రైల్వే కోర్టుకు హాజరైన పౌరసరఫరాల సంస్థ చైర్మన్
Published Thu, Dec 15 2016 4:36 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM
నెక్కొండ: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పెద్ది సుదర్శన్‌రెడ్డితో పాటు పది మందిపై 2009లో వరంగల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గురువారం కాజీపేట రేల్వే కోర్టుకు ప్రస్తుత పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంటుక సోమయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు మహబూబ్‌పాషాతో పాటు ఉద్యమకారులు తాళ్లూరి లక్ష్మయ్య, అల్లి యాదగిరి, బండి యాకయ్య, మాదాసి యాకయ్య, రావుల భాస్కర్‌రెడ్డి, పరకాల భిక్షపతి హాజరయ్యారు. కోర్టుకు తొమ్మిది మంది మాత్రమే హాజరుకావడంతో ఈ కేసును రైల్వే కోర్టు జనవరికి వాయిదా వేసింది.
Advertisement
Advertisement