railway court
-
తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత
-
అగ్నిపథ్ ఆందోళనకారులకు 14 రోజుల రిమాండ్ విధించిన రైల్వే జడ్జి
-
రైల్వే కోర్టుకు ముద్రగడ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): తూర్పుగోదావరి జిల్లా తునిలో రైలు దహనం ఘటన కేసుకు సంబంధించి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. మొత్తం 41 మందికి కోర్టు సమన్లు జారీ చేయగా వారిలో ముగ్గురు అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యారు. ముద్రగడతోపాటు మరో 37 మంది రైల్వే కోర్టు న్యాయమూర్తి సురేష్ బాబు ఎదుట హాజరయ్యారు. ఈ నెల 16కు విచారణ వాయిదా పడింది. -
రైలులో కీకీ అన్నారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు
ముంబై : కీకీ చాలెంజ్ చాలా ప్రమాదకరం.. కీకీ అంటూ విన్యాసాలు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా జనాలు మాత్రం వాటిని బుర్రకెక్కించుకోవడం లేదు. దాంతో ఇన్ని రోజులు మందలించి వదిలేసిన పోలీసులు ఇప్పుడు మాత్రం కాస్తా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కీకీ చాలెంజ్ అంటూ కదులుతున్న రైలుతో పాటు విన్యాసాలు చేసిన ఒక యువకుడికి, ఈ తతంగాన్నంతా వీడియో తీసిన అతని స్నేహితులకు కూడా పనిష్మెంట్ ఇచ్చారు. కాకాపోతే అది కాస్తా వెరైటీ పనిష్మెంట్. రైల్వే ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేశారు కాబట్టి వరుసగా మూడు రోజుల పాటు రైల్వే స్టేషన్‌ను శుభ్రపర్చాలంటూ కోర్టు ఆ యువకులను ఆదేశించింది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని విరార్ ప్రాంతానికి చెందిన నిషాంత్ షా(20), ధ్రువ్ షా(23), శ్యాం శర్మ(24) అనే ముగ్గురు యువకులు కీకీ ఛాలెంజ్ పేరిట కదులుతున్న రైల్లో నుంచి కిందకి దిగి డ్యాన్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఫ్లాట్‌ఫాంపై రకరకాల విన్యాసాలు చేశారు. దీన్నంతా వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్టు చేశారు. దాంతో అది కాస్తా పోలీసుల కంట పడింది. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు, సీసీ టీవీ, సదరు కీకీ వీడియోలోని దృశ్యాల ఆధారంగా ఆ ముగ్గురుని అరెస్టు చేశారు. అయితే ఈ యువకులు కీకీ పేరుతో ఇలా విన్యాసాలు చేయడం ఇదే ప్రథమం కాదని తెలిసిందే. గతంలో వీళ్లు ఏకంగా అంబులెన్స్ దగ్గర కూడా కీకీ ఛాలెంజ్ డ్యాన్స్ చేశారట. ఆ వీడియోను కూడా రైల్వే పోలీసులు గుర్తించారు. అనంతరం వాళ్లను అరెస్టు చేసి వసాయ్ ప్రాంతంలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. యువకులను విచారించిన రైల్వే కోర్టు వారికి శిక్ష విధించింది. ఈ వారంలో మూడు రోజుల పాటు వసాయ్ రైల్వే స్టేషన్‌ను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేకాక ముగ్గురు యువకులు రైల్వే స్టేషన్‌ను శుభ్రపరుస్తుండగా వీడియో తీసి దాన్ని కోర్టుకు అందజేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలు, అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ రైల్వే స్టేషన్‌ను శుభ్రం చెయ్యాలని కోర్టు ఆదేశించింది. -
మంత్రి ఈటలపై రైల్వే కేసు కొట్టివేత
కాజీపేట రూరల్: తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసుల్లో భాగంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు మరో ఐదుగురు గురువారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. రైల్వే కోర్టు పోలీసులు, టీఆర్ఎస్ నాయకులు విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2011లో ఉప్పల్ రైల్వే స్టేషన్లో వంటావార్పు చేసినందుకు మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు టీఆర్ఎస్ నాయకులు మాట్ల రమేష్, నవీన్‌కుమార్, బాలసాని కుమారస్వామి, కొలిపాక రాములు, పాక కుమారస్వామిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో వారు రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కేసులను పరిశీలించిన మెజిస్ట్రేట్ రూ.800 చొప్పున ఆరుగురికి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పి, కేసు కొట్టివేసినట్లు వారు తెలిపారు. కేసులను కొట్టివేయాలి : ఈటల కోర్టు ప్రాంగణంలో ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అక్రమంగా నమోదు చేసిన కేసులను కేంద్రం వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేశారు. తనపై ఇంకా రెండు కేసులు ఉన్నాయని తెలిపారు. రైల్వే కేసులతో తెలంగాణవాదులు ఐదు ఏళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిపై పెట్టిన కేసులు కూడా చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. రైల్వే కేసులను ఎత్తివేయాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
రైల్వేకోర్టుకు హాజరైన స్పీకర్ మధుసూదనాచారి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వేకోర్టుకు రైల్‌రోకో కేసులో భాగంగా మంగళవారం స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2013 సంవత్సరంలో చేపట్టిన రైల్‌రోకో కేసులో స్పీకర్ మధుసూదనచారి, అచ్చ విద్యాసాగర్, ఎస్.శ్రీనివాస్, డి.దయాసాగర్, ఎ.వినోద్, దిడ్డి నరేష్, వి.సత్యనారాయణ, బొల్లం సంపత్, మేకల రవి, రామగళ్ల పరమేశ్వర్ హాజరయ్యారు. అదేవిధంగా ధర్మారం రైల్వే గేట్ వద్ద 2014 సంవత్సరంలో జరిగిన రైల్‌రోకో కేసులో స్పీకర్ మధుసూదనచారి, ల్యాదెళ్ల బాలు, విజయ్, ఎల్.రామారావు, పి.ప్రేమ్‌కుమార్, జి.రమేష్, జి.రాజు, కె.రాములు, వి.లింగారెడ్డి, జి.సందీప్‌లు హాజరుకాగా వరంగల్, ధర్మారం కేçసులను పరిశీలించిన రైల్వే మెజీస్ట్రేట్ ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పు చెప్పినట్లు వారు తెలిపారు. -
మంత్రి కేటీఆర్‌కు కోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రులకు రైల్వే కోర్టులో ఉపశమనం లభించింది. 2011లో ప్రత్యే తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో నిర్వహించి, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారనే ఆరోపణలతో కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. దీనిపై గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ రైల్వేకోర్టులో జరుగుతున్న విచారణకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పద్మారావు సికింద్రాబాద్ రైల్వే కోర్టులో తరచూ హాజరవుతున్నారు. బుధవారం మంత్రులు తుది విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే దీనిపై పలుసార్లు విచారించిన రైల్వేకోర్టు, కేసులో సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. మంత్రులు నాయిని, కేటీఆర్, పద్మారావు సహా 14 మందిపై ఉన్న కేసులను కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో మౌలాలి జంక్షన్లో రైల్‌రోకో నిర్వహించిన సందర్భంగా కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కె తారకరామారావు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు ఇలా గడిచింది అనుకొనేలోపు ఇంకా ఆరు కేసలు పెండింగ్‌లో ఉన్నాయంటూ లాయర్ గుర్తుచేశారని సోషల్ మీడియా ట్విట్టర్లో తెలిపారు. Just when I was about to heave a sigh of relief after completion of a railway court case today, lawyer informs me that 6 more are pending!🙄 — KTR (@KTRTRS) August 30, 2017 -
రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు
సికింద్రాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్‌రోకోలో పాల్గొన్న పలువురు మంత్రులు సోమవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు సోమవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. మౌలాలీ రైల్ రోకో కేసులో ఇప్పటికే మంత్రులు పలుసార్లు కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. -
రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టుకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు బుధవారం ఉదయం హాజరయ్యారు. మౌలాలిలో తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో నిర్వహించిన కేసులో మంత్రులు కోర్టుకు హాజరయ్యారు. 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలిలో టీఆర్ఎస్ నేతలు రైల్ రోకో చేపట్టిన విషయం విదితమే. -
ఎంపీ కవితపై కేసు కొట్టివేత
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలిలో జరిగిన రైల్ రోకో కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో మద్దుయిగా ఉన్న ఎంపీ కవిత బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని, అయితే ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉత్సవాలకు సిద్ధమవుతుంటే శకునంలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి రాహుల్ గాంధీని పిలుస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ పేరును రాహుల్ రుడాల్ గాంధీగా మార్చుకోవాలని చెప్పారు. -
రైల్వే కోర్టుకు హాజరైన విజయశాంతి
-
రైల్వే కోర్టుకు హాజరైన విజయశాంతి
హైదరాబాద్: సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి గురువారం ఉదయం సికింద్రాబాద్‌లోని బోయి గూడా రైల్వే కోర్ట్ కు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఖైరతాబాద్ లో నిర్యహించిన రైల్ రోకో కేసు విచారణ సందర్భంగా ఆమె కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి లేని కారణంగా కేసును ఈ నెల 24కు వాయిదా వేశారు. -
రైల్వే కోర్టుకు హాజరైన పౌరసరఫరాల సంస్థ చైర్మన్
నెక్కొండ: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పెద్ది సుదర్శన్‌రెడ్డితో పాటు పది మందిపై 2009లో వరంగల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గురువారం కాజీపేట రేల్వే కోర్టుకు ప్రస్తుత పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంటుక సోమయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు మహబూబ్పాషాతో పాటు ఉద్యమకారులు తాళ్లూరి లక్ష్మయ్య, అల్లి యాదగిరి, బండి యాకయ్య, మాదాసి యాకయ్య, రావుల భాస్కర్‌రెడ్డి, పరకాల భిక్షపతి హాజరయ్యారు. కోర్టుకు తొమ్మిది మంది మాత్రమే హాజరుకావడంతో ఈ కేసును రైల్వే కోర్టు జనవరికి వాయిదా వేసింది. -
మంత్రులపై కేసు కొట్టివేసిన రైల్వే కోర్టు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రస్తుత మంత్రుల్లో కొందరిపై నమోదైన కేసులను రైల్వే కోర్టు కొట్టివేసింది. తమపై నమోదైన కేసుల విచారణ సందర్భంగా రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పద్మారావులు బుధవారం సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం కూడా కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో పల్లె పల్లె పట్టాలపైకి అనే నినాదంతో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో వీరితో పాటు పాల్గొన్న పలువురిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. -
రైల్వే కోర్టుకు హాజరైన స్పీకర్
కాజీపేట రూరల్ : తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2013లో వరంగల్ రైల్వేస్టేçÙన్లో చేపట్టిన రైల్ రోకోకు సంబంధించిన నమోదైన కేసులో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సోమవారం కాజీపేటలోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. స్పీకర్‌తో పాటు అచ్చ వినోద్, దండు దయాసాగర్, వి.సత్యనారాయణ, దిడ్డి నరేందర్, బొల్లం సంపత్‌కుమార్ కోర్టుకు హాజరు కాగా, కేసును డిసెంబర్ 5వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. అనంతరం కోర్టు బయట స్పీకర్ విలేకరులతోమాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణవాదిగా తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశానని అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులపై రైల్వే పోలీసులు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. అయితే, చట్టం, న్యాయాలపై అపారమైన గౌరవం ఉన్నందున కోర్టుకు వచ్చానని తెలిపారు. కాగా, కాజీపేట రైల్వే కోర్టుకు వచ్చిన స్పీకర్ మధుసూదనచారిని విశ్వ బ్రాహ్మణ సంఘం బాధ్యులు శృంగారపు భిక్షపతి, సల్లూరి లక్ష్మీనారాయణ, కొండోజు సారంగం, రవి, రామ్మోహన్ తదితరులు సన్మానించారు. -
రైల్వేకోర్టుకు హాజరైన మంత్రి పల్లె, ఎమ్మెల్యేలు
గుంతకల్లు టౌన్: సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో కేసుల్లో ఉన్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ ఛీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బీకే.పార్థసారధి, హనుమంతరాయచౌదరి, వరదాపురం సూ రి గురువారం స్థానిక రైల్వే కోర్టుకు హాజరయ్యారు. వీరితోపాటు మహాలక్ష్మీశ్రీనివాస్, చంద్రదుండు ప్రకాష్, బుగ్గయ్యచౌదరి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు పీజీఎస్.బాబు, హేమాద్రి వాదించారు. -
'తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపారు'
కాజీపేట రూరల్ : వరంగల్ ఉప ఉన్నికలో ఓటర్లు మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆయా పార్టీల నాయకులకు సీఎం కేసీఆర్ గురించి, ఆయన పాలన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులలో టీఆర్ఎస్ మంత్రుల్లా ఆయా పార్టీల నాయకులు, నాటి మంత్రులు ఏమైనా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా అని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఉద్యమంలో ప్రజలతో కలిసి రోడ్లపైనే గడిపామని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలకు ప్రజలు అసహ్యించుకుని తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యేలకు నాన్ బెయిలబుల్ వారెంట్ల జారీ