిన భారతి మృతికి నివాళులు అర్పించేం దుకు నిర్వహించిన అమరవీరుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు మందకృష్ణ మాదిగను అరెస్టు చేసి పలుకేసులు నమోదు చేసి జైలుకెళ్లేలా చేశారు. ఉద్యమంతోనే రాష్ట్రాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం అదే ఉద్యమాలను అణగదొక్కాలని చూడడం సహేతుకం కాదు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ ఉద్యమాలే కారణం అనే విషయం కేసీఆర్ మర్చిపోయారా లేక తాను మాత్రమే ఉద్యమాలు చేయాలి. ఇతరులెవరికీ ఆ హక్కు లేదని భావిస్తున్నారా? తెలంగాణ సాధించడం ద్వారా ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీఎం కేసీఆర్ చివరకు ఆ ఉద్యమాల పట్ల అణచివేత ధోరణితో వ్యవహరించడం మంచిది కాదు. – ఇ. చంద్రశేఖర్, సీనియర్ పాత్రికేయులు ‘ 98488 22333 -
గో‘దారి’ మళ్లితే.. గొడవే
సందర్భం రాష్ట్రాల అభ్యర్థనలను లెక్కించకుండా మొండిగా నదులను అనుసంధానం చేసి తెలంగాణ మాగాణాన్ని ఎండబెట్టి గోదావరి జలాలను కృష్ణా, కావేరిలకు పంపించే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజానీకం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. తెలంగాణ ఉద్యమం బలంగా పల్లెల్లోకి చొచ్చుకుపోవటానికి, విస్తరించటానికి, బలపడటా నికి నీళ్లే కారణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నీళ్లే ఆధారం. రైతులు, కూలీలు, కులవృ త్తులు, చేతి వృత్తులు, సబ్బండ జాతులు అంతా కలిస్తేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అవు తుంది. ఈ వ్యవస్థకు మూలం వ్యవసాయం. నీళ్లుంటేనే పల్లె పచ్చగా ఉంటుంది. నీళ్ల విలువేంటో తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో యేటా 25 వేల కోట్ల నిధులు ప్రాజెక్టులకు కేటాయించి కోటి ఎకరాల మాగా ణికి జీవం పోసే దిశగా వడివడిగా అడుగులు వేస్తు న్నారు. గోదావరిలో మనకొచ్చే 954 టీఎంసీల వాటా లో ఒక్క చుక్క వృథాగా పోకుండా జల ప్రాజెక్టులకు రూపం ఇచ్చారు. ఇప్పుడు నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను బలవంతంగా తీసుకపోయి కృష్ణా, కావేరిలోకి మళ్లించి దిగువ రాష్ట్రాల్లో ఓట్ల సాగుకు మోదీ సర్కారు తహతహలాడుతున్నట్లుంది కృష్ణా నదిలో 79 శాతం పరీవాహక ప్రాంతం తెలం గాణలోనే ఉంది. అంటే ముప్పావు వంతు జలాల వాటా తెలంగాణకు దక్కాలే. కృష్ణానది నీటి లభ్యత 811 టీఎంసీలు. ఈ లెక్కన కనీసం 600 టీఎంసీలు తెలం గాణకు రావాలే. కానీ అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం తెలంగాణకు 161 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ వాటాను 111కు కుదించింది. పోయిన నీళ్లు ఎలాగు పోయాయి, కనీసం ఉన్న గోదా వరి జలాలనైనా పోతం చేసుకుందామంటే కేంద్రం తెర మీదకు తెచ్చిన నదుల అనుసంధానంతో మళ్లీ తెలంగా ణను ఎండబెట్టేటట్టే కనబడుతోంది. ఒడిశా రాష్ట్రంలోని మహానదిలో 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీలు మొత్తం కలసి 890 టీఎం సీల మిగులు జలాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం లెక్కలు చెప్తోంది. మహానదిని గోదావరితో కలసి, గోదా వరిని కృష్ణానది మీదుగా కర్ణాటక, తమిళనాడు సరి హద్దుల్లో ఉన్న కావేరి నదికి అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉండగా.. నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం కలిపి 684 టీఎంసీల జలాలే వాడు కుంటున్నారని, మిగిలిన 270 టీఎంసీల నీళ్లు మిగులు జలాలే అని చెప్తోంది. ఇవి అన్యాయమైన లెక్కలని జలరంగ నిపుణులు దివంగత విద్యాసాగర్‌రావు బతికి ఉన్నంతకాలం నెత్తి నోరు బాదుకున్నారు. ఇప్పుడు గోదావరి మీద కాళే శ్వరం, కంతనపల్లి, తుపాకుల గూడెం, దుమ్ము గూడెం, దేవాదుల ప్రాజెక్టులు రూపం పోసుకుంటున్నాయి. పాత ప్రాజెక్టులు ఉండనే ఉన్నాయి. ఏ నది జలాలైనా ప్రస్తుత, కనీస భవిష్యత్తు పరీవాహక ప్రాంత అవస రాలను తీర్చాలి. అంటే మరో 30 ఏళ్ల నాటికి పెరగ నున్న జనాభా, వారికి అవసరమైన నీటి పరిమాణాన్ని నిర్థారించి లెక్కగట్టాలి. ఆ తరువాతే మిగులు జలాలను గుర్తించాలి. కానీ కేంద్రం మాత్రం 20 ఏళ్ల కిందట 75 శాతం నీటి లభ్యతతో తీసిన లెక్కలు చెప్తోంది. ఆ లెక్కలు ఇప్పటి నీటి లభ్యతతో ఎలా సరిపోలుతాయి? భవిష్యత్తు అవసరాలపై కేసీఆర్ ప్రభుత్వానికి పక్కా ప్రణాళిక ఉంది. నిర్మాణం పూర్తి అయిన ప్రాజెక్టు కింద 433.04 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 475.79 టీఎంసీలు, చేపట్టబోయే ప్రాజెక్టుల కింద 45.38 టీఎంసీలు మొత్తం కలిపి 954 టీఎంసీల జలాలు మనకు అవసరపడుతాయి. మరో వైపు మహానదిలో అసలు మిగులు జలాలే లేవు అని ఒడిశా ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్రాల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకో కుండా మొండిగా నదులను అనుసంధానం చే సి తెలం గాణ మాగాణాన్ని ఎండబెట్టి గోదావరి జలాలను కృష్ణా, కావేరిలకు పంపించే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజా నీకం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. నదుల అనుసంధానం అనేది ఇప్పటి ముచ్చటేం కాదు. 1960లో 4,200 కిలోమీటర్ల పొడవైన హిమా లయ ప్రాంత కాల్వలను, 9,300 కిలోమీటర్ల పొడవైన దక్షిణ ప్రాంత కాల్వలను ఢిల్లీ–పట్నాల వద్ద కలపాలని కెప్టెన్ దస్తూన్ తొలిసారి ప్రతిపాదించారు. ఆ తరువాత 1972లో అప్పటి కేంద్ర మంత్రి, ఇంజనీరు కేఎల్‌రావు కావేరి–గంగా నదుల ప్రతిపాదన చేశారు. సోన్, నర్మద, పెన్ గంగ, ప్రాణహిత, గోదావరి, కృష్ణా నదుల మీదుగా కావేరి నదితో అనుసంధానం చేయాలని సూచించారు. ఈ రెండు కూడా ఆచరణ సాధ్యం కాదని అప్పట్లోనే కేంద్రం తేల్చి చెప్పింది. నాటినుంచి నదుల అనుసంధాన ప్రతిపాదనపై చర్చ జరుగుతూనే ఉంది. అనుకూల వర్గం కంటే వ్యతిరేక వర్గమే ఎక్కువగా ఉండ టంతో ప్రభుత్వాలు ఈ ప్రక్రియను పక్కన పెట్టాయి. పశ్చిమ కనుమల్లో వర్ష ప్రభావం ఎక్కువ. అక్కడ స్థిరమైన వర్షపాతం ఉంది. అంతా గుట్టలు, లోయలతో కూడిన ప్రాంతం కాబట్టి వ్యవసాయ భూమి, నివాస ప్రాంతాలు కూడా తక్కువే. ఏటా వందల కోట్ల క్యూసె క్కుల జలరాశులు వచ్చి చేరుతున్నాయి. ఇందులో 90 శాతం నీళ్లు పశ్చిమంగా ప్రవహించి వృథాగా అరేబియా మహా సముద్రంలో కలుస్తున్నాయి. కేంద్రం ముందుగా ఈ జలాల వినియోగంపై దృష్టి పెట్టాలి. వీటిలో పావు వంతు నీళ్లను ఒడిసిపట్టుకుని, తూర్పు దిశగా తీసుకు వచ్చి మహానదిలోకి మళ్లిస్తే ఆ జలాలు గోదావరి, కృష్ణాల మీదుగా కావేరి నదిని తడుతాయి. అప్పుడు నాలుగు నదులేమిటీ? దక్షిణ భారతంలోని నదులన్నిం టినీ అనుసంధానం చేయవచ్చు. మోదీ అటు దిశగా ఆలోచన చేయకుండా గోదావరిని కృష్ణా, కావేరితో అను సంధానం చేస్తానంటే మాత్రం తెలంగాణ ప్రజలు మరో మహా ఉద్యమానికి సమాయత్తం అవుతారు. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త దుబ్బాక శాసనసభ్యులు మొబైల్ : 94403 80141 -
ఉద్యమ గురువును ఉపేక్షిస్తారా?
తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం 1969 తొలి దశ ఉద్యమం నుంచి మొన్నటి మలిదశ ఉద్యమం వరకు ప్రొఫెసర్ జయశంకర్‌కు సరి సమానంగా పోరాటం చేసిన సోషలిస్ట్ నాయకుడు, కోదండరాం, గద్దర్, కూర రాజన్న లాంటి ఎందరో ఉద్యమ నాయకులకే గురువు ప్రొ.కేశవరావు జాదవ్. ఆయన 85వ జన్మదినాన్ని (27.01.2018) తెలంగాణ సమాజం విస్మరించడం దారుణం. ఇప్పుడున్న ఉద్య మ పితామహుల్లో ఈయన ఒకరు. యావత్తు తెలంగాణ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై జాదవ్‌ని గౌరవించవలసిన బాధ్యత ఉన్నది. కానీ ప్రభుత్వం నుంచి ఈ సందర్భంగా ఒక చిన్న ప్రకటన కూడా రాకపోవడం బాధాకరం. ఉద్దేశపూర్వకంగా మరచిపోతే అది కుట్రపూరితమే. పొరపాటుగా ఆయన పుట్టినరోజును మరిచారంటే అజ్ఞానులే! మన పెద్దలను, ఉద్యమ దిగ్గజాలనే మరచిపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? 1969 తెలంగాణ ఉద్యమానికి ఆయన సజీవ సాక్ష్యం! మృదు భాషే కానీ అన్యాయాన్ని నిర్భయంగా నిలదీసే తత్వం ఆయనలో ఎల్ల ప్పుడూ కనిపించేది. సాదా సీదా జీవితం గడిపారు, ఇంకా గడుపుతున్నారు. సమైక్యవాదులను గౌరవిస్తూ, తెలంగాణ సాధనే జీవిత లక్ష్యంగా తమ జీవితాన్ని అంకితం చేసిన వారిని విస్మరించడం సబబేనా? – సయ్యద్ రఫీ, చిత్ర దర్శకుడు -
తిట్టినోళ్లు.. కొట్టినోళ్లే సీఎం వద్ద ఉన్నారు
సాక్షి, యాదాద్రి: తెలంగాణ ఉద్యమకారులను తిట్టినోళ్లు, కొట్టినోళ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి వద్ద ఉన్నారని టీజీవో గౌరవాధ్యక్షుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీ ఆవిష్కరణ కోసం ఆయన భువనగిరికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగులు, ఉద్యమకారులకు ప్రస్తుతం న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను తిట్టినోళ్లు, మమ్మల్ని కొట్టించి జైలులో పెట్టించినోళ్లదే రాజ్యం నడుస్తుంది. అలాంటి వారి వద్దకు పనుల కోసం పోవాలంటే బాధ అనిపిస్తోంది. గతాన్ని తలచుకుంటే దుఃఖం వస్తోంది’’అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారిలో వందశాతం ఈ బాధ ఉందని, కళ్లలోకి నీళ్లొస్తున్నాయని చెప్పా రు. ఈ విషయమై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉన్నమాటే అన్నారని పేర్కొన్నారు. వారిని అందుకే తీసుకున్నారేమో! ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆంధ్రా నాయకులు తెలంగాణను దెబ్బతీసే ప్రయత్నం మొదలుపెట్టారని, వాళ్ల ఆధిపత్యం చలాయించే చర్యలు ప్రారంభించారని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఈ సమయంలో ఇష్టం లేకపోయినా.. తెలంగాణ ఉద్యమంలో లేనివారిని ప్రభుత్వంలోకి తీసుకుని ఉంటారని ఆయన విశ్లేషించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడని, ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను చాలా మంది వ్యతిరేకించారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు రావడంతో వారంతా ఆయనకు జేజేలు పలుకుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్యమకారులెవరినీ మరిచిపోరని, ఎవరికి, ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసన్నారు. దీర్ఘకాలికంగా ఉద్యమకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సకలజనుల సమ్మె, సహాయ నిరాకరణ, తెలంగాణ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని, ఆనాటి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు, యువత కుటుంబాలకు రుణపడి ఉంటామన్నారు. నా మాటలను మీడియా వక్రీకరించింది యాజమాన్యాలకు లీగల్ నోటీస్ ఇస్తా జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని తాను అన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాలు మీడియాకు మంచిది కాదన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమే కానీ, కేసీఆర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నట్లు ఆయన స్పష్టం చేశారు. తాను మంత్రివర్గంపై ఆరోపణలు చేసినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. మంత్రి పదవి రావడం తన చేతుల్లో లేదని.. అది కేసీఆర్ చేతుల్లో ఉందన్నారు. తనపై దురుద్దేశంతోనే అసత్య ప్రచారం చేస్తున్న పత్రికా యాజమాన్యాలకు లీగల్ నోటీసులను ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చాలా కుట్రలు చేస్తున్నారని అలాంటిదే తనపై ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశా రు. తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని కొనియాడారు. -
మాజీ ఎమ్మెల్యే దేశిని కన్నుమూత
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య (86) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించినా కొద్దిసేపటికే మృతి చెందారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన చిన్న మల్లయ్య హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య రాజేశ్వరి, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే .. గీతవృత్తి కార్మికుడి నుంచి దేశిని అంచెలంచెలుగా ఎదిగారు. సీపీఐ నుంచి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. పటేల్, పట్వారీ, ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చి 1957లో తొలిసారి బొమ్మనపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ గ్రామానికి ఏకంగా 21 ఏళ్లు సర్పంచ్‌గా, హుస్నాబాద్ సమితి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1978 సాధారణ ఎన్నికల్లో తొలిసారి ఇందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గారు. 2001లో టీఆర్ఎస్లో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2003లో ఆవిర్భవించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించారు. 2006లో టీఆర్ఎస్ను వీడి తెలంగాణ రైతాంగ సమితి ఏర్పాటు చేసిన దేశిని చినమల్లయ్య ఐదు జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి రైతు సమస్యలపై ప్రత్యేక ఉద్యమాలు నిర్వహించారు. ఏడాది క్రితం వరకు వామపక్ష ఉద్యమాలు, ‘టఫ్’లలో పనిచేశారు. అనారోగ్యం కారణంగా కొద్దిరోజులుగా ఇంటి వద్దే ఉంటున్నారు. లెఫ్ట్ పార్టీల సంతాపం దేశిని మృతికి సీపీఐ, సీపీఎం సంతాపం ప్రకటించాయి. ఆయన బడుగు, బలహీన వర్గాల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సుదీర్ఘ కాలం కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ మేరకు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. ఎంపీ బి.వినోద్ కుమార్ హైదరాబాద్‌లోని దేశిని ఇంటికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆర్టీసీ బస్సుల్లో పయనం ప్రజాప్రతినిధిగా దేశిని చినమల్లయ్య నిరాడంబర జీవితం గడిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం తపించేవారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు, నియోజకవర్గ కేంద్రానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించేవారు. నియోజకవర్గం నుంచి వచ్చే ప్రజలకు అందుబాటులో కరీంనగర్ గణేశ్‌నగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఉంటూ కలెక్టరేట్‌తోపాటు వివిధ కార్యాలయాలకు ఆటో రిక్షా, సైకిల్ రిక్షాలు, ద్విచక్ర వాహనాలపై వచ్చిన సందర్భాలు అనేకం. పీఏలు, అసిస్టెంట్లు లేకుండా స్వదసూర్తితో లేఖలు, వినతిపత్రాలు రాసేవారు. సీఎం కేసీఆర్ సంతాపం.. దేశిని చిన్నమల్లయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి దేశిని క్రియాశీలక పాత్ర పోషించారంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు
సికింద్రాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్‌రోకోలో పాల్గొన్న పలువురు మంత్రులు సోమవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు సోమవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. మౌలాలీ రైల్ రోకో కేసులో ఇప్పటికే మంత్రులు పలుసార్లు కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. -
ఉద్యమస్ఫూర్తికి ఏదీ గౌరవం?
అధికారంలోనున్న నాయకులకు తమ ప్రయోజనాలే కానీ మన అవసరాలు కనిపించడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పాలన పాతకాలపు జాగీర్దార్ల పాలనను తలపిస్తున్నది. మనం కోరుకున్న ప్రజాస్వామిక పాలన కాదిది. ప్రజలకు నిర్ణయాధికారం లేదు. జాగీర్దార్లు అధికారాన్ని తమ ఇష్టానుసారం చెలాయించేవారు. ఇప్పటి పాలకులు కూడా అదే పద్ధతిలో సాగుతున్నారు. ప్రభుత్వానికి కనీసం తమ గోడు చెప్పుకోవడానికి కూడా ప్రజలకు మార్గమే లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏ పని చెప్పినా కాదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, తరువాత రాష్ట్ర ఏర్పాటు చరిత్రాత్మక ఘట నలు. సకల జనులు కలసి, సబ్బండ వర్గాలు ఏకమై సుదీర్ఘ కాలం పోరాడారు. ఉద్యమాల ఫలితంగా, త్యాగాల కారణంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఇప్పుడు ప్రజల ఆకాంక్షలకు గౌరవం లేకుండా పోవడమే పెద్ద విషాదం. ఈ అంశాన్ని వెల్లడించమే అమరవీరుల స్ఫూర్తి యాత్ర ఉద్దేశం. గోచికట్టి గొంగడేసుకుని పాట పాడి, వంటా వార్పూ చేసి, రాస్తారోకోలలో పాల్గొని, రైలు పట్టాల మీద బైఠాయించి, బంద్‌లు పాటించి, సమ్మెలు చేసి, సత్యాగ్రహాలు నిర్వహించి తెలంగాణ ప్రజలు తమ ప్రత్యేక రాష్ట్ర కలను నిజం చేసుకున్నారు. ఆంధ్ర పాలకులతో తెగించి కొట్లాడినారు. ఉద్యమానికి ఊతమిచ్చి తిరిగిరాని లోకాలకు తరలిపోయిన వారు ఎందరో. తరువాత ఎన్నికలలో తెలంగాణవాదుల గెలుపుకోసం రకరకాల మార్గాలలో ప్రచారాలు చేసి, నేను సైతం అన్న తీరులో ప్రతి వ్యక్తి సమరశీలతతో కదం తొక్కారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సంకుచితమైనది కాదు. ఆంధ్రా పాలకులను వ్యక్తిగతంగా వ్యతిరేకించడానికి ఇది సాగలేదు. అసలు ఆంధ్రపాలకులను ద్వేషించడమే దాని ధ్యేయం కాదు. తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని మాత్రమే ఉద్యమం ఎదిరించింది. ‘సచి వాలయంలో కూర్చుని చక్రం తిప్పడం కుదరదు’ అని రాష్ట్ర సాధనోద్యమం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్రోద్యమం గురించి కాళోజీ నారాయణరావు చేసిన వ్యాఖలను గుర్తు చేసుకోవాలి. ‘మాకొద్దీ తెల్లదొరతనము...’ అన్న గరిమెళ్ల వారి గేయంలోని మాటలను ఉటంకిస్తూ కాళోజీ, ‘స్వాతంత్య్రోద్యమం తెల్లవారిని వెళ్లగొట్టడం కోసమే కాదు, దొరతనాన్ని కూడా అంతం చేయడానికి సాగింది’అని పేర్కొనేవారు. సామాజిక, ఆర్థిక రంగాల మీద గుప్పెడు మంది పెత్తనాన్ని కూలదోయాలని తెలంగాణ ఉద్యమం అనుకున్నది. ఉద్యమ ఆకాంక్షలు సమష్టి అధికారాన్ని సమష్టి ప్రయోజనాలకు ఉపయోగించడానికి బదులుగా సీమాంధ్ర పాలకులు కార్పొరేట్ శక్తులకూ, కాంట్రాక్టర్లకూ, రియల్ ఎస్టేట్ డీలర్లకూ మేలు కలిగించే రీతిలో వ్యవహరించారు. అందువల్లనే ప్రజలు, ప్రధానంగా రైతులు, కార్మికులు, కుటీర పరిశ్రమలకు చెందినవారు, చిరువ్యాపారులు బాగా నష్టపోయారు. ఇజ్జత్‌తో బతకగలమన్న విశ్వాసం అడుగంటి పోవడంతో 1990 దశకం నుంచి రైతులు, చేతివృత్తుల వారు అనేక మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే వనరులలో వాటా, అ«ధికారంలో భాగం దక్కుతుందని తెలంగాణ ప్రజానీకం ఆశించింది. అభివృద్ధి నమూనా మారిపోయి బతుకు తెరువు అవకాశాలు పెరుతాయని, అందివస్తాయని భావించింది. ఉద్యోగాలు దొరుకుతాయని యువతీయువకులు బలంగా విశ్వసించారు. అసలు సమష్టి జీవితాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించుకోవాలన్న ఆశయంతోనే ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. కానీ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదు. ఆంధ్ర పాలకుల వలెనే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజలనూ, వారి ఆకాంక్షలనూ పక్కన పెట్టింది. ఆంధ్ర కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ శక్తులకు పట్టం కట్టింది. చిల్లరపైసలు ఇక్కడి ప్రజల ముఖాన కొట్టి గొప్ప ఘనకార్యమేదో చేసినట్టు పేజీలకు పేజీలు పత్రికలలో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రజా ప్రయోజన పథకాల మీద వెచ్చించిన దానికంటే, ఆ ప్రకటనలకే ఎక్కువ ఖర్చయిందేమో కూడా! మిషన్ భగీరథ పేరుతో, ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు ఆంధ్ర పాలకుల జేబులలోనికే వెళ్లాయి. ఉద్యోగాల ఊసే లేదు నీళ్లు, నిధులు, నియామకాలు... ఈ నినాదాలే తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్‌లైన్. ఇందులో నియామకాల నినాదానికి ఆకర్షితులు కావడం వల్లనే యువతీ యువకులు ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడితే తమ వారికి ఉద్యోగాలు దొరుకుతాయని ఉద్యమం కోసం ఆత్మార్పణం చేసుకున్నవారు రాసిపెట్టిన నోట్లలో పేర్కొన్నారు కూడా. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగింది వేరు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో సుమారు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇప్పటికి 20,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. ఉద్యోగ భర్తీ ప్రకటనలు వెలువడతాయన్న ఆశతో అభ్యర్థులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ కోచింగ్ క్లాసులకు హాజరవుతున్నారు. కానీ పోస్టులు మాత్రం అందని ద్రాక్షలుగానే మిగిలిపోతున్నాయి. జరిగిన పరీక్షలైనా అస్తవ్యస్తంగా జరిగాయి. పోటీ పరీక్షలను సక్రమంగా నిర్వహించడానికీ, ఉపాధి అవకాశాలు పెంచడానికీ ఇచ్చిన అన్ని సూచనలను కూడా ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఉద్యోగాల భర్తీకి క్యాలండర్‌ను ప్రకటించాలని, ప్రైవేట్ సంస్థలలో భూమిపుత్రులకు రిజర్వేషన్లు పాటించాలని చేసిన కీలక విజ్ఞాపనలు ప్రభుత్వం చెవికెక్కలేదు. ఉపాధి అవకాశాల కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలన్న సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. సమాన పనికి సమాన వేతనం అన్న సూత్రం ప్రకారం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచే విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వంలో కదలిక లేదు. సంక్షోభంలో వ్యవసాయం ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా రైతుల బలవన్మరణాలు ఆగలేదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,900 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ మూడేళ్లలో పంటల ధరలు పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు రాక సుమారు రూ. 500 కోట్లు తాము నష్టపోవడం జరిగిందని రైతు సంఘాలు చెబుతున్నాయి. కరువు నష్టానికి పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ముట్టలేదు. కనీసం కేంద్రం ఇచ్చిన రూ. 800 కోట్ల పరిహారం కూడా చేరలేదు. రైతులు ఏం పంట వేసుకోవాలో చెప్పలేని దౌర్భాగ్యస్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ సమస్యలకు పరిష్కారాలు ప్రభుత్వానికి తోచక పోవచ్చునని రైతు సంఘాలన్నీ కలసి వ్యవసాయ శాఖ కార్యదర్శికి వివరమైన, విలువైన సూచనలు ఇచ్చాయి. రైతు ఆదాయాన్ని పెంచటానికి సమగ్ర వ్యవసాయ విధానం రావాలన్నారు. రైతులను ఆదుకోవటానికి వ్యవసాయ కమిషన్ వేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయం చేయాలన్నారు. బ్యాంకుల నుంచి రైతులకు కావలసిన అప్పులు ఇప్పించాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే వ్యాపారులను కఠినంగా శిక్షించాలని, పంటల ధరలు పడిపోయినప్పుడు మద్దతు ధర చెల్లించి ఆదుకోవటానికి నిధిని ఏర్పాటు చేయాలని, చిన్న రైతులకు కావలసిన వ్యవసాయ పరికరాలను సబ్సిడీకి ఇవ్వాలని కోరినా ఉలుకూ పలుకూ లేదు. సంక్షేమ పథకాల అమలు–తీరుతెన్నులు ప్రజలకు అవసరమయ్యే ఏ పథకం కూడా అమలు కావడం లేదు. ఫీజు రీయింబర్సుమెంటు బకాయిలు చెల్లించక పోయేసరికి చాలామంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. ఉద్యోగాలకు అర్హత కోల్పోయారు. సింగరేణిలో ఓపెన్ కాస్టు గనులను ఆపే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల పునరుద్ధరణ జరగనే లేదు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోతున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లుతున్నాయి. చిన్న, సూక్ష్మ పరిశ్రమల పునరుద్ధరణకు ప్రయత్నమే లేదు. నిజాం షుగర్స్‌ను తెరిచి, నడిపిస్తామన్న హామీని మరిచి ఇవాళ పూర్తిగా మూసేశారు. నిర్వాసితుల కోసం 2013 భూసేకరణ చట్టం కల్పించిన మానవీయ పద్ధతులు రద్దయిపోయాయి. దాదాపు 3 లక్షల ఎకరాల భూమిని బలవంతంగా గుంజుకోవడానికి, నిర్వాసితుల హక్కుల రద్దు కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి నల్లాలు ఉన్నాయి. కానీ వాటిని తవ్వి మళ్లీ కొత్త పైపులు పరుస్తున్నారు. అదికూడా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే. అందుకైన వేల కోట్ల నిధుల దుర్వినియోగాన్ని ఆపగలిగితే డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి కావలసినన్ని నిధులుండేవి. ఇప్పటివలెనే అమలైతే మూడెకరాల పథకం కింద భూమిలేని దళితులందరికీ భూమి పంచడానికి 230 సంవత్సరాలు పడుతుంది. సాగునీటి పథకాల ఖర్చు తగ్గించే లక్ష్యంతో డిజైన్ చేస్తే సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరతే ఉండదు. అది అట్లుండగా వార్తలకెక్కిన భూ కుంభకోణాలు అధికార దుర్వినియోగాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు, రియల్ ఎస్టేట్ డీలర్లతో కుమ్మక్కై వేల ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. అప్రజాస్వామిక వైఖరి అధికారంలోనున్న నాయకులకు తమ ప్రయోజనాలే కానీ మన అవసరాలు కనిపించడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పాలన పాతకాలపు జాగీర్దార్ల పాలనను తలపిస్తున్నది. మనం కోరుకున్న ప్రజాస్వామిక పాలన కాదిది. ప్రజలకు నిర్ణయాధికారం లేదు. జాగీర్దార్లు అధికారాన్ని తమ ఇష్టానుసారం చెలాయించేవారు. ఇప్పటి పాలకులు కూడా అదే పద్ధతిలో సాగుతున్నారు. ప్రభుత్వానికి కనీసం తమ గోడు చెప్పుకోవడానికి కూడా ప్రజలకు మార్గమే లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏ పని చెప్పినా కాదు. ముఖ్యమంత్రి ఎవ్వరినీ కలువరు. గజేంద్రుడు వేడుకుంటే వైకుంఠపురిలోని విష్ణుమూర్తి దిగొచ్చాడు. కానీ ఎన్ని మొక్కినా మన ముఖ్యమంత్రి బయటకు రాడు. ప్రజలను కలువడు. తమ సమస్యలు నలుగురికీ వినిపించడానికి ఉన్న ఒక్క వేదిక ఇందిరా పార్కు వద్దనున్న ధర్ణాచౌకును కూడా మూసివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వార్త కూడా రాయవద్దని మీడియాపై జులుం చెలాయిస్తున్నారు. రాష్ట్రాన్ని తేవడానికి ప్రజలు చేసిన త్యాగాలకు, బలిదానాలకు ఇవాళ గుర్తింపు లేదు. విలాసాలు, హైదరాబాద్ చుట్టుప్రక్కల ఆస్తులు, కాంట్రాక్టుల పంపకాలు, ప్రచారాలు ఇదీ పాలకుల వ్యవహారం. దీన్ని ప్రజలకు తెలియజెప్పడానికే అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తున్నాం. తెలంగాణ ఆకాంక్షలను పరిరక్షించడానికే మొదలుపెట్టినాం. ప్రజలు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎంతోమంది నియంతల పాలనను అంతం చేసిన మనకు ప్రజాస్వామిక తెలంగాణను నిర్మించుకోవడం పెద్ద పని కాదు. - వ్యాసకర్త టీజేఏసీ ఛైర్మన్ యం. కోదండ రామ్ మొబైల్ : 98483 87001 -
ఓయూలో హత్యలు చేసిన బాల్క సుమన్: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్య మం ముసుగులో ఎంపీ బాల్క సుమన్ విద్యార్థులను హత్య చేశారని ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చిన తర్వాత ఆ హత్యల వివరాలను బయటపెడతానన్నారు. ‘నాకు గుండు కొట్టిస్తానని సుమన్ అంటున్నడు. దమ్ముంటే నన్ను ముట్టుకో. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులే సంగారెడ్డికి రావాలంటే భయపడతరు’ అని జగ్గారెడ్డి అన్నారు. సుమన్‌కు దమ్ముంటే ఓయూ లో సీఎంతో సభ పెట్టించాలని సవాల్ చేశారు. హైదరాబాద్‌లోనూ సుమన్‌ను తిరక్కుండా చేయగలనన్నారు. -
‘ఎన్టీఆర్‌నే చావగొట్టినోడు..మనకేం చేస్తాడు?’
హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌నే చావగొట్టినోడు మనకేం చేస్తాడు, మామను చంపి మంత్రి అయినోడు ఎలా చేస్తాడు..' అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్ధేశించి రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేశారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమానికి ఓ చరిత్ర ఉందని, ఆ చరిత్ర ఆధారంగానే ఇప్పుడు తెలంగాణ వచ్చిందని, లేకుంటే వచ్చేది కాదన్నారు. తెలంగాణ వాదులు ముందు నుంచీ మోసపోతూనే ఉన్నారని, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఆంధ్రాకు చెందిన వారు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారనే విషయంపై ముగ్గురు ఐఏఎస్‌లతో కమిటీని వేయగా, ఏపీకీ చెందిన వారు 85వేల మంది ఇక్కడ చేస్తున్నారని.. అందుకే ఇక్కడ వారికి ఉద్యోగాలు దక్కట్లేదని కమిటీ రిపోర్టు ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఆ ఉద్యోగాలన్నీ ఇక్కడ వారికే వర్తించేలా 610 జీఓను ప్రవేశపెట్టారు. ఆ తరువాత బాబు ముఖ్యమంత్రి అవ్వడం, ఎన్టీఆర్ మరణించడం అన్నీ జరిగిపోయాయి.. కానీ జీఓ మాత్రం అమలు కాలేదు. అప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది ఎన్టీఆర్‌నే చావగొట్టినోడు ఇంకా మనకేం చేస్తాడులే అని ఆ రోజుల్లోనే అనుకున్నామని.. ‘1969 జై తెలంగాణ విద్యార్థి నేతల ఉద్యమ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో నాయిని గుర్తు చేశారు. శనివారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో జరిగిన ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన నాయిని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పొయారన్నారు. మొక్కవోని దీక్షతో కేసీఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ వచ్చిందన్నారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని అప్పుడు కాంగ్రెస్ పెద్దలకు నేరుగా చెప్పానన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్.గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పాటే ప్రాణం!
► కళాకారుడిగా రాణిస్తున్న చరణ్ ►ప్రభుత్వ గుర్తింపునివ్వడంలో వివక్ష ►రాష్ట్రం, జిల్లా సాధన, హక్కుల సాధన కోసం వందలాది ప్రదర్శనలు ►ప్రముఖులచే ప్రశంసలు గద్వాల అర్బన్: ధరూర్ మండలం నీలహాళ్లి గ్రామానికి చెందిన చరణ్‌కు పాటంటే ప్రాణం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి గాయకుడిగా, రచయితగా, డ్యాన్సర్‌గా రాణిస్తున్నాడు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో, సకలజనుల సమ్మెలో తన పాట, ఆటలతో ఆకట్టుకున్నాడు. అలాగే గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని నడిగడ్డలో ఎగసిన ఉవ్వెత్తు ఉద్యమంలోనూ తనవంతు పాత్రను పోషించాడు. ఎక్కడ ప్రదర్శనలు చేసినా తన ఆటపాటలతో ప్రజలను ఉర్రూతలూగించాడు. అమ్మ తొలిగురువు తల్లిదండ్రులకు నలుగురు సంతానం, చివరి వాడు చరణ్. నిరుపేద దళిత కుటుంబం కావడంతో ఉప్పేరు హాస్టల్లో టె¯ŒS్త వరకు చదివించారు. ఆపై చదువులు చదివించలేకపోవడంతో తల్లితో పాటు వ్యవసాయ పనులకు వెళ్లేవాడు. అక్కడ తల్లిపాడే జానపద గేయాలు, బొడ్డెమ్మ పాటలకు కోరస్‌గా పాడేవాడు. అప్పుడే పాటపై ఇష్టం ఏర్పడింది. రాత్రివేళ కాలనీలో కోలాటం వేసేవారు. అందులో తండ్రి జంగిలప్ప ద్వారా కోలాటం నేర్చుకున్నాడు. జిల్లా ఉద్యమంలో... నూతన ఏర్పాటులో మొదట గద్వాల పేరు లేకపోవడంతో ఇక్కడ ప్రజలు జిల్లా కోసం అనేక నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు, జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షల్లో చరణ్ తన గళంవిప్పాడు. జిల్లా ప్రాశ్సస్త్యం, ప్రాముఖ్యతపై పాటలు రాసి పాడాడు. జిల్లా సాధించుకున్న తర్వాత కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సంబురాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులచే శభాష్ అనిపించుకున్నాడు. 2015లో ఐదు రోజుల పాటు జరిగిన పాలమూరు కళాప్రదర్శన కళాబృందం ప్రదర్శించి అప్పటి కలెక్టర్ శ్రీదేవి చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారులను ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం కల్పించారు. కానీ చరణ్‌పై మాత్రం వివక్ష ప్రదర్శించారు. 2001 నుంచి ప్రారంభం... అప్పటి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాటలు రాసి స్వయంగా పాడాడు. ప్రభుత్వ కార్యక్రమాలు, మూఢనమ్మకాలపై, అంటరానితనం, దళితుల దేవాలయ ప్రవేశం, పల్లెసుద్దుల తదితర కార్యక్రమాలపై కళాజాతా ప్రదర్శన ఇచ్చాడు. ఎస్సీ వర్గీకరణపై చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో... 2005లో తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో నడిగడ్డ నుంచే మొట్టమొదటి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో కేసీఆర్, లక్ష్మారెడ్డి వెంట ధూంధాం కార్యక్రమాలు, ఆటలు పాటలు, డప్పుల ప్రదర్శనలు ఇచ్చారు. పాటల ద్వారా తెలంగాణ ఉద్యమంపై అవగాహన కల్పించారు. తెలంగాణ వస్తే బతుకు మారుతుందని భావించి సకలజనుల సమ్మెలో 42రోజుల పాటు అహర్నిశలు ఆటలు, పాటలు పాడుతూ ధూంధాం నిర్వహించడం జరిగింది. నడిగడ్డ జిల్లాలో చరణ్ బృందం పాల్గొనని కార్యక్రమమే లేదు. నడిగడ్డ కళాకారులపై ప్రభుత్వం వివక్ష ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా పాటను మాత్రం వదలేదు. 17ఏళ్లుగా... తెలంగాణ ఉద్యమం, జిల్లా సాధనలో, జిల్లా సంబరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంలో వందలాది ప్రదర్శనలు ఇచ్చాను. అయినా ప్రభుత్వం నడిగడ్డ కళాకారులను గుర్తించకుండా వివక్ష చూపుతోంది. నాతోపాటు అనేక మంది కళాకారులకు అన్యాయం చేసింది. ఇది నాపై వివక్ష కాదు. కళపై వివక్ష. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పించాలి. –చరణ్, కళాకారుడు -
తెలంగాణ ఉద్యమానికి పునాది నల్లగొండ జిల్లానే
► మంత్రి ఈటల రాజేందర్ మోత్కూరు :నీళ్లు, నిధులు, నియామకాలు కావాలంటూ ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమానికి పునాదివేసింది ఉమ్మడి నల్లగొండ జిల్లానేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం మోత్కూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. మొదట పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ సాధించుకున్నామని కొట్లాడితెచ్చుకున్న తెలంగాణలో కన్నీళ్లు ఉండొద్దనే తపనతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత పాలకులు కార్మిక వర్గాలతో సంఘాలు పెట్టించి ఉద్యమాలు చేయించి వారి సమస్యలను విస్మరించారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కులవృత్తులకు సాయం చేస్తే గ్రామాభివృద్ధి జరుగుతుందని భావించి బడ్జెట్లో రూ.10వేల కోట్లు కేటాయించామన్నారు. భవన నిర్మాణ, రవాణా రంగ కార్మికులకు ప్రమాద బీమా రూ.ఐదు నుంచి రూ.ఆరు లక్షలకు పెంచినట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు ఏనాడూ వృత్తిదారులను పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేస్తూ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ మాట్లాడుతూ పల్లెజీవన ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఈటల రాజేందర్ కృషితోనే పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్, మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు టి.మేఘారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కె.యాకుబ్‌రెడ్డి, ఎంపీపీ ఓర్సు లక్ష్మీ, వైస్ ఎంపీపీ వంగా లలిత, సర్పంచ్‌లు బయ్యని పిచ్చయ్య, నిమ్మల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు జంగ శ్రీను, జనార్దన్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కె.శోభన్‌బాబు, నాయకులు కె.ప్రకాశ్‌రాయుడు, ఆనందమ్మ, శైలజ, కమలమ్మ, పొన్నాల వెంకటేశ్వర్లు, బి.వెంకటయ్య, కందుల విక్రాంత్, కోమటి మత్స్యగిరి, పి.రమేశ్ తదితరులు ఉన్నారు. -
చచ్చిపోతా... అనుమతివ్వండి
గ్రీవెన్స్‌సెల్‌లో తెలంగాణ ఉద్యమకారుడి విజ్ఞప్తి వరంగల్ రూరల్: తెలంగాణ పోరాటంలో పాల్గొన్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని లేని పక్షంలో ‘మెర్సీ కిల్లింగ్’ పద్ధతిలో చనిపోయేందుకు అనుమతించాలని వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకాలపల్లికి చెందిన ఆకుల సాంబరావు కోరారు. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రం అందజేశారు. అనంతరం సాంబరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పదిహేనేళ్ల పాటు పాల్గొన్న తాను మానసిక క్షోభకు గురికావడంతో పాటు వివిధ వ్యాధుల బారిన పడ్డానని పేర్కొన్నారు. ఇకనైనా సీఎం సహాయ నిధి నుంచి చికిత్స కోసం ఆర్థిక సాయం అందజేయడంతో పాటు ఉపాధి నిమిత్తం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని కోరారు. లేనిపక్షంలో మెర్సీ కిల్లింగ్ పద్ధతిలో చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ఉపన్యాసాలే తప్ప మీరు చేసిందేమిటి?
⇒ కోదండరామ్‌కు టీజేఏసీ అసంతృప్త నేతల బహిరంగ లేఖ ⇒ వివిధ జిల్లాలకు చెందిన 22 మంది సమావేశం ⇒ ఉద్యమకారులకు న్యాయం చేయడం లేదని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం లోనూ, రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా ఉపన్యా సాలు ఇవ్వడంతప్ప టీజేఏసీ చైర్మన్ కోదండరాం చేసిందేమీ లేదని జేఏసీ అసం తృప్తి నేతలు ఆరోపించారు. జేఏసీ కో–చైర్మన్ నల్లపు ప్రహ్లాద్ అధ్యక్షతన కన్వీనర్ పిట్టల రవీందర్, కో–కన్వీనర్ తన్వీర్ సుల్తానా సహా వివిధ జిల్లాలకు చెందిన 22 మంది జేఏసీ నేతలు హైదరాబాద్‌లోని అశోకా హోటల్లో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం సమావేశం వివరాలను, కోదండరామ్‌కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. నల్లపు ప్రహ్లాద్, పిట్టల రవీందర్, తన్వీర్ సుల్తానా రాసిన లేఖను సమావేశం ఏకగ్రీ వంగా సమర్థించినట్టుగా వెల్లడించారు. నియామాలకు విరుద్ధం.. జేఏసీ రూపొందించుకున్న నిబంధనలకు విరుద్ధంగా కోదండరాం వ్యవహరిస్తున్నారని నేతలు తమ లేఖలో ఆరోపించారు. టీ జేఏసీ రాజకీయపార్టీలతో కలసి పనిచేయ దని, రాజకీయ పార్టీగా మారదని ప్రకటి స్తూనే.. రాజకీయ పార్టీలతో, రాజకీయ నాయకులతో కోదండరాం అంటకాగుతున్నా రని విమర్శించారు. తెలంగాణ సామాజిక సమన్యాయ సాధనలో ఒక ప్రత్యేక కార్యా చరణను ఎందుకు రూపొందించుకోలేదని... ఇంతవరకూ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎందుకు నిర్వహించలేదని నిలదీశారు. జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేయ డానికి కనీస అవకాశాల్లేవని.. కోదండరాం అనుసరిస్తున్న స్వీయ అస్తిత్వ ధోరణితో ఇది స్పష్టమవుతోందన్నారు. ఉద్యమకారులు ఇంకా నష్టపోతున్నారు... ఉద్యమకారులు ఇంకా అనేక విధాలుగా నష్టపోతున్నారని, అణచివేత అనుభవిస్తున్నారని.. దీనికి కోదండరాం వైఖరే కారణమని నేతలు విమర్శించారు. వారికి న్యాయం జరిగే విధంగా వ్యవహరించాల్సిన బాధ్యత కోదండరాంపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు నిర్వహించిన పాత్ర గొప్పదని, కానీ వారికి సంబంధించిన ఏ అం శాన్నీ జేఏసీ ప్రస్తావించలేదని పేర్కొన్నారు. జేఏసీలో తాము వ్యక్తం చేసిన అభిప్రాయా లకు సమాధానం రాకపోవడంతో ఇలాంటి కీలకాంశాలపై అంతర్గత చర్చకు అవకాశం లేదని స్పష్టమైందని, అందుకే బహిరంగలేఖ రాస్తున్నామని నేతలు ప్రకటించారు. ఈ సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు సి.రాంచందర్, చొప్పరి శంకర్ ముదిరాజ్, ఆదిలాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ దుర్గం రాజేశ్, ఎం.మధుసూదన్‌బాబు (గద్వాల జిల్లా కో–కన్వీనర్), తొగరి బాబూరావు (భూపాలపల్లి జిల్లా కన్వీనర్), నాగుర్ల సంజీవరావు (మేడ్చల్ జిల్లా కన్వీనర్), ఆకుల మహేందర్(పెద్దపల్లి), వెంకట మల్లయ్య (జేఏసీ కరీంనగర్ జిల్లా చైర్మన్), శ్రీనివాస్ (రంగారెడ్డి మాజీ చైర్మన్), సదానందం(రంగారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్), ముకుంద నాగేశ్వర్ (పరిగి), పూల్‌సింగ్ (మంథని), రవీందర్ (హైదరాబాద్, పాతబస్తీ), సుభద్ర (సిరిసిల్ల జిల్లా జేఏసీ కోకన్వీనర్), తుమ్మల సుమిత్ర, పుష్పలత, వరలక్ష్మి, లలిత (కరీంనగర్ జిల్లా మహిళా జేఏసీ) తదితరులు పాల్గొన్నారు. కోదండరాం వైఖరితో అన్యాయం తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణ సందర్భంలోనూ కోదండరాం చేసిందేమీ లేదని నేతలు తమ లేఖలో ఆరోపించారు. ఉద్యమ, పౌర సంఘాలు ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల కు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిపోవడంతప్ప ఆయన పాత్రేమీ లేదన్నారు. ఉద్యమ సమయంలో ప్రజాసంఘాలు, విద్యార్థి, కుల, మహిళా, యువజన సంఘాలు, జేఏసీ కార్యకర్తలు, నేతలు నిర్వహించిన పాత్రను కోదండరాం ఏనాడూ ప్రస్తావించలేదన్నారు. ఉద్యమంలో అనేకమంది నేతలు ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయారని.. వారికి న్యాయం చేయడానికి కోదండరాం ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. -
కాంట్రాక్టర్లను కాదు..రైతులను బాగు చేయాలి
టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం కొత్తగూడెం టౌన్: ప్రభుత్వం కాంట్రాక్టర్ల ను కాకుండా.. రైతులను బాగు చేసే ఆలోచన చేయాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. సమస్యలపై పోరాటం చేసేవారిని అడ్డుకోవడం గొప్పతనం కాదని.. ఆ సమస్యను పరిష్కరిస్తేనే గౌరవం గా ఉంటుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన టీపీ టీఎఫ్ జిల్లా మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన కోదండరాం విలేకరులతో మాట్లా డారు. నిరుద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. లక్ష ఉద్యోగాల ప్రకటన ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని.. చివరికి అభ్యర్థుల వయసు సైతం మించిపోయే పరిస్థితులు ఉన్నా యన్నారు. తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యతోపాటు వాటి భర్తీకి పోటీ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న రిజర్వాయర్ నుంచి 50 టీఎంసీల నీటిని ఎలా మళ్లిస్తున్నారో, శ్రీశైలం కాలువ పనులు చూస్తే కాంట్రాక్టర్ల దోపిడీకి ప్రభుత్వం ఎంత మద్దతుగా ఉందో అర్థమవుతుందన్నారు. భూములను కోల్పో తున్న రైతుల పక్షాన ప్రశ్నిస్తే.. అన్ని వర్గాలను రెచ్చగొడుతున్నా రని, ప్రభుత్వం లోని పెద్దలే అవాకులు చెవాకులు పేలు తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల సహాయంతో పోరా టాలు చేశానని.. సొంత నిర్ణయాలు తీసు కునే తెలివి తేటలు తనకున్నాయని తెలిపారు. సొంతంగా ఆలోచించే శక్తిలే ని కొందరు దద్దమ్మలు చేసే ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నానన్నారు. -
ఉద్యమంలో గ్రూప్–1 అధికారుల పాత్ర ప్రశంసనీయం
► ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో గ్రూప్–1 అధికారుల పాత్ర ప్రశంసనీయమని ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో తెలంగాణ గ్రూప్–1 అసోసియేషన్ డైరీని నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ, ఉద్యమంలో గ్రూప్–1 అధికారులు తమ హోదాలను పక్కన పెట్టి 2010లో నిర్మాణాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. అసోసియేషన్ అధ్యక్షుడు మామిడ్ల చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ, సహాయ నిరాకర ణ, సకలజనుల సమ్మె ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ ఏర్పాటుకు తమ వంతు పాత్ర పోషిం చామని అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతీ సోమవారం గ్రూప్–1 అధికారులందరూ చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. -
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో...
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు రాగా, తాజాగా ‘బంగారు తెలంగాణ’ పేరుతో మరో చిత్రం తెరకెక్కింది. బిపిన్ , రమ్య జంటగా బిపిన్ దర్శకత్వంలో షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై డా. లయన్ ఏవీ స్వామి నిర్మించి, కీలక పాత్ర చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘1969లో వివేకవర్ధిని కళాశాలలో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమం నుంచి నేటి శ్రీకాంతాచారి వరకు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఆమరణ నిరాహారదీక్షతో పాటు ఎంతో మంది ఉద్యమాలు చేయడంతో బంగారు తెలంగాణ సాధ్యమైంది. ఈ నేపథ్యంలోనే మా చిత్రం ఉంటుంది. ఇందులో నేను లాయర్ పాత్ర చేశా. కేసీఆర్‌గారి పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ‘బంగారు తెలంగాణ’ పాటలు, మార్చి రెండో వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధు ఎ. నాయుడు, కో–ప్రొడ్యూసర్: కిష్టంపల్లి సురేందర్‌రెడ్డి, సమర్పణ: రమ్య. -
క్యాలెండర్ ఆవిష్కరణ
నిర్మల్ టౌన్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం టీయూటీఎఫ్ 2017 క్యాలెండర్‌ను రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో టీయూటీఎఫ్ కీలకపాత్ర పోషించిందన్నారు. ఇందులో కలెక్టర్ ఇలంబరిది, జేసీ శివలింగయ్య, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీమనోహర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నాగభూషణ్, రవికాంత్, లక్షీ్మప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ టౌన్ : పీఆర్టీయూ సంఘం రూపొందించిన 2017 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆదివారం రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. ఇందులో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారావు, జి.జనార్దన్, నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ రూరల్ : తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ యూనియన్ (టీఎంఈయూ) నూతన సంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. జిల్లాకేంద్రంలోని తన స్వగృహంలో ఆదివారం యూనియన్ నాయకులతో కలిసి ఆయన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా హిదాయత్‌అలీ, ప్రధాన కార్యదర్శి మహ్మద్ అథరుద్దీన్, కోశాధికారి మొయిజుద్దీన్, నాయకులు ఇర్ఫాన్, మతీన్, షరీఫ్, నహిద్పాషా, గౌసోద్దీన్, అన్సర్, ఫిరోజ్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. -
'తెలంగాణ ఉద్యమంలో దివ్యాంగులదే కీలకపాత్ర'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో దివ్యాంగులే కీలక పాత్ర పోషించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ గద్దెనెక్కాక ఒక్కసారి కూడా వికలాంగుల దినోత్సవంలో పాల్గొనకపోవడం ఆయనకు వారి పట్ల ఉన్న చిన్న చూపుకు నిదర్శనం అని మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన వికలాంగుల దినోత్సవంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జనాభా నిష్పత్తి ప్రకారం వికలాంగులకు మూడు శాతం డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. వికలాంగులకు ప్రత్యేక శాఖ కోసం అసెంబ్లీలో డిమాండ్ చేస్తామని చెప్పారు. -
ప్రజల సొమ్ముతో కేసీఆర్ రాజసౌధం!
సాక్షి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దుబారా, సోకులకు పోరుు ప్రజల సొమ్ముతో తొమ్మిదెకరాల్లో 150 గదులతో రాజసౌధం నిర్మించుకోవడం విడ్డూరంగా ఉందని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. ఇంత పెద్ద భవనం దేశ ప్రధానికి సైతం లేదన్నారు. సామాన్యులకు డబుల్ బెడ్రూమ్లు లేకపోరుునా..సీఎం మాత్రం ఇంద్రభవనం నిర్మించుకోవడం ఏంటని ప్రశ్నించారు. జనహితం కోరుకోకుండా స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రశ్నించిన సామాజిక శక్తులను అరెస్ట్ చేరుుంచడం విచారకరమన్నారు. కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సోమవారం విలేకరులతో మాట్లాడారు. హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతుంటే నిర్బంధాలతో అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల అనుమతి తీసుకుని ధర్నాచౌక్‌లో నిరసన తెలపడానికి వెళ్తే అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. రెండున్నరేళ్లలో అట్టడుగు వర్గాలకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. దళితులకు భూపంపిణీ, రుణమాఫీ, ఫీజురీరుుంబర్స్‌మెంట్ విడుదలపై దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరమన్నారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను వదిలి తన సీటులో చినజీయర్‌స్వామిని కూర్చోబెట్టడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. మంద కృష్ణకు రెండు నెలలుగా అపారుుంట్‌మెంట్ ఇవ్వకపోవడం జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా - మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్రంలో డెంగీ, విషజ్వరాలతో జనం ఇబ్బందులు పడుతుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసమస్యలను విస్మరించడమేనా బంగారు తెలంగాణ అని మాజీ ఎమ్మెల్యే, ఉద్యమ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14వేల టీచర్ల ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ప్రైవేట్ విద్యాసంస్థలను పెంచిపోషిస్తున్నారన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం ఎటువైపో తేల్చుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమ వేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్‌గౌడ్, మానాల లింగారెడ్డి, జిల్లా నాయకులు మేరి, మాల మహార్ రాష్ట్ర కన్వీనర్ వెంకటస్వామి, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మేడి అంజయ్య, టీవీవీ జిల్లా నాయకులు వెంకటేశ్, వనిత, మాధవి, అనిల్, మల్లేశం, శ్రీనివాస్, దుర్గయ్య, దళిత లిబరేషన్‌ఫ్రంట్ నాయకుడు మార్వాడి సుదర్శన్ పాల్గొన్నారు. -
మంత్రులపై కేసు కొట్టివేసిన రైల్వే కోర్టు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రస్తుత మంత్రుల్లో కొందరిపై నమోదైన కేసులను రైల్వే కోర్టు కొట్టివేసింది. తమపై నమోదైన కేసుల విచారణ సందర్భంగా రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పద్మారావులు బుధవారం సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం కూడా కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో పల్లె పల్లె పట్టాలపైకి అనే నినాదంతో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో వీరితో పాటు పాల్గొన్న పలువురిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. -
ఉద్యమకారుడైనందుకు.. ఉద్యోగం ఊడింది
► ఆర్టీసీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విద్యాసాగర్ ► తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఊడిన ఉద్యోగం సిద్దిపేట కల్చరల్: ఆర్టీసీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు ఓ ఉద్యమకారుడి ఉద్యోగం ఊడింది. దీంతో అతడు ఇంటికి వెళ్లలేక గుడిలోనే జీవనం సాగిస్తున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన వనపర్తి విద్యాసాగర్ 1988లో కడప బస్ డిపోలో సెక్యూరిటీగార్డుగా విధుల్లో చేరాడు. అక్కడ కొన్నేళ్లు పనిచేశాక అనంతపూర్‌కు, అక్కడి నుంచి జగిత్యాల డిపోకు బదిలీ చేశారు. అప్పట్లో ఇతను స్వరాష్ట్రం తెలంగాణ కావాలని బలంగా కోరుకున్నాడు. కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యోగం చేస్తూనే స్వరాష్ట్రం వచ్చే దాకా అఖండ అయ్యప్పమాలను స్వీకరించి, శబరిమలైకి ప్రతి సంవత్సరం పాదయాత్రగా వెళుతున్నాడు. ఇందుకోసం తనకున్న కొద్దిపాటి భూమిని.. భార్య మెడలోని పుస్తెల తాడును అమ్మేశాడు. ఈ క్రమంలో ఓసారి విద్యాసాగర్‌ను కేసీఆర్ సన్మానించారు కూడా. అరుుతే, విద్యాసాగర్ ఉద్యమంలో పాల్గొనడం నచ్చని అప్పటి ఆంధ్ర అధికారి ఇతడిని విధుల నుంచి తొలగించారు. దీంతో తన బాధను అప్పటి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌కు మొరపెట్టుకోవడంతో.. ఆయన చొరవతో మెట్పల్లి బస్ డిపోలో సెక్యూరిటీ గార్డుగా పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. మళ్లీ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడనే కారణంతో ఆరు నెలల్లోనే విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు కాగితం చేతిలో పట్టారు. దీంతో పిల్లలను చదివించే స్థోమత లేక.. భార్యకు మొహం చూపలేక ఎంతగానో మదనపడ్డాడు. దసరా రోజు.. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ దసరా రోజు సిద్దిపేట జిల్లాను ప్రారంభిస్తారని తెలుసుకొని మళ్లీ తన గోడును చెప్పుకోవడానికి సిద్దిపేటకు వచ్చాడు. కానీ అది సాధ్యపడలేదు. ఇతర ప్రజా ప్రతినిధులకైనా గోడు చెబుతామనుకుంటే వీలుకాకపోవడంతో ఇక చేసేది లేక.. సిద్దిపేట అయ్యప్ప దేవాలయంలోనే కాలం వెల్లదీస్తున్నాడు. ఏనాటికైనా సీఎం కేసీఆర్‌ను సిద్దిపేటలోనే కలుస్తాననీ, తన గోడు చెప్పుకొంటానని ఆశతో ఎదురు చూస్తున్నాడు. సీఎం చొరవ చూపాలి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించడంతో.. ఆర్టీసీలోని ఆంధ్ర అధికారి సంపత్‌కుమార్‌కు కోపం వచ్చింది. నన్ను రెండుసార్లు సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలోనుంచి తీసేశారు. సర్వం కోల్పోయిన నాకు మళ్లీ నా జాబ్ కావాలి. కేసీఆర్, ఇతర నాయకులు తలచుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు. కాస్త జాలి చూపి, నా కుటుంబాన్ని ఆదుకోండి. మీ కాళ్లకు దండం పెడతా. - విద్యాసాగర్, బాధితుడు -
పోరాటాల గడ్డ నిర్మల్
నాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా.. నేడు జిల్లా సాధన కోసం.. ఉద్యమ ఫలితంగానే జిల్లా ఏర్పాటు చారిత్రాత్మక జిల్లాగా నిలువనున్న నిర్మల్ ఆనాడు తెలంగాణ విముక్తి కోసం నిర్మల్ కేంద్రంగా సాయుధ పోరాటం జరిగింది. నైజాం, ఆంగ్లేయుల నిరంకుశ పాలనను తుదముట్టించి తెలంగాణ సాయుధ పోరాటంలో నిర్మల్ ప్రాంతానికి చెందిన పోరాటయోధుల చూపిన పటిమ అమోఘం. ఆ తర్వాత ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. నాటి ఉద్యమానికి నిర్మల్ కేంద్రంగా నిలిచింది. అదే తరహాలో జిల్లా సాధనకూ ఉద్యమం జరిగింది. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిలిపి నిర్మల్ జిల్లాను సాధించుకున్నారు. నిర్మల్ ప్రజల పోరాట పటిమపై ప్రత్యేక కథన ం.. - నిర్మల్ అర్బన్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం.. ఆంధ్రపాలనతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా 1969లో జరిగిన ఉద్యమంలోనూ నిర్మల్ ప్రాంతం ముందువరుసలో ఉంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ నిర్మల్‌వాసులు చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడి నాయక త్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, డాక్టర్ జేఏసీలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. రాంజీగోండ్ నేతృత్వంలో.. పోరాట యోధుడు రాంజీగోండ్‌ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ సాయుధ పోరు సాగించారు. రాంజీగోండ్ నేతృత్వంలో దాదాపు 150ఏళ్ల క్రితం జిల్లాలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించారు. ఆయన నేతృత్వంలో అనేక మంది గిరిజన యువకులతో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారిని భారీ సంఖ్యలో సమీకరించి పోరు జరిపారు. నిర్మల్, ఉట్నూర్, సిర్పూర్‌లతో పాటు ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్, చంద్రాపూర్, యావత్మాల్, మాహోర్ తదితర ప్రాంతాల్లో రాంజీగోండ్ ఆధ్వర్యంలో ఆంగ్లేయుల సైనికులపై దాడులు చేసి వారి గుండెల్లో గుబులు రేపారు. ప్రధానంగా అప్పట్లో సురక్షిత ప్రాంతంగా నిర్మల్ ఉండడంతో ఇక్కడి నుంచే పోరాటాన్ని నడిపించేందుకు వ్యూహరచనలు సాగించారు. అంతేకాకుండా ఆయుధాల స్థావరాలుగా కూడా ఏర్పర్చుకున్నారు. జరుగుతున్న పోరును అణచివేసేందుకు ఆంగ్లేయులు వివిధ రూపాల్లో అనేక పన్నాగాలు పన్నారు. దాంట్లో భాగంగానే కొందరు నజరానాలకు ఆశపడి రాంజీగోండు కదిలికలను చేరవేయడంతో నిర్మల్ శివారులోని సోన్ సమీపంలో గోదావరి నది వద్ద మాటు వేసి 1857 సెప్టెంబర్ 17న రాంజీగోండ్‌తో పాటు ఉద్యమకారులను సైనికులు పట్టుకున్నారు. వెయ్యి మందిని ఉరి తీశారు పట్టుబడ్డ రాంజీగోండ్‌తో పాటు పోరాట యోధులను నిర్మల్ మండలం ఎల్లపెల్లికి వెళ్లే దారిలో పట్టణ శివారులోని ఖజానా చెరువు వెనుకభాగంలో ఉన్న భారీ మర్రి చెట్టుకు రాంజీగోండ్‌తో పాటు వెయ్యిమందిని ఉరితీశారు. ఈ మర్రిచెట్టును వెయ్యి ఉరుల మర్రిగా చెప్పుకునేవారు. అయితే కాలక్రమేణ గతంలో వచ్చిన భారీ ఈదురుగాలులకు ఈ మర్రిచెట్టు నేలకొరిగింది. రాంజీగోండ్ జరిపిన ఆ నాటి పోరును ఆదర్శంగా తీసుకుని తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమించి తెలంగాణ విముక్తికై పాటుపడ్డారు. జయశంకర్ సారే స్ఫూర్తి గతంలో జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటులో భాగంగా నిర్మల్‌కు కేటాయించిన యూనివ ర్సిటీ ఆదిలాబాద్‌కు తరలిపోయింది. దీనికి కారణం నిర్మల్ జిల్లా కేంద్రం కాకపోవడమే. దీంతో నిర్మల్ జిల్లా ఏర్పాటు కావాలన్న ఆకాంక్ష ఏర్పడింది. అప్పట్లో విశ్వవిద్యాలయం కోసం ఉద్యమించాం. కానీ నెరవేరలేదు. నిర్మల్ జిల్లా ఏర్పాటైతే యూనివ ర్సిటీ వస్తుందన్న ఆశతో ఆ దిశగా అడుగులు వేశాను. దీనికి తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్‌సార్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిపాదనోద్యమం చేశాను. జిల్లా కల సాకారమైంది. - నంగె శ్రీనివాస్, నిర్మల్ జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నిర్మల్ జిల్లా సాధన సమితికి అంకురార్పణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. 2015 సెప్టెంబర్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటికే సీఎం కేసీఆర్ 10 జిల్లాలతో పాటు మరో ఐదు జిల్లాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. అందులో జిల్లా నుంచి మంచిర్యాలకు మాత్రమే చోటుదక్కింది. నూతన జిల్లాల ఏర్పాటు కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మను నియమించి, జిల్లాల ఏర్పాటు బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో ‘నిర్మల్ జిల్లా సాధన సమితి’ని ఏర్పాటు చేసిన నిర్మల్‌కు చెందిన నంగె శ్రీనివాస్, నిర్మల్ జిల్లా ఆవశ్యకతపై నివేదికను రూపొందించి, జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం హైదరాబాద్‌లోని సచివాలయంలో 2015, నవంబర్ 20న ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మను కలిసి నివేదిక అందజేశారు. అదే సమయంలో నిర్మల్ జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో ఉన్న ఆకాంక్షను తెలుసుకునేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నిర్మల్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనలతో ఉద్యమబాట పట్టారు. రాస్తారోకోలు, ధర్నాలు, బంద్‌లు, పాదయాత్రలు, మానవహారాలు, దీక్షలు చేపట్టారు. సీఎస్ కమిటీ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. గూగుల్ మ్యాప్‌లో పూర్తి సమాచారం తీసుకున్న సీఎం కొత్త జిల్లాగా నిర్మల్‌కు అన్ని విధాలా అర్హతలున్నాయని ప్రకటించారు. నిర్మల్ కొత్త జిల్లాగా ఆవిర్భవించింది. నిజాం, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా.. ఆనాడు నిర్మల్ ప్రాంతంలో గోపిడి గంగారెడ్డి నాయకత్వం వహించి ఆంగ్లేయులు, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈయన ఆధ్వర్యంలో నిర్మల్‌కు చెందిన ముడుసు ఎల్లయ్య, గంగిశెట్టి విఠల్, సత్యనారాయణ, గణపతి, లాలూపటేల్, జి.గంగాధర్, గంగారాం, జమునాలాల్, అర్గుల గంగయ్యగుప్తా తదితరులు ఉద్యమంలో ముందుకు సాగి అనేక పోరాటాలు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలతో పాటు నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలుపుకుని పోరాటాలు జరిపారు. -
రైల్వే కేసులను ఎత్తేయండి
కేంద్ర మంత్రి దత్తాత్రేయకు సీపీఐ వినతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన రైల్వే కేసులను వెం టనే ఎత్తివేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బం డారు దత్తాత్రేయకు సీపీఐ విజ్ఞప్తి చేసింది. రైల్ రోకో సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే రైళ్ల రాకపోకలను నిలిపేసినా, రైల్వే శాఖ ఆదేశాల మేరకు అనేక మంది రాజకీయ నాయకులు, క్రియాశీల కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. ఆదివారం ఈ మేరకు దత్తాత్రేయను ఆయన నివాసంలో కలుసుకుని సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్ పాషా, సుధాకర్ తదితరులు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు కావొస్తున్నా కేసులు ఎత్తివేయకపోవడం అన్యాయమని చాడ పేర్కొన్నారు. వందలాది మంది ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూ నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని తెలిపారు. తనపై కూడా హైదరాబాద్, కాజీపేట రైల్వే కోర్టులలో కేసులు నడుస్తున్నాయని, జరిమానా కట్టమని న్యాయవాదులు చెప్పినా తాను ఒప్పుకోలేదని తెలిపారు. -
'ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహం'
హైదరాబాద్ : వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించే విషయమై సీఎంతో మాట్లాడుతానని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శనివారం బాగ్‌లింగంపల్లిలో తెలంగాణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 31 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ ఐలమ్మ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రజకులను గ్రామ బహిష్కరణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
'ఆమె తెలంగాణ ఉద్యమ ఐకాన్'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి అలనాటి వీర వనిత చాకలి ఐలమ్మ ఒక ఐకాన్‌గా నిలిచిందని శాసన సభ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఆమె స్ఫూర్తితో ఎంతో మంది ఉద్యమంలో భాగస్వాములయ్యారని చెప్పారు. ఆమె ఆశయాలు, ఆదర్శాల కొనసాగిద్దామని చెప్పారు. శనివారం తెలంగాణ రాష్ట్ర రజక సమాజం, సాంస్కృతిక శాఖ సౌజన్యాలతో దివంగత చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతి సభను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ జె.పి. జీవన్ మాట్లాడుతూ నిరూపమాన సహస వంతురాలు చాకలి ఐలమ్మ అని చెప్పారు. ఆనాటి చాకలి వారి చైతన్యమే.. ఈనాటి తెలంగాణ చైతన్యమని చెప్పకతప్పదన్నారు. సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల స్ఫూర్తి ప్రదాయిని చాకలి ఐలమ్మ అని చెప్పారు. బడుగుల రుద్రమ్మ చాకలి ఐలమ్మ అని చెప్పారు. ఈ సందర్భంగా బుల్లి తెర డెరైక్టర్ నాగబాల సురేష్ కుమార్ రూపొందించి వీరానారి చాకలి ఐలమ్మ లఘు చిత్రం సీడీని ఆవిష్కరించారు. సభ ప్రారంభంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి జోహర్లు అర్పించారు. -
జయశంకర్ ఆశయ సాధనకు కృషి
ఉద్యోగాల భర్తీ, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం నాణ్యమైన విద్య కోసం 350 గురుకులాలు జయశంకర్ జయంతి వేడుకల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ : జయశంకర్ ఆలోచనలు, ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పనిచేస్తున్నారని ఉప ము ఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలో శనివారం జయశంకర్ జయంతి వే డుకలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు పసునూరి దయాకర్, అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, మేయర్ నన్నపునేని నరేందర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ తదితరులు ఏకశిల పార్కులోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. అనంతరం కడియం శ్రీహరి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అడ్డుకుంటున్నారని తూర్పారబట్టారు. 25 వేల కాంట్రాక్ట్ ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. త్వరలో 10వేల టీచర్ పోస్టులు, గురుకులాల్లో 4 వేల ఉపాధ్యాయ పోస్టులు, 4వేల పారా మెడికల్, మెడికల్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్ పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని, దీంతో జరిగే నష్టమేమిటని ప్రశ్నిం చారు. కేజీ టు పీజీ నాణ్యమైన విద్యను అం దించేందుకు రాష్ట్రంలో 350 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశామని, ఈ విద్యాలయా ల ద్వారా 1.75 లక్షల మందికి విద్య అందించనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం చేసిన ప్రొఫెసర్ కోదండరాం వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ వ్యతిరేకులకు బలం చేకూరుస్తోందన్నారు. 2013 చట్టం, 123 జీఓలో ప్రాజెక్టు నిర్వాసితులు ఏది కోరుకుంటే ఆ ప్రకారం పరిహారం చెల్లిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గుడిమల్ల రవికుమార్, జన్ను జకార్యా, నÄæూముద్దీన్, మర్రి యాదవరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, జయశంకర్ దత్తపుత్రుడు బ్రహ్మం, కుటుంబ సభ్యు లు, డిప్యూటీ మేయర్ సిరాజొద్దీన్, కార్పొరేట ర్లు నల్ల స్వరూపారాణి, మిడిదొడ్డి స్వప్న, వీరగంటి రవీందర్, జోరిక రమేష్ పాల్గొన్నారు. -
సుస్వరాల ‘శాలిని’
పాటల రంగంలో రాణిస్తున్న గిరిజన బిడ్డ తెలంగాణ ఉద్యమంలో హోరెత్తించే గీతాలు ‘ఆటా’ ఉత్సవాలకు తెలంగాణ సాంస్కృతిక సారథి తర పున హాజరు నెల రోజులపాటు 14 రాష్ట్రాల్లో ప్రదర్శనలు స్వగ్రామానికి తిరిగివచ్చిన గాయకురాలు ‘‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’’ అనే నానుడిని నిజం చేస్తూ ముందుకుసాగుతోంది ఓ జానపద గాయకురాలు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఆత్మ విశ్వాసంతో దూసుకుపోతోంది. ఈ మేరకు తెలంగాణ జానపద గీతాలతోపాటు సందేశ్మాతక, మెలోడీ పాటలు పాడుతూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. మారుమూల తండా నుంచి అమెరికాకు వెళ్లి తన మధురమైన గానంతో తెలుగు ప్రజలను ఓలలాడించిన సుస్వరాల మాలిని.. ‘శాలిని’పై ప్రత్యేక కథనం. –నర్సంపేట కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపిస్తూ ముందుకుసాగుతోంది జానపద గాయకురాలు శాలిని. నర్సంపేట డివిజన్ పరిధిలోని ఖానాపురం మండలం మంగళవారిపేట శివారు నాజీతండాకు చెందిన గుగులోతు లక్ష్మి, సోమ్లానాయక్ దంపతులకు ఆరుగురు సంతానం ఉన్నారు. సోమ్లానాయక్ వ్యవసాయంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను కష్టపడి చదివించారు. రెండో తరగతిలోనే పాటలు సోమ్లానాయక్ సంతానంలో ఐదో అమ్మాయిగా జన్మించిన శాలినికి చిన్నప్పటి నుంచే పాటల రంగంపై మక్కువ ఎక్కువ. ఇంట్లో అమ్మ, అన్నయ్య అప్పుడప్పుడు పాడే పాటలను ఆసక్తిగా గమనించిన శాలిని అందులో ప్రావీణ్యం సంపాదించాలని ఆరాటపడేది. ఈ క్రమంలో తం డాలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న సమయంలో ఆమె పాడిన దేశభక్తి గీతానికి ఉపాధ్యాయుడు మదార్హుస్సేన్ మంత్రముగ్దుడయ్యారు. ఈ మేరకు పాటల రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆయన శాలినిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. అలా మెుదలైన శాలిని పాటలు.. ప్రవాహంలో కొనసాగుతున్నాయి. కాగా, శాలిని 5వ తరగతి వరకు మంగళవారిపేటలో, 6 నుంచి పదో తరగతి వరకు బుధరావుపేట ప్రభుత్వ పాఠశాలలో చదివింది. ఇంటర్, డిగ్రీ నర ్సంపేటలో పూర్తి చేసింది. అలాగే హన్మకొండలో బీఎస్సీ నర్సింగ్ కోర్సును కూడా అభ్యసించింది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు ఓ వైపు క్రమశిక్షణతో చదువుకుంటూనే.. మరో వైపు తనకు ఇష్టమైన పాటల రంగంలో రాణిస్తూ శాలిని పేరు సంపాదించింది. ప్రధానంగా 2008 నుంచి తెలంగాణ ధూంధాంలలో పాల్గొని తన వంతుగా ఎన్నో పాటలు పాడి ప్రజలను చైతన్యపరిచింది. గాయకులు తాళ్లపెల్లి సునీల్, వరంగల్ శ్రీనివాస్ బృందాలతో కలిసి నర్సంపేట డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయి సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరై పాటలు పాడింది. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ టీవీ చానల్ నిర్వహించిన ‘రేలారే రేలా’ పోటీల్లో పాల్గొని టైటిల్ విజేతగా నిలిచి ఓరుగల్లు కీర్తిని నలుదిశలా చాటింది. నిర్భయపై పాట ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటనను దృష్టిలో పెట్టుకుని శాలిని ‘సన్నపు రైక’ అనే సందేశాత్మక పాటను రాసి పాడి వినిపించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. జానపద గీతాలతోపాటు మెలోడీ, సామాజిక కార్యక్రమాలకు సంబంధించి ఎన్నో పాటలు రాస్తూ.. పాడుతూ శాలిని ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఆటా ఉత్సవాలకు ఎంపిక అమెరికాలో జూలైలో నిర్వహించిన ఆటా ఉత్సవాలకు శాలిని తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం తరపున ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం నుంచి మెుత్తం ఎంపికైన 15 మంది మహిళా కళాకారుల్లో వరంగల్ జిల్లా నుంచి శాలిని ఒక్కరే ఉండడం గమనార్హం. ఈ మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో శాలిని జూన్ 27న అమెరికాకు వెళ్లి 14 రాష్ట్రాల్లో తెలంగాణ జానపద గీతాలు ఆలపించి అక్కడి తెలుగు ప్రజలను ఆకట్టుకుంది. నెలరోజుల పాటు విదేశాల్లో పర్యటించిన శాలిని మంగళవారం ఇంటికి చేరుకుంది. గొప్ప అనుభూతి మారుమూల తండాలో పుట్టిన నేను అమెరికాకు వెళ్లి పాటలు పాడడం సంతోషంగా ఉంది. తెలంగాణ సంస్కృతిని అమెరికా దేశస్తులతో పాటు అక్కడ ఉంటున్న తెలుగు ప్రజలకు తెలియజేసే అవకాశం లభించడం నా అదృష్టం. నెలరోజుల్లో అమెరికాలోని 14 రాష్ట్రాల్లో ప్రదర్శనలు చేపట్టి అక్కడి ప్రజల మన్ననలు పొందాను. నిజంగా ఇది గొప్ప అనుభూతి. –శాలిని, కళాకారిని, నర్సంపేట శాలిని పాటలు అద్భుతం తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు నెలరోజుల పాటు అమెరికాలో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తూ వారు పాడిన పాటలు, నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. శాలిని తన మధురమైన గానంతో మమ్మల్ని అలరించింది. తెలంగాణ నుంచి వచ్చిన కళాకారులకు సహకారం అందించడం గర్వంగా ఉంది. –అనుగు లక్ష్మారెడ్డి, అమెరికా తెలుగు అసోసియేషన్ మెంబర్ -
రైల్వే కోర్టుకు స్పీకర్
కాజీపేట రూరల్ : తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2013లో వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం రైల్వే గేట్ రైల్‌రోకోలో పాల్గొన్న ప్రస్తుత స్సీకర్ మధుసూదనాచారితో పాటు మరో 8 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. వారు బుధవారం కాజీపేట రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. కేసును మెజిస్ట్రేట్ ఆగస్టు 22వ తేదీకి కేసు వాయిదా వేసినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. స్పీకర్ మధుసూదనాచారితో పాటు వీరాటి లింగారెడ్డి, గంగుల రమేష్, ప్రభాకర్, రాంమూర్తి, రామారావు, ల్యాదెళ్ల బాలు, గాదె రాజు, సందీప్‌లు ఈ కేసులో ఉన్నారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేతకు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసిందని, మొక్కవోని ధైర్యంతో తెలంగాణ వాదులు వాటిని ఎదుర్కొన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాyì తెలంగాణవాదులపై పెట్టిన రైల్వే కేసులను కొట్టివేతకు కృషి చేస్తుందన్నారు. -
అస్తిత్వ జెండాకు ‘జన’ వందనం
తెలంగాణ ఉద్యమానికి కొత్త రూపాన్ని ఇచ్చిన కేసీఆర్ జనగామ ఉద్యమ భూమిని కూడా పరిగణనలోనికి తీసుకుని జనగామ జిల్లాను ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవించినట్టు అవుతుంది. భూసంస్కరణలను అమలు జరపాలని ప్రపంచానికి సందేశం ఇచ్చిన జనగామను సీఎం గుండెల్లో దాచుకుని, జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రజల ఆకాంక్ష. తెలంగాణలో జనగామ ప్రాంతానిది ప్రత్యేక చరిత్ర. ఈ ప్రాంతానికి ఒక్క పోరాట చరిత్రే కాదు, గొప్ప సాంస్కృ తిక చరిత్ర కూడా ఉంది. ఇక్కడి ప్రజలు పెద్దగా ధన వంతులు కాకపోవచ్చు. కానీ వివేకవంతులు. వస్తువు, భాష, ఛందస్సులలో నవ్య త్వాన్ని చాటి, ఉత్పత్తి కులాలకు సాహిత్యంలో స్థానం కల్పించిన పాల్కురికి సోమనాథుడు ఇక్కడి వారే. ‘బసవ పురాణం’, ‘పండితారాధ్య చరిత్ర’ ఆయన స్మర ణీయ కృతులు. ఇవాళ తెలంగాణ ఆయనను తొలి కవిగా ఆదరిస్తున్నది. ఆయన చేపట్టిన ప్రక్రియలు సాహితీరంగాన్ని గాఢంగా ప్రభావితం చేశాయి. ధన, కనక, వస్తువాహనాలకు ఆశించకుండా తను రాసిన భాగవతాన్ని నరాంకితం చేయకుండా, నారా యణునికి అంకితం చేసిన పోతనామాత్యుడు జన్మించిన బమ్మెర ఇక్కడిదే. వీరికి స్ఫూర్తిగా నిలిచారా అన్నట్టు పాలకుర్తిలోని గుట్ట మీద రెండు గుహల్లో శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వాములు స్వయంభువులుగా వెలసి అనాదిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. వాల్మీకి క్షేత్రంగా భావించే ‘వల్మికి’ ఈ ప్రాంతంలోనిదే. ఒకే పాదులో మొలిచినట్టుగా శైవ, వైష్ణవాలు; అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా సోమన, పోతన నిలవడం కాల ప్రభావమే. ఈ మహా కవుల సాంస్కృతిక ప్రభావమే, వారసత్వమే చుక్క సత్తయ్య వంటి ఒగ్గు కథ కళాకారులకు స్ఫూర్తినిచ్చిందనుకుంటాను. అంపశయ్య నవీన్ వంటి అభ్యుదయ రచయిత, సి. రాఘవాచారి వంటి పాత్రికేయులు ఈ మట్టి కన్నబిడ్డలే. ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలనను వికేంద్రీక రించవచ్చు గాని, ప్రజా సంస్కృతినీ, చరిత్రనూ వికేంద్రీ కరించలేము. అక్కడి భౌగోళిక పరిస్థితులు వారి మధ్య సంబంధాలను సమన్వయం చేస్తాయి. సామాజిక నేప థ్యానికీ, సంస్కృతికీ సమన్వయం కుదిరినప్పుడే సంబం ధాలు సామరస్యపూర్వకంగా ఉంటాయి. రెండూ వేర యితే సంఘర్షణాత్మక ధోరణే మిగులుతుంది. అది శాంతికి భంగకరమూ కావచ్చు. దేవులపల్లి వెంక టేశ్వరరావు వంటి కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ‘జనగామ ప్రజల వీరోచిత పోరా టాన్ని’ గురించి ప్రత్యేక గ్రంథమే వెలువరించారు. జనగామ ప్రాంతమంటే చాకలి ఐలమ్మ బువ్వ గింజల పోరాటం గుర్తుకు వస్తుంది. ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి దొరతనాన్ని ఎదిరించి అమరుడైన బందగీ భూమి పోరాటం తలపునకొస్తుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మలుపు తిప్పి నేలకొరిగిన దొడ్డి కొమరయ్య వంటి వీరుల అమరత్వం కళ్ల ముందు కదలాడుతుంది. జనగామ ప్రాంతం చేసిన పోరాటం వల్లనే దున్నేవానికే భూమి అన్న నినాదం ఎగిసిపడింది. అది భారతదేశంలో జరిగిన పోరాటాలకు కేంద్ర బిందువయింది. భారతదేశంలో భూసంస్కర ణలు రావడానికి జనగామ భూపోరాటమే కారణం. పాలనా సౌలభ్యానికీ, ప్రజావసరాలు తీర్చడానికీ, పాలనా యంత్రాంగం ప్రజలకు అందుబాటులోకి రావ డానికీ జిల్లాల వ్యవస్థ ఏర్పాటైంది. నిజాం పాలనలో జమాబందీతో పాటు జిల్లా బందీని ఏర్పాటు చేసి పాలించారు. పాలనా సౌలభ్యం కోసం తెలంగాణను 24 జిల్లాలను చేయాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచనను తెలంగాణ సమాజం ఆహ్వానిస్తున్నది. గత ప్రభుత్వాలు అవలంభించిన విధానాలకు భిన్నంగా కేసీఆర్ ప్రతి అంశంలోను నూతన ఒరవడితో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవన్నీ తెలంగాణ సమా జానికి అవసరమైనవే. ఆ ఫలితాలన్నీ భవిష్యత్ సమా జం అనుభవించడం ఖాయం. తెలంగాణ రాష్ట్రం ఉద్య మాల ద్వారా వచ్చింది. రాజకీయ ప్రక్రియను చేపట్టిన కేసీఆర్ పట్టు వదలకుండా పోరాడి తెలంగాణ విష యంలో గెలిచారు. అందుకే జిల్లాల వ్యవస్థలో మార్పులు చేసే సమయంలో ప్రజల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. బ్యూరోక్రసీకి ఈ నిర్ణయాన్ని వదిలిపెడితే గూగుల్ నెట్ వర్క్ పెట్టుకుని భూమ్మీద గీతలు గీసి 24 జిల్లాల స్వరూపాన్ని తేల్చేస్తారు. ఒక జిల్లాను ఏర్పాటు చేసే టప్పుడు ఆ నేలకు ఉన్న స్వభావాన్ని, ప్రజా పోరాటాల సామ్యాన్ని, సామాజిక, సాంఘిక నేపథ్యాలని, సంస్కృ తిని దృష్టిలో పెట్టుకుంటే ప్రాంతాల మధ్య స్థానికతను నిలబెట్టినట్టవుతుంది. బ్యూరోక్రసీని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు చేసే కాలం పోయిందని తెలంగాణ ప్రభు త్వమే ఆచరణాత్మకంగా చెబుతోంది. ప్రతి 40 కిలో మీటర్లకు భాష మారుతుంది. అలాగే భౌగోళికంగా కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ దేశంలో ప్రత్యేకతను కలిగి ఉంది. తెలంగాణ ఉద్యమానికి కొత్త రూపాన్ని ఇచ్చిన కేసీఆర్ జనగామ ఉద్యమ భూమిని కూడా పరిగణనలోనికి తీసుకుని జనగామ జిల్లాను ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవించి నట్టు అవుతుంది. కేసీఆర్ ఉద్యమ సమయంలో వంటా వార్పునకు, బతుకమ్మ బోనాల పండుగల రూపాలను ప్రతిష్టించి ఉద్యమాన్ని రగిలించారు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడం వల్ల భూసంస్కరణలను అమలు జరపండని ప్రపంచానికి సందేశం ఇచ్చిన జన గామ నేలను కూడా ముఖ్యమంత్రి గుండెల్లో దాచుకుని, తాము కోరుకుంటున్నట్టుగా జిల్లాను ఏర్పాటు చేయా లని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. జనగామ జిల్లా ఏర్పాటవుతుందని నమ్మకం నాకు ఉంది. ఒకనాడు భూమి పోరు జెండాను పట్టుకున్న పోరు భూమి నేడు తన అస్తిత్వం కాపాడుకోవడానికి తనను ఒక ప్రత్యేక జిల్లాగా ప్రకటించమని వేడుకుంటున్నది. - చుక్కా రామయ్య - వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు -
ఉద్యమనేతలకే ప్రాధాన్యం
► విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ► తిరుమలగిరి ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న వారికే పదవుల పందేరంలో తొలి ప్రాధాన్యముంటుందని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తిరుమలగిరిలో బుధవారం జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లా డారు. కొత్తగా చేరిన వారికి అవకాశాన్ని బట్టి గుర్తింపు ఇస్తామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నా యన్నారు. -తిరుమలగిరి తిరుమలగిరి :- పదవుల పందేరంలో తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న వారికే తొలి ప్రాధాన్యం ఉంటుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం తిరుమలగిరిలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పాలకవర్గం పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్తగా చేరిన వారికి అవకాశాన్ని బట్టి గుర్తింపు ఇస్తామన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు ఈ రెండు సంవత్సరాలలోనే ఎంతో అభివృద్ధి చెందాయన్నారను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే సంవత్సర కాలంలోనే ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా రెండు పంటలకు నీళ్లు అందిస్తామని పే ర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్ర తిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయన్నా రు. సూర్యాపేట నియోజకవర్గంలో ఈ రెండేళ్లలో ఏమి అభివృద్ధి జరగలేదని, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటు న్న మాజీమంత్రి ఆర్.దామోదర్ రెడ్డి పల్లెలకు వెళితే అభివృద్ధి ఏ జరిగిందో తెలుస్తుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ని ధులను కూడా ఖర్చు చేయని ఘనత దా మోదర్ రెడ్డికే దక్కిందని విమర్శించారు. 30ఏళ్లుగా ప్రజా ప్రతినిధినిగా ఉండి ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకే సమాధానం చె ప్పాలన్నారు. మాజీ ఎమ్మె ల్యే సంకినేని వెంకటేశ్వర్రావు కాంట్రాక్టులు చేసి రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. మార్కె ట్ కమిటీ పా లకవర్గం రైతుల పక్షాన నిల చి నిలిచి పనిచేయూలని కోరా రు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, తుం గతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, మార్కె ట్ కమిటీ చైర్పర్సన్ పాశం విజయయాదవరెడ్డి, వైస్ చైర్మన్ యుగేంధర్‌రావు, ఎంపీ పీ కొమ్మినేని సతీష్, జెడ్పీటీసీ పి.పూల మ్మ, వైస్ ఎంపీీ ప ఎస్.జనార్దన్, పీఏసీఎస్ చైర్మన్ జి.అశోక్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ డీడీఎం శ్రీనివాస్, ఏడీఎం అలీమ్, కార్యదర్శి నవీన్‌రెడ్డి పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ల కోసమా?
► అలాంటి తెలంగాణ వద్దు: కోదండరాం ► జయశంకర్ బాటలో పోరాడతాం ► సార్‌ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి ► అందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రజల్లోకి జేఏసీ ►నాకు రాజకీయ ఆకాంక్షలేవీ లేవు ► జయశంకర్ వర్ధంతి సభల్లో వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వాళ్లకు లబ్ధి చేకూర్చడానికే పరిమితమయ్యే తెలంగాణ వద్దని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు తదితర వర్గాలతో పాటు సబ్బండ వర్ణాల అభివృద్ధి కోసం రాజకీయ జేఏసీ మళ్లీ క్రీయాశీలక పాత్ర పోషిస్తూ భావి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తుందని ప్రకటించారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ ఐదో వర్ధంతి సందర్భంగా మంగళవారం తెలంగాణ జేఏసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ సార్ తెలంగాణ సాధనకు తన జీవితాన్ని త్యాగం చేశారంటూ కొనియాడారు. రాష్ట్రం వచ్చాక అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించాలని కాంక్షించిన ఆయన లేకపోవడం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. మలి దశ ఉద్యమంలో ఎంతోమందిని తెలంగాణ వైపు మళ్లించిన ఘనత సార్‌దేనని చెప్పారు. ‘‘మనుషులు శాశ్వతం కాదు. వారి ఆలోచనా విధానాలు, భావాలు శాశ్వతం. తెలంగాణ సాధించడం ఒక ఎత్తై, అభివృద్ధి చేసుకోవడం మరో ఎత్తని జయశంకర్ సార్ భావించేవారు. ప్రజలందరూ అభివృద్ధి చెందాలని, తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలు అట్టడుగు వర్గాలకు చెందాలనేది ఆయన ఆశయం. తెలంగాణ అభివృద్ధి కోసం మరింత సంఘటితంగా ప్రయత్నించాలని చెప్పిన సార్ బాటలోనే అభివృద్ధి కోసం సంఘటిత పోరాటాలు చేస్తాం. వివిధ అంశాలపై తొందరపడి ఏ విషయమూ మాట్లాడబోం. సమగ్రంగా అధ్యయనం చేసి, లోతుగా పరిశీలించాకే మాట్లాడతాం’’ అని కోదండరాం స్పష్టం చేశారు. ట్యాంక్‌బండ్ విగ్రహాల కూల్చివేతలను సమర్థించారు జయశంకర్‌ను తెలంగాణ జాతి పితగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఆగస్టు 6న ఆయన జయంతి వేడుకల నాటికి దీనిపై అధికారికంగా ప్రకటన చేయాలన్నారు. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ నాయకులు ప్రతిపాదించిన తీర్మానాన్ని కోదండరాం ఆమోదించారు. ఈ తీర్మానాన్ని ఊరూరా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం ఓయూ విద్యార్థి జేఏసీ, టీఎస్ జాక్ ఆధ్వర్యంలో ఓయూ లైబ్రరీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మిలియన్ మార్చ్ కార్యక్రమంలో భాగంలో ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను కూల్చివేయడాన్ని జయశంకర్ సమర్థించారని చెప్పారు. ‘‘మార్చ్‌లో ఆయన పాల్గొనలేదు. అదెలా జరిగిందో చెబుదామని సాయంత్రం వాళ్లింటికి వెళ్లాను. ట్యాంక్‌బండ్ విగ్రహాల ధ్వంసం గురించి ఆయనతో మాట్లాడేందుకు భయపడ్డాం. అయితే, మిలియన్ మార్చ్ బాగా జరిగిందని ఆయనన్నారు. తానూ వద్దామని బయల్దేరినా అక్కడి పరిస్థితుల దృష్ట్యా వద్దనడంతో ఆగిపోయానన్నారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలొద్దని అప్పటి సీఎం ఎన్టీఆర్‌కు వినతిపత్రం సమర్పించినా విన్లేదని, వాటిని ధ్వంసం చేయడం మంచిదేనని అన్నారు’’ అని వివరించారు. రాష్ట్ర సాధనకు ఎంత కష్టపడుతున్నామో ఆ తర్వాత ఈ ప్రాంత, ప్రజల అభివృద్ధికి కూడా అంతకంటే ఎక్కువ కృషి చేయాలని సార్ అనేవారన్నారు. తనకు ప్రత్యేక రాజకీయ ఆకాంక్షలేవీ లేవని కోదండరాం పునరుద్ఘాటించారు. ‘‘నావి ఎవరో అనిపిస్తే అంటున్న మాటలు కాదు. తెలంగాణ సమాజమే నా మాటాలకు కారణం. రాష్ట్రంలో కోటి మంది నిరుద్యోగులున్నారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల యువకులు 20 లక్షల మంది ఉన్నారు. ఇక పది, ఇంటర్ అయినవారు 80 లక్షల దాకా ఉంటారు. వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’’ అన్నారు. డీఎస్సీ, గ్రూప్-2 ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఊరురా దొరల పాలన తెచ్చేందుకే గడీలను మరమ్మతులు చేస్తున్నారని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ ఆరోపించారు. గడీల్లో దొరల పాలనను సాగనివ్వబోమని హెచ్చరించారు. అభివృద్ధిపై తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతూ కేసీఆర్ పాలన కొనసాగుతుందని జస్టిస్ చంద్రకుమార్ తప్పుబట్టారు. కార్యక్రమాల్లో ఓయూ అధ్యాపకులు ప్రొఫెసర్లు విశ్వేశ్వర్రావు, ఇటిక్యాల పురుషోత్తం, జేఏసీ నేతలు పిట్టల రవీందర్, ప్రహ్లాదరావు, విద్యార్థి జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో...
సుమన్, శివకృష్ణ, ప్రీతీనిగమ్, మధుబాల ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘త్యాగాల వీణ’. తుమ్మల రమేష్‌రెడ్డి సమర్పణలో మిరియాల రవికుమార్ దర్శకత్వంలో కొత్తపల్లి సతీష్‌బాబు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, పోస్టర్‌ను మంత్రి ఈటల రాజేందర్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఒక రాష్ట్రం కోసం ఏ దేశంలోనూ ఇప్పటివరకు ఇన్ని ఆత్మబలిదానాలు జరగలేదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రను భావి తరాలకు తెలియజెప్పాలనే ఈ సినిమా తెరకెక్కించాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా చిత్రాన్ని అంకితం ఇవ్వాలని అనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘షూటింగ్ పూర్తయింది. జులైలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత రమేష్‌రెడ్డి చెప్పారు. -
కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి: చాడ
కేసముద్రం: సీఎం కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయని, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులెవరూ ఇప్పుడు ఆయనకు కనిపించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. వరంగల్ జిల్లా కేసముద్రంలో గురువారం నిర్వహించిన సీపీఐ రాజకీయ-సైద్ధాంతిక శిక్షణ తరగతుల్లో చాడ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కలసి పనిచేసిన మిత్రులంతా కేసీఆర్‌కు ఇప్పుడు శత్రువులయ్యారని, ఉద్యమ వ్యతిరేకులేమో మిత్రులయ్యారని విమర్శించారు. మంత్రుల్లో సగం మంది ఉద్యమ వ్యతిరేకులేనని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జేఏసీ చైర్మన్ కోదండరాంపై మంత్రులు విమర్శలు చేయడం తెలంగాణ ప్రజలను అవమానపర్చినట్టేనని అన్నారు. ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ, ఇప్పుడు ప్రభుత్వంపై నిరసన కేంద్రంగా మారిందన్నారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ది కనిపించడంలేదని, విద్య, వైద్యంతోపాటు అన్నింటిలోనూ వెనుకబడే ఉన్నామని అన్నారు. -
'ఆయనను కరివేపాకులా తీసేస్తున్నారు'
హైదరాబాద్‌సిటీ: తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంను ఉపయోగించుకుని ఇప్పుడు కరివేపాకులా తీసేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కోదండ రాంపై టీఆర్ఎస్ దాడి ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణపై నిబద్ధత కలిగిన నేత కోదండరాం అనీ, ప్రజాభిప్రాయాన్నే కోదండరాం చెప్పారని భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కోదండరాం ప్రశ్నకు సమాధానం చెప్పాలని అన్నారు. ప్రశ్నించిన ప్రతి వ్యక్తినీ కాంగ్రెస్ ఏజెంట్ అనడం దారుణమన్నారు. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ దళారీ అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే ప్రాజెక్టులు రీడిజైన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. రెండేళ్ల రెండు లక్షల కోట్ల రూపాయల దోపిడీకి కేసీఆర్ టెండర్ పెట్టారన్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదన్నారు. రూ.475 కోట్లు మంజూరు చేస్తే ఖమ్మంలో రూ.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని అన్నారు. కొన్ని చోట్ల పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని విమర్శించారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఉపాధ్యాయులకు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై ఉద్యమించాలని అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీఆర్సీని తెచ్చుకున్న మనకు పాత పెన్షన్ విధానాన్ని తెచ్చుకోవటం అసాధ్యమేమీ కాదని అన్నారు. టీఎన్జీఓ గౌరవ అధ్యక్షులు దేవిప్రసాద్ మాట్లాడుతూ.. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తికి జీవితకాలం పెన్షన్ ఇస్తున్నప్పుడు 30 ఏళ్లుగా ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన వ్యక్తికి పెన్షన్ ఇవ్వకపోవటం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పి.సుధాకర్ రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్ రెడ్డి, టీఎన్జీఓ అధ్యక్షులు కారం రవీందర్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏం జరుగుతుందో చూద్దాం!
తెలంగాణ ఏర్పడి, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మెల్ల మెల్లగా రాజకీయచర్చల వేడి ఊపందుకుంటోంది. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో అనేక శక్తులు, వ్యక్తులు, సంస్థలు, భిన్న భావజాలాలు, సిద్ధాంతాలు కలిగిన వారు ఐక్యంగా కలసి పోరాడిన విషయం తెలిసిందే. రెండేళ్లలో జరిగిన వివిధ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీలతో విజయకేతనం ఎగురవేయడంతో ఆయా రాజకీయపార్టీల్లో స్తబ్ధత ఏర్పడడంపై కూడా ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయశక్తుల పునరేకీకరణకు అవకాశముందా ? లేక ప్రెషర్‌గ్రూప్ పాలిటిక్స్‌కు శ్రీకారం చుడతారా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా అందరినీ కలుపుకుని పోయి ఏ పార్టీ ముద్రపడకుండా కీలకపాత్రను పోషించిన జేఏసీ భవిష్యత్‌లో ఏదైనా కీలకభూమికను నిర్వహిస్తుందా అన్న దానిపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి అసలు ప్రయత్నాలు అయినా మొదలయ్యాయో లేదో అంతలోనే దీనిపై పరోక్షంగా విమర్శలు, ఆరోపణల పర్వం కూడా మొదలైపోయిందట. ఈ చర్చలను, పరిణామాలను గమనిస్తున్న ముఖ్యులు గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్రను పోషించిన వారు మాత్రం.. అసలు ఏమి జరుగుతుందో చూడాలి అంటూ సంకేతాలు ఇచ్చేస్తున్నారట. ఆధిపత్య ధోరణులు, రాచరిక పోకడలను, భూస్వామ్య భావజాలాన్ని అస్సలు సహించని, ఎంతో రాజకీయచైతన్యం కలిగిన ఈ తెలంగాణ గడ్డ గర్భం నుంచి ఏమి ఉద్భవిస్తుందో చూడాల్సిందేనంటూ... ముక్తాయింపునివ్వడం కూడా రాజకీయవర్గాల్లో కలకలాన్ని రేపుతోందట...! -
ఆవిర్భావ దినోత్సవానికి భారీ ఏర్పాట్లు
కార్యాచరణ రూపొందిస్తున్న టీజేఏసీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) రాష్ట్రావిర్భావ దినోత్సవాన్ని భారీగా నిర్వహించాలని యోచిస్తోంది. ఉద్యమ ఘట్టాలను, సన్నివేశాలను ఆవిష్కరించడంతో పాటు రాష్ట్ర ఏర్పాటు స్ఫూర్తిని, వివిధ వర్గాల ఆకాంక్షలను ప్రతిఫలించేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టనుంది. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఓయూలోనే జూన్ 2న భారీ కార్యక్రమానికి జేఏసీ రూపకల్పన చేస్తోంది. జూన్ 1నే మండల, నియోజకవర్గ, రెవెన్యూ డివిజన్, జిల్లా కేంద్రాల్లో వేడుకలను నిర్వహించాలని యోచిస్తోంది. అమరవీరుల కుటుంబాలకు సన్మానం, 2 సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాల తెలంగాణ ధూంధాం నిర్వహించడానికి ఏర్పా ట్లు చేస్తోంది. ఇందులో తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు, ఉద్యమ సంఘాల నేతలను భాగస్వామ్యం చేయాలని జేఏసీ భావి స్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ఈ నెల 25న తిరిగి రానున్నారు. ఆయన హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత దీనిపై పూర్తిస్థాయి ప్రకటన వెలువడనుంది. -
కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం: ఎంపీ కవిత
హైదరాబాద్: కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని ఎంపీ కవిత వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మేడే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తే అడ్డుకుంటామని ఎంపీ కవిత స్పష్టం చేశారు. -
పింఛన్ కోసం నాలుక కోసుకున్నాడు
సచివాలయంలో ఓ ఉద్యమకారుడి ఆవేదన ♦ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న రాజుచారి ♦ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఒంటికి నిప్పంటించుకున్న వైనం ♦ ప్రమాదంలో కాలు విరిగి కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితి పట్టించుకోని అధికారులు... ♦ గొంతుకోసుకోవడమే మిగిలిందంటూ రాజుచారి ఆవేదన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాడు.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నమూ చేశాడు.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని ఎంతో సంబరపడ్డాడు.. దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంతో కాలు విరగ్గొట్టుకున్నాడు.. కొద్దినెలలుగా పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేశాడు.. చివరికి సచివాలయానికీ వచ్చాడు.. మూడు రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో సీఎం కార్యాలయం ఎదుట నాలుక కోసుకున్నాడు.. హైదరాబాద్‌లోని సూరారం కాలనీ ఆనంద్‌నగర్‌కు చెందిన అబ్బోజి రాజుచారి (48) ఆవేదన ఇది. రాజుచారిది వరంగల్ జిల్లా పరకాల మండలం మాందర్పేట. 30 ఏళ్ల కింద పొట్టచేతబట్టుకుని సూరారం కాలనీకి వలస వచ్చి.. వడ్రంగి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య శోభ, ముగ్గురు పిల్లలు. తెలంగాణ ఉద్యమంలో రాజుచారి చురుగ్గా పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం డిమాం డ్తో 2014 జనవరి 5న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇది అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది కూడా. ఆ ఘటనలో రాజుచారి తీవ్రంగా గాయపడ్డారు. వారిది పేద కుటుంబం కావడంతో స్థానికంగా ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్దే చికిత్స పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మానని గాయాలతోనే ఉన్న రాజుచారి సూరారం చౌరస్తా వద్దకు నడుచుకుంటూ వచ్చి జై తెలంగాణ నినాదాలు చేశారు కూడా. అయితే రాజుచారి ఆరోగ్యం కుదుటపడ్డాక ఓ రోజు సైకిల్‌పై పనికి వెళ్తుండగా బైక్ ఢీకొట్టి ఎడమ కాలు విరిగింది. కుటుంబ సభ్యులు ఆయనను ఎర్రగడ్డ చర్చి ఆస్పత్రిలో చేర్చించగా.. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేసి, కాలులో రాడ్డు వేశారు. దీంతో సరిగా నడవలేక, పనిచేయలేక రాజు కొన్ని నెలలుగా ఇంటి పట్టునే ఉండిపోయారు. ఆస్పత్రి ఖర్చుల కోసం సొంత ఇంటిని అమ్మేసుకుని.. వారి కుటుంబం ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ప్రభుత్వ సాయం కోసం.. ఉద్యమంలో సర్వస్వం కోల్పోయిన తనను ఆదుకోవాలంటూ రాజుచారి ఎన్నోసార్లు స్థానిక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఫలితం లేకపోవడంతో తాను ఉద్యమంలో పాల్గొన్న ఫొటోలు, పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులు తీసుకుని సచివాలయానికి వచ్చారు. తనకు పింఛన్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని అధికారులను వేడుకున్నా రు. తనకు పింఛన్ ఇప్పించాలంటూ మంత్రి కేటీఆర్‌కూ లేఖ రాశారు. అయినా స్పందన కనిపించకపోవడంతో ఆవేదనకు లోనయ్యా రు. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో సచివాలయంలోని సీఎం కార్యాలయం ఎదుట బ్లేడుతో నాలుక కోసుకున్నా రు. భద్రతా సిబ్బంది ఆయనను సచివాల యం పక్కనే ఉన్న మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు పరిస్థితి నిలకడగానే ఉందని, నాలుక పూర్తిగా తెగకపోవడం వల్ల పెద్దగా ప్రమాదంలేదని వైద్యులు తెలిపారు. పింఛన్, ఇల్లు ఇచ్చేదాకా పోరాడుతా: రాజుచారి ఆస్పత్రిలో చేర్పించిన కొంత సేపటి అనంతరం కొద్దికొద్దిగా మాట్లాడుతూ, సైగలతో రాజుచారి తన బాధను వెళ్లగక్కారు. తెలంగాణ ఉద్యమంలో ఒంటికి నిప్పంటించుకుని పోరాటం చేశానని, ఇప్పుడు ప్రమాదంలో కాలు విరిగి నడవలేక కుటుం బాన్ని పోషించుకోలేకపోతున్నానని చెప్పారు. ఆసరా పింఛన్ ఇవ్వాలని విన్నవించుకుంటే.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తనకు ఉండటానికి ఇల్లు, పింఛన్ ఇవ్వాలని.. లేకుంటే గొంతు కోసుకోవడం తప్ప మరో మార్గం లేదని వాపోయారు -
నేటి నుంచి తెలంగాణ స్ఫూర్తి యాత్ర
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ, సామాజిక శక్తుల పునరేకీకరణ కోసం, గ్రామ స్థాయి నుంచి జేఏసీని తెలంగాణ ఉద్యమ జేఏసీగా మలిచేందుకు గాను అంబేడ్కర్ జయంతి రోజైన గురువారం నుంచి ‘తెలంగాణ స్ఫూర్తి యాత్ర’ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ వెల్లడించారు. ఆయన బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగు నింపేందుకు సామాజిక శక్తులను ఐక్యం చేయడం యాత్ర ఉద్దేశమన్నారు. అంబేడ్కర్ జయంతి రోజున ఉదయం 11 గంటలకు ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం నుంచి యాత్ర ప్రారంభమై భువనగిరి చేరుకుంటుందని, అక్కడ నుండి ఈ నెల 29 వరకు తెలంగాణలోని 10 జిల్లాలు తిరిగి, తిరిగి హైదరాబాద్ చేరుకుని 30న ఓయూలో మహనీయుల జయంతి ఉత్సవాలు, సభ నిర్విహ ంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగ్ ప్రహ్లాద్ పాల్గొన్నారు.