Tata Group company
-
సినీనటితో ప్రేమలో పడిన రతన్‌టాటా..? (ఫోటో గ్యాలరీ)
-
టాటా గ్రూప్ కంపెనీకి కళ్లు చెదిరే లాభాలు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ రిటైల్ సంస్థ ట్రెంట్ డిసెంబర్ క్వార్టర్‌కు కళ్లు చెదిరే లాభాలు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.155 కోట్ల నుంచి రూ.371 కోట్లకు దూసుకుపోయింది. 140 శాతం వృద్ధి చెందింది. వెస్ట్‌సైడ్, జుడియో, స్టార్ పేరుతో రిటైల్ స్టోర్లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఆదాయం 50 శాతం వృద్ధితో క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,303 కోట్ల నుంచి రూ.3,467 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 42 శాతం పెరిగి రూ.3,101 కోట్లుగా ఉన్నాయి. ‘‘అన్ని ఫార్మాట్లలోనూ స్థిరమైన వృద్ధిని కొనసాగించాం. నిర్వహణ క్రమశిక్షణ, వేగవంతమైన నిర్వహణ మా విస్తరణ అజెండాకు మద్దతుగా నిలిచాయి’’అని సంస్థ తెలిపింది. వెస్ట్‌సైడ్, జుడియో స్థూల మార్జిన్ గతంలో మాదిరే స్థిరంగా కొనసాగింది. ఆపరేటింగ్ ఎబిట్ మార్జిన్ 13 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 8.5 శాతంగానే ఉంది. బలమైన వృద్ధి విస్తరణ దిశగా తమకు మరింత ప్రోత్సాహాన్నిస్తున్నట్టు సంస్థ పేర్కొంది. వెస్ట్‌సైడ్ డాట్ కామ్, ఇతర టాటా గ్రూప్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అమ్మకాల్లో 5 శాతం వాటా ఆదాయం లభించినట్టు తెలిపింది. డిసెంబర్ క్వార్టర్లో కొత్తగా 5 వెస్ట్‌సైడ్ స్టోర్లు, 50 జుడియో స్టోర్లను ప్రారంభించింది. దీంతో నిర్వహణలోని వెస్ట్‌సైడ్ స్టోర్ల సంఖ్య 227కు, జుడియో స్టోర్లు 460కు చేరాయి. స్టార్ పేరుతో (గ్రోసరీ) నిర్వహించే స్టోర్ల సంఖ్య 67కు పెరిగింది. భవిష్యత్తులోనూ స్టోర్ల విస్తరణ ద్వారా మరింత మందికి చేరువ అవుతామని సంస్థ చైర్మన్ నోయల్ టాటా ప్రకటించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ట్రెంట్ షేరు 19 శాతం లాభపడి 3,609 వద్ద క్లోజ్ అయింది. -
టాటా గ్రూప్ కి షాకిచ్చిన ఎయిర్ ఇండియా ఫైలట్స్
-
ఎయిరిండియాకు భారీ షాక్, మిలియన్ డాలర్ల జరిమానా
సాక్షి, ముంబై: టాటా-గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కరోనా మహమ్మారి సమయంలో విమానాలను రద్దు చేయడం లేదా మార్చిన కారణంగా ప్రయాణీకులకు రీఫండ్లను అందించడంలో తీవ్ర జాప్యం చేసినందుకుగాను భారీ జరిమానా విధించాలని అమెరికా ఆదేశించింది. 121.5 మిలియన్ డాలర్లు (దాదాపు 990 కోట్ల రూపాయలు) రీఫండ్‌తోపాటు జరిమానాగా 1.4 మిలియన్ డాలర్లు (రూ.11.35 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో: అమెజాన్ సంచలన నిర్ణయం! 600 మిలియన్ డాలర్లకు పైగా వాపసు చెల్లించడానికి అంగీకరించిన ఆరు విమానయాన సంస్థలలో ఎయిరిండియా కూడా ఒకటని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ సోమవారం ప్రకటించింది. ఎయిరిండియా ‘రిఫండ్ ఆన్ రిక్వెస్ట్’ విధానం, తమ పాలసీకి విరుద్ధంగా ఉందని పేర్కొంది. తమ రవాణాశాఖ నిబంధనల ప్రకారం విమానాన్ని రద్దు చేసినా లేదా మార్పు చేసినా చట్టబద్ధంగా టిక్కెట్లను వాపసు చేయాలని, ఈ మేరకు ఎయిరిండియాకు ఆదేశించినట్లు రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్ తెలిపారు. అలాగే ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ 222 మిలియన్ డాలర్లతోపాటు 2.2 మిలియన్ల డాలర్లు పెనాల్టీ చెల్లించాల్సిఉందన్నారు. (ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?) -
Air India: టాటా గూటికి ఎయిర్ ఇండియా చేరేది అప్పుడే!
Air India to be handed over to Tata Group: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్ ఇండియా గత ఏడాది టాటా గ్రూప్ వేలంలో రూ.18,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎయిర్ ఇండియా పూర్తిగా టాటాల కంపెనీగా మారబోతుంది. ఈ విమానయాన సంస్థ పూర్తి భాద్యతలను ఈ వారం చివరి నాటికి టాటా గ్రూప్‌కు అప్పగించాలని చూస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఈ జనవరి 27, 2022న ఎయిర్ ఇండియా పూర్తిగా టాటాల పరం కానున్నట్లు ఈ విమానయాన సంస్థ ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. అందుకు, సంబంధించిన ప్రక్రియను వచ్చే రెండు లేదా మూడు రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియలో ప్రభుత్వ రంగ ఎయిరిండియాను అత్యధికంగా రూ. 18,000 కోట్ల బిడ్‌తో టాటా గ్రూప్ దక్కించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనకు తేలిసిందే. ఎయిరిండియాకు సంబంధించి రూ.15,300 కోట్ల రుణభారాన్ని తీసుకోవడంతో పాటు రూ. 2,700 కోట్లు నగదు చెల్లించేలా టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫర్ చేసినట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం వాటాలు, ఎయిరిండియా ఎస్ఏటీఎస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ (ఏఐఎస్ఏటీఎస్)లో 50 శాతం వాటాలను టాలేస్ కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి సంబంధించి టాటా సన్స్, కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 25న ఒప్పందం కుదుర్చుకొని సంతకాలు చేశాయి. ఈ జనవరి 20తో ముగిసిన బ్యాలెన్స్ షీట్'ను జనవరి 24 అందించాల్సి ఉంటుంది. తర్వాత దీనిని టాటా సమీక్షించవచ్చు, ఏవైనా మార్పులు చేయవచ్చు అని ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఫైనాన్స్ వినోద్ హెజ్మాడీ ఉద్యోగులకు గతంలో మెయిల్లో తెలిపారు. (చదవండి: ఐఐటీ పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ.. తగ్గనున్న ఎలక్ట్రికల్ వాహన ధరలు!) -
ఎయిరిండియా గెలుపుపై రతన్ టాటా ఆసక్తికర ట్వీట్!
ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తిరిగి తన సొంత గూటికి చేరుకోనుంది. టాటా సన్స్ బృందం బిడ్‌ను గెలుచుకున్నందుకు ఆ కంపెనీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. "ఎయిరిండియాకు తిరిగి స్వాగతం’’ అంటూ ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా టాటా ఎయిర్ ఇండియా విమానం నుంచి కంపెనీ మాజీ ఛైర్మన్ జే.ఆర్.డీ టాటా దిగిపోతున్న పాత ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో "ఎయిర్ ఇండియా బిడ్ గెలవడం టాటా గ్రూప్‌కు గ్రేట్ న్యూస్! ఎయిర్ ఇండియాను పునర్నిర్మించడానికి గణనీయమైన కృషి అవసరమని అంగీకరిస్తున్నప్పటికీ.. విమానయాన పరిశ్రమలో టాటా గ్రూప్‌కు ఇది చాలా బలమైన మార్కెట్ అవకాశాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను. ఒకప్పుడు జే.ఆర్.డీ. టాటా నాయకత్వంలో ఎయిర్ ఇండియా, ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విమానయాన సంస్థల్లో ఒకటిగా ఖ్యాతి పొందింది. టాటాలకు ఇప్పుడు ఎయిరిండియాకు అలాంటి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు మళ్లీ అవకాశం లభించింది. ఈ రోజు జే.ఆర్.డీ మన మధ్యలో ఉంటే చాలా సంతోషించేవారు. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వెల్కమ్ బ్యాక్, ఎయిరిండియా!’’ అని రతన్ టాటా సంతకం చేశారు.(చదవండి: ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. రూ.6000 క్యాష్‌బ్యాక్!) Welcome back, Air India 🛬🏠 pic.twitter.com/euIREDIzkV — Ratan N. Tata (@RNTata2000) October 8, 2021 1946లో టాటా సన్స్ ఏవియేషన్ విభాగం ఎయిరిండియాగా లిస్టయ్యింది. 1948లో యూరప్‌కు విమాన సేవలతో ఎయిరిండియా ఇంటర్నేషనల్ ఏర్పాటైంది. దేశీయంగా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి ఈ ఇంటర్నేషనల్ సర్వీసే నాంది. అప్పట్లో ఈ సంస్థలో ప్రభుత్వానికి 49 శాతం, టాటాలకు 25 శాతం, మిగతా వాటా పబ్లిక్ దగ్గర ఉండేది. 1953లో ఎయిరిండియాను కేంద్రం జాతీయం చేసింది. 1990లు, 2000ల దాకా ఎయిరిండియా ఆధిపత్యం కొ నసాగినా ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా రంగంలోకి దిగడం మొదలయ్యాక క్రమంగా ప్రాభవం తగ్గడం మొదలైంది. -
కోవిడ్ పోరులో భారీగా ఖర్చు చేసిన టాటా గ్రూప్
ముంబై: కోవిడ్-19 సహాయక చర్యలకుగాను టాటా గ్రూప్ కంపెనీలు ఇప్పటి వరకూ దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చు చేసినట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం వెల్లడించారు. టీసీఎస్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. క్తొత హాస్పిటల్స్ నిర్మాణం, ఆక్సిజన్ సామర్థ్య విస్తరణ వంటి చర్యలపై గ్రూప్ కంపెనీలు దృష్టి సారించినట్లు తెలిపారు. మొత్తం వ్యయాల్లో టాటా సన్స్ వాటా రూ.1,500 కోట్లు కాగా, గ్రూప్ కంపెనీల వ్యయాలు రూ.1,000 కోట్లని పేర్కొన్నారు. మరిన్ని నిధుల వ్యయాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కూడా వివరించారు. మూడో వేవ్ ఆందోళనల నేపథ్యంలో సవాళ్లను అధిగమించడానికి మరింత జాగ్రత్తగా తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. అథ్లెటిక్స్, హాకీ, ఫుడ్‌బాల్ వంటి క్రీడా కార్యకలాపాలకు గ్రూప్ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. చదవండి: బ్యాంకు ఖాతాదారులకు భారీ షాక్! -
వ్యాక్సిన్ కోసం టాటా, మోడరానా ఇంక్ జట్టు
ముంబై: టాటా గ్రూప్ యొక్క హెల్త్‌కేర్ వెంచర్ మోడరానా ఇంక్‌తో కలిసి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను భారతదేశంలో తీసుకురావడానికి భాగస్వామ్యం కోసం చర్చలు ప్రారంభించినట్లు ఎకనామిక్ టైమ్స్ నేడు తెలిపింది. టాటా మెడికల్ & డయాగ్నోస్టిక్స్, మోడరనా యొక్క వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారతదేశ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ తో జతకట్టిన్నట్లు కొందరు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై మోడెర్నా, టాటా మెడికల్ & డయాగ్నోస్టిక్స్ స్పందించలేదు.(చదవండి: వ్యాక్సిన్ రేస్‌లో టాప్‌టెన్‌లో భారత్) ఫైజర్ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలి. కానీ మోడెర్నాను సాధారణ ఫ్రిజ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు. ఇది భారతదేశం వంటి పేద దేశాలకు మరింత అనుకూలంగా ఉంటుంది వారు పేర్కొన్నారు. మోడరనా యొక్క వ్యాక్సిన్ చివరి పరీక్ష దశలో 94.1శాతం మందికి ఎలాంటి తీవ్రమైన భద్రతా సమస్యలు తలెత్తలేదు. ఈ వ్యాక్సిన్ ఈ నెల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్, ఐరోపాలో ఉపయోగించడానికి ఆమోదించబడింది అని మోడరనా సంస్థ పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద టీకా కార్యక్రమంలో ఏ వాక్సిన్ ను పరిగణనలోకి తీసుకోవాలంటే ప్రతి టీకా తయారిదారి కంపెనీ తప్పనిసరిగా స్థానికంగా పరీక్షలు జరపాలని భారతదేశం ఆదేశించింది. -
టాటా కన్జూమర్- గేట్‌వే డిస్ట్రిపార్క్స్ భళా
కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు వ్యాపార పునర్వ్యవస్థీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో లాజిస్టిక్స్ దిగ్గజం గేట్‌వే డిస్ట్రిపార్క్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతున్నాయి. ఇతర వివరాలు ఇవీ.. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ మూడు రోజులుగా బలపడుతూ వస్తున్న టాటా గ్రూప్ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ తాజాగా ఎన్ఎస్ఈలో 5.5 శాతం జంప్‌చేసింది. రూ. 580 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం దూసుకెళ్లి రూ. 592కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత రెండు నెలల్లో ఈ షేరు 46 శాతం పురోగమించింది. కాగా.. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 53,000 కోట్లను అధిగమించింది. తద్వారా గ్రూప్‌లోని ఇతర దిగ్గజాలు టాటా స్టీల్, టాటా మోటార్స్ విలువను దాటేసింది. ఈ ఏడాది క్యూ1లో ఇబిటా 37 శాతం ఎగసి రూ. 486 కోట్లను తాకగా.. నిర్వహణ మార్జిన్లు 3.12 శాతం బలపడిన విషయం విదితమే. గేట్‌వే డిస్ట్రిపార్క్స్ సమీకృత లాజిస్టిక్స్ కార్యకలాపాలు కలిగిన గేట్‌వే డిస్ట్రిపార్క్స్ వ్యాపార పునర్వ్యవస్థీకరణను చేపట్టనుంది. ఇందుకు బుధవారం సమావేశమైన బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. కంపెనీకిగల వివిధ వ్యాపార విభాగాలను గ్రూప్‌లోని విభిన్న సంస్థలు నిర్వహస్తున్న కారణంగా పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదించినట్లు తెలియజేసింది. తద్వారా వివిధ కార్యకలాపాలను క్రమబద్ధీకరించనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో గేట్‌వే డిస్ట్రిపార్క్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత దాదాపు 15 శాతం దూసుకెళ్లి రూ. 108కు చేరింది. తదుపరి కాస్త వెనకడుగు వేసింది. ప్రస్తుతం 6.5 శాతం జంప్‌చేసి రూ. 101 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో షేరుకి రూ. 72 ధరలో చేపట్టిన రైట్స్ ద్వారా కంపెనీ రూ. 116 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. -
కోవిడ్-19లోనూ ఈ కంపెనీల జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ కొనసాగుతోంది. మరోపక్క ఇదే కాలంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించినప్పటికీ మౌలిక సదుపాయాల కంపెనీ అశోకా బిల్డ్‌కాన్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవుల అమలు కారణంగా పనితీరు నిరాశపరచినప్పటికీ భవిష్యత్‌లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ జులై 1 నుంచీ ర్యాలీ బాటలో సాగుతున్న టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ షేరు తాజాగా 4 శాతం జంప్‌చేసి రూ. 538 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 543 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత ఆరు వారాల్లో ఈ షేరు 41 శాతం ర్యాలీ చేయడం విశేషం. తద్వారా తాజాగా ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికోను మార్కెట్ విలువలో వెనక్కి నెట్టింది. టాటా కన్జూమర్ మార్కెట్ విలువ తాజాగా రూ. 49,427 కోట్లను తాకగా.. మారికో మార్కెట్ క్యాప్ రూ. 47,253 కోట్లుగా నమోదైంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ నికర లాభం 82 శాతం జంప్‌చేసి రూ. 345 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 13 శాతం పుంజుకుని రూ. 2714 కోట్లకు చేరింది. అశోకా బిల్డ్‌కాన్ స్టాండెలోన్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అశోకా బిల్డ్‌కాన్ రూ. 69 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 7 శాతం వృద్ధికాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇదే కాలంలో రూ. 38 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 147 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 761 కోట్లకు చేరింది. అయితే ప్రస్తుత ఆర్డర్‌బుక్ విలువ రూ. 8,617 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. కోవిడ్-19 కారణంగా క్యూ1లో కార్యకలాపాలు కుంటుపడినప్పటికీ ఇకపై మెరుగైన పనితీరు చూపగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అశోకా బిల్డ్‌కాన్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7.5 శాతం దూసుకెళ్లి రూ. 65 వద్ద ట్రేడవుతోంది. -
టాటా కాఫీ- ఇండస్ఇండ్.. అదరహో!
విదేశీ మార్కెట్లు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. మరోవైపు ఇదే కాలంలో పటిష్ట పనితీరు చూపడంతో పానీయాల దిగ్గజం టాటా కాఫీ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాండెలోన్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం 68 శాతం క్షీణించింది రూ. 461 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 8681 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 72 శాతం పడిపోయి రూ. 602 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు 2.45 శాతం నుంచి 2.53 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు మాత్రం 1.23 శాతం నుంచి 0.86 శాతానికి తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.2 శాతం జంప్‌చేసి రూ. 549 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 565 వరకూ ఎగసింది. టాటా కాఫీ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన టాటా కాఫీ నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 36 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 26 శాతం పుంజుకుని రూ. 588 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం 65 శాతం వృద్ధితో రూ. 79 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో టాటా కాఫీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 11.5 శాతం దూసుకెళ్లి రూ. 93 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 97 వరకూ ఎగసింది. -
ట్రెంట్ లాభం 37 శాతం అప్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ రిటైల్ సంస్థ, ట్రెంట్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 37 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.12 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.16 కోట్లకు పెరిగిందని ట్రెంట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.539 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.677 కోట్లకు పెరిగిందని ట్రెంట్ చైర్మన్ నోయల్ ఎన్. టాటా చెప్పారు.. మొత్తం వ్యయాలు రూ.522 కోట్ల నుంచి రూ.659 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఒక్కో షేర్‌కు రూ.1.30 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)తో కలుపుకుంటే మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.52.08 కోట్లవుతాయని వివరించారు. గత క్యూ4లో తమ సంస్థ బ్రాండ్, వెస్ట్‌సైడ్ కొత్తగా 27 స్టోర్స్‌ను ప్రారంభించిందని గతంలో ఏ సంవత్సరంలోనూ ఈ స్థాయిలో స్టోర్స్‌ను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్ల లాభం ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.117 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్లకు పెరిగిందని నోయల్ తెలిపారు. ఆదాయం రూ.2,109 కోట్ల నుంచి రూ.2,568 కోట్లకు పెరిగింది. గత శుక్రవారం బీఎస్ఈలో ట్రెంట్ షేర్ 0.7% నష్టంతో రూ.355 వద్ద ముగిసింది. -
టాటా గ్రూపు కంపెనీల వివరణ కోరిన సెబీ...
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్పొరేట్ గ్రూపు అయిన టాటాల యాజమాన్యం విషయంలో జరుగుతున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వీటిపై దృష్టిసారించింది. కార్పొరేట్ పరిపాలనా నియమాలు, లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న అంశాలను పరిశీలిస్తోంది. టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి అవమానకరరీతిలో ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ... టాటా గ్రూపు కంపెనీలకు సంబంధించి 1.18 లక్షల కోట్ల రూపాయల నష్టాలను చూపించాల్సి ఉందంటూ పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు లిస్టెడ్ కంపెనీల నుంచి సెబీ వివరణ కోరింది. ఈ మేరకు టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్, టాటా టెలీసర్వీసెస్, టాటా పవర్ సహా గ్రూపులోని ఇతర కంపెనీలకు సెబీ నుంచి ఆదేశాలు అందాయి. అన్ని అంశాలపై పూర్తి వివరాలివ్వాలని ఎక్స్ఛేంజ్లు కూడా టాటా గ్రూపు కంపెనీలకు నోటీసులు జారీ చేశాయి. మీడియాలో వచ్చిన వార్తలపై వివరణ ఇవ్వాలని ప్రతీ అంశంపై క్రమ పద్ధతిలో వివరాలు చెప్పాలని ఆదేశించాయి.