తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రస్తుత మంత్రుల్లో కొందరిపై నమోదైన కేసులను రైల్వే కోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రస్తుత మంత్రుల్లో కొందరిపై నమోదైన కేసులను రైల్వే కోర్టు కొట్టివేసింది. తమపై నమోదైన కేసుల విచారణ సందర్భంగా రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పద్మారావులు బుధవారం సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం కూడా కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో పల్లె పల్లె పట్టాలపైకి అనే నినాదంతో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో వీరితో పాటు పాల్గొన్న పలువురిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు.