
టాటా గ్రూప్‌నకు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ చైర్మన్‌గా ఎన్ గణపతి సుబ్రమణ్యం నియమితులయ్యారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్‌గా గణపతి సుబ్రమణ్యం నియామకానికి టాటా కమ్యూనికేషన్స్ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది.
ఎన్‌జీఎస్‌గా ప్రసిద్ధి చెందిన గణపతి సుబ్రమణ్యం 2021 డిసెంబర్‌లో టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్)తోపాటు భారత ఐటీ పరిశ్రమలో ఆయన 40 ఏళ్లుగా ఉన్నారు. 2024 మేలో టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగారు.
నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సు మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2025 మార్చి 14 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎన్ గణపతి సుబ్రమణ్యాన్ని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్‌గా నియమించిందని టాటా కమ్యూనికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, టెలికాం, పబ్లిక్ సర్వీసెస్‌లో టీసీఎస్ చేపట్టిన పలు మైలురాయి కార్యక్రమాల్లో ఆయన వ్యూహాత్మక పాత్ర పోషించారని కంపెనీ తెలిపింది. టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఛేంజ్ మేనేజ్మెంట్‌పై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉందని పేర్కొంది.
ప్రస్తుతం గణపతి సుబ్రమణ్యం టాటా ఎలెక్సీ లిమిటెడ్, తేజస్ నెట్ వర్క్స్ లిమిటెడ్ లో బోర్డు చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే భారత్ 6జీ అలయన్స్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా, శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో ఇన్‌స్టిట్యూట్ బాడీ సభ్యుడిగా, ముంబైలోని దివ్యాంగ పిల్లల పునరావాస సొసైటీ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment