25 శాతంపై ఆశలు
- లాభాల వాటా పెంచాలని కార్మికుల డిమాండ్
- టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నమ్మకం
- ఆలస్యమవుతున్న పంపిణీ
- తొందరగా ఇవ్వాలని వేడుకోలు
మంచిర్యాల సిటీ : సింగరేణి కార్మికులు లాభాల వాటా పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. కార్మికుల కష్టార్జితాన్ని కార్మికులకు ఇవ్వడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యా న్ని ప్రదర్శించాయి. సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. తమ జీవితాలు, జీతాలను ఫణంగా పెట్టారు. చివరకు రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నారు. మన ప్రభుత్వం కొలువుదీరిందని భావి స్తున్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా లాభా ల వాటా పెంపుపై ప్రత్యేక దృష్టిసారించాలని కార్మికులు కోరుతున్నారు.
ప్రారంభంలో 10 శాతం ఉన్న లాభాల వాటా గతేడాది 17 శాతానికి చేరుకుంది. కార్మికులు ఇప్పుడు 25 శాతం ఇవ్వాలని గడిచిన ఏడాది నుంచి డి మాండ్ చేస్తూనే ఉన్నారు. టీబీజీకేఎస్‌పై ఎన్నో ఆశలతో కార్మికులు గెలిపించారు. గుర్తింపు సంఘంతోపాటు రాష్ట్రంలో కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కార్మికులు కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. సింగరేణి సంస్థ, కార్మికుల అభివృద్ధి కోసం ఎన్నో ఆశలు కల్పించిన టీఆర్‌ఎస్ 25 శాతం లాభాల వాటా ఇస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కార్మికులు సాధించిన లాభాల వాటాను ఏటా జూన్ మాసంలోపు చెల్లించే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
ఆలస్యమవుతున్న లాభాల వాటా చెల్లింపు
సింగరేణి కార్మికులు ఏడాది పాటు శ్రమించి బొగ్గు ఉత్పత్తి చేయగా వచ్చిన లాభాలు వారికి పంపిణీ చేయడంలో యాజమాన్యం ఆలస్యం చేస్తుంది. మార్చి నెలాఖరు నాటికి ఉత్పత్తి లక్ష్యం పూర్తయినా పక్షం రోజుల్లో లాభాలు ప్రకటించే సాంకేతిక ైనె పుణ్యం యాజమాన్యం వద్ద ఉన్నా నిర్లక్ష్యం చేయడంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో గుర్తింపు సంఘంగా గెలిపిస్తే టీబీజీకేఎస్ నాయకుల అంతర్గత పంచాయతీని కార్మికులే తేల్చాల్సి వచ్చింది.
ఇది యాజమాన్యానికి అనుకూలంగా మారింది. ఏటా కార్మికులకు సుమారు ఆరు నెలల వ్యవధితోనే లాభాల వాటాను పంచిన సందర్భాలు ఉన్నాయి.అదికూడా కార్మిక సంఘాలు, కార్మికులు కలిసి నిరసన వ్యక్తం చేసి, అనంతరం ముఖ్యమంత్రి వద్దకు వెళ్లేగాని లాభాల వాట ఎప్పుడు ఇవ్వాలనేది తే లేది కాదు. లాభాలు ఎంత సాధించింది అనేది ప్రకటించడానికి ఆలస్యమే. ఈ ప్రకటన వచ్చిన తరువాత ఇవ్వడానికి మరింత సమయాన్ని ఏటా యాజమాన్యం పొడిగించేది. ఇప్పటికైనా టీఆర్‌ఎస్ సర్కారు లాభాల వాటా పంపిణీ, పెంపుపై దృష్టిపెట్టాలని కార్మికులు కోరుతున్నారు.